న్యాయ కాలములో కార్యము

ఇశ్రాయేలీయుల పట్ల యెహోవా చేసిన కార్యము అనేది మానవాళి కోసం భూమ్మీద దేవుని కార్యమునకు పుట్టుక ప్రదేశంగా వ్యవస్థాపితమైంది. దేవుడి ఉనికికి సంబంధించి అదే పవిత్ర స్థలంగానూ మారింది. ఆయన తన పనిని ఇశ్రాయేలీయులకే పరిమితము చేశాడు. ప్రారంభంలో ఆయన ఇశ్రాయేలు వెలుపల ఎలాంటి కార్యము చేయలేదు. కానీ, దానికి బదులుగా, తన కార్యము పరిధిని పరిమితము చేయడానికి తగిన వ్యక్తులను ఆయన ఎంచుకున్నాడు. ఇశ్రాయేలు అనేది ఆదామును మరియు అవ్వను దేవుడు సృజించిన ప్రదేశము. ఆ ప్రదేశంలోని ధూళి నుండే దేవుడు మనిషిని సృజించాడు; భూమి మీద దేవుడి కార్యమునకు ఈ ప్రదేశము ములాధారమైనది. నోవాహు వారసులు మరియు ఆదాము సంతతి అయిన ఇశ్రాయేలీయులే ఈ భూమి మీద యెహోవా కార్యమునకు మానవ పునాదిగా ఉన్నారు.

ఈ సమయంలో, ఇశ్రాయేలులో యెహోవా కార్యము ప్రాముఖ్యత, ఉద్దేశ్యము మరియు అడుగులనేవి, భూమి మీద తన కార్యమును ప్రారంభించి, ఇశ్రాయేలు కేంద్రముగా, అన్య దేశములలోకి క్రమముగా వ్యాప్తి చెందడముగా ఉన్నది. ఒక నమూనా స్థాపించడం ద్వారా లోకంలోని మనుష్యులందరూ ఆయన సువార్తను అంగీకరించువరకు దానిని విస్తరింప చేయుట—అనే ఈ సూత్రం ప్రకారముగానే ఆయన లోకమంతట పనిచేస్తాడు. ఆదిమ ఇశ్రాయేలీయులు నోవాహు సంతతివారు. యెహోవా ఉపిరులూదడం వల్లే సంపన్నులైన ఈ మనుష్యులు జీవము ప్రాథమిక అవసరాలు తీర్చుకొనుటకు అవసరమైన జ్ఞానము కలిగియున్నారు. కానీ, యెహోవా ఎలాంటి దేవుడో, లేక నరుని పట్ల ఆయన చిత్తమేంటో, సకల సృష్టికి ప్రభువైన ఆయనను ఎలా గౌరవించాలో వారికి తెలియదు. దేవుని విషయంలో విధేయత చూపాల్సిన,[ఎ] నియమాలు మరియు ధర్మాలు ఏమిటో, సృష్టించబడిన జీవములు సృష్టికర్త పట్ల జరిగించవలసిన బాధ్యత ఏమిటో లాంటి విషయాల గురించి ఆదాము సంతతికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని పోషించడానికి భర్త చెమటోడ్చి శ్రమించాలని, మరియు భార్య తన భర్తకు లోబడి ఉండాలని, అలాగే యెహోవా సృజించిన మానవజాతిని శాశ్వతముగా కొనసాగించాలని మాత్రమే వారికి తెలుసు. మరొక విధంగా చెప్పాలంటే, యెహోవా ఊదిన ఉపిరి మరియు జీవమును మాత్రమే కలిగియున్న ఆ మనుష్యులకు దేవుని ధర్మాలను ఎలా పాటించాలో లేక సర్వ సృష్టికర్త అయిన ప్రభువును ఎలా సంతృప్తి పరచాలో ఏమీ తెలియదు. ఆ విషయాలను వారు చాలా తక్కువ అర్థం చేసుకున్నారు. కాబట్టే, దుష్టత్వము మరియు మోసపుచ్చే ఆలోచన వారి హృదయాల్లో లేనప్పటికీ, వారి మధ్య అసూయ మరియు వివాదాలు అరుదుగానే తలెత్తినప్పటికీ, సర్వ సృష్టికి ప్రభువైన యెహోవాను గురించి వారికి జ్ఞానము మరియు అవగాహన లేదు. మనుష్యుల పూర్వికులైన వీరికి కేవలం యెహోవాకు చెందిన వాటిని తినడం మరియు యెహోవాకు చెందిన వాటిని ఆస్వాదించటం మాత్రమే తెలుసు. కానీ, యెహోవాను ఆరాధించడం వారికి తెలీదు; మోకరిళ్లడం ద్వారా తాము ఆరాధించవలసిన యెహోవా ఆయనే అని వారికి తెలీదు. అలాంటప్పుడు, వారిని ఆయన జీవములుగా పిలవడం ఎలా సాధ్యం? ఇదే పరిస్థితి కొనసాగి ఉంటే, “యెహోవా సర్వసృష్టికి ప్రభువు” మరియు “ఆయన ప్రతినిధిగా, ఆయననుమహిమ పరచడానికి మరియు ఆయన గురించి వర్ణించడానికి ఆయన మానవుని సృజించాడు” అనే మాటలు వృధాగా మాట్లాడినట్లే కదా? యెహోవా పట్ల గౌరవము లేనివారు ఆయన మహిమకు ఎలా సాక్షులు కాగలరు? ఆయన మహిమకు ఎలా నిదర్శనాలు కాగలరు? “నా స్వరూపమందు నేను నరుని చేశాను” అనే యెహోవా మాటలు దుష్టుడైన సాతాను చేతిలో ఆయుధముగా మారవా? యెహోవా మానవ సృష్టికి ఈ మాటలు అవమానకర సూచనగా మారదా? ఆ దశ కార్యమును పూర్తి చేసే క్రమంలో, మానవజాతిని సృజించిన తర్వాత, ఆదాము నుండి నోవాహు వరకు యెహోవా ఎటువంటి ఉపదేశము లేక మార్గ నిర్దేశము చేయలేదు. బదులుగా, జలప్రళయము వచ్చి లోకాన్ని నాశనము చేశాక మాత్రమే నోవాహు మరియు ఆదాము సంతతి అయిన ఇశ్రాయేలీయులకు ఆయన లాంఛనముగా మార్గ నిర్దేశము చేయడం ప్రారంభించాడు. ఇశ్రాయేలులో ఆయన పని మరియు బోధనలు ఇశ్రాయేలు దేశమంతటా నివసించిన ఇశ్రాయేలు ప్రజలందరికి మార్గ నిర్దేశం చేశాయి. తద్వారా యెహోవా నరునిలో జీవవాయువును ఊదగలడని, తాను (నరుడు) ఆయన నుండి జీవాన్ని పొందుకొని ధూళి నుండి సృజించబడిన మానవునిగా లేపబడగలడని మాత్రమే కాకుండా, ఆయన మానవజాతిని దహించి వేస్తాడని, మరియు మానవజాతిని శపిస్తాడని, మరియు మానవజాతిని పరిపాలించడానికి తన దండమును ఉపయోగిస్తాడని కూడా మానవాళికి ప్రదర్శించబడుతున్నాయి. అలాగే, యెహోవా భూమిపై మానవుని జీవితాన్ని మార్గ నిర్దేశము మరియు కార్యము చేయగలడని, పగలు మరియు రాత్రి సమయాల ప్రకారం మానవాళి మధ్య మాట్లాడగలడని కూడా ఆ మనుష్యులు చూశారు. మానవుడు తాను తీసిన ధూళి నుండి వచ్చాడని, అంతేగాక మనిషి అనే జీవము తాను చేసిన సృష్టి అని తన జీవకోటి తెలుసుకోవాలని మాత్రమే ఆయన కార్యము చేశాడు. ఇది మాత్రమే కాదు, ఇతర మనుష్యులు మరియు ఇతర జాతులు (నిజానికి, ఎవరైతే ఇశ్రాయేలు నుండి వేరుపరచబడకుండా, ఇశ్రాయేలీయుల నుండి శాఖలుగా వెళ్లి, ఇప్పటికీ ఆదాము మరియు అవ్వల సంతానముగా ఉన్నవారు) ఇశ్రాయేలు నుండి యెహోవా సువార్తను పొందునట్లు, తద్వారా ఈ లోకములో సృజించబడినవన్ని యెహోవాను గౌరవించి ఆయనను ఉన్నతునిగా కలిగియుండునట్లుగా, మొదట ఆయన ఇశ్రాయేలులో తన పనిని చేశాడు. యెహోవా ఇశ్రాయేలులో తన పనిని ప్రారంభించడానికి బదులుగా మానవజాతిని సృజించి, భూమి మీద నిర్లక్ష్య జీవితాలు గడపడానికి వారిని అనుమతించి ఉంటే, మనిషి భౌతిక స్వభావం (స్వభావము అనగా మనిషి తాను ఎరుగని వాటిని ఎప్పటికీ తెలుసుకోలేడు, అంటే, మానవజాతిని సృజించినది యెహోవా అని మనిషికి తెలియదు మరియు ఆయన ఎందుకు అలా చేశాడో కూడా తెలియదు) బట్టి, మానవజాతిని సృజించినది, లేక సర్వ సృష్టికి ప్రభువు యెహోవా అని మనిషికి ఎప్పటికి తెలియదు. యెహోవా మానవుని సృజించి మరియు భూమి మీద ఉంచి, మానవజాతి మధ్య కొంత కాలము ఉండి వారికి మార్గ నిర్దేశము చేయకుండా, కేవలము తన చేతులు దులుపుకొని వదిలివేసి ఉంటే, అప్పుడు మానవాళి మొత్తం శూన్యమై ఉండేది; భూమ్యాకాశము మరియు ఆయన సృజించిన సమస్త జీవములు మరియు మానవాళి మొత్తము శూన్యమై, సాతాను చేత తోక్కించబడేవి. అలాంటి పరిస్థితిలో ఈ “భూమి మీద, అనగా తన సృష్టి నడుమ, నిలుచుటకు ఒక స్థలము, పరిశుద్ధ స్థలముగా ఉండాలి” అనే యెహోవా కోరిక చెదిరిపోయి ఉండేది. కాబట్టి, మానవజాతిని సృజించిన తరువాత, వారి జీవితాల్లో మార్గ నిర్దేశం చేయడానికి మరియు వారి మధ్య నుండి వారితో మాట్లాడటానికి ఆయన వారి మధ్య గడిపాడు—ఆయన ఆశను మనిషి గ్రహించడానికి, మరియు ఆయన ప్రణాళికను సాధించడానికి ఇదంతా జరిగినది. ఆయన ఇశ్రాయేలులో చేసిన పని అనేది, తన సమస్త సృష్టికి ముందుగానే తాను సిద్దపరచిన ప్రణాళికను అమలుచేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది, కాబట్టి, ఇశ్రాయేలీయులలో ఆయన మొదట పనిచేయడము మరియు సమస్తాన్ని సృష్ఠించడము ఏవికూడా ఒకదానికొకటి విరుద్ధముగా లేవు, కానీ, ఆ రెండూ ఆయన నిర్వహణ, కార్యము మరియు ఆయన మహిమ కొరకు జరిగాయి, మరియు మానవజాతి సృష్టి అర్ధాన్ని హెచ్చించడానికి చేయబడ్డాయి. నోవాహు తరువాత రెండువేల సంవత్సరాల పాటు భూమిమీద మానవాళికి ఆయన మార్గ నిర్దేశము చేశాడు. సర్వ సృష్టికి ప్రభువైన యెహోవాను ఎలా గౌరవించాలో, ఎలా జీవించాలో, మరియు జీవితాన్ని ఎలా కొనసాగించాలో, మరియు అన్నింటికంటే ముఖ్యంగా యోహోవాకు సాక్షిగా ఎలా ఉండాలో, ఆయనకు విధేయత చూపడం, మరియు ఆయనను గౌరవించడం, అలాగే దావీదు మరియు తన యాజకులు చేసిన విధముగా సంగీతనాదముతో ఆయనను స్తుతించడము వంటివి వారికి అర్ధమయ్యేలా ఆ కాలమున ఆయన బోధించాడు.

యెహోవా తన కార్యము చేసిన రెండువేల సంవత్సరాలకు పూర్వము మానవునికి ఏమీ తెలియదు, మరియు మానవాళి మొత్తము దాదాపుగా దుష్టత్వములో పడిపోయింది, జలప్రళయము ద్వారా లోకము నాశనమయ్యే ముందు వరకు, వారి వ్యభిచారము మరియు దుర్నీతి తీవ్రత, వారి హృదయాలు పూర్తిగా యోహోవాకు దూరముగా మరియు ఆయన మార్గమును మరింత విస్మరించే స్థాయికి చేరుకున్నాయి. వారికి యెహోవా పని గురించి అస్సలు గ్రహింపు లేదు, ఊపిరి పీల్చుకునే యంత్రాల వలె వారికి తెలివి లేదు, జ్ఞానము కూడా లేదు, మనిషి, దేవుడు, లోకము, జీవితము మొదలైన వాటి గురించి వారికి పూర్తిగా తెలియదు. భూమి మీద వారు సర్పము వలే అనేక సమ్మోహనాలలో నిమగ్నమై, యెహోవాకు అసహ్యమైన అనేక విషయాలు పలికారు, కానీ వారు అజ్ఞానులైనప్పటికీ, యెహోవా వారిని దండించలేదు లేక శిక్షించలేదు. జలప్రళయము తరువాత నోవాహు 601 సంవత్సరాలు గలవాడైనప్పుడు, యెహోవా నోవాహుకు అధికారికముగా కనపడి, అతడిని మరియు అతని కుటుంబాన్ని నడిపించాడు, నోవాహు మరియు అతని వారసులతో పాటు జలప్రళయం నుండి బయటపడిన పక్షులు మరియు జంతువులను, మొత్తంగా 2,500 సంవత్సరాలు కొనసాగిన న్యాయ కాలము ముగిసే వరకు నడిపించాడు. ఆయన ఇశ్రాయేలు నందు కార్యములో ఉన్నాడు అంటే, ఆయన మొత్తంగా 2,000 సంవత్సరాలు అధికారిక కార్యము కోసం, ఇశ్రాయేలు మరియు దాని వెలుపల ఏకకాలములో 500 సంవత్సరాలు కార్యము కోసం, వెరసి 2,500 సంవత్సరాలు పని చేశాడు. ఈ కాలంలో యెహోవాను సేవించడానికి, మనుష్యులు ఆలయమును నిర్మించాలని, యాజక వస్త్రాలు ధరించాలని, వారి పాదరక్షలు ఆలయాన్ని అపవిత్రపరిచే కారణమున ఆలయ శిఖరం నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి చంపకుండా ఉండడం కోసం అరుణోదయమున వారు పాదరక్షలు లేకుండా ఆలయములో నడవాలని ఇశ్రాయేలీయులకు ఆయన సూచించాడు. ఆవిధంగా, వారు వారి విధులను నిర్వర్తిస్తూ, యెహోవా ప్రణాళికలకు లోబడియున్నారు. వారు ఆలయములో యోహోవాను ప్రార్దించి, యెహోవా ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత, అనగా, యెహోవా వారితో మాట్లాడిన తర్వాత, తమ దేవుడైన యెహోవా పట్ల భక్తిని కనుపరచుకోవాలని జన సమూహాలకు బోధించి, వారిని ముందుకు నడిపించారు. మరియు యెహోవా నిర్ణయించిన సమయాన వారు ఒక ఆలయాన్ని మరియు బలిపీఠాన్ని నిర్మించాలని, అనగా, పస్కా దినమున, వారిని మితపరచుకొనుటకు మరియు వారి హృదయములలో యెహోవా పట్ల భక్తిని కలిగి ఉండి, యెహోవాను సేవించుటకు, తొలిచూలు దూడలను మరియు గొర్రె పిల్లలను బలిపీఠము మీద బలిగా సిద్దపరచాలని యెహోవా వారికి సెలవిచ్చాడు. ఆవిధంగా, వారు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారా లేదా అనేది వారి విధేయతకు ప్రమాణముగా మారింది. యెహోవా తన సృష్టిలోని ఏడవ దినాన్ని, అనగా విశ్రాంతి దినాన్ని కూడా నియమించాడు. విశ్రాంతి దినము మరుసటి రోజును, మొదటి దినముగా వారు యెహోవాను స్తుతించడానికి, ఆయనకు బలులు అర్పించడానికి, మరియు ఆయన కొరకు గానము చేయుటకు ఒక రోజుగా చేశాడు. ఈ దినమున యెహోవా బలిపీఠము బలులను ప్రజలు తిని ఆనందించునట్లు, బలిపీఠము మీది బలులను పంచిపెట్టుటకు యెహోవా యాజకులందరినీ పిలిచాడు. మరియు వారు ఆశీర్వదింపబడినవారు. కాబట్టి, వారు తనతో భాగము పంచుకున్నారని, మరియు దానినిబట్టి వారు ఆయన ఏర్పరిచిన మనుష్యులని (ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధన ఇది) ఆయన సెలవిచ్చాడు. కాబట్టే, యెహోవా తమ దేవుడని, అన్యుల దేవుడు కాదని ఇశ్రాయేలు ప్రజలు నేటికీ చెప్తుంటారు.

ఐగుప్తు నుండి తనను వెంబడించిన ఇశ్రాయేలీయులకు అందించాల్సిందిగా ధర్మశాస్త్ర కాలమందు యెహోవా మోషేకు అనేక ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నీ యెహోవా నుండి ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినవే గానీ, ఐగుప్తీయులకు వీటితో ఎటువంటి సంబంధం లేదు; అవి ఇశ్రాయేలీయులను అదుపుచేయడానికి ఉద్దేశించబడ్డాయి, మరియు వారి అక్కరలు తీర్చడానికి ఆయన ఆ ఆజ్ఞలను ఉపయోగించాడు. వారు విశ్రాంతి దినాన్ని ఆచరించడం, తల్లిదండ్రులను సన్మానించడం, విగ్రహాలను పుజించడం లాంటివి ఏమి చేసినప్పటికీ—ఈ నియమాల ఆధారంగానే వారు పాపులా లేక నీతిమంతులా అని తీర్పు తీర్చబడ్డారు. వారిలో, కొందరు యెహోవా అగ్ని చేత కొట్టబడినవారు, కొందరు రాళ్ళతో కొట్టబడి చంపబడినవారు, అలాగే మరికొందరు యెహోవా ఆశీర్వాదము పొందుకొన్నవారుగా ఉన్నారు, మరియు వారు ఈ ఆజ్ఞలను పాటించారా లేదా అనే దానిని బట్టి అది నిర్ణయించబడింది. విశ్రాంతి దినమును ఆచరించని వారిని రాళ్ళతో కొట్టి చంపారు. విశ్రాంతి దినమును ఆచరించని యాజకులు యెహోవా అగ్ని చేత కొట్టబడ్డారు. తల్లిదండ్రులను సన్మానించనివారిని కుడా రాళ్ళతో కొట్టి చంపారు. ఇదంతా యోహోవాకు ఇష్టమైంది. ఆయన వారి జీవితాల్లో వారిని నడిపించినప్పుడు, ప్రజలు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేయకుండా, ఆయన మాటను విని మరియు కట్టుబడి ఉండుటకు, యెహోవా తన ఆజ్ఞలను మరియు కట్టడలను నియమించాడు. నూతనముగా పుట్టిన మానవజాతిని అదుపులో ఉంచుటకు మరియు తన భవిష్యత్ కార్యాచరణకు మంచి పునాది వేయుటకు ఆయన ఈ కట్టడలను ఉపయోగించాడు. కావున, యెహోవా చేసిన పనిని బట్టి, మొదటి యుగము ధర్మశాస్త్ర యుగముగా పిలువబడింది. యెహోవా ఎన్ని బోధనలు చేసినప్పటికీ మరియు ఎంత కార్యము చేసినప్పటికీ, ఆయన ప్రధానంగా, మనిషిగా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, యెహోవా తలంపును ఎలా గ్రహించాలో ఈ అజ్ఞానులకు నేర్పిస్తూ, ఆయన ప్రజలను సానుకూల దిశగానే నడిపించాడు. చాలామట్టుకు, ప్రజలు తన వైఖరిని గ్రహించేలా మరియు తన కట్టడలను అనుసరించేలా ఆయన పని చేశాడు. నిస్సారముగా చెడిపోయిన ప్రజల కోసమే ఈ కార్యము జరిగింది; అయితే, ఇదంతా వారి స్వభావాన్ని లేక జీవితములో వారి అభివృద్దిని మార్చేంతగా మాత్రం విస్తరించలేదు. ఎందుకంటే, ప్రజలను అదుపు చేయడానికి మరియు నియంత్రించడానికి మాత్రమే ఆజ్ఞలను ఉపయోగించాలని ఆయన అనుకున్నాడు. ఆ కాలములో ఇశ్రాయేలీయులకు యెహోవా కేవలము ఆలయములోని ఒక దేవుడుగా, ఆకాశములలోని ఒక దేవునిగా ఉన్నాడు. ఆయన మేఘ స్థంభముగా, అగ్ని స్తంభముగా ఉన్నాడు. యోహోవాకు కావల్సింది ఆనాటి ప్రజలు వారికి తెలిసిన ఆయన కట్టడలకు మరియు ఆజ్ఞలకు లోబడటం మాత్రమే, వీటినే నియమాలని కూడా చెప్పవచ్చు—ఎందుకంటే, యెహోవా చేసిన కార్యమనేది మనిషిని మార్చడానికి కాదు, కానీ, మనిషి కలిగి ఉండవలసిన వాటిని అధికముగా ఇవ్వడానికి మరియు తన నోటి ద్వారా వారికి భోదించడానికి ఉద్దేశించబడినది. ఏలయనగా, సృజించబడిన తరువాత, మానవుడు కలిగియుండడానికి ఏమీ లేదు. కాబట్టే, మనుష్యులకు భూమి మీద వారి జీవితాల కొరకు కలిగియుండవలసిన వస్తువులను ఇచ్చి, తాను నడిపించిన ప్రజలను వారి పితరులైన ఆదాము మరియు అవ్వలను అధిగమించేలా యెహోవా చేశాడు, ఎందుకంటే, యెహోవా వారికి ఇచ్చినవి మొదట్లో ఆదాము అవ్వలకు ఇచ్చిన వాటికంటే మించిపోయాయి. ఏదేమైనప్పటికీ, యెహోవా ఇశ్రాయేలులో చేసిన కార్యము అనేది కేవలం మానవాళికి మార్గ నిర్దేశం చేయడం, మరియు మానవాళి తమ సృష్టికర్తను గుర్తించేలా చేయడమైయున్నది. ఆయన వారికి మార్గ నిర్దేశం మాత్రమే చేశాడు కానీ, ఆయన వారిని జయించడం లేదా మార్చడం చేయలేదు. యెహోవా ధర్మశాస్త్ర కాలంలో చేసిన కార్యము సారాంశం ఇదే. మొత్తము ఇశ్రాయేలు భూమ్మీద, మరియు తన ఆరువేల సంవత్సరాల కార్యము ప్రారంభ కోసం ఆయన చేసిన కార్యము నేపథ్యము, దాని వాస్తవ కథనము, ఆయన కార్యములోని అర్థము ఒక్కటే—మానవాళిని యెహోవా హస్త వశములో ఉంచడం. ఆయన ఆరు-వేల-సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలో భాగంగా, ఇక్కడి నుండే ఎక్కువ కార్యము ఉద్భవించింది.

ఫుట్‌నోట్:

ఎ. మూల వచనములో “విధేయత చూపాల్సిన” అనే పదబంధం లేదు.

మునుపటి:  సువార్తను వ్యాప్తి చేయు కార్యము అనేది మనిషిని రక్షించు కార్యమైయున్నది

తరువాత:  విమోచన యుగం నాటి కార్యము వెనుక దాగియున్న నిజమైన కథ

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger