ఆశీర్వాదాల పట్ల మీ అవగాహన ఎంత?

ఈ యుగములో జన్మించిన ప్రజలు సాతాను మరియు చెడ్డ అపవిత్రాత్మలచే చెరచబడినప్పటికీ, అటువంటి చెరుపు వారికి గొప్ప రక్షణను, పశువుల పర్వతాలు మరియు మైదానాల కంటే గొప్పదైన, ఇంకా యోబు విస్తారమైన సంపద కంటే, మరియు యోబు తన శోధనల తర్వాత యెహోవాను చూసి ఆశీర్వాదం పొందిన దాని కంటే కూడా ఎక్కువైన రక్షణను తీసుకువచ్చింది. యోబు మరణకరమైన శోధనలు ఎదుర్కొన్న తర్వాత మాత్రమే అతను యెహోవా మాట్లాడుటను, సుడిగాలిలో యెహోవా స్వరాన్ని విన్నాడు. అయినప్పటికీ, అతను యెహోవా ముఖాన్ని చూడలేదు మరియు ఆయన స్వభావం అతనికి తెలియదు. యోబు సంపాదించినది కేవలం భౌతిక సంపద, భౌతిక ఆనందాలు మరియు చుట్టుపక్కల పట్టణాలన్నిటిలోకెల్లా అత్యంత అందమైన పిల్లలను ఇచ్చిన సంపద, అలాగే దేవదూతల కాపుదల మాత్రమే. నీతిమంతుడు అని పిలువబడినప్పటికీ, అతను యెహోవాను ఎన్నడూ చూడలేదు ఇంకా యెహోవా స్వభావం అతనికి తెలియదు. ఈ దినాల్లో ప్రజల భౌతిక ఆనందాలు తాత్కాలికంగా స్వల్పమైనవని చెప్పబడినప్పటికీ, లేదా బయటి ప్రపంచపు పర్యావరణం ప్రతికూలమైనదైనప్పటికీ, అనాది కాలం నుండి నేను మనిషికి ఎన్నడూ వెల్లడించని మరియు ఎల్ల వేళలా మర్మముగా ఉన్న నా స్వభావాన్ని, అలాగే గత యుగాల రహస్యాలను, నా గొప్ప రక్షణను ఇచ్చిన అతి నిమ్నమైన ప్రజలకు నేను చూపిస్తాను. అంతేకాదు, నేను ఈ విషయాలు వెల్లడించడం ఇదే మొదటిసారి; మునుపెన్నడూ నేను ఇలాంటి కార్యము చేయలేదు. మీరు యోబు కంటే చాలా తక్కువ అయినప్పటికీ, మీరు సంపాదించిన వాటిలో మరియు మీరు చూసినవాటిలో అతనిని మించిపోయారు. మీరు అన్ని రకములైన బాధలను అనుభవించినప్పటికీ, మరియు ప్రతి విధమైన హింసను అనుభవించినప్పటికీ, ఆ బాధ యోబు శోధన వంటిది కానే కాదు; బదులుగా, అది ప్రజలు వారి తిరుగుబాటు కారణంగా, వారి ప్రతిఘటన కారణంగా మరియు నా నీతి యుక్తమైన స్వభావం కారణంగా పొందిన తీర్పు మరియు మందలింపుయై ఉన్నది; ఇది నీతివంతమైన తీర్పు, మందలింపు మరియు శాపం. మరోవైపు, యోబు ఇశ్రాయేలీయులలో నీతిమంతునిగా, యెహోవా గొప్ప ప్రేమను మరియు వాత్సల్యాన్ని పొందుకున్న వానిగా ఉన్నాడు. అతను ఎలాంటి చెడు పనులు చేయలేదు, అతను యెహోవాను ఎదిరించలేదు; బదులుగా, అతను యెహోవాకు నమ్మకంగా అంకితభావంతో ఉన్నాడు. అతని నీతి కారణంగా, అతను శోధనలకు గురయ్యాడు మరియు అతను యెహోవాకు నమ్మకమైన సేవకుడు కాబట్టి, అతను అగ్ని పరీక్షలకు గురయ్యాడు. నేటి ప్రజలు వారి మురికి మరియు అవినీతి కారణంగా నా తీర్పు మరియు శాపానికి లోనయ్యారు. వారి బాధలనేవి యోబు తన పశువులను, తన ఆస్తిని, అతని సేవకులను, తన పిల్లలను మరియు అతనికి ప్రియమైన