క్రీస్తుతో అనుకూలించని వారందరూ నిశ్చయముగా దేవుని విరోధులే
యేసు యొక్క నిజమైన స్వరూపమును చూడాలని మరియు ఆయనతో ఉండాలని మనుష్యులందరూ ఇష్టపడతారు. యేసును చూడాలని మాకు ఇష్టం లేదు లేక ఆయనతో ఉండుట నాకు ఇష్టం లేదు అని ఏ సహోదరుడు లేక ఏ సహోదరియు ఆలోచించరు. మీరు యేసును చూడక మునుపు—శరీరధారియైన దేవుని మీరు చూడక మునుపు—మీరు అన్ని విధాలైన ఆలోచనలకు సమ్మతి పలికి ఉంటారు. ఉదాహారణకు, యేసుని రూపం, ఆయన మాట్లాడు శైలి, ఆయన జీవన విధానం, ఇలా మొదలగువాటిని గూర్చి ముందే ఆలోచించి ఉంటారు. అయితే, మీరు ఆయనను నిజంగా చూసినప్పుడు, మీ ఆలోచనలు వెంటనే మారిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మనుష్యుని ఆలోచనను తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే, అది నిజమైనది—అయితే అంతకు మించి, క్రీస్తు గుణగణాలు మనుష్యుని ద్వారా మార్పు చేయబడవు. మీరు క్రీస్తును ఒక అమరునిగా లేక పవిత్రునిగా చూస్తున్నారు, అయితే ఎవరు కూడా ఆయనను దైవిక గుణగుణాలు కలిగిన సాధారణ వ్యక్తిగ చూడటం లేదు. మరోవైపు, దేవుణ్ణి చూడాలని రాత్రింబవళ్ళు కష్టపడుచున్న అనేకులు వాస్తవానికి దేవుని శత్రులైయున్నారు మరియు ఆయనతో వారు సంబంధం కలిగియుండరు. ఇది మనుష్యుల పక్షాన తప్పిదము కాదా? నిజానికి, క్రీస్తు స్వరూపమును చూచుటకు మీ విశ్వాసం మరియు నమ్మకత్వం సరిపోతుందని మీరు ఇప్పటికీ అనుకుంటున్నారు. కానీ, ఆచరణాత్మకమైన అనేక విషయాలలో మిమ్ములను మీరు సిద్ధపరచుకోవాల్సి ఉందని నేను హెచ్చరించుచున్నాను! భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములలో క్రీస్తుతో తలపడిన అనేకులు ఓడిపోయారు లేక ఓడిపోతారు; వాళ్ళందరూ పరిసయ్యుల పాత్రను పోషిస్తారు. మీ విఫలతకు కారణం ఏంటి? దేవుడు ఉన్నతుడని మరియు ప్రశంసలకు అర్హుడని మీరు దేవుని గూర్చి కలిగియున్న ఆలోచనలే దీనికి ప్రధాన కారణం. అయితే సత్యమనేది మనుష్యుడు ఆశించినట్లు ఉండదు. క్రీస్తు ఉన్నతుడు కాకపోవడమే కాకుండా, ఆయన ప్రత్యేకించి చిన్నవాడుగా ఉన్నాడు; ఆయన మానవుడుగా ఉండడమే కాకుండా ఆయన ఒక సాధారణ మానవుడై ఉన్నాడు; ఆయన స్వర్గానికి ఎక్కలేకపోవడమే కాకుండా, భూమ్మీద సైతం స్వేచ్ఛగా తిరగలేకపోయాడు. ఈ కారణంగానే, మనుష్యులు ఆయనను తమలాగే ఒక సాధారణా మనిషిగానే భావించారు మరియు ఆయనతో నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. అదే సమయంలో, “నిజమైన క్రీస్తు” కోసం వారింకా నిరీక్షిస్తూనే ఉన్నారు. నిజానికి, సామాన్య మానవుడిగా భూమ్మీదకు వచ్చిన క్రీస్తును, సామాన్య మానవుడిలా మాట్లాడే క్రీస్తును వారు లక్ష్య పెట్టలేదు. ఈ కారణంగానే, మీరు క్రీస్తు నుండి ఏదీ స్వీకరించలేదు, బదులుగా మీ సంపూర్ణమైన అందవిహీనతను వెలుగులో బట్టబయలు చేసుకున్నారు.
క్రీస్తును కలవక ముందు వరకు, నీవు స్వాభావికంగా సంపూర్ణమైన రీతిలో మారిపోయావని, నీవు క్రీస్తుకు నమ్మకమైన అనుచరుడవని, నీకు మించి ఇంకెవ్వరు క్రీస్తు ఆశీర్వాదములను పొందుకొనుటకు అర్హులు కారని—మరియు అనేకమైన మార్గములగుండా వెళ్లి, అధికమైన పని చేసి, అత్యధిక ఫలములను సంపాదించినందున నీవు తప్పకుండ కిరీటమును స్వీకరించు ఏకైక వ్యక్తిగా నిలిచియుందువని నీవు నమ్ముకొనియుండవచ్చు. అయితే, నీకు తెలియని ఒక సత్యమున్నది: మానవుని అవినీతి స్వభావము, అతని తిరుగుబాటుతనము మరియు అతని ప్రతిఘటన అంతయు క్రీస్తును చూచినప్పుడు బహిర్గతమవుతుంది మరియు ఈ సమయమున బహిర్గతమైన అతని తిరుగుబాటుతనము మరియు అతని ప్రతిఘటన ఇతర సమయముల కంటే ఈ సమయములో సంపూర్ణంగ బహిర్గతము చేయబడును. ఎందుకంటే, క్రీస్తు మనుష్య కుమారుడు—సామాన్యమైన మానవత్వమును కలిగియున్న మనుష్య కుమారుడు—ఈయనను మనుష్యుడు సన్మానించుటయు లేదు లేక గౌరవించుటయు లేదు. దేవుడు శరీరధారియై నివసించుట ద్వారా మానవుని తిరుగుబాటుతనము స్పష్టముగా, ఏ దాపరికం లేకుండ వెలుగులోనికి తేబడినందున మనుష్యుడు ఆయనను సన్మానించుట లేదు. అందువలన క్రీస్తు రాకడ మానవాళి యొక్క సమస్త తిరుగుబాటుతనమును పెళ్ళగించి మానవుని స్వభావమునకు కొంత ఉపశమనమును కలిగించినది. దీనినే “కొండమీదనుండి పులిని రప్పించడం” లేక “గుహలోనుండి నక్కను రప్పించడం” అని అంటారు. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావని చెప్పుటకు ఇప్పుడు ధైర్యం ఉందా? దేవునికి నీవు సంపూర్ణంగ లోబడియున్నావని చెప్పుటకు ఇప్పుడు ధైర్యం ఉందా? నీవు తిరుగుబాటు చేయుటలేదని చెప్పుటకు ఇప్పుడు ధైర్యం ఉందా? “దేవుడు నన్ను క్రొత్త వాతావరణంలో ఉంచినప్పుడు, నేను ఏ సణుగుడు గొణుగుడు లేకుండా లొంగిపోతాను మరియు దేవుని గూర్చి నేను ఎటువంటి భావాలను కూడా వ్యక్తపరచను” అని కొందరు అంటారు. “దేవుడు నాకు ఏ పనిని అప్పగించినా సరే, నా సామర్థ్యం కొలది దానిని పూర్తి చేస్తాను మరియు వాటిని నేను తప్పించుకోను” అని