ఉపోద్ఘాతము
అనేకమంది ప్రజలు దేవుని నమ్ముతున్నప్పటికీ, కొద్దిమంది మాత్రమే దేవుని పట్ల విశ్వాసము అనగా ఏమిటి మరియు దేవుని చిత్తాన్ని అనుసరించడానికి వారు ఏమి చేయవలసి ఉన్నది అనే దానిని గ్రహిస్తారు. ఎందుకనగా, “దేవుడు” అనే పదానికి మరియు “దేవుని కార్యము” వంటి వాక్కులకు ప్రజలు సుపరిచితమైనప్పటికీ, దేవుడంటే వారు ఎరుగరు, అలాగే ఇప్పటికీ వారికి దేవుని కార్యము గురించి తెలియదు. అలాంటప్పుడు, దేవుని ఎరుగని వారందరూ తాము కలిగియున్న ఆయన విశ్వాసమందు కలవరపడుటలో ఆశ్చర్యమేమీ లేదు. దేవునిపై విశ్వాసాన్ని ప్రజలు ప్రాధాన్యతగా తీసుకోరు, ఎందుకంటే దేవుని నమ్మడము అనేది వారికి ఏమాత్రమూ తెలియనిది మరియు వారికి అస్సలు పరిచయమే లేనిది. అందువలన, వారు దేవుని ఆజ్ఞాపనలను పొందలేకపోతున్నారు. మరొక మాటలో చెప్పాలంటే, ప్రజలు దేవుని ఎరుగక, మరియు ఆయన కార్యమును గ్రహించకపోతే, వారు దేవునిచే వాడబడుటుకు తగినవారు కాదు, ఇంకా వారు దేవుని చిత్తాన్ని కుడా సంతృప్తిపరచలేరు. “దేవునిపై నమ్మకము” అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడము; ఇది దేవునిపై విశ్వాసము గూర్చిన అతి సుళువైన భావన. పైగా, దేవుడు ఉన్నాడని నమ్మడము; అనేది ఒక దృఢమైన మతపరమైన ఆధారాలతో కూడిన సాధారణ విశ్వాసమే గానీ, నిజముగా దేవుని నమ్మడము వంటిది కాదు. దేవునిపై నిజమైన విశ్వాసము అంటే ఇవే: సమస్త విషయాలపై దేవుడు సర్వభౌమాదికారాన్ని కలిగి ఉన్నాడనే నమ్మకమునకు ఆధారముగా, ఒకరు ఆయన వాక్యమును మరియు ఆయన కార్యమును తెలుసుకొని, ఒకని దుర్నీతి ప్రక్షాళన చేయబడి, దేవుని చిత్తమును సంతృప్తిపరచుటను బట్టి దేవుని తెలుసుకోగలడు. ఈ విధమైన ప్రయాణమును మాత్రమే “దేవునిపై విశ్వాసము” అని పిలుస్తారు. ఇప్పటికీ ప్రజలు తరచుగా దేవునిపై నమ్మకమును ఒక అల్పమైన మరియు నిష్ప్రయోజనమైన విషయముగా చూస్తారు. దేవుని విశ్వసించే ప్రజలు ఈ విధముగా దేవునిపై నమ్మకము అర్ధాన్ని పోగొట్టుకున్నారు, మరియు వారు అంతము వరకు దేవుని నమ్మినప్పటికీ, వారు చెడు మార్గములో నడచుకున్నందున, వారు దేవుని అంగీకారమును పొందలేరు. అక్షరములను బట్టి దేవుని నమ్మేవారు మరియు మాయా సిద్దాంతమును నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. దేవునిపై విశ్వాసపు భావము వారియందు లేదని వారికి తెలియదు, మరియు వారు దేవుని అంగీకారమును పొందుకొనలేరు. అయినప్పటికీ, వారు రక్షణ యొక్క ఆశీర్వాదము మరియు సమృద్దియైన కృప కొరకు దేవుని ప్రార్థిస్తారు. మనము ఇకపై ఇలాంటివి ఆపివేసి, మన హృదయాలను నిమ్మళపరచి: భూమిపై దేవుని విశ్వసించడము అంత సులభమైన విషయమా? దేవుని విశ్వసించడము అంటే దేవుని నుండి కృపను పొందుకోవడం తప్ప మరేమీ కాదా? దేవుని ఎరుగకుండా ఆయనను విశ్వసించే ప్రజలు లేక దేవుని నమ్ముతూనే ఆయనను విరోధించే వారు దేవుని చిత్తాన్ని నిజముగా నెరవేర్చగలరా? అని మనల్ని మనము ప్రశ్నించుకుందాము.
దేవుడు మరియు మానవుని గురించి సమముగా మాట్లాడలేము. ఆయన స్వభావము మరియు ఆయన కార్యము మానవునికి నిగూఢమైనవి మరియు అగోచరములై ఉన్నాయి. దేవుడు తన కార్యమును వ్యక్తిగతముగా చేయకుండా మరియు మానవ లోకములో ఆయన వాక్యములు చెప్పకపోయినట్లయితే, ఇక మానవుడు ఎన్నటికీ దేవుని చిత్తాన్ని గ్రహించగలిగేవాడు కాదు. ఇంకా, తమ సంపూర్ణ జీవితాలను దేవునికి అర్పించినవారు కూడా దేవుని అంగీకారమును పొందలేరు. ఒకవేళ దేవుడే గనుక కార్యము చేయడానికి పూనుకొనకపోతే, మానవుడు ఎంత గొప్పగా పనిచేసినా, అదంతా నిష్ప్రయోజనమే, ఎందుకంటే దేవుని తలంపులు మానవుని ఆలోచనల కంటే ఎల్లపుడూ ఉన్నతమైనవి, మరియు దేవుని జ్ఞానము మానవుని ఊహకు మించినదై ఉన్నది. కాబట్టి ఎవరైతే దేవుని మరియు ఆయన కార్యమును “పూర్తిగా అర్ధము చేసుకున్నాము” అని చెప్పుకుంటారో వారిని బాగా పిచ్చిపట్టిన వారని నేను అంటాను; వారందరూ అహంకారులు మరియు అజ్ఞానులు. దేవుని కార్యమును మానవుడు నిర్దేశించకూడదు; అంతేగాక, దేవుని కార్యమును మానవుడు నిర్దేశించలేడు. దేవుని దృష్టిలో, మానవుడు అల్పమైన చీమ వంటివాడు; మరి దేవుని కార్యమును మానవుడు ఎలా గ్రహించగలడు? “దేవుడు ఇక్కడ కార్యము చేయడు లేక అలా చేస్తాడు,” లేదా “దేవుడు ఇది లేక అది,” అని ప్రగల్భాలు పలుకడానికి ఇష్టపడేవారు—వారు అహంకారముతో మాట్లాడటము లేదా? శరీర సంబంధమైన మానవుడు సాతానుచే చెడగొట్టబడ్డాడు. దేవుని ఎదిరించడమే మానవజాతి స్వభావము. మానవజాతి దేవునితో సరితూగలేదు, దేవుని కార్యమునకు మానవజాతి సలహా ఇవ్వాలని ఆశించడం అసంభవము. దేవుడు మానవుని ఎంతవరకు నడిపిస్తాడో, అది దేవుని స్వంత కార్యమై ఉన్నది. మానవుడు కేవలం మట్టి మాత్రమే గనుక ఏమి మాట్లాడకుండా లేక అభిప్రాయాన్ని తెలియజేయకుండా మానవుడు అంకితమవ్వడం ఉత్తమము. దేవుని కనుగోనటం మన ఉద్దేశ్యము కాబట్టి, దేవుని పరిగణన కొరకు ఆయన కార్యముపై మన తలంపులను మనము అతిక్రమించకూడదు. అది మనలను క్రీస్తు విరోధులుగా చేయదా? అటువంటి ప్రజలు దేవుని ఎలా విశ్వసిస్తారు? దేవుడు ఉన్నాడు అని మనము నమ్ముచున్నాము కాబట్టి, ఆయనను సంతృప్తి పరచాలని మరియు ఆయనను చూడాలను మనము ఆశిస్తున్నాము కాబట్టి, మను సత్య మార్గమును వెదకాలి మరియు దేవునితో ఏకీభవించే మార్గము కొరకు ఎదురు చూడాలి. మనము ఆయనకు బలమైన వ్యతిరేక పక్షముగా నిలవకూడదు. అటువంటి పనుల వల్ల ఉపయోగం ఏమిటి?
నేడు, దేవుడు నూతన కార్యము చేశాడు. బహుశా ఈ మాటలను నీవు అంగీకరించలేక పోవచ్చు, మరియు అవి నీకు విచిత్రముగా అనిపించవచ్చు, కానీ నీ స్వాభావికతను బహిర్గతం చేయవద్దని నేను సూచిస్తాను, ఎందుకంటే దేవుని యెదుట నీతి కొరకు నిజముగా ఆకలిదప్పులు గలవారు మాత్రమే సత్యమును స్వతంత్రించుకొంటారు, మరియు నిజమైన భక్తి గలవారు మాత్రమే జ్ఞానోదయము పొందుకొని ఆయనచే నడిపించబడతారు. జగడములు మరియు వివాదములతో కాకుండా, శాంతి సమాధానములతో సత్యాన్ని అన్వేషించడం వలన ఫలితాలు లభిస్తాయి. “నేడు, దేవుడు నూతన కార్యము చేశాడు” అని చెప్పానంటే, దేవుడు శరీరానికి తిరిగి వస్తున్నాడని నేను సూచిస్తున్నాను. బహుశా ఈ మాటలు నిన్ను తొందర పెట్టవు; బహుశా నీవు వాటిని తృణీకరించవచ్చు; బహుశా అవి నీకు గొప్ప ఆసక్తిని కూడా కలిగించవచ్చు. ఏదేమైనా, దేవుని ప్రత్యక్షత కొరకు నిజముగా ఆరాటపడే వారందరూ ఈ సత్యాన్ని గ్రహించి ముందస్తు నిర్ణయాలకు బదులు సునిశితమైన పరిశీలన చేయాలని ఆశిస్తున్నాను; బుద్ధిమంతుడు చేయవలసిన పని ఇదే.
దేవుని మానవ అవతారమైన వాడు దేవుని స్వభావాన్ని కలిగి ఉంటాడు, దేవుని మానవ అవతారమైన వాడు దేవుని పరిభాషను కలిగి ఉంటాడు; అనే సంగతి గురించి విచారణ చేయడము కష్టము కాదు, కానీ మనలో ప్రతి ఒక్కరూ ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు శరీరముగా మారినందున, ఆయన చేయాలనుకున్న కార్యమును ఆయన ముందుకు నడిపిస్తాడు, దేవుడు శరీరముగా మారినందున, ఆయన ఏమైయున్నాడో తెలియజేస్తాడు, మరియు మానవునికి సత్యాన్ని అందించి, అతనికి జీవాన్ని ప్రసాదించి, అలాగే తనకు మార్గాన్ని సూచిస్తాడు. దేవుని స్వభావము లేని శరీరము ఖచ్చితముగా శరీరధారి అయిన దేవుడు కాదు; ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇది దేవుని అవాతార శరీరమా కాదా అని మానవుడు తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు అతడు ఆయన వ్యక్తపరిచే స్వభావము మరియు ఆయన మాట్లాడే మాటలను బట్టి ధృవీకరించుకోవాలి. అనగా, ఇది దేవుని అవతార శరీరమా కాదా మరియు ఇది నిజమైన మార్గమా కాదా అని ధృవీకరించాలంటే, ఎవరైనా ఆయన స్వభావము ఆధారముగానే వేరుచేయాలి. కాబట్టి, ఇది దేవుని అవతారమైన శరీరమా కాదా అని నిర్ణయించడములో, బాహ్య రూపము కంటే, ఆయన స్వభావము (ఆయన కార్యము, ఆయన వాక్కులు, ఆయన గుణము, ఇంకా అనేక కోణాలు), చాలా కీలకమై ఉన్నది. మానవుడు ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే పరిశీలించి, ఫలితముగా ఆయన స్వభావాన్ని విస్మరిస్తే, మానవుడు భ్రమపడ్డాడని మరియు అజ్ఞాని అని కనుపరచబడుతుంది. బాహ్య రూపము స్వభావాన్ని నిర్ణయించదు; అంతేకాదు, దేవుని కార్యము మానవుని తలంపులకు అనుగుణముగా ఎన్నటికి ఉండదు. యేసయ్య బాహ్య రూపము మానవుని ఉద్దేశ్యాలకు విరుద్ధముగా లేదా? ఆయన ముఖ వైఖరి మరియు వస్త్రాలు ఆయన నిజమైన గుర్తింపును ఎందుకు చూపలేకపోయాయి? ఆదిమ పరిసయ్యులు యేసును ఖండితముగా విరోధించలేదు, కారణం వారు కేవలం ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే చూసి, లేక ఆయన నోటి మాటలను హృదయానికి తీసుకోలేదా? దేవుని ప్రత్యక్షతను అన్వేషించే ప్రతి సహోదరుడు మరియు సహోదరి చరిత్ర విషాదాన్ని పునరావృతం చేయకూడదు అనేది నా ఆశ. ఆధునిక కాలపు పరిసయ్యులుగా మరియు దేవుని మరలా సిలువకు దిగగొట్టే వారిగా మీరు మారకూడదు. దేవుని రాకడను మీరు ఎలా స్వాగతించాలో జాగ్రత్తగా పరిశీలించాలి మరియు సత్యమునకు లోబడే వ్యక్తిగా ఎలా ఉండాలి అనే దాని పట్ల మీరు స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. మేఘారూఢుడై యేసు తిరిగి రాబోతున్నాడని ఎదురు చూసే ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మన ఆత్మీయ నేత్రాలను శుభ్ర పరుచుకోవడానికి వాటిని మనము తుడవాలి, మరియు అతిశయోక్తిపూర్వకమైన కల్పన యొక్క మాటల్లో చిక్కుకొనకూడదు. మనము దేవుని ఆచరణాత్మకమైన కార్యము గురించి యోచించాలి, మరియు దేవుని ఆచరణాత్మకమైన అంశాన్ని పరిశీలించాలి. ప్రభువైన యేసు, మేఘారూఢుడై, మీ మధ్యంలో అకస్మాత్తుగా దిగివచ్చి, మరియు ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో తెలియని వారు, ఆయన ఎన్నడూ ఎరుగని మరియు చూడని వారైన మిమ్మల్ని తీసుకెళ్ళే రోజు కొరకు ఎల్లప్పుడూ నిరీక్షిస్తూ, పగటి కలలలో మిమ్మల్ని మీరు దూరము చేసుకొనకండి లేక కోల్పోకండి. ఆచరణాత్మకమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది!
నీవు ఈ పుస్తకాన్ని పరిశోధనా ఉద్దేశ్యముతో, లేక అంగీకార మనస్సుతో తెరిచి ఉండవచ్చు; నీ భావము ఏమైనప్పటికీ, నీవు చివరి వరకు చదువుతావని, అంత తేలికగా ప్రక్కన పెట్టవని నేను ఆశిస్తున్నాను. బహుశా, ఈ మాటలు చదివిన తరువాత, నీ భావము మారవచ్చు, కానీ అది నీ ప్రేరణ మరియు అవగాహన స్థాయి మీద ఆధారపడి ఉన్నది. ఏదేమైనా, ఇక్కడ, నీవు తెలుసుకోవలసిన విషయము ఒకటి ఉన్నది; దేవుని వాక్యాన్ని మానవుని మాటగా మార్చలేము, ఇంకా మానవుని మాటను దేవుని వాక్యముగా ఎవడూ చేయలేడు. దేవుని చేత వాడబడిన మానవుడు అవతార మూర్తి అయిన దేవుడు కాదు మరియు అవతార మూర్తి అయిన దేవుడు దేవుని చేత వాడబడిన మానవుడు కాదు. ఇందులో, ప్రాముఖ్యమైన వ్యత్యాసము ఉన్నది. బహుశా, ఈ మాటలు చదివిన తరువాత, వాటిని మీరు మానవుడు పొందిన జ్ఞానోదయము మాత్రముగానే కాక దేవుని వాక్యాలుగా గుర్తించరు. అలాంటప్పుడు, నీవు అజ్ఞానముతో అంధుడు అవుతావు. దేవుని వాక్యాలు మానవుడు పొందుకున్న జ్ఞానోదయము వంటిదిగా ఎలా ఉంటుంది? శరీరధారి అయిన దేవుని మాటలు ఒక నూతన యుగానికి తెరతీశాయి, సమస్త మానవజాతిని నడిపిస్తాయి, మర్మములను బయలుపరుస్తాయి, మరియు నూతన యుగములో మానవుడు వెళ్ళవలసిన దిశను కనుపరుస్తాయి. మానవుడు పొందిన జ్ఞానోదయము ఆచరణ మరియు జ్ఞానమునకు చెందిన సాధారణ సూచనలు. ఇది మానవజాతి అంతటినీ నూతన యుగములోనికి నడిపించదు మరియు దేవుని మర్మాలను బయలుపరచదు. అంతా చెప్పడము పూర్తయ్యాక, దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. దేవుడు దైవ స్వభావమును కలిగి ఉన్నాడు, మానవుడు మానవ స్వభావమును కలిగి ఉన్నాడు. ఒకవేళ మానవుడు దేవుని పలికిన మాటలను పరిశుద్ధాత్ముని సాధారణ ఉపదేశముగా భావించి, అపోస్తలులు మరియు ప్రవక్తల మాటలను దేవుడు వ్యక్తిగతముగా పలికిన మాటలుగా తీసుకుంటే, అది మానవుని పొరపాటు అవుతుంది. ఏదేమైనప్పటికీ, నీవు తప్పు ఒప్పును కలుపకూడదు, లేక అధికమైన దానిని అల్పముగా, లేక ఉన్నతమైన దానిని నిష్ప్రయోజనముగా చేయకూడదు; ఏదేమైనా సరే, నీవు సత్యమని ఎరిగిన దానిని నీవు ఎన్నటికి తిరస్కరించకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరూ సమస్యలను సరైన దృష్టితో చూడాలి, అలాగే దేవుని నూతన కార్యము మరియు ఆయన నూతన వాక్యములను ఆయన సృజించిన వాని దృష్టిని బట్టి అంగీకరించాలి; లేకపోతే, వారు దేవునిచే బహిష్కరించబడతారు.
యెహోవా కార్యము తరువాత, మానవుల మధ్య ఆయన కార్యము జరిగించడానికి యేసు శరీరముగా మారాడు. ఆయన కార్యము ఏకాంతముగా జరిగించబడలేదు, కానీ యెహోవా యొక్క కార్యము మీద నిర్మించబడినది. ధర్మశాస్త్ర కాలాన్ని ఆయన ముగించిన తరువాత, నూతన యుగము కొరకు దేవుడు చేసిన కార్యము ఇది. అదే విధముగా, యేసయ్య కార్యము సమాప్తమైన తరువాత, తదుపరి యోగము కొరకు ఆయన కార్యమును దేవుడు కొనసాగించాడు, ఎందుకంటే, దేవుని సమస్త నిర్వహణ ఎల్లపుడూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. పాత కాలము గతించినప్పుడు, దాని స్థానములో నూతన కాలము చేర్చబడుతుంది, మరియు పాత కార్యము పూర్తిగా ముగిసిన తరువాత, దేవుని నిర్వహణను కొనసాగించడానికి నూతన కార్యము ఉంటుంది. ఇది యేసయ్య కార్యమును అనుసరిస్తున్న, శరీరధారి అయిన దేవుని రెండవ అవతారము. వాస్తవానికి, ఈ అవతారము తనకు తానుగా ఏర్పడలేదు; ఇది ధర్మశాస్త్ర కాలము తరువాతి కార్యపు మూడవ దశ అయిన కృపా కాలము. దేవుని కార్యము నూతన దశను ప్రారంభించిన ప్రతిసారీ; ఎప్పుడూ ఒక నూతన ఆరంభము ఉంటుంది మరియు అది ఎల్లప్పుడూ ఒక నూతన యుగాన్ని తెస్తుంది. అలాగే దేవుని స్వభావములో, ఆయన కార్యము చేయు విధానములో, ఆయన కార్యము చేసే ప్రదేశములో, మరియు ఆయన నామములో కూడా తగిన మార్పులు ఉంటాయి. నూతన యుగములోని దేవుని కార్యమును అంగీకరించడము కష్టము అనుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయనను మానవుడు ఎలా వ్యతిరేకించినా గానీ, దేవుడు ఎల్లప్పుడూ తన కార్యము చేస్తూనే ఉంటాడు, అలాగే ఎల్లప్పుడూ సమస్త మానవజాతిని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. యేసు మానవ లోకములోనికి వచ్చినప్పుడు, ఆయన ధర్మశాస్త్ర కాలమును ముగించి కృపా కాలములో ప్రవేశించాడు. అంత్య దినములలో, దేవుడు మరోసారి శరీరధారిగా మారాడు, మరియు ఈ అవతారముతో ఆయన కృపా కాలమును ముగించి రాజ్య కాలమునకు నాంది పలికాడు. దేవుని రెండవ శరీరధారణను అంగీకరించగలిగిన వారందరూ రాజ్య కాలములోనికి నడిపించబడతారు, అంతేగాక దేవుని నడిపింపును స్వయముగా అంగీకరించగలుగుతారు. యేసయ్య మానవుని మధ్య ఎక్కువా కార్యము చేసినప్పటికీ, ఆయన మానవుని మరియు అతని దుర్నీతి స్వభావమంతటినీ వదిలించుకోలేదు; ఆయన మానవుని పాప పరిహారార్ధ బలిగా మారి సమస్త మానవాళి విమోచనను మాత్రమే సంపూర్తి చేశాడు. సాతాను ప్రభావము నుండి మానవుని పూర్తిగా రక్షించడానికి, యేసు పాప పరిహారార్ధ బలిగా మారి, మానవ పాపాలను భరించవలసి వచ్చిందని మాత్రమే కాదు గానీ, తన దుష్ట సంబంధమైన దుర్నీతి స్వభావము నుండి మానవుని పూర్తిగా విడిపించడానికి దేవుడు ఇంకా గొప్ప కార్యము చేయవలసి వచ్చింది. కాబట్టి, మానవుడు ఇప్పుడు తన పాపములనుండి క్షమాపణ పొందాడు, మానవుని నూతన యుగములోనికి నడిపించడానికి దేవుడు శరీరధారిగా తిరిగివచ్చు, శిక్ష మరియు తీర్పు కొరకైన కార్యమును ఆరంభించాడు. ఈ కార్యము మానవుని ఉన్నతమైన స్థాయికి తోడుకొని వచ్చింది. ఆయన ఆధిపత్యమునకు లోబడిన వారందరూ ఉన్నతమైన సత్యాన్ని అనుభవిస్తారు మరియు గొప్ప ఆశీర్వాదములను పొందుకుంటారు. వారు నిశ్చయముగా వెలుగులో జీవిస్తూ, వారు సత్యమును, మార్గమును మరియు జీవమును పొందుకుంటారు.
ఒకవేళ ప్రజలు కృపా కాలములోనే చిక్కుకుపోయి ఉంటే, వారు ఎన్నటికీ దేవుని సహజ స్వభావాన్ని తెలుసుకునేవారు కాదు, మరియు వారి దుర్నీతి స్వభావము నుండి విడుదల పొందేవారు కాదు. ప్రజలు ఎల్లప్పుడూ సమృద్ది అయిన కృపలో జీవిస్తూ, దేవుని తెలుసుకోవడానికి లేక దేవుని సంతృప్తి పరచడానికి అనుమతించే జీవ మార్గమును కలిగి లేకపోతే, ఆయనపై వారికున్న విశ్వాసముతో వారు ఎప్పటికీ ఆయనను నిజముగా పొందలేరు. ఈ విధమైన విశ్వాసము నిజముగా దయనీయమైనది. నీవు ఈ పుస్తకం చదవడం పూర్తి చేసిన తరువాత, రాజ్య కాలములో శరీరధారి అయిన దేవుని కాయము ప్రతి దశను నీవు గ్రహిస్తున్నపుడు, అనేక సంవత్సరాలుగా నీకున్న కోరికలు చివరికి నెరవేరాయి అనే భావన నీకు కలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆయనను ముఖాముఖిగా చుశాననే భావన నీకు కలుగుతుంది; అప్పుడు మాత్రమే ఆయన ముఖ దర్శనము నీకు కలిగింది, ఆయన స్వకీయమైన వాక్కులు విన్నావు, ఆయన కార్యపు జ్ఞానమును అభినందించావు, అలాగే ఆయన ఎంత యదార్ధవంతుడో మరియు సర్వశక్తిమంతుడో నిజముగా గ్రహించావు. గత కాలములలోని ప్రజలు ఎన్నడూ చూడని మరియు పొందని సంగతులను నీవు పొందినట్లు భావిస్తావు. ఈ సమయమందు, దేవునియందు విశ్వాసముంచడం అనగా ఏమిటి మరియు దేవుని చిత్తానికి అనుగుణముగా ఉండటము అంగ ఏమిటో నీవు స్పష్టముగా తెలుసుకుంటావు. నిజానికి, గతానికి చెందిన అభిప్రాయాలను నీవు అంటిపెట్టుకుని, దేవుని యొక్క ద్వితీయ శరీరధారణను తిరస్కరించినా లేక నిరాకరించినా, అప్పుడు నీవు ఏమీ పొందకుండా రిక్త హస్తాలతో మిగిలిపోతావు, అలాగే చివరికి దేవుని వ్యతిరేకించినందుకు గానూ నీవు దోషిగా ప్రకటించబడతావు. సత్యమునకు విధేయులై మరియు దేవుని కార్యమునకు లోబడువారు మాత్రమే ద్వితీయ శరీరధారి అయిన దేవుడు—సర్వ శక్తిమంతుని నామములో చేర్చబడతారు. వారు దేవుని వ్యక్తిగత నడిపింపును అంగీకరించి, ఇంకా ఉన్నతమైన సత్యాలు అలాగే నిజమైన జీవాన్ని పొందగలరు. గతములోని ప్రజలు మునుపెన్నడూ చూడని దర్శనమును వారు చూస్తారు: “ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను” (ప్రకటన 1:12-16). ఈ దర్శనము దేవుని సంపూర్ణ స్వభావపు పరిభాష, మరియు ఆయన సంపూర్ణ స్వభావము యొక్క పరిభాషే, ఆయన ప్రస్తుత అవతారమందున్న దేవుని కార్యపు వ్యక్తీకరణ అయి ఉన్నది. శిక్షలు మరియు తీర్పుల ప్రవాహాలలో, మనుష్య కుమారుడు తన సహజ స్వభావమును వాక్యముల భావముల ద్వారా వెల్లడిపరుస్తాడు, ఆయన శిక్షలను మరియు తీర్పులను అంగీకరించే వారందరికీ మనుష్య కుమారుని వాస్తవ ముఖాన్ని చూడటానికి అనుమతిస్తాడు, ఇది యోహాను చూసిన మనుష్య కుమారుని ముఖపు నిజమైన వర్ణన అయి ఉన్నది. (నిజానికీ, దేవుని కార్యమును అంగీకరించని వారికి రాజ్య కాలములో ఇవేవీ కనిపించవు.) మానవ భాషను ఉపయోగించి దేవుని నిజమైన ముఖమును వర్ణించలేము, కాబట్టి మానవునికి తన నిజమైన ముఖమును చూపించడానికి దేవుడు తన సహజమైన స్వభావమును వెల్లడిచేసే భావాలను ఉపయోగిస్తాడు. దేవుడు చాలా గొప్పవాడు మరియు మానవ భాషను ఉపయోగించి ఆయనను పూర్తిగా వర్ణించలేము కాబట్టి, మనుష్య కుమారుని సహజ స్వభావాన్ని అభినందించిన వారందరూ మనుష్య కుమారుని నిజమైన ముఖాన్నిచూశారని చెప్పవచ్చు. రాజ్య కాలములో దేవుని కార్యపు ప్రతి దశను మానవుడు తెలుసుకున్న దీపస్తంభాల మధ్య ఉన్న మనుష్య కుమారుని గురించి యోహాను మాట్లాడిన మాటల వాస్తవ అర్ధము అతడు గ్రహిస్తాడు: “ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను; ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను”. ఆ సమయానికి, ఇంతగా చెప్పబడిన ఈ సాధారణ శరీరము నిశ్చయముగా ద్వితీయ శరీరధారి అయిన దేవుడు అని సందేహాలన్నింటికీ అతీతముగా నీవు తెలుసుకుంటావు. అంతేగాక, నీవు ఎంత ఆశీర్వదించబడ్డావో తెలుసుకుంటావు, అలాగే నీకు నీవే గొప్ప అదృష్టవంతునిగా భావిస్తావు. ఈ ఆశీర్వాదము పొందాలని నీవు ఆశపడటంలేదా?
ఈ పుస్తకము యొక్క మొదటి సంపుటి “ఆది యందు క్రీస్తు ప్రకటనలు”. ఈ వాక్యాలు కృపా యుగపు అంతము నుండి రాజ్య యుగపు ఆరంభము వరకూ మధ్య గల మార్పులను సూచిస్తున్నాయి. మరియు అవి సంఘాలకు మనుష్య కుమారుని గురించి పరిశుద్దాత్ముని బహిరంగ సాక్ష్యములై ఉన్నవి. అవి “సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక”. అని ప్రకటన గ్రంధములోని వాక్యముల నెరవేర్పు అయి ఉన్నది. ఈ వాక్యాలు రాజ్య యుగపు ఆరంభములో దేవుడు మొదలు పెట్టిన కార్యాపు తొలి దశను సూచిస్తున్నాయి. ఈ పుస్తకములోని రెండవ సంపుటి మనుష్య కుమారుడు తనని బహిర్గతపరుచుకున్న తర్వాత స్వయంగా మాట్లాడిన మాటలతో కూడి ఉన్నాయి. అది పరిపరి విధాలైన వాక్కులు మరియు వాక్యాలు, ప్రవచనాలు వంటివి, ప్రత్యక్షతను గూర్చిన మర్మాలు, మరియు జీవ మార్గము వంటి వాటిని గొప్ప విషయ సమ్మేళనమై ఉన్నది—వాటిలో రాజ్య భవిష్యత్తును గూర్చిన అంచనాలు, దేవుని నిర్వహణా ప్రణాళిక ప్రత్యక్షతలను గూర్చిన మర్మాలు, మానవ స్వభావము యొక్క విశ్లేషణ, ప్రసంగాలు మరియు హెచ్చరికలు, కఠినమైన తీర్పులు, హృదయపూర్వకమైన ఓదార్పు మాటలు, జీవితమును గురించిన చర్చ, మరియు ప్రవేశమును గూర్చిన సంభాషణ, మొదలైనవి ఉన్నాయి. క్లుప్తంగా, దేవుడు ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడు, అలాగే దేవుని స్వభావము వంటివన్నీ ఆయన కార్యము మరియు ఆయన వాక్యములందు వెల్లడిచేయబడ్డాయి. శిక్ష మరియు తీర్పు ద్వారా ఆయన స్వభావాన్ని వెల్లడి చేయడమే ప్రస్తుతము శరీరధారిగా ఉన్న దేవుని కార్యమై ఉన్నది. ఈ పునాది మీద నిర్మించడాన్ని బట్టి, ఆయన మానవునికి మరింత సత్యాన్ని అందించి అలాగే తనకు మరిన్ని ఆచరణ మార్గాలను సూచిస్తాడు, తద్వారా మానవుని జయించడం మరియు తన దుర్నీతి స్వభావము నుండి అతని రక్షించడం అనే ఆయన లక్ష్యాలు నెరవేర్చడం. రాజ్య కాలములో దేవుని కార్యము వెనక ఉన్నవన్నీ ఇవే. నీవు నూతన యుగములో ప్రవేశించాలని ఆశ పడుచున్నావా? నీ దుర్నీతి స్వభావమును వదిలించుకోవాలని నీవు ఆశిస్తున్నావా? ఉన్నతమైన సత్యాన్ని నీవు పొందగోరుచున్నావా? మనుష్య కుమారుని నిజమైన ముఖాన్ని చూడాలని నీవు కోరుచున్నావా? ఈ జీవితము అర్థవంతమైనది కావాలని ఆశిస్తున్నావా? దేవుని చేత పరిపూర్ణ పరచబడాలని నీవు కోరుచున్నావా? అయితే మరి యేసయ్య రాకడను నీవు ఎలా స్వాగతిస్తావు?