4 వ అధ్యాయము

నా కంటే ముందు పరిచర్యచేసిన నా ప్రజలందరూ గతాన్ని గూర్చి తప్పక ఆలోచించాలి: నా పట్ల మీ ప్రేమ కల్మషంతో మలినమైపోయిందా? నా పట్ల మీ భక్తి పవిత్రమైనదిగా మరియు హృదయపూర్వకమైనదిగా ఉందా? నన్ను గూర్చిన మీ జ్ఞానం సత్యమైనదేనా? మీ హృదయాల్లో నేను ఏ స్థానాన్ని కలిగి ఉన్నాను? నేను మీ హృదయాలను సంపూర్ణంగా నింపానా? నా మాటలు మీలో ఎంతగా కార్యం చేశాయి? నన్ను బుద్ధిహీనునిగా భావించవద్దు! ఈ విషయాల్లో నాకు సంపూర్ణ స్పష్టత ఉంది. ఈరోజు, నా రక్షణ స్వరం ప్రకటించబడుతుంటే, దానిలో నా పట్ల మీ ప్రేమలో ఎదుగుదల ఏమైనా ఉందా? నా పట్ల మీ భక్తి కొంతైనా శుద్ధీకరించబడిందా? నన్ను గూర్చిన మీ జ్ఞానం వృద్ధిచెందిందా? గతంలో మీరు అర్పించిన స్తుతి, నేడు మీరు కలిగి ఉన్న జ్ఞానానికి బలమైన పునాది వేసిందా? మీరు ఎంతమేరకు నా ఆత్మచేత నింపబడియున్నారు? నా స్వరూపం మీలో ఏ స్థానాన్ని కలిగి ఉంది? నా మాటలు మీ హృదయంలో నివాసమున్నాయా? మీ సిగ్గును ఎక్కడ దాయలేరని మీరు నిజంగా భావిస్తున్నారా? నా ప్రజలుగా ఉండడానికి మీరు అనర్హులని నిజంగా నమ్ముతున్నారా? పై ప్రశ్నలన్నింటిని మీరు పూర్తిగా విస్మరించినట్లయితే, మీరు అంధకారపు నీళ్ళలో చేపలు పడుతున్నారని, కేవలం అంకెల కొరకే ప్రయాసపడుతున్నారని అర్థమవుతుంది మరియు నా ద్వారా ముందుగా నిర్ణయించబడిన సమయమందు, మీరు ఖచ్చితంగా పరిత్యజించబతారు మరియు రెండవసారి అగాధంలో తోసివేయబడతారు. ఇవి నా హెచ్చరిక మాటలు మరియు ఎవరైనా వీటిని తేలిగ్గా తీసుకుంటే, నా తీర్పుచే కొట్టబడతారు మరియు నిర్ణయకాలమందు నాశనాన్ని ఎదుర్కొంటారు. ఇది అలా కాదనుకుంటున్నారా? దీన్ని వివరించడానికి నేను ఇంకా ఉదాహరణలు అందించాలా? మీకు ఉదాహరణలు అందించడానికి ఇంకా సాధారణ రీతిగా నేను మాట్లాడాలా? సృష్టి మొదలుకొని ఈరోజు వరకు, అనేకులు నా మాటలకు అవిధేయత చూపారు. అందువల్ల వారు పెరికి వేయబడి బహిష్కరించబడ్డారు మరియు నా స్వస్థత ప్రవాహం నుండి వెలివేయబడ్డారు; చివరికి, వారి శరీరాలు నాశనమయ్యాయి మరియు వారి ఆత్మలు నరకంలో పడవేయబడ్డాయి, మరియు ఈరోజు వరకుకూడా వారు వేదనకరమైన శిక్షకు లోనయ్యారు. అనేకమంది ప్రజలు నా మాటలను అనుసరించారు, కానీ వారు నా జ్ఞానోదయానికి, వెలిగింపుకి వ్యతిరేకంగా వెళ్లారు, మరియు నా ద్వారా ప్రక్కకు నెట్టివేయడం వలన సాతాను అధికారానికి లోనై, నన్ను వ్యతిరేకించేవారిలో ఒకరిగా మారిపోయారు. (ఈరోజు నన్ను ప్రత్యక్షంగా వ్యతిరేకించేవారందరూ కేవలం నా మాటలకు పైపైన మాత్రమే విధేయత చూపి, నా మాటల సారాంశానికి ఆవిధేయత చూపారు.) నేను నిన్న చెప్పిన మాటలను ప్రస్తుత కాలపు ఫలంగా దాచుకొనకుండా, ఊరికే విని, వాటిని గతానికి చెందిన “వ్యర్థాలుగా” పక్కన పెట్టేసిన వారు అనేకులు ఉన్నారు. ఈ ప్రజలు సాతానుచే చెరపట్టబడడం మాత్రమే కాకుండా నిత్య పాపులుగాను, నా శత్రువులుగాను మారారు, మరియు వారు ప్రత్యక్షంగా నన్ను వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వ్యక్తులు నా ఉగ్రత యొక్క ఉన్నత స్థాయిలో నా తీర్పుకు గురిగా ఉన్నవారు, మరియు వారు ఇప్పటికీ చీకటిలోనే, అంధకారపు చెరసాలలోనే ఉండిపోయారు (అలాంటి వ్యక్తులు సాతానుచే నియంత్రించబడుతూ కుళ్లిపోయిన, మొద్దుబారిన దళాలుగా ఉన్నారని చెప్పవచ్చు; వారి నేత్రాలు నా ద్వారా మూసివేయబడ్డాయి గనుక వారు అంధులని నేను చెబుతున్నాను). మీ సూచన కొరకు ఒక ఉదాహారణను ఇస్తే మంచిది, తద్వారా మీరు దాని నుండి నేర్చుకుంటారు:

పౌలును గురించిన ప్రస్తావన వచ్చిననప్పుడు, అతని చరిత్ర గురించిన మీ ఆలోచనలు, మరియు ఆయనను గురించి మీరు వినే కొన్ని కథలు సరైనవి కాదు మరియు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అతనుపిన్నవయసు నుండి తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు, నా జీవాన్ని పొందాడు, ముందుగా నిర్ణయించిన నా సంకల్పాన్ని బట్టి, నేను కోరుకున్న సామర్ధ్యాన్ని అతను పొందాడు. 19 సంవత్సరాల వయసులోనే, జీవితాన్నిగురించిన వివిధ పుస్తకాలను చదివాడు; అందువలన ఎలా అనే వివరాల్లోకి వెళ్ళే అవసరత నాకు లేదు, అతని సామర్ధ్యాన్ని బట్టి మరియు నా జ్ఞానోదయం మరియు వెలిగింపును బట్టి, ఆత్మీయ విషయాల్లో కొంత పరిజ్ఞానంతో మాట్లాడడం కాకుండా, నా ఉద్దేశ్యాలను సైతం గ్రహించగలిగాడు. వాస్తవానికి, ఇది అంతరంగ, బహిరంగ అంశాల కలయిక నుండి మినహాయింపు కాదు. అయినప్పటికీ, ఆయనలో ఉన్న ఒక్క అపరిపూర్ణత ఏమిటంటే, తనకున్న తలాంతులను బట్టి, ధారాళంగా మాట్లాడేవాడు మరియు అతిశయపడేవాడు. ఫలితంగా, తన ఆవిధేయత వలన, నేను మొదటిసారి శరీరాన్ని ధరించినప్పుడు, నన్ను వ్యతిరేకించడానికి శక్తిమేర ప్రయత్నించాడు, దీనిలో కొంత భాగం ప్రధాన దూతను ప్రత్యక్షంగా సూచిస్తుంది. నా మాటలు గ్రహించని వారిలో అతను కూడా ఉన్నాడు మరియు అతని హృదయంలో నా స్థానం అదృశ్యమైపోయింది. అలాంటి వ్యక్తులు నా దైవత్వాన్ని ప్రత్యక్షంగా వ్యతిరేకించి, నా చేత కొట్టబడ్డారు, మరియు కేవలం ముగింపులో మోకరించి, వారి పాపాలను ఒప్పుకుంటారు. అందువల్ల, అతనిలోని బలమైన అంశాలను ఉపయోగించుకున్న తరువాత, అంటే అతను నా కొరకు కొంత సమయం పనిచేసిన తరువాత—మరొకసారి తన పూర్వ మార్గాల్లో పడిపోయాడు, అతను నా మాటలకు నేరుగా ఆవిధేయత చూపకపోయినప్పటికీ, అతను నా అంతరంగ నడిపింపునకు, జ్ఞానోదయానికి అవిధేయత చూపాడు, అందువల్ల గతంలో అతను చేసినవన్నీ నిరర్థకమైపోయాయి; మరొక విధంగా చెప్పాలంటే, మహిమ కిరీటాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు, అర్థంలేని మాటలుగాను, తన సొంత ఊహల్లో నుండి పుట్టినవిగాను మారాయి, ఇప్పటికీ అతను నా బంధకాల చెరలో, నా తీర్పుకు లోనైయున్నాడు.

పైన చెప్పబడిన ఉదాహరణ నుండి, ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో (నా శరీర స్వభావాన్ని వ్యతిరేకించడం మాత్రమే కాకుండా, మరింత ముఖ్యంగా, నా మాటలను మరియు నా ఆత్మను—ఒక్కమాటలో చెప్పాలంటే నా దైవత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా), వారు తమ శరీరంలో నా తీర్పును పొందుతారు. నా ఆత్మ నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీవు క్రిందకు లాగబడి, నేరుగా పాతాళంలోనికి దిగిపోతావు. నీ శరీరం భూమిపై ఉన్నప్పటికీ, నీవు మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిలా ఉంటావు; నీవు నీ ఆలోచన శక్తిని కోల్పోతావు, మరియు వెంటనే నీవు ఒక శవం అన్నట్లుగా భావించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను ఈ శరీరం నుండి తీసివేయాల్సిందిగా నన్ను బతిమాలుతావు. మీలో ఆత్మ కలిగిన అనేకులు, ఈ పరిస్థితులను గురించి లోతైన గ్రహింపు కలిగి ఉంటారు, కాబట్టి నేను మీకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వం, నేను సాధారణ మానవ స్వభావంతో పనిచేసినప్పుడు, చాలా మంది ప్రజలు నా ఉగ్రతకు, ప్రభావానికి వ్యతిరేకంగా తమకి తామే తీర్పు తీర్చుకున్నారు మరియు వారికి నా జ్ఞానాన్ని గురించి, నా స్వభావాన్ని గురించి కొద్దిగానే తెలుసు. ఇప్పుడు నేను, దైవత్వంలో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను మరియు కార్యం చేస్తున్నాను మరియు కొంతమంది వ్యక్తులు వారి నేత్రాలతో నా ఉగ్రతను మరియు తీర్పును చూస్తారు; అంతేకాకుండా, ప్రత్యక్షంగా శరీరంలో నా కార్యాలను ప్రజలకు తెలిసేలా చేయడం మరియు ప్రత్యక్షంగా నా స్వభావాన్ని మీరందరూ చూసేలా చేయడమే, తీర్పు యుగపు రెండవ భాగపు ప్రాముఖ్యమైన కార్యం. అయితే నేను శరీరంలో ఉన్నందు వలన, మీ బలహీనతలను గురించి ఆలోచించగలను. మీరు మీ ఆత్మను, మనసును మరియు శరీరాన్ని ఆట బొమ్మల వలె పరిగణించి, అనాలోచితంగా సాతానుకి సమర్పించకూడదని నా ఆశ. మీరు కలిగి ఉన్న సమస్తాన్ని ఆటలా పరిగణించకుండా, వాటిని దాచుకోవడం మంచిది, ఎందుకంటే అలాంటి విషయాలు మీ విధికి సంబంధించినవి. నా మాటల నిజమైన భావాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? నాలోని వాస్తవమైన భావాలను మీరు నిజంగా పరిగణలోకి తీసుకోగలుగుతున్నారా?

పరలోకంలో ఉన్నవారు అందుకునే నా దీవెనలను మీరు భూమిపై అనుభవించాలని కోరుకుంటున్నారా? నన్ను గూర్చిన అవగాహనను కలిగి, నా మాటలను బట్టి ఆనందిస్తూ, నన్ను గూర్చిన జ్ఞానాన్ని మీ జీవితంలో అత్యంత విలువైనదిగాను, అర్థవంతమైనదిగాను దాచుకోవడానికి ఇష్టపడుతున్నారా? మీ సొంత దృక్పథాలను గూర్చిన ఆలోచన లేకుండా, వాస్తవరీతిలో నాకు సంపూర్ణంగా లోబడగలరా? నా ద్వారా మరణానికి అప్పగించబడడానికి, గొర్రెల వలె నా చేత నడిపించబడడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోగలరా? అలాంటి విషయాలను సాధించగలిగవారు మీలో ఎవరైనా ఉన్నారా? నా ద్వారా అంగీకరించబడి, నా వాగ్ధానాలను పొందినవారే, నా ఆశీర్వాదాన్ని పొందినవారని చెప్పడం సాధ్యమేనా? ఈ మాటల నుండి మీరు ఏమైనా గ్రహించారా? నేను మిమ్మల్ని పరీక్షిస్తే, మీరు నిజంగా నా దయ, కనికరాల దగ్గరకు వచ్చి, ఈ శ్రమల మధ్యలో నా ఉద్దేశ్యాలను పరిశోధించి, నా హృదయాన్ని గ్రహించగలరా? మీరు హృదయాన్ని తాకే అనేకమైన మాటలు మాట్లాడాలని లేదా ఉత్తేజపరిచే అనేక కథలను చెప్పాలని నేను కోరుకోవడం లేదు; దానికి బదులుగా, నీవు నాకు ఒక మంచి సాక్షిగా ఉండాలని మరియు నీవు వాస్తవికతలోకి సంపూర్ణంగాను, లోతుగాను ప్రవేశించాలని అడుగుతున్నాను. నేను ప్రత్యక్షంగా మాట్లాడకపోతే, నీవు నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి, నా ద్వారా ఉపయోగించబడానికి నిన్ను నీవు అనుమతిస్తావా? ఇది కాదా నేను కోరుకునే వాస్తవం? నా మాటల్లోని భావాన్ని ఎవరు గ్రహించగలుగుతారు? అయితే, మీరు సందేహాల బరువుతో క్రిందికి లాగబడకుండా, మీ ప్రవేశంలో క్రియాశీలకంగా ఉండి, నా మాటల సారాన్ని గ్రహించాలని కోరుతున్నాను. ఇది మీరు నా మాటలను అపార్థం చేసుకోకుండా, నా భావం విషయంలో అస్పష్టత లేకుండా మరియు నా పాలన విధులను, కట్టడలను అతిక్రమించకుండా చేస్తుంది. నా మాటల్లో మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశ్యాలను గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం మీ స్వంత దృక్పథాలను గురించి ఆలోచించక, అన్ని విషయాల్లో దేవుని ప్రణాళికలకు/కూర్పుకు లోబడాలని నా యెదుట తీర్మానించుకొన్నవారివలె కార్యం చేయండి. నా గృహంలో నిలిచి ఉన్న వారందరూ, వారు చేయగలిగనంత పని చేయాలి; భూమిపై నా కార్యపు చివరి భాగానికి మిమ్మల్ని మీరు ఉత్తమంగా సమర్పించుకోవాలి. అలాంటి విషయాలను ఆచరణలో పెట్టడానికి మీరు నిజంగా ఇష్టపడుతున్నారా?

ఫిబ్రవరి 23, 1992

మునుపటి:  108 వ అధ్యాయము

తరువాత:  5 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger