20 వ అధ్యాయము
నా కుటుంబ సంపదలు లెక్కించ వీలుకానివి మరియు గ్రహించలేనివి, అయినా వాటిని అనుభవించడానికి మనిషి నా వద్దకు ఎప్పుడూ రాలేదు. మనిషి ఒంటరిగా తనంతట తాను ఆనందించలేడు, లేదా తన స్వంత వ్యయ ప్రయాసములను ఉపయోగించుకొని తనను తాను సంరక్షించుకోలేడు; దానికి బదులుగా, అతను ఎల్లప్పుడూ ఇతరులపై విశ్వాసం ఉంచాడు. నేను చూసే వారందరిలో ఎవరూ ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా, నేరుగా నన్ను అన్వేషించలేదు. వారందరూ ఇతరుల ప్రేరణతో, అధిక సంఖ్యాకులను అనుసరిస్తూ నా యెదుటకు వస్తారు, తమ జీవితాలను సుసంపన్నం చేసుకునేందుకు వెలను చెల్లించడానికి ఇష్టపడరు, లేదా సమయాన్ని వెచ్చించడానికి వారు ఇష్టపడరు. కాబట్టి, మనుష్యులలో ఏ ఒక్కరూ వాస్తవికతలో జీవించలేదు మరియు ప్రజలందరూ అర్థరహితమైన జీవితాలను జీవిస్తారు. సుదీర్ఘకాలం నుండి అమలులో ఉన్న మానవుని మార్గాలు మరియు ఆచారాల కారణంగా, ప్రజలందరి శరీరాలు ప్రాపంచిక మట్టి వాసనతో నిండిపోయాయి. తత్ఫలితంగా, మానవుడు మొద్దుబారిపోయాడు, ప్రపంచపు దుస్థితి పట్ల సున్నితత్వాన్ని కోల్పోయాడు, తత్ఫలితంగా ఈ ఘనీభవించిన ప్రపంచంలో తనను తాను ఆనందంగా ఉంచుకునే పనిలో లీనమవుతున్నాడు. మానవుని జీవితంలో లేశమాత్రం కూడా వెచ్చదనం లేదు, మానవుని జీవితములో ఎలాంటి మానవత్వపు జాడ గాని, లేదా కాంతి జాడ గాని లేదు, అయినప్పటికీ అతను ఏమీ సాధించకుండానే ఉరుకులు పరుగులు పెట్టే ఎలాంటి విలువలేని జీవితకాలానికి లోబడుతూ, ఎప్పుడూ స్వీయ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. కన్నుమూసి తెరిచే లోగా మృత్యువు దగ్గరవుతుంది మరియు మనిషి బాధాకరంగా మరణిస్తాడు. ఈ ప్రపంచంలో అతను ఎప్పుడూ ఏమీ సాధించలేదు లేదా ఏమీ సంపాదించుకోలేదు, అంటే అతను ఇక్కడకు హడావిడిగా వస్తాడు మరియు హడావిడిగా వెళ్లిపోతాడు. నేను చూసిన వారిలో ఎవరూ ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు, కాబట్టి ఈ ప్రపంచం అన్యాయమైనదని మనిషి భావిస్తాడు. అయినా, హడావిడిగా వెళ్లిపోవడానికి ఎవరూ ఇష్టపడరు. వారు త్రోవ తప్పిపోయిన సమయంలో, శాశ్వత జీవిత మార్గాన్ని మరోసారి చూసేందుకు వారికి వీలుకల్పిస్తూ, పరలోకం నుండి అకస్మాత్తుగా నా వాగ్దానం మానవుల మధ్యకు వచ్చే రోజు కోసం మాత్రమే వారు ఎదురు చూస్తారు. ఆ విధంగా, నేను మనిషికి ఇచ్చిన వాగ్దానాన్ని నిజంగా నిలబెట్టుకుంటున్నానా లేదా అని చూసేందుకు నేను జరిగించే ప్రతి పనిపై మరియు చర్యపై దృష్టి నిలుపుతారు. మనిషి వ్యధలలో ఉన్నప్పుడు లేదా అంతులేని బాధలో ఉన్నప్పుడు లేదా పరీక్షలకు గురై, పతనం కాబోతున్నప్పుడు, అతను త్వరగా తన కష్టాలను తప్పించుకొని మరొక ఆదర్శవంతమైన ప్రదేశానికి చేరుకోవడానికి తన పుట్టిన రోజును శపిస్తాడు. కానీ పరీక్షలు అయిపోయినప్పుడు, మనిషి ఆనందముతో నింపబడతాడు. అతను భూమి మీద తన పుట్టిన రోజు పండుగ చేసుకుంటాడు మరియు అతని పుట్టిన రోజును ఆశీర్వదించమని నన్ను అడుగుతాడు; ఈ సమయంలో, రెండవసారి మృత్యువు తనను కబళిస్తుందనే భయంతో, మనిషి ఇక ఏమాత్రం గత ప్రమాణాలను ప్రస్తావించడు. నా చేతులు లోకాన్ని ఉద్ధరించినప్పుడు, ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తారు, వారిలో ఇక దుఃఖం ఉండదు మరియు వారంతా నాపై ఆధారపడతారు. నేను నా చేతులతో నా ముఖాన్ని కప్పుకున్నప్పుడు మరియు ప్రజలను భూమిలోనికి తొక్కివేసినప్పుడు, వెంటనే వారికి ఊపిరి ఆడదు మరియు ప్రాణంతో ఉండలేరు. నేను వారిని నాశనం చేస్తాననే భయంతో వారంతా నా ఎదుట మొర పెట్టుకుంటారు, ఎందుకంటే నేను మహిమ పొందే రోజును చూడాలని వారందరూ ఆశిస్తారు. మనిషి నా రోజును తన అస్థిత్వానికి పెట్టుబడిగా తీసుకుంటాడు మరియు నా మహిమ వచ్చే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తారు కాబట్టే, మానవాళి నేటి వరకు ప్రాణంతో ఉంది. నా నోటితో తీర్పు ఇవ్వబడిన ఆశీర్వాదం ఏమిటంటే, అంత్యకాలములో జన్మించిన వారు నా మహిమనంతటినీ చూసే అదృష్టవంతులైయున్నారు.
కాలాల తరబడి, అనేకమంది నిరాశతోను మరియు అయిష్టంతోను ఈ లోకం నుండి వెళ్లిపోయారు మరియు అనేకమంది నిరీక్షణతోను మరియు విశ్వాసంతోను ఈ లోకంలోకి వచ్చారు. అనేకమంది రావడానికి నేను ఏర్పాటు చేశాను మరియు అనేకమందిని పంపించాను. లెక్కలేనంత మంది నా చేతులమీదుగా వెళ్లిపోయారు. అనేక ఆత్మలు పాతాళంలోకి తోసివేయబడ్డాయి, అనేకమంది దేహంలో జీవించారు మరియు అనేకమంది మరణించి, తిరిగి భూమిపై. అయినప్పటికీ, వారిలో ఎవరూ ఈనాటి దేవుని రాజ్యపు ఆశీర్వాదాలు అనుభవించే అవకాశాన్ని ఎప్పుడూ పొందలేదు. నేను మనిషికి ఎంతో ఇచ్చాను, అయినప్పటికీ అతను కొద్దిగానే పొందాడు, ఎందుకంటే సాతాను శక్తుల దాడులు నా సంపదలనన్నీ అతడు అనుభవించకుండా చేశాయి. అతనికి వాటిని చూసే అదృష్టం మాత్రమే దక్కింది, అంతేగానీ వాటిని పూర్తిగా అనుభవించలేకపోయాడు. పరలోకపు సంపదలను అందుకోవడానికి తన శరీరంలోని ఖజానాను ఎన్నడూ కనుగొనలేదు, కాబట్టే నేను అతనికి ప్రసాదించిన ఆశీర్వాదాలను కోల్పోయాడు. నా ఆత్మతో మనిషిని అనుసంధానము చేసే అతని ఆత్మ నిగూఢశక్తి కాదా? మనిషి తన ఆత్మతో నన్ను నిమగ్నమైయుండునట్లు ఎందుకు చేసుకోలేదు? అతను శరీరంతో నాకు చేరువగా వచ్చినప్పటికీ, ఆత్మ విషయములో అతను ఎందుకు అలా చేయలేకపోవుచున్నాడు? నా నిజమైన ముఖం శరీరసంబంధమైన ముఖమా? మనిషి నా గుణగణాలను ఎందుకు తెలుసుకోడు? మనిషి ఆత్మలో నేను నిజంగా ఎన్నడూ లేశమాత్రం కూడా లేనా? నేను మనిషి ఆత్మ నుండి పూర్తిగా అదృశ్యమైపోయానా? మనిషి ఆధ్యాత్మిక ప్రపంచం లోనికి ప్రవేశించకపోతే, అతను నా ఉద్దేశాలను ఎలా పసిగట్టగలడు? మనిషి దృష్టిలో, ఆధ్యాత్మిక ప్రపంచం లోనికి నేరుగా ప్రవేశించగలిగేది ఏదైనా ఉందా? నేను నా ఆత్మతో మనిషిని అనేకసార్లు పిలిచాను, అయినప్పటికీ నేను అతన్ని వేరే లోకంలోనికి తీసుకువెళ్తానేమోననే చాలా భయంతో, మనిషి దూరం నుండి నన్ను చూస్తూ, నేను అతన్ని గుచ్చుతున్నానా అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. నేను మనిషి ఆత్మలో అనేకసార్లు విచారించాను, అయినప్పటికీ నేను అతని ఇంట్లోకి జొరబడి అతని వస్తువులన్నీ దోచుకుంటానేమోనని తీవ్రంగా భయపడుతూ, అతను పూర్తిగా విస్మరించి ఉంటాడు. ఆవిధంగా, అతను నన్ను బయట చలిలో వదిలివేసి, గట్టిగా తలుపు మూసుకుంటాడు. అనేకసార్లు మనిషి పతనమయ్యాడు మరియు నేను అతనిని రక్షించాను, అయినప్పటికీ అతను మేల్కొన్న తక్షణమే నన్ను విడిచిపెట్టి, నా ప్రేమను పట్టించుకోకుండా, నేనెప్పుడూ మనిషి హృదయంపట్ల ఆత్మీయత చూపలేదు అన్నట్లు, నన్ను అనుమానంగా చూస్తాడు. మనిషి భావోద్వేగాలను కోల్పోయిన క్రూర జంతువు. అతను నా ఆలింగనంతో ఆత్మీయతను పొందినప్పటికీ, దాని ద్వారా అతను లోతుగా చలించలేకపోయాడు. మనిషి పర్వతాలలో ఉండే కిరాతకుని వంటివాడు. మానవజాతిపట్ల నాకున్న సమస్త అభిరుచిని అతను ఎన్నడూ కూడబెట్టుకోలేదు. క్రూర మృగాల ప్రమాదాలను తట్టుకుంటూ పర్వతాల మధ్య నివసించడానికి ఇష్టపడుతూ, అతను నన్ను చేరుకోవడానికి ఇష్టపడలేదు, అయినప్పటికీ నన్ను ఆశ్రయించడానికి అతడు ఇష్టపడటం లేదు. నేను ఏ మనిషినీ బలవంతం చేయను: నేను నా కార్యాన్ని మాత్రమే చేస్తాను. భూమిపై ఉన్న సంపదలన్నీ అనుభవించడానికి మరియు సముద్రం మింగివేసే ప్రమాదాన్ని తప్పించుకోవడానికి, మనిషి అంతులేని మహాసముద్రం మధ్య నుండి నా వైపుకు ఈత కొట్టుకుంటూ వచ్చే రోజు వస్తుంది.
నా మాటలు నిజమైనప్పుడు, భూమిపై క్రమంగా దేవుని రాజ్యం ఏర్పడుతుంది మరియు మనిషి క్రమంగా సాధారణ స్థితికి తిరిగి వస్తాడు, తద్వారా నా హృదయంలో ఉన్న దేవుని రాజ్యం భూమిపై స్థాపించబడుతుంది. దేవుని రాజ్యంలో, దేవుని ప్రజలందరూ సాధారణ మనిషి జీవితాన్ని తిరిగి పొందుకుంటారు. మంచుతో కూడిన శీతాకాలం ముగిసింది, దాని స్థానంలో వసంతంతో నిండిన నగరాల ప్రపంచం ఏర్పడింది, ఇక్కడ యేడాది పొడవునా వసంతకాలమే ఉంటుంది. ప్రజలు ఇకపై దిగులుతో, దయనీయంగా ఉండే మానవ ప్రపంచాన్ని చూడరు మరియు వారు ఇకపై మానవ ప్రపంచపు చల్లని చలిని భరించరు. ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోరు, దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగవు, ఇకపై మారణహోమం ఉండదు మరియు మారణహోమం నుండి రక్తపాతం ఉండదు; అన్ని దేశాలు ఆనందంతో నిండిపోతాయి మరియు ప్రతిచోటా మనుషుల మధ్య ఆత్మీయత వెల్లివిరుస్తుంది. నేను ప్రపంచమంతటా తిరుగుతాను, నా సింహాసనంపై నుండి ఆనందిస్తాను మరియు నేను నక్షత్రాల మధ్య నివసిస్తాను. దేవదూతలు నాకు కొత్త పాటలను మరియు కొత్త నృత్యాలను సమర్పిస్తారు. ఇకపై వారి సొంత దౌర్బల్యం కారణంగా వారి ముఖాలలో కన్నీళ్లు కారవు. ఇకపై, నా యెదుట, దేవదూతల ఏడుపు శబ్దం నాకు వినిపించదు మరియు ఇకపై ఎవరు కూడా కష్టాల గురించి నాకు ఫిర్యాదు చేయరు. ఈ రోజు, మీరందరూ నా యెదుట జీవిస్తున్నారు; రేపు మీరందరూ నా రాజ్యంలో ఉంటారు. ఇది మనిషికి నేను ప్రసాదించే గొప్ప ఆశీర్వాదం కాదా? ఈ రోజు మీరు చెల్లించే మూల్యం కారణంగా, మీరు భవిష్యత్తు ఆశీర్వాదాల వారసత్వాన్ని పొందుతారు మరియు నా మహిమ మధ్యన జీవిస్తారు. మీరు ఇప్పటికీ నా ఆత్మ గుణగణాలలో లీనమవ్వడానికి ఇష్టం లేదా? ఇప్పటికీ మిమ్మల్ని మీరు వధించుకోవాలనుకుంటున్నారా? ప్రజలు వారు చూడగలిగే వాగ్దానాలు క్షణభంగురమైనవే అయినప్పటికీ, వాటినే అన్వేషించాలని కోరుకుంటున్నారు, రేపటి వాగ్దానాలు శాశ్వతమైనవి అయినప్పటికీ, వాటిని అంగీకరించాలని ఎవరూ కోరుకోవడం లేదు. మనిషికి కనిపించే విషయాలు నేను నాశనం చేయబోయే విషయాలు మరియు మనిషి గ్రహించలేని విషయాలు నేను నెరవేర్చబోయే విషయాలు. ఇదే దేవునికి, మనిషికి మధ్య ఉండే తేడా.
నా రోజు ఎప్పుడు రాబోతుందోనని మనిషి లెక్కించాడు, అయినప్పటికీ, ఎవరికీ ఖచ్చితమైన తేదీ తెలియదు, అందుచేత, మనిషి భ్రమలో మాత్రమే జీవించగలడు. మానవుని వాంఛలు అంతులేని ఆకాశమంతా ప్రతిధ్వనించి, అదృశ్యమవుతాయి కాబట్టి, మనిషి తన ప్రస్తుత పరిస్థితులకు పతనమై పోయేలా పదే పదే నిరాశకు గురయ్యాడు. నా పలుకుల లక్ష్యం మనిషి తేదీలను అన్వేషించేలా చేయడం కాదు, లేదా అతని నిరాశ ఫలితంగా అతను తనను తానే నాశనం చేసుకునేలా చేయడం కాదు. మనిషి నా వాగ్దానాన్ని అంగీకరించేలా చేయాలని నా కోరిక మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ నా వాగ్దానంలో వాటా ఉండాలని నా కోరిక. నేను కోరుకునేది పూర్తి జీవముతో నిండి ఉన్నటువంటి జీవులనే గాని మృత్యువులో కూరుకుపోయిన శవాలను కాదు. నేను దేవుని రాజ్యంలోని బల్లను ఆనుకుని కూర్చున్నాను కాబట్టి, భూమిపై ఉన్న ప్రజలందరూ నా విచారణను స్వీకరించమని ఆజ్ఞాపిస్తాను. నా యెదుట అపరిశుద్ధమైనది ఏదీ ఉండటానికి నేను అనుమతించను. నా కార్యములో ఏ మనిషి జోక్యాన్ని నేను సహించను; నా కార్యములో జోక్యం చేసుకునే వారందరూ కారాగారంలోకి తోయబడ్డారు, వారు విడుదలైన తర్వాత కూడా, వారు భూమిపై ప్రజ్వరిల్లే జ్వాలలను స్వీకరిస్తూ, ఇప్పటికీ మహా విపత్తు మధ్య ఉన్నారు. నేను శరీరధారిగా ఉన్నప్పుడు, నా శరీరపరంగా నా కార్యాన్ని చర్చించే వారిని నేను అసహ్యించుకుంటాను. నాకు భూమిపై బంధువులెవరూ లేరని నేను మనుష్యులందరికీ అనేకసార్లు గుర్తు చేశాను, నన్ను సమానంగా చూసే మరియు వారు నాతో గడిపిన గత కాలాలను గుర్తుచేసుకునేలా నన్ను వారి వద్దకు లాగే వారెవరైనా నాశనం చేయబడతారు. నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే. అలాంటి విషయాలలో నేను మనిషిపట్ల ఏమాత్రం చనువు చూపను. నా కార్యములో జోక్యం చేసుకునే, నాకు సలహా ఇచ్చే వారందరినీ నేను శిక్షిస్తాను మరియు వారిని ఎప్పటికీ క్షమించను. నేను నిర్మొహమాటంగా మాట్లాడకపోతే, మనిషి ఎప్పుడూ స్పృహలోకి రాడు మరియు తెలియకుండానే నా శిక్షకు గురి అవుతాడు ఎందుకంటే మనిషికి నా శరీరంలో ఉన్న నన్ను గూర్చి తెలియదు.
మార్చి, 20, 1992