10 వ అధ్యాయము
దేవుని రాజ్య కాలము, గతించిన కాలాలు అన్నింటికన్నా భిన్నమైనది. ఇది మానవజాతి ఎలా స్పందిస్తుందో అని లెక్క చేయదు; బదులుగా, నా కార్యాన్ని జరిగించడానికి నేను స్వయంగా భూమి మీదికి వచ్చాను, ఇది మానవులు గ్రహించలేనిది లేదా నెరవేర్చలేనిది. లోకాన్ని సృజించినప్పటి నుండి, చాలా ఏళ్లుగా, కేవలం సంఘాన్ని కట్టే కార్యము గురించే, కానీ దేవుని రాజ్యాన్ని కట్టడం గురించి ఎవరూ వినలేదు. నా నోటితో నేను దీని గురించి మాట్లాడినప్పటికీ, దాని భావం తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి నేను మానవుల లోకములోనికి దిగి వచ్చి వారి బాధను నేను అనుభవించాను, మరియు గ్రహించాను, కానీ నా శరీరధారణ ఉద్దేశము నెరవేరకుండానే అలా చేశాను. దేవుని రాజ్యాన్ని కట్టడం మొదలు పెట్టాక, నా అవతరణ దేహము లాంఛనంగా నా పరిచర్యను నిర్వహించడం ప్రారంభించింది; అదే, రాజ్యపు రాజు తన సార్వభౌమాధికారాన్ని లాంఛనంగా చేపట్టడం. దీని నుండి దేవుని రాజ్యం మానవ లోకంలోకి రావడం—సాహిత్యపరమైన సాక్షాత్కారంగా మాత్రమే కాకుండా—నిజమైన వాస్తవికతలో ఒకటి అని స్పష్టమవుతుంది; ఇది “ఆచరణపు వాస్తవికత” యొక్క ఒక భావపు కోణం. మానవులు నా కార్యాలలో ఒక్కటి కూడా చూడలేదు, నా వాక్కులలో ఒక్కటి కూడా వారు వినలేదు. నా కార్యాలు వారు చూసినప్పటికీ, వారు ఏమికనుగొనిఉండేవారు? మరియు వారు గనుక నేను మాట్లాడటం విని ఉంటే, వారు ఏమి గ్రహించగలిగి ఉండేవారు? లోకమంతా, ప్రతి ఒక్కరూ నా దయ మరియు ప్రేమ కనికరము మూలంగా జీవిస్తున్నారు, అలానే సమస్త మానవాళి నా న్యాయతీర్పులో ఉంటుంది, అలాగే నా శ్రమలకు గురవుతుంది. కొంత మేరకు వారందరూ అవినీతికి గురైనప్పటికీ, నేను ప్రజల పట్ల దయతో మరియు ప్రేమతో ఉన్నాను; వారందరూ నా సింహాసనము ఎదుట సాగిలపడినప్పటికీ, నేను వారికి మందలింపు విధించాను. అయితే, నేను పంపిన బాధ మరియు శుద్దీకరణ మధ్యలో లేని మానవుడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి చాలామంది ప్రజలు వెలుగు కోసం చీకటిలో తడుముకుంటున్నారు, మరియు అనేకమంది వారి శ్రమలలో తీవ్రంగా పోరాడుతున్నారు. యోబుకు విశ్వాసం ఉంది, అయితే అతడు తన కోసం బయటపడే ఒక మార్గాన్ని వెతకడం లేదా? నా ప్రజలు శ్రమలను ఎదుర్కోవడంలో స్థిరంగా నిలబడగలిగినప్పటికీ, దాన్ని బిగ్గరగా చెప్పకుండా, అంతరంగంలో సైతం విశ్వాసాన్ని కలిగిన వారు, ఎవరైనా ఉన్నారా? అది ప్రజలు ఇంకా తమ హృదయాల్లో అనుమానాలు పెట్టుకునే వారి నమ్మకాల గురించి చెప్పడం కాదా? పరీక్షకు యదార్థంగా లోబడినవారు లేదా శ్రమలలో స్థిరంగా నిలిచిన మానవులు ఎవరూ లేరు. ఈ లోకాన్ని చూడకుండా నేను నా ముఖాన్ని కప్పుకోకపోతే, సమస్త మానవజాతి దహించే నా చూపుల కింద పడుతుంది, ఎందుకంటే నేను మానవజాతిని ఏమీ అడగలేదు.
దేవుని రాజ్యపు బూరధ్వని మోగినప్పుడు—ఏడు ఉరుములు కూడా ఉరిమినప్పుడు—ఈ ధ్వని పరలోకాన్ని మరియు భూలోకాన్ని వణికించి, సామ్రాజ్యాన్ని కదిలించి, మరియు దీనివల్ల ప్రతి మనిషి హృదయం కంపించేలా చేస్తుంది. దేవుని రాజ్యపు గీతం ఎర్రని మహా ఘట సర్ప దేశంలో వేడుకగా ఉద్భవించి, నేను ఆ దేశాన్ని నాశనం చేసి నా రాజ్యాన్ని స్థాపించాను అని రుజువు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా, నా రాజ్యము భూమి మీద స్థాపించబడింది. ఈ క్షణంలో, నేను నాదేవ దూతలను ప్రపంచ దేశాలలోని ప్రతి ఒక్కరికి పంపడం ఆరంభించాను తద్వారా వారు ఆ కుమారులను, నా ప్రజలను సంరక్షిస్తారు; ఇది నా కార్యపు తదుపరి దశ ఆశయాలు నెరవేర్చడానికి కూడా. ఏదేమైనప్పటికీ, ఎర్రని మహా ఘట సర్పము చుట్టుకుని పడుకున్న ప్రదేశానికి నేను వ్యక్తిగతంగా వచ్చి, దానితో పోటీపడతాను. సమస్త మానవజాతి శరీరునిగా ఉన్న నన్ను తెలుసుకుని మరియు శరీరమందు నా క్రియలను చూడగలిగితే, ఆ ఎర్రని మహా ఘట సర్పము గుహ బూడిదగా మారి జాడ లేకుండా అదృశ్యమవుతుంది. నా రాజ్యపు ప్రజలు, ఎర్రని మహా ఘట సర్పాన్ని తీవ్రముగా ద్వేషిస్తున్నందున, నీ కార్యాల ద్వారా నా హృదయాన్ని నీవు తృప్తి పరచాలి, మరియు ఈ విధంగా ఆ సర్పానికి అవమానం కలుగజేయాలి. ఆ ఎర్రని మహా ఘట సర్పము ద్వేషపూరితమైనదని నిజంగా మీరు భావిస్తున్నారా? దేవుని రాజ్యపు రాజుకి అది శత్రువని మీరు నిజంగా భావిస్తున్నారా? మీరు నాకు అద్భుతమైన సాక్ష్యమిస్తారన్న నమ్మకం నిజంగా మీకుందా? ఎర్రని మహా ఘట సర్పాన్ని ఓడించగలరన్న ఆత్మవిశ్వాసం నిజంగా మీకు ఉన్నదా? నేను మిమ్మల్ని అడుగుచున్నది ఇదే; నా కావలసిందల్లా మీరు ఈ స్థాయికి చేరుకోవడమే. మీరు దీన్ని చేయగలరా? దీన్ని సాధించగలరన్న విశ్వాసం మీకు ఉందా? మానవులు సరిగ్గా ఏమి చేయగలరు? అది నా అంతట నేనే చేయడం కాదా? యుద్దానికి సమకూడిన స్థలములో వ్యక్తిగతంగా నేను దిగుతానని ఎందుకు చెప్తున్నాను? నాకు కావలసింది మీ విశ్వాసం, మీ క్రియలు కాదు. మానవులందరూ నా వాక్యాలను సూటిగా అంగీకరించలేరు, మరియు బదులుగా వారు వాటిని ఒక పక్క చూపుతో చూస్తారు. ఇది మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడిందా? మీరు ఈ విధంగా నన్ను తెలుసుకున్నారా? నిజం చెప్పాలంటే, భూమి మీద మనుషులలో, ఎవరూ నా ముఖంలోకి సూటిగా చూడలేరు, మరియు నా వాక్యాల యొక్క స్వచ్చమైన మరియు మలినము కాని భావాన్ని పొందుకున్న వారు ఒక్కరూ లేరు. కాబట్టి నా లక్ష్యాలను చేరుకోడానికి మరియు ప్రజల హృదయాలలో నన్ను గురించిన నిజమైన రూపాన్ని స్థాపించడానికి భూమి మీద నేను అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ విధంగా, ఆలోచనలు మనుషులపై అధికారాన్ని చెలాయించే శకాన్ని నేను ముగిస్తాను.
నేడు, నేను మహా ఘట సర్ప దేశము మీదికి రావడమే కాదు, సమస్త సామ్రాజ్యాన్ని కంపింపజేయడానికి, నేను సర్వలోకం వైపు తిరుగుతున్నాను. నా న్యాయతీర్పుకు లోబడని ఏ ఒక్క ప్రదేశమైనా ఎక్కడైనా ఉందా? నేను కురిపించే ప్రచండ వర్షము క్రిందకు రాని ప్రదేశం ఏదైనా ఉందా? నేను వెళ్ళిన ప్రతిచోటా, అన్ని రకాల “విపత్తు బీజాలను” నేను వెదజల్లాను. ఇది నేను కార్యము చేసే విధానాలలో ఒకటి, నిస్సందేహంగా ఇది మానవజాతి రక్షణ కొరకైన ఒక కార్యము, మరియు ఇప్పటికీ నేను వారికి వెల్లడి చేసేది ఒక విధమైన ప్రేమనే. ఇంకా అనేకమంది నా గురించి తెలుసుకోడానికి మరియు చూడటానికి అనుమతించి, మరియు ఈ విధంగా, ఇన్ని సంవత్సరాలుగా వారు ఎవరిని చూడలేకపోయారో ఆ దేవుని, ఇప్పుడు, నిజంగా గౌరవించాలని నేను ఆశిస్తున్నాను. ఏ కారణాన్ని బట్టి నేను లోకాన్ని సృజించాను? ఎందుకు, మానవులు అవినీతిపరులుగా మారిన తర్వాత, నేను వారిని పూర్తిగా తుడిచి పెట్టలేదు? దేనిని బట్టి మానవజాతి విపత్తుల మధ్య జీవిస్తుంది? దేహాన్ని ధరించడంలో నా ఉద్దేశం ఏమిటి? నేను నా కార్యాన్ని నిర్వహించేటప్పుడు, మానవజాతి కఠినత్వాన్ని మాత్రమే కాకుండా, తీపిని రుచి చూడటం కూడా నేర్చుకుంటుంది. ఈ లోక ప్రజలందరిలో, నా కృపలో నివసించని వారెవరు? మానవులకు నేను భౌతికమైన ఆశీర్వాదాలను అనుగ్రహించకపోతే, లోకములో సమృద్ధిని ఎవరు ఆస్వాదిస్తారు? నా ప్రజలుగా మీ స్థానాన్ని తీసుకోడానికి మిమ్మల్ని అనుమతించడమే ఒక ఆశీర్వాదమేనా? మీరు నా ప్రజలుగా ఉండకుండా, సేవకులు మాత్రమే అయితే, మీరు నా ఆశీర్వాదాల పరిధిలో జీవించరా? నా వాక్యాల మూలాన్ని గ్రహించడం మీలో ఏ ఒక్కరి తరం కాదు. మానవజాతి—నేను వారికి పెట్టిన పేర్లను విలువైనవిగా పరిగణించకుండా, వారిలో అనేకమంది, “సేవకుడు” అనే పేరును బట్టి, వారి హృదయాల్లో రోషాన్ని పెంచుకుంటారు, మరియు అనేకమంది, “నా ప్రజలు” అనే పేరుని బట్టి, వారి హృదయాల్లో నా పట్ల ప్రేమను పెంచుకుంటారు. ఎవరూ నన్ను మోసపుచ్చడానికి ప్రయత్నించకూడదు; నా కళ్ళు సమస్తాన్ని చూస్తున్నాయి! మీలో ఎవరు ఇష్టపూర్వకంగాతీసుకుంటారు, మీలో ఎవరు సంపూర్ణ విధేయతను కనుపరుస్తారు? ఒకవేళ దేవుని రాజ్యపు బూరధ్వని మ్రోగకపోతే, మీరు నిజంగా చివరి వరకు లోబడతారా? మానవులు చేయగలిగినది మరియు ఆలోచించగలిగినది ఏమిటి, మరియు వారు ఎంత వరకు వెళ్ళగలరు—వీటన్నిటినీ చాల కాలం క్రితం నేను ముందుగానే నిర్ణయించాను.
