29 వ అధ్యాయము

సమస్తము పునరుత్థానం చెందిన రోజున, నేను మానవుని మధ్యకు వచ్చి, నేను అద్భుతమైన రేయింబవళ్ళను అతనితో గడిపాను. ఆ క్షణాన మాత్రమే మనిషి నా చొరవను గురించి కాస్త గ్రహిస్తాడు, మరియు నాతో జరిగే అతని సంభాషణలు ఎక్కువ తరచుగా మారే కొలది, నేను ఏమై ఉన్నానో మరియు నేను ఏమి కలిగియున్నానో వాటిలో కొన్నిటిని అతడు చూస్తాడు—దాని ఫలితంగా, నా గురించిన జ్ఞానాన్ని కొంత పొందుతాడు. ప్రజలందరిలో నా తల పైకెత్తుకొని చూస్తాను, మరియు వారందరూ నన్ను చూస్తారు. అయినప్పటికీ లోకానికి విపత్తు సంభవించినప్పుడు, వెంటనే వారు ఎంతో కలవరపడతారు, మరియు నా స్వరూపము వారి హృదయాలలో నుండి తుడిచిపెట్టుకుపోతుంది; విపత్తు సంభవించడంతో భయాందోళనలకు గురవుతారు, నా బోధలపట్ల శ్రద్ధ చూపరు. మనుష్యుల మధ్య చాలా ఏళ్ళు గడిపాను, అయినప్పటికీ వారు ఎల్లప్పుడు నన్ను ఎరుగకయున్నారు మరియు ఎన్నడూ నన్ను తెలుసుకోలేదు. నేడు నా నోటి ద్వారా దీన్ని నేను వారికి చెప్తాను, మరియు నా నుండి ఏదైనా పొందడానికి ప్రజలందరినీ నా ఎదుటకు వచ్చేలా చేస్తాను, అయినప్పటికీ ప్రజలు నా నుండి దూరంగా ఉంటారు, కాబట్టి వారు నన్ను ఎరుగరు. నా అడుగుజాడలు విశ్వమంతా మరియు భూమి అంచుల వరకు నడిచినప్పుడు, మనుష్యులందరూ శ్రద్ధతో ఆలోచించడం ప్రారంభిస్తారు, మరియు ప్రజలందరూ నా వద్దకు వచ్చి సాగిలపడి మరియు నన్ను ఆరాధిస్తారు. అదే నేను మహిమను పొందే రోజు, నేను తిరిగి వచ్చే రోజు, మరియు నేను వెడలిపోయే రోజు కూడా అదే. ఇప్పుడు, నేను సమస్త మానవజాతి మధ్య నా కార్యాన్ని ప్రారంభించాను, నా నిర్వహణ ప్రణాళిక ముగింపును సర్వలోకమంతటా అధికారికంగా ప్రారంభించాను. ఈ క్షణం నుండి శ్రద్ధ వహించని వారు ఎవరైనా నిర్దాక్షిణ్యమైన శిక్షకు పాత్రులవుతారు, మరియు ఇది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. నాకు హృదయం లేనందున ఇది జరగడంలేదు; అయితే, ఇది నా నిర్వహణ ప్రణాళికలో ఒక భాగంగా జరుగుతోంది; సమస్తమూ నా నిర్వహణ ప్రణాళికలోని దశల ప్రకారం ముందుకు సాగాలి, మరియు ఏ మనుష్యుడు దీన్ని మార్చలేడు. నేను నా కార్యాన్ని అధికారికంగా ప్రారంభించినప్పుడు, నేను సాగినట్టే ప్రజలందరూ సాగుతారు, ఆ విధంగా లోకంలోని ప్రజలు నాతో పాటుగా అడుగులు వేయడానికి సిద్దమవుతారు, లోకమంతటా “విజయోత్సాహం” ఉంటుంది, మరియు మనిషి నా ద్వారానే ముందుకు సాగుతాడు. దానికి ఫలితంగా, ఎర్రని మహా ఘట సర్పము ఉన్మాద పూరితమైన మరియు దిగ్భ్రాంతి మయమైన స్థితిలోనికి నా చేత కొట్టబడి, నా కార్యం కోసం పని చేస్తుంది మరియు, ఇష్టం లేకపోయినా, అది దాని సొంత ఆశలు తీర్చుకోలేకపోతుంది, కానీ ఆధిపత్యానికి లోబడటం తప్ప దానికి వేరే అవకాశం లేదు. నా ప్రణాళికలన్నింటిలో, ఎర్రని మహా ఘట సర్పము నన్ను ప్రతిఫలింపజేసే మెరుపుకాగితం, నా శత్రువు, మరియు నా సేవకుడు కూడా; అలాగని, నా “ఆశయాలను” నేను ఎన్నడూ మినహాయించలేదు. కాబట్టి, నా శరీరధారిగా మారిన కార్యపు చివరి దశ దాని కుటుంబములో పూర్తవుతుంది. ఈ విధంగా, ఎర్రని మహా ఘట సర్పము నా కొరకు సరిగ్గా ఎంతో సేవ చేయగలదు, తద్వారా నేను దాన్ని జయించి నా ప్రణాళికను పూర్తి చేస్తాను. నేను కార్యము చేస్తున్నప్పుడు, దేవదూతలందరూ అంతిమ యుద్దానికి నాతో పాటుగా బయలుదేరి, చివరి దశలోని నా కోరికలను నెరవేర్చాలని తీర్మానించుకుంటారు, తద్వారా భూలోకమందున్న ప్రజలు దేవదూతలలాగా నా ఎదుట సాగిలపడతారు, మరియు నన్ను ఎదిరించాలనే కోరిక లేకుండా, నాకు విరుద్ధంగా తిరుగుబాటు ఏదీ చేయరు. ఇవే లోకమంతటా ఉన్న నా కార్యపు క్రియాశీల కార్యాలు.

మానవుల మధ్యకు నేను రావడానికిగల ఉద్దేశం మరియు ప్రాధాన్యత ఏమిటంటే సర్వ మానవాళిని రక్షించడం, సర్వ మానవాళిని నా ఇంటికి తిరిగి తీసుకురావడం, పరలోకాన్ని భూమితో సంధి చేయడం, మరియు మనిషిని పరలోకానికి భూలోకానికి మధ్య “సంకేతాలు” తెలియజేయుటయైయున్నది, ఎందుకంటే ఇది మానవుని స్వాభావికమైన పనియైయున్నది. నేను మానవజాతిని సృజించిన సమయంలో, మానవజాతి కొరకు నేను అన్నిటినీ సిద్ద పరిచాను, మరియు తరువాత, నా ఆశయాలకు అనుగుణంగా, నేను ఇచ్చిన ఐశ్వర్యాన్ని పొందడానికి నేను అనుమతించాను. ఆ విధంగా, మానవజాతి మొత్తం నా మార్గదర్శకత్వములోనే నేటి వరకు చేరుకుందని నేను చెప్పుచున్నాను. ఇదంతా నా ప్రణాళిక. మానవజాతి అంతటిలో, లెక్కలేనంత మంది ప్రజలు నా ప్రేమ సంరక్షణలో ఉన్నారు, మరియు లెక్కలేనంతమంది నా ద్వేషపూరితమైన శిక్షలో జీవిస్తున్నారు. ప్రజలందరూ నన్ను ప్రార్థించినప్పటికీ, ఇంకా వారు తమ ప్రస్తుత పరిస్థితులను మార్చుకోలేకపోతున్నారు; వారు గనుక నిరీక్షణను కోల్పోతే, అప్పుడు మాత్రమే వారు ప్రకృతిని దాని గమనాన్ని బట్టి పోనిచ్చి నా పట్ల అవిధేయత చూపడం మానేస్తారు, ఎందుకంటే ఇదంతా మనిషి మాత్రమే సాధించగలడు. మానవ జీవితపు స్థితిని గమనిస్తే, మానవుడు నిజ జీవితాన్ని ఇంకా కనుగొనవలసి ఉన్నది, అతడు లోకపు అన్యాయాన్ని, దిక్కుమాలిన స్థితిని, మరియు దయనీయమైన పరిస్థితులను ఇంకా చూడలేదు—కాబట్టి, అవి గనుక వినాశనం రావడం కోసం కాకపోతే, అనేకమంది ఇంకా తల్లి స్వభావాన్నే అంటిపెట్టుకుని, ఇప్పటికీ “జీవితపు” రుచులలో మునిగితేలుతూ ఉండేవారు. ఇది లోకపు వాస్తవికత కాదా? ఇది నేను, మనుష్యులతో మాట్లాడుతున్న రక్షణ స్వరము కాదా? ఎందుకు, మానవజాతిలో ఎవరూ నన్ను ఎన్నడూ నిజంగా ప్రేమించలేదు? ఎందుకు మనుష్యులు తమకున్న బాధలు మరియు శ్రమల మధ్య మాత్రమే నన్ను ప్రేమిస్తూ, నా సంరక్షణలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఎవరూ నన్ను ప్రేమించరు? అనేక సార్లు మానవజాతి మీదికి నా శిక్షను పంపాను. వారు దాన్ని చూశారు, కాని అప్పుడే దాన్ని విస్మరించారు, ఇటువంటి సమయములో వారు దాన్ని పరిశీలించరు మరియు దాని గురించి ఆలోచించరు, కాబట్టి ఇక మనిషి మీదికి వచ్చేదంతా నిర్దాక్షిణ్యమైన తీర్పు. ఇది నేను జరిగించే కార్యపు విధానాలలో ఒకటి మాత్రమే, కానీ ఇది మానవుని మార్చి నన్ను ప్రేమించేలా చేయడానికే ఇంకా కొనసాగుతూ ఉంటుంది.

నేను రాజ్యంలో పాలిస్తాను, అంతేగాకుండా, నేను విశ్వమునంతటిని ఏలుతాను; నేను దేవుని రాజ్యానికి రాజును మరియు విశ్వానికి అధిపతిగా ఉన్నాను. ఇప్పటి నుండి, నేను ఏర్పరచబడని వారందరినీ సమకూర్చి అన్యజనుల మధ్య నా కార్యాన్ని ఆరంభిస్తాను, మరియు నా పాలనా విధులను లోకానికి ప్రకటిస్తాను, తద్వారా నేను నా కార్యపు తర్వాతి దశను విజయవంతంగా ప్రారంభించగలను. అన్యజనుల మధ్య నా కార్యాన్ని విస్తరింపజేయడానికి దండనను ఉపయోగిస్తాను, అంటే, అన్యజనులందరి మీద నా బలాన్ని ప్రయోగిస్తాను. సహజంగానే, ఏర్పచబడినవారి మధ్యన నా కార్యము జరుగుచున్న సమయములోనే మరొక ప్రక్క ఈ కార్యము కూడా జరుగుతూ ఉంటుంది. భూమి మీద నా ప్రజలు పరిపాలించి, అధికారాన్ని వినియోగించిన రోజునే భూమి మీదనున్న ప్రజలందరూ జయిస్తారు. అంతేగాక, నేను విశ్రమించే సమయమూ అదే—అప్పుడు మాత్రమే నేను జయించినవారికి కనబడతాను. నేను పరిశుద్ద రాజ్యానికి కనబడుతూ, అపవిత్రమైన దేశానికి నన్ను నేను మరుగు చేసుకుంటాను. జయించిన వారందరూ మరియు నా ఎదుట విధేయతతో ఉన్నవారందరూ వారి స్వంత నేత్రాలతో నా ముఖాన్ని చూడగలుగుతారు, మరియు వారి స్వంత చెవులతో నా స్వరాన్ని వినగలుగుతారు. ఇది అంత్య దినాల్లో జన్మించిన వారికి కలుగు దీవెన, ఇది నా ద్వారా ముందుగానే నిర్ణయించబడిన ఆశీర్వాదం, మరియు దీనిని ఏ మానవుడు మార్చలేడు. భవిష్యత్తులో జరగబోయే కార్యము కోసం ఈ రోజు నేను ఈ విధంగా కార్యము చేస్తున్నాను. నా కార్యమంతా అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటుంది, ప్రతి దానిలో, పిలుపు మరియు ప్రతిస్పందన ఉంటుంది: ఏ దశ కూడా ఎప్పుడూ ఆకస్మికంగా ఆగిపోలేదు, మరియు మరెవరి ద్వారానైనా స్వతంత్రంగా ఏ దశను ఎప్పుడూ చేపట్టలేదు. అది ఆ విధంగా లేదా? గత కాలపు కార్యము నేటి కార్యానికి పునాది కాదా? గతములో పలికిన వాక్కులకు ఈ రోజున పలికే వాక్కులకు నాంది కాదా? గతములో వేసిన అడుగులు నేటి అడుగులకు మూలం కాదా? గ్రంధపు చుట్టను నేను అధికారికంగా తెరచినప్పుడు, అనగా లోకమంతటా ప్రజలు శిక్షించబడినప్పుడు, లోకవ్యాప్తంగా ప్రజలు శ్రమలకు అప్పగించబడినప్పుడు, అది నా కార్యానికి ముగింపుయైయున్నది; ప్రజలందరూ వెలుగులేని దేశములో నివసిస్తున్నారు, మరియు జనులందరూ వారున్న స్థితిని బట్టి ఎదురయ్యే బెదిరింపుల మధ్య జీవిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఇది సృష్టి కాలం నుండి నేటి వరకు మానవుడు ఎన్నడూ అనుభవించని జీవితం, మరియు యుగయుగాలుగా ఎవరూ ఈ విధమైన జీవితాన్ని “ఆనందించలేదు,” కాబట్టి ఇదివరకెన్నడూ చేయని కార్యాన్ని నేను చేశానని చెప్పుదును. వ్యవహారాల వాస్తవ స్థితి ఇదే, మరియు అంతరంగిక భావమూ ఇదే. నా దినము సర్వ మానవాళిని సమీపిస్తున్నందున, అది దూరం నుండి కనబడదు, కానీ మానవుని కళ్ల ఎదుటే ఉంది కాబట్టి, దాని ఫలితంగా ఎవరు భయపడకుండా ఉంటారు? మరియు దీన్ని బట్టి ఎవరు సంతోషించకుండా ఉంటారు? అపవిత్ర పట్టణమైన బబులోను చివరికి దాని ముగింపునకు చేరుకుంది; మనిషి తిరిగి సరికొత్త లోకాన్ని చేరుకున్నాడు, మరియు భూమ్యాకాశము మార్పు చెంది పునరుద్దరించబడ్డాయి.

నేను సమస్త దేశాలకు మరియు ప్రజలందరికీ కనబడినప్పుడు, తెల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్ముకుని నన్ను ఆవరిస్తాయి. అలాగే, భూమిపై పక్షులు కూడా నాకోసం ఆనందంతో గానాలు పాడుతూ నాట్యం చేస్తూ, భూమిపై వాతావరణాన్ని మెరుగు పరుస్తాయి, తద్వారా ఇకపై “మెల్లగా దిగ జారిపోవడం” లేకుండా, దాని బదులు ప్రాణధారిత్వము ఉన్నటువంటి వాతావరణంలో జీవించడానికి భూమి మీద ఉన్నవన్నీ సజీవంగా మారేలా చేస్తాయి. నేను మేఘాల మధ్య ఉన్నప్పుడు, మనిషి నా ముఖాన్ని మరియు నేత్రాలను మసక మసకగా చూసేసరికి, ఇప్పుడు అతడు కాస్త భయపడతాడు. గతంలో, అతడు చరిత్రలో నన్ను గురించి విన్నాడు, దాని ఫలితంగా అతడు నాపట్ల సగ విశ్వాసంతో మరియు సగ అనుమానంతో ఉన్నాడు. నేనేక్కడున్నానో లేక నా ముఖము ఎంత విశాలమైనదో అతనికి తెలియదు—అది సముద్రమంత విశాలమైనదా, లేక పశ్చిక బయళ్ళంత ఎల్లలు లేనిదా? ఈ సంగతులు ఎవరికీ తెలియవు. నేడు మానవుడు మేఘాలలో నా ముఖాన్ని చూసినప్పుడు మాత్రమే నా గురించిన చరిత్ర నిజమైనదే అని మనిషికి అనిపిస్తుంది, కాబట్టి అతడు నా పట్ల ఇంకా కొంచెం సానుకూలంగా ఉంటాడు, మరియు ఇది కేవలం నా క్రియలను బట్టి మాత్రమే నా పట్ల అతనికి అభిమానం కాస్త ఎక్కువైంది. కాని మనిషికి నా గురించి ఇంకా తెలియదు, అతడు మేఘాలలో ఉన్న నాలోని ఒక భాగాన్ని మాత్రమే చూశాడు. ఆ తరువాత, నా చేతులు చాపి వాటిని మనిషికి చూపిస్తాను. మనిషి ఆశ్చర్యచకితుడవుటాడు, తన చేతులతో నోటిపై చరుచుకుంటూ, నా చేతితో కొట్టబడినంతగా ఎక్కువ భయాన్ని కలిగియుంటాడు, కాబట్టి తన ప్రశంసకు కాస్త గౌరవాన్ని కూడా జోడిస్తాడు. మనిషి నా ప్రతి కదలికపై అతని దృష్టిని పెట్టి, అతడు శ్రద్ధ చూపనప్పుడు నా చేత అతడు కొట్టబడతాడేమో అనేంత మిక్కిలి భయాన్ని కలిగి ఉంటాడు—అయినా మనిషి నన్ను చూస్తున్నాడని నేను నిర్బంధించబడియుండలేదు, మరియు నా చేతుల్లోని కార్యాన్ని నేను చేస్తూనే ఉంటాను. మనిషి నాపట్ల అభిమానాన్ని కలిగియుండాలని చేసే కార్యములలో మాత్రమే ఈ కార్యము ఉంటుంది. ఆవిధంగానే నాతో సహవాసం చేయడానికి క్రమంగా నా ఎదుటకు వస్తాడు. నేను పూర్తిగా మనిషికి ప్రత్యక్షమైనప్పుడు, మనిషి నా ముఖాన్ని చూస్తాడు, అప్పటి నుండి ఇకపై ఎన్నడూ నా ముఖాన్ని మనిషి నుండి దాచను లేదా మనిషి నుండి నన్ను నేను మరుగు చేసుకోను. లోకమంతటా, ప్రజలందరికీ బహిరంగంగా ప్రత్యక్షమవుతాను, రక్తమాంసాలు కలిగిన వారందరూ నా క్రియలన్నిటినీ చూస్తారు. ఆత్మ సంబంధులైన వారందరూ నా ఇంటిలో సమాధానంగా నివసిస్తూ, నిశ్చయముగా అద్భుతమైన దీవెనలను నాతో కలిసి అనుభవిస్తారు. నేను సంరక్షించే వారందరూ నిశ్చయముగా దండనను, ఆత్మ వేదనను మరియు శరీర బాధను తప్పించుకుంటారు. ప్రజలందరికీ నేను బహిరంగముగా కనపడి, అధికారం వినియోగిస్తాను, తద్వారా ఇకపై ఎన్నడూ ప్రేతల దుర్గంధం లోకమంతా వ్యాపించదు; బదులుగా, నా పరిమళ సువాసన సర్వ లోకమంతా వ్యాపిస్తుంది, నా దినము సమీపించుచున్నందున మానవుడు మేల్కొంటాడు, భూమిపై ఉన్నదంతా సక్రమంగా ఉంటుంది, మరియు నేను వచ్చేశాను కాబట్టి, ఇకపై భూమి మీద మనుగడ సాగించే రోజులు ఇక ఉండవు!

ఏప్రిల్ 6, 1992

మునుపటి:  26 వ అధ్యాయము

తరువాత:  16 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger