రాలిన ఆకులు వాటి మూలాల వద్దకు తిరిగి వచ్చినప్పుడు, నీవు చేసిన చెడు పనులకు నీవు చింతిస్తావు
మీ మధ్య నేను చేసిన కార్యమును మీరు మీ కళ్ళార చూసారు, నేను పలికిన మాటలన్నీ మీరు చెవులారా విన్నారు, మీ పట్ల నా స్వభావాన్ని గురించి మీ అందరికీ తెలుసు, అందుకనే నేను మీలో చేస్తున్న ఈ కార్యము ఎందుకు చేస్తున్నానో మీకు తెలిసుండాలి. నిజాయతీగా నేను మీకు చెబుతున్నాను, అంత్య దినముల్లో నా గెలుపు కార్యానికి మీరు ఉపకరణాలు మాత్రమే, అన్య దేశాల్లో నా కార్యాన్ని వ్యాప్తి చేయడానికి మీరే నా పనిముట్లు. అంటే, ఇశ్రాయేలు దేశానికి వెలుపల ఉన్న దేశాల మధ్య నా పేరు వ్యాప్తి చేయడానికీ, నా కార్యమును విస్తరించడానికీ, మీ అనీతిమత్వము, అపరిశుభ్రత, ప్రతిఘటన, తిరుగుబాటు ద్వారా నేను మాట్లాడుతాను. తద్వారా నా పేరు, నా క్రియలు, నా స్వరం అన్య దేశాలంతటా వెదజల్లబడి, ఇశ్రాయేలు కాని దేశాలన్నీ నా చేత గెలువబడి, నన్ను ఆరాధించే దేశాలుగా మారడంతో పాటు ఇశ్రాయేలు మరియు ఐగుప్తు దేశాల వెలుపల అవి నా పరిశుద్ధ స్థలాలు అవుతాయి. నా కార్యము విస్తరణ అంటే, నా విజయపు కార్యము విస్తరణ మరియు నా పరిశుద్ధ స్థల విస్తరణయే; భూమి మీద నా స్థాన బలం విస్తరణను ఇది సూచిస్తుంది. మీరు కేవలం నేను విజయం సాధించిన అన్య దేశాల్లో సృష్టించబడిన వారని మీకు స్పష్టంగా అర్థం కావాలి. వాస్తవానికి, వినియోగించబడుటకు మీకు ఎటువంటి స్థితి లేదా విలువ లేదు. మీరు దేనికీ పనికిరాని వారు. పెంట కుప్ప మీద నుండి పురుగులను లేవనెత్తినట్లుగా నేను మిమ్మల్ని లేవనెత్తడానికి కారణం, ఈ భూమి మొత్తం మీద నా విజయపు నమూనాలుగా, భూమి మొత్తం మీద నా విజయాన్ని “సూచించే వస్తువులు” గా ప్రదర్శించదలిచాను. మీకు ఆమాత్రం అదృష్టం ఉండబట్టే, ఆవిధంగానైనా మీరు నాకు దగ్గరయ్యారు మరియు నాతో సమావేశమయ్యారు. మీ నీచ స్థాయి కారణంగానే, నేను మిమ్మల్ని నా గెలుపు కార్యానికి నమూనాలుగా, ప్రతిరూపాలుగా ఎంచుకున్నాను. కేవలం ఈ కారణం చేతనే నేను మీ మధ్య పనిచేస్తూ, మీతో మాట్లాడుతూ, మీతో నివసిస్తూ, మీ వద్ద ఉంటున్నాను. నా నిర్వహణ వలన, పెంట కుప్ప మీద పురుగులంటే నాకు తీవ్రమైన అసహ్యం వలన, నేను మీ మధ్య మాట్లాడుతున్నానని మీరు తెలుసుకోవాలి. నేను కోపోద్రేకుడనయ్యే స్థాయికి అది చేరింది. మీ మధ్య నా కార్యము అనేది ఇశ్రాయేలు మధ్య యేహోవా దేవుడు చేసిన కార్యము లాంటిది కాదు. ప్రత్యేకించి, యేసు యూదయలో చేసిన కార్యము వంటిది కాదు. గొప్ప ఓర్పుతో నేను మాట్లాడుతున్నాను, పని చేస్తున్నాను. అదే కాకుండా కోపంతో, తీర్పుతో ఈ నశిస్తున్న వారిని నేను జయిస్తున్నాను. యేహోవా దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలులో నడిపించినట్లు కాదు. ఇశ్రాయేలులో ఆయన కార్యము ఆహారాన్ని, జీవ జలాన్ని అందించడం మాత్రమే. వారికి వాటిని అనుగ్రహిస్తూ ఆయన తన ప్రజల యెడల మిక్కిలి ప్రేమను, కనికరాన్ని కలిగి ఉన్నాడు. కానీ, నేటి కార్యము ఎన్నుకోబడని, శపించబడిన దేశపు మనుష్యుల మధ్య జరుగుతుంది. వీరికి సమృద్ధియైన ఆహారం లేదు, దాహం తీర్చి పోషణ నిచ్చే జీవ జలాలు లేవు, సమృద్ధియైన వస్తు సదుపాయాలు అతి తక్కువగా ఉన్నాయి; అధిక తీర్పు, శాపము, దండన మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే, పెంట కుప్ప మీద ఉండే ఈ పురుగులకు పర్వతాలను, అంటే, నేను ఇశ్రాయేలుకు ప్రసాదించిన గొర్రెలు, పశువులు, గొప్ప ధన సంపద, భూమి మీద ఉండే అందమైన పిల్లలు లాంటి పర్వతాలను సంపాదించుకునే అర్హత అస్సలు లేదు. సమకాలిన ఇశ్రాయేలు బలిపీఠం మీద పశువులను, గొర్రెలను, బంగారాన్ని, వెండిని అర్పిస్తారు. వాటితో నేను వారి ప్రజలను పోషిస్తాను. ధర్మశాస్త్రం ప్రకారం, యెహోవా దేవునికి వారు అర్పించాల్సిన పదవ వంతును మించి వారికి నేను మరింత అధికంగా ఇచ్చాను—ధర్మశాస్త్రం క్రింద ఇశ్రాయేలు పొందవలసిన దానికంటే వంద రెట్లు అధికంగా నేను వారికిచ్చాను. అబ్రాహాము పొందిన దానికంటే, యాకోబు పొందిన దానికంటే చాలా చాలా ఎక్కువగా నేను ఇశ్రాయేలు పోషణ కోసం అందించాను. ఇశ్రాయేలు కుటుంబాన్ని నేను ఫలవంతంగా చేసి, అభివృద్ధి చేస్తాను. నా ఇశ్రాయేలు ప్రజలను నేను భూమియందంతట వ్యాపింపజేస్తాను. నేను ఆశీర్వదించి, సంరక్షించేవారు ఇప్పటికీ నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు జనులే. వీళ్లు సమస్తము నాకు సమర్పించుకున్న జనులు, నా నుండి సమస్తాన్ని సంపాదించుకున్న జనులు. ఎందుకంటే వారు నన్ను వారి మనసులో ఉంచుకుంటారు. అందుకనే వారు నా పరిశుద్ధ బలిపీఠం మీద అప్పుడే పుట్టిన తమ దూడలను, గొర్రె పిల్లలను, ఇంకా వారికున్న సమస్తాన్ని నాకు సమర్పించారు. నా రాక కోసం ఎదురుచూస్తూ, వారి తొలిచూలు కుమారులను అర్పించడానికి కూడ వెనుకాడలేదు. మీ సంగతి ఏమిటి? మీరు నా కోపాన్ని రేకెత్తిస్తారు, నా నుండి ఆపేక్షిస్తారు, నాకు అర్పించేవారి నుండి బలులను దొంగిలిస్తారు. మీరు నన్ను నొప్పిస్తున్నారని మీకు తెలుసు. అందుకనే మీరు చీకటిలో ఏడుపును, శిక్షను పొందుకుంటారు. మీరు నా కోపాన్ని అనేకసార్లు రేకెత్తించారు, చాలా మంది విషాదకరమైన అంతాన్ని చూసేవరకు నేను మండే అగ్నిని కురిపించాను, అనందకర నిలయాలు నిర్జీవ సమాధులైనవి. ఈ పురుగుల పట్ల నాకున్నదల్లా అంతము లేని కోపము. వాటిని ఆశీర్వదించే ఆలోచనే నాకు లేదు. నా కార్యము కోసమే నేను మిమల్ని మినహాయించి లేవనెత్తాను, గొప్ప అవమానాన్ని సహించి, మీమధ్య కార్యము చేసాను. నా తండ్రి చిత్తము కాకపోతే, పెంట కుప్ప మీద దొర్లుతున్న పురుగులతో ఒకే ఇంటిలో నేను ఎలా నివశించగలను? మీ క్రియలు, మాటలు నాకు పరమ అసహ్యముగా ఉన్నాయి, కానీ నాకు మీ మురికితనం, తిరుగుబాటుతనంలోనూ కొంత ఆసక్తి ఉంది. అదే నా వాక్యముల గొప్ప సేకరణ అయ్యింది. లేకపోతే, నేను మీ మధ్య ఇంత కాలం ఉండే వాడిని కాను. అందుకనే, మీ పట్ల నా తీరు కేవలం జాలి, దయ అని మీరు తెలుసుకోవాలి; మీ పట్ల నాకు ఒక రవ్వంత ప్రేమ కూడా లేదు. మీ యెడల నాకు కేవలం సహనం మాత్రమే ఉంది, ఎందుకంటే, నా కార్యము గురించే నేను ఇది చేస్తున్నాను. మీరు కేవలం నా కార్యములు మాత్రమే చూసారు, ఎందుకంటే నేను మురికితనాన్ని, తిరుగుబాటును నా “ముడి సరుకుగా” తీసుకున్నాను; లేకపోతే, నేను నా క్రియలను ఈ పురుగులకు అస్సలు బయలుపరిచేవాడిని కాను. నేను మీతో అయిష్టతతో మాత్రమే పని చేస్తున్నానే తప్ప ఇశ్రాయేలులో నేను చేసిన కార్యములాగా సంసిద్ధతతో, అంగీకారంతో పని చేయడం లేదు. నేను నా కోపాన్ని భరిస్తూ, మీ మధ్య మాట్లాడటానికి నన్ను నేను బలవంత పరుచుకుంటున్నాను. నా గొప్ప కార్యము లేకపోతే, ఇలాంటి పురుగులను నేను ఎలా భరించగలను? నా నామం గురించి కాకపోతే, నేను ఎప్పుడో ఎత్తైనా ఉన్నతులను అధిరోహించేవాడిని. ఈ పురుగులను వాటి పెంట కుప్పతో సహా పూర్తిగా దహనం చేసేవాడిని! నా మహిమ గురించి కాకపోతే, ఈ దుష్ట రాక్షసులు నా కళ్ళ యెదుట తమ తలలను ఆడిస్తూ నన్ను బహిరంగంగా ఎదిరించడానికి నేను ఎలా అనుమతించగలను? కొంచెం కూడా ఆటంకం లేకుండా నా కార్యము సజావుగా జరగడానికి తప్పించి ఈ పురుగుల్లాంటి మనుష్యులు నన్ను ధారాళంగా దూషించడానికి ఎలా అనుమతించేవాడిని? ఇశ్రాయేలులో వంద మంది జనులు ఉండే గ్రామము నాకు వ్యతిరేకముగా ఇలా ప్రతిఘటిస్తే, నాకు బలులు అర్పించినా సరే, నేను వారిని సర్వనాశనం చేసి నేలలోని బీటల్లో విసిరిపారేస్తాను. ఇతర పట్టణాల్లోని ప్రజలు నాకు వ్యతిరేకంగా ఇంకెప్పుడూ తిరుగుబాటు చేయకుండా నివారించడానికి ఇలా చేస్తాను. అన్నింటినీ దహించే అగ్నిని నేను, నేరాన్ని సహించను. మానవులందరినీ సృజించినది నేను గనుక, నేను ఏమి చెప్పినా, చేసినా, వాళ్ళు నాకు విధేయత చూపించాలి, తిరుగుబాటు చేయకూడదు. నా పనిలో కల్పించుకునే హక్కు ప్రజలకు లేదు. నా పనిలో, నా మాటల్లో ఏది సరైనదో, ఏది తప్పో అని విశ్లేషించే అర్హత వారికి లేనే లేదు. నేను సృష్టికి ప్రభువును. నేను సృజించిన వారు నా పట్ల గౌరవము కల హృదయముతో నేను కోరినదంతటినీ సాధించాలి; నాతో వాదించడానికి ప్రయత్నించకూడదు, మరీ ముఖ్యంగా నన్ను ఎదిరించకూడదు. నా అధికారంతో నేను నా ప్రజలను పాలిస్తాను. నా సృష్టిలో భాగమైన వారు నా అధికారానికి లోబడి ఉండాలి. నేడు మీరు ధైర్యముగా నా ముందు అట్టహాసంగా ఉన్నా, నేను మీకు బోధించే మాటాలకు అవిధేయత చూపిస్తూ, భయం లేకుండా ఉన్నా, నేను మీ తిరుగుబాటును ఓర్పుతో ఎదుర్కుంటాను; నేను నా సహనాన్ని కోల్పోను, పెంట కుప్ప మీద మురికిని కదిలించిన సూక్షమైన, అల్పమైన పురుగుల వలన నా పని మీద ప్రభావం చూపించనివ్వను. నా తండ్రి చిత్తం కోసం నేను అసహ్యించుకునే, చీదరించుకునేవన్నిటి ఉనికిని భరిస్తాను. నా ఉచ్ఛారణలు సంపూర్తి అయ్యేవరకు, నా చివరి క్షణం వరకు నేను భరిస్తాను. చింతించకండి! పేరు లేని పురుగు స్థాయికి నేను దిగజారను, నీ నేర్పరితనపు స్థాయితో నన్ను నేను పోల్చుకోను. నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను కానీ భరించగలుగుతున్నాను. నీవు నాకు అవిధేయత చూపించవచ్చు కానీ, నేను నిన్ను దండించే దినాన్ని నీవు తప్పించుకోలేవు. అది నా తండ్రి చేత నాకు వాగ్ధానం చేయబడింది. సృజింపబడిన పురుగును సృష్టి కర్తతో సరిపోల్చగలరా? శరత్కాలంలో రాలే ఆకులు తమ మూలాల వద్దకు తిరిగి చేరుతాయి; నీవు కూడ తిరిగి నీ “తండ్రి” ఇంటికి వెళ్ళవలసిందే, నేను నా తండ్రి పక్కకు తిరిగి వెళ్తాను. ఆయన మృదువైన ప్రేమ చేత నేను కప్పబడతాను. నిన్ను నీ తండ్రి అణచివేత వెంబడిస్తుంది. నాకు నా తండ్రి మహిమ ఉంటుంది, నీకు నీ తండ్రి అవమానం ఉంటుంది. నిన్ను వెంబడించాల్సిన నేను, ఇప్పటి వరకు ఆపిన దండనను ఉపయోగిస్తాను. పదివేల సంవత్సరాలు పాడైన కుళ్లిన శరీరంతో నీవు నా దండనను ఎదుర్కుంటావు. నీలో నా మాటల కార్యాన్ని ఓర్పుతో నేను ముగించియుంటాను, నీవు నా మాటల నుండి వచ్చే శ్రమల ఉపద్రవపు పాత్రను నెరవేర్చడం ప్రారంభిస్తావు. నేను అత్యానందంగా ఇశ్రాయేలులో నా పని చేస్తాను; నీవు ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ, మట్టిలో జీవిస్తూ మరణిస్తూ ఉంటావు. నేను నా స్వాభావిక రూపాన్ని తిరిగి పొందుకుని ఇకపై నీతో మురికిలో ఉండను. నీవైతే నీ అసలైన అందవిహీన స్థితికి వచ్చి పెంట కుప్పలో చొచ్చుకుని వెళ్తూ ఉంటావు. నా కార్యము, నా మాటలు ముగించిన దినమనేది నాకు ఆనందకరమైన దినముగా ఉంటుంది. నీ వ్యతిరేకత, తిరుగుబాటు ముగిసిన తర్వాత, నీకు అది ఏడుపు దినమవుతుంది. నేను నీకు సానుభూతి చూపించను, నీవు ఇంకెన్నటికీ నన్ను చూడవు. నేను ఇంకెప్పుడూ నీతో మాట్లాడను, నీవు ఇంకెన్నటికీ నన్ను ఎదుర్కోవు. నీ తిరుగుబాటుతనాన్ని నేను అసహ్యించుకుంటాను, నా సౌందర్యాన్ని నీవు కోరుకుంటావు. నేను నిన్ను మొత్తుతాను, నీవు నా కోసం తపిస్తావు. నేను సంతోషంగా నీ వద్ద నుండి వెళ్లిపోతాను, నీవు నాకు చెల్లించాల్సిన అప్పును తెలుసుకుంటావు. నేను ఇంకెన్నటికీ నిన్ను చూడను, కానీ నీవు నా కోసం నిరీక్షిస్తూనే ఉంటావు. నీవు ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నావు గనుక నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను, నిన్ను ప్రస్తుతం నేను దండిస్తున్నాను గనుక నీవు నన్ను గుర్తుకు తెచ్చుకుంటున్నావు. నీ పక్కన జీవించడానికి నాకు ఇష్టం లేదు, కానీ నీవు తీవ్రంగా నా కోసం తపించి నిత్యత్వం వరకు ఏడుస్తావు, ఎందుకంటే, నాకు చేసినదంతటి గురించి నీవు విచారిస్తావు. నీ వ్యతిరేకత, తిరుగుబాటుతనం బట్టి నీవు పశ్చాత్తాపం చెందుతావు. పశ్చాత్తాపముతో నీవు నేల మీద ముఖమానించి పండుకొని, నా ముందు పడి, ఇంకెన్నాడూ నాకు అవిధేయత చూపించనని ప్రమాణం చేస్తావు. అయితే, నీ హృదయంలో నీవు కేవలం నన్ను ప్రేమిస్తావు, అయిననూ నీవు నా స్వరాన్ని వినలేవు. నేను నిన్ను సిగ్గుపడేలా చేస్తాను.
ఇప్పుడు నేను భోగము అనుభవించే నీ శరీరాన్ని చూస్తున్నాను. అది నన్ను ముగ్ధుని చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను నిన్ను దండనతో “సేవించక” పోయినా, నీకు కేవలం చిన్న హెచ్చరిక మాత్రమే ఉంది. నా పనిలో నీ పాత్ర ఏమిటో నీకు తెలియాలి, అప్పుడు నేను తృప్తి చెందుతాను. ఈ విషయాలకు మించిన వాటిలో, నీవు నాకు వ్యతిరేకత చూపించినా, లేదా నా ధనాన్ని ఖర్చుచేసినా, యెహోవానైన నా కోసం అర్పించిన బలులను తిన్నా, లేదా పురుగులైన మీరు ఒకరినొకరిని కొరికినా, లేదా కుక్కలాంటి జంతువులైన మీరు గొడవలు కలిగి లేదా ఒకరితో ఒకరిని హింసించుకుంటే—నేను వాటికి దేనిలోను బాధ్యుడను కాను. మీరు ఎలాంటి వారో మీకు తెలియాలి, అప్పుడు నేను తృప్తి చెందుతాను. ఇవన్నీకాకుండా, మీరు ఒకరి మీద ఒకరు ఆయుధాలను ఉపయోగించుకోవాలని, మాటలతో ఒకరితో ఒకరు యుద్ధం చేయాలని అనుకుంటే, నాకేమి అభ్యంతరం లేదు; అలాంటి విషయాల్లో కల్పించుకోవాలని నాకు లేదు, ఇలాంటి మానవ విషయాల మీద నాకు అస్సలు ఆసక్తి లేదు. మీ మధ్య గొడవల్లో నాకు ఆసక్తి లేదని కాదు; నేను మీలో ఒకడిని కాదు కాబట్టి, నేను మీ మధ్య జరిగే విషయాలలో పాలుపంచుకోను. నేను సృజించబడిన జీవిని కాను, ఈ లోకానికి చెందిన వాడిని కాను. అందుకనే ప్రజల తీరికలేని జీవితాలను, వారి మధ్య ఉండే గందరగోళ, అక్రమ సంబంధాలను నేను అసహ్యించుకుంటాను. ప్రత్యేకించి గోల చేసే గుంపు అంటే నాకు అసహ్యం. అయితే, సృజించిన ప్రతి వానిలోని హృదయపు మాలీన్యాల గురించి నాకు అధిక జ్ఞానం ఉంది. మిమ్మల్ని సృజింపక ముందే, మానవ హృదయాంతరాల్లో దాగి ఉన్న అనీతిమత్వం గురించి నాకు తెలుసు. మానవ హృదయంలో ఉన్న మోసం, వంకరితనం అన్నీ నాకు తెలుసు. అందుకనే, మనుషులు అనీతి కార్యాలు చేసినపుడు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, మీ హృదయాల్లో దాగి ఉన్న అనీతిమత్వం నేను సృజించిన ఐశ్వర్యాన్నంతటినీ అధిగమిస్తుందని నాకు తెలుసు. మీలో ప్రతి ఒక్కరు జనసమూహాల శిఖరానికి ఎదిగారు; ప్రజానికపు పూర్వీకులుగా ఉండే స్థితికి అధిరోహించారు. మీరు అతిగా నిర్హేతుకులై, అన్ని పురుగుల మధ్య ఇష్టంవచ్చినట్లు పరుగెడుతూ, సుఖమైన ప్రదేశం కోసం వెదుకుతూ, మీకంటే చిన్నవైన పురుగులను మింగివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ హృదయాల్లో మీరు ద్వేషపూరితమైన, దుష్టత్వాన్ని కలిగి, సముద్రపు లోపల మునిగిపోయిన దెయ్యాలను సైతం అధిగమించారు. పెంట అడుగున నివశిస్తూ, పైనుండి కిందవరకున్న పురుగులను విసిగిస్తూ, వాటికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అవి కొంత సేపు ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ తిరిగి సమాధానపడతాయి. మీకు మీ స్థానం తెలియదు, అయినా ఒకరితో ఒకరు ఆ పెంటలో యుద్ధం చేస్తారు. అలాంటి పోరాటం నుండి మీరు ఏమి సంపాదించుకుంటారు? మీ హృదయాల్లో మీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే, నా వెనుక ఎందుకలాగ ఒకరితో ఒకరు కొట్టుకుంటాjg? నీ స్థితి ఎంత గొప్పదైనా, నీవు కేవలం పెంటలో కంపుకొట్టే ఒక చిన్న పురుగువి కావా? నీకు రెక్కలొచ్చి ఆకాశంలో పావురముగా మారగలవా? కంపుకొట్టే చిన్న పురుగులైన మీరు యెహోవానైన నా బలిపీఠం మీద అర్పించే ఆహారాన్ని దొంగిలిస్తారు; అలా చేయడం వలన, నాశనమైన, పాడైన నీ ప్రతిష్టతను దక్కించుకొని, ఎన్నుకోబడ్డ ఇశ్రాయేలు ప్రజలవ్వగలరా? మీరు సిగ్గులేని నీచులు! నన్ను అరాధించే ప్రజలు తమ దయగల భావాల వ్యక్తీకరణగా బలిపీఠం మీద బలులు నాకు అర్పించారు. అవి నా ఆధిపత్యం, నా వినియోగం కోసం. ప్రజలు నాకర్పించిన చిన్న గువ్వలను నీవు ఎలాగు దొంగిలిస్తావు? ఒక యూదాలాగా అవుతావని నీవు భయపడటం లేదా? నీ నేల ఒక రక్త భూమి అవుతుందని నీకు భయము లేదా? సిగ్గుమాలినవాడా! ప్రజలు నాకర్పించిన గువ్వలను పురుగులాంటి నీ కడుపును నింపడానికని అనుకుంటున్నావా? నేను నీ కిచ్చింది నేను తృప్తితో, ఇష్టంతో నీకు ఇచ్చాను; నీకు ఇవ్వనిది నా అమరికలో ఉంది. నీవు నా అర్పణలను దొంగిలించలేవు. పనిచేసేది యెహోవానైన నేనే—సృష్టికర్తయైన ప్రభువు—ప్రజలు నాకు బలులు అర్పిస్తారు. నీవు అటూ ఇటూ పరిగెడుతూ పనిచేస్తున్న దానికి ఇది పరిహారమవుతుందని అనుకుంటున్నావా? నీవు నిజముగా సిగ్గుమాలినవాడివి! నీవు ఎవరి కోసం పరిగెడుతున్నావు? నీ గురించి కాదా? నీవు నా అర్పణలను ఎందుకు దొంగిలిస్తున్నావు? నా డబ్బు సంచి నుండి నీవు ఎందుకు దొంగిలిస్తున్నావు? యూదా ఇస్కరియోతు కుమారుడివి కావా నీవు? యెహోవానైన నాకు అర్పించే బలులను యాజకులు ఆనుభవించాలి. నీవొక యాజకుడివా? నీవు ప్రసన్నతతో నా అర్పణలను తినడమే కాకుండా, వాటిని బల్ల మీద కూడా పరుస్తున్నావు; నీవు దేనికీ పనికిరావు! పనికిరాని దౌర్భాగ్యుడా! నా అగ్ని, యేహోవా అగ్ని, నిన్ను దహించి వేయును!