దేవుణ్ణి ఎరుగని ప్రజలందరూ దేవుణ్ణి వ్యతిరేకించే ప్రజలే

దేవుని కార్యముల యొక్క ఉద్దేశ్యమును గ్రహించుట, మనుష్యులలో ఆయన కార్యము ప్రభావము సాధించేది గ్రహించుట మరియు ఖచ్చితంగా మనుష్యుల ఆయన చిత్తము ఏమిటో గ్రహించుట అనేవి దేవునిని అనుసరించే ప్రతి వ్యక్తి సాధించవలసిన కార్యములు. ఈ రోజుల్లో దేవుని కార్యము గురించిన జ్ఞానం ప్రజలందరికీ లేదు. దేవుడు మనుష్యుల విషయమై చేసిన క్రియలు, దేవుని కార్యమునంతయు, మరియు మనుష్యులపట్ల కలిగియున్న ఖచ్చితమైన దేవుని చిత్తము అనే అంశాలు ప్రపంచము సృజింపబడినప్పటి నుండి ఇప్పటివరకు మానవునికి తెలియబడనివి మరియు గ్రహించలేనివి కూడా. ఈ కొరత భక్తిపరమైన ప్రపంచమంతటిలో మాత్రమే కనబడడమే కాకుండా, దేవుణ్ణి విశ్వసించే వారందరిలో కూడా కనిపిస్తుంది. నీవు నిజంగా దేవుణ్ణి గట్టిగా పట్టుకునే రోజు వచ్చినపుడు, నువ్వుఆయన జ్ఞానాన్ని నిజంగా మెచ్చుకున్నప్పుడు, దేవుడు చేసిన కార్యములన్నిటిని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు ఎవరు మరియు ఆయన కలిగియున్నవాటిని నువ్వు గ్రహించినప్పుడు—అంటే ఆయన ఔదార్యం, జ్ఞానం, అద్భుతం మరియు ఆయన ప్రజల విషయమై జరిగించిన కార్యములన్నిటిని గ్రహించినప్పుడు నీవు దేవునిపై కలిగియున్న నీ విశ్వాసములో విజయం సాధిస్తావు. దేవుడు సర్వమును ఆవరించియున్నాడు మరియు సర్వ విషయములలో ఔదార్యముగలవాడైయున్నాడని ఆయనను గూర్చి చెప్పినప్పుడు, ఏ విధంగా ఆయన సర్వమును ఆవరించియున్నాడు? ఏ విధంగా ఆయన సర్వ విషయములలో ఔదార్యవంతుడు? నీవు దీన్ని అర్థం చేసుకోకపోతే, నీవు దేవునిని విశ్వసించలేవు, భక్తి ప్రపంచంలో ఉన్నవారు దేవునిని నమ్మకుండా దుర్మార్గులు గాను, అపవాది పోలికలోను ఉన్నారని నేను ఎందుకు చెప్పాలి? వారు దుర్మార్గులని నేను అన్నాను, ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేక, ఆయన జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు. దేవుడు వారికి తన పనిని ఎట్టి పరిస్థితులలోనూ బయలు పరచడు. వారు అంధులు; వారు దేవుని కార్యములను చూడలేరు, వారు దేవునిచే విడిచిపెట్టబడ్డారు, మరియు వారికి పూర్తిగా దేవుని సంరక్షణ మరియు భద్రతలను కొరత కలిగియున్నారు. ఇక పరిశుద్ధాత్ముని యొక్క కార్యమును గురించి చెప్పనవసరం లేదు. దేవుని కార్యమును కలిగియుండని వారందరూ దుర్మార్గులై ఉన్నారు మరియు దేవుణ్ణి వ్యతిరేకించేవారిగా ఉన్నారు. దేవుని వ్యతిరేకులని నేను చెప్పేది దేవుణ్ణి ఎరుగని వారిని గురించి, దేవుణ్ణి పెదవులతో ఒప్పుకొని, ఇంకా ఆయనను గూర్చి ఎరుగనివారిని గురించి, దేవుణ్ణి అనుసరిస్తూ, ఆయనకు విధేయత చూపనివారిని గురించి, ఇంకా దేవుని కృపలో వేడుక చేసుకుంటూ కూడా ఆయనకు సాక్ష్యులుగా నిలబడలేని వారిని గూర్చి చెప్తున్నాను. దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యం గురించి లేదా దేవుడు మనుష్యులలో చేసే కార్యము గురించి అవగాహన చేసుకోకుండా, అతడు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండలేడు, దేవునికి సాక్షిగా నిలబడలేడు. మానవుడు దేవుణ్ణి పూర్తిగా వ్యతిరేకించడానికి కారణం ఒకవైపు అతని భ్రష్ట స్వభావమునుండైతే, మరొక వైపు, దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడమునుండి మరియు దేవుడు పనిచేసే విధానాల గురించి మరియు మానవుని పట్ల ఆయన చిత్తమును గురించి అవగాహన లేకపోవడం అనేది మరొక కారణం, ఈ రెండు అంశాలు కలిసి, మనుష్యులు దేవుణ్ణి ఎదిరించే చరిత్రను నిర్మిస్తాయి. విశ్వాసంలో కొత్తగా చేరినవారు దేవునిని వ్యతిరేకిస్తారు, ఎందుకంటే అలాంటి వ్యతిరేకత వారి స్వభావము లోనే ఉంటుంది, అయితే విశ్వాసంలో అనేక సంవత్సరాలు ఉన్నవారిలో దేవుణ్ణి వ్యతిరేకించడం అనేది వారు దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టుట నుండి మరియు వారి భ్రష్ట స్వభావమునుండి ఉంటుంది. ఉదాహరణకు, దేవుడు శరీరధారిగా రాక మునుపు, మనుష్యులుదేవునికి వ్యతిరేకముగా ఉన్నారనేది పరలోకమందున్న దేవుడు నిర్దేశించిన శాసనాలను పాటించారా లేదా అనేదానిపై పరిగణించబడేది. ఉదాహరణకు, ధర్మశాస్త్ర యుగంలో, యెహోవా ధర్మశాస్త్రమును పాటించనివారందరు దేవునికి వ్యతిరేకులని పరిగణించబడ్డారు; ఎవరైతే యెహోవాకు అర్పించిన అర్పణలను దొంగిలిస్తారో, ఎవరైతే యెహోవా చేత అనుగ్రహము పొందిన వారికి వ్యతిరేకముగా నిలుస్తారో అట్టి వారు దేవునిని ఎదిరించిన వారిగా పరిగణించబడ్డారు మరియు రాళ్లతో కొట్టి చంపబడ్డారు; తన తండ్రిని మరియు తల్లిని గౌరవించనివాడు లేదా ఇతరులను కొట్టి, లేక శపించేవాడు ధర్మశాస్త్రాన్ని పాటించని వ్యక్తిగా పరిగణించబడతాడు. మరియు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించని వారందరూ ఆయనకు వ్యతిరేకంగా నిలబడినవారిగా పరిగణించబడ్డారు, అయితే కృపా యుగంలో ఇలా ఉండదు, యేసుకు వ్యతిరేకంగా నిలబడిన వారెవ్వరైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తులుగా పరిగణించబడ్డారు మరియు యేసుద్వారా పలకబడిన మాటలకు విధేయత చూపనివారందరు దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తులుగా పరిగణించబడ్డారు. ఈ సమయములో దేవుని పట్ల వ్యతిరేకతను నిర్వచించే విధానం మరింత ఖచ్చితమైనదిగా మరియు మరింత ఆచరణాత్మకమైనదిగా మారింది. దేవుడు ఇంకా శరీరధారిగా రాకముందు కాలంలో, మనుష్యులు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారా లేదా అనే సంగతిని పరలోకములో అదృశ్య రూపములో ఉన్న దేవుణ్ణి ఆరాధించాడా లేదా, ఆయన వైపు చూశాడా లేదా అనేదానిపై ఆధారపడి ఉండేది. ఆ సమయంలో దేవుణ్ణి వ్యతిరేకించుటను నిర్వచించిన తీరు అంత ఆచరణాత్మకమైనదిగా ఉండేది కాదు, ఎందుకంటే మనిషి దేవుణ్ణి చూడలేడు, లేదా దేవుని స్వరూపం ఎలా ఉంటుందో, ఆయన ఎలా పని చేస్తాడో, ఆయన ఎలా మాట్లాడతాడో అతనికి తెలియదు. మనిషికి దేవుని గురించి ఎలాంటి భావనలు లేవు కనుక అతను దేవుణ్ణి అస్పష్టంగా నమ్మాడు, ఎందుకంటే దేవుడు మనిషికి ఇంకా కనిపించలేదు. అందుకే, మనిషి తన ఊహలో దేవుణ్ణి ఎలా విశ్వసించినా, దేవుడు మనిషిని ఖండించలేదు లేదా అతని నుండి ఎక్కువగా దేనిని ఆశించలేదు, ఎందుకంటే మనిషి దేవుణ్ణి పూర్తిగా చూడలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు శరీరధారిగా మారి, మనుష్యుల మధ్య పని చేయుటకు వచ్చినప్పుడు, అందరు ఆయనపట్ల శ్రద్ధ వహించి, ఆయన మాటలు వింటారు, ఇంకా దేవుడు తన శరీరములో నుండి చేసే కార్యాలను అందరూ చూస్తారు. ఆ క్షణంలో, మనుష్యులందరి ఆలోచనలన్నీ నురుగుగా మారుతాయి. ఇక దేవుణ్ణి శరీరధారిగా చూసిన వారి విషయానికొస్తే, వారు ఇష్టపూర్వకంగా ఆయనకు విధేయత చూపించినట్లయితే వారు శిక్షించబడరు, అయితే ఉద్దేశపూర్వకంగా ఆయనకు విరుద్ధంగా నిలబడేవారందరూ దేవునికి విరోధులుగా పరిగణించబడతారు, అలాంటి వ్యక్తులు క్రీస్తు విరోధులు, ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడే శత్రువులు. దైవికమైన భావాలను కలిగి ఉన్నవారు ఇప్పటికీ సిద్ధంగా ఉండి, ఆయనకు విధేయత చూపడానికి ఇష్టపడేవారు మాత్రం శిక్షించబడరు. దేవుడు మనిషి యొక్క ఉద్దేశాలు మరియు క్రియల ఆధారంగా మనిషిని శిక్షిస్తాడు గాని అతని ఆలోచనలు మరియు తలంపులనుబట్టి శిక్షించడు. మానవుని ఆలోచనలు మరియు తలంపుల ఆధారంగా ఆయన శిక్షించ తలస్తే, అప్పుడు ఒక్క వ్యక్తి కూడా దేవుని ఉగ్ర హస్తాల నుండి తప్పించుకోలేరు. శరీరధారియైన దేవునికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా నిలబడిన వారు మాత్రం వారి అవిధేయతనుబట్టి శిక్షింపబడతారు. ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడే ఈ వ్యక్తులకైతే, వారు దేవుని గురించి కలిగియున్న అభిప్రాయాలలోనుండి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది వారిని దేవుని కార్యానికి భంగం కలిగించే చర్యలకు నడిపిస్తుంది. ఈ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దేవుని కార్యాన్ని ప్రతిఘటిస్తారు మరియు నాశనం చేస్తారు. వారు ఏ మాత్రం దేవుని గురించిన ఆలోచనలను కలిగి ఉండరు, కానీ వారు ఆయన కార్యామునకు భంగం కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఈ కారణంచేత ఇట్టి ప్రజలు శిక్షించబడతారు. దేవుని పనిని ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించనివారు పాపులుగా శిక్షించబడరు, ఎందుకంటే వారు ఇష్టపూర్వకంగా విధేయత కలిగి ఉంటూ విఘాతం కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉండలేరు. ఇలాంటి వ్యక్తులు శిక్షించబడరు. ఏదేమైనా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని కార్యాన్ని అనుభవించి, దేవుని గూర్చిన ఆలోచనలను పొందుకుంటూ, శరీరధారియైన దేవుని కార్యాన్ని తెలుసుకోలేకపోయినట్లయితే, ఆయన కార్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ వస్తున్నప్పటికీ, దేవుని గూర్చిన ఆలోచనలను పొందుతూ వస్తున్నప్పటికీ, వారు ఇంకా ఆయనను గూర్చి తెలుసుకొనలేకపోయినట్లయితే, వారు ఆటంకపరిచే కార్యకలాపాలలో నిమగ్నమైయుండపోయినా, వారి హృదయాలు దేవుని గూర్చిన ఆలోచనలతో నింపబడినా, ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చకపోయినా, ఇలాంటివారందరూ దేవుని కార్యమునకు సహాయంగా ఉండలేరు. ఇలాంటివారు దేవుని కొరకు సువార్తను వ్యాపింపజేయలేరు మరియు ఆయనకు సాక్ష్యులుగా ఉండలేరు. ఇలాంటి వారందరూ దేనికి పనికి రాకుండా అప్రయోజకులుగాను మరియు బుద్ధిహీనులుగా ఉంటారు. ఎందుకంటే వారికి దేవుడంటే ఎవరో తెలియదు మరియు దేవుని గురించి తమకున్న ఆలోచనలను వెల్లడి చేయలేని అసమర్థ స్థితిలోనూ ఉంటారు, ఇందుచేత వారు శిక్షించబడతారు. దీన్ని ఈ విధంగా చెప్పవచ్చు: దేవుని గురించి ఆభిప్రాయాలు కలిగి ఉండటం లేదా ఆయన గురించి ఏమీ తెలియకపోవడం క్రొత్తగా విశ్వసించినవారికి సాధారణం. కానీ చాలా సంవత్సరాలుగా దేవునిని నమ్మి, ఆయన కార్యములు బాగా అనుభవించిన వ్యక్తికి, అలాంటి ఆలోచనలు కలిగి, కొనసాగడం అనేది సాధారణం కాదు. అలానే ఇటువంటి వ్యక్తికి దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం కూడా సాధారణ స్థితికంటే చాలా తక్కువ స్థితిని కలిగియున్నాడు. ఎందుకంటే వారు శిక్షించబడతారు అనేది సాధారణ విషయం కాదు, సాధారణ స్థితికి భిన్నమైన ఈ వ్యక్తులందరూ చెత్తవలె ఉన్నారు; వీరందరూ దేవుణ్ణి అధికముగా వ్యతిరేకిస్తూ దేవుని కృపను ఊరకనే ఆనందంగా అనుభవించేవారు. అటువంటి వారందరూ అంతిమంగా తొలగించబడతారు.

దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని ఎవరైనా ఆయనను వ్యతిరేకించే వారే, ఇంకా దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నప్పటికి ఆ వ్యక్తి దేవునిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించనపుడు, అతను మరింత ఎక్కువగా దేవునికి విరోధిగా పరిగణించబడతాడు. గొప్ప సంఘాలలో బైబిల్ చదివి రోజంతా ధ్యానం చేస్తూ ఉండవచ్చు, కానీ వారిలో ఒక్కరు కూడా దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు. వారిలో ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేరు; అలానే వారిలో ఎవరూ కూడా దేవుని చిత్తానికి అనుగుణంగా అసలే ఉండలేరు. వారందరూ వ్యర్ధమైన నీచమైన మనుషులుగా ఉంటారు. ప్రతి ఒక్కరు దేవుని ఉపన్యాసాలు ఇవ్వడానికి ఎత్తుగా నిలబడతారు, వారు దేవుని ధ్వజమును పట్టుకుని కూడా, ఉద్దేశపూర్వకంగా మాత్రం దేవునిని వ్యతిరేకిస్తారు, దేవునిపై విశ్వాసం ప్రకటిస్తూ, వారు ఇంకా మనుష్యుల రక్త మాంసాలు తిని తాగుతారు. అలాంటి వారందరూ మనిషి యొక్క మనస్సును తినివేసే దయ్యపు శక్తులు, మంచి మార్గములోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశపూర్వకముగా అడ్డుకునే దయ్యపు అధికారులుగా ఉండి, దేవుణ్ణి వెదికే వారికి అడ్డుబండలుగా ఉంటారు. వారు “గొప్ప వ్యవస్థగా” కనపడుతూ ఉండవచ్చు గాని దేవునికి విరోధముగా నిలబడేందుకు గాను ప్రజలను నడిపించే క్రీస్తు విరోధులుగా వీరే అని వారిని వెంబడించే వారికి ఎలా తెలుసుకుంటారు? మానవ ఆత్మలను మ్రింగివేసేందుకు అంకితం చేయబడిన సజీవ దెయ్యాలని వీరిని గూర్చి వారి అనుచరులు ఎలా తెలుసుకుంటారు? దేవుని సన్నిధిలో తమను తాము ఉన్నతంగా గౌరవించుకునేవారు మనుష్యులకు గొప్ప పనిముట్లుగా కనపడతారు కానీ తమను తాము తగ్గించుకునే వారే ఎక్కువగా గౌరవించబడతారు. మరియు దేవుని పని తమకు తెలుసని భావించే వారు ఇంకా దేవుని కార్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా గొప్ప ఆర్భాటాలతోనే ఇతరులకు దేవుని కార్యాన్ని ప్రకటించగల సామర్థ్యం ఉన్నవారు మనుష్యుల మధ్యన నిర్లక్ష్యానికి గురైనవారు. అటువంటి వారు దేవుని సాక్ష్యం లేని వారై, అహంకారం మరియు దురభిమానంతో నిండి ఉంటారు. దేవుని గురించి వాస్తవ అనుభవం మరియు ఆచరణాత్మక జ్ఞానం ఉన్నప్పటికీ, తమకు ఆయన గురించి చాలా తక్కువ జ్ఞానం ఉందని విశ్వసించేవారు ఆయనకు అత్యంత ప్రియమైనవారు. అలాంటి వ్యక్తులు మాత్రమే నిజంగా సాక్ష్యం కలిగి ఉంటారు మరియు వారే నిజంగా దేవునిచే పరిపూర్ణత పొందడానికి అర్హులు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేనివారు దేవునికి విరోధులు; దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని ఆచరించని వారు దేవునికి విరోధులు; దేవుని వాక్కులను తిని త్రాగేవారిగా ఉంటూ కూడా, దేవుని మాటల గుణగణాలకు విరుద్ధంగా వెళ్ళేవారందరూ దేవునికి విరోధులు; శరీరధారియైన దేవుని గురించి అభిప్రాయాలూ కలిగి ఉన్నవారు మరియు అంతకంటే ఎక్కువగా తిరుగుబాటులో పాల్గొనే మనస్సు ఉన్నవారు దేవునికి విరోధులు; దేవుని మీద తీర్పులు తీర్చువారందరూ దేవునికి విరోధులు. మరియు దేవుణ్ణి ఎరుగని వారందరూ, లేదా ఆయనకు సాక్ష్యము ఇవ్వని వారందరూ దేవునికి విరోధులు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతున్నాను: మీరు ఈ మార్గంలో నడవగలరని మీకు నిజంగా నమ్మకం ఉంటే, దానిని అనుసరిస్తూ ఉండండి. అయితే, మీరు దేవునిని వ్యతిరేకించడం మానుకోలేకపోతే, మించిపోక ముందే మీరు దూరంగా వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే, విషయాలు మీకు చెడుగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మీ స్వభావం పూర్తిగా భ్రష్టుపట్టిపొయింది. మీ విధేయత, నమ్మకత్వము, లేక నీతి మరియు సత్యాల కోసం దప్పికగొన్న హృదయం, లేదా దేవుని కొరకైన ప్రేమ అనే అంశాలులోఏ ఒక్కటి కూడా కొంతైనా మీలొ లేవు. దేవుని ముందు మీ పరిస్థితి పూర్తిగా చితికిపోయిన పరిస్థితిలా ఉందని చెప్పవచ్చు. మీరు కట్టుబడి ఉండవలసిన దానికి కట్టుబడి ఉండలేరు మరియు చెప్పవలసినది మీరు చెప్పలేరు. దేనినైతే ఆచరించాలో దానిని ఆచరించడంలో మీరు విఫలమయ్యారు. మీరు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని మీరు నిర్వహించలేక పోయారు. మీరు కలిగియుండవలసిన నమ్మకత్వం, వివేకము, విధేయత, లేదా తీర్మానం అనేవి మీకు లేవు. మీరు సహించవలసిన శ్రమలను మీరు సహించలేదు, మరియు మీకు ఉండవలసిన విశ్వాసము మీకు లేదు. చాలా సరళంగా చెప్పాలంటే, మీరు బొత్తిగా ఎటువంటి అర్హత లేకుండా ఉన్నారు: మీరు జీవించడానికి సిగ్గుగా లేదా? శాశ్వతమైన విశ్రాంతిలో మీ కన్నులు మూసుకోవడం మంచిది, తద్వారా దేవుడు మీ గురించి చింతించడం మరియు మీ కొరకు బాధపడడం తప్పుతుంది. మీరు దేవుణ్ణి విశ్వసిస్తారు కానీ ఆయన చిత్తాన్ని తెలుసుకోలేరు; మీరు దేవుని వాక్కులను తింటారు త్రాగుతారు కానీ మానవుని నుండి దేవుడు కోరేవాటికి కట్టుబడి ఉండలేకపోతున్నారు. మీరు దేవునిని నమ్ముతారు కానీ ఆయనను తెలుసుకోలేరు, మరియు మీరు ఎటువంటి విలువలు లేకుండా, ఎటువంటి అర్థం లేకుండా, పోరాడే లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. నువ్వు మనిషిగా జీవిస్తున్నారు కానీ నీకు కనీస స్థాయిలో మనస్సాక్షి, యథార్థత, లేదా విశ్వసనీయత అనేవి లేవు—ఇంకా మిమ్మల్ని మీరు మనుషులుగా పిలుచుకోగలరా? మీరు దేవుణ్ణి నమ్ముచున్నారు గానీ ఆయనను మోసం చేస్తున్నారు, ఇంకా ఏమిటంటే, మీరు దేవుని డబ్బు తీసుకొని, ఆయనకు సమర్పించిన అర్పణలను తింటారు, అయినప్పటికీ, తుదకు మీరు దేవుని విషయమై దుర్భలమైన మనస్సాక్షిని గాని, లేక ఆయన భావాల విషయమై కనీసపు పట్టింపును గాని చూపించడములో విఫలమగుచున్నారు. దేవుడు అడుగుచున్నవాటిలో అతి స్వల్పమైన కోరికలను కూడా మీరు తీర్చలేకయున్నారు. మీరు ఇప్పటికీ మిమ్మల్ని మీరు మనుషులుగా పిలుచుకోగలరా? దేవుడు మీకు అందించే ఆహారం తినడం మరియు ఆయన మీకు ఇచ్చే ప్రాణవాయువును పీల్చడం, ఆయన దయలో ఆనందించడం అనేవి జరుగుచున్నప్పటికినీ, చివరికి, మీకు దేవుని గురించిన కనీస జ్ఞానం లేదు. దానికి విరుద్ధంగా, మీరు దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తులుగాను, ఎందుకూ పనికిరానివారుగాను మారారు. అది మిమ్మల్ని కుక్క కంటే నీచమైన మృగంగా మార్చలేదా? జంతువులలో, మీకంటే మరింత హానికరమైనవి ఏమైనా ఉన్నాయా?

ఎత్తైన పీఠముపై నిలబడి ఇతరులకు బోధించే సంఘ కాపరులు మరియు పెద్దలు దేవునికి విరోధులుగాను మరియు సాతానుకు మిత్రులుగాను ఉన్నారు; మీలో ఇతరులకు బోధించే ఉన్నత పీఠంలో నిలబడని వారు అంతకన్నా దేవునికి గొప్ప విరోధులు కాదా? మీరు వారి కంటే మరి ఎక్కువగా సాతానుతో కుమ్మక్కయ్యి లేరా? దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని వారికి దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా ఉండాలో తెలియదు. ఖచ్చితంగా, ఆయన కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్న వారికి కూడా దేవుని చిత్తానికి ఎలా కట్టుబడి ఉండాలో తెలియదు. దేవుని కార్యము ఎప్పుడూ తప్పు పోదు; బదులుగా, మనుష్యులు వెంబడించే విధానమే లోపభూయిష్టంగా ఉంటుంది. దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించేవారు ఆ సంఘ కాపరులు మరియు పెద్దల కంటే ఎక్కువ పాపులు మరియు దుర్మార్గులు కాదా? దేవునిని వ్యతిరేకించేవారు చాలా మంది ఉంటారు కానీ వారిలో దేవుణ్ణి వ్యతిరేకించే అనేక మార్గాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల విశ్వాసులు ఉన్నట్లే, దేవుణ్ణి వ్యతిరేకించే వారు కూడా అన్ని రకాలుగా ఉంటారు, ఒకరికొకరు విభిన్నంగా ఉంటారు. దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టంగా గుర్తించడంలో విఫలమైన వారు ఒక్కరూ కూడా రక్షింపబడలేరు. గతంలో మానవుడు ఎంతగా దేవుణ్ణి వ్యతిరేకించినా, మానవుడు దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, దేవుణ్ణి సంతృప్తిపరచడానికి తన ప్రయత్నాలను అంకితం చేసినప్పుడు, దేవుడు అతని పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేస్తాడు. మానవుడు సత్యాన్ని అర్ధం చేసుకుని సత్యాన్ని ఆచరించినంత కాలం, దేవుడు అతను చేసినది మనస్సులో ఉంచుకోడు. అంతేకాకుండా, మనిషి సత్యాన్ని ఆచరించే విధానం మీద దేవుడు అతనిని సమర్థిస్తాడు. ఇది దేవుని నీతి. మనుష్యుడు దేవుణ్ణి చూడక ముందు, ఆయన కార్యమును అనుభవించక ముందు, మానవుడు దేవుని పట్ల ఎలా ప్రవర్తించినా దానిని ఆయన మనస్సులో ఉంచుకోడు. ఏదేమైనప్పటికీ, మనిషి దేవుణ్ణి ఒక్కసారి చూసిన తర్వాత మరియు ఆయన కార్యమును అనుభవించిన తర్వాత, మనిషి యొక్క క్రియలను మరియు చర్యలను దేవుడు “చరిత్ర పుటలలో” నమోదు చేస్తాడు. ఎందుకంటే, మానవుడు దేవుణ్ణి చూశాడు మరియు ఆయన కార్యము మధ్యన జీవించాడు.

దేవుడు కలిగి ఉన్నవాటిని మరియు దేవుణ్ణి మనిషి నిజంగా చూసినప్పుడు, అతను ఆయన యొక్క సర్వాధిపత్యమును చూసినప్పుడు, మరియు అతను దేవుని కార్యములను నిజంగా తెలుసుకున్నప్పుడు, ఇంకా, మనిషి యొక్క పాత స్వభావం మారినప్పుడు, దేవునిని వ్యతిరేకించే అతని తిరుగుబాటు స్వభావాన్ని మానవుడు పూర్తిగా వదలి వేస్తాడు. అందరూ ఏదో ఒక సమయంలో దేవుణ్ణి వ్యతిరేకించారు మరియు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ, నీవు ఇష్టపూర్వకముగా శరీరధారియైన దేవునికి విధేయత చూపితే, మరియు నీ నమ్మకత్వముతో దేవుని హృదయాన్ని తృప్తిపరచగలిగి, నీవు అనుసరించవలసిన సత్యాన్ని ఆచరిస్తూ, నీవు చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తూ, నీవు పాటించవలసిన నియమాలన్నిటిని పాటిస్తున్నట్లయితే, అప్పుడు నువ్వు దేవుణ్ణి మెప్పించడానికి నీకున్న తిరుగుబాటుతనాన్ని తీసివేసుకున్న వ్యక్తివని మరియు దేవునిచేత పరిపూర్ణునిగా చేయబడిన వ్యక్తివని అర్థం. నీవు మొండిగా ఉంటూ నీ తప్పులను చూడడానికి నిరాకరిస్తూ నీకు నువ్వుగా పశ్చాత్తాపపడే ఉద్దేశ్యం లేకుండా ఉంటే, కనీసం దేవునితో సహకరించి, ఆయనను మెప్పించాలనే ఉద్దేశ్యం కూడా లేకుండా నీ తిరుగుబాటు ప్రవర్తనలో కొనసాగితే, అప్పుడు అటువంటి మొండి మరియు సరిదిద్దలేని వ్యక్తిగా నీవు ఖచ్చితంగా శిక్షించబడతావు మరియు ఖచ్చితంగా దేవునిచే పరిపూర్ణుడిగా ఎప్పటికీ అవ్వలేవు. ఇదిలా ఉంటే, నీవు ఈ దినమున దేవునికి శత్రువు అయ్యావు మరియు రేపు కూడా నీవు దేవునికి శత్రువు అవుతావు, అలాగే నీవు మరుసటి దినము కూడా దేవునికి శత్రువుగా ఉంటావు; నీవు ఎప్పటికీ దేవునికి విరోదివిగాను మరియు దేవునికి శత్రువుగానుఉంటావు. అలాంటప్పుడు, దేవుడు నిన్ను ఎలా విడిచిపెట్టగలడు? దేవుణ్ణి వ్యతిరేకించడం అనేది మానవ స్వభావం లోనే ఉంది, కానీ మనిషి తన స్వభావాన్ని మార్చుకోవడం ఒక అధిగమించలేని పని కాబట్టి దేవుణ్ణి వ్యతిరేకించే “రహస్యాన్ని” ఉద్దేశపూర్వకంగా వెతకకూడదు. ఒకవేళ అలా అయితే, భవిష్యత్తులో నిన్ను గద్దించే తీరు మరింత తీవ్రంగా మారకుండా నీలోని క్రూరమైన స్వభావం విస్ఫోటనం చెంది, సముదాయించలేనిదిగా మారి, చివరికి మీ శరీరాన్ని దేవుడు అంతం చేసేంత వరకు రాక మునుపే దూరంగా వెళ్లిపోవడం చాలా మంచిది. నీవు ఆశీర్వాదాలు పొందేందుకు దేవునిని విశ్వసించావు; కానీ చివరికి మీకు దౌర్భాగ్యం మాత్రమే ఎదురైతే, అది అవమానకరం కాదా? నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీరు మరొక ప్రణాళికను రూపొందించుకోవడం మంచిది. మీరు చేయగలిగింది ఏదైనా దేవునిని నమ్మడం కంటే గొప్పదిగా ఉండాలి: ఖచ్చితంగా ఈ ఒక్క మార్గం మాత్రమే అక్కడ ఉండకూడదు. మీరు సత్యాన్ని అన్వేషించకపోతే మీరు మనుగడ సాగించకుండా ఉండలేరా? ఈ విధంగా మీరు దేవునితో ఎందుకు విభేదించాలి?

మునుపటి:  మార్పులేని స్వభావాన్ని కలిగి ఉండటమంటే దేవునితో శత్రుత్వంలో ఉండటమే

తరువాత:  దేవుని కార్యపు దర్శనం (1)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger