మీరు మీ చేతలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి

మీ జీవితంలో ప్రతి పని మరియు చర్య మీకు ప్రతిరోజూ నా వాక్యములలో కొన్నింటిని అందించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది, ఎందుకంటే, జ్ఞానం విషయంలో మీరు చాలా కొదువగా ఉన్నారు మరియు మీ గ్రహింపు సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంది. మీ దైనందిన జీవితంలో, సత్యం లేదా సరైన వివేచన లేని వాతావరణం, పర్యావరణం మధ్యన మీరు జీవిస్తున్నారు. మనుగడ సాగించడానికి మీకు మూలధనం కరవైయున్నది, మరియు నన్ను లేదా సత్యాన్ని తెలుసుకోవడానికి పునాది కూడా లేదు. మీ విశ్వాసం పూర్తిగా అస్పష్టమైన మరియు పరిగ్రహించు విశ్వాసం లేదా అత్యంత మొండి జ్ఞానం మరియు మతపరమైన ఆచారాలపై నిర్మించబడిందే తప్ప మరే దానిమీద కాదు. ప్రతిరోజు నేను మీ కదలికలను గమనిస్తూ ఉంటాను, మీ ఉద్దేశాలను మరియు వాటి చెడు ఫలితాలను పరిశీలిస్తున్నాను మరియు ఎప్పటికీ కదలని నా బలిపీఠంపై తమ హృదయాన్ని, ఆత్మను నిజంగా ఉంచే ఒక్క వ్యక్తిని కూడా నేను కనుగొనలేదు. అందుకే, నేను వ్యక్తీకరించాలనుకుంటున్న అన్ని వాక్యాలను అలాంటి మానవాళికి ధారపోస్తూ సమయాన్ని వృధా చేయడానికి నేను ఇష్టపడడం లేదు; నేను రక్షించాల్సి ఉన్న మానవజాతి కోసం అసంపూర్తిగా ఉన్న నా కార్యము మాత్రమే నా హృదయంలో ఏకైక ప్రణాళికగా ఉంటోంది. నన్ను అనుసరించే వారందరూ నా మోక్షాన్ని మరియు నా వాక్యం మనిషికి ప్రసాదించే సత్యాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. ఏదో ఒక రోజు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, జీవ జలాల ప్రవాహాలు ప్రవహించే రాజ్యాన్ని చూస్తావని నేను ఆశిస్తున్నాను—అంతేకాని ఆకాశాన్ని కప్పివేసిన నల్లని మేఘాలు, ఎన్నడూ ఆగని కేకల శబ్దాలతో కూడిన చల్లని ప్రపంచాన్ని కాదు.

ప్రతి రోజూ, ప్రతి వ్యక్తి యొక్క క్రియలు మరియు ఆలోచనలు ఒక్కరి కళ్ళచే నిర్వహించబడతాయి, అదే సమయంలో, వారి స్వంత రేపటి కోసం వారు సిద్ధమవుతుంటారు. జీవించే వారందరూ నడవాల్సిన మార్గం ఇదే; ఇది నేను అందరికీ ముందుగా నిర్దేశించిన మార్గం, ఎవరూ దాని నుండి తప్పించుకోవడం గానీ లేదా మినహాయింపు పొందడం గానీ జరుగదు. నేను పలికిన వాక్యాలు అసంఖ్యాకమైనవి, అంతేకాక నేను చేసిన పనికి కొలమానం లేదు. ప్రతిరోజూ, ప్రతి వ్యక్తి సహజంగా వారి అంతర్గత స్వభావం మరియు వారి స్వభావం అభివృద్ధికి అనుగుణంగా వారు చేయవలసినదంతా అమలు చేస్తున్నప్పుడు నేను చూస్తూనే ఉంటాను. ఇప్పటికే వివిధ రకాల వ్యక్తులను వివరించడానికి నేను వేసిన “సరైన మార్గ౦పై” చాలా మంది తమకు తెలియకుండానే ఆధారపడి ఉన్నారు. ఈ విభిన్న రకాల వ్యక్తులను నేను చాలా కాలం నుండి వివిధ వాతావరణాలలో ఉంచాను మరియు వారి సంబంధిత ప్రదేశాలలో, ప్రతి ఒక్కరూ వారి స్వాభావిక లక్షణాలను వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేసేవారు లేరు, వారిని ప్రలోభపెట్టడానికి ఎవరూ లేరు. వారు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు మరియు వారి వ్యక్తీకరణలు సహజంగా ఉంటాయి. ఒకే ఒక్క విషయం వారిని అదుపులో ఉంచుతుంది: అవి నా వాక్యాలు మాత్రమే. అందుకే, కొంతమంది నా మాటలను సణుగుతూ చదువుతారు, వాటిని ఎన్నడూ అభ్యసించరు, మరణాన్ని నివారించడానికి మాత్రమే వారు అలా చేస్తారు; అదే సమయంలో మరికొ౦దరికి, నా వాక్యాలు లేకు౦డా నడిపి౦పబడడానికి, అవసరతలు తీర్చకోడానికి రోజులను భరించడం కష్టంగా ఉ౦టు౦ది, అ౦దుకే వారు సహజ౦గా అన్ని వేళలా నా వాక్యాలను పట్టుకు౦టారు. కాలక్రమేణా, వారు మానవ జీవిత రహస్యాన్ని, మానవాళి గమ్యాన్ని, మానవునిగా ఉ౦డడ౦లోని విలువను కనుగొ౦టారు. నా వాక్యాల సమక్షంలో మానవజాతి ఇలాగే ఉంటుంది మరియు విషయాలను వారి దారిలోకి తీసుకోవడానికి నేను అనుమతిస్తాను. నా వాక్యాలను వారి ఉనికికి పునాదిగా మార్చడానికి ప్రజలను బలవంతం చేసే ఏ పనిని నేను చేయను. కాబట్టి మనస్సాక్షి లేనివారు మరియు వారి ఉనికికి ఎప్పుడూ విలువ ఇవ్వనివారు, ధైర్యంగా నా వాక్యాలను పక్కనపెట్టి, విషయాలు ఎలా జరుగుతున్నాయో నిశ్శబ్దంగా గమనించిన తర్వాత వారు కోరుకున్నట్లు చేస్తారు. వారు సత్యాన్ని మరియు నా నుండి వచ్చే ప్రతిదాన్ని అసహ్యించుకోవడం ప్రారంభిస్తారు. అంతేకాక, వారు నా మందిరంలో ఉండటాన్ని అసహ్యించుకుంటారు. తమ గమ్యస్థానం కోసం, శిక్ష నుండి తప్పించుకోవడానికి, ఈ వ్యక్తులు సేవ చేస్తున్నప్పటికీ, కొంతకాలం నా మందిరంలో నివసిస్తారు. అయితే, వారి ఉద్దేశాలు, చర్యలు ఎన్నడూ మారవు. ఇది ఆశీర్వాదాలు పొందాలనే వారి కోరికను పెంచుతుంది మరియు ఒక్కసారిగా రాజ్యంలోకి ప్రవేశించి, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే ఉండాలనే కోరికను పెంచుతుంది—శాశ్వత పరలోకములోకి ప్రవేశించాలనే కోరికను కూడా పెంచేస్తుంది. నా రోజు త్వరలో రావాలని వారు ఆరాటపడిన కొద్దీ, సత్యం ఒక అడ్డంకిగా, వారి మార్గంలో అది ఒక ఆటంకంగా మారిందని వారు ఎక్కువగా భావిస్తారు. రాజ్య౦లో అడుగు పెట్టడానికి, పరలోక రాజ్య ఆశీర్వాదాలను శాశ్వత౦గా అనుభవి౦చడానికి వారు వేచి ఉ౦డలేరు—ఎందుకంటే, సత్యాన్ని వెంబడించాల్సిన అవసరం లేకుండా లేదా తీర్పు, శిక్షను అంగీకరించాల్సిన అవసరం లేకుండా, అన్నింటికంటే ఎక్కువగా, నా మందిరంలో తడుముకోకుండా, నా ఆజ్ఞ ప్రకార౦ చేయవలసిన అవసర౦ లేకు౦డానే ఇదంతా జరగాలని భావిస్తారు. సత్యాన్ని వెతకాలనే కోరికను తీర్చుకోవడానికి లేదా నా నిర్వహణకు సహకరించడానికి ఈ వ్యక్తులు నా ఇంట్లోకి ప్రవేశించరు; రాబోవు కాలములో నాశనం కాని వారి మధ్య ఉండటమే వారి లక్ష్యంగా ఉంటుంది. అందువల్ల సత్యం ఏమిటో, సత్యాన్ని ఎలా అంగీకరించాలో వారి హృదయాలకు ఎన్నడూ తెలియదు. అలా౦టి వ్యక్తులు ఎన్నడూ సత్యాన్ని ఆచరి౦చడం గానీ లేదా వారి అవినీతి లోతును గ్రహి౦చడం గానీ చేయలేరు, అయినప్పటికీ, వారు నా మందిరంలో “సేవకులు” గా నిరంతరాయంగా కొనసాగుతారు. నా రాకడ దినం కోసం వారు “ఓపికగా” ఎదురు చూస్తూ నా పని తీరుతో విసిగి అలసిపోతారు. కానీ వారు ఎంత గొప్ప కృషి చేసినా లేదా వారు ఎంత మూల్యం చెల్లించుకున్నా, వారు సత్యం కోసం బాధపడటం లేదా నా కోసం ఏదైనా ఇవ్వడం ఎవరూ చూసి ఉండరు. వారి హృదయాలలో, నేను వృద్ధాప్యానికి ముగింపు పలికే రోజును చూడాలనే దురదతో ఉంటారు అయితే, నా శక్తి మరియు అధికారం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి వేచి ఉండలేరు. తమను తాము మార్చుకోవడం మరియు సత్యాన్ని అనుసరించడంలో వారు ఎప్పుడూ తొందరపడరు. నేను విసిగిపోయిన దానిని వారు ప్రేమిస్తారు మరియు నేను ప్రేమించే దానిని వారు విసిగించుకుంటారు. నేను ద్వేషించే దాని కోసం వారు సుదీర్ఘంగా నిరీక్షిస్తారు, కానీ నేను అసహ్యించుకునే దానిని కోల్పోతామేమో అని భయపడతారు. వారు ఈ దుష్ట ప్రపంచంలో నివసిస్తున్నారు, కానీ, దానిని ఎన్నడూ అసహ్యించుకోవడం లేదు, అంతేకాకుండా నేను దానిని నాశనం చేస్తానేమోనని తీవ్రంగా భయపడతారు. వారి పరస్పర విరుద్ధమైన ఉద్దేశాల మధ్య, నేను అసహ్యించుకునే ఈ ప్రపంచాన్ని వారు ప్రేమిస్తూనే ఉంటారు, కానీ వారు నిజమైన మార్గం నుండి తప్పిపోవడానికి ముందు, వినాశన బాధలను విడిచిపెట్టి, తరువాతి కాలపు ప్రభువులుగా రూపాంతరం చెందాలని, తొందరపాటుతో దానిని నాశనం చేయాలని కూడా ఆరాటపడతారు. వారు సత్యాన్ని ప్రేమించకపోవడం మరియు నా నుండి వచ్చే వాటన్నింటినీ విసిగించుకోవడమే దీనంతటికీ కారణం. ఆశీర్వాదాలను కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కొద్దికాలం పాటు వారు “విధేయతగల వ్యక్తులు” గా మారవచ్చు, కానీ, ఆశీర్వదించబడాలనే వారి ఆత్రుత, మరియు తాము నశించి, మండుతున్న అగ్ని సరస్సులోకి ప్రవేశిస్తామనే వారి భయం ఎప్పటికీ కప్పిపుచ్చబడదు. నా దినం దగ్గరపడుతున్న కొద్దీ, వారి కోరిక క్రమంగా బలపడుతుంది. మరియు విపత్తు ఎంత పెద్దదైతే, అది వారిని అంత నిస్సహాయతకు గురి చేస్తుంది, నన్ను సంతోషపెట్టడానికి మరియు వారు చాలా కాలంగా ఆశించిన ఆశీర్వాదాలను కోల్పోకుండా ఉండటానికి ఎక్కడ ప్రారంభించాలో తెలియక వారిని నిస్సహాయంగా చేస్తుంది. నా చేయి దాని పని ప్రారంభించిన వెంటనే అలాంటి వ్యక్తులు అగ్రగామిగా పనిచేయడానికి, చర్యలు తీసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. నేను వారిని పట్టించుకోననే తీవ్ర భయాందోళనతో, దళాల ముందు వరుసలోకి వెళ్లడం గురించి మాత్రమే వారు ఆలోచిస్తారు. వారి పనులు మరియు చర్యలు ఎప్పుడూ సత్యానికి సంబంధించినవి కావు, మరియు వారి పనులు నా ప్రణాళికకు భంగం కలిగిస్తాయి మరియు జోక్యం చేసుకుంటాయని ఎప్పటికీ గ్రహించక వారు చేసేది సరైనదే అని భావించి వారు వాటిని చేస్తారు మరియు చెబుతారు. వారు గొప్ప ప్రయత్నం చేసి ఉండవచ్చు మరియు కష్టాలను భరించాలనే వారి సంకల్పం మరియు ఉద్దేశ్యంలో నిజం ఉండవచ్చు, కానీ వారు చేసే ఏదీ నాకు సంబంధించినది కాదు, ఎందుకంటే, మంచి ఉద్దేశ్యంతో వారు చేసిన పనులు నేను ఎప్పుడూ చూడలేదు, వారు నా బలిపీఠంపై ఏదైనా ఉంచడాన్ని నేను చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా వారు నా ముందు చేసిన పనులన్నీ అలాంటివే.

నిజానికి, మీకు మరిన్ని సత్యాలను అందించాలని నేను కోరుకున్నాను, కానీ ఆ పని నుండి నేను దూరంగా ఉండవలసి రావడానికి కారణం సత్యం పట్ల మీ వైఖరి చాలా ఉదాసీనంగా ఉండడమే; నా ప్రయత్నాలు వృధా కావాలని నేను కోరుకోవడం లేదు, అలాగే ప్రజలు నా మాటలను పట్టుకొని నన్ను ప్రతిఘటించే, నన్ను కించపరిచే మరియు నన్ను దూషించే వాటిని చేయడం కూడా నాకు ఇష్టం లేదు. మీ దృక్పథాల వల్ల, మీ మానవత్వం కారణంగా, నేను మీకు ఒక చిన్న మరియు మీ కోసం, నా వాక్యాలలో చాలా ముఖ్యమైన భాగాన్ని అందిస్తున్నాను, ఇది మానవాళిలో నా విచారణ క్రియగా పనిచేస్తుంది. నేను తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళిక మీ అవసరాలకు సరిపోతాయి, అంతేకాకుండా, మానవాళి పట్ల నా వైఖరి సరైనదని నేను ఇప్పుడు మాత్రమే ధృవీకరించాను. నా ఎదుట మీరు చేసిన అనేక స౦వత్సరాల ప్రవర్తన నాకు పూర్వాపరాలు లేకు౦డా జవాబు అందించింది, ఇంతకీ ఈ సమాధానానికి నా ప్రశ్న ఏమిటంటే: “సత్యానికి, సత్యమైన దేవునికి ము౦దు మానవుని దృక్పథం ఎలా ఉంటుంది?” అనేదే ఆ ప్రశ్న. మానవుని పట్ల నేను చేసిన కృషి మానవుని పట్ల నా ప్రేమ సారాన్ని రుజువు చేస్తుంది, మరియు నా ముందు మనిషి చేసే ప్రతి చర్య సత్యం పట్ల అసహ్యం మరియు నా పట్ల వ్యతిరేకత సారాంశాన్ని రుజువు చేస్తోంది. అన్ని వేళలా, నన్ను అనుసరించే వారందరి గురించి నేను ఆందోళన చెందుతున్నాను, అయినప్పటికీ, ఏ సమయంలోనూ నన్ను అనుసరించే వారు నా వాక్యాలను స్వీకరించలేరు; వారు నా సూచనలను కూడా అంగీకరించలేరు. ఇది నాకు అన్నిటికంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. నా దృక్పథం నిజాయితీగా ఉన్నప్పటికీ, నా మాటలు మృదువుగా ఉన్నప్పటికీ ఎవరూ నన్ను అర్థం చేసుకోలేకపోయారు మరియు ఇంకా ఎవరూ నన్ను అంగీకరించలేకపోయారు. ప్రతి ఒక్కరూ నేను వారికి అప్పగించిన పనిని వారి స్వంత ఆలోచనల ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు; వారు అందులో నా ఉద్దేశాలను వెతకరు, వారి నుండి నాకు ఏమి అవసరమని మాత్రమే అడుగుతారు. వారు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, నాకు విధేయతతో సేవ చేస్తున్నట్టు పేర్కొంటారు. చాలా మంది తమకు ఆమోదయోగ్యం కాని లేదా ఆచరించలేని సత్యాలన్నీ సత్యాలు కావని నమ్ముతారు. అలాంటి వ్యక్తులలో, నా సత్యాలు నిరాకరి౦చబడి పక్కనపెట్టబడినవిగా మారతాయి. అదే సమయంలో, ప్రజలు నన్ను వాక్యమందు దేవుడిగా గుర్తిస్తారు, అయినప్పటికీ సత్యము, మార్గము లేదా జీవము కాని లోకములోని వ్యక్తి అని కూడా నమ్ముతారు. ఈ సత్యం ఎవరికీ తెలియదు: నా వాక్యములు ఎప్పటికీ మారని సత్యము. నేనే మానవునికి జీవమును అందించే మరియు మానవాళికి ఏకైక మార్గదర్శిని. నా వాక్యముల విలువ, అర్థాలు మానవజాతి చేత గుర్తించబడ్డాయా లేదా అంగీకరించబడ్డాయా అనే దాని ద్వారా నిర్ణయించబడవు, కానీ పదాల సారాంశం ద్వారా నిర్ణయించబడతాయి. ఈ భూమి మీద ఒక్క వ్యక్తి కూడా నా వాక్యములను అందుకోలేకపోయినప్పటికీ, నా వాక్యముల విలువ మరియు మానవాళికి వాటి సహాయం ఏ మానవునికైనా అమూల్యమైనవి. అందువల్ల, నా మాటలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే, ఖండించే లేదా పూర్తిగా తిరస్కరిస్తున్న అనేక మంది వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, నా వైఖరి ఇలాగే ఉంటుంది: సమయం మరియు వాస్తవాలు నా సాక్షిగా ఉండనివ్వండి మరియు నా మాటలు సత్యం, మార్గం మరియు జీవమని రుజువు చేస్తాయి. నేను చెప్పినదల్లా సరైనదేనని, ఏ మనిషికి సమకూర్చాలో, అన్నింటిని మించి, ఏ మనిషి అంగీకరించాలో వారిని చూపనివ్వండి. నన్ను అనుసరించే వారందరికీ నేను ఈ వాస్తవాన్ని తెలియజేస్తాను: నా వాక్యములను పూర్తిగా అంగీకరించలేని వారు, నా వాక్యములను ఆచరించలేని వారు, నా వాక్యములో ప్రయోజనం కనుగొనలేని వారు మరియు నా వాక్యముల వల్ల రక్షణ పొందలేని వారు, నా వాఖ్యములచే ఖండించబడ్డారు మరియు నా రక్షణ కోల్పోయారు మరియు నా దండము వారికి ఎన్నటికీ దూరంగా ఉండదు.

ఏప్రిల్ 16, 2003

మునుపటి:  చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (2)

తరువాత:  మానవ జీవితానికి దేవుడే మూలం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger