సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—6 వ అధ్యాయము
ఆత్మ సంబంధమైన విషయాల పట్ల దృష్టి కలిగి, నా వాక్యం పట్ల శ్రద్ద కన పరుస్తూ, నా ఆత్మ మరియు నా ఉనికి, నా వాక్యం మరియు నా ఉనికి మొత్తాన్ని విడదీయరానిదిగా పరిగణించగల నిజమైన సామర్ధ్యాన్ని కలిగి ఉండండి, తద్వారా ప్రజలందరూ నా సన్నిధిలో నన్ను తృప్తి పరచగలరు. నేను అక్కడున్న వాటన్నిటి మీద అడుగుపెట్టి, ప్రపంచపు సువిశాల విస్తీర్ణాన్ని చూశాను, నేను ప్రజలందరి మధ్యలో నడిచి, మనుష్యుల్లోని మాధుర్యం మరియు చేదును రుచి చూశాను—అయితే మనిషి నన్ను ఎన్నడూ నిజంగా తెలుసుకోలేదు, నా యాత్రల్లో ఎన్నడూ నన్ను లక్ష్య పెట్టలేదు. నేను మౌనంగా ఉండి, ఎప్పుడూ అద్బుతకార్యాలు చేయలేదు కాబట్టి, ఎవరూ ఎప్పుడూ నన్ను చూడలేదు. ఈ రోజు గతానికి భిన్నంగా ఉంది: సృష్టికాలం నుండి ఎన్నడూ చేయని పనులను నేను చేయాలి, శతాబ్దాలుగా ఎన్నడూ వినని మాటలుమాట్లాడాలి, ఎందుకంటే ప్రజలందరూ శరీరధారిగా నన్ను తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను. ఇవే నా నిర్వాహకత్వపు దశలు, కానీ మనిషికి కొద్దిపాటి అవగాహన కూడా లేదు. నేను వారితో స్పష్టంగా మాట్లాడినప్పటికీ, ప్రజలు నిష్ప్రయోజనంగా ఉన్నారు; వారిని అర్ధం చేసుకోవడం కష్టం. ఇది మనిషి దయనీయత కాదా? నేను కచ్చితంగా పరిష్కరించాలనుకున్నది ఇది కాదా? కొన్ని సంవత్సరాలుగా, మనిషిలో నేను ఏమి చేయలేదు; కొన్నేళ్లుగా, నా అవతార దేహంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, నా దైవత్వం నుండి నేరుగా వెలువడిన స్వరాన్ని ఎవరూ వినలేదు. ఆ విధంగా ప్రజలు నన్ను గూర్చిన జ్ఞానాన్ని తప్పక కోల్పోతారు, అయినప్పటికీ ఇది యుగాలుగా నా పట్ల వారికున్న ప్రేమను ప్రభావితం చేయలేదు. అయితే, నేడు, నేను అద్భుత కార్యాన్ని, నిగూఢమైన మరియు ఎల్లలు లేని కార్యాన్ని చేసి, నేను ఎన్నో మాటలు పలికాను. అయినప్పటికీ, అలాంటి పరిస్థితులలో, ఇంకా, నా సన్నిధిలో నేరుగా నన్ను ఎదిరించేవారు చాలామంది ఉన్నారు. నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను.
ప్రతిరోజు మీరు ఒక అస్పష్టమైన దేవుని ప్రార్థిస్తూ, జీవితపు అవగాహన మరియు నా చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తారు. ఇంకా నా మాటలను విన్నప్పుడు, మీరు వాటిని భిన్నంగా చూస్తారు; నా ఆత్మను నా మాటలను మొత్తంగా పరిగణిస్తారు, ఇంకా నా ఉనికిని పక్కకు నెట్టి, ప్రాథమికంగా ఇటువంటి వాక్యాలను పలకలేని వ్యక్తినని, అవి నా ఆత్మ ద్వారా నిర్దేశించబడ్డాయని మీరు నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో నీ జ్ఞానం ఏమిటి? నువ్వు నా మాటలను కొంతవరకు నమ్ముతావు అయినా నేను శరీరాన్ని ధరించడం పట్ల తీవ్రమైన ఆలోచనలు భావాలు కలిగి ఉన్నావు. ప్రతిరోజు నువ్వు దీనిని అధ్యయనం చేస్తూ, “ఆయన పనులను ఈ విధంగా ఎందుకు చేశాడు? అవి నిజంగా దేవుని నుండి వచ్చాయా? అవకాశమే లేదు! ఆయన నాకు భిన్నమైన వాడు కాదు—ఆయన సాధారణమైనవాడు, సామాన్యమైన వ్యక్తి కూడా” అని చెప్తావు. అలాంటి పరిస్థితులు ఎలా వివరించబడతాయి?
పై వాటిని మీలో ఎవరు కలిగి ఉండలేదు? అలాంటి వాటి ద్వారా ఎవరు ఆక్రమించబడలేదు? అవి మీరు పట్టుకున్న వస్తువులుగా వ్యక్తిగతమైన ఆస్తుల భాగాలుగా కనిపిస్తాయి, వాటి పోనియ్యడానికి ఎప్పుడూ ఇష్టపడరు. ఇప్పటికీ వ్యక్తిగత ప్రయత్నాలను కొనసాగించరు; బదులుగా, నా అంతట నేనే దీనిని చేయాలని మీరు ఎదురు చూస్తారు. నిజం చెప్పాలంటే, ఏ ఒక్క వ్యక్తికి కూడా నన్ను వెదకకుండా తెలుసుకోవడం సులభం కాదు. నేను మీకు బోధించే ఈ మాటలు నిష్ప్రయోజనమైనవి కావు. నీ అవలోకనం కోసం నేను మరొక కోణం నుండి నీకు మరొక ఉదాహరణ ఇవ్వగలను.
పేతురు ప్రస్తావనలో, ప్రజలకు చివరిగా అతని గురించి. చెప్పే మంచి విషయాలకు అంతే లేదు అతను మూడుసార్లు దేవుని తెలియదనడం, సాతానుకు సేవ చేస్తూ దేవుని పరీక్షించిన విధానం, చివరికి దేవుని కోసం తలక్రిందులుగా సిలువ వేయబడ్డ విధానం, మొదలైన వాటిని వారు తక్షణమే గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పేతురు నన్ను ఎలా తెలుసుకున్నాడో అతని చివరి ముగింపు ఏమిటో నేను మీకు వివరించడంపై దృష్టి పెట్టబోతున్నాను. పేతురు మంచి సామర్ధ్యం కలిగినవాడు, కానీ అతని పరిస్థితులు పౌలు లాగా లేవు: అతని తల్లిదండ్రులు నన్ను హింసించారు, వారు సాతాను చేత పట్టబడిన దయ్యాలు, ఫలితంగా, వారు దేవుని గురించి పేతురు కి ఏమీ బోధించలేదు. పేతురు తెలివైనవాడు, ప్రతిభావంతుడు, మరియు అతని తల్లిదండ్రుల వలన చిన్నప్పటి నుండి గారాబం చేయబడినవాడు. అయితే యువకునిగా, నన్ను గూర్చిన జ్ఞానాన్ని వెంబడించడంలో ఎన్నడూ ఆగలేదు, కాబట్టి వారికి శత్రువు అయ్యాడు, ఆ తరువాత వారికి వెన్ను చూపించాడు. ఇది ఎందుకంటే, అన్నిటినీ మించి, భూమ్యాకాశము మరియు అన్ని విషయాలు సర్వశక్తిమంతుని చేతిలో ఉన్నాయని అలాగే సానుకూలమైన అన్ని విషయములు సాతాను ప్రమేయం లేకుండా, దేవుని నుండి నేరుగా పుట్టాయని అతను నమ్మాడు. పేతురు తల్లిదండ్రుల వైరుధ్యం నా ప్రేమ జాలి దయలను గూర్చిన గొప్ప జ్ఞానాన్ని అతనికి ఇచ్చింది, తద్వారా నన్ను వెతకాలనే ఆశ ఎక్కువయ్యింది. అతడు నా మాటలను తిని త్రాగడం మీద మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా, నా చిత్తాన్ని గ్రహించడం, ఎప్పుడూ తన హృదయంలో మెళకువతో ఉండటం మీద దృష్టి పెట్టాడు. ఫలితంగా, అతడు ఎల్లప్పుడూ తన ఆత్మలో సున్నితంగా ఉన్నాడు, అందువల్ల అతడు చేసిన వాటంతటిలో నా హృదయానుసారునిగా ఉన్నాడు. తనను తాను పురికొల్పుకోడానికి అతడు గతంలోని ప్రజల వైఫల్యాలపై నిరంతర దృష్టి పెట్టాడు, ఓటమిలో చిక్కుబడతానేమోనని ఎంతగానో భయపడ్డాడు. అలాగే, అతడు యుగయుగాలుగా దేవుని ప్రేమించిన వారందరి ప్రేమ మరియు విశ్వాసాన్ని సమీకరించడంపై దృష్టి పెట్టాడు. ఈ విధంగా—ప్రతికూల విషయాల్లో మాత్రమే కాకుండా, మరీ ముఖ్యంగా, సానుకూల విషయాల్లో—అతడు త్వరగా అభివృద్ధి చెందాడు, అలా అతని జ్ఞానం నా సన్నిధిలో అన్నింటికంటే గొప్పది అయింది. తనకు కలిగినదంతా ఎలా నా చేతుల్లో పెట్టాడో, ఆహారం, వస్త్రాలు, నిద్ర అలాగే అతడు నివసించే చోటును గూర్చిన నిర్ణయం తీసుకోవడంలో కూడా ఎలా విధేయుడయ్యాడో, దానికి బదులుగా అన్ని విషయాల్లో నన్ను తృప్తిపరచి నా ఐశ్వర్యాన్ని ఎలా అనుభవించాడో, ఊహించడం కష్టమేమీ కాదు. నేను అతడిని లేక్కలేన్నన్ని పరీక్షలకు గురి చేశాను—శ్రమలు, సాధారణంగా, అతడిని సగం-చచ్చిన వాడిలా చేశాయి—కానీ ఈ వందల కొద్దీశ్రమల మద్యలో, ఒక్కసారి కూడా నాపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు లేదా నా పట్ల నిరాశ చెందలేదు. అతడిని నేను మర్చిపోయానని చెప్పినప్పుడు కూడా, అతను నిరాశ చెందలేదు, అలాగే గతంలోని ఆచరణ సూత్రాలను బట్టి ఆచరణాత్మకమైన దారిలో నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించినప్పటికీ నేను అతడిని మెచ్చుకోనని, చివరికి అతడిని సాతాను చేతుల్లో పడేస్తానని చెప్పాను. అయితే తన శరీరం పైకి కాకుండా, మాటలతో కూడిన శ్రమల వంటి పరీక్షల్లో, అతడు నాకు ప్రార్థన ఇలా చేశాడు, “ఓ దేవా! భూమ్యాకాశము మరియు సమస్త విషయాల్లో, సర్వశక్తిమంతుడవైన నీ చేతిలో లేని ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా లేదా మరేదైనా ఉందా? నీవు నా పట్ల దయ కలిగి ఉన్నప్పుడు, నీ దయతో నా హృదయం గొప్పగా ఆనందిస్తుంది. నీవు నన్ను తీర్పు తీర్చునప్పుడు, నేను అర్హుడను కానప్పటికీ, నేను అంతులేని నీ క్రియల గొప్ప భావాన్ని పొందుతాను, ఎందుకంటే నీకు అధికారంతో, జ్ఞానంతో నిండి ఉన్నావు. నా శరీరం శ్రమలతో బాధించబడుతున్నప్పటికీ, నా ఆత్మ ఆదరణ పొందింది. నీ జ్ఞానాన్ని, నీ కార్యాలను స్తుతించకుండా నేను ఎలా ఉండగలను? నిన్ను తెలుసుకున్న తర్వాత నేను చనిపోవలసి వచ్చినప్పటికీ, నేను ఆనందంగా మరియు సంతోషంగా చేయకుండా ఎలా ఉండగలను? సర్వశక్తిమంతుడా! నేను నిన్ను చూడకూడదని నీవు నిజంగా కోరుకుంటున్నావా? నీ న్యాయ తీర్పును పొందడానికి నేను నిజంగా అర్హుడను కానా? నీవు చూడటానికి ఇష్టపడనిది నాలో ఏదైనా ఉందా?” ఈ శ్రమల కాలంలో, పేతురు నా చిత్తాన్ని ఖచ్చితంగా గ్రహించలేకపోయినా, నా ద్వారా ఉపయోగించబడినందుకు అతడు అతిశయించి మరియు గౌరవించబడ్డాడని (అతడు నా తీర్పును పొందినప్పటికీ దానివల్ల మానవజాతి నా మహిమను మరియు ఉగ్రతను చూడవచ్చేమోనని), మరియు ఈ పరీక్షల వలన అతడు దుఃఖపడలేదని నిరూపితమైంది. నా ఎదుటనున్న అతడి విధేయతను బట్టి, అతని పట్ల నా ఆశీర్వాదాన్నిబట్టి, వేల సంవత్సరాలుగా మనిషికి మాదిరిగా మరియు ఆదర్శంగా ఉన్నాడు. ఇది మీరు తప్పనిసరిగా అనుసరించవలసింది కాదా? నేను పేతురు గురించి ఇంత సుధీర్గమైన వృత్తాంతాన్ని ఎందుకు ఇచ్చానో మీరు దీర్గంగా ఆలోచించండి; మీరు చేసే పనులు ఈ మూల సూత్రాలను బట్టే ఉండాలి.
కొంతమంది ప్రజలకి నేను తెలిసినప్పటికీ, మనిషిపై నా ఉగ్రతను నేను చూపను, ఎందుకంటే ప్రజలు ఎంతో లేమితో ఉన్నారు, నేను ఆశిస్తున్నా స్థాయికి చేరుకోవడం వారికి కష్టం. ఈ విధంగా, వేల సంవత్సరాల నుండి నేటి వరకు, మనిషి పట్ల సహనంతో ఉన్నాను, అయినా నా సహనాన్ని బట్టి మీ పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉండరని నేను నమ్ముతున్నాను. పేతురు ద్వారా, మీరు నన్ను తెలుసుకొని మరియు నన్ను అనుసరించాలి; అతని అద్భుతకార్యాలన్నిటినుండి, మునుపెన్నడూ లేని విధంగా మీరు వెలిగింపబడాలి, తద్వారా మనిషి ఇంతకుముందెన్నడూ చేరని లోకాలు చేరుకోవాలి. జగత్తు మరియు ఆకాశమంతటిలో, భూమి మీద మరియు పరలోకమందున్న ప్రతిదానిలో, భూమ్యాకాశమందున్న సమస్త విషయాలు నా కార్యపు చివరి దశలో వాటి ప్రతి ప్రయత్నాన్ని అందిస్తాయి. మీరు నిజంగా సాతానుశక్తులచేఆదేశించబడినప్రేక్షకులుగాఉండకూడదనుకుంటున్నారా? సాతాను ప్రజల హృదయాల్లో నన్ను గూర్చిన జ్ఞానాన్ని పాడు చేస్తూ, చివరి మృత్యు ఘోషలో పండ్లు కొరుకుతూ, కోరలు వంచుతాడు. ఈ సారి మీరు దాని మోసపూరితమైన ఉపాయములలో పడి బలి కావాలని కోరుకుంటున్నారా? చివరికి నా కార్యం సంపూర్తి అయ్యే సమయానికి మీరు మీ జీవితాన్ని పాడుచేసుకోవాలని కోరుకుంటున్నారా? నేను మరోసారి నా సహనాన్ని చూపించాలని మీరు ఎదురు చూస్తున్నారా? నన్ను గూర్చిన జ్ఞానాన్ని అనుసరించడం కీలకం, అయితే ఆచరణపై దృష్టి పెట్టడం తప్పనిసరి. నా మాటలు మీకు నేరుగా వెల్లడి చేయబడ్డాయి, మీరు నా మార్గనిర్దేశనాన్ని అనుసరించగలరని నిరీక్షిస్తున్నాను, ఇకపై మీకోసం ఎటువంటి ప్రణాళికలు మరియు ఆశయాలు ఉండవు.
ఫిబ్రవరి 27, 1992