65 వ అధ్యాయము
నా వాక్కులు ఎల్లప్పుడూ మీ బలహీనతలపై ప్రభావాన్ని చూపుతాయి, అంటే, అవి హానికరమైన మీ బలహీనతలను ఉటంకిస్తాయి; లేకపోతే, ఇప్పుడు ఇది ఎలాంటి సమయం అనే గ్రహింపు కూడా లేకుండా, ఇప్పటికీ మీరు ఎంతో స్తబ్దంగానే ఉంటారు. దీనిని తెలుసుకో! మిమ్మల్ని కాపాడటానికి నేను ప్రేమ మార్గాన్ని ఉపయోగిస్తాను. మీరు ఎలా ప్రవర్తించినా సరే, నేను ఆమోదించిన విషయాలను, ఏదేమైనప్పటికీ ఎటువంటి పొరపాట్లు చేయకుండా, నేను ఖచ్చితంగా సంపూర్తి చేస్తాను. నీతిగల సర్వశక్తిమంతుడైన దేవుడనగు నేను, పొరపాటు చేయగలనా? ఇది మానవ తలంపు కాదా? నేను చేసే మరియు చెప్పే ప్రతిదీ మీ కోసం కాదా చెప్పండి? కొందరు వ్యక్తులు వినయంగా, “ఓ దేవా! నీవు ప్రతిదీ మాకోసమే చేస్తావు, కానీ నీకు అనుగుణంగా వ్యవహరించడాన్ని గురించి మాకు తెలియదు” అని చెప్తారు. ఎంతటి బుద్ధిహీనత! నాకు ఏ విధంగా సహకరించాలో నీకు తెలియదని చెప్పేవరకు సైతం నీవు వెళ్తావు! ఇవన్నీ అవమానకరమైన అబద్దాలు! అసలు వాస్తవానికి, అలాంటి సంగతులు మీకు వినిపించబడినప్పుడు, ఎందుకు, మీరు శరీరము పట్ల అదే తడవుగా శ్రద్దను కనుపరుస్తున్నారు? వినడానికి మీ మాటలు బాగున్నాయి, కానీ మీరు ఒక సులువైన మరియు అనుకూలమైన విధానంలో వ్యవహరించరు. ఈనాడు నేను మిమ్మల్ని ఎక్కువేమీ అడగడం లేదు, మరియు నా అవసరతలు మీ గ్రహణ శక్తికి అతీతమైనవేమీ కావు; అయితే, అవి మనుషులు సాధించగలవి: మీరు దీనిని తప్పక గ్రహించాలి. నేను మిమ్మల్ని కొంచెం కూడా తక్కువ అంచనా వేయడం లేదు. మానవుని యోగ్యతల విస్తృతిని నేను ఎరుగనా? దానిపట్ల నేను పూర్తిస్థాయిలో ఖచ్చితమైన అవగాహన కలిగియున్నాను.
నిత్యము నా వాక్కులు మీకు వెలిగింపును కలిగిస్తాయి, అయినప్పటికీ మీ హృదయాలు ఎంతో కఠినత్వాన్ని కలిగియుండుట చేత, మీరు మీ ఆత్మలలో ఉన్న నా చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు! భోజనమో, వస్త్రాలో లేక మీ సౌందర్యము మీదనో దృష్టి పెట్టకుండా, అందుకు బదులుగా మీ అంతరంగిక బ్రతుకుల మీద దృష్టి సారించాలని ఎన్నిసార్లు మీకు నేను జ్ఞాపకం చేశానో చెప్పండి? మీరు అసలు వినరు. చెప్పి చెప్పి నేను విసిగిపోయాను. మీరు మరీ ఇంతలా మొద్దుబారిపోయారా? మీరు పూర్తిగా బుద్దిహీనులైపోయారా? నా వాక్కులు ఏమైనా నిరర్ధకంగా ఉచ్చరించబడ్డాయా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? నా పుత్రులారా! మనఃపూర్వకమైన నా ఉద్దేశాల పట్ల శ్రద్ధ చూపండి! ఒక్కసారి మీ జీవితాలు పరిపక్వత చెందాయంటే, ఇక చింతించాల్సిన అవసరమే లేకుండా, సమస్తము సమకూర్చబడుతుంది. ఇప్పటికిప్పుడు ఆ సంగతుల మీద దృష్టి పెట్టడం వలన ఎలాంటి విలువ ఉండదు. నా రాజ్యము పరిపూర్ణంగా సంపాదించబడి, అది బహిరంగంగానే లోకానికి దిగొచ్చింది; ఇది అన్నిటికంటే ఎక్కువగా నా న్యాయ తీర్పు సంపూర్ణంగా వచ్చేసినట్టు సూచిస్తుంది. దీనిని మీరు అనుభూతి చెందారా? మీకు తీర్పు తీర్చడానికి నేను అసహ్యపడుతున్నాను, కానీ మీరు నా హృదయము పట్ల ఎలాంటి శ్రద్దను కనుపరచడంలేదు. నిర్దాక్షిణ్యమైన న్యాయతీర్పు కంటే, మీరు నిత్యము ప్రేమతో కూడిన నా సంరక్షణ మరియు కాపుదలను స్వీకరించాలనేది నా అభిలాషయై ఉన్నది. మీరు తీర్పు తీర్చబడటానికి ఇష్టపడుతున్నారా? అలా కాకపోతే, మరి ఎందుకు మీరు నాతో తరచూ సమీపముగా ఉండరు, సహవాసం చెయ్యరు, మరియు నాతో అనుభంధం కలిగి ఉండరు? నా పట్ల నీవు ఎంతో మందకొడిగా వ్యవహరిస్తూ, ఇంకా సాతాను నీకు ఉపాయాలు ఇచ్చినప్పుడల్లా, అవి నీ సొంత చిత్తానికి అనుగుణంగా ఉంటాయని భావించి, నీవు పరవశిస్తావు—అయినా సరే నీవు చేసేదేదీ నా కోసమై ఉండదు. మీరు ఎల్లప్పుడూ నాతో ఇలానే క్రూరంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా?
నేను నీకు ఇవ్వాలనుకోవడం లేదనేది కాదు, కానీ మీరే మూల్యం చెల్లించడానికి ఇష్టపడట్లేదు. అదేవిధంగా, మీరు అసలేమి లేకుండా, రిక్త హస్తాలతో ఉన్నారు. పరిశుద్దాత్మ కార్యము ఎంత చురుకుగా పురోగతి చెందుతుందో మీకు కనబడటం లేదా? నా హృదయము కలవరముతో దహించుకుపోవడం మీకు కనబడట్లేదా? నాతో ఏకీభవించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను, కానీ మీరు అయిష్టంగానే ఉన్నారు. సమస్త విధములైన విపత్తులు ఒకటి వెంట ఒకటిగా సంభవిస్తాయి; సమస్త దేశాలు మరియు ప్రదేశాలు ఎక్కడ చూసినా ప్లేగు, క్షామము, వరద, అనావృష్టి, మరియు భూకంపాలను ఉపద్రవాలను చవిచూస్తాయి. ఈ వినాశనాలు ఒకటి రెండు ప్రదేశాల్లో మాత్రమే జరుగుతున్నవి కావు, లేక అవి ఒకటి రెండు రోజుల్లో అయిపోయేవీ కావు; పైగా, అవి మహా మాహా విస్తీర్ణానికి ప్రబలి, అంతకంతకు ఉగ్రరూపం దాల్చుతాయి. ఈ కాలంలోనే, పలురకాలైన కీటకాల ద్వారా కలిగే తెగుళ్ళు ఒకొక్కటిగా పుట్టి, నరమాంస భక్షక విపరీతము అంతటా కలుగుతుంది. ఇదే దేశాలన్నిటిపైన మరియు ప్రజలందరిపైన నేను ఇచ్చే తీర్పు. నా పుత్రులారా! ఈ విపత్తుల వేదన లేక కష్టాల చేత మీరు బాధపడకూడదు. త్వరగా మీరు యవ్వనప్రాయానికి వచ్చి, సాధ్యమైనంత త్వరగా, నా భుజములపై ఉన్న భారాన్ని ఎత్తుకోవాలనేదే నా అభిలాషయై ఉన్నది. నా చిత్తము మీకెందుకు అర్ధం కావడంలేదు? ముందున్న కార్యము మరి ఎక్కువ కష్టంతో కూడుకున్నది. నిండైన నా హస్తాలతో పాటు నన్నే విడనాడేంత కఠిన హృదయులా మీరు? దీనిని నేను ఇంకా తేటగా చెప్తాను: పరిపక్వత చెందిన జీవితాలను కలిగియున్న వారు ఆశ్రయాన్ని పొంది, వేదన లేక కష్టము చేత బాధించబడరు; పరిపక్వత చెందని జీవితాలను కలిగిన వారు బాధ మరియు వేదనను తప్పక అనుభవించాలి. నా వాక్కులు తగినంత స్పష్టంగా ఉన్నాయా, లేవా?
అందరూ నా పరిశుద్ద నామమును తెలుసుకుని నన్ను ఎరుగునట్లు, నా నామాన్ని దిశలన్నిటిలో మరియు అన్ని చోట్లకు వ్యాప్తిచేయాలి. అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్, సోవియట్ యూనియన్, మకావు, హాంగ్ కాంగ్, మరియు ఆయా దేశాలలోని అన్నీ వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కలసికట్టుగా తక్షణమే చైనాలో కూడుకుని, సత్యమార్గము కొరకు అన్వేషిస్తారు. ఇదివరికే నా నామము వారికి సాక్ష్యమియ్యబడింది; మీరు వారిని సంరక్షించి నడిపించునట్లుగా, సాధ్యమైనంత త్వరగా మీరు పరిపక్వత చెందడం మాత్రమే మిగిలియున్నది. అందుకనే జరిగించాల్సిన కార్యము ఇంకా చాలానే ఉంది అని నేను చెప్తుంటాను. ఈ వినాశన పరిణామంలో నా నామము అధికముగా వ్యాప్తి చేయబడుతుంది, ఒకవేళ మీరు జాగ్రత్తగా లేకపోతే, మీరు మీ హక్కుపూర్వకమైన భాగాన్ని నష్టపోతారు. మీరు భయపడటంలేదా? నా నామము మతాలన్నిటికీ, వర్గాలన్నిటికీ, దేశాలన్నిటికీ, మరియు మత సంబంధ శాఖలన్నిటికీ విస్తరింపజేయబడింది. నా కార్యము ఒక క్రమమైన విధానంలో, అంతరంగిక అనుసంధానంతో జరిగించబడటం అంటే ఇదే. మీరు ప్రతి అడుగు ఒక పురోగమనంతో, నా అడుగుజాడలను శ్రద్దగా వెంబడించగలగాలని మాత్రమే నేను ఆశిస్తున్నాను.