అనుబంధం 2: దేవుడుమొత్తంమానవాళిభవిష్యత్తుకు అధిపతి

మానవాళికి చెందిన వ్యక్తులుగా మరియు విశ్వాసపరులైన క్రైస్తవులుగా, దేవుని ఆదేశాలు నెరవేర్చడం కోసం మన మనసులను మరియు శరీరాలను అర్పించడం మనందరి బాధ్యత మరియు విధి, ఎందుకంటే మన శరీరం మొత్తం దేవుని నుండి వచ్చింది, మరియు అది బ్రతుకుతుంది దేవుని యొక్క సర్వాధికారానికి కృతజ్ఞతలు. మన మనసులు మరియు శరీరాలు దేవుని ఆజ్ఞ కొరకు కాకపోతే మరియు మానవాళి పాటించాల్సిన నీతి కొరకు కాకపోతే, అప్పుడు మన ఆత్మలు దేవుని ఆదేశాల కోసం బలిదానం చేసుకున్న వారి ముందు ఎందుకూ పనికి రానివిగా, మరియు మనకి అన్నిటినీ సమకూర్చిన దేవుని పొందడానికి మరింత అనర్హమైనవిగా అనిపిస్తాయి.

దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఆయన ఈ మానవాళిని సృష్టించాడు, మరియు ఆయన పురాతన గ్రీకు సంస్కృతి మరియు మానవ నాగరికతకి రూపశిల్పి అయికూడా ఉన్నాడు. దేవుడు మాత్రమే మానవాళిని ఓదారుస్తాడు, మరియు దేవుడు మాత్రమే రేయింబవళ్లు మానవాళిని జాగ్రత్తగా చూస్తుంటాడు. మనిషి ఎదుగుదల మరియు అభివృద్ధి దేవుని సర్వాధికారము నుండి విడదీయలేనివి, మరియు మానవాళి చరిత్ర మరియు భవిష్యత్తు దేవుని యోచనల నుండి విడదీయరానివి. నువ్వు నిజమైన క్రైస్తవుడివే అయితే, అప్పుడు నువ్వు ఏదైనా ఒకదేశం లేదా జాతి యొక్క అభివృద్ధి మరియు పతనము దేవుని యోచనలకి అనుగుణంగానే జరుగుతాయని తప్పక నమ్ముతావు. ఒక దేశము లేదా జాతి యొక్క భవితవ్యం ఏమిటో దేవునికి మాత్రమే తెలుసు, మరియు దేవుడు మాత్రమే మానవాళి గతిని నిర్ణయించగలడు. మానవాళి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే, ఒక దేశం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే, అప్పుడు మనిషి దేవుని కి మోకరిల్లి ఆరాధించాలి, లేనిచో మానవాళి భవిష్యత్తు మరియు గమ్యం ఒక అనివార్యమైన విపత్తు గా మారతాయి.

నోవా ఓడను నిర్మించిన కాలానికి వెను తిరిగి చూడండి: మానవాళి విపరీతంగా అవినీతిమయమైంది, ప్రజలు దేవుని ఆశీర్వాదం నుండి దూరమయ్యారు, ఆ పైదేవుని చే సంరక్షింపబడలేదు మరియు దేవుని వాగ్దానాలను కోల్పోయారు. వారు దేవుని వెలుగులేకుండా అంధకారం లో జీవించారు. అప్పుడు వారు విచ్చలవిడి స్వభావులయ్యారు. మరియు ఘోరమైనఅధోగతికి తమను తాము పరిత్యజించారు. అలాంటి ప్రజలు ఇక మీదట దేవుని వాగ్దానాన్ని అందుకోలేరు; వారు దేవుడిని విడిచిపెట్టారు, ఆయన వారికి ప్రసాదించినవాటన్నిటినీ పక్కన పెట్టారు మరియు దేవుని బోధనలను మర్చిపోయారు, కావున వారు దేవుని ముఖాన్ని చూడడానికి లేదా దేవుని స్వరాన్నివినడానికి అనర్హులు. వారి హృదయం దేవుని నుండి ఇంకా ఇంకా దూరమయింది, అలా జరగడంతో, వారు విచక్షణ మరియు మానవత్వానికి అతీతంగా బ్రష్టుపట్టారు మరియు మరింత దుష్టులుగా మారారు. అలా వారు మృత్యువుకి అత్యంత సమీపముగా నడిచారు మరియుదేవుని క్రోధానికి మరియు శిక్షకి గురి అయ్యారు. నోవా మాత్రమే దేవుడిని ఆరాధించాడు మరియు దుష్టత్వాన్ని త్యజించాడు, కాబట్టి అతను దేవుని స్వరాన్ని వినగలిగాడు మరియు ఆయన సూచనలనువినగలిగాడు. అతను దేవుని వాక్కు ఆదేశానునుసారం ఓడని నిర్మించాడు, మరియు అక్కడ అన్నిరకాల జీవురాశులను సమీకరించాడు. మరియు ఈ విధంగా, ఒకసారిప్రతిదీ సిద్ధం అయిన తర్వాత, దేవుడు తన ప్రళయాన్ని ప్రపంచంపై విడుదలచేశాడు. నోవా యెహోవానుఆరాధించాడు మరియు దుష్టత్వాన్ని త్యజించాడు కావున కేవలం నోవా మరియు అతని కుటుంబంలోనిమరో ఏడుగురు సభ్యులు మాత్రమే ప్రళయం నుండి మనగలిగారు.

ఇప్పుడు ప్రస్తుత కాలంపై దృష్టి సారించండి. దేవుడిని ఆరాధించి మరియు దుష్టత్వాన్ని త్యజించగల నోవా వంటి నీతిమంతులు ఉనికిలో లేకుండా పోయారు. అయినప్పటికీ దేవుడు ఈ మానవాళి పట్ల కృపగలిగి ఉన్నాడు మరియు ఈ అంత్య కాలంలో కూడా వారినివిమోచిస్తున్నాడు. దేవుడు, ఆయన దర్శనం కోసం నిరీక్షించే వారిని వెతుకుతున్నాడు. ఆయనతన మాటలను వినగలిగేవారిని, ఎవరైతే ఆయన ఆజ్ఞ లని మరువకతమ శరీరాలని హృదయాలను ఆయనకి అర్పిస్తున్నారో అలాంటివారిని వెతుకుతున్నాడు. ఎవరైతే అయన ముందు శిశువుల్లా విధేయులుగా ఉంటారో, ఆయన్ని నిరోధించకుండాఉంటారో అలాంటి వాళ్ళని ఆయన వెతుకుతున్నాడు. ఏ శక్తీ లేదా బలం చేత ప్రభావితం కాకుండానీకు నువ్వుగా దేవునికి అంకితమైతే, నీపై దేవుడు మేలుతో తన దృష్టి నిలుపుతాడు మరియు ఆయన దీవెనలను నీ పై కుమ్మరిస్తాడు. నీవు ఉన్నత స్థానం లో, కీర్తి ప్రతిష్టలతో ఉన్నా, గొప్ప జ్ఞానాన్ని కలిగియున్నా, విస్తారమైన ఆస్తులకు యజమానివై ఉన్నా, అనేక మంది మద్దుతునీకులభిస్తున్నా, ఇవేమీ దేవుడి ముందుకు వచ్చి ఆయన పిలుపును, ఆజ్ఞలను స్వీకరించడానికి, దేవుడు నీతో అడిగింది చెయ్యడానికి ఎంతమాత్రమూ ఆపలేవు. అప్పుడు నీవు చేసే ప్రతీదీ ఈభూమిపై అత్యంత అర్థవంతమైన మరియు మానవాళి చేపట్టిన అత్యంత నీతివంతమైన కార్యంగా ఉంటుంది. స్థాయి మరియు నీ సొంతలక్ష్యాల కోసము దేవుడి పిలుపుని నీవు నిరాకరిస్తే, నీవు చేసే ప్రతిదీ శాపగ్రస్తమవుతుంది మరియు దేవునిచే కూడా తృణీకరించబడుతుంది. బహుశా నువ్వో రాష్ట్రపతివో, శాస్త్రవేత్తవో, సంఘకాపరివో, పెద్ద వాడివో అవ్వచ్చు కానీ నీ కార్యాలయం ఎంత గొప్పది అయినప్పటికీ, నీవు చేపట్టేపనుల్లో నీ జ్ఞానంపై మరియు సామర్థ్యంపై అధారపడినట్లయితే, నువ్వు ఎప్పటికీ విఫలుడివి ఔతావు మరియు ఎప్పటికీ దేవుని దీవెనలు కోల్పోతావు, ఎందుకంటే దేవుడు నువ్వుచేసే దేనినీ ఆమోదించడు, మరియు నువ్వు చేపట్టిన పని నీతివంతమైనదిగా అంగీకరించడు, లేదా నీవు మానవాళి ప్రయోజనంకోసం పాటుపడుతున్నట్టు ఒప్పుకోడు. నువ్వు చేసే ప్రతి పనీ మానవాళిజ్ఞానాన్ని, శక్తిని ఉపయోగించుకొని దేవుడి రక్షణనుండి మనిషిని దూరంగా త్రోసివేయుటకు చేయబడుతుంది, మరియు ఆయన దీవెనలను తిరస్కరించేందుకు చేయబడుతుంది అని ఆయన అంటాడు. నువ్వు మానవాళిని అంధకారంవైపు, మృత్యువువైపు, మరియు అలాగే మనిషిని, దేవుని మరియు ఆయన కృపను కోల్పోయిన అపరిమితమైన ఉనికి యొక్క ఆరంభదశకి నడిపిస్తున్నావని ఆయన అంటాడు.

మానవ జాతి సామాజిక శాస్త్రాల కల్పన చేసినప్పటినుండి, అతడి మెదడు విజ్ఞాన శాస్త్రం మరియు జ్ఞానము చేత ఆక్రమించబడింది. విజ్ఞాన శాస్త్రంమరియు జ్ఞానము మానవాళిపాలించడానికి పనిముట్లుగామారాయి, మరియు అక్కడ దేవుని ఆరాధించేందుకు మనిషికి తగినంత ఖాళీ లేకుండా పోయింది, మరియు దేవుని ఆరాధించేందుకు అనువైన పరిస్థితులు లేకుండా పోయాయి. మానవ హృదయంలో దేవునిస్థానం ఎప్పటికన్నా తక్కువ స్థానానికి పడిపోయింది. దేవుడు అతడి హృదయంలో లేకపోవడంతో, మనిషి అంతః ప్రపంచం అంధకారంగా, నిరాశాజనకంగా, మరియు శూన్యంగాను మారిపోయింది. తదనంతరంచాలామంది సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, రాజకీయ నాయకులు సామాజిక శాస్త్ర సిద్ధాంతాలను, మానవ పరిణామ క్రమం, మరియు దేవుడు మనిషిని సృష్టించాడన్న సత్యాన్ని వ్యతిరేకించే ఇతరసిద్ధాంతాలను, మానవాళి హృదయాలను మరియు మెదళ్లను నింపేందుకు వ్యక్తీకరించడానికి ముందుకువచ్చారు. ఈవిధంగా ప్రతీది దేవుడు సృష్టించాడనే దాన్ని నమ్మేవాళ్ళు ఎప్పటికన్నా తక్కువగానూ, మరియు పరిణామ క్రమ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఎప్పటికన్నా ఎక్కువగాను అయ్యారు. పాతనిబంధన కాలంలో గ్రంథస్తమైన దేవుడు చేసిన పనులను మరియు అయన వాక్కును అభూత కల్పనలు మరియుఇతిహాసాలగా అధికాధిక ప్రజలు పరిగణిస్తున్నారు. వారిహృదయాలలో, ప్రజలు దేవుని మహిమ మరియుఘనతకి, దేవుడు ఉన్నాడు మరియు ఆయన అన్నిటిపైనా అధికారం కలిగి ఉన్నాడన్న నిబంధనకి ఉదాసీనులుగామారారు. మానవాళి మనుగడ, మరియు దేశాల, జాతుల గతి వారికి ఇక ఏమాత్రం ముఖ్యం కాదు, మరియుఅలాగే మనిషి తినడం, తాగడం మరియు సుఖాన్వేషణ అనే డొల్ల ప్రపంచంలో నివసిస్తున్నాడు. … దేవుడు తన కార్యాన్ని ఈ రోజు ఎక్కడ నెరవేరుస్తున్నాడుఅనేది వెతకడాన్ని, ఆయన అధ్యక్షత వహించి మనిషి గమ్యస్థానాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నాడు అనేది చూడటాన్నికొద్దిమంది మాత్రమే వెతుకుతున్నారు. ఈ మార్గంలో, మనిషికి తెలియకుండానే, మనిషి కోరికలను మలిచే సామర్థ్యం మానవ నాగరికతకిఇంకా ఇంకా తగ్గిపోయింది. ఇలాంటి ప్రపంచంలో, చనిపోయిన వాళ్ల కంటే తాము తక్కువ ఆనందంతో నివసిస్తున్నామని చాలా మంది మనుష్యులు భావిస్తున్నారు. బాగా అభివృద్ధి చెందినట్లుచెప్పబడుతున్న నాగరికతల్లోని ప్రజలు కూడా ఇలాంటి ఇక్కట్లను వ్యక్తం చేస్తున్నారు. దేవుడి మార్గదర్శకం అనేది లేకుండా మానవ నాగరికతనుకాపాడేందుకు నాయకులు, సామాజిక వేత్తలుఎంతతలలు బద్దలు కొట్టుకున్నప్పటికీ అందులో ఏ విధమైన ప్రయోజనమూ ఉండదు. మానవ హృదయంలో ఉన్నశూన్యాన్ని ఎవ్వరూ నింపలేరు. అలాగే ఏ ఒక్కరూ మనిషికి జీవితం కాలేరు, అతన్ని బాధించేహృదయపు శూన్యత నుండి ఏ సామాజిక సిద్ధాంతం మనిషిని స్వతంత్రుణ్ణి చేయలేదు. విజ్ఞాన శాస్త్రం, జ్ఞానం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, తీరిక, సౌఖ్యం ఇవన్నీ మనిషికి కేవలం తాత్కాలికఉపశమనాన్నే తీసుకొస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మనిషి అనివార్యంగా పాపాలను చేస్తున్నాడుఅలాగే సమాజపు అన్యాయాల నుండి దుఃఖితుడు అవుతునే ఉన్నాడు. ఇవేమీ మనిషి కోరికలను మరియుఅన్వేషించాలనే అతని తపనని అదుపు చేయలేవు. ఇదంతా ఎందుకంటే మనిషి దేవుని చేత తయారుచేయబడ్డాడుమరియు అలాగే వివేకరహిత త్యాగాలు మరియు అన్వేషణలు మనిషిని మరింత వ్యాకులత వైపుకు మాత్రమేనడిపించగలవు, మరియు అవి మనిషిని, మానవాళి భవిష్యత్తుని ఎలా ఎదుర్కోవాలో తెలియని, ముందుఉన్న మార్గాన్ని ఎలా చూడాలో తెలియని, ఎప్పటికీ భయపడుతూ ఉండే స్థితిలో ఉంచేలా మాత్రమేచేయగలవు. మనిషి విజ్ఞాన శాస్త్రానికి మరియు జ్ఞానానికి భయపడే స్థితికి కూడా చేరుకున్నాడు, మరియు శూన్య భావానికి మరింతగా భయపడుతున్నాడు. ఈ ప్రపంచంలో, నీవు ఏ స్వేచ్చా దేశంలోలేదా మానవ హక్కులు లేని చోటిలో నివసిస్తున్నావు అనేదాంతో సంబంధం లేకుండా, మానవ జాతిదుర్గతి నుండి తప్పించుకునే సామర్థ్యం నీకు లేదు. నువ్వు పాలకుడివైనా లేదా పౌరుడివైనాభవితవ్యాన్ని, మర్మాలను, మానవాళి గమ్యస్థానాన్నిఅన్వేషించాలనే కోరిక నుండి తప్పించుకునే సామర్థ్యం ఏ మాత్రమూ లేదు. చికాకు పరిచేశూన్యతాభావం నుండి తప్పించుకునే సామర్థ్యం ఇంకా తక్కువ. మానవ జాతి మొత్తానికిసాధారణమైన ఈ ఉత్పాతాలని సామాజిక ఉత్పాతాలుగా సామాజికవేత్తలు పిలుస్తారు. అయినప్పటికీ ఏ గొప్ప వ్యక్తి ఇలాంటి సమస్యలను తీర్చేందుకు ముందుకురాలేదు. మనిషి చివారఖరికి మనిషే, మరియు దేవుడి యొక్క జీవితం, స్థానం మనిషి చేత మార్చబడలేవు. మానవాళకి ప్రతి ఒక్కరి కడుపు నింపే, మరియు స్వేచ్చా సమానత్వం గల న్యాయవంతమైన సమాజంమాత్రమే అవసరం కాదు. మానవజాతికి ఇంకా కావాల్సింది ఏంటంటే దేవుని రక్షణ మరియు ఆయన తమకొరకు సిద్ధం చేసిన జీవితం. ఎప్పుడైతే మనిషి కేవలం దేవుడు సిద్ధపరిచిన జీవితాన్ని మరియుఆయన రక్షణని అందుకుంటాడో, అప్పుడు అవసరాలు, అన్వేషించాలనే కాంక్ష, మరియు మనిషిలోనిఆధ్యాత్మిక శూన్యత పరిష్కరించబడగలదు. ఒక దేశంలోని లేదా జాతిలోని ప్రజలు దేవుడి రక్షణనుభద్రతను పొందలేని స్థితిలో ఉంటే అప్పుడు అలాంటి దేశం లేదా ఆ జాతి అంధకారం వైపుగా పతనానికిదారితీస్తుంది మరియు దేవుని చేత తప్పక నశింపచేయబడుతుంది.

బహుశా నీ దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు, కానీ ఒకవేళ నువ్వు నీ జనులు దేవునికి దూరం కావడాన్ని అనుమతించినట్లయితే, అప్పుడు దానంతట అదే దేవుని దీవెనలను అంతకంతకూ కోల్పోతుందని తెలుసుకుంటుంది. నీ దేశ నాగరికత అంతకంతకూ పాదాల కింద అణచి వేయబడుతుంది మరియు, దానికి మునుపే ప్రజలు దేవునికి వ్యతిరేకులై నిలిచి పరలోకమును శపిస్తారు. మరియు అలా, మనిషికి తెలియకుండానే ఒక దేశ భవిష్యత్తు నాశనం కాబడుతుంది. దేవుడు, తన శాపానికి గురైన దేశాలతో వ్యవహరించడానికి శక్తివంతమైన దేశాలను వృద్ది లోకి తెస్తాడు, మరియు వాటిని భూమి మీద నుండి సమూలంగా తుడిచి పెట్టవచ్చు. ఒక దేశం లేదా జాతి యొక్క అభివృద్ది మరియు పతనం దాని పాలకులు దేవుడిని ఆరాధిస్తున్నారా, మరియు వాళ్ళు వారి ప్రజలని దేవునికి దగ్గర కావడానికి, మరియు ఆయనను ఆరాధించడానికి నడిపిస్తున్నారా అనే దాని పైన అంచనా వేయవచ్చు. మరియు ఇప్పటికీ, ఈ అంత్య యుగంలో, ఎందుకంటే దేవుడిని నిజంగా కోరుకునే మరియు ఆరాధించే వారు అంతకంతకూ తగ్గిపోతున్నారు, క్రైస్తవం అధికార మతం గా ఉన్న దేశాల పైన దేవుడు ప్రత్యేకమైన మేళ్ళని ప్రసాదిస్తున్నాడు. ఆయన సాపేక్షంగా నీతివంతమైనదిగా ఉన్న శిబిరాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఆ దేశాలన్నిటినీ ఒకచోట చేరుస్తాడు, ఈ లోపుగా నిజ దేవుడిని ఆరాధించని మరియు నాస్తిక దేశాలన్నీ సాపేక్షంగా నీతివంతమైనదిగా ఉన్న శిబిరానికి వ్యతిరేకులుగా మారతారు. ఈ విధంగా, దేవునికి మానవాళి మధ్య గల స్థానం తన కార్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే కాదు, ఆయనని వ్యతిరేకించే దేశాల పైన ఆంక్షలను, పరిమితులను విధించడాన్ని అంగీకరించే, నీతివంతముగా అధికారాన్ని అమలు చేయగల దేశాలను పొందడానికి కూడా ఉంది. అయినప్పటికీ ఇంకా, దేవుడిని ఆరాధించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదు, ఎందుకంటే మనిషి ఆయన నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాడు, మరియు మనిషి దేవుడిని చాలా కాలంగా మరచిపోయాడు. నీతిని ఆచరించే దేశాలు, మరియు అవినీతిని నిరోధించే దేశాలు మాత్రమే భూమి మీద మిగులుతాయి. కానీ ఇది దేవుని కోరికకు చాలా దూరంగా ఉంది, ఎందుకంటే ఏ దేశాధినేతలూ దేవుడిని తమ ప్రజల మీద అధికారం చెలాయించడానికి అంగీకరించరు, మరియు ఏ రాజకీయపక్షమూ తమ ప్రజలను దేవుడిని ఆరాధించడానికి ఒక చోటకి చేర్చదు; దేవుడు ప్రతి దేశం, జాతి, అధికార పక్ష హృదయాలలో, మరియు ప్రతి ఒక్కరి హృదయంలో తనకి దక్కాల్సిన స్థానాన్ని కోల్పోయాడు. నీతివంతమైన శక్తులు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మనిషి హృదయంలో దేవునికి స్థానం లేని పాలన దుర్భలమైనది. దేవుని ఆశీర్వాదం లేకుండా, రాజకీయ రంగం గందరగోళంలో పడిపోతుంది, మరియు ఒక్క అఘాతాన్ని కూడా తట్టుకుని నిలబడలేక పోతుంది. మానవాళికి, దేవుని ఆశీర్వాదం లేకుండా బ్రతకడం అన్నది సూర్యుడు లేకుండా బ్రతకడం లాంటిది. పాలకులు ఎంత చిత్తశుద్దితో తమ ప్రజలకి సేవలు చేసినప్పటికీ, ఎన్ని నీతివంతమైన సమావేశాలు మానవాళి కలిసి నిర్వహించినప్పటికీ, అవేమీ తిరోగమనాన్ని ఆపలేవు లేదా మానవాళికి పట్టే గతిని మార్చలేవు. ఏ దేశంలోని ప్రజలైతే తిండి కలిగి మరియు బట్ట కలిగి ఉంటారో ఎక్కడ వారు శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటారో, అది ఒక మంచి దేశమని, మరియు అది మంచి నాయకత్వముతో ఉన్నదని మనిషి నమ్ముతాడు. కానీ దేవుడు అలా అనుకోడు. ఏ దేశము లోని ప్రజలైతే ఆయనను ఆరాధించరో, అది ఆయన నాశనం చెయ్యాల్సిన దేశంగా ఆయన నమ్ముతాడు. మనిషి ఆలోచనా విధానం దేవునికి ఎన్నో రెట్లు విరుద్ధంగా ఉంది. కాబట్టి, ఒకవేళ ఒక దేశాధినేత దేవుడిని ఆరాధించనట్లయితే ఆ దేశ భవిష్యత్తు విషాదభరితం అవుతుంది, మరియు ఆ దేశానికి ఏ గమ్యమూ ఉండదు.

దేవుడు మనిషి రాజకీయాల్లో పాలుపంచుకోడు, అయినప్పటికీ ఒక దేశం లేదా జాతి యొక్క భవితవ్యం దేవునిచే నియంత్రించబడుతుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని మరియు మొత్తం విశ్వాన్ని శాసిస్తున్నాడు. మనిషి భవిష్యత్తు మరియు దేవుని ప్రణాళిక సన్నిహితంగా అనుసంధానించబడ్డాయి, మరియు ఏ ఒక్క మనిషి, దేశం లేదా జాతి కూడా దేవుని సార్వభౌమాధికారం నుండి మినహాయింపబడలేదు. మనిషి తన భవిష్యత్తుని తెలుసుకోవాలని అనుకుంటే, అప్పుడు తను తప్పక దేవుని యెదుటకి రావాలి. దేవుడు ఆయనని అనుసరించి మరియు ఆరాధించే వారు వృద్ది చెందడానికి, ఆయనను ఆటంకపరిచి మరియు తిరస్కరించే వారిపై క్షీణ గతిని, వినాశనాన్ని తీసుకువచ్చేలా చేస్తాడు.

దేవుడు సొదొమ మీదకు విధ్వంసాన్ని తెచ్చిన బైబిల్ లోని సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి మరియు లోతు భార్య ఎలా ఉప్పు స్థంభంగా మారిందో కూడా ఆలోచించండి. నినేవే ప్రజలు గొనేపట్టాలు మరియు బూడిదలో తమ పాపాలకి ఎలా పశ్చాత్తాప పడ్డారో వెనక్కి తిరిగి ఆలోచించండి మరియు యూదులు 2,000 సంవత్సరాల క్రితం యేసుప్రభువుకి శిలువ వేసిన తర్వాత యూదులకి ఏం జరిగిందో గుర్తుచేసుకోండి. యూదులు ఇశ్రాయేలు నుండి బహిష్కరించబడ్డారు మరియు ప్రపంచం నలుదిక్కులా ఉన్న దేశాలకి పారిపోయారు. ఎంతో మంది చంపబడ్డారు, మరియు యూదుల జాతి తమ దేశ వినాశనంతో మునుపెన్నడూ లేనంత నొప్పికి గురైంది. వారు దేవుడిని సిలువకి వేలాడదీసారు—ఒక ఘోరమైన పాపానికి పాల్పడ్డారు—మరియు దేవుని స్వభావాన్ని రెచ్చగొట్టారు. వారు చేసిన దానికి తగిన మూల్యం చెల్లించేలా చేయబడ్డారు మరియు వారి చర్యలన్నిటికీ పర్యవసానాలు అనుభవించేలా చేయబడ్డారు. వారు దేవుడిని ఖండించారు, దేవుడిని తిరస్కరించారు, మరియు కాబట్టి వారికి ఒకే ఒక్క గతి ఉంది: దేవునిచే శిక్షింపబడడం. ఇది వారి పాలకులు వారి దేశం పైన మరియు జాతి పైన తెచ్చిన చేదు పర్యవసానం మరియు విపత్తు.

నేడు, ఆయన తన కార్యాన్ని నెరవేర్చడానికి లోకమునకు తిరిగి వచ్చాడు. ఆయన మొదట ఆగే స్థలం నియంతృత్వానికి నిదర్శనం అయినది: చైనా, నాస్తికత్వానికి ధృడమైన కోట. దేవుడు తన వివేకము మరియు శక్తి తో ఒక సమూహాన్ని పొందాడు. ఈ కాలంలో, ఆయన చైనా అధికార పక్షముచే అన్ని రకాలుగా వేటాడబడ్డాడు మరియు ఆయన తల వాల్చడానికి స్థలం లేక, ఆశ్రయం దొరకక గొప్ప వేదనకి గురయ్యాడు. ఇలా అయినప్పటికీ, దేవుడు ఆయన చేయాలనుకున్న కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన ఎలుగెత్తి తన స్వరం వినిపించి సువార్తను వ్యాపింప చేస్తున్నాడు. దేవుని యొక్క సర్వశక్తిని ఎవరూ కొలవలేరు. దేవుడిని శత్రువుగా చూసే ఒక దేశం, చైనాలో, దేవుడు తన కార్యాన్ని ఎప్పుడూ ఆపలేదు. బదులుగా, ఎక్కువ మంది ప్రజలు ఆయన కార్యాన్ని మరియు వాక్కును అంగీకరించారు, ఎందుకంటే దేవుడు మానవాళికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తిని సాధ్యమైనంత ఎక్కువగా రక్షిస్తాడు. ఏ దేశం లేదా శక్తి దేవుడు అనుకున్నది సాధించడంలో అడ్డుగా నిలవలేదు అని మనం నమ్ముతాము. ఎవరైతే దేవుని పనిని ఆటంకపరుస్తారో, దేవుని వాక్కును ఎదిరిస్తారో మరియు ఆయన ప్రణాళికను భంగపరుస్తారో మరియు బలహీనపరుస్తారో వారు చివరికి దేవుని చేత శిక్షింపబడతారు. ఎవరైతే దేవుని కార్యాన్ని ధిక్కరిస్తారో వారు నరకానికి పంపబడతారు: దేవుని కార్యాన్ని ధిక్కరించే ఏ దేశమైనా నాశనం కాబడుతుంది; దేవుని కార్యాన్ని వ్యతిరేకించడానికి నిలబడే ఏ జాతి అయినా భూమి మీద నుండి తుడిచి వేయబడుతుంది మరియు ఉనికిలో లేకుండా పోతుంది. నేను దేవుడిని అతి పవిత్రమైన, అత్యంత గౌరవప్రదమైన, అత్యున్నత, మరియు ఆరాధించదగ్గ ఒకే ఒక్కడిగా చెయ్యడానికి, మరియు యెహోవా వాగ్దానము కింద జీవించిన అబ్రహాము సంతతిలాగా, దేవునిచే మొట్టమొదటగా సృష్టించబడిన, ఏదేను తోటలో నివసించిన, ఆదాము మరియు అవ్వ లాగా, దేవుని ఆశీర్వాదం కింద మొత్తం మానవాళి బ్రతకడానికి, అన్ని జాతుల, అన్ని దేశాల, మరియు అన్ని కర్మాగారాల ప్రజలను దేవుని స్వరాన్ని వినమని, దేవుని కార్యాన్ని గమనించి మానవాళి భవిష్యత్తు పట్ల శ్రద్ద వహించమని కోరుతున్నాను.

దేవుని కార్యము బలమైన కెరటంలా ఉప్పొంగుతుంది. ఆయనను ఎవరూ నిర్భందించలేరు, ఆయన రాకను ఎవరూ ఆపలేరు. ఎవరైతే ఆయన మాటలను శ్రద్ధగా వింటారో, మరియు ఆయన కొరకు వెతుకుతూ మరియు దప్పిగొని ఉంటారో, వారు ఆయన అడుగుజాడలను అనుసరించవచ్చు మరియు ఆయన వాగ్దానాన్ని పొందుకోవచ్చు. అలా చేయని వారు అతి ఘోరమైన వినాశనానికి మరియు తగిన శిక్షకి గురి కాబడతారు.

మునుపటి:  అనుబంధం 1: దేవుని దర్సనం కొత్త యుగానికి నాంది పలికింది

తరువాత:  అనుబంధం 3: దేవుని నిర్వహణలో మాత్రమే మనిషి రక్షింపబడగలడు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger