దేవుని కార్యపు దర్శనం (1)

యేసు కోసం యోహాను ఏడు సంవత్సరాలు పని చేశాడు, యేసు వచ్చే నాటికే మార్గం సరళం చేశాడు. దీనికి ముందు, యోహానుచే ప్రకటించబడిన పరలోకరాజ్య సువార్త దేశమంతటా వినపడింది, తద్వారా అది యూదయ అంతటా వ్యాపించి, ప్రతిఒక్కరూ అతనిని ప్రవక్త అని పిలిచారు. ఆ కాలంలో, రాజైన హేరోదు యోహానును చంపాలనుకున్నాడు, కానీ ధైర్యం చేయలేదు, ఎందుకంటే ప్రజలు యోహాను ఎంతో గౌరవించారు, కాబట్టి, తాను యోహానును చంపితే ప్రజలు తనపై తిరగబడతారని హేరోదు భయపడ్డాడు. యోహాను చేసిన కార్యము సాధారణ ప్రజలలో పాతుకుపోయింది, మరియు అతడు యూదులలో విశ్వాసులను తయారుచేసుకున్నాడు. ఏడు సంవత్సరాల పాటు, అంటే, సరిగ్గా యేసు తన పరిచర్య నిర్వహణను ప్రారంభించే సమయం వచ్చే ముందు వరకు అతను యేసు కోసం మార్గం సరళం చేశాడు. ఈ కారణంగానే, యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడయ్యాడు. యోహాను చెరసాలలో వేయబడిన తరువాత మాత్రమే యేసు ఆయన అధికారిక కార్యాన్ని ఆరంభించాడు. యోహానుకు ముందు, దేవుని కోసం మార్గాన్ని సరళం చేసిన ప్రవక్త లేనే లేడు, ఎందుకంటే యేసుకు ముందు, అదివరకెన్నడూ దేవుడు శరీరునిగా మారలేదు. కాబట్టి, యోహాను ముందు వరకున్న ప్రవక్తలందరిలోకెల్లా, శరీరధారి అయిన దేవునికి ఈ విధంగా మార్గం సరళం చేసింది అతడు మాత్రమే, పాత మరియు క్రొత్త నిబంధనలలో యోహాను ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. యేసు బాప్తీస్మానికి ముందు యోహాను పరలోక రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రజలకు, అతడు చేసిన కార్యమనేది ఆ తదుపరి యేసు చేసిన కార్యము కంటే ఎక్కువగా అగుపడింది, అయినప్పటికీ, అతడు, ఇంకా ఒక ప్రవక్తే. అతడు పనిచేసింది మరియు మాట్లాడింది మందిరంలో కాదు, కానీ పట్టణాలలో మరియు సాని వెలుపటి పల్లెలలో. వాస్తవానికి, అతడు, యూదా దేశ ప్రజలు, ప్రత్యేకించి నిరుపేదల మధ్య దీనిని చేశాడు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో యోహాను మాట్లాడం చాలా అరుదు, మరియు అతడు సామాన్యులైన యూదయ ప్రజల మధ్య మాత్రమే సువార్త ప్రకటించేవాడు. ప్రభువైన యేసు కొరకు సరైన వ్యక్తులను తయారుచేసి, మరియు ఆయన కార్యము చేయడానికి అనువైన ప్రదేశాలను సిద్దపరచడానికే ఇలా చేశాడు. మార్గం సరళం చేయడానికి యోహాను వంటి ప్రవక్తతో, ప్రభువైన యేసు ఆయన వచ్చిన వెంటనే తన సిలువ మార్గాన్ని నేరుగా ప్రారంభించాడు. దేవుడు ఆయన కార్యాన్ని చేయడానికి శరీరునిగా మారినప్పుడు, ఆయన ప్రజలను ఎన్నుకునే కార్యాన్ని చేయనవసరం లేదు మరియు వ్యక్తిగతముగా ప్రజలను మరియు కార్యం చేసే ప్రదేశాన్ని వెదకనవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు ఇలాంటి పని చేయనవసరం లేదు; ఆయన వచ్చే ముందు ఆయన కోసం ఇలాంటి పనులన్నీ సరైన వ్యక్తి ఇదివరకే సిద్దపరిచాడు. యేసు తన కార్యాన్ని ప్రారంభించక ముందు యోహాను ఇదివరకే ఈ కార్యాన్ని పూర్తి చేశాడు, కావున శరీరధారి అయిన దేవుడు తన కార్యాన్ని చేయడానికి వచ్చినప్పుడు, ఆయన కోసం ఎంతో కాలంగా కనిపెట్టుచూ ఉన్నవారి పట్ల ఆయన నేరుగా కార్యం చేశాడు. మనిషిని చక్కబెట్టే కార్యాన్ని చేయడానికి యేసు రాలేదు, తాను నిర్వహించవలసిన పరిచర్యను నిర్వహించడానికి మాత్రమే ఆయన వచ్చాడు; మిగిలిన వాటితో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు. యోహాను వచ్చినప్పుడు, ప్రభువైన యేసు కార్యానికి సాధనాలుగా మారగల, పరలోక రాజ్య సువార్తను అంగీకరించిన ఒక సమూహాన్ని యూదుల మధ్య నుండి మరియు దేవాలయము నుండి వెలుపలకు తీసుకురావడం తప్ప అతడు మరేమీ చేయలేదు. యోహాను ఏడు సంవత్సరాలు పని చేశాడు, అంటే అతడు ఏడు సంవత్సరాలు సువార్తను ప్రకటించాడని చెప్పవచ్చు. అతని పని కాలంలో, అతని పని మార్గం సరళం చేయడమే కాబట్టి, అతడు ఎన్నెన్నో అద్భుతాలేమీ చేయలేదు; అతని పని సిద్దపరిచే కార్యక్రమం మాత్రమే. మిగిలిన కార్యమంతా, యేసు చేయబోయే కార్యం, దానితో అతనికి సంబంధం లేదు; అతడు కేవలం మనిషి. తమ పాపాలు ఒప్పుకుని, పశ్చాత్తాపపడాల్సిందిగా ప్రజలను కోరాడు, తద్వారా వారు రక్షింపబడటానికి, వారికి బాప్తీస్మమిచ్చాడు. అతడు నూతన కార్యం చేసి, మనిషి ఇంతకుముందు ఎన్నడూ నడవని మార్గాన్ని ఆవిష్కరించినప్పటికీ, అతడు ఇంకా యేసు కొరకు మాత్రమే మార్గం సరళం చేశాడు. సిద్దపరిచే కార్యక్రమాన్ని చేసిన ప్రవక్త ఇతడు మాత్రమే, మరియు యేసు కార్యాన్ని ఇతడు చేయలేడు. పరలోక రాజ్య సువార్తను ప్రకటించిన మొదటి వ్యక్తి యేసు కాకపోయినప్పటికీ, యోహాను ప్రారంభించిన మార్గంలోనే ఆయన కొనసాగినప్పటికీ, ఆయన కార్యము చేసేవారు ఇప్పటికీ ఎవరూ లేరు, మరియు అది యోహాను కార్యము కంటే ఉన్నతమైనది. యేసు తన స్వంత మార్గాన్ని సిద్దపరచుకోలేకపోయాడు; దేవుని తరపున ఆయన కార్యము నేరుగా కొనసాగించబడింది. కాబట్టి, యోహాను ఎన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ, అతనింకా మార్గం సరళం చేసిన ఒక ప్రవక్తగానే ఉన్నాడు. యేసు చేసిన మూడు సంవత్సరాల కార్యము యోహాను చేసిన ఏడు సంవత్సరాల పనిని అధిగమించింది. ఎందుకంటే, ఆయన కార్యపు పరమార్థము ఒకేలా లేదు. యేసు తన పరిచర్యను జరిగించడం ప్రారంభించినప్పుడు, యోహాను పని ముగింపునకు వచ్చినప్పుడు కూడా, ప్రభువైన యేసు ఉపయోగించుకోడానికి తగినంతమంది ప్రజలు మరియు ప్రదేశాలను యోహాను సిద్దపరిచాడు, ప్రభువైన యేసు మూడు సంవత్సరాల కార్యాన్ని ప్రారంభించడానికి వారు సరిపోతారు. కాబట్టి, యోహాను కార్యము ముగించబడిన వెంటనే, ప్రభువైన ఏసు తన కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించాడు, మరియు యోహాను చెప్పిన మాటలు పక్కన పెట్టబడ్డాయి. ఎందుకంటే, యోహాను చేసిన కార్యము కేవలం పరివర్తన కోసం మాత్రమే, మరియు అతని మాటలు మనిషిని నూతన ఎదుగుదలకు నడిపించే జీవపు మాటలు కాదు; అంతిమంగా, అతని మాటలు తాత్కాలిక ప్రయోజనానికి మాత్రమే.

యేసు చేసిన కార్యము అద్భుతమైనదేమీ కాదు; దానికి ఒక ప్రక్రియ ఉన్నది, మరియు అవన్నీ పనుల సాధారణ కట్టడల ప్రకారం వృద్ది చెందింది. ఆయన చివరి ఆరు నెలల నాటికి, ఆయన ఈ కార్యాన్ని చేయడానికి వచ్చినట్లుగా, యేసుకు ఖచ్చితంగా తెలుసు, మరియు తాను సిలువ వేయబడటానికి వచ్చాడనీ ఆయనకు తెలుసు. ఆయన సిలువ వేయబడటానికి ముందు, ఆయన గేత్సేమనే తోటలో మూడు సార్లు ప్రార్థించినట్టుగానే, తండ్రి అయిన దేవుడిని యేసు విడవక ప్రార్థించాడు. బాప్తీస్మము పొందిన తరువాత, యేసు మూడున్నర సంవత్సరాలు తన పరిచర్యను నిర్వహించాడు, మరియు తన అధికారిక కార్యం రెండున్నర సంవత్సరాలు కొనసాగింది. మొదటి సంవత్సరంలో, ఆయన సాతానుచే నిందించబడి, మానవునిచే వేధించబడ్డాడు మరియు మానవ శోధనకు గురయ్యాడు. ఆయన తన కార్యాన్ని కొనసాగించేటప్పుడు, ఆయన ఎన్నో శోధనలను జయించాడు. చివరి ఆరు నెలలలో, యేసు త్వరలో సిలువ వేయబడే ముందు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు అనే మాటలు పేతురు నోట నుండి వచ్చాయి. అప్పుడు మాత్రమే ఆయన కార్యము అందరికీ అర్ధమయ్యింది, మరియు అప్పుడు మాత్రమే ఆయన ఎవరనేది ప్రజలకు బహిర్గతమయింది. దాని తరువాత, యేసు ఆయన శిష్యులతో తాను మనుష్యుని కోసం సిలువ వేయబడబోతున్నానని, మరియు మూడు దినాల తరువాత తాను తిరిగి లేస్తానని; విమోచన కార్యము జరిగించడానికి తాను వచ్చానని, మరియు తానే రక్షకుడని చెప్పాడు. చివరి ఆరు నెలల్లో మాత్రమే తాను ఎవరనేది మరియు తాను చేయాలనుకున్న కార్యాన్ని ఆయన బయలుపరిచాడు. ఇది కూడా దేవుని సమయమే, మరియు ఈవిధంగా కార్యము జరిగించబడాలి. ఆ సమయంలో, యేసు కార్యంలో కొంత భాగము పాత నిబంధన, అలాగే ధర్మ శాస్త్ర కాలంలోని యెహోవా మరియు మోషే మాటలకు అనుగుణంగా ఉన్నది. ఈ విషయాలన్నీ, తన కార్యంలో భాగంగా చేసేవాడు. ఆయన ప్రజలకు ప్రకటించి మరియు సమాజ మందిరాలలో వారికి బోధించాడు, మరియు తనతో శత్రుత్వాన్ని కలిగి ఉన్న పరిసయ్యులను గద్దించడానికి ఆయన పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలను ఉపయోగించి, మరియు వారి అవిధేయతను వెల్లడి చేసి వారిని ఖండించడానికి ఆయన లేఖనాలలోని వాక్యాలను ఉపయోగించాడు. కానీ వారు యేసు చేసిన దానిని; ప్రత్యేకించి, యేసు కార్యములో చాల వరకు ధర్మ శాస్త్రంలోని విధులకు అనుగుణంగా జరగలేదని తృణీకరించారు, అంతేగాక, ఆయన బోధించినది వారి స్వంత మాటల కంటే ఉన్నతమైనది, మరియు లేఖనాల్లో ప్రవక్తలు ప్రవచించినదాని కంటే కూడా ఉన్నతమైనది. యేసు కార్యము కేవల మానవుని విమోచన కోసం మరియు సిలువ వేయబడటం కోసం, కాబట్టి ఆయన ఏ మనిషినీ జయించడానికి ఎక్కువ మాటలు మాట్లాడనవసరం లేదు. మనిషికి ఆయన బోధించిన దానిలో ఎక్కువ భాగం లేఖనాల వాక్యాలు నుండి తీసుకోబడింది, మరియు ఆయన అకార్యము లేఖనాలను దాటిపోక పోయినా, ఆయన అప్పటికీ సిలువ కార్యాన్ని నెరవేర్చగలిగాడు. ఆయనది వాక్యపు కార్యం కాదు, మానవజాతిని జయించడం కోసం జరిగిన కార్యం కాదు, ఇది కేవలం మానవజాతిని విమోచించడం చేసిన కార్యము. ఆయన కేవలం మానవజాతి కోసం పాపపరిహారార్ధ బలి అయ్యాడు, గానీ మానవజాతికి వాక్య మూలంగా పని చేయలేదు. ఆయన అన్య జనుల కార్యము చేయలేదు, కానీ సిలువ వేయబడటం అనేది, దేవుడు ఉన్నాడని విశ్వసించే వారిలో జరిగించబడిన కార్యము. ఆయన కార్యము లేఖనాలు పునాదిగా జరిగించబడినప్పటికీ, మరియు పరిసయ్యులను ఖండించడానికి పాత ప్రవక్తలు ద్వారా ప్రవచించబడిన దానిని ఆయన ఉపయోగించినప్పటికీ, సిలువ కార్యాన్ని పూర్తి చేయడానికి ఇది సరిపోతుంది. నేటి కార్యము ఇంకా లేఖనాలలోని పాత ప్రవక్తల ప్రవచనాల ఆధారంగా జరుగుతుంటే, ఇక మిమ్మల్ని జయించడం అసాధ్యం, ఎందుకంటే పాత నిబంధనలో మీ చైనీస్ ప్రజల అవిధేయత మరియు పాపాలు నమోదు కాలేదు, మరియు మీ పాపాల చరిత్ర లేదు. కాబట్టి, ఈ కార్యము గనుక ఇంకా బైబిల్‌లో లాగే కొనసాగితే, మీరు ఎన్నటికీ ఫలించరు. బైబిల్ గ్రంధం ఇశ్రాయేలీయులు పరిమిత చరిత్రను మాత్రమే నమోదు చేసింది, మీరు చెడ్డవారా లేక మంచివారా అని నిరూపించడానికి గానీ, లేదా మిమ్మల్ని తీర్పు తీర్చడానికి గానీ ఇది సమర్ధవంతమైనది కాదు. ఒకవేళ నేనే మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నానని అనుకుంటే—మీరు ఈ రోజుకి లాగా ఇంకా నన్ను అనుసరిస్తారా? మీరు ఎంత కష్టంగా ఉన్నారో మీకు తెలుసా? ఈ దశలో వాక్యాలు పలకకపోతే, విజయ కార్యం పూర్తి చేయడం అసాధ్యం. నేను సిలువ వేయబడటానికి రాలేదు కాబట్టి, నేను బైబిల్ నుండి వేరుగా ఉన్న వాక్యాలు మాట్లాడాలి, తద్వారా మీరు జయించబడతారు. యేసు చేసిన కార్యం పాత నిబంధన కంటే ఒక దశ మాత్రమే పైనున్నది; అది ఒక యుగాన్ని ప్రారంభించడానికి మరియు ఆ యుగాన్ని నడిపించడానికి ఉపయోగించబడింది. “నేను ధర్మ శాస్త్రాన్ని నెరవేర్చడానికే గానీ, కొట్టివేయుటకు రాలేదు” అని ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన కార్యములో పాత నిబంధనలోని ఇశ్రాయేలీయులు ఆచరించిన కట్టడలకు మరియు అనుసరించిన ఆజ్ఞలకు ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే గానీ, పాటించడానికి రాలేదు. దానిని నెరవేర్చే ప్రక్రియలో అనేకమైన ఆచరణాత్మక విషయాలున్నాయి; ఆయన కార్యము ఎంతో ఆచరణాత్మకమైనది, నిజమైనది, అంతేగాక, అది ఎంతో సజీవమైనది, మరియు ఎలాంటి నియమాలకు గుడ్డిగా కట్టుబడి ఉండదు. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదా? యేసు వచ్చినప్పుడు, ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు, ఎందుకంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని, మరియు విశ్రాంతి దినమునకు యజమానుడు వచ్చినప్పుడు, ఆయన తన ఇష్టానుసారం చేస్తాడని ఆయన చెప్పాడు. పాత నిబంధన కట్టడలను నెరవేర్చి మరియు నియమాలను మార్చడానికి ఆయన రావలసి వచ్చింది. నేడు జరుగుతున్నదంతా వర్తమానంపై ఆధారపడి ఉన్నది, ఇది ఇంకా ధర్మ శాస్త్ర కాలంలోని యెహోవా కార్యపు పునాదిమీద ఆధారపడి ఉన్నప్పటికీ, అది దాని పరిధిని దాటదు. ఉదాహరణకు, మీ నాలుకను కాచుకొనడం మరియు వ్యభిచరించకుండా ఉండటం—అనేవి పాత నిబంధన కట్టడలు కావా? నేడు, మీ నుండి కావలసింది కేవలం పది ఆజ్ఞలకు మాత్రమే పరిమితమై లేదు, కానీ గతంలో వచ్చిన వాటికంటే ఉన్నత శ్రేణి కట్టడలు మరియు ఆజ్ఞలను కలిగి ఉన్నది. దీని భావం ఇంతకుముందు తొలగించబడిందని కాదు. ఎందుకంటే, దేవుని కార్యపు దశ ఇంతకు ముందు వచ్చిన దశ పునాదిపై జరిగించబడుతుంది. ఇశ్రాయేలు పట్ల యెహోవా చేసిన కార్య విషయానికొస్తే, ప్రజలు బలులు అర్పించి, వారి తల్లిదండ్రులను గౌరవించాలి, విగ్రహారాధన చేయకూడదు, ఇతరులను శపించడం లేక దౌర్జన్యం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ధూమపానం లేక మద్యపానం చేయకూడదు, మరియు చచ్చిన వాటిని తినడం లేక రక్తం త్రాగడం చేయకూడదనే లాంటివి కోరడం—ఇది నేటికీ మీ ఆచరణకు పునాది కాదా? గతం పునాదిపై మాత్రమే కార్యము నేటి వరకు కొనసాగుతుంది. గతంలోని కట్టడలు ఇక ఎన్నడూ ప్రస్తావించబడక మరియు మీ నుండి కొత్త ఆక్షేపణలు చేయబడుతున్నప్పటికీ, ఈ కట్టడలు, కొట్టివేయబడటానికి, బదులుగా ఇంకా హెచ్చించబడ్డాయి. అవి కొట్టివేయబడ్డాయి అని చెప్పడమంటే, మునుపటి కాలం ముగించబడిందని అర్ధం, అయితే నీవు ఎప్పటికీ గౌరవించే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. గతంలోని ఆజ్ఞలు ఇదివరకే ఆచరణలో పెట్టబడి, ఇప్పటికే మానవుని ఉనికిగా మారిపోయాయి, ఇక “ధూమపానం చేయవద్దు” మరియు “తాగవద్దు” లాంటి మొదలైన ఆజ్ఞల మీద ప్రత్యేక దృష్టి పెట్టనవసరం లేదు. ఈ పునాది మీద, మీ నేటి అవసరాలకు అనుగుణంగా, మీ స్థాయికి తగ్గట్టుగా, మరియు నేటి కార్యాన్ని బట్టి కొత్త ఆజ్ఞలు సూచించబడ్డాయి. నూతన యుగం కోసం ఆజ్ఞలను జారీచేయడం అంటే, పాత యుగపు ఆజ్ఞలను కొట్టివేయడమని కాదు, కానీ దాన్ని పునాదిగా చేసుకొని, వాస్తవికతకు మరింత అనుగుణంగా, మానవుని పనులను మరింతగా పూర్తిచేయడానికి, వాటిని ఉన్నతముగా ఎత్తిపట్టడం. ఒకవేళ, నేడు, మీరు ఇశ్రాయేలీయులు వలె పాత నిబంధన నియమాలకు కట్టుబడి మరియు ఆజ్ఞలను అనుసరించవలసి వచ్చి, మరియు మీరు యెహోవా నిర్దేశించిన కట్టడలను కూడా కంఠస్థం చేయవలసి వస్తే, మీరు మారే అవకాశమే ఉండేది కాదు. ఒకవేళ మీరు ఆ అపరిమితమైన ఆజ్ఞలకు మాత్రమే కట్టుబడి లేక అపరిమితమైన కట్టడలను కంఠస్థం చేయవలసి వస్తే, మీ పాత స్వభావము లోతుగా పొందుపరచబడి, మరియు దానిని పెకలించే మార్గమే ఉండదు. ఆవిధంగా మీరు ఎక్కువ పాడైపోయి, మరియు మీలో ఒక్కరు కూడా విధేయులు కాలేరు. యెహోవా క్రియలను తెలుసుకోడానికి కొన్ని సులభమైన ఆజ్ఞలు లేక లెక్కలేనన్ని నియమాలు ఎలాంటి సహాయం చేయలేవనే చెప్పాలి. మీరు మరియు ఇశ్రాయేలీయులు ఒకటి కాదు; కట్టడలను అనుసరిస్తూ ఆజ్ఞలను కంఠస్థం చేయడం ద్వారా, వారు యెహోవా క్రియలకు సాక్ష్యమివ్వగలిగి ఆయన పట్ల మాత్రమే భయభక్తులు కనుపరిచారు. అయితే మీరు దానిని సాధించలేకపోయారు, మరియు పాత నిబంధన కాలం నాటి కొన్ని ఆజ్ఞలు మిమ్మల్ని మీ హృదయాన్ని ఇచ్చేలా చేయడంలో లేక మిమ్మల్ని సంరక్షించడంలో అసమర్థమైనవే కాకుండా, బదులుగా మిమ్మల్ని నిర్వీర్యం చేసి, మిమ్మల్ని పాతాళంలో పడేలా చేస్తాయి. నా కార్యము విజయ కార్యము కాబట్టి, ఇది మీ అవిధేయత మరియు మీ పాత స్వభావాన్ని లక్ష్యంగా చేసుకుంది. యెహోవా మరియు యేసు యొక్క దయగల వాక్యాలు, నేటి న్యాయ తీర్పునకు సంబంధించిన కఠోరమైన వాక్యాల కంటే చాలా అల్పముగా ఉన్నాయి. అలాంటి కఠోర వాక్యాలు లేకుండా, వేల సంవత్సరాలుగా అవిధేయులైన, మీలాంటి “నిపుణులని” జయించడం అసాధ్యం. చాల కాలం క్రితమే పాత నిబంధన కట్టడలు తమ శక్తిని కోల్పోయాయి, మరియు నేటి న్యాయ తీర్పు పాత కట్టడల కంటే ఎంతో భయంకరమైనది. న్యాయతీర్పు, మరియు నిరుపయోగమైన కట్టడల పరిమితులు మీకు అనుగుణం కాదు, ఎందుకంటే మీరు మొట్ట మొదటి మానవజాతి కాదు, కానీ వేల సంవత్సరాలుగా అవినీతి మయమైన మానవజాతి. మనిషి ప్రస్తుతం సాధించవలసినది నేటి మానవ వాస్తవ స్థితికి తగినట్టుగా ఉంది, ఆధునిక కాలంలోని మానవుని వాస్తవ స్థాయి మరియు సామర్థ్యం ప్రకారం, మీరు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి, మీరు మీ భావనలను పక్కన పెట్టడానికి, మీ పురాతన వైఖరిలో మార్పులను సాధించవచ్చు. మీరు ఆజ్ఞలను నియమాలని అనుకుంటున్నారా? అవి, మానవుని సాధారణ అవసరతలని చెప్పవచ్చు. అవి నీవు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కావు. ఉదాహరణకు, ధూమపాన నిషేధాన్ని తీసుకుంటే—అది ఒక నియమమా? అది నియమము కాదు! అది సాధారణ మానవాళికి అవసరమై ఉన్నది; ఇది నియమం కాదు, కానీ సమస్త మానవాళి కోసం స్పష్టంగా నిర్దేశించబడింది. నేడు, నిర్దేశించబడిన డజను లేక అంతకన్నా ఎక్కువ ఆజ్ఞలు కూడా నియమాలు కావు; అవి సాధారణ మానవ స్వభావాన్ని సాధించడానికి అవసరమైనవి. ప్రజలు గతంలో ఇలాంటి వాటిని ఎరుగలేదు లేదా కలిగి లేరు, కాబట్టి నేడు వాటిని సాధించడం ప్రజలకు అవసరమై ఉన్నది, మరియు అలాంటి విషయాలు నియమాలుగా ఎంచబడవు. చట్టాలు నియమాలకు సమానం కాదు. నేను మాట్లాడుతున్న నియమాలు వేడుకలు, లాంఛనాలు, లేక మానవుని విపరీతమైన మరియు తప్పుడు ఆచరణలకు చెందినవి; అవి మానవునికి ఏ విధంగానూ సహాయపడని మరియు అతనికి నిష్ప్రయోజనమైన నిబంధనలు; అవి అర్ధరహితమైన ఒక కార్యాన్ని ఏర్పరుస్తాయి. నియమాల సారాంశం ఇదే, మరియు అవి మానవునికి ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు కాబట్టి, అలాంటి నియమాలు తొలగించబడాలి. మానవునికి ఏది ప్రయోజనకరమైనదో దానినే ఆచరణలో పెట్టాలి.

మునుపటి:  దేవుణ్ణి ఎరుగని ప్రజలందరూ దేవుణ్ణి వ్యతిరేకించే ప్రజలే

తరువాత:  దేవుని కార్యపు దర్శనం (2)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger