దేవుడు తనకు తానే అద్వితీయుడు VII
దేవుడే సమస్తమైన వాటికి జీవాధారం (I)
దేవుని అధికారం, దేవుని నీతి స్వభావం, మరియు దేవుని పరిశుద్ధత గురించిన స్థూల దృష్టి
మీరు మీ ప్రార్థనలు పూర్తి చేసిన తర్వాత, దేవుని సన్నిధిలో మీ హృదయాలు ప్రశాంతతను అనుభవిస్తున్నాయా? (అవును.) ఒక వ్యక్తి హృదయం ప్రశాంతతను కలిగియున్నట్లయితే, వారు దేవుని వాక్యాన్ని వినగలరు మరియు అర్థం చేసుకోగలరు మరియు వారు సత్యాన్ని విని, సత్యాన్ని అర్థం చేసుకోగలరు. మీ హృదయం ప్రశాంతతను పొందలేకపోతే, నీ హృదయం ఎల్లప్పుడూ దారీతెన్నూ లేకుండా కొట్టుకుపోతుంటే, లేదా ఎల్లప్పుడూ ఇతర విషయాల గురించే ఆలోచిస్తుంటే, దేవుని వాక్యం వినడం కోసం నీవు కూటములకు హాజరైనప్పుడల్లా అది నీ మీద ప్రభావం చూపుతుంది. మనం చర్చించుకుంటున్న విషయాల్లో ముఖ్యాంశం ఏమిటి? ఈ ప్రధాన విషయాల గురించి మనం కాసేపు గతంలోకి ఆలోచిద్దాం. దేవుడు ప్రత్యేకమైన వాడని తెలుసుకోవడములో, దేవుని అధికారం గురించి మనం మొదటి భాగంలో చర్చించాము. రెండవ భాగంలో, దేవుని నీతి స్వభావం గురించి మనం చర్చించాము. అలాగే, దేవుని పరిశుద్ధతను గురించి మూడవ భాగంలో మనం చర్చించాము. ఈ విధంగా, ఏదైనా నిర్ధిష్ట విషయము గురించి మనం చర్చించిన ప్రతిసారీ, అది మీ మనసు మీద ఏదైనా ముద్ర వేసిందా? మొదటి భాగంలో, “దేవుని అధికారం” అనేది మీలో లోతుగా ఎలాంటి అభిప్రాయం కలిగించింది? ఏ భాగం మీలో బలమైన అభిప్రాయం కలిగించింది? (దేవుడు మొదటిగా దేవుని వాక్యపు అధికారం మరియు శక్తిని తెలియజేశాడు; దేవుడు ఆయన మాటలాగే గొప్పవాడు మరియు ఆయన మాట సత్యముగానే మారుతుంది. ఇదియే దేవుని స్థిరమైన స్వభావము.) (సాతానుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, అది యోబును శోధించవచ్చునేమో గాని అతని ప్రాణము తీయకూడదు. ఇందులో మనం దేవుని వాక్యపు అధికారాన్ని చూస్తున్నాము.) చేర్చడానికి ఏమైనా ఉందా? (భూమిని ఆకాశములను మరియు వాటిలోని సమస్తం సృష్టించడం కోసం దేవుడు వాక్కులను ఉపయోగించాడు మరియు మనిషితో ఒడంబడిక కోసం మరియు మనిషి మీద తన ఆశీర్వాదాలు కురిపించడం కోసం దేవుడు వాక్కులను పలికాడు. దేవుని వాక్యపు అధికారానికి ఇవన్నీ ఉదాహరణలు. ఆ తర్వాత, లాజరును అతని సమాధి నుండి వెలుపలకు రావాల్సిందిగా యేసు ప్రభువు ఎలా ఆజ్ఞాపించాడో మనం చూశాము, అంటే, జీవము మరియు మృత్యువు అనేవి దేవుని నియంత్రణలోనే ఉంటాయని, జీవమును మరియు మరణమును నియంత్రించే శక్తి సాతానుకు లేదని మరియు దేవుని కార్యము శరీరములో జరిగినప్పటికీ, లేదా ఆత్మలో జరిగినప్పటికీ, ఆయన అధికారము ప్రత్యేకమైనదని మనకు తెలియజేస్తోంది.) సహవాసములో విన్న తర్వాత, మీరు అర్థము చేసుకున్నది ఇదే కదా? దేవుని అధికారం గురించి మాట్లాడే సమయంలో, “అధికారం” అనే పదాన్ని మీరెలా అర్థం చేసుకున్నారు? దేవుని అధికారం పరిధిలో, దేవుడు చేసే మరియు వెల్లడించే వాటి నుండి మనుష్యులు చూసేదేమిటి? (దేవుని సర్వాధికారాన్నీ మరియు జ్ఞానాన్నీ మనం చూస్తాము.) (దేవుని అధికారం ఎల్లప్పుడూ ఉనికిలోనే ఉంటుందనీ మరియు అది నిజముగా ఉనికిలో ఉందనీ మనం చూస్తాము. సకల అంశాల మీద దేవుని ఆధిపత్యంలో ఆయన అధికారం అతిపెద్ద మొత్తంలో ఉండడాన్ని మనం చూస్తాము. అలాగే, ప్రతి ఒక్క మనిషి జీవితం మీద ఆయన నియంత్రణ ఉంటుంది కాబట్టి, వారి మీద ఆయన ఆధిపత్యము తక్కువ స్థాయిలో ఉండడాన్ని మనం చూస్తాము. నిజానికి, మనిషి జీవితంలోని ఆరు కీలక తరుణాల కోసం దేవుడు ప్రణాళిక చేస్తాడు మరియు నియంత్రిస్తాడు. అది మాత్రమే కాకుండా, దేవుడు తనకు తానే అద్వితీయుడనీ మరియు సృష్టిచంబడిన లేదా సృష్టించబడని ఏ జీవరాశి కూడా దేవుని అధికారాన్ని కలిగి ఉండజాలదనీ దేవుని అధికారం సూచిస్తుంది. దేవుని అధికారం అనేది ఆయన హోదాకు ఒక చిహ్నం.) “దేవుని హోదాకు మరియు దేవుని స్థానమునకు సంబంధించిన చిహ్నాలు” గురించి మీ అవగాహన అనేది కొంతమేర సిద్ధాంతపరమైనదిగానే ఉంటుంది. దేవుని అధికారం గురించి ఆవశ్యకమైన అవగాహన ఏదైనా మీకు ఉందా? (మన చిన్నప్పటి నుండే దేవుడు మనల్ని చూశాడు మరియు మనల్ని రక్షించాడు అనే దానిలో మనం దేవుని అధికారం చూస్తాము. మన మీద పొంచి ఉన్న ప్రమాదాల గురించి మనకు తెలియనప్పటికీ, దేవుడు ఎల్లప్పుడూ తెరవెనుక నుండి మనల్ని కాపాడుతున్నాడు. ఇది కూడా దేవుని అధికారమే.) చాలా బాగుంది. గొప్పగా చెప్పారు.
దేవుని అధికారం గురించి మనం మాట్లాడేటప్పుడు, మన గురి ఏమిటి, మనకుండే ముఖ్యమైన విషయం ఏమిటి? దీని గురించి మనం చర్చించాల్సిన అగత్యమేమిటి? సృష్టికర్తగా దేవుని హోదాను మరియు అన్ని విషయాల్లోనూ ఆయన స్థానాన్ని మనుష్యుల హృదయాల్లో స్థాపించడమే ఈ అంశం గురించి చర్చించడంలోని మొట్టమొదటి ఉద్దేశం. మొట్టమొదటిగా, మనుష్యులు దీన్ని తెలుసుకునేలా, చూసేలా మరియు అనుభూతి చెందేలా చేయవచ్చు. దేవుని క్రియలు, దేవుని మాటలు మరియు సకల అంశాల మీద దేవుని నియంత్రణ అనే వాటి నుండి నీవు ఏం చూస్తావు మరియు ఎలాంటి అనుభూతి చెందుతావు. ఆవిధంగా, దేవుని అధికారం ద్వారా చూడడం, నేర్చుకోవడం మరియు తెలుసుకోవడం నుండి మనుష్యులు నిజంగా అర్థం చేసుకునేదేమిటి? దీనికి సంబంధించిన మొదటి ఉద్దేశం గురించి మనం ఇదివరకే చర్చించాము. అలాగే, దేవుడు తన అధికారంతో చేసిన మరియు చెప్పిన మరియు నియంత్రించిన అన్నింటి నుండి దేవుడి శక్తిని మరియు జ్ఞానాన్ని మనుష్యులను చూడనివ్వడమే రెండో ఉద్దేశం. ప్రతి దానిని తన నియంత్రణలో పెట్టుకున్న దేవుడు ఎంత శక్తివంతుడో మరియు ఎంతటి జ్ఞానవంతుడో చూసేందుకు ఇది నిన్ను అనుమతిస్తుంది. దేవుని ప్రత్యేకమైన అధికారం గురించి మన మొదటగా చేసిన చర్చలో మన దృష్టికోణం మరియు ప్రధానాంశం ఇదే కదా? ఆ చర్చ జరిగి ఎక్కువ సమయం గడిచిపోనప్పటికీ, మీలో కొందరు దాని గురించి మరచిపోయారు. అంటే, దేవుని అధికారం గురించి మీరు అంత లోతైన అవగాహన పొందలేదని ఇది రుజువు చేస్తుంది. తద్వారా, దేవుని అధికారాన్ని మనిషి చూడలేదని కూడా చెప్పవచ్చు. ఇప్పటికైనా, మీకు కొంత అవగాహన వచ్చిందా? దేవుడు తన అధికారాన్ని వినియోగించుకొనుటను నీవు చూసినప్పుడు, నీకు నిజంగానే ఎలాంటి అనుభూతి కలిగింది? దేవుని శక్తిని నీవు నిజంగానే అనుభూతి చెందావా? (అవును). దేవుడు సమస్తాన్ని ఎలా సృష్టించాడనే దాని గురించిన ఆయన వాక్యములను నీవు చదివితే, ఆయన శక్తిని నీవు అనుభూతి చెందుతావు మరియు ఆయన సర్వశక్తిని నీవు అనుభూతి చెందుతావు. మనిషి విధి మీద దేవుని ఆధిపత్యాన్ని నీవు చూసినప్పుడు, నీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఆయన శక్తిని మరియు ఆయన జ్ఞానాన్ని మీరు అనుభూతి చెందుతున్నారా? ఈ శక్తిని దేవుడు కలిగి ఉండకపోతే, ఈ జ్ఞానాన్ని ఆయన కలిగి ఉండకపోతే, సమస్తము పైన మరియు మనుష్యుల విధి మీద ఆధిపత్యం వహించే అర్హత ఆయనకు దక్కేదా? శక్తిని మరియు జ్ఞానాన్ని దేవుడు కలిగియున్నాడు కాబట్టే, ఆయనకు ఈ అధికారం ఉంది. ఇది విశిష్టమైనది. సృష్టించబడిన జీవరాశియంతటిలో దేవుడి లాంటి శక్తి కలిగిన వ్యక్తిని లేదా జీవిని నీవు ఎప్పుడైనా చూశావా? ఆకాశములను, భూమిని, సమస్తమును సృష్టించడంతో పాటు వాటిని నియంత్రించడం మరియు వాటి మీద ఆధిపత్యం కలిగి ఉండే శక్తి ఎవరికైనా లేదా దేనికైనా ఉందా? సమస్త మానవాళిని పాలించగల మరియు ముందుండి నడిపించగలవారు ఎవరైనా ఉన్నారా, లేదంటే, అలాంటిది ఏదైనా ఉందా? (లేదు, అలాంటిదేదీ లేదు లేక అలాంటివారు ఎవరు లేరు.) దేవుని ప్రత్యేకమైన అధికారం గురించిన నిజమైన అర్థాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారా? మీకిప్పుడు దీని గురించి కొంచెమైనా అర్థమైందా? (అవును.) దేవుని ప్రత్యేకమైన అధికారం అనే అంశం వైపు మనం తిరిగి చూసేలా ఇది ముగించబడుతుంది.
రెండవ భాగంలో, దేవుని నీతియుతమైన స్వభావం గురించి మనం మాట్లాడుకున్నాము. నిజానికి, ఈ అంశం గురించి మనం ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే, ఈ దశలోదేవుని కార్యము అనేది ప్రధానంగా తీర్పు మరియు శిక్షకు సంబంధించినదై ఉంటుంది. రాజ్యపు యుగంలో, దేవుని నీతియుతమైన స్వభావం మరింత స్పష్టంగా మరియు సవివరంగా వెల్లడి చేయబడింది. సృష్టి సమయం నుండి ఇప్పటివరకు ఎప్పుడూ పలకని వాక్కులను ఆయన పలికాడు; మరియు ఆయన మాటల్లో, మనుష్యులందరూ, అంటే, ఆయన వాక్యాన్ని చదివి అనుభూతి చెందిన వారందరూ, బయలుపరచబడిన ఆయన నీతి స్వభావాన్ని చూశారు. మరి, దేవుని నీతి స్వభావమును గురించి మన చర్చలోని ప్రధాన అంశం ఏమిటి? మీరు దానిని లోతుగా అవగాహన చేసుకున్నారా? మీరు దానిని అనుభవం ద్వారా అర్థం చేసుకున్నారా? (ఆ సమయంలో ప్రజలందరూ తీవ్రంగా భ్రష్టు పట్టిపోవడంతోపాటు దేవునిలో ఆగ్రహం రేకెత్తించిన కారణంగానే, దేవుడు సొదొమను అగ్నితొ దహించాడు. దీని నుండి దేవుని నీతి స్వభావమును మనం చూస్తాము.) ముందుగా, ఒక విషయాన్ని చూద్దాం: సొదొమను దేవుడు నాశనం చేసి యుండకపోతే, ఆయన నీతి స్వభావం గురించి నీకు తెలిసేదా? నీవు ఇప్పటికీ, అలాగే ఉండేవాడివి కదా? రాజ్యపు యుగంలో దేవుడు పలికిన మాటల్లో మరియు మనిషి విషయంలో ఆయన తీర్పు, శిక్ష మరియు శాపాల్లో మీరు దానిని చూడవచ్చు. నినెవను విడిచిపెట్టడంలో దేవుని నీతి స్వభావమును మీరు చూడగలరా? (అవును.) ప్రస్తుత యుగంలో, దేవుని దయ, ప్రేమ మరియు సహనాన్ని మనుష్యులు చూడగలరు. అలాగే, మనిషి పశ్చాత్తాపాన్ని అనుసరించి దేవుని హృదయంలో మార్పును కూడా మనుష్యులు చూడగలరు. దేవుని నీతి స్వభావం గురించిన మన చర్చను పరిచయం చేయడం కోసం ఈ రెండు ఉదాహరణలు లేవనెత్తిన తర్వాత, ఆయన నీతి స్వభావం వెల్లడించబడడాన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు. అయితే, నిజానికి, దేవుని నీతి స్వభావపు గుణలక్షణము అనేది బైబిలులో వెల్లడిచేయబడిన ఈ రెండు కథలకే పరిమితం కాదు. దేవుని వాక్యములో మరియు ఆయన కార్యములో నుండి మీరు నేర్చుకున్నట్లుగా, చూసినట్లుగా మరియు అనుభవించిన దాని ప్రకారం, దేవుని నీతి స్వభావం అంటే ఏమిటి? మీ స్వంత అనుభవాల నుండి మాట్లాడండి. (మనుష్యుల కోసం దేవుడు సృష్టించిన పర్యావరణంలో, మనుష్యులు సత్యం కోసం అన్వేషించగలిగినప్పుడు మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినప్పుడు, దేవుడు వారికి మార్గనిర్దేశం చేస్తాడు, వారికి జ్ఞానోదయం కలిగిస్తాడు మరియు వారు తమ హృదయాల్లో వెలుగునిండినట్లుగా భావించేలా చేస్తాడు. మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా వెళ్లి, ఆయనను ప్రతిఘటించినప్పుడు మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించకపోయినప్పుడు, దేవుడు వారిని విడిచిపెట్టిన పక్షంలో వారి అంతరంగంలో అతి గొప్ప చీకటి ఉంటుంది. అలాంటప్పుడు, వారు ప్రార్థన చేసినప్పటికీ, ఆయనతో ఏం చెప్పుకోవాలో వారికి తెలియదు. అయితే, వారు దేవునికి సహకరిస్తూ, తమను తాము మెరుగ్గా చేసుకోవడానికి ఇష్టపడితే, క్రమంగా వారు చిరునవ్వుతో కూడిన ముఖం చూడగలుగుతారు. ఇక్కడ నుండి దేవుని నీతి స్వభావములోని పవిత్రత అనేది మన అనుభవంలోకి వస్తుంది. పరిశుద్ధమైన రాజ్యంలో దేవుడు కనిపిస్తాడు. అయితే, ఆయన అపరిశుద్ద ప్రదేశాలకు దూరంగా ఉంటాడు.) ( దేవుడు మనుష్యులతో నడుచుకునే విధానములో ఆయన నీతి స్వభావమును నేను చూస్తున్నాను. మన సోదరులు మరియు సోదరీమణులు వారి స్థాయిలో మరియు సామర్థ్యంలో భిన్నంగా ఉంటారు. దానికి తగ్గట్టే, మనలోని ప్రతిఒక్కరి నుండి దేవుడు కోరుకునేది కూడా భిన్నంగానే ఉంటుంది. మనమందరమూ దేవుని నుండి కలిగే జ్ఞానోదయాన్ని వివిధ స్థాయిల్లో పొందగలుగుతూనే ఉన్నాము. ఇందులోనూ దేవుని నీతిమంతత్వమును నేను చూస్తున్నాను. ఎందుకంటే, మనుష్యులమైన మనం సాటి మనిషితో ఈ విధంగా ప్రవర్తించలేము. కానీ, దేవుడు ప్రవర్తించగలడు.) ఇప్పుడు, మీకు మీరుగా చెప్పగల కొంత ఆచరణాత్మక జ్ఞానం మీ అందరిలోనూ ఉంది.
దేవుడి నీతి స్వభావమును అర్థం చేసుకోవడానికి అవసరమైన కీలకమైన జ్ఞానం ఏమిటో మీకు తెలుసా? ఈ అంశం మీద ఉండే అనుభవం నుండి చాలానే ఎక్కువగా చెప్పవచ్చు. కానీ, ముందుగా నేను మీకు చెప్పాల్సిన కొన్ని ప్రధానమైన అంశాలున్నాయి. ఒక వ్యక్తి దేవుని నీతి స్వభావమును అర్థం చేసుకోవాలంటే, ఆ వ్యక్తి ముందుగా దేవుని భావాలను అర్థం చేసుకోవాలి: అంటే, ఆయన వేటిని ద్వేషిస్తాడో, వేటిని అసహ్యించుకుంటాడో, వేటిని ఇష్టపడుతాడో, ఎవరి పట్ల ఆయన సహనం మరియు దయతో ఉంటాడో మరియు ఎలాంటి వ్యక్తికి తన దయను ప్రసాదిస్తాడో తెలుసుకోవాలి. ఇది ఒక ప్రధానమైన విషయం. దేవుడు ఎంతటి ప్రేమగలవాడైనప్పటికీ, మనుష్యులపట్ల ఆయనకు ఎంతటి దయ మరియు ప్రేమ ఉన్నప్పటికీ, తన హోదాను మరియు స్థానాన్ని ఎవరైనా కించపరచడాన్ని సహించడు. అలాగే, తన గౌరవాన్ని కించపరిచే వారిని కూడా ఆయన సహించడు. మనుష్యులను దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ, ఆయన వారిని అతి గారాబం చేయడు. మనుష్యుల మీద ఆయన తన ప్రేమను, తన దయను మరియు తన సహనాన్ని కురిపిస్తాడు. కానీ, ఆయన వారిని అతి లాలన చేయలేదు; దేవునికి తనకంటూ నిబంధనలు మరియు పరిమితులు ఉన్నాయి. దేవుని ప్రేమను నీవు ఎంతగా అనుభవించావనే దానితో సంబంధం లేకుండా, ఆ ప్రేమ ఎంత లోతైనదనే దానితో సంబంధం లేకుండా, మరొక వ్యక్తితో ప్రవర్తించినట్లుగా నీవు దేవునితో ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మనుష్యులపట్ల దేవుడు అత్యంత ఆత్మీయతతో వ్యవహరిస్తాడనేది నిజమే అయినప్పటికీ, ఎవరైనా దేవుణ్ణి కూడా కేవలం మరొక వ్యక్తిగా చూడడమో, ఆయన్ని కూడా ఒక సృష్టించబడిన జీవిలాగానే చూడడమో, ఒక స్నేహితుడిగానో లేదా పూజించే ఒక అంశంగానో చూస్తే, అలాంటి వారి నుండి దేవుడు తన ముఖాన్ని దాచేసుకుంటాడు మరియు వారిని పరిత్యజిస్తాడు. ఇదే ఆయన స్వభావము. మనుష్యులు ఈ విషయాన్ని ఆలోచనా రహితంగా తీసుకోకూడదు. కాబట్టే, తన స్వభావం గురించి దేవుడు మాట్లాడే ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం: నీవు ఎన్ని రోడ్ల వెంబడి ప్రయాణించినప్పటికీ, నీవు ఎంత గొప్ప పని పూర్తి చేసినప్పటికీ, లేదా నీవు ఎన్నెన్ని బాధలు సహించినప్పటికీ, వాటన్నింటితో సంబంధం లేకుండా, దేవుని స్వభావమును నీవు కించపరిచిన పక్షంలో, మీరు చేసిన దాని ఆధారంగా, మీలో ప్రతి ఒక్కరికీ ఆయన తగిన మూల్యం అందజేస్తాడు. దీని అర్థం ఏమిటంటే, మనుష్యులను దేవుడు అత్యంత ఆత్మీయంగా చూసినప్పటికీ, మనుష్యులు మాత్రం దేవుడిని ఒక స్నేహితుడిలా లేదా ఒక బంధువులా పరిగణించకూడదు. దేవుణ్ణి మీ “మిత్రుడు”గా పిలవకండి. ఆయన నుండి నీవు ఎంతటి ప్రేమను పొందినప్పటికీ, ఆయన మీపట్ల ఎంతటి సహనం ప్రదర్శించినప్పటికీ, నీవెప్పటికీ దేవుణ్ణి నీ స్నేహితుడిగా పరిగణించకూడదు. ఇదే దేవుని నీతి స్వభావము. మీకు అర్ధమైందా? దీని గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ విషయంలో మీకు ముందస్తు అవగాహన ఏదైనా ఉందా? సాధారణమైన మాటల్లో చెప్పాలంటే, సిద్ధాంతాలను అర్థం చేసుకున్నారా, లేదంటే, ముందెప్పుడైనా వారు ఈ అంశం గురించి ఆలోచించారా అనే దానితో సంబంధం లేకుండా, మనుష్యులందరూ సులభంగా చేసే తప్పు ఇది. దేవుణ్ణి మనుష్యులు నిందించినప్పుడు, దానికి కారణం, వారు చెప్పే ఒక సంఘటనో లేదా ఒక విషయమో కాకపోవచ్చు. నిజానికి, వారు కలిగి ఉన్న వైఖరి మరియు వారు ఉన్న స్థితి అనేది దానికి కారణం కావచ్చు. ఇది చాలా భయంకరమైన విషయం. కొందరు వ్యక్తుల విషయానికి వస్తే, తమకు దేవుడు గురించిన అవగాహన ఉందనీ, ఆయన గురించిన కొంత జ్ఞానం ఉందనీ వారు నమ్ముతారు మరియు దేవుణ్ణి సంతృప్తిపరిచే కొన్ని పనులు కూడా వారి చేసి ఉండవచ్చు. దాంతో, వారు తమ్మును తాము దేవునితో సమానంగా భావించడం మొదలుపెడుతారు మరియు వారు తెలివిగా తమను తాము దేవునితో స్నేహం కలిగినవారుగా మార్చేసుకుంటారు. ఈ రకమైన భావాలనేవి అత్యంత తప్పిదమైనవి. దీని గురించి నీకు లోతైన అవగాహన లేకపోతే, అంటే దీనిని మీరు స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతే, నీవు అత్యంత సులభంగా దేవుణ్ణి నిందిస్తావు మరియు ఆయన నీతి స్వభావమును నిందిస్తావు. మీకు ఈ విషయం ఇప్పుడు అర్థమైంది కదా? దేవుని నీతి స్వభావం విశిష్టమైనది కాదంటారా? మనిషి గుణము, లేదా నైతిక స్థితి అనేది ఎప్పటికైనా దానికి సమానం కాగలదా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి, మనుష్యులతో దేవుడు ఎలా ప్రవర్తించినప్పటికీ, లేదా మనుష్యుల గురించి ఆయన ఎలా ఆలోచించినప్పటికీ, దేవుని స్థానం, అధికారం మరియు హోదా అనేవి ఎప్పటికీ మారబోవని నీవు మర్చిపోకూడదు. మానవజాతికి సంబంధించిన సమస్త విషయాలకు దేవుడే ఎల్లప్పుడూ ప్రభువుగాను మరియు సృష్టికర్తగాను ఉంటాడు.
దేవుని పరిశుద్ధతను గురించి మీరు ఏం నేర్చుకున్నారు? “దేవుని పరిశుద్ధత” గురించిన భాగంలో, సాతాను దుష్టత్వం అనేది విభేదించే విధంగా ఉపయోగించబడినప్పటికీ, దేవుని పరిశుద్ధతను గురించిన మన చర్చలో ప్రధాన విషయంగా ఉన్నదేమిటి? ఇది దేవుడు కలిగియున్నది మరియు దేవుడు ఏమైయున్నాడనే విషయమును గురించి కాదంటారా? ఇది దేవుడు కలిగి ఉన్నది మరియు దేవునికి మాత్రమే ప్రత్యేకమైనది కాదంటారా? (అవును.) ఇది సృష్టించబడిన జీవులు కలిగియుండలేనిది. ఇందుచేతనే, దేవుని పరిశుద్ధత ఎంతో ప్రత్యేకమైనదని మనం చెబుతుంటాం. ఇదే మీరు అర్థం చేసుకోవావాల్సిన విషయం. దేవుని పరిశుద్ధత అనే అంశం మీద మనం మూడు సమావేశాలు నిర్వహించాము. దేవుని పరిశుద్ధత అంటే మీరు ఏం విశ్వసిస్తున్నారనే దాని గురించి మీ స్వంత మాటల్లో, మీ స్వంత అవగాహన మేరకు మీరు వివరించగలరా? (చివరిసారిగా, దేవుడు మనతో మాట్లాడిన సమయంలో, మనము ఆయన ఎదుట తల వంచి నమస్కరించామ. ఆయనను ఆరాధించడానికి ఎలా తల వంచుకొని మరియు ఏవిధంగా నమస్కరించాలనే సత్యమును దేవుడు మనకు సహవాసము ద్వారా తెలియజేశాడు. ఆయన కోరుకొనిన వాటిని చేయుటకు ముందే ఆయన్ని ఆరాధించడం కోసం తల వంచి నమస్కరించడం అనేది ఆయన చిత్తానికి అనుగుణమైనది కానిదని మనం చూశాము. అలాగే, దీని నుండే మనం దేవుని పరిశుద్ధతను చూశాము.) ఇది ఎంతో వాస్తవం. ఇంకేమైనా ఉందా? (మానవాళికి దేవుడు చెప్పిన మాటల్లో, ఆయన చాలా సరళంగా మరియు స్పష్టంగా మాట్లాడడం చూస్తాము. ఆయన సూటిగా మాట్లాడుతాడు మరియు అవసరమైన అంశం మీదే దృష్టి పెడుతాడు. అయితే, సాతాను తిప్పితిప్పి మాట్లాడతాడు మరియు అంతా అబద్ధాలే మాట్లాడుతాడు. చివరిసారిగా, మనం దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు ఏం జరిగిందో మనం చూశాము. ఆయన మాటలు మరియు ఆయన క్రియలు సూత్ర బద్ధమై ఉన్నాయి. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా పరిశీలించాలి మరియు ఎలా ఆచరించాలని ఆయన మనకు చెప్పినప్పుడల్లా, ఆయన ఎల్లప్పుడూ స్పష్టంగా మరియు సంక్షిప్తంగానే చెప్పాడు. అయితే, మనుష్యులు మాత్రం ఆ ప్రకారంగా ఉండడం లేదు. సాతాను ద్వారా మానవ జాతి భ్రష్టుపట్టిపోయిన కారణంగా, వారు తమ స్వంత వ్యక్తిగత ఉద్దేశాలను, లక్ష్యాలను మరియు కోరికలను దృష్టిలో ఉంచుకునే ప్రవర్తించారు మరియు మాట్లాడుతున్నారు. అయితే, దేవుడు మాత్రం మానవాళిని చూసే, వారి పట్ల శ్రద్ధ వహించే రీతిలో మరియు వారిని రక్షించే తీరులో ఆయన చేసే ప్రతి ఒక్కటీ సానుకూలంగా మరియు స్పష్టంగా ఉండడాన్ని మనం చూస్తాము. ఈ క్రమంలో, దేవుని పరిశుద్ధతకు సంబంధించిన గుణలక్షణాలన్ని బహిర్గతం కావడం మనం చూస్తాము.) చక్కగా అర్థమైంది కదా! ఎవరైనా ఏదైనా చెప్పాల్సినది ఉందా? (సాతాను దుష్టత్వాన్ని బహిర్గతం చేసేది దేవుడే అయినప్పటికీ, అందులోనే మనం దేవుని పరిశుద్ధతను చూస్తాము, సాతాను దుష్టత్వం గురించి ఎక్కువ జ్ఞానం పొందుకుంటాము మరియు మానవజాతి కష్టాలకు మూలం ఏమిటో చూస్తాము. గతంలో, సాతాను పాలనలో మనిషి బాధలకు మూలమేమిటో మనకు తెలియదు. దేవుడు ఈ విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత మాత్రమే, కీర్తి మరియు అదృష్టం వెంబడి పరుగుల కారణంగా ఎదురయ్యే బాధలన్నీ సాతాను చేష్టలేనని మనం చూశాము. ఆ తర్వాత మాత్రమే, దేవుని పరిశుద్ధతతే మానవాళికి నిజమైన మోక్షమని మనం గ్రహించాము.) దీనికి అదనంగా ఇంకేమైనా జోడించాలా? (భ్రష్టుపట్టిన మానవాళికి దేవుని గురించిన నిజమైన జ్ఞానం మరియు దేవుని కొరకైన నిజమైన ప్రేమ లేదు. ఎందుకంటే, దేవుని పరిశుద్ధత అనే గుణలక్షణాన్ని మనం అర్థం చేసుకోలేము మరియు ఆరాధనలో సాగిలపడి ఆయన ముందు మనం నమస్కరించినప్పుడు కూడా, అపవిత్రమైన ఆలోచనలతో మరియు కలుషితమైన ఉద్దేశాలు మరియు ప్రయోజనాల కోసమే మనం ఆ పని చేస్తాము. కాబట్టి, దేవుడు దానిని ఇష్టపడడు. దేవుడు సాతానుకి విభిన్నంగా ఉండడాన్ని మనం చూడవచ్చు; మనుష్యులు తనను ఆరాధించాలనీ మరియు పొగడ్తలతో ముంచెత్తాలనీ, తనను ఆరాధించడం కోసం తన ముందు సాగిలపడాలని సాతాను కోరుకుంటాడు. సాతానుకి ఎలాంటి నియమాలూ లేవు. దీని నుండి కూడా, దేవుని పరిశుద్ధత నేను అవగాహన పొందియున్నాను.) చాలా మంచిది! ఇప్పుడు మనం దేవుని పరిశుద్ధత గురించిన సహవాసం పూర్తి చేశాము. దేవుని పరిపూర్ణతను మీరు చూశారా? అన్ని సానుకూల అంశాలకు దేవుడే ఎలా మూలమయ్యాడో మీరు చూస్తున్నారా? సత్యం మరియు న్యాయం అనే వాటికి దేవుడే రూపమై ఉండడాన్ని మీరు చూడగలుగుచున్నారా? ప్రేమకు మూలంగా దేవుడు ఉండడాన్ని మీరు చూస్తున్నారా? దేవుడు చేసేవన్నీ, ఆయన వ్యక్తపరిచేవన్నీ మరియు ఆయన వెల్లడించేవన్నీ ఏ విధంగా దోషరహితంగా ఉన్నాయో మీరు చూస్తున్నారా? (మేము చూశాము.) దేవుని పరిశుద్ధత గురించి నేను చెప్పిన వాటిలో ఇవే ప్రధానమైన అంశాలు. ఈ రోజున, ఈ మాటలు మీకు కేవలం సిద్ధాంతపరమైనవిగా అనిపించవచ్చు, కానీ ఒక రోజున, దేవుని మాట నుండి మరియు ఆయన కార్యము నుండి నిజమైన దేవుణ్ణి నువ్వు అనుభవించి, వాటిని ప్రత్యక్షంగా చూసినప్పుడు, దేవుడు పరిశుద్దుడని, దేవుడు మానవాళికంటే భిన్నమైన వాడనీ మరియు ఆయన హృదయం, స్వభావం మరియు గుణలక్షణాలన్నీ పవిత్రమైనవనీ నువ్వే నీ హృదయ లోతుల్లో నుండి చెబుతావు. దేవుని పరిపూర్ణతను చూడడానికి మరియు దేవుని పరిశుద్ధతకు సంబంధించిన గుణలక్షణము నిష్కళంకమైనదని గ్రహించడానికి ఈ పరిశుద్ధతే మనిషికి అనుమతిస్తుంది. దేవుని పరిశుద్ధత గునలక్షణం అనేది ఆయనే దేవుడనీ, ప్రత్యేకమైనవాడని తీర్మానిస్తుంది మరియు ఈ రెండు అంశాలూ కలిసి ఆయనే ప్రత్యేకమైన దేవుడని మనిషి చూసేలా మరియు రుజువు చేసేలా చేస్తుంది. ఇందులో ఇదే ప్రధానమైన అంశం కాదా? (అవును ఇదే ప్రధానమైన అంశం.)
గత సహవాసాల నుండి అనేక అంశాలకు సంబంధించి, ఈ రోజు మనం ఒక స్థూల దృష్టిని నిర్వహించాము. నేటి స్థూల దృష్టితో ఇది ముగించబడుతుంది. మనం చర్చించిన ప్రతి అంశము మరియు విషయములోని ప్రధాన అంశాలను మీరందరూ మనఃపూర్వకంగా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. వీటని సిద్ధాంతపరమైనవిగా మాత్రమే భావించకండి; మీకు కాస్త విరామ సమయం దొరికినప్పుడు, నిజంగా వాటిని చదవండి మరియు వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీ హృదయములో వాటిని జ్ఞాపకం ఉంచుకోండి మరియు వాటిని క్రియా రూపములోనికి తీసుకురండి. అప్పుడు, దేవుడు తన స్వభావాన్ని బహిర్గతం చేయడం మరియు తానంటే ఏమిటో మరియు తాను ఏమై ఉన్నాడో బహిర్గతం చేయడమనే వాస్తవం గురించి నేను చెప్పినవన్నింటినీ మీరు నిజంగా అనుభూతి చెందుతారు. అయితే, నీవు వాటిని నీ నోటుపుస్తకంలో మాత్రమే రాసి ఉంచుకుని, వాటిని చదవకుండా లేదా వాటి గురించి ఆలోచించకుండా ఉంటే, వాటిని నీవు నీకోసం ఎప్పటికీ పొందుకోలేవు. మీరిప్పుడు అర్థం చేసుకున్నారు, కదా? ఈ మూడు అంశాల గురించి మాట్లాడుకున్న తర్వాత, దేవుని స్థితి, గుణ లక్షణము మరియు స్వభావం గురించి మనుష్యులు సాధారణ అవగాహన పొందినప్పుడు, లేదా నిర్దిష్ట స్థాయి అవగాహన పొందినప్పుడు, దేవుడు గురించిన వారి అవగాహన సంపూర్ణమైనదిగానే ఉంటుందా? (ఉండదు.) ఇప్పుడు, దేవుడు గురించిన నీ స్వంత అవగాహనకు వస్తే, ఏదైనా అంశాలకు సంబంధించి నీకు మరింత లోతైన అవగాహన అవసరమని నీవు భావిస్తున్నావా? అలాంటి పరిస్థితే ఉంటే, దేవుని అధికారం, ఆయన నీతి స్వభావం మరియు ఆయన పరిశుద్ధత గురించి నీవు అవగాహన పొందడమే కాకుండా, బహుశా ఆయన విశిష్ట హోదా మరియు స్థానం గురించి కూడా నీ మనస్సులో స్థిరమైన ఆలోచన ఉంటుంది; అయినప్పటికీ, మీదైన సొంత అనుభవం ద్వారా ఆయన కార్యములు, ఆయన శక్తి మరియు ఆయన గునలక్షణము గురించిన నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు, మీరు ఈ సహవాసాలు విన్న తర్వాత, మీ మనస్సుల్లో విశ్వాసం అనే అంశం గురించిన భావన ఎక్కువో, తక్కువో స్థిరపడే ఉంటుంది: దేవుడు నిజంగానే ఉనికిలో ఉన్నాడు మరియు అన్ని విషయాలనూ ఆయనే నిర్వహిస్తున్నాడనేది సత్యము. ఆయన నీతి స్వభావమును ఎవరూ తప్పు పట్టలేరు; ఆయన పరిశుద్ధత అనేది ఎవరూ ప్రశ్నించ వీలు కాని నిర్దిష్టతను కలిగియున్నది. ఇవన్నీ వాస్తవాలు. దేవుని హోదా మరియు స్థానం గురించి మానవుల హృదయాలలో పునాది వేయడానికి ఈ సహవాసాలు అనుమతిస్తాయి. ఒకసారి ఈ పునాది నాటుకున్న తర్వాత, మరింత అర్థం చేసుకోవడానికి మనుష్యులు ప్రయత్నించాలి.
1వ కథ: ఒక విత్తనం, భూమి, ఒక చెట్టు, సూర్యకాంతి, పక్షులు మరియు మనిషి
ఈ రోజు, ఒక కొత్త అంశం గురించి మీతో నేను సహవాసం చేయబోతున్నాను. ఇంతకీ, ఈ అంశం ఏమిటి? దాని శీర్షిక ఏమిటంటే: “ దేవుడే సమస్తమైనవాటికి జీవాధారమైయున్నాడు” ఈ అంశం కొంచెం పెద్దదిగా ఉంటుందేమో అని అనిపిస్త్తోందా? ఇది మీరు అనుకున్నదానికి అతీతంగా చిన్నదిగా అనిపిస్తోందా? “దేవుడే సమస్తమైనవాటికి జీవాధారమైయున్నాడు” అనే ఈ అంశం మనుష్యులకు కాస్త పాతదిగా అనిపించవచ్చు. అయితే, దేవుణ్ణి అనుసరించే వారందరూ తప్పక దీనిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని గురించిన పరిజ్ఞానముతోను ఆయన్ని సంతృప్తి పరచగల, గౌరవించగల వారి సామర్థ్యంతోను ఇది విడదీయలేనంతగా ముడిపడి ఉంటుంది. అందుచేతనే, ఈ అంశం గురించి సహవాసం చేయడానికి నేను సిద్దమయ్యాను. ఈ అంశానికి సంబంధించి వ్యక్తులకు ఇదివరకే ఒక సరళమైన, ముందస్తు అవగాహన ఉండవచ్చు, లేదంటే, బహుశా వారికి కొంతమేర దీని గురించి తెలిసి ఉండే అవకాశం కూడా ఉంది. ఈ పరిజ్ఞానం లేదా అవగాహన అనేది కొందరి మనస్సుల్లో, సరళమైన లేదంటే కొంత లోతైన అవగాహనతో మిళితమై ఉండవచ్చు. ఇంకొందరు ఈ అంశంతో లోతైన, వ్యక్తిగత ముఖాముఖీకి దారితీసిన సంఘటనలతో ముడిపడిన ప్రత్యేక అనుభవాలను వారి మనస్సుల్లో నిక్షిప్తం చేసుకుని ఉండవచ్చు. అయితే, అలాంటి ముందస్తు పరిజ్ఞానమనేది లోతైనదైనా లేదా పైపైనగా ఉండేదైనా అది ఏకపక్షంగానే ఉంటుంది మరియు తగినంత నిర్దిష్టమైనదిగా ఉండదు. కాబట్టే, ఈ అంశాన్ని నేను సహవాసం కోసం ఎంచుకున్నాను: మీరు ఒక లోతైన మరియు మరింత నిర్దిష్టమైన అవగాహనకు రావడంలో నేను మీకు సహాయం చేస్తాను. ఈ అంశం గురించి మీతో సహవాసం కోసం నేనొక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించనున్నాను. గతంలో, మనమెప్పుడూ ఉపయోగించని పద్ధతి ఇది. ఇది మీకు కాస్తంత అసాధారణంగా అనిపించవచ్చు, లేదంటే కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే, ఇది ముగిసిన తర్వాత, మీకు నా ఉద్దేశ్యం అర్థమవుతుంది. మీకందరికీ కథలంటే ఇష్టమే కదా? (అవును, ఇష్టమే.) సరే, మీరు ఇంతలా ఇష్టపడుతున్నారంటే, కథలు చెప్పాలనే నా ఎంపిక సరైనదిగానే అనిపిస్తోంది. సరే, మనం మొదలుపెడదాం. మీరిప్పుడు మీ నోటుపుస్తకాలు తీసుకోవాల్సిన అవసరమేం లేదు. మీరందరూ ప్రశాంతంగా ఉండాలనీ, అనవసర కదలికలు లేకుండా ఉండాలనీ నేను కోరుకుంటున్నాను. మీ పరిసరాల కారణంగా, లేదంటే మీ చుట్టూ ఉన్న వారి కారణంగా, మీ ఏకాగ్రత దెబ్బతింటోందని మీరు భావిస్తే, మీరు మీ కళ్లను మూసుకోవచ్చు. మీకు చెప్పడం కోసం నా దగ్గరొక అద్భుతమైన కథ ఉంది. ఒక విత్తనం, భూమి, ఒక చెట్టు, సూర్యకాంతి, పక్షులు మరియు మనిషికి సంబంధించిన కథ ఇది. ఈ కథలోని ప్రధాన పాత్రలేమిటి? (ఒక విత్తనం, భూమి, చెట్టు, సూర్యకాంతి, పక్షులు మరియు మనిషి.) ఇందులో దేవుడు కూడా ఉన్నాడా? (లేడు.) అయినప్పటికీ, మీరు ఈ కథ విన్న తర్వాత, మీరు ఉపశమనం పొంది, సంతృప్తి చెందుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు, దయచేసి నిశ్శబ్దంగా వినండి.
ఒక చిన్న విత్తనం భూమి మీద పడింది. చాలా భారీగా వర్షం కురిసిందిమరియు ఆ విత్తనం నుండి లేత మొలక బయటకు వచ్చింది, దాని వేళ్లు నెమ్మదిగా క్రిందనున్న భూమిలోకి ప్రవేశించాయి. కాలక్రమేనా, వీసె వీదురు గాలులకు మరియు తీవ్రమైన వర్షాలకు తట్టుకుంటూ, ఆ మొలక ఏపుగా పెరిగింది. ఆ క్రమంలో, చంద్రుడు వృద్ది చెందడం మరియు క్షీణించడంలాంటి ఋతువుల మార్పులకు అది సాక్ష్యంగా నిలిచింది. వేసవిలో, భూమి అందించిన నీళ్లు అనే బహుమతితో, ఆ మండే వేసవిని ఆ మొలక తట్టుకోగలిగింది. భూమి కారణంగానే, ఆ వేసవి వేడి మొలకను ఏమీ చేయలేకపోయింది. ఆవిధంగా, ఆ వేసవి వేడి వెళ్లిపోయింది. శీతాకాలం వచ్చినప్పుడు, భూమి దాని వెచ్చటి కౌగిట్లో మొలకను కప్పేసింది. ఆవిధంగా, భూమి మరియు ఆ మొలక ఒకదాని కౌగిట్లో ఒకటి వెచ్చగా ఒదిగిపోయాయి. భూమి అందించిన వేడితో ఆ శీతాకాలపు చలిగాలులు మరియు మంచు తుఫానుల నుండి ఆ మొలక క్షేమంగా బయటపడింది. భూమి అందించిన ఆశ్రయంతో ఆ మొలక ధైర్యంగా మరియు సంతోషంగా పెరిగి పెద్దదైంది; భూమి నిస్వార్థంగా ఆ మొలకకు పోషణ అందించడంతో ఆ మొలక ఆరోగ్యంగా మరియు బలంగా పెరిగింది. వర్షంలో పాడుతూ, నాట్యం చేస్తూ, గాలికి ఊగుతూ ఆనందంగా పెరిగింది. మొలక మరియు భూమి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి ...
సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ చిన్న మొలక భారీ వృక్షంగా పెరిగింది. లెక్కకు మించిన ఆకులతో ఉన్న బలిష్టమైన కొమ్మలతో అది భూమి మీద బలంగా నిలబడింది. అయితే, ఆ చెట్టు వేర్లు మాత్రం ఇప్పటికీ భూమిలోకే పాతుకుని ఉన్నాయి. అలాగే, ఇప్పుడవి భూమిలోని మట్టిలోకి మరింత లోతుకు చొచ్చుకు వెళ్లాయి. ఒకప్పుడు, ఒక చిన్న మొలకగా దానికి రక్షణ ఇచ్చిన అదే భూమి, ఇప్పుడు ఆ భారీ వృక్షానికి సైతం పునాదిగా ఉంటోంది.
చెట్టు మీదకి ఒక సూర్యకిరణం ప్రకాశించింది. చెట్టు దాని శరీరాన్ని ఊపుతూ, తన చేతులను వెడల్పుగా చాచి సూర్యరశ్మి గాలిని పీల్చుకుంది. చెట్టు క్రింద ఉన్న భూమి సైతం అదేసమయంలో ఊపిరి పీల్చుకుందిమరియు కొత్త ఊపిరి అందినట్లుగా భూమి భావించింది. సరిగ్గా అప్పుడే, కొమ్మల మధ్య నుండి తాజా గాలి వీచింది, చెట్టు ఆనందంతో కదిలింది, సరికొత్త శక్తితో ఊగింది. చెట్టు మరియు సూర్యకాంతి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి ...
మనుష్యులు ఆ చెట్టు చల్లని నీడలో కూర్చుని, ఉత్సాహం మరియు సువాసనతో నిండిన దాని గాలిని పీల్చుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు. ఆ గాలి వారి హృదయాలను మరియు ఊపిరితిత్తులను శుభ్రం చేసింది మరియు అది వారిలోని రక్తాన్ని శుభ్రం చేసింది మరియు వారి శరీరాలు ఇకపై మొద్దుబారినట్లుగా లేదా నిర్బంధంలో ఉన్నట్లుగా ఉండవు. మనుష్యులు మరియు చెట్టు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు ...
ఆ చెట్టు కొమ్మల మీదకు చిన్న పక్షుల గుంపు ఒకటి చేరింది. బహుశా అవి వాటిని వేటాడే జీవుల నుండి తప్పించుకోవడానికో లేదా వాటి పిల్లలను పెంచి, పెద్ద చేయడానికో అక్కడకు చేరాయి, లేదంటే, కొంతకాలం విశ్రాంతి కోసం కూడా వచ్చి ఉండవచ్చు. పక్షులు మరియు చెట్టు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి ...
ఆ చెట్టు వేర్లు మరింత మెలితిరిగి మరియు ఒకదానికొకటి అల్లుకుపోయి భూమిలోకి మరింత లోతుకి చొచ్చుకువెళ్లాయి. చెట్టు దాని కాండంతో గాలి మరియు వర్షం నుండి భూమికి ఆశ్రయం ఇచ్చింది మరియు దాని క్రింద ఉన్న భూమిని రక్షించడం కోసం ఆ చెట్టు దాని కొమ్మలను విస్తరించింది. భూమి తన తల్లి కాబట్టే చెట్టు ఆవిధంగా చేసింది. అవి పరస్పరం ఒకదానినొకటి బలపరచుకుంటాయి మరియు అవి ఒక దానిమీద ఒకటి ఆధారపడతాయి మరియు అవి ఎప్పటికీ విడిపోవు ...
ఈ విధంగా, ఈ కథ ముగిసింది. ఒక విత్తనం, భూమి, చెట్టు, సూర్యకాంతి, పక్షులు మరియు మనిషి గురించి నేను చెప్పిన కథలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఇది మీలో ఎలాంటి భావాలను మిగిల్చింది? నేను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతోందా? (మాకు అర్థమవుతోంది.) దయచేసి, మీ భావాల గురించి మాట్లాడండి. ఈ కథ విన్న తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? ఈ కథలో చూడగలిగిన, తాగగలిగిన పాత్రలన్నిటిని గూర్చి నేను మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నాను; అవన్నీ నిజమైన అంశాలే తప్ప, రూపకలంకారాలు కావు. నేను చెప్పినవాటిని పరిగణించాలని నేను కోరుకుంటున్నాను. నా కథలో రహస్యమైన విషయాలేవీ లేవు మరియు కథలోని ప్రధాన అంశాలను కొన్ని వాక్యాల్లో వ్యక్తీకరించవచ్చు. (మనం విన్న కథ ఒక అందమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది: ఒక విత్తనం మొలకెత్తి, పెరిగేకొద్దీ, సంవత్సరంలోని నాలుగు ఋతువులైన వసంతం, వేసవి, శరదృతువు మరియు శీతాకాలాన్ని అది అనుభూతి చెందుతోంది. మొలకెత్తిన విత్తనానికి భూమి తల్లిలాగా పోషణ అందిస్తోంది. చలికాలంలో అది మొలకకు వేడి అందిస్తుంది. తద్వారా, మొలక ఆ చలికాలాన్ని తట్టుకుంటుంది. ఆ మొలక ఒక చెట్టుగా ఎదిగిన తర్వాత, సూర్య కిరణం దాని కొమ్మలను తాకినప్పుడు, అది చాలా ఆనందాన్ని అనుభవిస్తుంది. దేవుని విభిన్న సృష్టిలో భూమిని కూడా సజీవమైనదిగానే నేను చూస్తున్నాను. అలాగే, భూమి మరియు చెట్టు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. చెట్టుకి సూర్యరశ్మి ప్రసాదించే గొప్ప వెచ్చదనాన్ని కూడా నేను చూస్తున్నాను. అలాగే, పక్షులు, సాధారణ జీవులైనప్పటికీ, అవి కూడా ఆ చెట్టు మరియు మానవులతో కలసి ఒక పరిపూర్ణ సామరస్యపు చిత్రంలో భాగం కావడాన్ని నేను చూస్తున్నాను. ఈ కథ విన్నప్పుడు నా హృదయంలో కలిగిన భావాలవి; ఇవన్నీ నిజంగా సజీవంగానే ఉన్నాయని నేను గ్రహించాను.) చాలాబాగా చెప్పారు! ఇంకెవరైనా, ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? (ఒక విత్తనం మొలకెత్తి, చెట్టుగా ఎదిగిన ఈ కథలో, దేవుని సృష్టిలోని అద్భుతాన్ని నేను చూస్తున్నాను. దేవుడు అన్ని అంశాలను పటిష్టం చేసి, ఒకదాని మీద ఒకటి ఆధారపడేలా చేశాడు మరియు అన్ని అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి, పరస్పర సేవలు అందించుకోవడాన్ని నేను చూస్తున్నాను. దేవుని జ్ఞానం, ఆయన అద్భుతాన్ని నేను చూస్తున్నాను. ఆయనే సమస్తానికి జీవాధామై ఉన్నాడనే విషయాన్ని నేను చూస్తున్నాను.)
కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడినవన్నీ మీరు గతంలో చూసినవే. ఉదాహరణకు విత్తనాలు విషయానికి వస్తే, అవి వృక్షాలుగా పెరుగుతాయి. వృక్షాలు ఎదిగే విధానములో భాగమైన ప్రతి వివరాన్ని నీవు చూడలేకపోయినప్పటికీ, అలా జరుగుతుందని నీకు తెలుసు కదా, నీకు తెలియదా? భూమి మరియు సూర్యకాంతి గురించి కూడా మీకు తెలుసు. చెట్టు మీద పక్షులు ఉండే దృశ్యం అందరూ చూసేదే కదా? అలాగే, చెట్టు నీడలో మనుష్యులు సేద తీరే దృశ్యం కూడా, ఇవన్నీ మీరందరూ చూసినవే కదా? (అవును.) కాబట్టి, ఇవన్నీ ఒకే చిత్రంలో ఉన్నప్పుడు, ఆ చిత్రం మీకు ఎలాంటి భావాన్ని కలిగిస్తుంది? (సమాధానకరమైన భావనను కలిగిస్తుంది.) అలాంటి చిత్రంలోని ప్రతి అంశం దేవుని నుండి వచ్చిందే కదా? (అవును.) అవి దేవుని నుండి వచ్చాయి కాబట్టి, ఈ విభిన్నమైన ప్రతీది భూ సంబంధమైన ఉనికి మరియు వాటి విలువను గురించి దేవునికి తెలుసు. దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడు, ఆయన ప్రణాళిక ప్రకారంగా ప్రతిదానిని సృష్టించినప్పుడు, ఆయన ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడు; మరియు ఆయన వాటిని సృష్టించినప్పుడు, ప్రతి ఒక్కటీ జీవంతో నిండి ఉంది. మన కథలో చెప్పబడినట్లుగా, మానవజాతి ఉనికి కోసం ఆయన సృష్టించిన వాతావరణంలో విత్తనాలు మరియు భూమి ఒకదాని మీద కొకటి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ భూమి అనేది విత్తనాలకు పోషణ అందించగలదు మరియు విత్తనాలనేవి భూమితో బంధం కలిగి కట్టుబడి ఉంటాయి. ఈ రకమైన బంధాన్ని దేవుడు తన సృష్టి ప్రారంభంలోనే ఏర్పరిచాడు. ఒక చెట్టు, సూర్యకాంతి, పక్షులు మరియు మనుష్యులతో కూడిన ఒక దృశ్యం అనేది మానవాళి కోసం దేవుడు సృష్టించిన ఒక సజీవ పర్యావరణానికి దృశ్యరూపంగా ఉంటుంది. మొదటిగా, చెట్టు భూమిని వదలిపెట్టలేదు, సూర్యకాంతి లేకుండా జీవించలేదు. మరి, చెట్టును సృష్టించడంలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి? దాన్ని సృష్టించింది భూమి కోసం మాత్రమే అని చెప్పగలమా? అది పక్షుల కోసం మాత్రమే అని మనం చెప్పగలమా? అది మనుష్యుల కోసం మాత్రమే అని మనం చెప్పగలమా? (లేదు) మరి, వాటి మధ్య బంధం ఏమిటి? వాటి మధ్య బంధం అనేది పరస్పరం బలోపేతమయ్యేది, పరస్పరం ఆధారపడేది మరియు విడదీయలేనిది. సరిగ్గా చెప్పాలంటే, భూమి, చెట్టు, సూర్యకాంతి, పక్షులు, మనుషులు తమ ఉనికి కోసం ఒకదాని మీద మరొకటి ఆధారపడుతూ, ఒకదానికి మరొకటి పోషణ అందిస్తాయి. చెట్టు భూమికి రక్షణ అందిస్తుంది, అలాగే, చెట్టుకి భూమి పోషణ అందిస్తుంది; సూర్యకాంతి చెట్టుకు అందించబడుతోంది. సూర్యరశ్మి నుండి చెట్టు తాజా గాలిని పొందడం ద్వారా, భూమి మీద సూర్యుడి తాపాన్ని తగ్గిస్తుంది. చివరకు దీనివల్ల ఎవరికి లాభం దక్కుతుంది? ఆ లాభం దక్కేది మానవజాతికే కదా? మానవజాతి నివసించడం కోసం దేవుడు సృష్టించిన ఈ పర్యావరణానికి ఆధారితమైన సూత్రాల్లో ఇది ఒకటి; మొదటి నుండి ఇది ఇలాగే ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ చిత్రం చాలా సాధారణముగా ఉన్నప్పటికిని మనం అందులో మనం దేవుని జ్ఞానం మరియు ఆయన ఉద్దేశం చూడవచ్చు. భూమి లేకుండా, చెట్లు లేకుండా, పక్షులు మరియు సూర్యకాంతి లేకుండా మానవజాతికి మనుగడ లేదు. ఇక్కడ చెబుతున్నది ఇదే కదా? ఇది ఒక కథే అయినప్పటికీ, దేవుడు సృష్టించిన భూమ్యాకాశములు మరియు సమస్త జీవులు మరియు వాతావరణం అనే దేవుని బహుమానము అనేవి ఒక పెద్ద సూక్ష్మ ప్రపంచములా కనిపిస్తోంది. ఇందులోనే మానవజాతి నివసిస్తోంది.
మానవాళి కోసమే దేవుడు భూమ్యాకాశాములను మరియు అందలి సమస్తమైనవాటిని సృష్టించడముతోపాటు నివాసం ఉండటానికి వాతావరణాన్ని కూడా సృష్టించాడు. మొదటగా, మన కథలో ప్రస్తావించబడిన ప్రధాన విషయం ఏమిటంటేపరస్పరం బలపరచుకోవడం, పరస్పరం ఆధారపడడం మరియు సమస్తము కలిసి జీవించుట సాగించడమైయున్నది. ఈ నియమం క్రింద, మానవజాతి ఉనికి యొక్క వాతావరణం అనేది సంరక్షించబడుతోంది; ఇది ఉనికిలోనే ఉంటుంది మరియు సుస్థిరంగా ఉంటుంది. ఈ కారణంగానే, మానవజాతి వృద్ధి చెందుతోంది మరియు పునరుత్పత్తి చేయగలుగుతోంది. మనం చూసిన చిత్రంలో ఒక చెట్టు, భూమి, సూర్యకాంతి, పక్షులు మరియు మనుష్యులు కలిసి ఉన్నాయి. ఈ చిత్రంలో దేవుడు ఉన్నాడా? అందులో ఏ ఒక్కరూ ఆయన్ని చూడలేదు, నిజమే కదా? కానీ, ఆ దృశ్యంలో కనిపించేవాటి మధ్యన పరస్పర బలోపేతం మరియు పరస్పరం ఆధారపడడం అనేది చూశారు; ఈ నియమంలో, దేవుని ఉనికిని మరియు ఆయన సార్వభౌమాధికారమును చూడవచ్చు. సకల అంశాల జీవాన్ని మరియు ఉనికిని భద్రపరచడానికి అలాంటి నియమాన్ని మరియు అలాంటి నిబంధనను దేవుడు ఉపయోగిస్తాడు. ఈ విధంగా, అన్నిటికి మరియు మానవజాతికి ఆయన అన్నింటినీ అందజేస్తాడు. మన ప్రధాన నేపథ్యానికి ఈ కథ అనుసంధానించబడిందా? పైపైన చూసినప్పుడు అలాంటిదేమీ లేదనిపిస్తుంది. కానీ, వాస్తవంలో, దేవుడు అన్నింటినీ సృష్టించిన నియమాన్నిబట్టి మరియు సమస్తము మీద ఆయన ప్రావిణ్యం అనేవి సమస్తమునకు ఆయనే జీవనాధారం అనే విషయంతో సానిహిత్యం కలిగి ఉంటాయి. ఈ వాస్తవాలన్నీ విడదీయలేనివి. ఇప్పుడు మీరు కొంతమేర నేర్చుకోవడం ప్రారంభించారు!
సమస్త వ్యవహారములను పరిపాలించే నియమాలను దేవుడు శాసిస్తాడు; సమస్తమైనవాటి మనుగడను నియంత్రించే నియమాలను ఆయనే శాసిస్తాడు; ఆయన సమస్తాన్ని నియంత్రిస్తాడు మరియు అవి బలోపేతం అయ్యేలా మరియు ఒకదాని మీద ఒకటి ఆధారపడేలా వాటిని అమరుస్తాడు. తద్వారా, అవి నశించకుండా లేదా అదృశ్యం కాకుండా ఉంటాయి. అప్పుడు మాత్రమే మానవజాతి జీవించి ఉండగలదు; ఆ విధంగా మాత్రమే మనుష్యులు ఆ వాతావరణంలో దేవుని మార్గదర్శనంలో జీవించగలరు. ఈ కార్యాచరణ నియమాలకు దేవుడే యజమాని, మరియు వీటిలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోలేరు లేదా వాటిని మార్చలేరు. దేవునికి మాత్రమే ఈ నియమాలు తెలుస్తాయి మరియు దేవుడు మాత్రమే వాటిని నిర్వహిస్తాడు. ఎప్పుడు చెట్లు మొలకెత్తాలో; ఎప్పుడు వర్షం కురువాలో; భూమి ఆ చెట్లకు ఎంత మొత్తములో నీళ్లనివ్వాలో మరియు ఎంత మొత్తములో పోషకాంశములను ఇవ్వాలో; ఏ ఋతువులో ఆకులు రాలిపోవాలో; ఏ ఋతువులో చెట్లు ఫలాలను ఇవ్వాలో; చెట్ల మీద సూర్య రశ్మి పడిన తరువాత ఆ చెట్లు బయటకు ఏమి విడుదల చేయాలో అనే ఈ విషయాలన్ని దేవుడు సృష్టిని సృష్టించునప్పుడే ఆయన ముందుగానే నిర్ణయిం చేసి పెట్టాడు. ఈ నియమాలను ఏ ఒక్కరు ఉల్లంఘించలేరు. దేవుడు సృష్టించిన సమస్తము మనిషి దృష్టిలో సజీవమైనవైనప్పటికీ లేదా నిర్జీవమైనవైనప్పటికీ, అవన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయనే వాటిని నియంత్రిస్తాడు మరియు వాటిని పాలిస్తాడు. ఈ నిబంధనలను ఏ ఒక్కరూ మార్చలేరు లేదా ఉల్లంఘించలేరు. సరిగ్గా చెప్పాలంటే, దేవుడు వీటన్నింటినీ సృష్టించినప్పుడే, భూమి లేకుండా, చెట్టుకి వేర్లు రాదు, అది మొలకెత్తదు మరియు పెరగదు; అలాగే, చెట్లు లేకపోతే, భూమి ఎండిపోతుంది; చెట్టు అనేది పక్షులకు ఆశ్రయం కావాలి. ఎందుకంటే, గాలి నుండి తప్పించుకోవడానికి పక్షులు అక్కడికే రావచ్చు అని ఆయన ముందే నిర్ణయించేశాడు. భూమి లేకుండా చెట్టు జీవించగలదా? ఖచ్చితంగా వీలుకాదు. సూర్యరశ్మి లేదా వర్షం లేకుండా అది జీవించగలదా? అదికూడా సాధ్యం కాదు. ఇవన్నీ మానవాళి కోసం, మానవాళి మనుగడ కోసమే సృష్టించబడ్డాయి. చెట్టు నుండి, మనిషికి తాజా గాలి లభిస్తుంది మరియు చెట్టు ద్వారా రక్షించబడిన భూమి మీద మనిషి నివసిస్తున్నాడు. సూర్యకాంతి లేదా వివిధ జీవరాశులు లేకుండా మనిషి జీవించలేడు. ఈ బంధాలన్నీ సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ, ఈ అన్ని విషయాలను నియంత్రించే నియమాలను దేవుడే సృష్టించాడని నీవు గుర్తుంచుకోవాలి. ఆవిధంగా మాత్రమే, అవి పరస్పరం బలపడుతాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి మరియు కలిసి జీవిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ఆయన సృష్టించిన ప్రతి అంశానికీ విలువ మరియు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రాముఖ్యత లేకుండా ఏదైనా దేవుడు సృష్టిస్తే, దేవుడే దానిని అదృశ్యం చేసేస్తాడు. సమస్తానికి అందించడం కోసం దేవుడు ఉపయోగించే పద్ధతుల్లో ఇదీ ఒకటి. ఈ కథలో “అందించడం కోసం” అనే పదాలు దేనిని సూచిస్తాయి? చెట్టుకు రోజూ దేవుడే నీళ్లు పోస్తాడా? చెట్టు శ్వాస తీసుకోవడం కొరకు దేవుని సహాయం కావాలా? (లేదు.) “అందించడం కోసం” అనేది దేవుడు సృష్టించిన తర్వాత సమస్తమైన వాటి నిర్వహణ గురించి ఇక్కడ సూచిస్తుంది; వాటిని పరిపాలించుటకు నియమాలన్నిటిని స్థాపించిన తరువాత దేవుడు వాటిని నిర్వహించడానికి ఇవి సరిపోతాయి. ఒక విత్తనం భూమిలోకి చేరిన తర్వాత, చెట్టు దానంతట అదే పెరుగుతుంది. దాని ఎదుగుదలకు కారణమయ్యే పరిస్థితులన్నీ దేవుడు సృష్టించినవే. సూర్యకాంతి, నీరు, నేల, గాలి మరియు పరిసర పర్యావరణాన్ని దేవుడే సృష్టించాడు; గాలి, పొగమంచు, మంచు, వర్షం మరియు నాలుగు ఋతువులను దేవుడే సృష్టించాడు. చెట్టు పెరగడానికి కావాల్సిన ఈ పరిస్థితులన్నీ దేవుడు సిద్ధం చేసినవే. దీన్నిబట్టి, ఈ సజీవ పర్యావరణానికి దేవుడే మూలం కాదా? (అవును.) చెట్ల మీది ఒక్కో ఆకును దేవుడు ప్రతిరోజూ లెక్కించాల్సిన అవసరం ఉందా? లేదు! అలాగే, చెట్టు శ్వాసించడంలో లేదా ప్రతిరోజూ సూర్యరశ్మిని మేల్కొల్పడంలో, అంటే, “నువ్వు చెట్ల మీదకి ప్రసరించాల్సిన సమయమిది” అని చెప్పడం ద్వారా, దేవుడు సహాయం చేయాలా? ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా, ప్రకాశించే సమయం వచ్చినప్పుడు సూర్యకాంతి దానికదే ప్రకాశిస్తుంది; అది చెట్టుపై పడుతుంది మరియు ప్రకాశిస్తుంది మరియు చెట్టుకి అవసరమైనప్పుడు అది సూర్యరశ్మిని గ్రహిస్తుంది మరియు ఆ అవసరం లేనప్పుడు, అది నిబంధనల ప్రకారం జీవిస్తుంది. ఈ వింతైన విషయాన్నిమీరు స్పష్టంగా వివరించలేకపోవచ్చు. అయితే, ఇది కాదనలేని సత్యము. దీనిని అందరూ చూడగలరు మరియు గుర్తించగలరు. నీవు చేయాల్సిందల్లా, సమస్తమైన వాటి ఉనికిని నియంత్రించే నియమాలు దేవుని నుండి వచ్చాయని గుర్తించడం మరియు సమస్తమైన వాటి వృద్ధి మరియు మనుగడ మీద దేవుడే సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని తెలుసుకోవడం మాత్రమే చేయాలి.
ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఒక “రూపకాలంకారం” అని వ్యక్తులు పేర్కొనేలా ఈ కథ ఉందా? ఇదొక మానవీకరణం అంటారా? (లేదు.) నేను నిజమైన కథ చెప్పాను. ప్రతి జీవరాశి, జీవము కలిగిన ప్రతి ఒక్కటీ దేవునిచేత పరిపాలించబడుతోంది; ప్రతి జీవి సృజించబడినప్పుడే దేవుని ద్వారా వచ్చిన జీవముతోనింపబడింది; ప్రతి జీవరాశికి జీవం దేవుని నుండి వస్తుంది మరియు దానికోసం నిర్దేశించిన మార్గాన్ని మరియు నిబంధనలను అది అనుసరిస్తుంది. మనిషి దానిని మార్చాల్సిన అవసరం లేదు. అందుకోసం మనిషికి సహాయమేమీ అవసరం లేదు; సమస్తమైన వాటి కోసం దేవుడు అందించిన మార్గాల్లో అది కూడా ఒకటి. మీకు అర్థమవుతోందా, అర్థము కావట్లేదా? మనుష్యులు దీనిని గుర్తించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? (అవును.) మరైతే, ఈ కథకు జీవశాస్త్రంతో ఏదైనా సంబంధం ఉందంటారా? విజ్ఞాన రంగంతో గాని, లేదా విద్యా శాఖతో ఇది ఏవిధంగానైనా ముడిపడి ఉందా? మనం ఇక్కడ జీవశాస్త్రం గురించి చర్చించడం లేదు. అలాగే, ఖచ్చితంగా మనమేమీ జీవశాస్త్ర పరిశోధనను నిర్వహించడం లేదు. మన సంభాషణకు సంబంధించిన ప్రధాన ఆలోచన ఏమిటి? ( దేవుడే సమస్తమునకు జీవాధారమైయున్నాడు.) సృష్టిలో మీరు ఏం చూశారు? మీరు వృక్షాలను చూశారా? మీరు భూమిని చూశారా? (అవును.) మీరు సూర్యకాంతిని చూశారా, లేదంటారా? చెట్ల మీద పక్షుల నివాసం చూశారా? (మేము చూశాము.) అలాంటి వాతావరణములో జీవించడంపట్ల మానవజాతి సంతోషంగానే ఉందా? (అవును.) సరిగ్గా చెప్పాలంటే, దేవుడు మానవాళి నివాసాన్ని, వారి జీవన వాతావరణాన్ని నిర్వహించడం కోసం వాటిని రక్షించడం కోసం దేవుడు తాను సృష్టించిన సమస్తాన్ని ఉపయోగిస్తాడు. ఆ విధంగా, మానవాళికి మరియు సమస్తానికి అవసరమైన వాటిని దేవుడు అందిస్తాడు.
మాట్లాడే ఇటువంటి శైలి, నేను సహవాసం చేస్తున్న తీరు మీకు ఏ మేరకు నచ్చాయి? (ఇది అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంది మరియు ఇందులో అనేక నిజ జీవిత ఉదాహరణలున్నాయి.) నేనేమీ వ్యర్థమైన మాటలు మాట్లాడడం లేదు కదా? సమస్తమైన వాటి కోసం దేవుడే జీవనాధారమై ఉన్నాడని ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ కథ అవసరం కదా? (అవును.) అలాంటప్పుడు, మన తర్వాతి కథకు వెళ్దాం. తదుపరి కథ విషయపరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది మరియు దాని దృష్టికోణం కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఈ కథలో కనిపించేవన్నీ దేవుని సృష్టిలో మనుష్యులు వారి కళ్లతో చూడగలిగినవే. ఇప్పుడు, నేను నా తర్వాతి కథ చెప్పడం మొదలుపెడుతాను. దయచేసి నిశ్శబ్దంగా వినండి మరియు నేనేం చెప్పదల్చుకున్నానో దానిని మీరు గ్రహించగలరో, లేదో చూడండి. కథ తర్వాత, మీరు ఏమేరకు గ్రహించారో తెలుసుకోవడం కోసం, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ కథలో ఒక గొప్ప పర్వతం, ఒక చిన్న ప్రవాహం, ఒక భీకరమైన గాలి మరియు ఒక భారీ అల అనేవి పాత్రలుగా ఉంటాయి.
2వ కథ: ఒక గొప్ప పర్వతం, ఒక చిన్న ప్రవాహం, ఒక భీకరమైన గాలి మరియు ఒక భారీ అల
ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది అటూ ఇటూ మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ, చివరకు ఒక గొప్ప పర్వతం పాదాల వద్దకు చేరుకుంది. ఆ చిన్న ప్రవాహాన్ని ఆ పర్వతం అడ్డుకుంది. అప్పుడు, ఆ ప్రవాహం దాని బలహీనమైన చిన్న స్వరంతో ఆ పర్వతంతో, “దయచేసి, నాకు త్రోవ ఇవ్వండి. మీరు నా మార్గంలో అడ్డుగా ఉన్నారు, నా దారిని అడ్డుకుంటున్నారు” అని చెప్పింది. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్?”అని పర్వతం అడిగింది. “నేను నా ఇంటి కోసం వెతుకుతున్నాను”అని ఆ ప్రవాహం స్పందించింది. “సరే, ముందుకు వచ్చి, నా మీదుగా ప్రవహించు!” అని పర్వతం చెప్పింది. కానీ, ఆ చిన్న ప్రవాహం చాలా బలహీనమైనది మరియు బాగా చిన్న వయసులో ఉంది. కాబట్టి, అది అంత మహా పర్వతం మీదుగా ప్రవహించే పరిస్థితి లేదు. అది పర్వత పాదాల గుండా మాత్రమే ప్రవహించగలదు ...
ఒక భయంకరమైన గాలి పర్వతం వైపుగా వీస్తూ, ఇసుక మరియు వ్యర్ధాలను పర్వతం ఉన్న చోటుకు తీసుకొచ్చింది. అప్పుడు ఆ గాలి, “నన్ను వెళ్లనివ్వండి!” అని పర్వతాన్ని అడిగింది. “నీవు ఎక్కడికి వెళ్తున్నావ్?” అని పర్వతం అడిగింది. “నేను పర్వతం అవతలి వైపుకు వెళ్లాలనుకుంటున్నాను” అని గాలి గట్టిగా సమాధానమిచ్చింది. “ఆలాగైతే, నీవు నా నడుముని చీల్చగలిగితే, నీవు వెళ్ళవచ్చు!” అని పర్వతం చెప్పింది. దాంతో, ఆ భీకరమైన గాలి అటూ ఇటూ గట్టిగా వీచింది. కానీ, అది ఎంత భీకరంగా వీచినప్పటికీ, పర్వతం నడుముని మాత్రం చేధించలేకపోయింది. గాలి అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవడం కోసం కాసేపు ఆగింది. అదేసమయంలో, పర్వతానికి అవతలివైపు గాలి వీచడం మొదలైంది. అక్కడున్న మనుష్యులకు ఆహ్లాదం కలిగించింది. పర్వతం ఆవిధంగా మనుష్యులకు శుభాకాంక్షలు తెలియజేసింది ...
సముద్రతీరం వద్ద, సముద్రపు అలతో వచ్చిన నీళ్లు రాతి ఒడ్డు మీద మెల్లగా దొర్లుతున్నాయి. అకస్మాత్తుగా, లేచిన పెద్ద అల ఒకటి గర్జిస్తూ పర్వతం వైపు వెళ్లింది. “పక్కకి కదులు!” అని ఆ అల బిగ్గరగా అరిచింది. “నీవు ఎక్కడికి వెళ్తున్నావ్?” అని పర్వతం అడిగింది. ముందుకు వేసిన అడుగును ఆపుకోలేని అల గర్జించింది, “నేను నా పరిధిని విస్తరిస్తున్నాను! నేను నా భుజాలను చాచాలనుకుంటున్నాను!” అని అల చెప్పింది “అలాగైతే, నీవు నా శిఖరాన్ని అధిగమించగలిగితే, నేను నీకు దారిస్తాను” అని పర్వతం చెప్పింది. ఆ భారీ అల కొంచెం దూరం వెనక్కి వెళ్లి, మళ్లీ పర్వతం వైపు దూసుకుపోయింది. అయితే, అది ఎంత ప్రయత్నించినప్పటికీ, పర్వత శిఖరాన్ని అధిగమించలేకపోయింది. చివరకు ఆ అల నెమ్మదిగా మళ్లీ సముద్రంలోకే వెళ్ళింది...
వేల సంవత్సరాలుగా, ఆ చిన్న ప్రవాహం పర్వత పాదాల చుట్టూ మెల్లగా ప్రవహించింది. పర్వతం దిక్కులను అనుసరిస్తూ, ఆ చిన్న ప్రవాహం దాని ఇంటికి చేరడం ద్వారా, అక్కడొక నదిని చేరింది. ఆ నది సముద్రంలోకి చేరింది. పర్వతం రక్షణలో, ఆ చిన్న ప్రవాహం ఎప్పుడూ దాని దారి తప్పిపోలేదు. ప్రవాహం మరియు పర్వతం ఒకదానినొకటి బలపరుచుకున్నాయి మరియు ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి; అవి పరస్పరం పటిష్టం చేసుకున్నాయి, అవి ఒకదానినొకటి ఎదుర్కొన్నాయి మరియు కలిసి జీవిస్తున్నాయి.
వేల సంవత్సరాలుగా, ఆ భీకరమైన గాలి దాని అలవాటు ప్రకారం, ఘర్జించింది. పర్వత “సందర్శన” కోసం అది తరచుగా వస్తూనే ఉంది. ఆ క్రమంలో, అది భారీగా ఇసుకు రేణువులను తీసుకొచ్చింది. అది పర్వతాన్ని బెదిరించింది. కానీ, దాని నడుముని మాత్రం చేధించలేకపోయింది. గాలి మరియు పర్వతం పరస్పరం బలపరచుకున్నాయి మరియు అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి; అవి ఒకదానినొకటి బలపరచుకున్నాయి, పరస్పరం పరిహరించుకున్నాయి మరియు కలిసి ఉన్నాయి.
వేల సంవత్సరాలుగా, భారీ అల విశ్రాంతి పేరుతో ఎప్పుడూ ఆగిపోలేదు మరియు ఎలాంటి కనికరం లేకుండా అది ముందుకు సాగింది. నిరంతరం అది తన భూభాగాన్ని విస్తరించింది. అది గర్జిస్తూ, పర్వతం వైపు పదే పదే దూసుకుపోయింది. అయినప్పటికీ, పర్వతం మాత్రం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. సముద్రానికి పర్వతం రక్షణగా నిలిచింది. ఆ విధంగా, సముద్రంలో జీవుల సంఖ్య బాగా పెరిగింది. అల మరియు పర్వతం పరస్పరం బలపరచుకున్నాయి మరియు అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి; అవి ఒకదానినొకటి బలపరచుకున్నాయి, పరస్పరం పరిహరించుకున్నాయి మరియు కలిసి ఉన్నాయి.
ఇక్కడితో మన కథ ముగిసింది. ముందుగా, ఈ కథ దేనికి సంబంధించిందో నాకు చెప్పగలరా? మొదలుపెడితే, ఈ కథలో ఒక గొప్ప పర్వతం, ఒక చిన్న ప్రవాహం, ఒక భయంకరమైన గాలి మరియు ఒక భారీ అల ఉన్నాయి. మొదటి భాగంలో, చిన్న ప్రవాహం మరియు గొప్ప పర్వతం మధ్యలో ఏం జరిగింది? ఒక ప్రవాహం మరియు పర్వతం గురించి మాట్లాడేందుకు నేను ఎందుకు ఎంచుకున్నాను? (పర్వతం రక్షణలో, ప్రవాహం దాని మార్గాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి.) ఆ చిన్న ప్రవాహాన్ని పర్వతం రక్షించిందని చెబుతారా లేదంటే అడ్డుకుందని చెబుతారా? (అది దానిని రక్షించింది.) అయితే, అది దానిని అడ్డుకోలేదంటారా? పర్వతం మరియు ప్రవాహం పరస్పరంగా పరిరక్షించుకున్నాయి; ప్రవాహాన్ని పర్వతం రక్షించింది మరియు దానిని అడ్డుకుంది కూడా. నదిలో కలిసే ప్రవాహాన్ని పర్వతం రక్షించింది. అయితే, అది కోరుకున్న చోటుకి ప్రవహించకుండా అడ్డుకుంది. ఆవిధంగా, వరదలకు కారణమైంది మరియు ప్రజలకు విపత్తు కలిగించింది. కథలోని మొదటి భాగం చెప్పేది ఇదే కదా? ప్రవాహాన్ని రక్షించడం ద్వారా మరియు దానిని అడ్డుకోవడం ద్వారా, మనుష్యుల ఇళ్లను పర్వతం కాపాడింది. ఆ చిన్న ప్రవాహం ఆ తర్వాత, పర్వతం పాదాల వద్ద నదిలోకి చేరింది. ఆ తరువాత అది సముద్రంలోకి ప్రవహించింది. ఇది ప్రవాహపు ఉనికిని నియంత్రించే నియమం కాదా? ఆ ప్రవాహం అనేది నదిలోకి మరియు సముద్రంలోకి కలిసే విధంగా చేసింది ఏది? అలా చేసింది పర్వతం కాదా? ఆ ప్రవాహం అనేది పర్వతపు రక్షణ మరియు దాని అడ్డంకి మీద ఆధారపడింది. కాబట్టి, ఇదే ఇక్కడ ప్రధాన విషయం కాదా? నీటికి పర్వతాల ప్రాముఖ్యత ఇక్కడ ఉందని నీవు చూస్తున్నావా? ప్రతి పర్వతాన్ని అతిపెద్దగానో మరియు చాలా చిన్నదిగానో చేయడంలో దేవుని ఉద్దేశ్యం ఉందంటారా? (అవును.) ఒక చిన్న ప్రవాహం మరియు ఒక గొప్ప పర్వతం తప్ప మరేమీ లేని ఈ భాగంలో, ఆ రెండు అంశాలకు సంబంధించి దేవుడి సృష్టిలోని విలువను మరియు ప్రాముఖ్యతను మనం చూస్తాము; వాటి మీద ఆయన పరిపాలనలోని జ్ఞానం మరియు ఉద్దేశ్యాన్ని కూడా ఈ కథలోని భాగం మనకు చూపిస్తోంది కదా. అలాంటిదేమీ లేదంటారా?
కథలోని రెండవ భాగం దేని గురించి చెప్పబడింది? (ఒక భయంకరమైన గాలి మరియు గొప్ప పర్వతం గురించి చెప్పింది.) గాలి ఒక మంచి విషయమే కదా? (అవును.) తప్పనిసరిగా అలాగే ఉండాల్సిన అవసరం లేదు—కొన్నిసార్లు గాలి చాలా బలంగా ఉంటుంది మరియు విపత్తును కలిగిస్తుంది. ఒక భీకరమైన గాలిలో నిన్ను నిలబెడితే, నీవెలా భావిస్తావు? నీ భావన అనేది ఆ గాలి బలం మీద ఆధారపడి ఉంటుంది కదా? అది మూడు లేదా నాలుగవ స్థాయిలో వీచే గాలి ప్రవాహం అయితే, అది సహించదగినదిగానే ఉంటుంది. ఈ స్థాయి గాలిలో, గరిష్టంగా, ఒక వ్యక్తి తన కళ్లు తెరచి ఉంచడంలో ఇబ్బంది పడవచ్చు. అయితే, అదే గాలి భీకరంగా, తుపానుగా మారితే, నీవు దానిని తట్టుకుని నిలబడగలవా? నీకు వీలుకాదు. కాబట్టి, గాలి అనేది ఎల్లప్పుడూ మంచిదేనని, లేదా అది ఎల్లప్పుడూ చెడ్డదని మనుష్యులు చెప్పడం తప్పే అవుతుంది. ఎందుకంటే, ఆ విషయం దాని బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు, ఇక్కడ పర్వతం పనేమిటి? గాలిని వడబోయడం దాని పని కాదా? భయంకరమైన గాలిని పర్వతం ఏ స్థాయికి తగ్గిస్తుంది? (ఒక మెల్లగా వీచే గాలి స్థాయికి తగ్గిస్తుంది.) ఇప్పుడు, మనుష్యులు నివసించే పర్యావరణంలో, ఎక్కువమంది మనుష్యులు ఈదురుగాలులు లేదా సాధారణ గాలుల్లో దేనిని అనుభూతి చెందుతుంటారు? (చల్లని గాలులు.) ఇది దేవుని ఉద్దేశాల్లో ఒకటి కాదా, పర్వతాలను సృష్టించడమనేది ఆయన ఉద్దేశాల్లో ఒకటి కాదా? గాలి కారణంగా, ఇసుక విపరీతంగా పైకి ఎగసే వాతావరణంలో, దానికి అడ్డంకులు లేకపోతే, వడపోత లేకపోతే, మనుష్యుల జీవితం ఎలా ఉంటుంది? ఇసుక మరియు రాళ్లు ఎగిరిపడే భూమి ఆవాసయోగ్యంగా ఉండగలదా? రాళ్లవల్ల మనుష్యులకు గాయాలు కావచ్చు, ఇసుక వారిని గుడ్డివాళ్లుగా చేయవచ్చు. గాలివల్ల మనుష్యులు వారి పాదాల మీద నిలవలేకపోవచ్చు లేదంటే, గాలి వారిని పైకి లేపేయవచ్చు. గృహాలు ధ్వంసం కావచ్చు మరియు అన్ని రకాల విపత్తులూ సంభవించవచ్చు. అయినప్పటికీ, భీకరమైన గాలి ఉనికికి విలువ ఉంటుందా? అలాంటి గాలి చెడ్డదని నేను అంటాను. కాబట్టి, దానికి విలువ లేదని మీరెవరైనా భావించవచ్చు. కానీ, అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? ఆ భీకరమైన గాలి అనేది మెల్లగా వీచే గాలిగా మారినప్పుడు దానికి విలువ లేదంటారా? వాతావరణం తేమగా ఉన్నప్పుడు లేదా ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నప్పుడు మనుష్యులగా ఎక్కువగా కావలసింది ఏమిటి? మెల్లగా వీచే గాలి వారికి కావాలి. వారిని తాజాగా మార్చడానికి మరియు వారి తలలను శుభ్రం చేయడానికి, వారి ఆలోచనలను పదునుగా చేయడానికి, వారి మానసిక స్థితిని మరమత్తు చేసి మరియు మెరుగ్గా చేయడానికి ఆ గాలి వారి మీద మృదువుగా వీయాలి. ఇప్పుడు, ఒక ఉదాహరణ చెప్పుకుంటే, చాలామంది వ్యక్తులతో కలసి మీరు ఒక గదిలో కూర్చుని ఉన్నారు. అక్కడ అస్సలు గాలి ఆడడం లేదు, అలాంటప్పుడు అక్కడ మీకు ఎక్కువగా కావలసింది ఏమిటి? (మెల్లగా వీచే గాలి కావాలి.) గాలి గందరగోళంగా వీచే మరియు గాలి మలినాలతో ఉండే ప్రదేశానికి వెళ్లినప్పుడు మన ఆలోచన మందగిస్తుంది, మనలో ప్రసరణ తగ్గిపోతుంది మరియు మానసిక స్థితిలో స్పష్టత తగ్గిపోతుంది. అయితే, అలాంటప్పుడు, కొద్దిపాటి కదలిక మరియు ప్రసరణ అనేవి గాలిని తాజాగా చేస్తాయి మరియు అలాంటి తాజా గాలిలో మనుష్యులు భిన్నమైన స్థితిని అనుభూతి చెందుతారు. ఒక చిన్న ప్రవాహం విపత్తు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, ఒక భీకరమైన గాలి విపత్తు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ ఆ పర్వతం ఉన్నంత కాలం అది ఆ ప్రమాదాలను మనుష్యులకు ప్రయోజనం అందించే శక్తిగా మారుస్తుంది. ఇది నిజంగా కాదంటారా?
కథలోని మూడవ భాగం దేని గురించి చెబుతుంది? (గొప్ప పర్వతం మరియు భారీ అల గురించి చెబుతుంది.) గొప్ప పర్వతం మరియు భారీ అల గురించి చెబుతుంది. కథలోని ఈ భాగం అనేది పర్వతం పాదాల వద్ద ఉన్న సముద్ర తీరం గురించి చెబుతుంది. ఇందులో మనం పర్వతమును, సముద్రపు తుంపరను మరియు భారీ అలను చూస్తాము. ఈ ఉదాహరణలో, అలకి పర్వతం ఏమవుతుంది? (ఒక రక్షణ మరియు అవరోధం అవుతుంది.) ఇక్కడ పర్వతమనేది ఆ అలకు రక్షణగాను మరియు అవరోధంగాను ఉంటుంది. ఒక రక్షణగా, సముద్రం అదృశ్యం కాకుండా అది చూస్తుంది. తద్వారా, సముద్రంలోని జీవులు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఒక అవరోధం రూపంలో, సముద్రపు జలాలు పొంగిపొర్లకుండా మరియు విపత్తు కలిగించకుండా, హాని కలిగించే మరియు మనుష్యుల ఇళ్లను ధ్వసం చేయకుండా ఉంచుతుంది. కాబట్టి, పర్వతం అనేది రక్షణగాను మరియు అవరోధంగాను రెండు విధాలుగా ఉంటుందని మనం చెప్పగలం.
గొప్ప పర్వతం మరియు చిన్న ప్రవాహం, గొప్ప పర్వతం మరియు భీకరమైన గాలి మరియు గొప్ప పర్వతం మరియు భారీ అల మధ్య పరస్పరం ఉండే బంధానికి సంబంధించనిన ప్రాముఖ్యత ఇదే; అవి పరస్పరం బలోపేతం చేసుకోవడం మరియు పరస్పరం ప్రతిఘటించడం మరియు అవి కలిసి ఉండడం యొక్క ప్రాముఖ్యత ఇదే. దేవుడు సృష్టించిన ఈ అంశాలనేవి ఒక నియమం మరియు ఒక నిబంధనం ద్వారా వాటి ఉనికిలో పరిపాలించబడుతాయి. కాబట్టి, దేవుడు చేసే ఎటువంటి కార్యములను మీరు ఈ కథలో చూశారు? దేవుడు వీటన్నింటినీ సృష్టించినప్పటి నుండే వీటిని విస్మరిస్తున్నాడా? సృష్టించిన తర్వాత, వాటిని విస్మరించడం కోసమే ఆయన ఈ నియమాలు సృష్టించడంతో పాటు అవన్నీ పనిచేసే మార్గాలు రూపొందించాడా? అలాంటిదే జరిగిందని అనుకుంటున్నారా? (లేదు.) మరైతే, ఏం జరిగింది? దేవుడు ఇప్పటికీ, వాటిని నియంత్రిస్తూనే ఉన్నాడు. నీరు, గాలి మరియు అలలను ఆయనే నియంత్రిస్తాడు. ఆయన వాటిని వాటి ఇష్టప్రకారం వెళ్లడానికి అనుమతించడు, లేదా హాని కలిగించడానికి లేదా మనుష్యుల నివాస గృహాలను నాశనం చేయడానికి అనుమతించడు. ఈ కారణంగానే, ఈ భూమి మీద మనుష్యులు నివసించగలుగుతున్నారు మరియు వారి సంఖ్యను పెంచుకుంటూ, వృద్ధి చెందగలుగుతున్నారు. దీనర్థం ఏమిటంటే, దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడే, వాటి ఉనికి కోసం నియమాలను కూడా ఆయన ముందే సిద్ధం చేశాడు. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు, అది మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఆయన నిర్ధారించాడు మరియు అది మానవాళిని ఇబ్బంది పెట్టకుండా లేదా మనిషికి విపత్తు కలిగించకుండా ఉండేలా ఆయన దానిని నియంత్రించాడు. దేవుని నిర్వహణే లేకుంటే, నీళ్లు అదుపు లేకుండా ప్రవహించేవి కాదా? గాలి అదుపు లేకుండా వీచేది కాదా? అంటే, నీళ్లు మరియు గాలి నియమాలు పాటిస్తున్నాయనే అర్థం కాదా? దేవుడు వాటిని నిర్వహించకపోతే, ఏ నియమాలూ వాటిని నియంత్రించవు. అప్పుడు గాలి భీకరంగా మారుతుంది మరియు నీరు అనియంత్రితంగా మారిపోతుంది మరియు వరదలకు కారణమవుతుంది. పర్వతం కంటే కెరటం ఎత్తు ఎక్కువగా ఉంటే, సముద్రం ఉనికిలో ఉండేదా? ఖచ్చితంగా ఉండేది కాదు. పర్వతం అనేది అల కంటే ఎత్తు లేకుంటే, సముద్రం ఉండేది కాదు. అలాగే, పర్వతం దాని విలువను మరియు ప్రాముఖ్యతను కోల్పోయేది.
ఈ రెండు కథల్లోనూ మీరు దేవుని జ్ఞానం చూస్తున్నారా? ఉనికిలో ఉన్న ప్రతిదానిని దేవుడు సృష్టించాడు మరియు ఉనికిలో ఉన్న ప్రతిదాని మీద ఆయనే సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు; ఆయనే వాటన్నింటినీ నిర్వహిస్తాడు మరియు ఆయనే వాటన్నింటికీ కావలసిన ప్రతీది అందిస్తాడు మరియు సృష్టించబడిన సమస్తమైన వాటిలో, ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కదానికి సంబంధించిన ప్రతి మాటను మరియు చర్యను ఆయన చూస్తాడు మరియు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అదే విధంగానే, మానవ జీవితంలోని ప్రతి విషయాన్నీ దేవుడు చూస్తున్నాడు మరియు పరిశీలిస్తున్నాడు. ఈ విధంగా, దేవుడు తన సృష్టిలోని ప్రతి దాని గురించి, సృష్టించబడిన ప్రతి దాని యొక్క పని తీరు, దాని స్వభావం మరియు మనుగడ కోసం దాని నియమాల నుండి దాని జీవితపు ప్రాముఖ్యత మరియు దాని ఉనికి విలువ వరకు అన్ని వివరాలను సంపుర్ణంగా తెలుసుకుంటాడు. దేవుడే అన్నింటినీ సృష్టించాడు, ఆలాంటప్పుడు, వాటిని నియంత్రించే నియమాలను ఆయన అధ్యయనం చేయాల్సి ఉంటుందని మీరు భావిస్తున్నారా? మనుష్యుల గురించి తెలుసుకోవడానికి మరియు వారిని అర్థం చేసుకోవడానికి మానవుని జ్ఞానాన్ని లేదా అతని విజ్ఞాన శాస్త్రాన్ని దేవుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటారా? (లేదు.) దేవుడు చేసే అన్ని విషయాలనూ అర్థం చేసుకోగల విద్యా శక్తిని మరియు పాండిత్యమును కలిగిన వారు ఎవరైనా మానవజాతిలో ఉన్నారా? అలాంటి వారెవరూ లేరన్నది నిజమే కదా? సమస్తము జీవించే జీవిత విధానానికి మరియు పెరుగుదలకు కారణమైన నియమాలను నిజంగా అర్థం చేసుకున్న ఖగోళ శాస్త్రవేత్తలు గాని, లేదా జీవశాస్త్రజ్ఞులు గాని ఎవరైనా ఉన్నారా? ప్రతి దాని యొక్క ఉనికికి సంబంధించిన విలువను వారు నిజంగా అర్థం చేసుకోగలరా? (లేదు, వారికి సాధ్యం కాదు.) దీనికి కారణం, సమస్తము దేవుని ద్వారా సృష్టించబడ్డాయిమరియు ఈ జ్ఞానం గురించి మానవజాతి ఎంత విస్తృతంగా లేదా ఎంత లోతుగా అధ్యయనం చేసినప్పటికీ, లేదా దాని గురించి నేర్చుకోవడానికి వారు ఎంతకాలం ప్రయత్నించినప్పటికీ, వారు ఎప్పటికీ ఆ రహస్యాన్ని గ్రహించలేరు లేదా సమస్తాన్ని సృష్టించడం వెనుక దేవుని ఉద్దేశ్యాన్ని వారు తెలుసుకోలేరు. ఈ పరిస్థితి అలాంటిదే కాదా? ఇప్పుడు, ఇక్కడి వరకు సాగిన మన చర్చ నుండి, “దేవుడే సమస్తానికి జీవాధారమైయున్నాడు” అనే పదబంధానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని మీరు పాక్షికంగానైనా అర్థం చేసుకున్నారనే భావన మీకు కలుగుతోందా? (అవును.) దేవుడే సమస్తానికి జీవనాధారమై ఉన్నాడు అనే ఈ అంశం గురించి నేను చర్చించినప్పుడు, చాలా మంది వెంటనే మరొక మాటను గూర్చి ఆలోచిస్తారు: “దేవుడే సత్యముమరియు మనకు కావలసిన ప్రతిదానిని అందించడం కోసం దేవుడు తన వాక్కును ఉపయోగిస్తాడు” ఈ మాటను గురించి ఆలోచించడంతో పాటు ఈ అంశం అర్థం కూడా అంతకు మించినదేమీ కాదనుకుంటారు. మరికొందరైతే, మానవ జీవితానికి దేవుడు అందించడం గురించి కూడా ఆలోచించవచ్చు. మనిషి కోసం ఆయన రోజూ అందించే ఆహారం మరియు పానీయం మరియు రోజువారీ అవసరం అనేవి పరిగణనలోకి రావని వాళ్లు భావించవచ్చు. ఈ విధంగా ఆలోచించే కొందరు లేదంటారా? అయినప్పటికీ, మానవజాతి ఉనికిలో ఉండడానికి మరియు సాధారణ స్థితిలో జీవించడానికి అనుమతించే విషయంలో దేవుని సృష్టి ఉద్దేశం స్పష్టంగా లేదంటారా? మనుష్యులు నివసించే వాతావరణమును దేవుడు నిర్వహిస్తాడు మరియు మానవాళి మనుగడకు అవసరమైన ప్రతి దానిని ఆయన అందజేస్తాడు. అంతేకాకుండా, ఆ అన్నిటి మీద ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగి, వాటి మీద అధికారమును చెలాయిస్తాడు. మానవజాతి జీవించడానికి, వృద్ధి చెందడానికి మరియు సర్వ సాధారణంగా సంఖ్యను పెంచుకోవడానికి ఇవన్నీ అనుమతిస్తాయి; ఈ విధంగానే దేవుడు తాను సృష్టించిన అన్నింటికి మరియు మానవాళికి అవసరమైనవన్నిటిని సమకూరుస్తాడు. మనుష్యులు వీటన్నింటినీ గుర్తించి, అర్థం చేసుకోవలసిన అవసరం ఉండనేది నిజం కాదా? బహుశా కొందరు “ఈ అంశం అనేది నిజమైన దేవుని గురించిన మన జ్ఞానానికి చాలా దూరంగా ఉంది మరియు మనం ఆహారంతో మాత్రమే జీవించడం లేదు, దానికి బదులుగా దేవుని వాక్య ప్రకారం జీవిస్తాము కాబట్టి, మనం దీనిని తెలుసుకోవాలనుకోము” అని అంటుంటారు. ఈ విధమైన అవగాహన సరైనదేనా? (కాదు.) ఇది తప్పు కావడానికి కారణమేమిటి? దేవుడు చెప్పిన విషయాల గురించి మాత్రమే మీకు జ్ఞానం ఉంటే మీరు దేవుడు గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండగలరా? మీరు దేవుని కార్యమును మాత్రమే అంగీకరిస్తే మరియు దేవుని తీర్పు, శిక్షను అంగీకరిస్తే, దేవుని గురించిన పూర్తి అవగాహన మీకు ఉంటుందా? దేవుని స్వభావంలోని కొంత భాగం, దేవుని అధికారంలోని కొంత భాగం మాత్రమే మీరు తెలుసుకుంటే, దేవుని గురించిన అవగాహన సాధించడానికి అది మాత్రమే సరిపోతుందని మీరు భావించగలరా? (లేదు.) దేవుని కార్యములనేవి ఆయన సమస్త సృష్టినుండే ప్రారంభమయ్యాయి మరియు నేటికీ అవి కొనసాగుతున్నాయి. దేవుని కార్యములనేవి అన్ని సమయాల్లో, ఒక క్షణం నుండి క్షణం వరకు స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు తన పనిని కొందరి మీద చేయడ కోసం మరియు వారిని కాపాడడం కోసమే వారిని ఎంచుకుంటాడని మరియు దేవుని అధికారం, ఆయన హోదా లేదా ఆయన కార్యములలాంటివేవీ ఏమీ చేయవనే కారణంతో ఒక వ్యక్తి దేవుని ఉనికిని విశ్వసిస్తే, అలాంటి వ్యక్తని దేవుని గురించి నిజమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పరిగణించగలమా? “దేవుని గురించిన జ్ఞానం” కలిగిన వారుగా పిలవబడే ఇలాంటి వ్యక్తులు ఒక వైపు అవగాహన మాత్రమే కలిగి ఉంటారు. దాని ప్రకారం, వారు ఆయన కార్యాలను ఒక సమూహానికే పరిమితం చేస్తారు. దేవుని గురించిన నిజమైన జ్ఞానం ఇదేనా? ఇలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు దేవుని సృష్టిని మరియు వాటిపై ఆయన సార్వభౌమాధికారాన్ని తిరస్కరించడం లేదా? కొందరు వ్యక్తులు ఈ అంశం గురించి చర్చించడానికి ఇష్టపడరు. బదులుగా తమలో తాము, “ సమస్తము పైన దేవుని సార్వభౌమాధికారాన్ని నేను చూడలేదు. ఇలాంటి ఆలోచనను పూర్తిగా తొలగించాలి, మరియు దీనిని అర్థం చేసుకోవాలని నేను అస్సలు అనుకోను. దేవుడు తాను కోరుకున్నది చేస్తాడు మరియు దానితో నాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. నేను దేవుని నాయకత్వాన్ని మరియు ఆయన మాటను అంగీకరిస్తే చాలు. తద్వారా, నేను దేవుని ద్వారా రక్షించబడతాను మరియు పరిపూర్ణుడిగా చేయబడగలను. నాకు ఇంకేదీ ముఖ్యం కాదు. సమస్తమును సృష్టించినప్పుడు దేవుడు రూపొందించిన నియమాలు మరియు అన్ని అంశాలకు మరియు మానవజాతికి సమకూర్చడం కోసం ఆయన చేసిన పనులతో నాకు సంబంధం లేదని ఆలోచిస్తారు. ఇవి ఎటువంటి మాటలు? ఇది తిరుగుబాటు చర్య కాదా? మీలో ఎవరైనా ఇలాంటి అవగాహన కలిగి ఉన్నారా? మీలో ఏ ఒక్కరు అవునని చెప్పనప్పటికీ, ఇక్కడున్న మీలో చాలా మంది అలాంటి ఆలోచనతో ఉన్నారని నాకు తెలుసు. సరిగ్గా చెప్పాలంటే, అలాంటి వ్యక్తులు ప్రతిదానిని తమ స్వంత “ఆధ్యాత్మిక” దృక్కోణం నుండే చూస్తారు. వారు దేవుణ్ణి బైబిల్‌కు మాత్రమే పరిమితం చేయాలనుకుంటారు. దేవుడు మాట్లాడిన మాటల వ్రాతపూర్వక పదాల నుండి ఉద్భవించిన భావానికి మాత్రమే ఆయనను పరిమితం చేయాలనుకుంటారు. దేవుడు గురించి ఎక్కువగా తెలుసుకోవాలని వారు కోరుకోరు మరియు ఇతర కార్యములు చేయడం ద్వారా దేవుడు తన దృష్టిని విభజించడాన్ని వారు కోరుకోరు. ఈ రకమైన ఆలోచన అనేది చిన్నపిల్లల తత్వం లాంటిది మరియు అది అతిగా మతపరమైనది కూడా. ఈ విధమైన దృష్టికోణాలు కలిగిన వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకోగలరా? దేవుణ్ణి తెలుసుకోవడమనేది వారికి చాలా కష్టమైన విషయం. ఈ రోజు నేను రెండు కథలు చెప్పాను. వాటిలో ఒక్కొక్కటీ ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తుంది. మీకు వాటితో కాస్త పరిచయం ఏర్పడింది కాబట్టి, అవి లోతైనవి లేదా కొంచెం నైరూప్యమైనవి, వాటిని గ్రహించడం మరియు అర్థం చేసుకోవడం కష్టం అని మీరు భావించవచ్చు. దేవుని కార్యములతో మరియు దేవునితో వాటిని అనుసంధానించడం కష్టంగా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, దేవుని కార్యములన్ని మరియు సృష్టిలోను మరియు మానవజాతిలోను ఆయన చేసిన అన్నింటి గురించి ప్రతి వ్యక్తికి, దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ స్పష్టంగా మరియు ఖచ్చితంగా తెలియాలి. ఈ జ్ఞానం అనేది దేవుని నిజమైన ఉనికి గురించి మీకున్న విశ్వాసంపట్ల మీకు నిశ్చయతను అందిస్తుంది. దేవుని జ్ఞానం, ఆయన శక్తి మరియు సమస్తానికి ఆయన సమకూర్చే విధానం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని కూడా ఇది మీకు అందిస్తుంది. దేవుని నిజమైన ఉనికిని స్పష్టంగా గ్రహించడానికి, ఆయన ఉనికి కల్పితం కాదని, అది పురాణగాధ కాదని, అస్పష్టమైన విషయం కాదని, అది సిద్ధాంతం కాదని మరియు ఖచ్చితంగా అది ఒక విధమైన ఆధ్యాత్మిక సాంత్వన కాదని, అది ఒక నిజమైన ఉనికి అని మీరు స్థిరమైన అభిప్రాయానికి రావడానికి అనుమతిస్తుంది. అదిమాత్రమే కాకుండా, సృష్టించిన అన్నింటి కోసం మరియు మానవజాతి కోసం అవసరమైన ప్రతీది దేవుడు ఎల్లప్పుడూ దయచేస్తాడని మనుష్యులు తెలుసుకునేందుకు ఇది అనుమతిస్తుంది; దీనంతటినీ దేవుడు తనదైన స్వంత మార్గంలో మరియు తన ఇష్టానుసారముగానే చేస్తాడు. ఈ విధంగా, దేవుడు అన్నింటినీ సృష్టించాడు మరియు వాటికి నియమాలను నిర్ధేశించాడు కాబట్టి, ఆయన ముందుగానే నిర్ణయించిన ప్రకారం, ఆ ప్రతి ఒక్కటీ వాటికి కేటాయించిన పనులు నిర్వహిస్తాయి, వాటి బాధ్యతలు నెరవేరుస్తాయి మరియు వాటి స్వంత పాత్రలను నిర్వహిస్తాయి; ఆయన ముందుగానే నిర్ణయించిన ప్రకారం, సృష్టించబడిన ప్రతీది మానవజాతి సేవలో మరియు మానవజాతి నివాస ప్రదేశం మరియు పర్యావరణంలో దానికంటూ ప్రత్యేకమైన ఉపయోగం కలిగి ఉంటుంది. దేవుడు ఈ విధంగా చేసి ఉండకపోతే మరియు మానవాళి నివాసం కోసం అలాంటి వాతావరణం లేకపోయి ఉంటే, దేవుణ్ణి విశ్వసించడం లేదా ఆయన్ని అనుసరించడం మానవాళికి అసాధ్యంగా ఉండేది; అప్పుడు అదంతా ఖాళీ మాటలు తప్ప మరేమీ కాకుండా పోయేది. ఇది నిజం కాదంటారా?
గొప్ప పర్వతం మరియు చిన్న ప్రవాహం కథను మరోసారి పరిశీలిద్దాం. పర్వతం పని ఏమిటి? పర్వతం మీద జీవురాశులు వర్ధిల్లుతాయి. కాబట్టి, దాని ఉనికికి స్వాభావికమైన విలువ ఉంది. అదేసమయంలో, అది చిన్న ప్రవాహాన్ని ప్రవహించకుండా అడ్డుకుంటుంది. తద్వారా, మనుష్యులకు విపత్తును తీసుకువచ్చే ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది అటువంటి పరిస్థితి కాదంటారా? పర్వతం దానికంటూ ప్రత్యేకమైన స్థితిలో ఉనికిలో ఉంటుంది. దాని మీద ఉండే అనేక జీవరాశులు, అంటే చెట్లు మరియు గడ్డి మరియు ఆ పర్వతం మీద ఉండే ఇతర అసంఖ్యాకమైన మొక్కలు మరియు జంతువులు వృద్ధి చెందడాన్ని అది అనుమతిస్తుంది. అలాగే, అది ఆ చిన్న ప్రవాహపు ప్రవాహ గమనాన్ని కూడా నిర్దేశిస్తుంది. ప్రవాహంలోని నీటిని పర్వతం సేకరించడంతో పాటు ఆ ప్రవాహం సహజంగా దాని పాదాల వద్ద ప్రవహించి, నదిలోకి మరియు చివరకు సముద్రంలోకి చేరేలా చేస్తుంది. ఈ నియమాలేవీ సహజంగా సంభవించలేదు. సృష్టి సమయంలో దేవుని ద్వారా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గొప్ప పర్వతం మరియు భీకరమైన గాలి విషయానికొస్తే, పర్వతానికి కూడా గాలి అవసరం. పర్వతం మీద నివసించే జీవులను హాయిగా ఉంచడానికి గాలి కావాలి. అదే సమయంలో, భీకరమైన గాలి శక్తిని పర్వతం పరిమితం చేస్తుంది. తద్వారా, ఆ గాలి దానికి ఇష్టం వచ్చినట్లుగా వీచే పరిస్థితి ఉండదు. ఈ నియమం అనేది ఒక నిర్దిష్ట విషయంలో, గొప్ప పర్వతం విధిని సూచిస్తుంది; మరైతే, పర్వతం నిర్వహించే ఈ విధికి సంబంధించిన ఈ నియమం అనేది దానికదే ఏర్పడిందా? (లేదు.) అది దేవుని ద్వారా చేయబడింది. గొప్ప పర్వతానికి దానికంటూ కర్తవ్యం ఉంది. అలాగే, భీకరమైన గాలికి కూడా దానికంటూ ఒక విధి ఉంది. ఇప్పుడు, మనం గొప్ప పర్వతం మరియు భారీ అల విషయానికి వెళ్దాం. పర్వతం ఉనికి లేకుండా, నీరు దాని స్వంత ప్రవాహ మార్గాన్ని కనుగొనగలదా? (లేదు.) ఆ నీళ్లు వరదగా మారుతాయి. పర్వతం అనేది ఒక పర్వతంగా దాని స్వంత అస్తిత్వపు విలువను కలిగి ఉంటుంది మరియు సముద్రం కూడా ఒక సముద్రంగా దాని స్వంత అస్తిత్వపు విలువను కలిగి ఉంటుంది; అయితే, అవి సాధారణంగా కలిసి ఉండగలిగే మరియు ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోని పరిస్థితుల్లో కూడా, అవి ఒకదానినొకటి నిర్బంధించుకుంటాయి. గొప్ప పర్వతం సముద్రాన్ని పరిమితం చేస్తుంది. తద్వారా, సముద్రం వల్ల వరదలు రాకుండా చేస్తుంది. తద్వారా, ప్రజల ఇళ్లను కాపాడుతుంది మరియు పర్వతం అనేది సముద్రాన్ని నిర్బంధించడం వల్ల, దానిపై నివసించే జీవులకు పోషణ లభించడానికి కూడా అనుమతిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యం దానంతట అదే రూపొందిందా? (లేదు.) ఇది కూడా దేవుని ద్వారా సృష్టించబడినదే. దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు, పర్వతం ఎక్కడ నిలబడాలో, ప్రవాహం ఎక్కడ ప్రవహించాలో, భీకర గాలి ఏ దిక్కు నుండి వీచాలో మరియు ప్రవాహం ఎక్కడికి వెళ్లాలో మరియు భారీ అలలు ఎంత ఎత్తుకు మాత్రమే వెళ్లాలో ఆయన ముందే నిర్ణయించాడాన్ని మనం ఈ చిత్రంలో చూస్తాము. ఈ అంశాలన్నిటిలో దేవుని ఉద్దేశాలు మరియు ప్రయోజనాలు ఉంటాయి. ఇవన్నీ దేవుని క్రియలు. ఇప్పుడు, మీరు దేవుని కార్యాలను అన్ని విషయాల్లోనూ చూడగలుగుతున్నారు కదా? (అవును.)
ఈ విషయాల గురించి చర్చించడంలో మన ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎటువంటి నియమాల ద్వారా సమస్తాన్ని సృష్టించాడో ఆ నియమాలను మనుష్యులు అధ్యయనం చేసేలా చేయడమా? ఖగోళశాస్త్రం మరియు భౌగోళిక శాస్త్రంలో వారికి ఆసక్తిని ప్రోత్సహించడమా? (కాదు.) మరైతే, ఇదంతా దేనికోసం? దేవుని కార్యములను మనుష్యులు అర్థం చేసుకునేలా చేయడమే దీని ఉద్దేశం. దేవుని కార్యములలో, దేవుడే సమస్తానికి జీవనాధారమైయున్నాడు అనే విషయాన్ని మనుష్యులు రూఢీగా చెప్పగలరు మరియు ధృవీకరించగలరు. నీవు దీన్ని అర్థం చేసుకోగలిగితే, నీవు నీ హృదయంలో దేవుని స్థానాన్ని నిజంగా ధృవీకరించగలుగుతావుమరియు దేవుడు ప్రత్యేకమైనవాడని, భూమ్యాకాశములను మరియు సమస్తానికి ఆయనే సృష్టికర్త అని నీవు నిర్ధారించగలుగుతావు. మరైతే, సృష్టించబడిన సమస్తమైనవాటికి సంబంధించిన నియమాలు తెలుసుకోవడానికి మరియు దేవుని కార్యములను గురించి తెలుసుకునే క్రమంలో దేవుని గురించి నీవు అవగాహన చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందా? (అవును, ఇది ఉపయోగపడుతుంది.) ఇంతకీ, ఇది ఏ విధంగా ఉపయోగకరం? అన్నింటికంటే ముందుగా, దేవుని కార్యాలను నీవు అర్థం చేసుకున్న తర్వాత కూడా, నీవింకా ఖగోళశాస్త్రం మరియు భౌగోళిక శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగి ఉండగలవా? సమస్తమైన వాటికి సృష్టికర్త దేవుడే అనే విషయంలో నీవు ఇంకా పరిశోధకుడి హృదయంతో మరియు అనుమానంతో ఉండగలవా? (లేదు.) సమస్తమైనవాటికి సృష్టికర్త దేవుడే అని నీవు ధృవీకరించడంతోపాటు దేవుని సృష్టిలోని కొన్ని నియమాలను నీవు అర్థం చేసుకుంటే, దేవుడే సమస్తమైనవాటికి అవసరమైనవన్నీ అందించువాడని నీవు నీ హృదయంలో నిజంగా విశ్వసిస్తావా? (అవును.) ఇక్కడ “అందించడం” అనే దానికి నిర్దిష్టమైన ప్రాముఖ్యత ఉందా లేదంటే, దాని ఉపయోగం అనేది నిర్దిష్ట పరిస్థితిని సూచిస్తుందా?” సృష్టించబడిన సమస్తమైన వాటి కోసం దేవుడు సమకూరుస్తాడు” అనేది అత్యంత విస్తృతమైన ప్రాముఖ్యత మరియు పరిధిని కలిగిన ఒక పదబంధం. మనుష్యులకు దేవుడు కేవలం వారి రోజువారీ ఆహారం మరియు పానీయాలు మాత్రమే సమకూర్చడు; మనుష్యులు చూడగలిగే వాటినే కాకుండా, వాళ్లు చూడలేని వాటితో సహా మానవాళికి అవసరమైన ప్రతిఒక్కటీ ఆయన సమకూరుస్తాడు. మానవాళికి ఆవశ్యకమైన ఈ సజీవ పర్యావరణాన్ని దేవుడు పరిరక్షిస్తాడు, నిర్వహిస్తాడు మరియు పరిపాలిస్తాడు. సరిగ్గా చెప్పాలంటే, ప్రతి ఋతువులో మనిషికి ఎలాంటి పర్యావరణం అవసరమో దానిని దేవుడు సిద్ధం చేశాడు. గాలి రకాన్ని మరియు దాని ఉష్ణోగ్రతను కూడా దేవుడే నిర్వహిస్తాడు. అందుకే, అవి మానవ మనుగడకు అనుకూలంగా ఉంటాయి. ఈ అంశాలను నియంత్రించే నియమాలనేవి వాటికవే స్వయంగానో లేదంటే యాదృచ్ఛికంగానో సంభవించినవి కావు; దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన పనుల ఫలితంగానే అవి సంభవించాయి. ఈ నియమాలన్నింటికీ మూలం మరియు సమస్తమైన వాటికి జీవాధారం దేవుడు మాత్రమే. దీన్ని నీవు నమ్మినప్పటికీ, నమ్మకపోయినప్పటికీ, నీవు దీనిని చూసినా, చూడకపోయినా, లేదంటే, నీవు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా, ఇది ఒక స్థిరమైన మరియు తిరస్కరించలేని వాస్తవం.
బైబిల్లో పొందుపరచబడిన దేవుని మాటలు మరియు దేవుని కార్యముల మీద మాత్రమే అత్యధికులు విశ్వాసం కలిగి ఉన్నారని నాకు తెలుసు. కొద్దిమంది ప్రజల ముందు దేవుడు తన కార్యాలను బహిర్గతం చేశాడు మరియు ఆయన ఉనికి యొక్క విలువను చూడడానికి ఆ ప్రజలను ఆయన అనుమతించాడు. తన హోదా గురించి ఆయన వారికి కొంత అవగాహన కల్పించాడు మరియు తన ఉనికి అనే వాస్తవాన్ని వారితో ధృవీకరించాడు. అయినప్పటికీ, దేవుడే సమస్తాన్ని సృష్టించాడు మరియు సమస్తాన్ని ఆయనే నిర్వహిస్తాడు మరియు వాటికి అవసరమైనవాటిని ఆయనే సమకూరుస్తాడనే వాస్తవం అస్పష్టంగానో లేదంటే నిర్దిష్టత లేనిదిగానో ఉంటోంది; అలాంటి వ్యక్తులు సందేహాస్పద వైఖరి కూడా కొనసాగిస్తుండవచ్చు. ఈ వైఖరి కారణంగానే, సహజ ప్రపంచపు నియమాలు ఆకస్మికంగా ఏర్పడ్డాయనీ, ప్రకృతి మార్పులు, పరివర్తనలు, విలక్షణమైన మరియు ప్రకృతిని నియంత్రించే నియమాలన్నీ ప్రకృతి నుండే ఉద్భవించాయని వారు స్థిరంగా విశ్వసిస్తారు. సమస్తాన్ని దేవుడు ఏ విధంగా సృష్టించాడు మరియు వాటి మీద ఏ విధంగా ఆధిపత్యం ప్రదర్శిస్తాడనే దానిని మనుష్యులు వారి మనసుల్లో ఊహించలేరు; అన్ని అంశాలను దేవుడు ఎలా నిర్వహిస్తాడు మరియు వాటి కోసం ఎలా సమకూరుస్తాడనేది వారు అర్థం చేసుకోలేరు. ఈ పూర్వ సిద్ధాంతం పరిమితుల క్రింద, దేవుడు సృష్టించాడనీ, వాటి మీద అధికారం కలిగి ఉంటాడనీ మరియు సృష్టించబడిన సమస్తానికి ఆయనే సమకూరుస్తాడని మనుష్యులు విశ్వసించరు; దీన్ని విశ్వసించే వారు సైతం వారి విశ్వాసానికి సంబంధించి ధర్మశాస్త్ర యుగం, కృపా యుగం మరియు రాజ్యపు యుగానికే పరిమితమై ఉంటారు: దేవుని కార్యములు మరియు మానవజాతి కోసం ఆయన సమకూర్చేవన్నీ ప్రత్యేకించి ఆయన ఎంచుకున్న వారి కోసం మాత్రమే అని వారు విశ్వసిస్తారు. ఇలాంటిది చూడడమే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది మరియు ఇదే నాకు చాలా బాధ కలిగించే విషయంగానూ ఉంటుంది. ఎందుకంటే, దేవుడు ఇచ్చిన అన్నింటినీ మానవజాతి ఆనందిస్తున్నప్పటికీ, ఆయన చేసే వాటన్నింటినీ మరియు ఆయన వారికి ఇచ్చే వాటన్నింటినీ వారు తిరస్కరిస్తుంటారు. భూమ్యాకాశాలు మరియు ప్రతిఒక్కటీ వాటి స్వంత, సహజ నియమాలు మరియు వాటి స్వంత, మనుగడ కోసం సహజ నియమాల ద్వారానే నిర్వహించబడుతున్నాయని మరియు వాటిని నిర్వహించడానికి పాలకుడు ఎవరూ లేరనీ లేదా వాటికి సమకూర్చడానికి మరియు వాటిని నియమబద్ధంగా ఉంచడానికి సార్వభౌమాధికారం ఏదీ లేదని మనుష్యులు నమ్ముతారు. నీవు దేవుణ్ణి విశ్వసించినప్పటికీ, ఇవన్నీ ఆయన పనులే అని నీవు నమ్మకపోవచ్చు; నిజానికి, దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరూ, దేవుని మాటను అంగీకరించే ప్రతి ఒక్కరూ మరియు దేవుణ్ణి అనుసరించే ప్రతి ఒక్కరూ అత్యంత తరచుగా నిర్లక్ష్యం చేసే విషయాలలో ఇది కూడా ఒకటి. కాబట్టే, బైబిల్‌తో లేదా ఆధ్యాత్మిక పరిభాషగా పిలవబడే దానితో సంబంధం లేని విషయాన్ని నేను చర్చించడం ప్రారంభించిన వెంటనే, కొందరు విసుగు చెందుతారు లేదా అలసిపోతారు లేదా అసౌకర్యంగా భావిస్తారు. నా మాటలన్నీ ఆధ్యాత్మిక వ్యక్తుల నుండి మరియు ఆధ్యాత్మిక విషయాల నుండి దారితప్పినట్లుగా వారు భావిస్తారు. అదొక భయానక విషయం. దేవుని పనులు గురించి తెలుసుకునే విషయానికి వస్తే, మనం ఖగోళ శాస్త్రం గురించి ప్రస్తావించనప్పటికీ, భూగోళశాస్త్రం లేదా జీవశాస్త్రాన్ని పరిశోధించనప్పటికీ, సమస్తము మీద దేవుని సార్వభౌమాధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి, అన్ని అంశాల కోసం ఆయన ఏర్పాటు గురించి మనం తెలుసుకోవాలి మరియు అన్ని అంశాలకు ఆయనే మూలం అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదొక ఆవశ్యకమైన పాఠం మరియు తప్పక అధ్యయనం చేయాల్సిన విషయం. మీరు నా మాటలు అర్థం చేసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను!
కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన రెండు కథలూ విషయపరంగా మరియు వ్యక్తీకరణపరంగా కొంచెం అసాధారణమైనవే అయినప్పటికీ, అవి కొంచెం ప్రత్యేకమైన రీతిలో చెప్పబడ్డాయి. ఒకానొక విషయాన్ని మీరు లోతుగా అర్థము చేసుకొని మరియు దానిని అంగీకరించడానికి సహాయపడడం కోసం సూటిగా ఉండే భాషను మరియు ఒక సరళమైన సులభ విధానములో ఉపయోగించడానికి నేను ప్రయత్నించాను. ఇదే నా ఏకైక లక్ష్యం. ఈ చిన్న కథలు మరియు అవి గీసిన చిత్రాల్లో, సమస్త సృష్టి మీద దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉండడాన్ని మీరు చూడాలని మరియు విశ్వసించాలని నేను కోరుకున్నాను. ఈ కథలు చెప్పడంలో నా లక్ష్యం, కథలోని నిర్దిష్టమైన పరిధిలో దేవుని అనంతమైన కార్యాలను చూసేలా మరియు తెలుసుకునేలా మిమ్మల్ని అనుమతించడమే. మీకు మీరుగా ఈ ఫలితాన్ని సంపూర్ణంగా గ్రహించి, సాధించగలగడమనేది మీ స్వంత అనుభవాలు మరియు మీరు స్వంతంగా వెంబడించడం మీద ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని వెంబడించడంతోపాటు దేవుణ్ణి తెలుసుకోవాలని నీవు కోరుకుంటే, ఈ విషయాలన్నీ నీకు మరింత శక్తివంతమైన జ్ఞాపకం చేసే విషయాలుగా ఉపయోగపడతాయి; ఇవి నీకు లోతైన అవగాహనను, నీవు అర్థం చేసుకున్న దానిలో స్పష్టతను అందిస్తాయి. ఆ స్పష్టత అనేది అరమరలేని మరియు లోపంలేని సాన్నిహిత్యంతో క్రమంగా దేవుని వాస్తవ కార్యాలకు దగ్గరగా తీసుకెళ్తుంది. అయితే, దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక నీకు లేకపోతే, ఈ కథలేవీ మీకు ఎలాంటి హాని చేయవు. వీటిని నిజమైన కథలుగా పరిగణిస్తే చాలు.
ఈ రెండు కథల నుండి మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా? ముందుగా, మానవజాతిపట్ల దేవునికిగల శ్రద్ధ గురించిన మన గత చర్చ నుండి ఈ కథలు వేరుగా ఉన్నాయా? వీటి మధ్య అంతర్గత సంబంధం ఏదైనా ఉందా? ఈ రెండు కథల్లోనూ దేవుని కార్యాలను మరియు మానవజాతి కోసం ఆయన రూపొందించే ప్రతిదానిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించడాన్ని మనం చూడగలమనేది నిజమేనా? దేవుడు చేసేదంతా, ఆయన ఆలోచించేదంతా మానవాళి ఉనికి కోసమే అనేది నిజమేనా? (అవును.) మానవజాతిపట్ల దేవుడు జాగ్రత్తగా ఆలోచించడం మరియు శ్రద్ధ చూపడం ఇందులో స్పష్టంగా కనిపించడం లేదా? మానవజాతి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనుష్యుల కోసం దేవుడు గాలిని సిద్ధం చేశాడు, వాళ్లు చేయాల్సిందల్లా దానిని పీల్చడం మాత్రమే. వాళ్లు తినే కూరగాయలు మరియు పండ్లు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, ప్రతి ప్రాంతం దానికంటూ సొంతమైన సహజ వనరులతో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లోని పంటలు మరియు పండ్లు మరియు కూరగాయలు అన్నీ దేవుని ద్వారా తయారు చేయబడ్డాయి. గొప్ప పర్యావరణంలో, సృష్టించబడిన ప్రతిదానిని దేవుడు పరస్పరంగా బలపరిచాడు, పరస్పర ఆధారితంగా చేశాడు, పరస్పరం బలపరచుకునే విధంగా చేశాడు, పరస్పరం ప్రతిఘటిస్తూ, సహజీవనం చేసేలా రూపొందించాడు. సృష్టించబడిన ప్రతిదాని యొక్క మనుగడ మరియు ఉనికిని నిర్వహించడానికి ఇది ఆయన పద్ధతి మరియు ఆయన నియమం; ఈ విధంగా, ఈ సజీవ పర్యావరణంలో మానవజాతి సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఎదగగలుగుతోంది. ఒక తరం నుండి మరొక తరానికి, నేటి వరకు కూడా సంఖ్యను పెంచుకుంటోంది. సరిగ్గా చెప్పాలంటే, సహజ పర్యావరణానికి దేవుడు సమతుల్యతను అందిస్తాడు. దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన నియంత్రణ లేకపోతే, ఈ పర్యావరణం అనేది దేవునిచేత సృష్టించబడినదే అయినప్పటికీ, దానిని నిర్వహించడం మరియు దాని సమతుల్యతను కాపాడడం అనేది ఏ ఒక్కరి సామర్థ్యానికైనా మించినదిగానే ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో గాలి ఉండదు. అలాంటి ప్రదేశాలలో మానవజాతి మనుగడ సాగించలేదు. నీవు ఆ ప్రదేశాలకు వెళ్లడానికి దేవుడు అనుమతించడు. కాబట్టి, నిర్దేశిత పరిమితులను ఎప్పుడూ దాటవద్దు. ఇది మానవజాతి సంరక్షణ కోసం దాని లోపల రహస్యాలు ఉన్నాయి. పర్యావరణంలోని ప్రతి అంశం, భూమి పొడవు మరియు వెడల్పు, భూమి మీది ప్రతి జీవి, అంటే జీవం కలిగినవి మరియు జీవం లేనివి రెండింటినీ దేవుడు ముందుగానే రూపొందించాడు మరియు సిద్ధం చేశాడు. ఈ అంశం ఎందుకు అవసరం? ఆ అంశం ఎందుకు అనవసరం? ఈ అంశం ఇక్కడ ఉండడంవల్ల ప్రయోజనం ఏమిటి మరియు ఆ అంశం అక్కడికే ఎందుకు వెళ్లాలి? దేవుడు ఈ ప్రశ్నలన్నింటినీ ముందుగానే ఆలోచించాడు కాబట్టి, మనుష్యులు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొందరు మూర్ఖులు ఎల్లప్పుడూ పర్వతాలను కదిలించడం గురించే ఆలోచిస్తుంటారు. అయితే, ఆ ఆలోచనకు బదులుగా, వాళ్లు మైదానాలకు వెళ్లవచ్చు కదా? నీకు పర్వతాలు నచ్చకపోతే, నీవెందుకు వాటి సమీపంలో నివసిస్తున్నావు? అది మూర్ఖత్వం కాదా? మీరు ఆ పర్వతాన్ని కదిలిస్తే ఏం జరుగుతుంది? తుఫానులు మరియు భారీ అలలు వస్తాయి. మనుష్యుల ఇళ్లు నాశనం చేయబడతాయి. అప్పుడది మూర్ఖత్వం కాదా? మనుష్యులు వినాశనం సృష్టించడానికి మాత్రమే సమర్థులు. వాళ్లు కనీసం వాళ్ల ఏకైక నివాస స్థలాన్ని కూడా నిర్వహించలేరు. అయినప్పటికీ, సమస్తానికి అవసరమైన వాటిని సమకూర్చాలని వాళ్లు కోరుకుంటారు. ఇది అసాధ్యం.
సృష్టించబడిన సమస్తాన్ని నిర్వహించడానికి మరియు వాటి మీద అధికారం కలిగి ఉండడానికి మనిషిని దేవుడు అనుమతిస్తాడు. అయితే, మనిషి మంచి పనే చేస్తాడా? మనిషి తనకు వీలైనంతగా దానిని నాశనం చేస్తాడు. దేవుడు తన కోసం సృష్టించిన ప్రతిదాన్ని దాని అసలు స్థితిలోనే ఉంచడం మనిషికి సాధ్యం కాదు, అతడు ఆ పనిని విరుద్ధంగా చేసి, దేవుడు సృష్టించిన దానిని నాశనం చేశాడు. మానవజాతి పర్వతాలను తరలించింది, సముద్రాల్లోని భూమిని చేజిక్కించుకుంది మరియు మైదానాలను మనుష్యులు నివసించలేని ఎడారులుగా మార్చింది. అదే సమయంలో, ఎడారిలో మనిషి పరిశ్రమను స్థాపించి, అణు స్థావరాలు నిర్మించాడు. అన్నిచోట్లా విధ్వంసమునే విత్తియున్నాడు. ఇప్పుడు నదులేవీ నదులుగా లేవు, సముద్రం కూడా సముద్రంగా లేదు... సహజ పర్యావరణం మరియు దాని నియమాల సమతుల్యతను మనిషి విచ్ఛిన్నం చేసిన తర్వాత, తనకు విపత్తు మరియు మరణం సంభవించే రోజు ఎంతో దూరములో లేదు; అది అనివార్యం కూడా. విపత్తు వచ్చినప్పుడే, దేవుడు తన కోసం చేసిన ప్రతిదాని విలువను గురించి మరియు మానవాళికి అది ఎంత ముఖ్యమైనదో మానవాళికి తెలుస్తుంది. మనిషికి సంబంధించి, గాలి మరియు వానలు సకాలంలో వచ్చే పర్యావరణంలో జీవించడమనేది స్వర్గంలో నివసించినట్లుగా ఉంటుంది. అది ఒక వరం అని మనుష్యులు గుర్తించరు. అయితే, వాటన్నింటినీ వారు కోల్పోయిన క్షణం, అది ఎంత అపురూపమైనదో మరియు విలువైనదో వారికి తెలుస్తుంది. అలాగే, అది పోయిన తర్వాత, దానిని మళ్లీ ఎలా పొందుగలరు? దేవుడు దానిని మళ్లీ సృష్టించడానికి ఇష్టపడకపోతే ప్రజలు ఏమి చేయగలరు? అప్పుడు మీరు చేయగలిగేది ఏదైనా ఉంటుందా? నిజానికి, మీరు చేయగలిగింది ఒకటి ఉంది. అది చాలా సులభం కూడా, అదేమిటో నేను మీకు చెప్పినప్పుడు, అది సాధ్యమేనని మీరు తక్షణమే తెలుసుకుంటారు. మనిషి తన ప్రస్తుత స్థితిలో తనను తాను ఎలా కనుగొనగలడు? ఇదంతా అతని దురాశ మరియు అతను చేసిన విధ్వంసంవల్ల కాదా? ఈ విధ్వంసానికి మనిషి ముగింపు పలికితే, అతడి సజీవ పర్యావరణం క్రమంగా సరైన స్థితికి చేరుకోదా? దేవుడు ఏమీ చేయకపోయినట్లతే, మానవాళికి ఇకపై ఏమీ చేయకూడదని దేవుడు భావిస్తే, అంటే, ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోకపోతే, ఈ అన్ని విధ్వంసాలు ఆపివేయడం మరియు వాటి సజీవ పర్యావరణాన్ని దాని సహజ స్థితికి చేరుకునే విధంగా చేయడమే మానవజాతి ముందున్న ఉత్తమ పరిష్కారం. ఈ విధ్వంసాలు అన్నింటినీ అంతం చేయడమంటే, దేవుడు సృష్టించిన వాటిని దోపిడి చేయడం మరియు వాటిని విధ్వంసం చేయడానికి ముగింపు పలకడమే. అలా చేయడం వల్ల, మనిషి జీవిస్తున్న పర్యావరణం క్రమంగా కోలుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేయడంలో విఫలమైన పక్షంలో, జీవితం కోసం పర్యావరణం మరింత దుర్భరంగా మారుతుంది మరియు దాని విధ్వంసం కాలక్రమేణా మరింత వేగవంతమవుతుంది. నేను చెప్పిన పరిష్కారం సులభమైనదే కదా? ఇది సరళమైనది మరియు ఆచరణీయమైనది కాదా? నిజానికి కొందరికి ఇది సరళమైనది మరియు సాధ్యమయ్యేదే గాని భూమి మీద ఉన్న ఎక్కువ శాతపు ప్రజలకు ఇది సాధ్యమేనా? (కానే కాదు.) మీకు ఇది కనీస స్థాయిలోనైనా సాధ్యమేనా? (అవును.) మీరు “అవును” అని చెప్పడానికి కారణమేంటి? ఇది దేవుని కార్యములను అర్థం చేసుకునే పునాది నుండి రావడమే అందుకు కారణంగా చెప్పవచ్చా? దీని పరిస్థితిని దేవుని సార్వభౌమాధికారానికి మరియు ప్రణాళికకు విధేయతగా పేర్కొనవచ్చా? (అవును.) అంశాలను మార్చడానికి ఒక మార్గం ఉంది గాని ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం అది కాదు. ప్రతి మానవ జీవితానికి దేవుడు బాధ్యత వహిస్తాడు మరియు చివరి క్షణం వరకు ఆయనే బాధ్యత వహిస్తాడు. దేవుడు నీ కోసం సమకూరుస్తూనే ఉంటాడు. సాతాను ద్వారా నాశనమైన ఈ పర్యావరణంలోనూ, నీవు అనారోగ్యంతో ఉన్నప్పటికీ లేదా కలుషితమై లేదా ఉల్లంఘించినప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా దేవుడు నీకు సమకూరుస్తాడు మరియు నీవు జీవించడానికి దేవుడు అనుమతిస్తాడు. మీరు ఈ విషయంలో విశ్వాసంతో ఉండాలి. మనిషి మరణించడాన్ని దేవుడు అంత తేలికగా అనుమతించడు.
దేవుడే సమస్తానికి జీవధారమైయున్నాడు అని గుర్తించాల్సిన ప్రాముఖ్యతకు సంబంధించి మీరిప్పుడు కొంతైనా భావించగలుగుచున్నారా? (అవును, మేము భావిస్తున్నాము.) మీకు ఎలాంటి భావాలు కలిగాయి? నాకు చెప్పండి. (పర్వతాలు, సముద్రాలు మరియు సరస్సులను దేవుని కార్యాలతో అనుసంధానించి చూడాలని గతంలో మేమెప్పుడూ అనుకోలేదు. ఈ రోజు దేవుని సహవాసం వినేంత వరకు, వాటిలో దేవుని కార్యాలు మరియు ఆయన జ్ఞానం దాగి ఉన్నాయని మేము అర్థం చేసుకోలేదు; దేవుడు సమస్తాన్ని సృష్టించినప్పుడు, ఆయన అప్పటికే, ప్రతి దానిని ఆయన గమ్యముతోను మరియు ఆయన మంచి సంకల్పంతోను నింపాడు. సమస్తము పరస్పరం బలోపేతం కావడంతోపాటు అవి పరస్పరం ఆధారపడి ఉంటాయనీ, ఇందులో మానవజాతి అంతిమ లబ్ధిదారుగా ఉంటుందని మనం చూస్తాము. ఈ రోజు మనం విన్నవి అత్యంత తాజాగా మరియు సరికొత్తగా అనిపిస్తాయి, దేవుని కార్యాలు ఎంత వాస్తవమో మనకు తెలుస్తుంది. వాస్తవ ప్రపంచంలో, మన రోజువారీ జీవితంలో మరియు అన్ని అంశాలతో మన ముఖాముఖిగా ఎదుర్కొనినప్పుడు మనం దీన్ని చూస్తాము.) మీరు నిజంగానే చూశారు కదా? ఒక మంచి పునాది లేకుండా దేవుడు దేనినీ మానవాళికి అందించడు; ఆయన సమకూర్చేవి కేవలం కొన్ని చిన్న పదాలు కావు. దేవుడు చాలా చేశాడు మరియు నీవు చూడని విషయాలు సైతం నీ ప్రయోజనం కోసమే ఉంటాయి. దేవుడు తన కోసం సృష్టించిన సమస్తము ఉన్న పర్యావరణంలో మనిషి జీవిస్తాడు. ఇక్కడ మనుష్యులు మరియు సృష్టించబడిన సమస్తము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, గాలిని శుద్ధి చేసే వాయువులను మొక్కలు వదులుతాయి. ఆ శుద్ధి చేయబడిన గాలిని మనుష్యులు పీల్చుకుంటారు మరియు దాని నుండి ప్రయోజనం పొందుతారు; అదే సమయంలో, కొన్ని మొక్కలు మనుష్యులకు విషపూరితమైనవిగా ఉంటాయి. మరికొన్ని మొక్కలు ఆ విషపూరిత మొక్కలను ప్రతిఘటిస్తాయి. దేవుని సృష్టిలోని అద్భుతం ఇదే! అయితే, ప్రస్తుతానికి ఈ అంశాన్ని వదిలేద్దాం; ఈ రోజు, మన చర్చ అనేది ప్రధానంగా మనిషి మరియు మిగిలిన సృష్టికి మధ్య కలిసి జీవించే విధానానికి సంబంధించినది. ఆ మిగిలిన సృష్టి లేకుండా మనిషి జీవించలేడు. దేవుడు సమస్తాన్ని సృష్టించడంలోగల ప్రాముఖ్యత ఏమిటి? గాలి లేకుండా మనిషి జీవించలేనట్లే, ఆ మిగిలినవి లేకుండా కూడా మనిషి జీవించలేడు, నిన్ను శూన్యంలో ఉంచితే, నీవు వెంటనే చనిపోతావు. మిగిలిన సృష్టి లేకుండా మనిషి జీవించలేడని చెప్పే సులభమైన సూత్రం ఇది. కాబట్టి, మిగిలిన అన్ని అంశాలపట్ల మనిషి ఎలాంటి వైఖరితో ఉండాలి? వాటిని సంపన్నం చేసేవాడిగా ఉండాలి, వాటిని రక్షించేవాడిగా ఉండాలి, వాటిని సమర్ధంగా ఉపయోగించుకునేలా ఉండాలి, వాటిని నాశనం చేయనివాడై ఉండాలి, వృధా చేయనివాడై ఉండాలి మరియు వాటిని ఇష్టానుసారంగా మార్చకుండా ఉండాలి. ఎందుకంటే, ప్రతి ఒక్కటీ దేవుని నుండి వచ్చింది. సమస్త సృష్టిని ఆయన మానవాళి కోసం సమకూర్చాడు. కాబట్టి, మానవాళి వాటితో స్పృహ కలిగి వ్యవహరించాలి. ఈ రోజు మనం ఈ రెండు అంశాల గురించి చర్చించాము. వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించండి మరియు వాటిని బాగా ధ్యానం చేయండి. ఈసారి, మరికొన్ని విషయాల గురించి మనం మరింత వివరంగా చర్చిద్దాం. నేటి సమావేశం ఇక్కడితో ముగిసింది. సెలవు!
జనవరి 18, 2014