మానవ జీవితానికి దేవుడే మూలం

నువ్వు ఏడుస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చిన క్షణం నుండే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మొదలు పెడతావు. దేవుని ప్రణాళిక కోసం ఆయన నియామకం కోసం నువ్వు నీ పాత్రను పోషిస్తూ జీవన ప్రయాణాన్ని ప్రారంభిస్తావు. మీ నేపథ్యం ఏదైనా, మీ ముందున్న ప్రయాణం ఎలా ఉన్నా ఎవరూ పరలోకపు ఏర్పాట్లనుండి తప్పించుకోలేరు; ఎవ్వరూ తమ గురి గమ్యాలను నియంత్రించజాలరు. ఎందుకంటే, సమస్తాన్ని పరిపాలన చేసే ఆయన మాత్రమే అటువంటి పనిని చేయగలడు. మానవజాతి ఉనికిలోకి వచ్చిన నాటినుండి దేవుడు అన్ని వేళలా ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ, అన్ని విషయాల మార్పును ఆదేశిస్తూ, వాటి గతిని నియంత్రించు పనిలో ఉన్నాడు. సృష్టిలో ప్రతి దానివలె మానవుడు తనకు తెలియకుండానే దేవునినుండి కలిగే మంచును, వర్షమును మరియు ఆయన మంచితనమును అనుభవించుచున్నాడు. అన్నింటివలెనే మానవుడు తనకు తెలియకుండానే దేవుని ప్రణాళిక చొప్పున జీవిస్తున్నాడు. మానవుని హృదయం, ఆత్మ దేవుని చేతిలో ఉన్నాయి. అతని జీవన పరిణామ సామర్థ్యాన్ని దేవుడు తన కళ్లతో గమనిస్తాడు. ఈ విషయాన్ని నీవు నమ్మిన నమ్మకపోయినా, సృష్టిలోని సమస్తమును అనగా ప్రాణమున్నవైన ప్రాణములేనివైన దేవుని ఆలోచనల ప్రకారముగానే స్థలాంతరము చెంది, మార్పు చేయబడి, పునరుద్ధరించబడి అదృశ్యమవుతాయి. ఈ విధంగానే దేవుడు సమస్తమును పరిపాలించును.

చప్పుడు చేయకుండా రాత్రి చేరువైనప్పుడు, ఆ విషయమే మనిషికి తెలియదు. ఎందుకంటే రాత్రి అనేది ఎలా అవుతుందో, ఎక్కడ నుండి వస్తుందో మానవ హృదయం గ్రహించదు. అదేవిధంగా రాత్రి అనేది మెల్లగా వెళ్ళిపోయినప్పుడు, మానవుడు పగటి పూటకు స్వాగతం పలుకుతాడు గానీ అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో, రాత్రియందున్న చీకటిని ఎలా పారద్రోలిందో అనే విషయాలను గూర్చి కనీస అవగాహన గానీ, గ్రహింపు గానీ మానవునికి లేదు. మళ్లీ మళ్లీ సంభవించే ఈ రాత్రింబవళ్ళ పరిణామాలు మానవుడిని ఒక కాలము నుండి మరో కాలానికి తీసుకుపోతాయి, ఒక చారిత్రక సందర్భం నుండి మరొక చారిత్రక సందర్భానికి తీసుకుపోతాయి. అదే సమయంలో అంతేగాకుండా, ప్రతి కాలములో దేవుని పని మరియు ప్రతి యుగానికి ఆయన కలిగియున్న ప్రణాళికలు జతగా వెళ్తుంటాయని నిర్ధారణ చేస్తూ ఉంటాయి. ఈ కాలాలన్నిటిలో మానవుడు దేవునితో నడిచాడు. అయినప్పటికీ దేవుడు సకలమును మరియు సకల జీవరాశులను ఎలా పాలిస్తున్నాడో, లేక దేవుడు సమస్తమును, సర్వ సృష్టిని ఎలా నిర్దేశించుచున్నాడో, ఎలా వాటిని నడుపుచున్నాడో మానవునికి తెలియదు. ఈ రహస్యం అనాదికాలం నుండి నేటికాలం వరకు మానవునికి తెలియకుండా ఉండిపోయింది. ఎందుకొరకు అంటే, దేవుని కార్యాలు కనబడకుండ దాచబడినందున కాదు, లేక దేవుని ప్రణాళిక అర్థం కాకపోయినందున కాదు గానీ మానవుని హృదయం మరియు మానవుని ఆత్మ దేవునికి బహు దూరమైనందున మరియు మానవుడు దేవునిని అనుసరిస్తున్నాడనుకుంటూ సాతాను సేవలో ఉండిపోయినందున మానవుడు ఆ విషయాలను గ్రహించలేకపోవుచున్నాడు. నిజానికి ఏ ఒక్కరూ దేవుని ముఖ దర్శనమును మరియు దేవుని అడుగు జాడలను వెదకడం లేదు. ఎవ్వరూ దేవుని సంరక్షణలో, పోషణలో ఉండేందుకు సిద్ధంగా ఉండరు. దానికి బదులు వారు ఈ ప్రపంచానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవడం కోసం, నాశనమైపోయే సాతాను మీద ఆధారపడతారు. దుష్టులైన మానవులు ఏ నియమాలను అనుసరిస్తారో వాటినే పాటిస్తారు. ఇట్లాంటి దశలో మానవుని హృదయం మరియు మానవుని ఆత్మ సాతానుకు కానుకలుగాను మరియు సాతాను ఆహార పదార్థములుగాను మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే, మానవుని హృదయం, ఆత్మ సాతానుకు నివాస స్థానాలుగా, ఆటకోసం అనువైన మైదానంగా మారినాయి. ఆ విధంగా మానవుడు మానవ జీవన సూత్రాలను, జీవితపు విలువను, మానవ ఉనికి యొక్క అర్థాన్ని మరియు విలువలను, మనిషిగా అనుసరించవలసిన సూత్రాలను అర్థము చేసుకోవడములో మనిషి తనకు తెలియకుండానే విఫలమయ్యాడు. దేవునికిని, మనిషికిని మధ్యనున్న నిబంధన మరియు దేవుని కట్టడలు మనిషి హృదయంలో క్రమక్రమంగా మసకబారినాయి. ఫలితంగా అతడు దేవుడిని అన్వేషించడం, లక్ష్యపెట్టడం మానుకున్నాడు. కాలక్రమాన, దేవుడు తనను ఎందుకు సృష్టించాడో మానవుడు మరిచిపోయాడు. దేవుని నోటి నుంచి వచ్చిన మాటలను, దేవునినుండి వచ్చే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోలేకపోవుచున్నాడు. ఆ తరువాత మానవుడు దేవుని ఆజ్ఞలకు, నిబంధనలకు ఎదురు తిరిగాడు. అతని హృదయం, ఆత్మ నశించాయి…. తను ఆదిలో సృష్టించిన మానవుడిని దేవుడు కోల్పోయాడు. అదేవిధంగా మానవుడు తను కలిగిఉన్న మూలాన్ని మరిచిపోయాడు. ఇది ఈ మానవజాతికి దుఃఖకరమైనది. నిజానికి ప్రారంభం నుండి ఇప్పటివరకు దేవుడు మానవాళియంతటికి దుఃఖ సందర్భాల వేదికనే ఇచ్చాడు. అందులో ముఖ్య కథానాయకుడు మరియు బాధితుడూ మానవుడే. ఈ దుఃఖకరమైన వృత్తాంతానికి దర్శకుడెవరు అనే ప్రశ్నకు ఎవరూ జవాబివ్వలేరు.

