శుద్ధీకరణను అనుభవించుట ద్వారా మాత్రమే మనిషి నిజమైన ప్రేమను పొందుకోగలడు
మీరందరు శ్రమలు మరియు శుద్ధీకరణల మధ్యలోనే ఉన్నారు. శుద్ధీకరణ సమయములో మీరు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? శుద్ధీకరణ అనుభవము పొందుతున్నప్పుడే మనుష్యులు దేవునికి నిజమైన స్తుతులను సమర్పించగలుగుతారు మరియు తమకు చాలా కొరతగా ఉందని వారు శుద్ధీకరణ మధ్యలోనే గ్రహించగలుగుతారు. మీరు ఎంత ఎక్కువగా శుద్ధీకరించబడితే, అంత ఎక్కువగా శరీర క్రియలను త్యజిస్తారు; మనుష్యులకు జరిగే శుద్ధీకరణ ఎంత గొప్పగా ఉంటే, దేవునియందు వారి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. ఈ విషయాన్నే మీరు ఖచ్చితంగా అర్థము చేసుకోవాలి. మనుష్యులు ఎందుకు తప్పనిసరిగా శుద్ధీకరించబడాలి? తద్వారా, ఎలాంటి ప్రభావము సాధించడమనేది లక్ష్యంగా ఉండాలి? మనిషిలో శుద్ధీకరణ చేసే దేవుని కార్యము ప్రాముఖ్యత ఏమిటి? మీరు నిజంగా దేవుణ్ణి వెదికినట్లయితే, ఆయన చేసిన శుద్దీకరణను ఒక స్థాయి వరకు అనుభంవించి, అది ఎంతో ఉత్తమమైనదని మరియు అది అత్యంత అవసరమని భావిస్తారు. శుద్ధీకరణ సమయములో ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఆయన చేసే శుద్ధీకరణను అంగీకరించేందుకు దేవుణ్ణి ప్రేమించే దృఢ సంకల్పాన్ని కలిగియుండడం ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి: గుండెలోనికి కత్తిని దింపి, గెలికితే ఎలా ఉంటుందో, శుద్ధీకరణ సమయములోను మీ లోపల కూడా అలాగే ఉంటుంది. అయినప్పటికీ, దేవుణ్ణి ప్రేమించే ఆ హృదయం ద్వారానే మీరు దేవుణ్ణి మెప్పించవలసి ఉంటుంది, శరీర క్రియలను నిర్లక్ష్యం చేయవలసి ఉంటుంది. దీనినే దేవుని ప్రేమను అనుభవించడం అని అంటారు. మీ లోపల మీరు నొప్పించబడతారు, మీరు పొందే శ్రమ తారా స్థాయికి చేరుకుంటుంది. అయినప్పటికీ, మీరు దేవుని ఎదుటికి రావడానికి ఇష్టపడి, “ఓ ప్రభువా! నేను నిన్ను విడువను. నాలో చీకటి ఉన్నప్పటికీ, నేను నిన్ను సంతోషపరుస్తాను; నా హృదయమును గూర్చి నీకు తెలుసు మరియు నాలో నీ ప్రేమను ఎంతగానో కుమ్మరించియున్నావు” అని చెబుతూ ప్రార్థన చేస్తారు. శుద్ధీకరణ సమయములో దీనినే అభ్యసించవలసి ఉంటుంది. మీరు దేవుని ప్రేమను ఒక పునాదిగా ఉపయోగించుకున్నట్లయితే, శుద్ధీకరణ ప్రక్రియ అనేది మిమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది మరియు మీరు దేవునితో మరింత ఎక్కువ అన్యోన్యంగా ఉండే విధంగా చేస్తుంది. మీరు దేవునిలో విశ్వాసము కలిగియున్నందున, మీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి. దేవుని ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించగలిగితే, శుద్ధీకరణ సమయములో మీరు దేవుణ్ణి వదిలి పెట్టడం, లేక దేవుణ్ణి తిరస్కరించడం అసాధ్యం. ఈ క్రమములో దేవునితో మీకున్న సహవాసం మరింత ఎక్కువగా పెనవేయబడి, సహజ సంబంధంగా మారుతుంది. అంతేగాకుండా, మీరు దేవునితో మరింత ఎక్కువ తరచుగా సంభాషించుగలుగుతారు. ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ అభ్యసిస్తున్నట్లయితే, మీరు దేవుని వెలుగులోను మరియు ఆయన మాటల మార్గదర్శకత్వములో ఎక్కువ సమయం గడుపుతారు. మీ స్వభావములోనూ ఎక్కువ మార్పు కలుగుతుంది మరియు రోజు రోజుకు మీ జ్ఞానము వృద్ధి చెందుతుంది. దేవుని పరీక్షలన్ని అకస్మాత్తుగా మిమ్మల్ని చుట్టుముట్టే ఆ రోజు వచ్చినప్పుడు, మీరు కేవలము దేవుని పక్షాన నిలబడటం మాత్రమే కాకుండా దేవుని కొరకు సాక్ష్యాన్ని కూడా కలిగియుండాలి. ఆ సమయములో మీరు యోబువలె, పేతురువలె ఉంటారు. దేవుని కొరకు సాక్ష్యాన్ని కలిగియున్నప్పుడు నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తావు మరియు దేవుని కొరకు మీ ప్రాణాన్ని సంతోషంగా అర్పిస్తారు; నీవు దేవుని సాక్షిగా ఉంటావు మరియు దేవునిచే ప్రేమించబడిన వ్యక్తిగా నిలిచిపోతావు. శుద్దీకరణను అనుభవించిన ప్రేమ చాలా బలమైనదే గానీ బలహీనమైనది కాదు. దేవుడు మిమ్మల్ని తన పరీక్షలకు ఎప్పుడు ఎలా గురి చేస్తాడనే దానితో సంబంధము లేకుండా, దేవుని కొరకు సమస్తాన్ని ప్రక్కకు పెట్టి, చావైనా బ్రతుకైనా మీ సమస్తాన్ని ఆయన కొరకు సమర్పించుకునే విధంగా ఉండాలి మరియు దేవుని కొరకు ప్రతిదాన్ని సంతోషంగా సహించుకోవాలి. తద్వారా మీ ప్రేమ పవిత్రంగా ఉంటుంది మరియు మీ విశ్వాసము నిజమైనదిగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు దేవుని చేత ప్రేమించబడిన, ప్రత్యేకమైన వ్యక్తులుగాను మరియు దేవునిచేత పరిపూర్ణము చేయబడిన వ్యక్తులుగాను ఉండగలుగుతారు.
మనుష్యులు సాతాను ప్రలోభాలకు గురియైనట్లయితే, వారిలో దేవుని కొరకు ప్రేమ అనేది ఉండదు మరియు మునుపు వారు కలిగియున్న దర్శనాలు, ప్రేమ మరియు తీర్మానాలన్నిటిని కోల్పోతారు. దేవుని కొరకు శ్రమలు అనుభవించవలసిన వారమైయున్నామని మనుష్యులు ఒకప్పుడు భావించేవారు. అయితే, నేటి దినాల్లో అలా శ్రమలు అనుభవించడాన్ని సిగ్గుగా భావిస్తున్నారు మరియు వారు ఫిర్యాదులు చేయడానికి కొరతే లేదు. ఇదే సాతాను చేసే కార్యము, ఒక మనిషి సాతాను అధికారము క్రింద ఉన్నాడనుటకు ఇది ఒక సూచనయై యున్నది. ఇలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కొన్నట్లయితే, మీరు తప్పకుండగ ప్రార్థించాలి, సాధ్యమైనంత త్వరగా దానిని జయించాలి. ఈ విధంగా చేయడం ద్వారానే సాతాను దాడుల నుండి మీరు సంరక్షించబడతారు. మీరు కఠినమైన శుద్ధీకరణ ద్వారా వెళ్తున్నప్పుడే చాలా సులభంగా సాతాను ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంది. అటువంటి శుద్ధీకరణ ప్రక్రియలో మీరు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మీరు తప్పకుండ మీ చిత్తాన్ని త్యజించి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి మరియు మీ శేష జీవితమంతా ఆయనకు విశ్వాసియై ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఎలా శుద్ధీకరిస్తాడనే విషయముతో నిమిత్తం లేకుండా, దేవుని చిత్తం ప్రకారం జీవించడానికి సత్యాన్ని అనుసరించే వారుగా ఉండాలి. మిమ్మల్ని మీరు దేవుణ్ణి వెదికే వ్యక్తులనుగాను మరియు ఐక్యతను కోరుకునే వ్యక్తులనుగాను ఉండు విధంగా చేసుకోవాలి. ఇలా కొన్ని సందర్భాల్లో, మీరు ఎంత మరుగై ఉంటారో, అంతే ఎక్కువగా ప్రతికూల ఆలోచనలతో నిండి, చాలా సులభంగా వెనుదిరిగే అవాకాశం ఉంటుంది. మీ కర్తవ్యాన్ని చేసి ముగించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని చేసి ముగించలేని స్థితికి వెళ్లిపోయినప్పటికీ, మీరు చేయగలిగినంత చేస్తారు. దేవుణ్ణి ప్రేమించడం కంటే ఎక్కువ ఏమీ చేయకండి; మీరు బాగా చేశారని, లేక మీరు బాగా చేయలేదని ఇతరులు ఎటువంటి మాటలు పలికినప్పటికీ పట్టించుకోవద్దు. ఎందుకంటే, మీ ఉద్దేశాలు మంచివే, మీరు స్వనీతిపరులు కారు, మీరు దేవుని ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇతరులు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నప్పుడు, మీరు దేవుని కోసం ప్రార్థన చేయాలి మరియు “ఓ దేవా! ఇతరులు నన్ను సహించాలని లేక నన్ను బాగా చూసుకోవాలని నిన్ను అడగడం లేదు, లేక వారు నన్ను అర్థము చేసుకొని, నన్ను అంగీకరించాలని అడగడం లేదు. నా హృదయములో నిన్ను ప్రేమించు వ్యక్తిగా ఉండాలని, నా హృదయములో సంతోషం కలిగిన వ్యక్తిగా ఉండాలని మరియు శుద్ధమైన మనస్సాక్షిని కలిగిన వ్యక్తిగా ఉండాలని మాత్రమే నేను నిన్ను అడుగుచున్నాను. ఇతరులు నన్ను పొగడాలని, లేక నన్ను హెచ్చించాలని అడగడం లేదు; హృదయ పూర్వకంగా నిన్ను మెప్పించడానికే నేను ప్రయత్నిస్తున్నాను; నేను చేయగలిగినవి చేయుట ద్వారానే నా పాత్రను నేను పోషిస్తున్నాను. నేను మూర్ఖునిగాను, తెలివి తక్కువ వ్యక్తిగాను, బలహీనుడిగాను మరియు గ్రుడ్డివాడిగా ఉన్నప్పటికీ, నువ్వు ప్రేమమయుడవని నాకు తెలుసు మరియు నాకున్న సమస్తాన్ని నీకు సమర్పించుకుంటున్నాను” అని ప్రార్థించాలి. ఈ విధంగా మీరు ప్రార్థన చేసిన వెంటనే, దేవుని కొరకు మీరు కలిగియున్న ప్రేమ బయటకు కనిపిస్తుంది. మీ హృదయములో ఎంతో సమాధానము పొందుకుంటారు. దీనినే దేవుని ప్రేమను అనుభవించడం అని అంటారు. మీరు అనుభవాన్ని పొందే కొలది, మీరు రెండుమార్లు విఫలమైనప్పటికీ, ఒకసారి విజయం పొందుకుంటారు, లేక ఐదు మార్లు విఫలమైనప్పటికీ, రెండుమార్లు జయాన్ని పొందుకుంటారు. ఈ విధంగా మీరు అనుభవాన్ని పొందుకుంటున్నప్పుడు, అపజయాలు మధ్యనే దేవుని ప్రేమను చూడగలుగుతారు మరియు మీలో ఎటువంటి కొరతను కలిగియున్నారో తెలుసుకోగలుగుతారు. అటువంటి సందర్భాలను మరల ఎదుర్కొన్నప్పుడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తపడి, ఆతురతను తగ్గించుకొని, తరచుగా ప్రార్థన చేయండి. అటువంటి సందర్భాలలో విజయాన్ని పొందే సామర్థ్యాన్ని క్రమేపి వృద్ధి చేసుకోవాలి. అలా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు, మీ ప్రార్థనలు కూడా చాలా ప్రభావితంగా మారుతాయి. ఈ సమయములో మీరు జయాన్ని పొందినట్లయితే, మీరు మీ అంతరంగములో కృతజ్ఞతా భావం కలిగియుంటారు. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీతో ఉన్నాడని మరియు పరిశుద్ధాత్మ సన్నిధి మిమ్మల్ని వదిలి పెట్టలేదనే అనుభూతిని కలిగియుంటారు. ఇలాంటప్పుడు మాత్రమే మీలో దేవుడు ఎలా కార్యము చేస్తాడనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ విధంగా ఆచరణాత్మకంగా జీవిస్తున్నప్పుడు, మీరు అనుభవాన్ని గడించే మార్గాన్ని పొందుకుంటారు. మీరు సత్యాన్ని ఆచరణలో పెట్టకపోయినట్లయితే, అప్పుడు మీరు మీలో పరిశుద్ధాత్ముని సన్నిధి లేనివారుగా ఉండిపోతారు. అయితే మీరు అటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుచున్నప్పుడు సత్యాన్ని ఆచరణలో పెట్టినట్లయితే, మీరు అంతరంగములో నొప్పించబడినప్పటికీ, పరిశుద్ధాత్ముడు మీతోనే ఉంటాడు, అప్పుడు మీరు ప్రార్థించిన ప్రతిసారి దేవుని సన్నిధిని అనుభవిస్తారు, దేవుని వాక్కులను అనుసరించే శక్తిని కలిగియుంటారు. మీ సహోదరి సహోదరులతో చేసే సహవాసములో మీ మనస్సాక్షికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సమాధానమును కలిగియుంటారు. ఈ విధంగా మీరు చేసిన వాటికి వెలుగును తీసుకు వస్తారు. ఇతరులు ఏమంటున్నారనే విషయాలను పట్టించుకోకుండా, దేవునితో సహజ సంబంధాన్ని కలిగియుంటారు, ఇతరుల వలన నిర్భంధించబడరు, అన్నటికంటే ముఖ్యంగా, మీరు హెచ్చయిన స్థాయిలో ఉంటారు. ఇందులో మీరు అనుసరిస్తున్న దేవుని వాక్కులు ప్రభావము చూపుతాయని తెలియజెప్పువారుగా ఉంటారు.
దేవుని శుద్ధీకరణ ఎంత ఎక్కువగా ఉంటుందో, అంతే ఎక్కువగా ప్రజల హృదయాలు దేవుణ్ణి ప్రేమిస్తాయి. వారి హృదయాలలో కలిగియున్న వేదన వారి జీవితాలకే ఎంతో ప్రయోజనకరము చేకూరుస్తుంది, వారు దేవుని ఎదుట ఎంతో ఎక్కువ సమాధానము కలిగి ఉంటారు, దేవునితో వారికున్న సంబంధము చాలా దగ్గరగా ఉంటుంది మరియు వారు దేవుని అత్యున్నత ప్రేమను మరియు ఆయన అత్యున్నత రక్షణను చూడగలుగుతారు. పేతురు ఇటువంటి శుద్ధీకరణను వందలాదిసార్లు ఎదుర్కొనియున్నాడు, యోబు అనేకమైన శ్రమల గుండా వెళ్ళాడు. మీరు దేవుని చేత పరిపూర్ణులుగా చేయబడాలనుకుంటే, మీరు కూడా వందలాదిసార్లు శుద్ధీకరణ ప్రక్రియలోకి వెళ్లక తప్పదు; ఈ ప్రక్రియ గుండా మీరు వెళ్ళినప్పుడే, ఇటువంటి పరిస్థితిలో నమ్మకముగా ఉన్నప్పుడే, మీరు దేవుని చిత్తాన్ని సంతృప్తిపరచగలుగుతారు మరియు దేవునిచేత పరిపూర్ణులుగా తీర్చబడతారు. శుద్ధీకరణ అనే ఏకైక విధానము ద్వారానే దేవుడు మనుష్యులను పరిపూర్ణులనుగా చేస్తాడు; శుద్ధీకరణ మరియు కఠోరమైన శ్రమలు మాత్రమే మనుష్యుల హృదయాలలో దేవుని కొరకు ఉన్న ప్రేమను వెలికి తీయగలుగుతాయి. ఎటువంటి శ్రమలు లేకుండా మనుష్యులెవరూ దేవుని పట్ల నిజమైన ప్రేమను కలిగి యుండలేరు; వారు అంతరంగమందు పరీక్షించబడకపోతే, వారు శుద్దీకరణకు లోబడక పోయినట్లయితే వారి హృదయాలు బయట ప్రపంచములో తేలుతూ ఉంటాయి. ఒకానొక నిర్దిష్ట సమయములో మీరు శుద్ధీకరణకు లోనైనప్పుడు మీరు మీలోని బలహీనతలను మరియు క్లిష్టతర సంగతులను చూడగలుగుతారు, మీరు ఎంత కొరతను కలిగియున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు మరియు మీరు ఎదుర్కునే అనేక సమస్యలను జయించలేకపోవుచున్నారని గ్రహిస్తారు. అంతేగాకుండా, మీ అవిధేయత ఎటువంటి స్థాయిలో ఉందనే విషయాన్ని చూడగలుగుతారు. ఇటువంటి కఠోర పరిస్థితులలోనే ప్రజలు తమ నిజ స్థితి ఎటువంటిదో నిజంగా గ్రహించగలుగుతారు; శ్రమలే మనుష్యులను పరిపూర్ణులుగా చేస్తాయి.
పేతురు తన జీవితములో వందలాదిసార్లు శుద్ధీకరణ ప్రక్రియను అనుభవించాడు మరియు అనేకమైన కఠోర అగ్ని పరీక్షల గుండా వెళ్ళాడు. ఈ శుద్ధీకరణ అనేది దేవుని మీద అతని అత్యున్నత ప్రేమకు పునాదిగాను మరియు అతని జీవిత కాలమంతటిలో అతి ప్రాముఖ్యమైన అనుభవంగాను మారింది. ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుణ్ణి ప్రేమించాలని తనకున్న సంకల్పం వల్లే అతను అత్యున్నత దేవుని ప్రేమను పొందగలిగాడు; అయితే, కీలకమైన విషయం ఏమిటంటే, అతను పొందిన శుద్ధీకరణ మరియు శ్రమలను బట్టియే దేవుని ప్రేమను పొందగలిగాడు. ఈ శ్రమలే దేవుని ప్రేమించే మార్గములో తనకు మార్గదర్శకంగాను మరియు చెరగని జ్ఞాపికగాను మారాయి. దేవుని ప్రేమించేటప్పుడు మనుష్యులు శుద్ధీకరణ శ్రమల గుండా వెళ్లకపోతే, వారి ప్రేమ అనేకమైన కల్మషాలతోను, వారి స్వంత ఇష్టా ఇష్టాలతోను నిండి ఉంటుంది; ఇటువంటి ప్రేమ సాతాను ఆలోచనలతో నిండి ఉంటుంది మరియు ప్రాథమికంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని అసమర్థమైన స్థితిలో ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించాలనే సంకల్పం కలిగియుండడం అనేది దేవుణ్ణి నిజంగా ప్రేమించడంతో సమానం కాదు. వారు తమ హృదయాలలో దేవుణ్ణి ప్రేమించడం కొరకేనని మరియు దేవుణ్ణి మెప్పించడం కొరకేనని ఆలోచించినప్పటికీ, వారి ఆలోచనలు భక్తిపూర్వకమైన ఆలోచనలుగా కనిపించి, ఇతరుల ఆలోచనలను తిరస్కరించినట్లుగా ఉన్నప్పటికీ, వారి ఆలోచనలన్నియు దేవుని ఎదుటికి తీసుకువచ్చినప్పటికీ, అటువంటి ఆలోచనలను దేవుడు మెచ్చడు, లేక అటువంటి ఆలోచనలను దేవుడు దీవించడు. మనుష్యులు సత్యాంశములను సంపూర్ణముగా అర్థము చేసుకోవడం, లేక వారు సత్యాలను తెలుసుకోవడం అనేది దేవుణ్ణి ప్రేమిస్తున్నారనుటకు సూచన కాదు. ఇలాంటివారు నిజంగా దేవుణ్ణి ప్రేమించువారుగా పరిగణించబడరు. శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళకుండా సత్యాలను మాత్రమే అర్థము చేసుకున్న మనుష్యులు తాము తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టని స్థితిలో ఉంటారు; శుద్ధీకరణలో మాత్రమే ఈ మనుష్యులు ఈ సత్యాల నిజమైన అర్థాన్ని తెలుసుకోగలరు. అప్పుడు మాత్రమే వారు తమ అర్థవంతమైన అంతర్గత స్థితిని బట్టి సంతోషిస్తారు. ఆ సమయములో వారు తిరిగి ప్రయత్నించినప్పుడు, వారు సత్యాలన్నిటినీ సరియైన విధంగా, దేవుని చిత్తానుసారంగా ఆచరణలో పెట్టగలుగుతారు; ఆ సమయములో వారి మానవ ఆలోచనలన్నీ తగ్గిపోతాయి, వారి మానవ సంబంధిత అవినీతియంతయూ తగ్గిపోతుంది మరియు వారి మానవ సంబంధిత భావోద్వేగాలన్నీ తగ్గిపోతాయి; ఆ సమయములో వారు కలిగియున్న ఆచరణాత్మకమైన జీవితమే దేవుని ప్రేమకు నిదర్శనము. దేవుని ప్రేమకు సంబంధించిన సత్యము యొక్క ప్రభావము అనేది జ్ఞానముతో మాట్లాడుట ద్వారానో లేదా మానసికంగా ఇష్టపడుట ద్వారానో కలిగింది కాదు, లేక కేవలం సత్యాన్ని అర్థము చేసుకోవడం ద్వారా కలిగింది కాదు. ఈ ప్రభావానికి మనుష్యులు వెల చెల్లించవలసియుంటుంది, వారు శుద్ధీకరణలో కఠోరమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి ప్రేమ పవిత్రంగాను, దేవుని హృదయానుసారమైనదిగాను మార్చబడుతుంది. మనిషి దేవుణ్ణి ప్రేమించాలనే విషయములో మనిషి తన స్వంత ఇష్టాలతోను లేక తనకున్న ఆసక్తితోను దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు మనిషిని బలవంతము చేయడము లేదు; ఆయన సేవ చేయడానికి సత్యాన్ని అనుసరించడం ద్వారా మరియు నమ్మకత్వము ద్వారా మాత్రమే దేవుణ్ణి నిజంగా ప్రేమించడం సాధ్యమవుతుంది. అయితే, మనిషి భ్రష్టత్వములో బ్రతుకుచున్నందున సత్యాన్ని అనుసరించలేకపోవుచున్నాడు, దేవునికి నమ్మకంగా సేవ చేయలేకపోవుచున్నాడు. అతడు దేవుని గురించి అత్యాసక్తితో అయి ఉంటాడు లేదా దేవుని గురించి ఆశ్రద్ధగా లేక నిర్లక్ష్యంగా అయినా ఉంటాడు; అతడు దేవుణ్ణి తీవ్ర స్థాయిలో ప్రేమిస్తాడు, లేక దేవుణ్ణి పూర్తిగా అసహ్యించుకుంటాడు. భ్రష్టత్వములో బ్రతుకుతున్న వారందరూ ఎల్లప్పుడూ ఈ రెండు పరిస్థితులకు మధ్యన జీవిస్తుంటారు. వారు వారి ఇష్టానుసారంగానే జీవిస్తూ, తాము చేస్తున్నది సరియే అని నమ్మకం కలిగియుంటారు. ఎన్నోమార్లు ఈ విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ, ఈ విషయమును గురించి పట్టించుకునే స్థితిలో ఉండరు. దాని ప్రాముఖ్యతను అర్థము చేసుకోవడములో వారు పూర్తిగా విఫలమయ్యారు. అందుచేత, వారు తమను తాము మోసము చేసుకునే విశ్వాసములో బ్రతుకుచున్నారు, దేవుణ్ణి ప్రేమించడమనేది తమ స్వంత ఇష్టముపై ఉంటుదనే భ్రమలో బ్రతుకుచున్నారు. చరిత్రనంతటిని తిరగతోడి చూసినప్పుడు, మానవాళి అభివృద్ధి చెందే కొలది, తరాలు మారే కోలది, మనిషి నుండి దేవుడు ఎదురుచూస్తున్న సంగతులు ఎక్కువవుతూ వచ్చాయి మరియు మనిషి తన వైపు తప్పనిసరిగా తిరగాలని అత్యధికమైన కోరికను ఆయన కలిగియున్నాడు. అదేసమయంలో, దేవుని గురించిన జ్ఞానము మనిషిలో అస్థిరంగాను, అస్పష్టంగాను మారింది. అదే సమయములోనే దేవుని విషయమై తనకున్న ప్రేమ ఎక్కువ అపవిత్రమయ్యింది. మనషి స్వభావ స్థితి మరియు తను చేసే ప్రతి క్రియ క్రమేపి దేవుని చిత్తానికి విరుద్దమైపోయాయి. ఇక మనిషి సాతాను చేత పూర్తిగా భ్రష్టుడైపోయాడు. ఇందుచేతనే, రక్షణకు సంబంధించి దేవుడు గొప్ప కార్యమును చేయవలసి వచ్చింది. దేవుడు మనిషి నుండి కోరుకుంటున్న వాటి విషయములో మనిషి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు మరియు దేవుని విషయమై తనకున్న ప్రేమ నానాటికి తగ్గిపోతూ వచ్చింది. సత్యముతో సంబంధము లేకుండ ప్రజలు అవిధేయతలో జీవిస్తున్నారు, మానవత్వము లేకుండా తమ జీవితాలను ఈడుస్తున్నారు; దేవుని ప్రేమ ఇసుమంతైనా వారిలో లేకపోవడమే కాకుండా, వారు అవిధేయతతోను మరియు వ్యతిరేకతతోను నిండియున్నారు. వారు ఇలాంటి పరిస్థితిలో ఉండి, దేవుని కొరకు గొప్ప ప్రేమను కలిగియున్నామని ఆలోచించినప్పటికీ, ఆయన పట్ల అనుకూలంగా నడుచుకొని కారణంగా, దేవుడు వారిని నమ్మడు. దేవుని పట్ల మనిషికున్న ప్రేమ ఎంత కలుషితమైనదో చాలా స్పష్టముగా విధితమైంది. మనిషికున్న బడవాతనమును బట్టో లేక మనిషి భక్తివలన చూపించే మంచితనమును బట్టో మనిషి విషయమై దేవుడు తనకున్న అభిప్రాయమును మార్చుకోడు. దేవుడు మనిషి వలె కాదు, ఆయన అన్నిటిని వివేచించగలడు: ఆయనను ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ప్రేమించట్లేదో ఆయనకు బాగా తెలుసు. మనిషి క్షణిక ప్రేరణల కారణంగా దేవుడు ఉత్సాహముతో తనలో తాను మైమరిచిపోకుండా, మనిషి నిజాయితీ మరియు ప్రవర్తనను బట్టి మనిషి పట్ల నడుచుకుంటాడు. ఈ ఆలోచనలకు మించి, దేవుడు దేవుడే. ఎందుకంటే, ఆయన హుందా, ఆయన ఆలోచనలు ఆయన కలిగియున్నాడు; మనిషి మనిషే. సత్యాన్ని వ్యతిరేకిస్తూ మనిషి చూపించే ప్రేమకు దేవుని తల కదల్చబడదు. దీనికి విభిన్నంగా, మనిషి చేసే ప్రతి పనికి దేవుడు తగిన విధంగా వ్యవహరిస్తాడు.
దేవుని పట్ల మనిషి కలిగియున్న స్వభావమును మరియు ధోరణిని చూచిన తరువాత, దేవుడు క్రొత్త కార్యమును చేసియున్నాడు. అదేమనగా, ఆయన పట్ల విధేయతను మరియు ఆయన జ్ఞానాన్ని కలిగియుండుటకు, ప్రేమను మరియు సాక్ష్యాన్ని కలిగియుండుటకు ఆయన మనిషికి అనుమతినిచ్చాడు. అందుచేత, మనిషి తప్పకుండ తన కొరకు దేవుడు ఇచ్చే శుద్దీకరణను, ఆయన తీర్పును, ఆయన వ్యవహరించు విధానాన్ని, ఆయన ఇచ్చే క్రమశిక్షణను అనుభవించి తీరాలి. ఇవన్నీ లేకుండా మనిషి దేవుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం, ఆయనను నిజంగా ప్రేమించడం మరియు ఆయనకు సాక్షిగా ఉండడం అసాధ్యం. మనిషిలో జరిగించబడే దేవుని శుద్దీకరణ ఒకే కోణములో జరిగించబడే పరిణామము కాదు గానీ అనేక కోణాలలో జరిగించబడే ప్రక్రియగా ఉంటుంది. ప్రజలు తాము కలిగియున్న సంకల్పాన్ని మరియు ప్రేమను దేవుని ద్వారా పరిపూర్ణము చేయబడే క్రమములో సత్యాన్ని వెదకువారి పట్ల మాత్రమే ఇటువంటి శుద్దీకరణ ప్రక్రియను దేవుడు జరిగిస్తాడు. దేవుని కొరకు ఆశ కలిగియుండు వారికి మరియు సత్యమును వెదకాలని ఆశపడు వారికి ఇటువంటి శుద్దీకరణ ప్రక్రియ కంటే ఏదీ అంత ఎక్కువ అర్థవంతమైనది కాదు, లేక ఏదీ అంత ప్రయోజనకరమైనది కాదు. దేవుడంటే దేవుడే గనుక మనిషికి దేవుని స్వభావము అంత సులభంగా అర్థము కాదు. అంతిమంగా, మనిషి స్వభావము వంటి స్వభావమును దేవుడు కలిగియుండడం అసాధ్యము. అందుచేత, ఆయన స్వభావమును కూడా మనిషి కలిగియుండడం అంత సులభము కాదు. సత్యము వారసత్వమును మనిషి సంపాదించుకోలేదు, ముఖ్యంగా సాతాను ద్వారా భ్రష్టు పట్టిన వారికి అంత సులభంగా అది అర్థము కాదు; మనిషిలో సత్యము లేదు, సత్యాన్ని ఆచరించాలనే సంకల్పము లేదు. అతను శ్రమపడకుండా, శుద్దీకరణ చెందకుండా, లేక తీర్పు తీర్చబడకుండా, తాను కలిగియున్న సంకల్పము పరిపూర్ణము చేయబడదు. మనుష్యులందరికీ శుద్దీకరణ ప్రక్రియ అనేది సహించలేనిది, స్వీకరించడానికి చాలా కఠినమైనదైనప్పటికీ, శుద్దీకరణ ప్రక్రియలో దేవుడు తన నీతి స్వభావమును మనిషికి బయలుపరుస్తాడు, మనిషి కొరకు ఆయన ఎటువంటి ఆలోచనలు కలిగియున్నాడో బహిరంగంగా తెలియజేస్తాడు, మరింత ఎక్కువ జ్ఞానోదయాన్ని అనుగ్రహిస్తాడు, మరింత ఎక్కువ క్రమశిక్షణలో నడిపిస్తాడు; వాస్తవాలకు మరియు సత్యానికి మధ్యనున్నటువంటి పోలిక ద్వారా ఆయనను గూర్చి, సత్యమును గూర్చి గొప్ప జ్ఞానాన్ని మనిషికి అందిస్తాడు, దేవుని చిత్తముపట్ల గొప్ప అవగాహనను అనుగ్రహిస్తాడు, అందుచేత దేవుని సత్యమైన పవిత్రమైన ప్రేమను కలిగియుండునట్లు మనిషికి గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. శుద్దీకరణలో దేవుడు కలిగియున్న లక్ష్యాలు ఇవే. మనిషిలో దేవుడు జరిగించే ప్రతి కార్యమునకు లక్ష్యాలు ఉంటాయి మరియు వాటికి ప్రాముఖ్యత ఉంటుంది; దేవుడు అర్థము లేని పనులు చేయడు లేదా మనిషికి ప్రయోజనము లేనటువంటి పనులు కూడా చేయడు. శుద్దీకరణ అంటే, దేవుని ఎదుటి నుండి మనుష్యులను తొలగించడం కాదు లేదా వారిని నరకంలో పడవేయుట అని అర్థం కాదు. శుద్దీకరణ అంటే, శుద్దీకరణ ప్రక్రియలో మనిషి స్వభావమును, తన ఉద్దేశాలను, తన పాత దృష్టి కోణాలను, దేవుని కొరకు కలిగియున్న తన ప్రేమను మరియు తన జీవితాన్ని సంపూర్ణముగా మార్చివేయడం అని అర్థం. శుద్దీకరణ అనేది మనిషి ఎదుర్కొనే నిజమైన పరీక్ష మరియు నిజమైన తర్ఫీదు యొక్క రూపము. శుద్దీకరణ ప్రక్రియలో మాత్రమే మనిషి ప్రేమ సహజ సిద్ధమైన పని తీరును అందిస్తుంది.