ఉపోద్ఘాతము
మీలో ప్రతియొక్కరూ మీ జీవిత కాలమంత దేవుణ్ణి ఎలా విశ్వసించారన్న విషయాన్ని మరొకసారి పరిశీలన చేసుకోవాలి. ఇందు మూలాన మీరు దేవుణ్ణి వెంబడించు క్రమములో, దేవుణ్ణి నిజంగా అర్థం చేసుకోనియున్నారా, ఆయనను మీరు నిజంగా ఎరిగియున్నారా మరియు ఆయనను మీరు నిజంగా తెలుసుకొనియున్నారా అని చూడగలరు, అంతమాత్రమే కాక వివిధ మనస్తత్వములను కలిగియున్న ప్రజల విషయంలో దేవుడు ఎటువంటి ఆలోచన కలిగియున్నాడో మరియు దేవుడు నీ మీద జరిగించు కార్యమును నీవు నిజంగా అర్థం చేసుకోగలిగావా మరియు దేవుడు నీ ప్రతి క్రియను ఎలా నిర్వచించునో అని మీరు తెలుసుకోగలరు. ఈ దేవుడు, నీ ప్రక్కనే ఉండి, నీ ప్రగతి యొక్క దిశను నడిపిస్తాడు, నీ గమ్యస్థానమును శాసించును మరియు నీ ప్రతి అవసరతను తీర్చునని అంతా చెప్పబడి ముగించబడిన తర్వాత ఈ దేవుణ్ణి నీవు ఎంతగా అర్థం చేసుకోగలవు. ఈ దేవుణ్ణి గూర్చి మీకు ఎంతవరకు తెలుసు? ప్రతిరోజు ఆయన నీ మీద ఎటువంటి కార్యమును జరిగించుచున్నాడో నీకు తెలుసా? ఆయన ప్రతి కార్యముకు ఆధారమైన ఆయన నియమాలను గూర్చి మరియు ఆయన ఉద్దేశ్యములను గూర్చి మీకు తెలుసా? ఆయన నిన్ను ఎలా నడిపిస్తున్నాడో నీకు తెలుసా? ఆయన నీ అవసరతలను ఎలా తీర్చుచుచున్నాడో నీకు తెలుసా? ఆయన నిన్ను ఎలాంటి విధానాలలో నడిపిస్తున్నాడో నీకు తెలుసా? ఆయన నీ దగ్గర నుండి ఏమి కోరుకొనుచున్నాడో మరియు నీ నుండి ఆయన ఏమి సాధించాలని ఆశిస్తున్నాడో నీకు తెలుసా? నీవు ప్రవర్తించు అనేక విధములను గూర్చి ఆయన ఎటువంటి ఆలోచనలను కలిగియున్నాడో నీకు తెలుసా? ఆయనకు అతి ప్రియమైన వ్యక్తిగా నీవున్నావో, లేదో నీకు తెలుసా? ఆయన సంతోషానికి, కోపముకు, దుఃఖముకు మరియు ఆనందముకు మూలము మీకు తెలుసా, వాటి వెనకున్న ఆలోచనలు మరియు అభిప్రాయములను గూర్చి అలాగే ఆయన గుణగణాలను గూర్చి నీకు తెలుసా? తుదకు, నీవు నమ్ముచున్న ఈ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? ఇలాంటి ప్రశ్నలను గూర్చి మరియు ఇతర ప్రశ్నలను గూర్చి నీవు ఎప్పుడూ ఆలోచించలేదు లేక దానిని గూర్చి ఎప్పుడు అర్థం చేసుకోలేదు కదా? దేవునిలో నీ విశ్వాసమును కొనసాగించుచున్నప్పుడు, నిజమైన అభినందనతో మరియు దేవుని మాటల అనుభవముతో, ఆయనను గూర్చి నీవు కలిగియున్న అపార్థమును ఎన్నడైనా తొలగించుకోగలిగావా? దేవుని ద్వారా క్రమశిక్షణ మరియు శిక్షణ పొందుకొన్న తర్వాత నిజాయితీతో కూడిన విధేయత మరియు జాగ్రతను వహించు స్థాయిని చేరుకొనియున్నారా? దేవుని శిక్ష మరియు న్యాయ తీర్పు మధ్యన ఉంటూ, మనుష్యునిలో తిరుగుబాటు చేయు స్వభావము మరియు సైతాను స్వభావమును గూర్చి తెలుసుకొని నీవు దేవుని పరిశుద్ధతత గూర్చి రవంతైనా అర్థం చేసుకొనియున్నావా? దేవుని మాటల ద్వారా నడిపించబడి మరియు జ్ఞానోదయం పొందిన నీవు జీవితం మీద ఒక క్రొత్త దృక్పథం కలిగియుండుటకు ప్రారంభించావా? దేవుడు పంపించిన శోధనల మధ్యలో, మనుష్యుడు చేయు తప్పిదములను గూర్చి ఆయన సహించడని అలాగే నీ నుండి ఆయన ఏమి అపేక్షించుచున్నాడో మరియు ఆయన నిన్ను ఎలా రక్షించుచున్నాడో అని నీవు తెలుసుకొనియున్నావా? దేవుని అపార్థము చేసుకొనుట అంటే ఏమిటని మీకు తెలియనప్పుడు, లేక ఆ అపార్థమును ఎలా తొలగించాలో తెలియనప్పుడు, నీవు దేవునితో నిజమైన బంధములోనికి ప్రవేశించలేదని మరియు ఆయనను అర్థం చేసుకోలేదని చెప్పవచ్చు లేక ఆయనను అర్థం చేసుకోవాలని నీవు ఎప్పుడు అనుకోనలేదని చెప్పవచ్చు. దేవుని క్రమశిక్షణ మరియు శిక్ష గూర్చి నీకు తెలియకపోతే, విధేయత మరియు సంరక్షణ అంటే ఏమిటో నీకు ఖచ్చితంగా తెలియదు, లేక దేవుని గూర్చి నీవు ఎన్నడు పట్టించుకోలేదు గదా ఆయనకు ఎన్నడు నిజంగా విధేయత చూపనూ లేదు. దేవుని శిక్షను మరియు ఆయన న్యాయ తీర్పును నీవు ఎన్నడు అనుభవించ లేదంటే, ఆయన పరిశుద్ధతను గూర్చి నీకు అస్సలు ఏమీ తెలియదు మరియు మనుష్యుని తిరుగుబాటుతనము గూర్చి నీకు ఏమాత్రమూ స్పష్టత ఉండదు. నీకు జీవితం మీద సరియైన దృక్పథం నిజంగా లేకపోయినట్లయితే లేక జీవితం మీద సరియైన గురి లేకపోయినట్లయితే నీవు తికమక స్థితిలోనే ఉన్నట్లయితే మరియు భవిష్యత్తు జీవిన విధానం మీద సరియైన నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే, ముందడుగు వేయుటకు కూడా సంకోచించుతుంటే, నీవు నిజంగా దేవుని జ్ఞానోదయమును మరియు ఆయన మార్గదర్శనమును పొందుకోలేదని ఖచ్చితంగా తెలుస్తుంది; నీవు దేవుని మాటల ద్వారా నిజంగా బలపరచబడలేదని లేక ఆయన మాటల ద్వారా నింపబడలేదని సునాయాసంగా చెప్పవచ్చు. దేవుడు పెట్టే పరీక్షలను నీవు ఇంకనూ ఎదుర్కొనకుంటే, మనుష్యుడు చేసే అపరాధముల నిమిత్తము దేవుడు ఎంతగా సహనము కలిగియున్నాడో నీకు నిశ్చయముగా తెలియదు, తుదకు నీనుండి దేవుడు ఏమి అపేక్షిస్తున్నాడనే సంగతి మరియు మానవుని రక్షణ నిమిత్తము కూడా నీవు అర్థం చేసుకోలేవు. ఒక వ్యక్తి దేవుని యందు ఎన్ని సంవత్సరాలు నమ్మకము కలిగియున్నాడనే దానితో నిమిత్తం లేకుండా, వారు దేవుని వాక్కుల అనుభవాన్ని కలిగియుండకపోతే, లేక దేవుని వాక్కులలో దేనిని గ్రహించకపోయినట్లయితే, అప్పుడు వారు ఖచ్చితంగా రక్షణ మార్గము వైపు నడవట్లేదని అర్థం, దేవుని యందు వారు ఉంచిన విశ్వాసములో అసలు విషయమే లేదని అర్థం, దేవుణ్ణి గూర్చి వారికున్న జ్ఞానము శూన్యం, మరియు దేవునియందుంచవలసిన భయభక్తుల విషయములో వారికి ఎంటువంటి ఆలోచనా లేదని చెప్పకనే చెబుతుంది.
దేవుని ఐశ్వర్యములు మరియు ఆయన ఉనికి, ఆయన గుణగణాలు, దేవుని స్వభావము—వీటన్నిటిని గూర్చి ఆయన మాటలలో మానవాళికి తెలియజేశాడు. దేవుని మాటలను ఎప్పుడైతే ఒక మనిషి అనుభవిస్తాడో, దేవుడు మాట్లాడే మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశమును అర్థం చేసుకోవడానికి, దేవుని మాటల నేపథ్యాన్ని, ఆ మాటల మూలాన్ని అర్థం చేసుకోవడానికి, మరియు దేవుని మాటల ఉద్దేశపూరితమైన ప్రభావాన్ని అర్థము చేసుకొని అభినందించుటకు ఆ వ్యక్తి ఆ మాటలను ఆచరణలో పెడతాడు. మానవాళియంతటి కొరకు, మనిషి వీటన్నిటిని అనుభవించాలి, గ్రహించాలి. సత్యమును జీవమును పొందుకొను క్రమములో, దేవుని ఉద్దేశాలను గ్రహించు క్రమములో, ఆయన స్వభావములో రూపాంతరం పొందుట కొరకు వీటిని పొందుకోవాలి. అంతేగాకుండా, దేవుని సార్వభౌమాధికారమునకు మరియు ఆయన కార్యనిర్వాహణలకు లోబడుటకు సమర్థుడవుతాడు. మనిషి ఈ విషయాలన్నిటినీ అనుభవించి, గ్రహించి మరియు పొందుకొను సమయములోనే అతను క్రమేపి దేవుణ్ణి అర్థము చేసుకుంటూ ఉంటాడు. ఈ సమయములోనే అతను ఆయన గూర్చి పలు స్థాయిల జ్ఞానమును పొందుకుంటాడు. ఈ అవగాహన మరియు జ్ఞానములనేవి మనిషి ఊహను బట్టి లేక మనిషి సంగ్రహించుటను బట్టి పుట్టినవి కావు గానీ ఇవి తన లోపల అనుభవించు వాటి నుండి, అనుభూతి చెందువాటి నుండి, మరియు ఆమోదించువాటి నుండి పుట్టుకొస్తాయి. ఈ విషయాలన్నిటిని అభినందించి, అనుభవించి, అనుభూతి చెంది మరియు ఆమోదించుట ద్వారా మాత్రమే దేవుని గూర్చి మనిషికున్న జ్ఞానము తృప్తి చెందుతుంది; ఈ సమయములో మనషి పొందుకొనే జ్ఞానము మాత్రమే వాస్తవికమైనది, నిజమైనది మరియు ఖచ్చితమైనది. ఆయన మాటలను అభినందించి, అనుభవించి, అనుభూతి చెంది, ఆమోదించుట ద్వారా దేవుని జ్ఞానాన్ని పొంది, అవగాహన చేసుకునే ఈ ప్రక్రియ దేవునికి మరియు మనిషికి మధ్యన ఉండే నిజమైన సత్సంబంధం తప్ప మరొకటి కాదు. ఇటువంటి సత్సంబంధములో మనిషి నిజంగా దేవుని ఉద్దేశాలను అర్థము చేసుకొని గ్రహిస్తాడు, దేవుని ఐశ్వర్యములను మరియు ఆయన ఉనికిని అర్థం చేసుకొని గ్రహిస్తాడు, దేవుని గుణగణాలను అర్థము చేసుకొని గ్రహిస్తాడు, దేవుని స్వభావాన్ని అర్థము చేసుకొని తెలుసుకుంటాడు, ఈ విషయాలను గూర్చి నిజమైన నిర్దిష్టితను కలిగి ఉంటాడు. సర్వ సృష్టియంతట మీద దేవుని ఆధిపత్యపు వాస్తవ సంగతి విషయమై సరియైన నిర్వచనాన్ని కలిగి ఉంటాడు, మరియు దేవుని గుర్తింపు మరియు ఆయన స్థానం విషయమైన జ్ఞానమును మరియు ప్రాముఖ్యమైన స్థితిని సంపాదించుకుంటాడు. ఇటువంటి మంచి సత్సంబంధములో, మనిషి మెల్ల మెల్లగా దేవుని గూర్చిన ఆలోచనను మార్చుకుంటాడు, ఆయనను గూర్చి ఏ మాత్రం ఊహించుకొనడు, లేక ఆయనను గూర్చి తనకున్న స్వంత సందేహాలకు కళ్లెము వేస్తాడు, లేక ఆయనను అపార్థం చేసుకుంటాడు, లేక ఆయనను దూషిస్తాడు, లేక ఆయనకు తీర్పు తీరుస్తాడు, లేక ఆయన విషయమై సందేహపడతాడు. అందుచేత, మనిషి దేవునితో తక్కువ వివాదాలను కలిగియుంటాడు, అతను దేవునితో తక్కువ గొడవలను కలిగియుంటాడు, మరియు మనిషి దేవునికి విరుద్ధంగా తిరుగబడే సందర్భాలు తక్కువే ఉంటాయి. అదే స్థాయిలో, మనిషి దేవుణ్ణి పట్టించుకొను విషయములో మరియు దేవునికి విధేయత చూపు విషయములో గొప్పగా ఎదుగుతాడు, మరియు దేవుని పట్ల అతని ఆరాధనా భావం మరింత ఎక్కువ నిజంగాను మరియు ఎక్కువ గాఢంగాను మారుతుంది. ఇటువంటి గొప్ప సత్సంబంధములో మనిషి కేవలం సత్యాన్ని మాత్రమే పొందుకొనడు గానీ నిత్యజీవపు బాప్తిస్మము పొందుకుంటాడు, అయితే అదే సమయములో అతను దేవుని గూర్చి నిజమైన జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఇటువంటి గొప్ప సత్సంబంధములో మనిషి తన స్వభావములో మాత్రమే రూపాంతరం చెందడు గానీ రక్షణను కూడా పొందుకుంటాడు, అయితే అదే సమయములో అతను దేవుని కొరకై సృజించబడిన వ్యక్తిగా నిజమైన భక్తి భావాన్ని మరియు ఆరాధనను సంపాదించుకుంటాడు. ఇటువంటి