విశాల ప్రపంచంలో. మహాసముద్రాలు పొలాల్లో మేట వేస్తున్నాయి, పొలాలేమో సముద్రాల్లోకి వరదలెత్తుతున్నాయి. అన్నిటినీ పాలించే దేవుడు తప్ప ఈ మానవజాతికి మార్గదర్శనం చేసి నడిపించగలిగేవారెవరూ లేరు. ఈ మానవజాతి కోసం శ్రమించేందుకు గానీ, దానికి ఏర్పాట్లు చేసేందుకు గానీ శక్తిమంతులెవరూ లేరు. ఈ మానవజాతిని గమ్యస్థానమైన వెలుగు దిశగా నడిపించి, లోక అన్యాయాలనుండి దానికి విముక్తిని ప్రసాదించగలిగేవారైతే మరీ తక్కువ. మానవజాతి భవిష్యత్తు ఏమైపోతుందోనని దేవుడు ప్రలాపించుచున్నాడు, మనుష్యులు పతనమైతేఆయన దుఃఖిస్తాడు. నానాటికి మానవాళియంత నాశనానికి జోగుచున్నందున, వెనక్కి తిరిగి రాలేని దారిలో ఒక్కో అడుగూ వేస్తూ ప్రయాణము చేస్తున్నందున బాధపడుచున్నాడు. దేవుని హృదయాన్ని బద్దలు చేసి, ఆయనను త్యజించి, దుష్టత్వాన్ని కోరుకునే మానవజాతి ఏ దిశలో ప్రయాణిస్తున్నదో ఎవరూ ఆలోచించలేదు. సరిగ్గా ఈ కారణం చేతనే ఎవరూ దేవుని ఆగ్రహాన్ని పసిగట్టడం లేదు, ఆయనను మెప్పించే మార్గాన్ని అన్వేషించడం లేదు, లేదా ఆయన దగ్గరగా పోవాలని కోరుకోవడం లేదు. ఇక దేవుని దుఖాన్ని, బాధను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు? దేవుని మాటలను విన్నతర్వాత కూడా మానవుడు తన మార్గంలోనే నడుస్తూ, అతని అనుగ్రహాన్నీ సంరక్షణనూ తప్పించుకుంటూ, ఆయన సత్యాన్ని త్యజిస్తూ, దేవునికి శత్రువైన సాతానుకు అమ్ముడుపోతూ దేవునికి దూరంగా పోతున్నాడు. మానవుడు ఇట్లా మొండిగా ప్రవర్తిస్తే, వెనక్కి చూడకుండా తనను నిరాకరించిన మానవజాతి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎన్నోమార్లు జ్ఞాపకము చేస్తూ, హెచ్చరికలు చేయడానికిగల కారణం మునుపెన్నడు లేనటువంటి గొప్ప ఉపద్రవము ఆయన చేతిలో సిద్ధము చేసుకొని ఉన్నాడని, మనుష్యులలో ఏ ఒక్కరూ ఈ ఉపద్రవాన్ని భరించలేరని మానవులలో ఏ ఒక్కరికీ తెలియదు. ఈ ఉపద్రవం కేవలం శరీరానికే శిక్ష కాదు, ఆత్మకు కూడా శిక్షే. నీవు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడైతే విఫలమౌతుందో, అతని హెచ్చరికలు, ప్రోత్సాహాలు ఎప్పుడైతే ఫలితాన్ని ఇవ్వవో అప్పుడు దేవుడు ఎటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు? దేవుని చేత సృష్టింపబడిన ఏ ప్రాణి కూడా ఎప్పుడూ ఊహించనంత, అనుభవించనంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నేను చెబుతున్నదేమంటే, ఆ ఉపద్రవం ఇంతకు ముందెప్పుడూ లేనంత తీవ్రంగా ఉంటుంది. అటువంటిది మళ్లీ సంభవించదు. ఎందుకంటే, మానవజాతిని సృష్టించాలనే దేవుని ప్రణాళిక ఈ ఒక్కసారే జరుగుతుంది. అదేవిధంగా మానవజాతిని రక్షించాలనే ప్రణాళికి కూడా ఈ ఒక్కసారే జరుగుతుంది. అంటే ఇదే మొదటిసారిది, ఇదే చివరిసారి అన్నమాట. కాబట్టి, ఈసారి మానవజాతిని రక్షించేందుకు దేవుడు ఎలాంటి జాగ్రత్తతో కూడిన ఉద్దేశాలను కలిగి, ఎలాంటి బలమైన అపేక్షను అవలంబిస్తాడో ఎవరూ గ్రహించలేరు.

దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, జీవించు వ్యక్తిగా మనుష్యుని తయారు చేసి, అతనిలో జీవము పోశాడు. తర్వాత, తల్లిదండ్రులు, బంధువులు రావడంతో మనిషి ఒంటరిగా లేడు. మానవుడు మొదటిసారిగా ఈ భౌతిక ప్రపంచాన్ని చూసినప్పటినుండి మానవుణ్ణి దేని కొరకైతే దేవుడు చేసుకున్నాడో ఆ దేవుని నియామకములోనే జీవించాలని మానవుడు నియమించబడ్డాడు. దేవుని నుండి వచ్చిన జీవ వాయువు జీవించు ప్రతివారికి పెరిగి పెద్ద కావడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మానవుడు దేవుని సంరక్షణలో పెరుగుతున్నాడని ఎవరూ తెలుసుకోరు. తాము తమ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్నామని అనుకుంటారు, సహజ సిద్ధంగా వచ్చిన తమ స్వంత జీవిత ప్రవృత్తివలన తాము ఎదుగుచున్నామని నమ్ముతారు. దీనికి కారణమేమంటే, తనకు జీవం పోసిందెవరో, అది ఎప్పుడు తనలో ప్రవేశించిందో మానవునికి సరిగ్గా తెలియదు. జీవము యొక్క సహజ గుణం అద్భుతాలను, మహిమలను సృష్టిస్తుందనే సంగతైతే అతి తక్కువగా తెలుస్తుంది. తన జీవితం కొనసాగడానికి కేవలం ఆహారం మాత్రమే కారణమనుకుంటాడతడు. పట్టుదల తన జీవితానికి మూలం అని భావిస్తాడు. తన మనసులోని విశ్వాసాలమీద తన మనుగడ ఆధారపడివుందని అనుకుంటాడు. దేవుని కృప, ఆయన అందించు వనరులను గురించి మానవుడు పూర్తిగా మరిచిపోయాడు. కాబట్టి, దేవుడు తాను పోసిన ప్రాణాన్ని తానే తునాతునకు చేస్తాడు. దేవుడు ఇంత జాగ్రత్తగా రాత్రింబవళ్ళు సంరక్షించే మానవాళిలో ఒక్కరు కూడా దేవునిని ఆరాధించడానికి ఇష్టపడుటలేదు. దేవుడు మనుష్యుల నుండి దేనిని ఆశించకుండా, వారిపట్ల ఎటువంటి ప్రణాళికలనైతే కలిగియున్నాడో ఆ ప్రణాళికలను చేయు దిశగా నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మానవుడు తన కలలోంచి మేల్కొని అకస్మాత్తుగా జీవితపు విలువనూ అర్థాన్నీ తెలుసుకుంటాడనే ఆశాభావంతో దేవుడు అలా చేస్తున్నాడు. మనుష్యులు తన వైపుకు ఎప్పుడు తిరుగుతారా అనే గొప్ప ఉత్సుకతతో దేవుడు ఎదురుచూస్తూనే ఉన్నాడు. మానవ జీవితపు పుట్టుకను, పెరుగుదలను పాలించే రహస్యాలలోకి ఎవరూ తొంగిచూడలేదు. దీన్నంతా అర్థం చేసుకున్న దేవుడు మాత్రమే దేవుని నుండి సమస్తాన్ని పొంది, ఆయన పట్ల కృతజ్ణత లేని మానవాళి పెట్టె బాధను, దెబ్బలను మౌనంగా సహిస్తున్నాడు. జీనవక్రమంలో సాధారణంగా పొందిన అన్నిటినీ మానవుడు ఆస్వాదిస్తాడు. అదేవిధంగా దేవుణ్ని సాధారణంగా వంచిస్తాడు, మరిచిపోతాడు, పీడిస్తాడు. దేవుని ప్రణాళికకు నిజంగా ఇంత ప్రాముఖ్యత ఉన్నదా? దేవుని చేతినుండి సృష్టించుకున్న జీవించు ఈ మానవునికి ఉన్న ప్రాధాన్యత ఇదేనా? దేవుని ప్రణాళికకు నిశ్చయముగా గొప్ప ప్రాధాన్యత కలదు. దేవుని హస్తముచేత సృష్టింపబడిన మానవుడు ఆ దేవుని ప్రణాళిక కోసమే ఉన్నాడు. కాబట్టి, దేవుడు మానవజాతి పట్ల ద్వేషాన్ని పెట్టుకుని తన ప్రణాళికను వ్యర్థము చేసుకోలేడు. తన ప్రణాళిక కోసం, మానవునిలోకి ఊదిన జీవం కోసం దేవుడు అన్ని యాతనలను భరిస్తాడు. మానవుని శరీరం కోసం కాదు గానీ మానవునిలో దేవుడు ఊదిన జీవ వాయువు కోసం దేవుడు వీటినన్నిటిని భరిస్తాడు. మానవుని దేహాన్ని తీసుకోవడం కోసం కాదు, తాను మానవుని శరీరంలోకి ఊదిన జీవము కోసం దేవుడు అలా చేస్తాడు. ఇదే ఆయన ప్రణాళిక.

ఈ లోకంలో జీవులుగా అరుదెంచే వాళ్లందరూ పుట్టుక, చావు అనే రెండింటిని అనుభవించవలసిందే. వారిలో చాలా మంది మరణం, పునరుత్థానికిఅనే వర్తుల మార్గంలో ప్రయాణించారు. ఇప్పుడు జీవించి ఉన్నవాళ్లు కొంత కాలం తర్వాత మరణిస్తారు, మరణించిన వారు తిరిగి జన్మిస్తారు. ఇదంతా ప్రతి జీవి కొరకు దేవుడు ఏర్పరచిన జీవన క్రమం. అయినప్పటికీ ఈ క్రమాన్ని, ఈ చక్రాన్ని మనిషి గమనించాలని దేవుడు కోరుకుంటాడనేది కచ్చితమైన సత్యం. మానవునికి దేవుడు ప్రసాదించిన జీవితం ఎల్లలు లేనిదీ మరియు భౌతికత చేత, స్థలకాలాల చేత బంధించబడదనేదే ఆ సత్యం. దేవుడు మానవునికి ప్రసాదించిన జీవితపు మర్మం అటువంటిది. దైవం నుండి జీవం ఉద్భవించిందనే సత్యానికి అది నిదర్శనం కూడా. జీవం దేవుని నుండి వెలువడినదని చాలా మంది నమ్మకపోవచ్చును. దేవుని అస్తిత్వాన్ని మానవుడు నమ్మినా నమ్మకపోయినా అతడు దేవుని నుండి సంక్రమించేదాన్నంతా ఆనందంగా అనుభవిస్తాడు. ఏదో ఒకనాడు దేవుని హృదయం అకస్మాత్తుగా మారిపోయి, ఆయన ఇచ్చిన జీవం సహా ప్రపంచంలో ఉన్నదాన్నంతా తిరిగి తీసుకోవాలనుకుంటే, అప్పుడు ప్రపంచంలో ఏమీ ఉండదు. తన శక్తి, అధికారం చేత దేవుడు సంపూర్ణంగా మంచిదైన క్రమపద్ధతిని ఏర్పరుస్తూ, జీవులకు మరియు నిర్జీవులకు అవసరమైన అన్నింటిని సమకూర్చేందుకు తన ఉనికిని ఉపయోగిస్తాడు. ఇది ఎవరూ తెలుసుకోలేని, అర్థం చేసుకోలేని సత్యం. అర్థం చేసుకోలేని ఈ సత్యాలు దేవుని ఉనికికి, ప్రాణశక్తికి రుజువులు. నేను మీకొక రహస్యాన్ని చెబుతాను: దేవుని జీవశక్తి యొక్క గొప్పతనం, అతని ఉనికి యొక్క బలం ఏ ప్రాణి కొలవలేనంత అగాథమైనవి. ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టే గతంలో ఉండింది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది. ఇక నేను చెప్పే రెండవ రహస్యాన్ని వినండి: దేవుని నుండే జీవంయొక్క మూలం వెలువడుతుంది. ఎందుకంటే, సృజించబడిన ప్రాణులన్నీ రూపంలో, నిర్మాణంలో ఎంత భిన్నమైనవైనా వాటికి మూలం దేవుడే. మీరు ఏ రకమైన జీవులైనా దేవుడు ఏర్పరచిన మార్గానికి ఎదురు తిరగలేరు. ఏది ఎట్లా జరిగినా, మానవుడు దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మానవుడు ఎంత జాగరూకతతో ప్రయత్నించినా, ఎంత శ్రమతో సంఘర్షణ చేసినా దేవుని పాలన, సంరక్షణ, అనుగ్రహం లేకుంటే అతడు పొందవలసినదాన్ని పొందలేడు. దేవుడు ప్రసాదించే సామగ్రి లేనప్పుడు మానవుడు జీవితపు విలువనూ, జీవించడం లోని అర్థాన్నీ, ఉద్దేశాన్నీ కోల్పోతాడు. తను ప్రసాదించిన జీవితపు విలువను తుచ్ఛంగా వృథా చేసే మానవుడిని దేవుడు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండనిస్తాడు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు, దేవుడు మీ జీవములకు మూలం అని మరచిపోకండి. దేవుడు ప్రసాదించిన అన్నింటిని మానవుడు కాపాడకుంటే, ఆదిలో తాను ప్రసాదించిన దాన్ని దేవుడు తిరిగి తీసుకోవడమే కాకుండా, తాను ఇచ్చినదానికి రెండింతల మూల్యాన్ని మానవుడు చెల్లించేలా చేస్తాడు.

మే 26, 2003

మునుపటి:  మీరు మీ చేతలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి

తరువాత:  సర్వశక్తిమంతుడైన దేవుని నిట్టూర్పు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger