విజయం లేదా వైఫల్యం అనేది మనిషి నడిచే మార్గం మీద ఆధారపడి ఉంటుంది
అనేక మంది ప్రజలు తమ భవిష్యత్తు గమ్యం కోసం, లేదా తాత్కాలిక ఆనందం కోసం దేవుణ్ణి నమ్ముతారు. ఎలాంటి పరిష్కరించబడటం గుండా వెళ్ళని వారు సైతం పరలోకంలోకి ప్రవేశించడానికి, బహుమానాలు పొందడానికి దేవుని నమ్ముతుంటారు. పరిపూర్ణపరచబడడానికో, లేదా దేవుని ఉత్పాదితపు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికో వారు దేవుని నమ్మరు. అంటే అనేకమంది ప్రజలు తమ బాధ్యతలను నెరవేర్చడానికో, లేదా తమ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికో దేవుని నమ్మరు. అర్థవంతమైన జీవితాలను గడిపే విషయంలో ప్రజలు చాలా అరుదుగానే దేవుణ్ణి విశ్వసిస్తారు, అంతేతప్ప, మనిషి జీవిస్తున్నాడంటే, అది పరలోకం ద్వారా నిర్ణయించబడి మరియు భూమిమీద అలా చేయాలని సమ్మతించబడింది కాబట్టి, అతడు దేవుడిని ప్రేమించాలని నమ్మేవారు లేరు అది మానవుని సహజమైన నైజం. ఈ విధంగా, వివిధ రకాల ప్రజలు ప్రతి ఒక్కరూ వారి సొంత లక్ష్యాలను అనుసరిస్తున్నప్పటికీ, వారి అన్వేషణా లక్ష్యం మరియు దాని వెనకున్న ప్రేరణలన్నీ ఒకేలా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే, వారిలో అనేకమంది ఆరాధన లక్ష్యాలు ఒకేలా ఉంటాయి. గత కొన్ని వేల సంవత్సరాలలో, అనేకమంది విశ్వాసులు మరణించారు, మరియు అనేకమంది చనిపోయి తిరిగి జన్మించారు. ఇది కేవలం దేవుడిని అనుసరించే ఒకరో లేక ఇద్దరో లేదంటే వెయ్యో లేక రెండు వేల మందికో మాత్రమే ఇది పరిమితం కాదు, అయినప్పటికీ వీరిలో అనేకమంది ప్రజలు వారి సొంత నమ్మకాల కోసమో లేక భవిష్యత్తు మీద వారికున్న ఘనమైన ఆశలు కోసమో వెంబడిస్తుంటారు. ఇలాంటి వారి మధ్యలో క్రీస్తు పట్ల అంకిత భావం కలిగిన వారు చాలా తక్కువ. భక్తి కలిగిన విశ్వాసులు అనేకమంది ఇప్పటికీ వారి సొంత ఉచ్చులలో చిక్కుకుని చనిపోయారు, మరియు విజయం పొందిన వ్యక్తుల సంఖ్య, అన్నింటికంటే, చాలా తక్కువగానే ఉన్నది. నేటికీ, ప్రజలకు వారు విఫలమవ్వడానికి కారణాలు, లేదా వారి విజయ రహస్యాలు, ఇప్పటికీ వారికి తెలియదు. క్రీస్తును అనుసరించాలని తపించిన వారు ఇంకా వారి ఆకస్మిక అంతఃదృష్టిని పొందలేదు, వారు ఈ మర్మాల లోతుల్లోకి చేరుకోలేదు, ఎందుకంటే వారికీ ఏమీ తెలియదు. వారు తమ అన్వేషణలో కష్టపడి ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు నడిచే మార్గము ఒకప్పుడు వారి పితరులు నడిచిన వైఫల్య మార్గముగా ఉంటోందే తప్ప విజయ మార్గముగా కాదు. ఈ విధంగా, వారు ఎలా అనుసరించినప్పటికీ, వారు నడుస్తున్న మార్గం అంధకారానికి దారితీసేది కాదా? వారు సంపాదించేది చేదుగా ఉండే ఫలం కాదా? గతకాలంలో విజయం సాధించిన వారిని అనుసరించే వ్యక్తులు చివరికి అదృష్టాన్ని చేరుకుంటారా లేదా విపత్తును చేరుకుంటారా అని అంచనా వేయడం చాలా కష్టం. అలాంటప్పుడు, విఫలమైన వారి అడుగుజాడలను వెంబడించాలని ఆశించే వ్యక్తుల కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో కదా? వారు నాశనం కావడానికి మరింత ఎక్కువ అవకాశం లేదంటారా? వారు నడిచే మార్గానికి ఎలాంటి విలువ ఉంటుంది? వారు తమ సమయాన్ని వృధా చేయట్లేదా? క్లుప్తంగా చెప్పాలంటే, ప్రజలు తమ సాధనలో విజయం సాధించారా లేదంటే విఫలమయ్యారా అనే దానితో సంబంధం లేకుండా, వారు అలా చేయడానికి ఒక కారణం ఉంది, వారి విజయమో లేదా వైఫల్యమో అనేది వారి ఇష్ట ప్రకారం నిర్ణయం కాకపోవడమే అందుకు కారణం.
మనిషి యధార్థ హృదయం కలిగి, అతను తనకు తానుగా సమర్పించుకుని, నిజంగా కట్టుబడి ఉండడమనేది దేవుని మీద మనిషి విశ్వాసానికి ప్రాధమిక ఆవశ్యకతగా ఉంటుంది. నిజమైన విశ్వాసం కోసం తన సంపూర్ణ జీవితాన్ని సమర్పించడం, దాని ద్వారా తాను సర్వ సత్యాన్ని పొందుకొని, దేవునిచే సృజించబడిన వానిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడమనేది మనిషికి అత్యంత కష్టతరమైనదిగా ఉంటుంది. ఇది వైఫల్యము చెందినవారు సాధించలేనిది, మరియు క్రీస్తుని కనుగొనలేని వారికి అస్సలు సాధ్యముకానిది. మానవుడు సంపూర్ణముగా తనకు తాను దేవునికి సమర్పించడంలో సరైన స్థితిలో లేడు, ఎందుకంటే సృష్టికర్త పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మానవుడు సుముఖంగా లేడు, ఎందుకంటే, సత్యాన్ని చూసి కూడా మానవుడు దానిని తప్పించుకుని తన సొంత మార్గంలో నడుస్తాడు, ఎందుకంటే మనిషి ఎప్పుడూ విఫలమైన వారి మార్గాన్నే అనుసరించడానికే చూస్తుంటాడు, ఎందుకంటే మనిషి ఎల్లపుడూ పరలోకాన్ని ధిక్కరిస్తాడు, ఆవిధంగా, మానవుడు ఎల్లప్పుడూ విఫలమవుతాడు, ఎల్లపుడూ సాతాను వంచనకు గురవుతూ, తన ఉచ్చులో తానే చిక్కుకొంటాడు. ఎందుకంటే, మనిషికి క్రీస్తు గురించి తెలియదు, ఎందుకంటే, సత్యాన్ని అర్ధం చేసుకుని మరియు అనుభవించడంలో మానవుడు నిపుణుడు కాదు, ఎందుకంటే మానవుడు ఎక్కువగా పౌలును ఆరాధిస్తూ మరియు పరలోకం పట్ల అత్యాశను కనుపరుస్తాడు, ఎందుకంటే క్రీస్తు తనకు లోబడి, దేవుని ఆజ్ఞాపించాలని మానవుడు కోరతాడు, ఆ కారణంగానే, ఆగొప్ప వ్యక్తులు మరియు లోకపు ఒడిదుడుకులను అనుభవించినవారు ఇంకా క్షయమైన వారిగానే ఉన్నప్పటికీ, ఇప్పటికీ దేవుని శిక్షలో మరణిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించి నేను చెప్పగలిగేది ఏంటంటే, వారు విషాదకరమైన మరణం పొందుతారు, మరియు ఆ పర్యవసానం—వారి మరణం—తీర్పు తీర్చబడనిదై ఉంటుంది. వారి వైఫల్యమనేది పరలోక నియమానికి ఏమాత్రమూ ఓర్వశక్యము కానిది కాదా? సత్యము మానవ లోకము నుండి వస్తుంది, అయితే మానవునిలో ఉన్న సత్యము క్రీస్తు ద్వారా పంపబడింది. అది క్రీస్తు నుండి ఉద్భవించింది, అంటే, స్వయంగా దేవుని నుండి వచ్చింది, మరియు ఇది మానవుని వల్ల కానిది. అయినప్పటికీ క్రీస్తు సత్యాన్ని మాత్రమే అందిస్తాడు; మానవుడు తన సత్యాన్వేషణలో విజయం సాధిస్తాడా లేదా అని నిర్ణయించడానికి ఆయన రాలేదు. ఆవిధంగా, సత్యంలో విజయం లేక వైఫల్యం అనేది మానవుడు వెంబడించే మార్గాన్ని బట్టి ఉన్నది. సత్యంలో మానవుని విజయం లేక వైఫల్యం అనేది క్రీస్తుతో ఎలాంటి సంబంధమూ కలిగి ఉండదు, బదులుగా అది మానవుని అనుసరణ బట్టి నిర్ణయించబడుతుంది. మానవుని గమ్యం మరియు అతడి విజయం లేక వైఫల్యాన్ని భరించడానికే దేవుడున్నాడు అన్నట్టుగా, అదేమీ దేవుని తలపై పోగు చేయబడదు, ఎందుకంటే అది దేవునికి సంబంధించినది కాకుండా, దేవునిచే సృజించబడిన వారు నిర్వర్తించవలసిన కర్తవ్యంతో అది ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది. పౌలు మరియు పేతురు గురించి అనేకమంది కొద్దిపాటి అవగాహన మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, పేతురు మరియు పౌలు వెలుపరచిన ఫలితాలే తప్పు ప్రజలకు తెలిసిందేమీ లేదు, మరియు పేతురు విజయ రహస్యము, లేదా పౌలు వైఫల్యానికి దారి తీసిన లోపాలు గురించి వారికి తెలియదు. కాబట్టి, మీరు వారి అన్వేషణ ధర్మాన్ని పూర్తిగా చూడకపోతే, మీలో అనేకమంది అన్వేషణ మరింత విఫలమవుతుంది, మీలో కొద్ది మంది విజయం సాధించినప్పటికీ, వారు పేతురుకి సమానం కాలేరు. మార్గం సరైనదైతే, అప్పుడు నీవు విజయ నిరీక్షణ కలిగి ఉంటావు; సత్యాన్ని అనుసరించడంలో నీవు నడిచే మార్గము తప్పైతే, నీవు ఇక ఎన్నటికీ విజయం సాధించలేవు, మరియు పౌలు వంటి ముగింపును పొందుతావు.
పేతురు పరిపూర్ణపరచబడిన వ్యక్తి. గద్దింపు మరియు న్యాయతీర్పు అనుభవించిన తరువాత, దాని ప్రకారంగా, దేవుని పట్ల స్వచ్చమైన ప్రేమను పొందుకున్న తరువాత మాత్రమే, అతడు సంపూర్ణముగా పరిపూర్ణ పరచబడ్డాడు; అతడు నడిచిన మార్గం పరిపూర్ణ పరచబడిన మార్గము. చెప్పాలంటే, మొదటి నుండి, పేతురు నడిచిన మార్గము సరైనదే, మరియు దేవుని నమ్మడంలో అతనికున్న ప్రేరణ కూడా సరైనదే, కాబట్టే పరిపూర్ణపరచబడిన ఒక వ్యక్తిగా, మనిషి ఇదివరకు ఎన్నడూ నడవని ఒక కొత్త మార్గంలో అతడు నడిచాడు. అయితే, పౌలు నడిచిన మార్గము మొదటి నుండి క్రీస్తుకు విరోధమైనది అయినప్పటికీ, అతడిని వినియోగించుకోవాలని మరియు తన కార్యము కోసం అతని వరాలు మరియు ప్రతిభలన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధాత్మ కోరుకున్న కారణంగానే అతను అనేక దశాబ్దాల పాటు క్రీస్తు కొరకు పని చేశాడు. అతను పరిశుద్దాత్మ ద్వారా వాడబడిన ఒకానొక వ్యక్తి మాత్రమే, అతని వరాల కారణంగానే అతను వినియోగించబడ్డాడు కానీ, అతని మానవత్వాన్ని బట్టి యేసు దయ చూపడం వలన కాదు. అతడు బాధించబడ్డాడు కాబట్టే యేసు కోసం పని చేయగలిగాడు, కానీ అలా చేయడం అతనికి సంతోషంగా అనిపించడం వల్ల కాదు. పరిశుద్దాత్మ వెలిగింపు మరియు నడిపింపు ద్వారానే అతడు అటువంటి కార్యము చేయగలిగాడు, మరియు అతడు చేసిన కార్యము ఏవిధంగానూ అతని అనుసరణో, లేక అతని మానవ స్వభావమో కాదు. పౌలు కార్యమనేది ఒక దాసుని కార్యాన్ని కనుపరుస్తుంది, అంటే అతడు ఒక అపోస్తలు చేసే కార్యాన్ని చేశాడు. అయితే, పేతురు కార్యము భిన్నమైనది; అది పౌలు కార్యమంతటి గొప్పది కానప్పటికీ, తన సొంత ప్రవేశాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతను కార్యము చేశాడు, మరియు అతని కార్యము పౌలు కార్యము కంటే భిన్నమైనది. పేతురు పని దేవునిచే సృజింపబడిన వాని కర్తవ్యపు నిర్వహణగా ఉన్నది. అతడు అపోస్తలుని పాత్రలో పని చేయనప్పటికీ, దేవుని పట్ల ప్రేమను కొనసాగిస్తున్న సమయంలో పని చేశాడు. పౌలు కార్య క్రమములో అతని వ్యక్తిగత అనుసరణ కూడా ఉంది; అతని అనుసరణ అనేది భవిష్యత్తు కొరకైన అతని నిరీక్షణలు, మరియు మంచి గమ్యస్థానం కోసమైన అతని కోరిక తప్ప మరేమీ కాదు. తన కార్యపు సమయంలో అతడు శుద్దీకరణను అంగీకరించలేదు, అలాగే సవరించడం మరియు పరిష్కరించడాన్నీ ఒప్పుకోలేదు. అతడు చేసిన కార్యము దేవుని కోరికను సంతృప్తిపరిచి మరియు అతడు చేసినదంతా దేవుని సంతోషపరిచినంత కాలం, ప్రతిఫలమనేది అతని కొరకు ఎదురు చూస్తుందని అతడు విశ్వసించాడు. అతని కార్యంలో వ్యక్తిగత అనుభవాలేమీ లేవు—అదంతా అతని కోసమే, గానీ మార్పు ముసుగులో జరిగించబడలేదు. అతని కార్యంలో ప్రతిది ఇచ్చిపుచ్చుకోవడమే తప్ప దేవునిచే సృజింపబడిన వాని కర్తవ్యం లేదా సమర్పణ ఏదీ అందులో లేదు. పౌలు కార్యము చేసే సమయంలో, అతని పాత స్వభావంలో ఎలాంటి మార్పూ సంభవించలేదు. అతని పని కేవలం ఇతరులకు సేవ చేయడం మాత్రమే, మరియు అది అతని స్వభావంలో ఎలాంటి మార్పులనూ తీసుకురాలేకపోయింది. పరిపూర్ణత పొందకుండా లేదా పరిష్కరింపబడకుండానే పౌలు తన పనిని నేరుగా జరిగించాడు, అతడు ప్రతిఫలాన్ని బట్టి ప్రేరేపించబడ్డాడు. పేతురు భిన్నమైన వాడు; అతడు సవరణ మరియు పరిష్కరించబడటం గుండా వెళ్లి శుద్దీకరణ పొందిన వ్యక్తి. పేతురు కార్యపు లక్ష్యము మరియు ప్రేరణలనేవి మొదటి నుండి పౌలుకు భిన్నంగానే ఉన్నాయి. పేతురు పెద్ద మొత్తంలో పని చేయనప్పటికీ, అతని స్వభావము అనేక మార్పులకు గురైంది, అతడు సత్యం మరియు నిజమైన మార్పును అన్వేషించాడు. అతని కార్యమనేది కేవలం ఆ కార్యం కోసం మాత్రమే జరిగించబడలేదు. పౌలు ఎంతో కార్యం చేసినప్పటికీ, అదంతా పరిశుద్దాత్మ కార్యము మాత్రమే, పౌలు ఆ కార్యములో సహకరించినప్పటికీ, దానిని అతడు అనుభవించలేదు. పేతురు చాలా తక్కువ కార్యం చేశాడంటే కారణం, పరిశుద్దాత్మ అతని ద్వారా ఎక్కువ కార్యం చేయలేదు. వారి కార్యపు పరిమాణమనేది వారు పరిపూర్ణపరచబడ్డారో లేదో నిర్ణయించలేదు; ఒకరి అన్వేషణ ప్రతిఫలం పొందడం కోసమైతే, మరొకరిది అంతిమంగా దేవుని పట్ల ప్రేమను సాధించేది మరియు దేవునిచే సృజింపబడిన వానిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చడం, దేవుని ఆశను తృప్తిపరచడానికి ఒక సుందరమైన ప్రతిరూపంగా జీవించగలగడంగా ఉంది. వారు బాహ్యంగా భిన్నమైన వారు, అలాగే, వారి స్వభావాలు భిన్నమైనవే. వారు ఎంత పని చేశారనే దాని ఆధారంగా వారిలో ఎవరు పరిపూర్ణత చెందారనేది నీవు నిర్ణయించలేవు. దేవుని ప్రేమించే వ్యక్తి ప్రతిరూపాన్ని కలిగి జీవించాలనీ, దేవునికి లోబడేవానిలా ఉండాలనీ, సవరింపు మరియు పరిష్కరించబడడాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉండాలనీ, మరియు దేవునిచే సృజించబడి తన కర్తవ్యాన్ని నెరవేర్చేవానిగా ఉండాలనీ పేతురు ఆశించాడు. తన సర్వస్వాన్ని దేవుని చేతుల్లో పెట్టి, మరణ పర్యంతం ఆయనకు కట్టుబడి ఉండటానికి, అతడు తనను తాను దేవునికి సమర్పణ చేసుకోగలిగాడు. అతడు చేయాలని తీర్మానించుకున్నది కూడా అదే. అలాగే, అతడు సాధించింది కూడా అదే. చివరికి, అతని ముగింపు పౌలుకు భిన్నంగా ఉండటానికి మొదటి కారణం కూడా అదే. పేతురులో పరిశుద్దాత్మ చేసిన కార్యము అతడిని పరిపూర్ణ పరచడం మరియు పౌలులో పరిశుద్దాత్మ చేసిన కార్యము అతనిని వినియోగించుకోవడం. ఎందుకంటే, వారి స్వభావాలు మరియు అనుసరణ పట్ల వారి అభిప్రాయాలు ఒకేలా లేవు. ఇద్దరూ పరిశుద్దాత్మ కార్యంలో భాగమైనవారే. పేతురు ఆ కార్యాన్ని తనకు తాను అన్వయించుకోవడంతో పాటు ఇతరులకు కూడా అందించాడు; అదే సమయంలో, పౌలు మాత్రం పరిశుద్దాత్మ సమస్త కార్యాన్ని ఇతరులకు మాత్రమే అందించాడే తప్ప దాని నుండి అతడేమీ పొందలేదు. ఆ విధంగా, అనేక సంవత్సరాలు పరిశుద్దాత్మ కార్యాన్ని అనుభవించిన తర్వాత, పౌలులో మార్పులనేవే లేకుండా పోయాయి. అంతకాలం తర్వాత కూడా అతను దాదాపు తన సహజ స్థితిని కలిగి, మునుపటి పౌలు లాగానే ఉన్నాడు. అనేక సంవత్సరాల కార్యపు కష్టాన్ని అనుభవించిన తర్వాత మాత్రమే, అతడు “కార్యము” ఎలా చేయాలో నేర్చుకున్నాడు, మరియు నిలకడను నేర్చుకున్నాడు, అయినప్పటికీ, అతని పాత స్వభావం—అతని అత్యంత పోటీతత్వం మరియు కిరాయి స్వభావం—ఇంకా అలానే ఉంది. అన్నేళ్లు పని చేశాక కూడా, అతని దుర్నీతి స్వభావం గురించి అతనికే తెలియదు, మరియు అతడు తన పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు, మరియు అది ఇంకా అతని పనిలో తేటగా కనబడుతూనే ఉంది. అతనిలో ఉన్నదంతా అత్యధికమైన కార్యానుభవం మాత్రమే, కానీ అలాంటి కొద్దిపాటి అనుభవం కూడా అతనిని మార్చలేకపోయింది మరియు అస్తిత్వం లేదా అనుసరణ ప్రాధాన్యత గురించిన అతని అభిప్రాయాలనూ మార్చలేకపోయింది. క్రీస్తు కొరకు అతడు అనేక సంవత్సరాలు పనిచేసి, ప్రభువైన క్రీస్తును మరలా హింసించనప్పటికీ, అతని హృదయంలో దేవుని గూర్చిన జ్ఞానంలో ఎలాంటి మార్పు రాలేదు. అంటే, అతడు అతను తనను తాను దేవునికి సమర్పించుకోవడం కోసం పని చెయ్యలేదు, బదులుగా తన భవిష్యత్తు లక్ష్యం కోసం బలవంతంగా పని చేయాల్సి వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. కారణం, మొదట్లో, అతడు క్రీస్తును హింసించాడు, మరియు క్రీస్తుకు లోబడలేదు; అతడు ఉద్దేశపూర్వకంగా క్రీస్తును విరోధించిన తిరుగుబాటుదారుడు, మరియు పరిశుద్దాత్మ కార్యము గురించి అవగాహన లేని వ్యక్తి. అతని పని దాదాపుగా పుర్తయినప్పుడు, ఇంకా అతనికి పరిశుద్దాత్మ కార్యము గురించి తెలియదు, మరియు పరిశుద్దాత్మ చిత్తము పట్ల కనీస శ్రద్ధ కూడా లేకుండా, కేవలం తన సొంత ఆచరణను బట్టి తన ఇష్టానుసారంగా నటించాడు. కాబట్టి అతని స్వభావం క్రీస్తుతో వైరాన్ని కలిగి, సత్యానికి లోబడలేదు. ఈ వ్యక్తి, పరిశుద్దాత్మ కార్యము ద్వారా విడువబడి, అలాగే క్రీస్తును కూడా విరోధించాడు—అలాంటి వ్యక్తి ఎలా రక్షింపబడగలడు? మనిషి రక్షింపబడతాడా, లేదా అనేది అతడు ఎంత పని చేశాడు, లేక అతడు ఎంత సమర్పణ కలిగి ఉన్నాడనే దానిపై ఆధారపడి కాకుండా పరిశుద్దాత్మ కార్యాన్ని ఎరిగి ఉన్నాడా, లేదా అతడు సత్యాన్ని అనుసరించగలడా, లేదా మరియు అనుసరణ గురించిన అతని అభిప్రాయాలు సత్యానికి అనుగుణంగా ఉన్నాయా, లేదా అనే దానిని బట్టి నిర్ణయించబడుతుంది.
పేతురు యేసును వెంబడించడం ప్రారంభించిన తరువాతే సాధారణ ప్రత్యక్షతలు సంభవించినప్పటికీ, అతడు స్వాభావికముగానే, మొదటి నుండి, పరిశుద్దాత్మకు లోబడి క్రీస్తును అనుసరించుటకు ఇష్టపడే వ్యక్తిగానే ఉన్నాడు. పరిశుద్దాత్మ పట్ల అతనికున్న విధేయత స్వచ్చమైనది: అతడు కీర్తి మరియు అదృష్టాన్ని ఆశించలేదు, బదులుగా సత్యము పట్ల విధేయతతో ప్రేరేపించబడ్డాడు. క్రీస్తును ఎరుగుటను పేతురు మూడుసార్లు తిరస్కరించినప్పటికీ, మరియు ప్రభువైన యేసును అతడు శోధించినప్పటికీ, అటువంటి స్వల్ప మానవ బలహీనత అనేది అతని స్వభావముతో ఎలాంటి సంబంధం కలిగినదై ఉండదు, అది అతని భవిష్యత్తు ఆచరణపై ప్రభావం చూపదు, మరియు అతని శోధనఅనేదిక్రీస్తు విరోధి కార్యమని తగినంతగా నిరూపించబడలేదు. సాధారణ మానవ బలహీనత అనేది లోకంలోని ప్రజలందరూ పంచుకునే విషయమే—పేతురు ఏమైనా భిన్నంగా ఉండాలని నీవు భావిస్తున్నావా? పేతురు అనేకమైన మూర్ఖపు తప్పిదాలు చేశాడు కాబట్టి ప్రజలు అతని గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండకుండా ఉంటారా? పౌలు చేసిన కార్యమంతటిని బట్టి, మరియు అతడు రాసిన పత్రికలన్నిటినీ బట్టి ప్రజలు అతడిని ఎంతగానో పూజించలేదా? మనిషి లోపలి గుణాన్ని మనిషి చూడగలగడం సాధ్యమైనా? వివేచన కలిగిన వారు నిజంగానే అటువంటి అల్పమైన దానిని తప్పనిసరిగా చూస్తారా? పేతురు యొక్క బాధాకరమైన అనుభవాలు బైబిల్లో నమోదు చేయబడనంత మాత్రాన, పేతురుకు నిజమైన అనుభవాలు లేవనో, లేక పేతురు పరిపూర్ణ పరచబడలేదనో అది రుజువు చేయదు. దేవుని కార్యాన్ని మానవుడు పూర్తిగా ఎలా తెలుసుకోగలడు? బైబిల్లో రాయబడినవి యేసు వ్యక్తిగతంగా ఎన్నుకున్నవి కావు, అవన్నీ ఆ తరువాతి తరాల ద్వారా రచించబడ్డాయి. అలాంటప్పుడు, బైబిల్లో రాయబడినవన్నీ మానవ ఆలోచనకు అనుగుణంగా ఎంచుకున్నవి కాదా? అంతేగాక, పేతురు మరియు పౌలు ముగింపులు పత్రికల్లో స్పష్టంగా చెప్పబడలేదు, కాబట్టి మనిషి తన జ్ఞానానుసారం, మరియు తన అభిప్రాయాలను బట్టి తీర్పు తీరుస్తాడు. పౌలు ఎంతో పని చేశాడు కాబట్టి, అతని “తోడ్పాటు” ఎంతో గొప్పది కాబట్టి, అతడు జన సమూహాల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అంటే, మానవుడు పేలవమైన విషయాల పట్ల దృష్టి పెట్టడం లేదంటాదా? మానవుని అంతర్గతాన్ని మానవుడు ఎలా చూడగలడు? చెప్పనవసరం లేకుండానే, పౌలు వేల సంవత్సరాలుగా ఒక ఆరాధన అంశముగా ఉన్నాడు కాబట్టి, అతని పనిని దూకుడుగా తిరస్కరించే ధైర్యం ఎవరు చేయగలరు? పేతురు కేవలం ఒక జాలరి, కాబట్టి అతని తోడ్పాటు పౌలు చేసిన దానికంటే గొప్పగా ఎలా ఉండగలదు? వారు చేసిన తోడ్పాటుల పరంగా చూస్తే, పేతురు కంటే ముందు పౌలుకే బహుమానం లభించి ఉండాలి, మరియు దేవుని మెప్పు పొందడానికి అతడే అత్యంత యోగ్యుడై ఉండాలి. అయితే, పౌలు పట్ల ఆయన ఆదరించిన విధానంలో, దేవుడు తన వరాల ద్వారా అతడిని పనిచేసే విధంగా మాత్రమే చేసి, పేతురును దేవుడు పరిపూర్ణ పరుస్తాడని ఎవరు మాత్రం ఊహించగలరు. దీనర్ధం ప్రభువైన యేసు మొట్టమొదటి నుండే పేతురు మరియు పౌలు కొరకు ప్రణాళికలు రూపొందించాడని కాదు: కానీ, వారు, వారి స్వాభావిక వైఖరుల ప్రకారం పరిపూర్ణ పరచబడ్డారు లేక పనిలో పెట్టబడ్డారు. కాబట్టి, ప్రజలు చూసేది మనిషి బాహ్య సహకారం మాత్రమే, అయితే దేవుడు మాత్రం మనిషి అంతరంగాన్ని, అలాగే మొదటి నుండి మనిషి అనుసరిస్తున్న మార్గం, మరియు ఆ అనుసరణ వెనకున్న మనిషి ఉద్దేశాన్ని చూస్తాడు. ప్రజలు తమ ఆలోచనల ప్రకారం, మరియు వారికున్న అవగాహన ప్రకారం మనిషిని అంచనా వేస్తారు, అయినప్పటికీ మనిషి ఆఖరి అంతం అనేది అతని బాహ్య ప్రయోజనాలను బట్టి నిర్ణయించబడదు. కాబట్టి మొదటి నుండి నీవు తీసుకున్న మార్గము విజయ మార్గముగా ఉండి, మొదటి నుండి అనుసరణ పట్ల నీ దృష్టి సరైనదిగా ఉంటే, అప్పుడు నీవు పేతురు లాంటి వాడవని నేను చెప్తాను; ఒకవేళ నీవు నడిచే మార్గము నాశన మార్గమైతే, నీవు ఎంత వెల చెల్లించినా సరే, నీ అంతము ఇప్పటికీ పౌలు వలె ఉంటుంది. ఏదేమైనప్పటికీ, నీ గమ్యమనేది, నీవు గెలిచినా లేదా ఓడినా, ఆ రెండూ నీవు అనుసరించేది సరైనదా, కాదా అనే దానిని బట్టే నిర్ణయించబడుతుందే గానీ, నీ భక్తి, లేక నీవు చెల్లించే వెలను బట్టి కాదు. పేతురు మరియు పౌలు స్వభావాలు, వారు అనుసరించిన గమ్యాలు, భిన్నమైనవి; ఈ విషయాలు కనుగొనడం మనిషికి సాధ్యం కాదు, దేవుడు మాత్రమే వారిని, వారి సమస్తాన్ని తెలుసుకోగలడు. కాబట్టి దేవుడు చూసేది మనిషి అంతరంగం, అయితే మనిషికి అతని అంతరంగము గురించి అతనికి తెలియదు. మనిషి మనిషిలో ఉన్న అంతర్గతాన్నో లేక అతని నిజమైన స్థితినో చూడలేడు, కాబట్టి పౌలు మరియు పేతురు విజయము మరియు వైఫల్యానికి గల కారణాలను మనిషి గుర్తించలేడు. అనేక మంది ప్రజలు పేతురును కాకుండా, పౌలును ఆరాధించడానికి గల కారణమేమిటంటే, పౌలు బహిరంగ కార్యము కొరకు ఉపయోగించబడ్డాడు, మరియు మనిషి ఈ కార్యాన్ని గ్రహించగలడు, కాబట్టి ప్రజలు పౌలు “విజయాలు” గుర్తించారు. అయితే, పేతురు అనుభవాలనేవి మనిషికి కనిపించేవి కావు, మరియు అతడు ఆశించినది మనిషి గ్రహించగలిగినది కాదు కాబట్టి, మానవునికి పేతురు పట్ల ఆసక్తి లేకుండా పోయింది.
పరిష్కరించబడటం మరియు శుద్దీకరణ ద్వారా పేతురు పరిపూర్ణత చెందాడు. “నేను ఎల్లప్పుడూ దేవుని ఆశను తృప్తి పరచాలి. నేను చేసే ప్రతి పనిలో నేను దేవుని ఆశను మాత్రమే తృప్తి పరచడానికి ప్రయత్నిస్తాను, మరియు నేను శిక్షించబడినా, లేక తీర్పు తీర్చబడినా, ఇంకా నేను చేయడానికి సంతోషిస్తాను” అని అతడు అన్నాడు. పేతురు తన సమస్తాన్ని దేవునికి ఇచ్చాడు, మరియు తన పనిని, మాటలను, మరియు సంపూర్ణ జీవితం అన్నిటినీ దేవుని ప్రేమించడం కోసం ఉంచాడు. అతడు పరిశుద్దత కోసం వేడుకున్న వ్యక్తి, మరియు అతడు అనుభవించిన కొలది, తన హృదయంలో దేవుని పట్ల తనకున్న ప్రేమ అంత లోతుగా ఉండేది. అయితే, పౌలు, వెలుపల కార్యం మాత్రమే చేశాడు, మరియు అతడు కష్టపడి పని చేసినప్పటికీ, అతని శ్రమంతా అతని పనిని సరిగ్గా చేసి దాని బట్టి ప్రతిఫలాన్ని పొందడం కోసమై ఉన్నది. తనకు ఎలాంటి ప్రతిఫలం లభించదని అతడికి తెలిసి ఉంటే, అతడు అతని పనిని వదులుకునేవాడు. పేతురు తన హృదయంలో ఉన్న నిజమైన ప్రేమ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, అది ఆచరణాత్మకమైనది మరియు సాధించదగినది. అతడు ప్రతిఫలము పొందుకుంటాడా లేదా అనే దాని గురించి పట్టించుకోలేదు, కానీ తన స్వభావము మారగలదా లేదా అనే దాని గురించే శ్రద్ధ వహించాడు. పౌలు ఎక్కువగా కష్టపడి పనిచేయడం పట్ల శ్రద్ధ వహించాడు, అతడు వెలుపల కార్యము మరియు భక్తి గురించి, మరియు సామాన్య ప్రజలు గ్రహించలేని సిద్దాంతాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన అంతరంగంలోని మార్పుల పట్ల గానీ లేదా దేవుని పట్ల నిజమైన ప్రేమ పట్ల గానీ శ్రద్ధ కలిగి లేడు. పేతురు అనుభవాలు దేవుని నిజమైన ప్రేమ మరియు జ్ఞానము సాధించేవిగా ఉన్నాయి. అతని అనుభవాలు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి, మరియు ఆచరణాత్మకంగా జీవించడం కోసమై ఉన్నాయి. పౌలు కార్యము అతడు ఆశించిన విషయాలను పొందుకోడానికి యేసు అతనికి అప్పగించాడు కాబట్టి జరిగింది, అయితే ఇవి అతనికి మరియు దేవునికి గురించిన తన జ్ఞానానికి సంబంధించినవి కావు. అతని పని శిక్ష మరియు న్యాయ తీర్పును తప్పించుకోవడం కోసం మాత్రమే. పేతురు వెదికింది నిజమైన ప్రేమ, మరియు పౌలు వెదికింది నీతి కిరీటం. పేతురు అనేక సంవత్సరాలు పరిశుద్దాత్మ కార్యాన్ని అనుభవించి, క్రీస్తు ఆచరణాత్మక జ్ఞానాన్ని, అలాగే తనను గురించిన పూర్తి అవగాహనను కలిగి ఉన్నాడు. కాబట్టి, దేవుని పట్ల అతనికున్న ప్రేమ స్వచ్చమైనది. అనేక సంవత్సరాల శుద్దీకరణ అనేది యేసు మరియు జీవితం పట్ల అతనికున్న జ్ఞానాన్ని పెంచింది, మరియు అతని ప్రేమ ఎల్లలు లేని ప్రేమ, అది ఒక ఆకస్మికమైన ప్రేమ, మరియు ప్రతిగా అతడు ఏమీ అడగలేదు, అలాగే ఎలాంటి ప్రయోజనాలనూ ఆశించలేదు. పౌలు అనేక సంవత్సరాలు పని చేశాడు, అయినప్పటికీ అతడు క్రీస్తు గురించి గొప్ప జ్ఞానాన్ని కలిగి లేడు, మరియు అతని గురించి అతనికున్న అవగాహన కూడా చాలా తక్కువ. క్రీస్తు పట్ల అతనికి ఏమాత్రమూ ప్రేమ లేదు, అతని పని మరియు అతడు పరుగెత్తిన పందెము చివరి బహుమానాన్ని పొందుకోవడం కోసమే. అతడు ఆశించింది అత్యుత్తమమైన కిరీటాన్నే గానీ, స్వచ్చమైన ప్రేమను కాదు. అతడు నామ మాత్రంగానే వెదికాడు కానీ, చురుకుగా వెదకలేదు; అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు, కానీ పరిశుద్దాత్మ కార్యము చేత పట్టుబడిన తరువాత తన ఆచరణ కోసం బలవంతం చేయబడ్డాడు. కాబట్టి, అతని అన్వేషణ అనేది అతడు యోగ్యమైన దేవుని జీవరాశిగా నిరూపించదు; పేతురు తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన యోగ్యమైన దేవుని జీవరాశి. దేవునికి సహకారం అందించే వారందరూ ప్రతిఫలం పొందాలనీ, మరియు ఎంత ఎక్కువ సహకారం అందిస్తారో, దేవుని దయను పొందే అవకాశం అంత ఎక్కువగా కలిగి ఉండాలనీ మనిషి అనుకుంటాడు. మానవ దృష్టి స్వభావము పరస్పర వినిమయము మీదే ఉంటుంది మరియు దేవుని జీవరాశిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అతను చురుకుగా ప్రయత్నించడు. దేవుని విషయానికి వస్తే, ప్రజలు ఎంత ఎక్కువగా దేవుని పట్ల పూర్తి విధేయత, మరియు దేవుని పట్ల నిజమైన ప్రేమ కొరకు అన్వేషిస్తారో, అంటే, దేవుని జీవరాశిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తారో వారు అంతగా దేవుని ఆమోదాన్ని పొందుకుంటారు. మనిషి తన మూల కర్తవ్యాన్ని మరియు స్థితిని తిరిగి పొందాలనుకోవడమే దేవుని దృష్టికోణంగా ఉన్నది. మానవుడు దేవుని జీవరాశే అయినప్పటికీ, ఏవిధంగానైనా దేవుని కోర్కెలు కోరడం ద్వారా మానవుడు తనను తాను హెచ్చించుకోకూడదు, మరియు దేవునిచే సృజించబడిన వానిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మించి మరేదీ చేయకూడదు. పౌలు మరియు పేతురు గమ్యాలు దేవుని జీవరాశులుగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారా లేదా అనే దాన్ని బట్టి కొలవబడ్డారే గానీ, వారు అందించిన సహకారపు పరిమాణాన్ని బట్టి కాదు; వారి గమ్య స్థానాలు మొదటి నుండి వారు అన్వేషించిన దానిని బట్టి నిర్ణయించబడ్డాయి గానీ, వారు ఎంత పని చేశారు, లేక వారి గురించి ఇతరులు వేసిన అంచనాని బట్టి కాదు. కాబట్టి, దేవుని జీవరాశిగా ఒకరి కర్తవ్యాన్ని చురుకుగా నిర్వర్తించడానికి ప్రయత్నించడమే విజయానికి మార్గము; దేవుని పట్ల నిజమైన ప్రేమ మార్గాన్ని అన్వేషించడం ఎంతో మంచి మార్గం; ఒకరి పాత స్వభావంలో మార్పులకు ప్రయత్నించడం, మరియు దేవుని పట్ల నిజమైన ప్రేమ కోసం అన్వేషించడం, అనేది విజయానికి మార్గము. అలాంటి విజయ మార్గము ప్రాథమిక కర్తవ్యాన్ని అలాగే దేవుని జీవరాశి దాని స్వరూపాన్ని తిరిగి పొందుకునే మార్గమై ఉన్నది. ఇది పునరుద్దరణ మార్గము, మరియు ఇది ఆది నుండి అంతము వరకు ఉన్న దేవుని కార్యమంతటి లక్ష్యము కూడా. మానవుని అన్వేషణ మితిమీరిన వ్యక్తిగత కోరికలతో మరియు మూర్ఖపు ఆశలతో మలినమైతే, అప్పుడు కలిగే ప్రభావం మానవుని స్వభావములో కలిగే మార్పులు కావు. ఇది పునరుద్దరణ కార్యానికి విరోధమైనది. ఇది నిస్సందేహంగా పరిశుద్దాత్మ ద్వారా జరిగించబడిన కార్యము కాదు, కాబట్టి ఈ రకమైన అన్వేషణ దేవునికి ఆమోదయోగ్యము కాదని ఇది రుజువు చేస్తున్నది. దేవుని ద్వారా ఆమోదించబడని అన్వేషణకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది?
పౌలు చేసిన కార్యము మనిషి ఎదుట ప్రదర్శించబడింది, కానీ దేవుని పట్ల అతనికున్న ప్రేమ స్వచ్చమైనదేనా మరియు అతని హృదయమందు అతడు దేవుని ఎంతగా ప్రేమించాడు—అనే విషయాలను మానవుడు చూడలేడు. మానవుడు తాను చేసిన పనిని మాత్రమే చూడగలడు, తద్వారా, తాను పరిశుద్దాత్మ ద్వారా నిశ్చయంగా వాడబడ్డాడని మానవుడు తెలుసుకుంటాడు, కాబట్టే పేతురు కంటే పౌలు గొప్పవాడనీ, అతని పని ఎంతో గొప్పదనీ, ఎందుకంటే అతడు సంఘాలకు ఎంతో అందించగలిగాడనీ మనిషి అనుకుంటాడు. పేతురు తన వ్యక్తిగత అనుభవాలను మాత్రమే చూసుకుంటూ తను అప్పుడప్పుడు చేసిన పని సమయంలో కొంతమంది వ్యక్తులనే సంపాదించాడు. అతని వద్ద నుండి అయితే చాలా తక్కువగా తెలిసిన కొన్ని పత్రికలు మాత్రమే ఉన్నాయి, కానీ అతని హృదయపు లోతుల్లో దేవుని పట్ల అతనికున్న ప్రేమ ఎంత గొప్పదో ఎవరికి తెలుసు? దిన, దినము పౌలు దేవుని కొరకు పని చేశాడు; చేయాల్సిన పని ఉన్నంత వరకే అతడు చేశాడు. ఆ విధంగా అతడు దేవుని తృప్తి పరిచి, కిరీటాన్ని పొందగలడని అతడు భావించాడు, అయినప్పటికీ తన పని ద్వారా అతను తనను తాను మార్చుకునే మార్గాలను అన్వేషించలేదు. పేతురు జీవితంలో దేవుని ఆశను తృప్తి పరచనిది ఏదైనా అతనికి అసౌకర్యంగానే అనిపించేది. అది గనుక దేవుని కోరికను తృప్తి పరచకపోతే, అతడు పశ్చాత్తాప భావం కలిగి, దేవుని హృదయాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించదగిన మార్గం కోసం వెదికాడు. అతని జీవితంలోని అతి చిన్న మరియు అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా, దేవుని కోరికను నెరవేర్చాలనే అతను ఆశించాడు. అతని పాత స్వభావానికొస్తే, అతడు నిశ్చయత కలిగి లేడు, సత్యములో లోతుగా వృద్ధి చెందడానికి, తన గురించిన తన అవసరతలలో ఎప్పుడూ అతడు కఠినంగానే ఉన్నాడు. పౌలు కేవలం పైపైని కీర్తిని మరియు హోదాను ఆశించాడు. మనిషి ముందు తనను తాను హెచ్చించుకోడానికి ప్రయత్నించాడు, మరియు జీవిత ప్రవేశం కొరకు ఎలాంటి లోతైన పురోగతిని సాధించడానికి ప్రయత్నించలేదు. అతడు శ్రద్ధ వహించింది సిద్దాంతం పట్లే కానీ, వాస్తవికత పట్ల కాదు. కొంతమంది, “దేవుని కోసం పౌలు ఎంతో పని చేశాడు, దేవుడు అతనిని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? అని అంటారు. అయితే దేవుని కోసం పేతురు చిన్న పనే చేశాడు, మరియు సంఘాలకు గొప్ప సహాయ సహకారం అందించలేదు, అయినప్పటికీ, అతడు ఎందుకు పరిపూర్ణుడయ్యాడు?” దేవుడు కోరిన విధంగా, పేతురు నిర్దిష్ట స్థాయి వరకు దేవుని ప్రేమించాడు; అలాంటి వ్యక్తులు మాత్రమే అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. మరి పౌలు సంగతేంటి? పౌలు ఏ స్థాయి వరకు దేవుణ్ణి ప్రేమించాడు? నీకు తెలుసా? పౌలు కార్యము దేని కోసం చేయబడింది? పేతురు ఎక్కువ పని చేయలేదు, కానీ అతని హృదయ లోతుల్లో ఏముందో నీకు తెలుసా? పౌలు కార్యము సంఘాలను పోషించడానికి, మరియు సంఘాలకు సహాయపడటానికి సంబంధించినది. పేతురు తన జీవితంలో మార్పులను అనుభవించాడు; అతడు దేవుని పట్ల నిజమైన ప్రేమను అనుభవించాడు. ఇప్పుడు నీవు వారి స్వభావాల్లోని వ్యత్యాసాలను తెలుసుకున్నావు, చివరికి, ఎవరు దేవుని నిజముగా నమ్మారు, మరియు ఎవరు దేవుణ్ణి నిజముగా నమ్మలేదో నీవు చూడవచ్చు. వారిలో ఒకరు దేవుణ్ణి నిజంగా ప్రేమించారు, మరొకరు నిజముగా దేవుని ప్రేమించలేదు; ఒకరు తన స్వభావములో మార్పులకు గురయ్యారు, మరొకరు కాలేదు; ఒకరేమో వినయంగా సేవ చేసినప్పటికీ, అంత సులభంగా ప్రజల ద్వారా గుర్తించబడలేదు, మరొకరేమో ప్రజలచేత ఆరాధించబడ్డారు, మరియు గొప్ప స్థాయిని కలిగి ఉన్నారు; ఒకరు పరిశుద్దతను వెదికారు, మరొకరు చేయలేదు, అతను అపవిత్రుడు కానప్పటికీ, అతనిలో స్వచ్చమైన ప్రేమ లేదు; ఒకరు నిజమైన మానవత్వాన్ని కలిగి ఉన్నారు, మరొకరు కలిగి లేరు; ఒకరు దేవుని ఉత్పాదితపు వివేచన కలిగి ఉన్నారు, మరొకరు కలిగి లేరు. ఇవే పౌలు మరియు పేతురుల స్వభావాల మధ్య గల వ్యత్యాసాలు. పేతురు నడిచిన మార్గము విజయ మార్గము. సాధారణ మానవత్వపు పునరుద్దరణ మరియు దేవుని ఉత్పాదితపు కర్తవ్య పునరుద్దరణను సాధించే మార్గము కూడా అదే. విజయవంతమైన వారందరికీ పేతురు సూచనగా ఉన్నాడు. పౌలు నడిచిన మార్గము వైఫల్య మార్గము, మరియు కేవలం సమర్పణ కలిగి తమను తాము పైపైన వెచ్చించి, దేవుని నిజముగా ప్రేమించని వారందరికీ అతడు ప్రతినిధిగా ఉన్నాడు. సత్యాన్ని కలిగి లేని వారందరికీ పౌలు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేవునిపై తనకున్న విశ్వాసంలో, పేతురు ప్రతి విషయములోనూ దేవుణ్ణి సంతృప్తి పరచాలని ఆశించాడు, మరియు దేవుని నుండి వచ్చిన సమస్తానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడ్డాడు. ఏ చిన్న ఆక్షేపణైనా లేకుండానే, శిక్షను మరియు న్యాయతీర్పును, అలాగే శుద్దీకరణ, శ్రమలను మరియు తన జీవితంలో ఏమీ లేకపోవడాన్ని అతను అంగీకరించగలిగాడు, వీటిలో ఏదీ దేవుని పట్ల అతనికున్న ప్రేమను మార్చలేదు. ఇదే దేవుని పట్ల ఉన్న పరమ ప్రేమ కాదా? ఇదే దేవుని ప్రాణి యొక్క కర్తవ్యపు నెరవేర్పు కాదా? శిక్ష, న్యాయతీర్పులో అయినా, లేదా శ్రమలలోనైనా, మరణం వరకు నీవు ఎల్లప్పుడూ విధేయతను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటావు, మరియు దేవునిచే సృజించబడిన వారు సాధించవలసినది ఇదే, ఇదే దేవుని పట్ల ఉన్న ప్రేమ యొక్క స్వచ్ఛత. మనిషి ఇంత వరకు సాధించగలిగితే, అప్పుడతడు యోగ్యమైన దేవుని జీవరాశి అవుతాడు, ఇక ఇంతకంటే సృష్టికర్త కోరికను తృప్తి పరిచేది ఏదీ లేదు. నీవు దేవుని కోసం పనిచేయగలిగినప్పటికీ నీవు దేవునికి లోబడకుండా, నిజముగా దేవుని ప్రేమించే సామర్థ్యము లేదని ఊహించుకొనండి. ఈ విధంగా, దేవుని ఉత్పాదితపు కర్తవ్యాన్ని నెరవేర్చకపోవడమే కాకుండా; దేవుని చేత నీవు ఖండించబడతావు కూడా, ఎందుకంటే నీవు సత్యాన్ని కలిగి లేని వ్యక్తివి, దేవునికి లోబడని వాడవు, మరియు దేవునికి అవిధేయుడవు. నీవు కేవలం దేవుని కొరకు పనిచేయడం పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తావు, సత్యాన్ని ఆచరించడం లేదా నిన్ను నీవు తెలుసుకోవడం గురించి పట్టించుకోవు. సృష్టికర్త గురించి తెలుసుకోవు లేక అర్ధం చేసుకోవు, మరియు నీవు సృష్టికర్తకు విధేయుడిగానో లేదా ప్రేమ కలిగిన వ్యక్తిగానో ఉండవు. నీవు స్వాభావికముగానే దేవునికి అవిధేయుడవు, కాబట్టి, అటువంటి వ్యక్తులు సృష్టికర్తకు ప్రియమైన వారు కారు.
కొంతమంది, “పౌలు బ్రహ్మాండమైన కార్యాన్ని చేశాడు, సంఘాల కొరకు అతడు గొప్ప భారాలను భుజానికెత్తుకుని వాటికి ఎంతో సహకారాన్ని అందించాడ. పౌలు యొక్క పదమూడు పత్రికలు కృపా యుగపు 2000 సంవత్సరాలను ఎత్తిపట్టాయి, మరియు అవి నాలుగు సువార్తలకు రెండవ భాగంగా మాత్రమే ఉన్నాయి. అతనితో ఎవరు పోల్చుకోగలరు? యోహాను ప్రకటన గ్రంధాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేరు, అయితే పౌలు పత్రికలు జీవితాన్ని అందిస్తాయి, మరియు అతడు చేసిన పని సంఘాలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇలాంటి వాటిని ఇంకెవరు సాధించగలరు? పేతురు ఏం పని చేశాడు?” అని అంటారు. మానవుడు ఇతరులను అంచనా వేసేటప్పుడు, వారి సహకారాన్ని బట్టి అతడు చేస్తాడు. కానీ, మానవుడిని దేవుడు అంచనా వేసినప్పుడు, మానవ స్వభావాన్ని బట్టి ఆయన ఆ పని చేస్తాడు. అలాంటి జీవితాన్ని అన్వేషించే వారిలో, తన అంతర్గతాన్ని గురించి తనకే తెలియని ఒక వ్యక్తి పౌలు. దీనర్ధం అతడు వినయుడు మరియు విధేయుడు అని కాదు, అలాగే దేవునికి విరోధమైన అతని స్వభావం గురించి అతనికే తెలియదు. కాబట్టి, అతడు సవివరమైన అనుభవాలు అనుభవించనివాడు, మరియు సత్యాన్ని అనుసరించని వాడు. పేతురు భిన్నమైన వాడు. తన అసంపూర్ణతలు, బలహీనతలు, దేవుని జీవరాశిగా తన అవినీతి స్వభావం గురించి అతనికి తెలుసు, కాబట్టి తన స్వభావాన్ని మార్చుకునే అనుసరణ మార్గాన్నే అతను కలిగి ఉన్నాడు; అతడు సిద్దాంతం మాత్రమే కలిగి వాస్తవికత లేని వారిలో ఒకడు కాదు. మార్పు చెందినా వారు రక్షింపబడిన కొత్త వ్యక్తులు, వారు సత్యాన్ని అనుసరించే అర్హత కలిగిన వారు. మార్పు చెందని ప్రజలు సహజముగానే చెల్లని వారికి సంబంధించిన వారు; వారు రక్షింపబడని వారు, అంటే, దేవునిచే చీత్కరించబడినవారు మరియు తిరస్కరించబడినవారు. వారి పని ఎంత గొప్పదైనా సరే, దేవుడు వారిని జ్ఞాపకముంచుకోడు. నీవు దీనిని నీ స్వంత అనుసరణతో పోల్చుకున్నప్పుడు, చివరికి నీవు పౌలు లేదా పేతురు వంటి వ్యక్తివా, కాదా అనేది స్వయంగా స్పష్టమవుతుంది. నీవు వెదికే దానిలో ఇంకా సత్యం లేకపోతే, మరియు నేటికీ నీవు పౌలు లాగా అహంకారం మరియు గర్వంతో, ఇంకా నిర్లక్ష్యంగా మరియు అతిశయంతో ఉంటే, అప్పుడు నిస్సందేహంగా నీవు దుర్గతి పాలవుతావు. నీవు పేతురు లాగా వెదికితే, అహంకారపూరితము లేక ఉద్దేశపూర్వకము కాకుండా, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించే, ఆచరణలు మరియు నిజమైన మార్పులను నీవు అనుసరిస్తే, అప్పుడు నీవు విజయాన్ని సాధించగల దేవుని జనితముగా ఉంటావు. పౌలు తన అంతర్గతాన్ని లేక అవినీతిని తానే తెలుసుకోలేదు, అతని అవిధేయత గురించి కూడా అతనికేమి తెలియదు. క్రీస్తు పట్ల తను కలిగి ఉన్న నీచమైన ధిక్కారాన్ని గురించి అతను ఎన్నడూ ప్రస్తావించలేదు, మరియు తీవ్ర విచారాన్నీ వ్యక్తపరచలేదు. అతడు కేవలం క్లుప్త వివరణ మాత్రమే ఇచ్చి, తన హృదయపు లోతుల్లో దేవునికి పూర్తిగా సమర్పించుకోలేదు. ధమస్కునకు వెళ్ళే మార్గంలో అతడు పడిపోయినప్పటికీ, అతడు లోతుగా ఆత్మపరిశీలన చేసుకోలేదు. అతడు కేవలం పనిచేయడాన్ని కొనసాగించడంలో సంతృప్తి చెందాడు, మరియు తన గురించి తాను తెలుసుకోవడం మరియు తన పాత స్వభావాన్ని మార్చుకోవడం సమస్యలలో అత్యంత కీలకమైనదని భావించలేదు. అతడు కేవలం సత్యాన్ని ప్రకటించడం, తన మనస్సాక్షికి రక్షణగా ఉన్న దానిని ఇతరులకు అందించడం, మరియు తనను తాను ఓదార్చుకుని తన గత పాపాలను బట్టి తనను తాను క్షమించుకోడానికి యేసు శిష్యులను ఇకపై హింసించకపోవడాన్ని బట్టి సంతృప్తి చెందాడు. అతడు అనుసరించిన లక్ష్యం భవిష్యత్తు కిరీటం మరియు తాత్కాలికమైన కార్యానికి మించి మరేమీ కాదు, అతడు అనుసరించిన లక్ష్యము సమృద్దియైన కృప మాత్రమే. అతడు తగినంత సత్యాన్ని అనుసరించలేదు, లేదా అతడు ఇదివరకు అర్ధం చేసుకొని సత్యమందు లోతుగా వృద్దిని సాధించలేదు. కాబట్టి అతని గురించి అతనికున్న అవగాహన తప్పు అని చెప్పొచ్చు, అతడు శిక్షను మరియు న్యాయతీర్పును అంగీకరించలేదు. అతడు కార్యము చేయగలిగాడు అంటే, అతడు తన సహజత్వం లేదా స్వభావాన్ని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని కాదు; అతని దృష్టి వెలుపలి ఆచరణల మీద మాత్రమే ఉన్నది. పైగా, అతడు మార్పు కోసం కాకుండా, జ్ఞానం కోసం ప్రయత్నించాడు. అతని కార్యము పూర్తిగా ధమస్కు వెళ్ళే మార్గంలో యేసు కనిపించిన దాని ఫలితముగానే ఉంది. ఆ పని అతడు మొదటగా చేయాలని తీర్మానించుకున్నదో, లేక అతడు తన పాత స్వభావాన్ని ఛేదించడానికి అంగీకరించిన తర్వాత సంభవించినదో కాదు. అతడు ఎంత పని చేసినా, తన పాత స్వభావము మారలేదు, కాబట్టి అతని పని అతని గత పాపాలకు ప్రాయశ్చిత్తం చేయలేదు కానీ ఆ కాలంలోని సంఘాలలో ఒక నిర్దిష్టమైన పాత్రను మాత్రమే పోషించింది. ఎవరి పాత స్వభావం మారలేదో—అంటే, ఎవరు రక్షణ పొందకుండా, ఇంకా ఎక్కువగా సత్య రహితంగా ఉంటాడో—అటువంటి వ్యక్తి, ప్రభువైన యేసుచే అంగీకరించబడిన వారిలో ఒకరిగా మారడానికి పూర్తిగా అసమర్థుడు. అతడు ఏసుక్రీస్తు పట్ల ప్రేమ మరియు భక్తితో నింపబడిన వ్యక్తి కాదు, లేదా సత్యాన్ని అన్వేషించడంలో నేర్పరి కాదు, శరీరధారణ మర్మాన్ని అన్వేషిస్తున్న వ్యక్తి అతడు కాదు. అతడు కేవలం వితండవాదం చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి, మరియు తన కంటే ఉన్నతమైన లేదా సత్యాన్ని కలిగియున్న వారికి ఎవరూ లోబడరు. తనకు విరుద్దమైన వ్యక్తులు మరియు సత్యాల పట్ల, లేదా తనతో ఉన్న శత్రుత్వములో ఉన్న వారి పట్ల అసూయ పడేవాడు, మరియు గొప్ప స్థాయిని ప్రదర్శించిన మరియు లోతైన జ్ఞానాన్ని కలిగి ప్రతిభావంతులైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చాడు. నిజమైన మార్గాన్ని అన్వేషించి మరియు సత్యము తప్ప మరేదీ పట్టించుకోని పేద ప్రజలతో సంభాషించడానికి అతడు ఇష్టపడడు, మరియు బదులుగా కేవలం సిద్దాంతాల గురించి మాత్రమే మాట్లాడుతూ, సమృద్ది జ్ఞానాన్ని కలిగి ఉన్న మత సంబంధమైన సీనియర్ వ్యక్తుల పట్ల తను తాను గానే శ్రద్ధ వహిస్తాడు. పరిశుద్దాత్మ నూతన కార్యము పట్ల అతనికి ప్రేమ లేదు మరియు పరిశుద్దాత్మ నూతన కార్యపు కదలిక పట్ల శ్రద్ధ లేదు. బదులుగా, సాధారణ సత్యాల కంటే ఉన్నతమైన నియమాలు మరియు సిద్దాంతాల పట్ల ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. తన సహజమైన అంతర్గతం మరియు అతడు అనుసరించిన సర్వస్వంలో, అతడు సత్యాన్ని అనుసరించే క్రైస్తవుడని పిలువబడటానికి అర్హుడు కాదు, దేవుని ఇంటిలో నమ్మకమైన దాసుడు కాదు, ఎందుకంటే అతని వేషధారణ చాలా ఎక్కువగా ఉంది, మరియు అతని అవిధేయత తీవ్రంగా ఉంటుంది. అతడు ప్రభువైన యేసు సేవకునిగా పేరొందినప్పటికీ, పరలోక రాజ్యపు ద్వారములో ప్రవేశించడానికి అతడు అస్సలు తగినవాడు కాదు, ఆది నుండి అంతము వరకున్న అతని కార్యాలను బట్టి నీతిమంతుడని పిలవలేము. అతడిని వేషధారణ కలిగియున్న, మరియు దుర్నీతి కలిగి, అయినా కూడా క్రీస్తు కోసం పనిచేసిన వ్యక్తిగా మాత్రమే చూడవచ్చు. అతడిని చెడ్డవానిగా పిలవక పోయినప్పటికీ, దుర్మార్గం చేసిన వ్యక్తిగా పిలవచ్చు. అతడు ఎంతో పని చేశాడు, అయినప్పటికీ అతడు చేసిన పని పరిమాణాన్ని బట్టి కాకుండా, దాని నాణ్యత మరియు స్వభావాన్ని బట్టి మాత్రమే, అతడు తీర్పు తీర్చబడాలి. ఈ విధంగా మాత్రమే ఈ విషయపు మూలానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. “నేను పనిచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాను, అనేకమంది కంటే నేను మెరుగైన వాడిని; ప్రభువు భారం పట్ల మరెవరూ కలిగి లేనంతగా నేను శ్రద్ధ వహిస్తాను, మరియు నా అంత లోతుగా మరెవరూ పశ్చాత్తాప చెందరు, ఎందుకంటే గొప్ప వెలుగు నాపై ప్రకాశించింది, మరియు నేను ఆ గొప్ప వెలుగును చూశాను, కాబట్టి నా పశ్చాత్తాపము అందరికన్నా లోతైనది” అని అతడు ఎల్లప్పుడూ నమ్ముతాడు. ఆ సమయంలో, అతడు తన హృదయంలో తలంచినది ఇదే. తన పని ముగింపులో, పౌలు: “నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడ ముట్టించాను, మరియు నా కోసం నీతి కిరీటము ఉంచబడియున్నది” అని అన్నాడు. అతని పోరాటము, పని మరియు పరుగు ఇవన్నీ పూర్తిగా నీతి కిరీటం కోసమే మరియు అతడు చురుకుగా ముందుకు సాగలేదు. అతడు తన పనిలో శ్రద్దను కనుపరచకపోయినప్పటికీ, తన పొరపాటులను సరిదిద్దుకోవడానికి తన మనస్సాక్షి మోపిన అపవాదులను కప్పిపుచ్చుకోడానికి అతని పని జరిగిందని చెప్పవచ్చు. తన పనిని పూర్తి చేయాలని, తన పరుగును ముగించాలని మరియు వీలైనంత త్వరగా తన పోరాటాన్ని పోరాడాలని తద్వారా నీతి కిరీటాన్ని త్వరగా పొందవచ్చని మాత్రమే అతడు నిరీక్షించాడు. అతడు ఆశించింది తన అనుభవాలు మరియు నిజమైన జ్ఞానంతో యేసు ప్రభువుని కలుసుకోవాలని కాదు, కానీ వీలైనంత త్వరగా తన పని ముగించి, ప్రభువైన యేసును కలుసుకున్నప్పుడు తన పని ద్వారా సంపాదించిన బహుమానాలు పొందడానికి మాత్రమే. అతడు తన పనిని తనను తాను ఓదార్చుకోడానికి, మరియు భవిష్యత్తు కిరీటం కోసం మార్పిడి ఒప్పందం చేసుకోడానికే ఉపయోగించుకున్నాడు. అతడు ఆశించింది కేవలం కిరీటాన్నే గానీ, సత్యాన్ని లేక దేవుణ్ణి కాదు. అలాంటి అనుసరణ ఎలా ప్రామాణికం అవుతుంది? అతని ప్రేరణ, అతని పని, అతడు చెల్లించిన మూల్యము, మరియు అతని సమస్త కృషి—అద్భుతమైన అతని కల్పనలు వాటన్నిటినీ విస్తరింపజేశాయి, మరియు అతడు పూర్తిగా తన కోరికల అనుసారం పనిచేశాడు. అతని మొత్తం పనిలో, అతడు చెల్లించిన వెలలో ఇష్ట పూర్వకమైనది కాస్తయినా లేదు; అతడు కేవలం ఒప్పందం చేసుకోవడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నాడు. అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి తన ప్రయత్నాలు ఇష్ట పూర్వకంగా చేయలేదు, కానీ ఒప్పంద లక్ష్యాన్ని సాధించడానికి వాటిని ఇష్ట పూర్వకంగా చేశాడు. అలాంటి ప్రయత్నాలకు ఏమైనా విలువ ఉన్నదా? అపవిత్రమైన అతని ప్రయత్నాలను ఎవరు మెచ్చుకుంటారు? అలాంటి ప్రయత్నాలపై ఆసక్తి ఎవరికి ఉంటుంది? అతని పని భవిష్యత్తు కొరకైన కలలతో నిండి ఉన్నది, అద్భుతమైన ప్రణాళికలతో నిండి ఉంది, మరియు మానవ స్వభావాన్ని మార్చే మార్గమే. అతని కనికరమంతా బూటకమే; అతని కార్యము మర్యాదపూర్వకమైన మోసాన్నే గానీ, జీవాన్ని అందించలేదు; ఇది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే. ఇలాంటి కార్యమనేది మనిషిని తన ప్రాథమిక కర్తవ్యాన్ని తిరిగి పొందే మార్గంలో ఎలా నడిపిస్తుంది?
పేతురు ఆశించినదంతా దేవుని హృదయానుసారమైనది. అతడు దేవుని ఆశను నెరవేర్చడానికి ప్రయత్నించాడు, బాధలు మరియు ప్రతికూలతలను లెక్క చేయకుండా, దేవుని కోరికను నెరవేర్చడానికి ఇంకా ఇష్టంగానే ఉన్నాడు. దేవుని నమ్మేవారికి ఇంతకన్నా గొప్ప అన్వేషణ అనేది లేదు. పౌలు అనుసరించినది తన సొంత దేహము ద్వారా, తన సొంత ఆలోచనల ద్వారా, మరియు తన సొంత ప్రణాళికలు మరియు పథకాల ద్వారా కలుషితమైంది. అతడు ఏ విధంగానూ యోగ్యమైన దేవుని జనితము కాదు, దేవుని కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించిన వ్యక్తి కాదు. పేతురు దేవుని నిర్వహణకు సమర్పించుకోడానికి ప్రయత్నించాడు, మరియు అతను చేసిన పని అంత గొప్పది కాకపోయినప్పటికీ, అతని అనుసరణ వెనుక ఉన్న ప్రేరణ మరియు అతడు నడిచిన దారి సరైనవి; అతడు అనేకమంది ప్రజలను సంపాదించలేకపోయినప్పటికీ, అతడు సత్య మార్గాన్ని అనుసరించగలిగాడు. దీనిని బట్టి అతడు యోగ్యమైన దేవుని జనితముగా పేర్కొనచ్చు. నేడు, నీవు పనిచేసే వాడవు కాకపోయినప్పటికీ, నీవు దేవుని జీవరాశి కర్తవ్యాన్ని నిర్వర్తించగలరు మరియు దేవుని నిర్వహణలన్నిటికీ సమర్పించుకోడానికి ప్రయత్నించగలరు. దేవుడు చెప్పే ప్రతి దానికి నీవు కట్టుబడి, అన్ని రకాలైన శ్రమలను మరియు శుద్దీకరణలు అనుభవించగలగాలి, మరియు మీరు బలహీనంగా ఉన్నప్పటికీ, మీ హృదయమందు ఇంకా దేవుని ప్రేమించగలగాలి. తమ జీవితానికి తామే బాధ్యత వహించేవారు దేవుని జనితపు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇష్టపడతారు, అనుసరణను గురించిన అలాంటి వ్యక్తుల అభిప్రాయము సరైనది. వీరు దేవునికి అవసరమైన వ్యక్తులు. నీవు ఎంతో పని చేసి, ఇతరులు నీ బోధనలు పొందినప్పటికీ, నిన్ను నీవే మార్చుకోకుండా, ఎలాంటి సాక్ష్యమివ్వకుండా, లేదా ఎలాంటి నిజమైన అనుభవము కలిగి లేకుండా, నీ జీవితం అలాంటి ముగింపులో ఉండి, ఇప్పటికీ నీవు చేసినది ఏదీ సాక్ష్యమివ్వడం లేదంటే, నీవు మార్పు చెందిన వ్యక్తివేనా? నీవు సత్యాన్ని అనుసరించే వ్యక్తివేనా? ఆ సమయంలో, పరిశుద్దాత్మ నిన్ను ఉపయోగించుకున్నాడు, కానీ ఆయన నిన్ను ఉపయోగించుకున్నప్పుడు, నీలో కార్యానికి ఉపయోగపడే భాగాన్ని ఆయన వాడుకున్నాడు, మరియు నీలో పనికిరాని భాగాన్ని వాడుకోలేదు. మార్పు చెందాలని నీవు ఆశిస్తే, వాడుకోబడే ప్రక్రియలో క్రమముగా నీవు పరిపూర్ణ పరచబడతావు. అయితే, చివరికి నీవు సంపాదించబడతావా లేదా అనే దాని గురించి పరిశుద్దాత్మ ఎటువంటి బాధ్యత వహించడు, మరియు ఇది నీ అనుసరణ విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీ వ్యక్తిగత స్వభావంలో ఎలాంటి మార్పులు లేకపోతే, అనుసరణ పట్ల మీ అభిప్రాయము తప్పుగా ఉందని భావం. ఒకవేళ బహుమానం దక్కకపోతే, అప్పుడది నీ సొంత సమస్య, ఎందుకంటే నీకు నీవుగా సత్యాన్ని అనుసరించలేదు మరియు దేవుని కోరికను నెరవేర్చలేదు. కాబట్టి, నీ వ్యక్తిగత అనుభవాల కంటే గొప్ప ప్రాముఖ్యత కలిగినది ఏదీ లేదు, మరియు నీ వ్యక్తిగత ప్రవేశము కంటే క్లిష్టమైనది ఏదీ లేదు! కొంతమంది వ్యక్తులు, “నీ కోసం నేను ఎంతో పని చేశాను, మరియు ఆనందించదగిన విజయాలేవీ నేను సాధించలేకపోయినప్పటికీ, నా ప్రయత్నాలలో నేను ఇంకా శ్రద్ధ కలిగి ఉన్నాను కాబట్టి, జీవ ఫలాన్ని తినడానికి నన్ను పరలోకంలోనికి నీవు అనుమతించలేవా?” అని అంటారు. నేను ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నానో నీవు తెలుసుకోవాలి; పవిత్రత లేనివారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి అనుమతించబడరు, అపవిత్రులు పరిశుద్ద ప్రదేశాన్ని పాడుచేయడానికి అనుమతించబడరు. నీవు ఎంతో పని చేసినప్పటికీ, ఎన్నో ఏళ్ళు పని చేసినప్పటికీ, చివరికి నీవు ఇంకా దుర్మార్గంగా, మలినమై ఉంటే, అప్పుడు నీవు నా రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశిస్తే, అది పరలోకపు ధర్మానికి భరించలేనిదిగా ఉంటుంది! లోకము స్థాపించబడినప్పటి నుండి నేటి వరకు, నన్ను ముఖ స్తుతి చేసే వారికి ఎన్నడూ నా రాజ్య ప్రవేశాన్ని ఇవ్వలేదు. ఇది పరలోకపు నియమం, మరియు దీనిని ఎవ్వరూ అతిక్రమించలేరు! నీవు జీవితాన్ని అన్వేషించాలి. నేడు, పరిపూర్ణ పరచబడిన వారందరూ పేతురు వంటి వారే: వారు తమ స్వభావాల్లో మార్పులను కోరుకునే వారు, వారు దేవుని కొరకు సాక్ష్యమివ్వడానికి మరియు దేవుని బిడ్డగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇష్టపడేవారు. ఇలాంటి వ్యక్తులు మాత్రమే పరిపూర్ణ పరచబడతారు. ఒకవేళ నీవు బహుమానాల కోసం మాత్రమే చూస్తూ, నీ సొంత జీవితపు స్వభావాన్ని మార్చుకోడానికి ప్రయత్నించకపోతే, నీ ప్రయాస అంతా వృధా అవుతుంది—ఇది మార్చలేని నిజం.
పేతురు మరియు పౌలు స్వభావాలలోని వ్యత్యాసాల నుండి జీవాన్ని అనుసరించని వారందరి కష్టం వృధా అవుతుందని నీవు అర్ధం చేసుకోవాలి! నీవు దేవుని నమ్మాలి మరియు దేవుణ్ణి వెంబడించాలి, తద్వారా నీ హృదయంలో నీవు దేవుని ప్రేమించాలి. నీ అవినీతి స్వభావాన్ని పక్కన పెట్టి, దేవుని కోరికను నెరవేర్చడానికి నీవు ప్రయత్నించాలి, మరియు దేవుని బిడ్డగా నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నీవు దేవుని నమ్మి అనుసరిస్తున్నావు కాబట్టి, నీవు ఆయనకు సర్వస్వాన్ని అప్పగించాలి, ఇక నీవు వ్యక్తిగత నిర్ణయాలు లేక ఆక్షేపణలు చేయకూడదు, మరియు దేవుని కోరికను నేరవేర్చడాన్ని నీవు సాధించాలి. నీవు సృజించబడినందున, నిన్ను సృజించిన ప్రభువునకు నీవు లోబడాలి, ఎందుకంటే సహజంగానే నీపై నీకు ఎలాంటి ఆధిపత్యం ఉండదు, మరియు నీ గమ్యాన్ని నిర్ణయించుకునే సామర్థ్యము లేదు. నీవు దేవుని విశ్వసించే వ్యక్తివి కాబట్టి, నీవు పరిశుద్దతను మరియు మార్పును అన్వేషించాలి. నీవు దేవుని బిడ్డవు కాబట్టి, నీవు నీ కర్తవ్యానికి కట్టుబడి ఉండాలి, మరియు నీ స్థానాన్ని నిలబెట్టుకోవాలి, మరియు నీ కర్తవ్యాన్ని అతిక్రమించకూడదు. ఇది ఏదో నిన్ను నిర్భంధించడమో, లేక సిద్దాంతము ద్వారా నిన్ను అణిచివేయడమో కాదు, కానీ ఇది నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి మరియు దానిని సాధించగల మార్గం—నీతియుక్తమైన దానిని చేసే వారందరూ—తప్పక సాధించాలి. ఒకవేళ నీవు పేతురు మరియు పౌలు స్వభావాలను పోలిస్తే, అప్పుడు నీవెలా వెతకాలో నీకు తెలుస్తుంది. పేతురు మరియు పౌలు నడిచిన మార్గాలలో, ఒకటి పరిపూర్ణ పరచబడే మార్గం, మరియు ఒకటి వెలివేయబడే మార్గం; పేతురు మరియు పౌలు రెండు వేర్వేరు మార్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పరిశుద్దాత్మ కార్యాన్ని పొంది, ప్రతి ఒక్కరూ పరిశుద్దాత్మ వెలిగింపు మరియు ప్రకాశాన్ని పొంది, ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసు అప్పగించిన దానిని అంగీకరించినప్పటికీ, ప్రతిఒక్కరూ ఫలించిన ఫలము ఒక్కటి కాదు: ఒకరు నిజంగా ఫలించారు, మరొకరు ఫలించలేదు. వారి స్వభావాల నుండి, వారు చేసిన పని బ్యాహ్యపరంగా వారి ద్వారా కనుపరచబడినవి, మరియు వారి చివరి ముగింపులు నుండి, నీవు ఏ దారి తీసుకోవాలో, నీవు ఏ దారిని నడవడానికి ఎంచుకోవాలో నీవు గ్రహించాలి. వారు స్పష్టమైన రెండు వేర్వేరు మార్గాల్లో నడిచారు. పౌలు మరియు పేతురు, వీళ్ళే ప్రతి ఒక్క మార్గానికి సారాంశం, కాబట్టి మొట్టమొదటి నుండి ఈ రెండు మార్గాలను సూచించడానికి పైకెత్తబడింది వీళ్ళే. పౌలు అనుభవాలలోని ముఖ్యాంశాలు ఏమిటి, మరియు అతడు దాన్ని ఎందుకు చేయలేదు? పేతురు అనుభవాలలోని ముఖ్యాంశాలు ఏమిటి, మరియు పరిపూర్ణ పరచబడటాన్ని అతడు ఎలా అనుభవించాడు? ఒకవేళ వారు ప్రతి ఒక్కరూ దేని పట్ల శ్రద్ధ వహించారో నీవు పోలిస్తే, దేవుడు ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తిని కోరుతున్నాడో, దేవుని చిత్తమేమిటో, దేవుని స్వభావము ఏమిటో, చివరకు ఎలాంటి వ్యక్తి పరిపూర్ణ పరచబడతాడో నీకు తెలుస్తుంది; పరిపూర్ణ పరచబడబోవు వారి స్వభావము ఏమిటో, మరియు పరిపూర్ణ పరచబడిన వారి స్వభావాన్ని ఏమిటో నీవు తెలుసుకుంటావు—ఈ స్వాభావికత సమస్యలను పేతురు మరియు పౌలు అనుభవాలలో చూడవచ్చు. దేవుడు సమస్తమైన వాటిని సృజించాడు, కాబట్టి ఆయన సర్వ సృష్టిని తన ఆధిపత్యంలోకి తెచ్చి, ఆయన అధికారానికి లోబడేలా చేస్తాడు; ఆయన సమస్తమైన వాటిని ఆజ్ఞాపిస్తాడు, తద్వారా సమస్తము ఆయన హస్తాల్లో ఉన్నాయి. జంతువులు, చెట్లు, మానవజాతి, కొండలు మరియు నదులు, మరియు సరస్సులు సహా దేవుని సర్వ సృష్టి—అంతా ఆయన ఆధీనంలోనికే రావాలి. ఆకాశములో మరియు నేలమీద ఉన్నవన్నీ ఆయన ఆధీనంలోనికే రావాలి. వాటికి ఎలాంటి అవకాశము లేదు మరియు అన్నీ ఆయన నిర్వహణలకు లోబడాలి. ఇది దేవునిచే చేయబడిన శాసనం, మరియు ఇది దేవుని అధికారం. దేవుని చిత్తానుసారంగా, దేవుడు ప్రతి దానిని ఆజ్ఞాపించి, ఆదేశించి, మరియు అన్నిటికి హోదాలను ఇచ్చి, ప్రతి ఒక్క రకాన్ని బట్టి వర్గీకరించి, మరియు వాటి స్థానాన్ని కేటాయిస్తాడు. అది ఎంత గొప్పదైనా సరే, దేవుణ్ణి ఏదీ అధిగమించలేదు, ప్రతిది దేవునిచే సృజించబడిన మానవజాతికి సేవ చేస్తుంది, దేవుని ఎదిరించే లేక దేవుని వివరణ కోరే ధైర్యము ఏదీ చేయలేదు. కాబట్టి మనిషి, దేవునిచే సృజించబడిన వానిగా, మానవ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. అతడు ప్రభువు లేక అన్నిటికి సంరక్షకుడు అనే దానితో సంబంధం లేకుండా, మనిషి స్థాయి అన్ని విషయాలలో ఎంత ఉన్నతమైనప్పటికీ, అతడు ఇప్పటికీ దేవుని ఆధీనంలో ఉన్న చిన్న మానవుడు, మరియు ఒక చిన్న సామాన్య మానవుని కంటే ఎక్కువేమీ కాదు, ఒక దేవుని జీవరాశి అనేది శి, మరియు అతడు ఎన్నటికీ దేవుని పైన ఉండడు. ఒక దేవుని జీవిగా, మనిషి దేవుని జీవి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి, మరే ఇతర నిర్ణయాలు చేసుకోకుండా దేవుని ప్రేమించడానికి అన్వేషించాలి, ఎందుకంటే దేవుడు మనిషి ప్రేమకు యోగ్యుడు. దేవుని ప్రేమించడానికి వెదికే వారు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఆశించకూడదు లేదా వ్యక్తిగతంగా వారు వెదుకుతున్న దాని కోసం ఆశించకూడదు; ఇది ఆచరణకు ఎంతో సరైన మార్గం. ఒకవేళ నీవు ఆశించేది సత్యమైతే, నీకు ఆచరించేది సత్యమైతే, నీవు సాధించింది నీ స్వభావంలో మార్పు అయితే, అప్పుడు నీవు నడుస్తున్న మార్గం సరైనది. నీవు కోరుకునేది శరీరానుసారమైన ఆశీర్వాదాలు అయితే, నీవు ఆచరించేది నీ సొంత ఆలోచనల ప్రకారం సత్యమైతే, మరియు నీ స్వభావంలో మార్పు ఏమీ లేకపోతే, శరీరమందు దేవునికి అస్సలు లోబడకపోతే, అప్పటికీ నీవు అస్పష్టతలోనే జీవిస్తుంటే, అప్పుడు నీవు ఆశించేది నిన్ను ఖచ్చితంగా నరకానికే తీసుకెళ్తుంది, ఎందుకంటే నీవు నడిచే మార్గము వైఫల్య మార్గము. నీవు పరిపూర్ణ పరచబడతావా లేక వెలివేయబడతావా అనేది నీ సొంత ఆచరణ మీద ఆధారపడి ఉన్నది, అంటే విజయమైనా లేక నాశనమైనా మనిషి నడిచే మార్గం మీదే ఆధారపడి ఉన్నదని కూడా చెప్పవచ్చు.