మరికొందరంటారు. అలాంటప్పుడు, నేను మిమ్ములను ఇలా అడుగుచున్నాను: మీరు క్రీస్తుతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆయనతో సంబంధాలను కలిగియుండగలరా? ఆయనతో మీరు ఎంత కాలం సంబంధం కలిగియుండగలరు? ఒక రోజా? రెండు రోజులా? ఒక గంటసేపా? రెండు గంటలసేపా? మీ విశ్వాసం ప్రశంసనీయంగా ఉండొచ్చుగానీ మీరు విశ్వాసమందు స్థిరముగా ఉండుట లేదు. నీవు క్రీస్తుతో నిజంగా జీవించుచున్నట్లయితే, నీ స్వనీతి మరియు స్వీయ ప్రాధాన్యత క్రమక్రమంగా నీ మాటలలోను క్రియలలోను బహిర్గతము చేయబడును మరియు నీ విపరీతమైన కోరికలు, అవిధేయత కలిగియున్న నీ మనస్తత్వము, నీ అసంతృప్తి సహజంగానే బట్టబయలు చేయబడును. తుదకు, నీ అహంకారం ఇంకా పెరిగి, అగ్నికి నీళ్ళకు పొత్తులేనట్లుగా క్రీస్తుతో నీవు విభేదిస్తూనేయుందువు అప్పుడు నీ స్వభావము సంపూర్ణంగ బహిర్గతము చేయబడుతుంది. ఆ సమయంలో నీ ఉద్దేశ్యాలు కప్పిపుచ్చబడవు, నీవు చేయు ఫిర్యాదులు కూడా సహజంగానే బయటపడతాయి మరియు అవమానకరమైన నీ మానవత్వం సంపూర్ణంగ బహిర్గతము చేయబడుతుంది. అప్పటికి కూడా, నీ స్వంత తిరిగుబాటుతనమును అంగీకరించుటకు ఒప్పుకొనక ఇటువంటి క్రీస్తును మునుష్యుడు అంగీకరించుట అంత సులభమైన విషయము కాదని, ఆయన చాలా కచ్చితమైన మనుష్యునిగా ఉన్నాడని నమ్మి క్రీస్తు ఇంకా కరుణామయునిగా ఉంటే నీవు ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకొందువని చెప్పుదువు. మీ తిరుగుబాటుతనము న్యాయమైనదని, ఆయన మిమ్మును చాలా దూరం త్రోసినప్పుడే మీరు ఆయన మీద తిరుబాటు చేస్తున్నారని నమ్ముతారు. మీరు ఆయనకు విధేయత చూపుటకు మీరు క్రీస్తును ఒక్కసారైన దేవునిగా భావించలేదు. అయితే, నీ స్వంత చిత్తానుసారం క్రీస్తు పనిచేయాలని మొండిగా బలవంతపెడతారు మరియు నీ ఆలోచన ప్రకారం లేని ఏదైన ఒక్క పని చేసినప్పుడు ఆయన దేవుడు కాదు మనిషే అని నువ్వు నమ్ముతావు. మీలో అనేకులు ఆయనతో ఈ విధంగానే సంతృప్తి చెందియున్నారు కదా? మీరు ఎవరిలో నమ్మికయుంచియున్నారు? మరియు మీరు ఏ మార్గములో వెదకుచున్నారు?
మీరు క్రీస్తును చూడాలనే కోరికను కలిగియున్నారు, అయితే మిమ్మల్ని మీరు అటువంటి హెచ్చయిన స్థితిలో ఉంచుకోకూడదని నేను మిమ్ములను ప్రాధేయపడుచున్నాను; ఎవరైనా క్రీస్తును చూడగలరు కానీ, క్రీస్తును చూచుటకు ఎవరు అర్హులుకారనే విషయాన్ని నేను చెబుతున్నాను. ఎందుకంటే మనుష్యుని స్వభావం దుష్టత్వం, అహంకారం మరియు తిరుగుబాటుతనముతో నిండియుంటుంది, మీరు క్రీస్తును చూచిన ఆ క్షణమున నీ స్వభావము నిన్ను నాశనం చేస్తుంది మరియు నీకు మరణ శిక్షను విధిస్తుంది. నీవు ఒక సహోదరుడు (లేక సహోదరితో) సహవాసం చేయుట ద్వారా నీ గురించి ఎక్కువగా ఏమి కనపరచదు అయితే నీవు క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు అది సులభంగా ఉండదు. ఏ సమయములోనైనా, నీ ఆలోచనలు వేరు తన్ని, నీ అహంకారం చిగురించవచ్చు మరియు నీలో తిరుగుబాటు అనే కాపు కాయవచ్చు. ఇటువంటి మానవ నైజం కలిగిన నీవు క్రీస్తుతో సహవాసం చేయుటకు ఎలా యోగ్యుడవుగా ఉంటావు? ప్రతి దినము ప్రతి గడియ ఆయనను దేవునిగా నీవు నిజంగా చూడగలుగుచున్నావా? నీవు దేవునియందు నిజమైన సమర్పణను కలిగియున్నావా? ఉన్నతుడైన దేవుని మీరు మీ హృదయాలలో యెహోవా అని ఆరాధిస్తున్నారు కానీ కనిపించు క్రీస్తును మీరు మనుష్యునిగా భావిస్తున్నారు. మీ భావాలు నీచమైనవిగాను మీ మానవత్వం అవమానకరంగాను ఉన్నది! మీరు ఎల్లప్పుడు క్రీస్తును దేవునిగా చూచుటకు అసమర్థులైయున్నారు; కొన్ని సందర్భాలలో మాత్రమే అంటే, మీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనను దేవునిగా ఆరాధిస్తారు. ఇందుమూలంగానే నేను మిమ్మల్ని దేవుని విశ్వాసులు కారనీ, క్రీస్తుకు విరోధంగ పోరాడు సహచరుల గుంపనీ పిలుస్తున్నాను. కనికరం చూపించే కొంతమంది మనుష్యులకు మీరు ఏదో విధంగ ప్రతిఫలం చెల్లిస్తారు గానీ మీ మధ్యలో క్రీస్తు చేసిన అత్యున్నతమైన కార్యము కొరకు ఆయన ఏనాడూ మనుష్యుని ప్రేమను గానీ ప్రతిఫలం గానీ లేక సమర్పణను గానీ పొందుకొలేదు. ఇది హృదయవిదారక సంగతి కాదా?
నీవు దేవునిలో విశ్వాసం ఉంచిన సంవత్సరములన్నిటిలో, నీవు ఎవరినైనా శపించియుండవచ్చు లేక ఒక చెడ్డ పని చేసియుండవచ్చు, కానీ నీవు క్రీస్తుతో సంబంధం కలిగియున్నప్పుడు, మీరు సత్యమును మాట్లాడలేకపోవుచున్నారు, నిజాయితీగా ఉండలేకపోవుచున్నారు లేక క్రీస్తు మాటలకు విధేయులు కాలేకపోతున్నారు; ఇటువంటి సందర్భములో, లోకములో నీవు అత్యంత కుటిలవర్తనుడిగా మరియు ద్రోహిగా ఉన్నావు. నీవు నీ బంధువులు, స్నేహితులు, భార్య (లేక భర్త), కుమారులు మరియు కుమార్తెలు, తల్లిదండ్రుల మధ్యన అనూహ్యమైన రీతిలో స్నేహభావమును వ్యక్తపరచిన మరియు ఇతరులను అక్రమంగా వాడుకోకపోయినప్పటికీ నీవు క్రీస్తుతో సంబంధం కలిగియుండుటకు సమర్థుడు కాకపోతే లేక ఆయనతో సమాధానంగా సంభాషించుటకు సాధ్యము కాకపొతే, నీ సంపాదనంతా నీ చుట్టుప్రక్కల వారికి కర్చుపెట్టినా లేక నీ తల్లిదండ్రులను మరియు నీ కుటుంబస్తులను అమితంగా చూసుకున్నా, నీవు ఇంకా జిత్తులమారి ఆలోచనలతోను నిండియున్న ఒక దుర్మార్గునిగానే మిగిలిపోయావని నేను చెప్పుచున్నాను. నీవు అందిరితో సత్సంబంధం కలిగియున్నందుకుగాను లేక ఏవో కొన్ని మంచి పనులు చేసినందుకుగాను నీవు క్రీస్తుతో సంబంధం కలిగియున్న వ్యక్తిగా నిన్ను నీవు తలంచనవసరం లేదు. నీ ఉదార స్వభావము చేత పరలోక ఆశీర్వాదములను కొల్లగొట్టుకోవచ్చని నీవు అనుకుంటున్నావా? నీ విధేయతకు బదులుగా కొన్ని మంచి పనులు చేస్తే సరిపోతుందని నీవు అనుకుంటున్నావా? మీలో ఒక్కరైనా సవరింపునకు మరియు క్రమపరచబడటానికి ఒప్పుకోలేరు లేక అంగీకరించనూలేరు. మీరందరూ సామాన్యమైన క్రీస్తు మానవత్వమును వెంబడించుటకు కష్టబడతారు, అయినప్పటికీ మీరు దేవునికి విధేయులమై యున్నామని విర్రవీగుచు డప్పాలు కొట్టుకొనుచున్నారు. మీరు కలిగియున్న అట్టి విశ్వాసము తగిన శిక్షను తీసుకొస్తుంది. క్రీస్తును చూడాలనే మీ ఉహా ప్రపంచము నుండి బయటకు రండి. ఎందుకంటే ఆయనను చూచుటకు మీకు ఏ విధమైన అర్హత లేదు, మీరు చాలా తక్కువ స్థాయిని కలిగియున్నారు. నీవు నీ తిరుగుబాటుతనము నుండి పూర్తిగా బయటబడిన తర్వాత క్రీస్తుతో సమాధానం కలిగియుండుటకు సమర్థులై యున్నప్పుడు, ఆ క్షణమున దేవుడు నీకు స్వాభావికంగానే ప్రత్యక్షమౌతాడు. ఎటువంటి సవరింపు లేక తీర్పును ఎదుర్కొనకుండానే దేవుని చూచుటకు వెళ్ళితే, నీవు నిశ్చయముగా దేవుని విరోధివై యుండి నాశనముకు పాత్రుడవవుతావు. మనుష్యుని స్వభావం సహజంగానే దేవునికి శత్రువై యుంటుంది, మనుష్యులందరూ సాతానుని లోతైన అవినీతిలో చిక్కుకొనియున్నారు. మనుష్యుడు తన అవినీతితో దేవునితో సంబంధం కలిగియుండుటకు ప్రయత్నిస్తే, దాని వలన ఎటువంటి ప్రయోజనముండదు; అతని క్రియలు మరియు మాటలు తన అవినీతిని ప్రతి అడుగులో బహిరంగ పరచబడుతూనే ఉంటుంది, మరియు దేవునితో సంబంధం కలిగియున్నప్పుడు అతని తిరుగుబాటుతనము ప్రతి విషయంలో బహిర్గితంచేబడుతుంది. తెలియకుండానే, మనుష్యుడు క్రీస్తును మోసగించుటకు మరియు క్రీస్తును తిరస్కరించుటకు మరియు క్రీస్తును విరోధిస్తాడు; ఇది జరిగినప్పుడు, మనుష్యుడు ఇంకా అపాయకరమైన స్థితికి చేరుకుంటాడు మరియు ఇది ఇంకా కొనసాగినట్లయితే, అతడు శిక్షకు పాత్రుడవుతాడు.
దేవునితో సంబంధం కలిగియుండుట ఇంత ప్రమాదకరమైతే, దేవుణ్ణి దూరంగా ఉంచడమే జ్ఞానయుతమని కొందరు అనుకుంటారు. ఇటువంటి మనుష్యులు ఏమి సంపాదించుకోగలరు? వాళ్ళు దేవునికి నమ్మకస్తులుగా ఉండగలరా? నిజానికి, దేవునితో సంబంధం కలిగియుండడం కష్టకరమే కానీ, అది మనుష్యుని అవినీతినిబట్టే తప్ప దేవుడు మనుష్యునితో సంబంధం కలిగియుండడని దాని అర్థం కాదు. మిమ్మును మీరు తెలుసుకొనే సత్యము కొరకు మీరు ఎక్కువ కృషి చేయడం ఉత్తమం. దేవుని ఎదుట నీవెందుకు కృపను పొందుకోలేదు? మీ స్వభావం ఆయనకు ఎందుకు అసహ్యంగా ఉంది? ఎందుకు మీ మాటలు ఆయనకు హేయకరంగా ఉన్నాయి? మీరు కొంత విధేయత చూపించిన వెంటనే, మిమ్మును గూర్చి మీరే పొగడుకుంటారు మరియు మీ చిన్న పనికి ప్రతిఫలమును అడుగుతారు; మీరు చూపించిన ఆ చిన్న విధేయతను బట్టి ఇతరులను తక్కువగా చూస్తారు మరియు ఏదో ఒక చిన్న పని చేసిన తర్వాత దేవుణ్ణి ధిక్కరిస్తారు. దేవుని స్వీకరించుటకు, మీరు ధనమును, బహుమతులను మరియు ప్రశంసలను కోరుకుంటారు. ఒకటి రెండు కాసులు ఇచ్చుటకు మీకు హృదయం భారమౌతుంది; అదే మీరు పది కాసులు ఇచ్చినట్లయితే, మీరు ఆశీర్వాదముల కొరకు ఆశిస్తారు మరియు విభిన్నమైన రీతిలో వ్యవహరించాలని కోరుకుంటారు. మీవంటి మానవత్వం వినుటకు గాని చెప్పుటకు గాని అభ్యంతరకరంగా ఉంటుంది. మీ మాటల్లో గానీ మీ క్రియల్లో గానీ ఏదైనా ప్రశంసనియంగా ఉన్నదా? వారి వారి కర్తవ్యం పాటించువారు మరియు వాటిని ఉల్లంఘించువారు; ప్రజలను నడిపించువారు మరియు నాయకులను వెంబడించువారు; దేవుణ్ణి స్వీకరించువారు మరియు దేవుణ్ణి స్వీకరించనివారు; విరాళం ఇచ్చువారు మరియు విరాళం ఇవ్వనివారు; బోధించువారు మరియు వాక్యం వినువారు ఇలా ఎంతోమంది ఇటువంటి వాటిలో తమను తాము పొగుడుకుంటారు. మీకు ఇది హాస్యాస్పదంగా అనిపించుటలేదా? మీరు దేవునియందు నమ్మిక యుంచియున్నారని పూర్తిగా తెలిసినప్పటికీ మీరు దేవునితో సంబంధంకలిగియుండలేరు. మీరు యోగ్యతలేనివారని పూర్తిగా తెలిసియుండి కూడా మీరు వాటి విషయాలలో పొగడుకొనుచున్నారు. ఆశా నిగ్రహాన్ని కోల్పోయిన స్థితిలో మీరున్నారని మీకు అనిపించడం లేదా? ఇటువంటి భావనతో మీరు దేవునితో ఎలా సంబంధం కలిగియుండగలరు? ఈ స్థితిలో మిమ్మును గూర్చి మీకు భయం కలగడం లేదా? మీ స్వభావం ఇప్పటికే దేవునితో సంబంధం కలిగియుండు స్థితిని కోల్పోయింది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, మీ విశ్వాసం నవ్వులపాలు కాదా? మీ విశ్వాసం అర్థరహితంగా లేదా? నీ భవిష్యత్తును నీవు ఎలా ఎదుర్కొంటావు? నీవు ఏ మార్గములో వెళ్ళాలో ఎలా ఎంపిక చేసుకుంటావు?