ఆచరణాత్మకమైన దేవుడే దేవుడని నీవు తెలుసుకోవాలి
ఆచరణాత్మకమైన దేవుని గురించి నీవు ఏమి తెలుసుకోవాలి? ఆత్మ, వ్యక్తి, మరియు వాక్యము కలసి ఆచరణాత్మకమైన దేవుణ్ణి తయారు చేస్తాయి, ఆచరణాత్మకమైన దేవుని యొక్క నిజమైన అర్ధము కూడా ఇదే. నీవు వ్యక్తిని మాత్రమే తెలుసుకున్నట్లయితే—ఆయన అలవాట్లు మరియు వ్యక్తిత్వం తెలుస్తాయి—కానీ, ఆత్మ కార్యము, లేదా శరీరములో ఆత్మ ఏమి చేస్తుందో తెలియదు, మరియు నీవు ఆత్మ మరియు వాక్యముపై మాత్రమే శ్రద్ధ వహించినట్లయితే, ఆత్మ ఎదుట మాత్రమే ప్రార్థిస్తావు, కానీ ఆచరణాత్మకమైన దేవుని లోని దేవుని ఆత్మ కార్యము తెలియదు, అప్పుడు అది ఆచరణాత్మకమైన దేవుడు నీకు ఇంకా తెలియదని రుజువు చేస్తుంది. ఆచరణాత్మకమైన దేవుని జ్ఞానము దేవుని మాటలను అనుభవపూర్వకముగా తెలుసుకోవడం, పరిశుద్ధాత్మ కార్యము నియమాలు మరియు సూత్రములను గ్రహించడం, అలాగే దేవుని యొక్క ఆత్మ శరీరములో ఎలా పని చేస్తున్నది అను వాటి సమ్మేళనమై ఉన్నది. దేవుని యొక్క ప్రతి కార్యము శరీరమందు ఆత్మచే జరిపించబడుచున్నదని, అలాగే ఆయన మాట్లాడే మాటలు ఆత్మ యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ అని గ్రహించడం కూడా మిళితమై ఉన్నది. కాబట్టి, ఆచరణాత్మకమైన దేవుని తెలుసుకోవడానికి, మానవ రూపంలో మరియు దేవుడి రూపంలో దేవుడు ఎలా కార్యము చేస్తాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం; ఇది, క్రమముగా, ప్రజలందరూ నిమగ్నమయ్యే, ఆత్మ వ్యక్తీకణలను సూచిస్తుంది.
ఆత్మ వ్యక్తీకరణల యొక్క అంశాలు ఏమిటి? కొన్నిసార్లు దేవుడు మానవత్వములో మరియు కొన్నిసార్లు దైవత్వములో కార్యములు చేస్తాడు—అయితే రెండూ సందర్భాలలోనూ ఆత్మ ఆధిపత్యం ఉంటుంది. మనుష్యుల అంతరంగములో ఏ ఆత్మ ఉంటుందో, వారి బాహ్య వ్యక్తీకరణ అదే అవుతుంది. ఆత్మ సాధారణముగా కార్యము జరిగిస్తుంది, కానీ ఆత్మ ద్వారా ఆయన నిర్దేశానికి రెండూ బాగాలు ఉన్నాయి: మొదటిది మనుష్యుల్లో ఆయన జరిగించే కార్యము, మరియు మరొకటి దైవత్వము ద్వారా ఆయన జరిగించే కార్యము. ఇది నీవు స్పష్టముగా తెలుసుకోవాలి. ఆత్మ కార్యము పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది: ఆయన మానవ కార్యము అవసరమైనప్పుడు, ఆత్మ ఆ మానవ కార్యమును నిర్దేశిస్తుంది, మరియు ఆయన దైవికమైన కార్యము అవసరమైనప్పుడు, దానిని జరిగించడానికి దైవత్వం ప్రత్యక్షమవుతుంది. కాబట్టి దేవుడు శరీరధారుడిగా కనిపిస్తాడు, మరియు శరీరధారిగా కార్యములు చేస్తాడు, అలాగే ఆయన మానవ రూపంలో మరియు దేవునిగా కార్యములు జరిగిస్తాడు. మనుష్యుల శరీర అవసరాలను తీర్చడానికి, ఆయనతో వారి ఒడంబడికను సులభతరం చేయడానికి, దేవుని వాస్తవికతను మరియు సహజత్వమును చూచుటకు వారిని అనుమతించడానికి, దేవుని ఆత్మ శరీరధారిగా మానవుల మధ్య, మానవులతో కలిసి జీవించి, మరియు ఆయన మానవులతో ఉండటానికి వచ్చాడని చూచుటకు వారిని అనుమతించడానికి, మనుష్యుల్లో ఆయన కార్యము ఆత్మ ద్వారా నిర్దేశించబడి ఉన్నది. ప్రజలకు సమకూర్చడానికి మరియు అన్నింటిలో సానుకూలత వైపు వారిని నడిపించడానికి దేవుని రూపంలో ఆయన కార్యము జరిగించుచూ, ప్రజల స్వభావమును మార్చి, మరియు శరీరమందు ఆత్మ ప్రత్యక్షతను నిజముగా చూచుటకు వారికి వీలు కలుగజేస్తుంది. ప్రాముఖ్యముగా, దైవత్యములో దేవుని మాటలు మరియు కార్యము వలన మనిషి జీవితంలో అభివృద్ధి నేరుగా సాధించబడుతుంది. దేవుని రూపంలోని దేవుని కార్యమును మనుష్యులు అంగీకరించినప్పుడు మాత్రమే, వారి స్వభావములో మార్పులను సాధించగలరు మరియు వారు ఆత్మలో సంతృప్తి చెందగలరు; మానవత్వము యొక్క కార్యమునకు—దేవుని కాపుదల, సహకారం, మరియు మానవత్వమందు సదుపాయములను జోడించినప్పుడు మాత్రమే, దేవుని కార్యము యొక్క ఫలితాలు సంపూర్ణముగా సాధించబడతాయి. నేడు చెప్పబడుతున్న ఆచరణాత్మకమైన దేవుడే మానవ రూపంలోనూ మరియు దేవుడి రూపంలోనూ కార్యములు చేస్తాడు. ఆచరణాత్మకమైన దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారానే, ఆయన యొక్క సాధారణ మానవ కార్యము మరియు జీవితం, అలాగే అయన దైవ కార్యము సంపూర్ణముగా సాధించబడతాయి. ఆయన మానవత్వం మరియు దైవత్వము మిళితమై ఉన్నాయి, మానవ రూపంలోనూ మరియు దేవుని రూపంలోనూ ఆయన వాక్యములనే పలుకుతాడు; రెండింటి కార్యము ఆయన వాక్యముల ద్వారానే నిర్వర్తించబడుతుంది. దేవుడు మానవజాతిలో కార్యము చేస్తున్నప్పుడు, ఆయన మానవుల భాషను మాట్లాడతాడు, కాబట్టి ప్రజలు గ్రహించి మరియు అర్ధం చేసుకోవచ్చు. ఆయన మాటలు స్పష్టముగా మరియు అర్ధం చేసుకోవడానికి సులభంగా ఉండి, అవి మనుష్యులందరికీ అందించబడతాయి; మనుష్యుల జ్ఞానము లేక విద్యాహీనతలతో సంబంధం లేకుండా, అందరూ ఆయన వాక్కులను పొందుకోవచ్చు. దేవుని రూపంలోని దేవుని కార్యము సహితము వాక్కుల ద్వారానే జరుగుతుంది, ఇది పోషణతో, జీవముతో నిండినదై, మానవుల ఆలోచనలతో కలుషితం కాకుండా, మానవ ప్రాధాన్యతలను కలిగి ఉండకుండా, మానవ పరిమితులను దాటి, సాధారణ మానవజాతి హద్దులకు వెలుపల ఉంటుంది; ఇది శరీరమునందు నిర్వహించబడిననూ, ఇది ఆత్మ ప్రత్యక్ష వ్యక్తీకరణయై ఉన్నది. ప్రజలు కేవలం మానవ రూపంలోని దేవుని కార్యమును అంగీకరించినట్లయితే, వారు తమను తాము ఒక నిర్దిష్ట పరిధికే పరిమితం చేసుకుంటారు, కాబట్టి వారిలో కొద్దిపాటి మార్పు రావాలన్నా వారికి శాశ్వతమైన నడవడిక, దిద్దుబాటు, క్రమశిక్షణ అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ సన్నిధి లేక కార్యము లేకపోతే, అప్పుడు, వారు తరచుగా వారి పాత నడవడికను అనుసరిస్తారు; దైవత్వం కార్యము ద్వారా మాత్రమే ఈ రోగములు మరియు లోపములు సరి చేయబడతాయి, అప్పుడు మాత్రమే ప్రజలు సంపూర్ణులుగా చేయబడగలరు. స్థిరమైన వ్యవహారానికి మరియు దిద్దుబాటుకు బదులుగా, సానుకూలమైన పోషణ, లోపాలను సవరించడానికి వాక్యాలను ఉపయోగించడం, ప్రజల ప్రతి స్థితిని వెల్లడి చేయడానికి వాక్యాలను ఉపయోగించడం, వారి బ్రతుకులను, వారి ప్రతి మాట, వారి ప్రతి క్రియ, వారి ఉద్దేశ్యాలు మరియు తలంపులను వెల్లడిచేయడానికి వాక్యాలు ఉపయోగించడం అవసరం. ఆచరణాత్మకమైన దేవుని నిజమైన కార్యము ఇదే. కాబట్టి, ఆచరణాత్మకమైన దేవుని పట్ల మీ ప్రవర్తనలో, ఆయన మానవ రూపానికి మీరు లోబడి, ఆయనను గుర్తించి మరియు అంగీకరించి, ఆయన దైవిక కార్యమును మరియు వాక్యములను మీరు ఇంకా అంగీకరించాలి మరియు పాటించాలి. శరీరమందు దేవుని ప్రత్యక్షత అనగా దేవుని ఆత్మ సమస్త కార్యము మరియు వాక్యములన్ని ఆయన సాధారణ మానవత్వము ద్వారా మరియు ఆయన శరీర అవతరణ ద్వారా జరిగింపబడుటయే. మరొక మాటలో చెప్పాలంటే, దేవుని ఆత్మ ఒకేసారి మానవ కార్యమును నిర్దేశించి శరీరమందు దైవికమైన కార్యమును జరిగిస్తుంది, మరియు శరీరధారి అయిన దేవునిలో నీవు మానవత్వములో దేవుని కార్యము మరియు పూర్తిగా ఆయన దైవిక కార్యము అయిన రెండిటిని చూడవచ్చు. ఇది శరీరమందు ప్రత్యక్షపరచబడిన కార్యసాధకుడైన దేవుని నిజమైన ప్రాముఖ్యత. నీవు దీనిని స్పష్టముగా చూడగలిగితే, నీవు దేవుని సమస్తమైన విభిన్న భాగాలను అనుసంధానించగలవు; దైవత్వములోని ఆయన కార్యమునకు నీవు అనుచితమైన గౌరవాన్ని ఇయ్యవు, మానవత్వమందు ఆయన కార్యమును అనుచిత దృక్పథంతో చూడటం మానేస్తావు, మరియు నీవు మితిమీరిన స్థితికి వెళ్ళవు అలాగే ఎటువంటి అడ్డదారులు తోక్కవు. మొత్తానికి, ఆత్మచే నిర్దేషించబడి, ఆయన శరీరము ద్వారా వెల్లడిచేయబడిన ఆయన మానవత్వము మరియు ఆయన దైవత్వమే ఆచరణాత్మక దేవుని యొక్క అర్ధముగా ఉన్నది, తద్వారా ఆయనను సజీవమైన మరియు ఇతర జీవము లాంటి, నిజమైన మరియు సత్యమైన రూపముగా మనుష్యులు చూడగలరు.
మనుష్యుల్లో దేవుని ఆత్మ కార్యము పరివర్తన చెందుతూ ఉంటుంది. మనుష్యులను పరిపూర్ణం చేయడం ద్వారా, ఆయన తన మానవత్వమును ఆత్మ నడిపింపును పొందేలా చేస్తాడు, ఆ తర్వాతే ఆయన మానవత్వము సమకూర్చగలదు మరియు సంఘములను కాయగలదు. ఇది దేవుని సాధారణ కార్యము యొక్క ఒక వ్యక్తీకరణ. కాబట్టి, ఒకవేళ నీవు మానవత్వమందు దేవుని కార్యము యొక్క ఉద్దేశ్యాలను స్పష్టంగా చూడగలిగినట్లయితే, అప్పుడు నీవు మానవత్వమందు దేవుని పనిని గూర్చి భిన్న ఆలోచనలను కలిగి ఉండవు. ఏదేమైనా సరే, దేవుని ఆత్మ ఎన్నటికి తప్పు కాదు. ఆయన ఏ దోషము లేని నీతిమంతుడు; ఆయన తప్పుగా ఏది చేయడు. దైవ కార్యము అనేది, మానవ జోక్యము లేని, దేవుని చిత్తాన్ని తెలియజేయడమై ఉన్నది. ఇది పరిపూర్ణతను పొందదు, కాని నేరుగా ఆత్మ నుండి వస్తుంది. ఏదేమైనా, ఆయన సాధారణ మానవత్వమును బట్టి, ఆయన దైవ కార్యము చేయగలడు అనునది వాస్తవం; ఇది కనీసం అతీతమైనది కాదు, మరియు ఇది ఒక సాధారణమైన వ్యక్తి చేసినట్లు కనబడుచున్నది. ప్రధానంగా దేవుడు పరలోకము నుండి భూమికి శరీరము ద్వారా దేవుని వాక్కులను తెలియజేయుటకు, శరీరం ద్వారా దేవుని ఆత్మ కార్యమును సంపూర్ణం చేయడానికి వచ్చాడు.
నేడు, ప్రజలలో ఆచరణాత్మకమైన దేవుని గూర్చిన అవగాహన ఏకపక్షంగా ఉంది, మరియు శరీరధారణ ప్రాముఖ్యతను గూర్చిన అవగాహన చాలా తక్కువగా ఉంది. దేవుడిచ్చిన శరీరముతో, ఆయన కార్యము మరియు వాక్కులను బట్టి దేవుని ఆత్మ విస్తారమైనదని మరియు ఆయన అధిక సంపన్నుడని ప్రజలు తెలుసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, దేవుడు శరీరధారిగా ఏమి చేశాడు, ఏ నియమాల ద్వారా కార్యము చేశాడు, మానవత్వమందు ఆయన ఏమి చేశాడు, మరియు దైవత్వంలో ఆయన ఏమి చేశాడు: అనే దేవుని సాక్ష్యము దేవుని ఆత్మ నుండే వస్తుంది. ప్రజలు దీనిని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. నేడు, నీవు ఈ వ్యక్తిని ఆరాధించగలుగుతున్నావంటే, నీవు ఆత్మను ఆరాధిస్తున్నావు అని అర్ధము, అలాగే శరీరధారి అయిన దేవుని గూర్చిన వారి జ్ఞానములో ప్రజలు గ్రహించవలసిన కనీస విషయమేమిటంటే: శరీరము ద్వారా ఆత్మ స్వభావమును తెలుసుకొనటం, శరీరమందు ఆత్మ దైవిక కార్యము మరియు శరీరమందు మానవ కార్యమును తెలుసుకోవడం, ఆత్మ వాక్కులు మరియు శరీరమందున్న మాటలన్నిటినీ స్వీకరించడం, మరియు శరీరమును దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుందో మరియు శరీరమందు ఆయన శక్తి ఎలా వెల్లడిపరచబడుతుందో గుర్తించడం. శరీరం ద్వారా, పరలోకమందున్న ఆత్మను మనిషి తెలుసుకున్నాడని చెప్పడానికి; మానవునియందు ఆచరణాత్మకమైన దేవుని స్వీయ ప్రత్యక్షత ప్రజల ఆలోచనల్లోని అస్పష్టమైన దేవుని తీసివేసింది. ఆచరణాత్మకమైన దేవుని పట్ల ప్రజల ఆరాధనే వారిలో విధేయతను పెంచింది, మరియు, శరీరములోని దేవుని ఆత్మ యొక్క దైవికమైన కార్యము ద్వారా, మరియు శరీరమందు ఆయన మానవ కార్యము, మనిషి ప్రత్యక్షతను పొందుకొని కాపాడబడతాడు, మరియు మనిషి జీవన విధానంలో మార్పులు సంభవిస్తాయి. శరీరములో ఆత్మ రాకడ యొక్క నిజమైన అర్ధం ఇదే, ప్రజలు దేవునితో మమేకమవడం, దేవుని పైన ఆధారపడడం, మరియు దేవుని జ్ఞానమును చేరుకోవడమే దాని ప్రధాన ఉద్దేశ్యము.
ప్రాముఖ్యంగా, ఆచరణాత్మకమైన దేవుని పట్ల ప్రజలు ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి? శరీరధారణ గురించి, శరీరమందు ప్రత్యక్షపరచబడిన వాక్యమును గురించి, కార్యసాధకుడైన దేవుని క్రియలను గురించి నీకేమి తెలుసు? ఈనాటి చర్చలోని ప్రధానాంశములు ఏమిటి? శరీరధారణ, శరీరమందు వాక్యము యొక్క ఆగమనము, మరియు శరీరమందు దేవుని ప్రత్యక్షత అనే విషయాలు తప్పక గ్రహించాలి. మీ స్థితిని బట్టి మరియు నేటి కాలమును బట్టి, వీటిని గూర్చిన స్పష్టమైన జ్ఞానమును మీ జీవిత అనుభవాలలో కలిగిఉండుటకు, మీరు ఈ విషయాలను క్రమముగా తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలి. ప్రజలు దేవుని మాటలను ఆస్వాదించే ప్రక్రియ, శరీరములో దేవుని వాక్కుల ప్రత్యక్షతను తెలుసుకునే ప్రక్రియ వంటిదే. దేవుని వాక్కును ఎంతగా ఆస్వాదించగలరో, దేవుని ఆత్మను గూర్చి అంతగా తెలుసుకుంటారు; దేవుని మాటలను ఆస్వాదించుట ద్వారా, ప్రజలు ఆత్మ కార్యము నియమాలను గ్రహిస్తారు మరియు ఆయనే కార్యసాధకుడైన దేవుడని తెలుసుకుంటారు. నిజానికి, దేవుడు మానవులను పరిపుర్ణులుగా చేసి వారిని చేర్చుకున్నప్పుడు, ఆచరణాత్మకమైన దేవుని క్రియలను వారికి తెలియపరుస్తూ; శరీరధారణ వాస్తవ ప్రాధాన్యతను ప్రజలకు కనుపరచడానికి, మానవుని యెదుట దేవుని ఆత్మ నిజముగా ప్రత్యక్షమైనదని వారికి కనుపరచడానికి ఆయన ఆచరణాత్మకమైన దేవుని కార్యమును ఉపయోగించుచున్నాడు. ప్రజలు దేవునిచే పరిపూర్ణపరచబడి దక్కించుకున్నప్పుడు, ఆచరణాత్మకమైన దేవుని వాక్కులు వారిని జయించాయి; ఆచరణాత్మకమైన దేవుని మాటలు వారికి మార్పు కలిగించి మరియు ఆయన జీవాన్ని వారిలోనికి అనుమతించి, ఆయన ఏమైయున్నాడో (ఆయన తన మానవత్వములో ఉన్నప్పటికీ లేక ఆయన దైవత్వములో ఉన్నప్పటికీ) దానితో వారిని నింపుతూ, ఆయన వాక్యముల యొక్క భావజాలముతో వారిని నింపుతూ మరియు ఆ వాక్యముల ప్రకారము ప్రజలను జీవింపచేస్తున్నాయి. దేవుడు ప్రజలను దక్కించుకున్నప్పుడు, ప్రజల లోపాలను సరిచేయడానికి మరియు వారి స్వభావమును బయలుపరచి విచారించడానికి, ఆయన మొదటిగా ఆచరణాత్మకమైన దేవుని మాటలను మరియు వాక్కులను ఒక మార్గముగా ఉపయోగిస్తాడు. అన్నింటికంటే ప్రాముఖ్యముగా, ఆచరణాత్మకమైన దేవుడు చేయు కార్యమేమిటంటే, ప్రతి వ్యక్తిని సాతాను ప్రభావము నుండి కాపాడటము, మాలిన్యమైన భూమి నుండి వారిని దూరముగా తీసుకొనిపోయి, వారి దుర్నీతి స్వభావమును పారద్రోలడము. ఒక ఆదర్శముగా మరియు నమునాగా ఆచరణాత్మకమైన దేవునితో ఒక సాధారణం మానవత్వము కలిగి జీవించగలగడం మరియు ఎటువంటి వైదొలగడం లేక నిష్క్రమించడం లేకుండా కార్యసాధకుడైన దేవుని వాక్యములను మరియు ఆశయాలను అనుసరించగలగడం, ఆయన చెప్పిన ప్రతి మార్గాన్ని అనుసరించడం, ఆయన అడిగిన ప్రతి దానిని నెరవేర్చడము అనేది కార్యసాధకుడైన దేవుని ద్వారా అందించబడిన అత్యంత ఉన్నతమైన ఆధిక్యత అయి ఉన్నది. ఈ విధముగా నీవు దేవునిచే రక్షింపబడతావు. నీవు దేవుని ద్వారా రక్షింపబడినప్పుడు, నీవు పరిశుద్ధాత్మ కార్యమును మాత్రమే కలిగి ఉండవు కానీ; ప్రధానముగా, కార్యసాధకుడైన దేవుని ఆశయాలకు అనుగుణముగా జీవించగలుగుతావు. కేవలం పరిశుద్ధాత్మ కార్యమును కలిగి ఉన్నావంటే, నీవు జీవాన్ని కలిగి ఉన్నావని అర్ధము కాదు. అస్సలు విషయము, నీవు నీ కార్యసాధకుడైన దేవుని యొక్క ఆశయాలకు అనుగుణముగా పని చేయగలుగుతున్నావా, లేక దేవుని ద్వారా పొందగలుగుతున్నావా అనే దానికి సంబంధించినది. ఇవి శరీరమందున్న ఆచరణాత్మకమైన దేవుని కార్యమునకు గొప్ప అర్ధము. అంటే, దేవుడు నిజముగా మరియు వాస్తవముగా శరీరమందు కనుపరచబడిన ప్రత్యక్ష్యతను బట్టి, తేటగా మరియు జీవాప్రదముగ ఉండుటన ద్వారా, ప్రజలు చూచుట ద్వారా నిజముగా ఆత్మ కార్యము శరీరమందు జరిగింపబడుట ద్వారా, శరీరులైన ప్రజల కొరకు ఒక నిదర్శనముగా వ్యవహరించడాన్ని బట్టి దేవుడు ఒక జన సమూహాన్ని దక్కించుకుంటాడు. శరీరమందు దేవుని ఆగమనము అనేది దేవుని నిజమైన కార్యాలు ప్రజలు చూడటానికి, నిరాకారమైన ఆత్మకు శరీర స్వరూపాన్ని ఇవ్వడానికి, ప్రజలు ఆయనను తాకు స్పర్శించడము కోసమై వీలు కల్పించుటకు ఉద్దేశించబడింది. ఈ విధముగా, ఆయన ద్వారా సంపూర్ణ పరచబడిన వారు ఆయనను జీవింపజేస్తారు, ఆయన ద్వారా హెచ్చించబడతారు, మరియు ఆయన హృదయానుసారులుగా ఉంటారు. దేవుడు భూలోకమునకు రాకుండా పరలోకములోనే మాట్లాడి ఉంటే, ప్రజలు దేవుని తెలుసుకునే వారు కాదు; వారు కేవలము నిరర్ధకమైన సిద్దాంతాన్ని బోధిస్తూ దేవుని వాక్యములను నిజముగా కలిగి ఉండేవారు కాదు. ఆయన పొందాలనుకున్న వారికి ఆదర్శముగా మరియు నిదర్శనముగా వ్యవహరించడానికి దేవుడు ప్రధానముగా భూలోకమునకు వచ్చాడు; ఇందునుబట్టి, ప్రజలు నిజముగా దేవుని ఎరిగి, ఆయనను తాకి, మరియు చూడగలిగినప్పుడు మాత్రమే, వారు నిజముగా దేవునిచే చేర్చుకొనబడతారు.