రాజ్య యుగంలో దేవునిచే ఎంపిక చేయబడిన ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన పది పరిపాలనా ఆజ్ఞలు
1. మానవుడు తనను తాను హెచ్చించు కొనకూడదు లేదా స్తుతించు కొనరాదు. అతడు దేవుడిని ఆరాధించాలి మరియు స్తుతించాలి.
2. దేవుని కార్యమునకు ప్రయోజనకరమైన ప్రతిదీ చేయుడి మరియు దేవుని కార్య ఆసక్తులకు హాని కలిగించేది దానిని చేయకుడి. దేవుని నామము, దేవుని సాక్ష్యం, మరియు దేవుని కార్యమును సమర్థించుడి.
3. దేవుని గృహములోని ధనము, భౌతిక వస్తువులు మరియు ఆస్తి మొత్తం మానవుడు ఇవ్వవలసిన అర్పణలు. ఈ అర్పణలను యాజకుడు మరియు దేవుడు తప్ప ఎవరూ అనుభవించరు, మానవుని అర్పణలు దేవుని సంతోషం కొరకే. దేవుడు ఈ అర్పణలను యాజకునితో మాత్రమే పంచుకుంటాడు, ఎవరైనా దానిలో ఏ భాగాన్నైనా అనుభవించడానికి అర్హతకానీ లేదా హక్కుకానీ కలిగి ఉండరు. మానవుని అన్ని అర్పణలు (ధనము మరియు అనుభవించదగిన భౌతిక వస్తువులతో సహా) దేవునికి ఇవ్వబడినవి, మానవునికి కాదు, కాబట్టి ఈ అర్పణలను మానవుడు అనుభవించ కూడదు, మానవుడు వాటిని అనుభవించినట్లయితే అప్పుడు అతను ఆ అర్పణలను దొంగిలిస్తున్నాడు. ఇలా ఎవరైనా చేసినట్లయితే వారు యూదా వంటివారు, ద్రోహిగా ఉండటానికి అదనంగా, యూదా డబ్బు సంచిలో ఉన్నదానికి తనకు తాను సహాయం చేసుకున్నాడు.
4. మానవుడు అవినీతి స్వభావం కలిగి ఉన్నాడు మరియు అంతేకాక భావోద్వేగాలను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సేవ చేసేటప్పుడు వ్యతిరేక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేయడం పూర్తిగా నిషేదించబడినది. ఎవరైనా అలా చేస్తుండటం కనుగొన్నప్పుడు ఎలాంటి మినహాయింపులు లేకుండా. బహిష్కరింపబడతారు.
5. దేవునిపై ఎటువంటి తీర్పును తీర్చవద్దు లేదా దేవునికి సంబంధించిన విషయాలను ఊరకనే చర్చించవద్దు. మానవుడు చేయవలసినట్లుగా చేయండి మరియు మానవుడు మాట్లాడవలసినట్టు గా మాట్లాడండి మరియు హద్దుల్ని అధిగమించకండి లేదా సరిహద్దులను అతిక్రమించకండి. దేవుని స్వభావానికి భంగం వాటిల్లింది ఏదీ చేయకుండా మీ స్వంతనాలుకకు కావలియుండుడి మరియు ఎక్కడ అడుగు పెడుతున్నారో జాగ్రత్త వహించండి.
6. మానవుడు చేయవలసిన పనిని చేయండి మరియు నీవిధులను నిర్వర్తిం చు, నీ బాధ్యతలను నెరవేర్చు మరియు పనికి బద్దుడై ఉండు. నువ్వు దేవుని నమ్మినందున దేవుని కార్యములో నీ వంతు సహకారం అందించాలి; అలా చేయనట్లయితే నువ్వు దేవుని మాటలను తినడానికి మరియు తాగటానికి అయ్యోగునివి మరియు దేవుని గృహంలో నివసించడానికి అయోగ్యునివి.
7. సంఘ కార్యము మరియు విషయాలలో, దేవునికి విధేయత విషయంలో తప్ప, ప్రతి విషయంలోనూ పరిశుద్ధాత్మ చేత వాడబడుతున్న మనుష్యుని ఆదేశాలను అనుసరించండి. చిన్న తప్పిదం కూడా ఆమోదయోగ్యం కాదు. మీ సమ్మతిలో సంపూర్ణంగా ఉండండి మరియు ఒప్పులేదా తప్పులను విశ్లేషించకండి; ఏది ఒప్పో లేదా తప్పోతో నీకు ఎటువంటి సంబంధం లేదు. నీయొక్క పూర్తి విధేయతతో మాత్రమే నువ్వు సంబంధం కలిగిఉండాలి.
8. దేవునియందు విశ్వసించేవారు దేవునికి విధేయత కనపరిచి మరీ ఆరాధించవలెను. ఏ వ్యక్తినైనా స్తుతించవద్దు లేదా చూడవద్దు; దేవుని ప్రథమ స్థానంలో, నువ్వు చూసే ప్రజలు రెండో స్థానంలో మరియు నిన్ను నువ్వు మూడో స్థానంలో ఉంచవద్దు. ఏ వ్యక్తి కూడా నీ హృదయంలో స్థానాన్ని కలిగి ఉండకూడదు, మరియు దేవునితో సరిసమానంగా లేదా ఆయనకు సమానంగా ఉండాలని ప్రత్యేకంగా నువ్వు గౌరవించే ప్రజలను పరిగణించకూడదు. ఇది దేవునికి సహింపరానిది.
9. మీ ఆలోచనలను సంఘం కార్యములపై ఉంచండి. మీ స్వంత శరీరాపేక్షలను పక్కనబెట్టి కుటుంబ విషయాలపట్ల నిర్ణయాత్మకంగా ఉండండి, దేవుని కార్యము కొరకు మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా సమర్పించుకోండి, దేవుని కార్యమును మొదటిగా మరియు మీ స్వంత జీవితం రెండవదిగా ఉంచండి. ఇది ఒక సన్యాసి యొక్క సభ్యత.
10. విశ్వాసములో లేని బంధువులను (నీ పిల్లలు, నీ భర్త లేదా భార్య, నీ సహోదరీలు, నీ తల్లిదండ్రులు మొదలైనవారు) సంఘములోనికి తీసుకురావటానికి బలవంతం చేయరాదు. దేవుని గృహములో సభ్యుల కొరత లేదు, ఉపయోగము లేని వారితో ఆ సభ్యులసంఖ్యను భర్తీ చేయాల్సిన అవసరం లేదు. సంతోషంగా దేవుని యందు నమ్మకంఉంచని వారందరినీ తప్పనిసరిగా సంఘంలోనికి నడిపించకూడదు. ఈ ఆజ్ఞ ప్రజలందరి కొరకు నిర్దేశించబడినది. మీరు ఈ విషయాన్ని పరీక్షించాలి, పర్యవేక్షించాలి మరియు ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి; ఎవరు కూడా దీనిని ఉల్లంఘించలేరు. విశ్వాసం లేని బంధువులు అయిష్టంగానే సంఘంలోని వచ్చినప్పటికీ, వారికి పుస్తకములను జారీ చేయకూడదు మరియు కొత్త పేరును ఇవ్వకూడదు. అటువంటి వ్యక్తులు దేవుని గృహమునకు చెందినవారు కాదు, మరియు సంఘంలోనికి వారి ప్రవేశాన్ని అవసరమైన ఏవిధంగానైనా ఆపివేయాలి. దయ్యముల దురాక్రమణ వల్ల సంఘమునకు ఇబ్బంది తలెత్తితే, మీరు బహిష్కరించబడతారు లేదా మీమీద ఆంక్షలు విధించబడతాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది, అయినప్పటికీ మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు లేదా మీ వ్యక్తిగత లెక్కలను పరిష్కరించుకోవడానికి దానిని వాడకూడదు.