దేవుడు తనకు తానే అద్వితీయుడు II

నీతియుక్తమైన దేవుని స్వభావం

దేవుని అధికారం గూర్చిన మునుపటి సహవాసమును మీరు వినియున్నారు కాబట్టి, ఈ విషయమై మీరు అనేకమైన మాటల చేత మంచి అవగాహన కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. మీరు దానిపై కృషి చేసిన దానిని బట్టి మీరు దానిని ఎంతగా అంగీకరించి, గ్రహించి మరియు అ bbbర్థం చేసుకొనియున్నారనేది ఆధారపడియుంటుంది. ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను; ఏ విధమైన అయిష్టతతోనూ మీరు ఇందులో పాల్గొనకూడదు! ఇప్పుడు, దేవుని అధికారం గురించి తెలుసుకోవడం అనేది దేవుని నిత్యత్వం గురించి తెలుసుకోవడంతో సమానమేనా? దేవుని అధికారమును తెలుసుకోవడం అనేది దేవుని ప్రత్యేకతను తెలుసుకొనుటకు ఆరంభమని ఒకరు చెప్పవచ్చు, అలాగే, దేవుడి అధికారమును తెలుసుకోవడమంటే, తనకు తానే విశిష్టమైన దేవుని గుణగణాలను తెలుసుకునేమార్గమందు ఆ వ్యక్తి అడుగుపెట్టినట్టు అర్థమని కూడా ఒకరు చెప్పవచ్చు. ఈ అవగాహన దేవుని గురించి తెలుసుకోవడంలో ఒక భాగం. అయితే, మరొక భాగం ఏమిటి? నేడు నేను ఈ విషయాన్నే పంచుకోవాలనుకుంటున్నాను, అదే—నీతియుక్తమైన దేవుని స్వభావం.

నేటి అంశం గురించి పంచుకోడానికి నేను బైబిల్ నుండి రెండు భాగాలను ఎంచుకున్నాను: మొదటిది దేవుడు సొదొమను నాశనం చేయడం గురించి, దీనిని మనం ఆదికాండం 19:1-11 మరియు ఆదికాండం 19:24-25 లో చూడవచ్చు; రెండవది దేవుడు నినెవేను విమోచించిన దాని గురించి, దీనిని మనం యోనా 1:1-2 లో, యోనా గ్రంధంలోని మూడు మరియు నాలుగు అధ్యాయాలలోను చూడవచ్చు. ఈ రెండు భాగములను గూర్చి నేను చెప్పవలసిఉన్నదాన్ని మీరు వినుటకు వేచి ఉన్నారని నేను అనుకొనుచున్నాను. నేను సహజంగా చెప్పే విషయాలు దేవుడిని తెలుసుకోవడం మరియు ఆయన గుణలక్షనాలను తెలుసుకోవడం అనే పరిదిని దాటిపోదు, అయితే నేటి సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైయున్నది? మీలో ఎవరికైనా తెలుసా? దేవుని అధికారంపైన నా ప్రసంగంలోని ఏ భాగాలు మీ దృష్టిని ఆకర్షించాయి? అటువంటి అధికారం మరియు శక్తి కలిగియున్నవాడే దేవుడని నేను ఎందుకు చెప్పాను? దీనిని చెప్పడం ద్వారా నేను ఏమి స్పష్టం చేయాలనుకుంటున్నాను? మీరు దీని నుండి ఏమి నేర్చుకోవాలని నేను ఆశించాను? దేవుని అధికారం మరియు శక్తి ఆయన గుణలక్షణాలను తెలియజేసే ఒక విధానమా? అవి ఆయన గుణలక్షణాలలో భాగమైయుండి, ఆయన గుర్తింపు మరియు ఆయన స్థానమును నిరూపించు ఒక భాగమైయున్నాయా? ఈ ప్రశ్నలను పరిగణలోనికి తీసుకొని నేను ఏమి చెప్పాలని ఉద్దేశించియున్నానో మీరు చెప్పగలరా? మీరు ఏమి అర్ధం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను? దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి.

దేవుడిని మొండిగా వ్యతిరేకించిన కారణంగానే, దేవుని కోపము చేత మనిషి నాశనమయ్యాడు

మొదట, దేవుడు సొదొమను నాశనం చేయడం గురించి వివరించే అనేక వాక్య భాగాలను చూద్దాం.

ఆది 19:1-11 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి; లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను: లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి; సాష్టాంగ నమస్కారము చేసి; నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు; నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు; వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి; అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా, వారు భోజనముచేసిరి. వారు పండుకొనక ముందు, ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచి—ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి, తన వెనుక తలుపువేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు; సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి: ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు. గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు, వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి, తీర్పరిగానుండ చూచుచున్నాడు: కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి, లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా, వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

ఆది 19:24-25 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి; ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని, నేల మొలకలను నాశనము చేసెను.

ఈ వాక్య భాగాలను గమనిస్తే, సొదొమ పట్టణపు దుష్టత్వము మరియు భ్రష్టత్వము మనిషి గానీ దేవుడు గానీ సహించలేనంత తారాస్థాయికి చేరియుందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ పట్టణం నాశనం కాకముందు ఆ పట్టణములో ఏమి జరిగింది? ఆ సంఘటనల నుండి ప్రజలు ఎటువంటి స్పూర్తిని పొందుకోగలరు? ఆ సంఘటనల పట్ల దేవుడు కలిగియున్న వైఖరి ద్వారా తన స్వభావమును గూర్చి ఆయన ప్రజలకు ఏమి సూచించుచున్నాడు? ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, లేఖనాలలో దీనిని గూర్చి ఏమి వ్రాయబడియున్నదో జాగ్రతగా చదువుకుందాం...

సొదొమ అవినీతి: మనిషిని రెచ్చగొట్టడం, దేవునికి కోపం పుట్టించడం

ఆ రాత్రి, దేవుని వద్ద నుండి వచ్చిన ఇద్దరు దూతలను లోతు చేర్చుకుని వారికి విందు సిద్ధం చేశాడు. భోజనమైన తరువాత, వారు పడుకునే ముందు, పట్టణం నలుమూలల నుండి ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి అతనిని పిలిచారు. లేఖనములో వారు ఇలా చెప్పినట్లు రాయబడియున్నది, “ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా.” ఈ మాటలను ఎవరు చెప్పారు? వారు ఎవరితో మాట్లాడారు? ఈ మాటలను సొదొమ పట్టణ ప్రజలు, లోతు ఇంట బయట అతడు వినాలనే ఉద్దేశంతో గట్టిగా అరచి చెప్పిన మాటలు. ఈ మాటలు వినడానికి ఎలా ఉన్నాయి? నీకు కోపంగా ఉందా? ఈ మాటలు నీకు అసహ్యం కలిగిస్తున్నాయా? నీవు ఆవేశంతో ఉడికిపోతున్నావా? ఈ మాటలు సాతాను నుండి వెలువడే దుర్గంధం వంటివి కావా? వీటి ద్వారా, పట్టణములోని దుష్టత్వమును మరియు అంధకారమును నీవు గ్రహించగలవా? వారి మాటలను బట్టి ఈ ప్రజల ప్రవర్తనలోని క్రూరత్వమును ఆటవికతని నీవు గ్రహించగలవా? వారి ప్రవర్తన బట్టి వారి భ్రష్టత్వపు తీవ్రతను నీవు గ్రహించగలవా? వారు మాట్లాడే ధోరణి బట్టి, వారి చెడు స్వభావం మరియు క్రూరత్వపు వైఖరి వారి వారి నియంత్రణకు మించిన స్థాయికి చేరుకుందనే విషయం గమనించడం కష్టమేమి కాదు. లోతు తప్ప, ఈ పట్టణంలోని ప్రతి వ్యక్తి సాతానుకు భిన్నంగా ఏమీ లేడు; వేరొక వ్యక్తిని చూచిన వెంటనే అతనిని హానిపరచి మరియు వారిని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు.... ఈ విషయాలు ఎవరికైనా ఆ పట్టణపు ఘోరమైన స్థితిని మరియు భయానకమైన స్వభావాన్ని తెలియజేయడమే కాకుండా, ఆ పట్టణమును చుట్టియున్న మరణ ఛాయలను, దాని దుష్టత్వము మరియు రక్తసిక్తమైన దాని స్థితిని కూడా తెలియజేస్తాయి.

అతను అమానుషమైన క్రూరుల ముఠాతో ముఖాముఖిగా ఎదురుపడినప్పుడు, మనుష్యుల ప్రాణాలను మ్రింగి వేయాలనే క్రూరమైన ఆశతో నిండిన ప్రజలతో, లోతు ఎలా స్పందించాడు? లేఖనముల ప్రకారం: “అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు; సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి: ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు. గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు.” ఈ మాటలలో లోతు ఉద్దేశం ఏమిటంటే: దూతలను కాపాడటానికి లోతు తన ఇద్దరు కుమార్తెలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఏదైనా సహేతుకమైన లెక్క ప్రకారం, ఈ ప్రజలు లోతు షరతులకు ఒప్పుకొని, ఆ ఇద్దరు దూతలను విడిచిపెట్టి ఉండాలి; అన్నింటికంటేఆ దూతలు వారికి పూర్తిగా అపరిచితులు, వారితో ఎటువంటి సంబంధం లేని వారు, మరియు వారి ప్రయోజనాలకు ఎప్పుడూ హాని కలిగించని వారు. అయినప్పటికీ, వారి చెడు స్వభావం ద్వారా ప్రేరేపించబడి, ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు, బదులుగా వారి ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇక్కడ, ఈ ప్రజలు తమ మాటల ద్వారా తమ ఘోరమైన నిజ స్వభావమును గూర్చి ప్రజలకు నిస్సందేహంగా తెలియజేస్తున్నారు, అంతేగాక దేవుడు ఈ పట్టణమును ఎందుకు నాశనం చేస్తున్నాడోనని ప్రజలు గ్రహించి, అర్థం చేసుకునే విధంగా చేస్తారు.

ఆ తరువాత వారు ఏమి చెప్పారు? వాక్యంలో చదివిన ప్రకారం: “వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి, తీర్పరిగానుండ చూచుచున్నాడు: కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి, లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.” వారు ఎందుకు లోతు తలుపును పగలగొట్టాలనుకున్నారు? ఎందుకంటే వారు ఆ ఇద్దరు దూతలకు హాని కలిగించాలని ఆత్రుతగా ఉన్నారు. ఆ దూతలు సొదొమకు ఎందుకు వచ్చారు? లోతును అతని కుటుంబాన్ని కాపాడటానికి వచ్చారు, కానీ పట్టణ ప్రజలు వారి అధికారిక పదవులను తీసుకోవడానికి వచ్చారనుకొని పొరపాటుపడ్డారు. దూతల ఉద్దేశాన్ని అడగకుండానే, పట్టణ ప్రజలు తమ ఊహను ఆధారం చేసుకొని ఈ ఇద్దరు దూతలను ఘోరంగా హానిపరచాలని తలంచారు; వారితో ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులకు హాని తలపెట్టాలని కోరుకున్నారు. ఈ పట్టణ ప్రజలు వారి మానవత్వాన్ని మరియు వివేకమును పూర్తిగా కోల్పోయారని స్పష్టమైంది. వారి వెర్రితనము మరియు క్రూరత్వాల స్థాయి, మనుష్యులను హానిపరచి మ్రింగివేయాలనే సాతాను దౌర్జన్యపు స్వభావముకు ఏవిధంగాను భిన్నంగా లేదు.

ఈ వ్యక్తులను అప్పగించాలని వారు లోతును కోరినప్పుడు, లోతు ఏమి చేశాడు? లోతు వారిని అప్పగించలేదని లేఖన భాగమునుండి మనకు తెలుస్తుంది. ఈ ఇద్దరు దేవదూతలు లోతుకు తెలుసా? నిజానికి తెలియదు! అయినప్పటికీ ఈ ఇద్దరు వ్యక్తులను అతను ఎందుకు కాపాడగలిగాడు? వారు ఏమి చేయడానికి వచ్చారో అతనికి తెలుసా? వారు రావడానికి గల కారణం అతనికి తెలియకపోయినప్పటికీ, వారు దేవుని సేవకులని అతనికి తెలుసు, అందుకని అతను వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతను ఈ ఇద్దరు దేవుని సేవకులను “ప్రభువు” అనే పేరుతో పిలవడం చూస్తే లోతు సొదొమలోని ఇతర ప్రజల లాగా కాకుండా దేవుణ్ణి అలవాటుగా వెంబడించేవాడని తెలుస్తుంది. అందువల్ల, దేవుని దూతలు అతని దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ఇద్దరు సేవకులను తన ఇంటిలోనికి తీసుకెళ్ళడానికి తన జీవితాన్ని సైతం పణంగా పెట్టాడు; అంతేకాకుండా, ఈ ఇద్దరు సేవకులను కాపాడటానికి తన ఇద్దరు కుమార్తెలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది లోతు యొక్క నీతియుక్తమైన పని; ఇది లోతు స్వభావము మరియు గుణగణాలకు స్పష్టమైన వ్యక్తీకరణ, లోతును రక్షించడానికి దేవుడు తన సేవకులను పంపడానికి గల కారణం కూడా ఇదే. అపాయమును ఎదుర్కున్నప్పుడు, ఏదీ పట్టించుకోకుండా లోతు ఈ ఇద్దరు సేవకులను కాపాడాడు; సేవకుల భద్రతకు బదులుగా అతను తన ఇద్దరు కుమార్తెలను ఇవ్వడానికి సహితం ప్రయత్నించాడు. లోతు తప్ప, పట్టణం లోపల ఇంకెవరైనా ఇలాంటిది ఏమైనా చేశారా? నిజానికి-ఎవరూ లేరని రుజువు చేయబడింది! అందువల్ల, లోతు తప్ప, సొదొమలోని ప్రతి ఒక్కరూ నాశనాన్ని గురిగా కలిగి ఉన్నారని చెప్పనవసరం లేదు, నిజానికి- వారు దీనికి అర్హులు.

దేవుని ఉగ్రతను అగౌరవపరచినందున సొదొమ పూర్తిగా నాశనం చేయబడింది

సొదొమ ప్రజలు ఈ దూతలు ఇద్దరినీ చూసినప్పుడు, తమ రాకకుగల కారణమేమిటనీ వారు అడుగలేదు, లేదా వారేమైనా దేవుని చిత్తాన్ని విస్తరింపజేయడానికి వచ్చారా అని ఎవరూ అడగలేదు. అందుకు వ్యతిరేకంగా, వివరణ కోసం ఎదురుచూడకుండా, వారొక సమూహంగా ఏర్పడి, క్రూరమైన తోడేళ్ళ వలె, లేక అడవి కుక్కల వలె ఈ ఇద్దరు దూతలను బలాత్కారంగా పట్టుకోడానికి వచ్చారు. ఈ సంగతులు సంభవించినప్పుడు వాటిని దేవుడు చూశాడా? ఈ విధమైన మానవ నడవడికను గూర్చి, ఇలాంటి సంఘటన గూర్చి దేవుడు తన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నాడు? ఈ పట్టాణాన్ని నాశనం చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు; ఆయన ఇక వెనుకాడడు లేక ఎదురుచూడడు, లేదా ఇక ఆయన ఏమాత్రమూ సహనాన్ని కనుపరచడు. ఆయన దినము రానేవచ్చింది, కావున ఆయన చేయాలని ఆశించిన కార్యాన్ని మొదలుపెట్టాడు. అందుకనే, ఆదికాండము 19:24-25 వచనాలు, “అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించాడు; ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేశాడు” అని సెలవిస్తున్నాయి. ఈ రెండు వచనాలు దేవుడు ఈ పట్టాణాన్ని నాశనం చేసిన విధానాన్ని, అలాగే దేవుడు నాశనం వాటి గురించి తెలుపుచున్నాయి. మొదటిగా, దేవుడు పట్టణాన్ని అగ్నితో కాల్చివేశాడని, ఈ అగ్ని మనుషులందరినీ మరియు నేలపై మొలిచిన మొత్తాన్ని నాశనం చేయడానికి సరిపడా తీవ్రతను కలిగి ఉన్నదని బైబిల్ వర్ణిస్తుంది. చెప్పాలంటే, ఆకాశము నుండి కురిసిన అగ్ని, పట్టణాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు గాని, అది ఏ ఒక్కదాని ఆచూకి కూడా మిగలనంతగా అందులోని మనుషులందరినీ మరియు జీవరాశులన్నిటినీ నాశనం చేసిందని చెప్పవచ్చు. పట్టణం నాశనం చేయబడిన తరువాత, ఆ ప్రాంతం జీవరాశులులేని నిరాధార ప్రాంతంగా మిగిలిపోయింది; ఇక అక్కడ ప్రాణాధారము ఏ మాత్రమూ లేదు, లేదా ప్రాణాధారానికి సంబంధించిన ఎలాంటి సూచనలు లేవు. పట్టణము ఒక నిర్మానుష్య ప్రాంతంగా, భయంకరమైన నిశ్శబ్దంతో నిండిన ఒక ఖాళీ ప్రదేశంగా మారిపోయింది. ఇకపై ఈ ప్రాంతంలో దేవునికి విరోధంగా చేసిన దుర్మార్గపు క్రియలు ఉండవు, వధించడం లేక రక్తాన్ని ఒలికించడమనేది ఇక ఎన్నడూ ఉండదు.

దేవుడు ఈ పట్టణాన్ని అంత పూర్తిగా ఎందుకు దహించి వేయాలనుకున్నాడు? మీరిక్కడ ఏమి చూడొచ్చు? మానవజాతి మరియు ప్రకృతి, స్వతహాగా ఆయన చేసిన సృష్టి మొత్తంఈ విధంగా నాశనం అవుతుంటే నిజంగా దేవుడు చూసి తట్టుకోగలడా? ఆకాశము నుండి కురిసిన అగ్ని నుండి యెహోవా దేవుని ఆగ్రహాన్ని గనుక నీవు గ్రహించగలిగితే, ఆయన నాశనానికి గురైన లక్ష్యాలను మరియు ఈ పట్టణం ఏ మేరకు తుడిచిపెట్టబడిందో అంచనా వేయడం ద్వారా, ఆయన ఆగ్రహము ఎంత గొప్పదో తెలిసికోవడం కష్టమేమీ కాదు. దేవుడు ఒక పట్టణాన్ని తృణీకరించినప్పుడు, ఆయన దానిపై తన శిక్షను పంపుతాడు. దేవుడు ఒక పట్టణాన్ని అసహ్యించుకున్నప్పుడు ఆయన తన కోపాన్ని ప్రజలకు తెలియజేయడానికి పలుమార్లు హెచ్చరిస్తాడు. ఏదేమైనప్పటికి, దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేసి అంతం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆయన ఉగ్రత మరియు ఆయన ప్రభావము అవమానించబడ్డాయని అర్థం, అప్పుడు ఆయన ఇక శిక్షలు గాని, లేక హెచ్చరికలు గాని ఇవ్వడు. అందుకు బదులుగా, ఆయన నేరుగా దానిని నాశనం చేస్తాడు. ఆయన దానిని బొత్తిగా తుడిచివేస్తాడు. ఇది దేవుని నీతి స్వభావమైయున్నది.

సొదొమ ఆయన పట్ల శతృత్వాన్ని మరియు ప్రతిఘటనను పునరావృత్తం చేసిన తరువాత, దేవుడు దానిని పూర్తిగా తుడిచి పెట్టాడు

మనకిప్పుడు దేవుని నీతి స్వభావమును గూర్చి ఒక సాధారణ అవగాహన కలిగియున్నాము గనుక, దేవుడు పాపపు పట్టణముగా పరిగణించిన ప్రదేశమైన సోదోమ పట్టణం వైపు మనం మన దృష్టిని మళ్ళించవచ్చు. ఈ పట్టణపు స్వభావాన్ని అవగాహన చేసుకోడాన్ని బట్టి, దేవుడు ఎందుకు దానిని నాశనం చేయాలనుకున్నాడో మరియు ఆయన దానిని ఎందుకు అంత సమూలంగా ధ్వంసం చేశాడో మనము గ్రహించగలము. దీనిని బట్టి, మనము దేవుని నీతి స్వభావాన్ని తెలిసికొనగలము.

మానవ దృష్టి కోణం నుండి చూస్తే, సొదొమ అనేది మానవుని కోరికను మరియు మానవుని దుర్మార్గాతను సంపూర్ణంగా తృప్తిపరచగలిగే ఒక పట్టణమై ఉన్నది. ఆకర్షణీయమైన మరియు మనోహరమైన, సంగీత నృత్యాలతో రాత్రుళ్ళు తరబడి, దాని సౌభాగ్యము మనుషులను ఆకర్షితులయ్యే విధంగా చేసి, పిచ్చితనానికి నడిపించింది. దాని దుర్మార్గత ప్రజల హృదయాలను హరించివేసి, వారిని దుర్మార్గతలో బంధించింది. ఇది అపవిత్రమైన దురాత్మలు ఉన్మాదంగా సంచరించిన ఒక పట్టణము; ఇది పాపముతోను, హత్యతోను నిండిపొయింది మరియు గాలి రక్తమయమై, కుళ్ళిన దుర్వాసనతో దట్టమైపోయింది. ఇది ప్రజలను మరణానికి నడిపించిన ఒక పట్టణముగా, భీతితో బహుగా కృశించిన ఒక పట్టణముగా ఉన్నది. ఈ పట్టణంలో పురుషులు గాని, లేక స్త్రీలు గాని, యౌవ్వనులు గాని, లేకవృద్దులు గాని, ఏ ఒక్కరూ సత్య మార్గాన్ని వెదకలేదు; ఎవరూ వెలుగు కొరకు తాపత్రయపడలేదు, లేక పాపము నుండి వైదొలగాలని ఆశించలేదు. వారు సాతాను నియంత్రణలో జీవించారు, సాతాను చెడుతనము మరియు వంచన క్రింద జీవించారు ఉన్నారు. వారు తమ మానవ ఉనికిని పోగొట్టుకున్నారు, వారు తమ వివేచనను పోగొట్టుకున్నారు మరియు వారు మానవ అస్తిత్వపు వాస్తవమైన లక్ష్యాన్ని కోల్పోయారు. దేవునికి విరోధముగా వారు లెక్కలేనన్ని దుష్క్రియలకు పాల్పడ్డారు; వారాయన నేతృత్వాన్ని కాదని ఆయన చిత్తాన్ని ఎదిరించారు. వారి దుష్క్రియలే ఈ జనులను, పట్టణాన్ని, అందులో జీవించే ప్రతి దానిని దశలవారీగా నాశన మార్గంలోనికి కొనిపోయాయి.

ఈ రెండు భాగాలు సొదొమ ప్రజల చెడుతనపు విస్తృతికి చెందిన వివరాలన్నిటినీ నమోదు చేయకపోయినా, దానికి బదులు, ఆ ఇద్దరు దేవుని దాసులు పట్టణానికి వచ్చిన తరువాత తమ పట్ల వారి ప్రవర్తనను నమోదు చేయడం, సొదొమ ప్రజలు ఏ మేరకు చెడిపోయారో, దుష్టులై దేవుడినే వ్యతిరేకించారో వెల్లడిచేసే ఒక సరళమైన నిజమున్నది. దీనితో, పట్టణ ప్రజల నిజ రూపము మరియు గుణము కూడా బహిర్గతం చేయబడ్డాయి. ఈ జనులు దేవుని హెచ్చరికలను స్వీకరించడాన్ని తిరస్కరించడం మాత్రమే కాకుండా, వారాయన విధించిన శిక్షకు కూడా భయపడలేదు. అందుకు ప్రతికూలంగా, వారు దేవుని ఆగ్రహాన్ని ధిక్కరించారు. వారు దేవుణ్ణి గుడ్డిగా ఎదిరించారు. ఆయన ఏమి చేసినా, లేక ఆయన దాన్ని ఎలా చేసినా సరే, వారి దుష్ట స్వభావం మాత్రము తీవ్రతరమై, పదేపదే దేవుణ్ణి ఎదిరించారు. సొదొమ ప్రజలు దేవుని అస్థిత్వము, ఆయన రాకడ, ఆయన శిక్ష, అంతకంటే ఎక్కువగా, ఆయన హెచ్చరికల పట్ల ప్రతికూలంగా ఉన్నారు. వారు మిక్కిలి గర్విష్టులై ఉన్నారు. పాడుచేయగలిగిన మరియు కీడు తలపెట్టగలిగిన జనులందరినీ వారు కబళించి హాని చేశారుమరియు వారు దేవ దాసులతోనూ అదేవిధంగా వ్యవహరించారు. సొదొమ ప్రజలు చేసిన దుర్మార్గాలన్నిటికి సంబంధించి చూస్తే, దైవ సేవకులకు కీడు తలపెట్టడడమనేది చాలా చిన్నదని చెప్పవచ్చు, ఆలాగున బయలుపరచబడిన వారి పాపిష్టి స్వభావము నిజానికి విస్తారమైన సాగరంలో ఒక బొట్టు కంటే అధికమేమీ కాదు. అందువలన, దేవుడు వారిని అగ్నిచేత నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. దేవుడు జలప్రళయాన్ని ఉపయోగించలేదు, లేదా ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి ఒక తుఫానునో, భుకంపాన్నో, సునామీనో లేక మరి ఏ ఇతర పద్ధతినో ఉపయోగించలేదు. దేవుడు ఈ పట్టణాన్ని పాడు చేయడానికి అగ్నిని ఉపయోగించుట ద్వారా ఏమి సూచిస్తోంది? అంటే పట్టణ సమూల నాశనమని దాని అర్ధం; అంటే పట్టణము భూమి నుండి మరియు సృష్టి నుండి బొత్తిగా తుడిచిపెట్టబడిందని దాని భావమైయున్నది. ఇక్కడ, “నాశనం” అనేది పట్టణపు రూపాన్నో ఆకృతినో, లేక వెలుపటి ఆకారాన్నో తుడిచిపెట్టడాన్ని మాత్రమే సూచించడంలేదు; పట్టణంలోని ప్రజల ప్రాణాలు సంపూర్ణంగా నిర్ములించబడుటచేత కనుమరుగైందని కూడా ఇది అర్ధమిచ్చుచున్నది. నేరుగా చెప్పాలంటే, పట్టణంతో సంబంధమున్న ప్రజలు, ఉదంతాలు మరియు సంగతులు అన్నీ నాశనమయ్యాయి. ఆ పట్టణ ప్రజలకు వచ్చే జన్మనో లేక పునర్జన్మనో ఉండబోవు; దేవుడు తన సృష్టియైన మానవజాతి నుండి వారిని, శాశ్వతంగా సమూలంగా నాశనం చేశాడు. అగ్నిని ఉపయోగించడమనేది ఈ ప్రాంతంలో పాపానికి ఒక ముగింపును సూచిస్తుంది మరియు అక్కడ పాపము నిషేధింపబడిందని సూచిస్తుంది; ఈ పాపమే ఉనికిలో ఉండకుండా విస్తరించకుండా నిలిచిపోయింది. అంటే, సాతాను దుష్టత్వమును పెంచి పోషించే భూమిని, అదేవిధంగా అది ఉండటానికి మరియు జీవించడానికి ముంజూరు చేసిన స్మశానమును పోగొట్టుకుందని దాని అర్థం. దేవునికి సాతానుకు మధ్య జరగబోయే సంగ్రామంలో, దేవుడు అగ్నిని ఉపయోగిండమనేద ఆయన విజయ చిహ్నంగా ఉంటుంది, దానితోనే సాతాను తుడిచిపెట్టుకుపోతాడు. ప్రజలను చెడగొట్టి భ్రష్టుపట్టించుట ద్వారా దేవుణ్ణి ఎదిరించాలన్న సాతాను అత్యాశలోసొదొమ వినాశనం అనేది ఒక పెద్ద తప్పటడుగైయున్నది మరియు అది మానవజాతి ప్రగతిలో మానవుడు దైవ నేతృత్వాన్ని కాదని చెడుతనానికి తనను విడిచిపెట్టుకున్నప్పుడు కాలానికి చెందిన ఒక అవమానకరమైన సూచనవలె ఉన్నది. అంతేకాకుండా, ఇది దేవుని నీతి స్వభావపు నిజమైన ప్రత్యక్షతకు చెందిన ఒక దాఖలు అయి ఉన్నది.

దేవుని చేత పంపబడిన అగ్ని ఆకాశము నుండి దిగివచ్చినప్పుడు సొదొమను కాల్చివేసి, బూడిద తప్ప మరేమీ లేకుండా చేశాడంటే, “సొదొమ” అను పేరుగల పట్టణము, అలాగే పట్టణంలో ఉన్నదంతా అటుతరువాత ఉనికిలోనే లేకుండా పోయిందని భావమై ఉన్నది. అది దేవుని ఆగ్రహము చేత నాశనమై, దేవుని ఉగ్రత మరియు ప్రభావమందు నశించి ఉన్నది. దేవుని నీతి స్వభావము మూలంగా, సొదొమ పొందవలసినసరియైన శిక్షను మరియు దాని న్యాయమైన అంతమును పొందుకున్నది. సొదొమ అస్తిత్వపు అంతమనేది దాని దుర్మార్గతవలన కలిగినది, మరియు ఈ పట్టణమునైనా, లేక ఇందులో జీవించిన ప్రజలలో ఎవరినైనా, లేక పట్టణములో ఎదిగిన ఏ జీవినైనా ఎప్పటికీ తిరిగి చూడకూడదనే దేవుని కోరికవలన కూడా కలిగింది. “ఎప్పటికీ పట్టణాన్ని తిరిగి చూడకూడదనుకునే” దేవుని కోరిక అనేది ఆయన ఉగ్రతయైయున్నది, అలానే ఆయన మహాత్వమునై ఉన్నది. పట్టణపు దుష్టత్వము మరియు పాపము అనేవి ఆ పట్టణముపట్ల దేవునికి ఆగ్రహాన్ని, అసహ్యాన్ని మరియు చీదరింపును కలిగించినందున మరియు దానిని లేక దానిలోని ప్రజలలో ఎవరినైనా లేక అందులోని జీవరాశులను ఎన్నటికీ ఎప్పటికీ చూడకూడదన్న కోరికను కలిగించినందున, ఆయన పట్టణాన్ని దహించివేశాడు. పట్టణము దహించబడటం పూర్తయి, కేవలం బూడిద మాత్రమే మిగిలిన తరువాత, అది దేవుని దృష్టిలో నిజముగా కనుమరుగైపోయింది; దాని గూర్చిన ఆయన జ్ఞాపకము సైతం లేకుండా పోయి, చెరిపివేయబడింది. దీనర్ధం ఆకాశము నుండి పంపబడిన అగ్ని అనేది సోదొమ పట్టణమంతటినీ నాశనం చేయడం మాత్రమే కాదు, లేక అది కేవలం పట్టణంలో పాపభరితులైన ప్రజలను నాశనం చేయడమే కాదు, లేక అది కేవలం పట్టణంలో పాపము చేత మలినమైన వాటన్నిటిని నాశనం చేయడమే కాదు; వీటన్నిటికీ మించి, ఆ అగ్ని మానవజాతి యొక్క దుష్టత్వాన్ని మరియు దేవునికి విరోధముగా చేసిన తిరుగుబాటుకు చెందిన జ్ఞాపకాన్ని సైతం నాశనం చేసింది. పట్టణాన్ని దహించివేయడంలో దేవునికున్న ఉద్దేశము ఇదే.

ఈ మానవజాతి తారా స్థాయిలో భ్రష్టుపట్టింది. ఈ ప్రజలకు దేవుడు ఎవరో, లేక వారు స్వయంగా ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఒకవేళ నీవు వారి వద్ద దేవుని గూర్చి ప్రస్తావిస్తే, వారు దాడి చేస్తారు, అపనిందలు వేస్తారు, దైవదూషణ చేస్తారు. ఆయన హెచ్చరికను చాటించడానికి దైవ సేవకులు వచ్చినప్పుడు కూడా, ఈ పాపిష్టి ప్రజలు పశ్చాత్తాపపు సూచనలను కనుపరకుండా తమ చెడు నడవడికను విసర్జించలేదు, అయితే దానికి వ్యతిరేకంగా, సిగ్గులేకుండా వారు దైవదాసులకు హాని చేశారు. వారు వ్యక్తపరిచి, బయలుపరిచిందంతా వారి స్వభావమును మరియు దేవునిపట్ల కలిగియున్న విపరీతమైన శతృత్వపు గుణాన్ని బయట పెట్టుకున్నారు. దేవునికి విరోధంగా ఈ భ్రష్ట ప్రజలు కలిగియున్న ఎదిరించే శక్తి అనేది వారి భ్రష్ట స్వభావపు ప్రత్యక్షతకంటే మించినది, అది కేవలం సత్యాన్ని గూర్చిన అవగాహన లోపమువలన పుట్టిన ఒక నింద లేక ఎగతాళికి సంబంధించిన దుష్టాంతానికి మించి ఉన్నదన్నట్టుగా మనం చూడగలము. వారి దుర్మార్గపు ప్రవర్తనకు మూఢత్వమో లేక అవివేకమో కారణము కాదు; వారు ఇలా ప్రవర్తించింది మోసపుచ్చబడినందుచేత కాదు మరియు వారు తప్పుదారి పట్టించినందుచేత అస్సలే కాదు. వారి ప్రవర్తన ద్వేషపూరితమైన మొండి వైరంతో, దేవునిని ఎదిరిస్తూ విరోధంగా కేకలు వేసే స్థాయికి చేరుకుంది. నిస్సంకోచంగా, ఈ రకమైన మనిషి ప్రవర్తన దేవునికి కోపము తెప్పిస్తుంది మరియు కోపానికి గురి కాగూడని ఆయన స్వభావమునకు కోపము తెప్పిస్తుంది. అందువలననే, దేవుడు తన ఉగ్రతను మరియు ప్రభావమునునేరుగా మరియు బాహాటముగా కనుపరిచాడు; ఇది ఆయన నీతి స్వభావానికి ఒక నిజమైన ప్రత్యక్షతయై ఉన్నది. పాపంతో పొంగిపొర్లుతున్న పట్టణాన్ని చూసిన దేవుడు, దానిని సాధ్యమైనంత శరవేగంగా నాశనం చేయాలని, అందులోని ప్రజలను వారి పాపలన్నిటినీ సంపూర్ణంగా సమూలంగా తుడిచిపెట్టాలని, ఈ ప్రాంతంలో పాపము విస్తరించకుండా ఉండటానికి ఈ పట్టణ ప్రజలను చంపివేయాలని అనుకున్నాడు. అలా జరిగించడానికి మిక్కిలి సత్వరమైన సంపూర్ణ మార్గము ఉన్నదంటే అది అగ్ని చేత దహించడమే. సొదొమ ప్రజలపట్ల దేవునికున్న ధోరణిని పరిత్యజించడమును గూర్చి, లేక అశ్రద్ధ చేయడమును గూర్చి కాదు. అందుకు ప్రతిగా, ఈ ప్రజలను శిక్షించి, కొట్టి, బొత్తిగా నాశనం చేయడానికి ఆయన తన ఉగ్రతను, ప్రభావమును మరియు అధికారాన్ని ఉపయోగించాడు. వారి పట్ల ఆయనకున్న ధోరణి కేవలం భౌతికపరమైన వినాశనం మాత్రమే కాదు గాని ఆత్మను నశింపజేయడం, నిత్య నిర్మూలన కూడా అయ్యున్నది. “ఉనికిలో లేకుండా చేయడం” అన్న మాటల ద్వారా దేవుడు అనుకున్న వాస్తవ తాత్పర్యము ఇదే.

దేవుని ఉగ్రత మనిషికి మరుగై, తెలియనప్పటికీ, అది అతిక్రమాన్ని సహించదు

మనుష్యులుగా మూర్ఖత్వమును మరియు నిర్లక్ష్యాన్ని కలిగియున్నప్పుడు ప్రాథమికంగా దేవుడు కరుణ మరియు సహనం అనే వాటిని ఆధారము చేసికొని సమస్త మనుష్యులందరిపట్ల నడుచుకుంటాడు. ఇంకోవైపు, ఆయన ఉగ్రత అనేదిఅత్యధిక కాలంపాటు, అనేక సంఘటనలలో మరుగుచేయబడింది, ఇది మానవునికి తెలియని విషయమై ఉన్నది. దాని ఫలితంగా, దేవుడు తాను ఉగ్రతను కనుపరచడాన్ని మానవుడు చూడటం కష్టము, మరియు తన ఉగ్రతను గ్రహించడం కూడా కష్టతరమై ఉన్నది. అలాంటప్పుడు, మనిషి దేవుని ఉగ్రతను చులకనగా చూస్తాడు. మానవుడు దేవుని అంతిమ కార్యాన్ని మరియు మానవుని పట్ల సహనాన్ని మరియు క్షమాపణను కనుపరిచే దశను ఎదుర్కొన్నపుడు, అంటే, దేవుని అంతిమ కరుణా ఉదంతము మరియు ఆయన అంతిమ హెచ్చరిక మానవాళి మీదికి వచ్చినప్పుడు, ఇంకా ప్రజలు దేవుణ్ణి వ్యతిరేకించడానికి అవే పద్దతులను అవలంబిస్తూ, పశ్చాత్తాపపడటానికి, తమ విధానాలు చక్కబరచుకుని ఆయన కరుణను స్వీకరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోతే, అప్పుడు దేవుడు తన ఓర్పు సహనములను ఇక ఎప్పటికీ వారికి అనుగ్రహించడు. అందుకు వ్యతిరేకంగా, ఇప్పుడైతే దేవుడు తన కరుణను వెనక్కి తీసుకుంటాడు. దీని తదుపరి, ఆయన తన ఉగ్రతను మాత్రమే పంపుతాడు. ఆయన ప్రజలను శిక్షించి నాశనం చేయడానికి పలురకాలైన పద్దతులను అవలభించినట్లే, ఆయన తన ఉగ్రతను పలు విధాలుగా వెల్లడిపరచగలడు.

సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు అగ్నిని ఉపయోగించడం అనేది ఒక మానవజాతినే గాని మరిదేనినైనా గాని సమూలంగా నిర్మూలించే శరవేగవంతమైన పద్దతియై ఉన్నది. సొదొమ ప్రజలను దహించడమనేది తమ భౌతిక దేహాలను మించి నాశనం చేసింది; అది వారి ఆత్మలను, వారి ప్రాణాలను మరియు వారి దేహాలను సంపూర్ణంగా నాశనం చేసి, భౌతికమైన లోకము మరియు మానవుని కనిపించని లోకములలోనూ ఉనికి లేకుండా కోల్పోయే పట్టణములోని ప్రజలను ఆమోదిస్తోంది. ఇది దేవుడు తన ఉగ్రతను బయలుపరచి, వ్యక్తపరిచే ఒక మార్గమై ఉన్నది. ఈ రకమైన ప్రత్యక్షత మరియు వ్యక్తీకరణ అనేది దేవుని ఉగ్రత గుణగణాలలో ఒక అంశమై ఉన్నది, స్వాభావికంగా ఇది దేవుని నీతి స్వభావపు గుణానికి సంబంధించిన ఒక ప్రత్యక్షతయైయున్నది. దేవుడు తన ఉగ్రతను పంపేటప్పుడు, ఆయన కరుణ, లేక ప్రేమ పూర్వకమైన దయను బయలుపరచడాన్ని ఆపేస్తాడు మరియు ఆయన తన ఓర్పు సహనాలను ఇక ఏ మాత్రమూ కనుపరచడు; సహనము కలిగి కొనసాగడానికి, తిరిగి తన కరుణను ఇవ్వడానికి, ఇంకొకసారి తన ఓర్పును అనుగ్రహించడానికి ఆయనను ఒప్పించే వ్యక్తి గాని, విషయం గాని లేక హేతువు గాని లేదు. ఈ విషయాలకు సంబంధించిన స్థలంలో, క్షణమాత్రమైనా ఆలస్యము చేయకుండా, దేవుడు తన ఉగ్రత మహత్యమును పంపి, తాను ఆశించినది జరిగిస్తాడు. ఆయన ఈ విషయాలను తన సొంత ఇష్టాలను అనుసరించి శరవేగమైన స్వచ్చమైన విధానంలో జరిగిస్తాడు. ఈ విధానములో దేవుడు తన ఉగ్రతను మరియు ప్రభావమును పంపిస్తాడు, ఏ మనిషి బాధకు గురి కాకూడదు మరియు ఆయన నీతి స్వభావములో ఒక అంశపు వ్యక్తీకరణయైనది. దేవుడు ప్రేమానురాగాలను మానవునిపట్ల కనుపరుస్తున్నట్లు ప్రజలు గుర్తించినప్పుడు, వారు ఆయన ఉగ్రతను పసిగట్టలేరు, ఆయన మహత్యమును చూడలేరు, లేక అతిక్రమముపట్ల ఆయనకు ఉండే అసహనాన్ని గ్రహించలేరు. ఈ విషయాలు దేవుని నీతి స్వభావము అంటే కరుణ, ఓర్పు మరియు ప్రేమ మాత్రమే అని ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్లు చేశాయి. అయితే, దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేయడాన్నో లేక మనుష్యులను ద్వేషించడాన్నో ఎవరైనా చూసినప్పుడు, మానవుని నశింపజేయడంలోని ఆయన ఆగ్రహం మరియు ఆయన మహత్యము అనేవి ప్రజలు ఆయన నీతి స్వభావపు మరో వైపును చూడటానికి వీలుకల్పిస్తాయి. ఇది అతిక్రమముపట్ల దేవుడు వ్యక్తపరిచే అసహనము. అతిక్రమాన్ని భరించలేని దేవుని స్వభావము సృజించబడిన ఏ జీవి ఊహాగానాన్నైనా అధిగమిస్తుంది మరియు సృజించబడని వాటిలోఏదీ దాని జోలికి పోలేదు లేక దానిని ప్రభావితం చేయలేదు; పైగా దానిని వంచించడానికి లేక అనుకరించడానికీ వల్లకాదు. అందువల్ల, దేవుని స్వభావములోని ఈ కోణాన్ని మానవజాతి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అంశమైయున్నది. దేవుడు మాత్రమే ఇటువంటి స్వభావాన్ని కలిగియున్నాడుమరియు కేవలం దేవునికి మాత్రమే ఇటువంటి స్వభావము సొంతమైయున్నది. దేవుడు ఈ విధమైన నీతి స్వభావాన్ని కలియున్న కారణముచేత తాను దుర్మార్గాన్ని, అంధకారాన్ని, తిరుగుబాటుతనాన్నిమరియు సాతాను దుష్ట కార్యాలైన—చెడుతనాన్నిమరియు మానవజాతిని హరించివేయడాన్ని అసహ్యించుకుంటాడు.ఎందుకంటే ఆయన తన పరిశుద్ద గుణాతిశయము కారణంగా ఆయన తనకు విరోధమైన పాప కార్యాలన్నిటినీ ద్వేషిస్తాడు. ఇది ఎందుకంటే సృజించబడిన లేక సృజించబడని జీవరాశిలో ఎవరూ తనను బహిరంగంగా విరోధించడాన్ని లేక తనతో తలపడటాన్ని ఆయన సహించడు. ఒకప్పుడు ఆయన దయ చూపిన లేక ఆయన ఎన్నుకున్న వ్యక్తి సైతము, కేవలం ఆయన స్వభావాన్ని పురికొల్పి, తన ఓర్పు సహనపు నియమాలను అతిక్రమిస్తే చాలు, ఎటువంటి అతిక్రమాన్ని సహించని దేవుడు కాస్తయినా దయ లేకుండా, సంకోచం లేకుండా తన నీతి స్వభావాన్ని విడుదల చేసి బయలుపరుస్తాడు.

దేవుని ఉగ్రత అనేది న్యాయ విధులన్నిటికీ మరియు సానుకూల విషయాలన్నిటికీ ఒక రక్షణ కవచమై ఉన్నది

దేవుని సంభాషణ, తలంపులు మరియు కార్యాలకు సంబధించిన ఈ ఉదాహరణలను అవగాహన చేసుకోవడం ద్వారా, మానవునిచేత విసుగు చెందడాన్ని సహించని స్వభామైన, దేవుని నీతి స్వభావాన్ని నీవు అర్ధం చేసుకోగలుగుచున్నావా? క్లుప్తంగా చెప్పాలంటే, మానవుడు దానిని ఎంతమేరకు అర్ధం చేసుకోగలడన్నది పక్కనపెడితే, ఇది స్వయానా దేవుని స్వభావానికి సంబధించిన ఒక దృష్టికోణముగా మరియు అది ఆయనకు విశేషమైనదిగా ఉన్నది. అతిక్రమముపట్ల దేవునికి కలిగే అసహనము ఆయన విశేష గుణమైయున్నది; దేవుని ఉగ్రత అనేది తన ప్రత్యేక స్వభావమై ఉన్నది; దేవుని మహత్యము అనేది ఆయన ఆపూర్వమైన గుణాతిశయమై ఉన్నది. తన గుర్తింపును మరియు స్థాయిని వెల్లడిపరచడం అనేది దేవుడు తాను మాత్రమే కలిగియున్న ఆగ్రహము వెనకున్న నియమమై ఉన్నది. ఈ నియమము అద్వితీయ దేవుని గుణగణానికి కూడా చిహ్నమై ఉన్నదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుని స్వభావమనేది కాలానుగుణంగా ఏమాత్రమూ మారని మరియు భౌగోళిక స్థాన పరివర్తనలను బట్టి మారని ఆయన స్వంత స్వాభావికమైన గుణమై ఉన్నది. సహజసిద్దమైన ఆయన స్వభావమే ఆయన అంతర్య గుణాతిశయమై ఉన్నది. ఆయన తన కార్యాన్ని ఎవరిమీద జరిగించినప్పటికీ, ఆయన గుణము మారదు మరియు ఆయన నీతి స్వభావమూ మార్పు చెందదు. ఎవరైనా దేవునికి ఆగ్రహాన్ని పుట్టించినప్పుడు, దేవుడు తన సహజసిద్దమైన స్వభావాన్ని కనుపరుస్తాడు; ఈ సమయంలో ఆయన ఆగ్రహము వెనకున్న నియమము గాని, ఆయన విశిష్టమైన గుర్తింపు మరియు స్థాయి గాని మార్పు చెందదు. ఆయనకు విరోధంగా మానవుడు కలిగిఉండే తిరుగుబాటు ఆయన స్వభావాన్ని బాధిస్తున్న కారణాన ఆయన కోపము రగులుకుంటుంది గాని ఆయన గుణంలో కలిగే ఒక మార్పు కారణంగానో లేక ఆయన స్వభావము నుండి ఉత్పన్నమయ్యే వివిధ అంశాల కారణం చేతనో ఆయన క్రోధాన్ని పెంచుకోడు. దేవుని పట్ల మానవుడు కలిగి ఉండే కఠోరమైన ప్రకోపనము అనేది దేవుని సొంత గుర్తింపుకు మరియు ఆయన స్థాయికి పెను సవాలుగా ఉన్నది. దేవుని దృష్టిలోమానవుడు ఆయనకు సవాలు విసిరినప్పుడు, మానవుడు ఆయనతో తలపడుతూ ఆయన క్రోధాన్ని పరీక్షిస్తున్నాడని భావించాలి. మానవుడు దేవుణ్ణి విరోధించినప్పుడు, మానవుడు దేవునితో తలపడినప్పుడు, మరియు మానవుడు నిరంతరంగా దేవుని ఆగ్రహాన్ని పరీక్షిస్తున్నప్పుడు మరియు పాపము ప్రబలిపోతున్న అటువంటి సమయాల్లో దేవుని ఉగ్రత స్వాభావికముగానే బయలుపరచబడి దానంతట అదే ప్రత్యక్షమవుతుంది. అందువల్ల, దేవుడు తన ఉగ్రతను వెల్లడిచేయడం అనేది దుష్ట శక్తులన్నీ ఉనికిలో లేకుండా తీసివేయబడతాయని చెప్పుటకు ఒక సూచనయైయున్నది మరియు అది శత్రు సమూహాలన్నీ నాశనం చేయబడతాయన్న దానికి ఒక నిదర్శనమైయున్నది. ఇది దేవుని ఉగ్రతమరియు దేవుని నీతి స్వభావపు విశిష్టతయై ఉన్నది. ఎప్పుడు దేవుని ఘనత మరియు పరిశుద్దత సవాలు చేయబడుతుందో, ఎప్పుడు మనుషులు న్యాయ విధులకు విఘాతం కలిగించి, వాటిని చూడరో, అప్పుడు దేవుడు తన ఉగ్రతను పంపుతాడు. దేవుని గుణగణాలను బట్టి, భూమి మీద దేవునితో తలపడే, ఆయనను ఎదిరించే, ఆయనను అడ్డుకునే శక్తులన్నీ దుర్మార్గమైనవి, భ్రష్టుపట్టినవి మరియు అన్యాయమైనవిగా ఉన్నాయి; అవి సాతాను వద్ద నుండి వచ్చినవి మరియు సాతానుకు చెందియున్నవి. దేవుడు న్యాయవంతుడు వెలుగు సంబంధి మరియు నిష్కళంకమైన పరిశుద్దుడు కాబట్టి, అలా దేవుని ఉగ్రత పంపబడగానే దుర్మార్గమైన, భ్రష్టుపట్టిన, సాతానుకు సంబంధించిన విషయాలన్నీ కనుమరుగైపోతాయి.

దేవుని ఉగ్రతను కుమ్మరించడం అనేది ఆయన నీతి స్వభావపు పరిభాషలోఒక భాగమైనప్పటికీ, దేవుని ఆగ్రహము దాని లక్ష్యము గూర్చిన విషయానికొస్తే ఏ విధంగానూ అవివేకమును చూపించదు మరియు నియమము లేకుండా ఉండదు. అందుకు వ్యతిరేకంగా, దేవుడు త్వరగా కోపపడువాడు కానేకాడు మరియు అంత సులువుగా ఆయన తన ఉగ్రతను మరియు మహత్యమును బయలుపరచడు. అంతేకాకుండా, దేవుని ఉగ్రత చాలా నియంత్రణలో మితంగా ఉంటుంది; ఇది మానవుడు కోపోద్రిక్తుడయ్యే విధానముతోనో లేక తన ఆవేశాన్ని వెళ్లగక్కే విదానముతోనో అస్సలు పోల్చదగినది కాదు. దేవునికి మనిషికి మధ్య జరిగిన ఎన్నో సంభాషణలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. సంభాషణలలో వ్యక్తిగతంగా పాలుపంచుకున్న కొంతమంది వ్యక్తులు పనికిమాలిన, అవివేకమైన మరియు పసిపిల్లల మాటలను మాట్లాడారు, కానీ దేవుడు వారిని మొత్తలేదు మరియు ఆయన వారిని ఖండించలేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే, యోబు శ్రమ సమయంలో, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు, మరికొందరు యోబుతో చెప్పిన మాటలు వినిన తరువాత దేవుడైన యెహోవా వారితో ఎలా వ్యవహరించాడు? ఆయన వారిని ఖండించాడా? ఆయన వారిపై కోపపడ్డాడా? ఆయన అటువంటిదేమీ చేయలేదు! అందుకు ప్రతిగా ఆయన యోబుతో వారి తరపున విజ్ఞాపనలు చేయమని మరియు వారి కొరకు ప్రార్ధించమని చెప్పాడే గాని, దేవుడు వారి తప్పిదాలను హృదయానికి తీసుకోలేదు. ఈ దృష్టాంతాలన్నీ దేవుడు మానవజాతిపట్ల, భ్రష్టులైనవారిపట్ల మరియు అవివేకులపట్ల ఒకేవిధంగా వ్యవహరించే ప్రాథమిక ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అందువలన, దేవుడు ఉగ్రతను పంపడమనేది తన మనస్థితి వ్యక్తీకరణో, లేక ఆయన తన భావనలు వ్యక్తపరిచే ఒక విధానమో కానే కాదు. మనిషి అపార్దానికి భిన్నంగా, దేవుని ఉగ్రత అనేది ఆయన కోపమును పూర్తిగా బయటకు కుమ్మరించడం కాదు. దేవుడు తన మనస్థితిని స్వాధీనపరచుకోలేకనో లేక తన క్రోధము పరాకాష్టకు చేరిన కారణంగా దాన్ని తప్పనిసరిగా వెళ్ళగక్కాలి అన్న కారణం చేతనో దేవుడు తన ఉగ్రతను పంపడు. ఇందుకు వ్యతిరేకంగా, ఆయన ఉగ్రత అనేది ఆయన నీతి స్వభావము యొక్క నిజమైన వ్యక్తీకరణయు మరియు ప్రదర్శనయూ అయ్యున్నది మరియు ఇది ఆయన పరిశుద్ద గుణగణానికి సంబంధించిన ఒక సూచనప్రాయమైన ప్రత్యక్షతగా ఉన్నది. దేవుడు అంటే ఉగ్రతయై ఉన్నాడు, ఆయన తృణీకరించబడుటను సహించడు. అంటే, దీనర్ధం దేవుని ఆగ్రహాము కారణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించదనో, లేక నీతిలేనిదనో కాదు; నీతిరాహిత్యము, నియమరహితమైన ఆక్రోశం, కారణాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించని ఒక విధమైన ఆవేశము మీద ఒక ప్రత్యేకమైన హక్కున ఉన్నారంటే అది భ్రష్టుపట్టిన మానవజాతి మాత్రమే. మనిషికి ఒక స్థాయి వచ్చిందంటే, అతడు తన మనస్థితిని అదుపులో ఉంచుకోడానికి కష్టపడుతుంటాడు, కాబట్టి అతడు తన అసంతృప్తిని తెలియజేయడానికి మరియు తన మనోభావాలను వెళ్ళగక్కడానికి అవకాశాలను అందిపుచ్చుకోడానికి ఇష్టపడతాడు; తన సమర్ధతను చూపించుకోడానికి మరియు సామాన్య ప్రజలకంటే తన స్థితిగతులు భిన్నంగా ఉన్నాయని మిగతావారికి తెలియజేయడానికి, తరచూ అతడు ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ఆవేశంతో రగిలిపోతాడు. నిజానికి, ఎటువంటి స్థాయిలేని భ్రష్టుపట్టిన ప్రజలు కూడా పదేపదే నియంత్రణను కోల్పోతారు. తమ స్వప్రయోజనాలకు నష్టం వాటిల్లినప్పుడు వారికి తరచుగా కోపం వస్తుంది. తమ పరువు ప్రతిష్టలను కాపాడుకోడానికి, వారు పలుమార్లు తమ మనోభావాలను వెళ్లగక్కి తమ అహంకారపూరితమైన స్వభావాన్ని వెలువరిస్తారు. పాపపు అస్తిత్వాన్ని కాపాడుకొని స్థిరపరచుకోవడానికి మానవుడు ఆవేశంతో రగిలిపోయి తన మనోభావాలను వెళ్ళగక్కుతాడు మరియు ఈ కార్యాలు మానవుడు తన అసంతృప్తిని తెలియజేసే మార్గాలై ఉన్నాయి; అవి కల్మషాలతో, కుట్రలు కుతంత్రాలతో, మనిషి భ్రష్టతవము మరియు దుర్మార్గాలతో నిండి ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా, అవి మానవుని మూర్ఖపు ఆశయాలతోను మరియు ఆకాంక్షలతోనునిండియున్నాయి. న్యాయానికి దుష్టత్వముతో సంఘర్షణ జరిగినప్పుడు, న్యాయపు అస్తిత్వాన్ని కాపాడటంలోనో లేదా దానిని నిలబెట్టడంలోనో మానవునికి ఆవేశం రగులుకోదు; అందుకు వ్యతిరేకంగా, న్యాయ విధులు విపత్కర పరిస్థితులకు గురైనప్పుడు, హింసింపబడి దాడికి గురైనప్పుడు, చూసిచూడనట్టు ఉండటం, తప్పించుకోవడం లేక సంకోచించడం లాంటి వాటిలో ఏదైనా ఒక వైఖరిని మానవుడు కలిగియుంటాడు. అయితే, దుష్ట శక్తులను ఎదుర్కొన్నప్పుడు, సర్దుకుపోవడం, వంగి వంగి నమస్కరించడం మరియు గీకుతూ ఉండడం లాంటి వాటిలో ఏదైనా ఒక వైఖరిని మానవుడు కలిగియుంటాడు. అందునుబట్టి, మానవుడు వెళ్ళగక్కడమనేది దుష్ట శక్తులకు తప్పించుకునే మార్గమై, కట్టడి లేని మరియు అదుపుచేయలేని దుర్మార్గపు ప్రవర్తన కలిగిన శరీర సంబంధమైన మానవుని భావ వ్యక్తీకరణయై ఉన్నది. అయితే, దేవుడు తన ఉగ్రతను పంపినప్పుడు, దుష్ట సముహాలన్నీ నిలువరింపబడతాయి, మానవునికి అపకారం తలపెట్టే సమస్త పాపాలు అణచివేయబడతాయి, దేవుని కార్యానికి అడ్డుపడే శత్రు సముహాలన్నీ తేటపరచబడి, వేరు చేయబడి శపించబడతాయి, అయితే దేవుణ్ణి ఎదిరించే సాతాను సహాయకులందరూ శిక్షించబడి పెకిలించివేయబడతారు. వారున్న ప్రదేశంలో, దేవుని కార్యము ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగుతుంది, కాలక్రమానుసారం దేవుని నిర్వహణ ప్రణాళిక దశలవారీగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, సాతాను భంగపాటు మరియు వంచన నుండి దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు విడుదల పొందుతారు, అయితే దేవుణ్ణి వెంబడించువారు శాంతికరమైన సమాధానకరమైన పరిసరాల మధ్య దేవుని నాయకత్వాన్ని మరియు ఏర్పాటును అనుభవిస్తారు. దేవుని ఉగ్రత అనేది దుష్ట శక్తులు విస్తరించకుండా మరియు ప్రబలకుండా నిరోధించే ఒక రక్షణకవచమై ఉన్నది మరియు అలాగే, ఇది న్యాయమైన మరియు సానుకూల విషయాలన్నిటి ఉనికిని మరియు వ్యాప్తిని కాపాడే రక్షణ కవచమై ఉన్నది. అలాగే, అవి అణచివేయబడకుండా, హానికి గురి కాకుండా ఆ రక్షణ కవచం వాటిని శాశ్వతంగా కాపాడుతుంది.

దేవుడు సొదొమను నాశనం చేయడంలో ఆయన ఉగ్రత గుణగణాన్ని మీరు చూడగలిగారా? ఆయన కోపములో మరేదైనా మిళితమై ఉన్నదా? దేవుని ఉగ్రత పవిత్రమైనదేనా? మానవుని మాటల్లో చెప్పాలంటే, దేవుని ఉగ్రత నిష్కల్మషమైనదేనా? ఆయన ఉగ్రత వెనుక వంచన ఏమైనా ఉన్నదా? ఏదైనా దురాలోచన ఉన్నదా? మాట్లాడకూడని మర్మాలు ఏవైనా ఉన్నాయా? దేవుని ఉగ్రతలోని ఏ భాగమూ అనుమానించే విధంగా తావివ్వదని నేను మీకు నిక్కచ్చిగా మరియు రూఢిగా చెప్పగలను. ఆయన ఆగ్రహము మరే ఇతర ఉద్దేశ్యాలకు మరియు లక్ష్యాలకు తావునివ్వని పవిత్రమైన, నిష్కల్మషమైన ఆగ్రహమై ఉన్నది. ఆయన ఆగ్రహానికి వెనకున్న కారణాలు నిర్మలమైనవి, నిష్కళంకమైనవి మరియు విమర్శకు అతీతంగా ఉన్నవి. ఇది ఆయన పరిశుద్దతకు సంబంధించిన ఒక సహజమైన ప్రత్యక్షత మరియు దర్పణమునై ఉన్నది; ఇది ఈ సృష్టి అంతటిలో ఏదీ కలిగిలేని విషయము. ఇది దేవుని విశిష్టమైన నీతి స్వభావానికి చెందిన ఒక భాగము, ఇది సృష్టికర్త మరియు తన సృష్టికి సంబధించిన లక్షణాల మధ్య గల విలక్షణమైన బేధము కూడా.

ఇతరుల దృష్టిలోనైనా, లేక వారి వెనుకాలనైనా ఎవరైనా కోపపడ్డారా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, అందరూ తమ ఆగ్రహానికి ఒక భిన్నమైన అభిప్రాయాన్ని మరియు ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. బహుశా వారు తమ పరువు ప్రతిష్టను పెంచుకుంటూ ఉండవచ్చు, లేక వారు తమ స్వప్రయోజనాలను కాపాడుకుంటూ, తమ ప్రతిష్టను సంరక్షించుకుంటూనో లేక పరువును నిలబెట్టుకుంటూనో ఉండవచ్చు. కొంతమంది వారి కోపంలో నియంత్రణ కలిగి ఉంటారు, మరి కొంతమందైతే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాస్తయినా నియంత్రణ లేకుండా వారు కావాలనుకున్న ప్రతిసారి తమ ఆవేశాన్ని రగిలిపోనిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, మానవుని కోపము తన చెడు స్వభావము నుండి ఉత్పన్నమవుతుంది. దాని ఉద్దేశము ఏమై ఉన్నప్పటికీ, అది శరీర సంబంధమైనది మరియు స్వాభావికమైనది; మానవుని స్వభావము మరియు లక్షణాలలో సత్యముతో సరిపడేది ఏదీ లేని కారణం చేత, న్యాయ అన్యాయాలతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అందువలన, చెడిపోయిన మానవజాతి ఆవేశాన్ని మరియు దేవుని ఉగ్రతను ఒకే మాటలో ప్రస్తావన చేయకూడదు. ఎటువంటి మినహాయింపు లేకుండా, సాతాను చేత చెడగొట్టబడిన ఒక వ్యక్తి వైఖరి చెడుతనాన్ని పరిరక్షించాలన్న ఆశతో మొదలవుతుంది, నిజానికి అది చెడుతనము మీదే ఆధారపడి ఉంటుంది; అందుకనే సిద్దాంత పరంగా మానవుని ఆగ్రహము ఎంత సరైనదన్నట్టుగా కనపడినా, మానవుని క్రోధాన్ని దేవుని ఉగ్రతతో కలిపి ఒకే ఉచ్చారణలో ప్రస్తావించలేము. దేవుడు తన ఉగ్రతను పంపినప్పుడు, దుష్ట శక్తులు బంధించబడి చెడ్డ సంగతులన్నీ నాశనం చేయబడతాయి, అయితే న్యాయమైన అనుకూల సంగతులు మాత్రము దేవుని సంరక్షణ కాపుదలను అనుభవిస్తాయి మరియు కొనసాగనివ్వబడతాయి. అన్యాయమైన, విరుద్దమైన చెడ్డ సంగతులు సామాన్యమైన క్రియాశీలతను మరియు న్యాయమైన అనుకూల సంగతుల అభివృద్ధికి అడ్డుపడటమో, అవరోధాన్ని కలిగించడమో లేక నాశనం చేస్తాయన్న కారణాన్ని బట్టి, దేవుడు తన ఉగ్రతను పంపుతాడు. దేవుని ఆగ్రహపు లక్ష్యము తన సొంత స్థాయిని మరియు గుర్తింపును కాపాడుకోవడం కాదు, కానీ న్యాయమైన, అనుకూలమైన, సుందరమైన మంచి సంగతుల అస్తిత్వాన్ని కాపాడటము, మానవజాతి సామాన్యమైన మనుగడకు చెందిన కట్టడలను మరియు విధానాన్ని కాపాడటమై ఉన్నది. దేవుని ఉగ్రతకు అసలు కారణం. దేవుని ఉగ్రత అనేది తన స్వభావానికి ఎంతో సముచితమైన, సహజమైన, మరియు నిజమైన ప్రత్యక్షతయై ఉన్నది. ఆయన ఉక్రోషంలో ఎటువంటి మర్మయుక్తమైన ఉద్దేశాలు లేవు మరియు మోసము లేక కుట్రలూ ఉండవు, అలాగే ఆశలు, టక్కరితనము, కార్పణ్యము, దౌర్జన్యము, దుష్టత్వము లేక చెడిపోయిన మానవజాతి పంచుకున్న ఏ ఇతర లక్షణాలేవీ ఉండవు. దేవుడు తన ఉక్రోషాన్ని పంపే ముందు, ప్రతి విషయపు తత్వాన్ని ఆయన అప్పటికే చాల స్పష్టంగా మరియు సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు మరియు ఇప్పటికే ఆయన సరియైన, స్పష్టమైన నిర్వచనాలను మరియు ముగింపులను పద్ధతి ప్రకారం ఏర్పాటు చేశాడు. కావున, దేవుడు చేసే ప్రతిదానిలో ఆయన లక్ష్యము ఆయన ధోరణివలె చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన అస్తవ్యస్తంగానో, గ్రుడ్డిగానో, దుందుడుకుగానో లేక ఆశ్రద్దగా ఉండేవాడు కాదు మరియు నిశ్చయంగా ఆయన నియమరహితుడు కాడు. ఇది దేవుని ఉగ్రతకు సంబంధించిన ఆచరణీయమైన కోణమైయున్నదిమరియు దేవుని ఉగ్రతకు చెందిన ఈ ఆచరణీయమైన కోణము కారణంచేత మానవజాతి దాని సాధారణమైన ఉనికిని సాధించింది. దేవుని ఉగ్రత లేకపోతే, మానవజాతి వికృతమైన జీవన పరిస్తితుల్లోనికి దిగజారిపోయి, న్యాయమైన, సుందరమైన మంచితనము అనేవి ఉనికిలో లేకుండా పోయేవి. దేవుని ఉగ్రతే లేకపోతే, సృజించబడిన జీవరాశుల కొరకైన కట్టడలు మరియు నిభందనలు సహితం అతిక్రమించబడతాయి లేక బొత్తిగా కూలద్రోయబడతాయి. మానవుని సృష్టించినది మొదలుకుని, మానవజాతి సామాన్యమైన ఉనికిని పరిరక్షించి, కొనసాగించడానికి దేవుడు తన నీతి స్వభావాన్ని నిర్విరామంగా ఉపయోగిస్తూనే వచ్చాడు. ఆయన నీతి స్వభావమునందు ఉగ్రత మహాత్యములను కలిగి ఉన్న కారణంచేత, దుష్ట ప్రజలు, దుష్ట సంగతులు మరియు దుష్ట లక్ష్యాలు మరియు మానవజాతి సామాన్య జీవన ఉనికిని ఆటంకపరిచి హాని తలపెట్టే విషయాలులాంటివన్నీ మొత్తము శిక్షించబడి, అదుపుచేయబడి, నాశనం చేయబడతాయి. గడచిన కొన్ని వేల సంవత్సరాలుగా, దేవుణ్ణి ఎదిరించి, మానవజాతి నిర్వాహకత్వపు దేవుని కార్యములో సాతాను దూతలుగా బానిసలవలె ప్రవర్తించే అన్నిరకాల అపవిత్ర దురాత్మలను కొట్టివేసి నశింపచేయడానికి దేవుడు తన నీతి స్వభావాన్ని యెడతెగకుండా వినియోగించాడు. ఆవిధంగా, మానవుని రక్షణ కొరకైన దేవుని కార్యము నిత్యము ఆయన ప్రణాళికను అనుసరించి ముందుకు సాగిపోతుంది. అంటే దేవుని ఉగ్రత అస్తిత్వపు కారణంచేత, మనుషుల మిక్కిలి నీతియుక్తమైన కారణాలు ఎప్పుడూ నాశనం చేయబడలేదన్నదే దీని భావము.

మీరిప్పుడు దేవుని ఉగ్రత లక్షణాన్ని గూర్చిన అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి, సాతాను దుష్టత్వాన్ని ఎలా గుర్తించాలన్న దాని గూర్చి మీరు నిశ్చయంగా ఇంకా చక్కటి అవగాహనను కలిగి ఉండాల్సి ఉన్నది!

సాతాను మానవ లక్షణంతో, న్యాయంగా మరియు సాత్వీకంగా కనపడినప్పటికీ, సాతాను గుణము కృూరమైనది మరియు చెడ్డదైయున్నది.

ప్రజలను మోసపుచ్చడం ద్వారా సాతాను తన పేరుప్రతిష్టలను పెంపొందించుకుంటాడు మరియు తరచూ తననుతాను ఉద్యమ నాయకునిగా మరియు నీతికి ఒక ఆదర్శప్రాయునిగా స్థాపించుకుంటాడు. నీతిని పరిరక్షించాలన్న సాకుతో, అది ప్రజలకు అపకారం తలపెడుతుంది, వారి ప్రాణాలను కబళిస్తుంది మరియు మనిషిని అచేతనపరచి, వంచించి, రెచ్చగొట్టడానికి అన్ని రకాలైన సాధనాలను ఉపయోగిస్తుంది. మానవునితో తన చెడ్డ ప్రవర్తనను ఒప్పింపజేసి తనతో పాటు వెళ్ళేలా చేయడము, దేవుని అధికారాన్ని మరియు ఏలుబడినిసార్వభౌమాధికారమును ధిక్కరించడానికి మనిషిని తనతో కలుపుకోవడమే దాని లక్ష్యమై ఉన్నది. అయితే, ఒకరు దాని కుట్రలు కుతంత్రాల గుండా చూసినప్పుడు, మరియు దాని నీచపు లక్షణాలను చూసినప్పుడు మరియు ఎవరైనా దానిచేత అణగద్రొక్కబడి మోసపుచ్చబడకూడదని లేక దానికి కొలువుచేయడాన్ని కొనసాగించకూడదని, లేదా దానితోపాటు శిక్షించబడి నాశనం కాకూడదని అనుకున్నప్పుడు, సాతాను ఇక తన పరిశుద్ద గుణగణాలను మార్చేసి తన నిజ స్వరూపమైన దుష్టత్వము, దుర్మార్గత, వికారము మరియు హింసాత్మకతను బయలుపరచడానికి దాని తప్పుడు ముసుగును చింపివేస్తాడు. తనను వెంబడించడాన్ని తిరస్కరించి తన దుష్ట శక్తులను ఎదిరించే వారందరినీ వాడు నాశనం చేయడం తప్ప మరేదీ ఇష్టపడదు. ఇప్పుడిక సాతాను విశ్వసనీయతను, పెద్దమనిషి తరహా స్వరూపాన్ని ఎన్నటికీ పొందలేడు; కావున, గొర్రె వస్త్రాల క్రిందున్న దాని వాస్తవ లక్షణాలైన వికారత మరియు పైశాచికతలు బట్టబయలవుతాయి. ఒక్కసారి సాతాను కుట్రలు వెలుగులోనికొచ్చి, దాని వాస్తవ గుణగణాలు బయట పడ్డాయంటే, అది ఆవేశానికి గురై తన క్రూరత్వమును బహిర్గతం చేస్తుంది. దీని తర్వాత, ప్రజలకు హాని తలపెట్టి హరించివేయాలన్న దాని ఆశ మాత్రము ఉధృతమవుతుంది. ఇలా ఎందుకంటే మానవుడు సత్యముచేత మేల్కొల్పబడినప్పుడు అది ఆవేశానికి లోనవుతుంది, మనుషులు విడుదల మరియు వెలుగు కొరకు అపేక్షించి దాని చెరనుండి విడిపించబడాలన్న వారి అభిలాషపట్ల అది ఒక బలమైన కసిని పెంపొందిస్తుంది. దాని ఆవేశము తన దుష్టత్వమును కాపాడుకొని నిలబెట్టుకోవడానికి ఉద్దేశించబడింది మరియు దాని పాశవికపు స్వభావానికి ఇదొక వాస్తవ ప్రత్యక్షతగా కూడా ఉన్నది.

ప్రతి విషయంలోనూ, సాతాను ప్రవర్తన ద్వారా దాని చెడ్డ స్వభావాన్ని బట్టబయలు చేస్తుంది. మానవుని మీద సాతాను అమలు పరచిన చెడ్డ కార్యాలన్నిటిలోనుండి, అంటే మనిషిని తనను వెంబడించేలా భ్రమింపజేయడానికి చేసిన దాని ప్రారంభ ప్రయత్నాలు మొదలుకొని, మనిషిని దుష్క్రియలలోనికి లాగి అందులోనే, మనిషి మనిషిని దోచుకునే వరకు, దాని నిజ లక్షణాలు బయటపడ్డాక మనిషి గుర్తించి దానిని విడిచిపెట్టిన తరువాత అది మనిషి పట్ల కలిగి ఉండే ప్రతీకార ధోరణి వరకు ఉండే ఈ కార్యాలలో సాతాను చెడ్డ గుణాన్ని బయటపెట్టడంలో ఒక్కటి కూడా విఫలమవ్వదు, లేక అనుకూలమైన సంగతులతో సాతానుకు ఎటువంటి సంబంధం లేదని మరియు చెడ్డ సంగతులన్నిటికీ సాతానే కారకుడన్న నిజాన్ని నిరూపించడంలో ఒక్కటీ విఫలమవ్వదు. దాని ప్రతి ఒక్క క్రియ తన దుష్టత్వాన్ని కాపాడుతూ, న్యాయమైన అనుకూల విషయాలకు విరుద్ధంగా, దాని దుష్కార్యాల కొనసాగింపును నిర్వహిస్తుంది, అది కట్టడలను మరియు మానవజాతి సాధారణ అస్తిత్వపు క్రమాన్ని పాడు చేస్తుంది. ఈ సాతాను కార్యాలె దేవునికి విరోధమైనవిమరియు అవి దేవుని ఉగ్రత చేత నాశనమైపోతాయి. స్వతహాగా సాతానూ కోపాన్ని కలిగి ఉన్నప్పటికీ, దాని రోషము తన చెడ్డ స్వభావాన్ని బయలుపరిచే ఒక ఉపకరణముగా మాత్రమే ఉన్నది. సాతాను ఆగ్రహానికి మరియు ఆక్రోశానికిగల కారణాలు ఏంటంటే: చెప్పలేని దాని పన్నాగాలు బట్టబయలయ్యాయి; దాని కుట్రల నుండి అంత తేలికగా బయటపడవు; దేవునిలా ప్రవర్తించాలి దేవుని స్థానాన్నే పొందాలన్న దాని క్రూరమైన ఆశయం మరియు ఆశ కొట్టి వేయబడి, అడ్డగించబడింది; మానవజాతి మొత్తాన్ని శాసించాలన్న దాని లక్ష్యము శూన్యమై ఎన్నటికీ సాధించలేనిదైపోయింది. కాలానుగుణంగా, దేవుడు తన ఉగ్రతను పదేపదే పంపడమనేది, సాతాను కుయుక్తులు ఫలించకుండా నిరోధించింది మరియు సాతాను దుర్మార్గత వ్యాప్తి చెందుటను మరియు ప్రాబల్యతను తగ్గించింది. ఈ కారణం చేతనే, సాతాను దేవుని ఉగ్రతను ద్వేషిస్తాడు మరియు దేవుని ఉగ్రతను గూర్చి భయపడతాడు. దేవుని ఉగ్రత దిగొచ్చిన ప్రతిసారీ, అది సాతాను అసలైన నీచపు రూపాన్ని బయలుపరచడం మాత్రమే కాదు, కానీ సాతాను చెడ్డ ఆశలను సైతం వెలుగులోనికి తెచ్చి బట్టబయలు చేస్తుంది, ఈ ప్రక్రియలో, మానవజాతి మీద సాతాను ఆవేశానికిగల కారణాలు బయటపెట్టబడతాయి. సాతాను కోపాన్ని వెళ్ళగక్కటమనేది తన దుష్ట స్వభావానికి ఒక నిజమైన ప్రత్యక్షతగా మరియు దాని కుయుక్తులను బట్టబయలు చేయడమై ఉన్నది. నిజానికి, సాతాను క్రోధాన్ని రేపిన ప్రతిసారి అది దుర్మార్గపు పనుల వినాశనాన్ని మరియు సానుకూల విషయాల సంరక్షణ కొనసాగింపును సూచిస్తుంది; ఇది దేవుని ఉగ్రత ఆటంకపరచబడనేరదన్న వాస్తవాన్ని చాటి చెప్తుంది!

ఎవరైనా దేవుని నీతి స్వభావాన్ని తెలుసుకోవడానికి లౌకిక జ్ఞానం మీద మరియు ఊహాగానం మీద ఆధారపడకూడదు

నిన్ను నీవు దేవుని తీర్పును మరియు దండనను ఎదుర్కొంటున్నట్లు నీకు కనబడినప్పుడు, దేవుని వాక్యం మలినమైనదని మీరంటారా? దేవుని కోపం వెనుక ఓ కథనం ఉందని, అది మలినమైనదని నీవు చెప్తావా? ఆయన వైఖరి అంతా అవశ్యముగా నీతి యుక్తమైనది కాదని చెప్పి, నీవు దేవుణ్ణి నిందిస్తావా? దేవుని కార్యాలలో ప్రతీ ఒక్క దాని పట్ల స్పందించేటప్పుడు, నీవు మొదట దేవుని నీతి స్వభావం వేరే ఏ శక్తుల కన్నా అతీతమైనదని, అది పరిశుద్ధమైనదని మరియు నిర్దోషమైనదని రూడీగా ఎరిగి ఉండాలి. ఈ కార్యాలలో దేవుడు మొత్తడం, దండించడం మరియు మానవజాతిని నాశనం చేయడం లాంటివి ఉన్నాయి. ఆక్షేపణ లేకుండా, దేవుని ప్రతీ ఒక్క కార్యం ఆయన సహాజమైన వైఖరి మరియు ఆయన ప్రణాళికకు తగినట్లుగా సరిగ్గా చేయబడుతుంది మరియు మానవాళి యొక్క జ్ఞానం, ఆచారం మరియు సిద్ధాంతంలో ఏ అంశాన్ని కలిగి ఉండదు. దేవుని ప్రతీ ఒక్క కార్యం ఆయన వైఖరి మరియు గుణముల వెల్లడి, మానవజాతి దుర్నీతికి చెందిన దేనికీ సంబంధించింది కాదు. మానవజాతి యెడల దేవుని ప్రేమ, కరుణ మరియు ఓర్పు నిర్దోషమైనవి, మలినం కానివి మరియు పరిశుద్ధమైనవనే అభిప్రాయము మానవజాతికి ఉంది మరియు దేవుని ఆక్రోశం మరియు ఆయన ఉగ్రత సైతం మలినమైనవి కావని ఎవరికీ తెలియదు; అంతే కాకుండా, దేవుడు ఏ అతిక్రమాన్ని ఎందుకు సహించడు లేదా ఆయన ఉగ్రత ఎందుకంత గొప్పది అనేటువంటి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు ఎవరికీ లేవు. దానికి విరోధంగా, కొంతమంది దేవుని ఉగ్రతను అవినీతిపరులైన మానవాళి వంటి చెడ్డ ఆవేశమని పొరబడుతుంటారు మరియు దేవుని క్రోదం చెడ్డవారైన మానవజాతికి ఉన్నటువంటి అదే కోపమని పొరబడుతుంటారు. దేవుని ఆవేశం అన్నది మానవజాతి చెడు వైఖరి యొక్క సహజమైన ప్రత్యక్షత లాంటిదని మరియు పాపిష్టి ప్రజలు కొన్ని బాధాకరమైన స్తితిగతులను ఎదుర్కొన్నప్పుడు దేవుని ఉగ్రతను పంపడం కేవలం వారివంటి కోపమేనని కూడా వారు తప్పుగా భావించారు, మరియు దేవుడు ఉగ్రతను పంపడం ఆయన మనఃస్థితి యొక్క వ్యక్తీకరణ అని విశ్వసిస్తారు. ఈ కూడిక అనంతరం, మీలో ప్రతి ఒక్కరికి ఇకమీదట దేవుని నీతిగల వైఖరిని గూర్చి ఎటువంటి అపార్ధాలు, కల్పనలు లేదా యోచనలు లేవని నేను నమ్ముతున్నాను. నా మాటలు వినిన తరువాత మీ హృదయాలలో దేవుని నీతి గలిగిన వైఖరి యొక్క ఉగ్రతకు అసలైన గుర్తింపు ఉంటుందని, దేవుని ఉగ్రతను గూర్చి గతంలో కలిగి ఉన్న ఏమైనా తప్పుడు అభిప్రాయాలను మీరు పక్కన ఉంచవచ్చని మరియు దేవుని ఉగ్రత భావమును గూర్చిన మీ స్వంత తప్పుడు విశ్వాసాలను మరియు ఉద్దేశాలను మార్చుకోవచ్చని నేను ఆశిస్తున్నాను. అంతే కాకుండా, మీరు మీ హృదయాలలో దేవుని స్వభావాన్ని గూర్చి సరైన అర్ధాన్ని కలిగి ఉంటారని, దేవుని నీతిగలిగిన స్వభావాన్ని గూర్చి మీకు ఇకమీదట ఎటువంటి అనుమానాలు ఉండవని మరియు మీరు దేవుని నిజమైన వైఖరిపై ఎటువంటి మానవ హేతువాదాన్ని లేదా భావనల భారాన్ని వేయరని నేను ఆశిస్తున్నాను. దేవుని నీతిగలిగిన స్వభావమే దేవుని వాస్తవమైన స్వకీయ తత్వం. ఇది ఎదో మనిషి ద్వారా వ్రాయబడింది లేదా రూపించబడింది కాదు. ఆయన నీతిగలిగిన వైఖరే ఆయన నీతిగలిగిన స్వభావమై యున్నది మరియు సృష్టికి చెందిన దేనితోనూ సంబంధం లేదా పొందిక లేదు. దేవుడే స్వయానా దేవుడై యున్నాడు. ఆయన ఎప్పటికీ సృష్టిలో భాగం కాడు మరియు ఆయన సృజించబడిన ప్రాణులలో సభ్యుడిగా మారినా కూడా, ఆయన సహాజమైన వైఖరి మరియు తత్వము మారవు. అందువల్ల, దేవుణ్ణి ఎరగడం అనేది ఒక పదార్దాన్ని తెలుసుకోవడం కాదు; దేవుణ్ణి ఎరగడం అంటే దేన్నైనా విభజించడం కాదు, ఒక మనిషిని అర్థం చేసుకోవడం వంటిది కాదు. ఒక పదార్ధాన్ని లేదా ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నట్లుగా తన ఉహను లేదా పద్ధతిని దేవుణ్ణి ఎరగడానికి మానవుడు వాడినట్లైతే, నీవు దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఎప్పటికీ పొందుకోలేవు. దేవుణ్ణి ఎరగడం అన్నది లౌకిక జ్ఞానం మీద లేదా భావన మీద ఆధారపడడం కాదు, అందువల్ల నీవు నీ లౌకిక జ్ఞానాన్ని లేదా భావనను ఎప్పుడూ దేవునిపై వేయకూడదు; నీ లౌకిక జ్ఞానం మరియు భావన ఎంత గొప్పదైనా సరే, అవి ఇప్పటికీ పరిమితమైనవి. ఇంకా చెప్పాలంటే, నీ భావన సత్యాలకు తగినట్టుగా లేదు మరియు నిజానికి ఎంతో తక్కువగా ఉంది, మరియు అది దేవుని అసలైన వైఖరికి మరియు తత్వానికి విరోధంగా ఉంది. నీవు దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నీ భావనపై ఆధారపడినట్లైతే నీవు ఎప్పటికీ సఫలం కావు. ఉన్న ఒకే ఒక్క దారి ఇదే: దేవుని యెద్ద నుండి వచ్చిన ప్రతిదానిని సమ్మతించండి, ఆ తదుపరి క్రమేపి అనుభూతిని పొంది అర్థం చేసుకోండి. నీ తోడ్పాటు వలన మరియు సత్యం కొరకు నీవు ఆకలిదప్పులు కలిగి ఉన్నందున దేవుడు ఆయనను నిజంగా అర్థం చేసుకోవడానికి మరియు ఎరిగి యుండడానికి నీకు జ్ఞానోదయాన్ని కలిగించే రోజు వస్తుంది. మరియు దీంతో, మన చర్చ యొక్క ఈ భాగాన్ని ముగించుదాం.

మనఃపూర్వకమైన పశ్చాత్తాపం ద్వారా మానవజాతి దేవుని దయ మరియు ఓర్పును పొందుకుంటుంది

“నీనెవెకు దేవుడు ఇచ్చిన రక్షణ” గూర్చిన బైబిల్ కథనం ఈ క్రింది విధంగా ఉన్నది.

యోనా 1:1-2 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, యీలాగు సెలవిచ్చెను. నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

యోనా 3 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా, నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాముచేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

యోనా 4 యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రదుకుటకంటె చచ్చుట మేలు; యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా—నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణములోనుండి పోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిలి యొకటి వేసికొని, పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా, దేవుడైన యెహోవా సొరచెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగినశ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకుపైగా నీడ యిచ్చునట్లు చేసెను; ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి—బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా—ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా—నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.

నీనెవె కథనాన్ని గూర్చిన తాత్పర్యం

“నీనెవెకు దేవుడు ఇచ్చిన రక్షణ” కథనపు నిడివి సంక్షిప్తంగా ఉన్నా కూడా, అది దేవుని నీతి గలిగిన స్వభావపు మరొక వైపు కొంచెం చూడడానికి అనుమతిస్తుంది. ఆ వైపు ఏముందో సరిగ్గా అర్ధమవ్వడానికి, మనం ఖచ్చితంగా తిరిగి లేఖనాలకు వెళ్లి దేవుడు తన కార్యపు ప్రక్రియలో ఆయన జరిగించిన కార్యాలలో ఒకదాన్ని పునఃపరిశీలన చేయాలి.

మనం ముందుగా ఈ కథనం ఆరంభాన్ని పరిశీలిద్దాం: “యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, యీలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక; నీవు లేచి, నినెవే మహా పట్టణమునకు పోయి, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము” (యోనా 1:1-2). లేఖనాల నుండి ఈ వాక్య భాగంలో, యెహోవా దేవుడు యోనాను నీనెవె పట్టణానికి వెళ్ళడానికి ఆదేశించాడని మనకు తెలుసు. ఆయన యోనాను ఈ పట్టణానికి వెళ్లమని ఎందుకు ఆజ్ఞాపించాడు? దీన్ని గూర్చి బైబిల్ నిష్కర్షగా చెప్తుంది ఏంటంటే, ఈ పట్టణస్తుల దోషము యెహోవా దేవుని దృష్టికి ఘోరమైంది, కాబట్టి ఆయన చేయాలనుకున్న దానిని వారికి ప్రకటించడానికి యోనాను పంపించాడు. అయితే యోనా ఎవరన్నది మనకు చెప్పడానికి ఏమీ వ్రాయబడనప్పటికీ, నిజానికి, ఇది, దేవుని గూర్చి తెలుసుకోడానికి సంబంధించింది కాదు, కావున మీరు యోనా అనబడే ఈ మనిషి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దేవుడు యోనాను ఏమి చేయాలని ఆదేశించాడో మరియు అటువంటి దాన్ని చేయడానికి దేవునికి ఉన్న హేతువు ఏమైయున్నదో మాత్రమే తెలుసుకోవడం అవసరం.

యెహోవా దేవుని హెచ్చరిక నీనెవె ప్రజలకు చేరడం

మనం యోనా గ్రంధం మూడో అధ్యాయంలోని రెండో వాక్యభాగాన్ని పరిశీలిద్దాం: “యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచూ ఇక నలువది దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా.” నీనెవె ప్రజలకు చెప్పడానికి దేవుడు సూటిగా యోనాకు పంపించిన మాటలు ఇవే, కాబట్టి నిజానికి, యెహోవా నీనెవె ప్రజలకు చెప్పదలుచుకున్న మాటలు ఇవే. దేవుడు పట్టణస్తులను చీదరించుకోవడం మరియు ద్వేషించడం మొదలు పెట్టాడు, కారణం వారి దోషము ఆయన దృష్టికి ఘోరమైంది, కాబట్టి ఆయన ఈ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడని ఈ మాటలు ప్రజలకు చెప్తున్నాయి. ఏదేమైనా, దేవుడు పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు, ఆయన నీనెవె ప్రజలకు ఒక చాటింపు చేస్తాడు మరియు అదే సమయంలో, వారి దోషమును గూర్చి పశ్చాత్తాపపడి మళ్ళీ మొదలుపెట్టే తరుణాన్ని వారికి ఇస్తాడు. ఈ అవకాశం నలభై దినాలు ఉంటుంది, మరియు అంతకు మించి ఉండదు. ఇంకొక మాటల్లో చెప్పాలంటే, పట్టణంలో ఉన్న మనుష్యులు పశ్చాత్తాపపడకుండా, వారి పాపాలను ఒప్పుకోకుండా, నలభై దినాల్లోపు యెహోవా దేవునికి సాగిలపడకపోయినట్లైతే, దేవుడు సొదొమను నాశనం చేసిన విధంగా పట్టణాన్ని నాశనం చేస్తాడు. నీనెవె పట్టణస్తులకు యెహోవా దేవుడు తెలియచేయాలనుకున్నది ఇదే. తేటగా, ఇది సామాన్యమైన చాటింపు కాదు. అది యెహోవా దేవుని ఆక్రోశాన్ని తెలియపరచడమే కాక, నీనెవె పట్టణస్తుల యెడల ఆయన ప్రవర్తనను సైతం తెలియపరచింది, అయితే అదే సమయంలో పట్టణంలో జీవిస్తున్న మనుష్యులకు తీవ్రమైన హెచ్చరికగా కూడా ఉపయోగపడింది. ఈ హెచ్చరిక అనేది తమ చెడు కార్యాలు దేవుడైన యెహోవాతో తమకు విరోధాన్ని కొని తెచ్చిపెట్టాయని తొందర్లోనే వారి స్వనాశనపు తీరానికి తోడుకెల్తాయని వారికి చెప్పింది. కావున నీనెవెలోని ప్రతీ కాపురస్తుని బ్రతుకు సమీపించి యున్న ఆపదలో ఉంది.

దేవుడైన యెహోవా చేసిన హెచ్చరికకు నీనెవె మరియు సోదోమల ప్రతిస్పందనల మధ్యనున్న పూర్తి వ్యత్యాసం

ధ్వంసం చేయడం అంటే అర్ధం ఏమిటి? వాడుక భాషలో, ఇక ఎప్పటికీ ఉండదని అర్ధము. కానీ ఏ రకంగా? పట్టణమంతటిని ఎవరు ద్వంశం చేయగలరు? మానవునికి అటువంటి పని చేయడం సాధ్యం కాదు. నీనెవె పట్టణస్తులు తెలివితక్కువ వారు కాదు; ఈ చాటింపు వినిన తక్షణమే వారికి ఒక ఉపాయం వచ్చింది. ప్రకటించబడిన విషయం దేవుని యెద్ద నుండి వచ్చిందని వారికి తెలుసు, దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడని వారికి తెలుసు, మరియు వారి దోషము దేవుడైన యెహోవాకు ఆగ్రహాన్ని కలిగించిందని మరియు ఆయన ఆక్రోశాన్ని వారిమీదికి తీసుకు వచ్చిందని, దానివల్ల వారు తొందర్లోనే వారి పట్టణంతో కలిసి నాశనం చేయబడతారని వారికి తెలుసు. దేవుడైన యెహోవా హెచ్చరికను వినిన తరువాత పట్టణస్తులు ఎలా నడుచుకున్నారు? రాజు దగ్గర నుండి సామాన్య మానవుల వరకు పనుష్యులు ఏ విధంగా స్పందించారో బైబిల్ నిర్దిష్టమైన వివరాలతో వర్ణిస్తుంది. క్రింద ఇవ్వబడిన వాక్యాలు లేఖనాలలో వ్రాయబడ్డాయి: “కాబట్టి నీనెవె పట్టణస్తులు ….వారి చేతుల్లో ఉన్నారు.” లేఖనాల్లోని వాక్యాలు ఈ క్రింది విధంగా రాయబడి ఉన్నాయి: “నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాముచేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.”

దేవుడైన యెహోవా చాటింపు వినిన తరువాత, నీనెవె పట్టణస్తులు సొదొమ పట్టణస్తుల స్వభావానికి బొత్తిగా వ్యతిరేక స్వభావాన్ని చూపించారు-అయితే సొదొమ పట్టణస్తులు బాహాటంగా దేవుణ్ణి ఎదిరించారు, అంతకంతకు చెడు ప్రవర్తనను కొనసాగించారు, నీనెవె పట్టణస్తులు, ఈ మాటలను వినిన తరువాత, సంగతిని నిర్లక్ష్యం చేయలేదు, మరియు వారు తిరుగుబాటు చేయలేదు. ప్రత్యామ్నాయంగా, వారు దేవుణ్ణి విశ్వసించి మరియు ఉపవాసాన్ని ప్రకటించారు. ఇక్కడ, “విశ్వసించారు” అన్న పదానికి అర్థం ఏంటి? ఈ పదం విశ్వాసాన్ని మరియు లోబడుటను తెలియచేస్తుంది. ఈ పదాన్ని విశదీకరించడానికి మనం నీనెవె పట్టణస్తుల అసలైన నడవడికను చూస్తే, దేవుడు తాను చెప్పిన విధంగా జరిగించగలడని మరియు జరిగిస్తాడని వారు నమ్మారు, అంతే వారు పశ్చాత్తాపపడడానికి ఇష్టపడ్డారు. సమీపించిన ఆపదను చూసి నీనెవె పట్టణస్తులు భయపడ్డారా? వారి నమ్మకమే వారి హృదయాల్లో భయాన్ని ఉంచింది. కనుక, నీనెవె పట్టణస్తుల విశ్వాసాన్ని మరియు భయాన్ని రుజువు చేయడానికి మనం దేన్ని వాడవచ్చు? బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది: “... ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” చెప్పాలంటే నీనెవే పట్టణస్తులు వాస్తవంగానే విశ్వసించారు మరియు ఈ విశ్వాసం నుండి భయం వచ్చింది, అది వారిని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొనేలా చేసింది. ఈ రీతిగా వారు పశ్చాత్తాపపడటం మొదలు పెట్టాడాన్ని వారు కనుపరిచారు. సొదొమ పట్టణస్తులకు పూర్తి వ్యతిరేకంగా, నీనెవె పట్టణస్తులు దేవుణ్ణి ఎదిరించకపోవడమే కాక, వారి నడవడిక మరియు క్రియల ద్వారా తమ పశ్చాత్తాపాన్ని తేటగా కనుపరిచారు. అవును, ఇది సామాన్య మానవులు మాత్రమే కాదు, రాజుతో సహా మినహాయింపు లేకుండా- నీనెవె పట్టణస్తులందరూ చేసింది ఇదే.

నీనెవె రాజు యొక్క పశ్చాత్తాపం దేవుడైన యెహోవా ప్రశంసను గెలుచుకుంటుంది

నీనెవె రాజు ఈ వార్త వినినప్పుడు, అతను తన సింహాసనం మీద నుండి దిగి, తన రాజ వస్త్రాన్ని తీసివేసి, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆ తర్వాత అతను పట్టణంలో ఎవరూ రుచి చూడకూడదని, గొర్రెలు, ఎద్దులు, వేరే పశువులు మేయడానికి, నీళ్లు తాగడానికి వీలు లేదని చాటించాడు. మానవులు మరియు పశువులు ఒకే విధంగా గోనెపట్ట కట్టుకోవాలి, మరియు మనుష్యులు దేవుణ్ణి మనఃపూర్వకంగా బతిమాలుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ చెడ్డ దారులను విడిచిపెట్టాలని మరియు వారి చేతుల్లోని దౌర్జన్యాన్ని విడిచిపెత్తాలని కూడా రాజు చాటించాడు. ఈ క్రియల క్రమాన్ని బట్టి ఆలోచిస్తే, నీనెవె రాజు తన హృదయంలో నిజమైన పశ్చాత్తాపాన్ని పొందాడు. తన సింహాసనం మీద నుండి దిగి, తన రాజవస్త్రాన్ని ఉపేక్షించి, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవడం వంటి అతను తీసుకున్న ఈ క్రియల క్రమం-నీనెవె రాజు తన రాజరికపు స్థాయిని పక్కనపెట్టి, సామాన్యులతో కలిసి గోనెపట్ట కట్టుకున్నాడని మనుష్యులకు తెలియచేస్తుంది. దేవుడైన యెహోవా చాటింపు వినిన తరువాత నీనెవె రాజు తన చెడు విధానాన్ని లేదా అతని చేతిలో ఉన్న దౌర్జన్యాన్ని కొనసాగించడానికి తన రాజరికపు పదవిని పట్టుకొని ఉండలేదని ఇది తెలియచేస్తుంది; మారుగా, అతను కలిగి ఉన్న అధికారాన్ని పక్కనబెట్టి, దేవుడైన యెహోవా ఎదుట పశ్చాత్తాపాన్ని పొందాడు. ఈ క్షణంలో నీనెవె రాజు ఒక రాజుగా పశ్చాత్తాపపడడం లేదు; దేవునికి లోబడిన ఒక మామూలు వ్యక్తిగా తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడడానికి దేవుని ఎదుటకు వచ్చాడు. అంతేకాకుండా, అతను చేసిన రీతిలోనే దేవుడైన యెహోవా ఎదుట వారి పాపాలను అంగీకరించి పశ్చాత్తాపపడాలని పట్టణమంతటికీ కూడా చెప్పాడు; ఇంకా, ఎలా చేయాలో అతను ఒక స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు, లేఖనాల్లో చెప్పబడినట్లుగా: “మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, అశువులు గానిఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు: … మరియు జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను: అవును, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను.” పట్టణ పాలకునిగా, నీనెవె రాజు ఎంతో ఉన్నతమైన స్థాయిని మరియు అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు అతను చేయాలనుకున్నది ఏదైనా జరిగించగలడు. దేవుడైన యెహోవా చాటింపును ఎదుర్కొన్నప్పుడు, అతను ఆ సంగతిని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు లేదా పశ్చాత్తాపపడి ఏకాంతంగా తన పాపాలను అంగీకరించి ఉండవచ్చు; పట్టణంలో ప్రజలు పశ్చాత్తాపాన్ని కోరుకున్నారా లేదా అనే విషయానికొస్తే, అతను ఈ సంగతిని పూర్తిగా అలక్ష్యం చేసి ఉండవచ్చు. కానీ, నీనెవె రాజు దీనిని ఎంతమాత్రమును చేయలేదు. అతను తన సింహాసనం మీద నుండి దిగి, గోనెపట్ట మరియు బూడిదను వేసుకొని, పశ్చాత్తాపపడి, దేవుడైన యెహోవా ఎదుట తన పాపాలను అంగీకరించడమే కాక, పట్టణంలోని మనుషులందరరూ మరియు పశువులు కూడా అలాగే చేయాలని ఆజ్ఞాపించాడు. అతను ప్రజలను “దేవుని మనఃపూర్వకముగా వేడుకొనవలెను” అని కూడా ఆజ్ఞాపించాడు. ఈ క్రియల క్రమము ద్వారా, నినెవె రాజు వాస్తవంగా ఒక అధికారిగా చేయాల్సిన దాన్ని నెరవేర్చాడు. ఆయన క్రియల రీతి మానవజాతి చరిత్రలో ఏ రాజుకైనా సరే సాధించడం కష్టమైనది, నిజంగా చెప్పాలంటే, వేరే ఏ రాజు వీటిని సాధించలేదు. ఈ క్రియలు మానవజాతి చరిత్రలో అసాదారణమైనవిగా పిలువబడవచ్చు మరియు అవి మానవాళిచే గుర్తించబడడానికి మరియు అనుసరించడానికి తగినవి. మనుషులు ఉద్భవించినప్పటి నుండి, రాజులందరూ తమ ప్రజలను దేవుణ్ణి ప్రతిఘటించడానికి మరియు విరోధించడానికే నడిపించారు. ఎవ్వరు కూడా తన ప్రజలను వారి దుర్మార్గత నుండి విమోచింపబడునట్లు, దేవుడైన యెహోవా క్షమాపణను పొందుకుని రాబోవు శిక్షను తప్పించుకునేట్లు నడిపించలేదు. అయితే, నీనెనె రాజు మాత్రం, తన ప్రజలను వారి దుర్మార్గ సంబంధిత విధానాలను విడిచి వారి హస్తగతమైన దౌర్జన్యాన్ని వదిలిపెట్టి, దేవునివైపు తిరిగేటట్లు నడిపించగలిగాడు. ఇంకా, అతడు తన సిహాసనాన్ని సైతం పక్కన పెట్టగలిగాడు, దానికి బదులుగా, దేవుడైన యెహోవా మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తప్తుడై, తన ఉగ్రతను చల్లార్చుకుని పట్టణస్థులు లయముకాకుండా కాపాడి, వారిని బ్రతుకనిచ్చాడు. మానవ చరిత్రలో ఈ రాజు కార్యాలను మాత్రమే ఒక అరుదైన అద్భుతంగా, అలాగే చెడిపోయిన మానవాళి పశ్చాత్తాపముతో దేవుని యెదుట తమ పాపాలను ఒప్పుకోడానికి ఒక ఆదర్శప్రాయమైన నిదర్శనముగా పిలవబడతాయి.

దేవుడు నీనెవె వాసుల హృదయలోతుల్లోని పశ్చాత్తాపాన్ని చూశాడు

దేవుడు వెల్లడించిన దానిని వినిన తరువాత, నీనెవె రాజు మరియు తన ప్రజలు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. వారి కార్యక్రమాలు మరియు వారి ప్రవర్తనల దృక్పథం ఏమై ఉన్నది? ఇంకా చెప్పాలంటే, ఇదంతా జరిగించడంలో వారి తాత్పర్యము ఏమై ఉన్నది? వారు జరిగించిన దానిని ఎందుకు చేశారు? దేవుని దృష్టిలో వారు యధార్ధంగా పశ్చత్తాపపడ్డారు, ఇది కేవలం వారు మనఃపూర్వకముగా వేడుకుని ఆయన యెదుట తమ పాపాలను అంగీకరించిన కారణంచేత మాత్రమే కాదు, కానీ వారు తమ దుష్ట ప్రవర్తనను కూడా వదిలిపెట్టిన కారణము చేతనై ఉన్నది. దేవుని మాటలను వినిన తరువాత, మిక్కిలి భయబడి దేవుడు చెప్పింది చేస్తాడని విశ్వసించిన కారణం చేతనే, వారు ఈ విధంగా వ్యవరించారు. ఉపవాసముండి, గోనెపట్టలు కట్టుకుని బూడిదలో కూర్చొని ఉండుట ద్వారా, వారు తమ చెడు నడతలను దిద్దుకుని, దుర్మార్గాన్ని విడిచిపెట్టడానికి తమ ఇష్టాన్ని సమ్మతిని తెలియజేయాలని ఆశించారు, మరియు తన కోపాన్ని చల్లార్చుకుని, తన నిర్ణయాన్ని మరియు తమపైకి వచ్చిన కీడును మానుకోవాలని వారు యెహోవా దేవుణ్ణి వేడుకున్నారు. ఒకవేళ మనం వారి నడవడిక అంతటిని పరీక్షించి చూస్తే, తమ గతకాలపు చెడు కార్యాలు దేవుడైన యోహోవాకు హేయమైనవని వారిప్పటికే గ్రహించినట్లుగా మనము చూడొచ్చు, అలాగే ఆయన ఎందుకు తమను త్వరలో నాశనం చేయబోతున్నాడన్న కారణాన్ని వారు గ్రహించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అందుకనే వాళ్ళందరూ ఒక సంపూర్ణ పశ్చాత్తాపాన్ని కలిగి, తమ దుర్మార్గాలను విడిచి తమ హస్తాల్లోని బలత్కారాన్ని మానివేయాలని ఆశించారు. ఇంకా చెప్పాలంటే, దేవుడైన యెహోవా నిర్ణయం గూర్చి వారు అవగాహన పొందిన తరువాత, వారిలో ప్రతి ఒక్కరు తమ హృదయాల్లో భయపడ్డారు; వారు తమ దుష్పరవర్తన మాని ఆపై ఎన్నడూ దేవుడైన యోహోవాకు హేయమైన కార్యాలను చేయలేదు. అదనంగా, వారు తమ పూర్వ పాపాలను క్షమించి తమ గత కార్యాలకు అనుగుణంగా తమతో ప్రవర్తించవద్దని వారు దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నారు. ఒకవేళ అది దేవుడైన యోహోవాకు ఆగ్రహాన్ని కలిగించదు అంటే, వారు ఇంకెప్పుడూ దుర్మార్గములో పాలుపంచుకోకుండా యెహోవా దేవుని ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడానికి వారు సిద్దపడ్డారు. వారి పశ్చాత్తాపము యదార్ధమైనది మరియు పరిపూర్ణమైయున్నది. అది తమ హృదయలోతుల్లో నుండి వచ్చిన నిష్కల్మషమైనది మరియు శాశ్వితమైనది.

ఒక్కసారిగా నీనెవె ప్రజలందరూ, రాజు నుండి సామాన్యుల దాకా, దేవుడైన యెహోవా తమ మీద కోపంగా ఉన్నాడని, తమ తరువాతి కార్యాలను మరియు తమ పూర్తి నడవడికను, అదేవిధంగా తాము చేసుకునే ప్రతి నిర్ణయాలు మరియు ఎన్నికలను, దేవుడు స్పష్టంగా మరియు తేటగా చూడగలడని వారు గ్రహించారు. వారి వైఖరిని బట్టి దేవుని హృదయము మారింది. ఆ క్షణంలో దేవుని ఆలోచనా విధానము ఏమై ఉన్నది? ఆ ప్రశ్నకు బైబిల్ నీకు జవాబివ్వగలదు. లేఖనాల్లో వాక్యాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి: “వారు తమ చెడు నడతలను మానుకొని చేయుచున్న క్రియలను దేవుడు చూచి, పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.” దేవుడు తన మనస్సును మార్చుకున్నప్పటికీ, ఆయన మనస్తత్వములో ఎలాంటి సంక్లిష్టత లేదు. ఆయన మాత్రము తన కోపాన్ని వెల్లడి చేయడం నుండి తన కోపాన్ని చల్లార్చుకునే దాకా వెళ్లి, ఇక నీనెవె పట్టణం మీద కీడును రప్పించకూడదని నిశ్చయించుకున్నాడు. దేవుడు నీనెవె కాపురస్తులను కీడు నుండి కాపాడాలని తక్షణమే ఎందుకు నిశ్చయించుకున్నాడంటే—దేవుడు ప్రతి నీనెవె కాపురస్తుని హృదయాన్ని గమనించాడు. వారు తమ హృదయలోతుల్లో కలిగియున్న, వారి నిజమైన పశ్చాత్తాపాన్ని మరియు వారి పాపాల ఒప్పుకోలును, ఆయన యందు వారు కలిగియున్న యదార్ధమైన విశ్వాసాన్ని, వారి దుష్క్రియలు ఆయన స్వభావానికి ఎలా కోపాన్ని తెప్పించాయన్న వారి లోతైన భావన, మరియు యెహోవా దేవుని రాబోయే శిక్షను బట్టి కలిగే భయాన్ని, ఆయన చూశాడు. దానితో పాటుగా, యెహోవా దేవుడు తాము ఈ కీడును తప్పించుకొనునట్లుగా, తమపై ఎన్నటికీ కోపాన్ని కలిగి ఉండవద్దని బ్రతిమాలుతూ, తమ హృదయలోతుల్లో నుండి చేసిన వారి ప్రార్ధనలు కూడా విన్నాడు. ఈ నిజాలన్నిటినీ దేవుడు గ్రహించినప్పుడు, ఆయన కోపము క్రమముగా చల్లారిపోయింది. ఆయన కోపము ఇదివరకు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఆయన ఈ ప్రజల హృదయలోతుల్లోని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు తన హృదయము స్పర్శించింది, కాబట్టే ఆయన వారిపై కీడును రప్పించడాన్ని భరించలేక, ఆయన వారిపై ఉన్న కోపాన్ని చల్లార్చుకున్నాడు. ప్రతిగా, ఆయన వారిపట్ల తన కరుణ మరియు ఓర్పును విస్తరించడాన్ని కొనసాగించి వారికి దారిచుపి సమకూర్చసాగాడు.

ఒకవేళ దేవుని పట్ల మీకున్న విశ్వాసం వాస్తవమైతే, తరచుగా నీవు ఆయన కాపుదలను పొందుకుంటావు

దేవుడు నీనెవె ప్రజల పట్ల తన అభిప్రాయాలను మార్చుకోవడంలో సందిగ్ధత గాని లేక అనిశ్చయమైన లేక అస్థిరత్వమైన దేని ప్రమేయమూ లేదు. అందుకు బదులుగా, ఇది పూర్తి కోపము నుండి పూర్తి ఓర్పునకు కలిగిన ఒక పరివర్తనయై ఉన్నది. ఇది దేవుని గుణగణమునకు సంబంధించిన ఒక నిజమైన ప్రత్యక్షతయై ఉన్నది. తన కార్యాలయందు దేవుడు ఎన్నడు చంచలంగా మరియు సంశయముగా ఉండడు; ఆయన కార్యాల వెనకున్న నియమాలు మరియు ఉద్దేశ్యాలు అన్నీ తేటగా మరియు పారదర్శకంగా, నీతిగా మరియు నిష్కల్మషంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అంతర్లీనమై లేవు. ఇంకా చెప్పాలంటే, దేవుని గుణగనములో అంధకారము గాని లేక చెడుతనము గాని లేవు. నీనెవె వాసుల దుష్క్రియలు తన దృష్టికి వచ్చిన కారణం చేత దేవుడు వారిని కోపగించుకున్నాడు; ఆ సమయంలో ఆయన కోపము తన లక్షణము నుండి ఉత్పన్నమైనది. అయితే, దేవుడు కోపాన్ని చల్లార్చుకుని నీనెవె ప్రజల మీద ఆయన తన శాంతాన్ని మరోసారి కురిపించాడంటే, ఆయన బయలుపరచిన ప్రతిదీ ఇంకా తన స్వంత లక్షణముగానే ఉన్నది. దేవుని పట్ల మానవుని వైఖరిలో కలిగిన మార్పు వల్లనే ఈ మార్పు మొత్తం సంభవించింది. ఈ కాల వ్యవధి అంతటిలో, నిష్కళంకమైన దేవుని స్వభావము మారలేదు, ఓర్పుతో కూడిన దేవుని గుణగణము మారలేదు, మరియు ప్రేమాకనికరములు గల దేవుని లక్షణమూ మారలేదు. ప్రజలు దుష్క్రియలకు పాల్పడి దేవునిని అవమానించినప్పుడు, ఆయన తన కోపాన్ని వారి పైకి రప్పిస్తాడు. నిజంగా ప్రజలు పశ్చాత్తాపం చెందినప్పుడు, దేవుని హృదయం మారి, తన కోపము సద్దుమణుగుతుంది. ప్రజలు కఠినాత్మకంగా ఆయనను ప్రతిఘటిస్తూ ఉన్నప్పుడు, ఆయన కోపము ఎడతెగకుండా ఉంటుంది, మరియు వారు అంతమయ్యేవరకు ఆయన కోపము ఉగ్రత కొంచెము కొంచెముగా వారిపై ఆపాదించబడుతుంది. ఇదే దేవుని స్వభావానికి సంబంధించిన పరమార్ధమై ఉన్నది. దేవుడు ఉగ్రతను వెల్లడిస్తున్నాడా లేక దయ మరియు ప్రేమాకనికరాలను వెల్లడిస్తున్నడా అన్నదానితో నిమిత్తం లేకుండా, మనిషి నడవడిక, వైఖరి, మరియు తన హృదయలోతుల్లో మానవుడు దేవుని పట్ల కలిగియున్న వైఖరి అనేది దేవుని స్వభావపు ప్రత్యక్షత ద్వారా వెల్లడించబడిన దానిని తెలియజేస్తుంది నిర్దేశిస్తుంది. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని విడువకుండా తన కోపానికి గురిచేస్తే, ఖచ్చితంగా వ్యక్తి హృదయము దేవునిని ఎదిరిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎన్నడూ నిజంగా పశ్చాత్తాపం చెందలేదు, దేవుని యెదుట సాగిలపడలేదు లేక దేవుని పట్ల నిజమైన నమ్మకాన్ని కలిగి లేడు, ఎప్పుడూ వారు దేవుని ఓర్పు కనికరాలను పొందుకోలేదు. ఒకవేళ ఎవరైనా దేవుని కాపుదల, తన కరుణ మరియు తన ఒర్పును తరచుగా పొందుతుంటే, అప్పుడు ఏమాత్రమూ సందేహము లేకుండా ఈ వ్యక్తి వారి మనసులో దేవుని పట్ల నిజమైన విశ్వాసాన్ని కలిగియుండుటను బట్టి, వారి హృదయము ఇక దేవుణ్ణి ఎదిరించదు. ఈ వ్యక్తి ఇక పదేపదే దేవుని యెదుట పశ్చాత్తాపపతాడు; కాబట్టి, ఒకవేళ దేవుని శిక్ష ఈ వ్యక్తి మీదికి తరుచుగా వచ్చినా గాని, ఆయన ఉగ్రత మాత్రం రాదు.

ఈ క్లుప్త సమాచారం అనేది ప్రజలు దేవుని హృదయాన్ని చూడటానికి, యదార్థమైన దేవుని లక్షణాన్ని చూడటానికి, మరియు దేవుని కోపము మరియు ఆయన హృదయములోని మార్పులు ఆకారణముగా కలుగవని కనుగొనటానికి వీలు కల్పిస్తుంది. దేవుడు ఉగ్రతతో ఉన్నప్పుడు ఆయన వ్యక్తపరచిన దానికి తన మనస్సు మార్చుకున్నప్పుడు ఆయన వ్యక్తపరచినది పూర్తి వైవిధ్యముగా ఉన్నప్పటికీ, ఇది దేవుని గుణానికి సంబంధించిన రెండు అంశాలైన—ఆయన కోపము మరియు ఆయన ఒర్పుల మధ్య—ఒక పెద్ద వేర్పాటుతనమో లేక వ్యత్యాసమో ఉన్నదన్నట్లు ప్రజలను నమ్మిస్తూ—నీనెవె ప్రజల పశ్చాత్తాపము పట్ల దేవుని వైఖరిని దేవుని నిజ స్వభావానికి సంబంధించిన ఇంకో రూపాన్ని మరోసారి చూడటానికి ప్రజలకు వీలు కల్పిస్తుంది. దేవుడు మనస్సు మార్చుకోవడం అనేది వాస్తవానికి దేవుని దయ మరియు ప్రేమాకనికరాలకు సంబంధించిన వాస్తవాన్ని మరోసారి చూడటానికి, మరియు దేవుని గుణమునకు చెందిన నిజమైన ప్రత్యక్షతను చూడటానికి వీలు కల్పిస్తుంది. అయితే మానవాళి మాత్రము దేవుని దయ మరియు ప్రేమాకనికరాలు అనేవి కట్టు కథలో, లేక కల్పితాలో కావని గుర్తించాలి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశ్యము వాస్తవం, మరియు దేవుడు మనస్సు మార్చుకోవడమూ నిజం—వాస్తవానికి మానవజాతికి దేవుడు తన దయను మరియు ఓర్పును మరోసారి అనుగ్రహించాడు.

నీనెవె వాసుల హృదయాల్లోని నిజమైన పశ్చాత్తాపము అనేది వారికి దేవుని దయను సంపాదించి పెట్టి తమ సొంత పరిణామాలను మార్చివేస్తుంది

దేవుడు తన మనస్సు మార్చుకోడానికి మరియు తన ఉగ్రతకు మధ్య వ్యత్యాసము ఏమైనా ఉన్నదా? అస్సలు కాదు! ఇది ఎదుకంటే ఆ నిర్దిష్ట సమయంలో దేవుని ఓర్పు దాని కారణాన్ని కలిగి ఉన్నది. ఇది ఏ విధమైన కారణము అయి ఉండవచ్చు? బైబ్లిల్లో, “మనుష్యులందరు తమ దుర్మార్గాన్ని విడిచి తాముచేయు బలాత్కారమును మానివేశారు” అన్నది పొందుపరచబడింది.

ఈ “దుర్మార్గము” కొన్ని దుష్కార్యాలను మాత్రమే కాదు, కానీ ప్రజల ప్రవర్తనను పుట్టించే దుష్టత్వపు మూలాన్ని సూచిస్తుంది. “ఒకరు చెడు నడతను మానుకోవడం” అంటే సందిగ్ధంలో ఉన్నవారు తిరిగి ఈ పనులు చేయరని అర్ధము. ఇంకా చెప్పాలంటే, వారు మరెన్నడూ ఈ దుర్మార్గంలో నడచుకోరు; వారి పనుల విధానము, మూలము, ఉద్దేశ్యము, భావము మరియు నియమము అనీ మారిపోయాయి; వారు తమ హృదయాలకు సంతోషాన్ని మరియు ఆనందాన్ని తెచ్చుకోడానికి ఆ విధానాలను మరియు నియమాలను మరెన్నడూ ఉపయోగించరు. “ఒకరు చేయు బలాత్కారాన్ని మానివేయడం” లోని “మానివేయడం” అంటే విడిచిపెట్టడం లేక విసర్జించడం, గతంతో పూర్తిగా తెగతెంపు చేసుకుని ఎప్పటికీ వెనుతిరగపోవడమని అర్ధమై ఉన్నది. నీనెవె ప్రజలు తాము చేయు బలాత్కారాన్ని మానివేసినప్పుడు, అనేది వారి నిజమైన పశ్చాత్తాపాన్ని కనుపరచి నిరూపించింది. దేవుడు ప్రజల పైరుపాన్ని అలాగే వారి హృదయాలను కూడా లక్ష్యపెడతాడు. దేవుడు నీనెవె ప్రజల హృదయాల్లోని నిజమైన పశ్చాత్తాపాన్ని సంశయించకుండా లక్ష్యపెట్టి వారు తమ దుర్మార్గాలను విడిచి, వారు చేయు బలత్కారాన్ని మానివేశారని గమనించినప్పుడు, ఆయన తన మనస్సును త్రిప్పుకున్నాడు. ఇది ఈ ప్రజల నడవడిక ప్రవర్తన మరియు వాళ్ళు పనులు చేసే పలు విధానాలు, అదేవిధంగా తమ పాపాలను గూర్చి వారి నిజమైన అంగీకారము మరియు పశ్చాత్తాపము అనేవి, దేవుడు తన మనస్సును త్రిప్పుకోడానికి, తన ఉద్దేశాలను మార్చుకోడానికి, తన నిర్ణయాన్ని మానుకోడానికి కారణమయ్యాయని చెప్పడానికే గాని వారిని శిక్షించడానికో లేక నాశనం చేయడానికో కాదు. ఆ విధంగా, నీనెవె ప్రజలు తమకొరకు ఒక విభిన్నమైన ఫలితాన్ని సాధించారు. తమ సొంత బ్రతుకులను విమోచించుకుని, అదే సమయంలో దేవుడు కూడా తన ఉగ్రతను చల్లార్చుకునే స్థాయిలో వారు దేవుని దయను మరియు సహనాన్ని గెలుచుకున్నారు.

మానవుని నిజమైన పశ్చాత్తాపమే గాని—దేవుని దయ మరియు ఓర్పులు అరుదైనవి కావు

నీనెవె ప్రజలపై దేవుడు ఎంత కోపాన్ని కలిగి ఉన్నప్పటికీ, వారు ఒక ఉపవాసాన్ని చాటించి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కుర్చుండిన తక్షణమే, ఆయన హృదయము కరగడము మొదలై ఆయన తన మనస్సును త్రిప్పుకోవడము ప్రారంభించాడు. ఎప్పుడైతే తాను వారి పట్టణాన్ని నశింపజేయబోతున్నానని ఆయన వారికి ప్రకటించాడో—అంటే వారు తమ పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడటానికి ఒక్క క్షణం ముందు కూడా—ఆయన వారిపై ఇంకా కోపముగానే ఉన్నాడు. ఒక్కసారి వారు పశ్చాత్తాప కార్యక్రమాల క్రమాన్ని చేపట్టాక, నీనెవె ప్రజల పట్ల దేవునికున్న కోపము కాస్త వారి పట్ల దయ మరియు ఓర్పుగా పరివర్తనమయ్యింది. అదే సంఘటనలో దేవుని స్వభావానికి చెందిన ఈ రెండు దృక్పథాల సమకాలిక ప్రత్యక్షత గూర్చి ఎలాంటి విరుద్ధత లేదు. మరి, ఈ వైరుధ్యం లేకపోవడాన్ని ఎవరైనా ఎలా అవగాహన చేసుకుని గ్రహించాలి? నీనెవె ప్రజలు పశ్చాతాపపడిన దానికి ప్రతిగా, ప్రజలు దేవుని లక్షణపు యధార్ధతను మరియు నిష్కళంకమును చూడటానికి వీలుపడే విధంగా దేవుడు ఈ రెండు విజాతి ధృవాల లక్షణాలలో ప్రతిదానిని తెలియజేసి బయలుపరిచాడు. దేవుడు ప్రజలను సహించడనో, లేక ఆయన వారిపై దయ చూపడం ఇష్టం లేదనో కాదు గాని; అందుకు బదులుగా, దేవుని వద్ద వారు నిజంగా పశ్చాత్తాపపడటమనేది చాలా అరుదని, ప్రజలు నిజంగా తమ దుర్మార్గాలను విడిచి వారి చేతుల్లోని బలత్కారాన్ని మానివేయడం చాలా అరుదన్న సంగతిని ప్రజలకు చెప్పడానికి దేవుడు తన వైఖరిని ఉపయోగించాడు. ఇంకా చెప్పాలంటే, దేవుడు మనిషి మీద కోపగించుకున్నప్పుడే, మానవుడు నిజంగా పశ్చాత్తాపపడగలడని ఆయన ఆశపడతాడు, మరియు ఆయన మానవుని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన, అదే సందర్భంలో ఆయన మానవునిపై తన దయను మరియు ఓర్పును ఔదార్యంగా అనుగ్రహించడాన్ని కొనసాగించాలని ఆశిస్తాడు. అంటే మానవుని దుష్ప్రవర్తన దేవుని ఉగ్రతను కొనితెస్తుందని, దేవుని మాటను ఆలకించి తన యెదుట నిజంగా పశ్చాత్తాపపడే వారికి, ఆపై తమ దుర్మార్గాలను విడిచి తమ చేతుల్లోని బలత్కారాన్ని మానివేసే వారికి దేవుని దయ మరియు ఓర్పు అనుగ్రహించబడుతుందని అర్ధము. నీనెవె ప్రజల పట్ల ఆయన వ్యవహరించిన విధానంలోనే దేవుని వైఖరి అనేది చాలా స్పష్టంగా బయలుపరచబడింది: దేవుని దయ మరియు సహనాన్ని పొందుకోవడము అస్సలు కష్టమే కాదు, మరియు ఆయన కోరేదల్లా ఎవరైనా నిజంగా పశ్చాత్తాపము చెందడమే. ప్రజలు తమ దుర్మార్గాలని విడిచి తమ చేతుల్లోని బలత్కారాన్ని మానివేసినంత కాలము, దేవుడు వారి పట్ల తన మనస్సు త్రిప్పుకుని తన ధోరణిని మార్చుకుంటాడు.

సృష్టికర్త నీతి స్వభావమనేది వాస్తవమైనది మరియు విశ్వసనీయమైనది

నీనెవె ప్రజల పట్ల దేవుడు మనస్సును త్రిప్పుకున్నప్పుడు, ఆయన చూపిన దయ మరియు ఓర్పు అనేది ఒక నాటకమేనా? అస్సలు కాదు! మరైతే ఈ ఒక్క పరిస్థితిని పరిష్కరించే విధానంలోని దేవుని స్వభావానికి చెందిన ఈ రెండు అంశాల మధ్య కలిగిన పరివర్తన ద్వారా కనుపరచబడింది ఏమిటి? దేవుని స్వభావము అనేది అస్సలు విభజించబడని ఒక సంపూర్ణ సముదాయమైయున్నది. ఆయన ప్రజల పట్ల కోపాన్ని వ్యక్త పరుస్తున్నాడా లేక దయను కనుపరుస్తున్నాడా మరియు సహనాన్ని ప్రదర్శిస్తున్నాడా అన్నది ప్రక్కన పెడితే, ఇవన్నీ ఆయన నీతి స్వభావానికి చెందిన వ్యక్తీకరణలై ఉన్నాయి. దేవుని స్వభావమనేది చాలా కీలకమైనది మరియు సుస్పష్టమైనది, మరియు పరిస్థితులు ఎదుగుతున్న క్రమాన్ని బట్టి ఆయన తన ఉద్దేశ్యాలను మరియు తీరులను త్రిప్పుకుంటాడు. నీనెవె ప్రజల పట్ల ఆయన ధోరణిలో కలిగిన మార్పు అనేది ఆయనకూ తన స్వంత ఉద్దేశాలు మరియు భావాలు ఉన్నాయని చెప్తుంది; ఆయన సజీవుడైన దేవుడే కానీ, ఆయన మర మనిషి లేక మట్టి బొమ్మ కాదు. తమ ప్రవర్తనల కారణం చేత ఆయన వారి గతాలను క్షమించగలిగినట్లే, నీనెవె ప్రజల పట్ల ఆయన కోపాన్నీ కనుపరచగలడు. ఆయన నీనెవె ప్రజలపై విపత్తును రాప్పించాలని నిశ్చయించుకోగలడు, మరియు వారి పశ్చాత్తాపపడిన కారణం చేత ఆయన తన నిర్ణయాన్ని కూడా మార్చుకోగలడు. ప్రజలు నిబంధనలను కఠినంగా పాటించి, వారు సూత్రాలను వాడి దేవుని స్వభావాన్ని అవగాహన చేసుకోడానికి యత్నించిన విధంగానే, ఆ నిబంధనలను వాడి దేవునికి హద్దులను నిర్ణయించడానికి మరియు నిర్వచించడానికి ఇష్టపడతారు. కాబట్టి, మనిషి ఆలోచనా సామర్ధ్యానికి సంబంధించినంత వరకు, దేవుడు యోచించడు, లేదా ఆయనకి ఎటువంటి ప్రధానమైన అభిప్రాయాలు ఉండవు. అయితే నిజానికి, దేవుని ఆలోచనలనేవి వస్తువులు మరియు పరిసర వాతావరణంలోని తేడాలను బట్టి నిత్యమైన రూపాంతర స్థితిలో ఉంటాయి. ఈ ఆలోచనలు రూపాంతరం చెందుతున్న సమయంలో, దేవుని స్వభావపు భిన్నమైన రూపాలు బయల్పరచబడతాయి. ఈ రూపాంతర ప్రక్రియ జరుగుతున్న సమయంలో, దేవుడు హృదయ మార్పును కలిగి ఉన్న సరైన నిముషంలో, ఆయన మానవజాతికి కనుపరిచేది తన జీవితపు అసలైన ఉనికి, మరియు ఆయన నీతియుక్తమైన వైఖరి బలమైన జీవశక్తితో నిండి ఉంటాయి. అదే సమయంలో, దేవుడు తన ఉగ్రతను, జాలిని, ప్రేమపూర్వకమైన కరుణను ఓర్పును మరియు ఉనికిని గూర్చిన సత్యాన్ని మానవాళికి రుజువు చేయడానికి తన స్వంత సత్యమైన ప్రత్యక్షతలను వాడతాడు. సంగతులు ఏవిధంగా పురోగతి చెందుతాయో దానికి తగినట్టుగా ఆయన తత్వము ఏ సమయంలోనైనా మరియు ఏ స్థలంలోనైనా బయల్పరచబడుతుంది. ఆయన ఒక సింహానికి ఉండే రోషాన్ని, ఒక తల్లికి ఉండే దయ మరియు ఓర్పును కలిగి ఉన్నాడు. ఆయన నీతిగలిగిన స్వభావం ఏ వ్యక్తి చేతనైనా ప్రశ్నించబడడానికి, ధిక్కారానికి, మార్పుకు, లేక వక్రీకరించబడడానికి అంగీకరించదు. అన్ని విషయాలలో మరియు అన్ని సంగతులలో, దేవుని నీతిగలిగిన వైఖరి-అంటే, దేవుని ఉగ్రత మరియు దేవుని కరుణ-ఏ సమయంలోనైనా మరియు ఏ స్థలంలోనైనా బయల్పరచబడవచ్చు అని అర్ధం. ఆయన సృష్టియంతటిలో ఉన్న ప్రతీ మూలలోని ఈ అంశాలకు జీవాధారమైన వ్యక్తీకరణను ఇస్తాడు మరియు గడుస్తున్న ప్రతీ క్షణంలో ఆయన వాటిని జీవశక్తితో నెరవేరుస్తాడు. దేవుని నీతి గలిగిన వైఖరి అనేది కాలగతుల చేత పరిమితం కాబడదు; ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని నీతిగలిగిన వైఖరి యాంత్రికంగా తెలియచేయబడదు లేదా కాలగతుల పరిమితులను బట్టి వెల్లడి చేయబడదు, కానీ సంపూర్ణ సౌకర్యంతో అన్ని కాలాల్లో మరియు స్థలాలలో వెల్లడి చేయబడుతుంది. దేవుడు మనసు మార్చుకుని, తన ఉగ్రతను తెలియచేయడం విరమించుకొని, నీనెవె పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండడం మీరు చూసినప్పుడు, దేవుడు కేవలం దయాదాక్షీణ్యాపూర్ణుడు మరియు ప్రేమామయుడని మీరు(లు) చెప్పగలరా? దేవుని ఉగ్రత అనేది నిష్ప్రయోజనమైన మాటలతో కూడుకున్నదని మీరు చెప్పగలరా? దేవుడు భీకరమైన ఉగ్రతతో ఉగ్రుడై ఉండి, తన జాలిని విరమించుకున్నప్పుడు, మానవజాతి పట్ల ఆయన నిజమైన ప్రేమను కలిగి లేడని మీరు చెప్పగలరా? ప్రజల చెడ్డ క్రియలకు సమాధానంగా ఈ భయంకరమైన ఉగ్రత దేవుని చేత వ్యక్తపరచబడింది; ఆయన ఉగ్రత దోషపూరితమైనది కాదు. ప్రజల పశ్చాత్తాపానికి సమాధానంగా దేవుని హృదయం కదిలించబడుతుంది మరియు ఈ పశ్చాత్తాపమే ఆయన హృదయాన్ని మారుస్తుంది. కదిలించబడినట్లు ఆయన భావించినప్పుడు, ఆయన హృదయం మారినప్పుడు మరియు మనిషి పట్ల తన జాలి మరియు ఓర్పును కనుపరచినప్పుడు, ఇవన్నీ పూర్తిగా దోషము లేనివిగా ఉంటాయి; అవి శుద్ధమైనవి, నిర్మలమైనవి, కళంకము లేనివి మరియు నిష్కల్మషమైనవి. దేవుని ఓర్పు ఖచ్చితంగా అదే: సహనం, కేవలం తన జాలి వంటిదే, జాలే తప్ప ఇంకొకటి కాదు. ఆయన వైఖరి మనిషి పశ్చాత్తాపానికి మరియు మనిషి నడవడికలోని విలక్షణాలకు తగినట్లుగా ఉగ్రతను లేదా జాలిని మరియు ఓర్పును వెల్లడిచేస్తుంది. ఆయన ఏమి వెల్లడిచేసినా మరియు వ్యక్తం చేసినా, అదంతా శుద్ధమైనది మరియు సూటియైనది; దాని ధర్మం సృష్టిలో ఉన్న దేనికంటే కూడా ఉన్నతమైనది. దేవుడు తన కార్యాలకు లోపల దాగి ఉన్న సూత్రాలను తెలియచేసినప్పుడు, మరియు ఆయన తలంపులు ఆలోచనలు, ఆయన భావనలు మరియు అయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మరియు ఆయన చేసే ప్రతి ఒక్క కార్యం, అవి ఎటువంటి దోషము, లేదా కళంకము లేనివిగా ఉంటాయి. దేవుడు ఈ రీతిగా నిర్ణయించుకొని మరియు ఆయన ఆ రీతిగా వ్యవహరించాడు కాబట్టి, ఆయన తన కార్యాలను సంపూర్తి చేస్తాడు. తన కార్యాల ఫలితాలు సరియైనవి మరియు ఖచ్చితంగా నిర్దోషమైనవి, ఎందుకంటే వాటి మూలాధారం దోషము లేనిది మరియు కళంకము లేనిది. దేవుని ఉగ్రత నిర్దోషమైనది. అలాగే, దేవుని జాలి మరియు ఓర్పు- సృష్టియంతటిలో ఎవరూ కలిగి ఉండనివి-పరిశుద్ధమైనవి మరియు నిర్దోషమైనవి మరియు ఆలోచనాత్మకమైన చర్చోపచర్చలను మరియు అనుభవాన్ని భరించగలవు.

నీనెవె కథనం మీద మీకున్న అవగాహన ద్వారా, ఇప్పుడు దేవుని నీతిగలిగిన స్వభావపు తత్వానికి ఉన్న మరొక వైపును మీరు గమనించారా? దేవుని అద్వితీయమైన నీతిగలిగిన స్వభావపు వేరొక కోణాన్ని మీరు పరిశీలించారా? మానవజాతిలో ఎవరైనను ఈ విధమైన వైఖరిని కలిగి ఉన్నారా? ఎవరికైనను ఈ విధమైన ఆగ్రహం, దేవుని ఉగ్రత లాంటిది ఉందా? దేవుడు కలిగి ఉన్న జాలి మరియు ఓర్పు ఎవరైనా కలిగి ఉన్నారా? సృష్టిలో ఇంత గొప్ప ఉగ్రతను తెప్పించి, మానవాళిని నాశనం చేయాలని లేదా వినాశనాన్ని రప్పించాలని ఎవరు నిర్ణయించగలరు? మరియు మానవుని మీద జాలిని చూపించడానికి, భరించడానికి మరియు క్షమించటానికి తద్వారా మానవుణ్ణి నాశనం చేయాలనే ఒకని పూర్వపు నిర్ణయాన్ని మార్చడానికి ఎవరు తగినవారు? సృష్టికర్త తన స్వంత అసమానమైన విధానాలు మరియు సూత్రాల ద్వారా తన నీతియుక్తమైన స్వభావాన్ని తెలియచేస్తాడు మరియు ఆయన ఏ ప్రజలు, సంభవాలు లేదా విషయాలచేత విధించబడిన నియంత్రణకు లేదా నియమాలకు లోబడి ఉండడు. తన అసమానమైన వైఖరిని, ఎవరూ ఆయన తలంపులను మరియు భావములను మార్చలేరు, లేదా ఎవరూ ఆయనకూ నచ్చజెప్పలేరు మరియు ఆయన నిర్ణయాలలో దేనిని మార్చలేరు. సృష్టిలో ఉన్న స్వభావాలు మరియు తలంపులన్ని ఆయన నీతియుక్తమైన వైఖరి యొక్క న్యాయతీర్పు క్రింద ఉన్నాయి. ఆయన ఉగ్రతను లేదా జాలిని చలాయిస్తే ఎవరూ ఆపలేరు; సృష్టికర్త తత్వం-లేదా ఇంకో మాటలో చెప్పాలంటే, సృష్టికర్త నీతిగలిగిన స్వభావం మాత్రమే-దీన్ని నిర్ణయించగలదు. సృష్టికర్త నీతిగలిగిన స్వభావపు అద్వితీయమైన లక్షణము అలాంటిది!

నీనెవె పట్టణస్తుల పట్ల దేవుని స్వభావపు రూపాంతరతను పరిశీలించడం మరియు తెలుసుకోవడం ద్వారా, మీరు దేవుని నీతిగలిగిన వైఖరిలో కనిపించే జాలిని వివరించడానికి “ప్రత్యేకమైన” పదాన్ని వాడగలరా? దేవుని ఉగ్రత ఆయన అసమానమైన నీతిగలిగిన స్వభావపు ధర్మంలో ఒక అంశమని మేము ఇదివరకు చెప్పాము. ఇప్పుడు నేను రెండు అంశాలను వ్యాఖ్యానిస్తాను—ఆయన నీతిగలిగిన వైఖరి వంటి—దేవుని ఉగ్రత మరియు దేవుని జాలి-అను రెండు అంశాలను నేను ఇప్పుడు వ్యాఖ్యానిస్తాను. దేవుని నీతిగలిగిన వైఖరి పరిశుద్ధమైనది; అది అపరాధాన్ని లేదా ప్రశ్నించడాన్ని ఒప్పుకోదు; దీన్ని సృజించబడిన లేదా సృజించబడని ప్రాణులలో ఎవరూ కలిగి ఉండలేదు. ఇది దేవునికి నిరుపమానమైనది మరియు విశిష్టమైనది. అంటే దేవుని ఉగ్రత పరిశుద్ధమైనది మరియు నిరపరాధమైనది. అదే రీతిగా, దేవుని నీతిగలిగిన వైఖరిలోని మరొక కోణం-దేవుని జాలి-పరిశుద్ధమైనది మరియు అపరాధానికి పాల్పడదు. సృజించబడిన లేదా సృజించబడని ప్రాణులు ఏవీ దేవుణ్ణి ఆయన క్రియల్లో భర్తీ చేయలేవు లేదా ప్రాతినిధ్యం వహించలేవు, అదే విధంగా సొదొమ వినాశనం లేదా నీనెవె రక్షణలో ఆయనను ఎవరూ భర్తీ చేయలేరు లేదా ప్రాతినిధ్యం వహించలేరు. ఇది దేవుని అసమానమైన నీతిగలిగిన వైఖరికి అసలైన వ్యక్తీకరణ.

మానవజాతి పట్ల సృష్టికర్త కలిగి ఉన్న నిజమైన భావనలు

దేవుణ్ణి తెలుసుకోవడం అంత సులువైన సంగతి కాదని ప్రజలు పదేపదే చెప్తుంటారు. ఏదేమైనా, దేవుణ్ణి తెలుసుకోవడం కష్టసాధ్యమైన సంగతి కాదని నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు తన కార్యాలను మానవుడు తెలుసుకోడానికి పదేపదే చూపిస్తుంటాడు. దేవుడు మానవాళితో తన పరస్పర సంభాషణను ఎప్పుడూ నిలిపివేయలేదు మరియు ఆయన తన్ను తాను మానవునికి ఎన్నడూ మరుగు చేసుకోలేదు మరియు తన్ను తాను దాచుకోలేదు. ఆయన తలంపులు, ఆయన అభిప్రాయాలు, ఆయన మాటలు మరియు ఆయన కార్యాలు మానవజాతికి బయలుపరచబడ్డాయి. కావున, మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని అనుకున్నంత కాలం, తను అన్ని విధాల దారులు మరియు పద్ధతుల ద్వారా ఆయనను అర్థం చేసుకోగలడు మరియు తెలుసుకోగలడు. దేవుడు తనను కావాలనే విసర్జించాడని, దేవుడు కావాలనే మానవజాతికి తనను తాను మరుగు చేసుకున్నాడని, మానవుడు తనను అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోడానికి అనుమతించే అభిమతం దేవునికి లేదని మానవుడు గుడ్డిగా అనుకోవడానికి కారణం ఏంటంటే, అతనికి దేవుడు ఎవరో తెలియదు మరియు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ తనకి లేదు. దాన్ని కూడా మించి, మానవుడు సృష్టికర్త తలంపులను, వాక్యాలను లేదా క్రియలను పట్టించుకోడు. నిజం చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ఖాళీ సమయాన్ని సృష్టికర్త వాక్యాలు లేదా క్రియలపై దృష్టిని కేద్రీకరించడానికి మరియు గ్రహించడానికి వాడితే, సృష్టికర్త తలంపులపై మరియు ఆయన హృదయపు స్వరము వినడానికి కొద్దిగా ఆసక్తిని కనుపరిస్తే, సృష్టికర్త యొక్క తలంపులు, వాక్కులు మరియు క్రియలు కంటికి కనిపించేవని మరియు స్వచ్చమైనవని గ్రహించడం కష్టతరం కాదు. అదే రీతిగా, కొద్దిగా ప్రయత్నిస్తే అన్ని సమయాలలో సృష్టికర్త మానవుల మధ్యనే ఉన్నాడని, ఆయన ఎప్పుడూ మానవునితో మరియు సృష్టి అంతటితో ముచ్చటిస్తుంటాడని మరియు ఆయన ప్రతిదినం నూతన కార్యాలు జరిగిస్తున్నాడని గుర్తించవచ్చు. ఆయన తత్వము మరియు వైఖరి మానవునితో తన పరస్పర సంభాషణలో వెల్లడి చేయబడ్డాయి; ఆయన తలంపులు మరియు అభిప్రాయాలు తన క్రియల్లో సంపూర్ణంగా బయల్పరచబడ్డాయి; ఆయన ఎల్లప్పుడూ మానవాళితో కలిసి ఉండి పరిశీలిస్తాడు. ఆయన మానవాలితో మరియు సృష్టి అంతటితో తన నిశ్శబ్ద వాక్కులతో నిమ్మళంగా మాట్లాడతాడు: “నేను ఆకాశములలో ఉన్నాను, మరియు నేను నా సృష్టి మధ్యన ఉన్నాను. నేను మేలుకొని ఉన్నాను; నేను ఎదురు చూస్తున్నాను; నేను నీ పక్షాన ఉన్నాను....” ఆయన హస్తాలు నులివెచ్చగా మరియు సత్తువగా ఉన్నాయి; ఆయన అడుగుజాడలు ప్రకాశమానమైనవి; ఆయన స్వరం సుకుమారమైనది మరియు దయాళత్వము గలది; ఆయన స్వరూపం సమస్త మానవాళిని కౌగలించుకుంటూ వెళ్తుంది; ఆయన ముఖవైఖరి అందమైనది మరియు మృదువైనది. ఆయన ఎప్పుడూ విడనాడలేదు, ఎన్నడూ కనుమరుగు అవ్వలేదు. రాత్రింబగళ్ళు, ఆయన మానవాళికి నిత్యమైన సహచరుడు, వారి పక్షాన్ని ఎన్నడూ విడనాడడు. ఆయన నీనెవె పట్టణాన్ని కాపాడినప్పుడు మానవజాతి పట్ల తనకున్న బద్దమైన జాగ్రత్త మరియు విశేషమైన వాత్చల్యం, అదేవిధంగా మానవుని పట్ల తన యదార్ధమైన శ్రద్ధ మరియు ప్రేమ కొద్దికొద్దిగా చూపించబడ్డాయి. ప్రత్యేకించి, దేవుడైన యెహోవాకు మరియు యోనాకు మధ్య జరిగిన మారకం, తాను సృజించిన మానవాళి పట్ల సృష్టికర్తకున్న దాక్షిణ్యాన్ని పూర్తిగా బయలు పరచింది. ఆ వాక్కుల ద్వారా, మానవజాతి పట్ల దేవునికి వున్న నిష్కళంకమైన భావాలను గూర్చి నీవు లోతుగా గ్రహింపవచ్చు...

ఈ క్రింది వాక్య భాగము యోనా గ్రంధం 4:10-11లో వ్రాయబడింది: “అందుకు యెహోవా, నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులునుగల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.” ఇవి దేవుడైన యెహోవా అసలైన మాటలు, నమోదు చేయబడిన దేవునికి మరియు యోనాకి మధ్య సంభాషణ. ఈ మారకం సంక్షిప్తంగా ఉన్నా కూడా, ఇది మానవాళి పట్ల సృష్టికర్తకున్న శ్రద్ధ మరియు మానవాళిని విడిచి పెట్టడానికి ఆయన అసమ్మతితో నిండి ఉన్నది. ఈ మాటలు దేవుడు తన సృష్టి కొరకు తన హృదయంలో కలిగి ఉన్న అసలైన స్వభావాన్ని మరియు భావాలను వెల్లడి చేస్తాయి. మానవునికి అరుదుగా వినిపించే స్వచ్చమైన మరియు సరియైన ఈ మాటల ద్వారా, దేవుడు మానవజాతి పట్ల తన అసలైన ఆంతర్యాన్ని వివరిస్తాడు. ఈ మారకం నీనెవె పట్టణస్తుల పట్ల దేవుడు కలిగి ఉన్న దృక్పధాన్ని సూచిస్తుంది-కానీ ఇది ఎటువంటి దృక్పదం? ఇది నీనెవె పట్టణస్తులు పశ్చాత్తాపపడడానికి ముందు మరియు తర్వాత వారి యెడల ఆయన కలిగి ఉన్న తీరు మరియు ఆయన మానవాళితో వ్యవహరించే తీరు. ఈ వాక్యాల్లో ఆయన తలంపులు మరియు ఆయన వైఖరి ఉన్నాయి.

ఈ వాక్యాల్లో దేవుని గూర్చిన ఎలాంటి భావనలు బయలుపరచబడ్డాయి? మీరు పఠించేటప్పుడు మీరు వివరాల మీద ఆశక్తి కలిగి ఉంటే, ఆయన “విచారపడడం” అనే మాటను వాడుతున్నాడని గుర్తించడం మీకు కష్టమేమీ కాదు; ఈ మాటను వాడడం మానవాళి పట్ల దేవుని అసలైన స్వభావాన్ని తెలియచేస్తుంది.

శాబ్దిక స్థాయి పరంగా చూస్తే, “విచారపడడం” అనే మాటను ప్రజలు అనేక విధాలుగా అర్థం చేసుకోగలరు: మొదటిది, “ప్రేమించడం మరియు సంరక్షించడమని, తెలియని దాని పట్ల మృదువైన భావనను కలిగి ఉండటమని అర్దమై ఉనది”; రెండోది, “మనోహర ప్రేమను కలిగి ఉండడం” అని అర్ధమై ఉన్నది; చివరకి, “దేన్నైనా కష్టపెట్టడానికి ఇష్టపడకపోవడం మరియు అలా చేయడాన్ని సహించలేకపోవడం” అని భావమై ఉన్నది. క్లుప్తంగా, ఈ మాట మృదువైన అనురాగాన్ని మరియు ప్రేమను సూచిస్తుంది, అదేవిధంగా ఎవరైనా లేదా దేన్నైనా విడిచిపెట్టడానికి సమ్మతించదు; ఇది మానవుని పట్ల దేవుని జాలి మరియు ఓర్పును సూచిస్తుంది. దేవుడు ఈ మాటను వాడాడు, ఇది సహజంగా మానవులు మాట్లాడే మాట, ఇంకా ఇది దేవుని హృదయ స్పందనను మరియు మానవాళి పట్ల ఆయన స్వభావాన్ని కూడా నిరూపించగలదు.

నీనెవె పట్టణం సొదొమలో వలే దుష్టులైన, దుర్మార్గులైన మరియు దౌర్జన్యపూరితమైన జనులతో నిండి ఉన్నా కూడా, వారి పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని మార్చి వారిని నాశనం చేయకూడదని నిర్ణయం తీసుకునేలా చేసింది. ఎందుకంటే వారు దేవుని వాక్యాల పట్ల మరియు సూచనల పట్ల మసులుకున్న తీరు సొదొమ నివాసుల ప్రవర్తనకి పూర్తిగా భిన్న వైఖరిని కనుపరిచింది మరియు దేవునికి వారి హృదయపూర్వక సమర్పణ మరియు వారి పాపాలను గూర్చిన హృదయపూర్వక పశ్చాత్తాపం, అదేవిధంగా అన్నీ విషయాలలో వారి యదార్ధమైన మరియు మనఃపూర్వకమైన ప్రవర్తన కారణంగా, దేవుడు ఇంకోసారి తన హృదయపూర్వకమైన దయను తెలియచేసి దాన్ని వారికి అనుగ్రహించాడు. దేవుడు మానవజాతికి అనుగ్రహించేదాన్ని మరియు మానవజాతి పట్ల ఆయనకున్న కరుణను నకిలీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు, మరియు ఏ వ్యక్తి అయినా దేవుని దయ, ఆయన సహనం లేదా మానవజాతి పట్ల తనకున్న సద్భావాలను కలిగి ఉండటం అసాధ్యం. నీవు ఘనుడవు లేదా ఘనురాలవని భావించే ఎవరైనా ఉన్నారా, లేదా అసాధారణమైన వ్యక్తి అయినా, గొప్ప స్థానం నుండి, ఘనుడిగా లేదా ఘనురాలిగా మాట్లాడేవారు లేదా ఉన్నతమైన స్థానం నుండి మానవజాతికి లేదా సృష్టికి ఈ విధమైన ప్రకటన చేస్తారా? మానవ జీవన గమనాన్ని తమ అరచేతుల వలే మనుష్యులలో తెలుసుకోగలవారు ఎవరు? మానవజాతి అస్తిత్వపు భారాన్ని మరియు బాధ్యతను ఎవరు వహించగలరు? పట్టణపు నాశనాన్ని ప్రకటించడానికి యోగ్యులెవరు? మరియు ఒక పట్టణాన్ని మన్నించడానికి యోగ్యులెవరు? వారు తాము సృష్టించిన దానిని కాపాడతారని ఎవరు చెప్పగలరు? కేవలం సృష్టికర్త మాత్రమే! సృష్టికర్త మాత్రమే ఈ మానవాళి పట్ల మృదుత్వాన్ని కలిగి ఉన్నాడు. సృష్టికర్త మాత్రమే ఈ మానవాళికి కనికరమును మరియు వాత్సల్యమును చూపిస్తాడు. సృష్టికర్త మాత్రమే ఈ మానవాళి పట్ల అసలైన, విడదీయలేనటువంటి అనురాగాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా, సృష్టికర్త మాత్రమే ఈ మానవాళికి కరుణను దయచేసి తన సృష్టి అంతటినీ కాపాడగలడు. మానవుని ప్రతీ క్రియకు ఆయన హృదయం గంతులు వేస్తుంది మరియు వేదన పడుతుంది: ఆయన మనిషి యొక్క దుష్టత్వంపై మరియు దుర్నీతిపై కోపపడ్డాడు, శ్రమపడ్డాడు మరియు విచారపడ్డాడు; మానవుని పశ్చాత్తాపం మరియు విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, మన్నిస్తాడు మరియు ఉల్లసిస్తాడు; ఆయన తలంపులు మరియు తాత్పర్యాలు ప్రతి ఒక్కటి మానవాళి కొరకే ఉండి మానవాళి చుట్టూ తిరుగుతాయి; ఆయన ఏమై ఉన్నాడో ఏమి కలిగి ఉన్నాడో పూర్తిగా మానవాళి కోసం ఉచ్చరించబడింది; ఆయన భావోద్వేగాలు అన్నీ మానవాళి ఉనికితో పెనవేయబడి ఉన్నాయి. మానవాళి కోసం, ఆయన సంచరిస్తాడు మరియు పరుగులెత్తుతాడు; ఆయన తన జీవితంలోని ప్రతీ బాగాన్ని మౌనంగా ఇస్తాడు; ఆయన తన జీవితంలోని ప్రతీ నిమిషాన్ని మరియు సెకనును అంకితం చేస్తాడు ... తన జీవితాన్ని గూర్చి ఎలా జాలిపడాలో ఆయనకి ఎప్పుడూ తెలియదు, అయినా కూడా ఆయన స్వయంగా సృజించిన మానవాళిని ఎల్లప్పుడూ కాపాడుతాడు. ఈ మానవజాతికి ఆయన కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఆయన తన జాలిని మరియు ఓర్పును షరతులు లేకుండా మరియు పరిహారాన్ని ఆపేక్షించకుండా దయచేస్తాడు. మానవాళి తన కన్నుల ఎదుట మనుగడను కొనసాగిస్తూ, తన జీవితానికి సబంధించిన తన సదుపాయాలను పొందుకోవాలని మాత్రమే ఆయన దీన్ని చేస్తాడు. మానవాళి ఏదో ఒకదినాన ఆయన ఎదుట విధేయత కలిగి మరియు మనిషి అస్తిత్వాన్ని కాపాడి సృష్టి అంతటికీ జీవాన్ని అందించేది ఆయనే అని గుర్తించడానికి మాత్రమే ఆయన దీనిని చేస్తాడు.

మానవజాతి పట్ల సృష్టికర్త తన సద్భావాలను తెలియచేస్తాడు

దేవుడైన యెహోవాకు మరియు యోనాకు మధ్య జరిగిన ఈ సంభాషణ సందేహం లేకుండా మానవజాతి పట్ల సృష్టికర్తకు ఉన్నటువంటి సద్భావాలను తెలియచేస్తుంది. ఒక ప్రక్కన ఇది సృష్టికర్త తన సర్వాదికారం క్రింద ఉన్న సృష్టి అంతటినీ గూర్చిన గ్రహింపును జనులకు సూచిస్తుంది; దేవుడైన యెహోవా చెప్పిన విధంగా, “అయితే నూట ఇరువదివేలకంటే ఎక్కువై కుడిఎడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నినెవే మహాపురము విషయములో నేను విచార పడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను” ఇంకో మాటలో చెప్పాలంటే, నీనెవెను గూర్చి దేవుని అవగాహన చాలా లోతుగా ఉంది. ఆయనకు పట్టణం లోపల ఉన్న ప్రాణుల సంఖ్య (జనులు మరియు పశువులతో సహా) మాత్రమే కాక, వారు కుడిఎడమలు ఎరుగని వారని—అంటే, ఎంతమంది పిల్లలు మరియు యవనస్తులు ఉన్నారన్న విషయాన్ని ఎంతమంది గ్రహించలేకపోయారో కూడా ఆయనకి తెలుసు. మానవాళి పట్ల దేవునికి ఉన్న సంపూర్ణమైన అవగాహనకు ఇది గట్టి నిరూపణ. మరో ప్రక్క, ఈ సంవాదన మానవజాతి పట్ల సృష్టికర్త స్వభావాన్ని, అంటే మానవాళి పట్ల సృష్టికర్త హృదయంలో ఉన్న భారాన్ని జనులకు తెలియజేస్తుంది. దేవుడైన యెహోవా ఈ విధంగా అన్నాడు: “నీవు కష్టపడకుండను, పెంచకుండను; ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి, ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సోరచెట్టు విషయంలో నీవు విచారడుచున్నావే: నీనెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా...?” ఇవి యోనాను నిందించడానికి దేవుడైన యెహోవా చెప్పిన మాటలు, అయితే అవన్నీ సత్యాలే.

నీనెవె పట్టణస్తులకు దేవుడైన యెహోవా మాటలను ప్రకటించాల్సిన బాధ్యత యోనాకు అప్పగించబడినప్పటికీ, అతడు దేవుడైన యెహోవా ఉద్దేశాలను గ్రహించలేదు, లేదా పట్టణస్తుల పట్ల ఆయన బాధను మరియు తలంపులను గ్రహించలేదు. ఈ గద్దింపుతో, మానవజాతి దేవుని స్వహస్తాల ఫలమని, మరియు ఆయన ప్రతి ఒక్క వ్యక్తి పైన శ్రమతో కూడిన కృషిని వెచ్చించాడని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఆశలను తమ భుజాల మీద మోస్తున్నాడని, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని జీవిత సమకూర్పును ఆస్వాదిస్తున్నాడని దేవుడు అతడికి చెప్పాలనుకున్నాడు; ప్రతి వ్యక్తి కోసం, దేవుడు శ్రమతో కూడిన కృషి చేత వెలను చెల్లించాడు. ఈ గద్దింపు అనేది యోనా తనకు తానుగా సొరకాయను బట్టి ఎంతలా సంతోషించాడో అలాగే, దేవుడు కూడా తన స్వహస్తాల కార్యమైన, మానవజాతిని బట్టి సంతోషించాడు అని యోనాకు చెప్పింది. కనీసం పట్టణంలో అనేకమంది పిల్లలు మరియు నిరపరాధ పశుపక్షాదులు ఉన్నాయని కారణం చేతనైనా, దేవుడు మానవజాతిని ఎట్టిపరిస్థితుల్లోనూ, లేక వీలైనంత చివరి క్షణం వరకు విడిచిపెట్టడు. దేవుని సృష్టిలోని కుడిఎడమలను కూడా ఎరుగని ఈ యవ్వన అవివేకపు ఉత్పాదితాలతో వ్యవహరించేటప్పుడు, దేవుడు వారి జీవితాలను ముగించి వారి ఫలితాలను మరీ ఇంత త్వరగా నిర్దేశిస్తాడన్నది నమ్మేట్లు కూడా లేదు. దేవుడు వారి ఎదుగుదలను చూడాలని ఆశపడ్డాడు; వారు తమ పితరులు లాగా అదే మార్గంలోనే నడవకూడదని, వారు యెహోవా దేవుని హెచ్చరికను మరల వినకూడదని, మరియు వారు నీనెవె గతము గురించి సాక్ష్యమిస్తారని ఆయన ఆశపడ్డాడు. అంతకంటే ఎక్కువగా, పశ్చాత్తాపము చెందిన తరువాతి నీనెవెను చూడాలని, పశ్చాత్తాపము చెందిన తరువాతి నీనెవె భవిష్యత్తును చూడాలని, మరియు ఇంకా ప్రాముఖ్యంగా, దేవుని దయలో మరోసారి జీవిస్తున్న నీనెవెను చూడాలని దేవుడు ఆశించాడు. కావున, దేవుని దృష్టిలో, కుడి ఎడమలు ఎరుగని సృష్టి సంబంధిత అంశాలుగా ఉన్నవారే నీనెవె యొక్క భవిష్యత్తుగా ఉన్నారు. దేవుడైన యెహోవా నిర్దేశికత్వంలో వారు నీనెవె గతము మరియు దాని భవిష్యత్తు రెండింటికి సాక్ష్యం ఇచ్చే ప్రధాన బాధ్యతను భుజానికి ఎత్తుకున్నట్లు, వారు నీచమైన నీనెవె గతాన్నీ భుజానికి ఎత్తుకుంటారు. దేవుడైన యెహోవా తన నిజమైన ఉద్దేశాలకు సంబంధించిన ఈ ప్రకటనలో, మానవ జాతి పట్ల సృష్టికర్త దయను పూర్తిగా కనుపరిచాడు. అది “సృష్టికర్త దయ” అనేది ఒక నిష్ఫలితమైన పదము కాదని, మరియు అది ఒక నిస్సారమైన వాగ్దానము కాదని మానవజాతికి కనుపరిచింది; అది పటిష్టమైన నియమాలను, పద్ధతులను మరియు లక్ష్యాలను కలిగి ఉన్నది. దేవుడు సత్యవంతుడు మరియు నిజమైన వాడు, ఆయన ఎలాంటి అపోహలను మరియు వేషధారణనలను ఉపయోగించుకోడు, అదే విధంగా మానవజాతి మీద తన దయను ప్రతి కాలంలో మరియు యుగంలో ఎడతెగకుండా అనుగ్రహిస్తాడు. అయితే, ఈనాటి వరకు, సృష్టికర్త యోనాతో పంచుకోవాల్సినదల్లా, మానవ జాతి పట్ల ఆయన ఎందుకు దయను కనుపరుస్తున్నాడు అన్న దాని గురించి ప్రత్యేకమైన నోటి మాట, మానవజాతి పట్ల ఆయన దయను ఎలా కనుపరుస్తాడు, మానవ జాతి పట్ల ఆయన ఎంతగా సహనాన్ని పాటిస్తాడు మరియు మానవజాతి పట్ల ఆయనకున్న నిజమైన ఉద్దేశాలను గుర్చిన తన మనస్సాక్షియై ఉన్నది. ఈ సంభాషణలోని దేవుడైన యెహోవా పలికిన సంక్షిప్తమైన మాటలు, మానవజాతి ఉద్దేశించిన తన తలంపులను ఒక సమగ్ర మొత్తంగా తెలియజేస్తాయి; అవి మానవ జాతి పట్ల తన హృదయపు వైఖరికి సంబంధించిన ఒక నిజమైన వ్యక్తీకరణగా, మరియు అవి మానవజాతికి తాను అనుగ్రహించిన సమృద్ధియైన దయకు ఒక నిర్దిష్టమైన నిరూపణగా కూడా ఉన్నాయి. ఆయన దయ కేవలము మానవజాతిలోని పెద్దవారి తరాలకు మాత్రమే అనుగ్రహింపబడలేదు, కానీ ఒక తరము నుండి తరువాత తరానికి, ఎప్పటిలాగానే ఇది, మానవజాతిలోని యవ్వనస్తులకు కూడా అనుగ్రహించబడింది. దేవుని ఉగ్రత అనేది మానవజాతి యొక్క కొన్ని దిక్కులు మరియు కొన్ని తరాలమీద తరచుగా దిగి వచ్చినప్పటికీ, దేవుని దయ మాత్రం ఎన్నడూ ఆగలేదు. ఆయన తన దయ చొప్పున, తన సృష్టిలోని ఒక తరం వెంబడి తరానికి మార్గం నిర్దేశము చేసి నడిపిస్తూ, మరియు సృష్టిలోని ఒక తరము వెంబడి తరానికి సమకూర్చి పోషిస్తాడు, ఎందుకనగా మానవజాతి పట్ల ఆయనకున్న భావనలు ఎన్నటికీ మారవు. దేవుడైన యెహోవా “నేను విచారపడవద్దా...?” అని చెప్పినట్లుగా, ఆయన తాను చేసిన సృష్టిని బట్టి ఎల్లప్పుడూ సంతోషించేవాడు. ఇది సృష్టికర్త నీతియుక్తమైన స్వభావపు దయగా, మరియు ఇది సృష్టికర్త సంపూర్ణ విశిష్టతగా కూడా ఉన్నది!

ఐదు రకాలైన ప్రజలు

ఇప్పటికికైతే, దేవుని నీతి స్వభావాన్ని గూర్చిన మన కూడికను ఇక్కడితో ఆపివేస్తున్నాను. ముందుకు సాగుతూ, నేను దేవుని అనుచరులను దేవుని పట్ల వారికున్న అవగాహన బట్టి, ఆయన నీతి స్వభావము పట్ల వారికున్న జ్ఞానము మరియు అనుభవాన్ని బట్టి కొన్ని వర్గాలుగా విభజిస్తాను, దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఏ దశలో ఉన్నారో, అలాగే ప్రస్తుతం మీరున్న దశ స్థాయి ఏమిటన్నది తెలుసుకోవచ్చు. దేవుని పట్ల ప్రజలకున్న జ్ఞానము మరియు ఆయన నీతి స్వభావము పట్ల ఉన్న అవగాహన పరంగా చూస్తే, ప్రజలు నివసించే పలు దశలు మరియు స్థాయిలను బట్టి సాధారణంగా ఐదు రకాలుగా విభజించవచ్చు. ఈ అంశము అద్వితీయ దేవుడు మరియు ఆయన నీతి స్వభావమును తెలుసుకోవడాన్ని గుర్చిన ప్రాతిపదికన నిర్దేశించబడింది. కావున మీరు ఈ క్రింది విషయాన్ని చదువుతున్నప్పుడు, మీరు దేవుని విశిష్టత మరియు ఆయన నీతి స్వభావమునకు సంబంధించి మీరు ఎంతమేరకు అవగాహన మరియు జ్ఞానాన్ని కలిగి ఉన్నారన్నది గుర్తించడానికి శ్రద్దగా ప్రయత్నించాలి, ఆ తర్వాత ఫలితాన్ని ఉపయోగించి మీరు నిజముగా ఏ దశకు చెందినవారు, మీ స్థాయి నిజముగా ఎంత పెద్దది, మరియు మీరు నిజముగా ఎలాంటి వ్యక్తి గా ఉన్నారన్నది నిర్ణయించుకోవాలి.

మొదటి రకము: పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్న ఒక శిశువు దశ

“పొత్తి గుడ్డలలో చుట్టబడియున్న ఒక శిశువు” అనగా అర్థం ఏమిటి? పొత్తి గుడ్డలలో చుట్టబడిన ఒక శిశువు అనగా అప్పుడే లోకంలోనికి వచ్చిన ఒక శిశువు, కొత్తగా పుట్టిన ఒక శిశువని భావము. ఇప్పుడు ప్రజలు అత్యంత అపరిపక్వతతో ఉంటారు.

ఈ దశలో ఉన్న ప్రజలకు దేవునిపై విశ్వాసానికి సంబంధించిన సంగతుల పట్ల ఎలాంటి అవగాహన లేక మనస్సాక్షిని కలిగి ఉండరు. ప్రతిదాని గురించి వారు కలవరపడుతూ అవివేకంగా ఉంటారు. ఈ ప్రజలు దేవుణ్ణి నమ్మి బహుశా కాలం అయ్యి ఉండొచ్చు లేక అస్సలు ఎక్కువ కాలము కాకపోయీ ఉండొచ్చు, కానీ వారి కలవరపాటు మరియు అవివేకపు స్థితి అనేది వారి స్థాయిని పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉన్న ఒక శిశువు దశలో ఉంచుతుంది. పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్న ఒక శిశువు యొక్క పరిస్థితులను గూర్చిన సరిగ్గా చెప్పాలంటే: ఈ రకమైన వ్యక్తులు దేవుణ్ణి ఎంత కాలంపాటు నమ్మినా సరే, వారు ఎల్లప్పుడూ అయోమయంగా, అస్తవ్యస్తంగా, మరియు సాదాసీదాగా మనస్తత్వంతో ఉంటారు; వారు దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తారో వారికి తెలియదు, మరియు దేవుడు ఏమై ఉన్నాడు లేక దేవుడు ఎవరన్నదీ వారికి తెలియదు. వారు దేవుని వెంబడిస్తున్నప్పటికీ, వారి మనస్సులలో దేవుని గూర్చి సరియైన నిర్వచనమేమీ లేదు, వారు నిజంగా దేవుని నమ్మి ఆయనను వెంబడించాలా వద్దా అన్నది పక్కన పెడితే, అసలు వారు అనుసరించే వ్యక్తి దేవుడా కాదా అన్నదీ వారు నిర్ధారించలేరు. ఇది ఈ రకమైన వ్యక్తికి సంబంధించిన వాస్తవ స్థితి. ఈ ప్రజల ఆలోచనలు స్తబ్దుగా ఉంటాయి, సులభంగా చెప్పాలంటే, వారి విశ్వాసమనేది అయోమయంగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ తికమకతో కూడిన విచ్చేష్టమైన స్థితిలోనే ఉంటారు; “గజిబిజితనము,” “అయోమయం,” మరియు “సాధాసీదా మనస్తత్వం” అనేవి వారి స్థితిని సంక్షిప్త పరుస్తాయి. వారు దేవుని అస్తిత్వాన్ని ఎప్పుడూ చూడలేదు మరియు అనుభవించలేదు, అందునుబట్టి, దేవుని గురించి వారికి చెప్పడం అనేది బ్రహ్మలిపిలో రాయబడిన పుస్తకాన్ని వారి చేత చదివించడం వల్ల కలిగే ప్రయోజనం వంటిది—వారు దానిని గ్రహించలేరు మరియు అంగీకరించలేరు. దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అనేది వారికి, అద్భుతమైన ఒక కథను వినడం లాంటిది. వారి తలంపులు స్తబ్దుగా ఉన్నా సరే, దేవుని తెలుసుకోవడం అంటే నిజంగా సమయాన్ని మరియు కష్టాన్ని పూర్తిగా వృధా చేయడమేనని వారు గట్టిగా నమ్ముతారు. ఇది మొదటి రకమైన వ్యక్తి గురించి: పోత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్న శిశువు.

రెండవ రకము: పాలుతాగే శిశువు దశ

పొత్తి గుడ్డలలో చుట్టబడిన శిశువుతో పోల్చి చూస్తే, ఈ రకమైన వ్యక్తి కొంతమేరకు అభివృద్ధి చెందాడు. విచారకరమైన సంగతి ఏమిటంటే, ఇప్పటికీ వారికి దేవుని గురించిన ఏమాత్రమూ అవగాహన లేదు. ఇప్పటికీ వారికి దేవుని పట్ల ఒక స్పష్టమైన అవగాహన గాని దేవుని గూర్చిన బుద్ధి గాని ఏమాత్రం లేదు, మరియు వారు దేవుని ఎందుకు నమ్మాలి అన్నదాని పట్ల కూడా వారు స్పష్టత కలిగి లేరు, అయినప్పటికీ వారు తమ మనసుల్లో సొంత ఉద్దేశాన్ని మరియు స్పష్టమైన భావాలను కలిగే ఉన్నారు. దేవుణ్ణి విశ్వసించడం అన్నది సరైనదా కాదా అన్నదానిపట్ల వారు తమకు తాముగా ఆందోళన చెందరు. దేవుని నమ్మడం ద్వారా వారు వెదికే లక్ష్యము మరియు ఉద్దేశ్యం ఏమిటంటే, ఆయన కృపలో ఆనందించడం, సంతోషాన్ని మరియు సమాధానాన్ని కలిగి ఉండటం, సౌఖ్యమైన జీవితాలను గడపడం, దేవుని కాపుదల మరియు సంరక్షణలో ఆనందించడం, మరియు దేవుని ఆశీర్వాదాలు జీవించడమై ఉన్నది. దేవుణ్ణి వారు ఏ స్థాయి మేరకు తెలుసుకున్నారన్న దాని గురించి వారికి చింత లేదు; వారికి దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలన్న ఆశ లేదు, మరియు దేవుడు ఏమి చేస్తున్నాడు లేక ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడన్న దాని పట్ల వారికి ఎలాంటి పట్టింపు లేదు. వారు కేవలం ఆయన కృపలో ఆనందించడానికి ఆయన ఆశీర్వాదాలు మరింతగా పొందాలని గుడ్డిగా ఆశిస్తారు; వారు ప్రస్తుత యుగంలో ఒక నూరుంతలు, మరియు రాబోవు యుగములో నిత్య జీవితాన్ని పొందుకోవాలని ఆశిస్తారు. వారి తలంపులు, తమ కోసం తాము ఎంత వెచ్చిస్తామన్నది, వారి భక్తి, అలాగే వారి బాధలు, ఇవన్నీ దేవుని కృపను మరియు ఆశీర్వాదాలను పొందాలన్న ఒకే లక్ష్యాన్ని పంచుకుంటాయి. వారికి మరి దేని గురించీ చింత లేదు. కేవలం ఈ రకమైన వ్యక్తి మాత్రమే దేవుడు ప్రజలను కాపాడి వారికి తన కృపను అనుగ్రహించగలడని నిశ్చయంగా చెప్పగల స్పష్టంగా చెప్పగలడు. దేవుడు ఎందుకు మానవుని మనుషులను రక్షించాలని అనుకుంటున్నాడు లేక దేవుడు తన మాటలతో మరియు కార్యముతో ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాడన్న దాని పట్ల వారికి ఆసక్తి లేదు మరియు అంతగా స్పష్టత లేదు. వారు ఎన్నడు దేవుని గుణాన్ని మరియు నీతి స్వభావాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి కృషి చేయలేదు, మరియు అలాగని ఆసక్తినీ కనుపరచలేదు. వారు ఈ సంగతులపై ఆసక్తిని కనుపరచడానికి మొగ్గు చూపలేదు, మరియు వారు వీటిని తెలుసుకోవాలనీ అనుకోవట్లేదు. వారు దేవుని కార్యము గురించి, మానవుని పట్ల దేవునికున్న ఆక్షేపణలను, దేవుని చిత్తము, లేక దేవునికి సంబంధించిన దేనినైనా అడగటానికి, కనీసం ఇలాంటి సంగతులను గురించి అడగడానికి కూడా అస్సలు మొగ్గు చూపరు. దేవుని కృపలో ఆనందించడానికి ఇవి సంబంధమే లేని సంగతులని వారు నమ్ముతూ, మరియు తమ స్వప్రయోజనాలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉన్నారన్న కారణం చేత వారు, మానవునికి కృపను అనుగ్రహించగలిగిన ఒక్క దేవుని పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తారు. వారికి ఇక మరి దేనిమీద శ్రద్ధలేదు, కాబట్టి వారు ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్మినా సరే, సత్యాన్ని గూర్చిన వాస్తవికతలోనికి వారు ప్రవేశించలేరు. పదేపదే వారికి నీరు పోయడమో లేక ఆహారమియ్యడమో చేయకుండా, దేవుని గూర్చిన విశ్వాస మార్గంలో కొనసాగడమనేది వారికి కష్టమవుతుంది. ఒకవేళ వారు గత ఆనందము మరియు సమాధానము లేక దేవుని కృపయందు ఆనందించలేకపోతే, ఇక వారు బహుదూరముగా వెళ్లిపోవలసి వస్తుంది. ఇదే రెండవ రకమైన వ్యక్తిత్వము: పాలుతాగే శిశువు దశలో ఉన్న వ్యక్తి.

మూడవ రకము: పాలు మానిన శిశువు దశ, లేక చిన్న పిల్లల దశ

ఈ వ్యక్తుల సమూహము కొంత వరకైతే ఒక స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటుంది. దేవుని కృపను అనుభవిస్తున్నామంటే దాని అర్థం తాము నిజమైన అనుభవమును కలిగి ఉన్నామనట్టు కాదని వారికి తెలుసు, ఒకవేళ వారు శాంతి సమాధానాన్ని వెతకడంలో, కృపను అనుసరించడంలో, లేక ఒకవేళ దేవుని కృపలో కృపను అనుభవించిన తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా లేక ఆయన దేవుడు వారికి అనుగ్రహించిన ఆశీర్వాదాలు బట్టి ఆయనను స్తుతిస్తూ వారు సాక్ష్యం ఇవ్వగలిగారంటే, దాని అర్థము ఈ సంగతులను బట్టి వారు జీవాన్ని కలిగి ఉంటారని, లేక సత్యమును గూర్చిన వాస్తవికతను వారు కలిగి ఉన్నట్టు కాదన్న సంగతి వారికి తెలుసు. తమ మనస్సాక్షి నుండి మొదలుకొని, వారు దేవుని దయ చొప్పున మాత్రమే జీవించాలన్న విపరీతమైన కోరికలను కలిగి ఉండటం మానేస్తారు; అందుకు బదులుగా, వారు దేవుని కృపను అనుభవిస్తూనే, అదేసమయంలో వారు దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడతారు. వారు వారి బాధ్యతను నెరవేర్చడానికి, కొంచెం కష్టమైన మరియు అలసత్వమైన భరించి, దేవునికి కొంతమేరకు సహకారాన్ని అందించడానికి సిద్ధపడ్డారు. అయితే, దేవుని పట్ల వారికున్న విశ్వాసమును గూర్చిన వారి అన్వేషణ చాలావరకు మలినమైన కారణం చేత, వారిలో దాగున్న వ్యక్తిగత భావనలు మరియు ఆశలు చాలా దృఢంగా ఉన్న కారణము చేత, వారి స్వభావము ఎంతో విపరీతమైన అహంకారంతో కూడి ఉన్నందున, దేవుని ఆశను నెరవేర్చడం లేక దేవునికి లోబడి ఉండటమనేది వారికి చాలా కష్టమవుతుంది. అందుకని, అనేకసార్లు వారు తమ వ్యక్తిగత ఆశలను గుర్తించడము లేక దేవునికి వారు చేసిన వాగ్దానాలను గౌరవించడం వంటివి చేయలేరు. అనేకసార్లు వారు తమకు తాముగా వివాదాస్పద పరిస్థితుల్లో చిక్కుకుంటారు: వారు వీలైనంతమేరకు దేవుణ్ణి ఘనంగా తృప్తి పరచాలని ఎంతగానో ఆశిస్తారు, అయినప్పటికీ వారు ఆయనను ఎదిరించడానికి తమకున్న బలాన్ని మొత్తం ఉపయోగిస్తారు, అనేకసార్లు వారు దేవుని మీద ప్రమాణాలు చేస్తారు, కానీ అంతే త్వరగా వారి ప్రమాణాలను ఉల్లంఘిస్తారు. ఇంకా తరచుగా వారు మరో వివాస్పదమైన పరిస్థితుల్లో తమకు తాముగా చిక్కుకుంటారు: వారు దేవుని మనస్ఫూర్తిగా నమ్ముతారు, అయినా వారు ఆయనను మరియు ఆయన నుండి వచ్చే సమస్తాన్ని నిరాకరిస్తారు; వారు దేవుడు తమను వెలిగించి, తమను నడిపించి, తమకు సమకూర్చి మరియు తమకు సహాయపడతాడని ఆశతో ఎదురుచూస్తారు, అయినప్పటికీ వారు తమ సొంత దారిని ఇంకా వెతుకుతూనే ఉంటారు. వారు దేవుణ్ణి అర్థం చేసుకోవాలని మరియు తెలుసుకోవాలని ఆశిస్తారు, కానీ వారు ఆయనకు దగ్గర అవ్వడానికి మాత్రము ఇష్టపడరు. అందుకు బదులుగా, వారు ఎల్లప్పుడూ దేవునికి దూరమయ్యారు, మరియు ఆయన కొరకు తమ హృదయాలు మూయబడ్డాయి. దేవుని మాటలు మరియు సత్యం గూర్చిన నిజమైన భావము పట్ల వారు పైపైన అవగాహన మరియు అనుభవాన్ని, అలాగే దేవుడు మరియు సత్యము పట్ల పేలవమైన అవగాహనను కలిగి ఉన్నాగానీ, మరో ఆలోచన లేకుండా వారు దేవుడు సత్యమై ఉన్నాడని దృవీకరించలేరు లేక నిర్ధారణ చేయలేరు, మరియు నిజముగా దేవుడు నీతిమంతుడని దృవపరచలేరు. దేవుని నిజమైన అస్తిత్వాన్ని విడిచిపెట్టి, వారు ఆయన స్వభావము మరియు గుణమును గూర్చిన వాస్తవికతను కూడా నిర్ధారించలేరు. దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకము ఎప్పుడు అనుమానాలు మరియు తప్పుడు భావనలను కలిగి ఉంటుంది, మరియు అది ఊహాగానాలు అభిప్రాయాలను కూడా కలిగి ఉంటుంది. వారు దేవుని కృపను అనుభవిస్తూనే, వారు తమ నమ్మకాన్ని వృద్ధి చేసుకోవడానికి, దేవుణ్ణి నమ్మడంలోని తమ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి, దేవునిపై తమకున్న విశ్వాసాన్ని సరిచూసుకోవడానికి, వారు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న జీవన మార్గంలో నడుస్తూ మానవజాతి కోసం ఒక నీతియుక్తమైన ప్రయత్నాన్ని నెరవేర్చడం ద్వారా తమ అహంకారాన్ని తృప్తి పరచుకోవడానికి, వారు ఆచరించగలమని భావించే కొన్ని సత్యాలను కూడా అయిష్టంగానే అనుభవిస్తారు లేక ఆచరిస్తారు. అదే సమయంలో, మానవజాతి కొరకు గొప్ప ఆశీర్వాదాలు అందజేయాలన్న ఆశతో, మరియు తాము దేవుని పొందే వరకు విరమించకూడదన్న తమ ప్రతిష్టాత్మకమైన కోరిక మరియు జీవిత కాలపు వాంఛను తీర్చుకోవడానికి కాసే ఒక పందెములో భాగంగా కూడా వారు ఈ పనులు చేస్తారు. దీవెనలను పొందాలన్న వారి కోరిక మరియు వారి తలంపు వారికి ప్రాముఖ్యం కాబట్టి, ఈ ప్రజలు దేవుని వెలిగింపును పొందుకోలేరు. దీన్ని వదులుకోవటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు, మరియు వాస్తవానికి వారు అలా చేయడాన్ని కూడా భరించలేరు. దీవెనలు పొందుకోవాలన్న ఆశ లేకపోతే, దేవుని పొందే వరకు విరమించకూడదన్న జీవిత కాలపు లక్ష్యమే లేకపోతే, దేవుని నమ్మాలన్న ప్రేరేపణను కోల్పోతామని వారు భయపడుతుంటారు. అందుకని, వాస్తవికతను ఎదుర్కోడానికి వారు ఇష్టపడరు. దేవుని వాక్కులను లేక దేవుని కార్యాన్ని ఎదుర్కోవడము వారికి ఇష్టముండదు. దేవుణ్ణి తెలుసుకోవడమన్న విషయాన్ని ప్రస్తావించడం విడిచిపెట్టి, దేవుని స్వభావాన్ని లేక గుణమును ఎదుర్కోవడమనేది వారికి ఇష్టం ఉండదు. దీనికి కారణం ఏమిటంటే, దేవుడు గనుక తన గుణము, మరియు తన నీతి స్వభావము చేత వారి ఊహాగానాలను మార్చివేస్తే, ఇక వారి కలలన్నీ ధూళిలో కలిసిపోతాయి, మరియు వారు ఏళ్ల తరబడి శ్రమనోర్చి పనిచేయడం ద్వారా కూడగట్టుకున్నమని చెప్పుకునే వారి స్వచమైన విశ్వాసము మరియు “సద్గుణాలు” కనుమరుగై నిష్ప్రయోజనములవుతాయి. ఏళ్లతరబడి తమ చెమట రక్తములను చిందించి గెలుచుకున్న వారి “భూబాగము” పతనాన్ని చవిచూస్తుంది. ఇదంతా ఎన్నో ఏళ్ల వారి కష్టము మరియు కృషి వ్యర్థమైపోయిందని, మరియు మరలా వారు శూన్యం నుండి మొదలు పెట్టవలసి ఉన్నదని సూచిస్తుంది. ఇది వారి మనసుల్లో భరించలేనంత కష్టమైన బాధ మరియు ఇది వారు కనీసం చూడాలని కుడా అనుకోని ఫలితమై ఉన్నది, అందుకే వారు ఎప్పుడూ ఇలాంటి స్థబ్ధతలోనే ఉంటూ, వెనుతిరగడానికి నిరాకరిస్తారు. ఇది మూడవ రకమైన వ్యక్తిత్వము: పాలు మాన్పిన శిశువు దశలో నున్న వ్యక్తి.

పైన పేర్కొన్న మూడు రకాలైన ప్రజలు—అనగా ఈ మూడు దశల్లోనూ—దేవుని గుర్తింపు మరియు స్థాయి లేక అయన నీతి స్వభావము పట్ల నిజమైన విశ్వాసాన్ని ఏమాత్రమూ కలిగిలేకుండా, మరియు ఈ సంగతుల పట్ల స్పష్టమైన, నిర్దిష్టమైన పరిగణన లేక నిశ్చయత లేని ప్రజలై ఉన్నారు. కాబట్టి, ఈ మూడు రకాల ప్రజలు సత్య సంబంధమైన వాస్తవికతలోనికి ప్రవేశించడమనేది చాలా కష్టము, మరియు వారు దేవుణ్ణి నమ్మే విధానము దేవుని పట్ల వారికున్న తప్పుడు ధోరణి అనేది ఆయన వారి హృదయాల్లో కార్యము జరిగించడాన్ని అసాధ్యం చేసిన కారణం చేత, వారు దేవుని దయ, వెలిగింపు, మరియు ప్రకాశాన్ని పొందుకోవడం కూడా కష్టమే. దేవుని గురించిన వారి సందేహాలు, అపార్ధాలు మరియు భావజాలాలు వారి విశ్వాసాన్ని మరియు దైవ జ్ఞానాన్నీ దాటిపోయాయి. ఈ మూడు రకాలైన ప్రజలు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు, మరియు వారు మూడు అత్యంత ప్రమాదకరమైన దశలై ఉన్నారు. దేవుడు, దేవుని గుణము, దేవుని వ్యక్తిత్వము, దేవుడు సత్యమై ఉన్నాడా లేదా మరియు దేవుని అస్తిత్వపు వాస్తవికతకు సంబంధించిన విషయాల పట్ల ఒకరు అనుమానాస్పదమైన ధోరణిని కలిగి ఉన్నప్పుడు, మరియు ఒకరికి ఈ విషయాల పట్ల నిశ్చయత లేనప్పుడు, ఎవరైనా దేవుని నుండి వచ్చే ప్రతిదాన్ని ఎలా అంగీకరించగలుగుతారు? దేవుడు మార్గమును, సత్యమును, మరియు జీవమునై ఉన్నాడన్న సత్యాన్ని ఒకరు ఎలా ఒప్పుకోగలరు? దేవుని దండన మరియు తీర్పును ఒకరు ఎలా అంగీకరించగలరు? దేవుని రక్షణను ఒకరు ఎలా అంగీకరించగలరు? ఇలాంటి వ్యక్తి త్వాన్ని కలిగిన వ్యక్తి దేవుని ఉపదేశాన్ని మరియు సమకూర్పును ఎలా పొందగలడు? ఈ మూడు దశాల్లో ఉన్నవారు ఏ క్షణంలోనైనా దేవుణ్ణి ఎదిరించి, దేవుని పట్ల తీర్పు తీర్చి, దేవుణ్ణి దూషించడమో లేక దేవునికి ద్రోహం చేయడమో చేయవచ్చు. వారు ఏ క్షణంలోనైనా సత్య మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి విడనాడవచ్చు. ఈ మూడు దశల్లోని వ్యక్తులు దేవునియందున్న విశ్వాసానికి సంబంధించి సరియైన త్రోవలో ప్రవేశించని కారణం చేత, వారు ఒక క్లిష్టమైన కాలంలో ఉన్నారని చెప్పవచ్చు.

నాల్గవ రకం: బిడ్డ ఎదిగే దశ, లేక బాల్య దశ

ఒక వ్యక్తి విడిపించబడిన తరువాత—అనగా, వారు సమృద్దియైన కృపను అనుభవించిన తరువాత—వారు దేవుణ్ణి నమ్మడం అంటే ఏమిటన్న దాని గురించి వెదకడం మొదలుపెడతారు, వారు మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు, మనిషి ఎలా బ్రతకాలి, మరియు మనిషి పట్ల దేవుడు తన కార్యాన్ని ఎందుకు జరిగిస్తున్నాడు వంటి పలురకాల ప్రశ్నలను అవగాహన చేసుకోవాలని ఆశిస్తారు. ఎప్పుడైతే అస్పష్టమైన అభిప్రాయాలు మరియు అస్తవ్యస్తమైన ఆలోచనా విధానాలు వారిలో పుట్టుకొచ్చి వారిలో ఉంటాయో, వారిక అనునిత్యము నీరు పోయబడతారు, మరియు వారు తమ కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలుగుతారు. ఈ సమయంలో, వారు దేవుని అస్తిత్వానికి సంబంధించిన సత్యము గురించి ఇకపై ఎలాంటి సందేహాలు లేకుండా, దేవుణ్ణి నమ్మడం అంటే ఏమిటన్న దాని పట్ల వారు నిర్దిష్టమైన అవగాహనను కలిగి ఉన్నారు. దీనిని పునాదిగా చేసుకుని వారు దేవుని గూర్చిన జ్ఞానాన్ని క్రమముగా పొందుకుంటారు, అలాగే వారు దేవుని స్వభావము మరియు గుణమును గుర్చి తమకున్న అస్పష్టమైన అభిప్రాయాలు మరియు అస్తవ్యస్తమైన ఆలోచనా విధానాలకు కొన్ని సమాధానాలను క్రమముగా పొందుకుంటారు. వారి స్వభావములోని మార్పులు అలాగే దేవుని గూర్చిన వారి అవగాహన పరంగా చూస్తే, ఈ దశలోని ప్రజలు సరియైన దారిలో పయనించడం ఆరభించి, ఒక పరివర్తన సమయంలోనికి ప్రవేశిస్తారు. ప్రజలు జీవాన్ని పొందుకోవడం ఈ దశలోనే మొదలవుతుంది. ప్రజలు దేవుణ్ణి అర్ధం చేసుకోవడానికి సంబంధించి తమ మనస్సులలో కలిగియున్న వివిధ ప్రశ్నలైన—అపార్ధాలు, ఊహాగానాలు, భావనలు, మరియు దేవుని గూర్చిన అస్పష్టమైన నిర్వచనాలు వంటి వాటిని క్రమముగా పరిష్కరించుకోవడమే జీవాన్ని కలిగి ఉన్నారనుటకు స్పష్టమైన నిదర్శనాలై ఉన్నాయి—మరియు వారు దేవుని అస్తిత్వపు వాస్తవికతను నిజముగా విశ్వసించి గుర్తించడం మాత్రమే కాదు, కానీ వారు దేవుని గూర్చి నిర్దిష్టమైన నిర్వచనాన్ని కలిగి తమ హృదయాల్లో దేవునికి సరియైన స్థానాన్ని కూడా కల్పిస్తారు, మరియు నిజముగా దేవుని వెంబడించడమనేది వారి విశ్వాసాన్ని పునఃస్థాపన చేస్తుంది. ఈ దశలో, ప్రజలు తాము దేవుని పట్ల కలిగి ఉన్న అపోహలను మరియు తమ తప్పుడు అన్వేషణలను మరియు విశ్వాసపు విధానాలను క్రమక్రమంగా తెలుసుకుంటారు. వారు సత్యము కోసం తపన పడటం, దేవుని తీర్పును, దండన మరియు క్రమశిక్షణను అనుభవించాలని వేడుకోవడం, మరియు తమ స్వభావములో ఒక మార్పు కలగాలని కోరుకోవడాన్ని ఆరంభిస్తారు. ఈ దశలో వారు దేవుని గూర్చిన సమస్త విధాలైన భావనలను మరియు ఊహాగానాలను క్రమముగా విడిచిపెట్టి, అదే సమయంలో వారు దేవుని గూర్చి తమకున్న తప్పుడు అవగాహనను మార్చుకొని సరిదిద్దుకోవడంతో పాటుగా దేవుని గూర్చి కాస్త సరియైన ప్రాథమిక అవగాహనను పొందుకుంటారు. ఈ దశలోని ప్రజలు కలిగి ఉన్న అవగాహనలో ఒక భాగము అంతగా విశేషమైనదో లేక నిర్దిష్టమైనదో కాకపోయినా, కనీసం వారు తమ భావనలను, అపోహలను, మరియు దేవుని గూర్చిన అపార్థాలనైనా క్రమముగా విడిచిపెట్టడం ఆరంభిస్తారు; ఇకపై వారు దేవుని గురించి తమ సొంత భావనలను మరియు ఊహాగానాలను ఏమాత్రమూ కలిగి ఉండరు. వారు విడనాడటం గురించి—అంటే తమ సొంత భావనల మధ్య అగుపడే విషయాలను, అవగాహన సంబంధిత విషయాలు, మరియు సాతాను సంబంధమైన విషయాలను విడనాడటము ఎలానో నేర్చుకోవడం ప్రారంభిస్తారు; వారు సరియైన మరియు సానుకూలమైన విషయాలకు, మరియు దైవ వాక్కుల నుండి వచ్చిన సత్యానుసారమైన విషయాలకు లోబడటానికి కూడా సుముఖత చూపడం ప్రారంభిస్తారు. వారు దేవుని వాక్కులను అనుభవించడానికి, ఆయన మాటలను వ్యక్తిగతంగా తెలుసుకుని జరిగించడానికి, ఆయన మాటలను తమ పనులకు నియమాలుగా మరియు తమ స్వభావమును మార్చుకొనుటకు ఆధారముగా స్వీకరించటానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ సమయంలో, ప్రజలు అనాలోచితంగానే దేవుని తీర్పును మరియు దండనను స్వీకరిస్తారు మరియు అనాలోచితంగానే దేవుని మాటలను తమ జీవంగా అంగీకరిస్తారు. వారు దేవుని తీర్పును, దండనను, మరియు వాక్కులను అంగీకరించేటప్పుడు, తమ హృదయపూర్వకంగా నమ్మే దేవుడు నిజముగా ఉన్నాడని వారు మరి ఎక్కువగా అవగాహన పొంది గ్రహించగలుగుతారు. దేవుని వాక్కులలో, తమ అనుభవాలు మరియు తమ జీవితాల్లో, దేవుడు ఎప్పుడూ మనిషి విధిని శాసించేవాడని మరియు ఎల్లప్పుడూ మానవునికి సమకూర్చి నడిపించేవాడని వారు దృఢముగా భావిస్తారు. వారు దేవునితో కలిగి ఉన్న సాంగత్యాన్ని బట్టి, దేవుని అస్తిత్వాన్ని వారు క్రమ క్రమముగా ధ్రువీకరిస్తారు. కాబట్టి, వారు దాన్ని గుర్తించకముందే, ఇదివరకే వారు దేవుని కార్యాన్ని అవ్యక్తముగానే ఒప్పుకుని దేవుని దృఢముగా విశ్వసించడం మొదలుపెట్టి, వారు దేవుని వాక్కులను అంగీకరించారు. ఒక్కసారి ప్రజలు దేవుని మాటలను మరియు వాక్కులను మరియు కార్యాన్ని అంగీకరించాక, వారు తమను తాము ఉపేక్షించుకుంటారు, తమ సొంత భావనలను తిరస్కరిస్తారు, తమ సొంత జ్ఞానాన్ని నిరాకరిస్తారు, తమ సొంత ఊహాగానాలను ఉపేక్షిస్తారు, అదే సమయంలో సత్యం అంటే ఏమిటని మరియు దేవుని చిత్తము ఏమైయున్నదని కూడా ఎడతెగక వెతుకుతారు. పురోగతి చెందుతున్న ఈ సమయంలో దేవుని పట్ల ప్రజలకున్న అవగాహన చాలా అల్పముగా ఉంటుంది—అవగాహన ఆధారితమైన ఒక పరిజ్ఞానాన్ని మాత్రమే వారు కలిగి ఉన్నారు గాని—వారు ఈ అవగాహనను మాటల్లో స్పష్టంగా విశదీకరించలేరు, మరియు ఇది మొలకెత్తటానికి గల నిర్దిష్టమైన వివరాలను సైతము తెలియజేయలేరు; అయితే, గత మూడు దశలతో పోల్చి చూసినప్పుడు, ఈ కాలపు ప్రజల అపరిపూర్ణమైన బ్రతుకులు ఇప్పటికే నీరు పోయబడడాన్ని మరియు దేవుని మాటల అనుగ్రహాన్ని పొంది, తద్వారా ఇప్పటికే మొలకెత్తడం మొదలుపెట్టాయి. వారి బ్రతుకులు భూమిలో పాతి పెట్టబడిన ఒక విత్తనం లాగా ఉన్నాయి; చెమ్మను మరియు పోషకాలను పొందుకున్న తర్వాత అది మట్టిని ఛేదిస్తుంది, మరియు అది మొలకెత్తడమనేది ఒక నూతన జీవితపు ఆవిర్భావాన్ని సూచిస్తుంది. ఈ ఆవిర్భావమనేది అనేది ఎవరికైనా జీవపు సూచనలను చూడటానికి వీలు కల్పిస్తుంది. ప్రజలకు జీవము కలిగి ఉన్నప్పుడు, వారు ఎదుగుతారు. కాబట్టి, వీటిని పునాదులుగా చేసుకొని—దేవుని నమ్మటము, తమ సొంత భావనలను విడనాడటము, దేవుని మార్గనిర్దేశాన్ని పొందటము వంటి వాటి చేత, తమ బ్రతుకులను సరియైన దారిలో ఉంచుకుని—ప్రజల జీవితాలు నిశ్చయముగా కొంచెం కొంచెంగా ఎదుగుతాయి. దేని ఆధారంగా ఈ ఎదుగుదల కొలవబడుతుంది? ఇది దేవుని వాక్కులతో వ్యక్తి కలిగి ఉన్న అనుభవం మరియు దేవుని నీతి స్వభావము పట్ల తమకున్న నిజమైన అవగాహన అనుసరించి కొలవబడుతుంది. ఈ ఎదుగుదల సమయంలో దేవుని గూర్చి మరియు ఆయన గుణాతిశయమును గురించి వారికున్న అవగాహనను తమ సొంత మాటలను ఉపయోగించి సరిగ్గా వర్ణించడము వారికి ఎంతో కష్టతరమైనప్పటికీ, ఇకపై ఈ ప్రజల సమూహము వ్యక్తిగతముగా దేవుని కృపను అనుభవించటం ద్వారా ఆనందాన్ని అనుసరించడాన్ని, లేక దేవుని కృపను పొందుకోవాలన్న తమ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయనను నమ్మడాన్ని ఇష్టపడదు. అందుకు బదులుగా, వారు దేవుని వాక్యానుసారము బ్రతికే జీవితాన్ని కొనసాగించడానికి మరియు దేవుని రక్షణకు పాత్రులుగా ఉండటానికి ఇష్టపడతారు. అంతేగాక, వారు దేవుని తీర్పు మరియు దండనను స్వీకరించడానికి ఆత్మవిశ్వాసము కలిగి సిద్దముగా ఉన్నారు. ఇది ఎదిగే దశలో ఉన్న ఒక వ్యక్తి కలిగి ఉండే సంకేతమై ఉన్నది.

ఈ దశలోని ప్రజలు దేవుని నీతి స్వభావమును గూర్చి కొంతమేరకు అవగాహన కలిగి ఉన్నప్పటికీ, ఈ అవగాహన గజిబిజిగా మరియు అస్పష్టంగా ఉన్నది. ఈ సంగతులను వారు స్పష్టంగా విషయకరించలేకపోగా విశదీకరించలేకపోగా, దేవుని దండన మరియు తీర్పు ద్వారా వారు దేవుని నీతి స్వభావమునకు సంబంధించి కొంతమేర అవగాహన మరియు జ్ఞానాన్ని పొందిన కారణం చేత, వారు ఇప్పటికే లోలోపల ఏదో సంపాదించేశామని అనుకుంటారు. అయితే, ఇదంతా నిస్సారమైనదే తప్ప మరేమీ కాదు, మరియు ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. దేవుని కృప పట్ల వ్యవహరించే విషయములో ఈ ప్రజల సమూహము ఒక నిర్దిష్టమైన దృష్టి కోణాన్ని కలిగి ఉన్నది, అది వారు అనుసరించే లక్ష్యాలు మరియు వాటిని అన్వేషించే విధానములోని మార్పుల ద్వారా తెలియజేయబడుతుంది. ఇప్పటికే వారు దేవుని మాటలలో మరియు కార్యములో, మానవ సంబంధిత అవసరతలన్నిటిలో మరియు మానవుని గూర్చిన ఆయన ప్రత్యక్షతల విషయాలలో, ఒకవేళ వారు ఇంకా సత్యాన్ని అనుసరించకపోతే, ఇంకా వారు వాస్తవికతలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించకపోతే, ఇప్పటికీ వారు దేవుణ్ణి తృప్తి పరచడానికి మరియు ఆయన వాక్కులను అనుభవపూర్వకముగా తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే, ఇక వారు దేవుని నమ్మటం అనేదాన్ని అర్ధాన్ని కోల్పోతారని చూశారు. దేవుని కృపను వారు ఎంత అనుభవించినా గానీ, వారు తమ స్వభావాన్ని మార్చుకోలేరు, దేవుని తృప్తి పరచలేరు లేక దేవుని తెలుసుకోలేరు, మరియు ఒకవేళ ప్రజలు నిరంతరము దేవుని కృపలో గనుక నిరంతరము జీవిస్తే, ఇక వారు ఎన్నటికీ ఎదుగుదలను సాధించలేరు, జీవాన్ని పొందలేరు లేక దేవుని రక్షణను పొందగలగడాన్నీ సాధించలేరు. ఒక వ్యక్తి నిజముగా దేవుని మాటలను అనుభవించలేక ఆయన వాక్యముల ద్వారా దేవుని తెలుసుకోలేకపోతే, ఇక వారు నిత్యము ఒక శిశువు దశలోనే నిలిచిపోతారు మరియు తమ జీవితపు ఎదుగుదలలో ఒక్క ముందడుగు కూడా వేయలేరు. ఒకవేళ నీవు ఎప్పటికీ శిశు దశలోనే ఉండిపోతే, ఒకవేళ నీవు ఎప్పటికీ దేవుని వాక్యపు వాస్తవికతలోనికి ప్రవేశించకపోతే, ఒకవేళ నీవు దేవుని వాక్యాన్ని నీ జీవితముగా జీవముగా కలిగి ఉండకపోతే, ఒకవేళ నీవు నిజమైన విశ్వాసాన్ని దేవుని జ్ఞానాన్ని ఎన్నటికీ కలిగి ఉండకపోతే, ఇక దేవుని చేత పరిపూర్ణపరచబడటానికి నీకు అవకాశం ఏదైనా ఉంటుందా? అందుచేత, దేవుని వాక్యపు వాస్తవికతలోనికి ప్రవేశించే వారెవరైనా, దేవుని వాక్యాన్ని తమ జీవముగా స్వీకరించే వారెవరైనా, దేవుని దండనను మరియు తీర్పును అంగీకరించే వారెవరైనా, చెడు స్వభావాన్ని మార్చుకునే వారు మరియు సత్యము కొరకై తాపత్రయపడే హృదయాన్ని కలిగిన వారు, దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ గలవారు మరియు దేవుని రక్షణను పొందుకోవాలన్న ఒక కోరికను కలిగిన వారు ఎవరైనా ఉంటే, వీరే నిజముగా జీవాన్ని కలిగి ఉన్న ప్రజలై ఉంటారు. నిజంగా ఇది ఎదుగుచున్న బిడ్డకు చెందిన, బాల్య దశలో ఉన్న వ్యక్తికి సంబంధించిన, నాలుగవ రకమైన వ్యక్తిత్వమై ఉన్నది.

ఐదవ రకము: జీవితపు పరిపక్వ దశ, లేక యుక్త దశ

బాల్య దశ ద్వారా తప్పటడుగులను, మళ్లీ మళ్లీ వచ్చే ఒడుగుదుడుకులతో నిండిన ఒక అభివృద్ధి దశను అనుభవించిన తరువాత, ప్రజల జీవితాలు సుస్థిరమవుతాయి, ముందుకు కొనసాగే వారి అడుగులు ఇక ఎన్నటికీ ఆగవు, మరియు ఎవ్వరూ వాటిని అడ్డుకోలేరు. ముందున్న మార్గము గరుకుగా మరియు గడుసుగా ఉన్నప్పటికీ, ఇకపై వారెన్నటికీ బలహీనమవ్వరు లేక భయపడరు, మరియు ఇకపై వారెన్నడూ ముందుకు తడబడరు లేదా తమ పటుత్వాన్ని కోల్పోరు. వారి పునాదులు దేవుని వాక్యపు నిజమైన అనుభవమందు లోతుగా నాటుకుపోయి, మరియు వారి హృదయాలు దేవుని ఘనత మరియు మహత్యము చేత ఆకర్షించబడ్డాయి. వారు దేవుణ్ణి వెంబడించాలని, దేవుని గుణాతిశయమును తెలుసుకోవాలని, దేవుని గూర్చిన సమస్తమును తెలుసుకోవాలని ఆశపడతారు.

ఈ దశలోని ప్రజలకు తాము ఎవరిని నమ్ముతున్నామన్నది వారికి ఇదివరికే స్పష్టంగా తెలుసు, మరియు తాము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి మరియు తమ జీవితాల పరమార్ధము ఏమిటన్నదీ వారికి స్పష్టముగా తెలుసు. ఎన్నో ఏళ్ల వారి అనుభవంలో, దేవుని తీర్పు మరియు దండన లేకుండా, ఒక వ్యక్తి ఎప్పటికీ దేవున్ని తెలుసుకోలేడని లేక తృప్తి పరచలేడని మరియు దేవుని యెదుటకు నిజముగా ఎప్పటికీ రాలేడని వారు తెలుసుకున్నారు. ఈ ప్రజల హృదయాల్లో దేవుని చేత పరీక్షించబడాలని, తద్వారా తాము పరీక్షించబడుతున్నప్పుడు దేవుని నీతి స్వభావమును చూడవచ్చని, మరియు ఒక స్వచ్ఛమైన ప్రేమను పొందవచ్చని, మరియు అదే సమయంలో దేవుణ్ణి మరింత నిజముగా అవగాహన చేసుకుని తెలుసుకోవచ్చన్న ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు. ఈ దశలో ఉన్న ప్రజలు ఇప్పటికే శిశువు దశకు, మరియు దేవుని కృపను ఆనందిస్తూ తమ నిండారా రొట్టెలను తినే దశకు పూర్తిగా వీడ్కోలు పలికేశారు. దేవుడు వారిని సహిస్తూ కరుణను చూపాలన్న మితిమీరిన ఆశలను వారెన్నటికీ పెట్టుకోరు; అందుకు బదులుగా, తమ చెడ్డ స్వభావము నుండి తమ్మును తాము వేరు చేసుకొని దేవుని తృప్తి పరచాలన్నట్టుగా, వారు నిత్యమైన దేవుని దండన మరియు తీర్పును పొందడానికి ఆశ కలిగి సంసిద్ధంగా ఉన్నారు. దేవుని గూర్చిన వారి జ్ఞానము మరియు వారి అన్వేషణలు, లేక వారి అన్వేషణల అంతిమ లక్ష్యాలు, అన్నీ వారి హృదయాల్లో ఎంతో స్పష్టంగా ఉన్నాయి. కావున, యుక్త దశలో ఉన్న ప్రజలు ఇప్పటికే చంచలమైన విశ్వాసపు దశకు, రక్షణ కొరకు వారు కృప మీద ఆధారపడే దశకు, అపరిపక్వమైన జీవితపు దశకు, స్పష్టత లేని దశకు, తడబడే దశకు, తరచుగా నడిచేందుకు మార్గమే లేని దశకు, అకస్మాత్తుగా కలిగే వెచ్చదనము మరియు చల్లదనము మధ్య మారుతున్న అస్థిరమైన కాలానికి, మరియు ఎవరైనా కళ్ళు మూసుకొని దేవుణ్ణి వెంబడించే దశకు పూర్తిగా వీడ్కోలు పలికారు. ఈ రకమైన ప్రజలు తరచుగా దేవుని వెలిగింపును మరియు ప్రకాశత్వమును పొందుతూ, తరచుగా దేవునితో నిజమైన సహవాసములో మరియు అనుసంధానములో నిమగ్నమై ఉంటారు. ఈ దశలో జీవిస్తున్న ప్రజలు ఇప్పటికే దేవుని చిత్తానికి సంబంధించిన కొంత భాగాన్ని గ్రహించారని, వారు చేస్తున్న ప్రతి దానిలో సత్య సంబంధమైన నియమాలను కనుగొనగలుగుతున్నారని, మరియు దేవుని ఆశను ఎలా తృప్తి పరచాలన్నది వారికి తెలుసని ఎవరైనా చెప్పగలరు. ఇంకా చెప్పాలంటే, వారు దేవుని తెలుసుకునే మార్గాన్ని కనుగొని దేవుని గూర్చి వారికున్న జ్ఞానాన్ని సాక్ష్యమివ్వడం కూడా ప్రారంభించారు. నెమ్మదిగా వృద్ధి చెందుతున్న ప్రక్రియలో, వారు దేవుని చిత్తాన్ని, మానవజాతిని సృజించటంలో దేవుని చిత్తాన్ని మరియు మానవజాతిని కొనసాగించడంలో దేవునికున్న సంకల్పాన్ని క్రమ క్రమముగా అర్ధం చేసుకుని అవగాహనను పొందుకుంటారు. గుణగణాల పరంగా వారు దేవుని నీతి స్వభావాన్ని క్రమం క్రమముగా అర్ధం చేసుకుని అవగాహనను పొందుకుంటారు. ఈ జ్ఞానాన్ని మానవునికి సంబంధించిన ఏ ఆలోచన గాని ఊహాగానము గాని భర్తీ చేయలేదు. ఐదవ దశలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితము పూర్తిగా పరిపక్వత చెందినదని లేక ఈ వ్యక్తి నీతిమంతుడని లేక సంపూర్ణుడని ఎవరు చెప్పలేకపోయినప్పటికీ, ఈ రకమైన వ్యక్తి దేవుని వాక్యముతో మరియు దేవునితో ముఖాముఖిగా నిలబడటానికి, జీవితపు పరిపక్వత దశవైపు ఇప్పటికే అడుగు వేసి ఇదివరికే దేవుని యెదుటకు రాగలిగాడు. ఈ రకమైన వ్యక్తి దేవుని వాక్యమును ఎంతగానో అనుభవించి, లెక్కలేనన్ని శ్రమలను అనుభవించి మరియు లెక్కలేనంతగా దేవుని క్రమశిక్షణ, తీర్పు మరియు దండనను అనుభవించాడు కాబట్టి, దేవుని పట్ల వారు కలిగి ఉండే సమర్పణ సంపూర్ణమైనదే కాని సాపేక్షమైనది కాదు. దేవుని గూర్చిన వారి జ్ఞానము అస్పష్టత నుండి స్పష్టమైన మరియు నిర్దిష్టమైన జ్ఞానానికి, చంచలత్వము నుండి లోతుగా, కళంకము మరియు మబ్బుతనము నుండి శ్రద్దపూర్వకమైన స్పర్శనీయతకు రూపాంతరము చెందింది. వారు కఠినాత్మకమైన తడబాటు మరియు పరోక్షమైన వెతుకులాట నుండి శ్రమలేని జ్ఞానమునకు మరియు చురుకుగా సాక్ష్యమివ్వడం వరకు వచ్చారు. ప్రజలు దేవుని వాక్యపు వాస్తవికతకు సంబంధించిన సత్యాన్ని కలిగి, వారు పేతురు నడిచిన మార్గం లాగా పరిపూర్ణతవైపుగా అడుగులు వేశారని చెప్పవచ్చు. యుక్త దశ—ఇది ఒకరు పరిణితి చెందిన స్థితిలో జీవించే ఐదవ రకమైన వ్యక్తిత్వమై ఉన్నది.

డిసెంబరు 14, 2013

మునుపటి:  ఉపోద్ఘాతము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger