నీకు తెలుసా? దేవుడు మనుషుల మధ్య ఒక గొప్ప కార్యాన్ని చేసాడు
పాత యుగం గడిచిపోయింది మరియు కొత్త యుగం వచ్చింది. సంవత్సరం తర్వాత సంవత్సరం, రోజు తర్వాత రోజు దేవుడు ఎంతో పనిని చేసాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు మరియు తిరిగి వెళ్ళిపోయాడు. అనేక తరాలుగా ఈ పరిభ్రమణం దానికదే పునారావృత్తమవుతుంది. ఈ రోజు, ఇంతకుమునుపులా ఆయన తాను తప్పక చేయవలసిన పనిని, ఆయన ఇంకా పూర్తి చేయాల్సిన పనిని దేవుడు కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే, ఈ రోజు వరకు ఆయన ఇంకా విశ్రాంతి తీసుకోలేదు. సృష్టి ఆరంభ కాలం నుని ఈ రోజు వరకూ దేవుడు ఎంతో పని చేసాడు. కానీ, దేవుడు ఈ రోజు ఇంతకుమునుపు కన్నా ఎక్కువగా పని చేస్తున్నాడని ఆయన పని యొక్క పరిధి ఇంతకుముందు కన్నా ఎక్కువని నీకు తెలుసా? అందుకే, దేవుడు మనుషుల మధ్య ఒక గొప్ప కార్యము చేసాడని నేను అంటాను. దేవుని యొక్క అన్ని కార్యాలు ముఖ్యమైనవే, అది మనిషి కైనా లేదా దేవుని కైనా, ఎందుకంటే ఆయన కార్యము యొక్క ప్రతీ అంశమూ మనిషికి చెందినది.
దేవుని కార్యము కనపడదు లేదా ముట్టుకోలేము—ప్రపంచం చేత అసలే చూడబడదు—కాబట్టి అది ఏదైనా గొప్ప విషయం ఎలా ఔతుంది? అసలు ఎలాంటి విషయము గొప్పదిగా పరిగణించబడుతుంది? దేవుడు ఏ కార్యము చేసినా అది గొప్పదిగా భావించబడుతుంది, ఖచ్చితంగా దాన్నైతే ఎవరూ ఖండించలేరు, కానీ ఇది ఈ రోజు దేవుడు చేసే పని గురించి ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఒక గొప్ప పని చేశాడు అని చెప్పినప్పుడు, దాంట్లో నిస్సందేహంగా మనిషి ఇంకా అర్దం చేసుకోవాల్సిన ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం.
క్రీస్తు, ఆయన అస్తిత్వాన్ని సహించలేని కాలంలో ఒక తొట్టిలో జన్మించాడు. అయినప్పటికీ, ఈ ప్రపంచం ఆయన మార్గంలో నిలబడలేక పోయింది, మరియు ఆయన దేవుని సంరక్షణలో ముప్పై మూడు సంవత్సరాల పాటు మనుషుల మధ్య జీవించాడు. ఈ అనేక సంవత్సరాల జీవితంలో, ఆయన ఈ ప్రపంచపు చేదును అనుభవించాడు మరియు భూమిపై దుర్భరమైన జీవితాన్ని రుచి చూశాడు. సమస్త మానవాళిని విమోచించడానికి శిలువ వేయించుకొనే గొప్ప భారాన్ని ఆయన భుజానికెత్తుకున్నాడు. ఆయన సాతాను అధికారం కింద జీవిస్తున్న పాపులందరినీ విముక్తులను చేశాడు. మరియు చివరికి పునరుత్థానం చెందిన ఆయన దేహం తిరిగి ఆయన విశ్రాంతి స్థలానికి చేరింది. ఇప్పుడు దేవుని యొక్క కొత్త కార్యం మొదలైంది, మరియు ఇది నూతన యుగపు ఆరంభం కూడా. దేవుడు, ఆయన కొత్త విమోచన కార్యాన్ని మొదలుపెట్టడానికి రక్షించబడిన వారిని ఆయన గృహానికి తీసుకువస్తున్నాడు. ఈ సారి, విమోచన కార్యము గతించిన కాలము కంటే మరింత క్షుణ్ణంగా ఉంది. తనంతట తాను మారడానికి మనిషిలో పని చేస్తున్న పరిశుద్దాత్మ, లేదా ఈ పని చెయ్యడానికి మనుషుల మధ్య కనపడే యేసు శరీరం కూడా కారణం కాదు, ఈ పని ఇతర మాధ్యమాల ద్వారా అసలే జరగడం లేదు. బదులుగా, పని చేస్తూ తనని తానూ నిర్వహించుకునే దేవుని అవతారం. మనిషిని కొత్త కార్యము వైపు నడిపించడానికి ఆయన ఈ విధానంలో చేస్తాడు. ఇది గొప్ప సంగతి కాదా? కొంతమంది మనుషుల ద్వారానో లేదా ప్రవచనాల ద్వారానో దేవుడు ఈ కార్యాన్ని చెయ్యడం లేదు; బదులుగా దేవుడు తనంతట తానే చేస్తున్నాడు. కొంత మంది ఇది గొప్ప విషయం కాదని మరియు అది మనిషికి గొప్ప సంతోషాన్ని తీసుకురాలేదని కొంత మంది అనొచ్చు. కానీ దేవుని కార్యము ఇది మాత్రమే కాదు, కానీ ఇంకా గొప్పది మరియు ఇంకా చాలా అని నీకు నేను చెప్తాను.
