16 వ అధ్యాయము
మానవ దృష్టికోణం నుండి చూసినప్పుడు దేవుడు చాలా గొప్పవాడు, చాలా సమృద్ధిగలవాడు, ఎంతో అద్భుతమైనవాడు, ఎంతో గంభీరుడుగా ఉన్నాడు; ప్రజల దృష్టిలో, దేవుని వాక్యములు సర్వోన్నతంగా ఉన్నాయి మరియు ప్రపంచంలోనే దివ్యమైనవిగా కనిపిస్తాయి. అయితే, మనష్యులు మరీ ఎక్కువ వైఫల్యాలను చవి చూశారు కాబట్టి, వారి మనస్సులు మరీ సరళమైనవి కాబట్టి, పైగా, వారి స్వీకరణ సామర్థ్యాలు చాలా స్వల్పం కాబట్టి, దేవుడు తన వాక్యములను ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ, వారు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారేమో అన్నట్లుగా వారు కూర్చొని, చలనరహితంగా అలాగే ఉండిపోతారు. వారికి ఆకలి వేసినప్పుడు, వారు తప్పకుండ తినాలనే విషయం వారికి అర్థం కాదు; వారికి దాహం వేసినప్పుడు, వారు తప్పకుండ తాగాలనే విషయం వారికి అర్థం కాదు; తమ ఆత్మల లోతుల్లో వర్ణించలేని కష్టాలను అనుభవిస్తున్నారా అన్నట్లు వారు కేకలు వేస్తూ, అరుస్తూ ఉంటారు, అయినా, దాని గురించి వారు మాట్లాడలేరు. దేవుడు మానవజాతిని సృష్టించినప్పుడు, మానవుడు సాధారణ మానవ జీవితాన్ని జీవించాలని మరియు అతని సహజగుణాలకు తగినట్లుగా దేవుని వాక్యములను అంగీకరించాలనేది ఆయన ఉద్దేశమైయుండెను. కానీ ఎందుకంటే, ఆదిలోనే మానవుడు సాతాను ప్రలోభాలకు లొంగిపోయాడు, ఈనాడు తనను తాను విడిపించుకోలేని అసమర్థుడిగా ఉండిపోయాడు మరియు వేలాది సంవత్సరాలుగా సాతాను కొనసాగిస్తున్న మోసపూరిత తంత్రాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాడు. అంతేగాకుండా, దేవుని వాక్యములను పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం మానవునికి లేదు, ఇవన్నీ కలిసి ప్రస్తుత పరిస్థితికి దారి తీశాయి. ఈనాడు ఉన్న పరిస్థితుల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ సాతాను శోధన ప్రమాదంలో జీవిస్తున్నారు, కాబట్టి సక్రమమైన మార్గంలో దేవుని వాక్యములను ప్రశంసించలేక పోతున్నారు. సాధారణ ప్రజల స్వభావాలలో వంకరబుద్ధి లేదు, లేదా వారి స్వభావాలలో వంచన లేదు, ప్రజలు ఒకరితో ఒకరు సాధారణ సంబంధం కలిగియుంటారు, వారు ఒంటరిగా ఉండరు మరియు వారి జీవితాలు సామాన్యమైనవిగా ఉండవు, లేదా క్షీణించినవిగా ఉండవు. అలాగే దేవుడు కూడా ప్రజలందరి మధ్యలో ఘనపరచబడ్డాడు; ఆయన వాక్కులు మనుష్యుల మధ్యన చొచ్చుకునిపోతాయి, ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరంగా శాంతితో జీవిస్తారు మరియు దేవుని సంరక్షణలోను, పరిరక్షణలోను