5 వ అధ్యాయము

నా మనోవైఖరిని తెలియపరిచేది నా ఆత్మ స్వరం. మీకు అర్థమైందా? ఈ విషయంలో స్పష్టత లేకుండా ఉండడమంటే, తుల్యమైన రీతిలో నన్ను నేరుగా ప్రతిఘటించినట్లే అవుతుంది. దీనిలో ఉన్న ప్రాముఖ్యతను మీరు నిజాయితీగా చూశారా? నేను మీమీద ఎంత శ్రమను, ఎంత శక్తిని, వెచ్చిస్తున్నానో మీకు నిజంగా తెలుసా? నా ముందు మీరు ఎలా ప్రవర్తించారో మరియు మీరేం చేశారో చెప్పే ధైర్యం నిజంగా మీకు ఉందా? నా ముఖం మీదనే మిమ్మల్ని మీరు నా ప్రజలని పిలుచుకునే ధైర్యం మీకు ఉంది—మీకు సిగ్గు లేదు, తెలివి తక్కువ వారు! త్వరలోనో లేక ఆ తరువాతో, మీలాంటి ప్రజలు నా ఇంటి నుండివెలి వేయబడతారు! నాకోసం సాక్ష్యంగా నిలబడ్డారనీ, పాత సైనికుడనీ భావించి నాతో రావద్దు! మానవజాతి చేయగలిగింది ఇదేనా? మీ ఉద్దేశాలు మరియు లక్ష్యాలలో ఏవి మిగలకపోతే, ఎప్పుడో మీరు వేరొక దారిలో కొట్టుకుపోయేవారు. మనిషి హృదయం ఎంత వరకు భరించగలదో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఈ సమయం నుండి, అన్ని విషయాల్లో, మీరు ఆచరణాత్మకమైన వాస్తవికతలోనికి తప్పనిసరిగా ప్రవేశించాలి; ఇకపై మీరు గతంలో చేసిన విధంగా, కేవలం దవడలు ఆడించడం వలన, మీకు ఇకపై ఉపయోగం ఉండదు. గతంలో మీలోని అనేకమంది నా పైకప్పు క్రింద నిశ్చింతగా విశ్రమించగలిగారు; ఈ రోజు మీరు దృఢంగా నిలబడగలుగుతున్నారంటే, అది పూర్తిగా నా మాటల తీవ్రత వల్లనే అన్నది వాస్తవం. నేను యాదృచ్చికంగా మరియు కారణం లేకుండా మాట్లాడతానని మీరు అనుకుంటున్నారా? అవకాశమే లేదు! నేను అన్ని విషయాలను పెద్దగా లెక్క చేయను, అలాగే పైనుండే అన్నిటిపై అధికారాన్ని చలాయిస్తాను. అదేవిధంగా, భూమిపై నేను నా రక్షణను స్థాపించాను. నా రహస్య స్థానము నుండి, మనుష్యుల కదలికలు, వారు మాట్లాడి చేసేదంతా నేను ప్రతి నిముషం చూస్తూనే ఉంటాను. మనుష్యులు నాకు తెరచిన పుస్తకముల వంటి వారు: ప్రతిఒక్కరిని చూసి తెలుసుకుంటాను. రహస్య స్థానము నా నివాసం, పరలోక పురము మొత్తం నేను పడుకునే పాన్పు. సాతాను శక్తులు నన్ను చేరుకోలేవు, ఎందుకంటే నేను మహత్యము, నీతి, తీర్పులతో నిండియున్నాను. నా వాక్యాల్లో చెప్పలేని రహస్యం ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నీటిలో పడిన కోడిపిల్లల వలె, గందరగోళంతో నిండిపోయి, లేదా భయంతో నిండిన పసిపిల్లల వలె, ఏమి తెలియని వారిలా అయిపోయారు, ఎందుకంటే మీ ఆత్మ మూర్చపోయిన స్థితిలో పడిపోయింది. రహస్య స్థానము నా నివాసమని నేనెందుకు చెప్పాను? నా మాటలలోని లోతైన అర్ధం మీకు తెలుసా? మనుష్యులలో నన్ను తెలుసుకోగలిగిన వారు ఎవరు? తమ సొంత తల్లి తండ్రిని తెలుసుకున్న విధంగా నన్ను తెలుసుకోగలిగిన వారు ఎవరు? నా పడక మీద విశ్రాంతి తీసుకుంటూ నేను దగ్గరగా గమనిస్తున్నాను: భూమి మీద మనుష్యులందరూ వారి గమ్యం మరియు భవిష్యత్తు కోసం హడావిడిగా ప్రపంచం చుట్టూ తిరుగుతూ ముందుకు వెనుకకు పరిగెత్తుతున్నారు. నా రాజ్యమును నిర్మించడానికి ఒక్కరికి శక్తి లేదు, కాస్తంత ఊపిరి పీల్చుకోవడానికి చేసేంత కృషి కూడా లేదు. నేను మనుష్యులను సృజించి, ఎన్నోసార్లు నేను వారిని శ్రమల నుండి రక్షించాను; అయినప్పటికీ, ఈ మనుష్యులందరూ కృతజ్ఞత లేనివారు: వారిలో ఒక్కరు కూడా నా రక్షణ గూర్చిన ఉపమానములను వివరించలేరు. లోకము సృష్టించబడిన నాటి నుండి ఈ రోజు వరకు చాలా సంవత్సరాలుగా—చాలా శతాబ్దాలుగా—ఇలాగే ఉంది; నేను చాలా అద్భుతాలు చేశాను మరియు ఎన్నోసార్లు నా జ్ఞానాన్ని తెలియజేసాను. అయినప్పటికీ, మనుష్యులు వెర్రి వారిలా మరియు మొద్దుబారిన మానసిక వ్యాధిగ్రస్తుల లాగే ఉన్నారు, కొన్నిసార్లు అడవిలో గంతులు వేసే క్రూర జంతువుల్లా, కనీసం నా వ్యవహారాలను పట్టించుకోవాలనే ఉద్దేశం కూడా లేకుండా ఉంటారు. చాలాసార్లు, మనుష్యులు చనిపోవడానికి వారికి మరణశిక్ష విధించి మరియు చావమని ఆజ్ఞాపించాను, కానీ నా నిర్వహణా ప్రణాళిక ఎవరూ మార్చలేనిది. అందువల్ల, నా చేతుల్లో, మనుష్యులు అంటిపెట్టుకుని ఉన్న పాత విషయాలను వారు తెలియచేస్తూనే ఉంటారు. నా కార్యపు దశల కారణంగా, నేను, మరోసారి, నీచమైన, మలినమైన, హేయమైన, దిక్కుమాలిన పెద్ద కుటుంబంలో జన్మించిన మిమ్మల్ని రక్షించాను.

నా ప్రణాళికాబద్ధమైన కార్యము ఒక్క నిముషం కూడా ఆగకుండా ముందుకు సాగుతుంది. దేవుని రాజ్య కాలంలోకి, మిమ్మల్ని నా ప్రజలుగా నా రాజ్యములోకి తీసుకువెళ్ళిన తరువాత మీకు ఇతర ఆజ్ఞలను ఇస్తాను; అంటే, ఈ యుగాన్ని పరిపాలించే రాజ్యాంగాన్ని మీకు ప్రకటించడం ప్రారంభిస్తాను:

నా ప్రజలుగా మీరు పిలవబడ్డారు కాబట్టి, నా నామాన్ని మీరు మహిమ పరచగలగాలి; అంటే, శ్రమలలో నాకు సాక్ష్యంగా నిలబడాలి. ఎవరైనా నన్ను లాలించి నానుండి సత్యాన్ని దాచాలని ప్రయత్నించినా, లేక నా వెనుక తుచ్చమైన వ్యవహారాలకు పాల్పడినా, అలాంటి వ్యక్తులు, ఉపేక్షించే అవకాశమే లేకుండా, నా ఇంటినుండి తొలగించబడి అలాగే తరిమికొట్టబడి, వారితో నేను పరిష్కారం చేసే వరకు ఎదురు చూస్తారు. గతంలో ద్రోహులై నాకు నమ్మక ద్రోహం చేసినవారు, ఈ రోజు బహిరంగంగా తీర్పు తీర్చడానికి పైకి లేచిన వారు కూడా—నా ఇంటి నుండి తరిమి కొట్టబడతారు. నా ప్రజలైన వారు నా భారముల కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి అలాగే నా వాక్యాలు తెలుసుకోవాలి. ఇలాంటి ప్రజలకు మాత్రమే నేను వెలిగిస్తాను, తప్పకుండా వారు నా నడిపింపు చొప్పున నా వెలిగింపు కలిగి జీవిస్తారు, శిక్షతో ఎప్పటికీ కలవరు. నా భారాల పట్ల శ్రద్ధ చూపడంలో విఫలమై, వారి సొంత భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టినవారు—అంటే, తమ క్రియలతో నా హృదయాన్ని తృప్తి పరచడం లక్ష్యంగా లేకుండా, బదులుగా దానం కోసం ఎదురు చూసే ఈ బిక్షగాళ్ళ లాంటి జీవులను వాడుకోవడానికి నేను బొత్తిగా నిరాకరిస్తాను, ఎందుకంటే వారు పుట్టినప్పటి నుండి, నా భారాల పట్ల శ్రద్ధ చూపించడం అంటే ఏమిటో వారికి తెలియదు. సాధారణమైన తెలివి కూడా లేని వ్యక్తులు; అలాంటి వ్యక్తులు మెదడుకి “పౌష్టికాహార లోపంతో” బాధ పడుతున్నారు, “పౌష్ఠికాహారము” కొరకు వారు ఇంటికి వెళ్ళడం అవసరం. నాకు అలాంటి వ్యక్తులతో ఉపయోగం లేదు. నా ప్రజలలో, ప్రతిఒక్కరు ఎలాగైతే తినడం, వస్త్రములు ధరించడం, నిద్ర పోవడం ఒక్క నిముషం కూడా మర్చిపోరో అలాగే నా గురించి తెలుసుకోవడమనేది అనివార్యమైన విధిగా మరియు చివరి వరకు చూడవలసిన కర్తవ్యంగా భావిస్తారు, కాబట్టి, చివరికి నన్ను తెలుసుకోవడం అనేది అనుభవం ఉన్న చేతితో, తిన్నంత సులభం అవుతుంది. నేను మాట్లాడే వాక్యాల విషయానికొస్తే, వాటిని అత్యంత విశ్వాసంతో సంపూర్ణ సాదృశ్యంగా తీసుకోవాలి; అందులో పనికిరాని అర్ద—కొలతలు ఉండకూడదు. నా మాటలకు శ్రద్ధ చూపించని వారు ఎవరైనా సరే, నన్ను నేరుగా ప్రతిఘటించినట్లుగానే పరిగణింపబడతారు; ఎవరైతే నా మాటలను భుజించరో, లేక వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించరో, వారు నా పట్ల శ్రద్ధ లేనివారిగా పరిగణించబడతారు, మరియు నేరుగా నా ఇంటి తలుపు దగ్గర నుండి తుడిచివేయబడతారు. ఇది ఎందుకంటే, నేను గతంలో చెప్పిన విధంగా, నాకు కావలసింది గొప్ప వ్యక్తుల సంఖ్య కాదు, శ్రేష్టత్వము. వంద మంది వ్యక్తులలో ఒక్కరే నా మాటల ద్వారా నన్ను తెలుసుకోగలిగితే, అ ఒక్కరిని వెలిగించి మరియు ప్రకాశింపజేయడానికి మిగిలిన వాళ్ళందరిని ఉద్దేశపూర్వకంగానే విసిరేస్తాను. ఎక్కువ మంది మాత్రమే నన్ను వ్యక్తపరచగలరని మరియు నన్ను జీవింపజేయగలరనేది ఖచ్చితంగా నిజం కాకపోవచ్చని మీరు దీని నుండి చూడవచ్చు. నాకు కావలసింది గోధుమలు (గింజలు నిండుగా లేకపోయినా) గురుగులు కాదు (గింజలు నిండుగా ఉన్నప్పటికీ). అన్వేషణ పట్ల శ్రద్ధ లేని వారి విషయానికొస్తే, ఆ పనికి బదులుగా బద్దకంగా ప్రవర్తించే ఇలాంటి వారిని, వారి ఇష్టానుసారానికి వదిలేయాలి; నా నామానికి అవమానం తీసుకురాకుండా ఉండేందుకు, ఇకపై నేను వారిని చూడాలని అనుకోను. నా ప్రజల నుండి నాకు కావలసిన దాని గురించి, ప్రస్తుతానికి నేను నా విధులను ఆపుతాను, పరిస్థితులు ఎలా మారతాయన్న దాని మీద ఆధారపడి తదుపరి ఆజ్ఞలను చేయడానికి ఎదురు చూస్తాను.

గతించిన దినాలలో, ఎక్కువమంది ప్రజలు నేనే జ్ఞానానికి దేవుడని, మనుష్యుల హృదయాలను లోతుగా చూసిన దేవుడని భావించేవారు; అయితే, ఇది కేవలం పైపైన చర్చ మాత్రమే. మనుష్యులు నన్ను నిజంగా తెలుసుకొని ఉంటే, వారి ఊహాజనితమైన ముగింపులకు వెళ్ళరు, బదులుగా నా వాక్యాల ద్వారా నన్ను తెలుసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నా కార్యాలను నిజముగా చూసే దశలోనికి వారు చేరుకున్నప్పుడు మాత్రమే నన్ను జ్ఞానవంతుడు మరియు అద్బుతకరుడని పిలవడానికి అర్హులు అవుతారు. నా గురించి మీకున్న జ్ఞానం చాలా తేలికపాటిది. యుగయుగాలుగా, చాలా మంది ప్రజలు చాలా సంవత్సరాలు నాకు సేవ చేసారు, నా కార్యాలు చూసి నిజంగా నా గురించి కొంత తెలుసుకున్నారు. ఈ కారణంగా, వారు ఎప్పుడు నా పట్ల లోబడే హృదయాన్ని కలిగి ఉండేవారు, నా అడుగుజాడలను అనుసరించడం ఎంతో కష్టం కాబట్టి నన్ను వ్యతిరేకించాలనే చిన్నపాటి ధైర్యం కూడా చేసేవారు కాదు. ఈ ప్రజలలో నా నడిపింపు గనుక లేకపోతే, వారు ఆవేశంగా ప్రవర్తించే ధైర్యం చేసేవారు కాదు. అందువల్ల, చాలా సంవత్సరాల అనుభవంతో జీవించిన తరువాత, చివరికి వారు నన్ను జ్ఞానిగా పిలవడానికి, ఆశ్చర్యకరుడని, ఉపదేశము చేయువాడనని, నా వాక్యాలు రెండంచుల వాడియైన ఖడ్గము వంటివని, నా కార్యములు గొప్పవని, స్తంభింపజేసి, ఆశ్చర్యపరచే విధంగా, మహత్యమును వస్త్రముగా ధరించుకున్న వాడనని, నా జ్ఞానము ఆకాశము కంటే ఎత్తుగా వ్యాపించి ఉందని, ఇంకా ఇతర జ్ఞానయుక్తమైన వాటిని మరియు ఇతర సూక్తులను వారు క్రమపరచుకున్నారు. అయితే నేడు, నన్ను గూర్చిన మీ జ్ఞానం వారు వేసిన పునాది మీద ఆధారపడి ఉంది, మీలో అనేకమంది—చిలుకలు లాగా—వారు మాట్లాడిన మాటలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు నన్ను తెలుసుకునే విధానం ఎంత నిస్సారంగా ఉందో మరియు మీ “విద్య” ఎంత పేలవంగా ఉందో నేను పరిగణనలోకి తీసుకోవడం వల్లనే నేను మీకు ఎంతో శిక్షను తప్పించాను. ఇప్పటికీ మీలో చాలామందికి మీ గురించి మీకు తెలియదు, మీ క్రియల్లో మీరు నా చిత్తానికి అనుగుణముగా ఉన్నారని, ఈ కారణంగానే తీర్పును తప్పించుకున్నామని; లేక శరీరధారిగా మారిన తర్వాత, మనుష్యుల పనులను గూర్చిన జాడను పూర్తిగా కోల్పోయానని, ఈ కారణంగానే మీరు శిక్ష నుండి కూడా తప్పించుకున్నామని; లేక మీరు విశ్వసించే దేవుడు సృష్టిలోని విశాలమైన స్థలములలో లేడు, కాబట్టి సమయాన్ని మోసగించడానికి దేవునిపై విశ్వాసముంచడం అనే మార్గాన్ని ఉపయోగిస్తూ, లేదంటే సోమరితనంతో గడుపుతూ తప్పనిసరిగా మీ హృదయాలలో ఉంచుకొని నెరవేర్చవలసిన విధిని, దానికి బదులుగా మీ ఖాళీ సమయాలను దేవుని గురించి తెలుసుకోడానికి కేటాయించవచ్చని మీరు భావించారు. మీ అర్హతలు, హేతువు, జ్ఞానముల కొరతపై నేను జాలి చూపించకపోతే, మీరంతా నా శిక్ష నడుమ నశించిపోయేవారు, ఉనికి లేకుండా తుడిచిపెట్టబడేవారు. అయినప్పటికీ, భూమిమీద నా కార్యము పూర్తయ్యేవరకు, నేను మానవాళితో సౌమ్యంగా ఉంటాను. ఇది మీరు తప్పనిసరిగా తెలుసుకోవడంతో పాటు మంచి చెడులనే గందరగోళానికి గురికావడం ఆపేయండి.

ఫిబ్రవరి 25, 1992

మునుపటి:  4 వ అధ్యాయము

తరువాత:  6 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger