సమస్త విశ్వానికి దేవుని వాక్యములు—8 వ అధ్యాయము
నా ప్రత్యక్షతలు అంతిమ స్థాయికి చేరినప్పుడు, మరియు నా తీర్పు అంతానికి వచ్చినప్పుడు, ఆ సమయంలో నా ప్రజలందరూ ప్రత్యక్షపరచబడతారు మరియు పరిపూర్ణం చేయబడతారు. నేను నా ఉద్దేశ్యాలకు అనుగుణంగా, నేను వాడుకోవడానికి తగిన రీతిగా ఉన్న వారికోసం నిరంతర అన్వేషణలో విశ్వ ప్రపంచంలో ప్రతి మూలకు ప్రయాణం చేశాను. ఎవరు లేచి, నాతో సహకరిస్తారు? నాపట్ల మనుష్యుల ప్రేమ స్వల్పమైనది మరియు నాపట్ల వారికున్న విశ్వాసం కూడా అత్యల్పమైనది. నేను నా మాటల తీవ్రతను, ప్రజల బలహీనతల వైపుకి నడిపించకపోతే, వారు గర్వించి, హెచ్చించుకుని, యాజకులుగా వ్యవహరిస్తారు మరియు భూసంబంధమైన విషయాల్లో తామే సర్వజ్ఞానులమన్నట్లు, నిరర్థకమైన సిద్ధాంతాలతో ముందుకు వస్తారు. గతంలో నా పట్ల ఎవరు “నమ్మకం” గా ఉన్నారు, ఇప్పుడు నా ఎదుట ఎవరు “స్థిరం” గా ఉన్నారు మరియు గర్వంతో మాట్లాడడానికి ధైర్యం చేయని వారెవరు? తమ స్వంత ఊహల్లో రహస్యంగా సంతోషించని వారెవరు? నేను ప్రజలను ప్రత్యక్షంగా బహిర్గతం చేయనప్పుడు, వారు దాక్కోవాలి మరియు సిగ్గుచేత వేదనను అనుభవించాలి. నేను మరొక విధానంలో మాట్లాడితే, అది ఇంకెంత తీవ్రంగా ఉంటుంది? ప్రజలు, మరింత ఎక్కువగా ఋణస్థులమనే భావన కలిగి, వారిని ఏది బాగు చేయలేదని నమ్ముతారు, మరియు వారు తమ స్తబ్ధతచే గట్టిగా బంధించబడతారు. ప్రజలు నిరీక్షణను కోల్పోయినప్పుడు, “ఏడంచెల తీవ్రమైన ఆత్మ పని ప్రారంభించిన సమయం” అని ప్రజలు చెప్పినట్లు, రాజ్యపు గౌరవం పోతుంది. మరొక విధంగా చెప్పాలంటే, భూమిపై రాజ్యపు జీవితం అధికారికంగా ఆరంభమైనప్పుడు ఇది జరుగుతుంది; ఇది, నా దైవత్వం ప్రత్యక్షంగా పనిచేయడం (ఎలాంటి మానసిక “పురోగతి” లేకుండా) మొదలైనప్పుడు జరుగుతుంది. ప్రజలందరూ ఉజ్జీవింపబడినప్పటికీి లేదా కల నుండి మేల్కొన్నప్పటికీ, తీరికలేకుండా త్వరపడిపోతున్నారు మరియు వారు మేల్కొన్నప్పుడు, వారున్న పరిస్థితుల్లో ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో, నేను సంఘాన్ని నిర్మించడం గురించి ఎంతో చెప్పాను; నేను ఎన్నో మర్మాలను బయలుపరిచాను, కానీ ఆ పని దాని శిఖరాగ్ర స్థాయికి చేరినప్పుడు, అది ఆకస్మిక ముగింపునకు చేరింది. అయితే, రాజ్యాన్ని నిర్మించడమనేది భిన్నమైనది. కేవలం ఆత్మీయ ప్రపంచంలో యుద్ధం దాని అంతిమ స్థాయికి చేరినప్పుడే, భూమిపై నా పనిని నూతనంగా ప్రారంభిస్తాను. స్పష్టంగా చెప్పాలంటే, కేవలం మనుష్యులందరూు తిరోగమన అంచున ఉన్నప్పుడే నేను నా నూతన కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించి, వృద్ధి చేస్తాను. రాజ్యాన్ని నిర్మించడానికి మరియు సంఘాన్ని నిర్మించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, సంఘాన్ని నిర్మించడంలో, దైవత్వంచే పాలించబడే మానవత్వం ద్వారా నేను పనిచేస్తాను. నేను నేరుగా మనుష్యుల ప్రాచీన స్వభావంతో వ్యవహరించి, వికృతమైన వారి స్వయాన్ని బయలుపరిచి, వారి స్వభావాన్ని బహిర్గతం చేస్తాను. దాని ఫలితంగా వారు దీన్ని ఆధారం చేసుకుని తమను గూర్చి తాము తెలుసుకుంటారు, మరియు వారి హృదయంలోనూ, వారి మాటల్లోనూ ఒప్పించబడతారు. రాజ్యాన్ని నిర్మించడంలో, నేను నా దైవత్వం ద్వారానే పని చేస్తాను, మరియు నా మాటలను గురించి ప్రజలందరూ కలిగి ఉన్న జ్ఞానపు పునాదిపై నేనెవరో, నేనేం కలిగి ఉన్నానో వారు తెలుసుకొనేలా చేస్తాను, అంతిమంగా శరీరధారిగా వచ్చిన నాగురించిన జ్ఞానాన్ని తెలుసుకొనేలా చేస్తాను. తద్వారా, దేవుని కొరకు మానవజాతి అస్పష్టమైన అన్వేషణ ముగుస్తుంది మరియు పరలోకమందున్న దేవునికి వారి హృదయంలో స్థానమివ్వని స్థితిని మానుకుంటారు; అంటే నేను శరీరధారిగా ఉన్నప్పుడు నేను చేసే కార్యాలు మానవులు తెలుసుకొనేట్లు చేశాను, కనుక భూమిపై నా సమయాన్ని ముగిస్తాను.
రాజ్య నిర్మాణం అనేది నేరుగా ఆధ్యాత్మిక ప్రపంచంపై లక్ష్యముంచుతుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచపు పోరాటం, నా ప్రజలందరి మధ్య స్పష్టం చేయబడింది, మరియు కేవలం సంఘంలో మాత్రమే కాదు, కానీ రాజ్యపు యుగంలో మరింత ఎక్కువగా ప్రతి వ్యక్తి నిరంతరం యుద్ధంలో ఉంటారని చూపడానికి ఇది సరిపోతుంది. వారి భౌతిక శరీరాలతో సంబంధంలేకుండా, ఆధ్యాత్మిక ప్రపంచం నేరుగా వారికి ప్రత్యక్షపరచబడుతుంది, మరియు వారి ఆధ్యాత్మిక ప్రపంచపు జీవితంతో వారు సంబంధంలోకి వస్తారు. ఆ ప్రకారంగా, మీరు నమ్మకంగా ఉండడం ప్రారంభించినప్పుడు, నా కార్యపు తదుపరి పని కొరకు సరైన విధంగా మీరు సిద్ధపడాలి. మీరు మీ హృదయమంతటిని సమర్పించాలి. కేవలం అప్పుడు మాత్రమే మీరు నా హృదయాన్ని సంతృప్తిపరచగలరు. గతంలో సంఘంలో జరిగిన దానిని నేను పట్టించుకోను. ఇప్పుడు, ఇది రాజ్యంలో ఉంది. నా ప్రణాళికలో, సాతాను ఎల్లప్పుడూ నా జ్ఞానాన్ని ప్రతిఫలింపజేసే మెరుపుకాగితంలా ఉంటూ, నా ప్రతి అడుగు వెనకాల మెల్లగా అడుగులేస్తూ, నా అసలు ప్రణాళికను భంగపరిచే మార్గాల కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అయితే వాని మోసపూరితమైన పన్నాగాలకు నేను లొంగిపోతానా? పరలోకంలోనూ, భూమిమీదనూు ఉన్న సమస్తం నన్ను సేవిస్తాయి; మోసపూరితమైన సాతాను కుయుక్తులు భిన్నమైనవా? ఇక్కడే నా జ్ఞానం విభజిస్తుంది; ఇది నా కార్యాలను గురించిన అద్భుతమైన విషయం మరియు ఇది నా సంపూర్ణ నిర్వహణ ప్రణాళికను అమలు చేసే నియమం. రాజ్యాన్ని నిర్మించే యుగంలో, సాతాను మోసపూరిత పన్నాగాలను నేను ఇప్పటికీ తప్పించుకోలేకపోతున్నాను, కానీ నేను చేయాల్సిన పనిని కొనసాగిస్తున్నాను. విశ్వంలోనూ మరియు అన్నీ విషయాల్లోనూ, సాతాను కార్యాలను మెరుపు కాగితంలా ప్రతిఫలింప చేస్తూ ఉన్నాను. ఇది నా జ్ఞానపు వ్యక్తీకరణ కాదా? ఇది నాపనిని గురించి అద్భుతమైన విషయం కాదా? రాజ్యపు యుగంలోకి ప్రవేశించే సంధర్భంలో, పరలోకమందు మరియు భూమి మీద ఉన్న సమస్తం సమూలంగా రూపాంతరం చెందాయి, మరియు అవి సంబరం చేసుకుంటాయి మరియు ఆనందిస్తాయి. మీరు ఏమైనా భిన్నమైనవారా? తేనె వంటి మాధుర్యం ఎవరి హృదయంలో లేదు? సంతోషం కొరకు ఎదురు చూడని వారెవరు? సంతోషంతో నాట్యం చేయని వారెవరు? స్తుతి మాటలు మాట్లాడని వారెవరు?
నేను పైన మాట్లాడిన, చర్చించిన విషయాలన్నింటి లక్ష్యాలను మరియు మూలాలను గ్రహించారా, గ్రహించలేదా? నేను దీన్ని అడగక పోయినట్లయితే, నేను ఊరికే పిచ్చి మాటలు మాట్లాడుతున్నానని చాలామంది ప్రజలు అనుకోవచ్చు, మరియు నా మాటల మూలాన్ని గ్రహించలేకపోవచ్చు. మీరు వాటిని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. నువ్వు వాటిని ఎంతో ఉన్నతంగా చదువుతావు: నా మాటల్లో నీకు ప్రయోజనకరంగా లేనివి ఏవి? నీ జీవితం వృద్ధి చెందడానికి ఉద్దేశించనవి ఏవి? వాటిలో ఆధ్యాత్మిక ప్రపంచపు వాస్తవికతను గురించి ఏవి మాట్లాడవు? చాలామంది ప్రజలు నా మాటలకు ఒక కారణం గానీ లేదా లయ గానీ లేదని, అవి వివరణనూ, వ్యాఖ్యానాన్నీ కలిగి లేవని భావిస్తారు. నిజంగా నా మాటలు అంతటి సంక్షిప్తమైనవి మరియు నిగూడమైనవా? మీరు నిజంగా నా మాటలకు లోబడతారా? మీరు నిజంగా నా మాటలను అంగీకరిస్తారా? మీరు బొమ్మలుగా వాటిని పరిగణించడం లేదుగా? మీ వికృత రూపాన్ని కప్పుకోవడానికి వారిని వస్త్రాలుగా ఉపయోగించడం లేదుగా? ఇంత విస్తారమైన లోకంలో, నా ద్వారా వ్యక్తిగతంగా పరీక్షించబడింది ఎవరు? అనేకమంది ప్రజలు చీకటిలో వెతుకులాడుతున్నారు మరియు అన్వేషిస్తున్నారు; అనేకమంది ప్రతికూలతల మధ్య ప్రార్థన చేస్తున్నారు; చాలామంది ఆకలి, చలిలో నిరీక్షణతో చూస్తున్నారు; మరియు అనేకులు సాతానుచే బంధించబడ్డారు; అయినప్పటికీ ఎక్కడ తిరగాలో తెలీదు, అనేకులు తమ సంతోషం కోసం నన్ను అమ్మేస్తున్నారు, చాలామంది కృతజ్ఞతలేనివారిగా ఉంటున్నారు, మరియు అనేకమంది సాతాను మోసపూరిత పన్నాగాలకు నమ్మకస్తులుగా ఉంటున్నారు. మీ మధ్యలో యోబు ఎవరు? ఎవరు పేతురు/ నేను పదే పదే యోబు గురించి ఎందుకు ప్రస్తావించాను? పేతురు గురించి అనేకసార్లు ఎందుకు మాట్లాడాను? మిమ్మల్ని గురించి నేను ఏ నిరీక్షణతో ఉన్నానో మీరు గ్రహించగలిగారా? అలాంటి విషయాల గురించి ఆలోచించడానికి మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి.
పేతురు, అనేక సంవత్సరాలు నాకు నమ్మకంగా ఉన్నాడు, అయితే ఎప్పుడు సణగలేదు, ఫిర్యాదు చేయలేదు; చివరకుికి యోబు కూడా అతనికి సమానం కాదు, మరియు యుగాలుగా, పరిశుద్ధులందరూు పేతురు స్థాయికి చేరుకోలేదు. అతను నన్ను తెలుసుకోవడం మాత్రమే కాకుండా, దు కానీ సాతాను మోసపూరితమైన పన్నాగాలును పన్నుతున్న సమయంలోనూకూడా నన్ను తెలుసుకున్నాడు. ఇది పేతురు ఎల్లప్పుడూ నా చిత్తానికి అనుగుణంగా ఉంటూ, నన్ను అనేక సంవత్సరాలు సేవించడానికి ఇదే కారణమయ్యింది మరియు ఈ కారణాన్ని బట్టి, అతను సాతానుచే దోపిడి చేయబడలేదు. పేతురు, యోబు విశ్వాసం నుండి కూడా పేతురుపాఠాలు నేర్చుకున్నాడు, అయితే యోబు వైఫ్యల్యాలను స్పష్టంగా గ్రహించాడు. యోబు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పటికీిని, ఆథ్యాత్మిక ప్రపంచంలోని విషయాలను గూర్చిన జ్ఞానాన్ని కలిగి లేడు, కాబట్టి వాస్తవంతో సంబంధం లేని అనేక విషయాలను ఆయన అతనుచెప్పాడు; ఇది యోబుకున్న జ్ఞానం లోతైనది కాదనీ, పరిపూర్ణతను సాధించలేదనీి చూపుతుంది. కాబట్టి, పేతురు ఎల్లప్పుడు ఆత్మ యొక్క భావనను పొందడం మీదేపై దృష్టిసారించాడు, మరియు ఎల్లప్పుడూ ఆథ్యాత్మిక ప్రపంచపు గతిని గమనించడంపై గమనించడం మీదేఏకాగ్రత నిలిపాడు. దాని ఫలితంగా, ఆయన అతనునా ఇష్టాలను నిశ్చయంగా తెలుసుకోగలగడం మాత్రమే కాదు కానీ, సాతాను యొక్క మోసపూరిత పన్నాగాలను గూర్చిన కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. దీనిని బట్టి, అన్ని కాలాల్లోనూఏ వ్యక్తి నా గురించి ఏ వ్యక్తి సాధించలేని కలిగి లేని గొప్ప జ్ఞానాన్ని ఆయన అతనుకలిగి ఉన్నాడు.
పేతురు అనుభవం నుండి, మనుష్యులు నన్ను తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, వారు తమ ఆత్మలను జాగ్రత్తగా పరిశీలించుకోవడంపై దృష్టిసారించడం కష్టమైన విషయం కాదు. బాహ్యంగా నీవు నాకు కొంత “సమర్పించాలని” నేను నిన్ను అడగడం లేదు; ఇది రెండవ ప్రాధాన్యత. నీవు నన్ను తెలుసుకోనట్లయితే, నువ్వు మాట్లాడే విశ్వాసం, ప్రేమ మరియు నమ్మకత్వం అనేవి వట్టి ఊహలే అవుతాయి; అవి ఢంభపు మాటలు మరియు తనని గురించి కూడా తాను గ్రహించకుండానే నా యెదుట ఎంతో అతిశయపడే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆవిధంగా, మరొకసారి నీవు సాతాను చేతుల్లో చిక్కుకుపోతావు మరియు నిన్ను నీవు విడిపించుకోలేవు; నువ్వు నాశన పుత్రుడివవుతావు మరియు నాశనానికి గురవుతావు. అయితే, నువ్వు చల్లారిపోయి, నా మాటల పట్ల అజాగ్రత్తగా ఉన్నట్లయితే, అప్పుడు ఎలాంటి సందేహం లేకుండా నీవు నన్ను వ్యతిరేకిస్తావు. ఇది వాస్తవం, మరియు నా ద్వారా శిక్షించబడే అనేకమైన, భిన్నమైన ఆత్మల ద్వారా ఆథ్యాత్మిక ప్రపంచపు ద్వారాల గుండా చూడడానికి ఎంతో చేస్తావు. నా మాటలను ఎదుర్కొన్న వారిలో నిష్క్రియాత్మకంగా, అజాగ్రత్తగా మరియు అంగీకరించకుండా ఉన్నదెవరు? వారిలో నా మాటల పట్ల మూర్ఖ స్వభావం కలిగిలేనిది ఎవరు? నా మాటల్లో తప్పులు వెదికే ప్రయత్నం చేయనిది ఎవరు? వారిలో తమని తాము “కాపాడుకోవడానికి” నా మాటలను “ఆత్మ రక్షణ ఆయుధంగా” ఉపయోగించకుండా ఉన్నది ఎవరు? వారు నా మాటల సారాన్ని, నన్ను తెలుసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించలేదు కానీ, ఆడుకునే ఆట బొమ్మలుగా పరిగణించారు. దీనిలో వారు నన్ను ప్రత్యక్షంగా ఎదురించలేదా? నా మాటలు ఎవరు? నా ఆత్మ ఎవరు? అలాంటి ప్రశ్నలను నేను చాలాసార్లు మిమ్మల్ని అడిగాను, అయినప్పటికీ వాటిని గురించి ఉన్నతమైన, స్పష్టమైన అవగాహన మీరు ఎప్పుడైనా పొందారా? నిజంగా మీరు ఎప్పుడైనా వాటిని అనుభవించారా? నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను: మీరు నా మాటలను తెలుసుకోకపోయినా, వాటిని అంగీకరించకపోయినా, లేదా వాటిని ఆచరణలో పెట్టకపోయినా, అప్పుడు మీరు నా శిక్షకు పాత్రులవుతారు! మీరు ఖచ్చితంగా సాతాను బాధితులుగా మారతారు!
ఫిబ్రవరి 29, 1992