మతపరమైన పరిచర్యను తప్పక ప్రక్షాళన చేయాలి
విశ్వమంతటిలో దేవుడు తన పని ప్రారంభించిన దగ్గర నుండి, తనకు సేవ చేయడానికి ఆయన అనేకమందిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. అన్ని జీవన వృత్తుల నుండి ఆయన వీరిని ఎంచుకున్నాడు. ఆయన చిత్తాన్ని తృప్తిపర్చి, భూమ్మీద ఆయన కార్యాన్ని సాఫీగా చేయడమే ఆయన ఉద్దేశం. ఆయనను సేవించడానికి మనుష్యులను ఎన్నుకోవడంలో ఆయన లక్ష్యం ఇదే. దేవుణ్ణి సేవించే ప్రతి ఒక్కరూ ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఈ పని వలన దేవుని జ్ఞానం, సర్వశక్తి, భూమ్మీద ఆయన పని సూత్రాలు మనుష్యులకు మరింత ఎక్కువ స్పష్టంగా కనిపిస్తాయి. నిజానికి, దేవుడు తన పని పూర్తి చేయడానికి, మనుష్యులతో మమేకం కావడం ద్వారా, వారు తన పని గురించి మరింత స్పష్టంగా తెలుసుకునేలా చేయడానికి ఈ భూమ్మీదకు వచ్చాడు. మీకు, అంటే, ఇక్కడున్న సమూహంలోని మీకు ఆచరణీయ దేవుణ్ణి సేవించే భాగ్యం ఈరోజు కలిగింది. ఇది మీకొక వెలకట్టలేని ఆశీర్వాదం—నిజంగా మీరు దేవుని చేత లేపబడ్డారు. ఆయన్ని సేవించడానికి ఒక మనిషిని ఎంచుకోవడంలో, దేవునికి తన స్వంత సూత్రాలున్నాయి. ప్రజలు అనుకుంటున్నట్లు, దేవుణ్ణి సేవించడం కేవలం ఒక ఆరాటం మాత్రమే కాదు. నేడు దేవునికి సేవ చేసేవారందరూ దేవుని మార్గదర్శనం, పరిశుద్ధాత్ముని కార్యము ఉండటం వలనే అలా చేయగలుగుతున్నారని మీరు చూడగలరు. ఎందుకంటే, వాళ్ళు సత్యాన్ని వెదికేవారు. దేవుణ్ణి సేవించే వారందరికీ ఉండాల్సిన కనీస లక్షణాలు ఇవి.
దేవుణ్ణి సేవించడం సులువైన పని కాదు. అనైతిక స్వభావములో మార్పు లేని వారెవరూ దేవుని సేవించలేరు. దేవుని మాటలు చేత మీ స్వభావం తీర్పు తీర్చబడి, మందలించబడకపోతే, అప్పుడు మీ స్వభావం ఇంకా సాతానునే సూచిస్తుంది. మీ స్వంత ఉద్దేశాలు బట్టి మీరు దేవుణ్ణి సేవిస్తారు. ఇంకా, మీ సేవ సాతాను స్వభావం మీద ఆధారపడినదై ఉంటుంది. దేవుణ్ణి మీరు మీ సహజ స్వభావంతో, మీ వ్యకిగత ఇష్టాల ప్రకారం సేవిస్తున్నారు. ఇంకా, మీరు చేయడానికి ఇష్టపడే పనులన్నీ దేవుణ్ణి ఆనందపరిచేవనీ, మీరు చేయడానికి ఇష్టపడని పనులన్నీ దేవునికి అసహ్యములని మీరు అనుకుంటున్నారు. మీరు చేసేదంతా మీ స్వంత ఇష్టాల ప్రకారమే ఉంటుంది. దీనిని దేవుని సేవ అని పిలవవచ్చా? చివరకు, నీ జీవిత స్వభావంలో కొంచెం కూడా మార్పు ఉండదు. దానికి బదులు నీ సేవ నిన్ను ఇంకా మొండిగా చేస్తుంది. దీని వలన నీ అనైతిక స్వభావం ఇంకా లోతుగా పాతుకుపోతుంది. తద్వారా, నీ స్వంత గుణం మీద ప్రాథమికంగా ఆధారితమైన దేవుని సేవను గురించిన నియమాలు, నీ స్వంత స్వభావం ప్రకారం నీ సేవ నుండి వెలువడిన అనుభవాలు నీలో ఏర్పడతాయి. ఇవే మానవుని అనుభవాలూ, పాఠాలు. లోకంలో మానవుని జీవిత తత్వము ఇది. ఇలాంటి వారిని పరిసయ్యులుగా, మతాధికారులుగా పేర్కొనవచ్చు. వాళ్ళు మేల్కొని పశ్చాత్తాపము పడకపోతే, వారు అంత్య దినాల్లో ప్రజలను మోసం చేసే అబద్ధ క్రైస్తవులుగా, అంత్య క్రీస్తులుగా ఖచ్చితంగా మారతారు. చెప్పబడిన అబద్ధ ప్రవక్తలు, అంత్య క్రీస్తులు, ఇలాంటి వారి