దేవుడు తనకు తానే అద్వితీయుడు III

దేవుని అధికారం (II)

ఈ రోజు మనం “దేవుడు ప్రత్యేకమైనవాడు” అనే అంశంపై సహవాసాన్ని కొనసాగిద్దాం. ఇప్పటికే ఈ అంశం గురించి మనం రెండు సహవాసాలు కలిగి ఉన్నాం, మొదటిది దేవుని అధికారాన్ని గురించి మరియు రెండవది దేవుని నీతిని గురించి సహవాసమును కలిగియున్నాము. ఈ రెండు సహవాసాలను విన్న తరువాత, మీరు దేవుని గుర్తింపును గూర్చి, ఆయన స్థాయిని గూర్చి మరియు ఆయన గుణగణాలను గూర్చి నూతన అవగాహనను పొందారా? ఈ ఆలోచనలు దేవుని ఉనికిని గూర్చిన నిర్దిష్టమైన సత్యమును మరియు మరింత ఎక్కువ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి మీకు సహాయపడ్డాయా? ఈ రోజు నేను “దేవుని అధికారం” అనే అంశాన్ని మరింతగా వివరించాలనే ప్రణాళికను కలిగియున్నాను.

సూక్ష్మ మరియు బృహత్తర దృష్టికోణముల నుండి దేవుని అధికారాన్ని అర్థం చేసుకొనుట

దేవుని అధికారం ప్రత్యేకమైనది. ఇది స్వయాన దేవుని గుర్తింపుయైయున్నది, విశేషమైన గుణమైయున్నది మరియు గుణలక్షణమును వ్యక్తీకరణయైయున్నది, అంటే సృష్టించబడిన, సృష్టించబడని మరే ఇతర జీవి కూడా ఈ గుణాన్ని స్వాధీనము చేసుకోలేదు; కేవలం సృష్టికర్త మాత్రమే ఈ విధమైన అధికారాన్ని కలిగి ఉంటాడు. మరోవిధంగా చెప్పాలంటే, సృష్టికర్త మాత్రమే, అంటే ప్రత్యేకమైనదేవుడు మాత్రమే ఈ విధంగా వ్యక్తము చేయగలడు మరియు ఈ గుణాన్ని కలిగి ఉండగలడు. అయితే, మనం దేవుని అధికారం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? స్వయాన దేవుడు కలిగియున్న అధికారానికి మనుష్యుడు దేవుని అధికారమును గూర్చి తన మనస్సులో అర్థము చేసుకున్న “అధికారానికి” ఎలాంటి వ్యత్యాసమున్నది? దీని ప్రత్యేకత ఏంటి? దీనిని గురించి ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడడం ఎందుకంత ప్రాముఖ్యం? మీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిగణించాలి. చాలా మందికి, “దేవుని అధికారం” అనేది అస్పష్టమైన ఆలోచనయైయున్నది, దీనిని అర్థం చేసుకోవాలంటే ఎంతో గొప్ప ప్రయాస పడవలసిన అవసరం ఉంది. దీనిని గూర్చిన ఏ చర్చయైన స్పష్టంగాను సమాహారముగాను ఉండాలి. అందుచేత, దేవుని అధికారం గురించి మనిషి కలిగియున్న జ్ఞానానికి, దేవుని అధికారం యొక్క గుణలక్షణానికి మధ్య ఎల్లప్పుడూ అంతరము ఉంటుంది. ఈ అంతరాన్ని పూడ్చాలి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని అధికారం గురించి ప్రజల ద్వారా, సంఘటనల ద్వారా మరియు మనిషికి అందుబాటులో ఉన్న, తమ వాస్తవ జీవితాల్లో అర్థం చేసుకోగలిగే సామర్థ్యంలో ఉన్నటువంటి వివిధ సంఘటనల ద్వారా క్రమంగా తెలుసుకోవాలి. “దేవుని అధికారం” అనే మాట అర్థం చేసుకోలేనిదిగా ఉన్నప్పటికిని, దేవుని అధికారం గూఢమైన విషయం కాదు. మనిషి జీవితంలో ప్రతి నిమిషం ఆయన అతనితో ఉండి, అతనిని ప్రతి దినం నడిపిస్తున్నాడు. కాబట్టి, నిజ జీవితంలో ప్రతి వ్యక్తి దేవుని అధికారం యొక్క అత్యంత గ్రహింపశక్యమైన అంశాన్ని ఖచ్చితంగా చూస్తాడు మరియు దానిని అనుభవిస్తాడు. దేవుని అధికారము ఉనికిలో ఉందనడానికి గ్రహింపశక్యమైన ఈ అంశమే తగిన రుజువైయున్నది మరియు దేవుడు అలాంటి అధికారాన్ని కలిగియున్నాడనే సత్యాన్ని ఒక వ్యక్తి గుర్తించడానికి మరియు గ్రహించడానికి ఇది పూర్తిగా అనుమతిస్తుంది.

దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, మరియు సమస్తాన్ని సృష్టించినప్పుడు, ఆయన సమస్తముపై అధికారాన్ని కలిగియున్నాడు. సమస్తముపైన అధికారాన్ని కలిగి ఉండడంతోపాటు, ఆయన సమస్తాన్ని తన తన నియంత్రణలో ఉంచుకున్నాడు. “దేవుడు సమస్తాన్ని నియంత్రణలో ఉంచుకున్నాడు” అనే ఆలోచనకు అర్థం ఏమిటి? దీన్ని ఎలా వివరించాలి? ఇది వాస్తవ జీవితానికి ఎలా వర్తిస్తుంది? దేవుడు సమస్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నాడు అనే వాస్తవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన అధికారాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా నడిపిస్తుంది? “దేవుడు సమస్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నాడు” అనే మాటను ఆలోచిస్తే, దేవుడు గ్రహాల్లో కొంతభాగాన్ని, సృష్టిలో కొంత భాగాన్ని, మానవజాతిలో చాలా తక్కువ భాగాన్ని నియంత్రిస్తాడని కాదు గాని సమస్తాన్ని నియంత్రిస్తాడు అనే విషయాన్ని మనం చూడాలి: బృహత్తరమైన వాటి నుండి సూక్ష్మమైన వాటి వరకు, కనిపించేవాటి నుండి కనిపించని వాటి వరకు, ఆకాశ నక్షత్రాల నుండి భూమిపై కంటికి కనిపించని సూక్ష్మజీవులతో పాటు, ఇతర ఆకృతలలో ఉండే జీవరాసులన్నింటి వరకు ప్రతి దానిపై ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు. ఇదీ “సమస్తము” పైన దేవుడు “నియంత్రణ” కలిగియున్నాడు అనే మాట యొక్క ఖచ్చితమైన నిర్వచనమైయున్నది; ఇదీ ఆయన అధికారం యొక్క పరిధి, ఆయన సార్వభౌమాధికారం మరియు ఆయన పాలన యొక్క విస్తృత స్థాయియైయున్నది.

ఈ మానవజాతి ఉనికిలోకి రాక మునుపు, విశ్వం—అంటే ఆకాశాలలోని గ్రహాలన్నీ, పరలోకంలోని నక్షత్రాలన్నీ ఉనికిని కలిగి ఉన్నాయి ఉనికిలో ఉన్నాయి. స్థూల బృహత్తర స్థాయిలో, ఆకాశమందున్న ఇవన్నీ దేవుని నియంత్రణలో, ఉండి, వాటి సంపూర్ణ ఉనికి కొరకు వాటి వాటి కక్ష్యలో నిరంతరం తిరుగుతున్నాయి, అయితే అది అనేక సంవత్సరాలు జరిగింది వాటి సమస్త ఉనికి అనేక సంవత్సరాల నుండి ఉంది. ఏ గ్రహం ఎప్పుడు, ఏ సమయంలో తిరుగుతుంది; ఏ గ్రహం ఏ పని ఎప్పుడు ఏ పని చేస్తుంది; ఏ గ్రహం ఏ కక్ష్యలో తిరుగుతుంది, అది ఎప్పుడు అదృశ్యమవుతుంది, లేదా స్థానచలనం చెందుతుంది అది ఎప్పుడు తిరిగి వస్తుంది—అనే ఈ విషయాలన్నీ కూడా కొంచెం కూడా లోపం లేకుండా ఉంటాయి కొనసాగుతూ ఉంటాయి. గ్రహాల స్థానం మరియు వాటి మధ్య దూరాలకు కూడా ఖచ్చితమైన నమూనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టమైన సమాచారంతో వివరించబడతాయి; అవి ప్రయాణించే మార్గాలు, వేగం మరియు వాటి కక్ష్యల నమూనా, వివిధ సమయాల్లో అవి ఉండే స్థానాలు- ఇవన్నీ అనే ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా లెక్కించబడతాయి మరియు ప్రత్యేకమైన నియమాలతో వివరించబడతాయి. ఈ గ్రహాలన్నీ ఎన్నో యుగాలుగా, కాస్త కూడా వాటి కక్ష్య నుండి తొలగక, ఈ నియమాలను అనుసరిస్తున్నాయి. ఏ శక్తి కూడా వాటి కక్ష్యలను లేదా గాని, లేక అవి అనుసరించే నమూనాలను గాని మార్చలేవు, లేదా పాడు చేయలేవు. ఎందుకంటే వాటి గతిని నిర్దేశించే ప్రత్యేకమైన నియమాలు మరియు వాటిని వివరించే స్పష్టమైన సమాచారం అనేవి సృష్టికర్త అధికారంచే అధికారము ద్వారా ముందుగానే నిర్దేశించబడతాయి మరియు అవి సృష్టికర్త సార్వభౌమాధికారం మరియు నియంత్రణ క్రింద వాటి స్వంత సమన్వయంతో ఈ నియమాలకు లోబడతాయి. స్థూల బృహత్తర స్థాయిలో, కొన్ని సమూనాలను, కొంత సమాచారాన్ని మరియు కొన్ని విచిత్రమైన, వివరించశక్యం కానీ కానటువంటి నియమాలను, సిద్ధాంతాలను కనుగొనడం మనిషికి కష్టమేమి కాదు. మానవజాతి, దేవుడు ఉన్నాడని, సృష్టి కర్త, సృష్టిని చేసి, సమస్తంపై సమస్తముపై అధికారం కలిగి ఉన్నాడని అంగీకరించపోయినప్పటికీ మరియు సృష్టికర్త అధికారం ఉందని గుర్తించకపోయినప్పటికీ, మానవ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు మరియు భౌతికశాస్త్రవేత్తలు విశ్వంలో సమస్త జీవుల ఉనికిని, వాటి కదలికలను నియంత్రించే నియమాలను, నమూనాలను కనిపెడుతున్నారు. ఇవన్నీ విస్తారమైన, అదృశ్యమైన అంధకార శక్తితో పరిపాలించబడుతున్నాయని, నియంత్రించబడుతున్నాయని చెబుతున్నారు. ఈ వాస్తవం, సమస్తాన్ని నడిపించే కదలికల నమూనాల్లో ఒక సర్వశక్తిమంతుడైన వ్యక్తి సర్వశక్తుడు ఉన్నాడని ప్రతిఘటించడానికి మరియు అంగీకరించడానికి బలవంతం చేస్తున్నాయి. ఆయన శక్తి అసాధారణమైంది, ఎవరు ఆయన వాస్తవ ముఖాన్ని చూడలేకపోయినప్పటికిని, ఆయన ప్రతి క్షణం, సమస్తాన్ని పాలిస్తాడు మరియు నియంత్రిస్తాడు. ఏ వ్యక్తి, లేక లేదా ఏ శక్తి ఆయన సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారానికి అతీతంగా దాటి వెళ్లలేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మనిషి, సమస్త ఉనికిని పాలించే నియమాలను మనుష్యులు నియంత్రించలేరని, ఏ వ్యక్తి వాటిని మార్చలేడని ఖచ్చితంగా గుర్తించాలి; మనుష్యులు ఈ నియమాలను పూర్తిగా అర్థం చేసుకోలేరని, అవి సహజంగా జరిగేవి కాదు, సంభవించేవి కానీ కాదని, అయితే అవి సార్వభౌమునిచే సార్వభౌముని ద్వారా అజ్ఞాపించబడతాయని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇవన్నీ, స్థూలస్థాయిలో బృహత్తర స్థాయిలో మానవజాతి గ్రహించగలిగే దేవుని అధికారాన్ని గురించిన అధికారమును వ్యక్తపరిచే విషయాలు. వ్యక్తీకరణలు.

సూక్ష్మస్థాయిలో, భూమిపై మనిషి చూడగలిగిన పర్వతాలు, నదులు, సరస్సులు, సముద్రాలు మరియు భూభాగాలు, అతను అనుభవించదగిన అనుభవించగలిగిన అన్నీ అన్ని కాలాలు, మరియు మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు మానవులతో కలిపి భూమిపై జీవించే సకల ప్రాణులు, దేవుని సార్వభౌమాధికారానికి మరియు ఆయన నియంత్రణకు లోబడి ఉండాలి. దేవుని సార్వభౌమాధికారం మరియు నియంత్రణల క్రింద, సమస్తం ఉనికిలోనికి వచ్చాయి, లేదా ఆయనకు అనుగుణంగా ఆయన ఆలోచన ప్రకారంగా అదృశ్యమవుతాయి; వాటి ఉనికిని పాలించే నియమాలు ఉద్భవిస్తాయి, మరియు వాటిని కొనసాగించడంలో ఎదిగి వృద్ధి చెందుతాయి. ఏ మానవుడు లేదా ప్రాణి మానవుడైనా, లేక ఏ విషయమైన ఈ నియమాలకు మించినవారు అతీతులు కాదు. ఇది ఇలా ఎందుకు? దేవుని అధికారమే ఈ ప్రశ్నకు ఏకైక సమాధానం. లేదాలేక, దీన్ని మరొక విధంగా చెప్పాలంటే, ఇది ఇదంతా దేవుని ఆలోచనలు మరియు దేవుని మాటల వలన ప్రకారంగా జరుగుతుందిజరుగుతోంది; ఎందుకంటే దేవుడు, తనకు తానుగా చేసే వ్యక్తిగత కార్యాల వలన జరుగుతుంది స్వయాన దేవుడు వ్యక్తిగత క్రియలవలన జరుగుతోంది. అంటే దీనర్థం, దేవుని అధికారం మరియు దేవుని మనసు, ఈ నియమాలకు ఆరంభాన్ని ఇస్తాయి నియమాలకు ఊతనిస్తున్నాయి. ఇవి ఆయన ఆలోచనలకు అనుగుణంగా మార్పుచెందుతాయి, మరియు ఈ మార్పులు జరగడం, లేక లేదా అదృశ్యమవ్వడం అనేది ఆయన ప్రణాళిక బట్టి జరుగుతాయి. ఉదాహరణకు తెగుళ్ళను తీసుకోండి. ఎలాంటి హెచ్చరిక చేయకుండానే లేకుండా అవి కలుగుతాయివిరుచుకు పడతాయి. అవి ఎక్కడ నుండి వచ్చాయో, లేక లేదా అవి జరగడానికి ఖచ్చితమైన కారణాలు ఏమిటో అనే విషయాలు ఎవరికి ఎవరికీ తెలియదు, మరియు ఈ తెగుళ్లు, ఒక నిర్ధిష్టమైన స్థానానికి చేరినప్పుడు, శపించబడినవారు ఉపద్రవం శిక్షకు గురైన వారందరు విపత్తు నుండి తప్పించుకోలేరు. విషపూరితమైన లేదా లేక హానికరమైన సూక్ష్మజీవులు వ్యాప్తిచెందడం ద్వారా తెగుళ్లు కలుగుతాయని మానవశాస్త్రం అర్థం చేసుకుంటుంది, మరియు వాటి వేగం, పరిధి, మరియు వ్యాప్తిచెందే విధానాన్ని మానవశాస్త్రం ఊహించలేదు, లేక వాటిని లేదా నియంత్రించలేదు. మనుష్యులు సాధ్యమైన ప్రతి విధానం ద్వారా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికి, వారు వాటిని నియంత్రించలేరు. తెగుళ్లు వచ్చినప్పుడు, ప్రజలు లేదా జంతువులు తప్పనిసరిగా ప్రభావితమవుతారు బాధించబడతారు. వాటిని నివారించడం, ఎదుర్కొవడం, మరియు పరిశోధన చేయడం లాంటి ప్రయత్నాలే మానవులు చేయగలరు. అంతేకాని, ఏ తెగులు ఎప్పుడు ఆరంభమైంది లేదా ఎప్పుడు ముగుస్తుందని చెప్పడానికి మూల కారణాలు ఎవరికి ఎవరికీ తెలియవు, ఏ వ్యక్తి వాటిని నియంత్రించలేడు. ఒక తెగులు ప్రారంభమై, అది వ్యాప్తి చెందుతున్నప్పుడు, మనుష్యులు మొట్టమొదటిగా టీకాను అభివృద్ధి పరుస్తారు, కానీ టీకా సిద్ధం కాకముందే తెగులు దానికదే చనిపోతుంది. తెగుళ్లు, ఎందుకు చనిపోతున్నాయి? క్రిములు, అదుపులోనికి వచ్చాయని కొంతమంది చెబితే, కాలాల్లో మార్పు వలన అవి చనిపోయాయని కొంతమంది చెబుతారు… విపరీతమైన ఈ ఊహాగానాలు సమర్థనీయమైనవా కాదా అనే విషయంలో సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఎలాంటి వివరణ వివరణను గాని, లేదా స్పష్టమైన సమాధానం సమాధానాన్ని గాని ఇవ్వడం లేదు. మానవజాతి ఈ ఊహాగానాలతో ఏకీభవించకపోవడం మాత్రమే కాదు కానీ, ఊహాగానాలను అంచనా వేయడం మాత్రమే కాకుండా మానవ జాతికి తెగుళ్ళ గురించి మనిషికి తక్కువ అవగాహనను అవగాహన లేకపోవడం మరియు భయం కూడా కారణం కావచ్చు భయాన్ని కూడా కలిగియున్నాడు. అంతిమ విశ్లేషణలో తెగులు ఎందుకు ప్రారంభమైందో, లేదా లేక తెగులు ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి ఎవరికీ తెలియదు. మానవజాతి కేవలం సైన్స్ విజ్ఞాన శాస్త్రములో మాత్రమే విశ్వాసం కలిగి, పూర్తిగా దానిపైననే ఆధాపరపడి, సృష్టికర్త అధికారాన్ని గుర్తించకపోవడం లేదా ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోవడం వలననే వారు సమాధానాన్ని జవాబును పొందలేకపోతున్నారుపొందలేకపోవుచున్నారు.

దేవుని సార్వభౌమాధికారం క్రింద, ఆయన అధికారం మరియు ఆయన కార్యనిర్వహణను బట్టి సమస్తం పుట్టాయి, జీవిస్తాయి మరియు నశిస్తాయి. కొన్ని సంఘటనలు సంభవిస్తాయి మరియు నిశ్శబ్దంగా సమసిపోతాయి, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో మనిషి చెప్పలేడు లేదా అవి ఎలా జరుగుతాయో గ్రహించలేడు, అవి ఎందుకు సంభవించి, సమసిపోతాయనడానికిగల కారణాలను సరిగా అర్థం చేసుకోలేడు. మనిషి తన స్వంత కళ్లతో చూడగలిగినప్పటికీ, సమస్త విషయాలలో జరిగేవన్నీ, తన చెవులతో వినగలడు మరియు తన శరీరంతో అనుభవించగలడు; ఇవన్నీ మనిషిపై ప్రభావం చూపుతున్నప్పటికీ, సంబంధిత అసాధారణతను, క్రమబద్ధతను లేదా వివిధ సంఘటనల వింతను సైతం మనిషి బుద్ధి పూర్వకంగా గ్రహించినప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న, అంటే సృష్టికర్త యొక్క చిత్తం మరియు ఆయనమనస్సు గురించి అతనికి ఏమీ తెలియదు. ఈ సంఘటనల వెనుక చాలా కథలు, అనేక దాచబడిన నిజాలు ఉన్నాయి. మనిషి సృష్టికర్తకు దూరంగా వెళ్లిపోవడాన్నిబట్టి మరియు సృష్టికర్త యొక్క అధికారం సమస్తాన్ని పాలిస్తుందనే వాస్తవాన్ని అతను అంగీకరించకపోవడాన్నిబట్టి, సృష్టికర్త యొక్క అధికారపు సార్వభౌమాధికారం క్రింద జరిగే ప్రతి దానిని ఎప్పటికీ తెలుసుకోలేడు మరియు గ్రహించలేడు. చాలా వరకు, దేవుని నియంత్రణ మరియు సార్వభౌమాధికారం అనేవి మానవ ఊహకు, మానవ జ్ఞానానికి, మానవ అవగాహనకు మరియు మానవ విజ్ఞాన శాస్త్రం సాధించే వాటికి మించి ఉంటాయి; ఇది సృష్టించబడిన మానవజాతి దృక్పథానికి అతీతమైనది. కొంతమంది, “మీరు దేవుని సార్వభౌమత్వాన్ని స్వయంగా చూడలేదు కాబట్టి, ప్రతిదీ ఆయన అధికారానికి లోబడి ఉంటాయని నీవు ఎలా నమ్ముతావు?” అని అంటారు. చూడడం అనేది ఎల్లప్పుడూ విశ్వసించడం అని కాదు, అలాగే ఎల్లప్పుడూ గుర్తించడం మరియు అర్థం చేసుకోవడం అని కూడా కాదు. కాబట్టి, విశ్వాసం ఎక్కడ నుండి వస్తుంది? నేను నిశ్చయంగా చెప్పగలను, “సంఘటనల వాస్తవికత మరియు మూల కారణాల పట్ల ప్రజల యొక్క భయాందోళన మరియు అనుభవం యొక్క స్థాయి మరియు లోతు నుండి విశ్వాసం వస్తుంది.” దేవుడు ఉన్నాడని నీవు విశ్వసిస్తూ, ఆయనను గుర్తించలేకపోతే, దేవుని నియంత్రణ మరియు సమస్త విషయాలపై దేవుని సార్వభౌమాధికారం యొక్క వాస్తవాన్ని నీవు సరిగా గుర్తించలేకపోతే, నీ హృదయంలో దేవుడు ఈ అధికారాన్ని కలిగి ఉన్నాడని మరియు దేవుని అధికారం అసమానమైనదని మీరు ఎన్నటికీ ఒప్పుకోరు. సృష్టికర్తను నీ ప్రభువుగాను మరియు నీ దేవునిగాను మీరు ఎన్నటికీ అంగీకరించరు.

మానవజాతి యొక్క విధి మరియు విశ్వం యొక్క విధి అనేవి సృష్టికర్త సార్వభౌమాధికారం నుండి విడదీయరానివి

మీరందరూ పెద్దవాళ్ళు. మీలో కొందరు మధ్య వయస్కులు; కొందరు వృద్ధాప్యంలోకి వచ్చారు. మీరు దేవుణ్ణి విశ్వసించకపోవడం నుండి ఆయనను విశ్వసించే స్థాయికి వరకు మరియు దేవుణ్ణి విశ్వసించడం మొదలుపెట్టడం నుండి ఆయన వాక్కును అంగీకరించడం మరియు ఆయన కార్యాన్ని అనుభవించే స్థాయి వరకు వెళ్ళారు. దేవుని సార్వభౌమాధికారం గురించి మీకు ఎంత జ్ఞానం ఉంది? మానవ విధి గూర్చి మీరు ఎలాంటి ఆలోచనలను కలిగియున్నారు? ఎవరైనా జీవితంలో తాము కోరుకున్నవన్నీ సాధించగలరా? మీరు పుట్టినప్పటి నుండి కొన్ని దశాబ్దాలలో మీరు కోరుకున్న విధంగా ఎన్ని విషయాలు సాధించగలిగారు? మీరు ఎన్నడూ ఊహించని విషయాలు ఎన్ని జరిగాయి? ఎన్ని విషయాలు ఆనందకరమైనవిగా మరియు ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి? ప్రజలు ఇంకా ఎన్ని విషయాలు ఫలిస్తాయనే నిరీక్షణతో ఎదురుచూస్తుంటారు-సరైన సమయం కోసం, పరలోకం యొక్క చిత్తం కోసం తెలియకుండానే ఎదురుచూస్తూ ఉంటారు? ఎన్ని విషయాలు ప్రజలను నిస్సహాయానికి మరియు నిరుత్సాహానికి గురి చేస్తుంటాయి? ప్రతి ఒక్కరూ తమ విధి గురించి ఆశలతో నిండి ఉన్నారు, తమ జీవితంలో ప్రతిదీ వారు కోరుకున్నట్లే జరుగుతుందని, ఆహారం లేదా దుస్తుల లేమి ఉండదని, వారి అదృష్టం అద్భుతంగా పెరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటారు. పేదరికం మరియు అణచివేతతో కూడిన జీవితాన్ని, కష్టాలతో నిండిన మరియు విపత్తులతో కూడిన జీవితాన్ని ఎవరూ కోరుకోరు. కానీ ప్రజలు ఈ విషయాలను ముందుగానే చూడలేరు లేదా వాటిని నియంత్రించలేరు. బహుశా కొందరికి, గతం అనేది కేవలం అనుభవాల సమాహారం; వారు పరలోక చిత్తం ఏమిటో తెలుసుకోరు మరియు అది ఏమిటనే విషయాన్ని వారు పట్టించుకోరు. వారు మానవజాతి యొక్క విధి గురించి గాని, లేదా మానవులు ఎందుకు సజీవంగా ఉన్నారు అనే విషయం గురించి గాని, లేదా వారు ఎలా జీవించాలి అనే దాని గురించి గాని పట్టించుకోకుండా, జంతువుల్లాగా, రోజురోజుకు అనాలోచితంగా తమ జీవితాలను గడుపుతున్నారు. అలాంటి వ్యక్తులు మానవ విధిని అర్థం చేసుకోకుండా వృద్ధాప్యానికి చేరుకుంటారు మరియు వారు చనిపోయే క్షణం వరకు జీవితం అంటే ఏమిటనే విషయం వారికి తెలియదు. అలాంటి వ్యక్తులు చనిపోయారు; వారు ఆత్మ లేని జీవులు; వారు మృగాలు. ప్రజలు సృష్టిలో జీవిస్తూ, లోకంలో తమ భౌతిక అవసరాలను తీర్చుకునే అనేక మార్గాల నుండి ఆనందాన్ని పొందుతున్నప్పటికీ, ఈ భౌతిక ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందడాన్ని వారు చూస్తున్నప్పటికీ, తమ హృదయాలు మరియు తమ ఆత్మలు అనుభూతి చెందే మరియు అనుభవించే తమ స్వంత అనుభవానికి భౌతిక విషయాలతో సంబంధం లేదు మరియు ఆ అనుభవానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అనుభవం అనేది ఒకరి హృదయంలో లోతైన గుర్తింపుయైయున్నది, ఇది భౌతిక నేత్రాలతో చూడలేనిది. ఈ గుర్తింపు అనేది మానవ జీవితం మరియు మానవ విధికి సంబంధించి ఒకరి అవగాహనలోను మరియు గ్రహింపులోను ఉంటుంది. మరియు ఇది తరచుగా కనిపించని ఒక యజమాని అన్ని విషయాలను ఏర్పాటు చేస్తున్నాడని, మనిషి కోసం ప్రతీది నిర్వహిస్తున్నాడనే ఆందోళనకు దారి తీస్తుంది. వీటన్నింటి మధ్యలో, విధి యొక్క ఏర్పాట్లు మరియు కార్య నిర్వహణ కార్యములను ఎవరూ అంగీకరించకుండా ఉండలేరు; సృష్టికర్త నిర్దేశించిన మార్గాన్ని, ఒకరి విధి విషయంలో సృష్టికర్త సార్వభౌమాధికారాన్ని ఎవరూ అంగీకరించకుండా ఉండలేరు. ఇది నిర్వివాదమైన వాస్తవం. విధి గురించి ఎవరికి ఎలాంటి అవగాహన ఉన్నా మరియు ఎలాంటి వైఖరి ఉన్నా, ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు.

మీరు ప్రతిరోజూ ఎక్కడికి వెళతారు, మీరు ఏమి చేస్తారు, మీరు ఎవరిని ఎదుర్కుంటారు, లేదా దేనిని ఎదుర్కొంటారు, మీరు ఏమి చెబుతారు, మీకు ఏమి జరుగుతుంది అనేటువంటి ఈ విషయాలలో దేనినైనా ముందే చెప్పగలరా? ప్రజలు ఈ సంఘటనలన్నింటినీ ముందుగా చూడలేరు, ఈ పరిస్థితులు ఎలా ఏర్పడతాయో అనే దానిని కూడా నియంత్రించలేరు. జీవితంలో ఇటువంటి ఊహించలేని సంఘటనలు అన్ని సమయాల్లో జరుగుతాయి; అవి ప్రతి రోజు జరిగేవి. ఈ రోజువారీ మలుపులు మరియు అవి పరిణామం చెందే మార్గాలు, లేదా అవి అనుసరించే విధానాలన్నియు యాదృచ్ఛికంగా ఏవీ జరగవని, ప్రతి సంఘటన యొక్క ప్రక్రియ, ప్రతి సంఘటన యొక్క అసంకల్పిత స్వభావం అనేవి మానవ చిత్తాన్ని బట్టి మార్చబడదని మానవాళికి పదే పదే గుర్తు చేస్తుంటాయి. సంభవించే ప్రతి సంఘటన అనేది సృష్టికర్త నుండి మానవాళికి ఒక ఉపదేశాన్ని తెలియజేస్తుంది మరియు మానవులు తమ స్వంత విధినినియంత్రించుకోలేరనే సందేశాన్ని కూడా పంపుతుంది. ప్రతి సంఘటన మానవాళి యొక్క క్రూరమైన, వ్యర్థమైన ఆశయానికి మరియు తమ విధిని తమ చేతుల్లోకి తీసుకోవాలనే కోరికకు ఖండనగా ఉంటుంది. అవి మానవాళి ముఖంపై గట్టి చెంపదెబ్బలు లాంటివి, ఒకదాని తర్వాత మరొకటి, అంతిమంగా తమ విధిని ఎవరు పరిపాలిస్తున్నారో మరియు ఎవరు నియంత్రిస్తున్నారో ప్రజలు పునరాలోచించుకొనేలా చేస్తాయి. మరియు తమ ఆశయాలు మరియు కోరికలు పదే పదే అడ్డుకోబడడం మరియు విచ్చిన్నం కావడంవలన, మానవులు సహజంగానే విధిని తెలియకుండానే అంగీకరించే స్థితికి చేరుకుంటారు, అంటే, పరలోకపు చిత్తము మరియు సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారము యొక్క వాస్తవికతను అంగీకరిస్తారు. ఈ రోజువారీ పరిణామాలు మొదలుకొని మొత్తం మానవ జీవితాల విధి వరకు, సృష్టికర్త యొక్క ప్రణాళికలను మరియు ఆయన సార్వభౌమాధికారాన్ని వెల్లడి చేయనిది ఏదీ లేదు; “సృష్టికర్త యొక్క అధికారాన్ని అధిగమించలేము” అనే సందేశాన్ని పంపనిది ఏదీ ఉండదు, “సృష్టికర్త యొక్క అధికారం సర్వోన్నతమైనది” అనే ఈ నిత్య సత్యాన్ని తెలియజేయనిది ఏదీ ఉండదు.

మానవాళి యొక్క విధి మరియు విశ్వం యొక్క విధి అనేవి సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారంతో చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయి, అవి సృష్టికర్త యొక్క కార్య నిర్వహణ ఏర్పాటులతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి; చివరికి, అవి సృష్టికర్త అధికారం నుండి విడదీయరానివిగా ఉన్నాయి. అన్ని విషయాలకు సంబంధించిన న్యాయవిధుల్లో, మనిషి సృష్టికర్త యొక్క కార్య నిర్వహణ ఏర్పాటులను మరియు ఆయన సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటాడు; అన్ని విషయాలకు సంబంధించిన మనుగడ యొక్క నియమాల్లో, అతను సృష్టికర్త యొక్క పాలనను గ్రహిస్తాడు; అన్ని విషయాలకు సంబంధించిన విధులలో, సృష్టికర్త తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించే మరియు దానిని నియంత్రించే మార్గాలను అతను అంచనా వేస్తాడు; మరియు మానవుల జీవిత చక్రాలలో మరియు అన్ని విషయాలలో, మానవుడు నిజంగా సమస్త విషయాలు మరియు జీవరాసులు కోసం సృష్టికర్త చేసిన నిర్వహణలు మరియు ఏర్పాట్లను అనుభవిస్తాడు, ఆ నిర్వహణలు మరియు ఏర్పాట్లు అన్ని భూసంబంధమైన న్యాయవిధులు, నియమాలు మరియు సంస్థలను, అన్ని ఇతర అధికారాలు మరియు శక్తులను ఎలా అధిగమిస్తాయో కళ్లారా చూస్తాడు. ఇది ఇలా ఉండగా, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని సృష్టించబడిన ఏ జీవి ఉల్లంఘించదని, సృష్టికర్త ముందుగా నిర్ణయించిన సంఘటనలు మరియు విషయాలను ఏ శక్తి కూడా ఆక్రమించదు లేదా మార్చదు అని మానవాళి గుర్తించవలసి వస్తుంది. ఈ దైవిక చట్టాలు మరియు నియమాల ప్రకారం మానవులు మరియు సమస్త విషయాలు, తరాలు వెంబడి తరాలు జీవిస్తాయి మరియు వ్యాప్తి చెందుతాయి. ఇది సృష్టికర్త అధికారం యొక్క నిజమైన స్వరూపం కాదా? మానవుడు బాహ్యమైన చట్టాలలో, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని మరియు అన్ని సంఘటనలు మరియు అన్ని విషయాలలో ఆయన నియామకాన్ని చూస్తున్నప్పటికీ, విశ్వంపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికార సూత్రాన్ని ఎంత మంది ప్రజలు గ్రహిస్తున్నారు? ఎంత మంది వ్యక్తులు తమ స్వంత విధిని గూర్చి సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని మరియు ఏర్పాటును నిజంగా తెలుసుకోగలరు, గుర్తించగలరు, అంగీకరించగలరు మరియు లోబడగలరు? సమస్తము పైన సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని విశ్వసించినవారు సృష్టికర్త మానవ జీవితాల విధిని కూడా నిర్దేశిస్తాడని నిజంగా విశ్వసించి, గుర్తిస్తారా? మనిషి యొక్క విధి సృష్టికర్త యొక్క అరచేతిలో ఉంది అనే వాస్తవాన్ని ఎవరు నిజంగా గ్రహించగలరు? ఆయన మానవాళి యొక్క విధిని పరిపాలిస్తాడు మరియు నియంత్రిస్తున్నాడు అనే వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారంపట్ల మానవాళి ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ఇప్పుడు ఈ వాస్తవాన్ని ఎదుర్కొన్న ప్రతి మానవుడు తన కోసం తాను తీసుకోవలసిన నిర్ణయం అది.

మానవ జీవితంలో ఆరు తరుణాలు

మానవ జీవిత గమనంలో, ప్రతి వ్యక్తి క్లిష్టమైన తరుణాలను ఎదుర్కొంటాడు. ఇవి జీవితంలో ఒక వ్యక్తి యొక్క విధిని నిర్ణయించే అత్యంత ప్రాథమిక మరియు అత్యంత ముఖ్యమైన అడుగులు. ప్రతి వ్యక్తి తమ జీవిత గమనంలో తప్పనిసరిగా దాటవలసిన ఈ మార్గ సూచిలను గూర్చిన క్లుప్త వివరణ క్రింద ఉంది.

మొదటి తరుణం: పుట్టుక

ఒక వ్యక్తి ఎక్కడ జన్మించాడు, వారు ఏ కుటుంబంలో జన్మించారు, ఆ వ్యక్తి లింగం, స్వరూపం మరియు పుట్టిన సమయం అనే ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలోని మొదటి తరుణానికి సంబంధించిన వివరాలు.

ఈ తరుణము యొక్క నిర్దిష్ట వివరాలను ఎవరూ ఎంచుకోలేరు; అవన్నీ సృష్టికర్త ద్వారా ముందుగానే నిర్ణయించబడ్డాయి. అవి ఏ విధంగానూ బయటి పరిస్థితుల ద్వారా ప్రభావితం చేయబడవు మరియు సృష్టికర్త ముందుగా నిర్ణయించిన ఈ వాస్తవాలను మనిషి తయారు చేసుకున్న ఏ అంశాలు మార్చలేవు. ఒక వ్యక్తి పుట్టడం అంటే సృష్టికర్త ఆ వ్యక్తి కోసం ఏర్పాటు చేసిన విధి యొక్క మొదటి దశను ఇప్పటికే నెరవేర్చాడు. ఈ వివరాలన్నిటినీ ఆయన చాలా ముందుగానే నిర్ణయించినందున, వాటిలో దేనినీ మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒక వ్యక్తి యొక్క తదుపరి విధితో సంబంధం లేకుండా, ఒకరి పుట్టుక యొక్క పరిస్థితులు ముందుగా నిర్ణయించబడ్డాయి మరియు అవి అలాగే ఉంటాయి; అవి జీవితంలో ఒకరి విధిని బట్టి ఏ విధంగానూ ప్రభావితం చేయబడవు మరియు జీవితంలో ఒకరి విధిపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అవి ఏ విధంగానూ ప్రభావితం చేయవు.

1. సృష్టికర్త యొక్క ప్రణాళికల ప్రకారం కొత్త జీవితం పుట్టింది

ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం, కుటుంబం, లింగం, భౌతిక స్వరూపం, పుట్టిన సమయంవంటి—మొదటి తరుణానికి సంబంధించిన వివరాలను ఒక వ్యక్తి ఎంచుకోగలడా? నిస్సందేహంగా, ఒక వ్యక్తి పుట్టుక అనేది నిష్క్రియాత్మక సంఘటన. ఒక వ్యక్తి అసంకల్పితంగా, ఒక నిర్దిష్ట ప్రదేశంలో, ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట కుటుంబంలో, ఒక నిర్దిష్ట భౌతిక రూపాన్ని కలిగి ఉంటాడు; ఒక వ్యక్తి అసంకల్పితంగా ఒక నిర్దిష్ట ఇంటిలో సభ్యుడిగా, ఒక నిర్దిష్ట కుటుంబ వృక్షపు కొమ్మగా మారతాడు. ఈ జీవిత మొదటి తరుణములో ఒక వ్యక్తి ఎంపిక లేదు, కానీ సృష్టికర్త యొక్క ప్రణాళికల ప్రకారం స్థిరమైన వాతావరణంలో, ఒక నిర్దిష్ట కుటుంబంలో, నిర్దిష్ట లింగం మరియు రూపంతో మరియు ఒక వ్యక్తి యొక్క జీవిత గమనంతో చాలా దగ్గరగా ముడిపడి ఉన్న నిర్దిష్ట సమయంలో జన్మిస్తాడు. ఈ క్లిష్టమైన తరుణములో ఒక వ్యక్తి ఏమి చేయగలడు? మొత్తానికి, ఒక వ్యక్తి పుట్టుకకు సంబంధించిన ఈ వివరాలలో ఏ ఒక్కదాని గురించి ఎవరికీ ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. సృష్టికర్త యొక్క ముందస్తు నిర్ణయం మరియు ఆయన మార్గదర్శకత్వం లేకుంటే, ఈ లోకంలోకి కొత్తగా జన్మించిన జీవితము ఎక్కడికి వెళ్లాలో లేదా ఎక్కడ ఉండాలో తెలియదు, ఎటువంటి సంబంధాలు ఉండవు, ఎక్కడికీ చెందదు మరియు నిజమైన ఇంటిని కలిగి ఉండదు. అయితే సృష్టికర్త యొక్క ఖచ్చితమైన ఏర్పాట్ల కారణంగా, ఈ కొత్త జీవితానికి ఉండడానికి స్థలం, తల్లిదండ్రులు, తనకంటూ ఒక స్థలం మరియు బంధువులు ఉంటారు, అందుకే ఆ జీవితము తన జీవిత గమనంలో ముందుకు సాగిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తంలో, ఈ కొత్త జీవితము యొక్క భౌతికీకరణ సృష్టికర్త యొక్క ప్రణాళికల ప్రకారం నిర్ణయించబడుతుంది మరియు అది స్వాధీనం చేసుకునే ప్రతీది సృష్టికర్త ద్వారా అందించబడుతుంది. పేరు ఏమీ లేకుండా స్వేచ్ఛగా తేలియాడే శరీరం నుండి, అది క్రమంగా రక్తమాంసాలుగా, కంటికి కనిపించే, స్పర్శనీయమైన మనిషిగా, ఆలోచించే, ఊపిరి పీల్చుకునే, వేడిని మరియు చల్లదనాన్ని అనుభూతి పొందే దేవుని సృష్టిలో ఒకటిగా మారుతుంది; భౌతిక ప్రపంచంలో సృష్టించబడిన జీవి యొక్క అన్ని సాధారణ కార్యకలాపాలలో పాల్గొనగలుగుతుంది; మరియు సృష్టించబడిన మనిషి జీవితంలో అనుభవించవలసిన అన్ని విషయాలను అనుభవిస్తుంది. సృష్టికర్త ఒక వ్యక్తి యొక్క పుట్టుకను ముందుగా నిర్ణయించడం అంటే, ఆ వ్యక్తి మనుగడకు అవసరమైన అన్ని విషయాలను ఆయన ప్రసాదిస్తాడు; మరియు, అలాగే, ఒక వ్యక్తి పుట్టాడంటే, వారు తమ మనుగడకు అవసరమైన అన్ని విషయాలను సృష్టికర్త నుండి పొందుతారు మరియు ఆ సమయం నుండి, వారు సృష్టికర్త అందించిన మరియు సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి లోబడి మరొక రూపంలో జీవిస్తారు.

2. వేర్వేరు మానవులు వేర్వేరు పరిస్థితుల్లో ఎందుకు జన్మిస్తారు

ఒక ప్రముఖ కుటుంబంలో తిరిగి పుడితే బాగుండేదని ప్రజలు తరచుగా ఊహించుకుంటూ ఉంటారు; వారు స్త్రీలైతే, అందంగా కనిపిస్తూ మరియు అందరిచేత ప్రేమించబడుతూ మరియు పురుషులైతే, అందాల రాకుమారుడుగా, ఏలోటూ లేనివారిగా, ప్రపంచం మొత్తం తమకు దాసోహం అన్నట్లుగా ఉంటే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. తమ పుట్టుక గురించి అనేక భ్రమలతో సతమతమయ్యేవారు మరియు దాని గురించి చాలా అసంతృప్తి చెందుతూ, తమ కుటుంబం, తమ రూపం, తమ లింగం మరియు తాము పుట్టిన సమయం గురించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసేవారు తరచుగా ఉంటారు. అయినప్పటికీ, వారు ఒక నిర్దిష్ట కుటుంబంలో ఎందుకు జన్మించారో లేదా వారు ఒక నిర్దిష్ట రూపములో ఎందుకు కనిపిస్తారో ప్రజలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. వారు ఎక్కడ పుట్టారు, లేదా ఎలా కనిపిస్తారు అనే దానితో సంబంధం లేకుండా, వారు సృష్టికర్త యొక్క కార్య నిర్వహణ ప్రణాళికలో వివిధ పాత్రలను పోషించాలి మరియు విభిన్న లక్ష్యాలను నెరవేర్చాలి అని వారికి తెలియదు మరియు ఈ ఉద్దేశం ఎప్పటికీ మారదు. సృష్టికర్త దృష్టిలో, ఒక వ్యక్తి జన్మించిన ప్రదేశం, ఒకరి లింగం మరియు ఒకరి భౌతిక రూపం అన్నీ తాత్కాలిక విషయాలు. అవన్నీ సమస్త మానవాళి విషయములో ఆయన జరిగించే కార్య నిర్వహణ యొక్క ప్రతి దశలోని సూక్ష్మ లేశములైయున్నవి, స్వల్ప చిహ్నములైయున్నవి. మరియు ఒక వ్యక్తి యొక్క నిజమైన గమ్యం మరియు ఫలితం ఏదైనా నిర్దిష్ట దశలోని వారి పుట్టుకను బట్టి నిర్ణయించబడదు, కానీ తమ జీవితంలో వారు నెరవేర్చే లక్ష్యం మరియు ఆయన నిర్వహణ ప్రణాళిక పూర్తయినప్పుడు వారికి సృష్టికర్త ఇచ్చే తీర్పు బట్టి నిర్ణయించబడుతుంది.

ప్రతి ప్రభావానికి ఒక కారణం ఉంటుందని, కారణం లేకుండా ఎటువంటి ప్రభావం ఉండదు అని అంటారు. కాబట్టి, ఒకరి జన్మ తప్పనిసరిగా తన ప్రస్తుత జీవితం మరియు పూర్వ జీవితంతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క మరణం తన ప్రస్తుత జీవిత కాలాన్ని ముగించినట్లయితే, అప్పుడు ఆ వ్యక్తి యొక్క జననం సరికొత్త వలయారంభం; పాత వలయం ఒక వ్యక్తి యొక్క మునుపటి జీవితాన్ని సూచిస్తే, కొత్త వలయం సహజంగా వారి ప్రస్తుత జీవిత సూచిస్తుంది. ఒకరి జన్మ తన గత జీవితానికి మరియు ప్రస్తుత జీవితానికి ముడిపడి ఉన్నందున, ఒకరి పుట్టుకతో సంబంధం ఉన్న ప్రదేశం, కుటుంబం, లింగం, రూపం మరియు ఇతర అంశాలు తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క గత జీవితానికి మరియు ప్రస్తుత జీవితానికి అనుసంధానమై ఉంటాయి. దీనర్థం, ఒక వ్యక్తి యొక్క జన్మకు సంబంధించిన అంశాలు ఆ వ్యక్తి యొక్క పూర్వ జీవితాన్ని బట్టి మాత్రమే ప్రభావితం చేయబడవు, కానీ ప్రస్తుత జీవితంలో ఆ వ్యక్తి యొక్క గమ్య స్థానాన్ని బట్టి నిర్ణయించబడతాయి, ఇది ప్రజలు విభిన్నమైన పరిస్థితుల్లో జన్మించడానికి కారణమవుతుంది: కొందరు పేద కుటుంబాల్లో, మరికొందరు ధనిక కుటుంబాల్లో జన్మిస్తారు. కొందరు సాధారణంగా ఉంటారు, మరికొందరు విశిష్టమైన వంశావళిని కలిగి ఉంటారు. కొందరు దక్షిణాదిలో, మరికొందరు ఉత్తరాదిలో జన్మిస్తారు. కొందరు ఎడారిలో, మరికొందరు పచ్చని భూముల్లో పుడతారు. కొందరి జననాలు ఆనందోత్సాహాలు, నవ్వులు మరియు వేడుకలతో కలిసి ఉంటాయి; మరికొందరి పుట్టుకలు కన్నీళ్లు, విపత్తు మరియు బాధలను తీసుకువస్తాయి. కొందరు ఐశ్వర్యవంతులుగా జన్మిస్తారు, మరికొందరు కలుపు మొక్కలను ప్రక్కన పడేసినట్లుగా పడవేసేందుకు పుడతారు. కొందరు మంచి లక్షణాలతో పుడతారు, మరికొందరు వంకర బుద్ధులతో పుడతారు. కొందరు చూడ్డానికి అందంగా ఉంటే మరికొందరు అసహ్యంగా ఉంటారు. కొందరు అర్ధరాత్రి పుడతారు, మరికొందరు మండుటెండ ఉండే మధ్యాహ్న సమయములో పుడతారు.… అన్ని రకాల వ్యక్తుల జననాలు సృష్టికర్త వారి కోసం ఏర్పరచిన విధినిబట్టి నిర్ణయించబడతాయి; వారి జన్మలు ప్రస్తుత జీవితంలోని తమ విధిని, అలాగే వారు పోషించే పాత్రలను మరియు వారు నెరవేర్చే లక్ష్యాలను నిర్ణయిస్తాయి. ఇవన్నీ సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి లోబడి ఉంటాయి, ఆయనచే ముందుగా నిర్ణయించబడ్డాయి; ఎవరూ వారి విషయమై ముందుగా నిర్ణయించిన దాని నుండి తప్పించుకోలేరు, వారి జన్మను ఎవరూ మార్చలేరు మరియు వారి విధిని ఎవరూ ఎంచుకోలేరు.

రెండవ తరుణం: ఎదుగుట

వాళ్ళు ఎలాంటి కుటుంబంలో జన్మించారు అనేదానిపై ఆధారపడి, ప్రజలు విభిన్నమైన ఇంటి వాతావరణాలలో పెరుగుతారు మరియు వారి తల్లిదండ్రుల నుండి విభిన్నమైన పాఠాలలు నేర్చుకుంటారు. ఈ అంశాలు ఒక వ్యక్తి ఒక వయస్సు నుండి మరొక వయస్సుకు వచ్చే పరిస్థితులను నిర్ణయిస్తాయి మరియు ఎదగడం అనేది ఒక వ్యక్తి జీవితంలో రెండవ క్లిష్టమైన తరుణాన్ని సూచిస్తుంది. ఈ తరుణములో కూడా ప్రజలకు వేరే మార్గం లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా ముందుగా నిర్ణయించినది, ముందే ఏర్పాటు చేయబడినది.