ఈసారి, దేవుడు ఆత్మ దారియై కాక అతి సాధారణ రూపంలో తన కార్యాన్ని చెయ్యడానికి వస్తున్నాడు. అంతేకాక, ఇది కేవలం దేవుని రెండవ అవతారపు శరీరం మాత్రమే కాదు, దేవుడు దేహానికి తిరిగి వచ్చే శరీరం కూడా ఇదే. ఇది అతి సాధారణమైన శరీరం. ఆయనను ఇతరుల నుండి ప్రత్యేకంగా ఉంచే దేనినీ నువ్వు చూడలేవు, కానీ అంతకు ముందెన్నడూ వినని సత్యాలను ఆయన నుండి పొందవచ్చు. దేవుని నుండి వచ్చే అన్నీ వాక్యాల సత్యాన్ని పొందుపరిచి ఉంది. అంత్య దినాల్లో దేవుని కార్యాన్ని చేపట్టి. మరియు మనిషికి అర్దం అయ్యేలా దేవుని స్వభావాన్ని వ్యక్తీకరించేది ఈ నిరర్థకమైన శరీరమే. పరలోకంలో ఉన్న దేవుని చూడాలని నువ్వు గొప్పగా కోరుకోవడం లేదా? పరలోకంలో దేవునిని అర్దం చేసుకోవాలని నువ్వు గొప్పగా కోరుకోవడం లేదా? మనిషి గమ్యస్థానం ఏమిటో చూడాలని నువ్వు గొప్పగా కోరుకోవడం లేదా? ఆయన నీకు ఈ రహస్యాలన్నీ చెప్తాడు—ఏ మనిషీ నీకు చెప్పలేని రహస్యాలు, మరియు ఆయన నువ్వు అర్ధం చేసుకోలేని రహస్యాలని కూడా నీకు చెప్తాడు. రాజ్యములోనికి నీ ద్వారము, మరియు నవీన యుగానికి నీ మార్గదర్శి ఆయనే. ఇంత సాధారణమైన దేహం ఎన్నో లోతైన రహస్యాలని కలిగి ఉంటుంది. ఆయన పనులు నీకు అతి నిగూఢమైనవిగా ఉండవచ్చు, కానీ ప్రజలు విశ్వసిస్తున్నట్లుగా ఒక సాధారణం దేహం కాదని ఆయన చేసే పని యొక్క మొత్తం లక్ష్యం నువ్వు చూసేలా అనుమతించడానికి సరిపోతుంది. ఎందుకంటే, ఆయన దేవుని చిత్తాన్ని మరియు దేవుడు మానవాళి పట్ల చూపే రక్షణకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూమ్యాకాశాల్ని వణికిస్తున్నట్లు ఉండే ఆయన మాటలు నువ్వు వినలేనప్పటికీ, అగ్ని జ్వాల లాంటి ఆయన కళ్ళను నువ్వు చూడలేనప్పటికీ, మరియు ఆయన ఇనుప దండపు క్రమశిక్షణను నువ్వు తీసుకోనప్పటికీ, ఆయన వాక్యము నుండి దేవుడు కోపధారి అని నువ్వు వినవచ్చు, మరియు దేవుడు మానవాళి పట్ల సహా నుభూతి నీ చూపిస్తున్నాడనీ తెలుసు కోవచ్చు. ఆయన నీతి వంతమైన స్వభావాన్ని మరియు ఆయన వివేచనను నువ్వు చూడవచ్చు, మరియు, అంతేకాక, మొత్తం మానవాళి పట్ల దేవుని వ్యాకులతని గ్రహించవచ్చు. అంత్య దినాల్లో దేవుని పని, మనిషిని పరలోకమునందున్న దేవుడు భూమిపై మనుషుల మధ్య నివసిస్తూ ఉండటం చూసేలా చెయ్యడమే. మరియు మనిషిని దేవుని తెలుసుకునేలా, లోబడేలా, ఆరాధించేలా చెయ్యడమే. ఇందుకోసమే ఆయన రెండవసారి దేహానికి తిరిగి వచ్చాడు. ఈ రోజు మనిషి చూసేది మనిషి లానే ఉండే దేవుడ్ని, ఒక ముక్కు రెండు చెవులూ మరియు రెండు కళ్ళు ఉన్న ఒక దేవుడ్ని, ఒక గుర్తింపు లేని దేవుడ్ని అయినప్పటికీ, చివరికి ఈ మనిషే కనుక లేకపోతే భూమ్యాకాశాలు గొప్ప మార్పుకి గురి ఔతాయి అని దేవుడు మీకు చూపిస్తాడు. ఈ మనిషే కనుక ఉనికిలో లేకపోతే పరలోకం వెలవెల పోతుంది, మరియు భూమి అరాచకంలో మునిగిపోతుంది మరియు మొత్తం మానవాళి కరువు మరియు వ్యాధుల మధ్య బ్రతుకుతుంది. ఒకవేళ అంత్య దినాల్లో దేవుని అవతారం మిమ్మల్ని రక్షించడానికి రాకపోతే, అప్పుడు దేవుడు చాలా కాలం క్రితమే మొత్తం మానవాళిని నరకంలో నాశనం చేసి ఉండేవాడని ఆయన చూపిస్తాడు. ఒకవేళ ఈ దేహం కనుక ఉనికిలో లేకపోతే, అప్పుడు మీరు ఎప్పటికీ పరమ పాపులుగా, మరియు ఎప్పటికన్నా ఎక్కువ శవాలుగా ఉండేవారు. ఈ శరీరమే కనుక ఉనికిలో లేకపోతే మొత్తం మానవాళి తప్పించుకోలేని విపత్తుని ఎదుర్కునే వారని, అంత్య దినాల్లో దేవుడు మానవాళికి విధించే మరింత తీవ్రమైన కఠినమైన శిక్ష నుండి తప్పించుకోవడం అసంభవం అని మీరు తెలుసుకోవాలి. ఈ సాధారణ దేహమే గనుక జన్మించకపోతే, మీరందరూ బ్రతకలేక బ్రతుకు గురించి అర్థిస్తూ, చావలేక చావు గురించి అర్థిస్తూ ఉండే స్థితి లో ఉండేవారు. ఒకవేళ ఈ దేహమే కనుక లేకపోతే, అప్పుడు మీరు సత్యాన్ని పొందగలిగే వారు కాదు, మరియు ఈ రోజు దేవుని సింహాసనం ముందుకు వచ్చేవారు కాదు. దానికి బదులుగా మీరు మీ ఘోరమైన పాపాల కారణంగా దేవునిచే శిక్షింపబడే వారు. మీకు తెలుసా, దేవుడు దేహ రూపంలోకి తిరిగి రాకపోవడం వలన కాకపోతే, ఏ ఒక్కరి విమోచనకి అవకాశం ఉండేది కాదు. మరియు ఈ దేహం ద్వారా రాక పోయి ఉంటే చాలా కాలం క్రితమే దేవుడు పాత తరానికి ముగింపు పలికే వాడని మీకు తెలుసా? ఇది ఇలా ఉండగా మీరు ఇంకా దేవుని రెండవ అవతారాన్ని తిరస్కరించగలుగుతున్నారా? ఈ సాధారణమైన మనిషి నుండి మీరు ఏన్నో ప్రయోజనాలు పొందగలిగినపుడు, మీరు ఎందుకు ఆయన్ని సంతోషంగా అంగీకరించరు?
దేవుని పని మీరు అవగాహన చేసుకోలేనిది. నీ ఎంపిక సరైనదో కాదో నువ్వు పూర్తిగా గ్రహించలేకపోతే, దేవుని పని విజయవంతం ఔతుందా అనేది కూడా తెలియకపోతే, అప్పుడు ఈ సాధారణ మనిషి నీకు గొప్పగా ఉపయోగపడచ్చేమో నీ అదృష్టాన్ని ఎందుకు పరీక్షించుకొని చూడకూడదు? ఒకవేళ దేవుడు అసలు గొప్ప పని చేశాడా? ఏదేమైనా, నేను నీకు ఇది చెప్పాలి, నోవాహు కాలంలో మనుషులు ఎంతగా తింటూ, తాగుతూ, పెళ్లి చేసుకుంటూ, పెళ్లిని తెగతెంపులు చేసుకుంటూ ఉన్నారంటే దేవునికి అది చూడటం భరించలేనంతగా అయింది. అందుకే ఆయన గొప్ప ప్రళయాన్ని మానవాళిని నాశనం చెయ్యడానికి పంపాడు, కేవలం ఎనిమిది మంది ఉన్న నోవాహు కుటుంబాన్ని మరియు అన్ని రకాల పక్షులని మరియు మృగాలను మాత్రమే విడిచి పెట్టాడు. అంత్య దినాల్లో దేవుని చేత విడిచి పెట్టబడిన వారందరూ చివరి వరకూ ఆయనకి విధేయులుగా ఉన్నారు. రెండు యుగాలూ దేవుడు చూడటానికి భరించలేనంత గొప్ప అవినీతిమయమైనప్పటికీ, మరియు రెండు యుగాలలో మనుషులు ఎంతో అవినీతి పరులై దేవుని తమ ప్రభువు అనే దాన్ని తిరస్కరించినప్పటికీ, దేవుడు కేవలం నోవాహు కాలంలోని మనుషులను మాత్రమే నాశనం చేశాడు. ఎందుకు ఇలా? ఎందుకు అని మీరు ఎప్పుడూ ఆశ్చర్యపోలేదా? మీకు నిజంగా తెలియకపోతే నన్ను మీకు చెప్పనివ్వండి. అంత్య దినాల్లో జనులకి దేవుడు కృపని అనుగ్రహించడానికి కారణం వారు నోవాహు కాలంలో ఉన్న ప్రజల కంటే తక్కువ అవినీతి పరులనో, లేదా వారు దేవునికి తమ పశ్చాత్తాపాన్ని ప్రకటించారనో, దేవుడు తానంతట తానే వచ్చి వారిని నాశనం చెయ్యలేనంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందనో అసలేమాత్రమూ కాదు. బదులుగా, అంత్య దినాల్లో ఒక జనుల సమూహం లో దేవుడు చెయ్యవలసిన పని ఉంది. మరియు దేవుడు ఆయన అవతారంలో తనంతట తానే ఈ పని చేస్తాడు. ఇంకా చెప్పాలంటే, దేవుడు ఈ సమూహంలోని కొంత మందిని తన విమోచన, మరియు నిర్వహణా ప్రణాళిక యొక్క ఫలంగా మారడానికి ఉపకరణాలుగా ఎంచుకుంటాడు, మరియు ఈ జనులని తర్వాత తరానికి తీసుకు వస్తాడు. అందువలన, ఏదైమనప్పటికీ, ఆయన దేహపు అవతారం అంత్య దినాల్లో చేయబోయే పనికి పూర్తిగా సిద్దంగా ఉండటానికి దేవుని చేత చెల్లింపబడిన వెల ఇది. మీరు వాస్తవానికి ఈ రోజు దాకా వచ్చారంటే ఈ దేహానికి కృతజ్ఞతలు. ఇది ఎందుకంటే దేవుడు ఈ దేహంలో నివసిస్తున్నాడు కాబట్టి మీకు బ్రతకడానికి అవకాశం దొరికింది. మొత్తం ఈ సంపద అంతా ఈ సాధారణమైన మనిషి వల్లనే లభించింది. ఇది మాత్రమే కాదు, చివరికి ప్రతి జాతి, ఈ సాధారణ మనిషిని ఆరాధించాలి దానితో పాటు కృతజ్ఞత తెలిపి ఈ ప్రాముఖ్యం లేని మనిషికి లోబడాలి, ఎందుకంటే అదే సత్యమూ, జీవము మరియు ఆయన దాన్ని తీసుకువచ్చిన విధానం మొత్తం మానవాళిని రక్షించింది. దేవునికి మనిషికి మధ్య ఉన్న విభేదాలను సరళం చేసింది. వారి మధ్యనున్న దూరాన్ని తగ్గించింది. దేవుని మరియు మనిషి ఆలోచనల మధ్య గల సంబంధాన్ని తెరిచింది. దేవునికి అత్యంత ఘనతని తీసుకువచ్చింది కూడా ఆయనే. ఈ సాధారణమైన మనిషి నీ నమ్మకానికి మరియు ఆరాధనకి అనర్హుడా? ఈ సాధారణమైన దేహం క్రీస్తు అని పిలువబడటానికి తగనిదా? ఇంత సాధారణమైన మనిషి మనుషుల మధ్యలో దేవుని వ్యక్తీకరణ కాకూడదా? మానవాళిని వినాశనం నుండి రక్షించిన ఇలాంటి మనిషి మీ ప్రేమ మరియు ఆయనని అంటి పెట్టుకుని ఉండాలనే మీ కోరికకి తగడా? ఆయన నోటి నుండి వ్యక్తమయ్యే సత్యాలను మీరు తిరస్కరిస్తే మరియు ఆయన మీ మధ్య ఆయన ఉనికిని అసహ్యించుకుంటే, అప్పుడు చివరికి మీరు ఏమవుతారు?
అంత్య దినాల్లో దేవుని కార్యం మొత్తం ఈ సాధారణ మనిషి ద్వారానే జరిగింది. ఆయన మీకు అన్నిటినీ అనుగ్రహిస్తాడు, ఇంకా ఏమిటంటే, మీకు సంబంధించిన ప్రతిదీ ఆయన నిర్ణయించగలడు. అలాంటి మనిషి మీరు విశ్వసించే లాంటి మనిషి ఔతాడా? ప్రస్తావించడానికి కూడా పనికి రానంత అతి సాధారణ మనిషి? మిమ్మల్ని పూర్తిగా ఒప్పించడానికి ఆయన సత్యం సరిపోదా? ఆయన కార్యాలని చూడటం మిమ్మల్ని పూర్తిగా ఒప్పించడానికి సరిపోదా? లేదా ఆయన తీసుకు వచ్చే మార్గం మీరు నడవడానికి అర్హత లేనిదా? ఇదంతా చెప్పి, చేసినప్పుడు, మీరు ఆయన్ని అసహ్యించు కునేందుకు మరియు ఆయన్ని దూరంగా ప్రారద్రోలేందుకు కారణమైంది ఏమిటి? ఆయనను ఎందుకు దూరంగా పెడుతున్నారు? సత్యాన్ని వ్యక్తపరిచేది ఈ మనిషే, సత్యాన్ని అందించేది ఈ మనిషే, మీరు అనుసరించడానికి మార్గాన్ని ఇచ్చేది ఈ మనిషే. మీరు ఈ సత్యాలలో దేవుని కార్యపు జాడలను ఇంకా కనుగొనలేక పోతున్నారా? క్రీస్తు కార్యము లేకుండా మానవాళి శిలువ నుండి కిందకి వచ్చేది కాదు, కానీ ఈ రోజుటి అవతారం లేకుండా, శిలువ నుండి కిందకి వచ్చినవారు ఎప్పటికీ దేవుని అంగీకారాన్ని పొందలేరు లేదా నవీన యుగంలోకి ప్రవేశించలేరు. ఈ సాధారణమైన మనిషి రాకడ లేకపోతే దేవుని యొక్క నిజమైన ముఖాన్ని చూసే అవకాశం ఎప్పటికీ ఉండేది కాదు. లేదా మీరు దానికి అర్హులు అయ్యేవారు కూడా కాదు. ఎందుకంటే మీరంతా ఎప్పుడో నాశనం కావాల్సిన ఉపకరణాలు. దేవుని రెండవ రాకడ అవతారం కారణంగా దేవుడు మిమ్మల్ని క్షమించాడు మరియు. మీపై దయ చూపించాడు. ఏదేమైనా, నేను మీతో తప్పక విడిచి పెట్టాల్సిన చివరి మాటలు ఇవే: దేవుని అవతారమైన ఈ సాధారణమైన మనిషి మీకు అతి ముఖ్యమైన వాడు. దేవుడు మనుషుల మధ్య చేసిన గొప్ప కార్యము ఇదే.