సంబంధమును కలిగియుంటూ, దేవుని యందలి మనిషికున్న విశ్వాసము ఇక ఎన్నటికి ఒక తెల్లని ఖాళీ కాగితములా ఉండదు, లేక వాగ్దానము కేవలం నోటి మాటలకే ఉండిపోదు, లేక గ్రుడ్డిగా అనుసరించడం మరియు విగ్రహారాధన చేయడం అనేవి ఇక ఉండవు; కేవలం ఇటువంటి సత్సంబంధము ద్వారానే మనిషి జీవితము నానాటికి పరిపక్వతలోనికి వెళ్తూ ఉంటుంది, మరియు ఇలాంటప్పుడు మాత్రమే అతని స్వభావము క్రమేపి రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంతేగాకుండా, దేవుని చిత్తములో అతని విశ్వాసము మెల్లమెల్లగా అనిశ్చితమైనా, అస్పష్టమైన స్థితినుండి నిజమైన విధేయతలోనికి మరియు శ్రద్ధాసక్తులలోనికి వెళ్తుంది, నిజమైన భక్తి జీవితములోనికి ప్రవేశిస్తుంది. అంతేగాకుండా, మనిషి దేవుణ్ణి వెంబడించే విధానములో క్రమేపి నిష్క్రియ స్థితిలో నుండి క్రియాశీల స్థితిలోనికి వెళ్లిపోతాడు. రుణాత్మక ఆలోచన సరళి నుండి ధనాత్మక ఆలోచనలలోనికి వెళ్తాడు; కేవలం ఇటువంటి సత్సంబంధము ద్వారానే మనిషి దేవుని గూర్చిన సరియైన అవగాహనలోనికి మరియు గ్రహింపులోనికి వస్తాడు మరియు దేవుని గూర్చిన నిజమైన జ్ఞానాన్ని పొందుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ప్రజలు దేవునితో గల నిజమైన సత్సంబంధము లోనికి ప్రవేశించలేదు, వారికున్న దేవుని గూర్చిన జ్ఞానం ఒక సైద్ధాంతిక స్థాయి వరకు, పత్రికలు మరియు సిద్ధాంతముల స్థాయి వరకే ఆగిపోయింది. మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ శాతం ప్రజలు ఎన్ని సంవత్సరాలు దేవునిలో నమ్మకం ఉంచారన్నదానిని ప్రక్కకు పెడితే, వారు దేవుణ్ణి తెలుసుకునే విషయములో వారు ఎక్కడ ఆరంభించారో ఇంకా అక్కడే ఉన్నారు, ఆచారప్రదమైన పునాది వద్ద, దానికి సంబంధించిన మూఢనమ్మకాలు మరియు చిత్ర విచిత్రమైన పలువిధములైన పద్ధతుల వద్దనే ఆగిపోయారు. దేవుని గూర్చిన మనిషి జ్ఞానము ఆరంభించిన స్థాయిలోనే ఉందంటే అది ఆచరణాత్మకంగా ఉనికిలోనే లేదని అర్థం. దేవుని స్థితిని మరియు ఆయన గుర్తింపును మనిషి ఆమోదించుటను ప్రక్కకు పెడితే, దేవునియందు మనిషికున్న విశ్వాసము ఇంకా అది అస్పష్టమైన అనిశ్చిత స్థితిలోనే ఉందని అర్థం. ఇది ఇలా ఉన్నప్పుడు, దేవుని పట్ల మనిషికి నిజమైన గౌరవం ఏ మేరకు ఉంటుంది?
నువ్వు దేవుని ఉనికిని ఎంత దృఢంగా విశ్వసించినా, అది దేవుని విషయమై నీకున్న జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా నిలువదు, లేక దేవుని పట్ల నీకున్న భక్తికి ప్రత్యామ్నాయంగా నిలువదు. నువ్వు ఆయన ఆశీర్వాదాలను మరియు ఆయన కృపను ఎంతగా అనుభవించి సంతోషించినా, ఈ అనుభవము నీకున్న దేవుని జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా నిలువదు. ఆయన కొరకు నీకున్న సమస్తాన్ని వెచ్చించుట కొరకు ఎంతగా ఇష్టపడినా, అది నీకున్న దేవుని జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా నిలువదు. బహుశా దేవుడు మాట్లాడిన మాటలతో పాటు చాలా సుపరిచయస్తుడిగా ఎదిగియుండవచ్చు, లేక దేవుని మాటలను కంఠస్థం కూడా చేసియుండవచ్చు మరియు నువ్వు వాటిని కొట్టివేస్తూ ఉండవచ్చు గానీ ఇవన్నియు దేవుని గూర్చి నీకున్న జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా నిలువలేవు. ఏదిఏమైనా ఉద్దేశపూర్వకముగానే మనిషి దేవుణ్ణి అనుసరించాలనుకున్నప్పటికీ, అతను దేవునితో నిజమైన సహవాసమును కలిగియుండకపోతే, లేక దేవుని మాటలను గూర్చిన నిజమైన అనుభవము కలిగియుండకపోతే, అతనికున్న దేవుని జ్ఞానము ఖాళీ మాసికలాంటిది, లేక హద్దులేని ఊహా విహారములాంటిది; నువ్వు దేవునితో భుజాలు తడుముకొని ఉండవచ్చు, లేక ఆయనను ముఖాముఖిగా కలిసి ఉండవచ్చు, అయినా నీవు కలిగియున్న దేవుని జ్ఞానం అంతా సున్నాగానే ఉంటుంది మరియు దేవుని పట్ల మీ భయభక్తులు కేవలం మాటల వరకే లేక ఒక ఆదర్శమైన భావము వరకే మిగిలిపోతాయి గానీ, అంతకంటే మించి ఏమీ ఉండదు.
చాలామంది ప్రజలు ప్రతిరోజు దేవుని మాటలను చదువుతూ ఉంటారు, వారి అత్యంత విలువైన ఆస్తిగా మంచి మంచి వాక్యాభాగాలన్నిటిని కంఠత చేయడానికి ఎంతో నిబద్ధత కలిగియుంటారు, మరియు అంతేగాకుండా వారు దేవుని వాక్కులను ఎక్కడైనా ప్రకటిస్తారు, దేవుని వాక్కులతో ఇతరులను ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. ఇలా చేయడం వలన వారు దేవునికి సాక్ష్యులుగా ఉన్నామని అనుకుంటారు, ఆయన వాక్కులకు సాక్ష్యులుగా ఉన్నామనుకుంటారు, ఈ విధంగా చేయడమంటే దేవుని మార్గాన్ని వెంబడించడమే; ఇలా చేయడం ద్వారా వారు దేవుని మాటల ద్వారా బ్రతుకుచున్నామని అనుకుంటారు, ఇలా చేయడం ద్వారానే ఆయన మాటలను వారి జీవితాలలోనికి తీసుకు వస్తారు, ఇలా చేయడం ద్వారా వారు దేవుని శిక్షను పొందుకోగలుగుతారు మరియు రక్షించబడి, పరిపూర్ణులవుతారు. అయితే, వారు దేవుని మాటలను ప్రకటించినప్పటికీ, వారు ఆచరించుటలో దేవుని మాటలకు విధేయత చూపరు, లేక దేవుని వాక్కులలో బయలుపరచబడిన విషయాలకు విరుద్ధంగా వారు ఎన్నడూ తమ్మునుతాము పోల్చుకోలేరు. దానికి బదులుగా, వారు ఇతరులను వంచించుట ద్వారా ఇతరుల నమ్మకాన్ని మరియు ప్రేమలను పొందడానికి, వారు తమ స్వంతంగా కార్య నిర్వహణ చేసుకోవడానికి, దేవుని మహిమను దొంగిలించడానికి మరియు అపహరించడానికి వారు దేవుని వాక్కులను ఉపయోగిస్తారు. ఆయన మెప్పును మరియు దేవుని పనికి తగ్గ బహుమానాన్ని పొందుతామన్నట్లుగా దేవుని వాక్కులను వ్యాపకము చేయుట ద్వారా కలుగు అవకాశాన్ని వారు వృథాగా ఆశిస్తుంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో గానీ దేవుని వాక్కులను ప్రకటించు విధానములో ఇలాంటి ప్రజలు దేవుని మెప్పును పొందుకోవడములో అసమర్థులుగానే మిగిలిపోయారు, దేవుని వాక్కులకు సాక్ష్యము కలిగియుండే విధానములో వారు అనుసరించవలసిన మార్గమును కనుగొనడములో అసమర్థులుగా మిగిలిపోయారు, దేవుని వాక్కులతో ఇతరులను ప్రోత్సహించి, బలపరచాలనే విధానములో తమను తాము ప్రోత్సహించుకోవడములోను, బలపరచుకోవడములో విఫలమయ్యారు, దేవుణ్ణి తెలుసుకోవడములో అసమర్థులుగా ఉండిపోయారు, లేక దేవునియందు నిజమైన భయభక్తులను కనుపరచడములో, వీటినన్నిటి జరిగించు విధానములో తమనుతాము మేల్కొలుపుకోవడములో విఫలమయ్యారు; అయితే, వీటన్నిటికి వేరుగా, దేవుని విషయమై వారికున్న అపార్థములన్ని లోతుగా పాతుకుపోయాయి, ఆయనను గూర్చిన అపనమ్మకాలన్ని సమూలంగా సమాధి చేయబడ్డాయి, మరియు ఆయనను గూర్చిన వారి ఊహాగానాలన్నీ అతిశయోక్తిగానే ఉండిపోయాయి. దేవుని వాక్కులను గూర్చి వారు అనుకున్న సైద్ధాంతిక విషయాల ద్వారానే వారు పోషించాబడ్డారు మరియు నడిపించబడ్డారు, వారు వాటన్నిటి విషయములో సంపూర్ణతను పొందామన్నట్లుగా, తమకున్న నైపుణ్యతలను చాలా సునాయాసంగా ప్రదర్శిస్తున్నట్లుగా, వారు తమ జీవితాలలో, తమ పరిచర్యలలో ఉద్దేశమును కనుగొన్నట్లుగా, వారు నూతన జీవితమును పొంది, రక్షించబడ్దామన్నట్లుగా, దేవుని వాక్కులను చదువుచున్నప్పుడు చాలా స్పష్టంగా పలుకుతున్నామన్నట్లుగా, వారు సత్యాన్ని పొందుకున్నామన్నట్లుగా, దేవుని ఉద్దేశాలన్నిటిని గ్రహించామన్నట్లుగా, మరియు దేవుని వాక్కులను ప్రకటించు విధానములో దేవుణ్ణి ఎరుగుటకు మార్గాన్ని కనుగొన్నామన్నట్లుగా, తరచుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడియున్నామన్నట్లుగా వారు కనిపిస్తారు. అంతేగాకుండా, వారు ఎన్నోమార్లు కన్నీళ్లు కార్చడానికి కూడా “కదలించబడతారు” మరియు దేవుని వాక్కులలో ఉన్నటువంటి “దేవుని” ద్వారా తరచుగా నడిపించబడతారు, వారు ఆయన గంభీరమైన కోరికను మరియు దయగల ఉద్దేశాన్ని ఎడతెగక గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తారు, మరియు అదే సమయములోనే మనిషిపట్ల దేవుడు కలిగియున్న రక్షణను మరియు ఆయన కార్యనిర్వహణను అర్థం చేసుకుంటారు, ఆయన గుణగణాలను తెలుసుకుంటారు మరియు ఆయన నీతి స్వభావమును కూడా అర్థం చేసుకుంటారు. ఈ పునాదిని ఆధారం చేసుకొని, వారు దేవుని ఉనికిని మరింత స్థిరముగా నమ్మాలి, ఆయన శ్రేష్టమైన స్థితిని గూర్చి మరింత ఎక్కువగా అవగాహన కలిగియుండాలి, ఆయన మహత్వమును మరియు మహనీయతను గురించి మరింత ఎక్కువగా లోతుగా అనుభవించాలి. దేవుని మాటలను గూర్చి మిడిమిడి జ్ఞానములో మునిగిపోయారు. ఇది ఎలా ఉంటుందంటే వారి విశ్వాసము ఎదిగిపోయినట్లుగా, శ్రమలను సహించడానికి వారికున్న సంకల్పం బలపడిందన్నట్లుగా, దేవుని విషయమై వారికున్న జ్ఞానము వేరుపారిందన్నట్లుగా కనిపిస్తుంది. వారు వాస్తవానికి దేవుని మాటలను అనుభవించునంతవరకు వారికి తెలిసిందంతా కొంచమే. దేవుని గూర్చి వారు కలిగియున్న జ్ఞానమంతయు మరియు ఆయనను గూర్చి వారికున్న ఆలోచనలన్నియు వారి స్వంత ఇష్టానుసారమైన ఊహలలోనుండి మరియు వారి స్వంత తలంపులలోనుండి పుట్టుకొచ్చినవే. దేవుని నుండి వచ్చు ఏ పరీక్షలోను వారి విశ్వాసము నిలబడియుండదు. వారికున్న ఆధ్యాత్మికత మరియు వారికున్న స్థాయి దేవుని పరీక్షకు లేక పరిశీలనకు నిలువనేరవు, వారి తీర్మానము ఇసుక మీద నిర్మించిన కోటవంటిది. వారికున్న మిడిమిడి దేవుని జ్ఞానము ఊహాజనితములాంటిది. వాస్తవానికి, ఇలాంటి స్థితిలో ఉండే ప్రజలు దేవుని వాక్కుల విషయములో ఎక్కువ కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది గానీ నిజమైన విశ్వాసమంటే ఏమిటి, నిజమైన విధేయత అంటే ఏమిటి, నిజంగా పట్టించుకోవడం అంటే ఏమిటి, లేక దేవుని నిజమైన జ్ఞానమంటే ఏమిటి అనే విషయాలను ఎప్పటికీ గ్రహించలేరు. వారు సైద్ధాంతిక తత్వం, ఊహాగానం, జ్ఞానం, వరం, ఆచారం, మూఢనమ్మకాలతోపాటు మానవ నైతిక విలువలను కూడా తీసుకొని, వాటిని దేవుణ్ణి నమ్మడం కొరకు మరియు ఆయనను అనుసరించడం కొరకు “పెట్టుబడిగా” మరియు “ఆయుధాలుగా” చేసుకుంటారు. అంతేగాకుండా, వారు దేవుణ్ణి విశ్వసించడానికి మరియు ఆయనను వెంబడించడానికి వాటిని పునాదులుగా చేసుకుంటారు. అదే సమయములోనే, వారు ఈ పెట్టుబడిని, ఆయుధాలను తీసుకొని, వాటిని వారికి తెలిసిన దేవుని ద్వారా మాయా మంత్రాల కవచముగా మారుస్తారు. ఎందుకంటే దేవుని పరిశోధనలు, పరీక్షలు, శిక్ష మరియు తీర్పులను ఎదుర్కొని, వాటితో వ్యవహరిస్తారు. చివరికి, వారు ఇప్పటికీ పొందుకొంటున్నదంతా దేవుని గురించి మతపరమైన ఉద్దేశాలతోను, ఎందుకు పనికిరాని మూఢనమ్మకాలతోను, శృంగారభరితమైన, వింతైన, సమస్యాత్మకమైన విషయాలతో నిండిన తీర్మానాలు తప్ప మరేమీ కాదు. పైనున్న పరలోకమును మాత్రమే నమ్ము ప్రజల వలె లేక ఆకాశములో నివసించు వృద్ధుని నమ్మువారి వలె వీరు కూడా దేవుణ్ణి అదే కొలమానంలో దేవుణ్ణి తెలుసుకొని నిర్వచించుచున్నారు. అయితే, నిజ దేవునికి మాత్రమే సంబంధించినవిగా ఉన్నటువంటి దేవుని నిజతత్వం, ఆయన గుణగణాలు, ఆయన స్వభావము, ఆయన సంపదలు మరియు ఆయన ఉనికి, ఇంకా మొదలగునవన్నిటిని గ్రహించుటలో వారికున్న జ్ఞానం విఫలమయ్యింది, దాని నుండి వారికున్న జ్ఞానం పూర్తిగా వేరైపోయింది, ఎంతగా వేరైపోయిందంటే ఉత్తర మరియు దక్షిణ ధృవాల మధ్యనున్నంత దూరము వలే వేరైపోయింది. ఈ విధంగా ఈ ప్రజలందరూ దేవుని వాక్కుల పోషణ మరియు సంరక్షణ క్రింద జీవిస్తున్నప్పటికీ, దేవునికి భయపడి చెడుకు దూరంగా ఉంచగలిగే మార్గములో వారు నడవలేరు. దీనికి గల నిజమైన కారణం ఏమంటే దేవునితో వారికి పరిచయం లేకపోవడమే, లేక ఆయనతో నిజమైన సంబంధాన్ని లేక పరిచయాన్ని కలిగియుండకపోవడమే. అందుచేత, వారు దేవునితో గల పరస్పర అవగాహనలోనికి రావడం అసాధ్యం, లేక నిజమైన విశ్వాసములో తమను తాము ప్రోత్సహించుకోవడం అసాధ్యం, దేవుణ్ణి ఆరాధన చేయడం లేక ఆయనను వెంబడించడం అసాధ్యం. అందుచేత, వారు దేవుని మాటలను పరిగణించాలి, దేవునికి సంబంధించినవారుగా ఉండాలి—ఈ దృక్పథం మరియు ఈ ధోరణి వారి సమస్త ప్రయత్నాల నుండి రిక్త హస్తాలతో వెనుదిరుగు విధంగా చేశాయి, దేవునికి భయపడి చెడుకు దూరంగా ఉంచే మార్గములో నడవడానికి సమర్థులుగా చేసే నిత్యత్వములో ఉండనీయకుండా చేశాయి. వారు లక్ష్యముంచిన గురి మరియు వారు వెళ్ళే దిశానిర్దేశం నిత్యత్వము గుండా వెళ్ళే దేవుని శత్రువులని వారిని సూచిస్తోంది, మరియు నిత్యత్వము గుండా వెళ్ళే వారు రక్షణను ఎన్నటికి పొందుకోలేరు.
ఒకవేళ, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి అనుసరించి, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాటలను అనుభవించి ఆనందించిన వ్యక్తి విషయములోనైతే, దేవుని విషయమై వారికున్న నిర్వచనము విగ్రహాల ముందు తనను తాను సాష్టాంగ పడుచున్న వ్యక్తి వలె చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది, అలాంటప్పుడు ఆ వ్యక్తి దేవుని మాటల నిజతత్వాన్ని పొందలేడని స్పష్టంగా అర్థమౌతోంది. ఇందుచేతనే, వారు దేవుని వాక్కుల నిజతత్వములోనికి ప్రవేశించలేదు, మరియు ఈ కారణముచేత, నిజతత్వం, సత్యం, ఉద్దేశాలు మరియు మనుషుల పైన దబాయింపులు అనేవి ఆ వ్యక్తితో ఏమి పని చేయవు, ఇవన్నీ దేవుని వాక్కులలో ఉన్నాయి. దేవుని వాక్కుల మీద ఆ వ్యక్తి ఎంత కృషి చేసినప్పటికీ, సమస్తం వ్యర్థమని చెప్పవచ్చు: ఎందుకంటే వారు వెంబడించేదంతా కేవలం మాటలను మాత్రమే, వారు పొందుకునేదంతా కేవలం మాటలను మాత్రమే. దేవుడు మాట్లాడిన మాటలు మామూలుగా ఉన్నవైనా లేక అర్థ గర్భితంగా ఉన్నవైనా అవన్నీ మనిషి జీవితములోనికి అడుగు పెట్టగానే ఆ మనిషికి అవన్నీ సత్యములై ఉంటాయి; అవన్నీ శరీరమందును మరియు ఆత్మయందును జీవించడానికి మనిషి బలపరిచే జీవ జలముల ఊటగా ఉంటాయి. మనిషి సజీవంగా ఉండడానికి కావలసిన ప్రతి అవసరతను అవి తీరుస్తాయి; తన దైనందిన జీవితమును మంచిగా ఉంచుకొనుటకు కావాలసిన నియమాలను మరియు ఆదేశాలను అందిస్తాయి. రక్షణకు, తన గురి వైపునకు మరియు దిశానిర్దేశం వైపునకు నడిపించే మార్గమునే అతను ఎన్నుకోవాలి; దేవుని ఎదుట సృష్టించబడినవాడుగా అతను ప్రతి సత్యమును పొందుకొనియుండాలి; మనిషి దేవునికి ఎలా విధేయత చూపాలో, ఆయనను ఎలా ఆరాధించాలో అనే విషయాలను గూర్చిన ప్రతి సత్యాన్ని తెలుసుకొని ఉండాలి. అవి మనిషి మనుగడకు ఖచ్చితమైన హామీని ఇస్తాయి, అవి మనిషి దైనందిన జీవితానికి ఆహారంగా ఉంటాయి, మరియు అవి మనిషి బలంగా ఉండుటకు మరియు నిలువబడి ఉండుటకు బలపరిచే బలమైన మద్దతుగా ఉంటాయి. సాధారణ మానవాళిగా జీవించుటకు మానవాళిని సృష్టించిన సత్యము వాస్తవికతలో అవి చాలా గొప్పవి, మానవాళి అవినీతి నుండి విముక్తి పొంది, సాతాను ఉచ్చులునుండి తప్పించునట్లు చేయు సత్యము విషయములో అవి చాలా గొప్పవి, అలుపెరగక బోధించుటలో, హెచ్చరించుటలో, ప్రోత్సహించుటలో అవి చాలా గొప్పవి. సృష్టించబడిన మానవాళికి సృష్టికర్త అందించే గొప్ప ఆదరణయైయున్నది. సమస్తము సానుకూలంగా ఉన్నాయని అర్థము చేసుకొనుటకు, నీతియుతమైన మరియు మంచివైన సమస్త విషయాలలోనికి మనుష్యులు వచ్చి, జీవించవచ్చునని హామీ ఇచ్చే అభయమునిచ్చేవని అర్థము చేసుకొనుటకు, ప్రజలందరి ద్వారా, ప్రతి సంఘటన ద్వారా మరియు సమస్త వస్తువులు ద్వారా కొలువబడే ప్రమాణమని అర్థము చేసుకొనుటకు మనుష్యులను వెలిగించి, మార్గదర్శనము చూపే దీప స్తంభముగా ఉన్నవి. అంతేగాకుండా, మనుష్యులను రక్షణ వైపునకు మరియు వెలుగు మార్గము వైపుకు నడిపించేవిగా లేక నావిగేషన్ మార్కరుగా ఉన్నాయి. దేవుని వాక్కులను ఆచరణాత్మకంగా అనుభవించుట ద్వారా మాత్రమే మనిషి సత్యమును మరియు జీవమును పొందగలడు; ఈ విధంగా మనిషి సాధారణ మానవత్వము అంటే ఏమిటి, అర్థవంతమైన జీవితం అంటే ఏమిటి, నిజమైన సృష్టించబడిన జీవిగా ఉండడం అంటే ఏమిటి, దేవునికి నిజమైన విధేయత చూపించడం అంటే ఏమిటి అనే సంగతులను తెలుసుకుంటాడు; ఈ విధంగానే మనిషి దేవుణ్ణి ఎలా పట్టించుకోవాలో, సృష్టించబడిన జీవిగా తన ధర్మాన్ని ఎలా నెరవేర్చగలడో, మరియు నిజమైన మనిషిగా ఎలా మార్పుచెందగలడనే విషయాలను అర్థం చేసుకుంటాడు; ఈ విధంగానే మనిషి నిజమైన విశ్వాసము అంటే ఏమిటి మరియు నిజమైన ఆరాధన అంటే ఏమిటి అని తెలుసుకుంటాడు; ఈ విధంగానే మనిషి భూమ్యాకాశములను మరియు సమస్తమును పాలించువాడు ఎవరో తెలుసుకుంటాడు; ఈ విధంగానే సమస్త సృష్టికి యజమానుడు, సృష్టిని పాలించేవాడు, సమస్తమును నడిపించెవాడు, సమస్తమును పోషించువాడి మార్గాలను మనిషి అర్థము చేసుకోగలడు; ఈ విధంగానే మనిషి ఉనికియందున్న సమస్త సృష్టికి యజమానుడు, ప్రత్యక్షమైనవాడు మరియు కార్యములను జరిగించువాడి మార్గాలను గ్రహించి అర్థము చేసుకొనగలడు. దేవుని వాక్కుల నిజ అనుభవము లేనివాడు నిజమైన జ్ఞానమును కలిగియుండలేడు, లేక దేవుని వాక్కుల మరియు ఆయన సత్యము యొక్క ఆలోచనలను కలిగియుండలేడు. అటువంటి వ్యక్తి సజీవ శవంగాను, ఎటువంటి మచ్చలులేని పెంకు చిప్పలా ఉంటాడు. సృష్టికర్తకు సంబంధించిన జ్ఞానమంతయు అటువంటి మనిషి విషయములో పని చేయదు. దేవుని దృష్టిలో అటువంటి వ్యక్తి ఆయనను నమ్మలేదు, లేక ఆయనను వెంబడించనూ లేదు. అందుచేత, దేవుడు అతనిని తన విశ్వాసిగానైనా లేక తనను వెంబడించువానిగానైనా, సృష్టించబడిన నిజమైన జీవిగానైనా గుర్తిస్తాడు.
సృష్టించబడిన నిజమైన వ్యక్తి తన సృష్టికర్త ఎవరో, మనిషి పుట్టుక ఎందుకో, సృష్టించబడిన వ్యక్తిగా తనకివ్వబడిన బాధ్యతలను ఎలా మోయాలో, మరియు సమస్త సృష్టికి ప్రభువుగా ఉన్నవాని ఎలా ఆరాధించాలో తప్పకుండా తెలుసుకోవాలి. సృష్టికర్త ఉద్దేశాలను, ఆకాంక్షలను మరియు కోరుకునేవాటిని తప్పకుండ గ్రహించి, తెలుసుకోవాలి మరియు వాటిని పట్టించుకోవాలి. సృష్టికర్త మార్గమును బట్టి ఖచ్చితంగా నడుచుకోవాలి, అంటే ఆయనకు భయపడుతూ, చెడుకు దూరంగా ఉండాలి.
దేవునికి భయపడడం అంటే ఏమిటి? ఒక వ్యక్తి చెడుకు దూరంగా ఎలా ఉండగలడు?
“దేవునికి భయపడడం” అంటే దాని అర్థం ఏదో జడియడమో మరియు భయాందోళన కలిగియుండడమో కాదు, లేక దేవుణ్ణి ప్రక్కకు పెట్టడమూ కాదు, లేక దేవునికి దూరంగా ఉండడమో కాదు, విగ్రహారాధనో లేక మూఢనమ్మకాన్ని పాటించడమో కాదు. అయితే, దేవునికి భయపడడం అంటే ఆయనను ఘనపరచడం, ఉన్నతంగా గౌరవించడం, నమ్మడం, అర్థం చేసుకోవడం, పట్టించుకోవడం, విధేయత చూపడం, అంకిత భావంగా ఉండడం, ప్రేమించడం, అలాగే షరత్తులులేని, ఫిర్యాదు చేయని ఆరాధన చేయడం, ఫలాన్ని తిరిగి చెల్లించడం, మరియు సమర్పించుకోవడమైయున్నది. నిజమైన దేవుని జ్ఞానము లేకుండా, మానవాళి నిజంగా ఘనపరచలేరు, నిజమైన నమ్మకాన్ని కలిగియుండలేరు, నిజమైన అవగాహనను కలిగియుండలేరు, నిజమైన పట్టింపు లేక విధేయతను కలిగియుండలేరు, అయితే వారు భీతిని, అశాంతిని, సందేహమును, అపార్థమును, సాకులు చెప్పడమును, మరియు నిర్లక్ష్య పరచడమును కలిగియుందురు; దేవుని నిజమైన జ్ఞానము లేకుండా, మానవాళియంత నిజమైన ఆరాధనను మరియు నిజమైన సమర్పణను కలిగియుండలేరు, కేవలము గ్రుడ్డి విగ్రహారాధనను మరియు మూఢనమ్మకాలను కలిగియుంటారు; దేవుని నిజమైన జ్ఞానము లేకుండా, మానవాళి దేవుని మార్గానుసారంగా నడుచుకోవడం అసాధ్యం, లేక దేవునికి భయపడడం అసాధ్యం, లేక చెడుకు దూరంగా ఉండడం అసాధ్యం. దీనికి విరుద్ధంగా, మనిషి జరిగించే ప్రతీ చర్య మరియు ప్రతి నడతా తిరుగుబాటుతోనూ మరియు తిరస్కరించడంతోనూ నిండియుంటుంది, ఆయనను గూర్చి అపరాధ ఆరోపణలు మరియు హానికరమైన తీర్పులతోను నిండియుంటుంది, మరియు దేవుని మాటల నిజమైన అర్థమునాకు సత్యానికి విరుద్ధంగా చెడు ప్రవర్తనతో నిండియుంటుంది.
మానవాళియంత దేవునియందు నిజమైన విశ్వాసాన్ని కలిగియున్నట్లయితే, వారు నిజంగా దేవుణ్ణి అనుసరించగలరు మరియు ఆయన మీద నిజముగా ఆధారపడగలరు; దేవుని మీద నిజముగా ఆధారపడి, నిజమైనమైన నమ్మకాన్ని కలిగియుండడం ద్వారా మాత్రమే మానవాళి నిజమైన అవగాహనను మరియు గ్రహింపు కలిగియుండగలరు; దేవుని గూర్చిన నిజమైన గ్రహింపుతో పాటు ఆయనను నిజముగా పట్టించుకోవడమనేది కూడా వస్తుంది; దేవునిని నిజంగా పట్టించుకోవడం ద్వారానే మానవాళియంతయు నిజమైన విధేయతను కలిగి ఉంటారు; దేవునికి నిజమైన విధేయతను చూపించుట ద్వారా మాత్రమే మానవాళియంతయు నిజమైన సమర్పణను కలిగియుంటారు; దేవునికి నిజమైన సమర్పణను కలిగియుండుట ద్వారా మాత్రమే మానవాళియంతయు షరత్తులులేని మరియు ఆరోపణలు లేనటువంటి ప్రతిఫలాన్ని కలిగియుంటారు; నిజమైన నమ్మకం మరియు నిజముగా ఆధారపడుట, నిజముగా అర్థము చేసికొనుట మరియు పట్టించుకోవడం, నిజమైన విధేయతను కలిగియుండుట, నిజమైన సమర్పణ మరియు ప్రతిఫలాన్ని కలిగియుండుట ద్వారానే మానవాళియంతయు దేవుని స్వభావమును మరియు గుణగణాలను, సృష్టికర్త గుర్తింపును తెలుసుకుంటారు; వారు సృష్టికర్తను గూర్చి నిజముగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మానవాళియంత నిజముగా ఆరాధన చేయుటలో మరియు సమర్పించుకొను విషయములో తమనుతాము నిజంగా పురికొల్పుకొనగలరు; సృష్టికర్తకు నిజమైన ఆరాధన చేసి మరియు సమర్పణ కలిగియున్నప్పుడు మాత్రమే మానవాళియంతయు నిజముగా తమ చెడు మార్గములన్నియు ప్రక్కకు పెట్టగలరు, దీనినే చెడుకు దూరంగా ఉండడం అని అంటారు.
ఇదే “దేవునికి భయపడి మరియు చెడుకు దూరంగా ఉండడం” అనే సంపూర్ణ విధానమును ఏర్పరుస్తుంది మరియు దేవునికి భయపడుట మరియు చెడుకు దూరంగా ఉండడం అనే అంశమంతటిలో ఉండే సమాచారమైయున్నది. దేవునికి భయపడి మరియు చెడుకు దూరంగా ఉండే క్రమములో ఈ మార్గమునందు తప్పనిసరిగా ప్రయాణించవలసి ఉంటుంది.
“దేవునికి భయపడుట మరియు చెడుకు దూరంగా ఉండుట” మరియు దేవుని గురించి తెలుసుకొనుట అనేవి విడదీయరాని విధంగా ఒక దారములా అల్లుకుపోయాయి, మరియు వారి మధ్యనున్న సంబంధము స్వతసిద్ధమైనది. ఒక వ్యక్తి చెడుకు దూరంగా ఉండాలనుకుంటే, ఆ వ్యక్తి మొట్టమొదటిగా తప్పనిసరిగా దేవుని భయాన్ని కలిగియుండాలి; ఒక వ్యక్తి నిజంగా దేవుని విషయమై నిజమైన భయాన్ని కలిగియుండాలని ఆశిస్తే, ఒక వ్యక్తి తప్పకుండా దేవుని గూర్చిన నిజమైన జ్ఞానాన్ని కలిగియుండాలి; ఒక వ్యక్తి దేవుని నిజమైన జ్ఞానాన్ని పొందుకోవాలని ఇష్టపడినట్లయితే, ఆ వ్యక్తి తప్పకుండ మొట్ట మొదటిగా దేవుని వాక్కుల అనుభవాన్ని కలిగియుండాలి, దేవుని వాక్కుల నిజతత్వములోనికి ప్రవేశించాలి, దేవుని క్రమశిక్షణను మరియు కఠినతను, ఆయన శిక్షను మరియు తీర్పును అనుభవించాలి; ఒక వ్యక్తి దేవుని వాక్కులను అనుభవించాలని ఇష్టపడితే, ఆ వ్యక్తి తప్పకుండ మొట్ట మొదటిగా దేవుని మాటలతోనూ మరియు దేవునితోనూ ముఖాముఖి అనుభవాన్ని కలిగియుండాలి, మరియు ప్రజలు, సంఘటనలు మరియు వస్తువులు ఉండేటువంటి వాతావరణములన్నిటిలో దేవుని వాక్కులను అనుభవించడానికి అవకాశాలను అందించాలని దేవుని అడగాలి; దేవుని మాటలతోనూ మరియు దేవునితోనూ ముఖాముఖి అనుభవాన్ని ఒకరు కలిగియుండాలని ఇష్టపడితే, ఆ వ్యక్తి తప్పకుండా మొట్ట మొదటిగా తగ్గింపు మరియు యథార్థ హృదయాన్ని కలిగియుండాలి, సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమలను సహించడానికి సుముఖత కలిగియుండాలి, చెడుకు దూరంగా ఉండడానికి తీర్మానము మరియు ధైర్యము కలిగియుండాలి, మరియు నిజమైన వ్యక్తిగా సృష్టించబడునట్లు మారుటకు ఆకాంక్షను కలిగియుండాలి…. ఈ విధంగా, ఒక అడుగు తరువాత మరొక అడుగు వేస్తూ, నువ్వు దేవునికి మరింత దగ్గరవ్వాలి, నీ హృదయాన్ని మరింత పవిత్రంగా మలచుకోవాలి, మరియు దేవుని గురించి తెలుసుకునే విషయములో నీ జీవితాన్ని మరియు సజీవంగా ఉండే నీ విలువను మరింత ఎక్కువ అర్థవంతంగా ఎదగాలి మరియు మరింత ప్రకాశవంతంగా కనబడుటకు మెరుగుపరచుకోండి. సృష్టికర్త ఒక చిక్కు ముడి కాదనీ, సృష్టికర్త నీకు కనపడకుండా దాక్కోలేదనీ, సృష్టికర్త నీకు తన ముఖాన్ని చాటువేయలేదనీ, సృష్టికర్త నీకు దూరంగా ఉండడనీ, నీ ఆలోచనలలో నువ్వు ఆశించే వ్యక్తిగా సృష్టికర్త ఇక మీదట ఉండడనీ మరియు నీ తలంపులతో ఆయనను చేరుకోలేవనీ, ఆయన నిజముగా ఉన్నాడనీ మరియు ఆయన నీకు ఇరువైపుల ఉండి కాయుచున్నాడనీ, నీ జీవితాన్ని పోషిస్తున్నాడని, మరియు నీ గమ్యాన్ని నియంత్రిస్తున్నాడనీ ఒకానొక రోజున నీవు తెలుసుకుంటావు. ఆయన ఎక్కడో తెలియని ప్రాంతములో లేడు, లేక ఆయన తనను తాను మేఘాల మధ్యన మర్మంగా దాచుకోలేదు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీకున్న వాటన్నిటి మీద నాయకుడై నడిపిస్తున్నాడు, నీకున్న సమస్తము ఆయనైయున్నాడు, మరియు నీవు కలిగియున్న ఏకైక వ్యక్తి ఆయనే. అటువంటి గొప్ప దేవుడు నీ హృదయ పూర్వకంగా ఆయన ప్రేమించడానికి, ఆయనను హత్తుకోవడానికి, ఆయనను దగ్గరగా పట్టుకోవడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనకు దూరమవుతున్నానే భయాన్ని కలిగియుండడానికి నీకు అనుమతినిస్తున్నాడు. ఇకపై ఆయనను త్యజించకుండా, ఎప్పటికీ ఆయనకు అవిధేయత చూపకుండా, లేక ఎప్పటికీ ఆయనను తోసిపుచ్చకుండా, లేక ఆయనను దూరంగా ఉంచకుండా ఉండాలని ఆయన కోరుచున్నాడు. నీకు కావాల్సిందల్లా ఆయనను పట్టించుకోవడమే, ఆయనకు విధేయత చూపించడమే, ఆయన నీకిచ్చే వాటన్నిటిలో ఫలించడమే, మరియు ఆయన అధికారానికి ఒప్పుకోవడమే. నువ్వు ఇకపై ఆయన ద్వారా నడిపించబడుటకు, పోషించబడుటకు, పర్యవేక్షించబడుటకు, కాపాడబడుటకు తిరస్కరించరు, నీ కొరకు ఆయన నియమించిన వాటిని మరియు ఉపదేశించేవాటిని తిరస్కరించరు. నీవు చేయవలసినదంతా ఆయనను వెంబడించడమే, ఆయన సహవాసములో ఆయనతో పాటు ఉండడమే; నీకు కావలసినదంతా ఆయనను నీకున్న ఏకైక జీవమని, నీకున్న ఏకైక ప్రభువని, నీకున్న ఏకైక దేవుడని అంగీకరించడమే.
ఆగస్టు 18, 2014