దేవుని రాజ్యపు గీతం

జన సమూహాలు నన్ను సంతోషపరుస్తారు, జనసమూహాలు నన్ను స్తుతిస్తారు; అన్ని నాలుకలు ఒక్కడైయున్న నిజ దేవుని నామాన్ని పలుకుతాయి, ప్రజలందరూ వారి కన్నులెత్తి, నా కార్యాలను చూస్తారు. (దేవుని) రాజ్యం, మనుష్య లోకంపై దిగివచ్చింది, నా వ్యక్తిత్వం ఉత్తమమైనది, దాతృత్వం కలిగింది. దీనిని బట్టి ఎవరు సంతోషించరు? సంతోషంతో నాట్యం చేయని వారెవరు? ఓహ్. సీయోను! నన్ను ఘనపరచడానికి నీ విజయోత్సాహ ధ్వజము ఎత్తుకొనుము! నా పరిశుద్ధ నామాన్ని ప్రకటించడానికి నీ విజయ గీతాన్ని పాడు! భూదిగంతముల వరకు ఉన్న సమస్త సృష్టి, నాకు అర్పించుకొనునట్లు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి త్వరపడు! పరలోకపు నక్షత్ర రాశులారా! ఆకాశమండలంలో నా గొప్ప శక్తిని చూపడానికి మీ స్థానాలకు తిరిగివెళ్ళడానికి త్వరపడండి! భూమిపై, కీర్తనలో నా పట్ల తమ అపారమైన ప్రేమను మరియు గౌరవాన్ని వ్యక్తపరిచే ప్రజల స్వరాలవైపు నా చెవులనిస్తున్నాను! ఈ రోజు, సమస్త సృష్టి, జీవానికి తిరిగి వచ్చినప్పుడు, నేను మనుష్య లోకానికి నేను దిగివస్తాను. ఈ క్షణంలో, ఈ తరుణంలో, పువ్వులన్నీ వికసిస్తాయి, పక్షులన్నీ ఏక స్వరంతో పాడతాయి, సమస్తం సంతోషంతో కంపిస్తుంది! (దేవుని) రాజ్యపు సమస్కార శబ్ధమందు, సాతాను రాజ్యం కూలిపోతుంది, దేవుని రాజ్యపు గీతం యొక్క ఉరుముల్లో మరలా తిరిగి లేవలేనంతగా నిర్మూలమైపోతుంది!

భూమిపై ఎవరు లేచి, ఎదుర్కొనే ధైర్యం చేస్తారు? నేను భూమికి దిగివచ్చినప్పుడు, నేను అగ్నిని, ఉగ్రతను, అన్ని రకాల విపత్తులను తీసుకొస్తాను. ఈ లోక రాజ్యాలన్నీ ఇప్పుడు నా రాజ్యాలు! ఆకాశమందు, మేఘాలు దొర్లిపోతాయి; ఆకాశం క్రింద సరస్సులు మరియు నదులు ప్రవాహంతో ఉప్పొంగుతూ, సంతోషంతో మధురమైన సంగీతాన్ని ఆలపిస్తాయి. విశ్రమిస్తున్న జంతువులను వాటి గుహల నుండి, వారున్న మత్తులో నుండి ప్రజలందరినీ నేను మేల్కోలుపుతాను. ఎట్టకేలకు అనేక మంది ప్రజలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! వారు అత్యంత సుందరమైన గీతాలను నాకు అర్పిస్తారు!

ఈ సుందరమైన తరుణంలో, సంతోషభరితమైన ఈ సమయంలో,

పైన ఆకాశమందు మరియు క్రింద భూమియందు, ప్రతిచోట స్తుతి వినపడుతుంది. దీనిని బట్టి ఉల్లసించని వారెవరు?

ఎవరి హృదయం తేలికపడదు? ఈ దృశ్యాన్ని బట్టి దుఃఖపడని వారెవరు?

ఆకాశం, ఒకప్పటి ఆకాశంలా ఉండదు, ఇప్పుడు ఇది దేవుని రాజ్యపు ఆకాశం.

భూమి, ఒకప్పటి భూమిలా ఉండదు, ఇప్పుడిది పరిశుద్ధమైన ప్రదేశం.

విస్తారమైన వర్షం గతించిపోయిన తరువాత, మురికిగా ఉన్న పాత ప్రపంచం పూర్తిగా కొత్త రూపు సంతరించుకొంటుంది.

పర్వతాలు మారుతున్నాయి … జలాలు మారుతున్నాయి …

ప్రజలు కూడా మారుతున్నారు … సమస్తం మార్పు చెందుతున్నాయి….

అహ్. నిశ్శబ్ధంగా ఉన్న పర్వతములారా! లేచి నాకొరకు నాట్యం చేయండి!

అహ్. నెమ్మదిగానున్న జలాల్లారా! స్వేచ్ఛగా ప్రవహించండి!

కలలు కంటున్న మనుష్యులారా! మిమ్మల్ని మీరు పురికొల్పుకుని, మేల్కోలుపుకొని, పరుగెత్తండి!

నేను వస్తున్నాను … నేను రాజును….

సమస్త మానవజాతి తమ కళ్ళతో నా ముఖాన్ని చూస్తారు, తమ చెవులతో నా స్వరాన్ని వింటారు,

దేవుని రాజ్యపు జీవితాన్ని తమ కొరకు తాము జీవిస్తారు….

ఎంత మధురం … ఎంత సౌందర్యం….

మరువజాలనిది … మరచిపోవడం అసాధ్యం….


నా ఉగ్రత మంటలో, ఎర్రటి మహా ఘటసర్పం శ్రమపడుతుంది;

నా గంభీరమైన తీర్పులో, దురాత్మలు వాటి నిజస్వరూపాన్ని చూపిస్తాయి;

కఠినమైన నా మాటలతో, ప్రజలందరూ తీవ్ర అవమానాన్ని అనుభవిస్తారు మరియు వారు తమని తాము ఎక్కడా దాచుకోలేరు.

గతంలో వారు నన్ను ఎలా పరిహాసం చేశారో, ఎలా ఎగతాళి చేశారో జ్ఞాపకం చేసుకుంటారు.

తమని తాము హెచ్చించుకొని, నన్ను ధిక్కరించని సమయమంటూ ఏది లేదు.

ఈ రోజు దుఃఖించని వారెవరు? పశ్చాత్తాపపడని వారెవరు?

సమస్త లోకం దుఃఖంతో నిండిపోతుంది …

సంతోష శబ్ధంతో నిండిపోతుంది … ఆనంద స్వరాలతో నిండిపోతుంది….

పోల్చలేని సంతోషం … పోలికేలేని సంతోషం….


చిరుజల్లుల శబ్ధం … అల్లల్లాడుతున్న భారమైన మంచు ముక్కలు….

ప్రజలు అంతరంగంలో, దుఃఖం మరియు సంతోషం మిళితమై ఉంటాయి … కొంతమంది నవ్వుతారు …

కొంతమంది ఏడుస్తారు … మరియు కొంతమంది సంతోషంతో గంతులేస్తారు….

అందరూ మరిచిపోయినట్లుగా … ఇది వర్షం మరియు మేఘాలతో నిండి ఉన్న వసంత ఋతువా,

పువ్వులు వికసించి సువాసన వెదజల్లే, గొప్ప పంట చేతికొచ్చే వేసవి కాలమా,

లేదా పొగమంచుతో ఉండే చల్లటి శీతాకాలమా ఎవరికీ తెలియదు….

ఆకాశంలో మేఘాలు కొట్టుకొనిపోతాయి, భూమిపై సముద్రాలు కలిసిపోతాయి.

కుమారులు, తమ చేతులు ఆడిస్తారు … ప్రజలు నాట్యం చేస్తూ, తమ పాదాలు కదుపుతారు….

దేవదూతలు పనిచేస్తారు … దేవదూతలు కాపరత్వం చేస్తారు….

భూమిపై నున్న ప్రజలందరూ సందడిగా ఉంటారు మరియు భూమిపైనున్న సమస్తం వృద్ధి చెందుతుంది.

మునుపటి:  సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—10 వ అధ్యాయము

తరువాత:  సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—12 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger