క్రీస్తు సత్యముతో తీర్పు కార్యమును చేస్తాడు
అంత్య దినముల్లో సమయము సమీపించి మరియు దేవుడు వచ్చే రోజు ఆసన్నమైనప్పుడు మనుష్యులను వారి రీతిని బట్టి వేరు చేయడం, మరియు దేవుని నిర్వహణ ప్రణాళికను ముగించడమే కార్యముగా ఉంటుంది. దేవుడు తన రాజ్యంలో ప్రవేశించిన వారిని, అంటే, అంతము వరకు తనకు విశ్వాసులై ఉన్న వారిని, తానే స్వయంగా దేవుని యుగంలోకి తీసుకొస్తాడు. అయితే, దేవుని యుగము వచ్చే ముందు వరకు, మనిషి కార్యములను పరిశీలించడం లేదా మనిషి జీవితం గురించి విచారించడం దేవుని పని కానప్పటికీ, తన సింహాసనం ముందుకు వచ్చిన అందరినీ శుద్ధి చేయడం కోసం, మనిషి అవిధేయత పట్ల ఆయన తీర్పు చేయాల్సి ఉంటుంది. ఈరోజు వరకు దేవుని అడుగుజాడల్లో నడిచిన వారే దేవుని సింహాసనం ముందుకు వచ్చారు. ఇలా చేసిన ప్రతిఒక్కరు, అంటే, దేవుని కార్యమును దాని చివరి దశలో అంగీకరించినవారు దేవుడు శుద్ధపరిచే అంశముగా ఉంటారు. మరో మాటలో మాటలో చెప్పాలంటే, దేవుని కార్యమును దాని చివరిదశలో అంగీకరించిన వారందరూ దేవుని తీర్పునకు ఎంచుకోబడుతారు.
గతంలో, దేవుని గృహంలో తీర్పు ప్రారంభంలో పేర్కొనబడినట్లుగా, ఈ మాటల “తీర్పు” అనేది అంత్య దినములలో తన సింహాసనం వద్దకు వచ్చే వారి కోసం దేవుడు నేడు జారీచేసే తీర్పును సూచిస్తుంది. బహుశా, అందుకే కాబోలు, అతీంద్రియ శక్తులను విశ్వసించేవారు, అంత్య దినములు సమీపించినప్పుడు, దేవుడు ఆకాశంలో ఒక పెద్ద బల్లను సృష్టిస్తాడని, దాని మీద ఒక తెల్లటి వస్త్రమును పరుస్తాడని, అటుపై, మనుష్యులందరూ నేల మీద మోకరిల్లి ఉండగా, ఒక గొప్ప సింహాసనం మీద కూర్చుని, ప్రతి ఒక్క మానవుని పాపములు బహిర్గతం చేయుచూ, వారు పరలోకమునకు వెళ్ళవలెనా లేదా అగ్ని గంధకములతో కూడిన గుండంలోనికి వెళ్లవలెనా అని నిర్ణయిస్తాడని ఊహిస్తుంటారు. అయితే, మనిషి ఎలా ఊహించినప్పటికీ, అదేదీ దేవుని కార్యము సారమును మార్చలేదు. ఎందుకంటే, మనిషి ఊహలన్నీ, మనిషి ఆలోచనల నుంచి నిర్మితమైనవే తప్ప వేరొకటి కాదు; అవి మనిషి ఆలోచనల నుండి వస్తాయి, మనిషి చూసిన మరియు విన్న వాటికి సంగ్రహంగా ముక్కల్లా కలిసి ఉంటాయి. కాబట్టి, అలాంటి ఊహా చిత్రాలు ఎంత గొప్పవి అయినప్పటికీ, అవి కార్టూన్ చిత్రాలు లాంటివి మాత్రమే, దేవుని ప్రణాళికా కార్యమును అవి ప్రత్యామ్నాయ పరచలేవు. ఎంతైనా మానవుడు సాతానుచే చెడగొట్టబడ్డాడు, కాబట్టి, అతను దేవుని ఆలోచనలను ఎలా గ్రహించగలడు? మానవుడు దేవుని తీర్పు కార్యమును చాలా గొప్పగా భావిస్తాడు. తీర్పు కార్యమును దేవుడే స్వయంగా చేస్తాడని అతడు నమ్ముతాడు కనుక, ఈ కార్యము అద్భుతమైన రీతిలో ఉండాలని, మర్త్యులకు అర్థం కాకూడదని, అది పరలోకమంతా ప్రతిధ్వనించి భూమి మొత్తం కదిలించబడాలని అతడు నమ్ముతాడు; అలా కానట్లయితే, అది దేవుని తీర్పు కార్యము ఎలా అవుతుంది? ఇది తీర్పు కార్యము కనుక, దేవుడు కార్యం చేయునప్పుడు, ప్రధానంగా అది అద్భుతంగా మరియు గంభీరంగా ఉండాలి మరియు తీర్పు తీర్చబడినవారు కన్నీళ్లతో మొత్తుకుంటూ మరియు వారి మోకాళ్ళపై దేవుని దయ కొరకు యాచిస్తూ ఉండాలని, మనిషఇ నమ్ముతాడు. ఇటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి మరియు లోతుగా స్వాగతించబడతాయి…. దేవుని తీర్పు కార్యము ఆశ్చర్యకరమైన రీతిలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఊహిస్తారు. దేవుడు చాలా కాలం క్రితం మనుష్యుల మధ్య తన తీర్పు కార్యమును ప్రారంభించినప్పుడు, మీరు ఇంకనూ వెచ్చగా సోమరిపోతుల వలే గాఢ నిద్రలో ఉన్నారని మీకు తెలుసా? దేవుని తీర్పు కార్యము లాంఛనప్రాయంగా ప్రారంభమైనదని మీరు భావిస్తున్న సమయంలోనే దేవుడు నూతన పరలోకము మరియు భూమిని రూపొందించేసి ఉంటాడా? బహుశా, ఆ సమయంలో, మీరు మీ జీవిత అర్ధాన్ని అవగాహన చేసుకోవడానికి మాత్రమే వస్తారు, కానీ, దయలేని దేవుని శిక్షా విధి మిమ్ములను, ఇంకనూ గాఢనిద్రలో ఉన్న మిమ్ములను నరకానికి తీసుకొస్తుంది. దేవుని తీర్పు కార్యము అప్పటికే ముగిసిందనే విషయం మీరు అప్పుడు అకస్మాత్తుగా తెలుసుకుంటారు.
మన విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు మరియు ఇటువంటి అసహ్యకరమైన మరియు హేయమైన మాటల గురించి ఇక మాట్లాడకూడదు. బదులుగా, ఏది తీర్పును ఏర్పరుస్తుందో దాని గురించి మనం మాట్లాడుదాం. “తీర్పు” అనే మాటను ప్రస్తావించినప్పుడు, ప్రతి ప్రాంతంలోని మనుష్యులకు ఆదేశం ఇవ్వటానికి యెహోవా మాట్లాడిన మాటలు మరియు పరిసయ్యులను గద్దించడానికి యేసు పలికిన మాటలను మీరు గుర్తుచేసుకునే అవకాశం ఉంది. వాటన్నింటి తీవ్రతను బట్టి, ఆ మాటలేవీ మనిషి పట్ల దేవుని తీర్పునకు సంబంధించిన కావు; దేవుడు వివిధ పరిస్థితుల్లో, అంటే, వివిధ సందర్భాలలో పలికిన మాటలవి. ఈమాటలవీ అంత్య దినములలో మనిషిని తీర్పు తీర్చునప్పుడు యేసు మాట్లాడిన మాటల వంటివి కావు. అంత్య దినములలోని మనిషికి బోధించడానికి, మనిషిలోని సారాన్ని బహిర్గతం చేయడానికి మరియు మనిషి మాటలు మరియు క్రియలను పరిశోధించడానికి యేసు వివిధ రకాల సత్యాలను ఉపయోగించెను. మానవుని విధి ఏమిటి, మానవుడు దేవునికి ఎలా విధేయుడిగా ఉండాలి, మానవుడు దేవునికి ఎలా నమ్మకంగా ఉండాలి, సాధారణ మానవత్వంతో మనిషి ఎలా జీవించాలి, అదేవిధంగా, దేవుని జ్ఞానము మరియు స్వభావము లాంటి సత్యాలను ఈమాటలు కలిగి ఉన్నాయి. ఈ మాటలన్నీ మానవుని సారాంశం మరియు అతని అవినీతి స్వభావంపై నిర్దేశించబడ్డాయి. ప్రత్యేకించి, మానవుడు ఎలా సాతాను అవతారంగా మరియు దేవునికి విరుద్ధంగా శత్రు శక్తిగా మారాడో ఈ మాటలు బహిర్గతం చేస్తాయి. దేవుడు తన తీర్పు కార్యానికి పూనుకున్నప్పుడు, మానవుని స్వభావాన్ని కొద్ది మాటలతో స్పష్టం చేయలేదు; దీర్ఘకాలం కోసం ఆయన వాటిని బహిర్గతం చేసెను, వ్యవహరించెను మరియు కత్తిరించెను. బహిర్గతం చేయడం, వ్యవహరించటం మరియు కత్తిరించడం ఇలాంటి వివిధ పద్ధతులను సాధారణ మాటలతో భర్తీ చేయలేము కానీ, మానవుడు పూర్తిగా కోల్పోయిన సత్యంతో భర్తీ చేయగలము. ఇటువంటి పద్ధతులను మాత్రమే తీర్పు అని అనవచ్చును; ఈ విధమైన తీర్పు ద్వారా మాత్రమే మనిషి లొంగి మరియు పూర్తిగా దేవుని విశ్వసించును మరియు అన్నిటికంటే ముఖ్యంగా, నిజమైన దేవుని జ్ఞానమును పొందుకుంటాడు. తీర్పు కార్యం ఏమిటంటే, దేవుని నిజస్వరూపాన్ని మరియు తన స్వంత తిరుగుబాటుతనం గురించిన సత్యమును మానవుడు అర్థం చేసుకోవడమే. దేవుని చిత్తము, దేవుని కార్యం యొక్క ఉద్దేశ్యము మరియు తనకు అర్థం కాని నిగూఢమైన రహస్యాల గురించిన అవగాహనను మనిషి పొందుకోవడానికి తీర్పు కార్యము అనుమతిస్తుంది. అతని అవినీతి సారము మరియు అతని అవినీతి మూలాలను గుర్తించడానికి మరియు తెలుసుకొనడానికి కూడా ఇదే అనుమతిస్తుంది; అలాగే మానవుని వికారమును కనుగొనటానికి కూడా అనుమతిస్తుంది. ఈ ప్రభావములన్నీ తీర్పు కార్యము ద్వారా తీసుకురాబడ్డాయి. నిజానికి, ఆయన యందు విశ్వసించిన వారందరికీ ఆయన సత్యం, మార్గము మరియు జీవమును గూర్చిన కార్యమును ప్రారంభించుటయే ఈ కార్యము యొక్క సారాంశము. ఈ కార్యమే దేవుని ద్వారా చేయబడిన తీర్పు కార్యము. నీవు ఈ సత్యాలను ముఖ్యమైనవిగా లక్ష్య పెట్టనట్లయితే, వాటిని ఎలా తప్పించుకోవాలి లేదా వాటిని కలిగి ఉండకుండా కొత్త మార్గాన్ని ఎలా కనుగొనాలని మాత్రమే ప్రయత్చినట్లయితే, నీవు ఘోర పాపివి అని నేను చెబుతాను. నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండి, ఇంకను సత్యమును లేదా దేవుని చిత్తమును వెదకనట్లయితే, లేదా నిన్ను దేవుని దగ్గరగా చేర్చే మార్గమును ప్రేమించనట్లయితే, అప్పుడు నీవు తీర్పును తప్పించుకొనుటకు ప్రయత్నించేవాడివని మరియు నీవు ఒక తోలుబొమ్మవని మరియు గొప్ప తెల్లని సింహాసనం నుండి పారిపోయే ద్రోహి అని నేను అంటాను. తన చూపుల నుంచి తప్పించుకునే తిరుగుబాటుదారులలో ఎవరినీ దేవుడు విడిచిపెట్టడు. అటువంటి మనుష్యులు ఇంకా తీవ్రమైన శిక్షను పొందుకుంటారు. తీర్పు తీర్చబడటానికి దేవుని ముందుకు వచ్చినవారు మరియు మరీ ముఖ్యంగా, శుద్దీకరించబడినవారు ఆయన రాజ్యంలో శాశ్వతంగా నివసిస్తారు. వాస్తవానికి, ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయం.
తీర్పు కార్యం అనేది దేవుని స్వంత పని, అందుచేత దేవుని ద్వారా స్వయంగా ఆ పని చేపట్టబడుతుంది; ఆయనకు బదులుగా మనిషి ఆ పనిని చేయలేడు. ఎందుకంటే, తీర్పు అనేది మానవాళిని జయించడానికి ఉపయోగించే సత్యం. అయితే, ఈ కార్యము చేయుటకు ఆయన మనుషుల మధ్య అవతార రూపుడై కనిపిస్తాడనే ప్రశ్న లేదు. అంటే, అంత్య దినములలోని క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ బోధించడానికి సత్యమును ఉపయోగిస్తాడు మరియు అన్ని సత్యములను తెలుసుకునేలా చేస్తాడు. ఇదే దేవుని తీర్పు కార్యము. దేవుని రెండవ అవతారం గురించి చాలా మందికి చెడ్డ తలంపులు ఉన్నాయి, తీర్పు కార్యమును చేయుటకు దేవుడు శరీరధారిగా మారతాడని నమ్మటానికి ప్రజలకు కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, తరచుగా దేవుని కార్యము మానవుని అంచనాలకు మించి ఉంటుంది మరియు మానవ హృదయాలు దాన్ని అంగీకరించడం కష్టంగా ఉంటుందని నేను తప్పక చెప్పి తీరాలి. మానవులు కేవలం ఈ భూమ్మీద పురుగుల వలే ఉన్నారు, దేవుడు ఈ సర్వలోకమును నింపే సర్వోన్నతుడుగా ఉన్నాడు; మానవుని మనస్సు పురుగులను మాత్రమే పుట్టించే చెడ్డ నీటితో నిండిన గుంట వలె ఉంటుంది, అయితే దేవుని తలంపులచే నిర్దేశించబడిన కార్యములోని ప్రతి దశ దేవుని జ్ఞానానికి సంబంధించిన ఫలం వలే ఉంటుంది. ప్రజలు ఎల్లప్పుడూ దేవునితో పోరాడటానికి ప్రయత్నిస్తుంటారు కానీ, అంతిమంగా వారు ఓడిపోతారని స్పష్టంగా ఉందనే విషయం నేను చెప్తాను. మిమ్మల్ని మీరు బంగారం కంటే ఎక్కువగా భావించవద్దని నేను మీకు బోధిస్తున్నాను. ఇతరులు దేవుని తీర్పును అంగీకరించినప్పుడు మీరు మాత్రం ఎందుకు అంగీకరించరు? ఇతరుల కంటే మీరు ఎంత ఎక్కువ ఎత్తులో నిలబడి ఉన్నారు? ఇతరులు సత్యం ముందు మోకరిల్లినప్పుడు మీరు కూడా ఎందుకు మోకరించరు? దేవుని కార్యము ఆపలేనంత వేగంతో ఉంటుంది. మీరు అందించిన “తోడ్పాటు” ను బట్టి ఆయన తీర్పు కార్యమును మరలా తిరిగి చేయడు. కాబట్టి, ఒక మంచి అవకాశం జారవిడుచుకున్నందుకు మీరు పశ్చాత్తాప పడతారు. మీరు నా మాటలను నమ్మనట్లయితే, ఆకాశంలో గొప్ప తెల్లని సింహాసనం మీ మీద తీర్చే తీర్పు కోసం వేచి ఉండండి! ఇశ్రాయేలీయులందరు యేసును తృణీకరించారని మరియు నిరాకరించారని మీరు తప్పక తెలుసుకోవాలి. అయినప్పటికీ, మానవాళిని యేసు విమోచించిన వాస్తవం విశ్వమంతటా మరియు భూమి అంతం వరకు విస్తరించెను. ఇది ఎంతో కాలం క్రితం దేవుడు చేసిన వాస్తవం కాదా? మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడని యేసు కొరకు మీరు ఇంకను వేచి ఉన్నట్లయితే, మీరు చేవ చచ్చిన కలపలా[ఎ] ఉన్నారని నేను అంటాను. సత్యానికి నమ్మకంగా లేకుండా కేవలం ఆశీర్వాదాలను మాత్రమే కోరుకునే మీలాంటి అబద్ధ విశ్వాసిని యేసు అంగీకరించడు. దానికి విరుద్ధంగా దేవుడు మిమ్మల్ని కనికరం లేకుండా పదుల వేల సంవత్సరాలు మండి పోవడానికి అగ్ని సరస్సులోనికి త్రోసి వేస్తాడు.
తీర్పు అంటే ఏమిటో మరియు సత్యం అంటే ఏమిటో అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? మీరు అర్థం చేసుకున్న పక్షంలో, తీర్పు తీర్చబడటం కోసం మిమ్మల్ని మీరు విధేయతతో సమర్పించుకొవాల్సిందిగా నేను మీకు బోధిస్తాను. లేనట్లయితే, మీరు దేవునిచే మెచ్చుకొనబడటానికి లేదా ఆయనచే ఆయన రాజ్యం లోనికి తీసుకొని రాబడే అవకాశాన్ని ఎప్పటికీ పొందుకోలేరు. తీర్పును మాత్రమే అంగీకరించి, ఎప్పటికీ శుద్ధి చేయబడని వారు, అంటే, తీర్పు కార్యము మధ్యలో నుండి పారిపోయేవారు ఎప్పటికీ దేవునిచే పరీక్షించబడతారు మరియు తిరస్కరించబడతారు. వారి పాపములు దేవునికి ద్రోహం చేసిన మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పరిసయ్యుల పాపముల కంటే అధికమైనవి మరియు చాలా తీవ్రమైనవి. సేవ చేయటానికి కూడా అర్హత లేని ఇలాంటి వ్యక్తులు చాలా తీవ్రమైన శిక్షను పొందుకుంటారు, అంతేకాక ఆ శిక్ష అనేది నిత్యమైనది. ఒకప్పుడు మాటలతో నమ్మకాన్ని చూపి తర్వాత తనకు ద్రోహం చేసిన ఏ ద్రోహినైనా దేవుడు విడిచిపెట్టడు. ఇటువంటి వ్యక్తులు ఆత్మ, మనసు మరియు శరీరమునకు శిక్ష ద్వారా ప్రతిఫలం పొందుకుంటారు. ఇది దేవుని నీతి గల స్వభావానికి సరైన వెల్లడి కాదా? మానవుడికి తీర్పు తీర్చడంలో మరియు అతన్ని బహిర్గతం చేయడంలో దేవుని ఉద్దేశం ఇది కాదా? తీర్పు సమయంలో అన్ని రకాలైన దుష్ట కార్యములు చేసే వారినందరిని దయ్యపు ఆత్మలచే పీడింపబడుచున్న ప్రదేశానికి పంపిస్తాడు మరియు అవి వాటి ఇష్టమొచ్చినట్లుగా వీరి శరీరములను నాశనం చేయును మరియు ఈ మనుష్యుల శరీరాలు శవాల దుర్గంధము విడుదల చేయును. ఇలాంటి వారికి ఇదే తగిన దండన. దేవుడు, నమ్మకంగా లేని అబద్ధపు విశ్వాసులు, అబద్ధపు ప్రవక్తలు మరియు అబద్ధపు పనివారు చేసిన ప్రతి ఒక్క పాపమును వారి చిట్టా పుస్తకములలో వ్రాయును, తర్వాత, సరైన సమయం వచ్చినప్పుడు వారిని అపవిత్ర ఆత్మల మధ్య పడవేయును, ఆ అపవిత్ర ఆత్మలు వాటి ఇష్టమొచ్చిన రీతిగా వారిని మలినము చేయును, తద్వారా, వారెప్పుడూ పునరవతరించలేరు మరలా ఎప్పటికీ వెలుతురును చూడలేరు. ఇలాంటి దొంగభక్తి కలవారు కొంత సమయం వరకే సేవ చేస్తారు. కానీ, అంతం వరకు నమ్మకంగా ఉండగలిగే సామర్థ్యం కలిగి ఉండరు, అలాంటివారిని దేవుడు దుష్టులలో భాగంగా లెక్కిస్తాడు, తద్వారా, వారు దుష్టుల సమూహంలో పడి మరియు క్రమానుసారం లేని వారి గుంపులో భాగం అవుతారు; చివరిలో దేవుడు వారిని నాశనము చేయును. తనకు ఎప్పుడూ నమ్మకంగా లేని వారిని మరియు ఎప్పుడూ వారి బలంతో సహకారం అందించని వారిని దేవుడు పక్కన పెట్టును మరియు వారిని పట్టించుకోడు. మరియు యుగం మారినప్పుడు వారినందరిని నాశనం చేస్తాడు. వారు ఇకపై భూమి పైన ఉండరు, దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడానికి వారు చాలా తక్కువ మార్గాన్ని మాత్రమే పొందుకుంటారు. దేవుని పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధితో లేనివారే అయినప్పటికీ, పరిస్థితుల కారణంగా దేవునితో వ్యవహరించేవారిని ప్రజల కొరకు సేవ చేసే వారిలో ఒకరిగా ఆయన ద్వారా లెక్కించబడతారు. ఇలాంటి చాలా కొద్దిమంది మాత్రమే జీవించి ఉంటారు, ప్రమాణానికి అనుగుణంగా సేవ చేయని వారితో సహా, చాలామంది నాశనము అవుతారు. చివరకు, దేవుని పోలిన మనసును కలిగిన వారినందరిని, దేవుని కుమారులను మరియు దేవునిచే ముందుగా నియమించబడిన యాజకులను ఆయన తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చును. వారు దేవుని కార్యంలో స్వేదనం వలే ఉంటారు. దేవునిచే ఏర్పరచబడిన ఏ వర్గాలలోనూ చేర్చబడని వారు అవిశ్వాసుల లెక్కలో లెక్కించబడతారు, మరియు అలాంటి వారి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మీరు ఖచ్చితంగా ఊహించగలరు. నేను చెప్పవలసింది అంతయు నేను ఇప్పటికే చెప్పాను; మీరు ఎంచుకున్న దారి కేవలం మీ ఎంపిక మాత్రమే. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని కార్యమనేది ఆయన వేగమును అందుకోలేని వారి కోసం ఎదురు చూడదు మరియు నీతి గల దేవుని స్వభావమనేది ఏ మనిషి పట్ల కరుణ చూపదు.
ఫుట్‌నోట్:
ఎ. చేవ చచ్చిన కలప: ఇది చైనీయుల సామెత, “సహాయమునకు అతీతమైనది” అని అర్థం.