నీవుఎవరికి విశ్వాసపాత్రుడవు?

ప్రస్తుతం, ప్రతిరోజూ మనుష్యుల జీవితము ఎంతో కీలకమైనది, మరియు అది మనుష్యుల గమ్యానికి మరియు మనుష్యులవిధికి అత్యంత ముఖ్యమైనది, కాబట్టి, ఈ దినమున మనుష్యులు కలిగి ఉన్న అన్నింటినీ మనుష్యులు ప్రేమ పూర్వకముగా ఆదరించవలెను, మరియు గడిచే ప్రతీ క్షణమును భద్రపర్చుకొనవలెను. నీవు ఈ జీవితమంతా వ్యర్ధముగా బ్రతుకకుండా ఉండుటకు, నీకు నీవు గొప్ప అనుభూతులను అందించుకొనుటకు వీలైనంత ఎక్కువ సమయాన్ని వెచ్చించునట్లు నిన్ను నీవు మలుచుకోవలెను. నేను ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను అని మీరుకలవరపడవచ్చు. నిజం చెప్పాలంటే, మీలో ఏ ఒక్కరి ప్రవర్తనతోనూ నేను ఏమాత్రము ఆనందముగా లేను, నేను మీ మీద పెట్టుకున్నఆశలకు అనుగుణంగా మీరు ఈ దినమున లేకపోవడమే అందుకు కారణం. కాబట్టి, నేను ఇలా చెప్పగలను: మీలో ప్రతి వారు ప్రమాదపు అంచున ఉన్నారు, మరియు ఒకప్పుడు సహాయము కొరకు మీరు పెట్టిన మొర మరియు సత్యాన్ని వెంబడించాలనే కోరిక, వెలుగును ఆపేక్షించాలనే పూర్వపు ఆకాంక్షలు వాటి అంతమును సమీపిస్తున్నాయి. ఇది మీ పరిహారం యొక్క కడవరి ప్రదర్శన మరియు నేను ఎన్నడూ ఊహించనిది. మీరు నన్ను అధికముగా నిరాశపరచిన కారణాన్ని బట్టి నేను వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకూడదనుకుంటున్నాను. బహుశా మీరు దీన్ని మౌనంగా ఒప్పుకోకపోవడానికి, వాస్తవికతను ఎదుర్కొనడానికి ఇష్టపడకపోయినప్పటికీ నేను మిమ్మల్ని తప్పక కఠినంగా ప్రశ్నించాలి: ఇంత కాలం మీ హృదయములు దేనితో నింపబడి ఉన్నాయి? మీరు ఎవరికి విధేయులుగా ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచో ఊడిపడ్డాయని చెప్పకండి మరియు ఇలాంటి వాటిని నేను ఎందుకు అడిగాను అని నన్ను అడగవద్దు. జ్ఞాపకముంచుకొనుడి: నేను నిన్నుబాగుగా ఎరుగుదును, నీ యెడల బహుగా చింతించుదును మరియు నీయొక్క నడతలలో, క్రియలలో నా హృదయాన్ని కుమ్మరించుదును, ఈ కారణాన్ని బట్టి నీ యెడల ఎటువంటి విరామం లేకుండా మరియు కష్టాన్ని భరిస్తూ నీ అకృత్యాలకు లెక్క చెప్పాలని కోరుతున్నాను. అయినప్పటికీ ప్రతిగా నీవు సహింపలేని విచారము మరియు ఉదాసీనతను తప్ప నాపట్ల మరేమియు చూపించలేదు. నీవు నన్ను పట్టించుకోకుండా ఉన్నావు; నాకు దాని గురించి ఏమీ తెలియకుండా ఉండడం సాధ్యమేనా? ఇది నీవు నమ్మినట్లయితే నీవు నన్ను నిజముగా ప్రేమపూర్వకంగా చూడవనే వాస్తవాన్ని ఇది మరింత రుజువు చేస్తుంది. కాబట్టి మీరు మీ శిరస్సులను ఇసుకలో సమాధి చేసుకుంటున్నారని నేను చెప్తున్నాను. మీరు అందరూ మీరు ఏమి చేస్తున్నారో కూడా మీకే తెలియనంత తెలివైనవారు—కాబట్టి మీరు నాకు వివరణ ఇవ్వడానికి ఏమి ఉపయోగిస్తారు?

నాకు చాలా ఆందోళన కలిగించే ప్రశ్న ఏమిటంటే, మీ హృదయములు ఖచ్చితంగా ఎవరి యెడల విశ్వాసంగా ఉన్నాయి. మీలో ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నిస్తారని కూడా నేను అనుకుంటున్నాను మరియు మీరు ఎవరికి విశ్వాసంగా ఉండి, ఎవరి కోసం జీవిస్తున్నారో మిమ్మును మీరే ప్రశ్నించుకొనుడి. బహుశా మీరు ఈ ప్రశ్నలను ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి ఉండకపోవచ్చు, కాబట్టి నేను మీకు ప్రత్యుత్తరములు ఎలా బయలుపరుస్తాను?

స్మరణము ఉన్న ఎవరైనా ఈ కార్యమును అంగీకరిస్తారు: మానవుడు తన కోసం జీవిస్తాడు మరియు తనకు తానుగా విశ్వాసపాత్రుడుగా ఉంటాడు. మీ జవాబులు పూర్తిగా సరైనవని నేను నమ్మనుఎందుకనగా మీలో ప్రతి ఒక్కరు తమతమ జీవితాలను జీవిస్తూ, ప్రతి ఒక్కరు మీ సొంత బాధలతో పోరాడుచున్నారు. అందుకని, మీరు ప్రేమించే మనుష్యులకు మరియు మీకు నచ్చిన విషయాలకు విశ్వాసపాత్రులుగా ఉన్నారు; మీరు మీ యెడల పూర్తిగా విశ్వసనీయమైన వారు కారు. మీలో ప్రతి ఒక్కరు మీ చుట్టూ ఉన్న మనుష్యులు, సంఘటనలు మరియు వస్తువులచే ప్రభావితమవుతారు కాబట్టి, మీరు మీ యెడల నిజముగా విశ్వాసపాత్రులు కారు. మీ యెడల మీరు విశ్వాసపాత్రులుగా ఉన్నారని చూపుటకు కాకుండా, ఏదైనా ఒక విషయం పట్ల మీకు ఉన్న మీ విశ్వాసమును బట్టబయలు చేయడానికి నేను ఈ మాటలు పలుకుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా మీలో ఎవరి నుండీ నేను ఎప్పుడూ విశ్వసనీయతను పొందలేదు. మీరు ఇన్ని సంవత్సరములు నన్ను వెంబడించినప్పటికీ నా పట్ల లేశమైనను కూడా విశ్వాసమును కనుపరచలేదు. దానికి బదులుగా, మీరు ప్రేమించే మనుష్యుల చుట్టూ మరియు మీకు నచ్చిన విషయాల చుట్టూ తిరిగారు—ఎంతగా అంటే అన్ని వేళల్లో మరియు మీరు ఎక్కడికి వెళ్లినా మీరు వారిని మీ హృదయాలకు సమీపంగా ఉంచుకుంటూ, వారిని ఎన్నడూ విడచిపెట్టలేదు. మీరు ప్రేమించే ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తి లేదా మక్కువ చూపుతారో, మీరు నన్ను వెంబడించుచున్నప్పుడు లేదా మీరు నా మాటలు ఆలకించునప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి, నేను మీ నుండి కోరుకున్న విశ్వసనీయతను నాపై చూపడానికి బదులుమీ “పెంపుడు జంతువుల” పట్ల విశ్వాసం చూపడానికి మరియు పోషణకు ఉపయోగించుచున్నారు. మీరు నా కోసం ఒకటో రెండో త్యాగాలు చేసినప్పటికీ, అది మీ సమస్తమును సూచించదు మరియు మీరు ఎవరికి నిజంగా విశ్వాసపాత్రులుగా ఉన్నారో అది నేనే అని తెలియజేయదు. మీకు మక్కువైన వాటిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునెదరు: కొంతమంది మనుష్యులు వారి కుమారులు లేదా కుమార్తెలకు, మరికొందరు భర్తలకు, భార్యలకు, ఐశ్వర్యమునకు, తాము చేసే పని యెడల, వారి అధికారులకు, వారు కలిగియున్నహోదా లేదా స్త్రీలకు విశ్వాసంగా ఉంటారు. మీరు విశ్వాసం చూపే విషయాల పట్ల మీరు ఎన్నడూ అలసిపోరు లేదా చిరాకు పడరు; దానికి బదులుగా, మీరు ఈ విషయాలను పెద్ద మొత్తంలోకలిగి ఉండాలని మరియు వాటిని శ్రేష్టమైనవిగా మార్చుకోవాలనిమరియు ఎన్నటికీ వాటిని వదులుకోవలదనే ఆసక్తిని పెంచుకుంటూ పోతారు. నేనుమరియు నా మాటలుఎల్లప్పుడు మీరు మక్కువ చూపే విషయాల తరువాతనే ఉంచబడతాయి. అంతేకాదు వాటికి చివరి స్థానము ఇవ్వడం తప్ప మీకు వేరొక మార్గం లేదు. కొంతమంది అయితే తాము ఇంకా కనిపెట్టని ఇటువంటి విషయాల కోసం ఈ చివరి స్థానాన్ని కూడా విడిచి పెడతారు. వారి హృదయాల్లో ఎన్నడూ నన్ను గూర్చిన జాడ కూడా ఉండదు. నేను మిమ్మల్ని ఎక్కువగా అడుగుతున్నాను లేదా తప్పుగా నిందిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు—కాని మీరు మీ కుటుంబముతో సంతోషముగా సమయము గడుపుతున్నప్పుడు ఎప్పుడైనా నా గురించి ఆలోచించారా? ఒక్కసారి అయినా మీరు నాకు విశ్వాసముగా ఉన్నారా? ఇలాంటి సమయాల్లో అది మీకు బాధ కలిగించలేదా? మీ హృదయాలు ఆనందంతో నింపబడినప్పుడు మరియు మీరు పడిన శ్రమకు ప్రతిఫలం పొందినప్పుడు, మీరు చాలినంత సత్యాన్ని సమకూర్చుకోనందుకు నిరుత్సాహపడలేదా? నా యొద్ద నుండి అనుమతి లభించనందున మీరు ఎప్పుడు ఏడ్చితిరి? మీరు మీ కుమారులు మరియు కుమార్తెల కొరకు ఎంతో వేదన, శ్రమపడతారు, అయినప్పటికీ మీరు సంతృప్తి చెందరు; ఇప్పటికీ మీరు వారి పక్షమున సరియైన శ్రద్ధ చూపలేదని, వారి కోసం మీరు చేయగలిగినదంతా చేయలేదని మీరు నమ్ముతుంటారు. అదే నా పక్షముగా అయితేమీరు ఎల్లప్పుడూ అశ్రద్ధగా మరియు అజాగ్రత్తగా ఉందురు; నేను మీ జ్ఞాపకాలలో మాత్రమే ఉన్నాను తప్ప మీ హృదయాలను గెల్చుకొనలేదు. నా శ్రద్ధ మరియు నా ప్రయాసను మీరు ఎన్నడూఅనుభవించలేదు మరియు మీరు వాటిని ఎన్నడూ ప్రశంసించలేదు. మీరు కేవలం కొంచముగా మాత్రమే ఆలోచించి ఇది సరిపోతుందని నమ్ముతారు. నేను ఏదైతే విశ్వసనీయత కొరకు చాలా కాలంగా ఆశించానో అది తృణీకరించిబడినది. ఐనప్పటికీ, నేను ఎంత చెప్పినప్పటికీ, మీరు మాత్రము ఒకటి లేదా రెండు విషయాలను మాత్రమే అంగీకరిస్తూ కొనసాగుతున్నారు. మీరు దీనిని సంపూర్ణముగా అంగీకరించలేరు ఎందుకంటే మీరు అందరూ చాలా “ధైర్యము” కలిగిన వారు, అంత మాత్రమే కాదు నేను పలికిన మాటలలో నుండి ఏమి ఎన్నుకోవలెనో అది మాత్రమే ఎల్లప్పుడు మీరు ఎంచుకుంటారు. మీరు ఈ దినము వరకు అలాగే ఉన్నట్లైతేమీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి నా దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయి, అంతేకాదు, నేను పలికిన నా మాటలన్నీ సత్యము తప్ప మరి ఏదీ కాదు అని మీరు గుర్తించేలా నేనుచేస్తాను. వాటిలో ఏవి కూడ సత్యాన్ని వక్రీకరించవు.

ఇప్పటికిప్పుడు నేను మీ ముందు కొంత ధనమును ఉంచి, ఎంపిక స్వేచ్ఛను మీకే ఇచ్చిన యెడల, మీరు ఎన్నుకునే విషయములో నేను మిమ్మల్ని ఖండించకపోయినట్లైతే ఖచ్చితముగా మీలో అనేకమంది సత్యమును విడచి ధనమును ఎంచుకుందురు. మీలో ఉన్న మంచివారు ధనమును వదులుకుని అయిష్టంగానే సత్యాన్ని ఎంచుకుంటారు అయితే ద్వంద్వ స్వభావము కలిగినవారు మాత్రము ఒక చేతిలో ధనమును, మరొక చేతిలో సత్యాన్ని పట్టుకుంటారు. ఆ విధంగా మీ నిజమైన రంగులు స్వయం-సాక్ష్యంగాకనిపించలేదా? సత్యం మరియు మీరు దేనికి విశ్వసనీయముగా ఉంటారో వాటి మధ్య ఎంచుకొనునప్పుడు, మీరు దేనినైతే ఎంపిక చేస్తారో ఆ ప్రకారముగానే మీ యొక్క వైఖరి కూడ ఉంటుంది. కాదంటారా? మీలో అనేకమంది తప్పు మరియు ఒప్పుల మధ్య ఊగిసలాడేవారు లేరా? అనుకూల మరియు ప్రతికూల సందర్భాలు, నలుపు మరియు తెలుపు, మీ యొక్క కుటుంబం మరియు దేవుడు, పిల్లలు మరియు దేవుడు, సమాధానము మరియు భంగం, ఐశ్వర్యము మరియు పేదరికం, హోదా మరియు సామాన్యస్థితి, అనేకులు మన పక్షమునఉండుట లేదా త్రోసివేయుట మొదలైన ఇంకా అనేకమైన వాటి మధ్య మీరు చేసిన ఎంపికల గురించి మీరు బాగుగా ఎరుగుదురు. అంతేకాకుండా సమాధానము కలిగిన కుటుంబం మరియు విచ్ఛిన్నమైన కుటుంబానికి మధ్య మీరు మొదటిదానిని ఎంచుకుంటారు, అదియును ఎలాంటి సంకోచము లేకుండా; ఐశ్వర్యము మరియు ధర్మము మధ్య గమనిస్తే ఇక్కడ కూడా మీరు మళ్లీ మొదటిదాన్నే ఎంచుకుంటారు, అంతేకాదు దరికి తిరిగి రావాలనే సంకల్పం కూడా మీలో లేకుండా పోతుంది;[ఎ] విలాసము మరియు దరిద్రత మధ్య కూడా మొదటిదానిని మీరు ఎంచుకుంటారు; మీ కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలుమరియు నా విషయములో ఎంచుకునేసందర్భంలో మీరు మొదటివాటినే ఎంచుకుంటారు; అభిప్రాయము మరియు సత్యం అను సంగతుల మధ్య మీరు మరోసారి మునుపటిదానినే ఎంచుకుంటారు. మీ చెడు క్రియలన్నిటిని గమనించినప్పుడు మీపై ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోయాను. మీ హృదయాలు మెత్తగా మారటానికి ఉన్న అవరోధాన్ని చూసి నాకు దిగ్భ్రాంతికలుగుతుంది. అనేక సంవత్సరాలనా సమర్పణ మరియు ప్రయత్నము నాకు మీ పరిత్యాగము మరియు నిస్పృహను తప్ప మరేమీ తీసుకురాలేదు, కానీ మీ కోసం నేను కలిగియున్న నిరీక్షణ రోజురోజుకు పెరుగుతూనే ఉండును, ఎందుకనగా నా రోజు అందరి యెదుటతేటతెల్లముగా ఉన్నది. అయినప్పటికీ మీరు చీకటి మరియు చెడు విషయాలను వెతకడంలో పట్టుదలతో ఉన్నారు మరియు వాటిపై మీ పట్టును వదులుకోవడానికి నిరాకరిస్తారు. అయితే, మీ ఫలితం ఎలా ఉంటుంది? మీరు దీనిని ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? మరలా మిమ్ములను ఎంచుకోమని అడిగితే, మీ వైఖరి ఎలా ఉండును? అది ఇంకనూ మునుపటివలె ఉంటుందా? మీరు ఇంకనూ నాకు నిరాశ మరియు దౌర్భాగ్యమైన దుఃఖాన్నితీసుకువస్తారా? మీ హృదయాలు ఇప్పటికీ రవ్వంత అయినావెచ్చదనమునుకలిగి ఉంటాయా? నా హృదయాన్ని ఆదరించుటకు ఏమి చేయాలో మీరు ఇంకా ఎరుగని స్థితిలో ఉన్నారా? ఈ క్షణములో, మీరు దేనిని ఎంచుకుంటారు? నా మాటలకు మిమ్మును మీరు అప్పగించుకుంటారా లేదా విసర్జిస్తారా? నా దినము మీ కళ్ళ ముందే ఉంచబడింది, మీ యెదుట ఉన్నది ఏమనగా ఒక నూతన జీవితం మరియు ఒక నూతన ఆరంభస్థానము. అయితే నేను చెప్పక తప్పదు, ఏమనగాఈ ఆరంభస్థానము అనేది గతంలోని కొత్త పనికి ప్రారంభం కాదుగానీపాత వాటన్నిటికీ ముగింపు. అనగా ఇదే చిట్టచివరి కార్యము. ఈ ఆరంభస్థానము గురించి అసాధారణమైనది ఏమిటో మీరందరూ గ్రహించగలరని నేను తలచుచున్నాను. అయితేఒక దినాన ఖచ్చితంగా మీరు ఈ ఆరంభ స్థానము యొక్క నిజస్థితిని గ్రహిస్తారు, కావునమనమందరమూ కలిసి త్వరితముగా దానిని దాటి ముందుకువెళ్లి రాబోయే ముగింపును స్వాగతిద్దాం! అయినప్పటికీ, మీ విషయములో నేను కలవరం చెందుతున్న కారణం, అన్యాయం మరియు న్యాయాన్ని మీరు ఎదుర్కొన్నప్పుడుమీరు ఎల్లప్పుడూ ముందటిదానినే ఎన్నుకుంటారు. అయితే అదంతా మీ యొక్క గత జీవితం. మీ గతాన్ని మర్చిపోవటం నాకు కష్టమైనప్పటికీ నేను కూడా సమస్తాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఏది ఏమైనప్పటికీ దానిని చేయుటకు మంచి ఆలోచనను కలిగి ఉన్నాను: గడిచిన కాలమును భవిష్యత్ కాలముతోభర్తీకానీయండి మరియు ఈ దినాన మీలో కలిగిన నిజమైన ఆంతర్యము గత దినాల ఛాయలను చెరిపివేయనీయండి. ఈలాగునమీరుమరోసారి ఎంపిక చేసుకోవడానికి నేను మిమ్ములను తప్పక ఇబ్బంది పెట్టాలి: మీరు ఖచ్చితంగా ఎవరికి విశ్వసనీయులుగా ఉన్నారు అని?

ఫుట్‌నోట్:

ఎ. సముద్రపు ఒడ్డుకు తిరిగి రండి: ఇది చైనీయుల సామెత, “ఒకని దుష్ట మార్గము నుండి వెనుదిరుగుట” అని ఈ సామెతకు అర్ధం.

మునుపటి:  నీ గమ్యము కొరకు తగిన సత్క్రియలు సిద్దపరచుకో

తరువాత:  గమ్యం గురించి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger