అనుబంధం 3: దేవుని నిర్వహణలో మాత్రమే మనిషి రక్షింపబడగలడు

ప్రతి మనిషి దృష్టిలో దేవుని నిర్వహణ అనేది ఒక పరిచయం లేని విషయం. ఎందుకంటే, దేవుని నిర్వహణ అనేది వారి నుంచి పూర్తిగా తొలగించబడినదని మానవులు అనుకుంటారు. దేవుని నిర్వహణ అనేది పూర్తిగా ఆయన పని మాత్రమే అని మరియు అది ఆయన మాత్రమే ఆందోళన చెందాల్సినదనిఅని, కాబట్టి, దేవుని నిర్వహణ గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మానవాళి భావిస్తుంది. ఈ క్రమంలో, మానవాళి విమోచనం అనేది అనిర్ధిష్టమైన మరియు అస్పష్టమైనదిగా మారింది, మరియు అది ఇప్పుడు ఖాళీ వాక్చాతుర్యత తప్ప మరేమీ కాదు. మోక్షము స్వీకరించడం కోసం మరియు అద్భుతమైన గమ్యములోకి ప్రవేశించడం కోసం మనిషి దేవుడిని అనుసరించినప్పటికీ, దేవుడు తన పనిని ఏవిధంగా నిర్వహిస్తాడనే ఆందోళన మనిషికి లేదు. దేవుడి ప్రణాళిక ఏమిటనే దాని గురించి, రక్షించబడడం కోసం తాను అందులో పోషించాల్సిన పాత్ర గురించి మనిషి లక్ష్యపెట్టడం లేదు. ఇదినిజంగా విషాదకరం. మానవుని విముక్తి అనేది దేవుని నిర్వహణ నుంచి అవిభాజ్యమైనది లేదా దేవుని ప్రణాళిక నుంచి విడదీయ లేనిది. అయినప్పటికీ, దేవుని నిర్వహణ గురించిమనిషి ఏదీ ఆలోచించడం లేదు, అవిధంగా ఆయననుండి అంతకంతకూ దూరంగా జరుగుతున్నాడు. సృష్టి అంటే ఏమిటి, దేవునిపై విశ్వాసం అంటే ఏమిటి, దేవుని ఎలా ప్రార్థించాలి, ఆయనను అనుసరించు వారిలో ఎలా చేరుకోవాలి లాంటి విముక్తి అనే ప్రశ్నకు సంబంధించినవిషయాల పట్ల పూర్తి అవహాహన లేని జనాల సంఖ్య బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. కాబట్టి, ప్రస్తుతం మనం దేవుని నిర్వహణ గురించి చర్చించాలి, తద్వారా, దేవుడినిఅనుసరించు వారు ఆయననుఅనుసరించడం, ఆయనపై విశ్వాసం ఉంచడం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఆశీర్వాదం పొందడం కోసం, లేదా ఉపద్రవాలను వదిలించుకోవడం కోసం, లేదా ఇతరుల నుంచి ప్రత్యేకంగా ఉండడం కోసం మాత్రమే దేవుడిని అనుసరించే వారిలా కాకుండా, ప్రతివ్యక్తి తాను అనుసరించాల్సిన మార్గాన్ని స్పష్టంగా ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

దేవుని నిర్వహణ అనేది చాలా లోతైన విషయమే అయినప్పటికీ, అది మానవుని గ్రహణశక్తికి అందనిది మాత్రం కాదు. ఎందుకంటే, దేవుడిపని అంతా ఆయన నిర్వహణకు సంబంధించినది మరియు మానవాళిని కాపాడటం, వారి జీవనం, జీవితం మరియు గమ్యానికి చెందినదై ఉంటుంది. మానవుని కొరకు, మరియు మానవాళి పై దేవుడు చేసే పని అత్యంత ఆచరణీయము మరియు అర్థవంతము అయినదిగా చెప్పవచ్చు. దానిని మానవుడు చూసి అనుభవించగలడేతప్ప, అతను పరిగ్రహించడానికి అందనంత దూరంలో మానవాళి ఉంటుంది. దేవుని పనులన్నిటిని అంగీకరించే శక్తిమనిషికి లేనపుడుఆయన పనికి ప్రాధాన్యత ఏమున్నది? మరియు అలాంటి నిర్వహణ ఏవిధంగా మానవుడి విముక్తికి దారి తీయగలదు? దేవుని అనుసరించు వారిలో చాలామంది దేవుని ఆశీర్వాదం పొందడం, ఉపద్రవాల నుంచి దూరంగా ఉండటం గురించి మాత్రమే ఆలోచిస్తారు. దేవుని పనులు, మరియు నిర్వహణ గురించి పేర్కొన్న వెంటనే వారు మౌనంగా వుండిపోతారు మరియు ఆసక్తి మొత్తం కోల్పోతారు. అంతటి సంక్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవడమనేది వారి జీవితాలు ఎదగడానికి సహాయపడదని లేదా ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని భావిస్తారు. తత్ఫలితంగా, దేవుని నిర్వహణ గురించి వారు విని ఉన్నప్పటికీ, దాని గురించి కొంచెం అలక్ష్యంగానే ఉంటారు. దానిని అంగీకరించవలసినంత విలువైన విషయంగా వారు చూడరు, మరియు వారి జీవితాలలో దానిని ఒక భాగంగా స్వీకరించడం అనేది చాలా తక్కువ. అటువంటి వారు దేవుని అనుసరించడంలో కేవలం ఆశీర్వాదం పొందడం అనే ఒక సాధారణలక్ష్యం మాత్రమే కలిగివుంటారు, అటువంటివారు ఈ లక్ష్యానికి ప్రత్యక్ష సంభందం లేని దేని పట్ల కూడా ఏకాగ్రత చూపడానికి లక్ష్యపెట్టరు. దేవుని మీద విశ్వాసం ఉంచడమనేది ఆశీర్వాదం పొందడానికే అనే విషయానికి మించిన శాస్త్రసమ్మతమైన మరొక గమ్యం వారికిఉండదు. వారి విశ్వాసం విలువ అంతే. ఈ లక్ష్యానికి సహకరించని ఏది కూడా వారిని కదల్చలేదు. నేడు దేవునిపై విశ్వాసం కలిగిన చాలా మంది విషయం ఇలాగే ఉంది. వారి లక్ష్యం మరియు ఉద్దేశ్యం శాస్త్రసమ్మతంగానే కనిపించవచ్చు, ఎందుకంటే, వారు దేవుని పై విశ్వాసం కలిగి వుంటారు, దేవుని కొరకు వ్యయం చేస్తారు, దేవునికి అంకితమై వుంటారు, మరియు వారి కర్తవ్య నిర్వహణ చేస్తారు. వారు యవ్వనాన్నివదలిపెట్టి, కుటుంబాన్ని మరియు వృత్తిని త్యాగం చేసి, చివరకు సంవత్సరాల పాటు ఇంటికి దూరంగా ఏకాగ్రతతోతమలో తాము నిమగ్నమై వుంటారు. వారి అంతిమ లక్ష్యం కోసం వారి ఆసక్తులను, జీవితం పట్ల వారి దృక్పథాన్ని మరియు వారు పొందవలసిన దిశను మార్చుకుంటారు; అయినప్పటికీ దేవుని మీద విశ్వాసంపై వారిలక్ష్యాన్ని మార్చుకోరు. వారి స్వీయ ఆదర్శాల నిర్వహణకో సంవారు పరుగులు పెడుతారు; దూరం ఎంత వున్నప్పటికి, ఎన్ని కష్టనష్టాలు, అడ్డంకులు వారి మార్గంలో ఎదురైనప్పటికీ, మరణ భయం లేకుండా స్థిరంగా వుంటారు. వారు ఈ విధంగా అంకితభావంతో ముందుకు సాగేలా వారిని ఏ శక్తి నెడుతోంది? అది వారి మనస్సాక్షి కావచ్చునా? అది వారి గొప్పతనం మరియు ఔన్నత్యమా? దుష్ట శక్తులను ఎదుర్కొని చివరి దాకా పోరాడాలనే వారి ధృడ సంకల్పమా? ఎటువంటి బహుమతిని ఆశించకుండా దేవుని కనుగోనాలనే వారి బలమైన విశ్వాసమా? దేవుని చిత్తమును సాధించడానికి సమస్తమును వదలిపెట్టిన వారి విధేయతా? లేక విపరీతమైన వారి వ్యక్తిగత కోర్కెలను ఎప్పటికైనా వదలిపెట్టాలనే వారి భక్తిపూర్వక ఆత్మ బలమా? దేవుని నిర్వహణ గురించి ఎప్పటికీ అర్థం కాని ఎవరికోసమో ఏదో చేస్తూ వుండటం నిజంగా ఒక అద్భుతం! ఒక్క క్షణం, వీళ్లు ఎంత ఇచ్చారనే విషయం గురించి చర్చించడం ఆపేద్దాం. ఏది ఏమైనప్పటికీ వారి వ్యవహరణ పట్ల మన విశ్లేషణ అత్యంత యోగ్యతా పూరితమైనది. వారికి సంబంధించి అత్యంత దగ్గరగా వున్న ప్రయోజనాలు కాకుండా, దేవుని ఎప్పటికీ అర్థం చేసుకోని జనులుఆయనకు ఇంకేవైనా ఇస్తున్నారనేందుకు ఇతర కారణాలు ఉన్నాయా? ఇందుకు సంబంధించి గతంలో గుర్తించని సమస్య ఒక దానిని మనం కనుగొనవచ్చు. అది: దేవునితో మానవునికి గల సంబంధం అనేది కేవలం గోచరము కాగల వ్యక్తిగత ఆసక్తిలో ఒకటి. అది ఆశీర్వాదములు ఇచ్చువారు మరియు పుచ్చుకొనువారి మధ్య ఉన్నటువంటి బాంధవ్యము. ఇంకా సరళంగా చెప్పాలంటే అది యజమానికి, ఉద్యోగికి ఉన్నటువంటి సంబంధం లాంటిది. ఉద్యోగి కేవలం యజమాని నుంచి తనకు లభించే ప్రతిఫలం ఆశించి మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. ఆ బంధంలో ఎటువంటి ఆప్యాయతలు వుండవు. అదొక వ్యవహారం మాత్రమే. అందులో ప్రేమించడం, లేదా ప్రేమించబడటం వుండదు. దయ, దాతృత్వం మాత్రమే వుంటాయి. అవగాహన వుండదు, అణచివేయబడిన ఆగ్రహావేశాలు, అన్యాయం తప్ప. అక్కడ సాన్నిహిత్యం వుండదు, దాటడానికి వీలుకాని అగాధం తప్ప. ఇప్పుడు పరిస్థితులన్నీ ఇలానే వున్నపుడు, ఈ క్రమాన్ని ఎవరు మార్చగలరు? ఈ బాంధవ్యం ఎంతటి తీవ్రంగా మారినదో నిజంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎందరికి వున్నది? ఆశీర్వాదం పొందిన ఆనందంలో మునిగి వున్న వారిలో ఎవరూ కూడా దేవునితో మానవునికి గల అటువంటి బాంధవ్యం ఎంతటి అసౌకర్యమైనదో, మరియు చూడలేనిదో ఊహించలేరని నేను అనుకుంటున్నాను.