1. ప్రతి వ్యక్తి వయస్సుల వారిగా మారే పరిస్థితులను సృష్టికర్త ముందుగానే నిర్ణయించి ప్రణాళిక చేసాడు.

ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు, ప్రజలను, సంఘటనలను, లేదా తమను మెరుగుపరిచే మరియు ప్రభావితం చేసే విషయాలను ఎంచుకోలేరు. ఒక వ్యక్తి ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, లేదా ఎటువంటి నైపుణ్యాలను సంపాదించుకోవాలి, ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి అనేది ఎంపిక చేసుకోలేరు. ఒకరికి తల్లిదండ్రులుగా మరియు బంధువులుగా ఎవరుండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎదగాలి అనేది ఎవరూ చెప్పలేరు; ప్రజలతో ఒక వ్యక్తి సంబంధాలు, సంఘటనలు, ఒక వ్యక్తి చుట్టూ ముట్టూ పరిసరాల్లోని విషయాలుమరియు అవి ఆ వ్యక్తి అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలు వారి నియంత్రణలో ఉండవు. మరి ఈ విషయాలను ఎవరు నిర్ణయిస్తారు? వాటిని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ విషయంలో ప్రజలకు వేరే మార్గం లేదు కాబట్టి, వారు ఈ విషయాలను స్వయంగా నిర్ణయించుకోలేరు కాబట్టి, మరియు వాటంతట అవి రూపుదిద్దుకోలేవు కాబట్టి, ఈ వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల ఏర్పాటు అంతా సృష్టికర్త చేతుల్లోనే ఉంటుందని చెప్పక తప్పదు. వాస్తవానికి, సృష్టికర్త ప్రతి వ్యక్తి యొక్క పుట్టుకకు సంబంధించిన నిర్దిష్ట పరిస్థితులను ఏర్పాటు చేసినట్లే, ఒకడు ఎదిగే నిర్దిష్ట పరిస్థితులను కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఒక వ్యక్తి యొక్క పుట్టుక ద్వారా వ్యక్తులు, సంఘటనలు మరియు తమ చుట్టూ ఉన్న విషయాల్లో మార్పులను తీసుకువస్తే, అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధి తప్పనిసరిగా వాటిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, కొంతమంది పేద కుటుంబాల్లో జన్మిస్తారు, కానీ సంపన్న వాతావరణంలో పెరుగుతారు; మరికొందరు సంపన్న కుటుంబాల్లో జన్మిస్తారు కానీ తమ కుటుంబాల సంపద తరిగిపోవడాన్ని బట్టి అలాంటి వారు పేద వాతావరణంలో పెరుగుతారు. ఏ ఒక్కరి పుట్టుక ఒక స్థిర నియమం ద్వారా పాలించబడదు మరియు ఏ ఒక్కరూ అనివార్యమైన, తప్పించుకోలేని పరిస్థితుల్లో పెరగరు. ఇవన్నీ ఒక వ్యక్తి ఊహించదగిన విషయాలు కాదు, లేదా నియంత్రించదగిన విషయాలు కాదు; అవి ఒకరి విధి యొక్క ప్రతిఫలాలు మరియు అవి ఒకరి విధిని బట్టి నిర్ణయించబడతాయి. వాస్తవానికి, వాటి మూలాలకు వెళ్తే, ఈ విషయాలన్నీ సృష్టికర్త ప్రతి వ్యక్తి కొరకు ముందుగా నిర్ణయించిన విధిని బట్టి నిర్ధారణ చేయబడతాయి; అవి ఆ వ్యక్తి యొక్క విధి మీద ఉన్నటువంటి సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం మరియు ఆయనకున్న ప్రణాళికలను బట్టి నిర్ణయించబడతాయి.

2. ప్రజలు పెరిగే విభిన్నమైన పరిస్థితులు విభిన్న పాత్రలకు దారితీస్తాయి

ఒక వ్యక్తి యొక్క పుట్టిన పరిస్థితులు, వారు పెరిగే వాతావరణం మరియు పరిస్థితులు అనే ప్రాథమిక స్థాయి మీద ఏర్పాటు చేయబడి ఉంటాయి మరియు ఒక వ్యక్తి పెరిగే పరిస్థితులు కూడా వారు పుట్టిన స్థితిగతులను బట్టి ఉంటాయి. ఈ సమయంలో, ఒక వ్యక్తి భాషను నేర్చుకోవడం ప్రారంభిస్తాడు, మరియు ఒక వ్యక్తి మనస్సు అనేక కొత్త విషయాలను ఎదుర్కోవడం మరియు సమీకరించడం మొదలుపెడుతుంది, ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి నిరంతరం ఎదుగుతూ ఉంటాడు. ఒక వ్యక్తి తన చెవులతో వినే, కళ్లతో చూసే, మనసుతో గ్రహించే విషయాలు క్రమంగా ఆ వ్యక్తి అంతర్గత ప్రపంచాన్ని నింపుతాయి మరియు చైతన్యవంతం చేస్తాయి. ఒక వ్యక్తి వ్యక్తులతోను, సంఘటనలతోను మరియు విషయాలతోను సంబంధం కలిగియుంటాడు; ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం, జ్ఞానం మరియు నైపుణ్యాలను నేర్చుకుంటాడు; మరియు ఒకరిని ప్రభావితం చేసే ఆలోచనా విధానాలు, ఒక వ్యక్తికి నేర్పించబడినవి లేదా బోధించబడినవి, అన్నీ మార్గనిర్దేశం చేస్తాయి మరియు జీవితంలో ఒక వ్యక్తి యొక్క విధిని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు నేర్చుకునే భాష మరియు ఆలోచనా విధానం అనేవి ఆ వ్యక్తి తన యవ్వనాన్ని గడిపే వాతావరణం నుండి విడదీయరానివి మరియు ఆ వాతావరణంలో తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు మరియు ఇతర వ్యక్తులు, సంఘటనలు మరియు వారి చుట్టూ జరిగే విషయాలు ఉంటాయి. కాబట్టి, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల ఆ వ్యక్తి పెరిగే వాతావరణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది మరియు ఈ సమయంలో ఆ వ్యక్తితో సంబంధంలోకి వచ్చే వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి పెరిగే పరిస్థితులు చాలా కాలం మునుపే నిర్ణయించబడినందున, ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి నివసించే వాతావరణం కూడా స్వాభావికముగానే ముందుగానే నిర్ణయించబడుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క ఎంపికలను బట్టి మరియు ప్రాధాన్యతలను బట్టి నిర్ణయించబడదు, కానీ సృష్టికర్త యొక్క ప్రణాళికల ప్రకారం, జీవితంలో ఒక వ్యక్తి యొక్క విధిపై సృష్టికర్త జాగ్రత్తగా చేసిన ఏర్పాట్లను బట్టి మరియు ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి, ఎదిగే క్రమంలో ఏ వ్యక్తయినా తనకు తారసపడే వ్యక్తులు మరియు వారితో పరిచయం ఏర్పడే విషయాలు అన్నీ సహజంగానే సృష్టికర్త యొక్క కార్య నిర్వహణలు మరియు ఏర్పాట్లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ రకమైన సంక్లిష్టమైన పరస్పర సంబంధాలను ప్రజలు ముందుగా చూడలేరు, లేదా వాటిని నియంత్రించలేరు,లేదా వాటిని గ్రహించలేరు. ఒక వ్యక్తి పెరిగే వాతావరణంపై అనేక రకాలైన విషయాల ప్రభావం మరియు వ్యక్తుల ప్రభావం ఉంటుంది మరియు ఇంత విస్తారమైన అనుసంధానాల సమ్మేళనాన్ని ఏర్పరచడం లేదా నిర్వహించడం ఏ మానవుడికి సాధ్యం కాదు. సృష్టికర్త తప్ప ఏ వ్యక్తి, లేదా ఏ విషయం కూడా ప్రజలు, విషయాలు మరియు సంఘటనలు ఎలా కనబడాలో నియంత్రించగలడు, లేక వాటికంతటికి అవే సంరక్షించుకోలేవు మరియు అవి కనబడకుండగా నియంత్రించుకోలేవు. సృష్టికర్త ముందుగా నిర్ణయించిన విధంగా విస్తారమైన అనుసంధానాల సమ్మేళనం ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని రూపొందిస్తుంది మరియు ప్రజలు పెరిగే వివిధ వాతావరణాలను ఏర్పరుస్తుంది. ఇది సృష్టికర్త యొక్క నిర్వహణ పనికి అవసరమైన వివిధ పాత్రలను సృష్టిస్తుంది, ప్రజలు తమ లక్ష్యాలను విజయవంతంగా నెరవేర్చడానికి స్థిరమైన, బలమైన పునాదులను వేస్తుంది.

మూడవ తరుణం: స్వతంత్రత

ఒక వ్యక్తి బాల్యం మరియు కౌమారదశను దాటి, క్రమంగా మరియు అనివార్యంగా పరిపక్వతకు చేరుకున్న తర్వాత, తదుపరి దశలో వారు తమ యవ్వనం నుండి పూర్తిగా బయటకొచ్చి, తమ తల్లిదండ్రులకు వీడ్కోలు పలికి మరియు ఎవరి మీద ఆధారపడని ఒక వ్యక్తిగా ముందుకు సాగుతాడు. ఈ సమయంలో, ఒక ఎదిగిన వ్యక్తిగా వారు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన అన్ని రకాల వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాలను ఎదుర్కోవాలి, త్వరలో వారికి తారసపడే వారి విధి యొక్క అన్ని భాగాలను ఎదుర్కోవాలి. ఒక వ్యక్తి తప్పనిసరిగా దాటవలసిన మూడవ తరుణం ఇది.

1. స్వతంత్రునిగా మారిన తర్వాత, ఒక వ్యక్తి సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని అనుభవించడాన్ని ప్రారంభిస్తాడు

ఒక వ్యక్తి యొక్క పుట్టుక మరియు ఎదుగుదల అనేవి ఒక వ్యక్తి జీవన ప్రయాణానికి “సిద్ధపరిచేకాలం”, ఆ వ్యక్తి యొక్క విధికి మూలరాయి వేయడం అయితే, ఒక వ్యక్తి యొక్క స్వతంత్రత అనేది వ్యక్తి జీవితంలోని విధికి ఏకపాత్రాభినయాన్ని ప్రారంభించడం వంటింది. ఒక వ్యక్తి పుట్టుక మరియు ఎదుగుదల అనేవి జీవితంలో వారి విధికి సిద్ధపాటుగా సంపాదించిన సంపద అయితే, ఒక వ్యక్తి యొక్క స్వతంత్రత అనేది వారు ఆ సంపదను ఖర్చు చేయడం లేదా దానికి జమ చేయడంలాంటిదన్నమాట. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి స్వతంత్రునిగా మారినప్పుడు, ఆ వ్యక్తి ఎదుర్కొనే సామాజిక పరిస్థితులు మరియు ఆ వ్యక్తికి లభించే పని మరియు వృత్తి రెండూ విధి ద్వారా నిర్ణయించబడతాయి మరియు ఆ వ్యక్తి తల్లిదండ్రులతో వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. కొందరు వ్యక్తులు కళాశాలలో మంచి విషయాన్ని ఎంచుకుంటారు మరియు పట్టభద్రులైన తర్వాత సంతృప్తికరమైన ఉద్యోగాన్ని పొందుతారు, వారి జీవిత ప్రయాణంలో విజయవంతమైన మొదటి అడుగు వేస్తారు. కొందరు వ్యక్తులు అనేక విభిన్న నైపుణ్యాలను నేర్చుకుంటారు మరియు ప్రావీణ్యం పొందుతారు, అయినప్పటికీ వారికి తగిన ఉద్యోగాన్ని ఎన్నడూ పొందలేరు, లేదా తమ స్థానాన్ని ఎన్నడూ కనుగొనలేరు, చాలా చిన్న వృత్తిని కూడా కలిగి ఉండరు; వారి జీవిత ప్రయాణం ప్రారంభంలో, వారు ప్రతి మలుపులో నిరుత్సాహానికి లోనవుతారు, ఇబ్బందులతో సతమతమవుతారు, వారి అవకాశాలు దుర్భరమైనవి మరియు వారి జీవితాలు అనిశ్చితంగా ఉంటాయి. కొందరు వ్యక్తులు తమ చదువుల కోసం జాగ్రత్తగా దరఖాస్తు చేసుకుంటారు, అయినప్పటికీ ఉన్నత విద్యను పొందే ప్రతి అవకాశాన్ని తృటిలో కోల్పోతారు; వారు ఎన్నటికీ విజయం సాధించలేరని భావిస్తారు, వారి జీవిత ప్రయాణంలో వారి మొట్టమొదటి ఆకాంక్ష గాలిలో కలిసిపోతుంది. ముందున్న మార్గం నునుపుగా ఉందా లేదా రాళ్లతో కూడినదా అని తెలియక, మానవ విధి ఎంత వైవిధ్యాలతో నిండి ఉందో వారు మొదటిసారిగా అనుభూతి చెందుతారు మరియు జీవితాన్ని ఆశగాను మరియు భయభ్రాంతితో కూడినదిగాను పరిగణిస్తారు. కొంతమంది, పెద్దగా చదువుకోకపోయినా, పుస్తకాలు వ్రాసి కొంత కీర్తిని సంపాదిస్తారు; కొందరు, దాదాపు పూర్తిగా నిరక్షరాస్యులైనప్పటికీ, వ్యాపారంలో డబ్బు సంపాదిస్తారు మరియు తద్వారా తమను తాము పోషించుకోగలుగుతారు. ఒక వ్యక్తి ఏ వృత్తిని ఎంచుకుంటాడు, ఎలా జీవనోపాధిని పొందుతాడు: ఈ విషయాలలో మంచి ఎంపిక చేయాలా, లేదా చెడు ఎంపిక చేయాలా అనే దానిపై ప్రజలకు ఏదైనా నియంత్రణను కలిగి ఉంటారా? ఈ విషయాలు ప్రజల కోరికలకు మరియు నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయా? చాలా మందికి ఈ క్రింది కోరికలు ఉంటాయి: తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించాలి, ఎండలో మరియు వానలో కష్టపడకూడదు, మంచి బట్టలు ధరించాలి, ప్రతిచోటా మెరుస్తూ, ప్రకాశిస్తూ ఉండాలి, ఇతరులకన్నా ఉన్నతంగా ఉండాలి మరియు తమ పూర్వీకులకు గౌరవం తీసుకురావాలి అనే కోరికలు ఉంటాయి. ప్రజలు పరిపూర్ణత కోసం ఆశిస్తారు, కానీ వారు తమ జీవిత ప్రయాణంలో మొదటి అడుగులు వేసినప్పుడు, మానవ విధి ఎంత అసంపూర్ణమైనదో వారు క్రమంగా తెలుసుకుంటారు మరియు ఒక వ్యక్తి తన భవిష్యత్తు కోసం ధైర్యమైన ప్రణాళికలు వేసుకోగలిగినప్పటికీ మరియు సాహసోపేతమైన కలలు కనగలిగినప్పటికీ, ఎవరికీ తమ స్వంత కలలను సాకారం చేసుకునే సామర్థ్యం లేదా శక్తి ఉండదు మరియు తమ స్వంత భవిష్యత్తును నియంత్రించే స్థితిలో ఎవరూ ఉండరు అనే వాస్తవాన్ని వారు మొదటిసారిగా గ్రహిస్తారు. ఒకరి కలలు మరియు ఒకరు ఎదుర్కోవాల్సిన వాస్తవాల మధ్య ఎల్లప్పుడూ కొంత దూరం ఉంటుంది; ఒక వ్యక్తి కోరుకున్నట్లుగా విషయాలు ఎప్పుడూ ఉండవు మరియు అలాంటి వాస్తవాలను ఎదుర్కొన్నాక, ప్రజలు ఎప్పటికీ సంతృప్తి లేదా సంతుష్టిని పొందలేరు. కొందరు వ్యక్తులు ఎంత దూరమైన వెళతారు, తమ స్వంత విధిని మార్చుకునే ప్రయత్నంలో, తమ జీవనోపాధి మరియు భవిష్యత్తు కోసం గొప్ప ప్రయత్నాలు చేస్తారు మరియు గొప్ప త్యాగాలు చేస్తారు. కానీ చివరికి, వారు తమ స్వంత కృషి ద్వారా వారి కలలు మరియు కోరికలను సాకారం చేసుకోగలిగినప్పటికీ, వారు తమ విధిని ఎప్పటికీ మార్చుకోలేరు మరియు వారు ఎంత గట్టిగా ప్రయత్నించినా, విధి వారికి కేటాయించిన దానిని వారు ఎన్నటికీ అధిగమించలేరు. సామర్థ్యాలు, తెలివితేటలు మరియు సంకల్ప శక్తిలోని తేడాలతో సంబంధం లేకుండా, విధి ముందు వ్యక్తులు అందరూ సమానమే, ఇది గొప్ప మరియు చిన్న, ఉన్నత మరియు తక్కువ, శ్రేష్టమైన మరియు సగటు అని బేధం చూపించదు. ఒకరు ఎటువంటి వృత్తిని చేపడతారు, జీవనోపాధి కోసం ఏం చేస్తారు మరియు ఒకరు తన జీవితంలో ఎంత సంపద కూడబెడతారు అనేవి ఒకరి తల్లిదండ్రులు, ఒకరి ప్రతిభ, ఒకరి కృషి లేదా ఒకరి ఆశయాల ద్వారా నిర్ణయించబడదు, కానీ సృష్టికర్త ద్వారా ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి.

2. ఒక వ్యక్తి తల్లిదండ్రులను విడిచిపెట్టి, జీవిత రంగస్థలంపై తన పాత్రను పోషించడానికి సిద్ధమవ్వడం

ఒక వ్యక్తి పరిపక్వతకు చేరుకున్నప్పుడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తనకు తానుగా జీవించడం మొదలుపెడతాడు మరియు ఈ సమయంలోనే ఒకరు నిజంగా తమ స్వంత పాత్రను పోషించడం ప్రారంభిస్తారు, పొగమంచు తొలగిపోతుంది మరియు జీవితంలో ఒకరి లక్ష్యం క్రమంగా స్పష్టమవుతుంది. నామమాత్రంగా, ఒకరు ఇప్పటికీ తమ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటారు, కానీ ఒకరి లక్ష్యం మరియు జీవితంలో ఒకరు పోషించే పాత్రకు తల్లి మరియు తండ్రితో సంబంధం లేనందున, ప్రాధమికంగా, ఒక వ్యక్తి క్రమంగా స్వతంత్రంగా మారుతున్నప్పుడు ఈ సన్నిహిత బంధం విచ్ఛిన్నమవుతుంది. జీవసంబంధమైన దృక్కోణంలో చూస్తే, తమకు తెలియకుండానే ప్రజలు ఇప్పటికీ తమ తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండలేరు, కానీ నిష్పక్షపాతంగా చెప్పాలంటే, వారు ఒక్కసారి పూర్తిగా ఎదిగిన తర్వాత, వారు తమ తల్లిదండ్రుల నుండి పూర్తిగా వేరైనా జీవితాలను కలిగి ఉంటారు మరియు వారు స్వతంత్రంగా చేపట్టే పాత్రలను నిర్వహిస్తారు. పుట్టుక మరియు పిల్లల పెంపకంతోపాటు, తమ పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల బాధ్యత కేవలం వారికి ఎదగడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పించడమే, ఎందుకంటే సృష్టికర్త యొక్క ముందస్తు నిర్ణయం తప్ప మరేదీ ఒక వ్యక్తి యొక్క విధిపై ప్రభావం చూపదు. ఒక వ్యక్తికి ఎలాంటి భవిష్యత్తు కలిగియుండాలోనని ఎవరూ నియంత్రించలేరు; ఇది చాలా కాలం ముందుగానే నిర్ణయించబడింది మరియు తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తి విధిని మార్చలేరు. విధికి సంబంధించినంతవరకు, ప్రతి ఒక్కరూ స్వతంత్రులు, మరియు ప్రతి ఒక్కరికి వారి స్వంత విధి ఉంటుంది. కాబట్టి, ఎవరి తల్లిదండ్రులు జీవితంలోని ఒకరి విధిని అడ్డుకోలేరు లేదా జీవితంలో ఒకరు పోషించే పాత్రపై కాస్తయినా ప్రభావం చూపలేరు. ఒక వ్యక్తి పుట్టబోయే కుటుంబం మరియు పెరిగే వాతావరణం జీవితంలో ఒక వ్యక్తి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉన్న ముందస్తు షరతులు తప్ప మరేమీ కాదని చెప్పవచ్చు. జీవితంలో ఒక వ్యక్తి యొక్క విధిని లేదా ఏరకమైన విధిలో ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని నెరవేర్చుతారో వారు ఏ విధంగానూ నిర్ణయించరు. కాబట్టి, జీవితంలో ఒకరి లక్ష్యాన్ని సాధించడంలో ఎవరి తల్లిదండ్రులు కూడా ఒకరికి సహాయం చేయలేరు మరియు అదేవిధంగా, జీవితంలో ఒకరి పాత్రను చేపట్టడంలో ఎవరి బంధువులు సహాయం చేయలేరు. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని ఎలా నెరవేరుస్తాడో మరియు ఎలాంటి జీవన వాతావరణంలో ఒక వ్యక్తి తన పాత్రను నిర్వర్తిస్తాడో అది పూర్తిగా జీవితంలో ఒకరి విధిని బట్టి నిర్ణయించబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, సృష్టికర్త ముందుగా నిర్ణయించిన వ్యక్తి యొక్క లక్ష్యాన్ని ఏ ఇతర బాహ్య పరిస్థితులు ప్రభావితం చేయలేవు. ప్రజలందరూ వారు పెరిగే నిర్దిష్ట వాతావరణంలో పరిణతి చెందుతారు; తరువాత క్రమంగా, అంచెలంచెలుగా, వారు జీవితంలో తమ సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు మరియు సృష్టికర్త వారి కోసం ఉద్దేశించిన విధిని నెరవేర్చుతారు. సహజంగానే, అసంకల్పితంగా, వారు మానవ జాతిలోకి ప్రవేశిస్తారు మరియు జీవితంలో తమ స్వంత బాధ్యతలను స్వీకరిస్తారు, సృష్టించబడిన జీవులుగా అక్కడ వారు సృష్టికర్త ముందుగా నిర్ణయించిన దానికోసం, ఆయన సార్వభౌమాధికారం కోసం తమ బాధ్యతలను నెరవేర్చడం ప్రారంభిస్తారు.

నాల్గవ తరుణం: వివాహం

ఒక వ్యక్తి పెరిగి పెద్దయ్యాక, ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల నుండి మరియు ఆ వ్యక్తి పుట్టి పెరిగిన వాతావరణం నుండి మరింత దూరం అవుతారు మరియు అందుకు బదులుగా జీవితంలో ఒక దిశను వెతకడం మరియు తన తల్లిదండ్రులకు భిన్నమైన శైలిలో తన స్వంత జీవిత లక్ష్యాలను కొనసాగించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో, ఒక వ్యక్తికి ఇకపై తన తల్లిదండ్రులు అవసరం ఉండదు, కానీ తన జీవితాన్ని గడపగలిగే భాగస్వామి, అంటే జీవిత భాగస్వామి, తన విధిలో భాగమైన ఉన్న వ్యక్తి కావాలి. కాబట్టి, స్వతంత్రత తర్వాత మొదటి ప్రధాన జీవిత సంఘటన వివాహం, ఒక వ్యక్తి నాల్గవ తరుణాన్ని తప్పనిసరిగా దాటాలి.

