శరీరధారి అయిన దేవునికి మరియు దేవునిచే వాడబడిన వ్యక్తులకు మధ్య ఉన్న కీలకమైన వ్యత్యాసము
భూమి మీద కార్యము చేసే క్రమంలో, దేవుని ఆత్మ అనేక సంవత్సరాలుగా శోధిస్తూనే ఉంది, అలాగే, యుగాల వ్యాప్తంగా తన కార్యమును నిర్వహించడానికి దేవుడు అనేకమందిని ఉపయోగించుకున్నాడు. అయినప్పటికీ, ఈ కాలమంతటిలో దేవుని ఆత్మకు ఒక తగిన విశ్రమ ప్రదేశం లభించలేదు, అందుకే, దేవుడు తన కార్యమును జరిగించడానికి వేర్వేరు వ్యక్తుల మధ్య మారుతూ వచ్చాడు. మొత్తంగా, ఆయన కార్యము ప్రజల ద్వారానే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే, ఇన్ని సంవత్సరాలుగా, దేవుని కార్యము ఎప్పుడూ ఆగకుండా, అది నేటికీ ప్రజలో కొనసాగించబడుతూ ముందుకు సాగుతూనే ఉన్నది. దేవుడు అనేక వాక్యాలు పలికి, ఎంతో కార్యము చేసినప్పటికీ, మానవుడు ఇంకా దేవుని తెలుసుకోవడం లేదు, ఇదంతా ఎందుకంటే దేవుడు మానవునికి ఎన్నడూ కనబడలేదు మరియు ఆయనకు నిర్దిష్టమైన రూపమూ లేదు. కాబట్టి దేవుడు ఈ కార్యాన్ని, అంటే, ఆచరణాత్మక దేవుని ఆచరణాత్మక ప్రాముఖ్యతను మనుషులందరికీ తెలియజేసే కార్యాన్ని ముగింపునకు తీసుకురావాలి. ఈ ముగింపును సాధించడానికి, మానవాళికి దేవుడు తన ఆత్మను ప్రత్యక్షముగా కనుపరచి వారి మధ్య తన కార్యాన్ని జరిగించాలి. అంటే, దేవుని ఆత్మ భౌతిక రూపం దాల్చి, మాంసము మరియు ఎముకలను ధరించి, మరియు ప్రజల మధ్య ప్రత్యక్షంగా నడుస్తూ, వారి జీవితాల్లో వారికి తోడుగా ఉంటూ, తనను తాను కొన్నిసార్లు ప్రదర్శిస్తూ మరియు కొన్నిసార్లు కనిపించకుండా చేసినప్పుడు మాత్రమే ప్రజలు ఆయన గురించిన లోతైన అవగాహనకు చేరుకోగలరు. దేవుడు ఎల్లప్పుడూ శరీరంలోనే ఉండిపోతే, ఆయన తన కార్యమును సంపూర్ణముగా పూర్తి చేయలేడు. శరీరమందు జరిగించవలసిన పరిచర్యను నెరవేర్చడానికి, కొంతకాలము పనిచేసిన తరువాత, దేవుడు శరీరాన్ని విడిచి శరీర స్వరూపములో ఆత్మీయ రాజ్యమందు కార్యము చేస్తాడు. సాధారణ మానవ స్వభావములో కొంతకాలము పనిచేసిన చేసిన తర్వాత, తాను పూర్తి చేయవలసిన సమస్త కార్యాన్ని యేసు పూర్తి చేసినట్టుగానే సంపూర్తి చేస్తాడు. “మార్గము … (5)”: “నా తండ్రి నాతో చెప్పిన, ‘భూమిమీద నీ తండ్రి చిత్తాన్ని చేయడానికి మరియు ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నించు. మరేదీ నిన్ను కలవరపెట్టకూడదు’” నుండి మీరు ఈ భాగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భాగంలో మీరేమి చూస్తున్నారు? దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు, దైవత్వంలో మాత్రమే తన కార్యాన్ని, అంటే, శరీరధారి అయిన దేవునికి పరలోకపు ఆత్మ అప్పగించిన కార్యాన్ని పూర్తి చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు, వివిధ భావాల ద్వారా మరియు విభిన్న దృక్కోణాల నుండి ఆయన వాక్కులకు స్వరాన్ని ఇవ్వడానికి మాత్రమే, ఆయన భూలోకమంతటా మాట్లాడతాడు. ఆయన ప్రధానంగా మానవునికి సమకూర్చడం మరియు మనిషికి బోధించడాన్ని తన లక్ష్యాలుగా మరియు కార్య సూత్రంగా తీసుకున్నాడు, మరియు మానవ సత్సంబంధాలను మరియు ప్రజల జీవితాల వివరాలను తనకు తానుగా పట్టించుకోడు. ఆత్మ కొరకు మాట్లాడటమే ఆయన ప్రధాన పరిచర్య. అంటే, దేవుడు శరీరమందు ప్రత్యక్షంగా కనబడినప్పుడు, ఆయన కేవలం మానవ జీవితాన్ని సమకూర్చి సత్యాన్ని విడుదల చేస్తాడు. తనకు తానుగా అయన మానవుని పనిలో పాలుపంచుకోడు, అంటే, మానవజాతి పనిలో అయన పాలుపంచుకోడు. మనుష్యులు దైవ కార్యాన్ని చేయలేరు, మరియు దేవుడు మానవ పనిలో పాలుపంచుకోడు. దేవుడు తన కార్యాన్ని భూమి మీద నెరవేర్చడానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో, ఆయన ఎల్లప్పుడూ ప్రజల ద్వారానే దానిని జరిగించాడు. అయితే, ఈ వ్యక్తులెవరూ దేవుని శరీరధారులుగా పరిగణించబడరు—వారు దేవునిచే వాడబడిన వారు మాత్రమే. అదే సమయంలో, నేటి దేవుడు, దైవత్వపు దృష్టికోణం నుండి నేరుగా మాట్లాడగలడు, ఆత్మ స్వరాన్ని పంపి ఆత్మ తరుపున కార్యము చేయగలడు. యుగయుగాలుగా దేవునిచే వాడబడిన వారందరూ, దేవుని ఆత్మ మాంసపు దేహములో కార్యము చేస్తుందనుటకు నిదర్శనాలు—అయినప్పటికీ, వారెందుకు దేవునిగా పిలువబడరు? కానీ, నేటి దేవుడు కూడా శరీరమందు నేరుగా కార్యము చేస్తున్న దేవుని ఆత్మ, మరియు యేసు కూడా శరీరమందు పనిచేస్తున్న దేవుని ఆత్మ; వారిద్దరూ దేవుడని పిలువబడతారు. మరి, ఈ వ్యత్యాసము ఏమిటి? యుగయుగాలుగా దేవుడు ఉపయోగించిన వ్యక్తులందరూ సాధారణ ఆలోచన మరియు వివేకము కలిగి ఉన్నారు. వారందరూ మానవ నడవడిక సూత్రాలను అర్ధం చేసుకున్నారు. వారు సామాన్య మానవ ఆలోచనలను కలిగి, సాధారణ వ్యక్తులు కలిగి ఉండవలసిన విషయాలన్నీ కలిగి ఉన్నారు. వారిలో అనేక మంది అసాధారణమైన ప్రతిభను మరియు సహజమైన తెలివిని కలిగి ఉన్నారు. ఈ వ్యక్తులపై కార్యం చేయడంలో, దేవుని ఆత్మ వారి తలాంతులను నియంత్రిస్తుంది, అవి దేవుడు వారికిచ్చిన వరాలు. దేవుని సేవలో వారి బలాలను ఉపయోగించి, దేవుని ఆత్మ వారి తలాంతులను అమలులోనికి తెస్తుంది. అయినప్పటికీ, దేవుని స్వభావం ప్రేరణలు మరియు ఆలోచన లేనిదై, మానవ ఉద్దేశాలతో మలినము కాకుండా, సాధారణ మానవులు కలిగి ఉండవలసినవి లేనిదై ఉన్నది. చెప్పాలంటే, ఆయన మానవ నడవడిక సూత్రాలు కూడా తెలిసిన వాడు కాదు. నేటి దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఆయన కార్యము మరియు ఆయన వాక్యాలు మానవ ఉద్దేశాలు లేక మానవ ఆలోచనతో మలినపరచబడనివి, అయితే అవి ఆత్మ ఉద్దేశాల ప్రత్యక్ష సాక్షాత్కారంగా ఉన్నాయి, మరియు ఆయన నేరుగా దేవుని తరపున కార్యము చేస్తాడు. దీనర్థం ఆత్మ నేరుగా మాట్లాడుతుంది, అంటే, దైవత్వము మానవుని ఉద్దేశాలలోని ఒక్క ముక్క అయినా కలుపకుండా, నేరుగా కార్యము చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, శరీరధారి అయిన దేవుడు నేరుగా మానవ ప్రేరణలు మరియు ఆలోచన లేని, మానవ నడవడిక సూత్రాల పట్ల అవగాహన లేని, దైవత్వపు దేహాన్ని ధరిస్తాడు. దైవత్వం మాత్రమే కార్యము చేస్తే (అంటే దేవుడు మాత్రమే తానుగా పనిలో ఉంటే), దేవుని కార్యము భూలోకములో జరిగించడానికి మార్గం ఉండదు. కాబట్టి, దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, దైవత్వంలో దేవుడు చేసే కార్యముతో కలిసి మానవత్వంలో పని చేయడానికి ఆయన ఉపయోగించుకునే కొద్దిమంది వ్యక్తులను ఆయన కలిగి ఉండవలసి ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే, తన దైవిక కార్యాన్ని ఎత్తిపట్టడానికి ఆయన మానవ కార్యాన్ని ఉపయోగించుకుంటాడు. లేకపోతే, మానవుడు నేరుగా దైవిక కార్యములో పాలుపంచుకునే అవకాశమే లేదు. యేసు మరియు ఆయన శిష్యుల విషయంలో ఇలాగే అయింది. లోకములో ఉన్న సమయంలో, యేసు పాత కట్టడలను కొట్టివేసి కొత్త ఆజ్ఞలను స్థిరపరిచాడు. ఆయన అనేక వాక్యాలు కూడా చెప్పాడు. ఆయన కార్యమంతా దైవత్వంలోనే జరిగించబడింది. పేతురు, పౌలు, మరియు యోహాను వంటి ఇతరులందరూ వారి తదుపరి కార్యాన్ని యేసు వాక్యముల పునాదిపై నిలిపారు. చెప్పాలంటే, దేవుడు ఆయన కార్యాన్ని ఆ కాలంలో ఆవిష్కరించి, కృపా కాలపు ఆరంభానికి నాంది పలికాడు; అంటే, ఆయన పాతదాన్ని కొట్టివేసి, కొత్త శకానికి నాంది పలికాడు, మరియు “దేవుడు ఆది మరియు అంతమునైయున్నాడు,” అనే మాటలను కూడా నెరవేర్చాడు. మరో మాటలో చెప్పాలంటే, దైవిక కార్యపు పునాది మీద మానవ కార్యమును మనిషి నిర్వహించాలి. యేసు భూమి మీద తన కార్యాన్ని ముగించి, తాను చెప్పవలసినదంతా మానవునికి విడిచిపెట్టాడు. దీని తరువాత, పనిచేయడంలో, ప్రజలందరూ, ఆయన వాక్యాలు తెలియజేసిన సూత్రాలను అనుసరించి చేశారు మరియు ఆయన పలికిన సత్యాలకు అనుగుణంగా ఈ ప్రజలందరూ యేసు కోసం పని చేశారు. ఒకవేళ యేసు ఒక్కడే ఆ కార్యము చేసి ఉంటే, ఆయన ఎన్ని వాక్యాలు పలికినా, ప్రజలు ఆయన వాక్యాలతో పట్టబడేవారు కాదు, ఎందుకంటే ఆయన దైవత్వంలో కార్యము చేస్తున్నాడు కాబట్టి దైవత్వపు మాటలే పలుకుతాడు, సాధారణ ప్రజలు తన మాటలను అర్ధం చేసుకునే స్థాయి వరకు ఆయన విషయాలను వివరించలేడు. కాబట్టి తన కార్యానికి అనుబంధముగా ఉండటానికి ఆయన తరువాత వచ్చిన అపోస్తలులు మరియు ప్రవక్తలను కలిగి ఉండవలసివచ్చింది. శరీరధారి అయిన దేవుడు ఎలా తన కార్యము చేస్తాడు అనే దానికి సూత్రము ఇదే—అవతారపు దేహమును ఉపయోగించి పని చేయడం మరియు దైవత్వపు కార్యాన్ని పూర్తి చేయడం, ఆ తరువాత ఆయన కార్యాన్ని అనుబంధ పరచడానికి కొందరు లేక ఎక్కువ మంది దేవుని హృదయానుసారులైన ప్రజలను ఉపయోగించడం. అంటే, దేవుడు ఎన్నుకున్న ప్రజలు సత్యం వాస్తవికతలోనికి ప్రవేశించడానికి మానవ స్వభావములో సంరక్షించి మరియు నీరు పోయడానికి దేవుడు తన హృదయానుసారులైన ప్రజలను వాడుకుంటాడు.
ఒకవేళ, ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు, దేవుడు మాత్రమే దైవత్వపు కార్యమును చేసి, ఆయనతో కలిసి పనిచేయడానికి ఆయన హృదయానుసారులైన ప్రజలు అక్కడ లేకపోతే, అప్పుడు మానవుడు దేవుని చిత్తాన్ని అర్ధం చేసుకోలేడు మరియు దేవునితో సంభాషించలేడు. ఈ కార్యము పూర్తి చేసి, సంఘాలను పర్యవేక్షించి సంరక్షించడానికి దేవుడు తన హృదయానుసారులైన సాధారణ వ్యక్తులను ఉపయోగించాలి, తద్వారా మానవుని అభిజ్ఞాత్మక ప్రక్రియ, అతని మస్తిష్కము ఊహించగలిగే స్థాయిని సాధించగలవు. మరో మాటలో చెప్పాలంటే, దైవత్వంలో తాను చేసే కార్యాన్ని “అనువదించడానికి” దేవుడు తన హృదయానుసారులైన కొద్దిమందిని ఉపయోగిస్తాడు, కాబట్టి దైవిక భాషను మానవ భాషలోనికి మార్చడానికి—అది తెరవబడుతుంది, తద్వారా ప్రజలు దానిని గ్రహించి అర్ధం చేసుకోగలరు. దేవుడు అలా గనుక చేయకపోతే, ఏ ఒక్కరూ దైవిక భాషను అర్ధం చేసుకోలేరు, ఎందుకంటే దేవుని హృదయానుసారులైన ప్రజలు, అందరి కంటే, చిన్న అల్పసంఖ్యాక వర్గమై ఉన్నారు, మరియు మనిషికి గ్రహించే సామర్ధ్యము బలహీనంగా ఉంది. అందుకే దేవుడు అవతార దేహములో కార్యము చేసేటప్పుడు మాత్రమే ఈ పద్దతిని ఎంచుకున్నాడు. ఒకవేళ దైవిక కార్యము మాత్రమే ఉండి ఉంటే, మానవుడు తెలుసుకోడానికి లేక దేవునికి కట్టుబడి ఉండటానికి మార్గమే ఉండదు, ఎందుకంటే మానవుడు దేవుని భాషను అర్ధం చేసుకోలేడు. ఆయన వాక్యాలను స్పష్ట పరిచే, దేవుని హృదయానుసారులైన ప్రజల ప్రాతినిధ్యం ద్వారా మాత్రమే మానవుడు ఈ భాషను అర్ధం చేసుకోగలడు. అయితే, అలాంటి వ్యక్తులు మానవ స్వభావములో మాత్రమే పనిచేస్తుంటే, అది మానవుని సాధారణ జీవితాన్ని మాత్రమే మార్చగలదు; కానీ అది మానవుని స్వభావాన్ని మార్చలేదు. దేవుని కార్యానికి కొత్త ప్రారంభ స్థానం లేదు; అవే పథ పాటలు, అవే పాత సూక్తులు మాత్రమే ఉంటాయి. తన శరీరధారణ కాలంలో చేయవలసినదంతా చేసి మరియు చెప్పవలసినదంతా చెప్పిన శరీరధారి అయిన దేవుని ప్రాతినిధ్యము ద్వారా, ఆయన వాక్యాల అనుగుణంగా ప్రజలు పనిచేసి మరియు అనుభవం చెందిన తరువాత మాత్రమే, అలా వారి జీవిత స్వభావము మార్చబడగలదు, ఆ విధంగా మాత్రమే వారు కాలానుగుణంగా వర్ధిల్లుతారు. దైవత్వములో పనిచేసే వాడు దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాడు, అయితే మానవ స్వభావమందు పనిచేసే వారు దేవునిచే ఉపయోగించబడిన ప్రజలు. చెప్పాలంటే, శరీరధారి అయిన దేవుడు స్వాభావికముగా దేవునిచే వాడబడిన ప్రజల కంటే భిన్నంగా ఉంటాడు. శరీరధారి అయిన దేవుడే దైవత్వపు కార్యాన్ని చేయగలడు, గానీ దేవునిచే వాడబడిన ప్రజలు కాదు. ప్రతి యుగము ఆరంభములో, దేవుని ఆత్మ వ్యక్తిగతముగా మాట్లాడుతూ మానవుని కొత్త ఆరంభంలోనికి తీసుకురావడానికి కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన మాట్లాడటం ముగించిన తరువాత, తన దైవత్వంలోని ఆయన కార్యము ముగించబడినదని ఇది సూచిస్తుంది. ఆ తరువాత, ప్రజలందరూ వారి జీవానుభవంలోకి ప్రవేశించడానికి దేవునిచే వాడబడిన వారి నాయకత్వాన్ని వెంబడిస్తారు. అదే సంకేతంగా, దేవుడు మానవుని నూతన యుగంలోనికి తీసుకువచ్చి ప్రజలకు ఒక నూతన ప్రారంభ స్థానాన్ని ఇచ్చే దశ కూడా ఇదే—ఈ సమయంలోనే శరీరమందు దేవుని కార్యము ముగించబడుతుంది.
తన సాధారణ మానవ స్వభావాన్ని పరిపూర్ణ పరుచుకోడానికో లేక సాధారణ మానవ స్వభావపు కార్యాన్ని నిర్వహించడానికో దేవుడు భూమి మీదికి రాడు. సాధారణ మానవ స్వభావమందు దైవత్వపు కార్యాన్ని చేయడానికి మాత్రమే ఆయన వస్తాడు. సాధారణ మానవ స్వభావం గురించి దేవుడు మాట్లాడేది ప్రజలు ఊహించినట్టుగా ఉండదు. “సాధారణ మానవ స్వభావం” అంటే భార్య, లేక భర్త, కుమారులు మరియు కుమార్తెల కలిగి ఉండడమనేది ఒక సాధారణ వ్యక్తిగా నిరూపిస్తుందని మానవుడు నిర్వచిస్తాడు; అయితే, దేవుడు దీన్ని ఈ విధంగా చూడడు. సాధారణ మానవ ఆలోచనలు, సాధారణ మానవ జీవితాలు అనేవి సాధారణ మానవుల నుండి పుట్టినట్లుగా ఆయన చూస్తాడు. ఆయన సాధారణత అనేది మానవుడు పేర్కొనే విధంగా ఒక భార్య, లేక ఒక భర్త, మరియు పిల్లలు కలిగి ఉండటం కాదు. అయితే, మనిషి దృష్టిలో, దేవుడు మాట్లాడే సాధారణ మానవ స్వభావమనేది దాదాపుగా భావోద్వేగము లోపించి మరియు శరీర అవసరాలు లేనట్టుగా కనబడుతూ, సాధారణ వ్యక్తి వెలుపలి ఆకారాన్ని మరియు సాధారణ వ్యక్తి రూపాన్ని మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, స్వభావములో మాత్రం ఒక సాధారణ వ్యక్తి కలిగి ఉండవలసినదేదీ లేని, యేసు వలే, మానవ స్వభావమే లేనట్టుగా ఉంటుంది. దీని నుండి శరీరధారి అయిన దేవుని అస్థిత్వము సాధారణ మానవ స్వభావపు సంపూర్ణతను ఆవరించదు, కానీ సాధారణ మానవ దినచర్యలకు దోహదపడటానికి మరియు న్యాయాధికారాలు కొనసాగించడానికి ప్రజలు కలిగి ఉండవలసిన విషయాలలో ఒక భావం మాత్రమే కలిగి ఉంటుందని చూడవచ్చు. కానీ మానవుడు సాధారణ మానవ స్వభావమని భావించే దానికి ఈ సంగతులతో ఎలాంటి సంబంధమూ లేదు. అవి దేవుని మానవ అవతారం కలిగి ఉండవలసినవి. ఏదేమైనప్పటికీ, తాను ఒక భార్యను, కుమారులు మరియు కుమార్తెలను, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే శరీరధారి అయిన దేవుడు సాధారణ మానవ స్వభావాన్ని కలిగి ఉన్నట్టు చెప్పవచ్చునని సమర్థించే వారూ ఉన్నారు. ఈ విషయాలు లేకుండా, ఆయన సాధారణ వ్యక్తి కాదని వారు చెప్తారు. అప్పుడు నేను “దేవునికి భార్య ఉన్నదా? అని నిన్ను అడుగుతాను, దేవునికి భర్త ఉండటం సాధ్యమేనా? దేవుడు సంతాన పొందగలడా?” ఇవన్నీ అపోహలు కాదా? అయినా శరీరధారి అయిన దేవుడేమీ బండ సందుల నుండి చిగుర్చలేడు లేక ఆకాశము నుండేమీ ఊడి పడలేడు. ఆయన సాధారణ మానవ కుటుంబంలో మాత్రమే జన్మించగలడు. అందుకే ఆయనకు తల్లిదండ్రులు మరియు సహోదరీలు ఉన్నారు. శరీరధారి అయిన దేవుని మానవ స్వభావము కలిగి ఉండవలసిన విషయాలు ఇవే. యేసు విషయంలో జరిగింది అలాంటిదే; యేసుకు తండ్రి మరియు తల్లి, సోదరీలు మరియు సహోదరులు ఉన్నారు, మరియు ఇదంతా సాధారణమైనది. కానీ ఒకవేళ ఆయనకి ఒక భార్య మరియు సోదర సోదరీలు ఉన్నట్లయితే, అప్పుడు దేవుని శరీరధారణ కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించిన సాధారణ మానవ స్వభావము ఆయనది అయ్యుండేది కాదు. ఒకవేళ ఇదే గనుక జరిగితే, ఆయన దైవత్వము తరపున కార్యము చేయగలిగేవాడు కాదు. అయన నిశ్చయంగా భార్య లేక పిల్లలను కలిగి లేడు కాబట్టి, మరియు సాధారణ వ్యక్తులకు సాధారణ కుటుంబములో జన్మించినందున, ఆయన దైవత్వపు కార్యాన్ని చేయగలుగుతున్నాడు. దీన్ని మరింత స్పష్ట పరచడానికి, సాధారణ కుటుంబములో జన్మించిన వ్యక్తినే దేవుడు సాధారణ వ్యక్తిగా పరిగణిస్తాడు. అలాంటి వ్యక్తి మాత్రమే దైవిక కార్యము చేయడానికి యోగ్యత గలవాడు. మరోవైపు, ఒకవేళ, ఒక వ్యక్తి భార్య, పిల్లలు, లేక భర్తని కలిగి ఉంటే, ఆ వ్యక్తి దైవిక కార్యాన్ని చేయలేడు, ఎందుకంటే మానవులు ఆశించే సాధారణ మానవ స్వభావాన్ని మాత్రమే వారు కలిగి ఉంటారు కానీ, దేవుడు ఆశించే సాధారణ మానవ స్వభావాన్ని కాదు. దేవుడు తలచేది మరియు మానవులు గ్రహించేది తరచూ ఎంతో భిన్నముగా, వేర్వేరు సమాఖ్యలు కలిగి ఉంటాయి. దేవుని కార్యపు ప్రస్తుత దశలో ప్రజల తలంపులకు విరోధముగా మరియు ఎంతో విభిన్నముగా ఉంటుంది. మానవ స్వభావము సహయక పాత్ర పోషించడంతో, దేవుని కార్యపు ప్రస్తుత దశ పూర్తిగా దైవత్వము చేతులమీద కలిసి పనిచేస్తుందని ఎవరైనా చెప్పవచ్చు. మానవుడు దీనికి చేయి వేయడానికి అనుమతించకుండా, తన కార్యాన్ని తానుగా నిర్వహించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు కాబట్టి, తన కార్యము చేయడానికి తనకు తానుగా ఆయన శరీరమందు (అసంపూర్ణమైన, సాధారణ వ్యక్తిలో) అవతరించాడు. మానవాళికి కొత్త యుగాన్ని అందించడానికి, తన కార్యములోని తదుపరి దశను మానవాళికి చెప్పడానికి, మరియు ఆయన వాక్యాలలో విశదీకరించబడిన మార్గానికి అనుగుణంగా ఆచరించమని ప్రజలను అడగడానికి ఆయన ఈ శరీరధారణను ఉపయోగించుకుంటాడు. ఈ విధంగా శరీరమందు దేవుని కార్యము ముగించబడింది; ఆయన మానవాళిని విడిచిపెట్టబోతున్నాడు, సాధారణ మానవ స్వభావపు శరీరంలో ఇక నివసించడు, కానీ ఆయన కార్యములోని మరొక భాగాన్ని కొనసాగించడానికి మానవుని నుండి దూరంగా వెళుతున్నాడు. తరువాత, ఆయన హృదయానుసారులైన ప్రజలను ఉపయోగించి, వారి మానవ స్వభావములో గాక, ఈ ప్రజల సమూహంలో తన కార్యాన్ని ఆయన కొనసాగిస్తాడు.
శరీరధారి అయిన దేవుడు మానవునితో ఎల్లప్పుడు ఉండలేడు ఎందుకంటే, దేవునికి చేయవలసిన కార్యము ఎంతో ఉంది. ఆయన శరీరానికి కట్టుబడి ఉండలేడు; ఆయన ఆ కార్యాన్ని శరీరపు స్వరూపములో చేసినప్పటికీ, ఆయన చేయవలసిన కార్యాన్ని చేయడానికి శరీరాన్ని త్యజించవలసి ఉన్నది. దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, ఒక సాధారణ వ్యక్తి మానవాళిని విడిచే మరియు చనిపోయే ముందు చేరుకునే రూపాన్ని చేరేవరకు ఎదురుచూడడు. తన శరీరపు వయస్సు ఎంతైనా, తన కార్యము ముగిశాక, ఆయన మానవుని విడిచి వెళ్ళిపోతాడు. ఆయనకు వయస్సు అనేదేమీ లేదు, మానవ జీవిత కాలానుగుణంగా అయన తన రోజులను లెక్కించడు; బదులుగా, ఆయన కార్యపు దశల అనుగుణంగా శరీరమందు తన జీవితాన్ని అయన ముగిస్తాడు. దేవుడు, శరీరంలోకి రావడానికి, కొంత వయస్సు కలిగి, పెరిగి పెద్దవాడై, వృద్దాప్యాన్ని చేరుకొని, శరీరము విఫలమైనప్పుడు మాత్రమే విడిచిపెట్టాలని భావించేవారు ఉండవచ్చు. ఇది మానవుని భ్రమ; దేవుడు ఆ విధంగా పని చేయడు. ఆయన చేయవలసిన కార్యాన్ని చేయడానికి మాత్రమే ఆయన శరీరునిగా వస్తాడు, ఒక సాధారణ మనిషికి చెందిన అన్ని కార్యకలాపాలు—తల్లిదండ్రులకు పుట్టడం, పెరగడం, కుటుంబాన్ని ఏర్పరచుకోవడం మరియు ఒక ఉపాధిని మొదలుపెట్టడం, పిల్లల్ని కని పెంచడం, లేక జీవితపు ఒడిదుడుకులను అనుభవించడం—లాంటి సాధారణ మానవ జీవితాన్ని గడపడానికి కాదు. దేవుడు భూలోకానికి రావడం, అంటే దేవుని ఆత్మ శరీరాన్ని ధరించడం, శరీరంలోకి రావడమే, కానీ దేవుడు సాధారణ వ్యక్తి జీవితాన్ని గడపడు. ఆయన నిర్వహణ ప్రణాళికలోని ఒక భాగాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన వస్తాడు. ఆ తరువాత ఆయన మానవాళిని విడిచిపెడతాడు. ఆయన శరీరంలోకి వచ్చేటప్పుడు, దేవుని ఆత్మ శరీరపు సాధారణ స్వభావాన్ని పరిపూర్ణపరచదు. బదులుగా, దేవుడు ముందుగా నిర్ణయించిన సమయానికి, దైవత్వము నేరుగా కార్యం చేస్తుంది. అప్పుడు, ఆయన చేయవలసినదంతా చేసి మరియు ఆయన పరిచర్యను సంపూర్ణంగా ముగించిన తరువాత, ఈ దశలోని దేవుని ఆత్మ కార్యము అయిపోతుంది, ఆ సమయానికి ఆయన శరీర సంబంధమైన దేహము దీర్ఘాయుష్కాలము జీవించిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా, శరీరధారి అయిన దేవుని జీవితం కూడా ముగుస్తుంది. అంటే, శరీర సంబంధమైన దేహపు జీవితం ఏ దశను చేరుకున్నప్పటికీ, భూమిపై ఎంతకాలం జీవించినా, ప్రతిదీ పరిశుద్దాత్మ కార్యము ద్వారా నిర్ణయించబడుతుంది. సాధారణ మానవత్వమని మనిషి భావించే దానితో సంబంధమే లేదు. యేసునే ఒక ఉదాహరణగా తీసుకోండి. ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన శరీరమందు జీవించాడు. మానవ శరీరపు ఆయుష్కాల పరంగా, ఆ వయస్సులో ఆయన చనిపోయి ఉండకూడదు, మరియు ఆయన విడిచిపెట్టి ఉండకూడదు. కానీ దేవుని ఆత్మకు ఇది పట్టింపు కాదు. ఆయన కార్యము ముగించబడిన, ఆ సమయానికి దేహము తీసివేయబడి, ఆత్మతో పాటుగా అదృశ్యమవుతుంది. ఈ సూత్రాన్ని అనుసరించి దేవుడు శరీరంలో కార్యం చేస్తాడు. కాబట్టి, కచ్చితంగా చెప్పాలంటే, శరీరధారి అయిన దేవునికి మానవ స్వభావం అనేది మొదటి ప్రాముఖ్యత కాదు. మళ్ళీ చెప్పాలంటే, ఆయన భూమి మీదికి వచ్చేది సాధారణ మానవ జీవితాన్ని జీవించడానికి కాదు. అయన మొదట సాధారణ మానవ జీవితాన్ని స్థాపించి ఆ తరువాత కార్యాన్ని ఆరంభించడం చేయడు. బదులుగా, ఆయన సాధారణ మానవ కుటుంబంలో జన్మించినంత కాలం, ఆయన మానవుని ఉద్దేశాలతో మలినపరచబడని, శరీర సంబంధము కాని, సమాజపు విధానాలు ఖచ్చితంగా అవలంభించని లేక మానవ ఆలోచనలు లేదా తలంపులలో కలుగజేసుకొనని, మరియు, అంతేగాక, మానవ జీవన తాత్విక సిద్దాంతాలలో కలుగజేసుకొనని పని అయిన, దైవిక కార్యాన్ని చేయగలడు. శరీరధారి అయిన దేవుడు చేయాలనుకున్న కార్యము ఇదే, ఇదే ఆయన శరీరధారణ యొక్క ఆచరణాత్మక ప్రాధాన్యత కూడా. దేవుడు ప్రధానంగా శరీరమందు జరిగించవలసిన కార్యపు ఒక దశను, ఏ ఇతర పనికిమాలిన ప్రక్రియలకు లోనుకాకుండా చేయడానికి వచ్చాడు, మరియు, సాధారణ మానవుని అనుభవాల విషయానికొస్తే, ఆయన వాటిని కలిగి ఉండడు. శరీరధారి అయిన దేవుడు చేయవలసిన కార్యము సాధారణ మానవ అనుభవాలను కలిగి ఉండదు. కాబట్టి ఆయన శరీరములో నెరవేర్చాల్సిన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు శరీరంలోనికి వస్తాడు. మిగిలిన వాటికి ఆయనతో సంబంధం లేదు; పనికిరాని అనేకమైన ప్రక్రియల గుండా ఆయన వెళ్ళడు. ఆయన కార్యము ముగిసిన వెంటనే, ఆయన శరీరధారణ ప్రాధాన్యత కూడా ముగుస్తుంది. ఈ దశను ముగించడమంటే, శరీరమందు ఆయన చేయవలసిన కార్యము ముగిసిందని, మరియు ఆయన శారీరక పరిచర్య పూర్తయిందని అర్ధము. కానీ ఆయన శరీరమందు నిరవధికంగా కార్యము చేస్తూ ఉండలేడు. ఆయన కార్యము చేయడానికి, శరీరానికి వెలుపల ఉన్న మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉన్నది. ఆ విధంగా మాత్రమే ఆయన కార్యము సంపూర్ణముగా నెరవేర్చబడి, మరింత ప్రభావంతముగా ఉంటుంది. దేవుడు తన మూల ప్రణాళిక ప్రకారం కార్యము చేస్తాడు. ఆయన చేయవలసిన కార్యము మరియు ఆయన ముగించిన కార్యము గురించి, తన అరచేయి అంత స్పష్టముగా ఆయనకు తెలుసు. దేవుడు ప్రతి వ్యక్తిని తాను ముందుగా నిర్ణయించిన మార్గంలో నడిపిస్తాడు. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. దేవుని ఆత్మ నడిపింపును అనుసరించేవారు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఆ తదుపరి కార్యములో, మనిషిని నడిపించడానికి శరీరమందు మాట్లాడేది దేవుడు కాదు, కానీ స్పర్శనీయ రూపములో మానవ జీవితాన్ని నడిపించేది ఆత్మ అయి ఉండవచ్చు. అప్పుడు మాత్రమే మానవుడు దేవుని తాకగలడు, దేవుని చూడగలడు, మరియు దేవుడు కోరుకునే వాస్తవికతలోనికి మెరుగైన ప్రవేశం పొందగలడు, అలాగే ఆచరణాత్మకమైన దేవుని ద్వారా పరిపూర్ణునిగా మార్చబడగలడు. ఇది దేవుడు సాధించడానికి ఉద్దేశించిన కార్యము, మరియు చాల కాలము క్రిందటి ఆయన ఏర్పాటు. దీని నుండి, మీరు తీసుకోవాల్సిన మార్గాన్ని మీరందరూ చూడాలి!