దేవుడు తనకు తానే అద్వితీయుడు I
దేవుని అధికారం (I)
నా చివరి అనేక సహవాసాలలో దేవుని కార్యము, దేవుని స్వభావం మరియు దేవుని గురించి ఉండేవి. ఈ సహవాసాలలో విన్న తర్వాత, మీరు దేవుని స్వభావం గురించి అవగాహనను మరియు జ్ఞానమును పొందారని భావిస్తున్నారా? మీరు ఎంత మేరకు అవగాహనను మరియు జ్ఞానాన్ని పొందారు? మీరు దానికి ఒక సంఖ్యను ఇవ్వగలరా? ఈ సహవాసాలు మీకు దేవుని గురించి లోతైన అవగాహనను ఇచ్చాయా? ఈ అవగాహన దేవునికి సంబంధించిన నిజమైన జ్ఞానం అని చెప్పగలరా? దేవుని గూర్చిన ఈ జ్ఞానం మరియు అవగాహన అనేది దేవుని సమస్త గుణగణాలకు సంబంధించిన జ్ఞానమని మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమైయున్నాడు అనే వాటికి సంబంధించిన జ్ఞానమని అని చెప్పవచ్చా? లేదు, కచ్చితంగా చెప్పలేము! ఎందుకంటే ఈ సహవాసాలు దేవుని స్వభావం మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమైయున్నాడు అనే దానిని గూర్చి పాక్షిక అవగాహనను మాత్రమే అందిస్తాయి గాని వాటిని గూర్చిన జ్ఞానమును అందించవు. ఈ సహవాసాలు గతంలో దేవుని ద్వారా జరిగించబడిన కార్యమును మీరు పాక్షికంగా అర్థం చేసుకొనేలా చేశాయి; ఈ సహవాసాల ద్వారా, నీవు దేవుని స్వభావమును, ఆయన కలిగియున్న వాటిని మరియు ఆయన ఏమైయున్నాడో అనే విషయాలను, అలాగే ఆయన జరిగించిన ప్రతిదాని వెనుక ఉన్న విధానం మరియు ఆలోచనను మీరు చూశారు. కానీ ఇది దేవుని గురించి అక్షరార్థంగా మాట్లాడే అవగాహన మాత్రమే మరియు మీ హృదయాలలో ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిని గూర్చి మీరు నిశ్చయత లేకుండా ఉన్నారు. అటువంటి విషయాలపై ప్రజల అవగాహనలో ఏదైనా వాస్తవికత ఉందా లేదా అనేది ప్రధానంగా ఏమి నిర్ణయిస్తుంది? వారి వాస్తవ అనుభవాల సమయంలో వారు నిజంగా ఎంతగా దేవుని మాటలు మరియు స్వభావాన్ని అనుభూతి చెందారు మరియు ఈ వాస్తవ అనుభవాల సమయంలో వారు ఎంతవరకు చూడగలిగారు మరియు తెలుసుకోగలిగారు అనే దానిని బట్టి నిర్ణయించబడుతుంది. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్పారా: “గత అనేక సహవాసాలు దేవుడు చేసిన కార్యములను, దేవుని ఆలోచనలను మరియు అంతేగాక మానవజాతిపట్ల దేవుని దృక్పథాన్ని మరియు ఆయన చర్యల మూలాన్ని, అలాగే ఆయన చర్యల సూత్రాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడ్డాయి; కాబట్టి మేము దేవుని స్వభావాన్ని అర్థం చేసుకున్నాము మరియు దేవుని సంపూర్ణతను తెలుసుకున్నామా”? ఇలా చెప్పడం సరైనదేనా? స్పష్టంగా, ఇలా చెప్పడం సరైనది కాదు. ఇలా చెప్పడం సరికాదని నేనెందుకు అంటున్నాను? దేవుని స్వభావము మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమైయున్నాడో అనేవన్నియు ఆయన చేసిన కార్యాలలో మరియు ఆయన మాట్లాడిన మాటలలో వ్యక్తీకరించబడతాయి. దేవుడు చేసిన కార్యము ద్వారా మరియు ఆయన పలికిన మాటల ద్వారా, మనిషి దేవుడు కలిగి ఉన్నవాటిని మరియు ఆయన ఏమైయున్నాడో అనే దానిని చూడగలుగుతాడు, అయితే ఈ కార్యం మరియు మాటలన్నీ మనిషి అర్ధంచేసుకొనేలా చేశాయి, కానీ అది కేవలం దేవుని స్వభావాన్ని, ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమైయున్నాడు అనే విషయాలను గూర్చిన పాక్షిక అవగాహన మాత్రమే అని చెప్పవచ్చు. మనిషి దేవుని గురించి మరింత గొప్ప మరియు లోతైన అవగాహన పొందాలనుకుంటే, అప్పుడు మనిషి దేవుని మాటలు మరియు కార్యాన్ని ఎక్కువగా అనుభవించాలి. దేవుని మాటలను లేదా కార్యాన్ని అనుభవించడం ద్వారా మనిషి దేవుని గురించి పాక్షిక అవగాహనను పొందుతున్నప్పటికీ, ఈ పాక్షిక అవగాహన అనేది దేవుని నిజమైన స్వభావాన్ని సూచిస్తుందా? అది దేవుని గుణగణాలను సూచిస్తుందా? వాస్తవానికి ఇది దేవుని నిజమైన స్వభావాన్ని మరియు దేవుని గుణగణాలను సూచిస్తుంది; అందులో సందేహం లేదు. సమయంతోను, లేదా ప్రదేశంతోను, లేదా దేవుడు తన పనిని ఏ విధంగా చేస్తాడనే దానితోను, లేదా ఆయన మనిషికి ఏ రూపంలో కనిపిస్తాడనేదానితోను, లేదా ఆయన తన చిత్తాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తాడు అనే దానితోను సంబంధం లేకుండా, ఆయన వెల్లడించే మరియు వ్యక్తీకరించే ప్రతిదీ దేవుణ్ణి, దేవుని గుణగణాలను మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమైయున్నాడు అనేదానిని సూచిస్తుంది. దేవుడు ఏమి కలిగి ఉన్నాడో మరియు ఏమైయున్నాడో అనే వాటితో ఆయన తన కార్యమును నిర్వహిస్తాడుమరియు ఆయన నిజమైన గుర్తింపులో జరిగిస్తాడు; ఇది ఖచ్చితంగా నిజం. అయినప్పటికీ, ఈ రోజున ప్రజలు ఆయన మాటల ద్వారా మరియు బోధలను వినడం ద్వారా దేవుని గురించి పాక్షిక అవగాహన కలిగి ఉన్నారు, కాబట్టి కొంత మేరకు, ఈ అవగాహన సిద్ధాంతపరమైన జ్ఞానం అని మాత్రమే చెప్పవచ్చు. మీ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా, మీలో ప్రతీ ఒక్కరు మీ వాస్తవ అనుభవాల గుండా వెళ్లి, దీనిని కొద్ది కొద్దిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఈ రోజు మీ హృదయంలో నువ్వు వినిన, చూసిన, లేదా తెలుసుకొన్న మరియు అర్థం చేసుకున్న దేవుని అవగాహన లేదా జ్ఞానాన్ని మీరు నిర్ధారించుకోవచ్చు. నేను మీతో ఈ మాటలను పంచుకోవడానికి సహవాసం చేయకపోతే, మీరు కేవలం మీ అనుభవాల ద్వారా దేవుని గురించిన నిజమైన జ్ఞానాన్ని పొందగలుగుతారా? అలా చేయడం చాలా కష్టం అని నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఎలా అనుభవించాలో తెలుసుకోవాలంటే ప్రజలు మొదట దేవుని మాటలు కలిగి ఉండాలి. ప్రజలు ఎన్ని దేవుని మాటలు తిన్నా, వారు నిజంగా అనుభవించగలిగింది ఇదే. దేవుని మాటలు ముందుకు నడిపిస్తాయి మరియు మనిషిని అతని అనుభవంలోకి నడిపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే, కొంత నిజమైన అనుభవం ఉన్నవారికి, ఈ గత అనేక సహవాసాలు సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు దేవుని గురించి మరింత వాస్తవిక జ్ఞానాన్ని పొందడానికి సహాయపడతాయి. కానీ ఏవిధమైన వాస్తవిక అనుభవం లేని వారికి, లేదా ఇప్పుడే తమ అనుభవాన్ని ప్రారంభించిన వారికి లేదా వాస్తవాన్ని స్పృశించడం ప్రారంభించిన వారికి, ఇది చాలా కష్టంగా ఉంటుంది.
గత అనేక సహవాసాల యొక్క ప్రధాన అంశం “దేవుని స్వభావం, దేవుని కార్యము మరియు దేవుడు ప్రత్యేకమైనవాడు” అనే వాటికి సంబంధించినవైయుండెను. నేను మాట్లాడిన ప్రతిదాని యొక్క కీలక మరియు ప్రధాన భాగాలలో మీరు దేనిని చూశారు? ఈ సహవాసాల ద్వారా, కార్యం జరిగించిన వ్యక్తిని, ఈ స్వభావాలను వెల్లడించిన వ్యక్తిని, అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రత్యేకమైన దేవుణ్ణి మీరు గుర్తించగలరా? మీ సమాధానం అవును అని చెప్పినట్లయితే, అటువంటి నిర్ణయానికి మిమ్మల్ని నడిపించేది ఏమిటి? ఈ నిర్ణయానికి వచ్చినప్పుడు, మీరు ఎన్ని అంశాలను పరిగణించారు? ఎవరైనా నాకు చెప్పగలరా? గత కొన్ని సహవాసాలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేశాయని మరియు దేవుని గురించి మీరు కలిగియున్న జ్ఞానంపట్ల మీ హృదయాల్లో కొత్త ఆరంభాన్ని అందించాయని నాకు తెలుసు, ఇది గొప్ప సంగతి. అయితే, మునుపటితో పోలిస్తే, మీరు దేవుని గురించిన మీ అవగాహనలో బాగా మెరుగుపడ్డప్పటికీ, దేవుని గుర్తింపును గూర్చిన మీ నిర్వచనం, ధర్మశాస్త్ర యుగపు యెహోవా దేవుడు, కృపాయుగపు ప్రభువైన యేసు, మరియు రాజ్య యుగపు సర్వశక్తిమంతుడైన దేవుడు అనే పేర్లకు అతీతంగా ఇంకా పురోగతిని సాధించలేదు. అంటే, “దేవుని స్వభావం, దేవుని కార్యము మరియు దేవుడు ప్రత్యేకమైనవాడు” అనే అంశాలను గూర్చిన ఈ సహవాసాలన్నీ మీకు దేవుడు ఒకసారి పలికిన మాటలు ద్వారా మరియు దేవుడు ఒకసారి చేసిన కార్యం ద్వారా మరియు దేవుడు ఒకసారి వెల్లడిపరిచిన గుణగణాలు మరియు లక్షణాల ద్వారాకొంత అవగాహనను ఇచ్చాయి, మీరు “దేవుడు” అనే పదానికి నిజమైన నిర్వచనం మరియు ఖచ్చితమైన ఆలోచనను ఇవ్వలేకపోతున్నారు. మీకు దేవుని యొక్క స్థాయి మరియు గుర్తింపు, అంటే, అన్ని విషయాలలో మరియు విశ్వమంతటిలో దేవుని స్థాయిని గురించి నిజమైన మరియు ఖచ్చితమైన ఆలోచన గాని మరియు జ్ఞానం గాని లేదు. ఎందుకంటే, దేవుని గురించి మరియు దేవుని స్వభావం గురించి మునుపటి సహవాసాల్లోని అంశమంతా బైబిల్లో నమోదు చేయబడిన దేవుని మునుపటి వ్యక్తీకరణలు మరియు ప్రత్యక్షతలపై ఆధారపడి ఉంది. అయినప్పటికీ, మానవజాతి యొక్క నిర్వహణ మరియు రక్షణ సమయంలో లేదా దానికి వెలుపల దేవుడు వెల్లడించిన మరియు వ్యక్తీకరించిన గుణగణాలు మరియు లక్షణాలను తెలుసుకోవడం మనిషికి కష్టం. కాబట్టి, దేవుడు గతంలో చేసిన కార్యంలో వెల్లడయిన దేవుని గుణగణాలు మరియు లక్షణాలను మీరు అర్థం చేసుకున్నప్పటికీ, దేవుని గుర్తింపు మరియు స్థాయికి సంబంధించిన మీ నిర్వచనం ఇప్పటికీ “అద్వితీయ దేవుడు, అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నవాడు” అనే దానికి చాలా దూరంలో ఉంది, మరియు అది “సృష్టికర్తకు” విభిన్నంగా ఉంటుంది. గత అనేక సహవాసాలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనిపించాయి: మనిషి దేవుని ఆలోచనలను ఎలా తెలుసుకోగలడు? ఎవరైనా నిజంగా తెలుసుకుంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడే అవుతాడు, ఎందుకంటే దేవునికి మాత్రమే తన స్వంత ఆలోచనలు తెలుసు మరియు ఆయన చేసే ప్రతిదానికి మూలం మరియు విధానం దేవునికి మాత్రమే తెలుసు. మీరు దేవుని గుర్తింపును ఈ విధంగా గ్రహించడం అనేది హేతుబద్ధంగా మరియు తార్కికంగా అనిపిస్తుంది, అయితే ఇది నిజంగా దేవుడే చేసే కార్యం, మనిషి చేసే కార్యం కాదు అని, దేవుని తరపున మనిషి చేయలేని కార్యం అని దేవుని స్వభావం మరియు కార్యాన్ని బట్టి ఎవరు చెప్పగలరు? ఈ కార్యం దేవుని గుణగణాలు మరియు శక్తిని కలిగి ఉన్న వ్యక్తి యొక్క సార్వభౌమాధికారం క్రిందకు వస్తుందని ఎవరు చూడగలరు? అంటే, మీరు ఏ లక్షణాలు లేదా గుణగణాలు ద్వారా ఆయనే దేవుడని, దేవుని గుర్తింపును కలిగి ఉన్నాడని మరియు సమస్త విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడని గుర్తిస్తారు? మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? మీరు ఆలోచించకపోతే, ఇది ఒక వాస్తవాన్ని రుజువు చేస్తుంది: గత అనేక సహవాసాలు మీకు దేవుడు తన కార్యాన్ని చేసిన చరిత్ర గురించి మరియు ఆ కార్యంలో దేవుని విధానం, వ్యక్తీరణ మరియు ప్రత్యక్షతల గురించి పాక్షిక అవగాహనను మాత్రమే అందించాయి. అలాంటి అవగాహన మీలో ప్రతి ఒక్కరూ ఈ రెండు దశల కార్యాన్ని చేసేది, మీరు విశ్వసించే మరియు అనుసరించే, మీరు ఎల్లప్పుడూ అనుసరించాల్సిన దేవుడే అని నిస్సందేహంగా గుర్తించేలా చేసినప్పటికీ, మీరు లోకం సృష్టించబడినప్పటి నుండి ఉనికిలో ఉన్న మరియు నిత్యము ఉనికిలో ఉండే దేవుడని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు, లేదా మానవజాతి అంతటిని నడిపిస్తున్నది మరియు వారిపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నది ఆయనే మీరు గ్రహించడంలేదు. మీరు ఖచ్చితంగా ఈ సమస్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అది యెహోవా అయినా లేదా యేసు ప్రభువు అయినా, గుణగణాలు మరియు వ్యక్తీకరణకు సంబంధించిన ఏ అంశాల ద్వారా, ఆయన మీరు అనుసరించాల్సిన దేవుడు మాత్రమే కాదు, మానవజాతిని ఆదేశించేది మరియు మానవజాతి విధిపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నది, అంతేగాక, ఆయన, భూమ్యాకాశాలు మీద కూడా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న అద్వితీయ దేవుడు అని మీరు గుర్తించగలుగుచున్నారు? మీరు విశ్వసించే మరియు అనుసరించే దేవుడే అన్ని విషయాలపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని మీరు ఎటువంటి మార్గాల ద్వారా గుర్తిస్తారు? మానవజాతి యొక్క విధిపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న దేవునికి మీరు విశ్వసించే దేవుణ్ణి ఏ మార్గాల ద్వారా అనుసంధానం చేస్తారు? మీరు విశ్వసించే దేవుడే పరలోకం మరియు భూమిపై మరియు అన్నిటి మధ్యన ఉన్న ప్రత్యేకమైన దేవుడు అని ఏది మిమ్మల్ని గుర్తించేలా చేస్తుంది? తదుపరి విభాగంలో నేను పరిష్కరించబోయే సమస్య ఇదే.
మీరు ఎన్నడూ ఆలోచించని లేదా ఆలోచించలేని సమస్యలు దేవుణ్ణి తెలుసుకోవడంలో మరియు బహుశా మనిషికి అంతుపట్టని సత్యాలను అన్వేషించడంలో అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఈ సమస్యలు మీకు వచ్చినప్పుడు, మీరు వాటిని ఎదుర్కొని ఎంపిక చేసుకోవాలి, మీ మూర్ఖత్వం మరియు అజ్ఞానం లేదా మీ అనుభవాలు చాలా నిస్సారంగా ఉండడం మరియు మీకు దేవుని గురించి నిజమైన జ్ఞానం లోపించడం కారణంగా మీరు వాటిని పూర్తిగా పరిష్కరించలేకపోతే, అప్పుడు అవి దేవునిపై మీకున్న విశ్వాసపు మార్గములో పెద్ద అవరోధంగా మరియు పెద్ద ఆటంకంగా మారతాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీతో సహవాసం చేయడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీ సమస్య ఏమిటో మీకు తెలుసా? నేను మాట్లాడే సమస్యల గురించి మీరు స్పష్టత కలిగి ఉన్నారా? ఇవేనా మీరు ఎదుర్కొనే సమస్యలు? అవి మీకు అర్థం కాని సమస్యలా? అవి మీకు ఎన్నడూ రాని సమస్యలా? ఈ సమస్యలు మీకు ముఖ్యమా? అవి నిజంగా సమస్యలేనా? ఈ విషయం మీకు చాలా గందరగోళంగా ఉంది, ఇది మీరు విశ్వసించే దేవుని గురించి మీకు నిజమైన అవగాహన లేదని మరియు మీరు ఆయనను పెద్దగా పట్టించుకోలేదని తెలియజేస్తోంది. కొంతమంది ఇలా అంటారు, “ఆయన దేవుడని నాకు తెలుసు, అందుకే నేను ఆయనను అనుసరిస్తాను, ఎందుకంటే ఆయన మాటలు దేవుణ్ణి వ్యక్తీకరిస్తున్నాయి. అది చాలు. ఇంతకంటే రుజువు ఏం కావాలి? దేవుని గురించి మనం సందేహాలు లేవనెత్తాల్సిన అవసరం లేదా? మనం ఖచ్చితంగా దేవుడిని పరీక్షించకూడదా? దేవుని గుణగణాలు మరియు దేవుని గుర్తింపును మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, దేవుని గురించి మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి, లేదా మీరు ఆయనను పరీక్షించడానికి, లేక, దేవుని గుర్తింపు మరియు గుణగణాలను గూర్చి మీలో సందేహాలు కలిగించడానికి నేను అలాంటి ప్రశ్నలను అడగడంలేదు. దానికి బదులుగా, నేను మీలో దేవుని గుణగణాల గురించి గొప్ప అవగాహనను మరియు దేవుని స్థాయి గురించి మరింత నిశ్చయత మరియు విశ్వాసాన్ని కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి అలా చేస్తున్నాను, తద్వారా దేవుని అనుసరించే వారందరి హృదయాలలో దేవుడు ఒక్కడే అవుతాడు మరియు తద్వారా సృష్టికర్తగా, అన్నిటికి అధిపతిగా, ప్రత్యేకమైన దేవునిగా, దేవుని యొక్క అసలు స్థాయి ప్రతి జీవి హృదయంలో పునరుద్ధరించబడవచ్చు. నేను సహవాసం చేయబోయే అంశం కూడా ఇదే.
ఇప్పుడు, బైబిల్లోని ఈ క్రింది లేఖనాలను చదవడం ప్రారంభిద్దాం.
1. సమస్త విషయాలను సృష్టించడానికి దేవుడు వాక్కులను ఉపయోగిస్తున్నారు
దేవుడు—వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (ఆదికాండము 1: 3-5).
మరియు దేవుడు—జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను (ఆదికాండము 1: 6-7).
దేవుడు—ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు—గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను (ఆదికాండము 1: 9-11).
దేవుడు—పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను (ఆదికాండము 1: 14-15).
దేవుడు—జీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను (ఆదికాండము 1: 14-15).
దేవుడు—వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను (ఆదికాండము 1: 24-25).
మొదటి దినమున, మానజాతి యొక్క పగలు మరియు రాత్రి ఏర్పడ్డాయి మరియు నిలిచి ఉన్నాయి. దేవుని అధికారానికి ధన్యవాదాలు.
మొదటి వాక్య భాగాన్ని చూద్దాం: “దేవుడు—వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను” (ఆదికాండము 1: 3-5). ఈ వాక్య భాగం సృష్టి ప్రారంభంలో దేవుని యొక్క మొదటి చర్యను మరియు దేవుడు చేసిన మొదటి దినములో అస్తమయము మరియు ఉదయము ఉన్నట్లుగా వివరిస్తుంది. అయితే అది ఒక అసాధారణమైన రోజు: దేవుడు సమస్త విషయాల కోసం వెలుగును సిద్ధం చేయడం ప్రారంభించాడు, అంతేకాకుండా, వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఈ దినమున, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు మరియు ఆయన మాటలు మరియు అధికారం ప్రక్క ప్రక్కనే సమాంతరంగా ఉనికిలో ఉన్నాయి. ఆయన అధికారం అన్ని విషయాలలో కనబడడం మొదలయ్యింది మరియు ఆయన మాటల ఫలితంగా ఆయన శక్తి అన్ని విషయాలకు విస్తరించింది. ఈ దినము మొదలుకొని, దేవుని మాటలు, దేవుని అధికారం మరియు దేవుని శక్తి కారణంగా సమస్త విషయాలు ఏర్పడి నిలిచి ఉన్నాయి మరియు అవి పని చేయడం ప్రారంభించాయి, దేవుని మాటలు, దేవుని అధికారం మరియు దేవుని శక్తికి ధన్యవాదాలు. దేవుడు “వెలుగు కమ్మని” పలికినప్పుడు వెలుగు కలిగింది. దేవుడు ఏ పనిని చేపట్టలేదు; ఆయన మాటల ఫలితంగా వెలుగు కలిగింది. దేవుడు ఈ వెలుగును పగలు అని పిలిచాడు, మరియు మానవుడు తన ఉనికి కోసం నేటికీ దీని మీదే ఆధారపడి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం, దాని గుణగణాలు మరియు విలువ ఎన్నడూ మారలేదు మరియు అది ఎన్నడూ అదృశ్యం కాలేదు. దాని ఉనికి దేవుని అధికారం మరియు శక్తిని కనబరుస్తుంది మరియు సృష్టికర్త ఉనికిని చాటుతుంది. ఇది సృష్టికర్త యొక్క గుర్తింపు మరియు స్థాయిని పదే పదే నిర్ధారిస్తుంది. ఇది అవ్యక్తమైనది, లేదా భ్రమ కలిగించేది కాదు, కానీ మనిషికి కనిపించే నిజమైన వెలుగు. ఆ సమయం మొదలుకొని, ఈ ఖాళీ ప్రపంచంలో “భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను,” అక్కడ మొదటి భౌతిక విషయం ఏర్పడింది. ఈ విషయం దేవుని నోటి మాటల నుండి వచ్చింది మరియు దేవుని అధికారం మరియు పలుకులు కారణంగా సమస్త విషయాలను సృష్టించే మొదటి చర్యలో ప్రత్యక్షమయ్యింది. ఆ వెంటనే, దేవుడు వెలుగు మరియు చీకటిని వేరుకమ్మని ఆదేశించాడు…. దేవుని మాటలను బట్టి అంతా మారిపోయింది మరియు పూర్తయింది….దేవుడు ఈ వెలుగును “పగలు” అని పిలిచాడు మరియు చీకటిని “రాత్రి” అని పిలిచాడు. ఆ సమయంలో, దేవుడు సృష్టించడానికి ఉద్దేశించిన లోకంలో మొదటి సాయంత్రం మరియు మొదటి ఉదయం ఉనికిలోకి వచ్చాయి, మరియు దేవుని దానిని మొదటి దినము అని చెప్పాడు. ఈ దినము సృష్టికర్త అన్నిటినీ సృష్టించిన మొదటి దినము, మరియు అన్ని విషయాల సృష్టికి నాంది మరియు సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి అనేవి ఆయన సృష్టించిన ఈ లోకంలో మొదటిసారిగా చూపబడింది.
ఈ మాటల ద్వారా మనిషి దేవుని అధికారాన్ని మరియు దేవుని మాటలను, అలాగే దేవుని శక్తిని చూడగలుగుతాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు, కాబట్టి దేవునికి మాత్రమే అలాంటి అధికారం ఉంది; ఎందుకంటే దేవుడు అలాంటి అధికారం కలిగి ఉన్నాడు, కాబట్టి దేవునికి మాత్రమే అలాంటి శక్తి ఉంది. ఏ మనిషియైనా ఇలాంటి అధికారమును మరియు శక్తిని కలిగియుండగలడా, లేదా మరేదైనా ఇలాంటి అధికారాన్ని మరియు శక్తిని కలిగి ఉండగలదా? మీ హృదయాలలో జవాబు ఉందా? దేవుడు కాకుండా, సృష్టించబడిన లేదా సృష్టించబడని దేనికైనా అలాంటి అధికారం ఉందా? మీరు ఎప్పుడైనా ఏదైనా పుస్తకంలో లేదా ప్రచురణలో అలాంటి ఉదాహరణను చూశారా? ఎవరైనా భూమ్యాకాశాలు మరియు సమస్తాన్ని సృష్టించినట్లు ఏదైనా రికార్డు ఉందా? ఇది ఏ ఇతర పుస్తకాలలో లేదా రికార్డులలో కనిపించదు; ఇవి, వాస్తవానికి, దేవుని అద్భుతమైన ప్రపంచ సృష్టిని గూర్చిన అధికారిక మరియు శక్తివంతమైన మాటలు కేవలం బైబిల్లో మాత్రమే నమోదు చేయబడ్డాయి; ఈ మాటలు దేవుని ప్రత్యేక అధికారం మరియు గుర్తింపును గూర్చి మాట్లాడతాయి. అటువంటి అధికారం మరియు శక్తి దేవుని యొక్క ప్రత్యేక గుర్తింపును సూచిస్తాయని చెప్పవచ్చా? వాటిని దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడని, దేవుని ఆధీనములో ఉన్నాయని చెప్పగలరా? నిస్సందేహంగా, దేవుడు మాత్రమే అలాంటి అధికారం మరియు శక్తిని కలిగి ఉన్నాడు! సృష్టించబడిన జీవియైనా, లేదా సృష్టించబడనవియైనా ఈ అధికారాన్ని మరియు శక్తిని ఆక్రమించలేదు లేదా భర్తీ చేయలేదు! ప్రత్యేకమైన దేవుని లక్షణాలలో ఇది ఒకటా? మీరు దానికి సాక్షిగా ఉన్నారా? దేవుడు ప్రత్యేకమైన అధికారం మరియు ప్రత్యేకమైన శక్తి, అత్యున్నతమైన గుర్తింపు మరియు స్థాయిని కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని ప్రజలు త్వరగా మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ మాటలు దోహదపడతాయి. పై సహవాసాన్ని బట్టి, మీరు విశ్వసించే దేవుడు ప్రత్యేకమైన దేవుడు అని చెప్పగలరా?
రెండవ దినమున, దేవుని అధికారం జలములను మరియు విశాలమును ఏర్పాటు చేస్తుంది, మరియు మానవ మనుగడకు అత్యంత ప్రాథమిక అవసరమైన ప్రదేశాన్ని కలుగజేస్తుంది.
బైబిల్లోని రెండవ వాక్య భాగం చదువుదాం: “మరియు దేవుడు—జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆప్రకారమాయెను” (ఆది 1:6-7). “జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక” అని దేవుడు పలికిన తర్వాత ఏ మార్పులు సంభవించాయి? లేఖనాల్లో ఇది ఇలా చెప్పబడింది: “మరియు దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరిచెను.” దేవుడు మాట్లాడి, ఇలా చేసిన తర్వాత కలిగిన ఫలితం ఏమిటి? సమాధానం వాక్య భాగం యొక్క చివరిలో ఉంది: “ఆప్రకారమాయెను.”
ఈ రెండు చిన్న వాక్యాలు ఒక అద్భుతమైన సంఘటనను నమోదు చేశాయి మరియు ఒక అద్భుతమైన దృశ్యాన్ని వివరిస్తున్నాయి, అదేమనగా దేవుడు జలాలను ఆదేశించడం మరియు మనిషి మనుగడ సాగించేలా ఒక ప్రదేశాన్ని సృష్టించడం అనే విషయాలను వివరిస్తున్నాయి.
ఈ చిత్రంలో జలములు మరియు విశాలము అనేవి క్షణంలో దేవుని కళ్ళ ఎదుట కనిపిస్తాయి మరియు అవి దేవుని మాటల అధికారంతో వేరుపరచబడ్డాయి మరియు దేవుడు నియమించిన పద్ధతిలో “పైన” మరియు “క్రింద”గా విభజించబడ్డాయి. దీనర్థం ఏమిటంటే, దేవుడు సృష్టించిన విశాలము క్రిందనున్న జలములను కప్పి ఉంచడమే కాకుండా, పైన ఉన్న నీటిని కూడా పట్టి ఉంచుతుంది…. ఇక్కడ మనిషి ఎటువంటి సహాయము చేయలేడు గాని సృష్టికర్త జలములను కదిలించి ఆజ్ఞాపించిన తీరును మరియు ఆకాశాన్ని సృష్టించిన దృశ్యం యొక్క వైభవాన్ని మరియు ఆయన అధికార శక్తిని చూసి ఆశ్చర్యంతో తదేకంగా చూడడం, మూగబోవడం మరియు ఉక్కిరిబిక్కిరి కావడం తప్ప మరేమీ చేయలేడు. దేవుని మాటలు మరియు దేవుని శక్తి మరియు దేవుని అధికారం ద్వారా, దేవుడు మరొక గొప్ప ఘనతను సాధించాడు. ఇది సృష్టికర్త యొక్క అధికారము యొక్క శక్తి కాదా? దేవుని కార్యాలను వివరించడానికి మనం లేఖనాలను ఉపయోగిద్దాం: దేవుడు తన మాటలను పలికాడు, దేవుని ఈ మాటల కారణంగా జలముల మధ్యలో ఒక విశాలము ఏర్పడింది. అదే సమయంలో, దేవుని ఈ మాటల కారణంగా ఈ ప్రదేశంలో బ్రహ్మాండమైన మార్పు సంభవించింది మరియు ఇది సాధారణ రీతిలో జరిగిన మార్పు కాదు, కానీ ఒక రకమైన ప్రత్యామ్నాయం, శూన్యంగా, ఒక విషయంగా మారింది. ఇది సృష్టికర్త యొక్క ఆలోచనల నుండి పుట్టింది మరియు సృష్టికర్త పలికిన మాటల కారణంగా శూన్యంగా, ఒక విషయంగా మారింది, ఇంకా, ఈ క్షణం నుండి ఇది ఉనికిలో ఉంటుంది మరియు సృష్టికర్త కొరకు నిలిచి ఉంటుంది మరియు సృష్టికర్త యొక్క ఆలోచనలకు అనుగుణంగా సవరించబడుతుంది, మారుతుంది మరియు పునరుద్ధరించబడుతుంది. ఈ వాక్య భాగం మొత్తం లోకాన్ని సృష్టించడంలో సృష్టికర్త యొక్క రెండవ చర్యను వివరిస్తుంది. ఇది సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి యొక్క మరొక వ్యక్తీకరణ, సృష్టికర్త చేపట్టిన మరొక మార్గదర్శక కార్యక్రమం. ఈ దినము లోకానికి పునాదులు వేయడం మొదలుకొని సృష్టికర్త చేసిన రెండవ దినము మరియు ఇది ఆయనకు మరొక అద్భుతమైన దినము: ఆయన వెలుగు మధ్య నడిచాడు, ఆయన విశాలమును తీసుకువచ్చాడు, ఆయన జలములను ఏర్పాటు చేశాడు మరియు ఆదేశించాడు, మరియు ఆయన కార్యాలు, ఆయన అధికారం మరియు ఆయన శక్తి కొత్త దినములో క్రియారూపం దాల్చాయి …
దేవుడు తన మాటలు పలుకక ముందు జలముల మధ్యలో విశాలము ఉందా? లేనే లేదు! “జలముల మధ్య నొక విశాలము కలగును గాక” అని దేవుడు పలికిన తర్వాత ఏమయ్యింది? దేవుడు ఉద్దేశించినవన్నీ ప్రత్యక్షమయ్యాయి; జలముల మధ్య ఒక విశాలము ఉంది మరియు “ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక” అని దేవుడు పలకడం వలన జలములు వేరు చేయబడ్డాయి. ఈ విధంగా, దేవుని మాటలను అనుసరించి, దేవుని అధికారం మరియు దేవుని శక్తి ఫలితంగా సమస్త విషయాలలో రెండు కొత్త అంశాలు, కొత్తగా జనించిన రెండు విషయాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రెండు కొత్త విషయాలు ప్రత్యక్షమవ్వడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది? సృష్టికర్త శక్తి యొక్క గొప్పతనాన్ని మీరు అనుభూతి చెందుతున్నారా? సృష్టికర్త యొక్క ప్రత్యేకమైన మరియు అసాధారణమైన ప్రభావాన్ని మీరు అనుభూతి చెందుతున్నారా? అటువంటి ప్రభావం మరియు శక్తి యొక్క గొప్పతనం అనేవి దేవుని అధికారమును బట్టి ఉన్నాయి మరియు ఈ అధికారం ప్రత్యేకమైన దేవుణ్ణి మరియు దేవుని యొక్క ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది.
ఈ వాక్య భాగం మీకు మరోసారి దేవుని యొక్క ప్రత్యేకతను గూర్చిన లోతైన భావనను అందించిందా? నిజానికి, ఇంకా చాలా ఉంది; సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి అనేవి ఇప్పుడు జరిగిదానికంటే మించి విస్తరించింది. ఆయన ప్రత్యేకత కేవలం ఏ జీవికీ లేని గుణగణాలను కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన అధికారం మరియు శక్తి అసాధారణమైనవి, అపరిమితమైనవి, అన్నింటికంటే ఉన్నతమైనవి మరియు అన్నింటికంటే మిన్నగా ఉన్నవి, అంతేకాదు, ఆయన అధికారం మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమైయున్నాడు అనేది జీవాన్ని సృష్టించగలదు, అద్భుతాలను చేయగలదు మరియు ప్రతి అద్భుతమైన మరియు అసాధారణమైన నిమిషాన్ని మరియు క్షణాన్ని సృష్టించగలదు. అదే సమయంలో, ఆయన సృష్టించే జీవాన్ని పరిపాలిస్తాడు మరియు అద్భుతాల మీద మరియు ఆయన సృష్టించే ప్రతి నిమిషం మరియు ప్రతి క్షణం మీద సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాడు.
మూడవ దినమున, దేవుని మాటలు భూమిని మరియు సముద్రములను పుట్టిస్తాయి మరియు దేవుని అధికారం అనేది జీవంతో లోకం నిండిపోయేలా చేస్తుంది
తర్వాత, ఆదికాండము 1:9—11లోని మొదటి వాక్యాన్ని చదువుదాం: “దేవుడు—ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక” అని పలికెను. “ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక” అని దేవుడు పలికిన తర్వాత ఏ మార్పులు సంభవించాయి? మరియు ఈ ప్రదేశంలో వెలుగు మరియు ఆకాశం కాకుండా మరేమి ఉంది? లేఖనాల్లో ఇలా వ్రాయబడింది: “దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.” అంటే, ఈ ప్రదేశంలో ఇప్పుడు భూమి మరియు సముద్రాలు ఉన్నాయి మరియు భూమి మరియు సముద్రాలు వేరు చేయబడ్డాయి. ఈ క్రొత్త విషయాలు కనిపించడం దేవుని నోటి నుండి వచ్చిన ఆజ్ఞను అనుసరించి, “ఆ ప్రకారమాయెను.” దేవుడు ఇలా చేస్తున్నప్పుడు ఆయన తొందరపడుతున్నాడని లేఖనాలు వివరిస్తున్నాయా? ఆయన శారీరకంగా శ్రమపడుతున్నట్టు అది వివరిస్తుందా? కాబట్టి, దేవుడు దీన్ని ఎలా చేశాడు? దేవుడు ఈ కొత్త విషయాలను ఎలా తయారు చేశాడు? స్వతహాగా, దేవుడు వీటన్నింటిని నెరవేర్చడానికి, దీనంతటినీ సృష్టించడానికి మాటలు ఉపయోగించాడు.
పైన పేర్కొన్న మూడు వాక్య భాగాలలో, మూడు గొప్ప సంఘటనలు జరిగినట్లు తెలుసుకున్నాము. ఈ మూడు గొప్ప సంఘటనలు దేవుని మాటల ద్వారా జరిగాయి మరియు ఉనికిలోకి వచ్చాయి మరియు ఆయన మాటల వల్లనే, ఈ సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి దేవుని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ విధంగా: “దేవుడు మాట్లాడతాడు, అది నెరవేరుతుంది; ఆయన ఆజ్ఞాపిస్తాడుమరియు అది నిలిచి ఉంటుంది” ఈ మాటలు అర్ధరహితమైనవి కావు. దేవుని యొక్క ఈ గుణగణాలు ఆయన ఆలోచనలను తక్షణమే ధృవీకరిస్తున్నాయి మరియు దేవుడు మాట్లాడటానికి నోరు తెరిచినప్పుడు, ఆయన గుణగణాలు పూర్తిగా ప్రతిబింబిస్తున్నాయి.
మనం ఈ భాగంలోని చివరి వాక్యాన్ని చూద్దాం: “దేవుడు—గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను” దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ దేవుని ఆలోచనలను అనుసరించి ఉనికిలోకి వచ్చాయి మరియు ఒక క్షణంలోనే, సున్నితమైన చిన్న జీవుల సమాహారం తమ తలలను విదిలించుకొంటూ భూమిలో నుంచి బయటకు పొడుచుకొచ్చాయి మరియు అవి తమ మీదున్న మురికిని దులుపుకోకముందే, అవి ఆత్రంగా ఒకదానికొకటి చూసుకుంటూ, పలకరించుకుంటూ, లోకాన్ని చూసి చిరుమందహాసం చేశాయి. సృష్టికర్త తమకు ప్రసాదించిన జీవితానికి అవి కృతజ్ఞతలు తెలిపాయి మరియు అవి అన్ని విషయాలలో తాము ఒక భాగమని మరియు సృష్టికర్త యొక్క అధికారాన్ని చూపించడానికి ప్రతి ఒక్కటి తమ జీవితాలను అంకితం చేస్తామని లోకానికి ప్రకటించాయి. దేవుని మాటలు పలుకుతుండగా, భూమి పచ్చగా, కోమలంగా మారింది, మానవుడు ఆనందించగలిగే అన్ని రకాల మొక్కలు భూమిని చీల్చుకొంటూ పుట్టుకొచ్చాయి మరియు పర్వతాలు మరియు మైదానాలు చెట్లతో మరియు అడవులతో దట్టంగా నిండిపోయాయి…. జీవపు జాడ లేని ఈ బీడువారిన లోకం, గడ్డి, మొక్కలు మరియు చెట్లతో వేగంగా కప్పబడి, పచ్చదనంతో నిండిపోయింది. గడ్డి యొక్క పరిమళం మరియు నేల యొక్క సువాసన గాలిలో వ్యాపించింది మరియు గాలి ప్రసరణతో మొక్కల శ్రేణి సమిష్టిగా శ్వాసించడం ప్రారంభించాయి మరియు ఎదగడం ఆరంభించాయి. అదే సమయంలో, దేవుని మాటలకు కృతజ్ఞతలు మరియు దేవుని ఆలోచనలను అనుసరించి, మొక్కలన్నీ ఎదగడం, వికసించడం, ఫలించడం మరియు అభివృద్ధి చెందడం అనే నిరంతర జీవన చక్రాలను ప్రారంభించాయి. అవి తమ జీవన ప్రక్రియకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం మరియు అన్ని విషయాలలో తమ పాత్రలను నిర్వహించడం ప్రారంభించాయి…. సృష్టికర్త యొక్క మాటలవల్ల అవన్నీ పుట్టాయి మరియు జీవించాయి. అవి సృష్టికర్త నుండి నిరంతరం సమకూర్పు మరియు పోషణను పొందుతాయి మరియు సృష్టికర్త యొక్క అధికారాన్ని మరియు శక్తిని ప్రదర్శించడానికి భూమి యొక్క ప్రతి మూలలో ఎల్లప్పుడూ స్థిరంగా జీవించి ఉంటాయి మరియు అవి ఎల్లప్పుడూ సృష్టికర్త తమకు ప్రసాదించిన జీవపు శక్తిని ప్రదర్శిస్తాయి…
సృష్టికర్త యొక్క జీవితం అసాధారణమైనది, ఆయన ఆలోచనలు అసాధారణమైనవి మరియు ఆయన అధికారం అసాధారణమైనది, అందువలన, ఆయన మాటలు పలికినప్పుడు, తుది ఫలితం “ఆ ప్రకారమాయెను” అని ఉండెను. స్పష్టంగా, దేవుడు కార్యము జరిగిస్తున్నప్పుడు తన చేతులతో పని చేయవలసిన అవసరం లేదు; ఆయన కేవలం తన ఆలోచనలను ఆజ్ఞాపించడానికి మరియు తన మాటలను ఆదేశించడానికి ఉపయోగిస్తాడు మరియు ఈ విధంగా విషయాలు నెరవేరతాయి. ఈ దినమున, దేవుడు జలములను ఒక చోటికి చేర్చాడు మరియు ఆరిన నేల కనిపించింది, ఆ తర్వాత దేవుడు భూమి నుండి గడ్డిని మొలకెత్తించాడు మరియు అక్కడ విత్తనములు ఇచ్చే చెట్లను మరియు ఫలాలను ఇచ్చే వృక్షాలను మొలిపించాడు మరియు దేవుడు వాటిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చే చెట్లుగా మరియు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములుగల ఫలవృక్షములగా విభజించాడు. ఇవన్నీ దేవుని ఆలోచనల ప్రకారం మరియు దేవుని మాటల ఆజ్ఞల ప్రకారం ఏర్పడ్డాయి మరియు ప్రతి ఒక్కటి ఈ కొత్త లోకంలో ఒకదాని తర్వాత మరొకటిగా ప్రత్యక్షమయ్యాయి.
ఆయన ఇంకా తన పనిని ప్రారంభించనప్పుడు, దేవుడు తన మనస్సులో ఆయన ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడో దాని గురించి అప్పటికే ఒక తలంపును కలిగి ఉన్నాడు మరియు అలాగే దేవుడు ఈ విషయాలను చేయడానికి సిద్ధమైనప్పుడు, ఈ తలంపు యొక్క విషయం గురించి మాట్లాడటానికి దేవుడు నోరు తెరిచినప్పుడు, సమస్త విషయాలలో మార్పులు సంభవించడం మొదలయ్యింది, దేవుని అధికారం మరియు శక్తికి కృతజ్ఞతలు. దేవుడు ఎలా చేసాడు, లేదా ఆయన తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడు అనే దానితో సంబంధం లేకుండా, ప్రతీది దేవుని ప్రణాళిక ప్రకారం మరియు దేవుని మాటలవలన దశలవారీగా నెరవేరాయి. భూమి మరియు ఆకాశం మధ్యన దశలవారీగా మార్పులు సంభవించాయి. దేవుని మాటలు మరియు అధికారానికి కృతజ్ఞతలు. ఈ మార్పులు మరియు సంఘటనలన్నీ సృష్టికర్త యొక్క అధికారాన్ని మరియు సృష్టికర్త జీవన శక్తి యొక్క అసాధారణతను మరియు గొప్పతనాన్ని చూపించాయి. ఆయన ఆలోచనలు సాధారణ ఆలోచనలు కావు, లేదా అది ఒట్టి తలంపు కాదు, కానీ జీవం మరియు అసాధారణ శక్తిని కలిగి ఉన్న అధికారమైయున్నది మరియు అది సమస్తాన్ని మార్చడానికి, పునరుజ్జీవింపజేయడానికి, పునరుద్ధరించడానికి మరియు నశింపజేయడానికి కారణమయ్యే శక్తియైయున్నది. దీని కారణంగా, ఆయన ఆలోచనలవలన సమస్త విషయాలు పని చేస్తాయి మరియు అదే సమయంలో, ఆయన నోటి నుండి వచ్చిన మాటలవలన సమస్తము నెరవేరతాయి.
సమస్త విషయాలు ప్రత్యక్షమవ్వక ముందే, దేవుని ఆలోచనలలో చాలా కాలం క్రితమే పూర్తి ప్రణాళిక రూపుదిద్దుకుంది మరియు చాలా కాలం క్రితమే కొత్త లోకం సంతరించుకుంది. మూడవ దినమున భూమిపై అన్ని రకాల మొక్కలు కనిపించినప్పటికీ, దేవుడు ఈ లోకాన్ని సృష్టించే దశలను ఆపడానికి ఎటువంటి కారణం లేదు; ఆయన తన మాటలను మాట్లాడటం కొనసాగించాలని, ప్రతి కొత్త విషయాన్ని సృష్టించడం కొనసాగించాలని ఉద్దేశించాడు. ఆయన మాట్లాడతాడు, తన ఆజ్ఞలను జారీ చేస్తాడు మరియు తన అధికారాన్ని ఉపయోగిస్తాడు మరియు తన శక్తిని ప్రదర్శిస్తాడు మరియు ఆయన సృష్టించాలనుకున్న అన్ని విషయాలు మరియు మానవజాతి కోసం ఆయన అనుకున్నదంతా సిద్ధం చేశాడు …
నాల్గవ దినమున, దేవుడు తన అధికారాన్ని మరోసారి ఉపయోగించినప్పుడు మానవజాతి యొక్క కాలములు, దినములు మరియు సంవత్సరాలు ఉనికిలోకి వచ్చాయి
సృష్టికర్త తన ప్రణాళికను నెరవేర్చడానికి తన మాటలను ఉపయోగించాడు మరియు ఈ విధంగా ఆయన తన ప్రణాళికలోని మొదటి మూడు దినములు చేశాడు. ఆయన చేసిన ఈ మూడు దినాలలో, దేవుడు తీరిక లేకుండా ఉన్నట్లు, లేదా ఆయన అలసిపోయినట్లు కనిపించలేదు; దీనికి బదులుగా, ఆయన తన ప్రణాళికలోని మొదటి మూడు దినాలను అద్భుతంగా గడిపాడు మరియు లోకపు సమూల పరివర్తన యొక్క గొప్ప బాధ్యతను నెరవేర్చాడు. ఒక సరికొత్త లోకం ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించింది మరియు క్రమేణా, ఆయన ఆలోచనలలో ముద్రించబడిన అందమైన చిత్రం చివరకు దేవుని మాటలలో నిజ రూపం దాల్చింది. ప్రతి కొత్త విషయం యొక్క రూపం నవజాత శిశువు పుట్టినట్లుగా ఉంది మరియు సృష్టికర్త ఒకప్పుడు తన ఆలోచనలలో ఉన్న చిత్రాన్ని బట్టి ఆనందించాడు, అయితే ఇప్పుడు దానికి జీవం పోసాడు. ఈ సమయంలో, ఆయన హృదయం కొంత సంతృప్తిని పొందింది, కానీ ఆయన ప్రణాళిక ఇప్పుడే ప్రారంభమైంది. రెప్పపాటులో, కొత్త దినము వచ్చింది, అయితే సృష్టికర్త యొక్క ప్రణాళికలో తదుపరి పేజీ ఏమిటి? ఆయన ఏమన్నాడు? ఆయన తన అధికారాన్ని ఎలా ఉపయోగించాడు? ఈ లోపల, ఏ కొత్త విషయాలు ఈ కొత్త లోకంలోకి వచ్చాయి? సృష్టికర్త యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించి, మన చూపు దేవుడు సమస్తాన్ని సృష్టించిన నాల్గవ దినము మీద పడింది, ఇది మరో కొత్త ఆరంభం. అయితే, సృష్టికర్తకు నిస్సందేహంగా ఇది మరో అద్భుతమైన రోజు, మరియు నేటి మానవజాతికి ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నరోజు. వాస్తవానికి, ఇది, అమూల్యమైన విలువ కలిగిన రోజు. ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఎంత ముఖ్యమైనది మరియు ఇది ఎంత అమూల్యమైనది? ముందుగా సృష్టికర్త పలికిన మాటలను విందాము …
“దేవుడు—పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు: భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను” (ఆది 1:14-15). ఇది దేవుని అధికారం యొక్క మరొక కార్యం, ఇది ఆయన ఆరిన నేలను మరియు దానిపై మొక్కలను సృష్టించిన తరువాత జీవుల ద్వారా చూపబడింది. అటువంటి కార్యం దేవుడు ఇంతకుముందు చేసినట్లే ఆయనకు సులభమైంది, ఎందుకంటే దేవునికి అలాంటి శక్తి ఉంది; దేవుడు తన మాటవలె మంచివాడు మరియు ఆయన మాట నెరవేరుతుంది. దేవుడు ఆకాశవిశాలమందు జ్యోతులు కనిపించమని ఆదేశించాడు మరియు ఈ జ్యోతులు ఆకాశంలో మరియు భూమిపై ప్రకాశించడమే కాకుండా, పగలు మరియు రాత్రికి, కాలములు, దినములు మరియు సంవత్సరాలకు సూచనలుగా కూడా పనిచేశాయి. ఈ విధంగా, దేవుడు తన మాటలను పలికినప్పుడు, దేవుడు నెరవేర్చాలన్న ప్రతి కార్యం దేవుని ఉద్దేశం ప్రకారం మరియు దేవుడు నియమించిన పద్ధతిలో నెరవేరింది.
ఆకాశవిశాలమందున్న జ్యోతులు ఆకాశంలో ఉండి వెలుగును ప్రసరింపజేస్తాయి; అవి ఆకాశాన్ని మరియు భూమిని మరియు సముద్రాలను ప్రకాశింపజేస్తాయి. దేవుడు ఆదేశించిన సరళి మరియు క్రమబద్ధతకు అనుగుణంగా పరిభ్రమిస్తూ మరియు భూమిపై వివిధ కాల వ్యవధులను వెలిగిస్తాయి మరియు ఈ విధంగా పరిభ్రమించే జ్యోతుల చక్రాలు భూమి యొక్క తూర్పు మరియు పడమరలలో పగలు మరియు రాత్రి ఏర్పడడానికి కారణమవుతాయి మరియు అవి రాత్రి మరియు పగలుకు మాత్రమే కాకుండా, ఈ వివిధ చక్రాల ద్వారా అవి మానవజాతి యొక్క పండుగలు మరియు వివిధ ప్రత్యేక రోజులను కూడా సూచిస్తాయి. అవి దేవునిచే జారీ చేయబడినవి, అవేమనగా, వసంత కాలం, వేసవి కాలం, శరత్కాలం మరియు శీతా కాలం అనే నాలుగు కాలాలకు పరిపూర్ణ పూరకంగా మరియు అనుబంధంగా ఉంటాయి, జ్యోతులు సమన్వయంతో మానవజాతి యొక్క చంద్రుని దశలు, రోజులు మరియు సంవత్సరాలకు క్రమమైన మరియు ఖచ్చితమైన గుర్తులుగా పనిచేస్తాయి. వ్యవసాయం ఆవిర్భవించిన తర్వాత మాత్రమే మానవజాతి దేవుడు సృష్టించిన జ్యోతులవల్ల చంద్రుని దశలు, రోజులు మరియు సంవత్సరాల విభజనను అర్థం చేసుకోవడం మరియు ఎదుర్కోవడం ప్రారంభించినప్పటికీ, వాస్తవానికి ఈ రోజు మనిషి అర్థం చేసుకునే చంద్రుని దశలు, రోజులు మరియు సంవత్సరాలు చాలా కాలం క్రితం దేవుడు సమస్త విషయాలను సృష్టించిన నాల్గవ రోజున ఉనికిలోకి రావడం మొదలయ్యింది, అలాగే మానవుడు అనుభవించే వసంత, వేసవి, ఆకురాలు మరియు శీతా కాలాల పరస్పర మార్పు అనేవి చాలా కాలం క్రితం దేవుడు సృష్టి యొక్క నాల్గవ రోజున ప్రారంభమయ్యాయి. దేవుడు సృష్టించిన జ్యోతులు మనిషిని క్రమం తప్పకుండా, ఖచ్చితంగా మరియు స్పష్టంగా రాత్రి మరియు పగలు మధ్య తేడాను గుర్తించేలా మరియు రోజులను లెక్కించేలా మరియు చంద్రుని దశలను మరియు సంవత్సరాలను స్పష్టంగా తెలుసుకునేలా చేశాయి. (పౌర్ణమికి ఒక నెల పూర్తవుతుంది మరియు దీని ద్వారా మనిషికి జ్యోతుల కాంతి కొత్త చక్రాన్ని ప్రారంభిస్తుందని తెలుస్తుంది; చంద్రవంక రోజున ఒక నెలలో సగం పూర్తవుతుంది, ఇది మనిషికి చంద్రుని కొత్త దశ ప్రారంభమైందని, దాని ద్వారా చంద్రుని దశలో ఎన్ని పగలు మరియు రాత్రులు ఉన్నాయో, ఒక కాలంలో ఎన్ని చంద్రుని దశలు ఉన్నాయో మరియు సంవత్సరంలో ఎన్ని కాలాలు ఉన్నాయో చెప్తుంది మరియు ఇవన్నీ చాలా క్రమబద్ధంగా వెల్లడి చేయబడ్డాయి.) కాబట్టి, మనిషి జ్యోతుల భ్రమణం ద్వారా చంద్రుని దశలు, రోజులు మరియు సంవత్సరాలను సులభంగా అనుసరించవచ్చు. ఈ క్షణం నుండి, మానవజాతి మరియు సమస్త జీవరాశులన్నీ జ్యోతుల భ్రమణం ద్వారా ఏర్పడిన రాత్రి మరియు పగలుల క్రమబద్ధమైన మార్పిడి మరియు రుతువుల మార్పుల మధ్య తమకు తెలియకుండానే జీవించాయి. సృష్టికర్త నాల్గవ దినమున జ్యోతులను సృష్టించడం యొక్క ప్రాముఖ్యత ఇది. అదేవిధంగా, సృష్టికర్త యొక్క ఈ చర్య యొక్క లక్ష్యాలు మరియు ప్రాముఖ్యత ఇప్పటికీ ఆయన అధికారం మరియు శక్తి నుండి విడదీయరానివిగా ఉన్నాయి. కాబట్టి, దేవుడు చేసిన జ్యోతులు మరియు అవి త్వరలో మనిషికి తీసుకురాబోయే విలువ అనేవి, సృష్టికర్త యొక్క అధికారాన్ని ఉపయోగించడంలో సాధించిన మరొక విజయం.
మానవజాతి ఇంకా ప్రత్యక్షంకాని ఈ కొత్త ప్రపంచంలో, సృష్టికర్త సాయంత్రమును మరియు ఉదయమును, ఆకాశ విశాలమును, భూమిని మరియు సముద్రాలను, గడ్డిని, మొక్కలను మరియు వివిధ రకాల వృక్షాలను మరియు జ్యోతులను, కాలాలను, రోజులను మరియు సంవత్సరాలను, ఆయన త్వరలో సృష్టించబోయే కొత్త జీవితము కోసం సిద్ధం చేశాడు. సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి అనునవి ఆయన సృష్టించిన ప్రతి కొత్త విషయంలో వ్యక్తీకరించబడ్డాయి. ఆయన మాటలు మరియు ఆయన విజయాలు స్వల్ప వ్యత్యాసం మరియు స్వల్ప విరామం లేకుండా ఒకేసారి నెరవేరాయి. ఈ కొత్త విషయాల అన్నిటి ఆవిర్భావము మరియు పుట్టుక అనేది సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తికి రుజువుగా ఉన్నది: ఆయన తన మాటవలె మంచివాడు మరియు ఆయన మాట నెరవేరుతుంది మరియు ఆయన నెరవేర్చినది శాశ్వతంగా ఉంటుంది. ఈ వాస్తవం ఎన్నడూ మారలేదు: ఇది గతంలో అలాగే ఉంది, నేడు అలాగే ఉంది మరియు శాశ్వతంగా అలాగే ఉంటుంది. మీరు లేఖనంలోని ఆ మాటలను మరొకసారి చూసినప్పుడు, అవి మీకు కొత్తగా అనిపిస్తున్నాయా? మీరు కొత్త విషయాన్ని చూసి, తెలియని విషయాలు కొత్తగా తెలుసుకున్నారా? ఎందుకంటే సృష్టికర్త యొక్క క్రియలు మీ హృదయాలను కదిలించాయి మరియు ఆయన అధికారం మరియు శక్తి గురించి మీ జ్ఞానానికి దిశానిర్దేశం చేశాయి మరియు సృష్టికర్త గురించి మీకు అవగాహన కలిగించాయి మరియు ఆయన క్రియలు మరియు ఆయన అధికారం ఈ మాటలకు జీవాన్ని ప్రసాదించాయి. కాబట్టి, ఈ మాటలలో సృష్టికర్త యొక్క అధికారాన్ని గూర్చిన నిజమైన, స్పష్టమైన వ్యక్తీకరణను మనిషి చూశాడు, సృష్టికర్త యొక్క ఆధిపత్యాన్ని నిజంగా చూశాడు మరియు సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి యొక్క అసాధారణతను చూశాడు.
సృష్టికర్త యొక్క అధికారం మరియు ఆయన శక్తి అద్భుతాల వెంబడి అద్భుతాలను చేస్తాయి; ఆయన మనిషి దృష్టిని ఆకర్షిస్తాడు మరియు ఆయన అధికార వినియోగంతో జరిగిన ఆశ్చర్యకరమైన కార్యాలను మనిషి అలా చూస్తూ ఉండిపోతాడు. ఆయన అసాధారణ శక్తి ఆనందం వెంబడి ఆనందం ఇస్తూ ఉంటుందిమరియు మనిషి అబ్బురపడిపోతాడు మరియు ఆనందంతో ఉప్పొంగిపోతాడు, అభిమానంతో ఉబ్బితబ్బైపోతాడు, విస్మయానికి గురవుతాడు మరియు ఉల్లసిస్తాడు; అంతేకాకుండా, మనిషి చలించిపోతాడు మరియు అతనిలో గౌరవం, భక్తిభావం మరియు అనుబంధం ఏర్పడతాయి. సృష్టికర్త యొక్క అధికారం మరియు క్రియలు మనిషి యొక్క ఆత్మపై గొప్ప ప్రభావాన్ని మరియు ప్రక్షాళన ఫలితాన్ని కలిగి ఉంటాయి, అంతేకాకుండా, అవి మనిషి యొక్క ఆత్మను సంతృప్తిపరుస్తాయి. ఆయన ప్రతీ ఆలోచన, ఆయన ప్రతీ మాట, మరియు ఆయన అధికారం యొక్క ప్రతీ ప్రత్యక్షత సమస్త విషయాలలో అత్యుత్తమమైనది మరియు సృష్టించబడిన మానవజాతి యొక్క లోతైన అవగాహనకు, జ్ఞానానికి అత్యంత విలువైనది. సృష్టికర్త యొక్క మాటల నుండి పుట్టిన ప్రతి జీవిని మనం లెక్కించినప్పుడు, మన ఆత్మలు దేవుని శక్తి యొక్క అద్భుతానికి ఆకర్షితులవుతాయి మరియు ఆ మరుసటి దినము కొరకు మనం సృష్టికర్త యొక్క అడుగుజాడలను అనుసరిస్తాం: అంటే, దేవుడు సమస్త విషయాలను సృష్టించిన ఐదవ దినము వరకు అనుసరిస్తాము.
మనం సృష్టికర్త యొక్క మరిన్ని కార్యాలను పరిశీలిస్తుండగా, లేఖన భాగం వెంబడి లేఖన భాగాన్ని చదవడం కొనసాగిద్దాం.
ఐదవ దినమున, వైవిధ్యమైన మరియు విభిన్న రకాల జీవులు విభిన్నమైన విధానాలలో సృష్టికర్త యొక్క అధికారాన్ని ప్రదర్శిస్తాయి
లేఖనం ఇలా చెబుతోంది, “దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను” (ఆది 1:20-21). ఈ దినమున, దేవుడు నీటిలోని జీవులను మరియు ఆకాశ పక్షులను సృష్టించాడు, అంటే ఆయన వివిధ రకాల చేపలను మరియు పక్షులను సృష్టించాడని మరియు వాటిని వాటి వాటి జాతి ప్రకారం వర్గీకరించాడని లేఖనం మనకు స్పష్టంగా చెబుతోంది. ఈ విధంగా, దేవుని సృష్టినిబట్టి భూమి, ఆకాశం మరియు జలాలు సుసంపన్నమయ్యాయి …
దేవుని మాట్లాడినప్పుడు, సృష్టికర్త మాట్లడే సమయంలోనే వివిధ రూపాలలో ఉన్నటువంటి ప్రతి యొక్క జీవి, క్రొంగొత్త నూతన జీవముతో తక్షణమే సజీవంగా బయటికి వచ్చాయి. అవి స్థలం కోసం తహతహలాడుతూ, గెంతుతూ, ఆనందంతో ఉల్లాసంగా ఈ లోకంలోకి వచ్చాయి…అన్ని ఆకారాలు మరియు పరిమాణాల చేపలు నీటిలో ఈదుకుంటూ వచ్చాయి; అన్ని రకాల గుల్ల చేపలు ఇసుకలో నుండి బయటకొచ్చాయి; పొలుసులతో కూడిన, పెంకుతో కూడిన మరియు పాకే జీవులలో పెద్ద లేదా చిన్న భేదము లేకుండా, పొడవు లేదా పొట్టి అనే బేధం లేకుండా వివిధ రూపాల్లో త్వరత్వరగా పుట్టుకొచ్చాయి. అలాగే వివిధ రకాలైన సముద్రపు మొక్కలు కూడా చురుగ్గా పెరగడం ప్రారంభించాయి, వివిధ జలచరాల కదలికలకు ఊగిసలాడుతూ, కదలకుండ ఉన్న నీళ్లను కదిలిస్తూ, వాటితో ఇలా చెప్పినట్లుంటుంది: “కాలు ఆడించండి! మీ స్నేహితులను తీసుకురండి! మీరు ఇకపై ఒంటరిగా ఉండరు!” దేవుడు సృష్టించిన వివిధ జీవరాశులు నీటిలో కనిపించిన వెంటనే, ప్రతి కొత్త జీవి ఎంతో కాలంగా నిశ్చలంగా ఉన్న నీళ్లకు జీవాన్ని అందించింది మరియు కొత్త శకానికి నాంది పలికింది. అప్పటి నుండి, అవి తమకంటూ నివాసాలు ఏర్పరచుకొన్నాయి, మరియు ఒకదానితో నొకటి సాంగత్యం చేశాయి మరియు తమ మధ్య ఎటువంటి దూరం ఉంచుకోలేదు. నీరు దానిలోని జీవుల కోసం ఉనికిలో ఉంది, తనలో నివసించే ప్రతి జీవిని పోషిస్తోంది మరియు ప్రతి జీవి దాని పోషణ కారణంగా నీటి కోసమే ఉనికిలో ఉంది. ప్రతి ఒక్కటి మరొకదానికి జీవం అందించింది, అదే సమయంలో, ప్రతీ ఒక్కటి, ఒకే విధంగా, సృష్టికర్త సృష్టి యొక్క అద్భుతానికి మరియు గొప్పతనానికి, సృష్టికర్త అధికారం యొక్క అపూర్వమైన శక్తికి సాక్ష్యంగా ఉన్నాయి …
సముద్రం ఇప్పుడు నిశ్శబ్దంగా లేనందున, జీవం ఆకాశాలను కూడా నింపడం ప్రారంభించింది. చిన్న పక్షులు పెద్ద పక్షులు ఒక్కొక్కటిగా నేల మీద నుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. సముద్రపు జీవులలా కాకుండా, వాటికి తమ సన్నని మరియు సొగసైన రూపాలను కప్పి ఉంచే రెక్కలు మరియు ఈకలు ఉన్నాయి. అవి తమ రెక్కలను ఊపుతూ, గర్వంగా మరియు ఠీవిగా సృష్టికర్త తమకు ప్రసాదించిన తమ సొగసైన ఈకలను మరియు తమ ప్రత్యేక విధులు మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాయి. అవి ఆకాశం మరియు భూమి మధ్య, గడ్డి భూములు మరియు అడవుల గుండా స్వేచ్ఛగా మరియు నేర్పుగా ఎగురుతూ ప్రయాణిస్తున్నాయి… అవి గాలికి ప్రియమైనవి, అవి అన్నిటికీ ప్రియమైనవి. అవి త్వరలో ఆకాశానికి మరియు భూమికి మధ్య బంధంగా మారతాయి మరియు అన్నిటికీ సందేశాలను పంపుతాయి… అవి పాడాయి, అవి ఆనందంతో ఊగిపోయాయి, అవి ఈ శూన్య ప్రపంచానికి ఆనందాన్ని, నవ్వును మరియు చైతన్యాన్ని తెచ్చాయి… అవి తమ స్పష్టమైన, శ్రావ్యమైన గానాన్ని ఉపయోగించాయి, తమకు ప్రసాదించిన జీవాన్ని బట్టి సృష్టికర్తను స్తుతించడానికి తమ హృదయాల్లోని పదాలను ఉపయోగించాయి. సృష్టికర్త సృష్టి యొక్క పరిపూర్ణతను మరియు అద్భుతాన్ని ప్రదర్శించడానికి అవి ఉల్లాసంగా నృత్యం చేశాయి మరియు ఆయన వాటికి ప్రసాదించిన ప్రత్యేక జీవితాన్ని బట్టి సృష్టికర్త యొక్క అధికారానికి సాక్ష్యమివ్వడానికి తమ జీవితాలను సమర్పించుకున్నాయి …
అవి నీటిలో ఉన్నాయా, లేదా ఆకాశంలో ఉన్నాయా అనే దానితో సంబంధం లేకుండా, సృష్టికర్త యొక్క ఆజ్ఞను బట్టి, ఈ విస్తారమైన జీవులన్నీ వివిధ జీవిత ఆకృతులలో ఉనికిలో ఉన్నాయి, మరియు సృష్టికర్త యొక్క ఆజ్ఞను బట్టి, అవి తమ తమ జాతుల ప్రకారం ఒక చోట చేరాయి మరియు ఈ సూత్రం, ఈ నియమంను ఏ జీవీ మార్చలేదు. సృష్టికర్త వాటి కోసం నిర్దేశించిన హద్దులు దాటి వెళ్ళడానికి అవి ఎన్నడూ సాహసించలేదు, లేదా సాహసం చేయలేవు. సృష్టికర్త నిర్దేశించినట్లుగా, అవి జీవించి అభివృద్ధి చెందాయి మరియు సృష్టికర్త వాటి కోసం నిర్దేశించిన జీవిత గమనం మరియు నియమాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాయి మరియు ఆయన ఉచ్ఛరించని ఆజ్ఞలు మరియు ఆయన వాటికి ఇచ్చిన పరలోకపు శాసనాలకు మరియు ఆదేశాలకు, ఈ రోజు వరకు అన్ని విధాలుగా చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాయి. అవి తమదైన ప్రత్యేక పద్ధతిలో సృష్టికర్తతో సంభాషించాయి మరియు సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాయి మరియు ఆయన ఆజ్ఞలకు లోబడ్డాయి. సృష్టికర్త యొక్క అధికారాన్ని ఎవరూ అతిక్రమించలేరు మరియు వాటిపై ఆయన సార్వభౌమాధికారం మరియు ఆదేశం ఆయన ఆలోచనల్లోనే అమలుచేయబడింది; ఎటువంటి పదాలు వెలువడలేదు, కానీ సృష్టికర్తకు మాత్రమే ఉండే ప్రత్యేకమైన అధికారం ఏమిటంటే ఎటువంటి భాషలేకుండా అన్ని విషయాలను నిశ్శబ్దంగా నియంత్రించడం, ఇది మానవజాతికి భిన్నమైనది. ఈ ప్రత్యేక పద్ధతిలో ఆయన అధికారాన్ని ఉపయోగించడంవలన మనిషి సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికారాన్ని గూర్చి కొత్త జ్ఞానాన్ని మరియు కొత్త అవగాహన పొందేలా చేసింది. ఇక్కడ, ఈ కొత్త దినమున, సృష్టికర్త యొక్క అధికార వినియోగం, సృష్టికర్త యొక్క ప్రత్యేకతను మరోసారి ప్రదర్శించిందని నేను మీకు తప్పక చెప్పాలి.
తరువాత, ఈ లేఖన భాగంలోని చివరి వాక్యాన్ని చూద్దాం: “అది మంచిదని దేవుడు చూచెను.” దీని అర్థం ఏమిటని మీరు అనుకుంటున్నారు? ఈ మాటలలో దేవుని భావోద్వేగాలు ఇమిడి ఉన్నాయి. దేవుడు తాను సృష్టించినవన్నీ తన మాటలవల్ల ఉనికిలోకి వచ్చి నిలిచి ఉండడం, మరియు క్రమంగా మార్పు చెందడం చూశాడు. ఈ సమయంలో, దేవుడు తన మాటచేత చేసిన వివిధ విషయాలను బట్టి మరియు ఆయన నెరవేర్చిన వివిధ పనులనుబట్టి సంతృప్తి చెందాడా? “అది మంచిదని దేవుడు చూచెను” అనేది సమాధానం. మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు? “అది మంచిదని దేవుడు చూచెను.” ఇది దేనిని సూచిస్తుంది? దేవుడు అనుకున్న మరియు నిర్దేశించిన వాటిని సాధించడానికి, తాను సాధించాలనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి ఆయన శక్తి మరియు జ్ఞానం కలిగి ఉన్నాడని అర్థం. దేవుడు ప్రతి పనిని పూర్తి చేసినప్పుడు, ఆయన పశ్చాత్తాపపడ్డాడా? ఇప్పటికీ “అది మంచిదని దేవుడు చూచెను” అనేదే సమాధానం. మరో మాటలో చెప్పాలంటే, ఆయన పశ్చాత్తాపపడలేదు, కానీ సంతృప్తి చెందాడు. ఆయన పశ్చాత్తాపపడలేదు అంటే అర్ధం ఏమిటి? దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనదని, ఆయన శక్తి మరియు జ్ఞానము పరిపూర్ణమైనవని మరియు ఆయన అధికారం ద్వారా మాత్రమే అటువంటి పరిపూర్ణత సాధించబడుతుందని దీని అర్థం. మనిషి ఒక పని చేస్తున్నప్పుడు, అతను, దేవుడిలా, అది మంచిదని చూడగలడా? మనిషి చేసే ప్రతీ పని పరిపూర్ణతను సాధించగలదా? మనిషి శాశ్వతంగా ఏదైనా ఒక్కసారే పూర్తి చేయగలడా? మనిషి చెప్పినట్లు, “ఏదీ పరిపూర్ణమైనది కాదు, కేవలం మెరుగైనది,” మనిషి చేసే ఏ పనీ పరిపూర్ణతను పొందదు. దేవుడు తాను చేసినది మరియు నెరవేర్చినదంతా మంచిదని చూసినప్పుడు, దేవుడు చేసిన ప్రతిదీ ఆయన మాటలను బట్టి ఏర్పడింది, అంటే “అది మంచిదని దేవుడు చూచినప్పుడు” ఆయన చేసినదంతా శాశ్వత రూపాన్ని పొందింది, వాటి రకాన్ని బట్టి వర్గీకరించబడింది మరియు స్థిరమైన ప్రదేశం, ఉద్దేశం మరియు విధి, శాశ్వతంగా ఒకేసారి ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా, అన్ని విషయాలలో వాటి పాత్ర మరియు అన్ని విషయాలకు చెందిన దేవుని నిర్వహణ సమయంలో అవి తప్పక చేయవలసిన ప్రయాణాన్ని అప్పటికే దేవుడు నియమించాడు మరియు అవి మార్పుచెందవు. ఇది అన్ని విషయాలకు సృష్టికర్త ఇచ్చిన పరలోకపు నియమం.
“అది మంచిదని దేవుడు చూచెను” ఈ సాధారణ, సామాన్యమైన మాటలు, చాలా తరచుగా విస్మరించబడతాయి, ఇవి దేవుడు అన్ని జీవులకు ఇచ్చిన పరలోకపు నియమం మరియు పరలోకపు శాసనం యొక్క మాటలు. అవి సృష్టికర్త యొక్క అధికారానికి మరొక ప్రతిరూపం, అవి మరింత ఆచరణాత్మకమైనవి మరియు మరింత గంభీరమైనవి. ఆయన మాటల ద్వారా, సృష్టికర్త తాను పొందాలనుకున్నవన్నీ పొందడం మరియు ఆయన నెరవేర్చాలనుకున్నవన్నీ నెరవేర్చడం మాత్రమే కాదు, తాను సృష్టించినవాటన్నిటినీ ఆయన తన చేతుల్లో నియంత్రించగలడు మరియు ఆయన తన అధికారం క్రింద చేసిన వాటన్నిటినీ పాలించగలడు, అంతేగాక, అన్నీ వ్యవస్థీకృతంగా మరియు క్రమబద్ధంగా ఉన్నాయి. సృష్టించబడిన సమస్తము కూడా విస్తరించాయి, ఉనికిలో ఉన్నాయి మరియు ఆయన మాటనుబట్టి నశించాయి, అంతేకాకుండా, ఆయన అధికారం ద్వారా ఆయన నిర్దేశించిన నియమం మధ్య అవి ఉనికిలో ఉన్నాయి మరియు ఏదీ మినహాయించబడలేదు! ఈ నియమం “అది మంచిదని దేవుడు చూచెను” అన్నప్పటి నుండే ప్రారంభమైంది మరియు సృష్టికర్త దీనిని రద్దు చేసే రోజు వరకు దేవుని నిర్వహణ ప్రణాళిక నిమిత్తం ఇది ఉనికిలో ఉంటుంది, కొనసాగుతుంది మరియు పని చేస్తుంది! సృష్టికర్త యొక్క ప్రత్యేకమైన అధికారం అన్నిటినీ సృష్టించడంలోను మరియు అన్నిటినీ ఉనికిలోకి వచ్చేలా ఆజ్ఞాపించడంలోను మాత్రమే కాకుండా, అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండే మరియు పరిపాలించే మరియు అన్ని విషయాలకు శక్తిని మరియు తేజస్సును ప్రసాదించడంలోని ఆయన సామర్ధ్యంలోను కనుపరచబడింది, అంతేకాకుండా, ఆయన ఒక పరిపూర్ణ ఆకృతిలో, పరిపూర్ణ జీవన నిర్మాణంలో మరియు పరిపూర్ణ పాత్రలో ఆయన చేసిన లోకంలో కనిపించడానికి మరియు ఉనికిలో ఉండటానికి తన ప్రణాళికలో ఆయన సృష్టించే ప్రతీ దానిని శాశ్వతంగా ఒకేసారి కలిగించే ఆయన సామర్థ్యంలో వ్యక్తీకరించబడింది. కాబట్టి సృష్టికర్త యొక్క ఆలోచనలు ఎటువంటి పరిమితులకు లోబడి ఉండవు, సమయం, స్థలం లేదా భౌగోళికంగా పరిమితం కావు. ఆయన అధికారంవలె, సృష్టికర్త యొక్క ప్రత్యేక గుర్తింపు ఎప్పటికీ మార్పు చెందదు. ఆయన అధికారం ఎల్లప్పుడూ ఆయన ప్రత్యేక గుర్తింపుకు ప్రతిబింబంగా మరియు చిహ్నంగా ఉంటుంది మరియు ఆయన అధికారం ఆయన గుర్తింపుతోపాటు ఎప్పటికీ ఉంటుంది!
ఆరవ దినమున, సృష్టికర్త మాట్లాడతాడు మరియు ఆయన మనస్సులో ఉన్న ప్రతి రకమైన జీవి ఒకదాని తర్వాత మరొకటి ప్రత్యక్షమవుతాయి
క్రమంగా, సమస్త సృష్టిని సృష్టించడములోని సృష్టికర్త పని ఐదు రోజుల పాటు కొనసాగింది, వెంటనే సృష్టికర్త అన్ని విషయాలను సృష్టించే ఆరవ రోజుకు స్వాగతం పలికాడు. ఈ రోజు మరొక కొత్త ఆరంభం, మరొక అసాధారణ రోజు. అయితే, ఈ కొత్త రోజు సందర్భంగా సృష్టికర్త యొక్క ప్రణాళిక ఏమిటి? ఆయన ఎటువంటి కొత్త జీవులను చేస్తాడు, సృష్టిస్తాడు? వినండి, అది సృష్టికర్త యొక్క స్వరం…
“దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను” (ఆది 1:24-25). ఎటువంటి జీవులు చేర్చబడ్డాయి? లేఖనాలు ఈ విధంగా చెబుతున్నాయి: వాటి వాటి జాతి ప్రకారము పశువులు, పురుగులు, మరియు అడవి జంతువులు. అంటే, ఈ రోజున భూమిపై ఉన్నటువంటి అన్ని రకాల జీవులు మాత్రమే కాకుండా, అవి వాటి వాటి జాతి ప్రకారము వర్గీకరించబడ్డాయి, మరియు, అలాగే, “అది మంచిదని దేవుడు చూచెను.”
మునుపటి అయిదు దినములవలెనే, సృష్టికర్త అదే స్వరంతో మాట్లాడాడు మరియు ఆయన ఆశించిన జీవుల పుట్టుకను ఆదేశించాడు మరియు అవి వాటి వాటి జాతి ప్రకారము భూమిపై ఒక్కొక్కటిగా కనిపించాయి. సృష్టికర్త తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు, ఆయన పలికిన మాటలు ఏవీ వ్యర్థం కావు, కాబట్టి, ఆరవ దినమున, ఆయన సృష్టించాలనుకున్న ప్రతి జీవి నిర్ణీత సమయంలో కనిపించింది. సృష్టికర్త “వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని భూమి పుట్టించుగాక” అని పలికినప్పుడు భూమి ఒక్కసారిగా జీవంతో నిండిపోయింది మరియు భూమిపై ఒక్కసారిగా అన్ని రకాల జీవులు శ్వాస తీసుకున్నాయి. పచ్చని మైదానంలో, బలిష్టమైన ఆవులు, తోకలు అటూ ఇటూ ఊపుతూ, ఒకదాని తర్వాత ఒకటి కనిపించాయి, అరుస్తున్న గొర్రెలు మందలుగా గూమిగూడాయి, సకిలిస్తున్న గుర్రాలు పరుగెత్తడం ప్రారంభించాయి. క్షణంలో, నిశబ్ధంగా ఉన్న విశాల పచ్చిక మైదానం జీవంతో నిండిపోయింది…. ఈ వివిధ పశువుల రాక ప్రశాంతమైన పచ్చని మైదానంలో ఒక అందమైన దృశ్యాన్ని మరియు అపరిమితమైన శక్తిని ఆవిష్కరించింది… అవి పచ్చని మైదానాలకు సహచరులుగా ఉంటాయి మరియు పచ్చని మైదానాలకు యజమానులుగా ఉంటాయి, ప్రతీ ఒక్కటి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి; అలాగే అవి ఈ భూములకు సంరక్షకులుగా మరియు కాపలాదారులుగా అవుతాయి, ఇది వాటి శాశ్వత నివాసంగా ఉంటుంది మరియు వాటికి అవసరమైన అన్నింటిని అందిస్తుంది, వాటి ఉనికికి అవసరమైన శాశ్వత పోషణకు మూలంగా ఉంటుంది…
ఈ వివిధ పశుసంపద ఆవిర్భవించిన రోజునే, సృష్టికర్త మాట ప్రకారం, ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రకాల కీటకాలు కూడా కనిపించాయి. అవి అన్ని జీవులలో చిన్నవి అయినప్పటికీ, వాటి జీవం ఇప్పటికీ సృష్టికర్త యొక్క అద్భుత సృష్టి, మరియు అవి చాలా ఆలస్యంగా రాలేదు…. కొన్ని తమ చిన్న రెక్కలను ఆడించగా, మరికొన్ని నెమ్మదిగా పాకాయి; కొన్ని గెంతాయి మరియు కొన్ని ఎగిరాయి, మరికొన్ని తడబడ్డాయి; కొన్ని వేగంగా ముందుకు వెళ్లాయి, మరికొన్ని త్వరగా వెనక్కి తగ్గాయి; కొన్ని పక్కకి కదిలాయి, మరికొన్ని పైకి మరియు క్రిందికి ఎగిరిపోయాయి…. అన్నీ తమ నివాసాలను కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాయి: కొన్ని గడ్డిలోకి వెళ్లాయి, కొన్ని భూమిలో బొరియలు ఏర్పరచుకోవడానికి బయలుదేరాయి, కొన్ని చెట్లపైకి ఎగిరి, అడవుల్లో దాక్కున్నాయి…పరిమాణంలో చిన్నవైనప్పటికీ, అవి ఖాళీ కడుపుతో అలమటించలేకపోయాయి మరియు అవి తమ నివాసాన్ని కనుగొన్న తరువాత, తమ ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కోసం వెతకడానికి పరిగెత్తాయి. కొన్ని గడ్డి మీద కూర్చొని చిగురాకులు తినసాగాయి, కొన్ని నోటినిండా మట్టి పెట్టుకొని కడుపు నింపుకున్నాయి, చాలా ఉత్సాహం మరియు ఆనందంతో తిన్నాయి (వాటికి మట్టి కూడా రుచికరమైన వంటకం); కొన్ని అడవుల్లో దాగి ఉన్నాయి, కానీ అవి విశ్రాంతి తీసుకోవడానికి ఆగలేదు, ఎందుకంటే నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకుల్లోని రసం వాటికి కమ్మని భోజనం అయ్యింది…. అవి తృప్తి పడిన తర్వాత, ఇప్పటికీ కీటకాలు తమ కార్యకలాపాలను ఆపలేదు; రూపంలో చిన్నవి అయినప్పటికీ, అవి విపరీతమైన శక్తిని మరియు అపరిమితమైన ఉత్సాహాన్ని కలిగి ఉన్నాయి మరియు అన్ని జీవులలో, అవి అత్యంత చురుకైనవి మరియు అత్యంత శ్రమించేవి. అవి ఎన్నడూ బద్ధకంగా లేవు, ఎన్నడూ విశ్రాంతి తీసుకోలేదు. తమ ఆకలి తీరిన తర్వాత, అవి తమ భవిష్యత్తు కోసం అవి కష్టపడుతూ ఉన్నాయి, తమను తాము కృషి చేయడములో నిమగ్నం చేసుకుంటూ, రేపటి కోసం, తమ మనుగడ కోసం ప్రయాసపడ్డాయి. అవి తమను తాము ప్రోత్సహించుకోవడానికి మరియు పురికొల్పుకోవడానికి శ్రావ్యమైన మరియు లయతో కూడిన వివిధ గీతాలను మృదువుగా ఝూంకారం చేశాయి. అవి గడ్డి, చెట్లు మరియు మట్టి యొక్క ప్రతి అంగుళానికి కూడా ఆనందాన్ని జోడించాయి, ప్రతి రోజు మరియు ప్రతి సంవత్సరాన్ని ప్రత్యేకంగా మారుస్తున్నాయి…తమ స్వంత భాషలతో మరియు తమ స్వంత పద్ధతులలో, అవి భూమిపై ఉన్న జీవులన్నిటికీ సమాచారాన్ని అందించాయి. తమదైన ప్రత్యేక జీవన గమనాన్ని ఉపయోగించి, అవి అన్ని విషయాలను గుర్తించి, వాటిపై తమ జాడలను వదిలిపెట్టాయి…. అవి నేల, గడ్డి మరియు అడవులతో సన్నిహితంగా ఉన్నాయి మరియు అవి నేల, గడ్డి మరియు అడవులకు శక్తిని మరియు తేజస్సును తీసుకువచ్చాయి. అవి సమస్త జీవులకు సృష్టికర్త యొక్క ఉపదేశాలను మరియు శుభాకాంక్షలను తీసుకొచ్చాయి …
సృష్టికర్త యొక్క చూపులు ఆయన సృష్టించిన అన్ని విషయాలను తేరి చూశాయి మరియు ఆ సమయంలో ఆయన చూపులు అడవులు మరియు పర్వతాల వద్ద ఆగిపోయాయి, ఆయన మనసు మళ్లింది. దట్టమైన అడవులలో మరియు పర్వతాల మీద ఆయన మాటలు ఉచ్ఛరిస్తున్నప్పుడు, ఇంతకు ముందు వచ్చిన వాటికి భిన్నమైన జీవులు ఆవిర్భవించాయి: అవి దేవుని నోటి మాటలవలన కలిగిన వన్యప్రాణులు. చాలాసేపటి తర్వాత, అవి తమ తలలను విదిలించాయి, తోకలు ఆడించాయి, ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక రూపంలో ఉన్నాయి. కొన్నిటికి వెంట్రుకలు దట్టంగా ఉన్నాయి, కొన్నిటికి కవచాలు ఉన్నాయి, కొన్నిటికి కోరలు ఉన్నాయి, కొన్ని పళ్ళను బయటకు పెట్టి ఇకిలించినట్లుగా ఉన్నాయి, కొన్నిపొడవాటి మెడ కలిగియున్నాయి, కొన్నిటికి చిన్న తోక, కొన్నింటి క్రూరమైన చూపులు, ఇంకొన్నిటికి పిరికి చూపులు, కొన్ని గడ్డి తినడానికి వంగి ఉన్నాయి, కొన్నిటి నోళ్లు రక్తంమోడుతున్నాయి, కొన్ని రెండు కాళ్లతో గెంతుతున్నాయి, కొన్ని నాలుగు కాళ్లతో నడుస్తున్నాయి, కొన్ని చెట్ల మీద కూర్చొని దూరంగా చూస్తున్నాయి, కొన్ని అడవుల్లో వేచి ఉన్నాయి, కొన్ని విశ్రాంతి తీసుకోవడానికి గుహల కోసం వెతుకుతున్నాయి, కొన్ని మైదానాల్లో ఉల్లాసంగా పరిగెత్తుతున్నాయి, కొన్ని అడవుల్లో తిరుగుతున్నాయి…; కొన్ని గర్జిస్తున్నాయి, కొన్ని కేకలు వేస్తున్నాయి, కొన్ని మొరుగుతున్నాయి, కొన్ని అంగలారుస్తున్నాయి…; కొన్ని హెచ్చు స్వరంతో, కొన్ని మధ్యమ స్వరంతో, కొన్ని పూర్ణ కంఠ స్వరంతో ఉన్నాయి, కొన్ని ఎంతో స్పష్టతతో కూడిన శ్రావ్యమైన కంఠమును కలిగి ఉన్నాయి…; కొన్ని భయంకరంగా ఉన్నాయి, కొన్ని అందంగా ఉన్నాయి, కొన్ని అసహ్యంగా ఉన్నాయి, కొన్ని ఆకర్షణీయమైనవిగా, కొన్ని భయపెట్టేవిగా, కొన్ని మనోహరంగా అమాయకంగా ఉన్నాయి… అవి ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అవి ఎలా ఎత్తుగా మరియు బలంగా, స్వేచ్ఛాయుతంగా, ఒకదానికొకటి భిన్నంగా, ఒకదానికొకటి చూసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉన్నాయో చూడండి…. ప్రతి ఒక్కటి సృష్టికర్త వాటికి ప్రసాదించిన నిర్దిష్ట జీవితాన్ని మరియు తమ వన్య స్వభావాన్ని మరియు పశుతత్వాన్ని కలిగి ఉన్నాయి, అవి అడవులలో మరియు పర్వతాల మీద కనిపించాయి. అన్నిటినీ ధిక్కరిస్తూ, పూర్తి ఆధిపత్యం కలిగి పర్వతాలు మరియు అడవులకు వాటిని నిజమైన యజమానులుగా చేసింది ఎవరు? సృష్టికర్త వాటిని పుట్టించిన క్షణం నుండి, అవి అడవులు మరియు పర్వతాలు తమవని “ప్రకటించుకున్నాయి”, ఎందుకంటే సృష్టికర్త అప్పటికే వాటి సరిహద్దులను నిర్దేశించాడు మరియు వాటి ఉనికి యొక్క పరిధిని నిర్ణయించాడు. పర్వతాలు మరియు అడవులకు అవి మాత్రమే నిజమైన ప్రభువులు, అందుకే అవి చాలా క్రూరంగా, ధిక్కారంగా ఉంటాయి. వాటిని పూర్తిగా “వన్య ప్రాణులు” అని పిలిచారు ఎందుకంటే, అన్ని జీవులలో, అవి నిజంగా భయంకరకైనవి, క్రూరమైనవి మరియు లొంగనివి. వాటిని మచ్చిక చేసుకోలేరు, కాబట్టి వాటిని పెంచలేరు మరియు మానవాళితో లేదా మానవాళి ప్రయత్నాలతో అవి సామరస్యంగా జీవించలేవు. వాటిని పెంచలేకపోవడంతో, మానవాళి కోసం అవి పని చేయలేకపోవడంతో, అవి మానవాళికి దూరంగా, మనిషి సమీపించలేని విధంగా జీవించాల్సి వచ్చింది. దాంతో, అవి మానవాళికి దూరంగా నివసించినందున, మరియు మనిషిని చేరుకోలేకపోయినందున, అవి సృష్టికర్త తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చగలిగాయి: పర్వతాలు మరియు అడవులను రక్షిస్తున్నాయి. వాటి క్రూరత్వం పర్వతాలను రక్షించింది మరియు అడవులను కాపాడింది మరియు వాటి ఉనికి మరియు వ్యాప్తి ఉత్తమ రక్షణను మరియు భరోసాను కల్పించాయి. అదే సమయంలో, వాటి క్రూరత్వం అన్ని విషయాల మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ నిర్ధారిస్తుంది. వాటి రాకతో పర్వతాలు మరియు అడవులకు మద్దతు మరియు పట్టు దొరికింది; వాటి రాకతో నిశ్చలంగా మరియు ఖాళీగా ఉన్న పర్వతాలు మరియు అడవులకు అపరిమితమైన బలం మరియు శక్తి చేకూరాయి. ఇది మొదలుకొని, పర్వతాలు మరియు అడవులు వాటి శాశ్వత నివాసంగా మారాయి మరియు అవి తమ నివాసాలను ఎప్పటికీ కోల్పోవు, ఎందుకంటే వాటి కోసమే పర్వతాలు మరియు అడవులు ఆవిర్భవించాయి మరియు ఉనికిలో ఉన్నాయి; వాటిని రక్షించడానికి వన్యప్రాణులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి మరియు చేయగలిగినదంతా చేస్తాయి. అలాగే, వన్యప్రాణులు కూడా తమ భూభాగాన్ని పట్టుకొని ఉండడానికి సృష్టికర్త యొక్క ఉపదేశాలకు కట్టుబడి ఉంటాయి మరియు సృష్టికర్త స్థాపించిన అన్ని విషయాల మధ్య సమతుల్యతను కాపాడడానికి తమ మృగ స్వభావాన్ని ఉపయోగిస్తూనే ఉంటాయి మరియు సృష్టికర్త యొక్క అధికారాన్ని మరియు శక్తిని ప్రదర్శిస్తూ ఉంటాయి!
సృష్టికర్త యొక్క అధికారం క్రింద, సృష్టించబడినవన్ని పరిపూర్ణంగా ఉన్నాయి
పక్షులు మరియు చేపలు, చెట్లు మరియు పువ్వులువంటి చలించే మరియు చలించలేని వాటితోపాటు, మరియు ఆరవ రోజున చేసిన పశువులు, కీటకాలు మరియు వన్యప్రాణులతో సహా దేవుడు సృష్టించిన సమస్తమూ దేవుని దృష్టికి మంచిగా ఉన్నాయి, అంతేకాకుండా, దేవుని దృష్టిలో, ఈ విషయాలు, ఆయన ప్రణాళికకు అనుగుణంగా, అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి మరియు దేవుడు సాధించాలనుకున్న ప్రమాణాలను అందుకున్నాయి. అంచెలంచెలుగా, సృష్టికర్త తాను అనుకున్న పనిని తన ప్రణాళిక ప్రకారం చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఆయన సృష్టించాలనుకున్న ప్రతీది కనిపించింది మరియు అలా కనిపించిన ప్రతీ ఒక్కటి సృష్టికర్త యొక్క అధికారాన్ని ప్రతిబింబిస్తున్నాయి, ఆయన అధికారాన్ని స్పష్టం చేస్తున్నాయి; ఈ స్పష్టీకరణల కారణంగా, సమస్త జీవులు సృష్టికర్త యొక్క దయ మరియు సమకూర్పును బట్టి కృతజ్ఞతతో ఉన్నాయి. దేవుని అద్భుత కార్యాలు ప్రత్యక్షమవుతున్న కొద్దీ, ఒక్కొక్కటిగా దేవుడు సృష్టించిన అన్ని విషయాలను బట్టి ఈ లోకం సంతోషించసాగింది, గందరగోళం మరియు అంధకారం నుండి స్పష్టత మరియు ప్రకాశవంతమైన వెలుగులోనికి, మరణకరమైన నిశ్చలత నుండి జీవముగల మరియు అపరిమితమైన తేజస్సులోనికి మార్చివేసింది. సృష్టిలోని అన్ని విషయాలు, గొప్పది మొదలుకొని చిన్నదాని వరకు, చిన్నది మొదలుకొని సూక్ష్మమైన వాటి వరకు, సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి ద్వారా సృష్టించబడనిది ఏదీ లేదు మరియు ప్రతి జీవి యొక్క ఉనికికి ఒక ప్రత్యేకమైన మరియు స్వాభావికమైన అవసరం మరియు విలువ ఉంది. వాటి ఆకారం మరియు నిర్మాణంలో తేడాలు ఉన్నప్పటికీ, అవి సృష్టికర్త యొక్క అధికారం కింద ఉనికిని కలిగి ఉండటానికి సృష్టికర్తచేత చేయబడాలి. కొన్నిసార్లు ప్రజలు ఒక పురుగును చూస్తారు, అది చాలా అసహ్యంగా ఉంటుంది, అప్పుడు వారు, “ఆ పురుగు చాలా అసహ్యంగా ఉంది, దేవుడు అలాంటి అసహ్యకరమైన దానిని సృష్టించే ప్రసక్తే లేదు, అంత అసహ్యకరమైన దానిని ఆయన సృష్టించే అవకాశమే లేదు” అని అంటారు. ఇది ఎంత మూర్ఖపు దృష్టికోణం! వాళ్లు చెప్పాల్సింది ఏంటంటే, “ఈ పురుగు చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ, ఇది దేవుడిచే సృష్టించబడింది మరియు దీనికంటూ ఒక ప్రత్యేక ఉద్దేశం ఉండాలి.” దేవుని ఆలోచనలలో, ఆయన సృష్టించిన వివిధ జీవులకు ఒక్కో ఆకృతిని మరియు అన్ని రకాల విధులు మరియు ఉపయోగాలను ఇవ్వాలని ఉద్దేశించాడు, కాబట్టి దేవుడు చేసిన వాటిలో ఏవీ ఒకదానికొకటి పోలి ఉండేవి కావు. వాటి బాహ్య రూపం నుండి వారి అంతర్గత కూర్పు వరకు, వాటి జీవన అలవాట్ల నుండి అవి ఆక్రమించే ప్రదేశం వరకు ప్రతి ఒక్కటీ భిన్నంగా ఉంటాయి. ఆవులకు ఆవుల ఆకృతి, గాడిదలకు గాడిదల ఆకృతి, జింకలకు జింకల ఆకృతి, ఏనుగులకు ఏనుగుల ఆకృతి ఉంటుంది. మీరు ఏది ఉత్తమంగా కనిపిస్తుందో మరియు ఏది అంద వికారమైనదో చెప్పగలరా? ఏది అత్యంత ఉపయోగకరమైనది మరియు ఏది అంత అవసరం లేనిదో మీరు చెప్పగలరా? కొందరికి ఏనుగులు కనిపించే తీరు నచ్చుతుంది, కానీ మొక్కలు నాటడానికి ఎవరూ ఏనుగులను ఉపయోగించరు; కొంతమందికి సింహాలు మరియు పులులు కనిపించే తీరు చాలా నచ్చుతుంది, ఎందుకంటే వాటి రూపురేఖలన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి, కానీ మీరు వాటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోగలరా? క్లుప్తంగా చెప్పాలంటే, సృష్టి యొక్క అసంఖ్యాక జీవుల విషయానికి వస్తే, మనిషి సృష్టికర్త యొక్క అధికారానికి లోబడాలి, అంటే, అన్ని విషయాలకు సృష్టికర్త నియమించిన క్రమానికి లోబడాలి; ఇది తెలివైన వైఖరి. సృష్టికర్త యొక్క అసలు ఉద్దేశాలను శోధించే మరియు విధేయత చూపే వైఖరి మాత్రమే సృష్టికర్త యొక్క అధికారాన్ని నిజంగా అంగీకరిస్తుంది మరియు నిశ్చయత కలిగి ఉంటుంది. ఇది దేవుని దృష్టిలో మంచింది, కాబట్టి తప్పును కనుగొనడానికి మనిషికి ఏ కారణం ఉంది?
అందువలన, సృష్టికర్త యొక్క అధికారం క్రింద ఉన్న అన్ని విషయాలు సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి ఒక కొత్త స్వరసమ్మేళనాన్ని వినిపించవలసి ఉంది, కొత్త దినమున ఆయన చేసిన కార్యాన్ని బట్టి అద్భుతమైన పల్లవిని ఆలపించాలి మరియు ఈ సమయంలో సృష్టికర్త తన నిర్వహణ కార్యములో ఒక కొత్త పేజీని కూడా తెరుస్తాడు! సృష్టికర్త ఏర్పరచిన నియమం ప్రకారం వసంతకాలంలో తాజా మొలకలు వికసిస్తాయి, వేసవిలో పక్వానికి వస్తాయి, పంటకాలంలో కోతకొస్తాయి మరియు శీతాకాలంలో నిల్వ చేయబడతాయి, సమస్త విషయాలు సృష్టికర్త యొక్క నిర్వహణ ప్రణాళికను ప్రతిధ్వనిస్తాయి మరియు అవి తమదైన కొత్త రోజును, కొత్త ఆరంభాన్ని మరియు కొత్త జీవన ప్రక్రియను స్వాగతిస్తాయి. సృష్టికర్త యొక్క అధికారపు సార్వభౌమాధికారం క్రింద ప్రతి రోజును స్వాగతించడానికి అవి అంతులేని పరంపరలో జీవిస్తాయి మరియు పునరుత్పత్తి చేస్తాయి …
సృష్టించబడిన మరియు సృష్టించబడని జీవులలో ఏవీ సృష్టికర్త యొక్క గుర్తింపును భర్తీ చేయలేవు
ఆయన అన్ని విషయాలను సృష్టించడం ప్రారంభించినప్పటి నుండి, దేవుని శక్తి వ్యక్తీకరించబడటం మరియు బహిర్గతం కావడం మొదలయ్యింది, ఎందుకంటే దేవుడు సమస్తమును సృష్టించడానికి తన వాక్కులను ఉపయోగించాడు. ఆయన వాటిని ఏ పద్ధతిలో సృష్టించాడు, ఆయన వాటిని ఎందుకు సృష్టించాడు అనే దానితో సంబంధం లేకుండా, సమస్తము దేవుని మాటలను బట్టి కలిగాయి మరియు నిలిచి ఉన్నాయి మరియు ఉనికిలో ఉన్నాయి; ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికారం. లోకంలోకి మానవజాతి రాకముందు, సృష్టికర్త తన శక్తిని మరియు అధికారాన్ని ఉపయోగించి మానవాళి కోసం సమస్తాన్ని సృష్టించాడు మరియు మానవాళికి అనుకూలమైన జీవన వాతావరణాన్ని సిద్ధం చేయడానికి తన ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించాడు. త్వరలో తన జీవవాయువును పొందబోతున్న మానవాళికి సిద్ధంగా ఉండడం కోసం ఆయన ఇవన్నీ చేసాడు. దీనర్థం ఏమిటంటే, మానవజాతి సృష్టించబడక ముందు, దేవుని అధికారం అనేది మానవాళికి భిన్నమైన అన్ని జీవులలో, ఆకాశం, వెలుగులు, సముద్రాలు, భూమివంటి గొప్ప వాటిలో, జంతువులు మరియు పక్షులువంటి చిన్న వాటిలో, అలాగే కంటికి కనిపించని వివిధ బాక్టీరియాలతో సహా, అన్ని రకాల కీటకాలు మరియు సూక్ష్మజీవులలో చూపబడింది. ప్రతి దానికి సృష్టికర్త మాటల ద్వారా జీవం లభించింది, ప్రతి ఒక్కటి సృష్టికర్త మాటలవల్ల విస్తరించింది మరియు ప్రతి ఒక్కటి ఆయన మాటల కారణంగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం క్రింద జీవించాయి. అవి సృష్టికర్త యొక్క జీవవాయువును పొందనప్పటికీ, అవి ఇప్పటికీ తమ విభిన్న ఆకృతులు మరియు నిర్మాణాల ద్వారా సృష్టికర్త వాటికి ప్రసాదించిన జీవశక్తిని చూపించాయి; సృష్టికర్త మానవాళికి ఇచ్చిన మాట్లాడే సామర్ధ్యాన్ని అవి పొందనప్పటికీ, వాటిల్లో ప్రతీ ఒక్కటి సృష్టికర్త తమకు ప్రసాదించిన జీవాన్ని వ్యక్తీకరించే మార్గాన్ని పొందాయి, మరియు ఇది మనిషి భాషకు భిన్నంగా ఉంటుంది. సృష్టికర్త యొక్క అధికారం స్థిరంగా కనిపించే భౌతిక విషయాలకు జీవశక్తిని అందించడమే కాదు, ఆయన ప్రతి జీవికి ఫలించి మరియు అభివృద్ధి చెందే ప్రవృత్తిని కూడా ఇస్తాడు, తద్వారా అవి ఎప్పటికీ కనుమరుగవవు మరియు తరతరాలకు, అవి సృష్టికర్త తమకు ప్రసాదించిన మనుగడ యొక్క నియమాలు మరియు సూత్రాలను అందజేస్తాయి. సృష్టికర్త తన అధికారాన్ని ప్రదర్శించే విధానం స్థూల లేదా సూక్ష్మ దృక్కోణానికి ధృడంగా కట్టుబడి ఉండదు మరియు ఎటువంటి నమూనాకు అది పరిమితం కాదు; ఆయన విశ్వం యొక్క కార్యకలాపాలను ఆదేశించగలడు మరియు అన్ని విషయాల యొక్క జీవమరణములుపై ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు, అంతేకాకుండా, ఆయన తనకు సేవ చేసేలా సమస్తాన్ని నడిపించగలడు; పర్వతాలు, నదులు మరియు సరస్సుల యొక్క కర్తవ్యాలను నిర్వహించగలడు మరియు వాటిలోని అన్ని విషయాలను పాలించగలడు మరియు అంతకు మించి, ఆయన అన్ని విషయాలకు అవసరమైన వాటిని అందించగలడు. ఇది మానవజాతితోపాటు సమస్త వాటియందు సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికారపు వ్యక్తీకరణయైయున్నది. అలాంటి వ్యక్తీకరణ జీవితాంతం మాత్రమే కాదు; అది ఎప్పటికీ ఆగదు, లేదా విశ్రమించదు మరియు అది ఏ వ్యక్తి ద్వారానైనా, లేదా ఎటువంటి వస్తువు ద్వారానైనా మార్పు చేయబడదు లేక పాడుచేయలేరు లేదా దానిని ఏ వ్యక్తి గాని లేదా ఏ వస్తువు గాని జోడించలేరు లేదా తగ్గించలేరు. ఎందుకంటే సృష్టికర్త యొక్క గుర్తింపును ఎవరూ భర్తీ చేయలేరు, కాబట్టి, సృష్టికర్త యొక్క అధికారాన్ని సృష్టించబడిన ఏ జీవి ద్వారానూ భర్తీ చేయలేము; దానిని సృష్టించబడని ఏ జీవీ సాధించలేదు. ఉదాహరణకు దేవుని సందేశకులు మరియు దేవదూతలను తీసుకోండి. వారు దేవుని శక్తిని కలిగి ఉండరు, అంతేకాదు సృష్టికర్త యొక్క అధికారాన్ని కూడా కలిగియుండరు మరియు వారికి దేవుని శక్తి మరియు అధికారం లేకపోవడానికి కారణం ఏంటంటే వారు సృష్టికర్త యొక్క గుణగణాలను కలిగిలేరు. దేవుని సందేశకులు మరియు దేవదూతలు వంటి సృష్టించబడని జీవులు, దేవుని తరపున కొన్ని పనులు చేయగలిగినప్పటికీ, వారు దేవునికి ప్రాతినిధ్యం వహించలేరు. వారు మానవునికిలేని కొన్ని శక్తులను కలిగి ఉన్నప్పటికీ, వారు దేవుని అధికారాన్ని కలిగి లేరు, వారు అన్నిటిని సృష్టించడానికి, అన్నిటిని ఆదేశించడానికి మరియు అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండటానికి వారు దేవుని అధికారాన్ని కలిగి ఉండరు. కాబట్టి, దేవుని ప్రత్యేకత సృష్టించబడని ఏ జీవిచేత భర్తీ చేయబడదు మరియు అదేవిధంగా, దేవుని యొక్క అధికారం మరియు శక్తిని ఏ సృష్టించబడని జీవిచేత భర్తీ చేయబడదు. బైబిల్లో, సమస్తాన్ని సృష్టించిన దేవుని సందేశకుల గురించి మీరు చదివారా? అన్నిటినీ సృష్టించడానికి దేవుడు తన సందేశకులను లేదా దేవదూతలను ఎందుకు పంపలేదు? ఎందుకంటే వారికి దేవుని అధికారం లేదు, కాబట్టి వారికి దేవుని అధికారాన్ని ప్రదర్శించే సామర్థ్యం లేదు. అన్ని జీవుల మాదిరిగానే, వారందరు సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం క్రింద మరియు సృష్టికర్త యొక్క అధికారం క్రింద ఉన్నారు, అదే విధంగా, సృష్టికర్త వారికి కూడా దేవునిగాను మరియు సార్వభౌమాధికారిగాను ఉన్నాడు. వారిలోని ప్రతి ఒక్కరిలో, వారు ఉన్నతమైన వారైనా లేదా తక్కువవారైనా, గొప్పవారైనా లేదా అల్పమైన శక్తి గలవారైనా సృష్టికర్త యొక్క అధికారాన్ని అధిగమించగలిగే వారు ఎవరూ లేరు మరియు వారిలో, ఏ ఒక్కరూ సృష్టికర్త యొక్క గుర్తింపును భర్తీ చేయలేరు. వారు ఎప్పటికీ దేవుడు అని పిలవబడరు మరియు సృష్టికర్త కాలేరు. ఇవి తిరుగులేని సత్యాలు మరియు వాస్తవాలు!
పై సహవాసం ద్వారా, మనం ఈ క్రింది వాటిని నొక్కి వక్కాణించగలమా: సమస్తానికి సృష్టికర్త మరియు పరిపాలకుడైన, ప్రత్యేకమైన అధికారమును మరియు ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్న, ఆయనే ప్రత్యేకమైన దేవుడు అని చెప్పవచ్చా? ఈ సమయంలో, అటువంటి ప్రశ్న చాలా గంభీరమైనదని మీరు భావించవచ్చు. మీరు ప్రస్తుతానికి, దానిని అర్థం చేసుకోలేరు మరియు లోపల ఉన్న సారాంశాన్ని గ్రహించలేరు మరియు ప్రస్తుతానికి మీరు సమాధానం చెప్పడం కష్టమని భావిస్తున్నారు. అలాంటప్పుడు, నేను నా సహవాసాన్ని కొనసాగిస్తాను. తరువాత, నేను మిమ్మల్ని దేవునికి మాత్రమే స్వంతమైన అధికారం మరియు శక్తి యొక్క అనేక అంశాలకు సంబంధించిన వాస్తవ క్రియలను చూడటానికి సహాయం చేస్తాను మరియు ఆ విధంగా నేను మీరు దేవుని యొక్క ప్రత్యేకత మరియు దేవుని యొక్క ప్రత్యేక అధికారం అంటే ఏమిటి అనే దానిని నిజంగా అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి మరియు తెలుసుకోవటానికి అనుమతిస్తాను.
2. మనిషితో నిబంధన స్థిరపరచుటకు దేవుడు తన వాక్కులను ఉపయోగిస్తాడు
“నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు—నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును” (ఆది 9:11-13).
ఆయన అన్నిటినీ చేసిన తర్వాత, సృష్టికర్త యొక్క అధికారం ధృవీకరించబడింది మరియు మరోసారి ధనుస్సులో చూపించబడింది
సృష్టికర్త యొక్క అధికారం అన్ని జీవుల మధ్య ఎల్లప్పుడూ చూపబడుతుంది మరియు ప్రయోగించబడుతుంది మరియు ఆయన సృష్టించబడిన సమస్తముపై విధిని శాసించడమే కాకుండా, ఆయన తన చేతులతో సృజించిన మరియు భిన్నమైన జీవన నిర్మాణాన్ని మరియు విభిన్న జీవన ఆకృతిని కలిగి ఉన్న మానవాళిని కూడా శాసిస్తాడు. సమస్తాన్ని సృష్టించిన తర్వాత, సృష్టికర్త తన అధికారాన్ని మరియు శక్తిని వ్యక్తపరచడం మానలేదు; ఆయనకు, సమస్తముపై మరియు మొత్తం మానవాళి యొక్క విధిపై ఆయన కలిగి ఉన్న సార్వభౌమాధికారం, మానవాళి నిజంగా ఆయన చేతి నుండి పుట్టిన తర్వాత మాత్రమే అధికారికంగా ప్రారంభమైంది. ఆయన మానవాళిని నడిపించాలని మరియు మానవాళిని పాలించాలని ఉద్దేశించాడు; ఆయన మానవాళిని రక్షించాలని మరియు మానవాళిని, అన్ని విషయాలను పరిపాలించగల మానవాళిని నిజంగా సంపాదించుకోవాలని అనుకున్నాడు; అటువంటి మానవాళిని తన అధికారం క్రింద జీవించేలా చేయాలని మరియు వారు ఆయన అధికారాన్ని తెలుసుకుని, విధేయత చూపాలని ఆయన ఉద్దేశించాడు. ఆ విధంగా, దేవుడు తన వాక్కులను ఉపయోగించి మానవుల మధ్య తన అధికారాన్ని అధికారికంగా వ్యక్తపరచడం ప్రారంభించాడు మరియు ఆయన మాటలను గ్రహించడానికి తన అధికారాన్ని వినియోగించడం మొదలుపెట్టాడు. వాస్తవానికి, ఈ ప్రక్రియలో అన్ని ప్రదేశాలలో దేవుని అధికారం చూపబడింది; నేను కేవలం కొన్ని నిర్దిష్టమైన, బాగా తెలిసిన ఉదాహరణలను ఎంచుకున్నాను, వాటి ద్వారా మీరు దేవుని యొక్క ప్రత్యేకతను మరియు ఆయన ప్రత్యేక అధికారాన్ని అర్థం చేసుకోవచ్చు మరియు తెలుసుకోవచ్చు.
ఆదికాండము 9:11-13లోని భాగానికి మరియు పైన పేర్కొన్న దేవుడు లోకాన్ని సృష్టించిన విధానాన్ని నమోదు చేసిన భాగాలకు మధ్య సారూప్యత ఉంది, అయినప్పటికీ వ్యత్యాసం కూడా అందులో ఉంది. సారూప్యత అనగా ఏమిటి? సారూప్యత అనేది ఆయన ఉద్దేశించినది చేయడానికి దేవుడు తన వాక్కులను ఉపయోగించడం మరియు ఇందులో ఉండే వ్యత్యాసం ఏమిటంటే ఇక్కడ ఉదహరించబడిన భాగాలు మనిషితో దేవుడు మాట్లాడుచున్నటువంటి సంభాషణను సూచిస్తున్నాయి, అందులో ఆయన మనిషితో నిబంధన ఏర్పరచుకున్నాడు మరియు నిబంధనలో ఉన్న దాని గురించి మనిషికి చెప్పాడు. దేవుని అధికారం యొక్క ఈ ప్రయత్నం మనిషితో ఆయన మాట్లాడుతున్న సమయంలో నెరవేరింది, అంటే, మానవాళిని సృష్టించక ముందు, దేవుని మాటలు ఆయన సృష్టించాలనుకున్న జీవులకు జారీ చేయబడిన సూచనలు మరియు ఆదేశాలు అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు దేవుని మాటలను వినడానికి ఒకరున్నారు, కాబట్టి ఆయన మాటలు మనిషితో సంభాషించు విధముగాను మరియు మనిషికి ఉపదేశంగా మరియు మందలింపుగా ఉన్నాయి. అంతేగాక, దేవుని మాటలు అనేవి సమస్తానికి అందించగలిగిన మరియు ఆయన అధికారాన్ని కలిగియున్న ఆజ్ఞలుగా ఉన్నాయి.
ఈ వాక్య భాగంలో దేవుని ఎటువంటి క్రియను నమోదు చేయడం జరిగింది? ఈ వాక్య భాగం జలప్రవాహంతో భూమిని నాశనం చేసిన తర్వాత దేవుడు మనిషితో ఏర్పరచిన నిబంధనను నమోదు చేస్తుంది; ఇది దేవుడు మళ్లీ భూమిపై అలాంటి విధ్వంసం సృష్టించడని మరియు దానికి దేవుడు ఒక గురుతును ఉంచాడని మనిషికి చెబుతుంది. ఈ గురుతు ఏమిటి? లేఖనాల్లో “మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును” అని చెప్పబడింది. ఇవి మానవాళికి సృష్టికర్త చెప్పిన అసలు మాటలు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, ఒక మేఘధనుస్సు మనిషి కళ్ళ ముందు కనిపించింది మరియు అది ఈ రోజు వరకు అలాగే ఉంది. అలాంటి మేఘ ధనుస్సును ప్రతి ఒక్కరు చూశారు, మీరు దానిని చూసినప్పుడు, అది ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? విజ్ఞాన శాస్త్రము దానిని నిరూపించలేకపోయింది, లేదా దాని మూలాన్ని లేదా దాని ఆచూకీని గుర్తించలేకపోయింది. ఎందుకంటే మేఘ ధనుస్సు సృష్టికర్త మరియు మనిషి మధ్య ఏర్పడిన నిబంధనకు సంకేతం; దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం అవసరం లేదు, అది మనిషిచేత తయారు చేయబడినది కాదు లేదా మనిషికి దానిని మార్చగల సామర్థ్యం లేదు. సృష్టికర్త తన మాటలు పలికిన తర్వాత ఆయన అధికారానికి కొనసాగింపు ఇది. సృష్టికర్త మనిషితో చేసుకున్న తన నిబంధనకు మరియు తన వాగ్దానానికి కట్టుబడి ఉండటానికి తన స్వంత ప్రత్యేక పద్ధతిని ఉపయోగించాడు, అందువలన ఆయన స్థిరపరచిన నిబంధనకు గురుతుగా మేఘధనస్సును ఉపయోగించడం అనేది పరలోకపు శాసనం మరియు నియమమై ఉన్నది, సృష్టికర్త విషయములో గాని లేదా సృష్టించబడిన మానవజాతి విషయంలో గాని ఇది ఎప్పటికీ మారదు. మార్పు చేయరాని ఈ నియమం సృష్టించబడిన సమస్తముపై సృష్టికర్త అధికారం యొక్క మరొక నిజమైన వ్యక్తీకరణ అని చెప్పాలి మరియు సృష్టికర్త యొక్క అధికారం మరియు శక్తి అపరిమితమైనవని చెప్పాలి; ఆయన మేఘధనస్సును గురుతుగా ఉపయోగించడం అనేది సృష్టికర్త యొక్క అధికారమును కొనసాగించుటయైయున్నది మరియు విస్తరణయైయున్నది. ఇది దేవుడు తన మాటలను ఉపయోగించి చేసిన మరొక క్రియ మరియు మాటలను ఉపయోగించి దేవుడు మనిషితో స్థిరపచిన నిబంధనకు గురుతుయైయున్నది. ఆయన తీసుకురావాలని నిర్ణయించుకున్న దాని గురించి మరియు అది ఏ పద్ధతిలో నెరవేరుతుందో మరియు సాధించబడుతుందో ఆయన మనిషికి చెప్పాడు. ఈ విధంగా దేవుని నోటి నుండి వచ్చిన మాటల ప్రకారం ఈ విషయం నెరవేరింది. దేవుడు మాత్రమే అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఈ రోజు, ఆయన ఈ మాటలు మాట్లాడిన అనేక వేల సంవత్సరాల తరువాత, మనిషి ఇప్పటికీ దేవుని నోటి మాటవలన కలిగిన మేఘ ధనస్సును చూడగలుగుతున్నాడు. దేవుడు పలికిన ఆ మాటల కారణంగా ఈ విషయం నేటి వరకు మార్పు చెందకుండా మరియు మారకుండా ఉంది. ఈ మేఘ ధనస్సును ఎవరూ తీసివేయలేరు, దాని నియమాలను ఎవరూ మార్చలేరు మరియు ఇది కేవలం దేవుని మాటలను బట్టే ఉనికిలో ఉంది. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క అధికారం. “దేవుడు తన మాటవలె మంచివాడు మరియు ఆయన మాట నెరవేరుతుంది, మరియు ఆయన నెరవేర్చినది శాశ్వతంగా ఉంటుంది.” అటువంటి మాటలు ఇక్కడ స్పష్టంగా వ్యక్తీకరించబడ్డాయి మరియు ఇది దేవుని అధికారం మరియు శక్తి యొక్క స్పష్టమైన సంకేతం మరియు గుణ లక్షణం. అటువంటి సంకేతం లేదా గుణ లక్షణం సృష్టించబడిన ఏ జీవి కలిగి ఉండదు లేదా ఏ జీవిలోనూ కనిపించదు మరియు సృష్టించబడని ఏ జీవిలోనూ కనిపించదు. ఇది ప్రత్యేకమైన దేవునికి మాత్రమే చెందినది మరియు సృష్టికర్త మాత్రమే కలిగి ఉన్న ఈ గుర్తింపు మరియు గుణగణాలు జీవుల నుండి వేరు చేస్తుంది. అదే సమయంలో, ఇది దేవుడు కాకుండా, సృష్టించబడిన లేదా సృష్టించబడని ఏ జీవిచేత ఎప్పటికీ అధిగమించబడదు అనే సంకేతం మరియు లక్షణమైయున్నది.
దేవుడు మనిషితో తన నిబంధనను స్థిరపరచడం అనేది గొప్ప ప్రాముఖ్యతతో కూడిన కార్యమైయున్నది, దీని ద్వారా ఆయన మనిషికి ఒక వాస్తవాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు మరియు ఆయన తన చిత్తాన్ని మనిషికి చెప్పాలనుకుంటున్నాడు. దీని కోసం ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించాడు, మనిషితో నిబంధన స్థిరపరచడానికి ఒక ప్రత్యేక గురుతును ఉపయోగించాడు, ఇది ఆయన మనిషితో స్థిరపరచి నిబంధన యొక్క వాగ్దానం. కాబట్టి, ఈ నిబంధన ఏర్పాటు గొప్ప సంఘటనగా ఉందా? ఇది ఎంత గొప్పది? నిబంధనకు సంబంధించిన ప్రత్యేకత ఇదే: ఇది ఒక మనిషి మరియు మరొక మనిషి, లేదా ఒక సమూహం మరియు మరొక సమూహం, లేదా ఒక దేశం మరియు మరొక దేశం మధ్య స్థిరపరచిన నిబంధన కాదు, కానీ సృష్టికర్త మరియు మానవాళి అంతటి మధ్య స్థిరపరచి నిబంధన మరియు ఇది సృష్టికర్త సమస్తాన్ని నిర్మూలించే రోజు వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ నిబంధన యొక్క కార్యనిర్వాహకుడు సృష్టికర్త మరియు దానిని నిర్వహించేవాడు కూడా సృష్టికర్తే. క్లుప్తంగా చెప్పాలంటే, సృష్టికర్త మరియు మానవాళికి మధ్య జరిగిన సంభాషణకు అనుగుణంగా మానవాళితో స్థిరపరచిన మేఘ ధనస్సు నిబంధన మొత్తం నెరవేరింది మరియు అమలు చేయబడింది మరియు నేటి వరకు అది అలాగే ఉంది. సృష్టికర్త యొక్క అధికారానికి సమర్పించుకోవడం, విధేయత చూపడం, విశ్వసించడం, మెచ్చుకోవడం, సాక్ష్యమివ్వడం మరియు స్తుతించడం మినహా జీవులు ఏమి చేయగలవు? అటువంటి నిబంధనను స్థిరపరచే శక్తి ప్రత్యేకమైన దేవునికి తప్ప మరెవరికీ లేదు. మేఘధనస్సు కనబడడం అనేది, పదే పదే, మానవాళికి చేస్తున్న ఒక ప్రకటన మరియు అది సృష్టికర్త మరియు మానవాళికి మధ్యనున్న నిబంధన వైపుకు మనిషి దృష్టిని మళ్ళిస్తుంది. సృష్టికర్త మరియు మానవాళికి మధ్యనున్న నిబంధన నిరంతరం కనబడడం, మానవాళికి ప్రదర్శించబడడం అనేది మేఘధనస్సు లేదా నిబంధన కాదు, కానీ అది సృష్టికర్త యొక్క మార్పులేని అధికారం. మేఘధనస్సు పదే పదే కనబడడం అనేది దాగు స్థలాలలో, సృష్టికర్త యొక్క బ్రహ్మాండమైన మరియు అద్భుతమైన క్రియలను ప్రదర్శిస్తుంది మరియు అదే సమయంలో, ఇది సృష్టికర్త అధికారం యొక్క ముఖ్యమైన ప్రతిబింబం, అది ఎప్పటికీ మసకబారదు మరియు ఎప్పటికీ మారదు. ఇది సృష్టికర్త ప్రత్యేక అధికారం యొక్క మరొక కోణాన్ని ప్రదర్శించడంవంటిది కాదా?
3. దేవుని ఆశీర్వాదాలు
ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలో నుండి వచ్చెదరు. (ఆదికాండము 17:4-6)
అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను. (ఆదికాండము 18:18-19)
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. (ఆదికాండము 22:16-18)
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను. (యోబు 42: 12)
సృష్టికర్త పలుకుల యొక్క ప్రత్యేకమైన తీరు మరియు ప్రత్యేకమైన లక్షణాలు అనేవి సృష్టికర్త యొక్క ప్రత్యేకమైన గుర్తింపు మరియు అధికారము యొక్క చిహ్నమైయున్నది.
చాలామంది దేవుని ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదాలను పొందలేరు, ఎందుకంటే దేవుడు తన స్వంత సూత్రాలను కలిగి ఉన్నాడు మరియు తన స్వంత పద్దతిలో మనిషిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనిషికి చేసే వాగ్దానాలు మరియు మానవునిపై ఆయన అనుగ్రహించే కృప మొత్తం మనిషి ఆలోచనలు మరియు చర్యల ఆధారంగా ఉంటుంది. కాబట్టి, దేవుని ఆశీర్వాదాల ద్వారా చూపించబడిందేమిటి? ప్రజలు తమలో తాము ఏమి చూడగలరు? ఈ సమయంలో, దేవుడు ఎలాంటి వ్యక్తులను ఆశీర్వదిస్తాడు మరియు మనిషిని దేవుడు ఆశీర్వదించే సూత్రాల గూర్చిన చర్చను పక్కన పెడదాం. దానికి బదులుగా, దేవుని అధికారాన్ని తెలుసుకోవాలనే లక్ష్యంతో, దేవుని అధికారాన్ని తెలుసుకునే దృష్టికోణంతో మనిషిని దేవుడు ఆశీర్వదించడాన్ని చూద్దాం.
పైన పేర్కొన్న లేఖనాల్లోని నాలుగు వాక్య భాగాలన్నీ దేవుడు మనిషిని ఆశీర్వదించడాన్ని గురించి చెబుతున్నాయి. అవి దేవుని ఆశీర్వాదాలు పొందిన అబ్రాహాము మరియు యోబు గురించి, అలాగే దేవుడు తన ఆశీర్వాదాలను ఎందుకు ప్రసాదించాడో మరియు ఈ ఆశీర్వాదాలలో ఏమున్నదనే దాని గురించి వివరిస్తున్నాయి. దేవుని పలుకుల స్వరము మరియు పలుగుల విధానము మరియు ఆయన ఏ దృష్టికోణం నుండి, ఏ స్థాయి నుండి మాట్లాడాడు అనేవి ఆశీర్వాదాలు ఇచ్చే వ్యక్తి మరియు ఆ ఆశీర్వాదాలను పొందే వ్యక్తి విభిన్నమైన గుర్తింపు, హోదా మరియు గుణగణాలను కలిగి ఉన్నారని ప్రజలు అభినందించేలా చేస్తాయి. ఈ పలుకులు ఏ విధంగా మరియు ఏ పద్ధతిలో మరియు ఏ స్థాయిలో వ్యక్తపరచబడ్డాయి అనేవి సృష్టికర్త యొక్క గుర్తింపును కలిగి ఉన్న దేవునికి ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఆయనకు అధికారం మరియు శక్తి ఉంది, అలాగే ఏ మనిషి సందేహించలేని సృష్టికర్త యొక్క గౌరవం మరియు ఘనతలు ఉన్నాయి.
మొదట ఆదికాండము 17:4-6 వాక్యభాగాన్ని చూద్దాం: “ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.” ఈ మాటలు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, అలాగే దేవుడు అబ్రహాముతో పలికిన ఆశీర్వాదాలు: దేవుడు అబ్రహామును జనములకు తండ్రిగా చేస్తాడు, ఆయనకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగ చేస్తాడు మరియు ఆయన నుండి జనములు వచ్చేలా చేస్తాడు మరియు ఆయన నుండి రాజులు వస్తారు. మీరు ఈ మాటలలో దేవుని అధికారాన్ని చూస్తున్నారా? మరియు అటువంటి అధికారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దేవుని అధికారం యొక్క గుణగణాల్లో మీరు ఏ అంశాన్ని చూస్తున్నారు? ఈ పదాలను నిశితంగా చదివినప్పుడు, దేవుని యొక్క అధికారం మరియు గుర్తింపులను దేవుని పలుకుల యొక్క పదాల్లో స్పష్టంగా వెల్లడి చేయబడిందని కనుగొనడం కష్టం కాదు. ఉదాహరణకు, దేవుడు “నా నిబంధన నీతో చేసియున్నాను, మరియు నీవు … నిన్ను నియమించితిని … నీకు కలుజేసి…” అని చెప్పినప్పుడు, “నీవు అవుతావు” మరియు “నేను చేస్తాను,” పదబంధాలు దేవుని గుర్తింపు మరియు అధికారాలను ధృవీకరిస్తున్నాయి, అవి, ఒక విధంగా, సృష్టికర్త యొక్క విశ్వసనీయతకు సూచనగా ఉన్నాయి; మరొక విధంగా, అవి సృష్టికర్త యొక్క గుర్తింపును కలిగియున్న దేవుడు ఉపయోగించే ప్రత్యేక పదాలు. అలాగే అవి ప్రామాణిక పదజాలంలో భాగమై ఉన్నాయి. ఎవరైనా, ఒక వ్యక్తితో నీకు అత్యధిక సంతానవృద్ధి కలుగుతుంది, నీలో నుండి జనములు కలుగుతాయి మరియు వారి నుండి రాజులు వస్తారని చెబితే, అది నిస్సందేహంగా ఒక రకమైన కోరిక, అంతేగాని అది వాగ్దానం లేదా ఆశీర్వాదం కాదు. కాబట్టి, ప్రజలు అటువంటి శక్తిని కలిగి లేరని వారికి తెలుసు కాబట్టి, “నేను నిన్ను అలా చేస్తాను మరియు నీవు అలా అవుతావు…” అని చెప్పడానికి ధైర్యం చేయరు; అది వారి చేతుల్లో లేదు, మరియు వారు అలాంటి మాటలు చెప్పినప్పటికీ, అవి వారి కోరిక మరియు ఆశయాన్ని బట్టి చెప్పినవి కాబట్టి, వారివి నిరర్థకమైన మాటలు మరియు అవి అర్ధంలేనివి. ఎవరైనా తమ కోరికలను నెరవేర్చుకోలేరని భావిస్తే అంత గొప్పగా మాట్లాడే ధైర్యం చేస్తారా? ప్రతి ఒక్కరూ తమ సంతతికి మంచి జరగాలని కోరుకుంటారు, వారు రాణించాలని మరియు గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తారు. “వారిలో ఒకరు చక్రవర్తి కావడం ఎంత గొప్ప అదృష్టమో కదా! ఎవరైనా గవర్నరుగా ఉంటే అది కూడా బాగుంటుంది, వారు ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నంత కాలం చాలా బాగానే ఉంటుంది!” ఇవన్నీ ప్రజల కోరికలు, కానీ ప్రజలు తమ సంతతి ఆశీర్వదించబడాలని మాత్రమే కోరుకుంటారు మరియు తమ వాగ్దానాలను నెరవేర్చలేరు లేదా వాటిని నిజం చేయలేరు. వారి హృదయాలలో, ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు, అలాంటి వాటిని చేయగల శక్తి తమకు లేదని, ఎందుకంటే వారికి సంబంధించిన ప్రతీది వారి నియంత్రణకు మించినది, కాబట్టి వారు ఇతరుల విధిని ఎలా ఆదేశించగలరు? దేవుడు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పగలడు అంటే, దేవుడు అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు ఆయన మనిషికి చేసే వాగ్దానాలన్నింటినీ నెరవేర్చగలడు మరియు ఆయన మనిషికి ప్రసాదించే అన్ని ఆశీర్వాదాలను నిజం చేయగలడు. మానవుడు దేవునిచే సృష్టించబడ్డాడు మరియు దేవుడు ఎవరికైనా అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేయడమనేది చాలా సులభం; ఒకరి సంతానాన్ని సంపన్నులుగా చేయడానికి ఆయన నుండి ఒక మాట చాలు. ఆయన దానిని చేయడానికి ఎన్నడూ చెమటోర్చి పని చేయవలసిన అవసరం లేదు, లేదా ఆయన మనస్సు పెట్టాల్సిన పని లేదు, లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు; ఇదీ దేవుని గొప్ప శక్తి, దేవుని గొప్ప అధికారం.
ఆదికాండము 18:18 వచనములోని “అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును” అని చదివిన తర్వాత, మీరు దేవుని అధికారాన్ని అనుభూతి చెందగలిగారా? సృష్టికర్త యొక్క అసాధారణతను మీరు గ్రహించగలిగారా? సృష్టికర్త యొక్క సర్వాధికారమును మీరు గ్రహించగలిగారా? దేవుని మాటలు ఖచ్చితమైనవి. విజయంపట్ల ఆయనకున్న నిశ్చయతను బట్టి గాని, లేదా ఆ నిశ్చయతకు ప్రాతినిధ్యం వహిస్తూ దేవుడు అలాంటి మాటలు చెప్పడు; దానికి బదులుగా, అవి, దేవుని పలుకుల యొక్క అధికారానికి రుజువు మరియు దేవుని మాటలను నెరవేర్చే ఆజ్ఞ. మీరు ఇక్కడ దృష్టి పెట్టవలసిన రెండు వ్యక్తీకరణలు ఉన్నాయి. “అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును” అని దేవుడు చెప్పినప్పుడు, ఈ మాటలలో అస్పష్టత ఏదైనా ఉందా? ఆందోళన కలిగించే అంశం ఏదైనా ఉందా? భయపెట్టే అంశం ఏదైనా ఉందా? దేవుని పలుకులలోని “నిశ్చయముగా” మరియు “అగును” అనే పదాల కారణంగా, మనిషికి ప్రత్యేకమైన మరియు అతనిలో తరచుగా కనబడే ఈ అంశాలు సృష్టికర్తకు ఎన్నడూ వర్తించవు. ఇతరులకు మంచి జరగాలని కోరుకునేటప్పుడు అలాంటి పదాలను ఉపయోగించేందుకు ఎవరూ సాహసించరు, ఎవరికీ బలముగల గొప్ప జనమగుతారని లేదా భూమిలోని సమస్త జనములు అతని మూలముగా ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేయడానికి ఎవరూ సాహసించరు. దేవుని మాటలు ఎంత నిర్దిష్టంగా ఉంటే, అవి అంతగా దానిని రుజువు చేస్తాయి-అయితే అది ఏమిటి? దేవునికి అలాంటి అధికారం ఉందని, ఆయన అధికారం వీటిని నెరవేర్చగలదని మరియు వాటి నెరవేర్పు అనివార్యమని అవి రుజువు చేస్తున్నాయి. దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి విషయంలో ఆయన ఏ మాత్రం సంకోచం లేకుండా హృదయంలో నిశ్చయత కలిగి ఉన్నాడు. అంతేకాకుండా, ఇది మొత్తం ఆయన మాటలకు అనుగుణంగానే నెరవేర్చబడుతుంది మరియు దాని నెరవేర్పును ఏ శక్తి మార్చదు, అడ్డుకోదు, బలహీనపరచదు లేదా భంగం కలిగించదు. ఇంకా ఏమి జరిగినా సరే, దేవుని మాటల నెరవేర్పు మరియు సాఫల్యతను ఏదీ రద్దు చేయలేదు లేదా ప్రభావితం చేయలేదు. సృష్టికర్త నోటి నుండి పలుకబడిన మాటల యొక్క గొప్పతనం మరియు మనిషి యొక్క తిరస్కరణకు దారి తీయని సృష్టికర్త యొక్క అధికారం ఇదే! ఈ మాటలు చదివిన తర్వాత, నీకు ఇంకా సందేహం కలుగుతోందా? ఈ మాటలు దేవుని నోటి మాటలు నుండి వెలువడ్డాయి మరియు ఆ దేవుని మాటలలో శక్తి, ఘనత మరియు అధికారాలు ఉన్నాయి. అటువంటి శక్తి, అధికారం, మరియు వాస్తవాన్ని జరిగించడం యొక్క అనివార్యత, సృష్టించబడిన లేదా సృష్టించబడని వాటి ద్వారా సాధింపజాలనివి మరియు సృష్టించబడిన లేదా సృష్టించబడని వాటి ద్వారా అధిగమించలేనివి. సృష్టికర్త మాత్రమే మానవజాతితో అటువంటి స్వరంతో మరియు శృతితో సంభాషించగలడు మరియు ఆయన వాగ్దానాలు నిరర్థకమైన మాటలు కాదని, లేదా పనికిమాలిన ప్రగల్భాలు కాదని, కానీ ఏ వ్యక్తి ద్వారానైనా, ఎటువంటి సంఘటన ద్వారానైనా, లేదా ఎటువంటి విషయం ద్వారానైనా అధిగమించలేని ప్రత్యేక అధికారం యొక్క వ్యక్తీకరణ అని వాస్తవాలు రుజువు చేశాయి.
దేవుడు పలికిన మాటలకు, మనిషి పలికిన మాటలకు మధ్యనున్న తేడా ఏమిటి? నీవు దేవుడు చెప్పిన ఈ మాటలను చదివినప్పుడు, నీవు దేవుని మాటల శక్తిని మరియు దేవుని అధికారాన్ని గ్రహిస్తావు. ప్రజలు ఇలాంటి మాటలు పలికిన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? వారు చాలా గర్వంగా మరియు గొప్పలు చెప్పుకుంటూ, తమను తాము ప్రదర్శించుకుంటున్నారు అని భావిస్తున్నావా? ఎందుకంటే వారికి ఈ శక్తి లేదు, వారికి అలాంటి అధికారం లేదు, కాబట్టి వారికి అలాంటి వాటిని చేయగల సమర్ధత అస్సలు లేదు. తమ వాగ్దానాలపట్ల వారు చాలా నిశ్చయంగా ఉండటం అనేది వారి మాటల్లోని అజాగ్రత్తను మాత్రమే తెలియజేస్తుంది. ఎవరైనా అలాంటి మాటలు చెబితే, వారు నిస్సందేహంగా అహంకారమును మరియు అతి నిశ్చయతను కలిగి ఉన్నారు, మరియు వారు ప్రధాన దేవదూత స్వభావానికి ఒక చక్కని ఉదాహరణగా తమను తాము వెల్లడి చేసుకుంటున్నారు. ఈ మాటలు దేవుని నోటి నుండి వచ్చాయి; నీకు ఇక్కడ ఏదైనా అహంకారంగా అనిపించిందా? దేవుని మాటలను హాస్యాస్పదమైన మాటలుగా మీరు భావిస్తున్నారా? దేవుని మాటలు అధికారమైయున్నది, దేవుని మాటలు వాస్తమైయున్నది మరియు ఆయన నోటి నుండి మాటలు ఉచ్ఛరించబడకముందే, అంటే, ఆయన ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే అది అప్పటికే నెరవేర్చబడింది. దేవుడు అబ్రాహాముతో చెప్పినవన్నీ దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన అని మరియు దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానమని చెప్పవచ్చు. ఈ వాగ్దానం ఒక ధృవీకరించబడిన వాస్తవం, అలాగే నెరవేర్చబడిన వాస్తవం మరియు ఈ వాస్తవాలు దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని ఆలోచనలలో క్రమంగా నెరవేరాయి. కాబట్టి, దేవుడు అలాంటి మాటలు చెప్పడం అంటే ఆయనకు అహంకార స్వభావం ఉందని కాదు, ఎందుకంటే దేవుడు అలాంటి వాటిని నెరవేర్చగలడు. ఆయన ఈ శక్తిని మరియు అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు ఈ కార్యాలను నెరవేర్చగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాడు మరియు వాటి సాఫల్యత పూర్తిగా ఆయన సామర్ధ్య పరిధిలోనే ఉంది. ఇలాంటి మాటలు దేవుని నోటి నుండి ఉచ్ఛరించబడినప్పుడు, అవి దేవుని నిజమైన స్వభావం యొక్క ప్రత్యక్షత మరియు వ్యక్తీకరణ, దేవుని గుణగణాలు మరియు అధికారం యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత మరియు ప్రదర్శన, మరియు సృష్టికర్త గుర్తింపుకు రుజువుగా ఉన్నాయి, అంతకన్నా సముచితమైనది మరియు తగినది మరొకటి లేదు. అటువంటి పలుకుల తీరు, స్వరం మరియు పదాలు ఖచ్చితంగా సృష్టికర్త యొక్క గుర్తింపుకు చిహ్నంగా ఉంటాయి మరియు దేవుని స్వంత గుర్తింపు యొక్క వ్యక్తీకరణకు సంపూర్ణంగా సరిపోతాయి; వాటిలో కపటం లేదు, అపవిత్రత లేదు; అవి పూర్తిగా మరియు సంపూర్ణంగా సృష్టికర్త యొక్క గుణగణాలను మరియు అధికారాన్ని పరిపూర్ణంగా కనబరుస్తాయి. ప్రాణుల విషయానికొస్తే వాటికి ఈ అధికారం లేదా ఈ గుణగణాలు లేవు, అంతేగాక అవి దేవుడు ఇచ్చిన శక్తిని కలిగి ఉండవు. మనిషి అలాంటి ద్రోహపూరిత ప్రవర్తనకు పాల్పడితే, అది ఖచ్చితంగా అతని చెడిపోయిన స్వభావానికి పూర్తి నిదర్శనమవుతుంది మరియు దీని మూలంగా మనిషి యొక్క అహంకారం, క్రూరపూరిత ఆశయానికి పురికొల్పినట్లవుతుంది మరియు ప్రజలను మోసగించాలని మరియు దైవద్రోహానికి పాల్పడేలా వారిని ప్రలోభపెట్టాలని కోరుకునే దయ్యం సాతాను యొక్క వికృత ఉద్దేశాలను బహిర్గతపరుస్తుంది. అటువంటి భాష ద్వారా బయలుపరచబడిన దానిని దేవుడు ఎలా పరిగణిస్తాడు? నీవు ఆయన స్థానాన్ని ఆక్రమించుకోవాలని కోరుకుంటున్నావని మరియు నీవు ఆయనను అనుకరించాలని మరియు ఆయనకు బదులుగా ఆయన స్థానములో ఉండాలని ఆశిస్తున్నావని దేవుడు చెబుతాడు. నీవు దేవుని పలుకుల స్వరాన్ని అనుకరించినప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజల హృదయాలలో దేవుని స్థానాన్ని బదిలీ చేయడమే, న్యాయబద్ధంగా దేవునికి చెందిన మానవజాతిని ఆయనకు కాకుండా చేయడమే. ఇదే సాతాను, సాతాను కాకుండా వేరొకటి కాదు; ఇవి ప్రధాన దేవదూత సంతతి చేసే పనులు, పరలోకంలో వాటికి తావు లేదు! మీలో ఎవరైనా ప్రజలను తప్పుదారి పట్టించే మరియు మోసగించే ఉద్దేశ్యంతో కొన్ని మాటలు మాట్లాడి ఒక నిర్దిష్ట మార్గంలో దేవుణ్ణి అనుకరించి, ఈ వ్యక్తి యొక్క మాటలు మరియు చర్యలు దేవుని అధికారాన్ని మరియు శక్తిని కలిగి ఉన్నాయని, ఈ వ్యక్తి యొక్క గుణగణాలు మరియు గుర్తింపు ప్రత్యేకం అని, ఇంకా ఈ వ్యక్తి మాటల స్వరం దేవునిలాగా ఉంది అని భావించేలా చేస్తున్నవారు ఉన్నారా? మీరు ఎప్పుడైనా ఇలాంటిది చేశారా? మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా దేవుని స్వభావాన్ని సూచించే హావభావాలతో, మీరు శక్తి మరియు అధికారం అని అనుకునే దానితో, దేవుని స్వరాన్ని అనుకరించారా? మీలో చాలా మంది తరచుగా ఆ విధంగా వ్యవహరిస్తారా లేదా వ్యవహరించాలని ప్రణాళిక వేసుకున్నారా? ఇప్పుడు, మీరు నిజంగా సృష్టికర్త యొక్క అధికారాన్ని గ్రహించి మరియు తెలుసుకున్నప్పుడు, మీరు ఏమి చేసేవారో మరియు మీ గురించి మీరు ఏమి అనుకునేవారో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, మీకు అసహ్యంగా అనిపిస్తుందా? మీకున్న అజ్ఞానమును మరియు సిగ్గులేనితనాన్ని గుర్తించారా? అటువంటి వ్యక్తుల స్వభావాన్ని మరియు గుణగణాలను పరిశీలించిన తరువాత, వారు నరకానికి పాత్రులని చెప్పవచ్చా? ఇలాంటి పనులు చేసే ప్రతి ఒక్కరూ తమకు తాము అవమానం తెచ్చుకుంటున్నారని చెప్పగలమా? మీరు ఆ స్వభావం యొక్క తీవ్రతను గుర్తించారా? ఇది ఎంత తీవ్రాతి తీవ్రమైనది? ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తుల యొక్క ఉద్దేశ్యం దేవుణ్ణి పోలి నడవాలనుకోవడమే. వారు దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నారు, ప్రజలు తమను దేవుడిగా ఆరాధించాలని కోరుకుంటారు. వారు ప్రజల హృదయాలలో దేవుని స్థానాన్ని నిర్మూలము చేయాలనుకుంటున్నారు మరియు మనుషుల మధ్య పని చేసే దేవుణ్ణి వదిలించుకోవాలని కోరుకుంటారు మరియు ప్రజలను నియంత్రించడం, ప్రజలను నాశనం చేయడం మరియు వారిని స్వాధీనపరచుకోవడం అనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వారు దీన్ని చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రజ్ఞతో కూడిన కోరికలు మరియు ఆశయాలు ఉంటాయి మరియు ప్రతి ఒక్కరూ ఈ రకమైన చెడిపోయిన మరియు సాతాను స్వభావంలో జీవిస్తున్నారు, సాతాను స్వభావంలో వారు దేవునితో శత్రుత్వం పెట్టుకుంటారు, దైవద్రోహం చేస్తారు మరియు దేవుడు అవ్వాలని కోరుకుంటారు. దేవుని అధికారం అనే అంశంపై నా సహవాసాన్ని అనుసరిస్తూ, మీరు ఇప్పటికీ దేవునిలా నటించాలని లేదా పోలి నడుచుకోవాలనుకుంటున్నారా? మీరు ఇప్పటికీ దేవునిగా ఉండాలని కోరుకుంటున్నారా? మీరు ఇంకా దేవుడవ్వాలనుకుంటున్నారా? దేవుని అధికారాన్ని మానవుడు కలిగియుండడం అసాధ్యం మరియు దేవుని గుర్తింపును మరియు స్థాయిని మనిషి కలిగి ఉండలేడు. నీవు దేవుడు మాట్లాడే స్వరాన్ని అనుకరించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, నీవు దేవుని గుణగణాలను అనుకరించలేవు. నీవు దేవుని స్థానంలో నిలబడి, దేవునివలె నటించగలిగినప్పటికీ, నీవు దేవుడు చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేవు మరియు సమస్తాన్ని పరిపాలించలేవు మరియు ఆజ్ఞాపించలేవు. దేవుని దృష్టిలో, నీవు ఎప్పటికీ చిన్న జీవిగానే ఉంటావు మరియు నీ నైపుణ్యాలు మరియు సామర్థ్యం ఎంత గొప్పగా ఉన్నా, నీకు ఎన్ని వరాలు ఉన్నప్పటికీ, నీవు పూర్తిగా సృష్టికర్త ఆధీనంలో ఉన్నావు. నీకు కొన్ని కఠోరమైన మాటలు చెప్పగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇది నీకు సృష్టికర్త యొక్క గుణగణాలు ఉన్నాయని లేదా నీవు సృష్టికర్త యొక్క అధికారాన్ని కలిగి ఉన్నావని సూచించదు. దేవుని అధికారం మరియు శక్తి అనేవి ప్రత్యేకమైన దేవుని యొక్క గుణగణాలే. అవి నేర్చుకొన్నవి కాదు, లేదా బయట నుండి జోడించబడినవి కాదు, అవి దేవుని యొక్క స్వాభావిక గుణగణాలైయున్నవి. కాబట్టి సృష్టికర్తకు మరియు జీవులకు మధ్యనున్న సంబంధాన్ని ఎప్పటికీ మార్పు చేయలేము. జీవులలో ఒకరిగా, మనిషి తన స్వంత స్థానాన్ని కాపాడుకోవాలి మరియు మనస్సాక్షితో ప్రవర్తించాలి. సృష్టికర్త నీకు అప్పగించిన దానిని విధిగా కాపాడుకోవాలి. హద్దు మీరి ప్రవర్తించవద్దు లేదా మీ సామర్థ్యానికి మించిన పనులను చేయవద్దు లేదా దేవునికి అసహ్యకరమైన పనులను చేయవద్దు. గొప్పవాడిగా ఉండటానికి ప్రయత్నించవద్దు, లేదా సూపర్మ్యాన్గా, లేదా ఇతరులకన్నా మించిన వానిగా ఉండవద్దు లేదా దేవుడు అవ్వాలని ప్రయత్నించవద్దు. ప్రజలు ఇలా ఉండాలని కోరుకోకూడదు. గొప్పవాడుగా ఉండాలనుకోవడం లేదా మానవాతీతమైన వ్యక్తిగా మారాలనుకోవడం అర్థరహితం. దేవుడు అవ్వాలని కోరుకోవడం మరింత అవమానకరమైన విషయం; ఇది అసహ్యకరమైనది మరియు జుగుప్సాకరమైనది. గ్రహించాల్సింది మరియు జీవులు అన్నిటికంటే ఎక్కువగా శ్రద్ధ వహించాల్సింది ఏమిటంటే నిజమైన జీవిగా మారడం; ఇదే ప్రజలందరూ అనుసరించాల్సిన ఏకైక లక్ష్యం.
సమయం, స్థలం లేదా భౌగోళికం ద్వారా సృష్టికర్త యొక్క అధికారం పరిమితం చేయబడదు మరియు సృష్టికర్త యొక్క అధికారం అంచనాకు అతీతమైనది
మనం ఆదికాండము 22:17-18 వచనాలను చూద్దాం. ఇది యెహోవా దేవుడు చెప్పిన మరొక వాక్య భాగం, దీనిలో ఆయన అబ్రాహాముతో ఇలా అన్నాడు, “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” అబ్రాహాము సంతానం వృద్ధి చెందుతుందని యెహోవా దేవుడు అనేకసార్లు ఆశీర్వదించాడు, అయితే వారు ఎంతమేరకు వృద్ధి చెందుతారు? లేఖనంలో చెప్పబడినట్లు: “ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను” వృద్ధి చెందుతారు. దేవుడు అబ్రాహాముకు ఆకాశంలోని నక్షత్రాలన్నింటి అనేకమైన సంతానాన్ని మరియు సముద్ర తీరమందలి ఇసుకవలె సమృద్ధిని ప్రసాదించాలని కోరుకున్నాడు. దేవుడు రూపకాలంకారం ప్రయోగించి మాట్లాడాడు మరియు ఈ రూపకాలంకారాన్ని బట్టి దేవుడు అబ్రాహాముకు కేవలం ఒకరు, ఇద్దరు లేదా ఇంకా వేలాది మంది సంతానాన్ని ప్రసాదిస్తాడని చూడటం కష్టం కాదు, కానీ లెక్కించలేనంత మందిని, వారు అనేక జనములుగా మారతారు, అబ్రహాము అనేక జనములకు తండ్రి అవుతాడని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు, ఆ సంఖ్యను మనిషి నిర్ణయించాడా, లేక దేవుడు నిర్ణయించాడా? మనిషి తనకు ఎంతమంది సంతతి ఉండాలో నియంత్రించగలడా? అది అతని ఇష్టమా? అసలు “ఆకాశ నక్షత్రములవలెను మరియు సముద్రతీరమందలి యిసుకవలెను” అన్నది కాదు, అతనికి అనేక సంతానమా కాదా అనేది కూడా మనిషి చేతుల్లో లేదు. తమ సంతానం నక్షత్రాలంత ఎక్కువ సంఖ్యలో ఉండాలని కోరుకోని వారెవరు? దురదృష్టవశాత్తు, మీరు కోరుకున్న విధంగా విషయాలు ఎల్లప్పుడూ జరగవు. మనిషి ఎంత నిపుణుడైనా లేదా సమర్ధుడైనా, అది అతని చేతుల్లో లేదు; దేవునిచే నియమించబడిన దాని వెలుపల ఎవరూ నిలబడలేరు. ఆయన నీకు ఎంత అనుమతిస్తాడో, అంతే నీవు కలిగి ఉంటావు: దేవుడు నీకు కొంచెం ఇస్తే, నీవు ఎప్పటికీ చాలా కలిగి ఉండవు, మరియు దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నీవు ఎంత కలిగి ఉన్నావో దానిని బట్టి ఆగ్రహం వ్యక్తము చేయడమువలన ప్రయోజనం లేదు. అంతేకదా? ఇదంతా మనిషి చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంది! మనిషి దేవునిచే పరిపాలించబడుతున్నాడు, మరియు ఎవరికీ మినహాయింపు లేదు!
“నీ సంతానమును విస్తరింప చేసెదను” అని దేవుడు చెప్పినప్పుడు, ఇది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇది మేఘ ధనుస్సు నిబంధనలాంటింది, ఇది నిత్యం ఉండేలా నెరవేర్చబడుతుంది మరియు ఇది కూడా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నిజం చేయడానికి దేవుడు మాత్రమే అర్హతను మరియు సమర్ధతను కలిగి ఉన్నాడు. మనిషి దానిని విశ్వసించినా, విశ్వసించకపోయినా, మనిషి దానిని అంగీకరించాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మరియు మనిషి దానిని ఎలా చూస్తాడు మరియు ఎలా పరిగణిస్తాడు అనే దానితో సంబంధం లేకుండా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఇవన్నీ అక్షరాలా నెరవేరుతాయి. మనిషి యొక్క సంకల్పంలోను లేదా ఆలోచనలలోను జరిగే మార్పులను బట్టి దేవుని మాటలు మారవు మరియు వ్యక్తిలోనైనా, సంఘటనలోనైనా లేదా ఏదేని విషయంలోనైనా జరిగే మార్పులను బట్టి అది మారదు. సమస్తము గతించిపోవచ్చు గాని దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. నిజానికి, ప్రతిదీ గతించే రోజునే దేవుని మాటలు పూర్తిగా నెరవేరుతాయి, ఎందుకంటే ఆయన సృష్టికర్తయైయున్నాడు, ఆయన సృష్టికర్త యొక్క అధికారాన్ని కలిగియున్నాడు, సృష్టికర్త యొక్క శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఆయన సమస్తమును మరియు సమస్త జీవుల బలమును నియంత్రిస్తాడు. ఆయన శూన్యం నుండి ఏదైనా వచ్చేలా చేయగలడు, లేదా దేనినైన శూన్యంగా మార్చగలడు మరియు ఆయన జీవించి ఉన్నదానిని మొదలుకొని చనిపోయిన వాటి వరకు అన్నిటి యొక్క మార్పులను నియంత్రిస్తాడు; దేవునికి, ఒకరి సంతానాన్ని విస్తరింపజేయడంకంటే సులభమైనది ఏదీ ఉండదు. ఇది ఒక కల్పిత కథలాగా మనిషికి అద్భుతంగా అనిపిస్తుంది, కానీ ఆయన చేయాలని నిర్ణయించుకున్నది మరియు వాగ్దానం చేసినది దేవునికి కల్పితం కాదు, ఇది కల్పిత కథ కాదు. దానికి బదులుగా, ఇది దేవుడు ఇప్పటికే చూసిన వాస్తవం మరియు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు దీనిని అభినందిస్తున్నారా? అబ్రహాము సంతతి లెక్కలేనంత మంది ఉన్నారని వాస్తవాలు రుజువు చేస్తున్నాయా? వారు ఎంత సంఖ్యలో ఉన్నారు? దేవుడు చెప్పిన “ఆకాశ నక్షత్రములవలె, సముద్రతీరమందలి యిసుకవలె” అనేకమంది ఉన్నారా? వారు అన్ని దేశాలు మరియు ప్రాంతాలలో, ప్రపంచంలోని ప్రతి ప్రదేశానికి విస్తరించారా? ఈ వాస్తవం దేనిని బట్టి నెరవేరింది? దేవుని మాటల అధికారాన్ని బట్టి అది నెరవేరిందా? దేవుని మాటలు చెప్పబడిన అనేక వందల వేల సంవత్సరాల వరకు, దేవుని మాటలు నెరవేరుతూనే ఉన్నాయి మరియు నిరంతరం వాస్తవాలుగా మారుతున్నాయి; ఇది దేవుని మాటల శక్తికి మరియు దేవుని అధికారానికి రుజువుగా ఉన్నది. దేవుడు ఆదియందు సమస్తాన్ని సృష్టించినప్పుడు, దేవుడు “వెలుగు కమ్మని” పలికాడు మరియు వెలుగు కలిగింది. ఇది చాలా త్వరగా జరిగింది, చాలా తక్కువ సమయంలో నెరవేరింది మరియు దాని సాఫల్యత మరియు నెరవేర్పులో ఆలస్యం లేదు; దేవుని మాటలు తక్షణమే ప్రభావం చూపాయి. రెండూ దేవుని అధికారాన్ని ప్రదర్శించేవి, కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు, ఆయన దేవుని అధికారం యొక్క గుణగణాలను గూర్చిన మరొక కోణాన్ని చూడడానికి మనిషిని అనుమతించాడు, అలాగే సృష్టికర్త యొక్క అధికారం లెక్కకు మించినది, అంతేకాకుండా, సృష్టికర్త అధికారానికి సంబంధించిన మరింత వాస్తవికమైన మరియు శ్రేష్ఠమైన పార్శ్వాన్ని చూడడానికి మనిషిని అనుమతించాడు.
దేవుని మాటలు పలికిన తర్వాత, దేవుని అధికారం ఈ పనిని ఆదేశిస్తుంది మరియు దేవుని నోటి ద్వారా వాగ్దానం చేయబడిన వాస్తవం క్రమంగా నిజరూపం దాల్చడం ప్రారంభమవుతుంది. తత్ఫలితంగా, వసంతకాలం రాగానే గడ్డి పచ్చగా మారడం, పూలు పూయడం, చెట్లు మొగ్గ తొడగడం, పక్షులు పాడడం, కొంగలు తిరిగి రావడం, పొలాలు ప్రజలతో నిండిపోవడం, ఇలా అన్ని విషయాల్లో మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. వసంతకాలం రాకతో అన్ని విషయాలు పునరుజ్జీవనం పొందుతాయి మరియు ఇది సృష్టికర్త యొక్క అద్భుత కార్యం. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు, పరలోకం మరియు భూమిపై ఉన్న సమస్త విషయాలు దేవుని ఆలోచనలకు అనుగుణంగా పునరుద్ధరించబడతాయి మరియు మార్పు చెందుతాయి, దేనికీ మినహాయింపు ఉండదు. దేవుని నోటి నుండి ఒక నిబంధన లేదా వాగ్దానం పలకబడినప్పుడు, ప్రతిదీ దాని నెరవేర్పు కోసం పని చేస్తాయి మరియు దానిని నెరవేర్చడానికి ప్రయాసపడతాయి; సమస్త జీవులు సృష్టికర్త యొక్క ఆధిపత్యం క్రింద ఏర్పాటు చేయబడ్డాయి మరియు అమర్చబడి ఉంటాయి, తమ సంబంధిత పాత్రను పోషిస్తాయి మరియు తమ సంబంధిత విధిని నిర్వహిస్తాయి. ఇది సృష్టికర్త అధికారానికి నిదర్శనం. ఇందులో నీవు ఏమి చూస్తున్నావు? నీవు దేవుని అధికారాన్ని ఎలా తెలుసుకుంటావు? దేవుని అధికారానికి పరిధి ఉందా? కాలపరిమితి ఉందా? ఇది ఇంత ఎత్తులో ఉందని, లేదా ఇంత పొడవుగా ఉందని చెప్పగలవా? ఇది ఇంత పరిమాణంలో ఉందని లేదా ఇంత ధృడంగా ఉందని చెప్పగలవా? మానవ కొలతలతో కొలవగలమా? దేవుని అధికారము చలించదు మరియు ఆగిపోదు, అది అలా వచ్చి పోదు మరియు ఆయన అధికారము ఎంత గొప్పదో కొలవగలవారు ఎవ్వరూ లేరు. ఎంత కాలం గడిచినా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, ఈ ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంటుంది మరియు దాని కొనసాగింపు దేవుని యొక్క అమూల్యమైన అధికారానికి నిదర్శనం మరియు ఇది సృష్టికర్త యొక్క తరిగిపోని జీవ శక్తిని మానవాళికి మళ్లీ మళ్లీ చూపిస్తుంది. ఆయన అధికారం కనబరిచిన ప్రతీది, ఆయన నోటి మాటలకు పరిపూర్ణ నిదర్శనమైయున్నది, ఇది సమస్త విషయాలకు మరియు మానవాళికి చూపించబడుతుంది. అంతేకాకుండా, ఆయన అధికారం ద్వారా నెరవేరిన ప్రతీది పోల్చజాలనిది మరియు పూర్తిగా దోషరహితమైనది. ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన అధికారం మరియు ఆయన చేసే పని అంతా పోల్చలేనంత అందమైన చిత్రం మరియు జీవుల విషయానికొస్తే, మానవాళి భాష దాని ప్రాముఖ్యతను మరియు విలువను వ్యక్తీకరింపజాలదు. దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేసినప్పుడు, వారు ఎక్కడ నివసిస్తారు, లేదా వారు ఏమి చేస్తారు, వాగ్దానం పొందక ముందు లేదా పొందిన తర్వాత వారి నేపథ్యం ఏమిటి లేదా వారి జీవితంలో ఎంతగా ఒడిదుడుకులు ఉన్నాయి, ఇలా వారికి సంబంధించిన ప్రతీది దేవునికి బాగా తెలుసు. దేవుని మాటలు పలికిన తర్వాత ఎంత కాలం గడిచినా సరే, ఆయన దృష్టిలో, అవి ఇప్పుడే పలికినట్లు. దేవుడు మానవాళికి చేసే ప్రతి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకోగల, నియంత్రించగల మరియు నెరవేర్చగల శక్తిని మరియు అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు వాగ్దానం ఏమిటి, అది పూర్తిగా నెరవేరడానికి ఎంత సమయం పడుతుంది, ఇంకా, దాని నెరవేర్పు ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుంది అనే విషయాలతో సంబంధము లేకుండా, ఉదాహరణకు, సమయం, భౌగోళికం, జాతి మరియు మొదలైన వాటితో సంబంధం లేకుండా ఈ వాగ్దానం క్రియారూపం దాలుస్తుంది మరియు నెరవేరుతుంది, అంతేకాకుండా, దానిని నిజం చేయడానికి మరియు నెరవేర్చడానికి ఆయన ఎటువంటి ప్రయాస పడనవసరం లేదు. ఇది దేనిని రుజువు చేస్తోంది? విశ్వం మొత్తాన్ని మరియు మానవాళిని అంతటిని నియంత్రించడానికి దేవుని అధికారం మరియు శక్తి యొక్క విస్తృతి సరిపోతుందని ఇది రుజువు చేస్తుంది. దేవుడు వెలుగును సృష్టించాడు, అయితే దాని అర్థం దేవుడు వెలుగును మాత్రమే నిర్వహిస్తాడని లేదా ఆయన నీటిని సృష్టించాడు కాబట్టి ఆయన నీటిని మాత్రమే నిర్వహిస్తాడని మరియు మిగతావన్నీ దేవునికి సంబంధం లేదని అర్థం కాదు. ఇది అపార్థం చేసుకునే విషయం కాదా? అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనేక వందల సంవత్సరాల తర్వాత మనిషి జ్ఞాపకశక్తి నుండి క్రమంగా చెరిగిపోయినప్పటికీ, దేవుని దృష్టిలో, ఈ వాగ్దానం ఇప్పటికీ అలాగే ఉంది. ఇది ఇప్పటికీ నెరవేరే ప్రక్రియలో ఉంది మరియు ఎన్నడూ ఆగలేదు. దేవుడు తన అధికారాన్ని ఎలా ప్రయోగించాడో, సమస్త విషయాలు ఎలా నిర్వహించబడ్డాయో మరియు ఏర్పరచబడ్డాయో మరియు ఈ సమయంలో దేవుని సృష్టిలోని సమస్త విషయాలకు సంబంధించి ఎన్ని అద్భుతమైన కథలు చోటు చేసుకున్నాయి మనిషికి ఎప్పుడూ తెలియదు లేదా ఎన్నడూ వినలేదు, కానీ దేవుని అధికారాన్ని కనబరిచే ప్రతి అద్భుతమైన అంశం మరియు ఆయన క్రియల ప్రత్యక్షత అన్నిటిలోను శ్రేష్ఠమైనవి మరియు అన్నిటిలో ఉన్నతమైనవి, సమస్త విషయాలు చూపించబడ్డాయి మరియు సృష్టికర్త యొక్క అద్భుత క్రియలను గూర్చి మాట్లాడాయి మరియు సమస్త విషయాలపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించి ఎక్కువగా చెప్పబడిన ప్రతీ కథను, సమస్త విషయాలు ఎప్పటికీ ప్రకటిస్తూనే ఉండాలి. సమస్తాన్ని పరిపాలించే దేవుని అధికారం, మరియు దేవుని శక్తి, దేవుడు ప్రతిచోటా మరియు అన్ని సమయాల్లోనూ ఉన్నాడని సమస్తానికి చూపుతుంది. నీవు దేవుని యొక్క అధికారం మరియు శక్తి సర్వత్రా ఉండడం చూసినప్పుడు, దేవుడు ప్రతిచోటా మరియు అన్ని సమయాలలో ఉన్నాడని నీవు చూస్తావు. దేవుని అధికారం మరియు శక్తి అనేవి సమయం, భౌగోళికం, స్థలం లేదా ఏదైనా వ్యక్తి, సంఘటన లేదా విషయం ద్వారా పరిమితం చేయబడవు. దేవుని అధికారం మరియు శక్తి యొక్క విస్తృతి అనేది మనిషి యొక్క ఊహకు మించియున్నది; ఇది మనిషికి అర్థంకానిది, మానవ ఊహకు అందనిది మరియు మనిషి ఎప్పటికీ దానిని పూర్తిగా తెలుసుకోలేడు.
కొంతమంది తర్కించడానికి మరియు ఊహించడానికి ఇష్టపడతారు, కానీ మనిషి ఊహ ఎంత వరకు వెళ్ళగలదు? అది ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళగలదా? దేవుని అధికారం యొక్క ప్రామాణికతను మరియు ఖచ్చితత్వాన్ని మానవుడు తర్కించగలడా మరియు ఊహించగలడా? మనిషి యొక్క తార్కికం మరియు ఊహ దేవుని అధికారాన్ని గురించిన జ్ఞానాన్ని పొందేలా చేయగలదా? అవి మనిషిని దేవుని అధికారాన్ని గుర్తించి లోబడేలా చేయగలవా? మనిషి యొక్క తార్కికం మరియు ఊహ కేవలం మనిషి యొక్క తెలివితేటల నుండి పుట్టినవని మరియు అవి దేవుని అధికారాన్ని గూర్చిన మనిషి యొక్క జ్ఞానానికి కాస్తయినా సహాయం అందించవని లేదా ప్రయోజనాన్ని అందించవని వాస్తవాలు రుజువు చేస్తున్నాయి. వైజ్ఞానిక కల్పన కధలను చదివిన తర్వాత, కొందరు చంద్రుడు లేదా నక్షత్రాలు ఎలా ఉంటాయో ఊహించుకోగలుగుతారు. అయినప్పటికీ, దీని అర్థం మనిషికి దేవుని అధికారం గురించి ఏదైనా అవగాహన ఉందని కాదు. మనిషి ఊహ అంత మాత్రమే: కేవలం ఊహ. ఈ విషయాల యొక్క వాస్తవాల గురించి, అంటే, దేవుని అధికారంతో వాటి సంబంధాన్ని గురించి, అతనికి ఏమాత్రం అవగాహన లేదు. నీవు చంద్రునిపైకి వెళ్లినంత మాత్రాన ఏం జరుగుతుంది? నీవు దేవుని అధికారం గురించి బహుముఖ అవగాహన కలిగి ఉన్నావని ఇది చూపుతుందా? నీవు దేవుని అధికారం మరియు శక్తి యొక్క విస్తృతిని ఊహించగలవని ఇది చూపుతుందా? మనిషి తన యొక్క తార్కికం మరియు ఊహతో దేవుని అధికారాన్ని తెలుసుకోలేక పోతున్నాడు కాబట్టి, మనిషి ఏమి చేయాలి? తర్కించడం, లేదా ఊహించడం వంటివి చేయకుండా ఉండటమే తెలివైన పని, అంటే దేవుని అధికారాన్ని తెలుసుకునే విషయంలో మనిషి ఎన్నడూ ఊహపై ఆధారపడకూడదు మరియు తర్కాన్ని ఆశ్రయించకూడదు. నేను మీకు ఇక్కడ ఏమి చెప్పాలనుకుంటున్నాను? దేవుని అధికారం, దేవుని శక్తి, దేవుని స్వంత గుర్తింపు మరియు దేవుని గుణగణాలను గూర్చిన జ్ఞానాన్ని నీ ఊహపై ఆధారపడటం ద్వారా పొందలేవు. దేవుని అధికారాన్ని తెలుసుకోవడానికి మీరు ఊహపై ఆధారపడలేరు కాబట్టి, మీరు ఏ విధంగా దేవుని అధికారం గురించి నిజమైన జ్ఞానాన్ని పొందగలరు? దేవుని మాటలను తిని త్రాగడం ద్వారా, దేవుని మాటలతో సహవాసం చేయడం ద్వారా మరియు దేవుని మాటలను అనుభవించడం ద్వారా మాత్రమే దీనికి ఏకైక మార్గం. ఆ విధంగా, మీరు దేవుని అధికారమును గూర్చి క్రమాగతమైన అనుభవం మరియు నిశ్చయతను కలిగి ఉంటారు మరియు మీరు దాని గురించి క్రమంగా అవగాహనను మరియు దశలవారీగా జ్ఞానాన్ని పొందుతారు. దేవుని అధికారాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి ఇదే ఏకైక మార్గం; ప్రత్యామ్నాయ మార్గాలు అనేవి లేవు. మిమ్మల్ని ఊహించుకోవద్దని మీకు చెప్పడం అంటే నాశనం కొరకు ఎదురుచూసేలా మిమ్మల్ని నిష్క్రియాత్మకంగా కూర్చోబెట్టడం లేదా ఏమీ చేయకుండా మిమ్మల్ని ఆపడం లాంటిది కాదు. ఆలోచించడానికి మరియు ఊహించడానికి మీ మస్తిష్కాన్ని ఉపయోగించకపోవడం అంటే ఊహించడానికి తర్కాన్ని ఉపయోగించకపోవడం, విశ్లేషించడానికి జ్ఞానాన్ని వాడకపోవడం, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాతిపదికంగా తీసుకోకపోవడం కాదు, దానికి బదులుగా నీవు విశ్వసించే దేవునికి అధికారం ఉందని గ్రహించడం, ధృవీకరించడం మరియు నిర్ధారించడం, ఆయన నీ విధిపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడని మరియు అన్ని సమయాలలో ఆయనే నిజమైన దేవుడని దేవుని మాటల ద్వారా, సత్యం ద్వారా, జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతిదాని ద్వారా నిరూపించడం. ఎవరైనా దేవుని గురించిన అవగాహనను పొందగల ఏకైక మార్గం ఇదే. కొందరు ఈ లక్ష్యాన్ని సాధించడానికి సులభమైన మార్గాన్ని కనుగొనాలని కోరుకుంటున్నామని చెప్తారు, కానీ మీరు అలాంటి మార్గం గురించి ఆలోచించగలరా? నేను నీకు చెప్తున్నాను, ఆలోచించాల్సిన అవసరం లేదు: వేరే మార్గాలు లేవు! దేవుడు ఏమైయున్నాడు మరియు ఏమి కలిగి ఉన్నాడు అనేది దేవుడు వ్యక్తపరిచే ప్రతి మాట మరియు ఆయన చేసే ప్రతిదానిని చిత్తశుద్ధితో మరియు స్థిరంగా తెలుసుకోవడం మరియు ధృవీకరించడం మాత్రమే ఏకైక మార్గం. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఎందుకంటే దేవుడు ఏమైయున్నాడు మరియు ఏమి కలిగి ఉన్నాడు మరియు దేవునికి సంబంధించిన ప్రతీది బూటకం కాదు మరియు శూన్యమైనది కాదు, కానీ వాస్తవమైనది.
సమస్తముపైన మరియు జీవులన్నిటిపైన సృష్టికర్త యొక్క నియంత్రణ మరియు ఆధిపత్యాన్ని గూర్చిన వాస్తవం సృష్టికర్త అధికారం యొక్క నిజమైన ఉనికిని గూర్చి మాట్లాడుతోంది.
అదేవిధంగా, యెహోవా యోబును ఆశీర్వదించడం గురించి యోబు గ్రంధంలో నమోదు చేయబడింది. దేవుడు యోబుకు ఏమి ప్రసాదించాడు? “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను” (యోబు 42:12). మనిషి దృష్టిలో, యోబుకు ఇవ్వబడిన ఇవన్నీ ఏమైయుండెను? అవి మానవజాతికి సంబంధించిన ఆస్తులా? ఈ ఆస్తులతో, ఆ వయస్సులో యోబు చాలా ధనవంతుడు కాలేడా? మరి అంత ఆస్తులు ఆయన ఎలా సంపాదించాడు? అతని సంపదకు కారణమేమిటి? ఇది చెప్పనవసరం లేదు, దేవుని ఆశీర్వాదంవల్ల యోబు వాటిని సొంతం చేసుకున్నాడు. యోబు ఈ ఆస్తులను ఎలా చూశాడు మరియు దేవుని ఆశీర్వాదాలను ఎలా పరిగణించాడు అనేది మనం ఇక్కడ చర్చించే విషయం కాదు. దేవుని ఆశీర్వాదం విషయానికి వస్తే, ప్రజలందరూ దేవుని ఆశీర్వాదం కోసం పగలు మరియు రాత్రి ప్రయాసపడుతుంటారు, అయినప్పటికీ మనిషి తన జీవితకాలంలో ఎన్ని ఆస్తులు సంపాదించగలడు లేదా అతను దేవుని నుండి ఆశీర్వాదాలు పొందగలడా లేదా అనే దానిపై అతనికి నియంత్రణ లేదు, ఇది కాదనలేని వాస్తవం! మనిషికి ఏదైనా ఆస్తులను ప్రసాదించడానికి, మనిషికి ఏదైనా ఆశీర్వాదం పొందేందుకు వీలు కల్పించడానికి దేవునికి అధికారం మరియు శక్తి ఉంది, అయినప్పటికీ దేవుని ఆశీర్వాదాలకు ఒక సూత్రం ఉంది. దేవుడు ఎలాంటి వ్యక్తులను ఆశీర్వదిస్తాడు? తాను ఇష్టపడే వ్యక్తులను ఆయన ఆశీర్వదిస్తాడు, అంతేకదా! అబ్రహాము మరియు యోబు ఇద్దరూ దేవునిచే ఆశీర్వదించబడ్డారు, అయినప్పటికీ వారు పొందిన ఆశీర్వాదాలు ఒకేలా లేవు. దేవుడు అబ్రహామును ఇసుకవంటి మరియు నక్షత్రాలవంటి అనేకమంది సంతానంతో ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు, ఆయన ఒక మనిషిని మరియు ఒక జనముకు చెందిన సంతానాన్ని శక్తివంతంగా మరియు సంపన్నులుగా మార్చాడు. ఇందులో, సృష్టించబడిన సమస్త జీవులు మరియు జీవరాసుల మధ్య తన జీవవాయువును ఊదిన దేవుని అధికారము మానజాతిని పరిపాలించింది. దేవుని అధికారపు సార్వభౌమాధికారం క్రింద, ఈ మానవజాతి విస్తరించింది మరియు దేవుడు నిర్ణయించిన వేగంతో మరియు దేవుడు నిర్ణయించిన పరిధిలో ఉనికిని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ జనము యొక్క జీవన సామర్థ్యత, విస్తరణపు అంచనా మరియు ఆయుర్దాయం అన్నీ దేవుని ఏర్పాట్లలో భాగమే మరియు వీటన్నింటి సూత్రం పూర్తిగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానంపై ఆధారపడి ఉంది. దీనర్థం ఏమిటంటే, పరిస్థితులతో సంబంధం లేకుండా, దేవుని వాగ్దానాలు నిరంతరాయంగా కొనసాగుతాయి మరియు దేవుని అధికారపు మార్గదర్శకత్వం క్రింద నెరవేరుతాయి. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ప్రకారం, ప్రపంచంలోని ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, మానవజాతి ఎదుర్కొనే విపత్తులతో సంబంధం లేకుండా, అబ్రహాము సంతతి వినాశనానికి గురి కాదు మరియు వారి జనము అంతరించిపోదు. అయితే, దేవుడు యోబుకు ఇచ్చిన ఆశీర్వాదం అతన్ని అత్యంత ధనవంతుడిని చేసింది. దేవుడు అతనికి జీవనాధారమును, శ్వాసగల జీవుల శ్రేణిని, వాటి సంఖ్య యొక్క వివరాలను, అవి వ్యాప్తి చెందే వేగం, మనుగడకు సంబంధించిన అంచనాలను, వాటి శరీరంలోని కొవ్వు పరిమాణాన్ని మరియు మొదలైనవాటిని ఇచ్చాడు. ఇవన్నీ దేవునిచేత నియంత్రించబడతాయి. ఈ జీవులకు మాట్లాడే సామర్థ్యం లేకపోయినా, అవి కూడా సృష్టికర్త యొక్క ఏర్పాట్లలో భాగమే, వాటి కోసం దేవుని ఏర్పాట్ల వెనుక ఉన్న సూత్రం, దేవుడు యోబుకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాల ఆధారంగా చేయబడింది. దేవుడు అబ్రహాము మరియు యోబుకు ఇచ్చిన ఆశీర్వాదాలలో చేయబడిన వాగ్దానం భిన్నంగా ఉన్నప్పటికీ, సృష్టించబడిన సమస్తమును మరియు జీవులను పరిపాలించిన సృష్టికర్త అధికారం ఒకటే. దేవుని అధికారం మరియు శక్తిని గూర్చిన ప్రతి వివరమంతయు దేవుడు అబ్రహాము మరియు యోబులకు చేసిన విభిన్న వాగ్దానాలు మరియు ఆశీర్వాదాలలో వ్యక్తీకరించబడ్డాయి మరియు దేవుని అధికారం మానవుని ఊహకు మించినది అని మరోసారి మానజాతికి చూపబడింది. మనిషి దేవుని అధికారాన్ని తెలుసుకోవాలనుకుంటే, అది దేవుని మాటల ద్వారా మరియు దేవుని పనిని అనుభవించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మరోసారి మానవజాతికి ఈ వివరాలన్నియు చెబుతున్నాయి.
సమస్తముపైన ఉన్నటువంటి దేవుని సార్వభౌమాధికారం మనిషి ఒక వాస్తవాన్ని చూసేలా చేస్తుంది: దేవుని అధికారం “దేవుడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, విశాలము కమ్మని పలుకగా విశాలము కలిగెను, నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను” అనే మాటలలో వ్యక్తమవ్వడమే మాత్రమే కాకుండా, ఆయన అధికారం ఆయన వెలుగును ఎలా కొనసాగేలా చేసాడో, విశాలము అదృశ్యం కాకుండా ఎలా నిరోధించాడో మరియు నేలను జలముల నుండి ఎప్పటికీ ఎలా వేరుగా ఉంచాడో, అలాగే ఆయన సృష్టించిన వెలుగు, విశాలము మరియు నేలను ఎలా పరిపాలించాడు మరియు ఎలా నిర్వహించాడు అనే వివరాలలో కూడా వ్యక్తమయింది. దేవుడు మానవాళిని ఆశీర్వదించడంలో మీరు ఇంకా ఏమి చూస్తున్నారు? స్పష్టంగా, దేవుడు అబ్రహామును మరియు యోబును ఆశీర్వదించిన తర్వాత, దేవుని అడుగులు ఆగిపోలేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడే తన అధికారాన్ని అమలు చేయడం ప్రారంభించాడు మరియు ఆయన తన ప్రతి మాటను నిజం చేయాలని మరియు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కటి క్రియా రూపం దాల్చాలని ఉద్దేశించాడు, అందువలన, తదుపరి సంవత్సరాలలో, ఆయన అనుకున్నదంతా చేయడం కొనసాగించాడు. దేవునికి అధికారం ఉన్నందున, దేవుడు మాట్లాడితే చాలు, కనీసం వేలు కూడా కదపనవసరం లేదు, సమస్త విషయాలు, సమస్త కార్యాలు నెరవేరుతాయి అని మనిషికి అనిపించవచ్చు. అలాంటి ఊహలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంటాయి! నీవు కేవలం మాటలను ఉపయోగించి మనిషితో దేవుడు చేసిన నిబంధనను మరియు మాటలను ఉపయోగించి దేవుడు ప్రతిదానిని నెరవేర్చడం గురించి ఏకపక్ష దృక్పథాన్ని మాత్రమే తీసుకుంటే, దేవుని అధికారం సమస్త విషయాల ఉనికిపై ఆధిపత్యం కలిగి ఉందని తెలిపే వివిధ సంకేతాలను మరియు వాస్తవాలను చూడలేవు, అప్పుడు దేవుని అధికారాన్ని గూర్చిన నీ అవగాహన చాలా అర్థరహితంగాను మరియు హాస్యాస్పదంగాను ఉంటుంది! మనిషి దేవుణ్ణి అలా ఊహించుకుంటే, అప్పుడు, దేవుని గురించిన మనిషికున్న జ్ఞానం చివరి ప్రయత్నానికి నడిపించబడిందని మరియు అంతిమ దశకు చేరుకుందని అర్థం, ఎందుకంటే మనిషి ఊహించుకునే దేవుడు ఎవరంటే ఆదేశాలు జారీ చేసే యంత్రమే గాని అధికారం కలిగి ఉన్న దేవుడు కాదని చెప్పవలసి ఉంటుంది. అబ్రహాము మరియు యోబు ఉదాహరణల ద్వారా నీవు ఏమి చూశావు? దేవుని అధికారం మరియు శక్తి యొక్క నిజమైన కోణాన్ని నీవు చూశావా? దేవుడు అబ్రహాము మరియు యోబులను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు తాను ఉన్న చోటనే ఆగిపోలేదు లేదా ఫలితం ఎలా ఉంటుందోనని వేచి చూస్తూ ఆయన తన దూతలను పనిలో పెట్టలేదు. దానికి భిన్నంగా, దేవుడు తన మాటలను ఉచ్చరించిన వెంటనే, దేవుని అధికారం యొక్క మార్గదర్శకత్వంలో, దేవుడు చేయాలనుకున్న పనికి తగినట్టుగా సృష్టించబడిన సమస్తము కట్టుబడి ఉండటం ప్రారంభించాయి మరియు దేవుడు కోరుకున్న ప్రజలు, విషయాలు మరియు వస్తువులు అక్కడ సిద్ధం చేయబడ్డాయి. దీనర్థం ఏమిటంటే, దేవుని నోటి నుండి మాటలు వెలువడిన వెంటనే, దేవుని అధికారం భూమి అంతటా అమలు కావడం మొదలయ్యింది మరియు ఆయన అబ్రహాము మరియు యోబుకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి మరియు నిజం చేయడానికి ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆయన తాను చేయదలుచుకున్న పని యొక్క ప్రతి దశకు మరియు ప్రతి కీలక స్థాయికి అవసరమైన సమస్త సముచిత ప్రణాళికలు మరియు సన్నాహాలను కూడా సిద్ధం చేశాడు. ఈ సమయంలో దేవుడు తన దూతలను మాత్రమే కాకుండా, తన చేత సృష్టించబడిన సమస్త విషయాలను కూడా ఉపయోగించాడు. దీనిని బట్టి, దేవుని అధికారాన్ని ప్రయోగించే పరిధిలో కేవలం దూతలు మాత్రమే కాకుండా, సృష్టిలోని సమస్త విషయాలు, ఆయన నెరవేర్చడానికి ఉద్దేశించిన కార్యానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి అని చెప్పవచ్చు; ఇవి దేవుని అధికారాన్ని ప్రయోగించే నిర్దిష్ట పద్ధతులు. మీలో కొంతమంది ఊహించుకునే ఊహలలో దేవుని అధికారం గురించి ఈ విధమైన అవగాహన కలిగి ఉండవచ్చు: దేవునికి అధికారం ఉంది మరియు దేవునికి శక్తి ఉంది, కాబట్టి దేవుడు మూడవ ఆకాశములో లేదా ఒక స్థిరమైన ప్రదేశంలో మాత్రమే ఉండవలసి ఉంటుంది మరియు ప్రత్యేకించి ఏ పని చేయనవసరం లేదు మరియు దేవుని పని మొత్తం ఆయన ఆలోచనల్లోనే పూర్తవుతుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పటికీ, దేవుడు ఏమీ చేయనవసరం లేదని మరియు ఆయన కేవలం తన మాటలు పలికితే సరిపోతుందని కూడా కొందరు విశ్వసించవచ్చు. నిజంగా జరిగింది ఇదేనా? కానే కాదు! దేవుడు అధికారం మరియు శక్తిని కలిగి ఉన్నప్పటికీ, ఆయన అధికారం సత్యమైనది మరియు నిజమైనది, అది నిరర్థకం కాదు. దేవుని అధికారం మరియు శక్తి యొక్క ప్రామాణికత మరియు వాస్తవికత క్రమంగా వెల్లడి అవుతాయి మరియు ఆయన సృష్టించిన అన్ని విషయాలలో, అన్ని విషయాలపై ఆయనకున్న నియంత్రణలో మరియు మానవజాతిని ఆయన నడిపించే మరియు నిర్వహించే ప్రక్రియలో వ్యక్తమవుతాయి. మానవజాతిపై మరియు సృష్టించబడిన సమస్తముపైన దేవుని సార్వభౌమాధికారాన్ని గూర్చిన ప్రతి పద్ధతి, ప్రతి దృక్పథం మరియు ప్రతి వివరం మరియు ఆయన నెరవేర్చిన పని అంతా, అలాగే సమస్తముపైన ఆయనకున్న అవగాహన అనే విషయాలన్నీ అక్షరాలా దేవుని అధికారం మరియు దేవుని శక్తి అని, కేవలం నిరర్థకమైన మాటలు కాదని నిరూపిస్తున్నాయి. ఆయన అధికారం మరియు ఆయన శక్తి నిరంతరం అన్ని విషయాలలో చూపబడ్డాయి మరియు ప్రత్యక్షపరచబడ్డాయి. ఈ వ్యక్తీకరణలు మరియు ప్రత్యక్షతలు దేవుని అధికారం యొక్క నిజమైన ఉనికి గురించి మాట్లాడుతున్నాయి, ఎందుకంటే ఆయన తన కార్యమును కొనసాగించడానికి మరియు సృష్టించబడిన సమస్తమును ఆదేశించడానికి మరియు ప్రతి అణువణువున సృష్టించబడిన సమస్తాన్ని పరిపాలించడానికి తన అధికారాన్ని మరియు ఆయన శక్తిని ఉపయోగిస్తున్నాడు; ఆయన శక్తిని మరియు ఆయన అధికారాన్ని దూతలు గాని, లేదా దేవుని రాయభారులు గాని భర్తీ చేయలేరు. దేవుడు అబ్రహాముకు మరియు యోబుకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలో నిర్ణయించుకున్నాడు, ఇది దేవుని నిర్ణయం. దేవుని దూతలు అబ్రహాము మరియు యోబులను వ్యక్తిగతంగా సందర్శించినప్పటికీ, వారి చర్యలు దేవుని ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నాయి మరియు వారి చర్యలు దేవుని అధికారానికి లోబడి ఉన్నాయి మరియు అదేవిధంగా, దూతలు దేవుని సార్వభౌమాధికారం క్రింద ఉన్నారు. దేవుని దూతలు అబ్రహామును సందర్శించడాన్ని మానవుడు చూసినప్పటికీ, యెహోవా దేవుడు ప్రత్యక్షంగా ఏదైనా చేయడం అనేది బైబిల్లో నమోదు చేయబడినట్టు లేదు. వాస్తవానికి, శక్తిని మరియు అధికారాన్ని నిజంగా ప్రయోగించగలిగిన ఏకైక వ్యక్తి దేవుడే, మరియు ఈ విషయంలో ఎవ్వరికీ సందేహం ఉండనక్కర్లేదు! దేవదూతలు మరియు రాయభారులు గొప్ప శక్తిని కలిగి ఉండడం మరియు అద్భుతాలు చేయడం, లేదా వారు దేవుడు అప్పగించిన కొన్ని పనులను చేయడం నీవు చూసినప్పటికీ, వారి చర్యలు కేవలం దేవుని అప్పగించిన పనిని పూర్తి చేయడం వరకే మరియు ఏ విధంగానూ అది దేవుని అధికారాన్ని ప్రదర్శించడం కాదు. సమస్తాన్ని సృష్టించే మరియు అన్నిటినీ పరిపాలించే సృష్టికర్త యొక్క అధికారం, ఏ మనిషికి లేదు, లేదా ఎటువంటి వస్తువుకు లేదు. కాబట్టి, ఏ మనిషియైనా, లేదా ఏ వస్తువైనా సృష్టికర్త యొక్క అధికారాన్ని ప్రయోగించలేవు, లేదా ప్రదర్శించలేవు.
సృష్టికర్త యొక్క అధికారం మార్పులేనిది మరియు తప్పుపట్టలేనిది
లేఖనంలోని ఈ మూడు భాగాలలో మీరు ఏమి చూశారు? దేవుడు తన అధికారాన్ని అమలు చేసే నియమం ఉందని మీరు చూశారా? ఉదాహరణకు, దేవుడు మానవునితో నిబంధనను స్థాపించడానికి మేఘ ధనస్సును ఉపయోగించాడు, లోకాన్ని నాశనం చేయడానికి ఆయన ఇకపై జలములను ఉపయోగించనని మనిషికి చెప్పడానికి ఆయన మేఘాలలో ధనస్సును ఉంచాడు. నేటికీ ప్రజలు చూస్తున్న ఇంద్రధనస్సు దేవుని నోటి నుండి పలికినదేనా? దాని స్వభావం మరియు అర్థం మారిందా? మారలేదని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ పనిని చేయడానికి దేవుడు తన అధికారాన్ని ఉపయోగించాడు మరియు ఆయన మనిషితో ఏర్పరచుకున్న నిబంధన నేటి వరకు కొనసాగుతోంది మరియు ఈ నిబంధన మార్చబడే సమయం, వాస్తవానికి, దేవుని చేతుల్లో ఉంది. “మేఘములో నా ధనుస్సును ఉంచితిని” అని దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు ఈ నిబంధనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాడు, ఈ రోజు వరకు కూడా కట్టుబడియున్నాడు. దీనిలో నీవు ఏమి చూస్తున్నావు? దేవుడు అధికారమును మరియు శక్తిని కలిగి ఉన్నప్పటికీ, ఆయన తన పనుల విషయంలో చాలా ఖచ్చితంగా మరియు న్యాయంగా ఉంటాడు మరియు తన మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయన ఖచ్చితత్వం మరియు న్యాయంగా ఉండే ఆయన చర్యలు, సృష్టికర్త యొక్క తప్పుపట్టలేనితనాన్ని మరియు సృష్టికర్త అధికారం యొక్క ప్రత్యేకతను చూపుతాయి. ఆయన సర్వోన్నతమైన అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ మరియు ప్రతీది ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ మరియు ఆయన సమస్త విషయాలను పరిపాలించే అధికారం కలిగి ఉన్నప్పటికీ, దేవుడు తన స్వంత ప్రణాళికను ఎన్నడూ నాశనం చేయలేదు లేదా భంగపరచలేదు మరియు ఆయన తన అధికారాన్ని ప్రయోగించిన ప్రతిసారీ, అది ఖచ్చితంగా ఆయన స్వంత నియమాలకు అనుగుణంగా ఉంటుంది మరియు ఆయన నోటి నుండి పలికిన దానిని తప్పక అనుసరిస్తుంది మరియు ఆయన ప్రణాళిక యొక్క దశలు మరియు లక్ష్యాలను అనుసరిస్తుంది. దేవునిచే పరిపాలించబడే సృష్టించబడిన సమస్తము కూడా దేవుని అధికారం యొక్క సూత్రాలకు కట్టుబడి ఉంటాయని చెప్పనవసరం లేదు మరియు ఎటువంటి మనిషి గాని, లేదా వస్తువు గాని ఆయన అధికారం యొక్క ఏర్పాట్ల నుండి మినహాయించబడడం అసాధ్యం, లేదా అధికారమును అమలు చేయడానికి ఆయన ఉపయోగించిన సూత్రాలను మనిషి గాని లేక ఎటువంటి వస్తువు గాని మార్చడం అసాధ్యం. దేవుని దృష్టిలో ఆశీర్వాదం పొందిన వారు ఆయన అధికారాన్ని బట్టి వచ్చిన ఐశ్వర్యాన్ని పొందుతారు మరియు శపించబడిన వారు దేవుని అధికారం కారణంగా శిక్షను అనుభవిస్తారు. దేవుని అధికారం యొక్క సార్వభౌమాధికారం క్రింద, ఏ మనిషి మినహాయించబడడు, లేదా ఏ విషయం ఆయన అధికార అమలు నుండి మినహాయించబడదు, లేదా ఆయన అధికార సూత్రాలను అవి మార్చలేవు. సృష్టికర్త యొక్క అధికారం ఏ విధమైన మార్పులకు అనుగుణంగా సవరించబడదు మరియు అదే విధంగా, ఆయన అధికారం యొక్క సూత్రాలు ఏ కారణం చేతనైనా మార్చబడవు. ఆకాశం మరియు భూమి ఎన్నో ఒడిదుడుకులకు గురికావచ్చు, కానీ సృష్టికర్త యొక్క అధికారం మారదు; సమస్త విషయాలు గతించిపోవచ్చు, కానీ సృష్టికర్త యొక్క అధికారం ఎప్పటికీ గతించిపోదు. ఇది సృష్టికర్త యొక్క మార్పులేని మరియు తప్పుపట్టలేని అధికారం యొక్క గుణగణాలు మరియు ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేకతయై ఉన్నది!
దేవుని అధికారాన్ని తెలుసుకోవటానికి ఈ క్రింది మాటలు చాలా అవసరం, మరియు వాటి అర్థం క్రింద ఉన్న సహవాసంలో చెప్పబడింది. మనం లేఖనాన్ని చదవడం కొనసాగిద్దాం.
4. సాతానుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ
అందుకు యెహోవా—అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను (యోబు 2:6)
సృష్టికర్త యొక్క అధికారాన్ని అతిక్రమించడానికి సాతాను ఎన్నడూ సాహసించలేదు, దీని కారణంగా, సృష్టించబడిన సమస్తము ఒక క్రమంలో ఉన్నాయి
ఇది యోబు గ్రంధం నుండి సంగ్రహించబడింది మరియు ఈ మాటల్లోని “అతడు” అనే పదం యోబును సూచిస్తుంది. క్లుప్తంగా, ఈ వాక్యం అనేక విషయాలను వివరిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు మరియు సాతాను మధ్య జరిగే నిర్దిష్ట పరస్పర సంభాషణను వివరిస్తుంది మరియు దేవుని మాటల యొక్క లక్ష్యం సాతాను అని చెబుతుంది. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చెప్పిన దానిని కూడా నమోదు చేయడం జరిగింది. దేవుని మాటలు సాతానుకు ఒక ఆజ్ఞ మరియు ఆదేశములైయున్నవి. ఈ ఆదేశం యొక్క నిర్దిష్ట వివరాలు యోబు ప్రాణాన్ని ముట్టకుండా ఉండడానికి సంబంధించినవి మరియు యోబు విషయంలో సాతాను ఎంత మేరకు వ్యవహరించాలో దేవుడు ఒక గీత గీసాడు, అంటే సాతాను యోబు ప్రాణాన్ని ముట్టకుండా ఉండవలసి వచ్చింది. ఈ వాక్యం నుండి మనం నేర్చుకునే మొదటి విషయం ఏమిటంటే, ఇవి దేవుడు సాతానుతో మాట్లాడిన మాటలు. యోబు గ్రంధం యొక్క అసలైన కథనం ప్రకారం, ఇది అటువంటి మాటల నేపథ్యాన్ని మనకు తెలియజేస్తుంది: సాతాను యోబును నిందించాలనుకున్నాడు, కాబట్టి అతనిని శోధించడానికి ముందు సాతాను దేవుని దగ్గర ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి వచ్చింది. యోబును శోధించడానికి సాతాను చేసిన అభ్యర్థనను అంగీకరించినప్పుడు, “యోబు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు” అనే షరతును దేవుడు సాతాను ముందుంచాడు. ఈ మాటల స్వభావము ఏమిటి? అవి స్పష్టంగా ఆజ్ఞగాను, ఆదేశంగాను ఉన్నాయి. ఈ మాటల స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఈ ఆదేశాన్ని జారీ చేసిన వ్యక్తి దేవుడని మరియు ఈ ఆదేశాన్ని స్వీకరించి, దానిని పాటించినది సాతాను అని కూడా నీవు గ్రహించాలి. ఈ ఆదేశంలో దేవునికి, సాతానుకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో ఈ మాటలు చదివిన ఎవరికైనా స్పష్టంగా కనిపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి, ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవునికి మరియు సాతానుకు మధ్య ఉన్న సంబంధమైయున్నది, దేవుడు మరియు సాతాను యొక్క గుర్తింపు మరియు స్థాయి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి లేఖనాలలో దేవుడు మరియు సాతాను మధ్య జరిగిన సంభాషణలో నమోదు చేయబడింది. ఈ రోజు వరకు ఉన్నటువంటి దేవుడు మరియు సాతాను యొక్క గుర్తింపు మరియు స్థాయి మధ్య ఉన్న ఈ స్పష్టమైన వ్యత్యాసాన్ని మనిషి నిర్దిష్ట ఉదాహరణలోనుండి మరియు నమోదు చేయబడిన మాటల నుండి తెలుసుకోవచ్చు. ఈ సమయంలో దేవుని యొక్క గుర్తింపు మరియు స్థాయి గురించి మానవజాతికి ఉన్న జ్ఞానానికి సంబంధించి ఈ మాటలను నమోదు చేయడం అనేది ఒక ముఖ్యమైన ప్రమాణ పత్రం అని నేను తప్పక చెప్పాలి మరియు దేవుని గూర్చి మానవజాతికి ఉన్న జ్ఞానానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో సృష్టికర్త మరియు సాతాను మధ్య ఈ పరస్పర సంభాషణ జరిగినప్పటికీ, మనిషి సృష్టికర్త యొక్క అధికారానికి సంబంధించి మరొక నిర్దిష్ట అంశాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ మాటలు సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికారానికి మరో సాక్ష్యంగా ఉన్నాయి.
పైకి చూడడానికి, యెహోవా దేవుడు సాతానుతో సంభాషిస్తున్నాడు. ఆ మాటల సారాంశంలో, యెహోవా దేవుడు మాట్లాడే దృక్పథం మరియు ఆయన స్థాయి సాతాను కంటే ఉన్నతంగా ఉన్నాయి. దీనర్థం ఏమిటంటే, యెహోవా దేవుడు సాతానుకు ఆదేశం ఇస్తున్నాడు మరియు ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో సాతానుకు చెబుతున్నాడు, యోబు ఇప్పటికే అతని వశమున ఉన్నాడు, కాబట్టి యోబుతో తనకు నచ్చిన విధంగా వ్యవహరించవచ్చు కానీ యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు. అంతరార్థం ఏమిటంటే, యోబును సాతాను వశములో ఉంచినప్పటికీ, అతని ప్రాణం సాతానుకు అప్పగించబడలేదు; దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరూ యోబు ప్రాణాన్ని దేవుని చేతిలో నుండి తీసుకోలేరు. సాతానుకు ఇచ్చిన ఈ ఆజ్ఞలో దేవుని వైఖరి స్పష్టంగా వ్యక్తీకరించబడింది మరియు ఈ ఆజ్ఞ కూడా యెహోవా దేవుడు సాతానుతో సంభాషిస్తున్నప్పుడు వ్యక్తీకరించబడింది మరియు వెల్లడయ్యింది. ఇందులో, వెలుగు, గాలి మరియు సమస్త విషయాలతోపాటు సృష్టించబడిన జీవరాసులపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న దేవుని స్థాయిని యెహోవా దేవుడు కలిగి ఉండడం మాత్రమే కాకుండా, మానవాళిని మరియు పాతాళలోకమును ఆదేశించే, సమస్త జీవరాసుల జీవమరణములను నియంత్రించే దేవుడై ఉన్నాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు కాకుండా సాతానుకు అలాంటి ఆదేశాన్ని జారీ చేయడానికి ఎవరు సాహసిస్తారు? మరియు దేవుడు సాతానుకు వ్యక్తిగతంగా తన ఆదేశాన్ని ఎందుకు జారీ చేశాడు? ఎందుకంటే యోబుతో సహా మనిషి ప్రాణం దేవునిచేతుల్లో ఉంది. సాతాను యోబు ప్రాణాన్ని ముట్టడానికి దేవుడు అనుమతించలేదు మరియు యోబును శోధించడానికి దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చినప్పటికీ, దేవుడు ప్రత్యేకంగా అలాంటి ఆజ్ఞను జారీ చేయడాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు యోబు ప్రాణాన్ని ముట్టవద్దని మరోసారి సాతానుకు ఆజ్ఞాపించాడు. దేవుని అధికారాన్ని సాతాను అతిక్రమించడానికి ఎన్నడూ సాహసించలేదు, అంతేకాకుండా, ఎల్లప్పుడూ దేవుని ఆదేశాలను మరియు నిర్దిష్టమైన ఆజ్ఞలను జాగ్రత్తగా వింటూ, పాటించింది, వాటిని ధిక్కరించే ధైర్యం ఎన్నడూ చేయదు మరియు దేవుని ఆదేశాలను తనకు నచ్చినట్టుగా మార్చే సాహసం కూడా చేయదు. దేవుడు సాతానుకు అలాంటి పరిమితులు నిర్ధేశించాడు, కాబట్టి సాతాను ఈ పరిమితులను దాటడానికి ఎప్పుడూ సాహసించలేదు. ఇది దేవుని అధికారం యొక్క శక్తి కాదా? ఇది దేవుని అధికారానికి నిదర్శనం కాదా? దేవునిపట్ల ఎలా ప్రవర్తించాలో మరియు దేవుణ్ణి ఎలా చూడాలో మానవజాతికంటే సాతానుకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది, కాబట్టి, ఆధ్యాత్మిక ప్రపంచంలో, దేవుని స్థాయిని మరియు అధికారాన్ని సాతాను చాలా స్పష్టంగా చూశాడు మరియు దేవుని అధికారం యొక్క శక్తి మరియు ఆయన అధికారాన్ని అమలు చేయడం వెనుక ఉన్న సూత్రాల గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నాడు. అది వాటిని ఎంతమాత్రం విస్మరించే ధైర్యం చేయదు, లేదా వాటిని ఏ విధంగానైనా ఉల్లంఘించే ధైర్యం చేయదు, లేదా దేవుని అధికారాన్ని అతిక్రమించే పనిని చేయదు మరియు దేవుని ఉగ్రతను ఏ విధంగానూ సవాలు చేయడానికి సాహసించదు. అది చెడ్డ స్వభావముతోను మరియు దురహంకార స్వభావంతోను ఉన్నప్పటికీ, దేవుడు దాని కోసం నిర్దేశించిన సరిహద్దులను మరియు పరిమితులను దాటడానికి సాతాను ఎన్నడూ సాహసించలేదు. లక్షలాది సంవత్సరాలుగా అది ఈ సరిహద్దులకు ఖచ్చితంగా కట్టుబడి ఉంది, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు మరియు ప్రతి ఆదేశానికి కట్టుబడి ఉంది మరియు గీత దాటడానికి ఎప్పుడూ సాహసించలేదు. ఇది దుర్మార్గమైనది అయినప్పటికీ, చెడిపోయిన మానవజాతి కంటే సాతాను చాలా తెలివైనది; దానికి సృష్టికర్త యొక్క గుర్తింపు తెలుసు మరియు దానికి నియమించబడిన సరిహద్దులు తెలుసు. దేవుని అధికారం మరియు శక్తి అనేవి సాతాను అతిక్రమించలేని పరలోక శాసనాలు అని, దేవుని యొక్క ప్రత్యేకత మరియు అధికారం కారణంగానే సమస్త విషయాలు ఒక క్రమ పద్ధతిలో మారతాయి మరియు వ్యాప్తి చెందుతాయి అని, దేవుడు ఏర్పరచిన మార్గంలో మానవజాతి బ్రతికి విస్తరిస్తుంది అని, ఏ వ్యక్తి లేదా ఏ వస్తువు కూడా ఈ క్రమాన్ని భంగపరచలేదు అని, ఏ వ్యక్తికి లేదా ఏ వస్తువుకు ఈ నియమాన్ని మార్చగల సామర్థ్యం లేదు అని సాతాను యొక్క “విధేయత” చర్యల ద్వారా చూడవచ్చు. ఎందుకంటే అవన్నీ సృష్టికర్త చేతుల నుండే వస్తాయి మరియు సృష్టికర్త యొక్క క్రమం మరియు అధికారాల నుండే కలుగుతాయి.
సృష్టికర్త యొక్క గుర్తింపు ఉన్న దేవుడు మాత్రమే ప్రత్యేకమైన అధికారాన్ని కలిగి ఉంటాడు
సాతానుకు ఉన్న ప్రత్యేక గుర్తింపు కారణంగా అనేక మంది ప్రజలు వివిధ అంశాలలో దాని వ్యక్తీకరణల మీద విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. సాతాను అద్భుతాలను చేయగలడు మరియు మానవాళికి అసాధ్యమైన పనులను చేయగలడు కాబట్టి, దేవునిలాగే సాతాను కూడా అధికారం కలిగి ఉన్నాడని నమ్మే చాలా మంది మూర్ఖులు కూడా ఉన్నారు. ఆ విధంగా, దేవుణ్ణి ఆరాధించడంతోపాటు, మానవజాతి తన హృదయంలో సాతానుకు కూడా ఒక స్థానాన్ని కేటాయించింది మరియు సాతానును కూడా దేవునిగా ఆరాధిస్తుంది. ఇటువంటి ప్రజలు దయనీయమైన మరియు అసహ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారు తమ అజ్ఞానం కారణంగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు మరియు వారు తమ మతభ్రష్టత్వం మరియు స్వాభావిక చెడు స్వభావం కారణంగా అసహ్యకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో, అధికారం అంటే ఏమిటి, అది దేనిని సూచిస్తుంది మరియు అది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో మీకు తెలియజేయడం అవసరమని నేను భావిస్తున్నాను. విస్తృత స్థాయిలో చెప్పాలంటే, దేవుడే అధికారమైయున్నాడు, ఆయన అధికారం అనేది దేవుని యొక్క సర్వాధికారమును మరియు గుణగణాలను సూచిస్తుంది మరియు దేవుని యొక్క అధికారం దేవుని స్థాయి మరియు గుర్తింపును సూచిస్తుంది. ఇందు మూలముగా, సాతాను తానే దేవుడని చెప్పడానికి సాహసిస్తుందా? సాతాను సమస్తాన్ని సృష్టించానని, సమస్త విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నానని చెప్పడానికి ధైర్యం చేస్తుందా? వాస్తవానికి, చేయలేదు! దానికి సమస్తమును సృష్టించే సామర్థ్యం లేదు; ఈ రోజు వరకు, దేవునిచే సృష్టించబడిన దేనినీ అది చేయలేదు మరియు జీవం ఉన్న దేనినీ సృష్టించలేదు. ఎందుకంటే దానికి దేవుని అధికారం లేదు, అది దేవుని స్థాయి మరియు గుర్తింపును ఎప్పటికీ కలిగి ఉండదు మరియు ఇది దాని గుణగణాలను బట్టి నిర్ణయించబడింది. దేవునికి ఉన్నంత శక్తి దానికి ఉందా? వాస్తవానికి, దానికి లేదు! సాతాను యొక్క చర్యలను మరియు సాతాను ప్రదర్శించిన అద్భుతాలను మనం ఏమని పిలుస్తాము? దీనిని శక్తి అని పిలవవచ్చా? దీనిని అధికారం అని పిలవవచ్చా? అస్సలు కానే కాదు! సాతాను దుర్మార్గతను కనబరుస్తుంది మరియు దేవుని పనిలోని ప్రతి అంశాన్ని భంగపరుస్తుంది, బలహీనపరుస్తుంది మరియు అంతరాయం కలిగిస్తుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా, మానవాళిని భ్రష్టు పట్టిస్తూ, దుర్వినియోగపరచడంతోపాటు, దేవుణ్ణి తిరస్కరించేలా మనిషిని ప్రలోభపరుస్తూ మరియు మోసం చేస్తూ, చివరకు మనిషిని గాఢాంధకారపు లోయ వైపుకు నడిపిస్తుంది, సాతాను మానవుని స్మరణకు, ప్రశంసలకు లేదా గౌరవానికి అర్హమైనదేదైనా చేసిందా? సాతాను అధికారాన్ని మరియు శక్తిని కలిగి ఉంటే, మానవజాతి దాని ద్వారా భ్రష్టుపట్టి ఉండేదా? సాతాను అధికారాన్ని మరియు శక్తిని కలిగి ఉన్నట్లయితే, మానవజాతికి దానివలన హాని కలిగి ఉండేదా? సాతాను శక్తిని మరియు అధికారాన్ని కలిగి ఉంటే, మానవాళియంత దేవుణ్ణి విడిచిపెట్టి, మరణం వైపుకు తిరిగేవారా? సాతానుకు అధికారం లేదు, లేదా శక్తి లేదు కాబట్టే, అది చేసేవాటి గుణగణాలను గురించి మనం ఏమి తేల్చాలి? సాతాను చేసేదంతా కేవలం వంచన అని నిర్వచించే వారు ఉన్నారు, అయినప్పటికీ అలాంటి నిర్వచనం అంత సముచితం కాదని నేను నమ్ముతున్నాను. చెడిపోయిన మానవజాతి యొక్క దుర్మార్గపు క్రియలు కేవలం వంచనా? యోబును దుర్వినియోగపరచిన సాతాను యొక్క దుష్ట శక్తి, మరియు అతనిని దుర్వినియోగపరచి, మ్రింగివేయాలనే దాని తీవ్రమైన కోరిక, కేవలం వంచనతో సాధ్యపడదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక్క క్షణంలో, కొండలు మరియు పర్వతాలలో చెదిరి ఉన్న యోబు యొక్క పశు సమూహాలు మరియు మందలు ఒక క్షణంలో చనిపోయాయి; ఒక్క క్షణంలో యోబు యొక్క గొప్ప ఐశ్వర్యం గతించిపోయింది. అది కేవలం వంచనతో సాధ్యమా? సాతాను చేసే ప్రతిదాని యొక్క స్వభావం బలహీనపరచడం, అంతరాయం కలిగించడం, నాశనం చేయడం, హాని చేయడం, చెడు, దురుద్దేశం మరియు చీకటివంటి ప్రతికూల పదాలకు అనుగుణంగా ఉంటుంది మరియు జరిగిన అన్యాయం మరియు దుర్మార్గత అంతా సాతాను చర్యలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు అది సాతాను యొక్క చెడు స్వభావం నుండి విడదీయరానిది. సాతాను ఎంత “శక్తిమంతంగా” ఉన్నప్పటికీ, అది ఎంత సాహసోపేతం మరియు ప్రతిష్టాత్మకం అయినప్పటికీ, నష్టం కలిగించే దాని సామర్థ్యం ఎంత గొప్పదైనా, మనిషిని భ్రష్టు పట్టించే మరియు ప్రలోభపరించే దాని పద్ధతులు ఎంత విస్తృతంగా ఉన్నా, మనిషిని భయపెట్టే దాని తంత్రాలు మరియు పన్నాగాలు ఎంత తెలివిగా ఉన్నా, దాని రూపం ఎంతగా మారుతున్నప్పటికీ, అది ఏనాడూ ఒక్క జీవిని కూడా సృష్టించలేకపోయింది, సమస్తము యొక్క ఉనికి కోసం అది చట్టాలను లేదా నియమాలను ఏర్పరచలేకపోయింది, జీవము కలిగిన మరియు జీవములేని దేనినీ అది ఎన్నడూ పాలించడం మరియు నియంత్రించడం చేయలేకపోయింది. దాని నుండి విశ్వంలో గాని మరియు ఆకాశము లోపల గాని పుట్టినట్లుగా, లేదా దాని కారణంగా ఉనికిలోనికి ఒక్క వ్యక్తి వచ్చినట్లుగా, లేదా వస్తువు వచ్చినట్లుగా లేదు; ఒక వ్యక్తి గాని లేదా వస్తువు గాని దాని ద్వారా పాలించబడలేదు లేదా దానిచే నియంత్రించబడలేదు. దీనికి భిన్నంగా, అది దేవుని ఆధీనంలో జీవించడమే కాకుండా, దేవుని ఆదేశాలు మరియు ఆజ్ఞలన్నింటికీ కట్టుబడి ఉంటుంది. దేవుడు సృష్టించిన మానవజాతిని కాదు గదా, దేవుని అనుమతి లేకుండా, భూమిపైనున్న నీటి బొట్టును లేదా ఇసుక రేణువును కూడా సాతాను ముట్టలేదు; దేవుని అనుమతి లేకుండా, సాతాను భూమిపైనున్న చీమలను సైతం కదిలించలేదు. దేవుని దృష్టిలో సాతానుకున్న స్థితి ఎలాంటిదంటే అది అడవి పువ్వులు కంటే, ఆకాశ పక్షుల కంటే, సముద్రంలోని చేపల కంటే మరియు భూమిపై ఉన్న పురుగుల కంటే హీనమైనది. అన్నింటిలో దాని పాత్ర అన్నింటికి సేవ చేయడం మరియు మానవజాతి కోసం పని చేయడం మరియు దేవుని పని మరియు ఆయన కార్య నిర్వహక ప్రణాళిక కొరకు మరియు ఆయన నిర్వర్తించే కార్యము కొరకు సేవ చేయడం. దాని స్వభావం ఎంత హానికరమైనది మరియు దాని గుణగణాలు ఎంత చెడ్డవైనప్పటికీ, అది చేయగల ఏకైక పని తన బాధ్యతకు విధిగా కట్టుబడి ఉండడం: దేవునికి సేవ చేయడం మరియు దేవునితో విభేదించడం. సాతాను యొక్క స్వభావం మరియు స్థాయి అలాంటిది. దాని గుణగణాలు జీవముతో సంబంధం లేనివి, శక్తితో సంబంధం లేనివి, అధికారంతో సంబంధం లేనివి; అది కేవలం దేవుని చేతిలో ఆటవస్తువు, దేవునికి సేవ చేసే యంత్రం మాత్రమే!
సాతాను యొక్క నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకున్న తరువాత కూడా, చాలా మందికి అధికారం అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు, కాబట్టి నేను నీకు చెబుతాను! అధికారాన్ని దేవుని శక్తిగా వివరించవచ్చు. మొదటిగా, అధికారం మరియు శక్తి రెండు కూడా సానుకూల అంశాలని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాటికి ప్రతికూలమైన దేనితోనూ సంబంధం లేదు మరియు సృష్టించబడిన లేదా సృష్టింబడని వాటితో సంబంధం లేదు. దేవుని శక్తి అనేది జీవమును, జీవ సత్వమును కలిగి ఉన్న దేనినైనా సృష్టించగలదు మరియు ఇది దేవుని జీవం ద్వారా నిర్ణయించబడుతుంది. దేవుడు జీవమైయున్నాడు, కాబట్టి ఆయన సమస్త జీవులకు ఆధారమైయున్నాడు. అంతేగాకుండా, దేవుని ప్రతి మాటకు, అంటే దేవుని నోటి నుండి వెలువడిన ప్రతి మాటకు సమస్త జీవులు లోబడే విధంగా దేవుని అధికారము చేయగలదు మరియు దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించి, అభివృద్ధి చెందేలా చేయగలదు, ఆ తర్వాత దేవుడు అన్ని జీవులను పరిపాలిస్తాడు మరియు ఆదేశిస్తాడు, ఇక అక్కడ ఎప్పటికీ క్రమము నుండి తొలగిపోవడం అనేది ఉండదు. ఎటువంటి వ్యక్తికి, లేదా ఎటువంటి వస్తువుకు ఈ అంశాలు లేవు; కేవలం సృష్టికర్త మాత్రమే అటువంటి శక్తిని కలిగి ఉన్నాడు, కాబట్టి దీనినే అధికారం అంటారు. ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేకతయైయున్నది. అలాగే, ఇది “అధికారం” అనే పదంతోను, లేదా ఈ అధికారం యొక్క గుణగణాలతోను సంబంధం లేకుండా, ప్రతి ఒక్కటి సృష్టికర్తతో మాత్రమే కలసి ఉంది, ఎందుకంటే ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేక గుర్తింపుకు మరియు ఆయన గుణగణాలకు గుర్తుగా ఉంది మరియు ఇది సృష్టికర్త యొక్క గుర్తింపును మరియు స్థాయిని సూచిస్తుంది; సృష్టికర్త తప్ప, ఏ వ్యక్తికి లేదా వస్తువుకు “అధికారం” అనే పదం వర్తించదు. ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికారాన్ని గూర్చిన అర్థ వివరణయైయున్నది.
సాతాను యోబును వశం చేసుకోవాలనే దృక్పధంతో చూసినప్పటికీ, దేవుని అనుమతి లేకుండా అది యోబు శరీరంపై ఒక్క వెంట్రుకను కూడా తాకడానికి సాహసించలేదు. సాతాను స్వతహాగా చెడ్డది మరియు క్రూరమైనది అయినప్పటికీ, దేవుడు దానికి తన ఆజ్ఞను జారీ చేసిన తర్వాత, దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండటం తప్ప దానికి వేరే మార్గం లేదు. ఈ విధంగా, యోబు దగ్గరకు వచ్చినప్పుడు సాతాను గొర్రెల మధ్య తోడేలువలె ఉన్మాదంగా ఉన్నప్పటికీ, దేవుడు దానికి నిర్దేశించిన పరిమితులను మరచిపోయే ధైర్యం చేయలేదు, దేవుని ఆదేశాలను ఉల్లంఘించే సాహసం చేయలేదు మరియు అది చేసిన దానంతటిలో, దేవుని మాటల సూత్రాలు మరియు పరిమితుల నుండి వైదొలగడానికి సాతాను ధైర్యం చేయలేదు, ఇది వాస్తవం కాదా? దీనిని బట్టి సాతాను యెహోవా దేవుని మాటల్లో దేనినీ ఉల్లంఘించే ధైర్యం చేయదని చూడవచ్చు. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట సాతానుకు ఒక ఆజ్ఞయు మరియు పరలోకపు శాసనమైయున్నది, దేవుని అధికారం యొక్క వ్యక్తీకరణయైయున్నది, ఎందుకంటే దేవుని ప్రతి మాట వెనుక దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినవారికి మరియు పరలోకపు చట్టాలకు లోబడనివారికి మరియు వాటిని వ్యతిరేకించేవారికి దేవుని శిక్షను సూచిస్తుంది. సాతాను దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, అప్పుడు దేవుని అధికారాన్ని అతిక్రమించడం మరియు పరలోక చట్టాలను వ్యతిరేకించడంవలన కలిగే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని దానికి బాగా తెలుసు. అసలు ఆ పర్యవసానాలు ఏమిటి? అవి దేవుడిచ్చిన శిక్ష అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యోబుపట్ల సాతాను చర్యలు మానవుని అవినీతికి సంబంధించి చిన్న ఉదాహరణ మాత్రమే మరియు సాతాను ఈ చర్యలకు పాల్పడుతున్నప్పుడు, దేవుడు నిర్దేశించిన పరిమితులు మరియు ఆయన సాతానుకు ఇచ్చిన ఆదేశాలు కేవలం అది చేసే ప్రతిదాని వెనుక ఉన్న ఉద్దేశాలకు చిన్న ఉదాహరణ మాత్రమే. దానికి తోడు, ఈ విషయంలో సాతాను పాత్ర మరియు సాతాను స్థాయి దేవుని కార్యనిర్వహణా కార్యములో దాని పాత్ర మరియు స్థాయి యొక్క సూక్ష్మ సన్నివేశము మాత్రమే మరియు యోబును శోధించే విషయంలో సాతాను పూర్తిగా దేవుడు చెప్పినట్లు చేయడం అనేది సాతాను దేవుని కార్యనిర్వహణ కార్యములో దేవునికి ఏ విధమైన వ్యతిరేకతను కొంచెమైనా ప్రదర్శించడానికి ధైర్యం చేయలేదు అనేదానికి ఇది సూక్ష్మ సన్నివేశము మాత్రమే. ఈ సూక్ష్మ సన్నివేశాలు మీకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయి? సాతానుతో సహా, సమస్త విషయాలలో, సృష్టికర్త నిర్దేశించిన పరలోకపు చట్టాలను మరియు శాసనాలను అతిక్రమించగల వ్యక్తి లేదా విషయం ఏదీ లేదు మరియు ఈ పరలోకపు చట్టాలు మరియు శాసనాలను ఉల్లంఘించే ధైర్యం చేసే వ్యక్తి లేదా విషయం ఏదీ లేదు, వాటికి అవిధేయత చూపే వారిపై సృష్టికర్త విధించే శిక్షను మార్చగల లేదా తప్పించుకోగల వ్యక్తి లేదా విషయం ఏదీ లేదు. కేవలం సృష్టికర్త మాత్రమే పరలోకపు చట్టాలను మరియు శాసనాలను ఏర్పరచగలడు, కేవలం సృష్టికర్తకు మాత్రమే వాటిని అమలులోకి తెచ్చే శక్తి ఉంది మరియు సృష్టికర్త యొక్క శక్తిని ఏ వ్యక్తి గాని, లేదా ఎటువంటి విషయం గాని అతిక్రమించలేదు. ఇది సృష్టికర్త యొక్క ప్రత్యేక అధికామైయున్నది మరియు ఈ అధికారం సమస్త విషయాలలో అత్యున్నతమైనది, కాబట్టి, “దేవుడు గొప్పవాడు మరియు సాతానుది రెండవ స్థానం” అని చెప్పడం అసాధ్యం. ప్రత్యేక అధికారం కలిగి ఉన్న సృష్టికర్త తప్ప, మరొక దేవుడు లేడు!
మీకు ఇప్పుడు దేవుని అధికారం గురించి కొత్త అవగాహన ఏర్పడిందా? మొదటిగా, ఇప్పుడే చెప్పబడిన దేవుని అధికారానికి, మరియు మనిషి శక్తికి మధ్య వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఏమిటి? రెండిటికీ పోలిక లేదని కొందరు చెప్తారు. అది నిజం! ఈ రెండింటి మధ్య పోలిక లేదని ప్రజలు చెప్పినప్పటికీ, మనిషి యొక్క ఆలోచనలు మరియు ఉద్దేశాలలో, మనిషి యొక్క శక్తి తరచుగా అధికారం విషయంలో గందరగోళానికి గురవుతుంది మరియు రెండింటినీ తరచుగా పక్కపక్కనే పోల్చడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రజలు అనాలోచితంగా ఒకదానిని మరొకదానితో భర్తీ చేసే పొరపాటు చేయడం లేదా? రెండూ సంబంధం లేనివి మరియు వాటి మధ్య ఎటువంటి పోలిక లేదు, అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ అర్ధం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలి? నీవు నిజంగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలనుకుంటే, దేవుని యొక్క ప్రత్యేక అధికారాన్ని తెలుసుకొని అర్థం చేసుకోవడమే ఏకైక మార్గం. సృష్టికర్త యొక్క అధికారాన్ని తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత నీవు ఒకే సమయంలో మనిషి యొక్క శక్తిని మరియు దేవుని అధికారాన్ని ప్రస్తావించవు.
మనిషి యొక్క శక్తి దేనిని సూచిస్తుంది? క్లుప్తంగా చెప్పాలంటే, ఇది మనిషి యొక్క అవినీతి స్వభావమును, కోరికలను మరియు ఆశయాలను అత్యధిక స్థాయిలో విస్తరించడానికి, లేదా నెరవేర్చుకోవడానికి వీలు కల్పించే సామర్థ్యం అని, లేదా నైపుణ్యం అని చెప్పవచ్చు. ఇది అధికారంగా పరిగణించబడుతుందా? మనిషి యొక్క ఆశయాలు మరియు కోరికలు ఎంత పెద్దవైనప్పటికి, లేదా లాభదాయకమైప్పటికీ, ఆ వ్యక్తి అధికారం కలిగి ఉన్నాడని చెప్పలేము; మహా అయితే, ఈ ప్రచారం మరియు విజయం కేవలం మనుషుల మధ్యలో సాతాను యొక్క తెలివితక్కువ తనానికి నిదర్శనం; దేవుడు అవ్వాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాతాను తన స్వంత పూర్వీకుడిలా వ్యవహరించే ఒక హాస్యాస్పదమైన పరిస్థితి.
నీవు ఇప్పుడు దేవుని అధికారాన్ని అసలు ఎలా చూస్తున్నావు? ఇప్పుడు ఈ మాటల గురించి సహవాసం చేశాం, నీవు దేవుని అధికారం గురించి ఒక కొత్త అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను: దేవుని అధికారం దేనిని సూచిస్తుంది? అది దేవుని గుర్తింపును సూచిస్తుందా? అది దేవుని శక్తిని సూచిస్తుందా? అది దేవుని ప్రత్యేక స్థాయిని సూచిస్తుందా? వీటన్నిటిలో, నీవు దేనిలో దేవుని అధికారాన్ని చూశావు? నీవు దానిని ఎలా చూశావు? మనిషి అనుభవించే నాలుగు కాలాల పరంగా, వసంతకాలం, వేసవికాలం, శరదృతువు మరియు శీతాకాలం మధ్యన పరస్పర మార్పు యొక్క నియమాన్ని ఎవరైనా మార్చగలరా? వసంతకాలంలో, చెట్లు మొగ్గతొడుగుతాయి మరియు పుష్పిస్తాయి; వేసవిలో అవి ఆకులతో నిండి ఉంటాయి; శరదృతువులో అవి పండ్లు కాస్తాయి మరియు శీతాకాలంలో ఆకులు రాలుతాయి. ఎవరైనా ఈ నియమాన్ని మార్చగలరా? ఇది దేవుని అధికారంలోని ఒక కోణాన్ని ప్రతిబింబిస్తుందా? దేవుడు “వెలుగు కమ్మని పలుకగా” వెలుగు కలిగెను. ఈ వెలుగు ఇప్పటికీ ఉనికిలో ఉందా? ఇది దేనిని బట్టి ఉనికిలో ఉంది? ఇది దేవుని మాటలను బట్టి, సహజంగానే, దేవుని అధికారాన్ని బట్టి ఉంది. దేవుడు సృష్టించిన గాలి ఇప్పటికీ ఉనికిలో ఉందా? మనిషి పీల్చే గాలి దేవుడి నుండి వస్తుందా? దేవుని నుండి వచ్చే వాటిని ఎవరైనా తీసివేయగలరా? వాటి స్వభావాన్ని మరియు పనితీరును ఎవరైనా మార్చగలరా? దేవుడు కేటాయించిన రాత్రిని మరియు పగలును, అలాగే దేవుడు ఆదేశించిన రాత్రి మరియు పగలు యొక్క నియమాన్ని ఎవరైనా విడదీయగలరా? అలాంటి గొప్ప పనిని సాతాను చేయగలదా? నీవు రాత్రి నిద్రపోకపోయినా, రాత్రిని పగలుగా పరిగణించినా, అది రాత్రివేళే; నీవు నీ దినచర్యను మార్చుకోవచ్చు, కానీ నీవు రాత్రి మరియు పగలుల మార్పు యొక్క నియమాన్ని మార్చలేవు, ఈ వాస్తవాన్ని ఏ వ్యక్తీ మార్చలేరు, అవునా కాదా? ఎద్దు భూమిని దున్నే విధంగా సింహము భూమిని దున్నునట్లు ఎవరైనా చేయగలరా? ఏనుగును గాడిదగా మార్చగల సమర్థుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కోడిని డేగలా గాలిలో ఎగురవేయగలరా? తోడేలును గొర్రెల్లాగా గడ్డి తినేలా చేయగలరా? (ఎవరూ చేయలేరు). నీటిలో ఉన్న చేపలను ఆరిన నేల మీద జీవించేలా చేయగలరా? మనుషులు అలా చేయలేరు. ఎందుకు? ఎందుకంటే దేవుడు చేపలను నీటిలో జీవించమని ఆదేశించాడు కాబట్టి అవి నీటిలో జీవిస్తాయి. నేల మీద అవి మనుగడ సాగించలేవు మరియు అవి చనిపోతాయి; అవి దేవుని ఆదేశపు పరిమితులను అతిక్రమించలేవు. అన్ని విషయాలకు వాటి ఉనికికి సంబంధించిన ఒక నియమం మరియు పరిమితి ఉన్నాయి మరియు వాటిలో ప్రతిదానికి స్వంత సహజ గుణాలు ఉన్నాయి. ఇవి సృష్టికర్తచే నిర్దేశించబడినవి మరియు ఏ మనిషీ వాటిని మార్చలేడు మరియు అధిగమించలేడు. ఉదాహరణకు, సింహం ఎల్లప్పుడూ అడవిలో నివసిస్తుంది, మానవ సమాజాలకు దూరంగా ఉంటుంది మరియు మనిషితో కలిసి జీవించే మరియు మనిషి కోసం పనిచేసే ఎద్దవలె ఎప్పుడూ విధేయతతో మరియు విశ్వాసపాత్రంగా ఉండదు. ఏనుగులు మరియు గాడిదలు రెండూ జంతువులే మరియు రెండూ నాలుగు కాళ్ళు కలిగి ఉన్నాయి మరియు గాలిని పీల్చుకునే జీవులు అయినప్పటికీ, అవి వేర్వేరు జాతులు, ఎందుకంటే వాటిని దేవుడు వివిధ రకాలుగా విభజించారు, ప్రతి దానికి వాటి స్వంత సహజ సిద్ధమైన గుణగణాలు ఉన్నాయి మరియు అవి ఎప్పటికీ పరస్పరం మార్చుకోలేవు. డేగవలె కోడికి కూడా రెండు కాళ్ళు మరియు రెక్కలు ఉన్నప్పటికీ, అది ఎప్పటికీ గాలిలో ఎగరదు; మహా అయితే అది చెట్టు మీదకు మాత్రమే ఎగరగలుగుతుంది, ఇది దాని సహజ గుణమునుబట్టి నిర్ణయించబడుతుంది. ఇదంతా దేవుని అధికార ఆజ్ఞలవల్లనే అని వేరే చెప్పనవసరం లేదు.
నేటి మానవజాతి అభివృద్ధిలో, మానవాళి యొక్క విజ్ఞాన శాస్త్రము బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు మరియు మనిషి యొక్క శాస్త్రీయ అన్వేషణకు సంబంధించిన విజయాలు అద్భుతమైనవని వర్ణించవచ్చు. మనిషి సామర్థ్యం అంతకంతకూ పెరుగుతోందని చెప్పాలి, అయితే మానవజాతి సాధించలేని ఒక శాస్త్రీయ పురోగతి ఉంది: మానవజాతి విమానాలను, విమాన వాహక నౌకలను మరియు అణు బాంబులను తయారు చేసింది, మానవజాతి అంతరిక్షంలోకి వెళ్ళింది, చంద్రునిపై నడిచింది, అంతర్జాలమును లేక ఇంటర్నెట్ను కనిపెట్టింది, ఉన్నత సాంకేతిక జీవన శైలిని లేక హైటెక్ జీవనశైలిని అలవర్చుకుయింది, అయినప్పటికీ మానవజాతి జీవించే జీవులను, శ్వాస పీల్చుకునేవాటిని సృష్టించలేకపోయింది. ప్రతి జీవి యొక్క సహజ గుణాలు మరియు అవి జీవించే నియమాలు మరియు ప్రతి రకమైన జీవి యొక్క జీవ మరణముల చక్రం అనే ఈ విషయాలన్నీ మానవజాతి యొక్క శాస్త్రీయ శక్తికి మించినవి మరియు ఇవన్నీ శాస్త్రీయ జ్ఞానము ద్వారా నియంత్రించబడవు. ఈ సమయంలో, మనిషి యొక్క శాస్త్రీయత ఎంత గొప్ప ఔన్నత్యాన్ని సాధించినప్పటికీ, అది సృష్టికర్త యొక్క ఆలోచనలలో ఏ ఒక్కదానికి సాటిరాదు మరియు సృష్టికర్త యొక్క సృష్టిని మరియు ఆయన అధికార శక్తి యొక్క అద్భుతాన్ని గుర్తించలేకపోతోందని చెప్పాలి. భూమిపై చాలా సముద్రాలు ఉన్నాయి, అయినప్పటికీ అవి ఎన్నడూ తమ పరిమితులను అతిక్రమించలేదు మరియు ఇష్టానుసారంగా భూమి మీదకు రాలేదు, ఎందుకంటే దేవుడు వాటిలో ప్రతిదానికి సరిహద్దులను నిర్దేశించాడు; ఆయన వాటికి ఆజ్ఞాపించిన చోటనే అవి ఉన్నాయి మరియు దేవుని అనుమతి లేకుండా అవి స్వేచ్ఛగా తిరగలేవు. దేవుని అనుమతి లేకుండా, అవి ఒకదానినొకటి అతిక్రమించకపోవచ్చు మరియు దేవుడు చెప్పినప్పుడు మాత్రమే కదలగలవు మరియు అవి ఎక్కడికి వెళ్లి ఉండాలనేది దేవుని అధికారం ద్వారా నిర్ణయించబడుతుంది.
సూటిగా చెప్పాలంటే, “దేవుని అధికారం” అంటే అది దేవునికి సంబంధించిన విషయం. ఒక పనిని ఎలా చేయాలో నిర్ణయించే హక్కు దేవునికి ఉంది మరియు అది ఆయన కోరుకున్న విధంగా జరుగుతుంది. సమస్త విషయాలకు సంబంధించిన నియమం దేవుని చేతుల్లో ఉంది, అది మనిషి చేతుల్లో లేదు; మనిషి దానిని సవరించలేడు. అది మనిషి యొక్క సంకల్పాన్నిబట్టి మారదు గాని దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞానం మరియు దేవుని ఆదేశాలను బట్టి మారుతుంది; ఇది ఏ మనిషి కాదనలేని వాస్తవం. ఆకాశం మరియు భూమి మరియు సృష్టించబడిన సమస్త సృష్టి, విశ్వం, నక్షత్రాలతో కూడిన ఆకాశం, సంవత్సరంలోని నాలుగు రుతువులు, మనిషికి కనిపించేవన్నీ మరియు కనిపించనివన్నీ దేవుని అధికారంలో, దేవుని ఆదేశాల ప్రకారం, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా మరియు సృష్టి ఆరంభంలోని నియమాల ప్రకారం కొంచమైనా లోపం లేకుండా పని చేస్తుంటాయి, మారుతూ ఉంటాయి మరియు ఉనికిలో ఉంటాయి. ఒక్క వ్యక్తి లేదా ఒక వస్తువు కూడా వాటి నియమాలను మార్చలేవు, లేదా అవి పని చేసే స్వాభావిక పద్ధతిని మార్చలేవు; అవి దేవుని అధికారము వలన ఉనికిలోకి వచ్చాయి మరియు దేవుని అధికారమువలన గతించిపోతాయి. ఇదీ దేవునికి ఉన్నటువంటి అధికారము. ఇప్పుడు ఇంత చెప్పబడిన తరువాత, దేవుని అధికారము అనేది దేవుని యొక్క గుర్తింపుకు మరియు ఆయన స్థాయికి చిహ్నంగా ఉందని నీవు భావించగలుగుతున్నావా? దేవుని అధికారాన్ని ఏదైనా సృష్టించబడిన లేదా సృష్టించబడని జీవి కలిగి ఉండగలదా? ఇది ఏ వ్యక్తి ద్వారానైనా, ఎటువంటి విషయం ద్వారానైనా లేదా ఎటువంటి వస్తువు ద్వారానైనా అనుకరించబడుతుందా, ప్రతిరూపంగా మార్చబడుతుందా లేదా బదిలీ చేయబడుతుందా?
సృష్టికర్త యొక్క గుర్తింపు ప్రత్యేకమైనది మరియు మీరు బహుదేవతారాధన అనే ఆలోచనకు కట్టుబడి ఉండకూడదు.
సాతాను యొక్క నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు మనిషి కంటే గొప్పవి అయినప్పటికీ, మనిషి చేయలేని పనులను అది చేయగలిగినప్పటికీ, మీరు సాతాను చేసే పనులను చూసి మీరు అసూయపడినా, లేదా మీరు కూడా అలా చేయాలని ఆశించినా, మీరు ఈ విషయాలను ద్వేషించినా, లేదా అసహ్యించుకున్నా, మీరు వాటిని చూసినా, లేదా చూడకపోయినా, సాతాను ఎంత సాధించినప్పటికీ, ఎంతమందిని తనను ఆరాధించేలా మరియు ప్రతిష్ఠించేలా మోసం చేసినప్పటికీ, నీవు దానిని ఎలా నిర్వచించినప్పటికీ, నీవు దానికి దేవుని అధికారము గాని మరియు శక్తి గాని ఉందని చెప్పలేవు. దేవుడు దేవుడైయున్నాడని, దేవుడు ఒక్కడే అని నీవు తెలుసుకోవాలి, అంతేగాక, కేవలం దేవునికి మాత్రమే అధికారం ఉందని, సమస్తాన్ని నియంత్రించే శక్తి మరియు పరిపాలించే శక్తి దేవునికి మాత్రమే ఉందని నీవు తెలుసుకోవాలి. సాతానుకు ప్రజలను మోసగించే సామర్థ్యం ఉంది కాబట్టి అది దేవునివలె నటించగలదు కాబట్టి, దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను చేసినట్లుగా అది కూడా అనుకరించగలదు, అయితే దేవునికి సమానమైన పనులు చేసింది కాబట్టి, దేవుడు ప్రత్యేకమైనవాడు కాదని, చాలా మంది దేవుళ్లు ఉన్నారని, ఈ దేవుళ్ళు అందరూ కాస్త అటూ ఇటూగా నైపుణ్యాలను కలిగి ఉన్నారు మరియు వారు కలిగి ఉన్న శక్తి యొక్క విస్తృతిలో తేడాలు ఉన్నాయి అని నీవు తప్పుగా నమ్ముతావు. నీవు వారి రాక యొక్క క్రమం మరియు వారి యొక్క యుగమును బట్టి వారి గొప్పతనాన్ని వర్గీకరిస్తున్నావు మరియు నీవు దేవుడు కాకుండా ఇతర దేవతలు ఉన్నారని తప్పుగా విశ్వసిస్తున్నావు మరియు దేవుని శక్తి మరియు అధికారం అనేవి ప్రత్యేకతను కలిగియున్నవి కాదని భావిస్తున్నావు. నీకు అలాంటి ఆలోచనలు ఉంటే, నీవు దేవుని ప్రత్యేకతను గుర్తించకపోతే, దేవుడు మాత్రమే అధికారం కలిగి ఉన్నాడని విశ్వసించకుండా, నీవు కేవలం బహుదేవతారాధనకు కట్టుబడి ఉన్నట్లయితే, నీవు జీవులు విసర్జించే మలినానివని, నీవు సాతాను యొక్క నిజ స్వరూపివని, మరియు నీవు దుర్మార్గతకు ప్రతిరూపమని నేను చెబుతాను! ఈ మాటలు చెప్పడం ద్వారా నేను మీకు ఏమి బోధించాలనుకుంటున్నానో మీకు అర్థమైందా? సమయం, ప్రదేశం లేదా మీ నేపథ్యం ఏమైనప్పటికీ, నీవు ఏ ఇతర వ్యక్తితోనైనా, విషయముతోనైనాలేదా వస్తువుతోనైనా దేవుణ్ణి తికమకకు గురి చేయకూడదు. దేవుని అధికారాన్ని మరియు దేవుని గుణగణాలను తెలుసుకోలేనని మరియు చేరుకోలేనని నీవు ఎంతగా భావించినా, సాతాను క్రియలు మరియు మాటలు మీ ఆలోచన మరియు ఊహతో ఎంతవరకు ఏకీభవించినప్పటికీ, అవి నీకు ఎంత సంతృప్తిని ఇచ్చినప్పటికీ, బుద్ధిహీనునిగా ఉండవద్దు, ఈ ఆలోచనలను తికమక చేయవద్దు, దేవుని ఉనికిని తిరస్కరించవద్దు, దేవుని గుర్తింపును మరియు స్థాయిని తిరస్కరించవద్దు, దేవుణ్ణి నీ హృదయపు తలుపు నుండి బయటకు తోసేసి, నీ హృదయంలో ఉన్న దేవుని స్థానంలోకి సాతానును తీసుకొచ్చి, సాతానుని నీ దేవునిగా చేసుకోవద్దు. అలా చేయడంవల్ల కలిగే పర్యవసానాలను మీరు ఊహించగలరనడంలో నాకు సందేహం లేదు!
మానవజాతి భ్రష్టుపట్టిపోయినప్పటికీ, అతను ఇప్పటికీ సృష్టికర్త అధికారం యొక్క సార్వభౌమాధికారం క్రింద జీవిస్తున్నాడు
వేల సంవత్సరాలుగా సాతాను మానవజాతిని భ్రష్టుపట్టిస్తూ ఉంది. మాటల్లో చెప్పలేనంత కీడును చేసింది, తరతరాలుగా మోసం చేస్తూ వచ్చింది మరియు ప్రపంచంలో ఘోరమైన నేరాలకు పాల్పడింది. ఇది మనిషిని దుర్వినియోగపరిచింది, మనిషిని మోసం చేసింది, దేవుణ్ణి ఎదిరించేలా మనిషిని కవ్వించింది మరియు దేవుని కార్యనిర్వహణ ప్రణాళికను పదే పదే అయోమయానికి గురిచేసే మరియు బలహీనపరిచే చెడు చేష్టలకు పాల్పడింది. అయినప్పటికీ, దేవుని అధికారం క్రింద, సమస్త విషయాలు మరియు జీవరాసులు దేవుడు నిర్దేశించిన నియమాలు మరియు చట్టాలకు కట్టుబడి ఉన్నాయి. దేవుని అధికారంతో పోలిస్తే, సాతాను యొక్క దుష్ట స్వభావం మరియు ప్రబలత అనేవి చాలా అసహ్యంగా, చాలా జుగుప్సకరంగా మరియు తుచ్ఛమైనవిగా ఉన్నాయి మరియు అవి చాలా స్వల్పమైనవిగాను మరియు దుర్బలమైనవిగాను ఉన్నాయి. దేవుడు సృష్టించిన సమస్త విషయాల మధ్య సాతాను నడుస్తున్నప్పటికీ, దేవుని ఆదేశము ద్వారా వచ్చిన వ్యక్తులలో, సృష్టించబడిన విషయాలలో మరియు వస్తువులలో స్వల్పమైన మార్పును కూడా తీసుకురాలేవు. అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి మరియు మానవజాతి ఇప్పటికీ దేవుడు ప్రసాదించిన వెలుగును మరియు గాలిని ఆస్వాదిస్తోంది, ఇప్పటికీ దేవుడిచ్చిన జీవవాయువును పీల్చుకుంటుంది, ఇప్పటికీ దేవుడు సృష్టించిన పువ్వులు, పక్షులు, చేపలు మరియు పురుగులను ఆస్వాదిస్తూ, దేవుడు అందజేసిన సమస్తమును అనుభవిస్తోంది; పగలు మరియు రాత్రి ఇప్పటికీ ఒకదాని త్వరాత మరొకటి నిరంతరం కొనసాగుతున్నాయి; ఎప్పటిలాగే నాలుగు రుతువులు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి; ఆకాశంలో ఎగిరే కొంగలు శీతాకాలంలో బయలుదేరుతాయి మరియు తరువాతి వసంతకాలంలో తిరిగి వస్తాయి; నీటిలోని చేపలు తమ నివాసములైన నదులు మరియు సరస్సులను వదిలిపెట్టవు; భూమిపై ఉన్న కీటకాలు వేసవి రోజులలో ఉత్సాహంతో పాడతాయి; గడ్డిలోని పురుగులు శరదృతువు గాలికి మెల్లగా రాగాలు తీస్తాయి; కొంగలు మందలుగా కూడుకుంటాయి, అయితే డేగలు ఒంటరిగా ఉంటాయి; సింహాలు వేటాడుతూ తమను గూర్చి గర్వపడుతుంటాయి; జింక గడ్డి మరియు పువ్వుల నుండి తప్పుకోదు… సృష్టించబడిన సమస్తము మధ్య ప్రతి రకమైన జీవి వెళుతుంది మరియు తిరిగి వస్తుంది, ఆపై మరలా వెళుతుంది, రెప్పపాటులో లక్షలాది మార్పులు చోటుచేసుకుంటాయి కానీ సహజ గుణాలు మరియు వాటి మనుగడ యొక్క నియమాలు ఎన్నటికీ మారవు. అవి దేవుని సమకూర్పు మరియు పోషణ క్రింద జీవిస్తాయి మరియు వాటి సహజ గుణాలను ఎవరూ మార్చలేరు మరియు వాటి మనుగడ నియమాలను ఎవరూ పాడు చేయలేరు. సమస్త జీవరాశుల మధ్య జీవించే మానవజాతి సాతాను ద్వారా భ్రష్టుపట్టి, మోసపోయినప్పటికీ, మానవుడు ఇప్పటికీ దేవుడు చేసిన నీటిని, దేవుడు చేసిన గాలిని మరియు దేవుడు చేసిన సమస్తమును విస్మరించలేదు మరియు మనిషి ఇప్పటికీ దేవుడు సృష్టించిన ఈ ప్రదేశంలో జీవిస్తున్నాడు మరియు విస్తరిస్తున్నాడు. మానవజాతి యొక్క సహజ గుణాలు మారలేదు. మనిషి ఇప్పటికీ చూడడానికి తన కళ్లపై, వినడానికి చెవులపై, ఆలోచించడానికి మెదడుపై, అర్థం చేసుకోవడానికి తన మనసుపై, నడవడానికి కాళ్లు మరియు పాదాలపై, పని చేయడానికి చేతులపై, ఇతర మొదలైన వాటిపై ఆధారపడుతున్నాడు; దేవుని సమకూర్పును స్వీకరించేలా మనిషికి దేవుడు ప్రసాదించిన సహజ గుణాలు సవరించబడలేదు, దేవునికి సహకరించే మనిషి సామర్థ్యాలు మారలేదు, సృష్టించబడిన జీవిగా తన విధి నిర్వహణలో మానవజాతి సామర్ధ్యం మారలేదు, మానవజాతి యొక్క ఆధ్యాత్మిక అవసరాలు మారలేదు, తన మూలాలను కనుగొనాలనే మానవజాతి కోరిక మారలేదు, సృష్టికర్త ద్వారా రక్షించబడాలనే మానవజాతి వాంఛ మారలేదు. దేవుని అధికారం క్రింద జీవిస్తున్న మరియు సాతాను చేసిన రక్తపాత నాశనాన్ని సహించిన మానవజాతి యొక్క ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. మానవజాతి సాతాను అణచివేతకు గురైనప్పటికీ, ఇకపై సృష్టి ఆరంభంలోని ఆదాము మరియు హవ్వలతో కాక, దానికి బదులుగా దేవునికి విరుద్ధమైన విషయాలతో, అంటే జ్ఞానం, ఊహ, తలంపులు మరియు మొదలైన వాటితో మరియు చెడిపోయిన సాతాను స్వభావంతో నిండి ఉంది, దేవుని దృష్టిలో మానవజాతి అనేది ఇప్పటికీ ఆయన సృష్టించిన మానవజాతే. మానవజాతి ఇప్పటికీ దేవునిచేత పరిపాలించబడుతోంది మరియు నిర్దేశించబడుతోంది, మరియు ఇప్పటికీ దేవుడు నిర్దేశించిన మార్గంలోనే జీవిస్తోంది, కాబట్టి దేవుని దృష్టిలో సాతాను చేత చెడిపోయిన మానవజాతి, కేవలం ధూళితో కప్పబడి ఉంది, కడుపు ఉబ్బరంతో ఉంది, ప్రతిస్పందనలు చాలాఆలస్యంగా వస్తున్నాయి, జ్ఞాపకశక్తి మునుపటిలా బాగా లేదు మరియు కొంచెం క్షీణించింది కానీ అన్ని విధులు మరియు మనిషి యొక్క సహజ గుణాలు పూర్తిగా దెబ్బతినలేదు. దేవుడు రక్షించాలనుకుంటున్న మానవజాతి ఇదే. ఈ మానవజాతి సృష్టికర్త యొక్క పిలుపును మరియు సృష్టికర్త యొక్క స్వరాన్ని వినవలసి ఉంది, అప్పుడు అతను లేచి నిలబడి ఈ స్వరం యొక్క మూలాన్ని కనుగొనడానికి పరుగెడుతాడు. ఈ మానవజాతి అంతయూ సృష్టికర్త యొక్క రూపాన్ని చూడవలసి ఉంది మరియు అతను దేనినీ పట్టించుకోకుండా, దేవునికి తనను తాను అంకితం చేసుకోవడానికి అన్నింటినీ వదిలివేస్తాడు మరియు ఆయన కోసం తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు. సృష్టికర్త హృదయపూర్వకంగా పలికిన మాటలను మానవాళి హృదయం అర్థం చేసుకున్నప్పుడు, మానవజాతి సాతానును తిరస్కరించి సృష్టికర్త వైపుకు వస్తుంది; మానవజాతి తన శరీరంలోని మురికిని పూర్తిగా కడుగుకొని, మరోసారి సృష్టికర్త యొక్క సమకూర్పు మరియు పోషణను పొందినప్పుడు, అప్పుడు మానవజాతి యొక్క జ్ఞాపకశక్తి పునరుద్ధరించబడుతుంది మరియు ఈ సమయంలో మానవజాతి నిజంగా సృష్టికర్త యొక్క ఆధిపత్యం క్రిందకు తిరిగి వస్తుంది.
డిసెంబరు 14, 2013