శరీరావతారపు రహస్యము (2)
ఆ కాలంలో యేసు యూదయలో కార్యము చేసినప్పుడు, ఆయన బహిరంగంగానే చేశాడు, కానీ ఇప్పుడు, నేను మీ మధ్య రహస్యంగా కార్యము చేస్తూ మాట్లాడుతున్నాను. అవిశ్వాసులకు ఇది బొత్తిగా తెలియదు. మీలో బయట ఉన్న వారికి నా కార్యము మరుగు చేయబడింది. ఈ వాక్యాలు, ఈ శిక్షలు మరియు దండనలు మీకు మాత్రమే తెలుసు ఇతరులకు కాదు. ఈ కార్యమంతా మీ మధ్యలో జరిగించబడి మీకు మాత్రమే విశదీకరించబడింది; అవిశ్వాసులలో ఎవరికీ ఇది తెలియదు, ఎందుకంటే సమయం ఇంకా రాలేదు. ఇక్కడ ఉన్న ప్రజలు శిక్షలను భరించిన తర్వాత సంపూర్తి చేయబడతారు, కానీ బయట ఉన్న వారికి దీని గురించి ఏమీ తెలియదు. ఈ కార్యం ఎంతగానో మరుగు చేయబడింది! వారికి, దేవుడు శరీరధారిగా మారడం మరుగు పరచబడింది, కానీ ఈ సహవాసంలో ఉన్నవారికి ఆయన బహిరంగంగ ఉన్నాడని ఎవరైనా చెప్పగలరు. దేవుడు బహిరంగంగ ఉన్న, సమస్తము బయలుపరచబడియున్న మరియు సమస్తము విడిపించబడియున్న; అది కేవలం ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నది వాస్తవం; మిగిలిన అవిశ్వాసుల విషయానికొస్తే, వారికేమీ తెలియపరచబడదు. ప్రస్తుతం మీ మధ్య మరియు చైనాలో జరుగుతున్న పని వారికి మరుగుచేయబడియున్నది. వారు ఈ పని గురించి తెలుసుకుంటే, వారు దానిని ఖండించి హింసకు గురుచేస్తారు. వారు దానిని నమ్మరు. ఎర్రని మహా ఘట సర్పపు దేశంలో, అత్యంత వెనుకబడిన ఈ ప్రదేశాలలో, కార్యం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఈ కార్యము బయలుపరచబడితే, దానిని కొనసాగించడం అసాధ్యమవుతుంది. ఈ దశపు కార్యము అంత సులభంగా ఇక్కడ జరిగింపబడదు. ఈ కార్యము బయలుపరచడితే, దాన్ని ముందుకు కొనసాగించడానికి వాళ్ళు ఎలా అనుమతిస్తారు? ఇది కార్యాన్ని మరింత ఎక్కువ ప్రమాదంలో పడవేయదా? ఈ కార్యాన్ని దాచిపెట్టక, రోగులను అధ్భుతంగా స్వస్థపరచి దేయ్యములను వెళ్ళగొట్టిన యేసు కాలంలో జరిగిన విధంగా జరిగియుంటే, దెయ్యములచే అది ఎన్నడో “స్వాధీనం చేయబడియుండేది” కాదా? దేవుని ఉనికిని వారు సహించగలరా? నేను ఇప్పుడు సమాజ మందిరాల్లోకి వెళ్లి మనిషికి బోధించినట్లయితే, చాలా కాలం క్రితమే నేను ముక్కలుగా చేయబడే వాడిని కాదా? ఇదే జరిగి ఉంటే, నా పని ఎలా కొనసాగుతుంది? మరుగుచేయబడడం కొరకే ఎటువంటి సూచక క్రియలు అద్భుతాలు బహిరంగంగా బయలుపరచబడలేదు. కాబట్టి, అవిశ్వాసులకు, నా కార్యము కనబడదు, తెలియదు, లేదా కనుగొనబడదు. ఒకవేళ ఈ దశపు కార్యము కృపా కాలంలో యేసు చేసిన విధంగానే జరిగి ఉంటే, అది ఇప్పుడు ఉన్నంత స్థిరంగా అయితే ఉండేదికాదు. కాబట్టి, ఈ విధంగా రహస్యంగా పని చేయడం మీకు మరియు కార్యమంతటికి ప్రయోజనకరంగా ఉంటుంది. భూమిపై దేవుని కార్యము ముగించబడినప్పుడు, అంటే, ఈ రహస్య కార్యము ముగిసినప్పుడు, ఈ కార్యపు దశ బహిరంగంగా తేటతెల్లమౌతుంది. చైనాలో జయించువారి సమూహం ఒకటుందని అందరూ తెలుసుకుంటారు; శరీరుడైన దేవుడు చైనాలో ఉన్నాడని మరియు ఆయన కార్యము ముగింపు లోనికి వచ్చిందని అందరూ తెలుసుకుంటారు. అప్పుడు మాత్రమే అది మానవుని మీద ఉదయిస్తుంది: చైనా క్షీణించడాన్ని మరియు పతనమవ్వడాన్ని ఇది ఇంకా ఎందుకు కనుపరచట్లేదు? ఎందుకంటే దేవుడు చైనాలో తన కార్యాన్ని వ్యక్తిగతంగా జరిగిస్తున్నాడని మరియు ఒక ప్రజల సమూహాన్ని జయించువారిలా తీర్చిదిద్దాడని తేలుతుంది.
దేవుడు తన కార్యాన్ని వ్యక్తిగతంగా జరిగిస్తున్న ప్రస్తుత కాలంలో, జీవరాశులన్నిటికీ కాకుండా తనను వెంబడించే వ్యక్తులలో ఒక భాగానికి మాత్రమే శరీరుడైన దేవుడు తనను తాను ప్రత్యక్ష పంచుకుంటాడు. ఆయన తన కార్యపు ఒక దశను పూర్తి చేయడానికి మాత్రమే శరీరునిగా మారాడు, మనిషికి తన రూపాన్ని చూపడం కోసం కాదు. అయితే, ఆయన కార్యము ఆయన ద్వారానే జరిగించబడాలి, కాబట్టి ఆయన దానిని శరీరధారిగా చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ కార్యము ముగిసినప్పుడు, ఆయన మానవ లోకం నుండి బయల్దేరతాడు; జరగబోవు కార్యానికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనతో ఆయన మానవాళి మధ్య ఎక్కువ కాలం గడపలేడు. ఆయన తన నీతి స్వభావమును మరియు ఆయన చేసిన అన్ని క్రియలను మాత్రమే పజలకు ప్రత్యక్షపరచుకున్నాడు అంతేగాని ఆయన రెండుమార్లు శరీరధారిగా వచ్చిన స్వరూపమును కాదు. ఎందుకనగా దేవుని స్వరూపము ఆయన స్వభావము ద్వారానే కనపరచబడుతుంది మరియు ఆయన శరీరధారిగా వచ్చిన స్వరూపమును బదులుగా అది ఉండదు. ఆయన శరీరధారిగా ఉన్న రూపమును కొంతమందికి మాత్రమే బయలుపరచాడు అనగా ఆయన శరీరధారిగా కార్యము జరిగించుచున్నప్పుడు ఆయనను వెంబడించు వారికి మాత్రమే ఆయన తనను తాను బయలుపరచుకున్నాడు. అందుకే ఇప్పుడు జరుగుతున్న కార్యము రహస్యంగా జరుగుతుంది. అదేవిధంగా, యేసు తన కార్యాన్ని చేసినప్పుడు యూదులకు మాత్రమే ఆయన తనను తాను కనుపరచుకున్నాడు, మరి ఏ ఇతర జనాంగమునకు తనను తాను కనుపరచుకోలేదు. అందువల్ల, ఆయన తన కార్యమును పూర్తిచేసిన తరువాత, మానవ ప్రపంచములో ఉండకుండా ఆయన శీఘ్రముగా వెళ్ళిపోయాడు; ఆ తర్వాత, మనిషికి తనను తాను కనుపరచుకున్న, ఈ మానవ రూపము, ఆయన కాదుకానీ పరిశుద్ధాత్మ నేరుగా కార్యాన్ని జరిగించాడు. శరీరధారియైన దేవుని కార్యము పూర్తిగా ముగించిన తరువాత, ఆయన క్షయమైన ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు మరియు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన ఏ కార్యాన్నీ మరలా చేయడు. దీని తర్వాత, కార్యమంతా నేరుగా పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడుతుంది. ఈ కాలంలో, ఆయన మనుష్యులకు శరీరధారిగా తన స్వరూపమును చూపించడు; ఆయన తనను తాను మనిషికి అస్సలు కనుపరచుకోడు, కానీ శాశ్వతంగా మరుగైయుంటాడు. దేవుడు శరీరధారిగా ఉండి కార్యము జరిగించిన కాలము పరిమితమైనది. ఇది ఖచ్చితమైన ఒక యుగములో, కాలము, జాతి మరియు నిర్దిష్టమైన ప్రజల మధ్య జరిగించబడుతుంది. ఈ కార్యము దేవుడు శరీరధారిగా ఉన్న కాలంలోని కార్యాన్ని మాత్రమే సూచిస్తుంది; ఇది ఒక యుగానికి ప్రతినిధిగా ఉంటూ, ఇది ఒక నిర్దిష్టమైన యుగంలోని దేవుని ఆత్మ కార్యాన్ని సూచిస్తుందే గాని, ఆయన కార్యమంతటినీ సూచించుట లేదు. కాబట్టి, శరీరధారిగా మారిన దేవుని స్వరూపము ప్రజలందరికి చూపించబడదు. ప్రజలకు ఆయన రెండు సార్లు శరీరధారి అయినప్పటి తన స్వరూపము కంటే, దేవుని నీతి మరియు నిత్యత్వంలోని తన స్వభావము చూపించబడుతుంది. ఇది మనిషికి చూపబడిన ఒకే ఒక్క రూపమో, లేదా రెండు రూపాలను జోడించినదో కాదు. అందువల్ల, శరీరధారియైన దేవుడు ఆయన చేయవలసిన కార్యమును పూర్తి చేసిన తరువాత ఈ భూలోకమును తప్పక విడిచి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన చేయవలసిన కార్యం చేయుటకే ఆయన వచాడు కానీ ఆయన స్వరూపమును చూపించుకొనుటకు ఆయన రాలేదు. దేవుడు రెండు మార్లు శరీరధారిగా మారి తన శరీరావతారపు ప్రాముఖ్యతను నెరవేర్చినప్పటికి, మునుపెన్నాడు చూడని విధంగా ఏ దేశానికి తనను తాను ప్రత్యక్షపరచుకోలేదుయేసు మరలా తనను తాను యూదులకు నీతి సూర్యునిగా ఎన్నడూ కనుపరచుకోడు, లేదా ఒలీవల కొండమీద నిలబడి ప్రజలందరికీ కనిపించడు; యూదులందరూ యేసు యూదయలో ఉన్న కాలంలోని ఆయన చిత్రపటాన్ని చూశారు. ఇది ఇలా ఎందుకంటే యేసు శరీరధారిగా చేసిన కార్యము రెండువేల సంవత్సరాల క్రితమే ముగిసింది; యూదుని రూపంలో ఆయన యూదయకు తిరిగి రాడు, అన్య దేశాలలో దేనికైనా తనను తాను యూదుని రూపంలో కనుపరచుకోడు, ఎందుకంటే శరీరునిగా మారిన యేసు రూపము కేవలం ఒక యూదుని రూపమే గాని, యోహాను చూసిన మనుష్యకుమారుని రూపము కాదు. తాను తిరిగి వస్తానని యేసు తన శిష్యులకు వాగ్దానం చేసినప్పటికీ, అన్య దేశాల్లో ఉన్న వారందరికి ఆయన యూదుని రూపంలో తనను తాను కనుపరచుకోడు. శరీరధారిగా దేవుని కార్యము ఒక యుగాన్ని ఆవిష్కరించడానికి అని మీరు తెలుసుకోవాలి. ఈ కార్యము కొన్ని సంవత్సరాలకే పరిమితం చేయబడింది, మరియు ఆయన దేవుని ఆత్మ కార్యాన్ని పూర్తి చేయలేడు, యూదునిగా ఉన్న యేసు రూపం ఆయన యూదయలో కార్యము చేసిన దేవుని రూపాన్ని మాత్రమే సూచిస్తుంది కాబట్టి సిలువ కార్యాన్ని మాత్రమే ఆయన చేయగలడు. యేసు శరీరధారిగా ఉన్న కాలంలో, యుగాన్ని అంతం చేసే లేదా మానవ జాతిని నాశనం చేసే కార్యాన్ని చేయలేకపోయాడు. కాబట్టి, ఆయన సిలువ వేయబడి తన కార్యాన్ని ముగించిన తర్వాత, ఆయన అత్యున్నత స్థలానికి ఆరోహణమై మానవుని నుండి తనను తాను శాశ్వతంగా మరుగు చేసుకున్నాడు. అప్పటి నుండి, అన్య దేశాలకు చెందిన నమ్మకమైన విశ్వాసులు కేవలం గోడపై వారు అతికించిన ఆయన చిత్రపటాన్నే గాని, యేసు ప్రభువు ప్రత్యక్షతను చూడలేకపోయారు. ఈ చిత్రపటము మనిషిచే గీయబడిందే గాని, అది తనను తాను మనిషికి కనుపరచుకున్న రూపమైన దేవుని స్వరూపం కాదు. దేవుడు రెండుసార్లు శరీరధారిగా ఉన్నట్లు ప్రజలకు తనను తాను బహిరంగంగా కనుపరచుకోడు. మనుష్యుల మధ్య ఆయన చేసే కార్యము, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వారిని అనుమతిస్తుంది. ఇదంతా వేర్వేరు యుగాలలోని కార్యము ద్వారా మనిషికి కనుపరచబడుతుంది; అది యేసు ద్వారా వ్యక్తపరచిన దాని వలన కాకుండా ఆయన స్వభావం, ఆయన తెలియజేసిన కార్యము ద్వారా సాధించబడుతుంది. అది శరీరధారిగా ఉన్న రూపము ద్వారా దేవుని స్వరూపము మనుష్యునికి తెలుపబడలేదు గాని శరీరము మరియు స్వరూపము ఉన్న దేవుని స్వరూపములో జరిగించబడిన కార్యము ద్వారా అది తెలియపరచబడియున్నది. ఇదే ఆయన శరీరమందు చేయాలనుకున్న కార్యపు యొక్క ప్రాముఖ్యతయైయున్నది.
దేవుడు రెండు మార్లు శరీరధారిగా తన కార్యము ముగియగానే, అవిశ్వాసుల దేశాలన్నిటిలో ఆయన తన నీతి యుక్తమైన స్వభావమును చూపించడం, జన సమూహము తన రూపాన్ని చూడడానికి అనుమతిస్తాడు. ఆయన తన స్వభావాన్ని వ్యక్తపరిచి, దీని ద్వారా భిన్నమైన మానవ జాతుల ముగింపులను స్పష్టంచేసి, ఆవిధంగా పాత యుగాన్ని పూర్తిగా ముగిస్తాడు. శరీరమందు ఆయన కార్యము ఒక పెద్ద ప్రపంచంలో విస్తరించకపోవడానికి కారణం (ఎలాగైతే యేసు యూదయలో మాత్రమే కార్యం చేశాడో, ఈరోజు నేనూ మీ మధ్య మాత్రమే కార్యం చేస్తున్నాను) ఎందుకంటే శరీరమందున్న ఆయన కార్యానికి సరిహద్దులు మరియు పరిమితులు ఉన్నాయి. ఆయన సామాన్యమైన సాధారణమైన శరీర రూపంలో తక్కువ కాలవ్యవధి గల కార్యాన్ని మాత్రమే చేస్తున్నాడు; ఆయన ఈ అవతార దేహాన్ని నిత్యత్వపు కార్యాన్ని చేయడానికి లేదా అవిశ్వాసుల దేశాల ప్రజలకు ప్రత్యక్షమయ్యే కార్యానికి ఉపయోగించడం లేదు. శరీరమందు చేసే కార్యము ఒక పరిధికి మాత్రమే పరిమితం చేయొచ్చు (కేవలం యూదయలో లేదా కేవలం మీ మధ్యలో కార్యం చేయడం లాంటివి), ఆపై ఈ పరిమితులలో జరిగించబడే కార్యము ద్వారా, దాని పరిధిని అప్పుడు విస్తరించవచ్చు. నిజానికి, విస్తరణ కార్యము ఇకపై ఆయన శరీరధారిగా చేయు కార్యముగా కాకుండా, నేరుగా ఆయన ఆత్మ ద్వారా జరిగించబడుతుంది. ఎందుకంటే శరీరమందున్న కార్యానికి హద్దులు ఉన్నాయి మరియు లోకంలోని అన్ని మూలలకు విస్తరించదు—ఇది దీన్ని సాధించలేదు. శరీరమందున్న కార్యము ద్వారా, ఆయన ఆత్మ అనుసరించాల్సిన కార్యాన్ని జరిగిస్తుంది. అందువల్ల, శరీరమందు చేసిన కార్యము ప్రారంభ స్వభావాన్ని కలిగి నిర్దిష్టమైన పరిమితుల్లో జరిగించబడుతుంది; దీని తరువాత ఆయన ఆత్మ ఈ కార్యాన్ని కొనసాగిస్తూ, ఇంకా అపరిమిత పరిధిలో కూడా ఆయన అలానే చేస్తాడు.
దేవుడు యుగాన్ని నడిపించడానికి భూమిపై కార్యము చేయడానికి మాత్రమే వస్తాడు; ఆయన ఉద్దేశం కేవలం ఒక కొత్త యుగాన్ని ప్రారంభించడం మరియు పాత దాన్ని అంతం చేయడం. ఆయన భూమిపై ఒక మనిషి జీవితాన్ని గడపడానికి, మానవ ప్రపంచపు జీవితంలోని సంతోషాలను బాధలను ఆయనే స్వయంగా అనుభవించడానికి, లేదా ఒక నిర్ణీత వ్యక్తిని ఆయన చేతితో పరిపూర్ణ పరచడానికి లేదా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా చూడడానికి రాలేదు. ఇది ఆయన పని కాదు; ఆయన పని కేవలం కొత్త యుగాన్ని ప్రారంభించి పాత దానికి ముగింపు తీసుకురావడం మాత్రమే. అంటే, ఆయన వ్యక్తిగతంగా ఒక యుగాన్ని ప్రారంభిస్తాడు, వ్యక్తిగతంగా వేరొక దానికి అంతం చేస్తాడు, వ్యక్తిగతంగా తన కార్యాన్ని జరిగించడం ద్వారా సాతాన్ని ఓడిస్తాడు. ఆయన తన కార్యాన్ని వ్యక్తిగతంగా జరిగించే ప్రతిసారి, ఆయన యుద్ధ భూమిపై కాలు మోపినట్టుగా ఉంటుంది. మొదట, ఆయన లోకాన్ని జయించి శరీరధారిగా ఉన్నప్పుడే సాతాను మీద విజయం సాధిస్తాడు; ఆయన సమస్త మహిమను స్వాధీనం చేసుకుని రెండువేల సంవత్సరాల కార్యానికి తెర లేపుతాడు, తద్వారా భూమిపై ఉన్న ప్రజలందరూ నడవడానికి సరైన మార్గం మరియు శాంతి సంతోషాలతో కూడిన జీవితం కలిగి ఉండేలా చేస్తాడు. అయితే, భూమిపై దేవుడు మనిషితో ఎక్కువ కాలం జీవించలేడు, ఎందుకంటే దేవుడు దేవుడే, కనీసం మనిషిలాంటి వాడూ కాదు. ఒక సాధారణ వ్యక్తి జీవిత కాలాన్ని ఆయన జీవించలేడు, అంటే, ఆయన సాధారణ వ్యక్తిగా ఏమీ లేనివాడిగా భూమిపై నివసించలేడు, ఎందుకంటే ఆయన తన మానవ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సామాన్యమైన వ్యక్తి లోని సాధారణ మానవత్వంలో కొద్దిపాటి భాగాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఒక కుటుంబాన్ని ప్రారంభించి, ఉపాధిని కలిగి, భూమిమీద పిల్లలను ఎలా పెంచగలడు? ఇది ఆయనకు అవమానం కాదా? ఆయన సాధారణ మానవ స్వభావాన్ని కలిగి ఉన్నది సాధారణ పద్ధతిలో కార్యాన్ని జరిగించడం కోసం మాత్రమే, కానీ ఒక సాధారణ వ్యక్తికి లాగా కుటుంబాన్ని ఉపాధిని కలిగి ఉండటానికి కాదు. ఆయన సాధారణ జ్ఞానము, మామూలు మనసు, ఆయన శరీరానికి ఆహారము మరియు దుస్తులు అనేవి ఆయనకు సాధారణ మానవ స్వభావముందని నిరూపించడానికి సరిపోతాయి; ఆయన సాధారణ మానవ స్వభావము చేత కూర్చబడ్డాడని నిరూపించడానికి ఆయనకు కుటుంబం లేదా ఉపాధి ఉండాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా అనవసరమైనది! దేవుడు భూమి మీదికి రావడమంటే వాక్యము శరీరంగా మారడం; మనిషి తన వాక్యాన్ని అర్థం చేసుకొని తన వాక్యాన్ని చూడడానికి ఆయన మాములుగానే అనుమతిస్తున్నాడు, అంటే, శరీరం ద్వారా జరిగించబడే కార్యాన్ని చూడడానికి మనిషిని అనుమతిస్తున్నాడు. ప్రజలు ఆయన శరీరాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో గౌరవించాలనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ మనిషి చివరి వరకు విధేయతతో ఉండడం కోసం మాత్రమే, అంటే ఆయన నోటి నుండి వెలువడే వాక్యాలన్నిటికి విధేయుడై, ఆయన చేసే కార్యమంతటికి లోబడాలి. ఆయన శరీరమందు మాత్రమే కార్యము చేస్తున్నాడు; ఆయన ఉద్దేశపూర్వకంగా మనిషిని తన శరీరపు గొప్పతనాన్ని మరియు పరిశుద్దతను కొనియాడమని అడగడం లేదు, దానికి బదులుగా తన కార్యపు జ్ఞానాన్ని మరియు తన సర్వాధికారాన్ని మానవునికి చూపిస్తున్నాడు. అందువల్ల, ఆయన విశిష్టమైన మానవ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా, ఆయన చేయాల్సిన కార్యంమీద మాత్రమే దృష్టి పెడతాడు. దేవుడు ఎందుకు శరీరధారి అయ్యాడు మరియు ఇప్పటికీ ఆయన సాధారణ స్వభావాన్ని గూర్చి ప్రకటించడం లేదా సాక్ష్యమివ్వడం చేయకుండా, బదులుగా ఆయన చేయాలనుకున్న కార్యాన్ని మాత్రమే నిర్వహిస్తాడో మీరు తెలుసుకోవాలి. అప్పుడు, ఆయన దైవసంకల్పము చొప్పున ఏమై ఉన్నాడో శరీరధారి అయిన దేవుని నుండి మాత్రమే మీరు చూడగలరు; ఎందుకంటే మనిషి అనుసరించడానికి ఆయన మానవ స్వభావపరంగా ఏమై ఉన్నాడో ఆయన ఎప్పుడు ప్రకటించడు. ఒక మనిషి ప్రజలను నడిపించేటప్పుడు మాత్రమే అతడు మాట్లాడే మానవ ధర్మం ఏమిటంటే, వారి అబిమానాన్ని మరియు నమ్మకాన్ని పొందడం ఆ తరువాత ఇతరుల నాయకత్వాన్ని పొందడం మంచిది. దీనికి భిన్నంగా, దేవుడు తన కార్యము ద్వారా మాత్రమే మనిషిని జయిస్తాడు (అది, మనిషి అసాధ్యమైన పని); ఆయన మనిషి చేత అభిమానించబడ్డాడా లేదా మనిషి తనను ఆరాధించేలా చేశాడా అనేది ముఖ్యం కాదు. ఆయన చేసేదంతా మనిషిలో తన పట్ల భక్తి భావనను లేదా అపారమైన తన జ్ఞానాన్ని కలిగించడమే. మనిషిని మెప్పించాల్సిన అవసరం దేవునికి లేదు; ఆయనకు కావలసిందల్లా నీవు ఆయన స్వభావాన్ని చూసిన తర్వాత ఆయనను నీవు గౌరవించడమే. దేవుడు కార్యాన్ని తన స్వంతంగా చేస్తాడు; ఆయన స్థానంలో మనిషి దాన్ని చేయలేడు, మరియు మనిషి దాన్ని సాధించలేడు. స్వయంభవుడైన దేవుడు మాత్రమే తన సొంత కార్యమును చేయగలడు మరియు మనిషిని నూతన జీవన విధానాల్లోకి నడిపించే కొత్త యుగానికి నాంది పలకగలడు. ఆయన చేసే కార్యము మనిషిని కొత్త జీవితాన్ని సొంతం చేసుకొని, కొత్త యుగంలోకి ప్రవేశించేలా చేస్తుంది. మిగిలిన పని ఇతరులు మెచ్చుకునే సాధారణ మానవ స్వభావమున్న వారికే అప్పగించబడుతుంది. కాబట్టి, కృపా కాలంలో, ఆయన శరీరునిగా ఉన్న తన ముప్పై మూడు సంవత్సరాలలోని కేవలం మూడున్నర సంవత్సరాల వ్యవధిలోనే రెండు వేల సంవత్సరాల కార్యాన్ని పూర్తి చేశాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి భూమి పైకి వచ్చినప్పుడు, ఆయన ఎప్పుడూ రెండు సంవత్సరాల లేదా సర్వ యుగపు కార్యాన్ని కొన్ని సంవత్సరాల తక్కువ వ్యవధిలోనే పూర్తి చేస్తాడు. ఆయన ఆలస్యం చేయడు, మరియు ఆయన కాలయాపన చేయడు; అనేక సంవత్సరాల కార్యాన్ని కాస్త తక్కువ సంవత్సరాలలో పూర్తిచేయడానికి ఆయన దాన్ని కుదిస్తాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చేసే కార్యం పూర్తిగా నూతన మార్గాన్ని ఆవిష్కరించి కొత్త యుగానికి నడిపించడం కోసమే.