అనేకమంది నా ముఖ కాంతిలోని వర్చస్సు ని అంగీకరిస్తారు. అనేకమంది ప్రజలు, నా ప్రోద్భలాన్ని బట్టి ప్రేరేపించబడి, అనుసరణలో ముందుకు సాగడానికి తమను తాము పురికొల్పుకుంటారు. సాతాను శక్తులు నా ప్రజలపై దాడి చేసినప్పుడు, వారిని తప్పించడానికి నేను ఉన్నాను; సాతాను కుతంత్రాలు వారి జీవితాల్లో విధ్వంసాన్ని సృష్టించినప్పుడు, నేను దాన్ని ఓడించి పారద్రోలుతాను, ఒకసారి వెళ్ళిన తరువాత తిరిగి రాదు. భూమి మీద, అన్ని రకాలైన దురాత్మలు విశ్రాంతి తీసుకోడానికి ఒక ప్రదేశాన్ని ఎప్పుడూ పొంచి ఉంటాయి, మరియు ఆక్రమించుకోదగిన మానవ దేహాల కోసం నిరంతరం వెదుకుతూనే ఉంటాయి. నా ప్రజలు! మీరు నా కాపుదలలో మరియు సంరక్షణలోనే ఉండాలి. ఎన్నటికీవ్యసనపరులు కావద్దు! నిర్లక్ష్యంగా ఎప్పుడూ ప్రవర్తించవద్దు! నా మందిరంలో మీరు మీ విధేయతను కనుపరచాలి, మరియు విధేయతతో మాత్రమే దుష్టుని వంచనకు ప్రతిగా ప్రతిచర్యను చేయగలరు. మీరు గతంలో చేసినట్టు, నా ముందు ఒకటి చేయడం మరియు నా వెనుక వేరొకటి చేసినట్టు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించకూడదు; ఒకవేళ మీరు ఇలా చేస్తే, ఇక మీరు విమోచననుకోల్పోయినట్టే. ఇలాంటి మాటలు నేను కావలసిన దానికంటే ఎక్కువే చెప్పలేదా? మానవ జాతి పాత స్వభావము సరిదిద్దలేనిది కాబట్టి నేను ప్రజలకు అనేక సూచనలను పదేపదే ఇవ్వవలసి వచ్చింది. విసుగు చెందవద్దు! నేను చెప్పేదంతా మీ గమ్యాన్ని పదిలపరచడం కోసమే! చెడిపోయిన మరియు మలినమైన ప్రదేశమే సాతానుకు సరిగ్గా కావలసింది; మీరు విమోచన లేకుండా ఎంత నిరాశగా, మరియు ఎంత దుర్మార్గంగా, సంయమనం పాటించడానికి నిరాకరిస్తారో, అప్పుడు ఆ దురాత్మలు మీలోకి చొరబడే అవకాశాన్ని అంతగా కలిగి ఉంటాయి. మీకు ఈ విషయం అర్ధమైతే, మీ విధేయత ఎలాంటి వాస్తవికత లేని, పోచుకోలు కబుర్లు తప్ప మరేమీ కాదు, మరియు అపవిత్రాత్మలు మీ తీర్మానాన్ని దిగ జార్చి దాన్ని నా కార్యాన్ని ఆటంకపరచడానికి ఉపయోగపడే సాతాను కుయుక్తులుగా మారుస్తాయి. అక్కడి నుండి, మీరు ఎప్పుడైనా నాచేత హతము చేయబడతారు. ఈ పరిస్థితి యొక్క తీవ్రత ఎవరికీ అర్ధంకావడం లేదు; ప్రజలందరూ తాము వినే దాని పట్ల కేవలం మందపు చెవిని కలిగి, కనీసపు జాగ్రత్తైనా కలిగి ఉండరు. గతంలో ఏం జరిగిందో నాకు జ్ఞాపకం లేదు; మరోసారి “మర్చిపోవడం” ద్వారా మీ పట్ల దయను కనుపరుస్తానని మీరు ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నారా? మనుష్యులు నన్ను వ్యతిరేకించినప్పటికీ, వారికి విరుద్ధముగా నేను దాన్ని ఎంచను, ఎందుకంటే వారు అతి కొద్ది స్థాయిని కలిగి ఉన్నారు, కాబట్టి వారి నుండి నేను ఎక్కువేమీ కోరలేదు. నేను కోరేదంతా వారు చెడిపోకుండా, సంయమనం పాటిస్తూ ఉండాలని. ఈ ఒక్క షరతును తీర్చడం మీ సామర్థ్యానికి మించినదేమీ కాదు, అవును కదా? అనేకమంది ప్రజలు వారి కన్నులపండుగ చేసుకోడానికి ఇంకా ఎన్నో మర్మాలు వెల్లడించాలని నా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, పరలోకపు మర్మాలన్నీ మీకు అర్ధమైనా కూడా, ఆ జ్ఞానంతో సరిగ్గా మీరేమి చేయగలరు? అది నా పట్ల నీ ప్రేమను పెంచుతుందా? ఇది నాపై నీ ప్రేమను రేకెత్తించగలదా? మానవులను నేను తక్కువ అంచనా వేయడం లేదు, లేదా వారి గురించి తేలికగా తీర్పు తీర్చడం లేదు. ఇవి మానవుల ప్రస్తుత పరిస్థితులు కాకపోతే, నేనెప్పుడూ అలాంటి ముద్రలు సాధారణంగా వారికి వేయను. గతాన్ని ఒకసారి ఆలోచించండి: ఎన్ని సార్లు నేను మిమ్మల్ని నిందించాను? ఎన్ని సార్లు మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేశాను? మీ వాస్తవ పరిస్థితులను లెక్క చేయకుండా ఎన్ని సార్లు మీ వైపు చూశాను? ఎన్ని సార్లు నా వాక్కులు మిమ్మల్ని హృదయపూర్వకంగా గెలువలేకపోయాయి? మీలో భావోద్వేగంతో ప్రతిస్పందించేలా మీటకుండా ఎన్ని సార్లు మాట్లాడాను? మీలో భయము మరియు వణుకు లేకుండా, నేను మిమ్మల్ని అగాధంలో పడేస్తానన్న భయమే లోపల లేకుండా నా వాక్యాలను ఎవరు చదివారు? నా వాక్యాలను బట్టి శ్రమలను ఎవరు సహించరు? నా వాక్కుల్లో అధికారం ఉంటుంది, అయితే ఇది మనుషుల మీద మామూలు న్యాయతీర్పు కోసం కాదు; కానీ, వారి వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకొని, నా వాక్యాల అంతరార్ధాన్ని అనునిత్యం నేను వారికి తెలియజేస్తాను. నిజానికి, నా వాక్యాలను బట్టి నేను సర్వశక్తిమంతుడనని గుర్తించగలిగిన సమర్ధులు ఎవరైనా ఉన్నారా? మేలిమి బంగారముతో తయారు చేయబడిన నా వాక్యాలను పొందుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడాను? ఎవరైనా వాటిని ఎప్పుడైనా విలువైనవిగా గుర్తించారా?
మార్చి ౩, 1992