ఏడు ఉరుముల గర్జన—దేవుని రాజ్య సువార్త విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రవచించడం
అన్య దేశాల్లో నేను నా కార్యమును వ్యాపింపజేస్తున్నాను. నా మహిమ విశ్వమంతటా ప్రకాశిస్తుంది; అన్నిరకాల మనుష్యులు నా సంకల్పాన్ని మనసులో ఉంచుకుంటారు, వారందరినీ నా చేతితో నడిపిస్తాను మరియు నేను అప్పగించిన పనుల కోసం సిద్ధం చేస్తాను. ఈ క్షణం నుండి, మనుష్యులందరినీ మరో లోకంలోకి తీసుకువస్తూ నేను కొత్త కాలము లోనికి ప్రవేశించాను. నేను నా “మాతృభూమి” కి తిరిగి వచ్చినప్పుడు, మనిషి నన్ను మరింత లోతుగా తెలుసుకోగలగడానికి వీలుగా నా అసలు ప్రణాళికలోని కార్యంలో ఇంకో భాగాన్ని మొదలుపెట్టాను. నేను విశ్వాన్ని దాని సంపూర్ణతతో ఆదరిస్తాను మరియు నా కార్యానికి అనుకూలమైన సమయంగా దానిని చూస్తాను[ఎ], కాబట్టి మనుష్యులలో నా కొత్త కార్యమును చేయడానికి నేను వీటన్నింటి గురించి తొందరపడుతున్నాను. అన్నింటికి మించి, ఇది ఒక కొత్త కాలం, కొత్త కాలంలోకి మరింతమంది కొత్త వ్యక్తులను తీసుకోవడానికి మరియు నేను తొలగించబోయే వారిలో మరింత మందిని పరిత్యజించడానికి నేను కొత్త కార్యాన్ని తీసుకువచ్చాను. గ్రేట్ రెడ్ డ్రాగన్ దేశంలో, మానవులు గాలిలో ఊగిసలాడేలా వారికి అంతుపట్టని కార్యపు దశను నేను నిర్వహించాను, ఆ తర్వాత చాలా మంది గాలి వేగంతో మౌనంగా కొట్టుకొనిపోయారు. నిజంగా, ఇది నేను శుభ్రం చేయబోతున్న “నూర్పిడి నేల”; ఇదే నేను ఆకాంక్షించేది మరియు ఇదే నా ప్రణాళిక కూడా. ఎందుకంటే నేను కార్యంలో లీనమై ఉన్నప్పుడు అనేకమంది దుష్టులు చొరబడ్డారు, కానీ వారిని దూరంగా పారద్రోలడానికి నాకు తొందరలేదు. దానికి బదులుగా, సరైన సమయం వచ్చినప్పుడు వారిని నేను చెల్లాచెదరు చేస్తాను. ఆతర్వాత మాత్రమే నేను నన్ను నిజంగా ప్రేమించే వారు నా నుండి అంజీర చెట్టు పండ్లను మరియు లిల్లీ సువాసనను స్వీకరించడానికి అనుమతిస్తూ జీవాన్ని వెదజల్లే ఫౌంటైన్‌గా ఉంటాను. సాతాను నివాసం చేసే భూమిలో, దుమ్ము కొట్టుకు పోయిన భూమిలో, స్వచ్ఛమైన బంగారం లేకుండా ఇసుక మాత్రమే ఉంటుంది, కాబట్టి, ఇలాంటి పరిస్థితులకు తగినట్లు, నేను అలాంటి కార్యపు దశను చేస్తాను. నేను పొందేది స్వచ్ఛమైన, శుద్ధి చేసిన బంగారమే తప్ప, ఇసుక కాదు అని మీరు తెలుసుకోవాలి. దుష్టులు నా ఇంట్లో ఎలా ఉండగలరు? జిత్తులమారి నక్కలను నా స్వర్గంలో పరాన్నజీవులుగా ఎలా నేను అనుమతించగలను? వీటిని దూరంగా పారద్రోలడానికి నేను ఊహించదగ్గ ప్రతీ పద్ధతిని ఉపయోగిస్తాను. నా సంకల్పం ప్రకటించబడటానికి ముందు, నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, నేను ఆ దుష్టులను దూరంగా తరిమికొడతాను మరియు వారు నా సమక్షాన్ని విడిచిపెట్టడానికి బలవంతం చేయబడతారు. దుష్టులకు నేను చేసేది ఇదే, కానీ ఇప్పటికీ నాకు సేవ చేయడానికి వారికి ఒక రోజంటూ ఉంటుంది. ఆశీర్వాదాల కోసం మనుష్యుల కోరిక చాలా బలీయమైనది; కాబట్టి మనుష్యులందరూ వారి సొంత ప్రపంచంలో నివసించి, తమకు తాము తీర్పు ఇచ్చుకునేలా నేను చెప్పవలసిన మాటలు చెబుతూ, మనుష్యులకు అవసరమైన వాటిని వారికి సరఫరా చేస్తూనే, నేను నా శరీరాన్ని వెనక్కు త్రిప్పి, నా మహిమగల అనుగ్రహాన్ని అన్యులకు చూపిస్తాను. మనుష్యులు తమ స్పృహలలోకి వచ్చినప్పుడు, నేను అప్పటికే నా కార్యమును చాలా దూరం వ్యాపింపజేసి ఉంటాను. అప్పుడు నేను మనుష్యులకు నా సంకల్పాన్ని తెలియజేస్తాను మరియు నా కార్యంతో సమన్వయం చేసుకోవడానికి మనుష్యులందరూ నన్ను దగ్గరగా అనుసరించేలా, నేను తప్పక చేయవలసిన కార్యాన్ని నాతో కలిసి చేయడానికి మనుష్యులు వారి శక్తిమేరకు చేసేలా అనుమతిస్తూ మనుష్యులలో నా కార్యం రెండవ భాగాన్ని ప్రారంభిస్తాను.
నా మహిమను చూడబోతామనే నమ్మకం ఎవరికీ లేదు మరియు నేను వారిని బలవంతం చేయను, దానికి బదులుగా నా మహిమను మానవజాతి మధ్య నుండి తొలగించి దానిని మరొక ప్రపంచానికి తీసుకువెళతాను. మనుష్యులు మరోసారి పశ్చాత్తాపపడినప్పుడు, నేను నా మహిమను వెనక్కు తీసుకుని విశ్వాముగల ఇంకా ఎక్కువ మందికి చూపుతాను. నేను ఈ సూత్రం ద్వారానే పనిచేస్తాను. ఎందుకంటే, నా మహిమ కనానును విడిచి పెట్టే ఒక సమయం ఉంటుంది మరియు ఎంచుకున్నవారిని నా మహిమ విడిచిపెట్టే సమయం కూడా ఒకటి ఉంటుంది. అంతేకాకుండా, నా మహిమను మసకబారేలా మరియు అంధకారంలో మునిగిపోయేలా చేస్తూ, అది ఈ మొత్తం భూమిని విడిచిపెట్టే సమయం ఒకటి ఉంటుంది. కనాను దేశం కూడా సూర్యకాంతిని చూడదు; మనుష్యులందరూ తమ విశ్వాసాన్ని కోల్పోతారు, కానీ కనాను దేశం సువాసనను విడిచిపెట్టడాన్ని ఎవరూ భరించలేరు. నేను కొత్త స్వర్గం మరియు భూమిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నేను నా మహిమలో మరో భాగాన్ని తీసుకుంటాను మరియు దానిని మొదట కనాను దేశంలో వెల్లడిస్తాను, ఇది కటిక చీకటిలో మునిగిపోయిన మొత్తం భూమిలో కాంతి మెరిసేలా చేస్తూ ఈ భూమి మొత్తం ప్రకాశించేలా చేస్తుంది; నా మహిమ పెరిగేలా మరియు ప్రతి జాతికి సరికొత్తగా కనిపించేలా చేస్తూ, లోకంలోని సమస్త జనులు ఈ కాంతి శక్తి నుండి బలాన్ని పొందవచ్చు; మరియు నేను చాలా కాలం క్రితమే మనుష్య ప్రపంచానికి వచ్చానని మరియు చాలా కాలం క్రితమే నా మహిమను ఇశ్రాయేలు నుండి తూర్పుకు తీసుకువచ్చానని మనుష్యులంతా గ్రహించవచ్చు; ఎందుకంటే, నా మహిమ తూర్పు నుండి ప్రకాశిస్తుంది మరియు అది కృపాకాలము నుండి ఈ రోజు వరకు తీసుకురాబడింది. కానీ, నేను దీనిని ఇశ్రాయేలు నుండే వదలివెళ్లాను మరియు అక్కడి నుండే నేను తూర్పుకు చేరుకున్నాను. తూర్పు కాంతి క్రమంగా తెల్లగా మారినప్పుడు మాత్రమే లోకమంతా ఉన్న చీకటి వెలుగుగా మారడం ప్రారంభమవుతుంది, అప్పుడు మాత్రమే నేను ఇశ్రాయేలు నుండి చాలా కాలం క్రితమే వెళ్లిపోయి, తూర్పున సరికొత్తగా ఉదయిస్తున్నానని మనుష్యులు కనుగొంటారు. ఇశ్రాయేలులో అవతరించి, ఆపై దాని నుండి వదిలివెళ్లిన తరువాత, నేను మళ్లీ ఇజ్రాయెల్‌లో పుట్టలేను, ఎందుకంటే నా కార్యం ఈ విశ్వం మొత్తాన్ని ముందుకు నడిపిస్తుంది మరియు ఇంకా చెప్పాలంటే, మెరుపు తూర్పు నుండి పడమరకు నేరుగా మెరుస్తుంది. ఈ కారణం చేత నేను తూర్పున అవతరించి తూర్పున ఉన్న మనుష్యులకు కనానును తీసుకువచ్చాను. నేను భూమి నలువైపుల నుండి మనుష్యులను కనాను దేశానికి తీసుకువస్తాను, కాబట్టి నేను విశ్వమంతటినీ నియంత్రించడానికి వాక్యములను వెల్లడించడం కనాను దేశంలో కొనసాగిస్తాను. ఈ సమయంలో, కనానులో తప్ప లోకమంతా కాంతి ఉండదు మరియు మనుష్యులందరూ ఆకలి మరియు చలితో తల్లడిల్లుతారు. నేను నా మహిమను ఇశ్రాయేలుకు ఇచ్చి, ఆపై దానిని వెనక్కు తీసుకున్నాను, ఆవిధంగా ఇశ్రాయేలీయులను తూర్పుకు మరియు మానవాళి మొత్తాన్ని తూర్పుకు తీసుకువచ్చాను. వారు కాంతితో తిరిగి ఏకమయ్యేలా, దాని సాంగత్యంలో ఉండేలా మరియు దాని కోసం ఇకపై వెతకవలసిన అవసరం లేకుండా నేను వారందరినీ వెలుగులోకి తెచ్చాను. కాంతిని మళ్లీ చూడటానికి మరియు ఇశ్రాయేలులో నేను కలిగిన మహిమను చూడటానికి శోధిస్తున్న వారందరినీ చూసేలా చేస్తాను; నేను చాలా కాలం క్రితం తెల్లటి మేఘం మీద కిందికి దిగి, మనుష్యుల మధ్యలోకి వచ్చానని వారు చూసేలా చేస్తాను, వారిని లెక్కలేనన్ని తెల్లటి మేఘాలు మరియు నిండైన గుత్తులతో పండ్లను చూసేలా చేస్తాను, ఇంకా చెప్పాలంటే, వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను చూసేలా చేస్తాను. నేను వారిని మెస్సియా కొరకు పరితపించే యూదుల బోధకుడిని మరియు యుగయుగాలుగా రాజులచే శిక్షించబడిన నా సంపూర్ణ రూపాన్ని చూడనిస్తాను. అంతిమ దినాలలో మనిషికి నా మహిమనంతా మరియు నా కార్యములన్నీ వెల్లడిస్తూ, నేను ఈ విశ్వమంతా పని చేస్తాను మరియు నేను గొప్ప కార్యమును చేస్తాను. నేను చాలా కాలం క్రితమే నా మహిమను తీసివేసి తూర్పుకు తీసుకువచ్చానని మరియు అది యూదయలో లేదని అందరూ తెలుసుకునేలా నా కోసం ఎన్నో ఏండ్లు ఎదురుచూసిన వారికి, తెల్లటి మేఘంపై నేను రావాలని పరితపించిన వారికి, నేను మళ్లీ కనిపించాలని పరితపించిన ఇశ్రాయేలుకి, నన్ను హింసించే సమస్త మనుష్యులకు నా మహిమగల అనుగ్రహాన్ని సంపూర్ణంగా చూపిస్తాను. ఎందుకంటే, అంతిమ దినాలు ఇప్పటికే వచ్చేశాయి!
విశ్వమంతటా నేను నా కార్యమును చేస్తున్నాను మరియు తూర్పున, అన్ని దేశాలను మరియు తెగలను వణికిస్తూ ఉరుములతో కూడిన పెళపెళమనే శబ్దాలు అనంతంగా వెలువడుతున్నాయి. మనుష్యులందరినీ వర్తమానంలోకి తీసుకువచ్చింది ఈ నా స్వరమే. నేను మనుష్యులందరూ నా స్వరంతో జయించబడేలా, ఈ ప్రవాహంలోకి పడిపోయేలా, నా ముందు సమర్పించుకునేలా చేస్తాను, ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను మొత్తం భూమి నుండి నా మహిమను తిరిగి పొందాను మరియు దానిని తూర్పున సరికొత్తగా వెల్లడించాను. నా మహిమను చూడాలని పరితపించని వారు ఎవరుంటారు? నా రాక కోసం ఆత్రుతతో ఎదురుచూడని వారు ఎవరుంటారు? నా పునర్దర్శనము కోసం దప్పికగొనని వారు ఎవరుంటారు? నా మనోహరత్వాన్ని తప్పించుకోవాలనే వారు ఎవరు ఉంటారు? వెలుగులోకి రాకుండా ఉండాలనుకునే వారు ఉంటారా? కనాను గొప్పతనాన్ని చూడకుండా ఉండే వారు ఉంటారా? విమోచకుని తిరిగి రాక కోసం పరితపించని వారు ఎవరుంటారు? గొప్ప శక్తివంతుడైన ఆయనను ఆరాధించని వారు ఎవరైనా ఉంటారా? నా స్వరం సమస్త లోకంలో వ్యాపిస్తుంది; నేను ఎంచుకున్న మనుష్యులకు ఎదురుగా నిలబడతాను మరియు వారికి మరిన్ని వాక్యములు చెబుతాను. పర్వతాలను, నదులను కదిలించే బలమైన ఉరుముల లాగా, ఈ మొత్తం విశ్వం మరియు మనుష్యులతో నేను నా వాక్యములు మాట్లాడుతాను. కాబట్టి నా నోటిలోని వాక్యములు మనుష్యులకు నిధిగా మారాయి మరియు మనుష్యులందరూ నా వాక్యములను ఆస్వాదిస్తారు. మెరుపు తూర్పు నుండి అపరిమితంగా పడమరకు మెరుస్తుంది. నా వాక్యములు ఎలా ఉంటాయంటే, మనిషి వాటిని వదులుకోవడానికి ఇష్టపడడు మరియు అదే సమయంలో వాటిని అంతుపట్టనివిగా భావిస్తాడు, అయినా వాటన్నింటినీ మరింతగా ఆనందిస్తాడు. అప్పుడే ఒక శిశువు జన్మించిందా అన్నట్లు నా రాకను వేడుక చేసుకుంటూ, మనుష్యులందరూ సంతోషంగా మరియు ఆనందంగా ఉంటారు. నా స్వరంతో మనుష్యులందరినీ నేను నా ముందుకు తెస్తాను. అప్పటినుండి, మనుష్యులు నన్ను ఆరాధించడానికి వచ్చేందుకు వీలుగా అధికారికంగా నేను మనుష్యజాతిలోకి ప్రవేశిస్తాను. నేను ప్రసరించే మహిమ మరియు నా నోటిలోని వాక్యములతో, మనుష్యులందరూ నా ముందుకు వచ్చేలా చేస్తాను మరియు తూర్పు నుండి మెరుపులు మెరియడాన్ని మరియు నేను తూర్పున ఉన్న “ఆలివ్ పర్వతం” మీదికి దిగడాన్ని చూసేలా చేస్తాను. ఇకపై యూదుల కుమారుడిగా కాకుండా తూర్పున మెరిసే మెరుపులాగా నేను ఇప్పటికే ఎంతో కాలం క్రితమే భూమిపై ఉన్నానని వారు చూస్తారు. ఎందుకంటే, నేను ఎంతో కాలం క్రితమే పునరుత్థానం చేయబడ్డాను మరియు మానవాళి మధ్య నుండి వెళ్లిపోయాను, ఆతర్వాత మనుష్యుల మధ్య మహిమతో తిరిగి కనిపించాను. ఈనాటికి ముందు లెక్కలేనన్ని కాలాలలో ఆరాధించబడిన వాడిని నేనే, ఈనాటికి ముందు లెక్కలేనన్ని కాలాలలో ఇశ్రాయేలీయులు వదిలివేసిన శిశువును కూడా నేనే. అంతేగాకుండా, ప్రస్తుత కాలానికి సమస్త మహిమ గల సర్వశక్తిమంతుడైన దేవుడిని నేనే! అందరు నా సింహాసనము ముందుకు వచ్చి నా మహిమగల అనుగ్రహాన్ని చూడండి, నా స్వరాన్ని వినండి మరియు నా కార్యములను చూడండి. ఇదే నా సంకల్పపు సంపూర్ణత; ఇదే నా ప్రణాళికా ముగింపు మరియు అంతిమ ఘట్టం, అలాగే నా నిర్వహణ ఉద్దేశం కూడా ఇదే: ప్రతి జాతి నన్ను ఆరాధించేలా, ప్రతి నాలుక నన్ను గుర్తించేలా, ప్రతి మనిషి నాపై విశ్వాసాన్ని తిరిగి నింపుకునేలా మరియు ప్రతి ఒక్కరూ నాకు లోబడి ఉండేలా చేయడమే!
ఫుట్‌నోట్:
ఎ. మూల వచనములో “దానిని చూస్తాను” అనే పదబంధం లేదు.