1. వ్యక్తిగత ఎంపికతో వివాహంలోకి ప్రవేశించలేరు

ఏ వ్యక్తి జీవితంలోనైనా వివాహం అనేది కీలకమైన సంఘటన; ఒక వ్యక్తి నిజంగా వివిధ రకాల బాధ్యతలను స్వీకరించడం మరియు క్రమంగా వివిధ రకాల లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రారంభించే సమయం ఇది. ప్రజలు వివాహం గురించి చాలా భ్రమలు కలిగి ఉంటారు, వారు దానిని అనుభవించక ముందు, ఈ భ్రమలన్నీ చాలా అందంగా ఉంటాయి. మహిళలు తమ జీవిత భాగస్వాములు అందాల రాకుమారులుగా ఉండాలని ఊహించుకుంటారు మరియు చక్కని అందగత్తెలని వివాహం చేసుకుంటారని పురుషులు ఊహించుకుంటారు. ఈ ఊహలు ప్రతి వ్యక్తికి వివాహానికి సంబంధించి కొన్ని అవసరాలు, వారి స్వంత కోర్కెలు మరియు ప్రమాణాలు ఉంటాయని చూపుతున్నాయి. ఈ దుష్ట యుగంలో ప్రజలు వివాహం గురించి వక్రీకరించిన సందేశాలతో నిరంతరం సతమతమవుతున్నారు, ఇది మరింత అదనపు అవసరాలను సృష్టిస్తుంది మరియు ప్రజలకు అన్ని రకాల భారాన్ని మరియు వింతైన వైఖరులను కల్పిస్తుంది, వివాహాన్ని అనుభవించిన ఎవరికైనా తెలుసు, వారు దానిని ఎలా అర్థం చేసుకున్నా, దానిపట్ల ఒకరి వైఖరి ఎలా ఉన్నా, వివాహం అనేది వ్యక్తిగత ఎంపికకు సంబంధించినది కాదు.

ఒక వ్యక్తి తన జీవితంలో చాలా మందిని ఎదుర్కొంటాడు, కానీ వివాహంలో భాగస్వామిగా ఎవరు అవుతారో ఎవరికీ తెలియదు. వివాహం విషయంలో ప్రతి ఒక్కరికి వారి స్వంత ఆలోచనలు మరియు వ్యక్తిగత భావాలు ఉన్నప్పటికీ, చివరకు వారి భాగస్వామిగా ఎవరు వస్తారో ఎవరూ నిజంగా ఊహించలేరుమరియు ఈ విషయంపై ఒకరి స్వంత ఆలోచనలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని కలిసిన తర్వాత, మీరు ఆ వ్యక్తిని వెంబడించవచ్చు; కానీ వారు నీపట్ల ఆసక్తి కలిగి ఉన్నారా, వారు నీ భాగస్వామిగా మారగలరా అనే విషయాన్ని నిర్ణయించేది నువ్వు కాదు. నీవు నీ జీవితాన్ని పంచుకోవచ్చనే వ్యక్తి నీ ప్రేమానురాగాలకు గురి కానక్కరలేదు; మరియు అదే సమయంలో, నీవు ఎన్నడూ ఊహించని ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నీ జీవితంలోకి ప్రవేశించి, నీ భాగస్వామిగా మారవచ్చు, నీ విధిలో అత్యంత ముఖ్యమైన అంశం, నీ భాగస్వామితో ని విధి విడదీయరాని విధంగా బంధాన్ని కలిగియుండడమే. కాబట్టి, ప్రపంచంలో లక్షలాది వివాహాలు జరిగినప్పటికీ, ప్రతి ఒక్కటి ఒకదానికొకటి భిన్నంగానే ఉంటాయి: చాలా వివాహాలు సంతృప్తికరంగా లేవు, చాలా వివాహాలు సంతోషంగా ఉన్నాయి; చాలా వివాహాలు తూర్పు మరియు పడమరల్లా ఉన్నాయి, చాలా వివాహాలు ఉత్తర మరియు దక్షిణాల్లా ఉన్నాయి; చాలా బంధాలు పరిపూర్ణంగా ఉన్నాయి, చాలా వివాహాలు సమాన సామాజిక హోదాను కలిగి ఉన్నాయి; చాలా వివాహాలు సంతోషంగా మరియు సమాధానంగా ఉన్నాయి, చాలా వివాహాలు బాధ మరియు దుఃఖంలో ఉన్నాయి; చాలా వివాహాలు ఇతరుల్లో అసూయను పుట్టిస్తాయి, చాలా వివాహాలు అపార్ధానికి మరియు కోపానికి గురి చేస్తాయి; చాలా వివాహాలు ఆనందంతో నిండి ఉన్నాయి, చాలా వివాహాలు కన్నీళ్లతో కొట్టుమిట్టాడుతూ, నిరాశలో ఉన్నాయి…ఈ అనేక రకాల వివాహాలలో, మానవులు వివాహంపట్ల విధేయత మరియు జీవితకాల నిబద్ధతను కనబరుస్తారు; వారు ప్రేమను, అనుబంధమును మరియు విడదీయరాని అవినాభావ సంబంధాన్ని, లేదా పరిత్యాగమును మరియు అవగాహనా రాహిత్యాన్ని వెల్లడిస్తారు. కొందరు తమ వివాహానికి ద్రోహం చేస్తారు లేదా దానిని ద్వేషిస్తారు. వివాహం అనేది సంతోషాన్ని తెచ్చినా, లేదా బాధను తెచ్చినా, వివాహంలో ప్రతి ఒక్కరి లక్ష్యాన్ని సృష్టికర్త ముందుగానే నిర్ణయించాడు మరియు అది మారదు; ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయవలసి ఉంది. సృష్టికర్త చాలా ముందుగానే నిర్ణయించిన, ప్రతి వివాహం వెనుక ఉన్న ప్రతి వ్యక్తి యొక్క విధి అనేది మారదు.

2. వివాహం అనేది ఇద్దరు భాగస్వాముల యొక్క విధి నుండి పుడుతుంది

వివాహం అనేది ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక వ్యక్తి విధిలోనుండి మరియు ఒక వ్యక్తి విధిలోని కీలకమైన సంబంధం నుండి పుట్టిన ఫలితమైయున్నది; ఇది ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత సంకల్పం మీదనో, లేదా వారి వ్యక్తిగత ప్రాధాన్యతల మీదనో స్థాపించబడదు మరియు ఎటువంటి బాహ్యాపరమైన అంశాల ద్వారా ప్రభావితం చేయబడదు, కానీ ఇద్దరు భాగస్వాముల విధిని బట్టి, దంపతుల ఇద్దరి భవిష్యత్తు కోసం సృష్టికర్త చేసిన ఏర్పాట్లు మరియు ముందస్తు నిర్ణయాలను బట్టి నిశ్చయించబడుతుంది. పైకి చూడడానికి, వివాహం యొక్క ఉద్దేశ్యం మానవ జాతిని కొనసాగించడమే అయినా, వాస్తవానికి, వివాహం అనేది ఒకరి లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రక్రియలో చేసే ఆచారం తప్ప మరొకటి కాదు. వివాహంలో, ప్రజలు కేవలం తరువాతి తరాన్ని పెంచే పాత్రను పోషించడం మాత్రమే కాదు; వారు వివాహ నిర్వహణలో భాగమైయున్న అన్ని విభిన్న పాత్రలను పోషిస్తారు మరియు ఒక వ్యక్తి ఆ పాత్రలను పోషించడానికి అవసరమైన పనులను స్వీకరిస్తారు. ఒక వ్యక్తి పుట్టుక అనేది దాని చుట్టూ ఉన్న వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల ద్వారా జరిగే మార్పులను ప్రభావితం చేస్తుంది ఒక వ్యక్తి వివాహం కూడా అనివార్యంగా ఈ వ్యక్తులను, సంఘటనలు మరియు విషయాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, వాటన్నిటినీ వివిధ రకాలుగా మారుస్తుంది.

ఒక వ్యక్తి స్వతంత్రుడిగా మారినప్పుడు, ఆ వ్యక్తి తన జీవితంలో తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు, ఇది ఒక వ్యక్తిని దశలవారీగా, తన వివాహానికి సంబంధించిన వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల వైపుకు నడిపిస్తుంది. అదే సమయంలో, ఆ వివాహంలో ఉండే ఇతర వ్యక్తి కూడా అదే వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల వైపుకు అంచెలంచెలుగా చేరుకుంటారు. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం క్రింద, సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు విధిని అనుసరించి క్రమంగా ఒకే వివాహంలోకి ప్రవేశించి, అద్భుతంగా, ఒక కుటుంబంగా మారతారు: “రెండు మిడతలు ఒకే తాడుకు వ్రేలాడుతుంటాయి.” కాబట్టి, ఒక వ్యక్తి వివాహంలోకి ప్రవేశించినప్పుడు, జీవితంలో ఆ వ్యక్తి ప్రయాణం తన భాగస్వామిపై ప్రభావం చూపుతుంది మరియు స్పృశిస్తుంది, అలాగే ఒక వ్యక్తి యొక్క భాగస్వామి ప్రయాణం జీవితంలో ఆ వ్యక్తి స్వంత విధిని ప్రభావితం చేస్తుంది మరియు స్పృశిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మానవ విధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది మరియు ఇతరుల మద్దతు లేకుండా స్వతహాగా ఏ ఒక్కరూ జీవితంలో తన లక్ష్యాన్ని పూర్తి చేయలేరు లేదా తన పాత్రను పోషించలేరు. ఒక వ్యక్తి పుట్టుక అనేక సంబంధాల సమ్మేళనంపై ప్రభావం చూపుతుంది; ఎదగడం అనేది కూడా సంబంధాల సంక్లిష్ట సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది; మరియు అదే విధంగా, వివాహం అనేది అనివార్యంగా ఉనికిలో ఉంది మరియు మానవ సంబంధాల యొక్క విస్తారమైన మరియు సంక్లిష్టమైన సమ్మేళనంలో అది నిర్వహించబడుతుంది, ఆ సమ్మేళనంలోని ప్రతి సభ్యుడిని కలుపుకొంటుంది మరియు దానిలో భాగమైన ప్రతి ఒక్కరి విధిని ప్రభావితం చేస్తుంది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు, వారు పెరిగిన పరిస్థితులు, వారి రూపాలు, వారి వయస్సులు, వారి లక్షణాలు, వారి ప్రతిభ లేదా మరేదైనా ఇతర అంశాలవలన పుట్టేది కాదు; దానికి బదులుగా, ఇది ఒకే పనిని పంచుకోవడము నుండి మరియు సంబంధిత విధి నుండి ఉద్భవిస్తుంది. ఇదే వివాహానికి మూలం, ఇది సృష్టికర్తచే నిర్దేశించబడిన మరియు ఏర్పాటు చేయబడిన మానవ విధి యొక్క ఫలితమైయున్నది.

ఐదవ తరుణం: సంతానం

వివాహమయ్యాక, ఒక వ్యక్తి తన తర్వాతి తరాన్ని పుట్టించడాన్ని ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తికి ఎంతమంది పిల్లలు ఉండాలి మరియు ఎలాంటి పిల్లలు కలిగి ఉండాలనే విషయాన్ని ఎవరూ చెప్పజాలరు; ఇది కూడా ఒక వ్యక్తి యొక్క విధిని బట్టి నిర్ణయించబడుతుంది, ఇది సృష్టికర్తచేత ముందుగానే నిర్ణయించబడుతుంది. ఇది ఒక వ్యక్తి తప్పనిసరిగా దాటవలసిన ఐదవ తరుణం.

ఒక వ్యక్తి యొక్క బిడ్డ పాత్రను పోషించడానికి ఎవరైనా జన్మించినట్లయితే, అప్పుడు ఒక వ్యక్తి తల్లిదండ్రుల పాత్రను నెరవేర్చడానికి తరువాతి తరాన్ని పెంచుతారు. పాత్రలలో ఈ మార్పు అనేది జీవితంలోని వివిధ దశలను వివిధ దృష్టికోణాల నుండి అనుభవించేలా చేస్తుంది. ఇది ఒక విభిన్న జీవిత అనుభవాన్ని కూడా అందిస్తుంది, తద్వారా ఒక వ్యక్తి సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకుంటారు, ఇది ఎల్లప్పుడూ ఒకే విధంగా అమలు చేయబడుతుంది మరియు దీని ద్వారా సృష్టికర్త యొక్క ముందస్తు నిర్ణయాన్ని ఎవరూ అతిక్రమించలేరు, లేదా మార్చలేరు అనే వాస్తవాన్ని ఒక వ్యక్తి తెలుసుకొంటాడు.

1. ఒక వ్యక్తి యొక్క సంతానం ఏమి అవుతుందనే దానిపై ఆ వ్యక్తికి నియంత్రణ ఉండదు

పుట్టడం, ఎదగడం మరియు వివాహం అనేవి అన్నీ వివిధ రకాలుగా మరియు వివిధ స్థాయిలలో నిరాశను కలిగిస్తాయి. కొంతమంది వ్యక్తులు తమ కుటుంబాలను చూసి, లేదా తమ స్వంత భౌతిక రూపాలను చూసుకొని అసంతృప్తి చెందుతారు; కొందరు తమ తల్లిదండ్రులను ఇష్టపడరు; కొందరు తాము పెరిగిన వాతావరణంపై ఆగ్రహమును వ్యక్తము చేస్తారు, లేదా పెరిగిన వాతావరణంపై ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మరియు చాలా మందికి, ఈ నిరాశలన్నిటి మధ్యన, వివాహం చాలా అసంతృప్తికరంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన పుట్టుకను బట్టి, తనకున్న పరిపక్వతను బట్టి, లేదా వివాహమును బట్టి ఎంత అసంతృప్తిగా ఉన్నారనే దానితో సంబంధము లేకుండా, ఈ విషయాల గుండా వెళ్ళిన ప్రతి ఒక్కరికి, వారు ఎక్కడ పుట్టాలి మరియు ఎప్పుడు జన్మించాలి, వారు ఎలా కనిపించాలి, వారి తల్లిదండ్రులు ఎవరై ఉండాలి మరియు వారి జీవిత భాగస్వామిగా ఎవరుండాలి అనే వాటిని ఎంపిక చేసుకోలేరని, కేవలం పరలోక చిత్తాన్ని అంగీకరించాలని తెలుసుకొని ఉంటారు. అయినప్పటికీ, ప్రజలు తరువాతి తరాన్ని పెంచే సమయం వచ్చినప్పుడు, తమ జీవితపు మొదటి అర్ధభాగంలో వారు నెరవేర్చుకోలేకపోయిన కోరికలన్నింటినీ వారి వారసులు నెరవేర్చాలని ఆశిస్తారు, వారి జీవితపు మొదటి అర్ధభాగంలోని నిరాశలన్నిటినీ వారి సంతానం భర్తీ చేస్తుందని ఆశిస్తారు. కాబట్టి ప్రజలు తమ పిల్లల గురించి: తమ కుమార్తెలు అద్భుతమైన సౌందర్య రాశులుగా, తమ కుమారులు ఆకర్షణీయమైన వ్యక్తులుగా; తమ కుమార్తెలు సంస్కారవంతులుగా మరియు ప్రతిభావంతులుగా మరియు తమ కుమారులు తెలివైన విద్యార్థులుగా మరియు ప్రఖ్యాత క్రీడాకారులుగా ఉండాలని; తమ కుమార్తెలు సున్నితత్వం, సద్గుణం మరియు తెలివిగలవారుగా మరియు తమ కుమారులు తెలివైనవారు, సామర్థ్యంగలవారు మరియు సున్నితత్వం కలిగినవారిగా ఎదగాలని తమ పిల్లల విషయమై అనేక రకాల కలలను కంటూ, వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. వారు తమ సంతానం, వారు కుమార్తెలయినా లేదా కుమారులైనా, పెద్దలను గౌరవిస్తారని, తల్లిదండ్రులపట్ల శ్రద్ధ వహిస్తారని, అందరిచే ప్రేమించబడతారని మరియు ప్రశంసించబడాలని ఆశిస్తారు... ఈ సమయంలో, జీవితంపై ఆశలు మళ్లీ పుంజుకుంటాయి, ప్రజల హృదయాల్లో కొత్త కోరికలు పుడతాయి. ఈ జీవితంలో తాము శక్తిలేనివారమని మరియు నిస్సహాయులమని, ఇతరులకంటే భిన్నంగా ఉండడానికి వారికి మరొక అవకాశం, లేదా మరొక ఆశ ఉండదని మరియు తమ విధిని అంగీకరించడం తప్ప వారికి వేరొక మార్గం లేదని ప్రజలకు తెలుసు. కాబట్టి వారు తమ ఆశలను, నెరవేర్చబడని తమ కోరికలను మరియు ఆలోచనలను తరువాతి తరానికి అందిస్తారు, వారి సంతానం వారి కలలను నెరవేర్చడంలో మరియు వారి కోరికలను సాకారం చేసుకోవడంలో వారికి సహాయపడగలదని ఆశిస్తారు; వారి కుమార్తెలు మరియు కుమారులు ఇంటి పేరుకు కీర్తిని తెస్తారని, ప్రముఖులవుతారని, ధనవంతులు అవుతారని, లేదా ప్రసిద్ధులు అవుతారని ఆశిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, వారు తమ పిల్లల అదృష్టం అమాంతం పెరగాలని కోరుకుంటారు. ప్రజల ప్రణాళికలు మరియు ఊహలు ఖచ్చితంగా ఉంటాయి; తమకు ఎంత మంది పిల్లలు ఉండాలి, తమ పిల్లల రూపురేఖలు, సామర్థ్యాలు మొదలైనవాటిని తాము నిర్ణయించుకోలేమని, తమ పిల్లల భవితవ్యం తమ చేతుల్లో లేదని వారికి తెలియదా? మానవులు తమ స్వంత విధికి యజమానులు కాదు, అయినప్పటికీ వారు యువ తరం యొక్క విధిని మార్చాలని ఆశిస్తున్నారు; వారు తమ స్వంత విధి నుండి తప్పించుకోలేని శక్తిహీనులు, అయినప్పటికీ వారు తమ కుమారులు మరియు కుమార్తెలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. వారు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదా? ఇది మానవ మూర్ఖత్వం మరియు అజ్ఞానం కాదా? ప్రజలు తమ సంతానం కోసం ఎంత దూరం అయినా వెళతారు, కానీ చివరికి, ఒకరి ప్రణాళికలు మరియు కోరికలు ఒకరికి ఎంత మంది పిల్లలను కలిగి ఉండాలో, లేదా ఆ పిల్లలు ఎలా ఉండాలో అనే వాటిని గూర్చి నిర్దేశించలేవు. కొంతమంది డబ్బులేకుండా కడు పేద స్థితిని కలిగియుంటారు కానీ వారు ఎక్కువమంది పిల్లలను కంటారు; కొంతమంది ధనవంతులు అయినప్పటికీ వారికీ ఒక్క సంతానం కూడా ఉండదు. కొందరికి కూతురు కావాలి కానీ ఆ కోరిక తీరదు; కొందరికి కొడుకు కావాలి కానీ మగ బిడ్డను కనడంలో విఫలమవుతారు. కొందరికి పిల్లలు అంటే ఆశీర్వాదం; మరికొందరికి, పిల్లలంటే శాపం. కొన్ని జంటలు తెలివైనవారు, అయినప్పకీ మంద బుద్ధిగల పిల్లలకు జన్మనిస్తారు; కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి మరియు నిజాయితీగా ఉంటారు, అయినప్పటికీ వారు పెంచే పిల్లలు సోమరులుగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు దయగా మరియు నిజాయితీగా ఉంటారు, కానీ వారి పిల్లలు మోసపూరితంగా మరియు దుర్మార్గులుగా తయారవుతారు. కొంతమంది తల్లిదండ్రులు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కానీ వికలాంగ పిల్లలకు జన్మనిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు సామాన్యులు మరియు ఏమీ సాధించనివారుంటారు, అయినా వారి పిల్లలు గొప్ప విజయాలు సాధిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తక్కువ హోదాలో ఉన్నప్పటికీ వారి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారు...

2. తరువాతి తరాన్ని పెంచిన తర్వాత, ప్రజలు విధిని గురించి కొత్త అవగాహనను పొందుకుంటారు

చాలా మంది వ్యక్తులు సుమారు ముప్పై ఏళ్ళ వయసులో వివాహ జీవితంలోకి ప్రవేశిస్తుంటారు, జీవితంలోని ఇలాంటి సమయంలో మనిషికి విధి గురించి ఇంకా ఎలాంటి అవగాహన ఉండదు. కానీ ప్రజలు పిల్లలను పెంచడం ప్రారంభించినప్పుడు మరియు వారి సంతానం పెరిగేకొద్దీ, కొత్త తరం యొక్క జీవితం మరియు మునుపటి తరం యొక్క అన్ని అనుభవాలను పునరావృతం అవడాన్ని వారు చూస్తారు మరియు వారి స్వంత గతాలు తమ పిల్లల్లో ప్రతిబింబించడం చూశాక, తమలాగే, యువ తరం నడిచిన మార్గాన్ని ముందుగా ప్రణాళిక చేయలేమని మరియు ఎన్నుకోలేమని వారు గ్రహిస్తారు. ఈ వాస్తవాన్ని ఎదుర్కొన్నప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క విధి ముందుగా నిర్ణయించబడిందని అంగీకరించడం తప్ప వారికి వేరే మార్గం లేదు మరియు దానిని పూర్తిగా గ్రహించకుండా, వారు క్రమంగా తమ స్వంత కోరికలను పక్కన పెడతారు మరియు వారి హృదయాలలోని అభిరుచులు చెదిరిపోయి, కనుమరుగవుతాయి. ఈ కాలములో ఉన్న వ్యక్తులు, తప్పనిసరిగా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శినిని దాటి, జీవితమును గూర్చి కొత్త అవగాహనను పొందుకున్నారు, కొత్త వైఖరిని అలవరచుకున్నారు. ఈ వయస్సులో ఉన్న వ్యక్తి భవిష్యత్తు నుండి ఏం ఆశించవచ్చు మరియు వారు ఎటువంటి అవకాశాల కోసం ఎదురుచూడవచ్చు? యాభై ఏళ్ల మహిళ ఇప్పటికీ అందమైన రాకుమారుని గురించి కలలు కంటోంది అంటే ఏమిటి? యాభై ఏళ్ల వ్యక్తి ఇప్పటికీ తన సౌందర్య రాశి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఏమిటి? మధ్య వయస్కురాలైన స్త్రీ ఇప్పటికీ బాతు కోడి స్థితి నుండి హంసలా అందంగా మారాలని ఆశిస్తోంది? చాలా మంది వృద్ధులు యువకుల మాదిరిగానే వృత్తి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారా? మొత్తానికి, ఒక వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ అనే తేడా లేకుండా, ఈ వయస్సు వరకు జీవించే ఎవరైనా వివాహం, కుటుంబం మరియు పిల్లలపట్ల సాపేక్షంగా హేతుబద్ధమైన మరియు ఆచరణాత్మకమైన వైఖరిని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ఎటువంటి ఎంపికలు ఉండవు, విధిని సవాలు చేయాలనే కోరిక ఉండదు. మానవ అనుభవానికి సంబంధించినంతవరకు, ఒక వ్యక్తి ఈ వయస్సు వచ్చిన వెంటనే, ఆ వ్యక్తి సహజంగా ఒక నిర్దిష్టమైన వైఖరిని ఏర్పరచుకొంటాడు: “ఒక వ్యక్తి విధిని అంగీకరించాలి; ఒక వ్యక్తి యొక్క పిల్లలకు వారి స్వంత అదృష్టాలు ఉంటాయి; మానవ విధి అనేది పరలోకంచే నిర్ణయించబడింది.” సత్యాన్ని అర్థం చేసుకోని చాలా మంది వ్యక్తులు, ఈ ప్రపంచంలోని అన్ని ఒడిదుడుకులు, నిరాశలు మరియు కష్టాలను ఎదుర్కొన్న తర్వాత, మానవ జీవితానికి సంబంధించిన వారి ఆలోచనలన్నీ రెండు పదాలతో సారాంశముగా చెప్తారు: “అది విధి!” ఈ మాట మానవ విధిని గూర్చి లౌకిక వ్యక్తుల అవగాహనను మరియు వారు తీసుకు వచ్చిన ముగింపును సారాంశముగా చెప్పినప్పటికీ మరియు ఇది మనుష్యజాతి యొక్క నిస్సహాయతను వ్యక్తపరిచినప్పటికీ, చాకచక్యంగా మరియు ఖచ్చితమైనదిగా వివరించబడినప్పటికీ, ఇది సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోవడానికి చాలా దూరంగా ఉంది మరియు సృష్టికర్త యొక్క అధికారానికి సంబంధించిన జ్ఞానానికి ఇది ప్రత్యామ్నాయం కాదు.

3. విధిని విశ్వసించడం అనేది సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించిన జ్ఞానానికి ప్రత్యామ్నాయం కాదు

ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి అనుసరించాక, విధి గురించిన మీకున్న (ప్రజల) జ్ఞానానికి మరియు విధిని గురించి లోకసంబంధమైన వ్యక్తులకున్న జ్ఞానానికి మధ్య ముఖ్యమైన తేడా ఉందా? మీరు నిజంగా సృష్టికర్త యొక్క ముందస్తు నిర్ణయాన్ని అర్థం చేసుకున్నారా మరియు సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని నిజంగా తెలుసుకున్నారా? కొంతమంది వ్యక్తులు “అది విధి” అనే మాటను గురించి గాఢమైన మరియు లోతైన అవగాహనను కలిగి ఉన్నారు, అయినప్పటికీ వారు దేవుని సార్వభౌమత్వాన్ని కనీసం విశ్వసించరు; మానవ విధి అనేది దేవునిచే ఏర్పాటు చేయబడిందని మరియు నిర్వహించబడిందని వారు విశ్వసించరు మరియు దేవుని సార్వభౌమాధికారానికి లోబడడానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తులు సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నట్లు, కెరటాల చేత ఎగురవేయబడినట్లుగా, ప్రవాహంతో కొట్టుకుపోతున్నట్లుగా, నిష్క్రియంగా వేచి ఉంటూ మరియు విధికి తమను తాము వదిలివేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు. అయినప్పటికీ మానవ విధి అనేది దేవుని సార్వభౌమాధికారానికి లోబడి ఉంటుందని వారు గుర్తించరు; వారు తమ స్వంత చొరవతో దేవుని సార్వభౌమాధికారమును గూర్చి తెలుసుకోలేరు మరియు తద్వారా దేవుని అధికారం గురించి జ్ఞానాన్ని సంపాదించలేరు, దేవుని కార్య నిర్వహణలకు మరియు ఏర్పాట్లకు లోబడలేరు, విధిని ఎదిరించడాన్ని ఆపలేరు మరియు దేవుని సంరక్షణ, రక్షణ మరియు మార్గదర్శకత్వంలో జీవించలేరు. మరో మాటలో చెప్పాలంటే, విధిని అంగీకరించడం అనేది సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి లోబడడం కాదు; విధిని విశ్వసించడం అంటే సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం, గుర్తించడం మరియు తెలుసుకోవడం కాదు; విధిని విశ్వసించడం అంటే దానిని గూర్చిన సత్యాన్ని మరియు దాని అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను గుర్తించుటయైయున్నది. మానవాళి యొక్క విధిని సృష్టికర్త ఎలా శాసిస్తాడో తెలుసుకోవడం నుండి, అన్ని విషయాలపై ఆధిపత్యానికి సృష్టికర్తే మూలం అని గుర్తించడానికి ఇది భిన్నంగా ఉంటుంది మరియు సృష్టికర్త యొక్క నిర్వహణలకు మరియు మానవాళి యొక్క విధికి సంబంధించిన ఏర్పాట్లకు లోబడడానికి ఖచ్చితంగా చాలా దూరంగా ఉంటుంది. ఒక వ్యక్తి విధిని మాత్రమే విశ్వసిస్తే, అంటే వారు దాని గురించి లోతుగా భావించినప్పటికీ, తద్వారా మానవాళి యొక్క విధిపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకోలేకపోతే మరియు గుర్తించలేకపోతే, దానికి లోబడకపోతే మరియు దానిని అంగీకరించకపోతే, వారి జీవితం విషాదం అవుతుంది, జీవితం వ్యర్థంగా జీవించినట్లవుతుంది, శూన్యంగా ఉంటుంది; నిజానికి వారు సృష్టించబడిన మానవులుగా మారడానికి మరియు సృష్టికర్త ఆమోదాన్ని ఆస్వాదించడానికి వారు ఇప్పటికీ సృష్టికర్త యొక్క ఆధీనంలోకి రాలేకపోవుచున్నారు. సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని నిజంగా తెలుసుకొని మరియు అనుభవించే వ్యక్తి క్రియాశీలక స్థితిలో ఉండాలి గాని క్రియారహితముగాను, లేదా నిస్సహాయ స్థితిలోనూ ఉండకూడదు. అటువంటి వ్యక్తి సమస్త విషయాలకు విధి ఉంటుందనే విషయాన్ని అంగీకరించినప్పుడు, వారు జీవితానికి మరియు విధికి సంబంధించి ఖచ్చితమైన నిర్వచనాన్ని కలిగి ఉండాలి: ప్రతి జీవితం సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి తాను నడిచిన మార్గాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, తన ప్రయాణంలోని ప్రతి దశను గుర్తు చేసుకున్నప్పుడు, ఆ ప్రయాణం కష్టతరమైనా లేదా సాఫీగా సాగినా, ప్రతి అడుగులోనూ దేవుడు తన మార్గాన్ని నడిపిస్తున్నాడని, దానిని ప్రణాళిక చేస్తూ ఉంటాడని చూస్తాడు. ఇవన్నీ దేవుని ఖచ్చితమైన ఏర్పాట్లు, ఆయన జాగ్రత్తగా చేసిన ప్రణాళికలుకా ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండానే, అది ఒక వ్యక్తిని ఈనాటి వరకు నడిపించింది. సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించగలగడం, ఆయన రక్షణను పొందడం అనేది ఎంత గొప్ప అదృష్టం! ఒక వ్యక్తి విధిపట్ల ప్రతికూల వైఖరిని కలిగి ఉన్నట్లయితే, దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన ప్రతి దానిని వారు ఎదిరిస్తున్నారని, వారికి లోబడే స్వభావం లేదని రుజువు చేస్తోంది. మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారంపట్ల ఒక వ్యక్తి సానుకూల దృక్పథం కలిగి ఉన్నట్లయితే, అప్పుడు ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని తిరిగి చూసుకున్నప్పుడు, దేవుని సార్వభౌమాధికారాన్ని నిజంగా అర్ధం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదానికీ లోబడాలని మరింత హృదయపూర్వకంగా కోరుకుంటాడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మానేయడానికి మరియు దేవుడు ఒకరి విధిని నడిపించేందుకు మరింత దృఢ నిశ్చయం మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా విధిని గ్రహించనప్పుడు, దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకోనప్పుడు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ముందుకు సాగినప్పుడు, అస్పష్టతతో తడబడుతూ తొట్రుపడుతున్నప్పుడు, ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కాబట్టి మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రజలు గుర్తించినప్పుడు, తెలివిగలవారు దానిని తెలుసుకోవడానికి మరియు దానిని అంగీకరించడానికి ఎంచుకుంటారు, వారు తమ స్వహస్తాలతో మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించిన బాధాకరమైన రోజులకు వీడ్కోలు పలుకుతారు మరియు విధికి వ్యతిరేకంగా పోరాడటం మరియు వారి స్వంత మార్గంలో “జీవిత లక్ష్యాలు” అని పిలవబడే వాటిని అనుసరించడాన్ని ఆపేస్తారు. ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉండనప్పుడు, ఆయనను చూడలేనప్పుడు, దేవుని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా గుర్తించలేనప్పుడు, ప్రతిదినం అర్థరహితంగాను, విలువలేనిదిగాను, దయనీయంగాను ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నా, ఒక వ్యక్తి ఉద్యోగం ఏదయినా, ఒక వ్యక్తి జీవన సాధనాలు మరియు ఒక వ్యక్తి లక్ష్యాల సాధన అనేవి ఒక వ్యక్తికి అంతులేని హృదయ విదారకాన్ని మరియు ఉపశమనంలేని బాధను తప్ప మరేమీ తీసుకురావు, అలాంటి వ్యక్తి తన గతాన్ని తిరిగి చూసేందుకు ధైర్యం చేయలేడు. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించి, ఆయన నిర్వహణలు మరియు ఏర్పాట్లకు లోబడి, మరియు నిజమైన మానవ జీవితాన్ని అన్వేషిస్తున్నప్పుడు మాత్రమే, ఒక వ్యక్తి క్రమంగా సమస్త హృదయ విదారకమైన స్థితి నుండిమరియు సమస్త శ్రమల నుండి విముక్తి పొందడం ప్రారంభిస్తాడు మరియు జీవితంలోని సమస్త శూన్యత నుండి బయటపడతాడు.

4. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి లోబడేవారు వారు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యమును పొందగలరు

ప్రజలు దేవుని కార్య నిర్వహణలు మరియు దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించనందున, వారు ఎల్లప్పుడూ తిరుగుబాటు వైఖరితోనూ మరియు అవిధేయతతోనూ విధిని ఎదుర్కొంటూ ఉంటారుమరియు వారు ఎల్లప్పుడూ దేవుని అధికారాన్ని మరియు సార్వభౌమాధికారాన్ని మరియు విధిలో భాగమైయున్న విషయాలను త్రోసిపుచ్చాలని కోరుకుంటారు, వారి ప్రస్తుత పరిస్థితులను మరియు వారి విధిని మార్చుకోవాలని వృధాగా ఆశిస్తుంటారు. కానీ వారు ఎప్పటికీ విజయం సాధించలేరు మరియు ప్రతి మలుపులోనూ అడ్డుకోబడతారు. ఒకరి ఆత్మలో లోతుగా జరిగే ఈ పోరాటం, ఒక విధంగా ఎముకలు విరిగిపోతున్నటువంటి తీవ్రమైన బాధను పుట్టిస్తుంది, ఎందుకంటే ఒకరు తమ జీవితాన్ని అన్ని వేళలా వృధాగా జీవీస్తున్న వారివలె ఉంటారు. ఈ బాధకు కారణం ఏమిటి? ఈ బాధకు కారణం దేవుని సార్వభౌమాధికారమా? లేదా ఒక వ్యక్తి దురదృష్టవంతుడుగా పుట్టడమా? నిస్సందేహంగా, రెండూ నిజం కాదు. ప్రాధమికంగా, ఇది ప్రజలు అనుసరించే మార్గాలను బట్టి, తమ జీవితాలను గడపడానికి వారు ఎంచుకున్న పద్ధతులను బట్టి కలుగుతుంది. కొంతమంది ఈ విషయాలను గ్రహించి ఉండకపోవచ్చు. కానీ నీవు నిజంగా తెలుసుకున్నప్పుడు, మానవ విధిపై దేవునికి సార్వభౌమాధికారం ఉందని మీరు నిజంగా గుర్తించినప్పుడు, దేవుడు నీ కోసం ప్రణాళిక చేసిన మరియు నీ కోసం నిర్ణయించిన ప్రతీది గొప్ప ప్రయోజనకరమని మరియు సంరక్షణకరమని నీవు నిజంగా అర్థం చేసుకున్నప్పుడు, నీవు నీ నొప్పి తగ్గిపోతూ ఉండడాన్ని అనుభూతి చెందుతావు మరియు నీ మనస్సు, శరీరం మరియు అంతరంగం విశ్రాంతిని, స్వేచ్ఛను, విముక్తిని పొందుతుంది. ఎక్కువ శాతపు ప్రజల స్థాయిల నుండి తీర్పు తీర్చుకుంటూ వచ్చినప్పుడు, మానవాళి విధిపై సృష్టికర్త సార్వభౌమాధికారం యొక్క అర్థము మరియు ఆచరణాత్మక విలువ అనే మాటలను వారు నిజంగా అర్థం చేసుకోలేదు, వ్యక్తిగత స్థాయిలోనైనా, వారు మునుపటిలా జీవించడానికి మరియు వారి బాధ నుండి ఉపశమనం పొందడానికి ఇష్టపడరు; ఖచ్చితంగా, వారు నిజంగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించలేదు మరియు దానికి లోబడలేదు. సృష్టికర్త యొక్క కార్య నిర్వహణలు మరియు ఏర్పాట్లను ఎలా అన్వేషించాలి మరియు ఎలా అంగీకరించాలి అనే విషయం వారికి ఇంకా చాలా వరకు తెలియదు. కాబట్టి, మానవుల విధిపై మరియు మానవునికి సంబంధించిన అన్ని విషయాలపై సృష్టికర్త సార్వభౌమాధికారాన్ని కలిగియున్నాడనే వాస్తవాన్ని ప్రజలు నిజంగా గుర్తించలేకపోతే, వారు నిజంగా సృష్టికర్త ఆధిపత్యానికి లోబడకపోతే, అప్పుడు “ఒక వ్యక్తి విధి ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది” అనే ఆలోచనతో నడిపించబడకుండా మరియు నిర్భంధించబడకుండా ఉండటం వారికి కష్టంగా ఉంటుంది. విధి మరియు సృష్టికర్త యొక్క అధికారానికి వ్యతిరేకంగా వారు చేసే తీవ్రమైన పోరాటం యొక్క బాధను పోగొట్టుకోవడం వారికి కష్టంగా ఉంటుంది మరియు వారు నిజంగా విముక్తి పొందడం మరియు స్వేచ్ఛగా మారడం, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మారడం కూడా కష్టమని చెప్పనవసరం లేదు. కానీ ఒక వ్యక్తి ఈ స్థితి నుండి తనను తాను విడిపించుకోవడానికి చాలా సులభమైన మార్గం ఉంది, అది తన పూర్వ జీవన విధానానికి వీడ్కోలు పలకడం; జీవితంలో ఒక వ్యక్తి యొక్క మునుపటి లక్ష్యాలకు స్వస్తి చెప్పడం; ఒక వ్యక్తి మునుపటి జీవనశైలిని, జీవిత దృక్పధాన్ని, అన్వేషణలను, కోరికలను, ఆదర్శాలను సంగ్రహించడం మరియు విశ్లేషించడం; ఆపై వాటిని దేవుని చిత్తంతోనూ మరియు మనిషి కోసం దేవుడు కోరుకున్నవాటితో పోల్చి, వాటిలో ఏవైనా దేవుని చిత్తానికి మరియు ఆయన కోరుకున్నవాటికి అనుగుణంగా ఉన్నాయో లేదో, వాటిలో ఏదైనా సరైన జీవిత విలువలను అందజేస్తుందో లేదో, ఒక వ్యక్తి సత్యాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి దారి తీస్తుందో లేదో మరియు మానవజాతితో మరియు మానవ పోలికతో జీవించడానికి అనుమతిస్తుందో లేదో చూడడం. ప్రజలు జీవితంలో అనుసరించే వివిధ లక్ష్యాలను మరియు వారి అసంఖ్యాక జీవన విధానాలను నీవు పదే పదే పరిశోధించి, జాగ్రత్తగా గమనించినప్పుడు, వాటిల్లో ఏ ఒక్కటి కూడా సృష్టికర్త మానవాళిని సృష్టించిన అసలు ఉద్దేశానికి అనుగుణంగా లేదని నీవు తెలుసుకుంటావు. అవన్నీ ప్రజలను సృష్టికర్త సార్వభౌమాధికారం నుండి మరియు సంరక్షణ నుండి దూరం చేస్తాయి; అవన్నీ ప్రజలను భ్రష్టుపట్టేలా చేసే ఉచ్చులు మరియు అవి వారిని నరకానికి నడిపిస్తాయి. నీవు దీనిని గుర్తించిన తర్వాత, నీవు చేయాల్సిన పని ఏమనగా జీవితంపట్ల నీకున్న పాత దృక్పథాన్ని పక్కన పెట్టడం, వివిధ రకాలైన ఉచ్చులకు దూరంగా ఉండటం, నీ జీవితానికి దేవుణ్ణి బాధ్యత వహించనివ్వడం మరియు నీ కోసం ఏర్పాట్లు చేయనివ్వడం; ఇది కేవలం దేవుని కార్యనిర్వహణలకు మరియు నడిపింపుకు లోబడుటకు ప్రయత్నించడం, వ్యక్తిగత ఎంపిక లేకుండా జీవించడం మరియు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారడం. ఇది సులువుగా అనిపిస్తుంది, కానీ అలా చేయడం చాలా కష్టం. కొంతమంది దాని బాధను భరించగలరు, మరికొందరు భరించలేరు. కొందరు లోబడడానికి ఇష్టపడతారు, మరికొందరు ఇష్టపడరు. ఇష్టపడని వారికి అలా చేయాలనే కోరిక మరియు తీర్మానం లేదు; వారికి దేవుని సార్వభౌమాధికారం గురించి స్పష్టంగా తెలుసు, మానవ విధిని ప్రణాళిక చేసేది మరియు ఏర్పాటు చేసేది దేవుడే అని బాగా తెలుసు, అయినప్పటికీ వారు సతమతమవుతుంటారు మరియు దేవుని చేతిలో తమ విధిని ఉంచడానికి మరియు దేవుని సార్వభౌమత్వానికి లోబడడానికి ఇష్టపడకుండా అసమాధానముతోనే ఉండిపోతారు; అంతేకాకుండా, వారు దేవుని కార్యనిర్వహణలు మరియు ఆయన ఏర్పాట్లను ఇష్టపడరు. కాబట్టి తమ సామర్థ్యం ఏమిటో స్వయంగా చూడాలనుకునే కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు; వారు దేవుని అధికారం యొక్క హద్దులను అధిగమించగలరా మరియు దేవుని సార్వభౌమాధికారం కంటే పైకి ఎదగగలరో లేదో చూడడానికి, వారు తమ స్వహస్తాలతో తమ విధిని మార్చుకోవాలని, లేదా వారి స్వంత శక్తితో ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. మనిషి యొక్క విషాదం ఏమిటంటే, అతను సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడం కాదు, అతను కీర్తి మరియు అదృష్టాన్ని వెంబడించడం కాదు, లేదా అస్పష్టంగా తన స్వంత విధికి వ్యతిరేకంగా పోరాడడం కాదు, కానీ అతను సృష్టికర్త ఉనికిని చూసిన తర్వాత, మానవ విధిపై సృష్టికర్తకు సార్వభౌమాధికారం ఉందనే వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత, ఇప్పటికీ తన మార్గాలను సరిదిద్దుకోలేకపోవడం, బురదలో నుండి తన పాదాలను బయటకు తీయలేకపోవడం, కానీ తన హృదయాన్ని కఠినతరం చేసుకొంటాడు మరియు తన తప్పులలోనే కొనసాగుతాడు. బురదలో కొట్టుకుంటూనే ఉంటాడు, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మొండిగా పోరాడుతుంటాడు, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, కఠినమైన ముగింపు వరకు తిరస్కరిస్తూ ఉంటాడు. అతను విరిగి నలిగిపోయి రక్తపాతములో పడి ఉన్నప్పుడు మాత్రమే చివరికి వదిలిపెట్టి వెనుదిరగాలని నిర్ణయించుకుంటాడు. ఇది నిజమైన మానవ దుఃఖం. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, లోబడడానికి ఎంచుకునే వారు తెలివైనవారు మరియు పోరాడి పారిపోవడానికి ఎంచుకున్నవారు నిజంగా తెలివి తక్కువ వారు.

ఆరవ తరుణం: మరణం

ఇంతటి హడావిడి, ఎన్నో నిరాశలు, నిరుత్సాహాల తర్వాత, ఎన్నో సంతోషాలు, దుఃఖాలు, ఒడిదుడుకుల తర్వాత, ఎన్నో మరచిపోలేని సంవత్సరాల తర్వాత, ఋతువులు పదే పదే మారడం చూసిన తర్వాత, ఒక వ్యక్తి తన జీవితంలో ముఖ్యమైన అడుగుజాడలను గమనించకుండానే దాటాడు. మరియు రెప్పపాటులో, ఒక వ్యక్తి తనను తాను తన కనుచీకటి, లేక తన చివరి సంవత్సరాలలో కనుగొంటాడు. సమయం యొక్క గుర్తులు ఒక వ్యక్తి యొక్క శరీరం అంతటా ముద్రించబడి ఉంటాయి: ఒక వ్యక్తి ఇక నిటారుగా నిలబడలేడు, ఒక వ్యక్తికున్న జుట్టు నలుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతుంది, ఒకప్పుడు ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా ఉండే కళ్ళు మసకగా మరియు మబ్బుగా మారుతాయి, మరియు మృదువుగా, మెత్తగా ఉండే చర్మం ముడతలు మరియు మచ్చలుగా మారుతుంది. ఒక వ్యక్తి వినికిడి శక్తి బలహీనపడుతుంది, ఒక వ్యక్తి దంతాలు వదులవుతాయి మరియు రాలిపోతాయి, ఒకరి స్పందనలు మందగిస్తాయి, ఒకరి కదలికలు నెమ్మదిస్తాయి. ఈ సమయంలో, ఒక వ్యక్తి తన యవ్వనం యొక్క ఉత్సాహభరిత సంవత్సరాలకు తుది వీడ్కోలు పలికి, వృద్ధాప్యం అనే తన జీవితపు కనుచీకటిలోనికి ప్రవేశిస్తాడు: తరువాత, ఒక వ్యక్తి మరణాన్ని ఎదుర్కొంటాడు, ఇదే మానవ జీవితంలో చివరి ఘట్టం.

1. సృష్టికర్త మాత్రమే మనిషి యొక్క జీవం మీద మరియు మరణం మీద అధికారాన్ని కలిగి ఉంటాడు

ఒక వ్యక్తి యొక్క జన్మ ఆ వ్యక్తి యొక్క మునుపటి జీవితాన్ని బట్టి నిర్ణయించబడితే, అప్పుడు ఒకరి మరణం ఆ విధి యొక్క ముగింపుని సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క పుట్టుక ఈ జీవితంలో ఒకరి లక్ష్యానికి ఆరంభమైతే, ఒకరి మరణం ఆ లక్ష్యానికి ముగింపును సూచిస్తుంది. సృష్టికర్త ఒక వ్యక్తి యొక్క పుట్టుకకు నిర్దిష్ట పరిస్థితులను నిర్ణయించాడు కాబట్టి, ఆయన ఒక వ్యక్తి యొక్క మరణానికి కూడా ఒక నిర్దిష్ట పరిస్థితులను ఏర్పాటు చేసాడు అని చెప్పనవసరం లేదు. మరో మాటలో చెప్పాలంటే, ఎవరూ అదృష్టాన్నిబట్టి జన్మించరు, ఎవరికీ ఆకస్మికంగా మరణం రాదు మరియు ఒక వ్యక్తి యొక్క పుట్టుక మరియు మరణం రెండూ తప్పనిసరిగా వారి మునుపటి మరియు ప్రస్తుత జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క జననానికి మరియు మరణానికి సంబంధించిన పరిస్థితులు సృష్టికర్త ద్వారా ముందుగానే నిర్ణయించబడతాయి; ఇది ఒక వ్యక్తి యొక్క గమ్యస్థానం, ఒక వ్యక్తి యొక్క విధియైయున్నది. ఒక వ్యక్తి యొక్క పుట్టుకకు అనేక వివరణలు ఉన్నందున, ఒక వ్యక్తి యొక్క మరణం సహజంగా దాని స్వంత, ప్రత్యేకమైన వివిధ పరిస్థితులలో సంభవిస్తుంది అనేది కూడా నిజం. ఈ కారణం చేతనే ప్రజలు వివిధ ఆయుష్కాలలను మరియు విభిన్న మరణ పద్ధతులను మరియు మరణించేటప్పుడు విభిన్నసమయాలను కలిగి ఉంటారు. కొందరు వ్యక్తులు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు, అయినా యౌవ్వన వయసులోనే చనిపోతారు; మరికొందరు బలహీనంగా మరియు అనారోగ్యంతో ఉంటారు, అయినప్పటికీ వృద్ధాప్యం వరకు జీవిస్తారు మరియు ప్రశాంతంగా మరణిస్తారు. కొందరు అస్వాభావికమైన కారణాలవల్ల చనిపోతారు, మరికొందరు స్వాభావికంగానే చనిపోతాయి. కొందరు ఇంటికి దూరంగా తమ జీవితాలను ముగించుకుంటారు, మరికొందరు చివరిసారిగా తమ ప్రియమైన వారిని పక్కన పెట్టుకుని కళ్ళు మూస్తారు. కొంతమంది గాలిలో చనిపోతారు, మరికొందరు భూగర్భంలో మరణిస్తారు. కొందరు నీటి అడుగున మునిగిపోతారు, మరికొందరు విపత్తులలో కనుమరుగవుతారు. కొందరు ఉదయం, మరికొందరు రాత్రి మరణిస్తారు.… ప్రతి ఒక్కరూ అద్భుతమైన పుట్టుక, అద్భుతమైన జీవితం మరియు అద్భుతమైన మరణాన్ని కోరుకుంటారు, కానీ ఎవరూ తమ స్వంత విధిని అధిగమించలేరు, ఏ ఒక్కరూ సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తప్పించుకోలేరు. ఇదే మానవ విధి. మనిషి తన భవిష్యత్తు కోసం అన్ని రకాల ప్రణాళికలు వేసుకోగలడు, కానీ ఏ ఒక్కరూ తమ జనన మరణ విధానాన్ని మరియు సమయాన్ని ప్రణాళిక చేసుకోలేరు. మృత్యువు రాకుండా తప్పించుకోవడానికి మరియు నిరోధించడానికి ప్రజలు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, వారికి తెలియకుండానేమరణం నిశ్శబ్దంగా దగ్గరవుతుంది. వారు ఎప్పుడు చనిపోతారో, అది ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిస్సందేహంగా, జీవంపై మరియు మరణంపై అధికారాన్ని మానవజాతియైన, స్వాభావిక ప్రపంచములో ఏ ఇతర వ్యక్తియైనా కలిగియుండడు కానీ విశిష్టమైన అధికారం కలిగి ఉన్న సృష్టికర్త మాత్రమే కలిగి ఉంటాడు. మానవజాతి యొక్క జననం మరియు మరణం అనేవి సహజ ప్రపంచంలోని కొన్ని నియమాల ద్వారా పుట్టేది కాదు గాని సృష్టికర్త అధికారం యొక్క సార్వభౌమాధికారపు పరిణామమైయున్నది.

2. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం తెలియని వ్యక్తిని మరణ భయం వెంటాడుతుంది

ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి ప్రవేశించినప్పుడు, ఎదుర్కొనే సవాలు ఏమనగా కుటుంబాన్ని పోషించడం గురించి కాదు, లేదా జీవితంలో ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆశయాలను స్థాపించడం గురించి కాదు, కానీ ఒక వ్యక్తి జీవితానికి ఎలా వీడ్కోలు పలకాలి, ఒక వ్యక్తి జీవితపు ముగింపును ఎలా చేరుకోవాలి, చివరికి ఒక వ్యక్తి జీవితమనే వాక్యము యొక్క ముగింపుకు ఎలాంటి విరామం పలకగలరనే సవాలును ఎదుర్కుంటారు. పైకి చూడడానికి, ప్రజలు మరణంపట్ల తక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు అనిపించినా, ఆ విషయాన్ని అన్వేషించకుండా ఎవరూ తప్పించుకోలేరు, ఎందుకంటే మరణానికి దూరంగా, తమకు ఏమాత్రం తెలియని, మానవులు గ్రహించలేని లేదా అనుభూతి చెందని, మరొక ప్రపంచం ఉంటుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. దీనివలన ప్రజలు మరణాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవటానికి భయపడతారు, వారు దానిని తప్పకుండా ఎదుర్కోవాలని తెలిసినప్పటికీ దానిని ఎదుర్కోవటానికి భయపడతారు; దానికి బదులుగా, వారు దానిని తప్పించుకోవడానికి తమ వంతు కృషిని చేస్తారు. కాబట్టి ఇది ప్రతి వ్యక్తిని మరణాన్ని గూర్చిన భయాందోళనలతో నింపుతుంది మరియు ఈ అనివార్యమైన జీవిత వాస్తవానికి మర్మపు ముసుగును వేస్తుంది, ప్రతి వ్యక్తి హృదయంపై నిరంతరము ఉండే నీడను పరుస్తుంది.

ఒక వ్యక్తి తన శరీరం క్షీణిస్తున్నట్లు భావించినప్పుడు, ఒక వ్యక్తి మరణానికి దగ్గరవుతున్నట్టు గ్రహించినప్పుడు, ఒక అస్పష్టమైన భీతికి, చెప్పలేని భయానికి లోనవుతాడు. మరణ భయం అనేది ఒక వ్యక్తిని మరింత ఒంటరితనానికి మరియు నిస్సహాయతకు గురి చేస్తుంది. ఈ సమయంలో, ఒక వ్యక్తి తనను తాను ఈ క్రింది విధంగా ప్రశ్నించుకుంటాడు: మనిషి ఎక్కడ నుండి వచ్చాడు? మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? తనకున్న జీవం పోయాక, మనిషి ఇలా చనిపోతాడా? మనిషి జీవితానికి ముగింపు ఇలాగే ఉంటుందా? చివరికి, జీవితానికి అర్థం ఏమిటి? అసలు, జీవితం విలువ ఏమిటి? ఇది కీర్తి మరియు అదృష్టాల గురించా? ఇది కుటుంబాన్ని పోషించడం గురించా?… ఈ నిర్దిష్ట ప్రశ్నల గురించి ఎవరైనా ఆలోచించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మరణం గురించి ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా భయపడుతున్నాడనే దానితో సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తి హృదయ లోతుల్లో రహస్యాలను పరిశోధించాలనే కోరిక, జీవితం గురించి గ్రహించలేనటువంటి ఒక భావన మరియు వీటితో పాటు, ప్రపంచమును గురించిన వ్యామోహం, వదిలి వెళ్ళడానికి అయిష్టతలు ఉంటాయి. మనిషి దేనికి భయపడతాడు, మనిషి దేనిని అన్వేషిస్తాడు, దేని గురించి వ్యామోహం కలిగి ఉంటాడు మరియు దేనిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు అనే విషయాలను ఎవరూ స్పష్టంగా చెప్పలేరు...

వారు మరణానికి భయపడతారు కాబట్టి, ప్రజలు ఎన్నో చీకు చింతలను కలిగి ఉంటారు; వారు మరణానికి భయపడతారు కాబట్టి, ప్రజలు వదులుకోలేనివాటిని ఎన్నో కలిగి ఉంటారు. వారు చనిపోబోతున్నప్పుడు, కొంతమంది దీని గురించి లేదా దాని గురించి చింతిస్తారు; వారు తమ బిడ్డల గురించి, తమకు ప్రియమైన వారి గురించి, తమ సంపదల గురించి ఆందోళన చెందుతారు, చింతించుట ద్వారా మరణం తెచ్చే బాధలను మరియు భయాన్ని వారు తుడిచివేయవచ్చని, జీవించి ఉన్నవారితో ఒక రకమైన సాన్నిహిత్యాన్ని కొనసాగించడం ద్వారా మృత్యువుతోపాటు వచ్చే నిస్సహాయత మరియు ఒంటరితనం నుండి వారు తప్పించుకోవచ్చని అనుకుంటారు. మనిషి హృదయ లోతుల్లో ఒక అస్పష్టమైన తెలియని భయం ఉంటుంది, తమకు ప్రియమైనవారి నుండి విడిపోతామనే భయం, నీలాకాశం వైపు ఇంకెప్పుడూ చూడలేమనే భయం, భౌతిక ప్రపంచాన్ని మరలా చూడలేమనే భయం ఉంటుంది. తనకు ప్రియమైనవారి సహవాసానికి అలవాటుపడిన ఓ ఒంటరి ఆత్మ, తన పట్టును కోల్పోయి, తెలియని ప్రపంచం కోసం మరియు పరిచయంలేని ప్రపంచం కోసం ఒంటరిగా బయలుదేరడానికి ఇష్టపడదు.

3. కీర్తిని మరియు అదృష్టమును వెంబడిస్తూ గడిపిన జీవితం ఒక వ్యక్తిని మృత్యువాత పడి నష్టపోయే విధంగా చేస్తుంది.

సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం మరియు ముందస్తు నిర్ణయం కారణంగా, తన పేరుతో ఏమీ లేకుండా ప్రారంభమైన ఒంటరి ఆత్మ తల్లిదండ్రులను మరియు కుటుంబాన్ని, మానవ జాతిలో సభ్యునిగా మారే అవకాశాన్ని, మానవ జీవితాన్ని అనుభవించే మరియు ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని పొందుతుంది. ఈ ఆత్మ సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని అనుభవించడానికి, సృష్టికర్త యొక్క సృష్టిలోని అద్భుతాన్ని తెలుసుకోవడానికి మరియు దానికంటే ఎక్కువగా సృష్టికర్త యొక్క అధికారాన్ని తెలుసుకునే మరియు ఆ అధికారానికి లోబడి ఉండే అవకాశాన్ని కూడా పొందుతుంది. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ అరుదైన మరియు స్వల్పకాలిక అవకాశాన్ని నిజంగా ఉపయోగించుకోరు. ఒక వ్యక్తి విధికి వ్యతిరేకంగా పోరాడే పోరాటములో జీవితకాలపు విలువైన శక్తిని వ్యయము చేస్తాడు, తన సమయాన్నంతా హడావిడిగా అల్లరిగా గడుపుతాడు, తన కుటుంబాన్ని పోషించడానికి ప్రయత్నిస్తాడు, సంపద కోసం మరియు హోదా కోసం ప్రాకులాడుతుంటాడు. ప్రజలు నిధిగా భావించే విషయాలు కుటుంబం, డబ్బు మరియు కీర్తి అనే వాటిని వారు జీవితంలో అత్యంత విలువైన విషయాలుగా చూస్తారు. ప్రజలందరూ తమ విధి గురించి ఫిర్యాదు చేస్తుంటారు, అయినప్పటికీ వారు పరిశీలించడానికి మరియు అర్థం చేసుకోవడానికి చాలా ఆవశ్యకమైన సమస్యలను పట్టించుకోకుండా ఉన్నారు: అంటే, మనిషి ఎందుకు సజీవంగా ఉన్నాడు, మనిషి ఎలా జీవించాలి, జీవితం యొక్క విలువ మరియు జీవితం యొక్క అర్థం అంటే ఏమిటి అనే విషయాలను వారు అంతగా పట్టించుకోరు. వారు తమ జీవితమంతా, వారు ఎంతకాలం జీవిస్తే అంత కాలం, వారి యవ్వనం తరిగిపోయే వరకు మరియు వెంట్రుకలు తెల్లబారి, చర్మము మడతలు పడేంత వృద్ధులయ్యే వరకు కేవలం కీర్తిని మరియు సంపదను వెతుక్కుంటూ గడుపుతారు. కీర్తి మరియు సంపద తమను వృద్ధాప్యానికి దగ్గర కాకుండా ఆపలేవని, డబ్బు హృదయ శూన్యతను నింపలేదని, పుట్టుక, వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణం యొక్క నియమాల నుండి ఎవరూ అతీతులు కారని, తమకున్న విధిని ఎవరూ తప్పించుకోలేరని వారు చూసేంత వరకు వారు ఈ విధంగా జీవిస్తారు. జీవితపు ఆఖరి తరుణమును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మాత్రమే, ఒక వ్యక్తి విస్తారమైన సంపద మరియు అపారమైన ఆస్తులను కలిగి ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ప్రత్యేక హోదా మరియు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి మరణం నుండి తప్పించుకోలేడని మరియు తన అసలు స్థితికి తిరిగి రావాలని వారు నిజంగా గ్రహిస్తాడు: ఒక ఒంటరి ఆత్మ, దాని పేరు మీద ఏమీ ఉండదు. ప్రజలు తల్లిదండ్రులను కలిగి ఉన్నప్పుడు, తమకు తల్లిదండ్రులే సర్వస్వం అని నమ్ముతారు; ప్రజలకు ఆస్తి ఉన్నప్పుడు, డబ్బు అనేది ఒక వ్యక్తి మూలాధారమని, దాని ద్వారానే ఒక వ్యక్తి జీవనం సాగిస్తాడని వారు భావిస్తారు; ప్రజలు హోదాను కలిగి ఉన్నప్పుడు, వారు దానిని గట్టిగా పట్టుకుంటారు మరియు దాని కొరకు తమ ప్రాణాలను పణంగా పెడతారు. ప్రజలు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టబోతున్నప్పుడు మాత్రమే వారు తమ జీవితాలను వేటిని వెంబడిస్తూ గడిపారో అవన్నీ చెదిరిపోయే మేఘాలు తప్ప మరేమీ కాదని వారు గ్రహిస్తారు, వాటిలో దేనినీ వారు పట్టుకోలేరు, వారు దేనినీ తమతో తీసుకెళ్లలేరు, వాటిలో ఏ ఒక్కటీ వారిని మరణం నుండి తప్పించలేదు, వాటిలో ఏ ఒక్కటి కూడా తిరుగు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఆత్మకు సహవాసమును గాని, లేదా ఆదరణను గాని అందించదు; వీటన్నిటికీ మించి, వీటిలో ఏ ఒక్కటి ఒక వ్యక్తిని రక్షించలేవు మరియు వారు మృత్యువును అధిగమించేలా చేయలేవు. భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి పొందే కీర్తి మరియు సంపద తాత్కాలిక సంతృప్తిని, క్షణిక ఆనందాన్ని, తప్పుడు సౌలభ్య అనుభూతిని ఇస్తుంది; ఈ ప్రక్రియలో, అవి ఒక వ్యక్తి దారి తప్పి పోయేలా చేస్తాయి. అందువల్ల ప్రజలు, వారు మానవ జాతి యొక్క విస్తారమైన సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, శాంతి, సౌఖ్యం మరియు హృదయ ప్రశాంతతను కోరుకుంటూ, ఒక దాని తర్వాత మరొకటిగా వచ్చే అలలలో మునిగిపోతుంటారు. ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు జీవిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే మొదలైన అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్నలను ప్రజలు ఇంకా గుర్తించనప్పుడు, వారు కీర్తి మరియు సంపదలు అనే వాటి ద్వారా చెరపట్టబడతారు. వాటి ద్వారా తప్పుదారి పట్టించబడతారు మరియు వాటిచే నియంత్రించబడతారు మరియు కోలుకోలేని విధంగా నష్టపోతారు. కాలం గడిచిపోతుంది; రెప్పపాటులో సంవత్సరాలు గడిచిపోతాయి మరియు ఒక వ్యక్తి దానిని గ్రహించేలోపే, ఒక వ్యక్తి తన జీవితంలోని అత్యుత్తమ సంవత్సరాలకు వీడ్కోలు పలుకుతాడు. ఒక వ్యక్తి త్వరగా లోకాన్ని విడిచిపెట్టబోతున్నప్పుడు, ప్రపంచంలోని సమస్తం చేజారిపోతుందని, నిజానికి ఏ ఒక్కరూ తమకు చెందిన ఆస్తులను ఇకపై పట్టుకొని ఉండలేరని క్రమక్రమంగా గ్రహిస్తారు; అప్పుడు ఒక వ్యక్తి తన పేరున ఇంకా ఏమీ లేకుండా, ఇప్పుడే ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏడుస్తున్న పసిబిడ్డలా ఉన్నానని నిజంగా భావిస్తాడు. ఈ సమయంలో, ఒక వ్యక్తి జీవితంలో ఏమి చేసాడో, సజీవంగా ఉండటం అనేది విలువైనదా, దాని అర్థం ఏమిటి, ఒక వ్యక్తి ప్రపంచంలోకి ఎందుకు వచ్చాడో అనే విషయాలను ఆలోచించవలసి వస్తుంది. మరియు ఈ సమయంలోనే ఒక వ్యక్తి నిజంగా తదుపరి జీవితం ఉందా, పరలోకం నిజంగా ఉందా, నిజంగా శిక్ష ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటాడు…. ఒక వ్యక్తి మరణానికి ఎంత దగ్గరగా వస్తాడో, నిజంగా జీవితం అంటే ఏమిటో అని అంతగా అర్థం చేసుకోవాలనుకుంటాడు; ఒక వ్యక్తి మరణానికి ఎంత దగ్గరగా వస్తే, ఆ వ్యక్తి హృదయం అంత శూన్యంగా కనిపిస్తుంది; ఒక వ్యక్తి మరణానికి ఎంత దగ్గరగా వస్తే, ఆ వ్యక్తి అంతగా మరింత నిస్సహాయతకు లోనవుతాడు; కాబట్టి ఒక వ్యక్తి మరణ భయం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ప్రజలు మరణానికి దగ్గరవుతున్నప్పుడు అలాంటి భావనలు కలగడానికి రెండు కారణాలు ఉన్నాయి: మొదటిగా, వారు జీవితాలు ఆధారపడిన కీర్తిని మరియు సంపదను కోల్పోతారు, ప్రపంచంలో కంటికి కనిపించే ప్రతిదాన్ని వదిలివేయబోతున్నారు; మరియు రెండవదిగా, వారు ఒంటరిగా ఎటువంటి పరిచయంలేని ప్రపంచాన్ని, ఒక రహస్యమైన, తెలియని ప్రదేశాన్ని ఎదుర్కోబోతున్నారు, అక్కడ వారు అడుగు పెట్టడానికి భయపడతారు, అక్కడ వారికి ప్రియమైనవారు లేరు మరియు బలపరిచే మార్గాలు లేవు. ఈ రెండు కారణాలవల్ల, మరణాన్ని ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ అశాంతికి గురవుతారు, భయాందోళనలకు లోనవుతారు మరియు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిస్సహాయతను అనుభవిస్తారు. ఎవరైనా నిజంగా ఈ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే వారు ఈ భూమిపై అడుగు పెట్టినప్పుడు, వారు మొదట, మానవులు ఎక్కడ నుండి వచ్చారు, ప్రజలు ఎందుకు జీవిస్తున్నారు, మానవ విధిని ఎవరు నిర్దేశిస్తారు మరియు ఎవరు సమకూర్చుతారు మరియు మానవ ఉనికిపై ఎవరు సార్వభౌమాధికారం కలిగి ఉన్నారు అనే విషయాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ అవగాహనే ఒక వ్యక్తి జీవించడానికి నిజమైన సాధనం, మానవ మనుగడకు అవసరమైన ఆధారం, అంటే ఒక వ్యక్తి కుటుంబానికి అవసరమైనవి ఎలా సమకూర్చాలో, లేదా కీర్తి మరియు సంపదను ఎలా సంపాదించాలో నేర్చుకోవడం కాదు,, ఇతరులకు భిన్నంగా ఎలా ఉండాలో లేదా మరింత సంపన్నంగా జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడం కాదు, ఎలా రాణించాలి మరియు ఇతరులతో విజయవంతంగా ఎలా పోటీపడాలో అనేటువంటివి నేర్చుకోవడం కాదు. ప్రజలు తమ జీవితాలను స్వావలంబనలో గడపడానికి దోహదమైన వివిధ మనుగడ నైపుణ్యాలు భౌతిక సుఖాలను సమృద్ధిగా అందించగలిగినప్పటికీ, అవి ఒకరి హృదయానికి నిజమైన శాంతిని మరియు ఓదార్పును అందించవు, దానికి బదులుగా, అవి ప్రజలు తరచూ తమ దిశను కోల్పోయేలా, తమను తాము నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడేలా మరియు జీవితం యొక్క అర్థం తెలుసుకోవడానికిగల ప్రతి అవకాశాన్ని కోల్పోయేలా చేస్తాయి; ఈ మనుగడ నైపుణ్యాలు మరణాన్ని సరిగ్గా ఎలా ఎదుర్కోవాలి అనే ఆందోళనను లోలోపల సృష్టిస్తాయి. ప్రజల జీవితాలు ఈ విధంగా నాశనం అవుతున్నాయి. సృష్టికర్త ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తాడు, ప్రతి ఒక్కరికీ తన సార్వభౌమాధికారాన్ని అనుభవించడానికి మరియు తెలుసుకోవటానికి జీవితకాల విలువైన అవకాశాలను ఇస్తాడు, అయినప్పటికీ మరణం సమీపించినప్పుడు, దాని భీతి ఏర్పడినప్పుడు, ఒక వ్యక్తి కాంతిని చూడటం ప్రారంభిస్తాడు, అంటే అప్పటికే చాలా ఆలస్యం అయ్యుంటుంది!

ప్రజలు డబ్బును మరియు కీర్తిని సంపాదించుట కొరకు వెంటపడుతూ తమ జీవితాలను గడుపుతారు; వాటిని కలిగి ఉండటం ద్వారా వారు మరణం నుండి మినహాయింపు పొంది జీవించగలరు అన్నట్లుగా, వారికిదే ఆధార సాధనాలు అన్నట్లుగా ఆలోచన చేస్తుంటారు, కానీ వారు చనిపోవబోతున్నప్పుడు మాత్రమే, ఈ విషయాలు తమకు ఎంత దూరంలో ఉన్నాయో, మరణం ముంగిట వారు ఎంత బలహీనులో, వారు ఎంత సులభంగా విచ్చిన్నమవుతారో, ఎటువైపు తిరగాలో తెలియక, ఎంత ఒంటరిగా మరియు నిస్సహాయంగా ఉన్నారో వారు తెలుసుకుంటారు. జీవితాన్ని డబ్బుతోనో, కీర్తితోనో కొనలేమని, ఒక వ్యక్తి ఎంత సంపన్నుడైనా, ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా, మరణం ముందు అందరూ సమానంగా అధములని మరియు అల్పమైనవారని వారు గ్రహిస్తారు. డబ్బుతో జీవితాన్ని కొనలేమని, కీర్తి మరణాన్ని తుడిచిపెట్టదని, డబ్బు గాని, లేదా కీర్తి గాని ఒక వ్యక్తి జీవితాన్ని ఒక్క నిమిషం, ఒక్క క్షణం కూడా పొడిగించలేవని వారు గ్రహిస్తారు. ప్రజలు ఎంతగా ఎక్కువగా ఈ విధంగా భావిస్తే, వారు అంత ఎక్కువగా జీవించడం కొనసాగించాలని కోరుకుంటారు; ప్రజలు ఎంతగా ఎక్కువగా ఈ విధంగా భావిస్తే, వారు అంత ఎక్కువగా మృత్యువును సమీపించుట కొరకు భయపడతారు. ఈ సమయంలో మాత్రమే వారు తమ జీవితాలు తమకు చెందినవి కావని, వారి నితంత్రణలో లేవని, మరియు ఒక వ్యక్తి జీవించడం, లేదా మరణించడం అనే దానిని ఎవరూ చెప్పలేరనే విషయాన్ని వారు నిజంగా గ్రహిస్తారు, అంటే ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క నియంత్రణకు అతీతమైనవి.

4. సృష్టికర్త యొక్క ఆధిపత్యం కిందకు వచ్చి, మరణాన్ని ప్రశాంతంగా ఎదుర్కోండి

ఒక వ్యక్తి జన్మించిన సమయంలో, ఒక ఒంటరి ఆత్మ భూమిపై తన జీవితాన్ని అనుభవించుటకు ప్రారంభిస్తుంది, సృష్టికర్త దాని కోసం ఏర్పాటు చేసిన సృష్టికర్త యొక్క అధికారాన్ని అనుభవిస్తుంది. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించిన జ్ఞానాన్ని పొందేందుకు, ఆయన అధికారాన్ని తెలుసుకోవటానికి మరియు దానిని వ్యక్తిగతంగా అనుభవించడానికి ఒక వ్యక్తికి, అంటే ఒక ఆత్మకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పనవసరం లేదు. సృష్టికర్త నిర్దేశించిన విధి నియమాలకు లోబడి ప్రజలు తమ జీవితాలను జీవిస్తారు మరియు మనస్సాక్షి ఉన్న ఏ హేతుబద్ధమైన వ్యక్తికైనా, వారి జీవితంలో దశాబ్దాలుగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం మరియు ఆయన అధికారాన్ని తెలుసుకోవడం కష్టమైన విషయం కాదు. కాబట్టి, అనేక దశాబ్దాలుగా వారి స్వంత జీవిత అనుభవాలను బట్టి, మానవుల భవిష్యత్తులన్నీముందుగానే నిర్ణయించబడ్డాయని ప్రతి వ్యక్తి గుర్తించడం చాలా సులభం మరియు సజీవంగా ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం సులభం, లేదా వాటిని సారాంశ పరచడం సులభం. ఒక వ్యక్తి ఈ జీవిత పాఠాలను స్వీకరించినప్పుడు, జీవం ఎక్కడ నుండి వస్తుంది, హృదయానికి నిజంగా ఏమి అవసరం, ఒక వ్యక్తిని నిజమైన జీవిత మార్గంలో ఏది నడిపిస్తుంది మరియు మానవ జీవితం యొక్క లక్ష్యం మరియు మానవ జీవితము యొక్క గురి ఏమిటో క్రమంగా అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి సృష్టికర్తను ఆరాధించకపోతే, ఒక వ్యక్తి ఆయన ఆధీనంలోకి రాకపోతే, మరణాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు, అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ మరోసారి సృష్టికర్తను ఎదుర్కోబోతున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క హృదయం విపరీతమైన భీతితోనో మరియు అలజడితోనో నిండిపోవడం క్రమంగా గుర్తిస్తారు. ఒక వ్యక్తి అనేక దశాబ్దాలుగా ప్రపంచంలో ఉంటూ, మానవ జీవితం ఎక్కడ నుండి వస్తుందో ఇంకా అర్థం చేసుకోకపోతే, లేదా ఎవరి చేతిలో మానవ విధి ఆధారపడి ఉందో గుర్తించకపోతే, వారు మరణాన్ని ప్రశాంతంగా ఎదుర్కోలేరనడంలో ఆశ్చర్యం లేదు. మానవ జీవితానికి సంబంధించిన దశాబ్దాల అనుభవంలో, సృష్టికర్త సార్వభౌమాధికారం గురించిన జ్ఞానాన్ని పొందిన వ్యక్తి, జీవితం యొక్క అర్థం మరియు జీవితం యొక్క విలువ పట్ల సరైన అవగాహన కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించిన నిజమైన అనుభవం మరియు అవగాహనతో జీవిత ఉద్దేశ్యం గురించి లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు మరియు అంతకు మించి, సృష్టికర్త అధికారానికి లోబడగలుగుతాడు. అలాంటి వ్యక్తి దేవుడు మానవజాతిని సృష్టించిన అర్ధాన్ని గ్రహిస్తాడు, మనిషి సృష్టికర్తను ఆరాధించాలని, మనిషి కలిగి ఉన్న ప్రతీది సృష్టికర్త నుండి వచ్చిందని మరియు భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆయన వద్దకు తిరిగి వెళతాడని అర్ధం చేసుకుంటాడు. ఈ విధమైన వ్యక్తి సృష్టికర్త మనిషి పుట్టుకను ఏర్పాటు చేస్తాడని మరియు మనిషి మరణంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడని మరియు జీవం మరియు మరణం రెండూ సృష్టికర్త యొక్క అధికారం ద్వారా ముందుగా నిర్ణయించబడ్డాయని అర్థం చేసుకుంటాడు. కాబట్టి, ఒక వ్యక్తి ఈ విషయాలను నిజంగా గ్రహించినప్పుడు, ఆ వ్యక్తి సహజంగానే మృత్యువును ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతాడు, తన ప్రాపంచిక ఆస్తులన్నింటినీ ప్రశాంతంగా ప్రక్కనపెట్టి, రానున్న వాటన్నింటినీ అంగీకరించి, సంతోషంగా సమర్పించుకుంటాడు మరియు శాశ్వత జీవితాన్ని స్వాగతిస్తాడు, అంటే గుడ్డిగా భయపపడుతూ, దానికి వ్యతిరేకంగా పోరాడే బదులు, సృష్టికర్త ద్వారా ఏర్పాటు చేయబడిన చివరి జీవిత తరుణాన్ని స్వాగతిస్తాడు. సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని అనుభవించడానికి మరియు ఆయన అధికారాన్ని తెలుసుకోవడానికి తన జీవితాన్ని ఒక అవకాశంగా భావిస్తే, ఒక వ్యక్తి తన జీవితాన్ని సృష్టించబడిన మానవుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి మరియు తన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఒక అరుదైన అవకాశంగా భావిస్తే, అప్పుడు ఒక వ్యక్తికి ఖచ్చితంగా జీవితంపై సరైన దృక్పథం ఉంటుంది, ఖచ్చితంగా సృష్టికర్త ద్వారా ఆశీర్వదించబడిన మరియు మార్గనిర్దేశం చేయబడిన జీవితాన్ని గడుపుతారు, ఖచ్చితంగా సృష్టికర్త యొక్క వెలుగులో నడుస్తారు, ఖచ్చితంగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకుంటారు, ఖచ్చితంగా ఆయన ఆధిపత్యంలోకి వస్తారు మరియు ఖచ్చితంగా ఆయన అద్భుత కార్యాలకు, ఆయన అధికారానికి సాక్షిగా మారతారు. అలాంటి వ్యక్తిని సృష్టికర్త ఖచ్చితంగా ప్రేమిస్తాడని మరియు అంగీకరిస్తాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరియు అలాంటి వ్యక్తి మాత్రమే మరణంపట్ల ప్రశాంత వైఖరిని కలిగి ఉండగలడు మరియు జీవితపు చివరి తరుణాన్ని ఆనందంతో స్వాగతించగలడు. మరణంపట్ల యోబు ఈ విధమైన వైఖరిని స్పష్టంగా కలిగి ఉన్నాడు. యోబు జీవితంలోని ఆఖరి దశను సంతోషంగా అంగీకరించగల స్థితిలో ఉన్నాడు మరియు తన జీవిత ప్రయాణాన్ని సాఫీగా ముగించి మరియు జీవితంలో తన లక్ష్యాన్ని పూర్తి చేసి, అతను సృష్టికర్త వద్దకు తిరిగి వచ్చాడు.

5. జీవితములో యోబు యొక్క అన్వేషణలు మరియు ఆయన పొందిన ప్రయోజనాలు అనేవి అతను ప్రశాంతంగా మరణాన్ని ఎదుర్కొనేలా చేశాయి

లేఖనాల్లో యోబు గురించి ఇలా వ్రాయబడి ఉంది: “పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను” (యోబు 42:17). దీనర్థం, యోబు మరణించినప్పుడు, అతను విచారించలేదు మరియు బాధను అనుభవించలేదు, కానీ ఆయన సహజంగానే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. అందరికీ తెలిసినట్లుగా, యోబు జీవించి ఉన్న రోజుల్లో దేవునికి భయపడి చెడుకు దూరంగా ఉండేవాడు. అతని పనులు దేవునిచే ప్రశంసించబడ్డాయి మరియు ఇతరులచే స్మరించుకోబడ్డాయి మరియు అతని జీవితం ఇతరులందరినీ మించిన విలువను మరియు ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పవచ్చు. యోబు దేవుని ఆశీర్వాదాలను ఆస్వాదించాడు మరియు భూమిపై ఆయన చేత నీతిమంతుడు అని పిలువబడ్డాడు మరియు అతను కూడా దేవునిచే పరీక్షించబడ్డాడు మరియు సాతాను చేత శ్రమ పరచబడ్డాడు. అతను దేవునికి సాక్షిగా నిలిచాడు మరియు ఆయన నీతిమంతుడు అని పిలవబడటానికి అర్హునిగా ఎంచబడ్డాడు. అతను దేవునిచే పరీక్షించబడిన తర్వాత అనేక దశాబ్దాలలో, అతను మునుపటి కంటే మరింత విలువైన, అర్థవంతమైన, స్థిరమైన మరియు ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపాడు. అతని నీతి క్రియల కారణంగా, దేవుడు అతనిని పరీక్షించాడు మరియు అతని నీతి క్రియలు కారణంగా, దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో నేరుగా మాట్లాడాడు. కాబట్టి, అతను పరీక్షించబడిన తర్వాత వచ్చిన సంవత్సరాలలో, యోబు జీవిత విలువను మరింత నిర్దిష్టమైన రీతిలో అర్థం చేసుకున్నాడు మరియు గ్రహించాడు, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించి లోతైన అవగాహనను పొందాడు మరియు సృష్టికర్త తన ఆశీర్వాదాలను ఎలా ఇస్తాడు మరియు తీసుకుంటాడు అనే దాని గురించి మరింత ఖచ్చితమైన మరియు నిర్దిష్టమైన జ్ఞానాన్ని పొందాడు. యెహోవా దేవుడు యోబుకు మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదించాడని, సృష్టికర్త సార్వభౌమాధికారాన్ని తెలుసుకుని, మరణాన్ని ప్రశాంతంగా ఎదుర్కోవడానికి యోబును మరింత మెరుగైన స్థితిలో ఉంచాడని యోబు గ్రంధంలో నమోదు చేయబడి ఉంది. కాబట్టి యోబు వృద్ధుడై మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు, తన ఆస్తి గురించి ఖచ్చితంగా చింతించి ఉండడు. అతనికి చింత లేదు, పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు మరియు మరణానికి భయపడలేదు, ఎందుకంటే అతను తన జీవితమంతా దేవునికి భయపడుతూ మరియు చెడును విస్మరిస్తూ జీవించాడు. అతను తన జీవిత ముగింపు గురించి ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. నేడు ఎంతమంది వ్యక్తులు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు యోబులా ఉండగలరు? ఎందుకు ఏ ఒక్కరూ ఇంతటి సులువైన బాహ్య వైఖరిని వ్యక్తీకరించలేకపోతున్నారు? ఒకే ఒక కారణం ఉంది: యోబు తన జీవితాన్ని విశ్వాసం, గుర్తింపు అను వాటిని కలిగి, దేవుని సార్వభౌమాధికారానికి లోబడుతూ జీవించాడు మరియు ఈ విశ్వాసం, గుర్తింపు మరియు విధేయతతో అతను జీవితంలోని ముఖ్యమైన తరుణాలను దాటాడు, తన చివరి సంవత్సరాల వరకు జీవించాడు మరియు తన జీవితపు చివరి తరుణానికి స్వాగతం పలికాడు. యోబు అనుభవించిన దానితో సంబంధం లేకుండా, జీవితంలో అతనికున్న అన్వేషణలు మరియు లక్ష్యాలు బాధాకరమైనవి కావు గాని సంతోషకరమైనవి. సృష్టికర్త అతనికి ప్రసాదించిన ఆశీర్వాదాలు లేదా ప్రశంసలవల్ల మాత్రమే కాదు గాని, మరి ముఖ్యంగా, అతని అన్వేషణలు మరియు జీవిత లక్ష్యాలు, దేవునికి భయపడుతూ, చెడును విస్మరించడం ద్వారా అతను పొందిన సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించి పెరుగుతున్న జ్ఞానం మరియు నిజమైన అవగాహననుబట్టి. అంతేకాకుండా, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం, దేవుని అద్భుత కార్యాలు, మనిషికి మరియు దేవునికి మధ్యనున్న సామరస్యం, పరిచయం మరియు పరస్పర అవగాహనను గూర్చిన సున్నితమైన ఇంకా మరచిపోలేని అనుభవాలు మరియు జ్ఞాపకాలనుబట్టి అతను సంతోషంగా ఉన్నాడు. సృష్టికర్త యొక్క చిత్తాన్ని తెలుసుకోవడంవల్ల లభించిన సౌఖ్యం మరియు ఆనందం కారణంగా మరియు ఆయన గొప్పవాడు, అద్భుతకరుడు, ప్రేమగలవాడు మరియు నమ్మకదగిననవాడు అని చూసిన తర్వాత ఏర్పడిన ఆరాధనా భావం కారణంగా యోబు సంతోషంగా ఉన్నాడు. యోబు ఎటువంటి బాధ లేకుండా మరణాన్ని ఎదుర్కోగలిగాడు, ఎందుకంటే అతను చనిపోతే, సృష్టికర్త వద్దకు తిరిగి వస్తాడని అతనికి తెలుసు. అతని జీవితంలోని అన్వేషణలు మరియు ప్రయోజనాలే అతన్ని ప్రశాంతంగా మరణాన్ని ఎదుర్కొనేలా చేశాయి, సృష్టికర్త తన జీవితాన్ని ప్రశాంతంగా తిరిగి తీసుకునే అవకాశాన్ని ఎదుర్కొనేందుకు అతన్ని అనుమతించాయి. అంతేకాకుండా, సృష్టికర్త ముందు కల్మషం మరియు చింతా లేకుండా నిలబడేలా చేశాయి. ఈ రోజుల్లో ప్రజలు యోబు పొందిన ఆనందాన్ని పొందగలరా? మీరు అలా చేయడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజుల్లో ప్రజలు ఈ పరిస్థితులను కలిగి ఉన్నారు కాబట్టి, వారు యోబువలె ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నారు? మృత్యుభయం అనే బాధ నుండి వారు ఎందుకు తప్పించుకోలేకపోతున్నారు? మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు, కొంతమంది మూత్ర విసర్జన ఆపుకోలేరు; మరికొంత మంది వణుకుతారు, మూర్ఛపోతారు, పరలోకానికి మరియు మనిషికి వ్యతిరేకంగా విరుచుకుపడుతుంటారు; కొంతమందైతే విలపిస్తారు మరియు ఏడుస్తారు. ఇవి ఏ విధంగానూ మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సంభవించే సహజ ప్రతిచర్యలు కావు. ప్రజలు ప్రధానంగా ఇలాంటి ఇబ్బందికరమైన రీతుల్లో ఎందుకు ప్రవర్తిస్తారంటే, వారి హృదయాల లోతుల్లో, వారు మరణానికి భయపడతారు, ఎందుకంటే వారికి దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన ఏర్పాట్ల గురించిన స్పష్టమైన జ్ఞానం గాని మరియు కృతజ్ఞత భావం గాని లేదు, అంతేగాక నిజంగా వాటికి లోబడరు కూడా. ప్రజలు ఈ విధంగా ఎందుకు ప్రతిస్పందిస్తారంటే, వారు తమ స్వంత విధిని, వారి స్వంత జీవితాలను మరియు మరణాలను నియంత్రించడానికి, ప్రతిదీ స్వయంగా ఏర్పాటు చేసుకోవడం మరియు పాలించుకోవడం తప్ప మరేమీ కోరుకోరు. అందువల్ల, ప్రజలు మరణ భయం నుండి తప్పించుకోలేరనడంలో ఆశ్చర్యం లేదు.

6. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆయన వైపుకు తిరిగి రాగలరు.

ఒక వ్యక్తికి దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన ఏర్పాట్ల గురించి స్పష్టమైన జ్ఞానం మరియు అనుభవం లేనప్పుడు, విధి మరియు మరణం గురించిన జ్ఞానం తప్పనిసరిగా అసంబద్ధంగా ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న ప్రతి దానిని ప్రజలు స్పష్టంగా చూడలేరు, ప్రతీది దేవుని నియంత్రణ మరియు సార్వభౌమాధికారానికి లోబడి ఉంటుందని గ్రహించలేరు, అలాంటి సార్వభౌమాధికారాన్ని మనిషి విడనాడలేడని లేదా తప్పించుకోలేడని గుర్తించరు. ఈ కారణంగా, వారు మరణాన్ని ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు, వారి చివరి మాటలకు, చింతలకు మరియు విచారాలకు అంతం ఉండదు. వారు ఎన్నో ప్రతిబంధకాలు, ఎంతో అయిష్టత, ఎంతో గందరగోళంతో అణచివేయబడతారు. దీనివల్ల వారికి మృత్యు భయం కలుగుతుంది. ఈ లోకంలో జన్మించిన ఏ వ్యక్తికైనా, పుట్టుక అవసరం మరియు మరణం అనివార్యం; ఎవ్వరూ ఈ గమనాన్ని అధిగమించలేరు. ఎవరైనా బాధ లేకుండా ఈ లోకం విడిచి వెళ్లాలనుకొంటే, జీవితపు చివరి తరుణాన్ని ఎలాంటి అయిష్టత లేకుండా, లేదా చింత లేకుండా ఎదుర్కోవాలంటే, చింతించకుండా ఉండటమే ఏకైక మార్గం. మరియు చింతించకుండా విడిచి వెళ్ళడానికి ఏకైక మార్గం, సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకోవడం, ఆయన అధికారాన్ని తెలుసుకోవడం మరియు వాటికి లోబడడం. ఈ విధంగా మాత్రమే ఒక వ్యక్తి మానవ కలహాలకు, దుర్మార్గతకు, సాతాను బానిసత్వానికి దూరంగా ఉండగలరు మరియు ఈ విధంగా మాత్రమే సృష్టికర్తచే మార్గనిర్దేశం చేయబడిన మరియు ఆశీర్వదించబడిన యోబు వంటి జీవితాన్ని, స్వేచ్ఛ మరియు విముక్తి కలిగిన జీవితాన్ని, విలువ మరియు అర్థంతో కూడిన జీవితాన్ని, నిజాయితీ మరియు కపటంలేని జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా మాత్రమే, యోబు లాగా ఎవరైనా, సృష్టికర్త యొక్క పరీక్షలు మరియు కష్టాలకు, సృష్టికర్త యొక్క నిర్వహణలు మరియు ఏర్పాట్లకు లోబడగలుగుతారు. ఈ విధంగా మాత్రమే ఒక వ్యక్తి యోబువలె తన జీవితమంతా సృష్టికర్తను ఆరాధించగలడు మరియు ఆయన మెప్పును పొందగలడు మరియు ఆయన స్వరాన్ని విని, ఆయన ప్రత్యక్షతను చూడగలడు. ఈ విధంగా మాత్రమే ఒక వ్యక్తి యోబువలె ఎటువంటి బాధ, చింత, విచారం లేకుండా సంతోషంగా జీవించి, మరణించగలడు. ఈ విధంగా మాత్రమే ఒక వ్యక్తి యోబువలె వెలుగులో జీవించగలడు మరియు వెలుగులోని జీవితం యొక్క ప్రతి తరుణములోని ప్రతి ఒక్కరిని దాటుకుంటూ వెళ్ళగలడు, ఒక వ్యక్తి వెలుగులో తన ప్రయాణాన్ని సజావుగా పూర్తి చేయగలడు, సృష్టించబడిన జీవిగా సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అనుభవించడం, నేర్చుకోవడం మరియు తెలుసుకోవడం మరియు వెలుగులో మరణించడం మరియు సృష్టికర్త యొక్క పక్షాన ఎప్పటికీ నిలిచి, సృష్టించబడిన మానవునిగా, ఆయనచే ప్రశంసించబడడం కోసం ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు.

సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోకండి

పైన వివరించిన ఆరు తరుణాలు సృష్టికర్త నిర్దేశించిన కీలకమైన తరుణాలు, ప్రతీ వ్యక్తి తమ జీవితంలో తప్పనిసరిగా వీటిని దాటాలి. మానవ దృష్టికోణములోని ఈ తరుణాలన్నిటిలో ప్రతి ఒక్కటి వాస్తవమైనది, ఏదీ తప్పించుకోబడదు మరియు అన్నీ సృష్టికర్త యొక్క ముందస్తు నిర్ణయం మరియు సార్వభౌమాధికారంతో సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి, మానవునికి, ఈ తరుణాలలో ప్రతి ఒక్కటి ఒక ముఖ్యమైన పరిశీలన చేసుకోవలసిన అంశమైయున్నది మరియు ఇప్పుడు మీరందరూ (ప్రజలు) వాటిలో ప్రతిదానిని విజయవంతంగా ఎలా దాటాలి అనే ముఖ్యమైన ప్రశ్నను ఎదుర్కొంటున్నారు.

మానవ జీవితంలోని అనేక దశాబ్దాలు సుదీర్ఘమైనవి కావు, లేదా అతి తక్కువ కాలవ్యవధిని కలిగియున్నవి కావు. పుట్టుకకు మరియు వయసుకు వచ్చే కాలానికి మధ్యనున్న సుమారు ఇరవై సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి మరియు జీవితంలోని ఈ సమయంలో ఒక వ్యక్తిని ప్రాయానికి వచ్చిన మనిషిగా పరిగణించినప్పటికీ, ఈ వయస్సులో ఉన్న వ్యక్తులకు మానవ జీవితం గురించి మరియు మానవ విధి గురించి ఏమీ తెలియదు. వారు మరింత అనుభవాన్ని పొందే కొద్ది, వారు క్రమంగా మధ్యవయస్సులోకి అడుగుపెడతారు. ముప్పై మరియు నలభైలలో ఉండే వ్యక్తులు జీవితం మరియు విధిని గూర్చి కొత్త అనుభవాన్ని పొందుతారు, అయితే ఈ విషయాల గురించిన వారి ఆలోచనలు ఇప్పటికీ చాలా అస్పష్టంగా ఉంటాయి. దేవుడు సృష్టించిన మానవాళిని మరియు విశ్వాన్ని అర్థం చేసుకోవడం మరియు మానవ జీవితం అంటే ఏమిటో, మానవ విధి అంటే ఏమిటో కొంతమంది నలభై ఏళ్ల వయస్సు వచ్చే వరకు గ్రహించరు. కొందరు వ్యక్తులు, ఎంతో కాలంగా దేవుని అనుచరులుగా ఉంటూ, ఇప్పుడు మధ్య వయస్కులైనప్పటికీ, ఇప్పటికీ దేవుని సార్వభౌమాధికారం గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని మరియు నిర్వచనాన్ని పొందలేరు, అంతేగాక నిజమైన విధేయత ఉండదు. కొంతమంది వ్యక్తులు ఆశీర్వాదాలు పొందడం తప్ప మరేమీ పట్టించుకోరు మరియు వారు చాలా సంవత్సరాలు జీవించినప్పటికీ, మానవ విధిపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం గురించి వారికి కనీసం తెలియదు, లేదా ఆ విషయమును గూర్చి అర్థం కాదు మరియు దేవుని కార్య నిర్వహణలకు మరియు ఏర్పాట్లకు లోబడే ఆచరణాత్మక అభ్యాసములోకి చిన్న అడుగు కూడా వేయలేదు. అలాంటి వ్యక్తులు పూర్తిగా మూర్ఖులు మరియు తమ జీవితాలను వ్యర్థంగా జీవించారు.

ప్రజల జీవిత అనుభవం మరియు మానవ విధిని గూర్చిన జ్ఞానం జ్ఞానాన్ని బట్టి మానవ జీవిత కాల వ్యవధులను విభజించినట్లయితే, వాటిని దాదాపు మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ యవ్వనం, ఇది పుట్టుకకు మరియు మధ్య వయస్సుకు మధ్యనున్న సంవత్సరాల వయస్సు వరకు, లేదా పుట్టినప్పటి నుండి ముప్పై సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది. రెండవ దశ పరిపక్వదశ, మధ్య వయస్సు నుండి వృద్ధాప్యం వరకు లేదా ముప్పై నుండి అరవై వరకు ఉంటుంది. మూడవ దశ అనేది ఒక వ్యక్తి యొక్క పరిణతి చెందిన వ్యవధి, ఇది వృద్ధాప్యంతో ప్రారంభమవుతుంది, అంటే అరవైలో మొదలై, ఈ లోకాన్ని విడిచివెళ్లే వరకు ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, పుట్టినప్పటి నుండి మధ్య వయస్సు వరకు చాలా మందికి విధి మరియు జీవితం గురించిన జ్ఞానం ఇతరుల ఆలోచనలను అనుకరించడంవరకే పరిమితమై ఉంటుంది మరియు దాదాపుగా నిజమైన, ఆచరణాత్మక విషయం ఉండదు. ఈ సమయంలో, జీవితంపట్ల ఒక వ్యక్తి యొక్క దృక్పథం మరియు ప్రపంచంలో ఒక వ్యక్తి మార్గం ఎలా ఉంటుంది అనేది చాలా మిడిమిడిగా మరియు అనుభవరహితంగా ఉంటుంది. ఇది ఒకరి బాల్య కాలం. జీవితంలోని అన్ని సంతోషాలు మరియు దుఃఖాలను రుచి చూసిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి విధి గురించి నిజమైన అవగాహనను పొందుతాడు మరియు ఒక వ్యక్తి తనకు తెలియకుండానే హృదయ లోతుల్లో క్రమంగా విధిని మార్చలేమని అర్థం చేసుకుంటాడు మరియు మానవ విధిపై సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారం నిజంగా ఉందని నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. ఇది ఒక వ్యక్తి యొక్క పరిపక్వత కాలం. విధికి వ్యతిరేకంగా పోరాడటం మానేసినప్పుడు మరియు వారు ఇకపై కలహాలకు దిగడానికి ఇష్టపడకుండా, దానికి బదులుగా, జీవితంలో తమ గురించి తెలుసుకుని, పరలోక చిత్తానికి లోబడి, జీవితంలో తమ విజయాలు మరియు లోపాలను సంగ్రహించి, మరియు తమ జీవితంపై సృష్టికర్త యొక్క తీర్పు కోసం వేచి ఉన్నప్పుడు ఒక వ్యక్తి వారి పరిపక్వ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఈ మూడు కాల వ్యవధులలో ప్రజలు పొందే విభిన్న అనుభవాలు మరియు సముపార్జనలను పరిగణనలోకి తీసుకుంటే, సాధారణ పరిస్థితులలో, ఒక వ్యక్తి సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకునే అవకాశం, సమయం అంత ఎక్కువగా లేదు. ఒక వ్యక్తి అరవై సంవత్సరాలు జీవించినట్లయితే, దేవుని సార్వభౌమాధికారాన్ని తెలుసుకోవటానికి ఒక వ్యక్తికి కేవలం ముప్పై సంవత్సరాలు గాని, లేదా అంతకంటే కాస్త ఎక్కువ సంవత్సరాలు మాత్రమే ఉంటాయి; ఒక వ్యక్తికి ఎక్కువ కాలం కావాలంటే, అది ఒక వ్యక్తి చాలా కాలం పాటు కొనసాగితే, ఒక శతాబ్దం పాటు జీవించగలిగితే మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నేను చెబుతున్నాను, మానవ ఉనికి యొక్క సాధారణ నియమాల ప్రకారం, సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని తెలుసుకోవడం అనే అంశాన్ని మొదటిసారి ఎదుర్కొన్నప్పటి నుండి, ఆ సార్వభౌమాధికారాన్ని గూర్చిన వాస్తవాన్ని గుర్తించగలిగే వరకు మరియు అప్పటి నుండి ఒక వ్యక్తి దానికి లోబడగలిగేంత వరకు, ఒక వ్యక్తి నిజానికి సంవత్సరాలను లెక్కించినట్లయితే, ముప్పై లేదా నలభై సంవత్సరాలకు మించి ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉండదు. మరియు తరచుగా, ప్రజలు తమ కోరికలు మరియు ఆశీర్వాదాలను పొందాలనే వారి ఆశయాలచే ప్రభావితమవుతుంటారు, తద్వారా మానవ జీవిత పరమార్ధం ఎక్కడ ఉందో వారు గుర్తించలేరు మరియు సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించలేరు. అలాంటి వ్యక్తులు మానవ జీవితాన్ని మరియు సృష్టికర్త యొక్క సార్వభౌమత్వాన్ని అనుభవించడానికి మానవ ప్రపంచంలోకి ప్రవేశించే ఈ అమూల్యమైన అవకాశాన్ని విలువైనదిగా భావించరు మరియు సృష్టికర్త యొక్క వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని పొందడం అనేది సృష్టించబడిన జీవికి ఎంత విలువైనదో వారు గ్రహించలేరు. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని కార్యం త్వరగా ముగియాలని కోరుకునే వ్యక్తులు, దేవుడు మనిషి యొక్క ముగింపును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటారు, తద్వారా వారు వెంటనే ఆయనను ప్రత్యక్షముగా చూసి వీలైనంత త్వరగా ఆశీర్వాదాలు పొందవచ్చు అనుకుంటారు. వారు అధ్వాన్నంగా అవిధేయతకు పాల్పడతారు మరియు వారు అత్యంత మూర్ఖులు. ఇదిలా ఉండగా, మనుష్యులలో తెలివైనవారు, అత్యంత మానసిక దృఢత్వం ఉన్నవారు, తమ పరిమిత సమయంలో, సృష్టికర్త సార్వభౌమత్వాన్ని తెలుసుకునే ఈ అపూర్వ అవకాశాన్ని అర్ధం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ రెండు వేర్వేరు కోరికలు అనేవి రెండు విభిన్న దృష్టికోణాలను మరియు అన్వేషణలను బహిర్గతం చేస్తాయి: ఆశీర్వాదాలు కోరుకునే వారు స్వార్థపరులు మరియు నీచమైనవారు మరియు దేవుని చిత్తంపట్ల శ్రద్ధ చూపరు, దేవుని సార్వభౌమాధికారాన్ని తెలుసుకోవాలని ఎన్నడూ కోరుకోరు, దానికి లోబడాలని ఎన్నడూ కోరుకోరు, కానీ తమకు నచ్చినట్లు జీవించాలని కోరుకుంటారు. వారు అనాలోచితంగా అధోగతి పాలవుతుంటారు మరియు ఈ రకమైన ప్రజలు నాశనం చేయబడతారు. దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకునేవారు తమ కోరికలను పక్కన పెట్టగలుగుతారు, దేవుని సార్వభౌమాధికారానికి మరియు దేవుని ఏర్పాటుకు లోబడడానికి ఇష్టపడతారు మరియు వారు దేవుని అధికారానికి విధేయత చూపే వారుగాను మరియు దేవుని కోరికను నెరవేర్చే వ్యక్తులుగాను ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులు వెలుగులో మరియు దేవుని ఆశీర్వాదాలలో జీవిస్తారు మరియు వారు తప్పకుండా దేవునిచే ప్రశంసించబడతారు. ఏది ఏమైనప్పటికీ, మానవ ఎంపిక నిరుపయోగమైనది మరియు దేవుని పనికి ఎంత సమయం పడుతుందో మానవులు చెప్పలేరు. ప్రజలు దేవుని నిర్వహణ క్రింద తమను తాము ఉంచుకోవడం మరియు ఆయన సార్వభౌమాధికారానికి లోబడి ఉండటం మంచిది. మీరు ఆయన నిర్వహణ క్రింద మిమ్మల్ని మీరు ఉంచుకోకపోతే, మీరు ఏమి చేయగలరు? దానివల్ల దేవుడికి ఏమైనా నష్టం జరుగుతుందా? మిమ్మల్ని మీరు ఆయన నిర్వహణ క్రింద ఉంచుకోకుండా, దానికి బదులుగా మీరే బాధ్యత వహించాలని ప్రయత్నించినట్లయితే, మీరు ఒక మూర్ఖమైన ఎంపిక చేసుకుంటున్నారు మరియు చివరికి మీరు మాత్రమే నష్టపోతారు. ప్రజలు వీలైనంత త్వరగా దేవునికి సహకరిస్తే, ఆయన నిర్వహణాలను అంగీకరించడానికి, ఆయన అధికారాన్ని తెలుసుకునేందుకు మరియు ఆయన తమ కోసం చేసినదంతా అర్థం చేసుకోవడానికి తొందరపడినప్పుడు మాత్రమే, వారికి ఆశ ఉంటుంది. ఈ విధంగా మాత్రమే వారి జీవితాలు వ్యర్థం కావు మరియు వారు రక్షణ పొందుతారు.

మానవ విధిపై దేవుడు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు

నేను చెప్పినదంతా విన్న తర్వాత, విధి గురించి మీ ఆలోచన మారిందా? మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? స్పష్టంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన జీవిత గమనంలో ఎంత కష్టపడినా, ఎన్ని వక్ర మార్గాల్లో నడిచినా, దేవుని అధికారం కింద, ప్రతి వ్యక్తి క్రియాశీలంగా లేదా నిష్క్రియంగా ఆయన సార్వభౌమాధికారమును మరియు ఆయన ఏర్పాట్లను అంగీకరిస్తాడు మరియు తుదకు ఒక వ్యక్తి సృష్టికర్త తమ కోసం నిర్ధేశించిన విధి యొక్క కక్ష్యలోకి తిరిగి వస్తాడు. ఇది సృష్టికర్త యొక్క అధికారం మరియు ఆయన అధికారం విశ్వాన్ని నియంత్రించే మరియు పరిపాలించే విధానాన్ని అధిగమించలేదు. ఈ అశక్తతలో, ఈ విధమైన నియంత్రణ మరియు పరిపాలన, అన్ని జీవరాశులకు నిర్ధేశించిన నియమాలకు బాధ్యత వహిస్తుంది, ఎటువంటి జోక్యం లేకుండా మానవులు మళ్లీ మళ్లీ పునరుద్ధరణ పొందేలా చేస్తుంది, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం, ప్రపంచాన్ని క్రమం తప్పకుండా తిప్పుతూ మరియు ముందుకు సాగేలా చేస్తుంది. మీరు ఈ వాస్తవాలన్నింటినీ చూశారు మరియు అర్థం చేసుకున్నారు, అది పైపైనా లేదా లోతుగానైనా మీరు ఎంత లోతుగా అర్ధం చేసుకొన్నారు అనేది సత్యాన్ని గూర్చిన మీకున్న అనుభవం మరియు మీకున్న జ్ఞానం మీదను మరియు దేవుని గురించి మీకున్న జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. నీకు సత్యం యొక్క వాస్తవికత ఎంత బాగా తెలుసు, దేవుని వాక్కులను మీరు ఎంతగా అనుభవించారు, దేవుని ఉనికి మరియు స్వభాములను గూర్చి మీకు ఎంత బాగా తెలుసు అనేవన్నీ దేవుని సార్వభౌమాధికారం మరియు ఏర్పాట్ల గురించి నీకున్న అవగాహన యొక్క లోతును సూచిస్తాయి. దేవుని సార్వభౌమాధికారం మరియు ఆయన ఏర్పాట్ల యొక్క ఉనికి అనేది మానవులు వాటికి లోబడతారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుందా? దేవుడు కలిగి ఉన్న ఈ అధికారం, మానవాళి దానికి లోబడుతుందా అనేదానిని బట్టి నిర్ణయించబడుతుందా? పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని అధికారం ఉనికిలో ఉంటుంది. అన్ని పరిస్థితులలో, దేవుడు తన ఆలోచనలు మరియు ఆయన ఆశలకు అనుగుణంగా ప్రతి మానవ విధిని మరియు అన్ని విషయాలను నిర్దేశిస్తాడు మరియు ఏర్పాటు చేస్తాడు. ఇది మానవ మార్పు ఫలితంగా మారదు; ఇది మనిషి యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉండదు, ఎటువంటి సమయం, స్థలము మరియు భౌగోళిక మార్పులను బట్టి మార్చబడదు, ఎందుకంటే దేవుని అధికారము అనేది ఆయన గుణలక్షణమైయున్నది. మనిషి దేవుని సార్వభౌమత్వాన్ని తెలుసుకోగలడా మరియు అంగీకరించగలడా, మరియు మానవుడు దానికి లోబడగలడా, ఈ పరిగణనలు ఏవీ మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారాన్ని గూర్చిన వాస్తవాన్ని స్వల్పంగానైనా మార్చలేవు. అంటే, దేవుని సార్వభౌమాధికారం పట్ల మనిషి ఎలాంటి వైఖరి కలిగి ఉన్నా, మానవ విధిపై మరియు అన్ని విషయాలపై దేవుడు తన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని మార్చలేదు. నువ్వు ఆయన దేవుని సార్వభౌమాధికారానికి లోబడనప్పటికీ, ఆయన నీ విధిని ఆదేశిస్తాడు; నువ్వు ఆయన సార్వభౌమత్వాన్ని తెలుసుకోలేకపోయినా, ఆయన అధికారం ఇప్పటికీ ఉంది. దేవుని అధికారం మరియు మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారం యొక్క వాస్తవం అనేది మానవ చిత్తం మీద ఆధారపడి లేదు మరియు అది మనిషి యొక్క ప్రాధాన్యతలు మరియు ఎంపికలకు అనుగుణంగా మారవు. దేవుని అధికారం ప్రతిచోటా, ప్రతి గంటలో, ప్రతి క్షణంలో ఉంటుంది. ఆకాశం మరియు భూమి గతించినా, ఆయన అధికారం ఎప్పటికీ గతించిపోదు, ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయన అద్వితీయమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు ఆయన అధికారం ఎప్పటికీ వ్యక్తులు, సంఘటనలు లేదా విషయాలు, స్థలం లేదా భౌగోళికంగా పరిమితం చేయబడియుండదు. అన్ని సమయాల్లో, దేవుడు తన అధికారాన్ని కలిగి ఉంటాడు, తన శక్తిని చూపుతాడు, తన నిర్వహణ కార్యమును ఎప్పటిలాగే కొనసాగిస్తాడు; అన్ని సమయాలలో, ఆయన సమస్తాన్ని పరిపాలిస్తాడు, ఆయన ఎప్పటిలాగే అన్నింటికీ కావలసిన వాటిని సమకూరుస్తాడు, అన్నిటినీ నిర్దేశిస్తాడు. దీనిని ఎవరూ మార్చలేరు. ఇది వాస్తవం; ఇది అనాదిగా మారని సత్యం!

దేవుని అధికారానికి లోబడాలని ఆశించే వ్యక్తికి ఉండాల్సిన సరైన వైఖరి మరియు అలవాటు.

దేవుని అధికారాన్ని మరియు మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారాన్ని గూర్చిన వాస్తవాన్ని మనిషి ఇప్పుడు ఏ వైఖరితో తెలుసుకోవాలి మరియు పరిగణించాలి? ఇది ప్రతి వ్యక్తి ముందు ఉన్న నిజమైన సమస్య. నిజ జీవిత సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, నువ్వు దేవుని అధికారాన్ని మరియు ఆయన సార్వభౌమత్వాన్ని ఎలా తెలుసుకోవాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు ఈ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మరియు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా నిర్వహించాలో మరియు ఎలా అనుభవించాలో తెలియనప్పుడు, లోబడాలనే నీ ఉద్దేశం, లోబడాలనే నీ కోరిక మరియు దేవుని సార్వభౌమాధికారం మరియు ఏర్పాట్లకు మీరు చూపే విధేయతను గూర్చిన వాస్తవికతను ప్రదర్శించడానికి నువ్వు ఎలాంటి వైఖరిని అవలంబించాలి? మొదట నువ్వు వేచి ఉండడం నేర్చుకోవాలి; తర్వాత నువ్వు వెతకడం నేర్చుకోవాలి; ఆ తర్వాత నువ్వు లోబడడం నేర్చుకోవాలి. “వేచి ఉండడం” అంటే దేవుని సమయం కోసం ఎదురుచూడడం, ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల కోసం ఎదురుచూడడం, ఆయన చిత్తం నీకు క్రమంగా బహిర్గతమయ్యే వరకు వేచి ఉండడం. “వెతకడం” అంటే ప్రజలు, సంఘటనలు మరియు ఆయన నిర్ధేశిన విషయాల ద్వారా మీ పట్ల దేవునికున్న ఆలోచనాత్మక ఉద్దేశాలను గమనించడం మరియు అర్థం చేసుకోవడం, వాటి ద్వారా సత్యాన్ని అర్థం చేసుకోవడం, మానవులు ఏమి సాధించాలి మరియు వారు ఎలాంటి మార్గాలను అనుసరించాలో అర్థం చేసుకోవడం, మానవులలో దేవుడు ఎలాంటి ఫలితాలను సాధించాలనుకొంటున్నాడో మరియు వారిలో ఎలాంటి విజయాలు సాధించాలనుకొంటున్నాడో అర్థం చేసుకోవడం. “లోబడడం” అంటే దేవుడు నిర్దేశించిన వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాలను అంగీకరించడం, ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించడం మరియు దాని ద్వారా సృష్టికర్త మనిషి యొక్క విధిని ఎలా నిర్దేశిస్తాడో, ఆయన తన జీవితంతో మనిషికి ఎలా సమకూర్చుతాడో, ఆయన మనిషిలో సత్య పూర్వకంగా ఎలా పని చేస్తాడో తెలుసుకోవడం. దేవుని ఏర్పాట్లు మరియు సార్వభౌమాధికారం క్రింద ఉన్న సమస్త విషయాలు సహజ నియమాలకు లోబడి ఉంటాయి మరియు నీ కోసం దేవుడు ప్రతీది ఏర్పాటు చేయాలని మరియు నిర్దేశించాలని నువ్వు సంకల్పిస్తే, నువ్వు వేచి ఉండటం నేర్చుకోవాలి, మీరు వెతకడం నేర్చుకోవాలి మరియు మీరు లోబడడం నేర్చుకోవాలి. దేవుని అధికారానికి లోబడాలనుకునే ప్రతి వ్యక్తి అవలంబించాల్సిన వైఖరి, దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఏర్పాట్లను అంగీకరించాలనుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఇదే. అటువంటి వైఖరిని కలిగి ఉండటానికి, అటువంటి లక్షణాన్ని కలిగి ఉండటానికి, నువ్వు మరింత కృషి చేయాలి. మీరు నిజమైన వాస్తవికతలోకి ప్రవేశించగల ఏకైక మార్గం ఇది.

దేవుణ్ణి నీవు ప్రత్యేకమైన యజమానిగా అంగీకరించడం అనేది రక్షణ పొందడంలో మొదటి మెట్టుయైయున్నది.

దేవుని అధికారానికి సంబంధించిన సత్యాలను ప్రతి వ్యక్తి తీవ్రంగా పరిగణించాలి, వారు తమ హృదయపూర్వకంగా అనుభవించి అర్థం చేసుకోవాలి; ఎందుకంటే ఈ సత్యాలు ప్రతి వ్యక్తి జీవితంపై; ప్రతి వ్యక్తి యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్తుపై; ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా దాటవలసిన కీలకమైన తరుణాలపై; దేవుని సార్వభౌమాధికారం గురించి మానవుని జ్ఞానం మరియు దేవుని అధికారాన్ని ఎదుర్కోవాల్సిన వైఖరిపై; మరియు సహజంగానే, ప్రతి వ్యక్తి యొక్క తుది గమ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, వాటిని తెలుసుకోవటానికి మరియు అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. నీవు దేవుని అధికారాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, నీవు ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు, నీవు క్రమంగా దేవుని అధికార ఉనికిని గూర్చిన సత్యాన్ని గ్రహిస్తారు మరియు దానిని అర్థం చేసుకుంటారు. కానీ నీవు దేవుని అధికారాన్ని ఎన్నటికీ గుర్తించకపోతే మరియు ఆయన సార్వభౌమత్వాన్ని ఎన్నటికీ అంగీకరించకపోతే, నీవు ఎన్ని సంవత్సరాలు జీవించినా, నీవు దేవుని సార్వభౌమాధికారం గురించి కనీసపు జ్ఞానాన్ని కూడా పొందలేరు. నీవు దేవుని అధికారాన్ని నిజంగా తెలుసుకోకపోయినా మరియు అర్థం చేసుకోకపోయినా, అప్పుడు నీవు మార్గం చివరకు చేరుకున్నప్పుడు, నీవు దశాబ్దాలుగా దేవుణ్ణి విశ్వసించినప్పటికీ, నీవు జీవితంలో చూపించడానికి ఏమీ ఉండదు మరియు నీవు సహజంగానే మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారం గురించి కనీస జ్ఞానం కలిగి ఉండరు. ఇది చాలా బాధాకరమైన విషయం కాదా? కాబట్టి, నీవు జీవితంలో ఎంత దూరం వెళ్లినా, ఇప్పుడు నీకు ఎంత వయస్సు వచ్చిందన్నదానితో సంబంధం లేకుండా, నువ్వు ప్రయాణించవలసిన ప్రయాణం ఎంత మిగిలి ఉందన్న దానితో సంబంధం లేకుండా, నువ్వు మొట్ట మొదటిగా దేవుని అధికారాన్ని గుర్తించాలి మరియు దానిని తీవ్రంగా పరిగణించాలి మరియు దేవుడు నీకు ప్రత్యేకమైన యజమాని అనే వాస్తవాన్ని అంగీకరించాలి. మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారానికి సంబంధించి ఈ సత్యాల గురించి స్పష్టమైన, ఖచ్చితమైన జ్ఞానం మరియు అవగాహన పొందడం అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరి నేర్చుకోవాల్సిన పాఠం; మానవ జీవితాన్ని తెలుసుకోవటానికి మరియు సత్యాన్ని గ్రహించడానికి ఇది కీలకం. దేవుణ్ణి తెలుసుకొనే అలాంటి జీవితం, దాని ప్రాథమిక అధ్యయనం, ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఎదుర్కోవలసి ఉంటుంది, దానిని ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఎవరైనా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సత్వర మార్గాలను తీసుకోవాలనుకుంటే, అది అసాధ్యమని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను! మీరు దేవుని సార్వభౌమాధికారం నుండి తప్పించుకోవాలనుకుంటే, అది మరీ అసాధ్యం! దేవుడు మానవుని ఏకైక ప్రభువు, మానవ విధికి దేవుడు మాత్రమే యజమాని, కాబట్టి మనిషి తన విధిని నిర్దేశించడం అసాధ్యం, దాని నుండి బయటపడటం అతనికి అసాధ్యం. ఒక వ్యక్తికి ఎంతటి సామర్థ్యాలు ఉన్నా, ఇతరుల విధిని ప్రభావితం చేయలేరు, అంతేగాక నిర్వహించడం, ఏర్పాటు చేయడం, నియంత్రించడం లేదా మార్చడం చేయలేరు. ప్రత్యేకమైన దేవుడు మాత్రమే మానవుని కోసం సమస్తాన్ని నిర్దేశిస్తాడు, ఎందుకంటే ఆయన మాత్రమే మానవ విధిపై సార్వభౌమాధికారంగల విశిష్ట అధికారాన్ని కలిగి ఉన్నాడు, కాబట్టి సృష్టికర్త మాత్రమే మనిషి యొక్క ఏకైక యజమాని. దేవుని అధికారం కేవలం సృష్టించబడిన మానవాళిపై మాత్రమే కాకుండా, సృష్టించబడని వాటిపై, నక్షత్రాలపై, విశ్వంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. ఇది కాదనలేని వాస్తవం, ఇది నిజంగా ఉనికిలో ఉంది, ఏ వ్యక్తి గాని లేదా ఏ విషయం గాని దీనిని మార్చలేదు. మీలో ఎవరైనా ఇప్పటికే మీ కళ్ళ ఎదుట నిలిచి ఉన్న విషయాలపై అసంతృప్తిగా ఉన్నట్లయితే, మీకు కొంత ప్రత్యేక నైపుణ్యం లేదా సామర్థ్యం ఉందని నమ్ముతూ, ఏదో ఒక అదృష్టంతో మీరు మీ ప్రస్తుత పరిస్థితులను మార్చవచ్చు లేదా వాటిని తప్పించుకోవచ్చు అని ఇప్పటికీ ఆలోచిస్తున్నట్లయితే; మీరు మానవ ప్రయత్నం ద్వారా మీ స్వంత విధిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తేమరియు తద్వారా మీ తోటివారి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకొని, కీర్తి మరియు అదృష్టాన్ని సంపాదించుకొంటే; అప్పుడు నేను మీకు చెప్తున్నాను, నువ్వు కష్టాలు కొని తెచ్చుకొంటున్నావు, నీవు ఇబ్బందుల్లో పడతావు, నీ గుంతను నీవే తవ్వుకుంటున్నావు! ఒక రోజున, కాస్త వెనుకా ముందైనా, నువ్వు తప్పు ఎంపిక చేసుకున్నావని మరియు నీ ప్రయత్నాలు వృధా అయ్యాయని నీవు తెలుసుకుంటావు. నీ ఆశయం, విధికి వ్యతిరేకంగా పోరాడాలనే నీ కోరిక మరియు నీ స్వీయ దుర్మార్గపు ప్రవర్తన వెనక్కి తిరిగి రాలేని మార్గంలోకి నిన్ను తీసుకువెళతాయి మరియు దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం నీవు పర్యవసానాల తీవ్రతను చూడనప్పటికీ, దేవుడు మానవ విధికి యజమాని అనే సత్యాన్ని మరింత లోతుగా నీవు అనుభవిస్తూ మరియు గ్రహిస్తూ ఉండే కొద్ది, నేను ఈ రోజు మాట్లాడే దాని గురించి మరియు దాని నిజమైన అంతరార్ధాలను నీవు క్రమంగా తెలుసుకుంటావు. నీవు నిజంగా హృదయం మరియు ఆత్మను కలిగి ఉన్నావా మరియు నీవు సత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది నీవు దేవుని సార్వభౌమాధికారంపట్ల మరియు సత్యంపట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సహజంగానే, నీవు దేవుని అధికారాన్ని నిజంగా తెలుసుకోగలవా మరియు అర్థం చేసుకోగలవా అనేది ఇది నిర్ణయిస్తుంది. నీవు నీ జీవితంలో ఎన్నడూ దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఆయన ఏర్పాట్లను గ్రహించి ఉండకపోతే, అంతేగాక దేవుని అధికారాన్ని గుర్తించి మరియు అంగీకరించకపోయిట్లయితే, నీవు తీసుకున్న మార్గం మరియు నీవు చేసుకున్న ఎంపిక కారణంగా, నీవు పూర్తిగా విలువలేని వ్యక్తివవుతావు మరియు నిస్సందేహంగా దేవుడు మిమ్మల్ని అసహ్యించుకుంటాడు మరియు తిరస్కరిస్తాడు. కానీ దేవుని కార్యములో ఉన్నవారు, ఆయన పరీక్షను అంగీకరిస్తారు, ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తారు, ఆయన అధికారానికి లోబడతారు మరియు క్రమంగా ఆయన మాటల యొక్క నిజమైన అనుభవాన్ని పొందడం ద్వారా దేవుని అధికారాన్ని గురించిన నిజమైన జ్ఞానాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని గురించిన నిజమైన అవగాహనను పొందుకుంటారు; వారు నిజంగా సృష్టికర్తకు లోబడి ఉంటారు. అలాంటి వ్యక్తులు మాత్రమే నిజంగా రక్షింపబడతారు. ఎందుకంటే వారు దేవుని సార్వభౌమత్వాన్ని తెలుసుకున్నారు, ఎందుకంటే వారు దానిని అంగీకరించారు, మానవ విధిపై దేవుని సార్వభౌమాధికారాన్ని గూర్చిన వాస్తవాన్ని వారు గ్రహించారు, వారు దానికి లోబడ్డారు, ఇది వాస్తవమైనది మరియు ఖచ్చితమైనది. వారు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు, వారు యోబు వలె, మరణాన్ని గూర్చి బాధపడరు మరియు ఎటువంటి వ్యక్తిగత ఎంపిక లేకుండా, ఎటువంటి వ్యక్తిగత కోరిక లేకుండా అన్ని విషయాలలో దేవుని నిర్వహణలు మరియు ఏర్పాట్లకు లోబడి ఉంటారు. అటువంటి వ్యక్తి మాత్రమే నిజమైన, సృష్టించబడిన మానవునిగా సృష్టికర్త వైపుకు తిరిగి రాగలడు.

డిసెంబర్ 17, 2013

మునుపటి:  దేవుడు తనకు తానే అద్వితీయుడు I

తరువాత:  దేవుడు తనకు తానే అద్వితీయుడు IV

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger