దేవుని కార్యపు దర్శనం (2)

పశ్చాత్తాప సువార్త కృపా కాలంలో ప్రకటించబడింది, మానవుడు దానిని నమ్మితే, అతడు రక్షింపబడతాడు. నేడు, రక్షణ స్థానంలో, జయించడం మరియు పరిపూర్ణత గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. ఒక్క వ్యక్తి నమ్మితే, వారి కుటుంబం మొత్తం రక్షింపబడుతుందని, లేదా ఒక్కసారి రక్షణ పొందితే ఇక ఎప్పటికీ రక్షింపబడినట్లే అని ఎక్కడా చెప్పబడలేదు. నేడు, ఎవరూ ఈ మాటలు మాట్లాడరు, మరియు అలాంటివి కాల దోషం పట్టినవి. ఆ కాలంలో, యేసు చేసిన కార్యము సర్వ మానవాళిని విమోచించే కార్యము. ఆయన యందు విశ్వాసముంచిన వారందరి పాపాలు క్షమించబడ్డాయి; నీవు ఆయనను విశ్వసించినంత కాలం, ఆయన నిన్ను విమోచిస్తాడు; నీవు ఆయనను నమ్మితే, ఇక నీవు ఎన్నడూ పాపం చేయవు, నీవు నీ పాపాల నుండి విడుదల పొందియున్నావు. రక్షించబడటం, మరియు విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడటం అంటే అర్ధం ఇదే. విశ్వసించే వారిలో ఇప్పటికీ, నెమ్మదిగా తొలగించబడవలసిన, దేవుని విరోధించేది మరియు విరుద్దమైనది మిగిలే ఉన్నది. రక్షణ అంటే మానవుడు సంపూర్ణముగా యేసు ద్వారా జయించబడ్డాడని అర్థంకాదు, కానీ మానవుడు ఇక ఎన్నటికీ పాపి కాకుండా, తన పాపాల విషయమై అతడు క్షమించబడ్డాడని అర్ధం. నీకు అందించబడిన దానిని నమ్మితే, నీవు ఎన్నటికీ పాపం చేయవు. ఆ కాలంలో, యేసు తన శిష్యులు గ్రహించలేని కార్యము ఎంతో చేశాడు మరియు ప్రజలకు అర్థం కానిది ఎంతో చెప్పాడు. ఎందుకంటే, ఆ కాలంలో, ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ విధంగా, ఆయన వెళ్ళిపోయిన చాలా ఏళ్ల తరువాత, యేసు కొరకు మత్తయి ఒక వంశావళినే సృష్టించాడు, మరియు మిగిలిన వారు కూడా మానవ చిత్తానికి చెందిన ఎంతో కార్యాన్ని చేశారు. కార్యములోని ఒక దశను చేయడానికే యేసు వచ్చాడే కానీ, మానవుని పరిపూర్ణ పరచడానికి మరియు పొందుకోవడానికి రాలేదు. ఆయన వచ్చిన పని: పరలోక రాజ్య సువార్తను ముందుంచడం, మరియు సిలువ కార్యాన్ని పూర్తి చేయడం. కాబట్టి, యేసు సిలువ వేయబడితే, అయన కార్యము సంపూర్ణ ముగింపునకు వచ్చినట్టే. కానీ ప్రస్తుత దశ—విజయ కార్యము—లో అనేకమైన వాక్యాలు పలుకబడాలి, ఎంతో కార్యము జరిగించబడాలి మరియు అనేక ప్రక్రియలు ఉండాలి. అలాగే, యెహోవా మరియు క్రీస్తు కార్యపు మర్మాలు కూడా ప్రత్యక్ష పరచబడాలి, దానిని బట్టి ప్రజలందరికీ తమ విశ్వాసంలో అవగాహన మరియు స్పష్టత ఉంటుంది. ఎందుకంటే, ఇది అంత్య దినాల్లోని కార్యము, మరియు ఈ అంత్య దినాలు దేవుని కార్యానికి, కార్యపు ముగింపు సమయానికి అంతముగా ఉన్నవి. ఈ కార్యపు దశ నీకు యెహోవా ధర్మశాస్త్రాన్ని మరియు యేసు విమోచనను విశదీకరిస్తుంది, కాబట్టి నీవు ప్రధానంగా దేవుని ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక కార్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకొని, మరియు ఆ ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ప్రాధాన్యతను మరియు భావాన్ని అభినందించవచ్చు, యేసు ద్వారా జరిగించబడిన కార్యమంతటి ఉద్దేశాన్ని మరియు ఆయన మాట్లాడిన వాక్యాలు, మరియు బైబిల్ పట్ల నీకున్న అంధ విశ్వాసాన్ని మరియు భక్తిని కూడా అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా నీవు క్షుణ్ణంగా అర్ధం చేసుకోడానికి వీలు కల్పిస్తుంది. యేసు చేసిన కార్యాన్ని మరియు నేటి దేవుని కార్యమనే రెండింటినీ నీవు అర్ధం చేసుకుంటావు; నీవు సత్యాన్ని, జీవాన్ని, మరియు మార్గాన్ని నీవు అర్ధం చేసుకుని చూస్తావు. యేసు చేసిన కార్యపు దశలో, ముగింపు కార్యము చేయకుండా యేసు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకంటే, యేసు కార్యపు దశ కార్యము ముగింపు కాదు. ఆయన సిలువకు వేలాడదీయబడినప్పుడు, ఆయన వాక్యాలు కూడా ముగింపునకు వచ్చాయి; ఆయన సిలువ వేయబడిన తరువాత, ఆయన కార్యము సంపూర్ణంగా ముగించబడింది. ప్రస్తుత దశ దానికి భిన్నంగా ఉంటుంది: వాక్యాలు చివరి వరకు చెప్పబడి, ఆయన కార్యము సంపూర్ణంగా ముగించబడినప్పుడు మాత్రమే ఆయన కార్యము ముగిస్తుంది. యేసు కార్యపు దశ సమయంలో, చెప్పబడకుండా మిగిలిపోయిన, లేక పూర్తిగా వ్యక్తీకరించబడని అనేక వాక్యాలున్నాయి. అయినప్పటికీ, యేసు తాను ఏం చేశాడు లేక ఏమి చెప్పలేదు అనే వాటిని పట్టించుకోలేదు, ఎందుకంటే ఆయన పరిచర్య మాటల పరిచర్య, కాబట్టి ఆయన సిలువ వేయబడిన తరువాత, ఆయన వెళ్ళిపోయాడు. ఆ కార్యపు దశ ప్రస్తుత దశకు భిన్నంగా, ప్రత్యేకించి సిలువ వేయబడటం కోసం జరిగింది. ప్రస్తుత కార్యపు దశ అనేది ప్రధానంగా సంపూర్తి చేయడం, స్పష్ట పరచడం, మరియు సమస్త కార్యాన్ని ముగింపులోనికి తీసుకురావడం కోసమై ఉన్నది. వాటి అంతము వరకు వాక్యాలు పలుకబడకపోతే, ఈ కార్యాన్ని ముగించే ప్రసక్తే ఉండదు, ఎందుకంటే ఈ దశలో సమస్త కార్యము ఒక ముగింపులోనికి తీసుకురాబడి వాక్యాలను ఉపయోగించుట ద్వారా సంపూర్తి చేయబడుతుంది. ఆ కాలంలో, మానవుడు గ్రహించలేని ఎంతో కార్యాన్ని యేసు చేశాడు. ఆయన నెమ్మదిగా వెళ్ళిపోయాడు, మరియు నేటికీ ఆయన వాక్యాలను అర్ధం చేసుకోకుండా, తప్పుడు అవగాహన కలిగి ఉన్నప్పటికీ దానిని సత్యమని నమ్ముతూ, తాము సరైన వారిగా లేమని తెలియని వారు ఇంకా అనేకమంది ఉన్నారు. అంతిమ దశ దేవుని కార్యాన్ని పూర్తి ముగింపులోకి తీసుకువచ్చి, దాని సమాప్తాన్ని అందిస్తుంది. దేవుని నిర్వహణ ప్రణాళికను అందరూ తెలుసుకుని అర్ధం చేసుకుంటారు. మనిషిలోని ఆలోచనలు, తన ఉద్దేశాలు, తన అనుచితమైన మరియు అసంబద్దమైన అవగాహన, యెహోవా మరియు యేసు కార్యాన్ని గురించిన అతని అవగాహన, అన్యులను గురించిన అతని అభిప్రాయాలు, మరియు అతని అతిక్రమణలు మరియు తప్పులన్నీ సరిచేయబడతాయి. మరియు మానవుడు తన జీవితపు మంచి మార్గాలన్నీ, మరియు దేవుడు చేసిన కార్యమంతటినీ, మరియు సంపూర్ణ సత్యాన్ని గ్రహిస్తాడు. అది జరిగినప్పుడు, ఈ దశలోని కార్యము ముగించబడుతుంది. లోకాన్ని సృజించడం యెహోవా కార్యమై ఉన్నది, అది ఆరంభం; కార్యపు ఈ దశ ఈ కార్యపు అంతమునకు మరియు ముగింపునకు సంబంధించినది. ప్రారంభంలో, దేవుని కార్యము ఎంచుకోబడినవారైన ఇశ్రాయేలు మధ్య జరిగించబడింది, మరియు అది అతి పరిశుద్ద స్థలం అనే ఒక నూతన శకాన్ని ఉదయింపజేసింది. లోకానికి తీర్పు తీర్చి యుగాన్ని ఒక ముగింపుకు తీసుకురావడానికి, కార్యపు తీర్పు అనేది దేశాలన్నిటిలోని అత్యంత అపవిత్రమైన దానిలో జరిగించబడుతుంది. మొదటి దశలో, దేవుని కార్యము అన్ని ప్రదేశాలలోకెల్లా ప్రకాశవంతమైన దానిలో జరిగించబడింది, మరియు అంతిమ దశ అనేది ప్రదేశాలన్నిటిలోకెల్లా అత్యంత అంధకారమైన దానిలో జరిగించబడుతుంది, అక్కడి అంధకారం పారద్రోలబడి, వెలుగు వస్తుంది, మరియు ప్రజలందరూ జయించబడుతారు. అత్యంత అంధకారంతో ఉన్న ఈ ప్రదేశ వెలుగుతో నింపబడి, ప్రజలు జయించబడి, మరియు నిజ దేవుడైన ఒక దేవుడు ఉన్నాడని ప్రజలందరూ ఒప్పుకుని, మరియు ప్రతి వ్యక్తి సంపూర్ణంగా ఒప్పించబడినప్పుడు, అప్పుడు సర్వ లోకమంతా విజయ కార్యాన్ని జరిగించడానికి ఆ వాస్తవం ఉపయోగించబడుతుంది. ఈ కార్యపు దశ సూచనప్రాయమైనది: ఈ కాలపు కార్యము ముగిశాక, ఆరువేల సంవత్సరాల నిర్వహణ కార్యము సంపూర్తి అవుతుంది. సమస్త ప్రదేశాలలోని అత్యంత అంధకారంలో ఉన్నవారు జయించబడిన తరువాత, అన్ని చోట్లా అలానే ఉంటుందని చెప్పనవసరం లేదు. అదే విధంగా, చైనాలో విజయ కార్యము మాత్రమే అర్థవంతమైన ప్రతీకాత్మకతను కలిగి ఉంటుంది. చైనా అంధకార శక్తులను కలిగి ఉన్నది, మరియు చైనా ప్రజలు శరీరానుసారులై, సాతాను సంబంధులై, రక్త మాంసములను అనుసరించే వారందరికీ ప్రాతినిథ్యం వహిస్తారు. ఎర్రని మహా ఘట సర్పము ద్వారా భ్రష్టపరచబడిన వారు, దేవుని పట్ల బలమైన వ్యతిరేకత గలవారు, అత్యంత నీచమైన మరియు అపరిశుద్దమైన మానవ స్వభావం కలిగిన వారు చైనీయులు, కాబట్టి వారు భ్రష్టులైన మానవజాతి అంతటికీ ఆది మూలమై ఉన్నారు. దీనర్ధం ఇతర దేశాలు ఎలాంటి సమస్యలు కలిగి లేవని చెప్పటం కాదు; మానవ తలంపులన్నీ ఒకేలా ఉంటాయి, మరియు మంచి సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ, వారు దేవుని ఎరుగకపోతే, అప్పుడది వారు ఆయనను వ్యతిరేకిస్తున్నట్టే. మరి యూదులు ఎందుకు దేవుని విరోధించి ధిక్కరించారు? పరిసయ్యులు కూడా ఆయనను ఎందుకు వ్యతిరేకించారు? యూదా ఎందుకు యేసును అప్పగించాడు? ఆ సమయంలో, అనేకమంది శిష్యులకు యేసు గురించి తెలియదు. యేసు సిలువ వేయబడి తిరిగి లేచిన తరువాత కూడా, ప్రజలు ఎందుకు ఆయనను నమ్మలేదు? మానవుని అవిధేయత అంతా ఒక్కటే కాదా? ఇది చైనా ప్రజలను ఒక ఉదాహరణగా మాత్రమే తెలియజేయబడింది, మరియు వారు జయించబడినప్పుడు వారు ఆదర్శాలు మరియు నిదర్శనాలుగా మారి, ఇతరులకు మార్గదర్శకాలుగా పనిచేస్తారు. మీరు నా నిర్వహణ ప్రణాళికకు అనుబంధమై ఉన్నారని నేను ఎల్లప్పుడూ ఎందుకు చెప్తుంటాను? చైనా ప్రజలలో అవినీతి, కల్మషం, దుర్నీతి, వ్యతిరేకత మరియు తిరుగుబాటుతనం అనేవి ఎంతో ప్రస్ఫుటంగా వెల్లడి అవుతూ, వివిధ రకాలైన వాటి ఆకృతులలో బహిర్గతమయ్యాయి. ఒకవైపు, వారు అల్ప సామర్థ్యం కలిగిన వారు, మరోవైపు, వారి జీవితాలు మరియు మనస్తత్వము వెనుకబడి ఉన్నాయి, మరియు వారి సామాజిక స్థితిగతులు, జన్మించిన కుటుంబం—అన్నీ పేదరికంతో ఎంతగానో వెనుకబడి ఉన్నాయి. వారి స్థాయి, కూడా తక్కువే. ఈ ప్రదేశంలోని కార్యము సూచనప్రాయమైనది, మరియు ఈ పరీక్ష కార్యము సంపూర్ణంగా చేయబడిన తరువాత, దేవుని తదుపరి కార్యము చాలా సులభంగా ఉంటుంది. ఈ దశ కార్యము గనుక పూర్తి చేయగలిగితే, అప్పుడు తదుపరి కార్యము చెప్పకుండానే జరిగిపోతుంది. ఒకసారి ఈ కార్యపు దశను గనుక పూర్తి చేస్తే, గొప్ప విజయం పూర్తిగా సాధించబడుతుంది, మరియు సర్వ లోకమంతటా సాధించవలసిన విజయ కార్యము పూర్తిగా ముగించబడుతుంది. నిజానికి, మీ మధ్య కార్యము గనుక విజయవంతమైతే, ఇది సర్వ లోకమంతటి విజయంతో సమానం. మిమ్మల్ని ఒక ఆదర్శంగా మరియు నిదర్శనంగా నేను ఎందుకు కలిగి ఉన్నాను అనే దాని ప్రాధాన్యత ఇదే. తిరుగుబాటుతనం, వ్యతిరేకత, అపవిత్రత, అధర్మం—ఇవన్నీ ఈ ప్రజలలో కనిపిస్తాయి, మరియు మానవజాతి తిరుగుబాటుతనం మొత్తం వారిలోనే కనుపరచబడుతుంది. నిజంగా వారు ఏదో అయి ఉన్నారు. కాబట్టి, వారి విజయ సంక్షేపముగా ఉన్నారు, మరియు ఒకసారి వారు జయించబడితే వారు స్వాభావికంగానే ఇతరులకు ఆదర్శాలుగా మరియు నిదర్శనాలుగా ఉంటారు. జరిగించబడుతున్న మొదటి దశకు ఇశ్రాయేలు కంటే ఎక్కువ సూచనప్రాయమైనది ఏదీ లేదు: ఇశ్రాయేలీయులు ప్రజలందరిలోకెల్లా అత్యంత పరిశుద్దమైన వారు మరియు తక్కువగా చెడినవారు, కాబట్టి ఈ దేశంలో కొత్త శకం ఆరంభానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవజాతి పితరులు ఇశ్రాయేలు నుండి వచ్చారని, మరియు దేవుని కార్యానికి ఆ ఇశ్రాయేలు జన్మస్థలమని చెప్పవచ్చు. మొదట్లో, ఈ ప్రజలు పరిశుద్దులై, యెహోవాను ఆరాధించారు, మరియు వారిలోని దేవుని కార్యము ప్రయోజనకరమైన గొప్ప ఫలితాలను ఇవ్వగలిగింది. బైబిల్ మొత్తం రెండు కాలాల కార్యాన్ని వివరిస్తుంది: ఒకటి ధర్మశాస్త్ర కాలపు కార్యము, మరియు ఒకటి కృపా కాలపు కార్యము. పాత నిబంధన ఇశ్రాయేలీయులు కొరకైన యెహోవా మాటలను మరియు ఇశ్రాయేలులోని ఆయన కార్యాన్ని నమోదు చేస్తుంది; కొత్త నిబంధన యూదయలోని యేసు కార్యాన్ని నమోదు చేస్తుంది. మరి, చైనీయుల పేర్లు బైబిల్‌లో ఎందుకు లేవు? ఎందుకంటే, మొదటి రెండు భాగాల దేవుని కార్యము ఇశ్రాయేలులో జరిగించబడింది, కారణం ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకోబడినవారు—అంటే యెహోవా కార్యాన్ని మొదటిగా అంగీకరించిన వారని చెప్పవచ్చు. వారు మానవజాతిలో తక్కువగా చెడినవారు, మరియు మొదట్లో, వారు దేవుని వైపు చూచి ఆయనను గౌరవించారు. యెహోవా మాటలకు వారు విధేయులై, ఎల్లప్పుడూ మందిరంలో ఆయనను సేవిస్తూ, మరియు యాజక దట్టిలు లేక కిరీటాలను ధరించేవారు. వారు దేవుని ఆరాధించిన తొలి ప్రజలు, మరియు ఆయన కార్యానికి తొలి సాధనమై ఉన్నారు. ఈ ప్రజలు సర్వ మానవాళికి ఆదర్శాలు మరియు నిదర్శనాలు. వారు పరిశుద్దతకు మరియు నీతిమంతులకు ఆదర్శాలు మరియు నిదర్శనాలుగా ఉన్నారు. యోబు, అబ్రహాము, లోతు, లేదా పేతురు మరియు తిమోతి వంటి వ్యక్తులు—వీరందరూ ఇశ్రాయేలీయులు, ఆదర్శాలు మరియు నిదర్శనాలలో ఎంతో పరిశుద్ధులు. మానవజాతిలో దేవుని ఆరాధించిన మొట్టమొదటి దేశం ఇశ్రాయేలు, నీతిమంతులు మరెక్కడి కన్నా ఇక్కడి నుండే ఎక్కువగా వచ్చారు. భవిష్యత్తులో దేశమందంతటా మానవజాతిని మెరుగ్గా నిర్వహించడానికి దేవుడు వారిలో కార్యము చేశాడు. యెహోవాను ఆరాధించడంలో వారి విజయాలు మరియు సత్క్రియలు నమోదు చేయబడ్డాయి, తద్వారా వారు కృపా కాలంలో ఇశ్రాయేలును మించిన ప్రజలకు ఆదర్శాలు మరియు నిదర్శనాలుగా పని చేస్తారు; మరియు వారి చర్యలు అనేక వేల సంవత్సరాల కార్యాన్ని నేటి వరకు నిలబెట్టాయి.

లోకము స్థాపించబడిన తరువాత, దేవుని కార్యపు మొదటి దశ ఇశ్రాయేలులో జరిగించబడింది, మరియు అ విధంగా ఇశ్రాయేలు భూమి మీద దేవుని కార్యానికి జన్మస్థలముగా, భూమి మీది దేవుని కార్యానికి ఆరంభ స్థానముగా ఉన్నది. యేసు కార్యపు వ్యాప్తి యూదయ మొత్తాన్ని చుట్టుముట్టింది. ఆయన కార్యపు సమయంలో, యూదయ వెలుపల ఉన్న అతి కొద్దిమందికి మాత్రమే దీని గురించి తెలుసు, ఎందుకంటే ఆయన యూదయను దాటి ఆయన ఏ కార్యమూ చేయలేదు. నేడు, దేవుని కార్యము చైనాకి తీసుకురాబడింది, అది పూర్తిగా ఈ పరిధిలోనే జరిగించబడుతుంది. ఈ దశలో, చైనాకి వెలుపల ఏ కార్యము ఆవిష్కరించబడలేదు; దేని వ్యాప్తి చైనాని మించుతుందో ఆ కార్యము తరువాత వస్తుంది. ఈ కార్యపు దశ యేసు కార్యపు దశను అనుసరిస్తుంది. యేసు విమోచన కార్యాన్ని జరిగించాడు, ఈ కార్యపు దశ ఆ కార్యపు దశను అనుసరిస్తుంది; విమోచన కార్యము పూర్తి చేయబడింది, మరియు ఈ దశలో పరిశుద్దాత్మ ద్వారా గర్భాన్ని ధరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కార్యము చివరి దశకు భిన్నంగా ఉంటుంది, అంతేగాక, ఇంకా చైనా ఇశ్రాయేలు లాంటిది కాదు. యేసు విమోచన కార్యంలో ఒక దశను చేశాడు. మానవుడు యేసును చూశాడు, మరియు కొద్దికాలం తరువాత, ఆయన కార్యము అన్య జనులలో వ్యాప్తి చెందడం ఆరంభమైంది. నేడు, దేవుని నమ్మేవారు అమెరికా, యూకే, మరియు రష్యాలలో ఎక్కువమంది ఉన్నారు, కానీ, చైనాలో తక్కువమందే ఎందుకు ఉన్నారు? ఎందుకంటే, చైనా అత్యంత సంకుచితమైన దేశం. అలాగే దేవుని మార్గమును చివరిగా అంగీకరించిన దేశం చైనా, మరియు అమెరికా మరియు యూకే కన్నా చాలా కాలం తరువాతే అది జరిగింది, అంటే, అలా జరిగి వంద సంవత్సరాల లోపే అయింది. ఆయన కార్యాన్ని ముగింపులోకి తీసుకురావడానికి, మరియు ఆయన సమస్త కార్యము సాధించబడటానికి దేవుని కార్యపు ఆఖరి దశ చైనా దేశంలో జరిగించబడుతుంది. ఇశ్రాయేలులోని ప్రజలందరూ యెహోవాను తమ ప్రభువుగా పిలిచేవారు. ఆ సమయంలో, వారు ఆయనను తమ కుటుంబ యజమానునిగా భావించేవారు, మరియు ఇశ్రాయేలులోని ప్రతిఒక్కరు తమ ప్రభువైన యెహోవాను ఆరాధించే ఒక గొప్ప కుటుంబంగా మారారు. యెహోవా ఆత్మ తరచూ వారికి కనిపించి, ఆయన వారితో మాట్లాడి మరియు తన స్వరాన్ని వారితో పలికి, వారి జీవితాలను నడిపించడానికి మేఘ స్తంభాన్ని మరియు ధ్వనిని ఉపయోగించుకున్నాడు. ఆ సమయంలో, ప్రజలతో మాట్లాడటం మరియు తన స్వరంతో పలకడం ద్వారా, ఇశ్రాయేలీయులకు ఆత్మ నేరుగా తన మార్గనిర్దేశనాన్ని అందించాడు, మరియు వారు మేఘాలు చూశారు ఉరుములను విన్నారు, ఈ విధంగా ఆయన వారి జీవితాలను అనేక వేల సంవత్సరాల పాటు నడిపించాడు. కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే యెహోవాను ఎల్లప్పుడూ ఆరాధించేవారు. వారు యెహోవా తమ దేవుడని, మరియు అయన అన్యజనుల దేవుడు కాదని నమ్మేవారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేది కాదు; యెహోవా, వారి మధ్య దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలు కార్యము చేశాడు. చైనా దేశంలో, నాలుగువేల సంవత్సరాల సుప్తావస్థ నిద్ర తరువాత, భూమ్యాకాశాలు మరియు సమస్తమైనవి సహజముగా ఏర్పడినవి కాదని, సృష్టికర్త ద్వారా చేయబడినవని నీచులకి ఇప్పుడే తెలిసింది. ఈ సువార్త విదేశాల నుండి వచ్చినందున, ఆ సువార్తను నమ్మేవారందరూ ద్రోహులని, వారు తమ పితరుడైన బుద్ధునికి ద్రోహం చేసిన వీధికుక్కలని జమిందారీ, ప్రతిఘాతుక మనస్సు గలవారు నమ్ముతారు. అంతేగాక, జమిందారీ మనస్కులు అనేకమంది “విదేశీయుల దేవుని చైనా ప్రజలు ఎలా నమ్ముతారు? వారు తమ పితరులకు ద్రోహం చేయడం లేదా? వారు చెడును తలపెట్టడం లేదా?” అని అడుగుతారు. నేడు, యెహోవా తమ దేవుడని ప్రజలు మరిచిపోయి చాలా కాలం అయింది. చాలా కాలం నుండి వారు సృష్టికర్తను వారి మనస్సుల వెనుకకు నెట్టివేసి, దానికి బదులుగా పరిణామ సిద్దాంతాన్ని నమ్మారు, అంటే మనిషి కోతుల నుండి ఉద్భవించాడని, మరియు ఈ సాధారణ ప్రపంచం సహజసిద్ధంగానే ఏర్పడిందని అర్ధం. మానవాళి ఆస్వాదించే అన్నిరకాల మంచి ఆహారం ప్రకృతి ద్వారా ప్రసాదించబడింది, మానవ జీవితానికి జీవన్మరణ క్రమం ఉంటుంది, మరియు వీటన్నిటినీ పాలించే దేవుడే లేదు. పైగా, సమస్తాన్ని దేవుడు పాలిస్తాడు అనేది మూఢ నమ్మకమని అది శాస్త్రీయం కాదని విశ్వసించే నాస్తికులు అనేకమంది ఉన్నారు. కానీ శాస్త్రీయ జ్ఞానం దేవుని కార్యాన్ని భర్తీ చేయగలదా? శాస్త్రీయ జ్ఞానం మానవజాతిని పాలించగలదా? నాస్తికత్వంచే పాలించబడుతున్న దేశంలో సువార్త ప్రకటించడం అంత సులభమైన పని కాదు, దానిలో చాలా ఆటంకాలు ఉన్నాయి. నేడు, దేవుని ఈ విధంగా విరోధించేవారు అనేకమంది లేరా?

యేసు తన కార్యాన్ని చేయడానికి వచ్చినప్పుడు, అనేకమంది ప్రజలు ఆయన కార్యాన్ని యెహోవా కార్యముతో సరిపోల్చి, ఆ రెండూ విరుద్ధముగా ఉన్నాయని కనుగొని, యేసును సిలువ వేశారు. ఈ కార్యాల మధ్య సంబంధాన్ని వారు ఎందుకు కనుగొనలేదు? యేసు కొత్త కార్యము చేయడమే దీనికి కొంతవరకు కారణం. అలాగే, యేసు తన కార్యాన్ని ప్రారంభించే ముందు వరకు ఆయన వంశావళిని ఎవరూ వ్రాయలేదు. ఒకవేళ మత్తయి గనుక యేసు వంశావళిని అనేక దశాబ్దాల కిందటే రాసి ఉంటే, యేసు అంత గొప్ప హింసను అనుభవించేవాడు కాదు. అవునా, కాదా? ప్రజలు యేసు వంశావళిని చదివిన వెంటనే—ఆయన అబ్రహాము కుమారుడని, మరియు ఆయన దావీదు సంతతి అని—అప్పుడు ఆయనను హింసించడం మానేసేవారు. ఆయన వంశావళి చాలా ఆలస్యంగా వ్రాయబడటం దయనీయం కదా? బైబిల్ కేవలం దేవుని కార్యపు రెండు దశలను మాత్రమే నమోదు చేయడం ఎంత విచారకరం: ఒకటి ధర్మశాస్త్ర కార్యపు దశ, మరియు ఒకటి కృపా కాల కార్యపు దశ; ఒక దశ యెహోవా కార్యము, మరియు ఒక దశ యేసు కార్యము. ఒక గొప్ప ప్రవక్త నేటి కార్యాన్ని గురించి ముందుగానే చెప్పి ఉంటే ఎంతో బాగుండేది. బైబిల్లో “అంత్య దినముల కార్యము” అనే మరొక విభాగము కూడా ఉండి ఉంటే—అది ఎంతో బాగుండేది కదా? నేడు మానవుడు ఇన్ని కష్టాలను ఎందుకు అనుభవించాలి? మీరూ కష్ట సమయాన్ని కలిగి ఉన్నారు! ఎవరైనా ద్వేషించబడటానికి అర్హులుగా ఉన్నారంటే, అది అంత్య దినాల కార్యాన్ని ముందుగా ప్రవచింపనందుకు యెషయా మరియు దానియేలు మరియు ఎవరినైనా నిందించవలసి వస్తే, అది దేవుని రెండవ శరీరధారణ వంశావళిని ముందుగా నమోదు చేయని కొత్త నిబంధన అపోస్తలులనే అవుతుంది. ఇది ఎంత అవమానకరం? మీరు ఆధారం కోసం ప్రతి చోటా వెదకాలి, మరియు కొన్ని చిన్న వాక్య భాగాలు కనుగొన్నప్పటికీ, అది నిజమైన సాక్ష్యమా, కాదా అని మీరు చెప్పలేరు. ఎంత సిగ్గుచేటు? తన కార్యములో దేవుడు ఎందుకు మర్మయుక్తంగా ఉంటాడు? నేడు, అనేక మంది స్పష్టమైన ఆధారాన్ని ఇంకా కనుగొనలేదు, అయినప్పటికీ వారు దానిని తిరస్కరించలేరు. అయితే వారు ఏమి చేయాలి? వారు తీర్మానపూర్వకంగా దేవుని అనుసరించలేరు, అలాగని వారు అటువంటి సందేహంతో ముందుకూ సాగలేరు. కాబట్టి, అనేకమంది “తెలివైన మరియు ప్రజ్ఞావంతులైన పండితులు” దేవుని అనుసరించేటప్పుడు వారు “ప్రయత్నించి చూడు” అనే వైఖరిని అవలంబిస్తారు. ఇది ఎంతో ఇబ్బందికరమైనది! ఒకవేళ మత్తయి, మార్కు, లూకా, మరియు యోహానులు భవిష్యత్తు గురించి ప్రవచించగలిగి ఉంటే, పరిస్థితులు ఇంకా తేలికగా ఉండేవి కదా? యోహాను గనుక దేవుని రాజ్యములోని అంతరంగిక సత్యాన్ని చూసి ఉంటే బాగుండేది—అతడు వాస్తవాన్ని, భూమిమీద భౌతిక కార్యాన్ని చూడకుండా, కేవలం దర్శనాలను మాత్రమే చూడటం ఎంతో విచారకరం. అది ఎంతో అవమానకరం! దేవునికి ఏమైంది? ఇశ్రాయేలులో ఆయన కార్యము చక్కగా జరిగిన తరువాత, ఎందుకు, ఆయన ఇప్పుడు చైనాకి వచ్చాడు, మరియు ఎందుకు ఆయన శరీరునిగా మారి, ప్రజల మధ్య వ్యక్తిగతంగా కార్యము చేసి జీవించవలసి వచ్చింది? మనిషి పట్ల దేవుడు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు! ఆయన ప్రజలకు ముందస్తుగా చెప్పకపోవడమే కాకుండా, తన శిక్షను మరియు న్యాయతీర్పును హఠాత్తుగా తీసుకువచ్చాడు. నిజంగా ఇది అర్ధం లేనిది! దేవుడు మొదటిసారి శరీరధారి అయినప్పుడు, అంతర్గత సత్యమంతటిని మనిషికి ముందుగా చెప్పకపోవడం వలన ఎంతో కష్టాన్ని అనుభవించాడు. ఖచ్చితంగా ఆయన దానిని మరిచిపోలేదా? మరి ఆయన ఇంకా మనిషికి ఎందుకు చెప్పట్లేదు? నేడు, బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు మాత్రమే ఉండటం ఎంత దురదృష్టకరం? అంత్య దినముల కార్యాన్ని చెప్పడానికి మరొకటి ఉండటం అవసరం! నీవు దీనిని ఆలోచించలేదా? యెహోవా, యెషయా మరియు దావీదు కూడా నేటి కార్యము గురించి ప్రస్తావించలేదు. అవి వర్తమానం నుండి తొలగించబడి, కాలానుసారంగా నాలుగువేల సంవత్సరాలకు పైగా వేరుచేయబడ్డాయి. యేసు నేటి కార్యము గురించి పూర్తిగా ప్రవచించలేదు, దానిలో కొంచెము మాత్రమే మాట్లాడాడు, మరియు ఇప్పటికీ మనిషి వద్ద తగిన సాక్ష్యము లేదు. నీవు ఈనాటి కార్యాన్ని మునుపటితో పోల్చితే, రెండూ ఒక దానితో ఒకటి ఎలా సరితూగుతాయి? యెహోవా కార్యపు దశ ఇశ్రాయేలుకు నిర్దేశించబడింది, కాబట్టి మీరు నేటి కార్యాన్ని దానితో పోల్చితే ఇంకా ఎక్కువ వైరుధ్యంగా ఉంటుంది; ఆ రెండిటినీ అంత సులభంగా పోల్చలేము. నీవు ఇశ్రాయేలు వాడవు కావు, నీవు యూదుడవు కావు; నీ సామర్థ్యము మరియు నీ సమస్తము లోపము కలిగి—వారితో నిన్ను నీవు ఎలా పోల్చుకుంటావు? అది సాధ్యమేనా? ఇది దేవుని రాజ్య కాలమని, ఇది ధర్మశాస్త్ర కాలానికి, మరియు కృపా కాలానికి భిన్నంగా ఉంటుందని తెలుసుకో. ఏ పరిస్థితిలోనూ, ఒక నియమాన్ని ప్రయత్నించి వర్తింపజేయవద్దు; దేవుడిని అలాంటి నియమాలలో కనుగొనలేవు.

యేసు జన్మించిన తర్వాత 29 సంవత్సరాలు ఎలా జీవించాడు? ఆయన బాల్యము మరియు యవ్వనం గురించి బైబిల్ ఏమీ నమోదు చేయలేదు; అవి ఎలా ఉండేవో నీకు తెలుసా? ఆయనకు బాల్యము మరియు యవ్వనం లేకుండా, ఆయన జన్మించినప్పటికే ఆయనకు 30 సంవత్సరాలు ఉండవచ్చా? నీకు తెలిసింది తక్కువ, కాబట్టి నీ అభిప్రాయాలు చెప్పడంలో అజాగ్రత్తగా ఉండవద్దు. అది నీకు మంచి చేయదు! యేసు 30వ జన్మదినానికి ముందు, బాప్తీస్మము తీసుకుని అపవాది చేత శోధించబడటానికి పరిశుద్దాత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డాడని మాత్రమే బైబిల్ నమోదు చేసింది. మరియు నాలుగు సువార్తలు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల కార్యాన్ని నమోదు చేశాయి. ఆయన బాల్యము మరియు యవ్వనం గురించి ఎలాంటి దాఖలా లేదు, అయితే ఇది ఆయనకు బాల్యం మరియు యవ్వనం లేదని నిరూపించదు; అది కేవలం, ప్రారంభంలో, ఆయన ఏ కార్యము చేయలేదని, ఒక సాధారణ వ్యక్తి అని భావం. అయితే, మరి యేసు 33 సంవత్సరాలు యవ్వనం మరియు బాల్యం లేకుండా జీవించాడని మీరు చెప్పగలరా? ఆయన అకస్మాత్తుగా ముప్పై మూడున్నర ఏళ్లకు చేరుకున్నాడా? అయన గురించి మనిషి ఆలోచించేదంతా అసాధారణమైనది మరియు అసత్యమైనది. శరీరధారి అయిన దేవుడు సామాన్య మరియు సాధారణ మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడనటంలో సందేహం లేదు, కానీ ఆయన తన కార్యాన్ని జరిగించేటప్పుడు అది నేరుగా ఆయన అసంపూర్ణమైన మానవ స్వభావంతో మరియు సంపూర్ణ దైవత్వంతో ఉంటుంది. దీనిని బట్టి ప్రజలకు నేటి కార్యము గురించి, యేసు కార్యము గురించి కూడా సందేహాలు ఉన్నాయి. దేవుని కార్యము ఆయన శరీరునిగా మారిన రెండు విధానాల మధ్య వ్యత్యాసముంది గానీ, ఆయన స్వభావమందు కాదు. నిజానికి, ఒకవేళ నీవు నాలుగు సువార్తల దాఖలాలు చదివితే, వ్యత్యాసాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. యేసు బాల్య మరియు యవ్వన జీవితంలోనికి నీవు ఎలా తిరిగి రాగలవు? యేసు సాధారణ మానవ స్వభావాన్ని నీవు ఎలా గ్రహించగలవు? బహుశా నీకు ప్రస్తుత దేవుని మానవ స్వభావము గురించి బలమైన అవగాహన ఉండి ఉండవచ్చు, అయినప్పటికీ యేసు మానవ స్వభావము గురించి నీకు ఎటువంటి అవగాహన లేదు, నీకు అర్ధం కాదు కూడా. ఇది గనుక మత్తయి ద్వారా నమోదు చేయబడక పోయినట్లయితే, యేసు మానవ స్వభావం గురించి ఎలాంటి సూచనా ఉండేది కాదు. బహుశా, యేసు తన జీవిత కాలములోని చరిత్రలను గురించి నేను నీకు చెప్పినప్పుడు, మరియు యేసు బాల్యము మరియు యవ్వనపు అంతర్గత సత్యాలను నీకు చెప్పినప్పుడు, నీవు నీ తల ఊపుతూ, “లేదు! ఆయన అలా ఉండి ఉండడు. ఆయనకు ఎటువంటి బలహీనత ఉండదు, ఆయన ఎలాంటి మానవత్వాన్ని కలిగి ఉండడు!” అని నీవు అరిచి కేకలు కూడా వేస్తావు. ఇది ఎందుకంటే, నా గురించి నీవు ఆలోచనలు కలిగి ఉన్నట్టుగా యేసు గురించి నీవు అర్ధం చేసుకోలేదు. యేసు చాలా దైవికమని, ఆయన యందు శరీర సంబంధమైనది ఏమీ లేదని నీవు నమ్ముతావు. కానీ వాస్తవాలు ఇప్పటికీ వాస్తవాలుగానే ఉన్నాయి. వాస్తవాల సత్యాన్ని ధిక్కరించి మాట్లాడాలని ఎవరూ కోరుకోరు; ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు అది సత్య సంబంధముగా ఉంటుంది; అది ఊహాజనితమైనది కాదు, ప్రవచనమూ కాదు. దేవుడు ఉన్నత శిఖరాలకు ఎదగగలడని, మరియు, అంతేగాక, ఆయన మాగా అగాధములో దాగగలడని తెలుసుకోవాలి. ఆయన ఏదో నీ మనస్సులో ఉన్న కల్పిత పాత్ర కాదు—ఆయన సమస్త జీవరాశులకు దేవుడు, ఒక నిర్ధిష్ట వ్యక్తి ద్వారా రూపొందించబడిన వ్యక్తిగత దేవుడు కాదు.

మునుపటి:  దేవుని కార్యపు దర్శనం (1)

తరువాత:  దేవుని కార్యపు దర్శనం (3)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger