దేవుడు సకల సృష్టికి ప్రభువైయున్నాడు
ఇంతకుముందు రెండు యుగాలలోని కార్యము యొక్క ఒక దశ ఇశ్రాయేలులో చేపట్టబడినది, ఇంకొకటి యూదా ప్రదేశములో చేపట్టబడినది. సాధారణంగా చెప్పాలంటే, ఈ పని యొక్క ఏ దశలో కూడా ఇశ్రాయేలును విడిచిపెట్టబడలేదు, మరియు ఈ రెండూ కూడా తొలుత ఎన్నుకొనబడిన ప్రజలపైనే నిర్వహించబడినది. ఈ కారణంగానే, యేహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడని వారు విశ్వసించారు. యేసు యూదా ప్రదేశములో పని చేసినందున, అక్కడనే ఆయన సిలువ యాగమును జరిగించినందున, యూదులు ఆయనను యూదుల విమోచకునిగా చూశారు. ఆయన యూదులకు మాత్రమే రాజని, వేరవ్వరికి ఆయన రాజుగా ఉండకూడదని వారు ఆలోచిస్తారు; ఆయన ఇంగ్లీషు వారిని లేక అమెరికా వారిని విమోచించు ప్రభువు కాదు గానీ ఆయన ఇశ్రాయేలులోని యూదులను మాత్రమే విమోచించాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలీయులను విమోచించు ప్రభువని వారు ఆలోచిస్తారు. వాస్తవానికి, దేవుడే సమస్తమునకు యజమానుడైయున్నాడు. ఆయనే సకల సృష్టికి దేవుడైయున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకు లేక యూదులకు మాత్రమే దేవుడు కాదు; ఆయన సకల సృష్టికి దేవుడైయున్నాడు. ఆయన కార్యములలోని మునుపటి రెండు దశలు ఇశ్రాయేలులోనే చోటుచేసుకున్నాయి, అవి కొన్ని ఆలోచనలను ప్రజలలో సృష్టించాయి. ఇశ్రాయేలులో యెహోవా తన కార్యమును జరిపించాడనీ, యేసుప్రభువు తన కార్యమును యూదా ప్రదేశములో జరిపించాడనీ, అంతేకాకుండా తన కార్యమును జరిగించుట కొరకు ఆయన శరీరధారియాయెనని వారు నమ్మారు కానీ కారణాలు ఎవని తెలియకపోయిననూ ఆ కార్యము ఇశ్రాయేలును దాటి బయటకు పోలేదు. దేవుడు ఐగుప్తీయులలోనూ లేదా భారతీయులలోనూ కార్యము జరుపలేదు; ఆయన ఇశ్రాయేలీయులలో మాత్రమే కార్యము జరిపించాడు. ఆ విధంగా ప్రజలు వివిధ రకాల భావాలను ఏర్పరచుకుని, దేవుని కార్యమును ఒక నిర్దిష్టమైన పరిధిలోనే వివరిస్తున్నారు. దేవుడు కార్యము జరిగించునప్పుడు ఆయన ఎన్నుకోబడిన ప్రజల మధ్యలోనే అనగా ఇశ్రాయేలీయుల మధ్యలోనే జరిగించాలనీ; ఇశ్రాయేలీయులు తప్ప మరి ఎవరి మీదనూ ఆయన కార్యము జరిగించకూడదనీ లేక ఆయన కార్యముకు ప్రాధాన్యత ఉండదనీ వారు అంటారు. దేవుడు శరీరధారిగా వచ్చిన విషయములో వాళ్ళు మరింత కఠినంగా ఉండి ఆయన ఇశ్రాయేలు సరిహద్దులను దాటిపోవుటకు అనుమతించరు. ఇవన్నీ మానవుని తలంపులు కావా? దేవుడు భూమ్యకాశములను మరియు సమస్తమును సృజించెను, సృష్టిలోని యావత్తును ఆయనే సృజించెను అలాంటప్పుడు ఆయన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే తన కార్యమును ఎలా పరిమితం చేసుకొనగలడు? అలాగైతే, ఆయన సమస్త సృష్టిని సృజించడంలో అర్థమేముంది? ఆయన ప్రపంచం యావత్తునూ సృష్టించాడు, అంతేగాక ఆయన తన ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికను ఇశ్రాయేలులో మాత్రమే కాకుండా, విశ్వములోని ప్రతి వ్యక్తి మీద చేపట్టాడు. చైనాలో నివసిస్తున్నవారా, యునైటెడ్ స్టేట్స్‌లో, యునైటెడ్ కింగ్డమ్ లేదా రష్యాలో ఉంటున్నారా అన్నదానితో నిమిత్తం లేకుండా, ప్రతి వ్యక్తి కూడా ఆదాము వారసులే; వారందరూ దేవుని ద్వారా సృష్టించబడినవారే. సృష్టి నియమాల నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, అంతేగాక అందులోని ఏ ఒక్క వ్యక్తి కూడా “ఆదాము వారసుడు” అనే ముద్ర నుండి తమను తాము వేరు పరుచుకోలేరు. వారందరూ దేవుని సృష్టియైయున్నారు, వారందరూ ఆదాము సంతతివారైయున్నారు, మరియు వారు ఆదాము హవ్వల భ్రష్ట సంతానమైయున్నారు. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు గానీ ప్రజలందరూ దేవుని సృష్టియైయున్నారు; అందులో కొందరు శపించబడిన వారైయుండగా, మరికొందరు ఆశీర్వదించబడినవారై యున్నారు. ఇశ్రాయేలీయుల గురించిన చాల విషయాలు ఆమోదయోగ్యమైనవిగా ఉన్నాయి; ప్రారంభంలో దేవుడు వారిపై కార్యము జరిపించాడు. ఎందుకంటే, వారు అతి తక్కువగా చెడు మార్గములో ఉండిరి. చైనీయులతో వారిని పోల్చడం తగదు; వారు అతి అల్పులు. కాబట్టి, దేవుడు ఆదిలో ఇశ్రాయేలీయుల మధ్యన కార్యమును జరిపించాడు, ఆయన కార్యపు రెండవ దశ యూదా ప్రదేశములో చోటు చేసుకున్నది—ఇది మనుష్యుని యందు ఎన్నో ఆలోచనలకు మరియు నియమాలకు దారి తీసింది. నిజానికి, మానవుని తలంపులకు అనుగుణంగా దేవుడు నడుచుకుని ఉంటే, ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా ఉండే వాడు, సమస్త సృష్టికి దేవుడిగా ఉండేవాడు కాదు, తన క్రియలను అన్యజనుల వరకు విస్తరింప చేయడానికి అసమర్థుడై ఉండేవాడు, ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడై యుండి ఉంటే, సకల సృష్టికి దేవుడిగా ఉండేవాడు కాదు. అన్య జనులకు యెహోవా నామము విస్తరించినందువల్ల అన్యజనుల యందు ఆ నామము ఘనపరచబడును గాక అని ప్రవచనాలు సెలవిస్తున్నాయి. అది ఎందుకు ప్రవచించబడింది? దేవుడు ఒక్క ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడైనట్లయితే, ఆయన ఇశ్రాయేలులో మాత్రమే కార్యము జరపాలి. అంతేగాక, ఆయన తన కార్యములను వ్యాప్తి చేసేవాడు కాదు. మరియు ఇటువంటి ప్రవచనం చేసియుండే వాడు కాదు. ఆయన ఈ ప్రవచనం చేసినందువల్ల, ఆయన తన కార్యములను అన్య జనుల యందు, అన్ని దేశాల యందు మరియు అన్ని రాజ్యాల యందు తప్పక వ్యాప్తి చెందిస్తాడు. ఆయన దానిని చెప్పినందు వల్ల, ఆయన దానిని తప్పక చేయాలి; ఇది ఆయన ప్రణాళిక, ఆయన భూమ్యాకాశములను మరియు సమస్తము సృష్టించినవాడు మరియు ఆయన సృష్టి అంతటికి దేవుడైయున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల యందు కార్యము జరిగించుచున్నాడా లేక, యూదయ ప్రదేశమంతటిలోనూ కార్యము జరిగించుచున్నాడా అన్నదానితో పని లేకుండా, ఆయన జరిగించు కార్యము సమస్త విశ్వమునకు మరియు