సమస్తజనులారా, ఆనందించండి!

నా వెలుగులో, ప్రజలు మరల వెలుగు చూస్తారు. నా మాటలో, ప్రజలు తాము సంతోషించే విషయాలను కనుగొంటారు. నేను తూర్పు నుండి వచ్చాను, తూర్పు నుండి పిలుస్తున్నాను. నా మహిమ ప్రకాశించినప్పుడు, సమస్త దేశాలు వెలిగించబడతాయి, సమస్తం వెలుగులోకి తీసుకురాబడుతుంది, ఏ ఒక్కటి కూడా చీకటిలో ఉండదు. దేవుని రాజ్యంలో, దేవునితో, దేవుని ప్రజలు జీవించే జీవితం, అవధులులేని సంతోషం. ప్రజల ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి, సముద్రాలు ఆనందంతో నాట్యం చేస్తాయి, నా సమృద్ధిని బట్టి ప్రజలతో కలిసి పర్వతాలు ఆనందిస్తాయి. పురుషులందరు, ప్రయాసపడుతూ, కష్టపడిపనిచేస్తూ, నా రాజ్యంలో తమ నమ్మకత్వాన్ని, విధేయతను చూపుతారు. రాజ్యంలో తిరుగుబాటు ఇకను ఉండదు, ప్రతిఘటించడం ఉండదు; భూమి, ఆకాశం ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. జీవితంలోని మధురమైన ఆనందాల ద్వారా, మనిషి మరియు నేను లోతైన అనుభూతితో దగ్గరవుతాం, ఒకరిపై మరొకరం ఆధారపడతాం…. ఈసమయంలో, నేను నాజీవితాన్ని లాంఛనప్రాయంగా పరలోకంలో ప్రారంభిస్తాను. సాతాను ఇబ్బందులు ఇక ఉండవు, ప్రజలు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు. విశ్వమంతటా, నేను ఎన్నుకొన్న నాప్రజలు, నా మహిమలో జీవిస్తారు, ప్రజల మధ్యలో జీవించే వారివలె కాక, దేవునితో జీవించే ప్రజలుగా చెప్పజాలని దీవెనతో దీవించబడతారు. మానవజాతి అంతా సాతాను భ్రష్టత్వానికి గురైంది మరియు జీవితంలోని చేదు మరియు తీపిని తాగి కల్మషమైపోయింది. ఇప్పుడు, నా వెలుగులో జీవిస్తూ, ఒక వ్యక్తి సంతోషించకుండా ఎలా ఉంటాడు? ఈ అందమైన తరుణాన్ని ఎవరైనా అంత తేలికగా ఎలా పోనిస్తారు మరియు వదిలేస్తారు? ప్రజలారా! మీ హృదయంలో పాట పాడండి మరియు నా కొరకు సంతోషంతో నాట్యంచేయండి! మీ యదార్థమైన హృదయాలనెత్తి, వాటిని నాకు అర్పించండి! మీ ఢమరుకములు మ్రోగిస్తూ నాకోసం ఆనందంగా ఆడండి! సమస్త విశ్వం ద్వారా నేను నా సంతోషాన్ని ప్రకాశింపజేస్తాను. ప్రజలకు నా మహిమగల ముఖాన్ని బయలుపరుస్తాను! నేను భీకరమైన స్వరంతో పిలుస్తాను! నేను విశ్వంకంటే మించినవాడిని! ఇప్పటికే నేను ప్రజల మధ్య పరిపాలన చేశాను! ప్రజలు నన్ను ఘనపరిచారు! నేను నీలాకాశంలో కదిలిపోతున్నాను మరియు ప్రజలు నాతోకూడా నడుస్తున్నారు. నేను ప్రజల మధ్యలో నడుస్తున్నాను, నా ప్రజలు నా చుట్టూ ఉన్నారు! ప్రజల హృదయాలు సంతోషంతో ఉన్నాయి, వారి పాటలు విశ్వాన్ని కదిలిస్తున్నాయి, తేజోమండలాన్ని పగులగొడుతున్నాయి! విశ్వం, ఇకను పొగమంచుతో కప్పి ఉండదు; బురద ఉండదు, ముగురునీరు చేరడం ఉండదు. విశ్వపు పరిశుద్ధజనులారా! నా పర్యవేక్షణలో మీ ముఖవైఖరిని చూపండి. మీరు మలినంతో కప్పబడిన మనుష్యులు కాదు, కానీ మీరు పచ్చరాయివలె పరిశుద్ధులు, మీరంతా నాప్రియులు, మీరంతా నాసంతోషం! సమస్తం తిరిగి జీవంలోకి వస్తాయి! పరిశుద్ధులందరు నన్ను సేవించడానికి పరలోకానికి తిరిగి వస్తారు, నా వెచ్చని కౌగిలిలో ప్రవేశిస్తారు, ఏడుపులేదు, ఆందోళనలేదు, వారు తమనుతాము నాకు అర్పించుకుంటారు, తిరిగి నా ఇంటికి వస్తారు, మరియు వారి స్వదేశ మందు, వారు మానక నన్ను ప్రేమిస్తారు! నిత్యత్వమంతా మార్పులేనివారిగా ఉంటారు! దుఃఖం ఎక్కడ! కన్నీళ్ళు ఎక్కడ! శరీరం ఎక్కడ! భూమి గతించిపోయింది, కానీ ఆకాశం నిరంతరం నిలుస్తుంది. నేను ప్రజలందరికీ కనబడతాను, ప్రజలందరూ నన్ను స్తుతిస్తారు. ఈజీవితం, ఈసౌందర్యం, అనాదికాలం నుండి అంత్యకాలం వరకు మార్పుచెందదు. ఇది దేవుని రాజ్యపు జీవితం.

మునుపటి:  సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—12 వ అధ్యాయము

తరువాత:  సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—26 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger