దేవుడు తనకు తానే అద్వితీయుడు IV
దేవుని పరిశుద్దత (I)
మన ఆఖరి కూడిక సమయంలో మనము దేవుని అధికారం గూర్చి మరి కొంచెం పంచుకున్నాము. ఇప్పటికైతే, మనం దేవుని నీతిని గూర్చి మాట్లాడుకోవడం లేదు. ఈ రోజు మనము పూర్తిగా కొత్త అంశమైన దేవుని పరిశుద్దత గురించి మాట్లాడుకోబోతున్నాము. దేవుని పరిశుద్దత అనేది దేవుని ప్రత్యేకమైన స్వభావపు వేరొక కోణం, కనుక ఈ కోణాన్ని గూర్చి మనం చర్చించడం ఎంతో ముఖ్యం. ఇదివరకు నేను దేవుని గుణగణాల్లోని మరో రెండు దృష్టికోణాలైన, దేవుని నీతి స్వభావము మరియు దేవుని అధికారం గూర్చి పంచుకున్నాను; అయితే ఈ దృష్టికోణాలు, మరియు నేడు నేను పంచుకోబోతున్న దృష్టికోణము, ఇవన్నీ ప్రత్యేకమైనవేనా? (అవును.) దేవుని పరిశుద్దత కూడా ప్రత్యేకమైనదే, కాబట్టి ఈ ప్రత్యేకత పునాదిని మరియు మూలాన్ని రూపించేది ఏమిటనేదే నేడు మన కూడికలో ముఖ్యాంశమై ఉన్నది. నేడు మనం ఈ సహవాసంలో దేవుని ప్రత్యేకమైన స్వభావం-ఆయన పరిశుద్దతను గూర్చి చర్చించబోతున్నాం మీలో కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయేమో, “దేవుని పరిశుద్దతను గూర్చి మనం ఎందుకు చర్చించాలి?” అని అడుగుతున్నారు. ఆందోళన పడొద్దు, దీని గురించి నేను మీతో నెమ్మదిగా మాట్లాడతాను. ఒకసారి నేను చెప్పింది మీరు వినిన తరువాత, నేను ఈ విషయాన్ని గూర్చి చర్చించడం ఎందుకంత అవసరమో మీరు తెలుసుకుంటారు.
మొదటిగా, “పరిశుద్దత” అనే మాటను స్పష్టీకరించుకుందాం. మీ దృష్టికోణం మరియు మీరు కలిగివున్న జ్ఞానమంతటి ఆధారంగా, “పరిశుద్దత” కలిగి ఉండడమంటే, మీరు ఏ అర్దాన్ని గ్రహించారు? (“పరిశుద్దత” అంటే నిష్కలంకమైనది, పూర్తిగా మానవ దుర్నీతి లేదా పొరపాట్లు లేనిది. పరిశుద్దత అనేది ఆలోచన, సంభాషణ లేదా క్రియ ఏదైనా సరే అన్ని విషయాలలో అనుకూలంగా ప్రకాశిస్తుంది.) చాలా మంచిది. (“పరిశుద్దత” దైవికమైనది, నిష్కల్మషమైనది, మనిషి పాడు చేయలేనిది. ఇది ప్రత్యేకమైనది, ఇది కేవలం దేవునికి మాత్రమే చెందినది మరియు ఇది ఆయన సంకేతం.) ఇది మీ స్పష్టీకరణ. ప్రతి మనిషి హృదయంలో, ఈ “పరిశుద్దత” అనే మాటకి ఒక పరిమితి, అర్ధం మరియు తాత్పర్యం ఉంటాయి. కనీసం, మీరు “పరిశుద్దత” అనే మాటను చూసినప్పుడు, మీ హృదయాలు ఊరక ఉండవు. మీరు ఈ మాటకి ఒక నిర్నీతమైన పరిమితి కలిగిన అర్దాన్ని కలిగి ఉన్నారు మరియు కొంతమంది మనుష్యుల లోకోక్తులు దేవుని స్వభావపు తత్వాన్ని నిర్వచించే పలుకులకు కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇది చాలా మంచిది. ఎంతో మంది జనులు “పరిశుద్దత” అనే మాట సానుకూలమైనదని విశ్వసిస్తారు మరియు ఇది ముమ్మాటికీ సత్యం. అయితే ఈనాడు, దేవుని పరిశుద్దతను గూర్చి మనం చర్చిస్తున్నప్పుడు, నేను కేవలం నిర్వచనాలు లేదా వ్యాఖ్యానముల గూర్చి మాత్రమే మాట్లాడను. బదులుగా, దేనికి నేను దేవుడు పరిశుద్దుడని చెప్తున్నానో మరియు దేవుని గుణాతిశయాన్ని వర్ణించడానికి నేను “పరిశుద్దత” అనే మాటను ఎందుకు వాడానో నీకు చూపించడానికి సత్యాలను సాక్ష్యంగా అందజేస్తాను. మన చర్చ ముగిసే సరికి, దేవుని లక్షణాన్ని తెలియపరచడానికి మరియు దేవునికి సూచనగా “పరిశుద్దత” అనే మాటను వాడడం పూర్తిగా భావ్యమని మరియు ఎంతో సరైనదని నీవు భావిస్తావు. కనీసం, ఇప్పుడున్న మానవ భాషకు సంబధించిన సదర్భంలో, దేవుణ్ణి సూచించడానికి ఈ మాటను వాడటమనేది చక్కగా సరిపోతుంది—ఇది మానవ భాషలోని పదాలన్నిటిలో దేవుణ్ణి సూచించడానికి సంపూర్ణంగా తగిన ఏకైక మార్గమై ఉన్నది. దేవుణ్ణి సూచించడానికి ఈ మాటను వాడినప్పుడు, ఇదొక నిష్ప్రయోజనమైన మాట కాదు, మరియు నిరాధారమైన ప్రశంసో లేక వట్టి పొగడ్తో కాదు. దేవుని గుణాతిశయానికి సంబంధించిన ఈ అంశపు సత్యాన్ని ప్రతి వ్యక్తి గుర్తించేలా చేయడమే మన కూడిక ఉద్దేశ్యమై ఉన్నది. దేవుడు మనిషి వివేకానికి భయపడడు, కానీ అతని తప్పుడు భావనకు భయపడతాడు. ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని మరియు తాను ఏమి కలిగి ఉన్నది మరియు అది ఏమిటన్నది తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తాడు. కనుక మనం దేవుని గుణాతిశయపు దృక్పథాన్ని ఉదాహరించిన ప్రతిసారీ, దేవుని గుణాతిశయపు దృక్పథము నిజంగానే ఉన్నదని ప్రజలు తెలుసుకొనేందుకు వీలు కల్పించడానికి మనం చాలా వాస్తవాలను ఆరా తీయవచ్చు.
ఇప్పుడు మన వద్ద “పరిశుద్దత” అనే మాటకి నిర్వచనము ఉన్నందున మనం కొన్ని దృష్టాంతాలను గురించి చర్చించుకుందాము. ప్రజలు వారి భావనల్లో, ఎన్నో సంగతులను మరియు వ్యక్తులను “పరిశుద్దులు” అని అనుకుంటారు. ఉదాహరణకు, బ్రహ్మచారులు మరియు కన్యలు మానవ నిఘంటువులలో పరిశుద్దులుగా చెప్పబడ్డారు. అయితే, వారు నిజంగా పరిశుద్దులేనా? ఈ దినం మనం చర్చించబోయే “పరిశుద్దత” మరియు మనము పిలుచుకుంటున్న “పరిశుద్దత” రెండూ ఒకటేనా? మనుషుల్లో యదార్ధత గలవారు, శుద్దీకరించబడిన సంస్కారవంతమైన వాక్కును గలవారు, ఇతరులను బాధించని వారు, మరియు తాము, మాట్లాడే మాటల చేత, ఇతరులను సఖ్యముగా మరియు ఏకీభవించేలా చేసేవారు—వీళ్ళేనా పరిశుద్దులంటే? పదేపదే మంచి చేసేవారు, దాతృత్వం గలవారు మరియు ఇతరులకు గొప్ప సహకారాన్ని అందించేవారు, ప్రజల బ్రతుకుల్లో ఎంతో సంతోషాన్ని తెచ్చేవారు—వీరు పరిశుద్దులా? స్వార్థపూరిత ఆలోచనలకు తావివ్వనివారు, ఎవరిమీదా క్రూరమైన ఆక్షేపణలు చెయ్యనివారు, అందరితో ఓర్పుగా వ్యవహరించే వారు—వీళ్ళా పరిశుద్దులు? ఎవరితోనూ ఎప్పుడూ కొట్లాటలు పెట్టుకోకుండా లేక ఎవరి వద్ద నుండి లాభం ఆశించని వారు—వీళ్ళు పరిశుద్దులా? మరియు ఇతరుల మంచి కొరకు పాటుపడే వారు, ఇతరులకు లాభాన్ని చేకూర్చే వారు మరియు ఇతరులకు అన్ని రకాలుగా నైతికాభివృద్దిని కలిగించే వారి సంగతేంటి—వారూ పరిశుద్దులేనా? తమ బ్రతుకులో కూడబెట్టిన ధ్రవ్యమంతటినీ ఇతరులకు ఇచ్చి, సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారు, తమ పట్ల తాము ఖచ్చితంగా వ్యవహరిస్తూ, ఇతరులతో ఔదార్యంగా వ్యవహరించేవారు-వారు పరిశుద్దులా? (కాదు.) మీ తల్లులు మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో మరియు అన్ని విధాలుగా మిమ్మల్ని ఎలా కనిపెట్టి చూసుకున్నారో మీ అందరికీ జ్ఞాపకముంది కదా—వారు పరిశుద్దులా? మీరు ప్రేమతో చూసుకొనే విగ్రహాలు, అవి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులవో, ప్రముఖులవో లేదా గొప్ప వ్యక్తులవో అయినప్పటికీ—అవి పరిశుద్దమైనవా? (కాదు.) ఎంతో మందికి తెలియని భవిష్యత్తును గూర్చిన సంగతులను చెప్పగలిగిన బైబిల్‌లోని ప్రవక్తలైన వారిని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం—ఈ వ్యక్తులు పరిశుద్దులేనా? బైబిల్లో దేవుని వాక్యాలను మరియు ఆయన కార్యపు సత్యాలను వ్రాయగలిగిన వ్యక్తులు—వారు పరిశుద్దులా? మోషే పరిశుద్దుడా? అబ్రాహాము పరిశుద్ధుడా? (కాదు.) మరి యోబు సంగతేంటి? అతడు పరిశుద్దుడా? (కాదు.) యోబు దేవుని చేత నీతిమంతుడని పిలవబడ్డాడు, ఆ విధంగా కూడా అతను పరిశుద్దుడు కాదని ఎందుకు చెప్పబడింది? దేవునికి భయపడి, చెడును విసర్జించే వ్యక్తులు నిజంగా పరిశుద్దులు కారా? వారు పరిశుద్దులా కారా? (కారు.) మీరు కొద్దిగా భయపీడితులై ఉన్నారు, మీకు ఖచ్చితంగా సమాధానం తెలియదు, మరియు మీరు “కాదు” అని చెప్పే ధైర్యం చేయరు, కానీ “అవును” అని చెప్పే ధైర్యం కూడా చేయరు కాబట్టి ఆఖరికి మీరు అయిష్టంగానే “కాదు” అని చెప్తారు. నన్ను ఇంకొక ప్రశ్న అడగనివ్వండి. దేవుని దూతలు—భూమిమీదకి పంపించబడిన దేవుని దూతలు-వారు పరిశుద్దులా? దేవదూతలు పరిశుద్దులా? (కాదు.) సాతాను చేత చెడగొట్టబడని మానవాళి—వారు పరిశుద్దులా? (కాదు.) మీరు ప్రతి ప్రశ్నకు “కాదు” అని జవాబిస్తూ ఉంటారు. దేని ఆధారంగా? మీరు అయోమయంలో ఉన్నారు కదూ, అవునా కాదా? దేవదూతలు సైతం పరిశుద్దులు కారని ఎందుకు చెప్పబడింది? మీరిప్పుడు భయస్తులై ఉన్నారు. అవునా కాదా? ఇదివరకు మనం ప్రస్తావించిన వ్యక్తులు, వస్తువులు లేదా సృజించబడని వారు దేని ఆధారంగా పరిశుద్దులు కాదని మీరు రుజువు చేయగలరు? మీరు రుజువు చేయలేరని నాకు ఖచ్చితంగా తెలుసు. మరి మీరు “కాదు” అని చెప్పడమనేది కాస్త బాధ్యతారహితంగా లేదా? మీరు అనాలోచితంగా జవాబిస్తున్నట్టు లేదా? కొంతమంది, “నీవు ఈ రీతిగా మీ ప్రశ్నను రూపొందించావు కనుక, జవాబు ఖచ్చితంగా ‘కాదు’ అని ఉండాలి” అని అనుకుంటున్నారు. అర్ధపర్ధం లేని జవాబులు నాకు ఇవ్వొద్దు. జవాబు “అవును” లేక “కాదు” అన్నది మాత్రం శ్రద్దగా ఆలోచించండి. మీరు ఈ క్రింది అంశాన్ని చర్చించిన తరువాత జవాబు “కాదు” అని ఎందుకు అన్నారన్నది మీరు తెలుసుకుంటారు. నేను మీకు క్లుప్తంగా సమాధానాలను ఇస్తాను. మొదటగా, మనం లేఖనాల నుండి చదువుకుందాం.
1. మనిషికి దేవుడైన యెహోవా ఆజ్ఞ
ఆది 2:15-17 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేపుడైన యెహోవా-ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
2. సర్పము స్త్రీని ప్రలోభపెట్టుట
ఆది 3:1–5 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో—ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ—ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము—మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెను.
ఈ రెండు వాక్య భాగాలు బైబిల్ గ్రంధంలోని ఆదికాండము నుండి సంగ్రహించినవి. మీరంతా ఈ రెండు వాక్య భాగాలకూ సుపరిచితులేనా? అవి ఆదిలో జరిగిన సంఘటనలు, మొదట మానవాళి సృజించబడినప్పుడు; ఈ సంఘటనలు సత్యమైనవి. మొదటిగా దేవుడైన యెహోవా ఆదాము హవ్వలకు ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడో చూద్దాం; ఈ ఆజ్ఞ యొక్క సారం ఈ దినపు మన అంశానికి చాలా ప్రాముఖ్యమైనది. “మరియు దేపుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” ఈ వాక్యభాగంలో మనిషికి దేవుడిచ్చిన ఆజ్ఞ యొక్క ప్రాదాన్యత ఏంటి? ప్రధమంగా, దేవుడు మనిషికి ఏమి తినొచ్చో చెప్తాడు, అంటే, అవి ఎన్నో రకాల చెట్ల పండ్లు. ఆపదేమీ లేదు మరియు విషపూరితం కాదు; అన్నీ తినగలిగినవే. అనుమానం మరియు ఆందోళన లేకుండా, మానవుడు ఇష్టం వచ్చినట్లుగా తినొచ్చు. ఇది దేవుని ఆజ్ఞలో ఒక భాగమై ఉన్నది. మరొక భాగం హెచ్చరికయై ఉన్నది. ఈ హెచ్చరికలో, దేవుడు మానవునికి మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు ఫలాలను అస్సలు తినకూడదని చెప్పాడు. మనిషి ఈ చెట్టు నుండి ఫలాలు తింటే ఏం జరుగుతుంది? ఒకవేళ, నీవు ఆ ఫలాలు తింటే, నీవు ఖచ్చితంగా చనిపోతావని మానవునికి దేవుడు చెప్పాడు. ఈ మాటలు నిర్మొహమాటంగా లేవా? దేవుడు నీకిది చెప్పినప్పటికీ, నీవెందుకు అర్థం చేసుకోలేదు, ఆయన మాటలను నీవు ఒక నియమముగానో లేక పాటించి తీరాల్సిన ఆదేశంగా పరిగణించవా? అటువంటి మాటలు పాటించదగినవా కాదా? కానీ మానవుడు విదేయుడైనా కాకపోయినా, దేవుని మాటలు ఖచ్చితమైనవి. మానవుడు ఏమి తినొచ్చు, ఏది తినకూడదు, ఏమి తింటే ఏమవుతుందో అన్నది దేవుడు ఎంతో తేటగా చెప్పాడు. దేవుడు మాట్లాడిన ఈ సంక్షిప్తమైన మాటల్లో, నీవు దేవుని స్వభావంలో దేనినైనా గమనించగలవా? దేవుడు పలికిన ఈ మాటలు సత్యమైనవేనా? ఏమైనా వంచన ఉందా? ఏమైనా అసత్యం ఉందా? ఏమైనా భయపెట్టడం ఉందా? (లేదు.) మానవునికి ఏది తినొచ్చు మరియు ఏది తినకూడదో దేవుడు నిష్కపటంగా, సత్యసంధుడిగా మరియు మనఃపూర్వకంగా చెప్పాడు. దేవుడు సూటిగా మరియు తేటగా మాట్లాడాడు. ఈ మాటల్లో ఏమైనా మరుగైన భావముందా? ఈ మాటలు నిర్మొహమాటంగా లేవా? ఊహించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఊహాగానాలతో పనిలేదు. వాటి అర్థం రెప్పపాటులో వ్యక్తవుతుంది. వాటిని పఠించిన తరువాత, వాటి అర్ధాన్ని గూర్చి పూర్తిగా తేటగా అనిపిస్తుంది. అంటే, దేవుడు చెప్పాలనుకుంటున్నది ఏమిటో మరియు ఆయన వ్యక్తం చేయాలనుకుంటున్నది ఏమిటో ఆయన హృదయంలో నుండి వస్తుంది. దేవుడు వ్యక్తీకరించే సంగతులు స్వచ్చంగా, ముక్కుసూటిగా మరియు తేటగా ఉంటాయి. ఇక్కడ కపటమైన ఉద్దేశ్యాలు లేవు, మరుగైన అర్థాలు లేవు. ఆయన మానవునితో సూటిగా మాట్లాడతాడు, అతడికి ఏమి తినవచ్చో మరియు ఏమి తినకూడదో చెప్తున్నాడు. అంటే, దేవుని ఈ వాక్యాల ద్వారా, దేవుని హృదయం స్వచ్చమైనదిగా మరియు నిజమైనదిగా మానవుడు చూడగలడు. ఇక్కడ అబద్దపు ఆనవాలు లేదు; నీవు తినదగినది తినవద్దని నీకు చెప్పడమో లేదా నీవు తినకూడని వాటితో “అలా చేసి ఏమౌతుందో చూడు” అని చెప్పడమో జరగలేదు. దేవుడంటే ఇది కాదు. దేవుడు తన హృదయంలో ఏదైతే తలంచుతాడో, అదే చెప్తాడు. ఈ రీతిగా ఈ వాక్యాల్లో తనను తాను కనుపరచి, బయలుపరచినందున దేవుడు పరిశుద్దుడని నేను చెప్తే, నేను ఒక మట్టిదిబ్బ నుండి కొండను తయారు చేశానని లేదా నేను ఒక బిందువును కొంచెం దూరంగా విస్తరించానని నీవు అనుకోవచ్చు. అలాగైతే, ఆందోళన పడకండి; మనము ఇంకా పూర్తి చేయలేదు.
ఇప్పుడు మనం “సర్పము స్త్రీని ప్రలోభపెట్టడం” గూర్చి మాట్లాడుకుందాం. అసలు సర్పము ఎవరు? అపవాది. ఇది దేవుని ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలో చెడగొట్టే పాత్రను పోషిస్తుంది మరియు దేవుని పరిశుద్దతను గూర్చి మనం చర్చించేటప్పుడు మనం పేర్కొనవలసిన పాత్ర ఇది. దీనిని నేనెందుకు చెప్తున్నాను? అపవాది చెడుతనం మరియు దుర్నీతి గురించి నీకు తెలియకపోతే, అపవాది వైఖరి గురించి నీకు తెలియకపోతే, నీకు పరిశుద్దతను గుర్తించే దారి ఉండదు, మరియు పరిశుద్దత అంటే ఏంటో నిజంగా నీవు తెలుసుకోలేవు. ప్రజలు అయోమయంలో, అపవాది చేసేది నిజమని విశ్వసిస్తారు, ఎందుకంటే వారు ఈ విధమైన దుర్నీతి వైఖరిలో జీవిస్తున్నారు. చెడగొట్టడం అనేది లేకుండా, పోల్చడం అనేది లేకుండా, పరిశుద్దత అంటే ఏంటో నీవు తెలుసుకోలేవు. అందువల్ల ఇక్కడ అపవాదిని తప్పనిసరిగా ప్రస్తావించి తీరాలి. అలాంటి ప్రస్తావన వట్టి సంభాషణ కాదు. అపవాది మాటలు మరియు క్రియల ద్వారా, అపవాది ఎలా వ్యవహరిస్తుంది, అపవాది మానవాళిని ఏవిధంగా చెడగొడుతుందో మరియు అపవాది స్వభావము మరియు ముఖవైఖరి ఏంటో మనం చూస్తాం. అయితే, ఆ స్త్రీ సర్పంతో ఏమని చెప్పింది? దేవుడైన యెహోవా తనతో చెప్పిన సంగతిని ఆ స్త్రీ సర్పముకు వివరంగా చెప్పింది. ఆమె ఈ మాటలు చెప్పినప్పుడు, దేవుడు తనతో చెప్పింది వాస్తవమని ఆమె విశ్వసించిందా? ఆమె ఖండితంగా చెప్పలేకపోయింది, కదా? నూతనంగా సృజించబడిన వ్యక్తిగా, ఆమెకు మంచిచెడులను వివేచించే సామర్థ్యం లేదు మరియు తన చుట్టుప్రక్కల ఉన్న దేనిని గూర్చి ఆమెకు ఏవిధమైన గ్రహింపు లేదు. ఆమె సర్పంతో మాట్లాడిన మాటలను బట్టి ఆలోచిస్తే, దేవుని వాక్కులు సత్యమైనవని ఆమె హృదయంలో రూడీగా లేదు; ఆమె స్వభావం అటువంటిది. కాబట్టి దేవుని మాటల పట్ల ఆ స్త్రీ సందిగ్ధత కలిగిన స్వభావంతో ఉన్నట్లు సర్పము గమనించినప్పుడు, అది ఈవిధంగా చెప్పింది: “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెను.” ఈ మాటలు ఏమైనా వివాదాస్పదంగా ఉన్నాయా? మీరు ఈ వాక్య భాగాన్ని పఠించినప్పుడు, మీరు సర్పము ఉద్దేశాలు గమనించారా? ఆ ఉద్దేశాలు ఏంటి? ఇది ఈ స్త్రీని ప్రేరేపించాలని, దేవుని మాటలను లక్ష్యపెట్టకుండా అడ్డుకోవాలనుకుంది. కానీ అది ఈ సంగతులను నేరుగా చెప్పలేదు. అందువల్ల, మనం దీనిని చాలా కపటమైనదని చెప్పవచ్చు. ఇది తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి కపటముగా తప్పించుకునే దారిలో దాని భావాన్ని తెలియచేస్తుంది, దాన్ని తన హృదయంలో మరుగుచేసి, మానవునికి కనిపించకుండా దాస్తుంది—సర్పము జిత్తులమారితనం అలాంటిది. ఎప్పుడూ అపవాది మాట్లాడుతూ నటించే పద్ధతి ఇదే. ఏదోక దారిలో అది నిర్ధారణ చేయకుండా “నిజమా” అని అంటుంది. అయితే దీన్ని వినిన ఈ తెలివిలేని స్త్రీ హృదయం కదిలించబడింది. సర్పము సంతోషపడింది, ఎందుకంటే దాని మాటలు అనుకున్న పరిణామాన్నే కలిగించాయి—అదే సర్పపు కపటపూరితమైన ఉద్దేశ్యము. పైగా, మనుషులకు కోరుకొనే ఫలితాన్ని వాగ్దానం చేయడం ద్వారా, అది ఆమెను ప్రలోభపరచి, “మీరు వాటిని తిన్న దినమున, మీ కన్నులు తెరవబడును” అని చెప్పింది. అందుకు ఆమె, “నా కన్నులు తెరవబడడం మంచి విషయమే” అని అనుకుంది! ఆ తరువాత అది “మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురు” అని ఎంతో కట్టిపడేసే, మానవుడు ఇదివరకెన్నడూ ఎరగని, వాటిని విన్న వారిని ఆకర్షణకు గురి చేసే గొప్ప శక్తివంతమైన మాటలను చెప్పింది. ఈ మాటలు మానవుణ్ణి అంత బలంగా ప్రలోభపెట్టేవా? ఇదెలా ఉందంటే, “నీ ముక్కులోని గోడ కొద్దిగా పొట్టిగా ఉండటం తప్ప, నీ ముఖము అద్బుతంగా రూపించబడింది. అది గనుక నీవు సరిచేసుకుంటే, ఇక నీవు ఒక ప్రపంచ సుందరివి అవుతావు” అని ఎవరో నీతో చెప్తున్నటు ఉంటుంది! ఇదివరకు ఎన్నడూ సౌందర్య సాధక శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరికే లేని వ్యక్తి హృదయాన్ని ఈ మాటలు చలింపజేయవా? ఈ మాటలు ప్రలోభపెట్టేవి కావా? ఈ ప్రలోభం నీ మనస్సును ఆకర్షించడం లేదా? మరియు ఇది ఆకర్షణ కాదా? (అవును.) దేవుడు ఇటువంటి విషయాలు చెప్తాడా? ఇప్పుడు మనం చదివిన దేవుని వాక్యాల్లో దీన్ని గూర్చి ఏదైనా జాడయైనా ఉన్నదా? దేవుడు తన మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని చెప్తాడా? మానవుడు దేవుని హృదయాన్ని ఆయన మాటల ద్వారా తెలుసుకోగలడా? (అవును.) అయితే సర్పము ఆ స్త్రీతో ఆ మాటలు పలికినప్పుడు, నీవు దాని హృదయాన్ని తెలుసుకోగలిగావా? లేదు. మరియు మానవుని అవివేకం కారణంగా, మానవుడు సర్పపు మాటలకు సులువుగా ప్రలోభపరచబడ్డాడు మరియు తేలికగా మాయలో చిక్కాడు. కనుక నీవు అపవాది భావాలను తెలుసుకోగలిగావా? అపవాది చెప్పిన దాని వెనుక ఉన్నటువంటి తాత్పర్యాన్ని నీవు తెలుసుకోగలిగావా? నీవు అపవాది కుట్రలు మరియు కుయుక్తులను తెలుసుకోగలిగావా? (లేదు.) అపవాది మాట్లాడే తీరు ఎటువంటి వైఖరిని సూచిస్తుంది? ఈ మాటల ద్వారా నీవు అపవాదిలో ఎటువంటి స్వభావాన్ని చూశావు? ఇది కపటమైనది కాదా? బహుశా నేలమీద అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది, లేదా బహుశా అది ఏ విధమైన వ్యక్తీకరణను బయలు పరచదు. కానీ దాని హృదయంలో అది తన లక్ష్యాన్ని ఏ విధంగా పొందుకోవాలో అంచనా వేస్తుంది మరియు ఈ ఉద్దేశాన్ని నీవు తెలుసుకోలేవు. అది నీకు చేస్తానని మాటిచ్చేవన్నీ, అది విశదపరిచే ఉపయోగాలన్నీ దాని వంచన యొక్క మారువేషం. నీవు ఈ సంగతులను మంచివని భావిస్తావు, కాబట్టి నీవు అది చెప్పేది దేవుడు చెప్పిన దాని కంటే మరింత ప్రయోజనకరంగా, ఎంతో ప్రధానమైనదిగా భావిస్తావు. ఇది జరిగినప్పుడు, మానవుడు లొంగిపోయిన బంధీగా మారిపోలేదా? అపవాది వాడిన ఈ పధకం క్రూరమైనది కాదా? నీవు దుష్టత్వంలో కూరుకుపోవడానికి నిన్ను నీవే అనుమతించుకుంటావు. అపవాది తన ప్రమేయం లేకుండానే, కేవలం ఈ రెండు మాటలను పలకడం ద్వారా, నీవు అపవాదితో పాటు కలిసి వెంబడించడాన్ని, అపవాదికి అనుగుణంగా వ్యవహరించడాన్ని ఆనందిస్తావు. ఆ రీతిగా, అపవాది ఉద్దేశం నెరవేర్చబడింది. ఈ భావన క్రూరమైనది కాదా? ఇది అపవాది అత్యంత ప్రాముఖ్యమైన ముఖవైఖరి కాదా? అపవాది మాటల బట్టి, మానవుడు దాని క్రూరమైన ఆశయాలను తెలుసుకోవచ్చు, అసహ్యమైన దాని ముఖవైఖరిని చూడవచ్చు మరియు దాని లక్షణాన్ని తెలుసుకోవచ్చు. అది నిజం కాదా? ఈ వాక్యాలను పోల్చడం ద్వారా, పరిశీలించకుండా బహుశా దేవుడైన యెహోవా వాక్కులు ఇక్కడ ఉద్వేగభరితంగా దేవుని యదార్ధతను కీర్తించడానికి పనికిరాని నిరుత్సాహమైనవి, సాధారణమైనవి మరియు ఎలాంటి విశేషము లేనివని నీవు భావించవచ్చు. అయితే, మనం అపవాది మాటలను మరియు అపవాది అసహ్యమైన ముఖవైఖరిని ప్రతిఫలింపజేసే మెరుపు కాగితంగా తీసుకుంటే, దేవుని ఈ వాక్కులు ఈనాటి ప్రజలకు విశేషమైన గౌరవాన్ని తీసుకురావా? (అవును.) ఈ పోలిక ద్వారా, మానవుడు దేవుని నిష్కల్మషమైన నిర్దోషత్వమును అర్ధం చేసుకోగలడు. అపవాది మాట్లాడే ప్రతీ మాట, అలాగే అపవాది ఆశయాలు, అభిప్రాయాలు మరియు అది మాట్లాడే తీరు—అవన్నీ కల్మషమైనవి. అపవాది మాట్లాడే తీరులో ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏంటి? అపవాది నిన్ను దాని వంచనను చూడనివ్వకుండా, నువ్వు దాని ఆశయాన్ని పసిగట్టనివ్వకుండా, నిన్ను ప్రలోభపెట్టడానికి వక్రీకరణను వాడుతుంది; నీవు ఎరను తీసుకునేదాకా అపవాది ఆగుతుంది, కానీ నువ్వు కూడా దాని విజయాలను కీర్తించి పొగడాలి. ఈ కుట్ర అపవాది అలవాటుగా చేసుకున్న విధానం కాదా? (అవును.) మానవుడు దాని అసహ్యమైన ముఖవైఖరిని తెలుసుకోడానికి అనుమతించే అపవాది ఇతరమైన మాటలు మరియు వ్యక్తీకరణలను ఇప్పుడు చూద్దాం. లేఖనభాగాల నుండి ఇంకొన్ని చదువుకుందాం.
3. అపవాది మరియు దేవుడైన యెహోవా మధ్య జరిగిన సంభాషణ
యోబు 1:6-11 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతి పనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను.
యోబు 2:1-5 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా, అపవాది–చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.
ఈ రెండు వాక్య భాగాల్లో పూర్తిగా దేవునికి మరియు అపవాదికి మధ్య జరిగిన సంభాషణ ఉంటుంది; వారు దేవుడు చెప్పినదాన్ని మరియు అపవాది చెప్పినదాన్ని వ్రాస్తారు. దేవుడు ఎక్కువగా మాట్లాడలేదు మరియు ఎంతో సహజంగా మాట్లాడాడు. ఆయన సహజమైన మాటల్లోనే దేవుని పరిశుద్దతను మనం తెలుసుకోగలమా? ఇది అంత సులువుగా అయ్యేది కాదు అని కొంతమంది చెప్తారు. కాబట్టి మనం అపవాది వికారతను దాని సమాధానాలలో మనం గ్రహించగలమా? దేవుడైన యెహోవా అపవాదిను మొదట ఎటువంటి ప్రశ్న అడిగాడో పరిశీలిద్దాం. “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” ఇది సూటియైన ప్రశ్న కాదా? మరుగైన భావం ఏమైనా ఉందా? లేదు; ఇది సూటియైన ప్రశ్న మాత్రమే. “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని నేను మిమ్మల్ని అడిగితే: అప్పుడు మీరు ఏవిధంగా జవాబిస్తారు? ఇది జవాబివ్వడానికి కష్టతరమైన ప్రశ్నా? మీరు “అటు ఇటూ తిరుగులాడుచూ అందులో సంచరిస్తున్నామని చెప్తారా”? లేదు మీరు ఈవిధంగా జవాబివ్వరు. కాబట్టి, అపవాది ఇలా జవాబివ్వడం మీరు గమనించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? (అపవాది అర్ధరహితంగా ఉన్నదని, అయితే కపటముతో కూడా ఉన్నదని మనము అనుకుంటాము.) నేను ఎమనుకుంటున్నానో మీరు చెప్పగలరా? నేను ఈ అపవాది మాటలను చూసిన ప్రతిసారీ, నాకు చీదరగా అనిపిస్తుంది, ఎందుకంటే అపవాది మాట్లాడుతుంది, అయితే దాని మాటల్లో ఏవిధమైన భావముండదు. దేవుని ప్రశ్నకు అపవాది సమాధానం ఇచ్చిందా? లేదు, అపవాది చెప్పిన మాటలు జవాబు కాదు, అవి ఏమీ ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. అవి దేవుని ప్రశ్నకు జవాబు కాదు. “భూమిమీద అటూ ఇటూ తిరుగులాడుచూ, అందులో సంచరించడం.” ఈ మాటల్లో మీరు గ్రహించింది ఏమిటి? అపవాది అప్పుడే ఎక్కడ నుండి వచ్చింది? మీరు ఈ ప్రశ్నకు జవాబును పొందారా? (లేదు) ఇది అపవాది కపటమైన కుట్రలు పన్నే “ప్రతిభాశాలి”- నిజానికి అది ఏమి చెప్తుందో ఏ ఒక్కరినీ కనుగొననివ్వదు. ఈ మాటలు విన్న నీవు అది జవాబివ్వడం అయిపోయినప్పటికీ, అది చెప్పిన దాన్ని నీవు గ్రహించలేకపోయావు. అయినప్పటికీ, అది సరిగ్గా జవాబిచ్చిందని అపవాది నమ్ముతుంది. అయితే నీకు ఏమనిపిస్తుంది? వికృతంగా ఉందా? (అవును.) ఇప్పుడు నువ్వు ఈ మాటలకు జవాబుగా అసహ్యకరమైన భావనను పొందుతావు. అపవాది మాటలు ఒక నిర్నీతమైన విలక్షణతను కలిగి ఉంటాయి: అపవాది చెప్పేది నిన్ను అయోమయంలో పడేస్తుంది, దాని మాటల మూలాధారాన్ని అవగతం కానివ్వదు. కొన్నిసార్లు అపవాది ఆశయాలను కలిగి బుద్ధిపూర్వకంగానే మాట్లాడుతుంది, మరియు కొన్నిసార్లు దాని గుణాన్ని బట్టి పాలించబడతావు, అటువంటి మాటలు హటాత్తుగా ఉద్భవించి, అపవాది నోటి నుండి తిన్నగా వెలువడతాయి. అపవాది అటువంటి మాటలను భరిస్తూ ఎక్కువసేపు ఉండదు; కానీ, అవి అనాలోచితముగానే తెలియజేయబడ్డాయి. ఎక్కడి నుండి వచ్చిందని దేవుడు దాన్ని అడుగగా, అపవాది కొన్ని సందేహాస్పదమైన మాటలతో జవాబిచ్చింది. అపవాది ఎక్కడిదో తెలియక నువ్వు చాలా సందిగ్దంలో ఉన్నావు. ఈ విధంగా మాట్లాడేవారు మీలో ఎవరైనా ఉన్నారా? మాట్లాడటానికి ఇది ఏ రకమైన పద్ధతి? (ఇది సందేహాస్పదంగా ఉంది మరియు నిర్దిష్టమైన జవాబును ఇవ్వదు.) ఈ రీతిగా మాట్లాడే పద్దతిని విశదీకరించడానికి మనం ఎటువంటి మాటలను వాడాలి? ఇది వైదొలగించడం మరియు దారి తప్పించడం, కాదా? ఎవరైనా నిన్న చేసింది వేరేవారికి తెలియడం ఇష్టం లేదనుకుందాం. నువ్వు వారిని: “నిన్న నేను నిన్ను చూసాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అని అడుగుతావు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో వాళ్ళు నీకు సూటిగా చెప్పరు. బదులుగా, వారు ఈవిధంగా చెప్తారు: “నిన్నటి రోజు అసలు అది ఏం రోజు. ఇది ఎంతో అలసటగా ఉంది!” వారు నీ ప్రశ్నకు జవాబిచ్చారా? వారు ఇచ్చారు, అయితే నువ్వు ఆశించిన జవాబు వారు ఇవ్వలేదు. ఇది మానవుని సందేశపు కల్పనా “ప్రతిభ”. వాటి భావమేమన్నది నీవు ఇప్పటికీ కనుగొనలేవు, లేదా వారి మాటల మూలాదారాన్ని లేదా ఉద్దేశాన్ని తెలుసుకోలేవు. వారు దేన్ని తప్పించాలని ప్రయత్నిస్తున్నారో నీకు తెలియదు ఎందుకంటే వారి మనస్సులో వారి సొంత కథ వారికుంది—ఇది కపటపూరితమైనది. మీలో కూడా పదేపదే ఈ రీతిగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? (ఉన్నారు.) అప్పుడు మీకున్న కారణం ఏంటి? కొన్నిసార్లు మీ సొంత ఇష్టాఇష్టాలను పరిరక్షించుకోవడం, కొన్నిసార్లు మీ సొంత అభిమానాన్ని, హోదాని మరియు పరువుని కాపాడుకోవడం, మీ ఆంతరంగికమైన జీవిత గుట్టులను పరిరక్షించుకోవడం కోసమా? కారణం ఏదైనప్పటికీ, అది మీ ఇష్టాయిష్టాలకు సంబంధించింది, మీ ఇష్టాయిష్టాల నుండి విడదీయకూడనిది. ఇది మానవుని వైఖరి కాదా? అటువంటి వైఖరి కలిగిన వారంతా అపవాదితో అతి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటారు, లేదా దాని కుటుంబమై ఉంటారు. మనం ఈవిధంగా అనుకోవచ్చు, కాదంటారా? సాధారణమైన మాటల్లో చెప్పాలంటే, ఈ లక్షణం హేయమైనది మరియు అసంగతమైంది. ఇప్పుడు కూడా మీరు అసహ్యహించుకుంటూ ఉన్నారు కదా? (అవును.)
ఈ క్రింది వచనాలను పరిశీలిద్దాం. యెహోవా ప్రశ్నకు అపవాది మరలా ప్రత్యుత్తరమిస్తూ, “యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయెనా?” అని అడిగింది యోబు మీద యెహోవాకు వున్న అంచనాలపై అపవాది దాడి చేయడానికి ప్రారంభించింది మరియు ఈ దాడి విరోధంతో మభ్యపరచబడి ఉంది. “నీవు అతనికిని, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా?” ఇది యోబు పట్ల యెహోవా చేసిన కార్యాన్ని అపవాది గ్రహించి అంచనా వేయడం. అపవాది దాన్ని: “నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత, అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము యెదుటనే దూషించి నిన్ను విడిచిపోవును” అని ఈ విధంగా చెప్పి అంచనా వేస్తుంది. అపవాది ఎప్పుడూ సంధిగ్దముగానే మాట్లాడుతుంది, అయితే ఇక్కడ యిది నిర్దిష్టమైన షరతులతో మాట్లాడుతుంది. అయితే, ఈ మాటలు నిర్దిష్టమైన షరతులతో చెప్పబడినప్పటికీ, దాడి, దేవదూషణ మరియు దేవుడైన యెహోవాను, స్వయంగా దేవుణ్ణి ధిక్కరించే చర్య. మీరు ఈ మాటలను విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకు అసహ్యంగా అనిపిస్తుందా? మీరు అపవాది ఆంతర్యాలను గ్రహించగలుగుతున్నారా? అన్నింటికంటే ముందుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విసర్జించిన యోబును గూర్చి యెహోవా నిర్దారణను అపవాది నిరాకరించింది. అప్పుడు యోబు చెప్పేవాటిని, చేసేవాటిని అపవాదిత్రోసిపుచ్చింది అంటే అది యెహోవా పట్ల తనకున్న భయభక్తులను అంగీకరించలేదు. ఇది ఆరోపించడం కాదా? యెహోవా చేసేవాటిని, చెప్పేవాటిని అన్నింటిని అపవాది నిందించి, సందేహించి మరియు త్రోసిపుచ్చింది. “విషయాలు ఈవిధంగా ఉన్నాయి, నేను దాన్ని చూడలేదు ఎలా? అని నువ్వు చెప్తే అది నమ్మదు నువ్వు దానికి ఎన్నో దీవెనలు దయచేసావు, కాబట్టి అది నీయందు భయభక్తులు లేకుండా ఎలా ఉంటుంది? ఇది దేవుడు చేసిన వాటన్నింటిని నిరాకరించడం కాదా? నిందారోపణ, నిరాకరణ, దేవదూషణ-అయినటువంటి అపవాది మాటలు దౌర్జన్యమైనవి కావా? అపవాది దాని హృదయంలో ఏం ఆలోచిస్తోందో అవి అసలైన వ్యక్తీకరణ కాదా? “భూమిమీద అటూ ఇటూ తిరుగులాడుచూ, అందులో సంచరించడం” అనే ఈ మాటలు, ఇప్పుడు మనం చదివిన మాటల వలె ఒకే విధంగా ఉండవు. అవి పూర్తి వ్యత్యాసంగా ఉంటాయి. ఈ మాటల ద్వారా, అపవాది తన మనస్సులో—దేవుని పట్ల దాని ధోరణిని, మరియు దేవుని పట్ల యోబు కలిగి ఉన్న భయ భక్తులను చీదరించుకోవడం వంటి సంగతులను పూర్తిగా బయలు పరుస్తుంది. ఇది సంభవించినప్పుడు, దాని చెడు బుద్ధి మరియు చెడ్డ వైఖరి పూర్తిగా అగపరచబడతాయి. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండే వారిని అది చీదరించుకుంటుంది, చెడుతనము విసర్జించే వారిని, మరియు అంతకంటే మరి ఎక్కువగా మనిషికి దీవెనలను దయచేసినందుకు యెహోవాను చీదరించుకుంటుంది. దేవుడు తన హస్తాలతో లేవనెత్తిన యోబును నాశనం చేయడానికి, అతనిని నష్టపరచడానికి, అది ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకొని, ఈవిధంగా చెప్తుంది: “యోబు నీ యందు భయభక్తులు కలిగిన వాడని మరియు చెడుతనమును విసర్జించినవాడని నీవు చెప్తున్నావు. నేను దాన్ని వేరేలా చూస్తాను.” ఇది యెహోవాకు ఆగ్రహాన్ని కలిగించి శోధించడానికి వివిధ రకాలైన దారులను ఉపయోగిస్తుంది, మరియు దేవుడైన యెహోవా యోబు పట్ల ఇష్టానుసారంగా భ్రమ పరచి, హాని తలపెట్టి మరియు దురుసుగా వ్యవహరించడానికి తనకు అప్పగిస్తాడని అపవాది పలురకాల కుయుక్తులను ఉపయోగిస్తుంది. అది ఈ సదావకాశాన్ని అందిపుచ్చుకొని దేవుని దృష్టిలో యథార్థవర్తనుడును న్యాయవంతుడైన ఈ మనిషిని నాశనం చేయాలనుకుంటుంది. అపవాది ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటానికి కేవలం ఒక్క క్షణికావేశమే కారణమా? లేదు, అది కాదు. ఇది ఎంతో కాలం పాటు తయారవడంలో ఉన్నది. దేవుడు కార్యము చేస్తూ, ఒక వ్యక్తి పట్ల శ్రద్ధ కనుపరుస్తున్నప్పుడు, మరియు ఈ వ్యక్తిని పరిశీలన చేసేటప్పుడు, మరియు ఆయన ఈ వ్యక్తిని కనికరించి అంగీకరించినప్పుడు, అపవాది ఆ వ్యక్తిని చాలా `దగ్గరగా వెంబడిస్తూ, మోసపుచ్చి హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ దేవుడు ఈ వ్యక్తిని పొందాలని ఆశిస్తే, అపవాది దాని అదృశ్య లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, దేవుని కార్యాన్ని ఆటంకపరచి నిర్విరియం చేయడానికి, శోధించడానికి, పలు రకాలైన దుర్మార్గపు కుయుక్తులను ఉపయోగించి దేవునిని అడ్డుకోవాలని అది దాని శక్తి కొలది ప్రతి దాన్ని చేస్తుంది. ఈ లక్ష్యము ఏమై ఉన్నది? దేవుడు ఎవరినైనా సంపాదించడం దానికి ఇష్టముండదు; దేవుడు సంపాదించాలనుకునే వారు కలిగి ఉన్న దానిని లాక్కోవాలని అది ఆశిస్తుంది. వారిని అదుపు చేయాలని, వారు దానిని ఆరాధించే విధంగా వారు బాధ్యతను వహించాలని అనుకుంటుంది, కావున వారు దుష్కార్యాలకు పాల్పడటంలో ఏకీభవించి, దేవుణ్ణి నిరోధిస్తారు. ఇది అపవాది కలిగి ఉన్న దురుద్దేశం కాదా? ఎన్నోసార్లు మీరు అపవాది ఎంతో దుర్మార్గమైనది, చాలా చెడ్డదని అంటారు, అయితే దాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? మనుష్య జాతి ఎంత చెడ్డదో మీరు చూడగలరు; నిజంగా అపవాది ఎంత చెడ్డదో మీరు చూడలేదు. అయితే, యోబు విషయంలో మాత్రం, అపవాది ఎంతటి దుర్మార్గమైనదో మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. ఈ విషయం అనేది అపవాది వికృత ముఖకవళికలను మరియు దాని గుణమును చాలా స్పష్ట పరిచింది. దేవునితో యుద్ధం చేయడంలో, మరియు ఆయనను వెనువంటే అనుసరించడంలో, దేవుడు జరిగించాలనుకున్న కార్యాన్ని ధ్వంసం చేయడం, ఎవరిని దేవుడు పొందాలనుకున్నాడో వారిని వశపరచుకొని అదుపు చేయడం, దేవుడు సంపాదించాలనుకున్న వారిని బొత్తిగా నిర్మూలించడం వంటివి అపవాది లక్ష్యమై ఉన్నది. ఒకవేళ వారు నిర్వీర్యం కాకపోతే, అపవాది చేత ఉపయోగించబడడానికి వారు దాని వశములోనికి వస్తారు—ఇదే దాని లక్ష్యమై ఉన్నది. మరైతే దేవుడు ఏమి చేస్తాడు? ఈ వాక్య భాగంలో దేవుడు ఒక మామూలు వాక్యాన్ని మాత్రమే పలికాడు; ఇంతకు మించి ఆయన ఏదీ చేసిన దాఖలాలు లేవు, అయితే అపవాది చేసినవి మరియు పలికిన వాటి గురించి మాత్రం ఎన్నెన్నో దాఖలాలు ఉన్నాయి. ఈ క్రింది లేఖన భాగంలో, యోహోవా అపవాదితో “నీవు ఎక్కడనుండి వచ్చావు?” అని అడుగుతాడు. అపవాది జవాబు ఏమిటి? (ఇది ఇంకా “భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చితిని.) ఇప్పటికీ దాని మాట అదే. ఇది అపవాది పరిభాషగా, అపవాది చిరునామా పత్రంగా మారిపోయింది. ఇది ఎలా జరిగింది? అపవాది ద్వేషపూరితమైనది కాదా? నిజంగా హేయమైన ఈ వాక్యాన్ని ఒక్కసారి పలికితే సరిపోతుంది. మరెందుకు అపవాది దీనిని పదేపదే పలుకుతుంది? ఇది ఒక్క సంగతిని నిరూపిస్తుంది: అపవాది స్వభావము ఎన్నటికీ మారదు. తన వికృతమైన ముఖ కవళికలను కప్పిపుచ్చుకోవడానికి అపవాది కుంటిసాకును వాడుకోలేదు. దేవుడు దానిని ఒక ప్రశ్న అడుగుతాడు మరియు అది ఇలా సమాధానమిస్తుంది. ఇదే ఇలా ఉంటే, ఇక ఇది మనుష్యుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో ఊహించండి! అపవాదికు దేవుడంటే భయము లేదు, దేవునికి భయపడదు, మరియు దేవునికి విధేయత చూపదు. అంటే దేవుని ఎదుట అది గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇవే వాక్యాలను ఉపయోగించి దేవుని ప్రశ్ననే కొట్టిపారేస్తుంది, దేవుని ప్రశ్నకు ప్రతిసారి ఈ ఒక్క జవాబునే ఉపయోగిస్తుంది, ఇదే జవాబును ఉపయోగించి దేవుణ్ణి కలవరపెట్దడానికి యత్నిస్తుంది—ఇదే అపవాది వికృత రూపము. అది దేవుని సర్వశక్తియందు విశ్వాసముంచదు, దేవుని అధికారాన్ని నమ్మదు, మరియు దేవుని ఏలుబడికి లోబడటం అస్సలు నచ్చదు. అది ఎప్పుడూ దేవునికి విరోధంగా ఉంటూ, దేవుడు జరిగించే సమస్తం మీద దాడికి తెగబడుతూ, దేవుడు చేసేదంతటిని ద్వంసం చేయడానికి ప్రత్నిస్తుంది—ఇదే దాని దుర్మార్గపు లక్ష్యము.
యోబు గ్రంథములో రాయబడినట్టుగా, అపవాది మాట్లాడిన ఈ రెండు వాక్య భాగాలు మరియు అపవాది చేసిన పనులు అనేవి ఆరువేల సంవత్సరాల దేవుని నిర్వహణ ప్రణాళికలో అది ఆయనను ఎదిరించిన విధానానికి సూచనగా ఉన్నాయి—ఇక్కడ, అపవాది అసలు రంగులు బయటపడ్డాయి. అపవాది మాటలు మరియు క్రియలను నిజ జీవితంలో నీవు ఎపుడైనా చూశావా? అవి నీకు కనబడినప్పుడు, అవి అపవాది పలికిన వాటిలా నీకు అనిపించకపోవచ్చు, కానీ అందుకు బదులుగా అవి మానవుడు పలికిన మాటలుగా అనిపిస్తాయి. మానవుడు అలాంటి విషయాలను పలికినప్పుడు, అది దేనిని సూచిస్తుంది? అపవాదిను సూచిస్తుంది. ఒకవేళ నీవు దానిని గుర్తుపట్టినా, వాస్తవానికి మాట్లాడుతున్నది సాతానే అన్న సంగతి నీవు ఇంకా తెలిసికోలేవు. అయితే ఇప్పుడిక్కడ సాతానే స్వయంగా చెప్పిన దానిని మీరు స్పష్టంగా చూశారు. ఇప్పటికి నీకు అపవాది వికృత రూపము మరియు చెడుతనమును గూర్చి నిశ్చయమైన, సుస్పష్టమైన అవగాహన కలిగింది. కాబట్టి అపవాది స్వభావానికి సంబంధించిన అవగాహనను పొందడానికి నేటి ప్రజలకు దోహదపడటంలో అపవాది పలికిన ఈ రెండు వాక్య భాగాలు విలువైనవిగా ఉన్నాయా? ఈనాడు మానవాళి అపవాది భయంకర రూపాన్ని గుర్తించడానికి, అపవాది అసలైన, నిజ స్వరూపాన్ని గుర్తించడానికి ఈ రెండు వాక్య భాగాలను భద్రంగా ఉంచుకోవడం సరైనదేనా? ఇది చెప్పడానికి సరైనదిగా అనిపించకపోయినప్పటికీ, ఈ రకంగా తెలియజేయబడిన ఈ మాటలు సరైనవిగానే లెక్కించబడతాయి. వాస్తవానికి, నేను ఈ ఆలోచనను తెలియచేయగల ఒకే ఒక్క దారి ఇదే, మరియు మీరు దాన్ని గ్రహించగలిగితే, అదే చాలు. అపవాది పదే పదే యెహోవా చేసే కార్యాలపై దాడి చేస్తుంది, దేవుడైన యెహోవా పట్ల యోబుకు ఉన్న భయభక్తులను గూర్చి నేరారోపణ చేస్తుంది. అపవాది రకరకాలైన విధానాల ద్వారా యెహోవాకు కోపం పుట్టించడానికి ప్రయత్నిస్తుంది, అది యోబును పెట్టిన ప్రలోభాన్ని యెహోవా మన్నించేలా ప్రయత్నిస్తుంది. అందువల్ల దాని మాటలు ఎంతో కోపాన్ని పుట్టించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, అపవాది ఈ మాటలు పలికిన తరువాత, అపవాది ఏమి చేయాలనుకుంటుందో దేవుడు తేటగా గ్రహించలేడా నాకు చెప్పండి? (అవును.) దేవుని హృదయంలో, దేవుడు చూస్తున్న ఈ మానవుడైన యోబు-దేవుడు నీతిమంతునిగా ఈ దేవుని సేవకుడు, దేవుడు నీతిమంతుడిగా, నిర్దోషమైన వ్యక్తిగా తీసుకున్న ఈ దేవుని సేవకుడు-అతను ఈ రకమైన శోధనకు నిలబడగలడా? (అవును.) దేవుడు దాని గురించి ఎందుకు ఖచ్చితంగా ఉన్నాడు? దేవుడు ఎల్లప్పుడూ మానవుని హృదయాన్ని పరిశీలన చేస్తాడా? (అవును.) మరైతే అపవాది మానవుని హృదయాన్ని పరిశీలించగలదా? అపవాది పరిశీలించలేదు. ఒకవేళ అపవాది నీ హృదయాన్ని గమనించగలిగినప్పటికీ, దాని చెడ్డ మనస్తత్వమనేది పరిశుద్దతను పరిశుద్దతని, లేక నికృష్టతను నికృష్టతని విశ్వసించనివ్వదు. దుష్టుడైన, పరిశుద్దమైన, నీతియుక్తమైన లేక ప్రకాశవంతమైన దేనినీ ఎప్పటికీ విలువైనదిగా లెక్కించదు. తన స్వభావము, తన చెడుతనాన్ని అనుసరించి, మరియు తన అలవాటైన విధానాల ద్వారా అపవాది నిర్విరామంగా పనిచేయడంలో సహాయపడలేదు. దేవుని శిక్షను మరియు నాశనాన్ని దానికది కొనితెచ్చుకున్నప్పటికీ, అది మూర్ఖంగా దేవుణ్ణి ప్రతిఘటించడానికి కూడా వెనుకాడదు—చెడుతనము అంటే ఇదే, అపవాది స్వభావమూ ఇదే. కాబట్టి ఈ వాక్య భాగంలో, అపవాది: “చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును” అని అనిందిచెప్పింది. మానవుడు దేవుని వద్ద నుండి ఎన్నో లాభాలను చేకూర్చుకున్న కారణం చేత మానవుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాడని అపవాది అనుకుంటుంది. మానవుడు దేవుని వద్ద నుండి ప్రయోజనాలను పొందుకుంటాడు, కాబట్టి అతడు దేవుడిని మంచివాడని అంటాడు. అయితే, దీనికి కారణం దేవుడు మంచివాడని కాదు, మానవుడు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నాడు కాబట్టే అతడు దేవుని పట్ల ఈ విధమైన భయభక్తులు కనుపరుస్తాడు. దేవుడు గనుక ఒక్కసారి ఈ ప్రయోజనాలను అందకుండా చేస్తే, అతడిక దేవుణ్ణి విడనాడతాడు. సాతాను చెడ్డ మనస్తత్వములో, మానవుని హృదయం నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండగలదని అది నమ్మదు. దాని దుష్ట మనస్తత్వము కారణం చేత, పరిశుద్దత అంటే ఏమిటో, అసలు భయభక్తులు అంటే ఏమిటో దానికి తెలియదు. దేవుని లోబడటమంటే ఏమిటో, లేక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమంటే ఏమిటో దానికి తెలీదు. ఈ సంగతులేవీ దానికి తెలియదు కాబట్టి, మానవుడు కూడా దేవుని పట్ల భయభక్తులు కనుపరచలేడని అది భావిస్తుంది. మరి, అపవాది దుష్టమైనదా, కాదా చెప్పండి? మన సంఘము తప్ప, వేరే మతాలు మరియు మత శాఖలు, లేక మతసంబంధమైన మరియు సామాజికమైన సముదాయాలేవీ, దేవుని అస్తిత్వము పట్ల విశ్వాసముంచవు, దేవుడు శరీరధారియై తీర్పు కార్యాన్ని జరిగిస్తున్నాడని వాళ్ళు అస్సలు నమ్మరు, కాబట్టి నీవు నమ్మేది అసలు దేవుడే కాదని వారు అనుకుంటారు. వ్యభిచారియైన ఒక మనిషి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ తన వంటి వ్యభిచారి లాగానే చూస్తాడు. మోసకారియైన మనిషి చుట్టూ మోసాన్ని అబద్దాలను మాత్రమే చూస్తాడు. ఒక దుష్టుడు ప్రతి ఒక్కరినీ దుష్టునిగానే చూస్తాడు మరియు కనపడిన ప్రతివారితో అతడు గొడవపడాలనుకుంటాడు. యదార్ధతను ప్రమాణముగా కలిగిన వారు అందరినీ యదార్ధతతోనే చూస్తారు, అందుకే వాళ్ళు ప్రతిసారీ మోసపుచ్చబడతారు, ప్రతిసారీ వంచించబడతారు, మరియు దాని గూర్చి వారేమీ చేయలేరు. మీ విశ్వాసాన్ని దృఢపరచడానికి నేను కొన్ని ఉదాహారణలను ఇస్తాను: అపవాది చెడ్డ స్వభావమనేది క్షణమాత్రపు బలత్కారమో లేక పరిస్థితులను బట్టి నిర్ధారించబడినదో కాదు, మరియు అదేమీ కారణమో లేక సందర్భానుసారమైన మూలకాల నుండి ఉద్భవించే స్వల్పకాలిక వ్త్యక్తీకరణో కాదు. ఖచ్చితంగా కాదు! అపవాది మాత్రం ఈ విధంగా ఉండటం తప్ప ఏమి చెయ్యలేదు! దాని వలన మంచి అనేదేమీ జరగదు. వినసొంపుగా అది ఏదైనా మీకు చెప్పిందంటే, అది కేవలం నిన్ను ఆకర్షించడానికే. దాని మాటలు ఎంత హాయిగా, ఎంత వ్యూహాత్మకంగా, మరియు ఎంత హుందాగా ఉంటాయో, ఈ మాటల వెనుక క్రూరమైన దురుద్దేశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు వాక్య భాగాల్లో అపవాది ఏరకమైన ముఖాన్ని, ఏ రకమైన మనస్తత్వాన్ని కనుపరిచింది? (మోసపూరితమైన, ద్వేషపూరితమైన మరియు దుష్టత్వము.) చెడుతనము అనేది అపవాది ప్రాథమిక లక్షణం; అన్నిటికంటే ఎక్కువగా, అపవాది దుష్టత్వం మరియు దుర్మార్గం కలిగినదై ఉన్నది.
అపవాది గురించిన మన చర్చను ఇప్పుడు ముగించుకుని, తిరిగి మనము మన దేవుని గురించి మాట్లాడుకుందాము. ఆరువేల సంవత్సరాల దేవుని నిర్వహణ ప్రణాళిక కాలములో, దేవుని ప్రత్యక్ష భాషణలో అతికొద్ది భాగము బైబిల్లో పొందుపరచబడింది, అది కూడా అతి సాధారణంగా లిఖించబడింది. కాబట్టి మన మొదట్లోనే ప్రారంభించుదాం. దేవుడు మానవుడిని సృజించి అది మొదలుకుని మానజాతి జీవితానికి మార్గనిర్దేశం చేశాడు. మానవజాతికి దీవెనలను అనుగ్రహించడంలో గానీ, మనుషుల కొరకు న్యాయవిధులను మరియు ఆజ్ఞలను రూపొందించడంలో గానీ, లేక జీవిత సంబంధమైన పలురకాలైన నియమాలను ఏర్పాటుచేయడంలో గానీ, వీటన్నిటిని చేయడంలో దేవుని ఉద్దేశిత లక్ష్యమేమిటో మీకు తెలుసా? మొట్టమొదటిగా, దేవుడు జరిగించే ప్రతిదీ మానవాళి మంచి కోసమే అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? చూడటానికి ఇవి గొప్పవైన, లోతైన మాటలని మీకు అనిపించవచ్చు, అయితే లోపలున్న వివరాలను పరిశీలించిన మీదట, దేవుడు చేసే ప్రతిదీ మానవుడు ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడము వైపుగా నడిపించడానికి మరియు నిర్దేశించడానికి ఉద్దేశించబడినది కాదా? మానవుడు ఆయన నియమాలకు నిబద్దమై ఉండేలా చేయడమో లేక ఆయన న్యాయవిధులను పాటించేలా చేయడములో, దేవుని ఉద్దేశ్యము మానవుడు అపవాది ఆరాధనలో పడకుండా మరియు అపవాది కీడు భారిన పడకుండా చేయడమై ఉన్నది; ఇది చాలా ప్రధానమైనది మరియు మొట్టమొదట్లో జరిగింది కూడా ఇదే. మొట్టమొదట్లో, మానవునికి దేవుని చిత్తమనేది అర్ధం కానప్పుడు, ఆలోచించదగిన ప్రతి విషయాన్ని సంరక్షించడానికి, దేవుడు కొన్ని సామాన్యమైన నియమ నిభందనలను రూపొందించాడు. ఇవి సామాన్యమైన నిబంధనలే అయినప్పటికీ, దేవుని చిత్తమనేది వీటిలోనే ఇమిడి ఉన్నది. దేవుడు మానవజాతిని విలువైనదిగా చూస్తాడు, ఆనందిస్తాడు మరియు అమితంగా ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన హృదయము పరిశుద్దమైనదని మనమేమైనా చెప్పగలమా? ఆయన మనస్సు నిర్మలమైనదని మనమేమైనా చెప్పగలమా? (అవును.) దేవునికి ఇంకా ఏవైనా వేరే ఉద్దేశాలు ఉన్నాయా? (లేవు.) అంటే ఆయన ఈ లక్ష్యము సరియైనది మరియు సానుకులమైనదేనా? దేవుడు కార్యము చేసే సమయంలో, ఆయన రూపొందించిన నిబంధనలన్నీ మానవుని మీద సానుకూల ప్రభావాన్ని కలుగజేసి, మానవునికి దారిని చూపించాయి. అంటే దేవుని మనస్సులో స్వార్ధపూరితమైన ఆలోచనలు ఏవైనా ఉన్నాయా? మానవునికి విలువ దొరికిన చోట దేవునికి అదనపు ఉద్దేశ్యాలు ఏమైనా ఉంటాయా? ఏదో విధంగా దేవుడు మానవుని వాడుకోవలనుకుంటున్నాడా? అస్సలు కాదు. దేవుడు తాను చెప్పినట్లే చేస్తాడు, ఆయన మాటలు మరియు క్రియలు తన మనస్సులోని తన తలంపులకు అనుగుణంగా ఉంటాయి. దురుద్దేశము, స్వార్ధపూరితమైన ఆలోచనలేవీ లేవు. ఆయన ఏదీ తన కోసం చేసుకోడు; ఆయన చేసే ప్రతిదీ, ఏ వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా, మానవుని కోసమే చేస్తాడు. ఆయన మానవుని మీద ఉంచవలసిన, ప్రణాళికలు మరియు ఉద్దేశ్యాలను తాను కలిగి ఉన్నప్పటికీ, అదేదీ ఆయన కోసం మాత్రం కాదు. ఆయన చేసే ప్రతిదీ పూర్తిగా మానవాళి కోసం, మనుష్యజతిని రక్షించడం కోసం, మానవజాతి నాశనానికి కొనిపోబడకుండా కాపాడటం కోసమే చేస్తాడు. కాబట్టి ఆయన మనస్సు అమూల్యమైనది కాదా? ఇంతటి అమూల్యమైన మనస్సులోని ఒక రవ్వంత ఆనవాలునైనా నీవు అపవాదిలో చూడగలవా? అపవాదిలో దీన్ని గుర్చిన అతిచిన్న జాడయైనా నీవు కనుగోనలేవు, దానిని నీవు అస్సలు చూడలేవు. దేవుడు చేసేదంతా స్వాభావికముగానే బయలుపరచబడుతుంది. ఇప్పుడు, మనము దేవుడు కార్యము జరిగించే విధానాన్ని చూద్దాము; ఆయన తన కార్యాన్ని ఎలా జరిగిస్తాడు? ఈ న్యాయవిధులను మరియు ఆయన మాటలను తలకట్టును బిగించే మంత్రములా[ఎ] దేవుడు ప్రతి వ్యక్తి తల చుట్టూ వాటిని గట్టిగా బిగించి, ప్రతి వ్యక్తిమీద వాటిని ఆపాదిస్తాడా? ఆయన ఈ విధంగా కార్యము జరిగిస్తాడా? (లేదు.) మరైతే దేవుడు తన కార్యాన్ని ఏ విధంగా జరిగిస్తాడు? ఆయన ఏమైనా బెదిరిస్తాడా? ఆయన మీతో మాట్లాడేటప్పుడు సత్యాన్ని చెప్పడా? (లేదు.) సత్యము నీకు అర్ధం కానప్పుడు, దేవుడు నీకెలా మార్గదర్శకం చేస్తాడు? ఆయన నీపై ఒక వెలుగును ప్రకాశింపజేసి, ఇది సత్యానికి అనుగుణంగా లేదని నీకు స్పష్టంగా తెలియజేసి, ఆపై నీవు ఏమి చేయాలో ఆయన మీతో మాట్లాడతాడు. దేవుడు కార్యము జరిగించే ఈ మార్గాలను బట్టి చూస్తే, దేవుని నీవు ఎటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నట్లు నీకు అనిపిస్తుంది? దేవుడు అందుకోలేనంత దూరంలో ఉన్నాడని నీవు అనుకుంటున్నావా? (లేదు.) మరైతే దేవుడు కార్యము జరిగించే ఈ మార్గాలను చూసినప్పుడు మీరు ఎలా భావిస్తారు? దేవుని మాటలు ప్రత్యేకించి వాస్తవమైనవి, మరియు మానవునితో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకించి సాధారణమైనది. దేవుడు నీకు ఊహించలేనంత సమీపముగా ఉన్నాడు; నీకు దేవునికి మధ్య ఎటువంటి దూరం లేదు. దేవుడు నిన్ను నడిపించేటప్పుడు, ఆయన నీకు సమకూర్చి, నీకు సహాయపడి నిన్ను ప్రోత్సహించినప్పుడు, నీవు దేవుడు ఎంతటి స్నేహశీలియైనవాడో అని, ఆయన కలుగజేసే భక్తిభావనను అనుభూతి చెందుతావు; ఆయన మనోహరతను నీవు ఆస్వాదిస్తూ, ఆయన ఆత్మీయతను నీవు అనుభవిస్తావు. అయితే దుర్నీతిని బట్టి దేవుడు నిన్ను నిందించినప్పుడు, తనకు విరోధముగా తిరుగుబాటు చేసినదానిని బట్టి ఆయన తీర్పు తీర్చి క్రమశిక్షణలో పెట్టినప్పుడు, ఆయన ఏ విధానాన్ని అవలంభిస్తాడు? ఆయన వాక్యాలను ఉపయోగించి నీపై నింద మోపుతాడా? ఆయన నీ పరిస్థితుల ద్వారా మరియు ప్రజలు, వ్యవహారాలు, మరియు పనుల ద్వారా నిన్ను క్రమశిక్షణలు పెడతాడా? (అవును.) ఎంతమేరకు దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడతాడు? అపవాది మనిషికి హాని తలపెట్టే స్థాయిలో దేవుడు మానవుని క్రమశిక్షణలో పెడతాడా? (లేదు, మానవుడు తట్టుకోగలిగిన మేరకు మాత్రమే దేవుడు మానవుడిని క్రమశిక్షణకు గురిచేస్తాడు.) దేవుడు హుందాగా, సున్నితమైన, ప్రేమ మరియు సంరక్షణ విధానంలో, అద్బుతమైన ఎంచబడిన నిర్దిష్టమైన రీతిలో కార్యము చేస్తాడు. ఆయన విధానము నీలో ఉన్న “దేవుడు నన్ను దీనిని చేయనిచ్చి తీరాలి” లేక “దేవుడు నన్ని దానిని చేయనివ్వల్సిందే” వంటి బలమైన ఉద్రేకాలను రెచ్చగొట్టదు. దేవుడు అటువంటి మానసికమైన లేక భావావేశ పూరితమైన ఉద్రిక్తతను నీకు ఎప్పుడూ ఇవ్వడు అది పరిస్థితులను భరించలేనివిగా చేస్తుంది. అది నిజం కాదా? తీర్పు మరియు దండనకు సంబంధించిన దేవుని మాటలను నీవు అంగీకరించినప్పటికీ, అప్పుడు నీకెలా అనిపిస్తుంది? దేవుని అధికారాన్ని మరియు శక్తిని గ్రహించినప్పుడు, నీకెలా అనిపించింది? దేవుడు దైవత్వము గలవాడని పరిశుద్దుడని నీవు భావిస్తున్నావా? ఈ సమయాల్లో నీకు మరియు దేవునికి మధ్య దూరము ఉన్నట్లు నీకేమైనా అనిపిస్తుందా? దేవుడంటే భయపడుతున్నావా? లేదు— కానీ, దేవుని పట్ల నీవు భయభక్తులను కలిగి ఉన్నావు. వీటన్నిటినీ ప్రజలు అనుభూతి చెందుతున్నది దేవుని కార్యము కారణము చేత కాదా? ఒకవేళ పని చేస్తున్నది అపవాది అయ్యుంటే వారికీ ఈ భావనలు కలిగేవా? కచ్చితంగా కలుగవు. మానవునికి నిత్యము సమకూర్చి, మానవుని బలపరచడానికి దేవుడు తన మాటలను, తన సత్యాన్ని, మరియు తన జీవాన్ని ఉపయోగిస్తాడు. మానవుడు బలహీనుడై, మనిషి క్రుంగిపోయిన భావనతో ఉన్నప్పుడు, దేవుడు నిర్మొహమాటంగా: “దిగులుపడకు. క్రుంగిపోయేంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు నీవు బలహీనంగా ఉన్నావు? బలహీనపడటానికి కారణం ఏమై ఉంటుంది? నీవు ఎప్పుడూ బలహీనంగానే ఉంటావు, మరియు నీవు ఎల్లప్పుడూ ప్రతికూలంగానే ఉంటావు! నువ్వు బ్రతికుండటం వలన ప్రయోజనం ఏమిటి? ఇక చనిపోయి దీనిని ముగించు!” అని దేవుడు కఠినంగా మాట్లాడడు. దేవుడు ఈ విధంగా కార్యము చేస్తాడా? (లేదు.) ఈ రకంగా వ్యవహరించడానికి దేవునికి అధికారం ఉన్నదా? అవును, ఆయన కలిగి ఉన్నాడు. అయినప్పటికీ, దేవుడు ఈ విధంగా వ్యవహరించడు. దేవుడు ఈ విధంగా వ్యవహరించకపోడానికి ఆయన గుణము మరియు దేవుని పరిశుద్దతా లక్షణము కారణమై ఉన్నది. మనిషి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, మానవుని యెడల ఆయన చూపించే విలువ మరియు ఆప్యాయత కేవలం ఒకటి లేక రెండు వాక్యాల్లో తేటగా తెలియజేయగలిగేవి కాదు. ఇది మానవుని గొప్పతనం వలన వచ్చేది కాదు కానీ నిజమైన అభ్యాసం ద్వారా దేవుడు బయటికి తెచ్చేది; అది దేవుని స్వభావపు ఆవిష్కరణ. దేవుడు కార్యాలను జరిగించే ఈ దారులన్నింటి ద్వారా మానవుడు దేవుని పరిశుద్దతను చూడగలడా? దేవుడు కార్యాన్ని జరిగించే ఈ దారులన్నింటిలో, దేవుని మంచి ఉద్దేశాలతో కలిపి, దేవుడు మానవుని కొరకు కార్యాన్ని జరిగించాలనుకుంటున్న వాటి ప్రభావాలతో సహా, మానవుని కొరకు కార్యం జరిగించడానికి దేవుడు అనుసరిస్తున్న పలు మార్గాలు, ఆయన చేసే కార్యాన్ని, మానవుడు ఏమి గ్రహించాడు-నీవు దేవుని సదుద్దేశాలలో ఏదైనా చెడు లేదా మోసాన్ని చూశావా? (లేదు.) అంటే దేవుడు చేసే ప్రతిదానిలో, దేవుడు చెప్పే ప్రతి విషయంలో, ఆయన తన హృదయంలో ఆలోచించే ప్రతి విషయంలో, అలాగే ఆయన బయలు పరచే దేవుని గుణము అంతటిని బట్టి-మనం దేవుణ్ణి పరిశుద్దుడని పిలువగలమా? (అవును.) ఈ లోకంలో, లేదా తనలో ఈ పరిశుద్దతను ఏ మానవుడైనా ఎప్పుడైనా చూశాడా? దేవునిలో తప్ప, నువ్వెప్పుడైనా ఏ మనిషిలోనైనా లేదా అపవాదిలోనైనా చూశావా? (లేదు.) ఇంతవరకు మన సంభాషణల ఆధారంగా, మనం దేవుణ్ణి అద్వితీయుడు, పరిశుద్ధ దేవుడని పిలువచ్చా? (అవును.) దేవుడు మనిషికి ఇచ్చినవన్నీ, దేవుని వాక్కులతో సహా, దేవుడు మానవుని కొరకు పలుమార్గాల్లో జరిగించే కార్యాలను బట్టి, దేవుడు మానవునికి ఏమి చెప్పాడో, దేవుడు మానవునికి ఏమి గుర్తుచేస్తున్నాడో, ఆయన ఏమి ఉపదేశించాడో మరియు ప్రోత్సాహపరిచాడో-అవన్నీ ఒకే గుణము నుండి ఆవిర్భవించాయి: అదే దేవుని పరిశుద్దతయై ఉన్నది. అలాంటి పరిశుద్దుడైన దేవుడు లేకపోతే, ఆయన జరిగించే కార్యాన్ని చేయడానికి ఏ మనిషి కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేయలేడు. దేవుడు ఈ మానవులను పూర్తిగా అపవాదికు అప్పగించి ఉండుంటే, ఈనాడు మీరంతా ఎటువంటి స్థితిలో ఉండేవారో మీరెప్పుడైనా యోచించారా? మీరంతా ఇక్కడ కూర్చొని, పూర్తిగా బాధలేకుండా ఉంటారా? మీరు కూడా, “భూమి మీద అటు ఇటు తిరుగుతూ, మరియు దానిలో సంచరిస్తున్నాను”అని చెప్తారా? మీరు సిగ్గు లేకుండా దేవుని ఎదుట అటువంటి మాటలు మాట్లాడడానికి ధైర్యం చేసి, డంబంతో నిండిపోయి ప్రగల్భాలు పలుకుతారా? మీరు కొంచెం కూడా సందేహించకుండా, ఖచ్చితంగా పలుకుతారు! మానవుని పట్ల అపవాది తీరు, అపవాది వైఖరిని మరియు లక్షణాన్ని దేవునికి పూర్తిగా భిన్నంగా మానవుడు చూసేలా చేస్తుంది. దేవుని పరిశుద్దతకు వ్యతిరేకమైన అపవాది గుణము ఏపాటిది? (అపవాది చెడుతనం.) అపవాది చెడ్డ స్వభావం దేవుని పరిశుద్దతకు వ్యతిరేకమైనది. ఎక్కువమంది ప్రజలు దేవుని ఈ ప్రత్యక్షతను మరియు దేవుని పరిశుద్దతకు సంబంధించిన లక్షణాన్ని గుర్తించకపోవడానికి వారు అపవాది ఆధీనంలో, అపవాది దుర్నీతిలో మరియు అపవాది నివాస ఆవరణలో జీవిస్తుండడమే కారణమై ఉన్నది. పరిశుద్దత అంటే ఏమిటో, లేక పరిశుద్దతను ఎలా నిర్వచిస్తారో వారికి తెలియదు. నీవు దేవుని పరిశుద్దతను గ్రహించినా కూడా, నీవు దాన్ని దేవుని పరిశుద్దత అని ఖచ్చితంగా నిర్వచించలేరు. ఇది దేవుని పరిశుద్దత పట్ల మానవుడు కలిగి ఉన్న అవగాహనలోని వ్యత్యాసమై ఉన్నది.
మానవునిపై అపవాది జరిగించే కార్యాన్ని వర్ణించేది ఏమిటి? మీరు దీనిని మీ సొంత అనుభవాల ద్వారా నేర్చుకోగలగాలి—ఇదే అపవాది మూలరూపాత్మకమైన ప్రత్యేకత అంటే, అది మాటిమాటికి చేసే పనిని, ప్రతి ఒక్క వ్యక్తితో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బహుశా మీరు ఈ ప్రత్యేకతను చూడలేరు, కాబట్టి మీరు అపవాది ఎంతో భయంకరమైనదని మరియు దుర్మార్గమైనదని అనుకోరు. ఈ ప్రత్యేకత ఏంటో ఏ ఒక్కరికైనా తెలుసా? (ఇది మానవుణ్ణి ప్రలోభానికి గురి చేస్తుంది ఆకర్షిస్తుంది మరియు శోధిస్తుంది.) అది నిజం; ఇవి ఈ ప్రత్యేకతను వెల్లడించే పలు మార్గాలై ఉన్నాయి. అపవాది మానవుణ్ణి భ్రమపరచి, దాడి చేయడంతో పాటు నేరారోపణ కూడా చేస్తుంది-ఇవన్నీ దాని సాక్షాత్కారాలుగా ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా? (ఇది అబద్ధాలు చెప్తుంది.) మోసగించడం మరియు అబద్ధమాడడం అపవాదికి ఎంతో స్వాభావికంగానే వచ్చేవి. తరచుగా అది ఈ పనులు చేస్తుంది. ప్రజలను ప్రోత్సహపరచడం, వారిని ప్రేరేపించడం, వారిని పనులు చేయడానికి బలవంతం చేయడం, వారి గురించి ఆదేశించడం మరియు వారిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. నేనిప్పుడు మీ రోమాలు నిక్కబోడుచునే ఒక సంగతిని మీకు వర్ణిస్తాను, అయితే మిమ్మల్ని భయపెట్టడానికి నేనిది చేయట్లేదు. దేవుడు తన దృక్పథం మరియు తన మనస్సు రెండిటిలో మానవుని పట్ల కార్యము చేస్తాడు మరియు మానవుని బట్టి ఆనందిస్తాడు. మరోవైపు చూస్తే, అపవాది, మానవుణ్ణి అసలు ప్రేమించదు, అది ఎప్పుడూ మానవునికి ఎలా హాని తలపెట్టాలని ఆలోచించడానికే సమయం మొత్తాన్ని కేటాయిస్తుంది. ఇది నిజం కాదా? మానవునికి కీడు తలపెట్టాలని అది అనుకుంటున్నప్పుడు, దాని మనస్సంతా తొందరపాటుతో ఉంటుందా? (అవును.) అయితే, మానవుని పట్ల అపవాది చేసే పనికి సంబంధించినట్టుగా, నా వద్ద క్రూరమైన మరియు దుర్మార్గమైన అపవాది స్వభావాన్ని విఫులంగా వర్ణించే రెండు వాక్యాలున్నాయి, అవి అపవాది కలిగియున్న విద్వేషాన్ని గ్రహించడానికి మీకు నిజంగా వీలును కల్పిస్తాయి: మానవునితో అపవాది వ్యవహరించే విధానంలో, అది మానవునిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి మానవునికి ఘోరమైన కీడు తలపెట్టేంత మేరకు, ఎప్పుడూ అది ప్రతి ఒక్కరినీ బలవంతంగా వశపరచుకుని అదుపులోనికి తెచ్చుకోవాలని అనుకుంటుంది, తద్వారా అది తన లక్ష్యాన్ని సాధించి విశృంఖలమైన తన ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతుంది. “బలవంతముగా వశపరచుకోవడం” అంటే అర్ధం ఏమిటి? ఇది నీ అంగీకారముతో జరిగేదా, లేక అంగీకారము లేకుండా జరిగేదా? ఇది నీకు తెలిసే జరుగుతుందా, లేక నీకు తెలియకుండా జరుగుతుందా? జవాబు ఏమిటంటే ఇది పూర్తిగా నీకు తెలియకుండానే జరుగుతుంది! నీకేమి తెలియని పరిస్థితుల్లో, బహుశా నీకేమి చెప్పకుండానో లేక నీవేమీ చెయ్యకుండానో, వాక్యాధారం లేకుండా, అసదర్భంగా అది జరుగుతుందంటే—అక్కడ అపవాది ఉండి, నీ చుట్టూ తిరుగుతూ, నిన్ను ముట్టిందని భావమై ఉన్నది. అది నిన్ను దోచుకుని, ఆపై నిన్ను బలవంతంగా వశపరచుకుని, నిన్ను హస్తగతం చేసుకుని, నిన్ను పూర్తిగా అదుపులోనికి తెచ్చుకుని నీపై కీడును కలుగజేయాలన్న దాని లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఇది మానవజాతిని దేవుని నుండి దూరంగా లాక్కెళ్ళడానికి ప్రయాసపడుతున్న అపవాది యొక్క అత్యంత స్వాభావికమైన భావన మరియు మనస్తత్వమై ఉన్నది. మీరు దీనిని విన్నప్పుడు మీకెలా అనిపించింది? (మా హృదయాల్లో భీతి భయం కలిగింది.) మీకు అసహ్యం కలుగుతుందా? (అవును.) మీకు అసహ్యమని అనిపించినట్టు అపవాది సిగ్గుమాలినదని మీరు అనుకుంటున్నారా? అపవాది సిగ్గుమాలినదిగా మీకు అనిపించినప్పుడు, మరి ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్నే నిలువరించాలని అనుకునే ప్రజలు, పరువు ప్రతిష్టలనే ఘోరమైన ఆశయాలుగా గలవారు మీకు అసహ్యముగా అనిపిస్తున్నారా? (అవును.) మరైతే మానవుని బలవంతముగా పట్టుకుని వశపరచుకోడానికి అపవాది ఎలాంటి విధానాలను అవలంభిస్తుంది? దీన్ని గురించి మీరు స్పష్టత కలిగి ఉన్నారా? మీరు“బలవంతంగా వశపరచుకోవడం”మరియు “స్వాధీనపరచుకోవడం” అనే ఈ రెండు మాటలను విన్నప్పుడు మీకు విరక్తి కలుగుతుంది మరియు మీరు ఈ మాటలను గూర్చి చెడును గ్రహించవచ్చు. నీ అంగీకారం లేకుండానే లేదా నీకు తెలియకుండానే, అపవాది నిన్ను స్వాధీనపరచుకుంటాడు, బలవంతంగా నిన్ను వశపరచుకుంటాడు మరియు నిన్ను చెడగొడతాడు. నీ హృదయంలో నీవు దీన్ని రుచి చూశావా? నీకు విరక్తిగా మరియు వెగటుగా అనిపిస్తుందా? (అవును.) నీకు అపవాది యొక్క ఈ దారుల పట్ల ఈ విరక్తిగా మరియు వెగటుగా అనిపించినప్పుడు, నీవు దేవుని పట్ల ఎటువంటి భావనను కలిగి ఉంటావు? (కృతజ్ఞత.) నిన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు, ఈ క్షణంలో, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని మరియు నిన్ను నువ్వు దేవునికి వశపరచుకొని, అధికారం చేయనివ్వడానికి నీవు ఇష్టాన్ని లేదా కోరికను కలిగి ఉన్నావా? (అవును.) నీవు ఏ సందర్భంలో ఈవిధంగా జవాబిస్తావు? అపవాది నిన్ను బలవంతంగా వశపరచుకుని స్వాధీనపరుచుకుంటదన్న భయంతో “అవును” అని చెప్తున్నావా? (అవును.) ఈ విధమైన మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండకూడదు; అది సరైనది కాదు. భయపడవద్దు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. భయపడటానికి అక్కడ ఏమీ లేదు. ఒక్కసారి నీవు అపవాది చెడ్డ గుణాన్ని తెలుసుకున్న తరువాత, మానవుని పట్ల దేవునికున్న ప్రేమ, దేవునికున్న సదుద్దేశాలు, దేవునికున్న కనికరము మరియు ఓర్పు మరియు ఆయన నీతి స్వభావము గూర్చి నీకు మరింత నిర్దిష్టమైన ఒక అవగహన మరియు లోతైన ఆప్యాయతను కలిగి ఉండాలి. అపవాది ఎంతో విద్వేషపూరితమైనది, అయినప్పటికీ ఒకవేళ దేవుని పట్ల నీకున్న ప్రేమను మరియు దేవునిపై నీకున్న నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఇది ప్రభావితం చేయకపోతే, అసలు నీవు ఎటువంటి మనిషివి? అపవాది నీకు అలా హాని తలపెట్టనివ్వడాన్ని నీవు ఇష్టపడుతున్నావా? అపవాది చెడుతనము మరియు వికృతతత్వాన్ని చూసిన తరువాత, మనము వెనుకకు తిరిగి అప్పుడు దేవుణ్ణి చూద్దాము. దేవునికి సంబంధించి నీకున్న జ్ఞానంలో ఏదైనా మార్పు సంభవించిందా? దేవుడు పరిశుద్దుడని మనము చెప్పగలమా? దేవుడు నిష్కళంకుడని మనము చెప్పగలమా? “దేవుడు అద్వితీయుడైన పరిశుద్ధుడు”—దేవుడు ఈ స్థాయికి తగినట్టు జీవించగలడా? (అవును.) మరైతే లోకము మరియు అందులోని విషయాలన్నిటిలో, దేవుని గూర్చి మానవునికి ఉన్న జ్ఞానానికి తగినట్టు జీవించగలిగేది స్వయంగా దేవుడు మాత్రమేనా? మరెవరైనా ఉన్నారా? (లేరు.) అయితే దేవుడు మానవునికి ఖచ్చితంగా ఇచ్చేది ఏమిటి? నీకు కూడా అవగాహన లేనంత కొద్దిపాటి సంరక్షణ, శ్రద్ద, మరియు పట్టింపును ఆయన నీకు ఇస్తాడా? దేవుడు మానవునికి ఇచ్చినది ఏమిటి? మానవునికి దేవుడు జీవాన్నిచ్చాడు, సమస్తాన్ని మానవునికి ఇచ్చి, మరియు బదులుగా దేనినీ ఆశించకుండా, ఎలాంటి రహస్య ప్రయోజనము లేకుండా బేషరతుగా ఇదంతా మానవునికి అనుగ్రహించాడు. ఆయన సత్యాన్ని, తన మాటలను, మరియు తన జీవాన్ని ఉపయోగించి మనిషిని మార్గనిర్దేశం చేసి నడిపిస్తాడు, అపవాది కీడు నుండి, మరియు అపవాది శోధనలు మరియు ప్రేరేపణల నుండి మానవుడిని దూరపరుస్థాడు, అపవాది దుష్ట స్వభావాన్ని మరియు వికృత ముఖాన్ని స్పష్టంగా చూడటానికి మానవునికి వీలు కల్పిస్తాడు. మానవాళి పట్ల దేవునికున్న ప్రేమ శ్రద్దలు నిజమైనవేనా? ఇది మీలో ప్రతి ఒక్కరూ అనుభవించదగినదేనా? (అవును.)
మీ విశ్వాస జీవితపు సంవత్సరాలన్నిటిలో, దేవుడు నీ పట్ల చేసిన కార్యమంతటినీ, ఇప్పటివరకు ఉన్న మీ జీవితాలను వెనుకకు తిరిగి చూసుకోండి. నిన్ను పురికొల్పే ఈ భావనలు లోతుగానో లేక పైపైనో ఉన్నప్పటికీ, నీ సమస్తానికి సంబంధించినంత వరకు ఇది ఎంతో అవసరమైన విషయము కాదా? ఇది నీవు పొందుకోడానికి చాలా అవసరమైనది కాదా? (అవును.) ఇది వాస్తవం కాదా? ఇది జీవితము కాదా? (అవును.) నీపై దేవుడు ఎప్పుడైనా వెలిగింపును కలిగించి, అప్పుడు దేవుడు నీకిచ్చిన సమస్తానికి ప్రతిఫలంగా తనకు ఇమ్మని నిన్నేమైనా అడిగాడా? (లేదు.) మరైతే దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు? నిన్ను వశపరచుకోవాలన్న ఉద్దేశ్యం దేవునికి ఉన్నదా? (లేదు.) మానవుని హృదయంలో ఉన్న తన సింహాసనాన్ని దేవుడు ఎక్కాలనుకుంటున్నాడా? (అవును.) మరైతే దేవుడు సింహాసనాశీనుడు కావడానికి మరియు సాతాను బలవంతంగా వశపరచుకోడానికి మధ్య గల వ్యత్యాసము ఏమిటి? దేవుడు మానవుని హృదయాన్ని సంపాదించి, ఆయన మానవుని హృదయాన్ని వశపరచుకోవాలనుకుంటున్నాడు—దీని భావము ఏమిటి? అంటే దీనర్ధం మానవులు కీలుబొమ్మలుగా, యంత్రాలుగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడా? (లేదు.) మరైతే దేవుని ఉద్దేశ్యం ఏమిటి? దేవుడు మానవుని హృదయాన్ని వశపరచుకోవాలని ఆశించడానికి మరియు సాతాను బలవంతంగా ఆక్రమించుకోడానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉన్నదా? (ఉన్నది.) ఏమిటి ఆ వ్యత్యాసం? నాకు కాస్త స్పష్టంగా చెప్పగలరా? (సాతాను దేన్నీ బలవంతంగా చేస్తే దేవుడు మాత్రం మానవునికి స్వేచ్చనిస్తాడు.) ఇదేనా ఆ వ్యత్యాసము? నీ హృదయము వలన దేవునికి కలిగే ప్రయోజనము ఏమిటి? నిన్ను సంపాదించడం వలన దేవునికి వచ్చే లాభం ఏమిటి? మీ హృదయాల్లో “దేవుడు మానవుని హృదయాన్ని వశపరచుకున్నాడు” అన్న దానిని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు? మనమిక్కడ దేవుని గురించి ఎలా మాట్లాడాలన్న దానిపట్ల సముచితంగా వ్యవహరించాలి, లేకపోతే ప్రజలు ఎల్లప్పుడూ, “దేవుడు నన్ను ఎప్పుడూ వశపరచుకోవాలనే చూస్తున్నాడు. దేనికోసం ఆయన నన్ను వశపరచుకోవాలనుకుంటున్నాడు? వశమవ్వడం నాకు ఇష్టం లేదు, నాకు నేనే యజమానునిగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజలను వశపరచుకునేది అపవాది అని మీరు చెప్తున్నారు, కానీ దేవుడు కూడా ప్రజలను వశపరచుకుంటాడు. ఎ విధంగా చూసినా ఇది ఒకేలా లేదా? ఎవరినీ నన్ను వశపరచుకొనివ్వకూడదు అని అనుకుంటున్నాను. నేను నేనుగానే ఉంటాను!” అని అపార్ధం చేసుకుంటారు. ఇక్కడున్న వ్యత్యాసం ఏమిటి? కాస్త ఆలోచించి చూడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నది, “దేవుడు మానవుని వశపరచుకుంటాడు” అన్నది ఒక నిష్ప్రయోజనమైన వాక్యమేనా? దేవుడు మానవుని వశపరచుకోవడమంటే ఆయన నీ హృదయంలో నివసిస్తూ, నీ ప్రతి మాటను మరియు ప్రతి కదలికను అదుపు చేస్తాడన్నది భావమా? ఒకవేళ ఆయన నిన్ను కూర్చోమని చెప్తే, నిలబడే ధైర్యం నీకున్నదా? ఒకవేళ ఆయన నిన్ను తూర్పుకు వెళ్ళమంటే, పడమరకు పోయే ధైర్యం నీకుందా? “వశపరచుకువడం” అనేది ఈ విధానాలలో దేనినైనా సూచిస్తుందా? (లేదు, ఏది సూచించడం లేదు. దేవుడు ఏమైయున్నాడు మరియు ఏమి కలిగి ఉన్నాడన్న దానిని బట్టే మానవుడు బ్రతకాలని దేవుడు అనుకుంటాడు.) ఇన్ని సంవత్సరాలుగా దేవుడు మానవుని నిలబెట్టాడు, ఈ అంతిమ దశలో ఇప్పటివరకు మానవుని మీద ఆయన జరిగించిన కార్యములో, మానవుని మీద ఆయన పలికిన మాటలన్నిటి యొక్క ఉద్దేశిత ప్రభావం ఏమై ఉన్నది? దేవుడు ఏమైయున్నాడు మరియు ఏమి కలిగి ఉన్నాడన్న దాన్ని బట్టి మానవుడు బ్రతుకుతున్నాడా? “దేవుడు మానవుని వశపరచుకుంటాడు” అన్నదానికి అక్షరార్ధాన్ని గనుక పరిశీలిస్తే, దేవుడు మానవుని హృదయాన్ని తీసుకుని దాన్ని ఆక్రమించి, అందులో నివసిస్తున్నట్లు, అందులోనుండి తిరిగి బయటకు రాలేడన్నట్టుగా అర్థం వస్తుంది; మానవుని హృదయానికి దేవుడే యజమానుడై, ఇష్టమొచ్చినట్లు మానవుని హృదయాన్ని ఏలుతూ మార్చగలడు, తద్వారా దేవుడు చెప్పిన ప్రతిదాన్ని మానవుడు ఖచ్చితంగా చేసి తీరాలి అన్నట్లు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే, ప్రతి వ్యక్తి దేవునిగా మారి ఆయన గుణగణాన్ని మరియు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు అన్నట్లుగా కనడుతుంది. అలా అయితే మరి, మానవుడు కూడా దేవుని క్రియలను జరిగించగలడా? “వశపరచుకోవడం” అనే దానిని ఇలా వివరించవచ్చా? (లేదు.) అయితే మరి ఇదేమిటి? నేను మిమ్మల్ని ఇది అడగాలి: దేవుడు మానవునికి అనుగ్రహించే మాటలు మరియు సత్యమంతా దేవుని గుణము మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు ఏమై ఉన్నాడన్న దానిని గుర్చిన ఒక ప్రత్యక్షతయై ఉన్నదా? (అవును.) కచ్చితంగా ఇది నిజమే. అయితే దేవుడు మనిషికి అనుగ్రహించే మాటలన్నింటినీ ఆయన స్వయంగా కలిగిఉండటం మరియు పాటించడమనేది అంత ప్రాముఖ్యమా? దీని గురించి కాస్త ఆలోచించండి. దేవుడు మానవుని తీర్పు తీరుస్తున్నాడంటే, ఎందుకు తీర్పు తీరుస్తాడు? అసలు ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయి? దేవుడు మానవునికి తీర్పు తీర్చేటప్పుడు ఆయన పలికే ఈ మాటల్లోని తాత్పర్యం ఏమై ఉంటుంది? అవి దేని మీద ఆధారితమై ఉంటాయి? అవేమైనా మానవుని చెడు స్వభావము మీద ఆధారపడి ఉంటాయా? (అవును.) అంటే మానవునిపై దేవుడు తీర్చిన తీర్పు బట్టి కలిగిన ఫలితము దేవుని గుణము మీద ఆధారితమై ఉంటుందా? (అవును.) మరైతే దేవుడు చెప్పిన “మానవుని ఆధీనత” అనేది నిష్ప్రయోజనమైన మాటేనా? ఖచ్చితంగా కాదు. మరైతే దేవుడు ఈ మాటలను మానవునికి ఎందుకు చెప్పాడు? ఈ మాటలను చెప్పడంలో ఆయనకున్న ఉద్దేశ్యం ఏమిటి? ఈ మాటలు మానవునికి జీవముగా పనిచేయాలని ఆయన అనుకుంటున్నాడా? (అవును.) దేవుడు పలికిన ఈ మాటల్లోని సత్యమంతా మనిషికి జీవము లాగా పనిచేయడానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాడు. మానవుడు ఈ సత్యమంతటినీ మరియు దేవుని వాక్యమంతటినీ తీసుకొని వాటిని తన జీవముగా మార్చుకుంటే, అప్పుడు మానవుడు దేవునికి లోబడగలడా? ఇక మానవుడు దేవునికి భయపడతాడా? ఇక మానవుడు చెడుతనమును విసర్జిస్తాడా? మానవుడు ఈ స్థాయికి చేరుకున్నాక, ఇక అతడు దేవుని సర్వాధికారానికి మరియు దేవుని ఏర్పాటుకు లోబడతాడా? అప్పుడు మానవుడు దేవుని అధికారానికి లోబడే స్థితిలో ఉంటాడా? యోబుకు లాగానో, లేక పేతురుకులాగానో ప్రజలు తమ మార్గపు ముగింపుకు చేరుకున్నప్పుడు, వారి జీవితము పరిణితి చెందినట్లు పరిగణించబడినప్పుడు, దేవుని గూర్చి వారు ఒక వాస్తవికమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడు—అప్పుడు కూడా అపవాది వారిని దూరంగా నడిపించగలడా? అప్పుడు కూడా అపవాది వారిని స్వాధీనపరచుకోగలడా? అపవాది ఇప్పటికీ వారిని బలవంతముగా స్వాధీన పరుచుకోగలడా? (లేదు.) మరైతే ఇది ఎలాంటి వ్యక్తిత్వమై ఉన్నది? ఒకరు సంపూర్ణంగా దేవుని చేత సంపాదించబడటం అంటే ఇదేనా? (అవును.) ఈ స్థాయిలో అర్ధం చేసుకున్నాక, దేవుని చేత సంపూర్ణముగా సంపాదించబడిన ఈ విధమైన వ్యక్తిత్వాన్ని మీరు ఎలా చూస్తారు? దేవుని దృష్టి నుండి చూస్తే, ఇటువంటి సందర్భాల్లో, ఆయన ఈ వ్యక్తి హృదయాన్ని ఇదివరికే స్వాధీనపరచుకున్నాడు. అయితే ఈ వ్యక్తి ఏమనుకుంటాడు? దేవుని వాక్యము, దేవుని అధికారం మరియు, దేవుని మార్గములు మానవునిలో జీవముగా మారి, ఆపై ఈ జీవము చేత మానవుని ఉనికినే మొత్తంగా వశపరచుకుని, అతడు బ్రతికే విషయాలు అలాగే అతని గుణములతో దేవుణ్ణి తృప్తిపరిచేలా చేయడానికి సరిపోతుందా? దేవుని దృష్టి నుండి చూస్తే, ఈ క్షణంలో మానవజాతి హృదయాన్ని ఆయన వశపరచుకున్నాడా? (అవును.) ఈ స్థాయి భావాన్ని మీరిప్పుడు ఎలా గ్రహించారు? నిన్ను వశపరచుకునేది దేవుని ఆత్మయేనా? (కాదు, మనల్ని వశపరచుకునేది దేవుని వాక్యమై ఉన్నది.) నీ జీవముగా మారింది దేవుని మార్గము మరియు దేవుని వాక్యమైతే, నీ జీవితముగా మారింది మాత్రం సత్యమై ఉన్నది. ఈ సమయంలో, ఇక దేవుని నుండి వచ్చిన జీవాన్ని మనిషి కలిగి ఉంటాడే, కానీ ఈ జీవము దేవుని జీవమని మాత్రము మనం చెప్పలేము. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యము నుండి మనిషి పొందాలని నిశ్చయమైన జీవము, దేవుని జీవమని మనము చెప్పలేము. మానవుడు ఎంత కాలంపాటు దేవుణ్ణి వెంబడించినా, దేవుని వద్దనుండి మానవుడు ఎన్ని మాటలను పొందుకున్నా, మానవుడు ఎన్నటికీ దేవుడు అవ్వలేడు. అలాగే ఒకానొక దినాన దేవుడు, “నేను నీ హృదయాన్ని వశపరచుకున్నాను, ఇప్పుడు నీవు నా జీవాన్ని కలిగి ఉన్నావు,” అని చెప్తే, అప్పుడు నిన్ను నీవు దేవునిగా భావిస్తావా? (లేదు.) అలాంటప్పుడు నీవు ఏ విధంగా మారినట్టు? దేవుని పట్ల నీవు సంపూర్ణ విధేయత కలిగి ఉండవా? నీ హృదయము దేవుడు నీకు అనుగ్రహించిన జీవముతో నిండియుండలేదా? మానవుని హృదయాన్ని దేవుడు వశపరచుకున్నప్పుడు ఏమవుతుంది అన్నదానికి ఇది అత్యంత సాధారణ సాక్షాత్కారమై ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి ఈ దృష్టికోణం నుండి చూస్తుంటే, మానవుడు దేవునిగా మారగలడా? దేవుని మాటల వాస్తవికతను బట్టి మానవుడు జీవించగలిగి, దేవుని యెడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే వ్యక్తిగా మారగలిగినప్పుడు, మరి మానవుడు దేవుని జీవపు లక్షణాన్ని మరియు పరిశుద్దతను కలిగి ఉండగలడా? కచ్చితంగా లేదు. ఏమి జరిగినా సరే, చెప్పినవన్నీ అయిపోయినా మానవుడు మానవునిగానే ఉంటాడు. నీవు సృష్టిలోని ఒక జీవరాశివి; దేవుని వద్దనుండి వచ్చిన దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించి, దేవుని మార్గాన్ని పొందుకున్నప్పుడు, నీవు దేవుని మాల నుండి వచ్చిన జీవాన్ని మాత్రమే కలిగి, నేవు దేవుని చేత కొనియాడబడే వ్యక్తిగా మారతావు, కానీ నీవు దేవుని జీవపు లక్షణాన్ని, దేవుని పరిశుద్దతను మాత్రం ఎన్నటికీ కలిగి ఉండలేవు.
మనమిప్పుడు మాట్లాడుకున్న అంశానికి మనము తిరిగి వద్దాము. ఈ చర్చ జరిగేటప్పుడు, నేను మిమ్మల్ని అబ్రహాము పరిశుద్దుడా అని ఒక ప్రశ్నను అడిగాను. యోబు పరిశుద్దుడా? (కాదు.) ఈ “పరిశుద్దత” అనేది మానవునికి ఎంతగానో కొదువైయున్న, దేవుని లక్షణాన్ని మరియు స్వభావాన్ని కనుపరుస్తుంది. మానవుడు దేవుని లక్షణమును లేక దేవుని స్వభావమును కలిగి లేడు. మనిషి దేవుని వాక్కులన్నిటినీ అనుభవించి, వాటి వాస్తవికత చేత సంసిద్దుడైనప్పటికి కూడా, మానవుడు దేవుని పరిశుద్ద లక్షణాన్ని మరెన్నడూ కలిగి ఉండలేదు; మనిషి మనిషిగానే ఉంటాడు. మీకు అర్ధమవుతుంది, కదా? అయితే “దేవుడు మానవుని హృదయాన్ని వశపరచుకున్నాడు” అనే వాక్యము గురంచి మీరిప్పుడు ఏమి అర్ధం చేసుకున్నారు? (అది దేవుని మాటలు, దేవుని మార్గము, మరియు దేవుని సత్యము మానవుని జీవముగా మారిందని.) ఈ మాటలను మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. మీరు ఒక లోతైన అవగాహనను కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను. “అయితే మరి దేవుని దూతలు మరియు దేవదూతలు పరిశుద్దులు కారని ఎందుకు అంటారు?” అని కొంతమంది వ్యక్తులు అడుగవచ్చు. ఈ ప్రశ్న గురించి మీరు ఏమనుకుంటున్నారు? బహుశా ఇంతకు ముందు మీరు దీనిని పట్టించుకుని ఉండరు. నేనొక చిన్న ఉదాహరణను వాడతాను: నీవు ఒక రోబోను ఆన్ చేసినప్పుడు, అది ఆడటం మరియు పాడటం రెండూ చేయగలదు, అలాగే అదేమీ చెప్తుందో కుడా నీవు గ్రహించగలవు. దానిని నీవు ముద్దుగా ముచ్చటగా ఉన్నదని అనవచ్చు, కానీ దానికి జీవము లేని కారణం చేత దానికి అర్ధం కాదు. నీవు దాని విద్యుత్ సరఫరాను ఆపివేసినప్పుడు, అది ఇంకేమైనా కదలగలదా? ఎప్పుడైతే ఈ రోబోట్ పనిచేస్తుందో, నీవు దీనిని ముద్దుగా ముచ్చటగా ఉన్నట్లు చూడవచు. ఇది అవసరమా లేక అనవసరమా అని నీవు నిర్దారించడమే గాని, సందర్భం ఏదైనా సరే, అది కదులుతూనే ఉండటాన్ని నీవు గమనించవచ్చు. అయితే నీవు దాని విద్యుత్ ప్రసరణను ఆపినప్పుడు, దానిలో ఏదైనా వ్యక్తిత్వము నీకు కనబడుతుందా? అదేదైనా లక్షణాన్ని కలిగి ఉన్నట్లు నీకు కనబడుతుందా? నేను చెప్తున్న దాని భావము నీకు అర్ధమవుతుందా? చెప్పాలంటే, ఈ రోబోట్ కదలగలిగి, ఆగగలిగినంత మాత్రాన, అది ఎదో గుణాన్ని కలిగి ఉన్నదని నీవు ఎన్నటికీ వర్ణించలేవు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు, మనం దీని గురించి ఇకపై మాట్లాడుకోబోవట్లేదు. దీని భావాన్ని గురించి మీకు ఒక మామూలు అవగాహన ఉంటే చాలు. ఇక్కడితో మన సహవాసమును ముగించుకుందాము. శుభం!
డిసెంబర్ 17, 2013
ఫుట్‌నోట్:
ఎ. “తలకట్టును బిగించే మంత్రము” అనేది చైనీయుల నవలయైన జర్నీ టు వెస్ట్ లో తాంగ్ సంజగ్ అనే సన్యాసి వాడిన మంత్రమై ఉన్నది. అతడు ఈ మంత్రాన్ని సన్ వుకాంగ్ తల చుట్టూ ఒక బంగారపు తలకట్టును పెట్టి బిగించి, అతనికి తీవ్రమైన తలనొప్పి కలుగజేయుట ద్వారా, అతనిని అదుపులోనికి తెచ్చి నియంత్రించడానికి ఉపయోగిస్తాడు. ఇది ఒక వ్యక్తిని బంధించే విషయాన్ని వివరించేందుకు రూపకాలంకారముగా మారిపోయింది.