సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—26 వ అధ్యాయము
నా ఇంటిలో నివసించింది ఎవరు? నా కోసం నిలబడింది ఎవరు? నా తరపున బాధ అనుభవించింది ఎవరు? నా ఎదుట తన మాటకి కట్టుబడింది ఎవరు? ఇప్పటిదాకా నన్ను అనుసరించి ఇంకా నిష్పక్షపాతంగా మారనది ఎవరు? మానవులందరూ ఎందుకు నిర్దయాత్మకంగామరియు కఠినంగా ఉంటారు? మానవజాతి నన్ను ఎందుకు విసర్జించింది? ఎందుకు మానవజాతి నా పట్ల విసుగు చెందింది? మానవ లోకంలో ఎందుకు వెచ్చదనం లేకుండా పోయింది? సియోనులో ఉన్నప్పుడు, నేను పరలోకపు వెచ్చదనాన్ని రుచి చూశాను, సియోనులో ఉన్నప్పుడు పరలోకపు ఆశీర్వాదాన్ని అనుభవించాను. మరలా, నేను మానవజాతి మధ్య నివసించి, నేను మానవ లోకపు కఠినత్వాన్ని రుచి చూశాను, మరియు మనుషుల మధ్య ఉన్న విభిన్నమైన స్థితిగతులను నేను నా కళ్ళారా చూశాను. తెలియకుండానే, నేను “మార్పు చెందినట్లు” మనిషి కూడా మారిపోయాడు, మరియు ఈ విధంగా మాత్రమే అతడు నేటి వరకు వచ్చాడు. మనిషి నా కోసం ఏదైనా చేయగలగాలని నేను ఆశించడం లేదు, లేదా నా పేరుమీద ఏదైనా ఎక్కువ చేయాలని కూడా నేను కోరడం లేదు. నా ప్రణాళికకు అనుగుణంగా ప్రవర్తించగలగాలని, నాకు అవిధేయుడుగా లేదా నాకు అవమానకరమైన సూచనగా ఉండకుండా, నాకు ప్రతిధ్వనించే సాక్షిగా ఉండాలని మాత్రమే నేను కోరుతున్నాను. మనుషులలో, నాకు మంచి సాక్ష్యమిచ్చినవారు మరియు నా నామమును మహిమ పరిచినవారు ఉన్నారు, కాని మానవుని ఆచరణలు లేదా ప్రవర్తన నా హృదయాన్ని సంతృప్తి పరచగలగడం ఎలా సాధ్యమవుతుంది? అతడు నా హృదయంతో ఏకీభవించి లేదా నా చిత్తాన్ని ఎలా నెరవేర్చగలడు? భూమిపై ఉన్న పర్వతాలు, నీరు, పువ్వులు, పచ్చిక బయళ్ళు, మరియు భూమి పైనున్న చెట్లు, అన్నీ నా చేతి కార్యాన్ని కనుపరుస్తాయి, అన్నీ నా నామాన్ని బట్టి జీవిస్తున్నాయి. అయినా కూడా మనిషి నేను ఆశించే స్థాయిని ఎందుకు అందుకోలేడు? అది అతని హీనమైన అణగారిన స్థితిని బట్టి కావచ్చా? నేను అతనిని హెచ్చించిన దాన్ని బట్టి కావచ్చా? నేను అతని పట్ల చాలా క్రూరంగా ఉన్న దాన్ని బట్టి కావచ్చా? నా కోరికలను బట్టి మానవుడు ఎప్పుడూ ఎందుకు భయపడతాడు? నేడు, రాజ్యములోని జన సమూహాల మధ్య, మీరు నా స్వరాన్ని మాత్రమే వింటారు, కానీ నా ముఖాన్ని చూడటానికి ఎందుకు ఇష్టపడరు? మీరు నా వాక్యాలను మాత్రమే చూస్తారు ఎందుకు వాటిని నా ఆత్మతో సరిపోల్చరు? పరలోకానికి, భూమికి అని నన్నెందుకు వేరు చేస్తున్నారు? నేను, భూమి మీద ఉన్నప్పుడు, పరలోకంలో కూడా నేను ఉన్నట్టు కాదా? నేను, పరలోకంలో ఉంటే, ఇక నేను భూమి మీదికి దిగి రాలేనని కావచ్చా? నేను, భూమిపై ఉంటే, పరలోకానికి ఆరోహణమవ్వడానికి అర్హుడను కానా? నేను, భూమి మీద ఉన్నప్పుడు, అల్ప జీవిగా ఉన్నట్టు, నేను, పరలోకంలో ఉన్నప్పుడు, నేను ఒక ఉన్నతమైన వాడను అయినట్టు, మరియు పరలోకానికి భూమికి మధ్య ఒక దాటలేని అగాధము ఉంచబడి ఉన్నది. అయినప్పటికీ మానవ లోకంలో ఈ సంగతుల మూలాలు గురించి ఏమీ తెలియదన్నట్టు అనిపిస్తుంది, అయితే నా మాటలకు ఏదో శబ్దమే తప్ప అర్ధమే లేదన్నట్టు ఎల్లప్పుడూ నాకు విరోధముగానే నడుస్తున్నాయి. మానవ జాతి అంతా నా వాక్యాల కోసం కృషి చేస్తూ, నా బాహ్య పోలికపై వారి సొంత పరిశోధనలు చేస్తారు, కానీ చివరికి వారందరూ వైఫల్యం చెందుతారు, వారి శ్రమ ఫలించదు, బదులుగా నా వాక్యాలచేత బాధించబడి తిరిగిలేచే సాహసం చేయరు.
మానవజాతి విశ్వాసాన్ని నేను పరీక్షించినప్పుడు, ఒక్క మానవుడు కూడా నిజమైన సాక్ష్యాన్ని కలిగి లేడు, తన సర్వస్వాన్ని అర్పించగల సమర్ధుడు లేడు; కాని, మనిషి దాక్కునే ఉంటాడు, మరియు నేనేదో అతని హృదయాన్ని దోచుకొనబోతున్నట్లుగా, తనను తాను బహిరంగ పరచుకోడానికి నిరాకరిస్తాడు. నిజంగా యోబు కూడా తన శ్రమలో స్థిరంగా నిలబడలేదు, మరియు బాధల మధ్యలో మాధుర్యాన్ని వెదజల్లలేదు. ప్రజలందరూ వసంతకాలపు వెచ్చదనంలోని పాలిపోయిన ఆకుపచ్చ రంగు వంటి సూచన కనుపరుస్తారు; అతి శీతాకాలంలో అవి ఎప్పుడూ పచ్చగా ఉండవు. తన బక్కచిక్కిన మరియు కృశించిన ఆకృతితో, మానవుడు నా ఉద్దేశాలను నెరవేర్చలేడు. మానవజాతి అంతటిలో, ఇతరులకు ఆదర్శంగా పని చేసేవారు ఒక్కరూ లేరు, ఎందుకంటే సాధారణంగా మనుషులందరూ ఒక్కటే మరియు ఒకరికొకరు భిన్నంగా ఏమీ లేరు, ఒకరి నుండి మరొకరిని వర్గీకరించడం చాలా అరుదు. ఈ కారణాన్ని బట్టి, నేటికీ మనుష్యులు నా కార్యాలను పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. నా దండన సర్వ మానవాళి మీద దిగినప్పుడు మాత్రమే, తెలియకుండానే తమకు తాముగా, నా కార్యాల గురించి తెలుసుకుంటారు, మరియు నేనేమి చేయకుండానే లేక ఎవరినీ బలవంత పెట్టకుండానే, మనిషి నన్ను తెలుసుకుని, తద్వారా నా కార్యాలను చూస్తాడు. ఇది నా ప్రణాళిక, ఇది నా కార్యాలలో తెలియజేయబడిన మరియు మనిషి తెలుసుకోవాల్సిన ఒక భాగం. దేవుని రాజ్యములో, సృష్టిలోని లెక్కలేనన్ని ఈవులు ఉజ్జీవింపబడి వాటి జీవశక్తిని తిరిగి పొందడం ప్రారంభిస్తాయి. భౌగోళిక స్థితిలో మార్పును బట్టి, ఒక దేశానికి మరో దేశానికి మధ్య సరిహద్దు రేఖలు కూడా మారడం ప్రారంభమవుతాయి. భూభాగము నుండి భూభాగము వేరుపర్చబడినప్పుడు, మరియు భూభాగముతో భూభాగము కలిసినప్పుడు, అది నేను దేశాలన్నింటినీ ముక్కలుగా చేసే సమయము అని నేను ప్రవచించాను. ఆ సమయంలో, నేను సర్వ సృష్టిని నూతన పరిచి, సర్వ లోకాన్ని పునర్విభజన చేస్తాను, తద్వారా లోకాన్ని క్రమపరచి, పాతదాన్ని కొత్తదిగా మారుస్తాను—ఇదే నా ప్రణాళిక మరియు ఇవే నా కార్యాలు. ప్రపంచ దేశాలు మరియు ప్రజలందరూ నా సింహాసనం ఎదుటకు తిరిగి వచ్చినప్పుడు, నేను పరలోకపు సమృద్దిని తీసుకుని మానవ లోకానికి అందిస్తాను, తద్వారా, లోకము సాటిలేని సమృద్దితో నిండి ఉన్నదని, నాకు కృతజ్ఞత చెల్లించాలి. అయితే పాత లోకము ఉనికిలో కొనసాగినంత కాలం, నా ఉగ్రతను దాని దేశాలపై పొర్లించి, నా పాలనా విధులను లోకమంతటా బహిరంగముగా ప్రకటిస్తాను, మరియు వాటిని ఉల్లంఘించిన వారిపై నా దండనను ప్రదర్శిస్తాను:
నేను మాట్లాడటానికి లోకంవైపు నా ముఖాన్ని తిప్పినప్పుడు, సర్వ మానవాళి నా స్వరాన్ని వింటుంది, మరియు అక్కడి నుండి లోకవ్యాప్తంగా నేను చేసే కార్యాలన్నిటినీ చూస్తుంది. నా చిత్తానికి విరుద్దంగా తమకు తాము సిద్ధపర్చుకున్నవారు, అంటే, మానవ క్రియలతో నన్ను విరోధించే వారు, నా దండనకు గురవుతారు. నేను ఆకాశములలోని విస్తారమైన నక్షత్రాలను తీసుకుని వాటిని నూతనపరుస్తాను, నాకు కృతజ్ఞతలు, సూర్యుడు మరియు చంద్రుడు నూతన పరచబడతాయి—ఆకాశాలు ఇదివరకు ఉన్నట్లుగా ఇకపై ఉండవు మరియు భూమి మీద ఉన్న లెక్కలేనన్ని విషయాలు నూతన పరచబడతాయి. నా వాక్యాల ద్వారా సమస్తము సంపూర్ణమవుతాయి. లోకంలోని అనేక దేశాలు కొత్తగా విభజింపబడి, నా రాజ్యముతో పునఃస్థాపించబడతాయి, తద్వారా భూమి పైనున్న దేశాలు ఎప్పటికీ అదృశ్యమై అన్నీ నన్ను ఆరాధించే దేవుని రాజ్యముగా మారుతుంది; భూమి పైనున్న దేశాలన్నీ నాశనమై ఉనికిలో లేకుండాపోతాయి. లోకంలోని మానవులలో, దుష్టునికి చెందిన వారందరూ నిర్మూలించబడతారు, మరియు సాతానును ఆరాధించే వారందరూ దహించు నా అగ్నిచేత అణచబడతారు—అంటే, ఇప్పుడు స్రవంతిలో వారు తప్ప, అందరూ బూడిదగా మారుతారు. నేను అనేకమంది ప్రజలను దండించినప్పుడు, వివిధ పరిధులకు చెందిన, దైవభక్తి గల లోకంలో ఉన్న వారందరూ, నా కార్యాల ద్వారా జయించబడిన నా రాజ్యానికి తిరిగి వస్తారు, ఎందుకంటే వారు తెల్లటి మేఘము మీద వస్తున్న పరిశుద్ధుడైన వాని ఆగమనాన్ని చూశారు. ప్రజలందరూ వారివారి జాతుల ప్రకారము వేరు చేయబడతారు మరియు వారివారి కార్యాలకు అనుగుణంగా శిక్షలను పొందుకుంటారు. నాకు విరోధముగా నిలిచిన వారందరూ నశిస్తారు; భూమి మీద ఎవరి క్రియలు నా ప్రమేయం లేకుండా ఉన్నాయో, వారు, తమను తాము ఎలా నిర్దోషులుగా ప్రకటించుకున్నారన్న దానిని బట్టి, భూమి మీద నా కుమారుల మరియు నా ప్రజల పాలనలో జీవితాన్ని కొనసాగిస్తారు. లెక్కలేనంతమంది ప్రజలకు మరియు అనేక దేశాలకు నన్ను నేను కనుపరచుకుంటాను, నా స్వరముతో, భూమిపై నేను ధ్వనిస్తాను, సర్వ మానవాళి తమ కళ్లతో చూడగలిగేలా నా గొప్ప కార్యపు ముగింపును ప్రకటిస్తాను.
నా స్వరం తీవ్రతరం అవుతున్న కొద్దీ, నేను లోకపు తీరును కూడా గమనిస్తున్నాను. నా వాక్యాల ద్వారా, సృష్టిలోని అపరిమితమైన సంగతులన్నీ నూతన పరచబడతాయి. భూమికి లాగానే పరలోకము కూడా మారుతుంది. మానవజాతి దాని అస్సలు రూపం బట్టబయలు అవుతుంది, మరియు, మెల్లగా, ప్రతి వ్యక్తి తమ జాతి ప్రకారం వేరు పరచబడి, తమ కుటుంబ మూలాలకు తెలియకుండానే తిరిగి వెళ్ళే వారి మార్గాన్ని కనుగొంటారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేను అంతరాయము నుండి విముక్తి పొంది, తెలియకుండానే, నా గొప్ప కార్యము నెరవేర్చబడి, సృష్టిలోని అపరిమితమైన సమస్త విషయాలన్నీ రూపాంతరం చెందాయి. నేను లోకాన్ని సృజించినప్పుడు, అన్నిటినీ వాటి జాతులకు అనుగుణంగా రూపొందించి, అన్నిటినీ వాటివాటి రూపాల ప్రకారం నియమించాను. నా నిర్వహణ ప్రణాళిక అంతము సమీపిస్తున్న కొద్దీ, నేను సృష్టి యొక్క పూర్వపు స్థితిని పునరుద్ధరిస్తాను; ప్రతి దాన్ని మొదట ఉన్న విధంగానే బాగుచేస్తాను, ప్రతి దాన్ని పూర్తిగా మార్చడం, ద్వారా ప్రతిది తిరిగి నా ప్రణాళిక మూలానికి వస్తుంది. సమయం వచ్చేసింది! నా ప్రణాళిక యొక్క చివరి దశ పూర్తి కానుంది. ఓ, అపవిత్రమైన పాత లోకమా! నిశ్చయముగా మీరు నా వాక్యాల కింద పడతారు! నిశ్చయముగా మీరు నా ప్రణాళిక ద్వారా శున్యానికి దిగజారిపోతారు! ఓ, సృష్టి యొక్క అసంఖ్యాకమైన వస్తువులారా! నా వాక్యాలలోని నూతన జీవాన్ని మీరందరూ పొందుతారు—సర్వాధికారి అయిన ప్రభువును మీరు కలిగి ఉంటారు! ఓ, శుద్ధి పొందిన నిష్కళంకమైన కొత్త లోకమా! నిశ్చయముగా మీరు నా మహిమలోని ఉజ్జీవాన్ని పొందుతారు! ఓ, సీయోను పర్వతమా! ఇకపై మౌనంగా ఉండవద్దు—నేను విజయోత్సాహముతో తిరిగి వచ్చాను! సృష్టి మధ్య నుండి, నేను సర్వలోకాన్ని పరిశీలిస్తాను. భూమి మీద, మానవజాతి నూతన జీవితాన్ని ఆరంభించి నూతన నిరీక్షణను జయించింది. ఓ, నా ప్రజలారా! మీరు నా వెలుగులో జీవానికి ఎలా తిరిగి రాలేకపోతున్నారు? నా నడిపింపులో మీరు ఎందుకు ఆనందంతో గంతులు వేయలేకపోతున్నారు? దేశాలు ఆనందోత్సాహాలతో కేకలు పెడుతున్నాయి, నీరు ఉల్లాసంతో కరకుగా నవ్వుతున్నాయి! ఓ, తిరిగి లేచిన ఇశ్రాయేలూ! నా ముందస్తుగానే నిర్ణయించిన దానిని బట్టి ఎలా అతిశయ పడకుండా ఉంటారు? విలపించింది ఎవరు? శోకించింది ఎవరు? పాత ఇశ్రాయేలు ఉనికిలో లేదు, నేటి ఇశ్రాయేలు నిటారుగా మరియు మహోన్నతముగా ఉద్భవించి, సర్వ మానవాళి హృదయాల్లో నిలిచిపోయింది. నేటి ఇశ్రాయేలు నిశ్చయంగా నా ప్రజల ద్వారా జీవన మూలాన్ని పొందుతుంది! ఓ, ద్వేషపూరితమైన ఐగుప్తూ! నిశ్చయంగా ఇప్పటికీ నీవు నాకు విరోధంగా నిలబడలేదా? నా దయను అదనుగా చేసుకుని నా దండనను తప్పించుకోడానికి ఎలా ప్రయత్నించగలవు? నీవు నా దండనలో ఎలా ఉండకుండా పోగలవు? నేను ప్రేమించే వారందరూ నిరంతరం జీవిస్తారు, మరియు నాకు విరోధముగా నిలిచే వారందరూ నిరంతరం నాచేత దండించబడతారు. నేను రోషము కలిగిన దేవుడను కాబట్టి మనుష్యులు వారు చేసిన ప్రతి దానిని అంత తేలికగా విడిచిపెట్టను. నేను భూమి అంతటా కనిపెడుతూ, లోకపు తూర్పు దిక్కున నీతి, ప్రభావము, ఉగ్రత, మరియు దండనతో కనబడుతూ, అనేకమైన మానవజాతి సమూహాలకు నన్ను నేను ప్రత్యక్ష పరచుకుంటాను!
మార్చి 29, 1992