సమస్త మానవ కోటికి సంబంధించినదిగా ఉన్నది. అన్యజనుల దేశమైన—గ్రేట్ రెడ్ డ్రాగన్, అనగా చైనా దేశములో ఆయన నేడు చేస్తున్న కార్యము—సకల మానవాళి కొరకైన కార్యముగానే ఉన్నది. ఇశ్రాయేలు దేశము ఆయన భూమి మీద జరిగించు కార్యముకు పునాదిగా నిలిచెను; అదే విధంగా, చైనా అనేది అన్య జనుల మధ్య ఆయన జరిగించు కార్యమునకు పునాదిగా ఉండవచ్చు. ఇప్పుడు “అన్య జనులయందు యెహోవా నామము ఘనపరచబడును” అన్న ఆయన ప్రవచనము నెరవేర్చబడలేదా? గ్రేట్ రెడ్ డ్రాగన్ దేశము అనగా చైనా దేశములో ఆయన జరిగించు ఈ కార్యమే, అన్యుల దేశములో ఆయన జరిగించు కార్యములకు తొలిమెట్టుగా ఉన్నది. శరీరధారియైన దేవుడు ఈ దేశములో మరియు శాపగ్రస్తులైన ఈ ప్రజల మధ్యలో తన కార్యమును జరిపించాలి, ఇది మానవ ఆలోచనలకూ అతీతంగా ఉంటుంది; అందరిలో విరే అధములు, వీరికి ఎటువంటి విలువ లేదు, వీరు యెహోవాచే ఆదిలో విడిచిపెట్టబడినవారు. ప్రజలు ఇతర ప్రజలను విడిచిపెట్టొచ్చు, కానీ వారు దేవునిచే విడిచిపెట్టబడితే, వారు ఏ స్థానము లేనివారిగా ఉంటారు, వారికి విలువ ఉండదు. దేవుని సృష్టికి, సాతానుచే పీడించబడడం లేదా ప్రజల ద్వారా విడిచిపెట్టబడడం అనేది ఒక రకమైన బాధాకరమైన విషయం—అయితే, ఒక సృష్టిని తన సృష్టికర్తే విడిచిపెట్టినప్పుడు అంతకన్న దిగజారిన స్థితి మరొకటి ఉండదని అర్థము. మోయబు వంశస్థులు శపించబడినవారు, వారు ఈ వెనుకబడిన దేశములో జన్మించారు; ఎటువంటి సందేహము లేకుండా, చీకటి ప్రభావంతో ఉన్న ప్రజలందరిలో కంటే, మోయబు వంశస్థులే అత్యంత అల్ప స్థితిలో ఉన్నారు. ఈ ప్రజలు ఇంతకు ముందు అత్యంత దుస్థితిని కలిగి ఉన్నారు కాబట్టి, వారి మీద జరిగించబడు కార్యము మనుష్యుల ఆలోచనలను పడగొట్టుతాయి మరియు దేవుని ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రజల మధ్య అలాంటి కార్యమును చేయడం అనేది మనుష్యుల ఆలోచనలను పడగొట్టుటలో ఉత్తమ మార్గం, అంతేగాక దీనితో దేవుడు ఒక శకమును ప్రారంభిస్తాడు; దీనితో ఆయన మనుష్యుని ప్రతి ఆలోచనలను పడగొట్టుతాడు; దీనితో ఆయన కృపా యుగపు కార్యమంతటినీ ముగింపునకు తీసుకు వస్తాడు. అతని మొదటి క్రియ ఇశ్రాయేలు సరిహద్దు లోపల ఉన్న యూదా ప్రదేశములో చోటుచేసుకున్నది; అన్యజనుల మధ్యన, క్రొత్త శకమును ప్రారంభించడానికి ఆయన ఎటువంటి కార్యమును చేయలేదు. కార్యపు అంతిమ దశ కేవలం అన్యజనుల మధ్య చేపట్టడం మాత్రమే కాదు, కానీ శాపగ్రస్తులుగా ఉన్నవారి మధ్యలో కూడా ఎక్కువగా జరిగించబడియున్నది. ఈ ఒక్క విషయమే సాతానును కించపరచడానికి ఉత్తమ సాధనమైయున్నది, ఆ విధంగా, దేవుడు విశ్వములోని సకల సృష్టికి దేవుడవుతాడు, సమస్తమునకు ప్రభువవుతాడు, జీవించుచున్న ప్రతి సృష్టికి ఆయన ఆరాధన యోగ్యంగా మారుతాడు.
ఈ దినమున, దేవుడు ఎటువంటి నూతన కార్యమును జరిగించుచున్నాడో అర్థము చేసుకొని అనేక మంది ఉన్నారు. అన్య జనుల యందు, దేవుడు ఒక క్రొత్త ఆరంభానికి నాంది పలికాడు. ఆయన ఒక నూతన శకమును ప్రారంభించాడు, నూతన కార్యముకు నాంది పలికాడు—ఆయన ఈ కార్యమును మాయోబు వంశస్థుల మీద చేయనున్నాడు. ఇది ఆయన నూతన కార్యము కాదా? చరిత్ర మొత్తం మీద మరెవ్వరూ ఎన్న్డడూ ఇటువంటి కార్యమును చూసియుండలేదు. దీనిని గూర్చి ఎవరూ వినలేదు, చాలా కొద్ది మంది మాత్రమే దీనిని అభినందించారు. దేవుని జ్ఞానము, దేవుని అద్భుతము, గ్రహింపునకు సాధ్యము కాని దేవుని నిగూఢత, దేవుని గొప్పతనము మరియు దేవుని పరిశుద్ధత లాంటివన్నీ అంత్య దినాల కార్యము అయినటువంటి ఈ కార్యపు దశలో బయలుపరచబడియున్నాయి. మనుష్యుల ఆలోచనలను పడగొట్టే ఇది నూతన కార్యము కాదా? “దేవుడు మాయోబును శపించాడు, మాయోబు వంశస్థులను విడనాడుతానని ఆయన చెప్పాడు గనుక, ఇప్పుడు వారిని ఎలా రక్షిస్తాడు?” అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. వీరంతా దేవునిచే శపించబడి ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టబడిన అన్యజనులు; ఇశ్రాయేలీయులు వీరిని “అన్య శునకాలు” అని పిలిచారు. ప్రతి ఒక్కరి దృష్టిలో వారు అన్య శునకాలు మాత్రమే కాకుండా, అంతకన్నా ఘోరంగా, నాశన పుత్రులైయున్నారు; ఇంకా చెప్పాలంటే, వారు దేవునిచే ఎన్నుకోబడని ప్రజలు. వారు ఇశ్రాయేలు సరిహద్దులోనే జన్మించి ఉండవచ్చు, కానీ వారు ఇశ్రాయేలు జనాంగానికి చెందినవారు కాకపోవడమే కాకుండా, వారు అన్య దేశములకు వెలివేయబడియుండిరి. వారు ప్రజలందరిలోనూ అత్యంత అల్పులుగా ఉన్నారు. వారు మానవాళిలోకెల్లా అత్యంత అల్పులు కాబట్టి వారి మధ్య ఒక నూతన శకాన్ని ప్రారంభించే కార్యమును దేవుడు జరిగించును, భ్రష్టుపట్టిన మానవాళికి వారు ప్రతినిధులుగా ఉన్నారు. దేవుని కార్యము ఎంపిక చేయబడినది మరియు లక్ష్యంతో కూడినదైయున్నది; ఈ ప్రజల మధ్య నేడు ఆయన చేసిన కార్యము సృష్టి మీద చేసిన కార్యము లాగా కూడా ఉన్నది. నోవాహు మరియు అతని వంశస్థులు దేవునిచే చేయబడిన సృష్టియైయున్నారు. రక్త మాంసములతో కూడుకున్నవారు ఈ ప్రపంచములో ఎవరున్నా సరే వారు దేవుని సృష్టియే. దేవుని క్రియ ప్రతి ఒక్క సృష్టిపై నిర్దేశించబడియున్నది; సృష్టించబడిన తరువాత ఎవరైనా శపించబడ్డారా అనేదానిపై అది ఆధారపడి ఉండదు. శపించబడని వారు అనగా ఎన్నుకోబడిన వారు మీద మాత్రమే కాకుండా, సృష్టంతటి మీద ఆయన నిర్వహణ కార్యము నిర్దేషించబడియున్నది. దేవుడు తన సృష్టి యందు తన కార్యమును జరిగించుటకు ఇష్టుడైయున్నాడు కాబట్టి ఆయన తప్పకుండ దానిని విజయవంతంగా పూర్తి చేయును మరియు ఆయన కార్యము ద్వారా ప్రయోజనము పొందే ప్రజల మధ్యలో ఆయన తన కార్యమును జరిగిస్తాడు. అందువలన జనముల మధ్యలో కార్యము చేయునప్పుడు ఆయన అన్ని ఆచారములనూ పదకొడతాడు; ఆయనకు సంబంధించినంతవరకు “శపించబడిన”, “శిక్షించబడిన” మరియు “దీవించబడిన” అనే పదాలు అర్థరహితమైనవి! యూదా జనములు ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు జనాంగము వలె ఉన్నారు కాబట్టి వారు మంచివారు; వారు మంచి యోగ్యత మరియు మానవత్వము కలిగియున్న ప్రజలు. ఆదియందు, యెహోవా తన కార్యమును వీరి మధ్యన ప్రారంభించాడు. ప్రారంభ కాల కార్యములను ప్రదర్శించాడు—కానీ నేడు వారి మీద విజయ కార్యము జరిగించడం అనేది అర్థరహితంగా ఉందును. వారు కూడా, సృష్టిలో ఒక భాగం కావచ్చు, వారిని గురించిన సానుకూల విషయములు అనేకములు ఉండవచ్చు, కానీ వారి మీద ఈ కార్యమును జరిగించడం అనేది అర్థము లేనిదిగా ఉందును, దేవుడు ప్రజలను జయించలేడు, లేదా సమస్త సృష్టిని ఆయన ఒప్పించ లేడు, అందుకే, గ్రేట్ రెడ్ డ్రాగన్ దేశములోని ప్రజల మీద తన కార్యమును కేంద్రీకరించడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆయన అన్ని నియమాలను మరియు మనుష్యుల అన్ని ఆలోచనలను పడగొట్టి ఒక శకమును ప్రారంభించి మరియు కృపా యుగపు సమస్త కార్యమును పూర్తి చేయడమనేది అతి ప్రాముఖ్యమైన సంగతిగా ఉన్నది. ఆయన తన ప్రస్తుతపు కార్యము ఇశ్రాయేలీయుల మధ్యన చేపట్టి ఉన్నట్టయితే, ఆయన ఆరు—వేల—సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ముగింపుకు వచ్చి ఉండే సమయానికి, ప్రతి ఒక్కరు దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడై ఉన్నాడనీ, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడినవారనీ, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ఆశీర్వాదమును, వాగ్దానమును స్వతంత్రించుకునేందుకు అర్ఙులనీ నమ్మియుండేవారు. అంత్య దినములలో దేవుడు శరీరధారియై గ్రేట్ రెడ్ డ్రాగన్ దేశములో ఉన్నప్పుడు, సమస్త సృష్టిలో దేవుని కార్యమును చేయు దేవునిగా ఉండి; ఆయన నిర్వహణ కార్యమును ముగించి మరియు గ్రేట్ రెడ్ డ్రాగన్ దేశములో ఆయన కార్యపు ముఖ్య ఉద్దేశ్యమును ముగిస్తాడు. ఈ మూడు దశల కార్యపు ప్రధాన అంశం మానవుని రక్షణ—సమస్త సృష్టియు సృష్టికర్తను ఆరాధించడం. ఆ విధంగా కార్యపు ప్రతి దశకు ఒక గొప్ప అంతరార్థం ఉంది; దేవుడు అర్థం లేకుండా లేదా విలువ లేకుండా ఉండేది ఏదీ చేయడు. ఒక వైపు ఈ దశలోని కార్యము ఒక నూతన శకములోనికి ప్రవేశిస్తుండగా, గత రెండు శకాలకు ముగింపు వస్తుంది; మరోవైపు ఇది మానవ తలంపులన్నింటినీ, మానవుని నమ్మకము మరియు జ్ఞానపు పాత మార్గాలనూ పడగొట్టుతుంది. గత రెండు యుగాల క్రియ మానవుని వివిధ తలంపులకు అనుగుణంగా చేపట్టబడింది; ఈ దశలో, అలా కాకుండా, మానవుని తలంపులను పూర్తిగా తొలగించేసింది, ఆలా చేయడం ద్వారా మానవత్వాన్ని పూర్తిగా జయించింది. మాయోబు కుటుంబీకులను జయించడం ద్వారా, మాయోబు కుటుంబీకుల మధ్యలో కార్యము చేపట్టడం ద్వారా, దేవుడు విశ్వమంతటా ఉన్న ప్రజలందరినీ జయిస్తాడు. ఇదియే ఆయన కార్యములోని ఈ దశ యొక్క గూడార్థము, ఇదియే ఆయన కార్యములోని ఈ దశ యొక్క అత్యంత విలువైన విషయము. ఇంకనూ మీ సొంత హోదా చాలా తక్కువగానూ, మీరు అత్యంత తక్కువ విలువ కలిగి యున్నప్పటికీ, మీరు ఒక గొప్ప సంతోషకరమైన విషయాన్ని తెలుసుకున్నారని గ్రహించెదరు. మీరు గొప్ప ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నారు, గొప్ప వాగ్దానమును పొందుకున్నారు, మరియు ఈ గొప్ప దేవుని కార్యమును నెరవేర్పుకు రావడానికి మీరు సహాయపడగలరు. మీరు దేవుని అసలైన ముఖ జాడను చూశారు, దేవుని సహజమైన స్వాబావికత మీకు తెలుసు, దేవుని చిత్తమును మీరు చేస్తారు. దేవుని కార్యపు గత రెండు దశలు ఇశ్రాయేలులో చేపట్టబడినాయి. ఆయన కార్యములోని ఈ దశ కూడా ఇశ్రాయేలీయుల మధ్యన చేపట్టబడియున్నట్లైతే, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడిన జనములు అని సమస్త సృష్టి నమ్మడమే గాక, దేవుని నిర్వహణ ప్రణాళిక యావత్తు అది ఆశించిన ప్రభావాన్ని సాధించడంలో విఫలమవుతుంది. ఇశ్రాయేలులో చేపట్టబడిన దేవుని కార్యపు రెండవ దశ సమయంలో, ఏ నూతన కార్యము—లేదా నూతన శకాన్ని ప్రారంభించే ఏ కార్యము—అన్యజనముల మధ్య చేపట్టబడలేదు. కార్యపు నేటి దశ—ఒక నూతన శకాన్ని ప్రారంభించే కార్యము—అన్యజనుల దేశమందు మొట్టమొదటిగా చేపట్టబడింది, పైగా, మాయోబు వంశస్థుల మధ్యన అది చేపట్టబడింది, ఆ విధంగా మొత్తం శకాన్ని ప్రారంభించినట్టయింది. మానవ తలంపులతో కూడుకున్న ఎటువంటి జ్ఞానాన్నీ అనుమతించని విధంగా దేవుడు వాటిని పడగొట్టాడు. దేవుని గెలుపు కార్యములో ఆయన మనుష్యుల ప్రాచీన మరియు మానవుని జ్ఞానపు పాత మార్గములను, పడగొట్టాడు. దేవుని యందు ఎటువంటి నియమాలు ఉండవనీ, దేవుని విషయములో పాతది ఏదీ లేదనీ, ఆయన జరిగించే కార్యము పూర్తిగా స్వతంత్రించబడేదనీ, పూర్తిగా ఉచితమైనదనీ, ఆయన చేసే ప్రతిది సరైనదిగానే ఉంటుందనీ ప్రజలు చూసేలా చేశాడు. సృష్టియందు ఆయన చేసే ఏ కార్యమైననూ దానికి మీరు సంపూర్ణంగా లోబడి ఉండాలి. ఆయన చేసే ప్రతి కార్యమునకూ ఒక అర్థం ఉంటుంది, అది ఆయన స్వంత చిత్తం మరియు జ్ఢానము మేరకు చేపట్టబడుతున్నాయే తప్ప, మానవుని ఎంపికలు మరియు తలంపుల మేరకు చేపట్టబడటం లేదు. ఆయన కార్యమునకు లాభకరమైన దానినే ఆయన చేస్తాడు, అలాకాకపోతే అది ఎంతటి మంచిదైనా సరే ఆయన చేయడు. ఆయన తన కార్యమును అర్థపూర్వకంగానూ, ఉద్దేశ్య పూర్వకంగానూ మరియు కార్యమును ఎక్కడ చేయాలో లేక ఎవరి కొరకు చేయాలో అని ఎంపిక చేసుకుంటాడు. ఆయన కార్యము జరిపించేటప్పుడు పాత నియమాలను అంటిపెట్టుకోవడం గానీ, లేదా పాత సూత్రాలను అనుసరించడం గానీ చేయడు. అందుకు భిన్నంగా కార్యపు ప్రాముఖ్యతను బట్టి దానికి తగ్గట్టుగా తన కార్య ప్రణాళికను చేసుకుంటాడు. తుదకు, ఆయన స్వచ్ఛమైన ప్రభావాన్నీ మరియు ఊహించిన లక్ష్యాన్నీ అందుకుంటాడు. నీవు ఈ విషయాలను నేడు తెలుసుకోకపోతే, ఈ కార్యము నీలో ఏ మాత్రమూ ప్రభావం చూపదు.