మధ్య నుండే వస్తాడు. దేవుణ్ణి సేవించే వారు తమ స్వంత స్వభావాన్ని వెంబడించి, తమ స్వంత చిత్తానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు వారిని ఏదొక సమయంలో వెలివేసేప్రమాదం ఉంది. ఎవరైతే దేవుని సేవలో తమకు గల అనేక సంవత్స్రరాల అనుభవాన్ని ఇతరుల హృదయాలను గెలుచుకోవడానికీవారికి ప్రబోధిస్తూ వారిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికీ, ఎత్తైన స్థలంలో నిలబడటానికీ వాడతారో—ఇంకా ఎవరైతేపశ్చాత్తాపము చెందరో, వారి పాపాలనుఒప్పుకోరో, వారి స్థాయి వలన వచ్చే లాభాలను త్యజించరో—వాళ్ళు దేవుని ముందు నుండి పడిపోతారు. వాళ్ళు పౌలు లాంటి వాళ్ళు. వారి జ్యేష్టతను చూపించుకుంటూ, వారి అర్హతలను చాటించుకుంటారు. దేవుడు ఇలాంటి వారిని పరిపూర్ణతలోనికి తీసుకొనిరాడు. అలాంటి పరిచర్య దేవుని పనికి ఆటంకంగా ఉంటుంది. ప్రజలు పాతవాటినే పట్టుకొని వేలాడతారు. పాత ఆలోచనలను, పూర్వకాల విషయాలను పట్టుకొని వేలాడతారు. వారి పరిచర్యకు ఇది చాలా ఆటంకముగా మారుతుంది. నీవు వీటిని పారవేయలేకపోతే, ఇవి నీ జీవితాన్నంతటిని ఊపిరి ఆడకుండా చేస్తుంది. దేవుడు నిన్ను అభినందించడు. కొంచెం కూడా అభినందించడు. పరిగెడుతూ నీవు నీ కాళ్ళను లేదా శ్రమతో నీ నడుమును విరగగొట్టుకున్నా, దేవుని సేవలో నీవు హతసాక్షివైనా దేవుడు నిన్ను అభినందించడు. దానికి వ్యతిరేకంగా చెప్తాడు: నీవు దుష్టపనులను చేసేవాడివని ఆయన అంటాడు.
నేటి నుండి, ఎవరికైతే మత తలంపులు లేవో, ఎవరైతే తమ పాత స్వభావాన్ని పక్కన పెడతారో, మంచి మనసుతో దేవునికి విధేయత చూపుతారో, వారిని దేవుడు అధికారికంగా పరిపూర్ణులుగా చేస్తాడు. దేవుని మాటల కోసం ఆత్రుత కలిగి ఉండేవారిని దేవుడు పరిపూర్ణులుగా చేస్తాడు. ఇలాంటి వారు లేచి నిలబడి దేవుని సేవను చేయాలి. దేవునిలో అంతులేని సమృద్ధి, హద్దుల్లేని జ్ఞానం ఉంది. ఆయన అద్భుత పని, అమూల్యమైన మాటలను ఆనందించడానికి ఇంకా అనేకులు ఉన్నారు. మత అలోచనలు కలవారు, పెద్దరికాన్ని ప్రదర్శించేవారు, తమని తాము పక్కన పెట్టుకోలేని వారు, ఈ కొత్త విషయాలను అంగీకరించడం కష్టం. ఇలాంటి వారిని పరిపూర్ణులుగా చేసే అవకాశం పరిశుద్ధాత్మకు లేదు. ఒక వ్యక్తి లోబడి ఉండటానికి తీర్మానించుకోకపోతే, దేవుని మాటలకు తృష్ణ లేకపోతే, వాళ్ళు ఈ కొత్త విషయాలను అంగీకరించే అవకాశమే లేదు. వాళ్ళు మరెక్కువ తిరుగుబాటుదారులుగా, మరెక్కువ జిత్తులమారిగా తయారయ్యి, తప్పుడు దారిలోకి వెళ్తారు. దేవుని పనిని నేడు చేయడం వలన, ఆయన్ని నిజంగా ప్రేమించి కొత్త వెలుతురును అంగీకరించగలవారిని అనేకులను ఆయన లేవనెత్తుతారు. పెద్దరికాన్నిగొప్పగా చెప్పుకునే మతాధికారులను ఆయన సంపూర్ణంగా నిర్మూలిస్తారు. మార్పుని మొండిగా వ్యతిరేకించే ఏ ఒక్కరు ఆయనకు అక్కరలేదు. ఇలాంటి వారిలో నీవూ ఒకరివి కావాలనుకుంటున్నావా? నీ పరిచర్య అనేది నీ స్వంత ఉద్దేశాల ప్రకారం ఉంటుందా లేదా దేవునికి కావాల్సిన విధంగా ఉంటుందా? నీకు నీవే ఈ విషయాలను తెలుసుకోవాలి. నీవు ఒక మతాధికారివా లేదా దేవుని చేత పరిపూర్ణం చేయబడిన ఒక కొత్తగా జన్మించిన శిశువివా? నీ సేవ ఎంతవరకు పరిశుద్ధాత్మ చేత అభినందించబడుతుంది? ఎంత సేవను దేవుడు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు? నీవు పరిచర్య చేసిన సంవత్సరాలంతటి ఫలితంగా నీ జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చింది? దీనంతటి గురించి నీకు స్పష్టత ఉందా? నీకు నిజంగా విశ్వాసముంటే నీవు మునుపటి నీ పాత మత ఆలోచనలను విసర్జించి, దేవుణ్ణి ఒక కొత్త విధానంలో నీవు సేవ చేస్తావు. నిలబడటానికి ఇంకా ఆలస్యం కాలేదు. ఒక వ్యక్తి జీవితాన్నంతా పాత మతాలోచనలు జప్తు చేయగలవు. దేవుని నుండి తప్పిపోయి, తమ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళడానికి ఒక వ్యక్తి సంపాదించే అనుభవం కారణము కాగలదు. నీవు ఇలాంటి విషయాలను పక్కన పెట్టకపోతే, నీ జీవితం ఎదుగుదలకు ఇవి ఆటంకములుగా మారతాయి. దేవుణ్ణి సేవించే వారిని దేవుడు ఎల్లప్పుడూ పరిపూర్ణులుగా చేస్తాడు. వారిని తేలికగా బయట పారవేయడు. దేవుని మాటల తీర్పును, మందలింపును నీవు నిజంగా అంగీకరిస్తే, నీ పాత మత ఆచారాలను నియమాలను నీవు పక్కన పెట్టగలిగి, ఆ పాత మతాలోచనలను నేటి దేవుని మాటలుగా ఉపయోగించడం మానివేస్తే, అప్పుడు మాత్రమే నీకు భవిష్యత్తు ఉంటుంది. కానీ నీవు ఇంకా పాత విషయాలను పట్టుకొని వేలాడుతూ, వాటిని భద్రపర్చుకుంటే, అప్పుడు నీవు రక్షింపబడే మార్గమే లేదు. దేవుడు అలాంటి వారిని పట్టించుకోడు. నీవు నిజంగా పరిపూర్ణమవ్వాలని అనుకుంటే, మునుపటి వాటినంతటినీ త్యజించడానికి నీవు తీర్మానించుకోవాలి. ముందు జరిగింది సరియైనది కావచ్చు, అది దేవుని పనైనా సరే, నీవు దానిని పక్కన పెట్టి, దానిని పట్టుకొని వేలాడకూడదు. అది పరిశుద్ధాత్ముని పనైనా, పరిశుద్ధాత్మునిచే ప్రత్యక్షంగా చేయబడినా, నేడు నీవు దానిని పక్కన పెట్టాలి. దానిని పట్టుకొని వేలాడకూడదు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతీది నూతనపర్చబడాలి. దేవుని పనిలో కానీ, దేవుని మాటలలో కానీ, ముందు గడిచిన పాత విషయాల గురించి ఆయన ప్రస్తావించలేదు. ఆయన పాత పుస్తకాన్ని తవ్వరు. దేవుడు దేవుడే. ఆయన ఎల్లప్పుడూ కొత్తే, ఎన్నటికీ పాత కాదు. ఆయన తన పూర్వ మాటలను కూడా పట్టుకొని వేలాడరు—దీనిని బట్టి దేవుడు ఎలాంటి నియమాలను పాటించరని తెలుస్తుంది. నీవు ఒక మనిషిగా పాత విషయాలను పట్టుకొని వేలాడితే, వాటిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తే, దేవుడు ఇదివరకు పనిచేసినట్టు వాటితో పని చేయకున్నా, ఒక సూత్రం లాగా నీవు వాటిని కఠినంగా అన్వయిస్తే, అప్పుడు నీ మాటాలు, క్రియలు విఘాతం కలిగించేవి కావా? నీవు దేవునికి శత్రువు కాలేదా? నీ జీవితమంతా ఈ పాత విషయాల వలన నాశనం అవ్వడానికి నీవు సిద్ధమా? దేవుని పనిని ఆటంకపరిచే వానిగా ఈ పాత విషయాలు నిన్ను తయారు చేస్తాయి—నీవు అలాంటి వ్యక్తివి కావాలనుకుంటున్నావా? నీవు నిజంగా అలాంటి వానిగా అవ్వాలనుకోకపోతే, నీవు చేసేది వెంటనే ఆపి వెనక్కి తిరుగు. మరలా మొదటి నుండి ప్రారంభించు. దేవుడు నీ పాత సేవను గుర్తుపెట్టుకోడు.