దేవుని పట్ల మానవాళి నమ్మకానికి సంబంధించి ఒక విషాదకరమైన విషయం ఏమిటంటే, దేవుని పనుల మధ్య మానవుడు తన నిర్వహణ చేసుకుంటున్నప్పటికీ, దేవుని నిర్వహణ పట్ల మాత్రం అలక్ష్యం వహిస్తున్నాడు. ఏ విధంగా అయితే ఒకే సమయంలో దేవుని శరణాగతి కోరుతూ, మరియు ఆయనను కొలుస్తూ మానవుడు తన స్వీయ ఆదర్శాల గమ్యాన్ని నిర్మించుకుంటూ మరియు ఏదో విధంగా అతిగొప్ప ఆశీర్వాదం పొంది, అత్యున్నత గమ్యాన్ని చేరుకోవాలని పన్నాగం పన్నడంలోనే మానవుని అతి పెద్ద వైఫల్యం వున్నది. ఇది ఎంతటి దయనీయము, సహించలేనిది మరియు విషాదకరమైనదంటే, ఒకవేళ ఎవరైనా వారిని అర్థం చేసుకున్నప్పటికీ, ఎందరు వారి ఆదర్శాలను మరియు నమ్మకాలను వెంటనే నిషేదించకుండా ఉండగలరు? వారి స్వీయ అడుగులను ఎవరు ఆపగలరు మరియు వారు గురించి మాత్రమే వారు చేసే ఆలోచనలను ఎవరు మాన్పించగలరు? తన నిర్వహణ పూర్తి చేయడానికి గాను సన్నిహితంగా సహకరించగల వారు మాత్రమే దేవునికి అవసరం. తమ మనసు, శరీరాలను పూర్తిగా దేవుని నిర్వహణ అనే పనికి శరణాగతితో అంకితం చేయగల వారే దేవునికి కావాలి. ప్రతిరోజూ చేతులు జోడించి పట్టుకొని తనను అడుక్కునేవారు, అతి కొద్దిగా ఇచ్చువారు, ప్రతిఫలం కోసం వేచి వుండేవారు దేవునికి అవసరం లేదు. అల్పమైన సహకారం ఇచ్చు వారిని, వారి పురస్కారాలపై ఆధారపడి నెమ్మది పొందే వారిని దేవుడు తృణీకరిస్తాడు. అటువంటి క్రూర స్వభావం గలవారిని, తన నిర్వహణ పనుల పట్ల ఆగ్రహం గల వారిని, స్వర్గాన్ని చేరుకోవడం గురించి మాత్రమే మాట్లాడేవారిని మరియు ఆశీర్వాదాలు కోరేవారిని దేవుడు ద్వేషిస్తాడు. మానవాళిని కాపాడే క్రమంలో తన పనిని అవకాశంగా తీసుకుని లబ్ది పొందాలని చూసే వారిని దేవుడు మరింత అసహ్యించు కుంటాడు. వీళ్ళందరూ దేవుడు తన నిర్వహణ అనే పని ద్వారా ఏది సాధించాలని అనుకుంటున్నారో దాని పట్ల ఏనాడు కూడా శ్రద్ధ చూపలేకపోవడమే అందుకు కారణం. ఆశీర్వాదములు పొందడం కోసం, దేవుడు నిర్వహించు పనుల నుంచి వచ్చు అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ధ్యాస మాత్రమే వారికి వుంటుంది. వారి భవిత, వారి వృద్ది గురించి మాత్రమే పూర్తిగా నిమగ్నమై ఉండే అలాంటి వారికిదేవుని మనసు గురించి శ్రద్ధ ఉండదు. దేవుని నిర్వహణ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయువారు మరియు దేవుడు మానవాళిని ఏ విధంగా రక్షిస్తాడు, ఆయన భావన ఏమిటనే విషయంలో అణుమాత్రమైనా ఆసక్తి లేని వారు వారికి సంతోషం కలిగించే విధంగానే పనులు చేస్తూ వుంటారు. దేవుని నిర్వహణ అనే పనుల నుంచి అది వారిని విడదీస్తుంది. వీరి ప్రవర్తనను దేవుడు గుర్తు పెట్టుకోవడం కానీ, లేదా ఆమోదించడం కానీవుండదు—దానిపై దేవుని అనుకూల దృష్టి వుండటం చాలా తక్కువ.

ఈ విశాలమైన సృష్టిలోను, అనంతమైన ఆకాశంలోను, లెక్కలేనన్ని జీవులు జీవిస్తూ మరియు పునరుత్పత్తి చేస్తూ, జీవిత కాల చక్ర చట్టాన్ని అనుసరిస్తూ, ఒక స్థిరమైన నియమానికి కట్టుబడి వున్నాయి. మరణించిన వారు జీవించి వున్న వారి గాధలను తమతో తీసుకు వెళ్తారు. జీవించి వున్న వారు, మరణించిన వారి అదే విషాద చరిత్రను పునరావృత్తం చేసుకుంటారు. కనుక తమను తాము ప్రశ్నించు కోవడం తప్ప మానవజాతికి మరో మార్గం లేదు; మనం ఎందుకు జీవిస్తున్నాము? మనం ఎందుకు మరణిస్తున్నాము? ఈ ప్రపంచాన్ని ఎవరు శాసిస్తున్నారు? మానవ జాతిని ఎవరు సృష్టించారు? మానవ జాతిని నిజంగా ప్రకృతి మాత సృష్టించిందా? మానవ జాతి నిజంగా తమ విధికి లోబడి వున్నదా? … లాంటి ఎడతెగని ప్రశ్నలు వేల సంవత్స్తరాలుగా మానవ జాతిని వేధిస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, మనిషి ఈ ప్రశ్నలతో ఎంత ఎక్కువగా తలమునకలై ఉన్నాడో, అంతగా సైన్స్ పట్ల తన తృష్ణను పెంచుకున్నాడు. సంక్షిప్తమైన సంతృప్తిని, తాత్కాలికమైన శారీరక ఆనందాన్ని సైన్స్ అందించగలదు, కానీ తన మనసు లోతుల్లో దాగి వున్న ఒంటరితనం, ఏకాంత భావన, అణచి వుంచిన భయాందోళన మరియు నిస్సహాయతల నుంచి మనిషికి విముక్తి ఇవ్వడానికి అది సరిపోనంత దూరంలో వుంది. మనసును స్పృహ తప్పించి, కేవలం తన కంటితో చూడగలిగే మరియు మెదడుతో అర్థం చేసుకోగలిగేలా మాత్రమే శాస్త్రీయ జ్ఞానాన్ని మానవ జాతి ఉపయోగిస్తున్నది. అయినప్పటికీ, రహస్యాలను అన్వేషించకుండా మానవ జాతిని ఆపడానికి అలాంటి శాస్త్రీయ జ్ఞానం సరిపోదు. విశ్వానికి, అందులోని సమస్తానికి అధిపతి ఎవరనే విషయం గురించి మానవజాతికి తెలియదు. మానవజాతి ప్రారంభం మరియు భవిష్యత్తు గురించి తెలిసినది చాలా తక్కువ. ఈ శాసనానికి లోబడి మానవజాతి జీవించడం, పాలించబడటం జరుగుతుంది. నిత్యం నుంచి శాశ్వతం వరకు అన్నిటిపైన స్వర్గంలో సార్వభౌమాధికారం కలిగిన కేవలం ఒక్కరు తప్ప, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ఎవరూ దానిని మార్చలేరు. మానవజాతి ఎన్నడూ ఆయనను చూడలేదు, మానవజాతి ఎన్నడూ ఆయనను ఎరుగదు, ఆయనఉనికిని మానవజాతి ఎన్నడూ విశ్వసించలేదు-అయినప్పటికీ, ఆయన మానవజాతి పూర్వీకులకు ఊపిరి పోసి మానవాళికి జీవం పోసినవాడు. ఆయనేమానవజాతికి సమకూర్చేవాడు మరియుపోషించేవాడు, మనిషికిఉనికిని కల్పించువాడు; మరియు నేటి వరకు మానవజాతికి మార్గనిర్దేశం చేసి నడిపించినది ఆయనే. అంతేకాక, మానవజాతి తన మనుగడ కోసం ఆయన మీద మరియు కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉటుంది. ఆయనే అన్నివిషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు విశ్వంలోని సకల జీవులను పరిపాలిస్తున్నాడు. ఆయన నాలుగు ఋతువులను ఆజ్ఞాపిస్తాడు, మరియు ఆయనే గాలి, మంచు, హిమపాతమును మరియు వానలను పిలువగలడు. ఆయనమానవాళికి వెలుగు కొనితెచ్చి చీకటిలో దారి చూపువాడు. పర్వతాలు, సరస్సులు మరియు నదులు మరియు వాటిలోని అన్ని జీవరాశులను మనిషికి అందించి, స్వర్గాన్ని మరియు భూమిని నిర్దేశించినది ఆయనే. ఆయనకర్మలు సర్వవ్యాపితము, ఆయనశక్తి సర్వవ్యాప్తము, ఆయనజ్ఞానము సర్వవ్యాపితము, మరియు ఆయనఅధికారము సర్వవ్యాపకము. ఈ చట్టాలు మరియు నియమాలలో ప్రతి ఒక్కటీ ఆయనచర్యల స్వరూపము, మరియు ప్రతి ఒక్కటి కూడా ఆయనజ్ఞానం మరియు అధికారాన్ని వెల్లడిస్తుంది. ఆయనసార్వభౌమాధికారం నుండి ఎవరు తమను మినహాయించుకోగలరు? మరియు ఆయనప్రణాళిక నుండి ఎవరు తమను తాము విడుదల చేసుకోగలరు? అన్ని విషయాలు ఆయనదృష్టి క్రిందే ఉన్నాయి, అంతేకాకుండా, ప్రతిదీ ఆయనసార్వభౌమాధికారం క్రింద జీవిస్తున్నది. ఆయనపనులు మరియు ఆయనశక్తి వలన ఆయననిజంగా ఉనికిలో ఉన్నాడని మరియు సమస్త విషయాలపై సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని అంగీకరించడం మినహా మానవజాతికి వేరే మార్గం లేకుండా పోయింది. ఈ మానవాళికి అంతులేకుండా అందించడానికిఆయన తప్ప మరేదీ విశ్వాన్ని ఆజ్ఞాపించదు. మీరు దేవుని పనులను గుర్తించగలరా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మరియు మీరు దేవుడిఉనికిని విశ్వసిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మీభవితవ్యం దేవునిచే నిర్ణయించబడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఎల్లప్పుడూ అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఉనికి మరియు అధికారాన్ని ఊహించడానికి మనిషి వాటిని గుర్తించాడా, గ్రహించాడా అనే దానితో నిమిత్తం లేదు. మనిషి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆయనకు మాత్రమే తెలుసు, మరియు ఆయనమాత్రమే మానవజాతి విధిని నిర్ణయించగలడు. మీరుఈ వాస్తవాన్ని అంగీకరించగలరా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మానవజాతి తమ స్వీయదృష్టితో వీటన్నింటిని చూడగలిగేందుకు ఎంతో కాలం పట్టదనే వాస్తవం దేవుడు గ్రహింపచేస్తాడు. మానవాళి జీవన్మరణాలు దేవుని కనుసన్నలలోనే వుంటాయి. మానవుడు దేవుని నిర్వహణ కోసమే జీవిస్తాడు, ఆయనకళ్ళు చివరిసారి మూసుకున్నపుడుఈ నిర్వహణ కోసమే అవి కూడా మూసుకుపోతాయి. మనిషి పదే పదే ముందుకు వెనుకకూ వస్తూ పోతూ ఉంటాడు. ఇది దేవుని సార్వభౌమాధికారం మరియు అతని ప్రణాళికలో భాగం. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు. దేవుని నిర్వహణ ఎప్పుడూ ఆగిపోలేదు; అది నిత్యం పురోగమిస్తోంది. ఆయనతన ఉనికిని గురించి మానవాళికి అవగాహన, అతని సార్వభౌమాధికారంపై నమ్మకం కల్గిస్తాడు. ఆయనపనులను చూసుకొని, తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఇది ఆయన ప్రణాళిక, మరియు వేలాది సంవత్సరాలుగా అతనునిర్వహిస్తున్న పని.

దేవుని నిర్వహణ పని అనేది ప్రపంచం సృష్టితో ప్రారంభమైంది మరియు మనిషి ఈ పనిలో ప్రధానంగా వున్నాడు. దేవుడు సృష్టించిన సకలంమనిషి కోసమే అని చెప్పవచ్చు. ఆయననిర్వహణ పని వేల సంవత్సరాల కాల పరిధి కలిగినది. కేవలం నిమిషాలు లేదా సెకన్ల వ్యవధిలో లేదా రెప్పపాటులో లేదా ఒకటి లేదా రెండు సంవత్సరాలలో పూర్తయ్యేది కాదు. ఆయన మానవజాతి మనుగడకు అవసరమైన మరిన్నిటిని అనగా, సూర్యుడు, చంద్రుడు, సకల జీవులు, ఆహారం మరియు ఆతిథ్యపూర్వక వాతావరణం మొదలైనవి సృష్టించవలసి వచ్చింది. దేవుని నిర్వహణ ఇలాగే ప్రారంభమైంది.

ఆ తరువాత, దేవుడు మానవజాతిని సాతానుకు అప్పగించాడు, మరియు మనిషి సాతాను సామ్రాజ్యం క్రింద జీవించాడు. ఇది క్రమంగా మొదటి యుగపు దేవుని పనికి దారితీసింది: న్యాయ యుగం కథ…. న్యాయ యుగంలో అనేక వేల సంవత్సరాలకు పైగా, మానవజాతి న్యాయ యుగం మార్గదర్శకత్వానికి అలవాటు పడింది మరియు దానిని స్వీకరించడం జరిగింది. క్రమంగా, మనిషి దేవుని విస్మరించాడు. అందువల్ల, వారు చట్టాన్ని అనుసరిస్తున్నపుడు, విగ్రహారాధన చేసారు, మరియు చెడు పనులు చేశారు. వారు యెహోవా రక్షణ లేకుండా ఉండి, కేవలం ఆలయంలోని బలిపీఠం ముందు తమ జీవితాలను గడిపారు. వాస్తవానికి, దేవుని పని చాలా కాలం క్రితం వారిని విడిచిపెట్టింది, మరియు ఇజ్రాయలీయులు ఇప్పటికీ శాసనానికి కట్టుబడి, యెహోవా పేరును మాట్లాడినప్పటికీ, వారు మాత్రమే యెహోవా ప్రజలమని మరియు యెహోవాచే ఎన్నుకోబడిన వారని గర్వంగా విశ్వసించారు. దేవుని మహిమ వారిని నిశ్శబ్దంగా విడిచిపెట్టింది …

దేవుడు తన పనిని చేసినప్పుడు, ఆయననిరంతరం నిశ్శబ్దంగా ఒక ప్రదేశాన్ని విడిచిపెట్టి, మరొక చోట మృదువుగా ప్రారంభించిన కొత్త పనిని నిర్వహిస్తాడు. మొద్దుబారిన వ్యక్తులకు ఇది అపురూపంగా కన్పిస్తుంది. ప్రజలు ఎల్లప్పుడూ పాతవాటిని విలువైనదిగాను, మరియు వినూత్నమైన, తెలియని విషయాలను విరోధ భావంతో లేదా ఇబ్బందికరంగాను చూస్తారు. కాబట్టి, దేవుడు ఎటువంటి కొత్త పని చేసినప్పటికీ, ప్రారంభం నుండి చిట్టచివరి వరకు, మానవుడు దానిని తెలుసుకోవడంలో వెనుకబడే వున్నాడు.

ఎప్పటిలాగే, న్యాయ యుగంలో యెహోవా పని తర్వాత, దేవుడు తన రెండవ దశ కొత్త పనిని ప్రారంభించాడు: శరీరాన్ని స్వీకరించి—పది, ఇరవై సంవత్సరాలు మనిషిగా అవతరించి-మరియు విశ్వాసుల మధ్య మాట్లాడటం మరియు ఆయనపని చేయడం చేశాడు. అయినప్పటికీ ఎటువంటి మినహాయింపు లేకుండా, ఇది ఎవరికీ తెలియనప్పటికీ, యేసు ప్రభువు దేవుడనే విషయాన్ని ఆయనశిలువకు వ్రేలాడదీయబడి పునరుత్థానం చెందిన తర్వాత కూడా కొద్దిమంది మాత్రమే అంగీకరించారు. దేవునికి ప్రాణాంతకమైన శత్రుత్వంలో వున్న పౌలు అని పిలవబడే వ్యక్తి సమస్యాత్మకంగాకనిపించాడు, అతను తోసివేయబడి, మరియు క్రైస్తవ బోధకుడైన తర్వాత కూడా, పౌలు తన పాత స్వభావాన్ని మార్చుకోలేదు మరియు అతను దేవుని వ్యతిరేక మార్గంలో నడవడం కొనసాగించాడు. అతను పనిచేసిన సమయంలో, పౌలు అనేక లేఖనాలు వ్రాసాడు; దురదృష్టవశాత్తూ, తరువాతి తరాలు అతని లేఖనాల విషయంలోగందరగోళానికి గురై, వాటిని దేవుని పదాలుగా ఆస్వాదించారు, మరియు అవి కొత్త నిబంధనలో చేర్చబడి దేవుని మాటలు వారిని గందరగోళ పరిచాయి. పవిత్ర గ్రంథం వెలువడినప్పటి నుంచి నుండి ఇది పూర్తిగా అవమానకరంగా వుంది! ఈ తప్పు మనిషి తీవ్రమైన మూర్ఖత్వం కారణంగా జరిగింది కాదా? కృపాయుగంలో దేవుని పని రికార్డులలో, మనిషి లేఖనాలు లేదా ఆధ్యాత్మిక రచనలు కేవలం దేవుని పని మరియు పదాలు వలె అనుకరించకూడదని వారికి తెలియదు. కానీ అది అసలు విషయం పక్కనే ఉంది, కాబట్టి మన అసలు అంశానికి తిరిగి వెళ్దాం. దేవుని పని రెండవ దశ పూర్తయిన వెంటనే—శిలువ వేయబడిన తరువాత—పాపం నుండి మనిషిని పునరుద్ధరించే దేవుని పని (అంటే సాతాను చేతిలో నుండి మనిషిని కోలుకునేలా చేయడం) నెరవేరింది. కాబట్టి, ఆ క్షణం నుండి, అతని పాపాలు క్షమించబడతాయి మరియు మానవజాతికి ప్రభువైన యేసును మాత్రమే రక్షకునిగా అంగీకరించాలి. సాధారణంగా చెప్పాలంటే, మనిషి పాపాలు అతను మోక్షాన్ని సాధించడానికి మరియు దేవుని ఎదుటకు రావడానికి ఇకపై అడ్డంకిగా ఉండవు మరియు సాతాను మనిషిపై ఆరోపణలు చేసేంత పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడే స్వయంగా నిజమైన పని చేసాడు, పాపపంకిలమైన శరీరానికి సారూప్యత మరియు సంభావ్య పరిమిత అవగాహనగా మారాడు మరియు దేవుడే పాపపరిహారార్థ సమర్పణ అయినాడు. ఈ విధంగా, మనిషి శిలువ నుండి దిగి, విమోచన గావించబడినాడు మరియు దేవుని దేహం-పాపపంకిలమైన దేహం పోలికద్వారా రక్షించబడినాడు. కాబట్టి, సాతాను బందీగా తీసుకున్న తర్వాత, మనిషి దేవుని ముందు తన మోక్షాన్ని అంగీకరించడానికి ఒక అడుగు దగ్గరగా వచ్చాడు. వాస్తవానికి, శాసన యుగంలో దేవుని నిర్వహణ కంటే ఈ దశ పని లోతుగా మరియు ఎక్కువగా అభివృద్ధి చెందింది.

దేవుని నిర్వహణ అటువంటిది: మానవజాతిని సాతానుకు అప్పగించడం—దేవుడు అంటే ఏమిటో, సృష్టికర్త అంటే ఏమిటో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, లేదా దేవునికి ఎందుకు లోబడాలో తెలియని మానవజాతి—మరియు సాతాను అతనిని పాడు చేయడానికి అనుమతించడం. అంచెలంచెలుగా, మనిషి దేవుణ్ణి పూర్తిగా ఆరాధించి సాతానును తిరస్కరించే వరకు, దేవుడు మనిషిని సాతాను చేతుల నుండి తిరిగి పొందుతాడు, ఇది దేవుని నిర్వహణ. ఇది పౌరాణిక గాధలా అనిపించవచ్చు మరియు ఇది అయోమయంగా కనిపించవచ్చు. గత కొన్ని వేల సంవత్సరాలలో మనిషికి ఎంత జరిగిందనే దాని గురించి వారికి ఎటువంటి అవగాహన లేదు, విశ్వం మరియు ఆకాశంలో ఎన్ని కథలు సంభవించాయో వారికి తెలిసినది చాలా తక్కువ కాబట్టి ఇది పురాణ కథగా ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా, భౌతిక ప్రపంచానికి మించి ఉన్న మరింత ఆశ్చర్యకరమైన, మరింత భయాన్ని కలిగించే ప్రపంచాన్ని వారు అభినందించలేరుకానీ, వారి నశ్వరమైన కళ్ళు వారిని చూడకుండా నిరోధించాయి. దేవుడు మానవాళిని రక్షించే ప్రాముఖ్యత గురించి లేదా ఆయననిర్వహణ ప్రాముఖ్యత గురించి మనిషికి అవగాహన లేనందున ఇది మనిషికి అర్థంకానిదిగా అనిపిస్తుంది మరియు చివరికి దేవుడు మానవజాతి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అర్థం చేసుకోలేడు. అది ఆదాము హవ్వల వలె సాతానుచే పూర్తిగా పాడైపోకుండా ఉండాలా? లేదు! దేవుని నిర్వహణ యొక్క ఉద్దేశ్యం దేవుణ్ణి ఆరాధించే మరియు ఆయనకు శరణాగతి పొందే వ్యక్తుల సమూహాన్ని పొందడం. ఈ ప్రజలు సాతానుచే పాడు చేయబడినప్పటికీ, వారు ఇకపై సాతానును తమ తండ్రిగా చూడరు; వారు సాతాను వికారమైన ముఖాన్ని గుర్తించి దానిని తిరస్కరించారు మరియు వారు దేవుని తీర్పును మరియు శిక్షను అంగీకరించడానికి దేవుని ముందుకు వస్తారు. అసహ్యకరమైనది మరియు అతిపవిత్రమైన దానితో ఎలా విభేదిస్తుందో వారు తెలుసుకుంటారు మరియు దేవుని గొప్పతనాన్ని, సాతాను చెడును గుర్తిస్తారు. ఇలాంటి మానవజాతి ఇకపై సాతాను కోసం పనిచేయదు, లేదా సాతానును ఆరాధించదు లేదా సాతానును ప్రతిష్టించదు. ఎందుకంటే, వారు నిజంగా దేవుని చేత సంపాదించబడిన వ్యక్తుల సమూహం. మానవాళిని నిర్వహించే దేవుని పని ప్రాముఖ్యత ఇదే. ఈ కాలపు దేవుని నిర్వహణ పనిలో, మానవజాతి సాతాను అవినీతి మరియు దేవుని మోక్షానికి సంబంధించిన అంశము, దేవుడు మరియు సాతాను పోరాడుతున్న వస్తువే మానవుడు. దేవుడు తన పనిని నిర్వర్తిస్తున్నప్పుడు, ఆయనక్రమంగా మనిషిని సాతాను చేతి నుండి విముక్తి పరుస్తున్నాడు మరియు మనిషి దేవునికి మరింత దగ్గరవుతున్నాడు …

ఆపై రాజ్య యుగం వచ్చింది, ఇది పని యొక్క మరింత ఆచరణాత్మక దశ, ఇంకా దీనిని అంగీకరించడం మనిషికి కష్టతరమైనది. ఎందుకంటే, మనిషి దేవునికి ఎంత దగ్గరగా వస్తాడో, దేవుని దండం మనిషికి అంత దగ్గరగా వస్తుంది మరియు దేవుని ముఖం మనిషికి మరింత స్పష్టంగా తెలుస్తుంది. మానవజాతి విమోచన తరువాత, మనిషి అధికారికంగా దేవుని కుటుంబానికి తిరిగి వస్తాడు. మానవుడు ఇప్పుడు ఆనందించే సమయం అని భావించాడు, అయినప్పటికీ అతను దేవుని పూర్తి-ఎదురు దాడికి గురవుతాడు, ఇలాంటివి ఎవరూ ఊహించలేదు: ఇది దేవుని ప్రజలు “ఆనందించే” బాప్టిజంగా మారింది. అటువంటి చికిత్సలో, ప్రజలు ఆగి తమలో తాము ఆలోచించుకోవడం తప్ప వేరే మార్గం లేదు, “నేను అనేక సంవత్సరాలు తప్పిపోయిన గొర్రెపిల్లను, తిరిగి పొందడానికి చాలా ఖర్చు చేసిన దేవుడు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? నన్నుపరిహసించడం మరియు నన్ను బహిర్గతం చేయడం దేవుని మార్గమా? …” సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆటు పోట్లను తట్టుకుని మనిషి శుద్ధి మరియు శిక్షల కష్టాలను అనుభవించాడు. మానవుడు గత కాలపు “వైభవాన్ని” మరియు “శృంగారాన్ని” కోల్పోయినప్పటికీ, అతను తనకు తెలియకుండానే, మానవ ప్రవర్తన సూత్రాలను అర్థం చేసుకున్నాడు మరియు మానవాళిని రక్షించడానికి ఏళ్ళతరబడి అంకితమైన దేవుని మెచ్చుకున్నాడు. మనిషి నెమ్మదిగా తన అనాగరికతను అసహ్యించుకోవడం ప్రారంభిస్తాడు. అతను ఎంత క్రూరమైనవాడో, దేవుని పట్ల అతనికి ఉన్న అపార్థాలన్నింటినీ మరియు అతని నుండి తాను కోరిన అసమంజసమైన కోర్కెలనును ద్వేషించడం ప్రారంభించాడు. గడియారాన్ని వెనక్కి తిప్పలేము. గత కాలపు సంఘటనలు మనిషికి విచారకరమైన జ్ఞాపకాలవుతాయి, మరియు దేవుని ప్రేమ, మాటలు మనిషి కొత్త జీవితాన్ని నడిపించే చాలక శక్తిగా మారుతుంది. రోజులు గడిచే కొద్దీ మనిషి గాయాలు మానుతాయి, తన శక్తి తిరిగి వస్తుంది, లేచి నిలబడి దేవుడిముఖాన్ని చూస్తాడు … ఆయన ఎల్లప్పుడూ తనపక్కనే ఉన్నాడని మరియు ఆయనచిరునవ్వు మరియు ఆయనఅందమైన ముఖం ఇప్పటికీ చాలా కదిలిస్తుంది. ఆయనసృష్టించిన మానవజాతి పట్ల ఆయన హృదయం ఇప్పటికీ ఆందోళన కలిగి ఉంది మరియు ఆయనచేతులు ప్రారంభంలో ఉన్నంత వెచ్చగా మరియు శక్తివంతంగా ఉన్నాయి. అది ఎలా వుందంటే మానవుడు ఏదేను వనమునకు తిరిగి వచ్చినట్లుగా ఉంది, అయితే ఈసారి మనిషి ఇకపై సర్పము ప్రలోభాలను వినడు మరియు ఇకపై యెహోవా ముఖం నుండి దూరంగా జరగడు. మనిషి దేవుని ముందు మోకరిల్లి, దేవుని చిరునవ్వుతో కూడిన ముఖం వైపు చూస్తూ, —ఓహ్! నా ప్రభువా, నా దేవా! అని శరణు వేడుతాడు.

దేవుని ప్రేమ మరియు కరుణ ఆయన నిర్వహణలోని ప్రతి పనిని వివరంగా విస్తరిస్తుంది మరియు ప్రజలు దేవుని మంచి ఉద్దేశాలను అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అనే దానితో సంబంధం లేకుండా, ఆయన ఇప్పటికీ ఆయననెరవేర్చడానికి నిర్ణయించిన పనిని అవిశ్రాంతంగా చేస్తున్నాడు. దేవుని నిర్వహణ గురించి ప్రజలు ఎంతగా అర్థం చేసుకున్నారనే దానితో సంబంధం లేకుండా, దేవుని పని ద్వారా మనిషికి లభించే సహాయం మరియు ప్రయోజనాలు ప్రతిఒక్కరిచే ప్రశంసించబడతాయి. బహుశా, ఈ రోజున, మీరు దేవుడు అందించిన ప్రేమ లేదా జీవితాన్ని అనుభవించలేదు, కానీ మీరు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నంత కాలం మరియు సత్యాన్ని వెంబడించాలనే మీ సంకల్పాన్ని వదులుకోనంత కాలం దేవుని చిరునవ్వు మీకు వెల్లడి అయ్యే ఒక రోజు వస్తుంది. దేవుని నిర్వహణ పని లక్ష్యం సాతాను సామ్రాజ్యం క్రింద ఉన్న ప్రజలను తిరిగి పొందడమే తప్ప, సాతానుచే భ్రష్టుపట్టిన ప్రజలను, దేవుని వ్యతిరేకించే వారిని విడిచిపెట్టడం కాదు.

సెప్టెంబర్ 23, 2005

మునుపటి:  అనుబంధం 2: దేవుడుమొత్తంమానవాళిభవిష్యత్తుకు అధిపతి

తరువాత:  అనుబంధం 4: దేవుని తీర్పు మరియు శిక్షలలో ఆయన ప్రత్యక్షతను చూచుట

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger