పరిశుద్ధాత్మ కార్యం మరియు సాతాను కార్యం
పరిశుద్ధాత్మ వివరాలను ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారు? మనిషిలో పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తుంది? మనిషిలో సాతాను ఎలా పని చేస్తుంది? మనిషిలో దుష్ట ఆత్మలు ఎలా పని చేస్తాయి? సాక్షాత్కారాలు అంటే ఏమిటి? నీకు ఏదైనా జరిగినప్పుడు, అది పరిశుద్ధాత్మ నుండి వస్తుందా, నీవు దానిని పాటించాలా లేదా తిరస్కరించాలా? వ్యక్తుల వాస్తవ ఆచరణలో, మనుష్యులు పరిశుద్ధాత్మ నుండి వస్తుందని తప్పక నమ్మే ఎన్నో మానవ సంకల్పం నుండే పుడతాయి. కొన్ని దుష్ట ఆత్మల నుండి వస్తాయి, అయినప్పటికీ అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చాయని మనుష్యులు అనుకుంటారు, అలాగే పరిశుద్ధాత్మ కొన్నిసార్లు లోపలి నుండి మనుష్యులను నడిపిస్తుంది, అయినప్పటికీ అలాంటి ఉపదేశం సాతాను నుండి వస్తుందని భయపడి దానిని ఆచరించడానికి మనుష్యులు సాహసం చేయరు కానీ, నిజానికి ఆ నిర్దేశనం పరిశుద్ధాత్మ బోధగా ఉంటుంది. ఈ విధంగా, ఒక వ్యక్తి ఆ వ్యత్యాసాలను అభ్యసిస్తే తప్ప, ఒకరి వ్యావహారిక అనుభవంలో తెలుసుకోవడానికి మరో మార్గం లేదు; ఈ వ్యత్యాసాన్ని గ్రహించకుండా, జీవం పొందే మార్గమే లేదు. పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తుంది? దుష్ట ఆత్మలు ఎలా పని చేస్తాయి? మనిషి సంకల్పం నుండి ఏమి వస్తుంది? అలాగే పరిశుద్ధాత్మ నిర్దేశనం మరియు బోధ నుండి ఏమి పుడుతుంది? నీ రోజువారీ జీవితంలో మరియు నీ వ్యావహారిక అనుభవాలలో, నీవు మనిషి లోపల పరిశుద్ధాత్మ కార్యము యొక్క రీతులను గ్రహించినట్లయితే, నీవు నీ జ్ఞానాన్ని పెంచుకోగలవు మరియు తేడాలను గుర్తించగలవు; నీవు దేవుణ్ణి తెలుసుకుంటావు, నీవు సాతానును అర్థం చేసుకోగలవు మరియు గుర్తించగలవు; నీవు నీ విధేయతలో లేదా అనుసరణలో గందరగోళ పడవు, అలాగే నీవు ఆలోచనలు స్పష్టంగా ఉండే, పరిశుద్ధాత్మ కార్యాన్ని పాటించే వ్యక్తిగా ఉంటావు.
పరిశుద్ధాత్మ కార్యం అనేది తనంతతానుగా చొరవ తీసుకునే నిర్దేశనం మరియు సానుకూల బోధ యొక్క ఒక రూపంగా ఉంటుంది. అది మనుష్యులు స్తబ్ధంగా ఉండటానికి అనుమతించదు. అది వారికి ఓదార్పునిస్తుంది, వారికి విశ్వాసాన్ని మరియు నిశ్చయాన్ని ఇస్తుంది మరియు దేవునిచే పరిపూర్ణులుగా తయారుచేయబడే సామర్థ్యం వారికి ఇస్తుంది. పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు, మనుష్యులు చురుకుగా చొచ్చుకుపోగలుగుతారు; వారు స్తబ్ధంగా ఉండరు లేదా బలవంతం చేయబడరు, వారి సొంత చొరవతో వ్యవహరిస్తారు. పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు, మనుష్యులు సంతోషంగా మరియు సమ్మతంగా ఉంటారు, విధేయత చూపడానికి సమతిస్తారు మరియు తమంతతాము వినమ్రులుగా ఉండటాన్ని ఆనందిస్తారు. వారు లోలోన బాధతో మరియు సున్నితంగా ఉన్నప్పటికీ, వారు సహకరించడానికి నిశ్చయము కలిగి ఉంటారు; వారు సంతోషంగా సహిస్తారు, వారు విధేయత చూపగలుగుతారు మరియు వారు మానవ సంకల్పంతో కలుషితం కారు, మనిషి ఆలోచనలచే కలుషితం కారు మరియు వారు ఖచ్చితంగా మానవ కోరికలు మరియు ప్రేరణలచే కలుషితం కానివారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ కార్యాన్ని మనుష్యులు అనుభవించినప్పుడు, ప్రధానంగా వారు అంతరాత్మలో పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధాత్మ కార్యాన్ని పొందినవారు, దేవుని ప్రేమతో మరియు వారి సోదర, సోదరీమణుల ప్రేమతో జీవిస్తారు; వారు దేవుణ్ణి సంతోషపెట్టే పనులలో సంతోషం పొందుతారు మరియు దేవుడు అసహ్యించుకునే వాటిని వారు కూడా అసహ్యించుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యం స్పృశించిన వ్యక్తులు సాధారణ మానవత్వంతో ఉంటారు, వారు నిరంతరం సత్యాన్ని అనుసరిస్తారు మరియు మానవత్వం కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ మనుష్యుల లోపల పని చేసినప్పుడు, వారి పరిస్థితి నిరంతరం మెరుగుపడుతూనే ఉంటుంది, వారి మానవత్వం మరింత సరళం అవుతుంది, వారి సహకారంలో కొంతభాగం మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారి ఆశయాలు సరైనవిగా, వారి ప్రవేశం సానుకూలంగా ఉంటుంది, అంతరాయం కలిగించడానికి వారు ప్రయత్నించరు మరియు వారిలో ఎటువంటి ద్వేషము ఉండదు. పరిశుద్ధాత్మ కార్యం సామాన్యమైనది మరియు నిజమైనది, పరిశుద్ధాత్మ మనిషి సాధారణ జీవిత నియమాలకు అనుగుణంగా మానవునిలో పని చేస్తుంది మరియు పరిశుద్ధాత్మ సాధారణ వ్యక్తుల వాస్తవ అనుసరణ ప్రకారం, మనుష్యులకు బోధ మరియు నిర్దేశనం కొనసాగిస్తుంది. మనుష్యుల్లో పరిశుద్ధాత్మ పని చేసినప్పుడు, సాధారణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయన వారిని నడిపిస్తాడు మరియు జ్ఞానపరుస్తాడు. వారి అవసరాలకు అనుగుణంగా ఆయన వారికి సమకూర్చుతాడు, వారికి లేని దానినిబట్టి మరియు వారి లోపాలనుబట్టి, ఆప్రకారం వారికి సానుకూలంగా మార్గనిర్దేశం చేస్తాడు మరియు బోధపరుస్తాడు. పరిశుద్ధాత్మ కార్యం నిజ జీవితంలో ప్రజలను బోధపర్చడం మరియు మార్గనిర్దేశం చేయడంగా ఉంటుంది; వారు వారి వాస్తవ జీవితాలలో దేవుని వాక్యములను అనుభవిస్తేనే వారు పరిశుద్ధాత్మ కార్యాన్ని చూడగలుగుతారు. ప్రజలు వారి దైనందిన జీవితంలో, సానుకూల స్థితిలో ఉంటే, సాధారణ ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటే, అప్పుడు వారికి పరిశుద్ధాత్మ కార్యం అనుభవం అవుతుంది. అటువంటి స్థితిలో, వారు దేవుని వాక్యములను ఆరగించి, సేవించినప్పుడు, వారిలో విశ్వాసం ఉంటుంది; వారు ప్రార్థించినప్పుడు, వారు ప్రేరణ పొందుతారు; వారు దేనినైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, వారు స్తబ్ధంగా ఉండరు; మరియు ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు, వారు నేర్చుకోవాలని దేవుడు కోరుకునే పాఠాలను వారు ఆ సంఘటనల్లో చూడగలుగుతారు. వారు స్తబ్ధంగా లేదా బలహీనంగా ఉండరు, వారికి నిజమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేవుని ఏర్పాట్లన్నింటినీ శిరసావహించడానికి వారు సిద్ధంగా ఉంటారు.
పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ఎటువంటి ప్రభావాలు సాధించబడతాయి? నీవు తెలివి తక్కువ వాడివి కావచ్చు, నీవు వివేకం లేనివాడివి కావచ్చు కానీ, పరిశుద్ధాత్మ నీలో పని చేయవలసి ఉంటుంది, ఎందుకంటే, నీలో విశ్వాసం ఉన్నప్పటికీ, దేవుణ్ణి తగినంతగా ప్రేమించలేవని నీవు ఎల్లప్పుడూ భావిస్తావు. ముందున్న కష్టాలు ఎంత పెద్దవైనప్పటికీ, నీవు సహకరించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు పనులు జరుగుతాయి మరియు అవి దేవుని నుండి వచ్చాయా లేదా సాతాను నుండి వచ్చాయా అనేది నీకు స్పష్టంగా తెలియదు, కానీ నీవు వేచి ఉండగలుగుతావు, నీవు స్తబ్ధంగా గానీ లేదా అజాగ్రత్తగా గానీ ఉండవు. ఇది పరిశుద్ధాత్మ సాధారణ కార్యం. పరిశుద్ధాత్మ నీలో పని చేస్తున్నా కూడా, ఇంకా నీవు నిజమైన ఇబ్బందులను ఎదుర్కొంటావు: కొన్నిసార్లు నీకు కన్నీళ్లు వస్తాయి, మరికొన్నిసార్లు నీవు అధిగమించలేని కష్టాలు ఉంటాయి కానీ, ఇదంతా పరిశుద్ధాత్మ సాధారణ కార్యంలోని ఒక దశ మాత్రమే. నీవు ఆ కష్టాలను అధిగమించనప్పటికీ, ఆ సమయంలో నీవు బలహీనంగా మరియు పూర్తిగా ఫిర్యాదులతో ఉన్నప్పటికీ, ఆ తర్వాత నీవు సంపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి ఇంకా ప్రేమించగలిగి ఉంటావు. నీ ఉదాశీనత నీవు సాధారణ అనుభవాలను పొందకుండా నిరోధించలేదు మరియు ఇతరులు ఏమంటారు, ఇతరులు నీపై ఎలా దాడి చేస్తారు అనేదానితో సంబంధం లేకుండా, నీవు ఇంకనూ దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. ప్రార్థన సమయంలో, గతంలో దేవునికి నీవు చాలా రుణపడి ఉన్నావని ఎల్లప్పుడూ భావిస్తావు, నీవు దేవుణ్ణి సంతృప్తి పరచడానికి నిశ్చయించుకుంటావు మరియు మళ్లీ అలాంటివి ఎదురైనప్పుడల్లా దేహ సంబంధమైన వాటిని త్యజిస్తావు. పరిశుద్ధాత్మ కార్యం నీలోనే ఉందని ఈ బలం చూపుతుంది. పరిశుద్ధాత్మ కార్యం సాధారణ స్థితి ఇలాగే ఉంటుంది.
సాతాను నుండి వచ్చే కార్యం ఏమిటి? సాతాను నుండి వచ్చే కార్యంలో, వ్యక్తులలోని దృష్టికోణాలు అస్పష్టంగా ఉంటాయి; వ్యక్తులు సాధారణ మానవత్వం లేకుండా ఉంటారు, వారి చర్యల వెనుక ఉన్న ప్రేరణలు తప్పుగా ఉంటాయి, వారు దేవుణ్ణి ప్రేమించాలని కోరుకున్నప్పటికీ, వారి లోలోపల ఎల్లప్పుడూ నిందారోపణలు ఉంటాయి, ఈ నిందారోపణలు మరియు ఆలోచనలు వారికి నిరంతరం అవరోధం కలిగిస్తుంటాయి, వారి జీవిత ఎదుగుదలను అడ్డుకుంటాయి మరియు దేవుని యెదుటకు సాధారణ స్థితిలో రాకుండా వారిని ఆపుతాయి. దీనర్థం ఏమిటంటే, వ్యక్తులలో సాతాను కార్యం మొదలైన వెంటనే, వారి హృదయాలు దేవుని యెదుట ప్రశాంతంగా ఉండలేవు. అలాంటి వారికి తమకు తాము ఏమి చేసుకోవాలో తెలియదు—వ్యక్తులు గుమిగూడటం చూసినప్పుడు, వారు పారిపోవాలనుకుంటారు మరియు ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కళ్ళు మూసుకోలేరు. దుష్ట ఆత్మల కార్యం మనిషి మరియు దేవుని మధ్య ఉన్న సాధారణ సంబంధాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది, వ్యక్తుల మునుపటి దృష్టికోణాలను లేదా వారి పూర్వ జీవన ప్రవేశ మార్గాన్ని తల్లకిందులుగా చేస్తుంది; వారి హృదయాలలో వారు ఎప్పటికీ దేవునికి దగ్గరగా రాలేరు, వారికి అంతరాయం కలిగించే మరియు వారిని బంధించే విషయాలు ఎల్లప్పుడూ జరుగుతాయి. వారి హృదయాలు శాంతిని పొందలేవు మరియు వారి ప్రేరణలు కుంగిపోవడంతో వారిలో దేవుణ్ణి ప్రేమించడానికి కావల్సిన బలం ఉండదు. సాతాను కార్యపు సాక్షాత్కారాలు అలాగే ఉంటాయి. సాతాను కార్యపు సాక్షాత్కారాలు ఏవంటే: మాట మీద నిలబడలేక పోవడం మరియు సాక్ష్యంగా నిలువలేకపోవటం. ఇవి నిన్ను దేవుని యెదుట దోషిగా నిలబడే వ్యక్తిగా మరియు దేవుని పట్ల విశ్వాసంలేని వ్యక్తిగా మార్చుతాయి. సాతాను జోక్యం చేసుకున్నప్పుడు, నీవు దేవుని యందు ప్రేమ, విధేయతను కోల్పోతావు, నీవు దేవునితో సహజ సంబంధాన్ని కోల్పోతావు, నీవు సత్యాన్ని ఆచరించడం లేదా నిన్ను నీవు మెరుగుపరుచుకోవడం కొనసాగించలేవు; నీవు పతనం అవుతావు మరియు స్తబ్ధంగా ఉంటావు, నీలో నీవే లీనమైపోతావు, నీవు పాపాన్ని అదుపు లేకుండా వ్యాప్తి చేస్తావు మరియు పాపం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండవు; అంతేగాకుండా, సాతాను ప్రవేశం నిన్ను దుష్ప్రవర్తనగలవానిగా చేస్తుంది; ఇది నీలో దేవుని స్పర్శ మాయమై పోయేలా చేస్తుంది మరియు నిన్ను దేవునిపై దోషారోపణ చేసే వాడిగా, ఆయనను తిరస్కరించే వాడిగా మారుస్తుంది, ఇది దేవుణ్ణి ప్రశ్నించడానికి దారి తీస్తుంది; నీవు దేవుణ్ణి త్యజించే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ సాతాను నుండే వస్తాయి.
నీ రోజువారీ జీవితంలో నీకు ఏదైనా జరిగినప్పుడు, అది పరిశుద్ధాత్మ కార్యం నుండి వచ్చిందా లేదా సాతాను కార్యం నుండి వచ్చిందా అనే తేడాను నీవు ఎలా తెలుసుకోవాలి? మనుష్యుల పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు, వారి ఆధ్యాత్మిక జీవితాలు మరియు వారి దేహంలోని ప్రాణాలు సాధారణంగా ఉంటాయి, వారి హేతువు సాధారణంగా మరియు క్రమబద్ధంగా ఉంటుంది. వారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు, తమలో తాము అనుభవించే మరియు తెలుసుకునే విషయాలు సాధారణంగా పరిశుద్ధాత్మ స్పర్శ నుండి వచ్చాయని చెప్పవచ్చు (వారు దేవుని వాక్యములను ఆరగించి, సేవించినప్పుడు అంతర్దృష్టి లేదా కొంత సరళమైన ఙ్ఞానం కలిగి ఉండడం మరియు కొన్నింటి పట్ల విశ్వాసం ఉండడం లేదా కొన్ని విషయాలలో దేవుణ్ణి ప్రేమించే బలం కలిగి ఉండడం—ఇవన్నీ పరిశుద్ధాత్మ నుండి వస్తాయి). మనిషిలో పరిశుద్ధాత్మ కార్యం ప్రత్యేకించి సాధారణమైనది; మనిషి దానిని అనుభవించలేడు మరియు అది మనిషి నుండే వచ్చినట్లు అనిపిస్తుంది, అయితే, నిజానికి అది పరిశుద్ధాత్మ కార్యమే. రోజువారీ జీవితంలో, ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ గొప్ప మరియు చిన్న కార్యాలు రెండూ చేస్తుంది మరియు ఈ కార్యపు పరిధి మాత్రమే మారుతుంది. కొంతమందిలో మంచి సామర్థ్యం ఉంటుంది, వారు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు మరియు ప్రత్యేకించి వారిలో పరిశుద్ధాత్మ బోధ గొప్పగా ఉంటుంది. ఇదే సమయంలో, కొంతమందిలో తక్కువ సామర్థ్యం ఉంటుంది, వారు విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది, అయితే పరిశుద్ధాత్మ వారి అంతరాత్మను స్పృశిస్తుంది, వారు కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని సాధించగలరు—దేవుని అనుసరించే అందరిలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. రోజువారీ జీవితంలో, మనుష్యులు దేవుడిని వ్యతిరేకించనప్పుడు లేదా తిరుగుబాటు చేయనప్పుడు, దేవుని పాలనకు విరుద్ధమైన పనులు చేయనప్పుడు మరియు దేవుని కార్యంలో జోక్యం చేసుకోనప్పుడు, ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ అంతో ఇంతో పనిచేస్తుంది; ఆయన వారిని స్పృశిస్తాడు, వారికి బోధ, విశ్వాసం అనుగ్రహిస్తాడు, వారికి బలాన్ని చేకూరుస్తాడు మరియు సోమరితనం లేకుండా లేదా దేహ భోగాల వాంఛ లేకుండా, సత్యాన్ని ఆచరించడానికి మరియు దేవుని వాక్యములను ఆకాంక్షించడానికి, చురుకుగా చొచ్చుకుపోయేలా వారిని నడుపుతాడు. ఇదంతా పరిశుద్ధాత్మ నుండి వచ్చే కార్యమే.
వ్యక్తుల స్థితి సాధారణంగా లేనప్పుడు, వారిని పరిశుద్ధాత్మ త్యజిస్తుంది; వారి మనస్సులలో వారు పితూరీలు చేసేవారుగా ఉంటారు, వారి ప్రేరణలు తప్పుగా ఉంటాయి, వారు సోమరులు, వారు దేహ సంబంధ విషయాలలో లీనమై పోతారు మరియు వారి హృదయాలు సత్యానికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతాయి. ఇదంతా సాతాను నుండి వస్తుంది. మనుష్యుల పరిస్థితులు సాధారణంగా లేనప్పుడు, వారి లోపల చీకటి అలుముకున్నప్పుడు మరియు వారు సాధారణ వివేచన కోల్పోయినప్పుడు, వారిని పరిశుద్ధాత్మ త్యజించినప్పుడు మరియు వారు తమలో తాము దేవుణ్ణి అనుభూతి చెందలేనప్పుడు, అదే సాతాను వారిలో పని చేస్తున్న సమయంగా ఉంటుంది. వ్యక్తులలో ఎల్లప్పుడూ బలం ఉంటే మరియు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తే, అదే సాధారణంగా వారిలో మార్పులు సంభవించే సమయంగా ఉంటుంది, ఆ పరివర్తనలు పరిశుద్ధాత్మ నుండి వస్తాయి మరియు వారు ఎవరిని కలుసుకున్నా, ఆ కలయిక దేవుని సంకల్పాల ఫలితమే. అంటే నీవు సాధారణ పరిస్థితిలో ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధాత్మ గొప్ప కార్యం పరిధిలో ఉన్నప్పుడు, సాతాను నిన్ను చలింపజేయడం అసాధ్యం. ఈ ఆధారం ప్రకారం ప్రతిదీ పరిశుద్ధాత్మ నుండి వచ్చినదేనని చెప్పవచ్చు మరియు నీకు తప్పుడు ఆలోచనలు వచ్చినప్పటికీ, నీవు వాటిని త్యజించగలవు మరియు నీవు వాటిని అనుసరించవు. ఇదంతా పరిశుద్ధాత్మ కార్యం నుండే వస్తుంది. ఏ పరిస్థితుల్లో సాతాను జోక్యం చేసుకుంటుంది? నీ పరిస్థితులు అసాధారణంగా ఉన్నప్పుడు, నీకు దేవుని స్పర్శ లేనప్పుడు మరియు నీకు దేవుని కార్యం లేనప్పుడు, నీవు లోలోపల శుష్కించి మరియు బీడువారి ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి ప్రార్థించినా కూడా ఏమీ గ్రహించనప్పుడు మరియు నీవు దేవుని వాక్యములను ఆరగించి, సేవించినప్పటికీ, నీవు బోధ లేదా ప్రకాశం పొందనప్పుడు సాతాను నీలో పని చేయడం సులభమవుతుంది. మరో రకంగా చెప్పాలంటే, నిన్ను పరిశుద్ధాత్మ త్యజించినప్పుడు మరియు నీవు దేవుణ్ణి అనుభూతి చెందలేనప్పుడు, సాతాను ప్రలోభాల నుండి వచ్చిన అనేక విషయాలు నీలో జరుగుతాయి. పరిశుద్ధాత్మ పని చేస్తున్నట్టుగానే, సాతాను కూడా ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ మనిషి అంతరాత్మను స్పృశిస్తుంది, అదే సమయంలో సాతాను మనిషిలో జోక్యం చేసుకుంటుంది. అయినప్పటికీ, పరిశుద్ధాత్మ కార్యం ప్రథమ స్థానం తీసుకుంటుంది మరియు సాధారణ పరిస్థితులు ఉన్న వ్యక్తులు విజయం సాధించగలరు; ఇది సాతాను కార్యంపై పరిశుద్ధాత్మ కార్యం సాధించిన విజయం. పరిశుద్ధాత్మ పని చేస్తున్నా, వ్యక్తులలో అవినీతి స్వభావం ఇంకా ఉంటుంది; అయినప్పటికీ, పరిశుద్ధాత్మ పని సమయంలో, వ్యక్తులు వారి దుర్మార్గాలను, ప్రేరణలను మరియు అశుద్ధీకరణలను కనుగొనడం మరియు గుర్తించడం సులభం. అప్పుడు మాత్రమే వ్యక్తులు అనుతాపం చెంది, పశ్చాత్తాపపడటానికి సిద్ధపడతారు. ఆ విధంగా, వారి దుర్మార్గాలు మరియు అవినీతి స్వభావాలు దేవుని పని పరిధి నుండి క్రమంగా దూరం అవుతాయి. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ కార్యం సాధారణమైనది; వ్యక్తులలో ఆయన పని చేస్తున్నప్పటికీ, వారికి ఇబ్బందులు ఉంటాయి, వారు రోదిస్తూనే ఉంటారు, వారు బాధపడుతూనే ఉంటార, వారు దుర్బలంగానే ఉంటారు మరియు వారికి అర్థం కానిది ఇంకా చాలా ఉంటుంది, అయినప్పటికీ, ఈ స్థితిలో వారు కుంగుబాటు నుండి తమను తాము ఆపగలుగుతారు, వారు దేవుణ్ణి ప్రేమించగలరు, మరియు వారు రోధించినప్పటికీ మరియు బాధలో ఉన్నప్పటికీ, ఇంకనూ వారు దేవుణ్ణి స్తుతించగలరు; ప్రత్యేకించి పరిశుద్ధాత్మ కార్యం సాధారణమైనది, స్వల్పంగా కూడా అతీతమైనది కాదు. పరిశుద్ధాత్మ పనిచేయడం ప్రారంభించిన వెంటనే, వ్యక్తుల స్థితిలో పరివర్తనలు సంభవిస్తాయని మరియు వారికి ప్రధానమైన విషయాలు తొలగించబడతాయని చాలా మంది విశ్వసిస్తారు. అలాంటి విశ్వాసాలు మోసపూరితమైనవి. మనిషిలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు కూడా, మనిషిలో స్తబ్ధంగా ఉన్న విషయాలు అలాగే ఉంటాయి మరియు అతని స్థితి అలాగే ఉంటుంది, కానీ అతను పరిశుద్ధాత్మ ప్రకాశం, బోధను పొందుతాడు మరియు అతని స్థితి మరింత చురుకుగా మారుతుంది, అతనిలోని పరిస్థితులు సాధారణమవుతాయి మరియు అతను వేగంగా పరివర్తన చెందుతాడు. మనుష్యుల వాస్తవ అనుభవాలలో, వారు ప్రధానంగా పరిశుద్ధాత్మ కార్యాన్నిగానీ లేదా సాతాను కార్యాన్నిగానీ అనుభవిస్తారు, వారు ఈ స్థితులను గ్రహించలేకపోతే, మరియు తేడాలను తెలుసుకోలేకపోతే, వాస్తవ అనుభవాలలోకి ప్రవేశించడం అనే ప్రశ్నే లేదు, స్వభావంలో పరివర్తనల గురించి ఇక చెప్పనవసరం లేదు. కాబట్టి, దేవుని కార్యాన్ని అనుభవించడానికి కీలకమైనది ఏదంటే, అటువంటి వాటిని చూడగలగడం మాత్రమే; ఈ విధంగా, వారు దానిని అనుభవించడం సులభం అవుతుంది.
పరిశుద్ధాత్మ కార్యం అనేది ప్రజలను సానుకూల పురోగతి సాధించేలా చేస్తుంది. ఉంటుంది, అయితే సాతాను కార్యం మాత్రం వారిని ప్రతికూలురుగా వెనుదిరిగేలా చేస్తుంది, పరిశుద్ధాత్మ బోధ నుండి ఉద్భవించే ప్రతిదీ చాలా సహజమైనది; అది నీపై బలవంతంగా రుద్దబడదు. నీవు దానికి లోబడితే, నీకు శాంతి ఉంటుంది; నీవు అనుసరించకపోతే, ఆతర్వాత తిరస్కరించబడతావు. పరిశుద్ధాత్మ బోధతో, నీవు చేసే ఏ విషయంలో కూడా జోక్యం ఉండదు లేదా బలవంతం ఉండదు; నీవు స్వేచ్ఛగా ఉంటావు, నీ చర్యలలో సాధన చేయడానికి ఒక మార్గం ఉంటుంది మరియు నీవు ఎటువంటి పరిమితులకు లోబడి ఉండవు కానీ, దేవుని చిత్తానికి అనుగుణంగా పని చేయగలుగుతావు. సాతాను కార్యం అనేక విషయాలలో నీకు అవరోధం కలిగిస్తుంది; అది నిన్ను ప్రార్థించడానికి ఇష్టపడకుండా చేస్తుంది, దేవుని వాక్యములను ఆరగించడానికి మరియు సేవించడానికి చాలా సోమరిని చేస్తుంది, సంఘము జీవితాన్ని గడపడానికి సమ్మతి లేకుండా చేస్తుంది మరియు ఇది నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుండి వేరు చేస్తుంది. పరిశుద్ధాత్మ కార్యం నీ రోజువారీ జీవితంలో జోక్యం చేసుకోదు మరియు నీ సాధారణ ఆధ్యాత్మిక జీవితానికి అంతరాయం కలిగించదు. చాలా విషయాలను అవి సంభవించిన క్షణంలోనే నీవు గ్రహించలేవు, అయినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత, నీ హృదయం ప్రకాశవంతం అవుతుంది మరియు నీ మనస్సు స్పష్టంగా మారుతుంది. పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాల గురించి నీకు కొంత అవగాహన కలుగుతుంది మరియు ఒక ఆలోచన దేవుని నుండి వచ్చిందా లేదా సాతాను నుండి వచ్చిందా అని నీవు నెమ్మదిగా గ్రహించవచ్చు. కొన్ని విషయాలు స్పష్టంగా నిన్ను దేవుణ్ణి వ్యతిరేకించేలా చేస్తాయి మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా చేస్తాయి లేదా దేవుని వాక్యములను ఆచరణలో పెట్టకుండా నిన్ను అడ్డుకుంటాయి; ఇవన్నీ సాతాను నుండి వస్తాయి. కొన్ని విషయాలు స్పష్టంగా కనిపించవు, అవి ఏమిటో నీవు ఆ క్షణంలో చెప్పలేవు; ఆ తర్వాత, వాటి సాక్షాత్కారాలు చూసి, నీవు వివేచన ప్రదర్శించగలవు. సాతాను నుండి వచ్చిన విషయాలు ఏవో, పరిశుద్ధాత్మ ఉపదేశించిన విషయాలు ఏవో నీవు స్పష్టంగా గుర్తించగలిగితే, నీ అనుభవాలలో నీవు సులభంగా దారి తప్పలేవు. కొన్నిసార్లు, నీ పరిస్థితి బాగా లేనప్పుడు, నిన్ను నీ స్తబ్ధత నుండి బయట పడవేసే కొన్ని ఆలోచనలు నీకు ఉంటాయి. నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నీ ఆలోచనల్లో కొన్ని ఇప్పటికీ పరిశుద్ధాత్మ నుండి వస్తాయని ఇది చూపుతుంది. నీవు స్తబ్ధంగా ఉన్నప్పుడు, నీ ఆలోచనలన్నీ సాతాను ద్వారా పంపబడినవి అని అర్థం కాదు; అదే నిజమైతే, నీవు ఎప్పటికి సానుకూల స్థితిలోకి పరివర్తన చెందగలవు? కొంత కాలం పాటు స్తబ్ధంగా ఉన్నందున, పరిపూర్ణంగా తయారయ్యేందుకు పరిశుద్ధాత్మ నీకు అవకాశాన్ని ఇస్తుంది; అది నిన్ను స్పృశించి, నిన్ను నీ స్తబ్ధత స్తితి నుండి బయటకు తెస్తుంది మరియు సహజ స్తితిలోకి ప్రవేశిస్తావు.
పరిశుద్ధాత్మ కార్యం ఏమిటో, సాతాను కార్యం ఏమిటో తెలుసుకోవడం వల్ల, నీవు నీ అనుభవాల స్థితితో ఉన్నప్పుడు వీటిని పోల్చవచ్చు, ఈ విధంగా నీ అనుభవాలలో మూలానికి సంబంధించిన అనేక సత్యాలు ఉంటాయి. మూలాన్ని గురించిన ఈ సత్యాలను అర్థం చేసుకోవడం ద్వారా, నీవు నీ వాస్తవ స్థితిపై విజయం సాధించగలుగుతావు, వ్యక్తులు మరియు సంఘటనల మధ్య తేడాను గుర్తించగలుగుతావు మరియు పరిశుద్ధాత్మ కార్యాన్ని పొందడంలో నీవు ఎక్కువ కృషి చేయవలసిన అవసరం లేదు. వాస్తవానికి, ఇది నీ ప్రేరణలు సరియైనవిగా ఉండటం, నీవు అభ్యసించడానికి మరియు ఆచరించడానికి సుముఖతపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి భాష-మూలానికి సంబంధించిన భాష-ఇది నీ అనుభవాలలో కనిపించాలి. ఇది లేకుంటే, నీ అనుభవాలు సాతాను అవరోధాలతో మరియు మూర్ఖపు జ్ఞానంతో నిండి ఉంటాయి. పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తాడో నీవు అర్థం చేసుకోలేకపోతే, దేవునికి ఎలా ప్రార్థించాలో, లేదంటే, ప్రవేశించవలసిన దానిలోనికి నీవెలా ప్రవేశించాలో నీవు అర్థం చేసుకోలేవు, మరియు సాతాను ఎలా మభ్యపెడుతుందో మరియు మనుష్యులతో ఎలా జోక్యం చేసుకుంటుందో మీకు అర్థం కాకపోతే, సాతానుని ఎలా తిరస్కరించాలో మరియు మీ సాక్ష్యంలో దృఢంగా ఎలా నిలబడాలో మీకు తెలియదు. పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తాడో మరియు సాతాను ఎలా పనిచేస్తుందో మనుష్యులు తప్పక అర్థం చేసుకోవాలి; ఎందుకంటే, దేవుని పట్ల మనుష్యులు కలిగియున్న విశ్వాసంలో ఈ అంశాలు తప్పక అనుభవంలోకి రావాలి.