జీవిస్తారు, సాతాను జోక్యం లేకుండా భూమి అంతా సామరస్యంతో నిండి ఉంటుంది మరియు మనుష్యులలో దేవుని మహిమకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రజలు దేవదూతలలాంటివారు: స్వచ్ఛమైనవారు, శక్తిమంతులు, దేవుని గురించి ఎప్పటికి ఫిర్యాదు చేయనివారు మరియు భూమిపై దేవుని మహిమకు మాత్రమే తమ ప్రయత్నాలన్నింటినీ అంకితం చేసేవారు. ఇప్పుడు కటిక చీకటి సమయం, అంటే అందరూ తడుముకుంటూ, వెతుక్కుంటూ ఉన్నారు, చిమ్మ చీకటితో నిండిన రాత్రి వారి రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది, వారు సహాయము చేయరు గాని వణికిపోతారు; మానవుని శోకభరితమైన వెక్కిళ్లు నిండి ఉన్నాయా అనిపించే వాయువ్యం నుండి తెరలు తెరలుగా దూసుకొస్తున్న గాలిని నిశితంగా వినడం తప్ప ఇంకేమీ చేయలేరు. ప్రజలు తమ విధిని బట్టి దుఃఖిస్తారు మరియు ఏడుస్తారు. వారు దేవుని వాక్కులు చదివినప్పటికీ వాటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇది ఎలా ఉందంటే వారి జీవితాలు నిరాశ అంచుకు చేరుకున్నాయా అన్నట్లు, మృత్యువు వారిని కబళించబోతుందా అన్నట్లు, వారి చివరి రోజు వారి కళ్లెదుటే ఉందన్నట్లుగా ఉంది. అటువంటి పరిస్థితులన్నీ దుర్భలమైన దేవదూతలు తమ సొంత కష్టాన్ని శోకభరితమైన రోదనను ఒకదాని తర్వాత మరొకటి దేవునికి మొర్రపెట్టుకున్నప్పుడు జరుగుతుంటాయి. ఈ కారణముచేతనే, దేవుని కుమారులు మరియు దేవుని ప్రజల మధ్య పనిచేసే దేవదూతలు ఇక ఎప్పుడూ తిరిగి మానవుల మీదకి దిగిరారు; ఇది ఎందుకంటే, వారు శరీరధారులుగా ఉన్నప్పుడు సాతాను మోసంలో చిక్కుకుపోయి, తమంత తాము విడిపించుకోవడాన్ని నిరోధించడం కోసమే, కాబట్టి వారు మనిషికి కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే పనిచేస్తారు. కాబట్టి, “నేను మనుష్యుని హృదయంలో సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, నా కుమారులు మరియు నా ప్రజలు భూమిని పరిపాలించే క్షణం అదే” అని దేవుడు చెప్పినప్పుడు, భూమి మీదనున్న దేవదూతలు పరలోకములో దేవుణ్ణి సేవించే ఆశీర్వాదాన్ని ఆనందించే సమయాన్ని ఆయన సూచిస్తున్నాడు. మనిషి దేవదూతల ఆత్మల వ్యక్తీకరణయైయున్నాడు కాబట్టి, భూమిపై ఉండడం అనేది పరలోకములో ఉన్నట్లేనని దేవుడు మనిషికి చెప్పుచున్నాడు; భూమిపై మానవుడు దేవుణ్ణి సేవించడమంటే పరలోకములో దేవుణ్ణి దేవదూతలు నేరుగా సేవించడం లాంటిదే, అందుచేత, ఆయన భూమిపై ఉన్న రోజుల్లో, మనిషి మూడవ ఆకాశపు ఆశీర్వాదాలను అనుభవిస్తాడు. ఈ వాక్యములలో వాస్తవంగా చెబుతున్నది ఇదే.
దేవుడి వాక్యములలో ఎంతో అర్థం దాగి ఉంది. “ఆ దినమున, ప్రజలు తమ హృదయాల లోతుల్లో నన్ను తెలుసుకుంటారు మరియు తమ ఆలోచనలలో నన్ను గుర్తుంచుకుంటారు.” ఈ వాక్యములు మనిషి ఆత్మను ఉద్దేశించి చెప్పబడ్డాయి. దేవదూతల దుర్భలత కారణంగా, వారు ఎల్లప్పుడూ అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడతారు, ఎల్లప్పుడూ దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటారు మరియు దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే సాతాను ఆటంకం కారణంగా, వారు తమకు తాము సహాయము చేసుకోలేరు మరియు తమను తాము నియంత్రించుకోలేరు; వారు దేవుణ్ణి ప్రేమించాలనుకుంటారు కానీ తమ సంపూర్ణ హృదయాలతో ఆయనను ప్రేమించలేరు, కాబట్టే వారు బాధను అనుభవిస్తారు. దేవుని కార్యము ఒక నిర్దిష్ట బిందువుకు చేరుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి నిజంగా ప్రేమించాలనే ఈ నిస్సహాయులైన దేవదూతల కోరిక నెరవేరుతుంది, అందుచేతనే దేవుడు ఆ వాక్కులను చెప్పాడు. దేవదూతల స్వభావం దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ఆస్వాదించడం మరియు దేవునికి విధేయత చూపడం, అయినప్పటికీ వారు భూమిపై దీనిని సాధించలేకపోతున్నారు, వారికి ప్రస్తుత సమయం వరకు సహనం వహించడం తప్ప మరో దారి లేకపోయింది. మీరు నేటి ప్రపంచాన్ని చూడవచ్చు: ప్రజలందరి హృదయాలలో దేవుడు ఉన్నాడు, అయినా, తమ హృదయాలలో ఉన్నది నిజమైన దేవుడా, లేదా అబద్ధపు దేవుడా అనేదానిని ప్రజలు గుర్తించలేకపోవుచున్నారు, వారు తమ ఈ దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ, వారు నిజంగా అసలైన దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. అంటే, వారిపై వారికి నియంత్రణ లేదని అర్థం. దేవుని ద్వారా బయలుపరచబడిన మనిషి యొక్క వికారమైన ముఖం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో సాతాను యొక్క నిజమైన ముఖమే. నిజానికి మనిషి అమాయకుడు మరియు పాపములేనివాడు, కాబట్టి మనిషికున్న భ్రష్టుపట్టిన, వికృతమైన ప్రవర్తనలన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో సాతాను పనులే మరియు ఆధ్యాత్మిక ప్రపంచపు పరిణామాల నమ్మదగ్గ నమోదుయైయున్నది. “ఈ రోజు, ప్రజలకు అర్హతలు ఉన్నాయి, మరియు వారు నా ముందు గర్వంగా నడవగలమని మరియు ఎలాంటి మొహమాటం లేకుండా నాతో నవ్వవచ్చు మరియు వేళాకోళం చేయవచ్చు మరియు నన్ను సమానంగా సంబోధించవచ్చు అని విశ్వసిస్తున్నారు. ఇప్పటికీ మనిషి నన్ను ఎరుగడు, ఇప్పటికీ మేము స్వభావంలో ఒకేలా ఉన్నామని, మేమిద్దరం రక్తమాంసాలతో కూడుకున్నవాళ్లమని, ఇద్దరూ మానవ లోకంలో నివసిస్తున్నామని నమ్ముతున్నాడు.” మనిషి హృదయంలో సాతాను చేసింది ఇదే. దేవుణ్ణి వ్యతిరేకించడానికి సాతాను మనిషి యొక్క ఆలోచనలను మరియు భౌతిక కళ్ళను ఉపయోగించుకుంటాడు, అయినప్పటికీ మనిషి ఇక్కడి ఘోరమైన వాటిని నివారించే క్రమములో దేవుడు ఈ సంఘటనల గురించి మనిషికి సంగదిగ్ధము లేకుండానే చెప్తాడు. ప్రజలందరి ఐహికమైన బలహీనత ఏమిటంటే, వారు “రక్తమాంసాలతో కూడిన శరీరం, దేవుని ఆత్మను గ్రహించవద్దు.” మాత్రమే చూస్తారు. మనిషిని సాతాను ప్రలోభపెట్టడంలో ఒక అంశానికి ఆధారం ఇదే. ఈ శరీరములోని ఆత్మ మాత్రమే దేవుడని పిలవబడుతుందని ప్రజలందరూ విశ్వసిస్తారు. ఈ రోజు, ఆత్మ దేహంగా మారిందని మరియు వాస్తవానికి వారి కళ్లెదుటే ప్రత్యక్షమైందని ఎవరూ విశ్వసించరు; ప్రజలు దేవుణ్ణి రెండు భాగాలుగా చూస్తారు, అవేమనగా, “బట్టలు ధరించుకొనుట మరియు శరీరం”—మరియు ఎవరూ దేవుణ్ణి ఆత్మ అవతారంగా చూడరు, శరీర గుణగణాలే దేవుని స్వభావమని ఎవరూ చూడరు. ప్రజల ఊహలో దేవుడు ప్రత్యేకించి సాధారణమైనవాడు, కానీ ఈ సాధారణతలో దేవుని లోతైన ప్రాధాన్యతకు సంబంధించిన ఒక కోణం దాగి ఉందని వారికి తెలుసా?
దేవుడు సమస్త ప్రపంచాన్ని ఆవరించడం ప్రారంభించినప్పుడు, అది చిమ్మచీకటిగా మారింది మరియు ప్రజలు నిద్రిస్తున్న సమయాన్ని, దేవుడు మనుష్యుల మధ్యకు దిగడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు మరియు మానవజాతిని రక్షించే కార్యాన్ని మొదలుపెడుతూ, భూమి నలు మూలలకు అధికారికంగా ఆత్మను పంపడం ప్రారంభించాడు. దేవుడు శరీర స్వరూపాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు, దేవుడు స్వయంగా భూమిపై పనిచేశాడని చెప్పవచ్చు. అప్పుడు ఆత్మ కార్యము ప్రారంభమైంది, దాంతో భూమిపై సమస్త కార్యము అధికారికంగా ప్రారంభమైంది. రెండు వేల యేండ్ల పర్యంతం, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ విశ్వమంతటా పని చేసింది. ప్రజలకు ఈ విషయం తెలిసియుండవచ్చు, లేక తెలియకయుండవచ్చు, కానీ అంత్య దినాలలో, ఈ కాలము త్వరలో ముగియబోతున్నప్పుడు, దేవుడు స్వయంగా కార్యము నిర్వహించడానికి భూమి పైకి దిగివచ్చాడు. ఇది అంత్యకాలములో జన్మించిన వారికి ఆశీర్వాదం, శరీరంలో జీవించే దేవుని స్వరూపాన్ని వీరు వ్యక్తిగతంగా చూడగలరు. “అగాధజలములు అంతా మసకబారినప్పుడు, మనిషిలో నేను ప్రపంచంలోని కఠినత్వాన్ని చవి చూడటం ప్రారంభించాను. నా ఆత్మ ప్రపంచమంతటా ప్రయాణిస్తుంది మరియు ప్రజలందరి హృదయాలను చూస్తుంది, అయినప్పటికీ, నేను కూడా శరీరధారిగా మానవజాతిని జయిస్తాను.” పరలోకంలో ఉన్న దేవునికి మరియు భూమిపై ఉన్న దేవునికి మధ్య సామరస్యపూర్వకమైన సహకారం అలా ఉంది. అంతిమంగా, భూమిపై ఉన్న దేవుడే పరలోకంలో ఉన్న దేవుడని, పరలోకం, భూమి మరియు వాటిలోని సమస్తం భూమిపై ఉన్న దేవుడిచే సృష్టించబడిందని, మనిషి భూమిపై ఉన్న దేవుడిచే నియంత్రించబడుతున్నాడని, పరలోకంలో చేసే కార్యాన్నే భూమిపై ఉన్న దేవుడు భూమి మీద చేస్తాడని మరియు పరలోకంలో ఉన్న దేవుడు శరీర స్వరూపంలో కనిపించాడని ప్రజలు తమ ఆలోచనలలో విశ్వసిస్తారు. భూమిపై దేవుని కార్యపు అంతిమ లక్ష్యం ఇదే, కాబట్టి, శరీరావతారం కలిగియున్న కాలంలో కార్యపు అత్యున్నత ప్రమాణం కలిగియున్న దశ ఇదే; ఇది దైవత్వంలో కొనసాగించబడుతుంది మరియు ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకునేలా చేస్తుంది. ప్రజలు ఎంత ఎక్కువగా తమ ఆలోచనలలో దేవుణ్ణి అన్వేషిస్తారో, అంత ఎక్కువ మంది భూమిపై ఉన్న దేవుడు నిజం కాదని భావిస్తారు. కాబట్టి, ప్రజలు ఖాళీ వాక్యముల మధ్యన మరియు సిద్ధాంతాల మధ్యన దేవుని కోసం అన్వేషిస్తారని దేవుడు అంటాడు. ప్రజలు ఎంత ఎక్కువగా తమ ఆలోచనలలో దేవుణ్ణి తెలుసుకుంటారో, అంతే ఎక్కువగా వారు ఈ వాక్యములను మరియు సిద్ధాంతాలను మాట్లాడటంలో ప్రవీణులవుతారు మరియు అంతే ఎక్కువ ప్రశంసనీయులు అవుతారు; ప్రజలు ఎంత ఎక్కువగా వాక్యములను మరియు సిద్ధాంతాలను మాట్లాడుతారో, దేవుని నుండి వారు అంతే దూరం అవుతారు, మానవ స్వభావాన్ని తెలుసుకోవడంలో వారు ఎంత ఎక్కువ అసమర్థులు అవుతారో, దేవునిపట్ల అంతే ఎక్కువ అవిధేయత చూపుతారు మరియు దేవుడు కోరుకునేవాటినుండి అంతే ఎక్కువ దూరం అవుతారు. మనిషి నుండి దేవుడు కోరుకునేవి ప్రజలు ఊహించినంత అతీంద్రియమైనవి కావు, అయినప్పటికీ దేవుని చిత్తాన్ని నిజంగా ఎవరూ అర్థం చేసుకోలేదు, కాబట్టి దేవుడు, “ప్రజలు అనంతమైన ఆకాశాన్ని, లేదా ఉవ్వెత్తున పడిలేస్తున్న సముద్రాన్ని, లేదా ప్రశాంతమైన సరస్సును లేదా ఖాళీ అక్షరాలు మరియు సిద్ధాంతాలను మాత్రమే కోరుకుంటారు.” అని అంటాడు. మనిషి నుండి దేవుడు ఎన్ని ఎక్కువ కోరికలు కోరుతాడో, అంతే ఎక్కువగా ప్రజలు దేవుడు చేరుకోలేనివాడని భావిస్తారు మరియు అంతే ఎక్కువగా దేవుడు గొప్పవాడని విశ్వసిస్తారు. ఆవిధంగా, వారి ప్రజ్ఞలో, దేవుని నోటి నుండి వచ్చిన మాటలన్నిటిని మానవుడు పొందుకోలేడు, దీంతో దేవునికి వ్యక్తిగతంగా చర్య తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు; అదే సమయంలో, దేవునితో సహకరించడంపట్ల మానవుడు కొంచెం కూడా మొగ్గుచూపడు మరియు శిరస్సు వంచి తన పాపాలను ఒప్పుకుంటూ, వినయంగా మరియు విధేయతతో ఉండటానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. అందుచేత, దీన్ని గ్రహించకుండా, ప్రజలు కొత్త భక్తిలోనికి ప్రవేశిస్తారు, భక్తిపరమైన సంఘాలలో ఉన్నదానికంటే ఘోరమైన మతపరమైన వేడుకలలోకి ప్రవేశిస్తారు. దీనికి ప్రజలు తమ ప్రతికూల స్థితిని సానుకూల స్థితిగా మార్చుకోవడం ద్వారా వారు సాధారణ పరిస్థితులకు తిరిగి రావలసియున్నది; లేకపోతే, మనిషి మరింత లోతుగా కూరుకుపోతాడు.
దేవుడు తన అనేక పలుకుల్లో పర్వతాలు మరియు జలాలను గురించి వివరించడంపై ఎందుకు దృష్టి పెడతాడు? ఈ మాటలలో ఏదైనా సంకేతాక్మకమైన అర్థం ఉందా? అందువల్ల, దేవుడు శరీరధారిగా తాను చేసే పనులను మనిషి చూడడానికి అనుమతించడం మాత్రమే కాకుండా, ఆకాశములో తన శక్తులను అర్థం చేసుకునేలా కూడా చేస్తాడు. ఈ విధంగా, అదే సమయంలో, ప్రజలు ఈయన శరీరధారిగా ఉన్న దేవుడని నిస్సందేహముగా విశ్వసించడంతో పాటు, ఆచరణాత్మకమైన దేవుని పనులను కూడా ప్రజలు తెలుసుకుంటారు, తద్వారా భూమిపై ఉన్న దేవుడే పరలోకానికి పంపబడ్డాడని మరియు పరలోకంలో ఉన్న దేవుడు భూమిపైకి తీసుకురాబడ్డాడని కూడా తెలుసుకుంటారు, ఆ తర్వాత మాత్రమే ప్రజలు దేవుడు ఏమైయున్నాడో పూర్తిగా చూడగలుగుతారు మరియు సర్వశక్తిమంతుడైన దేవుని గురించి గొప్ప జ్ఞానాన్ని పొందగలుగుతారు. దేవుడు శరీరములో ఉన్నటువంటి మానవాళిని ఎంత ఎక్కువగా జయించి, సమస్త విశ్వం పైకి మరియు అంతటా ప్రయాణించడానికి శరీరాన్ని అధిగమించగలడో, అంతే ఎక్కువగా ప్రజలు ఆచరణాత్మకమైన దేవుణ్ణి చూడటమును ఆధారము చేసుకొని దేవుని కార్యాలను చూడగలుగుతారు, తద్వారా విశ్వమంతటా జరిగే దేవుని కార్యము యొక్క వాస్తవమును తెలుసుకుంటారు, అంటే నకిలీ కాదనీ, నిజమైనదనీ తెలుసుకోగలుగుతారు. అందుచేత, ఈనాటి ఆచరణాత్మకమైన దేవుడు ఆత్మ స్వరూపుడని మరియు మనిషిలాంటి అదే రకమైన రక్తమాంసాలతో కూడిన శరీరముగలవాడు కాదని వారు తెలుసుకుంటారు. కాబట్టి, “కానీ నేను నా కోపాన్ని కుమ్మరించినప్పుడు, పర్వతాలు వెంటనే చీలిపోతాయి, భూమి వెంటనే కుదుపుకు లోనవుతుంది, నీరు వెంటనే ఎండిపోతుంది మరియు మనిషి వెంటనే విపత్తుకు గురవుతాడు.” అని దేవుడు అంటాడు. ప్రజలు దేవుని వాక్కులు చదివినప్పుడు, వారు వాటిని దేవుని రక్తమాంసాల శరీరంతో ముడిపెడతారు. అందువల్ల, ఆధ్యాత్మిక ప్రపంచంలోని కార్యము మరియు వాక్యములు శరీరధారియైన దేవుణ్ణి నేరుగా సూచిస్తాయి, ఇది మరింత ప్రభావవంతమైన ఫలితానికి దోహదపడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు, ఈ మాటలు తరచుగా ఆకాశము నుండి భూమి మీదకి వచ్చేవి, దేవుని వాక్యముల ప్రేరణలు మరియు మూలాలను ప్రజలు గ్రహించలేకపోయేలా చేస్తూ, ఆ తర్వాత మరోసారి నేల నుండి ఆకాశానికి వెళ్తుండేవి. “నేను ఆకాశములలో ఉన్నప్పుడు, నా ఉనికిని చూసి నక్షత్రాలు ఎప్పుడూ భయాందోళనలకు గురికావు. దానికి బదులుగా, అవి నా కోసం తమ పనిలో తమ హృదయాలను పెడతాయి.” ఇలాంటిదే పరలోకపు స్థితి. దేవుని సేవలో ఉన్న సేవకులందరూ దేవుని కోసం తమ సొంత పని చేస్తూ ఉండేలా, మూడవ ఆకాశములో దేవుడు ప్రతిదీ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తాడు. వారు దేవునికి అవిధేయతతో ఏమీ చేయలేదు, కాబట్టి వారు దేవుడు చెప్పిన భయాందోళనలోనికి తోసివేయబడలేదు, దానికి బదులుగా వారి హృదయాలను వారి పనిలో నిమగ్నం చేస్తారు; ఎప్పుడూ ఎలాంటి గందరగోళం ఉండదు, ఆ విధంగా దేవదూతలందరూ దేవుని వెలుగులో జీవిస్తారు. ఇదే సమయంలో, అవిధేయత మరియు దేవుడు తెలియకపోవడం కారణంగా, భూమిపై ఉన్న ప్రజలందరూ చీకటిలో జీవిస్తారు మరియు వారు ఎంత ఎక్కువగా దేవుడిని వ్యతిరేకిస్తారో, అంతే ఎక్కువ చీకటిలో వారు జీవిస్తారు. దేవుడు “ఆకాశములు ఎంత ప్రకాశవంతంగా ఉంటే, క్రిందున్న ప్రపంచం అంత అంధకారంగా ఉంటుంది” అని చెప్పినప్పుడు, దేవుని రోజు మానవాళి అంతటికి ఎలా మరింత దగ్గరవుతున్నదో ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆ విధంగా, మూడవ ఆకాశములో దేవుని 6,000 యేండ్ల అలుపెరుగని కార్యము త్వరలో ముగియబోతుంది. భూమిపై ఉన్న అన్ని విషయాలు అంతిమ అధ్యాయంలోనికి ప్రవేశించాయి మరియు త్వరలో ప్రతి ఒక్కటి దేవుని చేతి నుండి తెగిపోయి దూరమవుతాయి. ప్రజలు ఎంత ఎక్కువగా అంత్యకాలములోకి వెళ్తారో, మానవ ప్రపంచంలోని భ్రష్టత్వాన్ని అంతే ఎక్కువగా రుచి చూడగలుగుతారు; వారు అంత్యకాలములోకి ఎంత ఎక్కువగా వెళ్తారో, అంతే ఎక్కువగా తమ సొంత శరీర సంబంధితమైన వారుగా ఉంటారు. ప్రపంచపు దయనీయమైన స్థితిని వెనక్కు మళ్లించాలనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు, అయినప్పటికీ దేవుని పనుల కారణంగా, వారి ఆశ వారి నిట్టూర్పుల మధ్య అంతరిస్తుంది. ఆ విధంగా, ప్రజలు వసంతకాలపు వెచ్చదనాన్ని గ్రహించినప్పుడు, దేవుడు వారి కళ్లను మూసివేస్తాడు, అందువల్ల వారు కదలాడే అలలపై తేలుతారు, వారిలో ఒక్కరు కూడా సుదూరంలో ఉన్న జీవిత నావను చేరుకోలేరు. ప్రజలు సహజంగానే బలహీనులు కాబట్టి, పరిస్థితులను మార్చగలిగే వారెవరూ లేరని దేవుడు చెప్తాడు. ప్రజలు నిరీక్షణను కోల్పోయినప్పుడు, దేవుడు విశ్వమంతటితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన సమస్త మానవాళిని రక్షించడం ప్రారంభిస్తాడు మరియు దీని తర్వాత మాత్రమే, అంటే పరిస్థితులు మార్చబడిన తర్వాత వచ్చే నూతన జీవితాన్ని ప్రజలు ఆస్వాదించగలుగుతారు. నేటి ప్రజలు తమను తాము మోసపరచుకునే దశలో ఉన్నారు. ప్రజల ముందున్న మార్గం చాలా నిర్మానుష్యంగా మరియు అస్పష్టంగా ఉన్నందున మరియు వారి భవిష్యత్తు “అపరిమితంగా” మరియు “సరిహద్దులు లేకుండా” ఉన్నందున, ఈ కాలపు ప్రజలు పోరాటానికి మొగ్గు చూపరు మరియు వారి రోజులను అవసరమైన పని చేయకుండా హన్హావో పక్షిలా[ఎ] మాత్రమే గడపగలరు. జీవించడం మరియు మానవ జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని గురించి తీవ్రంగా అన్వేషించే వారెవరూ లేరు; దానికి బదులుగా, ప్రపంచంలోని దయనీయ స్థితిని మార్చడానికి పరలోకంలోని రక్షకుడు అకస్మాత్తుగా దిగివచ్చే రోజు కోసం ఎదురు చూస్తారు, ఆ తర్వాత మాత్రమే వారు జీవితాన్ని మనస్ఫూర్తిగా గడపడానికి ప్రయత్నిస్తారు. సమస్త మానవాళి వాస్తవ స్థితి మరియు ప్రజలందరి మనస్తత్వం ఇదే.
ఈ రోజు, మనిషి ప్రస్తుత మనస్తత్వం దృష్ట్యా, భవిష్యత్తులో మనిషి కొత్త జీవితం గురించి దేవుడు ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడేది, ఈ కాంతి రేఖ కనిపించడం గురించే. దేవుడు దేవుడు చెప్పిన ప్రవచనం అంతిమంగా దేవుని ద్వారానే సాధించబడుతుంది మరియు ఇదే సాతానుపై దేవుని విజయపు ఫలాలుగా ఉన్నాయి. “నేను మనుషులందరి మీద సంచరిస్తున్నాను మరియు ప్రతిచోటా గమనిస్తున్నాను. ఏదీ ఎన్నడూ పాతదిగా కనిపించదు మరియు ఏ వ్యక్తి కూడా మునుపటిలా ఉండడు. నేను సింహాసనం మీద కూర్చుంటాను, నేను విశ్వమంతటి మీద విశ్రమిస్తాను...” ఇదే దేవుని ప్రస్తుత కార్యపు ఫలితమైయున్నది. దేవుడు ఎంచుకున్న ప్రజలందరూ వారి అసలు రూపానికి తిరిగి వస్తారు, “వారి ముఖాలు మనిషి హృదయంలోని పరిశుద్ధుని వలె.” అని దేవుడు చెప్పినట్లుగా, దాని ఫలితంగా ఎన్నో యేండ్లుగా బాధలు అనుభవించిన దేవదూతలు విడుదల చేయబడ్డారు. ఎందుకంటే, దేవదూతలు భూమిపై పని చేస్తారు, భూమిపై దేవునికి సేవ చేస్తారు మరియు దేవుని మహిమ ప్రపంచమంతటా వ్యాపిస్తుంది, భూమి మీదకు పరలోకం తీసుకురాబడింది మరియు భూమి పరలోకానికి ఎత్తబడుతుంది. అందుచేత, మనిషే పరలోకాన్ని మరియు భూమిని కలిపే వారదియైయున్నాడు; ఇకపై పరలోకం మరియు భూమి వేరుగా ఉండవు, ఇకపై విడదీయబడవు, కానీ ఒక్కటిగా కలిసి ఉంటాయి. యావత్తు ప్రపంచంలో దేవుడు మరియు మానవులు మాత్రమే ఉంటారు. దుమ్ము, లేదా ధూళి ఉండదు, ఆకాశం కింద పచ్చ గడ్డి మైదానంలో పడుకుని ఉన్న చిన్న గొర్రెపిల్లలా దేవుని కృపనంతా ఆస్వాదిస్తూ ఉన్నట్లుగా అన్ని విషయాలు పునరుద్ధరించబడతాయి. పచ్చదనం చిగురించడంవల్ల జీవం యొక్క ఊపిరి ప్రకాశిస్తుంది, ఎందుకంటే, “నేను మరోసారి సీయోనులో నిమ్మళంగా నివసించగలను.” అని దేవుడు నోటితో చెప్పినట్లు, దేవుడు శాశ్వతంగా మనిషితోపాటు జీవించడానికి ఈ లోకానికి వస్తాడు, ఇది సాతాను ఓటమికి సంకేతాక్మకమైయున్నది, ఇది దేవుని విశ్రాంతి దినమైయున్నది మరియు ఈ రోజు ప్రజలందరిచే ప్రశంసించబడుతుంది, ప్రకటించబడుతుంది మరియు ప్రజలందరిచే స్మరించబడుతుంది. దేవుడు సింహాసనంపై విశ్రాంతి తీసుకున్నప్పుడు, దేవుడు భూమిపై తన కార్యాన్ని కూడా ముగించే సమయమై ఉంటుంది మరియు దేవుని రహస్యాలన్నీ మనిషికి చూపించబడే క్షణం కూడా ఇదే; దేవుడు మరియు మనిషి శాశ్వతంగా సామరస్యంతో సమాధానంగా ఉంటారు, ఎప్పటికీ విడిపోరు, దేవుని రాజ్యపు అందమైన దృశ్యాలు ఇలాగే ఉంటాయి!
రహస్యాలలో రహస్యాలు దాగి ఉంటాయి; దేవుని మాటలు నిజంగా లోతైనవి మరియు గ్రహించలేనివి!
ఫుట్‌నోట్:
ఎ. హన్‌హావో పక్షి కథ యోసేపు చెప్పిన చీమ మరియు గొల్లభామ కల్పితగాథకి చాలా దగ్గరగా ఉంటుంది. హన్‌హావో పక్షికి తన పొరుగున ఉన్న కొండకాటి పిట్ట నుండి పదే పదే హెచ్చరికలు వచ్చినప్పటికీ, వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు గూడు కట్టుకోవడానికి బదులుగా నిద్రపోవడాన్ని ఇష్టపడుతుంది. శీతాకాలం వచ్చినప్పుడు, ఆ పక్షి చలికి వణుకుతూ మరణిస్తుంది.