వారందరినీ పోగొట్టుకున్నప్పుడు అతను అనుభవించిన బాధలతో ఏ మాత్రం సరితూగనివైనప్పటికీ, వారు అనుభవించేది అగ్ని శుద్ధి మరియు దహనంగా ఉంటుంది. మరియు యోబు అనుభవించిన దానికంటే, వాటిని తీవ్రమైనదిగా చేసేది ఏమిటంటే, ప్రజలు బలహీనంగా ఉన్నంత మాత్రాన అలాంటి పరీక్షలు తగ్గించబడవు లేదా తీసివేయబడవు; బదులుగా, అవి దీర్ఘకాలం ఉంటాయి మరియు ప్రజల జీవితపు అంతిమ దినం వరకు కొనసాగుతాయి. ఇది శిక్ష, తీర్పు మరియు శాపం; అది కనికరం లేని దహనం, ఇంకా ఎక్కువగా, ఇది మానవజాతి సరైన “వారసత్వం”. ఇది ప్రజలకు అర్హమైనది, మరియు ఇక్కడే నా నీతి వంతమైన స్వభావం వ్యక్తీకరించబడింది. ఇది తెలిసిన విషయమే. అయినప్పటికీ, ప్రజలు పొందినది నేడు వారు అనుభవిస్తున్న బాధలను మించిపోయింది. మీరు భరిస్తున్న బాధలు మీ మూర్ఖత్వం వల్ల వచ్చిన ఎదురుదెబ్బ మాత్రమే, అది మీరు పొందినది మీ బాధ కంటే వంద రెట్లు ఎక్కువ. పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల చట్టాల ప్రకారం, నన్ను ప్రతిఘటించే వారందరూ, నన్ను బహిరంగంగా తీర్పు తీర్చే వారందరూ మరియు నా మార్గాన్ని అనుసరించకుండా, ధైర్యంగా నాకు అపవిత్రమైన బలులు అర్పించే వారందరూ ఖచ్చితంగా మందిరపు అగ్నిలో నాశనం చేయబడతారు లేదా ఎన్నుకోబడిన కొందరితో రాళ్లతో కొట్టి చంపబడతారు, ఇంకా వారి వారి వంశాల వారసులు మరియు ఇతర ప్రత్యక్ష సంభంధీకులు కూడా నా శాపానికి గురవుతారు. రాబోయే జీవితాలలో, వారు స్వేచ్ఛగా ఉండరు కానీ, నా దాసులకు బానిసలుగా ఉంటారు, మరియు నేను వారిని అన్యజనుల మధ్య ప్రవాసంలోకి పంపుతాను, మరియు వారు తమ స్వదేశానికి తిరిగి రాలేరు. వారి చర్యలు మరియు ప్రవర్తన ఆధారంగా నేటి ప్రజలు అనుభవిస్తున్న బాధలు ఇశ్రాయేలీయులు అనుభవించిన శిక్ష అంత తీవ్రంగా లేవు. మీరు ప్రస్తుతం బాధపడుతున్నది ప్రతీకారం అని చెప్పడానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే మీరు నిజంగా రేఖను దాటారు. మీరు ఇశ్రాయేలులో ఉన్నట్లయితే, మీరు శాశ్వతమైన పాపులుగా మారేవారు, మరియు మీరు చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయులచే ముక్కలుగా నరకబడి, యెహోవా మందిరంలో ఆకాశం నుండి అగ్నితో కాల్చివేయబడేవారు. మీరు ఇప్పుడు ఏమి పొందారు? మీరు ఏమి అందుకున్నారు, మరియు మీరు ఏమి ఆనందించారు? నేను మీలో నా నీతివంతమైన స్వభావాన్ని వెల్లడించాను కానీ, మానవాళిని విమోచించడానికి నేను నా సహనాన్ని వెల్లడించడం అతి ముఖ్యమైనది. నేను మీలో చేసిన కార్యము ఓపికతో కూడిన కార్యము అని ఒకరు చెప్పగలరు; ఇది నా నిర్వహణ కొరకు, ఇంకా ఎక్కువగా మానవాళి ఆనందం కొరకు చేయబడింది.

యెహోవా పరీక్షలను యోబు ఎదుర్కొన్నప్పటికీ, అతను మాత్రం యెహోవాను ఆరాధించే నీతిమంతునిగా ఉన్నాడు. శోధనలకు గురి కాబడినప్పటికీ, అతను యెహోవా పట్ల ఫిర్యాదు చేయలేదు కానీ, ఆయనతో తన ముఖాముఖి అనుభవం విలువైనదిగా భావించాడు. ఈ రోజులలో ప్రజలు యెహోవా సన్నిధిని గౌరవించకపోవడమే కాక, ఆయన స్వరూపాన్ని తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, ఫిర్యాదు చేస్తారు మరియు అపహాస్యం చేస్తారు. అలాంటప్పుడు, మీరు కొంచెం ఎక్కువగానే పొందాలి కదా? మీ బాధ నిజంగా అంత గొప్పదా? మీరు మేరీ మరియు జేమ్స్ కంటే ఎక్కువ అదృష్టవంతులు కాలేదా? మీ ప్రతిఘటన నిజంగా చాలా చిన్నవిషయమా? నేను మీ నుండి కోరినది ఇంకా నేను మీ నుండి అడిగినది చాలా గొప్పది, చాలా ఎక్కువ కావచ్ఛా? నన్ను ఎదిరించిన ఇశ్రాయేలీయులపై మాత్రమే నా కోపం విరజిమ్మబడింది. మీపై నేరుగా కాదు; మీరు పొందినది కేవలం నా కనికరంలేని తీర్పు మరియు వెల్లడి, అలాగే కనికరంలేని మండుతున్న శుద్ధీకరణ మాత్రమే. అయినప్పటికీ, ప్రజలు నన్ను ప్రతిఘటించడం మరియు తిరస్కరించడం కొనసాగిస్తున్నారు మరియు వారు కొంచెం కూడా లోబడకుండా చేస్తారు. నాకు దూరంగా మరియు నన్ను తిరస్కరించే వారుగా కూడా కొందరు ఉన్నారు; అలాంటి వ్యక్తులు మోషేను ఎదిరించిన కోరహు మరియు దాతానుల గుంపు కంటే గొప్పవారు కాదు. ప్రజల హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి అలానే వారి స్వభావాలు చాలా మొండిగా ఉంటాయి. వారు తమ పాత పద్దతులను మార్చుకోరు. వారు పట్టపగలు వేశ్యల వలె నగ్నంగా ఉంచబడతారని నేను చెప్తాను, నా మాటలు వారికి కఠినంగా ఉంటాయి ఎంతగా అంటే అవి “చెవులకు అభ్యంతరకరమైనవి” కూడా కావచ్చు, ప్రజల స్వభావాలను పగటి వెలుగులో బహిర్గతం చేస్తాయి—అయినా వారు కేవలం తమ తలలు ఊపుతూ, కొంత కన్నీరు కారుస్తూ, కొంత విచారంగా ఉండటానికి వారిని వారు బలవంత పరుచుకుంటారు. ఇది గడిచిన తర్వాత, వారు పర్వతాల మధ్య క్రూర మృగాల రాజు వలె క్రూరంగా ఉన్నారు, మరియు వారికి కనీస అవగాహన లేదు. యోబు కంటే వంద రెట్లు ఎక్కువ అదృష్టవంతులమని ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు ఎలా తెలుసుకోగలరు? వారు ఆనందించే ఆశీర్వాదాలు యుగయుగాలుగా చూడనివి మరియు ఇంతకు ముందు ఎవరూ అనుభవించని ఆశీర్వాదాలని వారు ఎలా గ్రహించగలరు? అటువంటి ఆశీర్వాదాలు, శిక్షను కలిగి ఉన్న ఆశీర్వాదాలను ప్రజల మనస్సాక్షి ఎలా గ్రహించగలదు? నిర్మొహమాటంగా చెప్పాలంటే, నేను మీ నుండి కోరేదల్లా మీరు నా పనికి నమూనాలుగా, నా పూర్తి స్వభావానికి మరియు నా అన్ని చర్యలకు సాక్షులుగా ఉండాలని, తద్వారా మీరు సాతాను కష్టాల నుండి విముక్తి పొందాలని. అయినప్పటికీ, ప్రజలు ఎల్లప్పుడూ నా పనిని తిప్పికొట్టారు మరియు ఉద్దేశపూర్వకంగా దానికి విరుద్ధంగా ఉంటారు. ఇశ్రాయేలు చట్టాలను తిరిగి తీసుకురావడానికి మరియు నేను ఇశ్రాయేలు మీద తెచ్చిన ఉగ్రతను వారిపైకి తీసుకురావడానికి అలాంటి వ్యక్తులు నన్ను ఎలా ప్రేరేపించకుండా ఉండగలరా? మీలో చాలా మంది నా పట్ల “విధేయత మరియు లోబడే తత్వం” కలిగి ఉన్నప్పటికీ, కోరహు బృందం వారు కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. నేను నా పూర్తి మహిమను పొందిన తర్వాత, నేను వారిని బూడిద చేయడానికి ఆకాశము నుండి అగ్నిని ఉపయోగిస్తాను. నేను ఇకపై నా మాటలతో ప్రజలను మందలించనని మీరు తెలుసుకోవాలి; బదులుగా, ఇశ్రాయేలు పని చేసే ముందు, నన్ను ఎదిరించిన మరియు నేను చాలా కాలం క్రితం వెళ్లగొట్టిన “కోరా బృందాన్ని” పూర్తిగా కాల్చివేస్తాను. నన్ను ఆనందించే అవకాశం ఇకపై మానవజాతికి ఉండదు; బదులుగా, వారు చూసేదంతా నా కోపం మరియు ఆకాశం నుండి మంటలు. నేను అన్ని రకాల వ్యక్తుల యొక్క వివిధ ఫలితాలను వెల్లడిస్తాను మరియు నేను వారందరినీ వర్గాలుగా విభజిస్తాను. నేను వారి ప్రతి తిరుగుబాటు చర్యను గమనించి, ఆపై నా పనిని పూర్తి చేస్తాను, తద్వారా భూమిపై ఉన్నప్పుడు నా తీర్పు అలాగే నా పట్ల వారికున్న వైఖరి ఆధారంగా ప్రజల ఫలితాలు నిర్ణయించబడతాయి. ఆ సమయం వచ్చినప్పుడు, వారి ఫలితాలను మార్చగలిగేది ఏమీ ఉండదు. ప్రజలు తమ సొంత ఫలితాలను వెల్లడించనివ్వండి! అప్పుడు నేను ప్రజల ఫలితాలను పరలోకపు తండ్రికి అప్పగిస్తాను.

మునుపటి:  మీ భవిష్యత్తు పరిచర్యకు మీరు ఎలా హాజరు కావాలి?

తరువాత:  దేవుని పట్ల నీ అవగాహన ఏమిటి?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger