సువార్తను వ్యాప్తి చేయు కార్యము అనేది మనిషిని రక్షించు కార్యమైయున్నది

ఈ భూమి మీద నా కార్యము యొక్క లక్ష్యాలు ఏమిటని ప్రతియొక్కరూ తెలుసుకోవాలి, అంటే, నేను అంతిమంగా ఏమి పొందాలనుకుంటున్నాను, మరియు ఈ కార్యము పూర్తి కావడానికి ముందు నేను ఎటువంటి స్థాయిని చేరుకోవాలి అనే లక్ష్యాలను ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు వరకు నాతో నడిచిన తరువాత కూడా, నేను చేసే పని ఏమిటో ప్రజలకు అర్థం కానట్లయితే, అప్పుడు వారు నాతో వృధాగా నడిచినట్లు కాదా? ప్రజలు నన్ను అనుసరిస్తే, వారు నా సంకల్పాన్ని తెలుసుకోవాలి. నేను వేలాది సంవత్సరాలుగా భూమిపై కార్యము చేస్తున్నాను, మరియు ఈ రోజు వరకు, నేను నా కార్యమును కొనసాగిస్తున్నాను. నా కార్యములో అనేక ప్రణాళికలు ఉన్నప్పటికీ, ఆ కార్యానికున్న ఉద్దేశ్యం మారలేదు; ఉదాహరణకు, నేను మానవునికి తీర్పు తీర్చి, శిక్షించే ఆలోచనలో ఉన్నప్పటికీ, అతనిని కాపాడడ౦ కోసం, నా సువార్తను మరి౦త మెరుగ్గా వ్యాప్తి చేయడ౦ కోస౦, మానవుడు పరిపూర్ణమైన తరువాత అన్యజనుల౦దరి మధ్య నా కార్యమును మరి౦త విస్తృత౦ చేయడ౦ కోస౦ చేస్తున్నాను నేను ఇప్పటికీ నా కార్యమును జరిగించుచున్నాను. కాబట్టి ఈ రోజు, చాలా మంది చాలా కాలం నుండి నిరాశలో కూరుకుపోయిన సమయంలో, నేను ఇప్పటికీ నా కార్యమును కొనసాగిస్తున్నాను, మనిషిపై తీర్పు తీర్చడానికి మరియు శిక్షించడానికి నేను చేయాల్సిన కార్యమును నేను కొనసాగిస్తున్నాను. మానవుడు నేను చెప్పేదానితో విసిగిపోయినప్పటికీ, నా కార్యము పట్ల శ్రద్ధ వహించాలనే కోరిక అతనికి లేనప్పటికీ, నేను ఇప్పటికీ నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను, ఎందుకంటే నా కార్యము యొక్క ఉద్దేశ్యం మారలేదు మరియు నా వాస్తవ ప్రణాళిక విచ్ఛిన్నం కాదు. మనిషి నాకు బాగా విధేయత చూపడానికి వీలు కల్పించడానికే నేను తీర్పు తీర్చుచున్నాను, అంతేగాక మనిషిని మరింత సమర్థవంతంగా మార్చడానికే నేను మనిషిని శిక్షించుచున్నాను. నేను చేసేది నా కార్య నిర్వహణ కోసమే అయినప్పటికీ, నేను మనిషికి ప్రయోజనకరము లేనిదానిని చేయలేదు, ఎందుకంటే ఇశ్రాయేలుకు మించిన దేశాలన్నింటినీ ఇశ్రాయేలీయులవలె విధేయులుగా చేయాలని, వారిని నిజమైన మానవులుగా మార్చాలని, ఇశ్రాయేలు వెలుపల ఉన్న భూములలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. ఇదే నేను చేయు కార్యనిర్వహణయైయున్నది; ఇదే అన్యజనుల మధ్య నేను చేయదలచిన కార్యము. ఇప్పుడు కూడా, చాలా మందికి నేను నిర్వహించు కార్యము అర్థం కాలేదు, ఎందుకంటే వారికి అలాంటి విషయాలపై ఆసక్తి లేదు మరియు వారి స్వంత భవిష్యత్తు మరియు గురి గమ్యాల గురించి మాత్రమే వారు శ్రద్ధ వహిస్తారు. నేను ఏమి చెప్పినా, నేను చేసే పని పట్ల విభిన్న వైఖరిని కలిగి ఉంటారు, అంతేగాకుండా, వారి గురి గమ్యాల పైన మాత్రమే ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. పరిస్థిలు ఈ విధంగా కొనసాగితే, నేను చేయు కార్యము ఎలా విస్తరిస్తుంది? నా సువార్త ప్రపంచమంతటా ఎలా వ్యాపిస్తుంది? నేను చేయు కార్యము విస్తరించినప్పుడు, నేను మిమ్మల్ని చెదరగొట్టి, ఇశ్రాయేలులోని ప్రతి గోత్రాన్ని యెహోవా చంపినట్లే నిన్ను కొట్టివేస్తానని తెలుసుకోండి. ఈ కార్యమంతా జరగాలి. తద్వారా నా సువార్త భూవ్యాప్తంగా విస్తరిస్తుంది, ఆవిధంగా నా కార్యము అన్య దేశాల వరకు విస్తరించగలదు, నా నామము పిల్ల్ల్లల ద్వారా పెద్దల ద్వారా ఘనపరచబడుతుంది, నా పరిశుద్ధ నామము అన్ని గోత్రముల, జనముల నోటను ఘనపరచబడుతుంది. ఈ విధంగా ఈ అంత్య యుగంలో, అన్యజనుల మధ్య నా నామము ఘనపరచబడును, తద్వారా నా క్రియలు అన్యజనులకు కనిపిస్తాయి మరియు వారు నేను చేయు కార్యములకారణంగా నన్ను సర్వశక్తిమంతుడు అని పిలుస్తారు మరియు నా వాక్యములు త్వరలోనే నెరవేరుతాయి. నేను ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడని కాకుండా, అన్యజనుల౦దరి దేవుడను, నేను శపి౦చిన వారికి కూడా దేవుడనని ప్రజలందరికీ తెలియజేస్తాను. నేనే సమస్త సృష్టికి దేవుడనని ప్రజలందరూ చూసేలా చేస్తాను. ఇదే నేను చేసే గొప్ప కార్యము, అంత్య దినాలలో నా ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం మరియు అంత్య దినాలలో నెరవేర్చాల్సిన ఏకైక కార్యమైయున్నది.

వేల సంవత్సరాలుగా నేను నిర్వహిస్తున్న కార్యము మానవునికి పూర్తిగా అంత్య దినాలలో మాత్రమే బహిర్గతమవుతుంది. ఇప్పుడు మాత్రమే నేను నా నిర్వహణ యొక్క పరిపూర్ణ రహస్యాన్ని మానవునికి వెల్లడించాను. అంతేగాక, మానవుడు నా పని యొక్క ఉద్దేశ్యాన్ని నేర్చుకున్నాడు, నా రహస్యాలన్నింటినీ అర్థం చేసుకున్నాడు. మానవుడు కలిగియున్న తన గమ్యం గురించి నేను ఇప్పటికే చెప్పాను. మానవుని కోసం నా రహస్యాలు అన్నింటినీ, 5,900 సంవత్సరాలుగా దాగి ఉన్న నా రహస్యాలు అన్నీ నేను ఇప్పటికే బయటపెట్టాను. యెహోవా ఎవరు? మెస్సీయ ఎవరు? యేసు ఎవరు? అనే మొదలగు విషయాలన్నిటిని మీరు తెలుసుకోవాలి. ఈ పేర్ల విషయమై నేను చేయు కార్యము మరలింది. అది మీకు అర్థమైందా? నా పరిశుద్ధ నామాన్ని ఎలా ప్రకటి౦చాలి? నా నామములలో ఏ నామము ద్వారానైనా నన్ను పిలిచిన ఏ జనములకైనా నా పేరు ఎలా వ్యాప్తి చెందాలి? నా కార్యము విస్తరిస్తోంది, మరియు నేను దాని సంపూర్ణతను ఎటువంటి దేశానికైనా మరియు అన్ని దేశాలకు వ్యాప్తి చేస్తాను. నా కార్యము మీలో జరిగి౦ది కాబట్టి, ఇశ్రాయేలులోని దావీదు ఇ౦టి కాపరులను యెహోవా కొట్టినట్టే నేను మిమ్మల్ని కూడా ప్రతి జనాంగములో చెదరగొడతాను. ఎందుకంటే అంత్య దినాల్లో, నేను అన్ని దేశాలను తునాతునకలు చేసి, వారి ప్రజలను నూతనంగా చేస్తాను. నేను మళ్లీ తిరిగి వచ్చినప్పుడు, నా మండే జ్వాలలచే నిర్దేశించిన సరిహద్దుల ద్వారా దేశాలు అప్పటికే విభజించబడియుంటాయి. ఆ సమయంలో, నేను మానవాళికి మండే సూర్యునిలా నూతనంగా కనుపరచుకుంటాను, వారు ఎన్నడూ చూడని పరిశుద్ధుని రూపములో నన్ను నేను బహిర౦గ౦గా కనుబరచుకుంటాను, యెహోవానైన నేను ఒకప్పుడు యూదా గోత్రాల మధ్య నడిచినట్లే బహుళ దేశాల మధ్య నడుస్తాను. అప్పటి నుండి, నేను భూమిపై ఉన్నటువంటి మానవాళి జీవితాలను నడిపిస్తాను. అక్కడ వారు ఖచ్చితంగా నా మహిమను చూస్తారు మరియు వారి జీవితాలలో వారిని నడిపించడానికి వారు గాలిలో ఒక మేఘ స్తంభాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే నేను పరిశుద్ధ స్థలాలలో నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను. మానవుడు నా నీతిని చూసే ఆ దినాన్ని, మహిమగల ప్రత్యక్షతను కూడా చూస్తాడు. నేను భూమి అంతటా పరిపాలించినప్పుడు మరియు నా అనేక మంది కుమారులను మహిమలోకి తీసుకువచ్చినప్పుడు అది జరుగుతుంది. భూమిపై ప్రతిచోటా మానవులు నమస్కరిస్తారు మరియు నా గుడారం మానవాళి మధ్యఈ రోజు నేను నిర్వహిస్తున్న కార్యము యొక్క బండపై దృఢంగా ఉంటుంది. ప్రజలు నాకు దేవాలయంలో కూడా సేవ చేస్తారు. బలిపీఠం, మురికి మరియు అసహ్యకరమైన వస్తువులతో కప్పబడి ఉంది, నేను ముక్కలుగా పగులగొట్టి, నూతనంగా నిర్మిస్తాను. పవిత్ర బలిపీఠం మీద తోలిచూలు గొర్రెపిల్లలు మరియు దూడలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. నేను ఈనాటి మందిరాన్ని కూల్చివేసి కొత్తది నిర్మిస్తాను. ఇప్పుడు ఉన్న, అసహ్యకరమైన వ్యక్తులతో నిండిన మందిరము కూలిపోతుంది, మరియు నేను నిర్మించే ఆలయం నాకు విధేయులైన సేవకులతో నిండి ఉంటుంది. నా మందిర మహిమ కొరకు వారు మరోసారి లేచి నిలబడి నాకు సేవ చేస్తారు. నేను గొప్ప మహిమ పొందే రోజును మీరు తప్పకుండా చూస్తారు, అలాగే నేను మందిరాన్ని కూల్చివేసి క్రొత్తదాన్ని నిర్మి౦చే రోజును కూడా మీరు ఖచ్చిత౦గా చూస్తారు. అలాగే, మానవుల ప్రపంచంలోకి నా గుడారం వచ్చే రోజును మీరు తప్పకుండా చూస్తారు. నేను ఆలయాన్ని పగులగొడుతున్నప్పుడు, వారు నా సంతతిని చూస్తున్నట్లుగానే, నేను నా గుడారాన్ని మానవుల ప్రపంచంలోకి తీసుకువస్తాను. నేను అన్ని దేశాలను నలగగొట్టిన తరువాత, నేను వారిని క్రొత్త జనాంగములుగా మళ్లీ ఒకచోట చేర్చుకుంటాను, ఇక నుండి నా ఆలయాన్ని నిర్మిస్తాను మరియు నా బలిపీఠాన్ని స్థాపిస్తాను, అందరూ నాకు బలులు అర్పిస్తారు, నా మందిరంలో నన్ను సేవిస్తారు మరియు అన్యదేశాలలో నేను జరిగించే కార్యమునకు వారు తమ్మును తాము నమ్మకమైన భక్తిపరులుగా కనుబరుచుకుంటారు. వారు నేటి ఇశ్రాయేలీయుల వలె, యాజక వస్త్రము, కిరీటముతో అలంకరించబడి, వారి మధ్యన ఉందురు. యెహోవానై నా మహిమను నా ప్రభావమును వారి మధ్యన సంచరించి వారితో నివసించును. అన్యదేశాలలో నా కార్యము కూడా అదే విధంగా అమలు చేయబడుతుంది. ఇశ్రాయేలులో నా కార్యము ఎలా జరిగిందో, అన్యజనులలో నా కార్యము అలాగే జరుగుతుంది. ఎందుకంటే నేను ఇశ్రాయేలులో నా కార్యమును విస్తరింపజేస్తాను మరియు అన్యజనుల దేశాలకు వ్యాప్తి చేస్తాను.

నా ఆత్మ ద్వారా గొప్ప కార్యములను జరిగించే సమయం మరియు అన్య దేశాల మధ్యన నా కార్యమును ఆరంభించే సమయం ఆసన్నమైంది. దాని కంటే ఎక్కువగా, నేను సృష్టించిన అన్ని జీవులను వర్గీకరించి, నేను సృష్టించిన ప్రతి ఒక్కదానిని వాటి సంబంధిత వర్గంలో ఉంచే సమయం ఆసన్నమైంది. తద్వారా నా పని మరింత వేగంగా మరియు ప్రభావవంతంగా ముందుకు కొనసాగుతుంది. కాబట్టి, నేను జరిగించు కార్యమంతటికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలని ఇంకను మీయందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేగాకుండా, నేను మీలో చేసిన కార్యములన్నిటిని మీరు స్పష్టంగా వివేచించి, నిర్ధారిస్తూ, మీ శక్తినంతా నాలో పెట్టండి, అలా చేయడం వలన ఇది మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థము చేసుకోవాలి. మీలో మీరు పోట్లాడుకోవడం, వెనుదిరగడానికి ఎదురుచూడడం, లేదా నా కార్యమును మరియు మీ అద్భుత భవిష్యత్తును ఆలస్యం చేసే శరీర సుఖాల కొరకు ఎదురుచూడడం మానుకోండి. మిమ్మల్ని సంరక్షించుకునే విషయములో మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పకుండ మీరు మీ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. ఇది మీ మూర్ఖత్వం కాదా? ఈ రోజు మీరు అత్యాశతో ఆస్వాదించే విషయం మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది, అయితే ఈ రోజు మీరు అనుభవిస్తున్న బాధ రేపటి రోజున మిమ్మల్ని రక్షించే గొప్ప కార్యము. సూర్యుని కనగొనలేనంత దట్టమైన పొగ మంచులోనికి వెళ్ళేటువంటి తప్పిదము చేయకుండునట్లుగా, మీయంతటికి మీరు బయటకి రాలేనంత శోధనలలోనికి ప్రవేశించకుండునట్లు ఈ విషయాలన్నిటిపట్ల స్పష్టమైన అవగాహన కలిగియుండాలి. దట్టమైన పొగమంచు తొలగిపోయినప్పుడు, తీర్పు తీర్చు ఆ గొప్ప రోజున మీరుంటారు. ఆ సమయానికి, నా రోజు మానవాళికి దగ్గరకానుంది. నా తీర్పు నుండి మీరు ఎలా తప్పించుకుంటారు? భగభగ మండుచున్న సూర్యుని మహా వేడిమిని మీరు ఎలా భరించగలరు? నేను మనిషిని సమృద్ధిగా ఆశీర్వదించినప్పుడు, దానినిబట్టి సంతోషించడు కానీ ఎవరూ గమనించని ప్రదేశానికి దానిని పక్కన పెడతాడు. నా దినము మనుష్యుని మీదికి వచ్చినప్పుడు అతను నా సమృద్ధిని కనుగొనలేకపోవును, నేను చాలాకాల౦ క్రిత౦ అతనితో మాట్లాడిన చేదుతో కూడిన సత్యపు మాటలను కనుగొనకపోవును. అతడు వెలుగు యొక్క ప్రకాశమును కోల్పోయి చీకటిలో పడినందున అతడు విలపిస్తూ ఏడుస్తాడు. ఈ రోజు మీరు చూస్తున్నది నా నోటిలోని పదునైన కత్తి మాత్రమే. మీరు నా చేతిలోని దండమును లేదా నేను మనిషిని కాల్చే మంటను చూడలేదు, అందుకే మీరు ఇప్పటికీ నా సన్నిధిలో గర్విష్టులుగాను మరియు మితి మీరిన జనముగాను ఉన్నారు. అందుకే మీరు ఇప్పటికీ నా నివాసములో నాతో పోరాడుతున్నారు, నేను నా నోటితో మాట్లాడిన దాని గురించి మీ మానవ నాలుకతో వాదిస్తున్నారు. మానవుడు నాకు భయపడడు, మరియు అతను ఈ రోజు కూడా నాతో శత్రుత్వంలో కొనసాగుతున్నప్పటికీ, అతను ఎటువంటి భయం లేకుండా ఉన్నాడు. మీరు మీ నోళ్ళల్లో అవినీతితో కూడిన నాలుకలను, దంతాలను కలిగియున్నారు. మీ మాటలు, మీ క్రియలు ఎలా ఉన్నాయంటే హవ్వను పాపం చేయడానికి ప్రేరేపించిన పాము మాటలవలె ఉన్నాయి. మీరు ఒకరికొకరు కంటికి కన్ను మరియు పంటికి పన్ను కావాలని కోరుతున్నారు, మరియు మీరు మీ స్థానం, కీర్తి మరియు లాభాన్ని పొందడం కోసం నా సన్నిధిలో పోరాడుతున్నారు, అయినప్పటికీ నేను మీ మాటలు మరియు క్రియలను రహస్యంగా గమనిస్తున్నానని మీకు తెలియదు. మీరు నా సన్నిధికి రాక ముందే, నేను మీ హృదయాంతరాలలో ధ్వనించాను. మానవుడు ఎల్లప్పుడూ నా చేతి నుండి తప్పించుకోవాలని, నా కళ్ళ పరిశీలననుండి తప్పించుకోవాలని కోరుకుంటాడు, కాని నేను అతని మాటలను లేక క్రియలను చూడకుండ దూరముగా ఉండలేదు. అయితే, నేను ఉద్దేశ్యపూర్వకంగా అతని మాటలను మరియు క్రియలను నా కళ్ళతో చూస్తున్నాను. నేను మనిషి యొక్క అనీతిని శిక్షించి, అతని తిరుగుబాటుపై తీర్పు తీరుస్తాను. ఆ విధంగా, రహస్యంలో ఉన్న మానవుని మాటలు మరియు క్రియలు ఎల్లప్పుడూ నా న్యాయస్థానం ముందు ఉంటాయి మరియు అతని తిరుగుబాటు తీవ్ర స్థాయిలో ఉన్నందున నా తీర్పు మనిషిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. నా ఆత్మ సన్నిధిలో మానవుడు పలికిన మాటలను మరియు చేసిన క్రియలను నా కార్యము దహించి వేసి, శుద్దీకరిస్తుంది. ఈ విధంగా,[ఎ] నేను భూమిని విడిచి వెళ్ళినప్పుడు, ప్రజలు నాకు నమ్మకస్తులై ఉంటారు. మరియు నేను జరిగించు కార్యములో నా పరిశుద్ధ సేవకులుగా నాకు సేవచేస్తారు, భూమిపై నేను జరిగించే ఈ కార్యము సంపూర్ణమయ్యే రోజు వరకు కొనసాగిస్తూనే ఉంటారు.

ఫుట్‌నోట్:

ఎ. మూల వచనములో “ఈ విధంగా” అనే పదబంధం లేదు.

మునుపటి:  రక్షకుడు ఇప్పటికే “తెల్లటి మేఘం” మీద తిరిగి వచ్చాడు

తరువాత:  న్యాయ కాలములో కార్యము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger