దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు II

మన గత సమావేశంలో మనం చాలా ముఖ్యమైన అంశం గురించి సాంగత్యము చేశాము. అదేమిటో మీకు గుర్తుందా? దానిని తిరిగి ఒకసారి గుర్తు చేయనివ్వండి. మన గత సాంగత్యపు అంశం ఏమిటంటే: దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు. ఇది మీకు ముఖ్యమైన అంశమేనా? ఇందులో ఏ భాగం మీకు అతి ముఖ్యమైనది? దేవుడి కార్యమా, దేవుడి స్వభావమా మరియు స్వయంగా దేవుడా? ఇందులో మీకు అత్యంత ఇష్టమైనది ఏది? ఏ భాగాన్ని మీరు ఎక్కువగా వినాలనుకుంటారు? ఆ ప్రశ్నకు సమాధానమివ్వడం మీకు కష్టమని నాకు తెలుసు, ఎందుకంటే దేవుని కార్యపు ప్రతి అంశంలోనూ ఆయన స్వభావాన్ని చూడవచ్చు మరియు ఆయన కార్యములో ఆయన స్వభావము ఎప్పుడూ మరియు ఎక్కడైనా బయలుపరచబడుతుంది, ఫలితంగా, స్వయంగా దేవుడిని సూచిస్తుంది; దేవుని మొత్తం నిర్వహణ ప్రణాళికలో, దేవుని కార్యము, దేవుని స్వభావము మరియు స్వయంగా దేవుడు అన్నీ ఒకదాని నుండి మరొకటి విడదీయలేనివి.

దేవుని కార్యము గురించి మన గత సాంగత్యములో చాలా కాలం క్రితం జరిగిన సంఘటనల గురించి బైబిల్ నుండి వృత్తాంతాలు ఉన్నాయి. అవన్నీ మనిషి మరియు దేవుని గురించిన కథలు, వీటిలో దేవుని భాగస్వామ్యం మరియు వ్యక్తీకరణ కూడా ఉన్నప్పటికీ, అవి మనిషికి జరిగిన విషయాలకు సంబంధించినవి, కాబట్టి దేవుడిని తెలుసుకోవడానికి ఈ కథలకు ప్రత్యేకమైన విలువ మరియు ప్రాముఖ్యత ఉన్నాయి. దేవుడు మానవాళిని సృష్టించిన తర్వాత కొద్దిసేపటికే, ఆయన మనిషితో వ్యవహరించడం, మనిషితో మాట్లాడటం ప్రారంభించాడు మరియు ఆయన స్వభావము మనిషికి వ్యక్తమవ్వడం ప్రారంభమైంది. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మానవాళితో మొట్టమొదటగా వ్యవహరించినప్పటి నుండి ఎలాంటి అంతరాయం లేకుండా ఆయన తన గుణగణాలను, తన వద్ద ఉన్న దానిని మరియు అసలు తానంటే ఏమిటనే దానిని మనిషికి ఆయన బహిరంగపరచడం ప్రారంభించాడు. పూర్వపు మనుష్యులు లేదా నేటి మనుష్యులు చూడగలరా లేదా అర్థం చేసుకోగలరా అనే దానితో సంబంధం లేకుండా, తన స్వభావాన్ని బయలుపరుస్తూ మరియు తన గుణగణాలను వ్యక్తపరుస్తూ, దేవుడు మనిషితో మాట్లాడతాడు మరియు మనుష్యుల మధ్య పని చేస్తాడు-ఇది వాస్తవం మరియు ఏ ఒక్కరూ నిరాకరించలేనిది. దేవుని స్వభావము, దేవుని గుణగణాలు మరియు ఆయన వద్ద ఉన్నది మరియు అసలు ఆయనంటే ఏమిటో నిరంతరం ఎదుట ఉంచబడతాయనీ మరియు బహిర్గతము చేయబడతాయని కూడా దాని అర్థం, ఎందుకంటే ఆయన మనుష్యులతో పని చేస్తాడు మరియు వ్యవహరిస్తాడు. ఆయన మనిషి నుండి ఎప్పుడూ దేనినీ రహస్యంగా ఉంచలేదు లేదా దాచలేదు, దానికి బదులుగా ఎలాంటి సంకోచం లేకుండా తన సొంత స్వభావాన్ని బహిరంగం చేస్తాడు మరియు ప్రకటిస్తాడు. కాబట్టి, మనిషి ఆయనను తెలుసుకోగలడని మరియు ఆయన స్వభావాన్ని మరియు గుణగణాలను అర్థం చేసుకోగలడని దేవుడు ఆశిస్తాడు. మనిషి ఆయన స్వభావాన్ని మరియు గుణగణాలను శాశ్వతమైన రహస్యాలుగా భావించాలనీ లేదా మానవాళి దేవుడిని ఎప్పటికీ పరిష్కరించలేని చిక్కుముడిగా పరిగణించాలనీ ఆయన కోరుకోడు. మానవాళి దేవుడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే, మనిషి ముందుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోగలడు మరియు దేవుని మార్గదర్శకత్వాన్ని అంగీకరించగలడు మరియు ఇలాంటి మానవాళి మాత్రమే దేవుని ఆధిపత్యం క్రింద నిజంగా జీవించగలదు మరియు వెలుగులో, దేవుని ఆశీర్వాదాల నడుమ జీవించగలదు.

దేవుడు మన ఎదుట ఉంచిన మరియు బహిర్గతము చేసిన వాక్యములు మరియు స్వభావము ఆయన చిత్తాన్ని సూచిస్తాయి మరియు అవి ఆయన గుణగణాలను కూడా సూచిస్తాయి. దేవుడు మనిషితో వ్యవహరిస్తున్నప్పుడు, ఆయన ఏమి చెప్పినా లేదా చేసినా లేదా ఆయన బహిర్గతము చేసిన స్వభావము ఏదైనప్పటికీ మరియు మనిషి చూసే దేవుని గుణగణాలు మరియు ఆయన వద్ద ఉన్నది మరియు అసలు ఆయనంటే ఏమిటనేవి ఏవైనప్పటికీ, అవన్నీ మనిషి పట్ల దేవుని చిత్తాన్ని సూచిస్తాయి. మనిషి ఎంత తెలుసుకోగలిగినా, అవగాహన చేసుకోగలిగినా లేదా అర్థం చేసుకోగలిగినా, అదంతా దేవుని చిత్తాన్ని, అంటే, మనిషి పట్ల దేవుని చిత్తాన్ని సూచిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, వారు ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, వారు ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు మరియు వారు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనేవే మానవాళి పట్ల దేవుని చిత్తం. ఈ విషయాలు దేవుని గుణగణాల నుండి విడదీయగలిగినవా? మరో మాటలో చెప్పాలంటే, మనిషి ఏమి చేయాలో దేవుడు కోరుకుంటున్న అదే సమయంలోనే, ఆయన తన స్వభావాన్ని మరియు ఆయనకు ఉన్నవన్నీ మరియు ఆయన ఏమిటో మనిషి ఎదుట ఉంచుతాడు. ఇందులో ఎలాంటి తప్పులేదు, నటన లేదు, దాపరికం లేదు మరియు ఆడంబరం లేదు. అయినా, మనిషి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, మరియు మనిషి దేవుని స్వభావాన్ని ఎందుకు స్పష్టంగా గ్రహించలేకపోయాడు? మనిషి దేవుని చిత్తాన్ని ఎప్పుడూ ఎందుకు తెలుసుకోలేదు? దేవుడు బయలుపరిచినది మరియు ఎదుట ఉంచినది స్వయంగా దేవుడి వద్ద ఉన్నది మరియు అసలు ఆయనంటే ఏమిటి అనే విషయాలే; ఇది ఆయన నిజమైన స్వభావపు ప్రతి రేణువు మరియు లక్షణం-మరి వీటిని మనిషి ఎందుకు చూడలేడు? మనిషి పూర్తి జ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. అయితే, ఆ కారణం ఏమిటి? సృష్టి జరిగినప్పటి నుండి, మనిషి దేవుడిని దేవుడుగా చూడలేదు. తొలినాళ్లలో, మనిషికి సంబంధించి దేవుడు ఏమి చేసినా-అంటే అప్పుడే సృష్టించబడిన మనిషికి-మనిషి దేవుడిని ఒక సహచరుడి కంటే మించి చూడలేదు, ఆధారపడదగిన ఎవరైనా ఒక వ్యక్తిగా చూడలేదు మరియు మనిషికి దేవుని గురించి జ్ఞానం లేదా అవగాహన లేదు. అంటే, మనిషి-తాను ఆధారపడిన మరియు తన సహచరుడిగా చూసిన-ఈ వ్యక్తి బయలుపరిచినది, దేవుని గుణగణాలే అని మనిషికి తెలియదు లేదా ఈ వ్యక్తే సమస్త సృష్టికి పాలకుడని అతనికి తెలియదని చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ కాలపు ప్రజలు దేవుడిని అస్సలు గుర్తించలేదు. భూమ్యాకాశములు మరియు సమస్తాన్ని ఆయనే సృష్టించాడని వారికి తెలియదు మరియు ఆయన ఎక్కడినుండి వచ్చాడో, అంతేకాకుండా, ఆయన ఎవరో వారికి తెలియదు. వాస్తవానికి, తన గురించి మనిషి తెలుసుకోవాలని లేదా అవగాహన చేసుకోవాలని లేదా తాను చేసినదంతా మనిషి అర్థం చేసుకోవాలని లేదా తన చిత్తం గురించి మనిషి తెలుసుకోవాలని దేవుడు అప్పుడు కోరుకోలేదు, ఎందుకంటే అవి మానవజాతి సృష్టి తర్వాత ప్రారంభ దినాలు. దేవుడు ధర్మశాస్త్ర యుగపు కార్యము కోసం సన్నాహాలు ప్రారంభించినప్పుడు, దేవుడు మనిషికి కొన్ని పనులు చేశాడు మరియు దేవునికి పరిహారార్థ బలులు ఎలా ఇవ్వాలో మరియు ఎలా ఆరాధించాలో చెబుతూ మనిషి నుండి కొన్ని కోరుకోవడం కూడా ప్రారంభించాడు. అప్పుడే మనిషికి దేవుని గురించి కొన్ని సాధారణ ఆలోచనలు వచ్చాయి, మనిషికి దేవునికి మధ్య ఉన్న భేదం మరియు మానవాళిని సృష్టించింది దేవుడే అని అప్పుడే అతనికి తెలిసింది. దేవుడు దేవుడే, మనిషి మనిషే అని మనిషికి తెలిసినప్పుడు, అతనికి మరియు దేవునికి మధ్య కొంత దూరం ఏర్పడింది, అయినప్పటికీ మనిషి తన గురించి గొప్ప జ్ఞానం లేదా లోతైన అవగాహన కలిగి ఉండాలని దేవుడు కోరలేదు. ఆ విధంగా, దేవుడు తన కార్యపు వివిధ దశలు మరియు పరిస్థితులపై ఆధారపడి మనిషి చేయాల్సిన వివిధ పనులను కోరుతాడు. దీనిలో మీకు ఏమి కనిపిస్తుంది? దేవుని స్వభావములోని ఏ కోణాన్ని మీరు గ్రహిస్తారు? దేవుడు నిజమేనా? మనిషి నుండి దేవుడు కోరేవి సబబైనవేనా? దేవుడు మానవాళిని సృష్టించిన తరువాత తొలినాళ్లలో, దేవుడు ఇంకా మనిషిపై విజయపు మరియు పరిపూర్ణత కార్యాన్ని ఇంకా కొనసాగించనప్పుడు మరియు అతనికి చాలా వాక్యములు చెప్పనప్పుడు, ఆయన మనిషి నుండి చాలా తక్కువ కోరాడు. మనిషి ఏమి చేశాడు, ఎలా ప్రవర్తించాడనే దానితో సంబంధం లేకుండా-అతను దేవుడి పట్ల అపరాధము చేసే కొన్ని పనులు చేసినప్పటికీ- దేవుడు వాటన్నింటినీ క్షమించాడు మరియు పట్టించుకోలేదు. అలా ఎందుకంటే, మనిషికి ఆయన ఏమిచ్చాడో, మనిషి లోపల ఏముందో దేవుడికి తెలుసు, కాబట్టి, ఆయన మనిషి నుండి కోరుకోవాల్సిన వాటి ప్రమాణం ఆయనకు తెలుసు. అప్పట్లో ఆయన కోరుకున్న వాటి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన స్వభావము గొప్పది కాదనో లేదా ఆయన జ్ఞానం మరియు సర్వశక్తిమత్వం కేవలం ఒట్టి మాటలనో అర్థం కాదనేది దాని అర్థం. మనిషికి సంబంధించినంత వరకు, దేవుడి స్వభావాన్ని మరియు స్వయంగా దేవుడిని తెలుసుకోవడానికి ఒకే మార్గం ఉంది: దేవుని నిర్వహణ మరియు మానవాళి రక్షణకు సంబంధించిన కార్యపు దశలను అనుసరించడం మరియు దేవుడు మానవాళితో మాట్లాడే వాక్యములను అంగీకరించడం ద్వారా మాత్రమే ఇది చేయవచ్చు. దేవుడి వద్ద ఉన్నది మరియు అసలు దేవుడంటే ఏమిటో మనిషి తెలుసుకున్న తర్వాత మరియు దేవుని స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత, దేవుడు తన నిజ స్వరూపాన్ని అతనికి చూపించమని మనిషి ఇంకా అడుగుతాడా? లేదు, మనిషి అడగడు, అడిగే సాహసం కూడా చేయడు, ఎందుకంటే దేవుని స్వభావాన్ని, ఆయన వద్ద ఉన్నది మరియు అసలు ఆయనంటే ఏమిటో అర్థం చేసుకోవడం వలన, మనిషి ఇప్పటికే స్వయంగా దేవుడిని, ఆయన నిజ స్వరూపాన్ని చూశాడు. ఇది తప్పించుకోలేని ఫలితం.

దేవుని కార్యము మరియు ప్రణాళిక ఆగకుండా ముందుకు సాగుతున్నప్పుడు, దేవుడు మనిషితో ఇంద్రధనస్సు ఒడంబడిక ఏర్పాటు తర్వాత, జలప్రళయాలతో ప్రపంచాన్ని ఆయన మరెప్పుడూ నాశనం చేయడనే దానికి సంకేతంగా, ఆయనతో ఒకే మనస్సుతో ఉండగలిగిన వారిని పొందాలనే బలమైన కోరిక దేవుడిలో పెరిగింది. అలాగే, భూమిపై తన చిత్తాన్ని నెరవేర్చగలిగే వారిని పొందాలనీ, అంతేకాకుండా అంధకార శక్తులు నుండి విముక్తులు కాగలిగే మరియు సాతానుచే బంధీ కాకుండా ఉండగలిగే వ్యక్తుల సమూహాన్ని, భూమిపై ఆయనకు సాక్ష్యమివ్వగల సమూహాన్ని పొందాలని కూడా ఆయనకు ఎప్పుడూ లేనంత మరింత అత్యవసర కోరిక కలిగింది. అలాంటి వ్యక్తుల సమూహాన్ని పొందాలనేది దేవుడి చిరకాల కోరిక, దానికోసం ఆయన సృష్టి కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి దేవుడు జల ప్రళయాలను ఉపయోగించడంతో లేదా మనిషితో ఆయన ఏర్పాటు చేసుకున్న ఒడంబడికతో సంబంధం లేకుండా, దేవుని చిత్తం, మనోస్థితి, ప్రణాళిక మరియు ఆశలు అన్నీ అలాగే ఉండిపోయాయి. ఆయన సృష్టి కాలం కంటే చాలాకాలం ముందు నుండి కోరుకున్నది, మానవజాతిలో ఆయన పొందాలనుకునే వారిని పొందడం-ఆయన స్వభావాన్ని అవగాహన చేసుకోగల, తెలుసుకోగల మరియు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోగల వ్యక్తుల సమూహాన్ని, ఆయనను ఆరాధించగలిగే సమూహాన్ని పొందడమే. అలాంటి వ్యక్తుల సమూహమే నిజంగా ఆయనకు సాక్ష్యమివ్వగలదు మరియు అలాంటి వారే ఆయనకు విశ్వాసపాత్రులుగా ఉంటారని చెప్పవచ్చు.

ఈరోజు, చాలాకాలం నుండి “సీలువేసి మూసివేయబడి ఉన్న” దేవుని ఆలోచనలు మరియు అభిప్రాయాలు మరియు దేవునికి సంబంధించిన వివిధ వివరాలన్నింటిని వెలికితీయగలిగేలా, మనం దేవుని అడుగుజాడలను తిరిగి కనుగొనడం మరియు ఆయన కార్యపు దశలను అనుసరించడం కొనసాగిద్దాం. వీటి ద్వారా మనం దేవుడి స్వభావాన్ని తెలుసుకుంటాము, దేవుని గుణగణాలను అర్థం చేసుకుంటాము, మన హృదయాలలోకి దేవుడిని అనుమతిస్తాము మరియు మనలో ప్రతి ఒక్కరూ దేవుడి నుండి మన దూరాన్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా దేవునికి దగ్గరవుతాము.

మనం ఇంతకుముందు మాట్లాడిన దానిలో కొంత భాగం దేవుడు మనిషితో ఎందుకు ఒడంబడికను ఏర్పరచుకున్నాడు అనే దాని గురించి ఉంది. ఈసారి, కింది పవిత్ర గ్రంథంలోని గధ్యభాగాలను గురించి మనం సాంగత్యము చేస్తాము. పవిత్ర గ్రంథం లోనివి చదవడంతో ప్రారంభిద్దాం.

ఎ. అబ్రాహాము

1. అబ్రాహాముకు ఒక కుమారుడిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు

ఆదికాండము 17:15-17 మరియు దేవుడు నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.

ఆదికాండము 17:21-22 అయితే వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.

2. అబ్రాహాము ఇస్సాకును అర్పిస్తాడు

ఆదికాండము 22:2-3 అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

ఆదికాండము 22:9-10 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనెను.

దేవుడు చేయాలని నిర్ణయించుకున్న కార్యాన్ని ఎవరూ ఆపలేరు

కాబట్టి, మీరందరూ ఇప్పుడే అబ్రాహాము కథను విన్నారు. జలప్రళయం ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాత అతను దేవునిచే ఎంచుకోబడ్డాడు, అతని పేరు అబ్రాహాము, మరియు అతనికి వంద సంవత్సరాలు మరియు అతని భార్య సారాకు తొంభై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు అతనికి ఏ వాగ్దానం చేశాడు? దేవుడు వాగ్దానం చేసింది పవిత్ర గ్రంథంలో ప్రస్తావించబడింది: “నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను.” అతనికి కుమారుడిని ఇస్తాననే దేవుడి వాగ్దానానికి నేపథ్యం ఏమిటి? పవిత్ర గ్రంథం ఈ కింది వృత్తాంతాన్ని ఇస్తుంది: “అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను” మరో మాటలో చెప్పాలంటే, పిల్లలను కనడానికి ఈ వృద్ధ జంటకు అప్పటికే వయసు మీరి పోయింది. అబ్రాహాముకు దేవుడు తన వాగ్దానం చేసిన తర్వాత అతను ఏమి చేశాడు? “అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను” అది అసాధ్యమని అబ్రహాము నమ్మాడు-అంటే తనకు దేవుడు చేసిన వాగ్దానం ఒక పరిహాసానికి మించి మరేమీ కాదని అతను నమ్మాడు. మనిషి దృష్టికోణంలో, అది మనిషి సాధించగలిగేది కాదు మరియు అదే విధంగా అది దేవుడు కూడా సాధించగలిగేది కాదు మరియు అసాధ్యమైనది. బహుశా, అబ్రాహాముకు అది నవ్వుకోదగినది: దేవుడు మనిషిని సృష్టించాడు, అయినా ఇంత వయస్సున్న వ్యక్తి పిల్లలను కనలేడని ఆయనకు ఎందుకో తెలియనట్లు అనిపిస్తుంది; దేవుడు నేను బిడ్డను కనేలా చేయగలడని అనుకుంటున్నాడు, ఆయన నాకు ఒక కుమారిడిని ఇస్తానని అంటున్నాడు-ఖచ్చితంగా అది అసాధ్యం! కాబట్టి, అబ్రాహాము తన పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు, తనలో తాను ఇలా అనుకున్నాడు: అసాధ్యం—దేవుడు నాతో పరిహాసం చేస్తున్నాడు, ఇది నిజమయ్యే వీలులేదు! అతడు దేవుని మాటలను తీవ్రంగా తీసుకోలేదు. అయితే, దేవుని దృష్టిలో, అబ్రాహాము ఎలాంటి మనిషి? (నీతిమంతుడు.) అతను నీతిమంతుడైన మనిషని ఎక్కడ పేర్కొనబడింది? దేవుడు ఏదైనా చేయాల్సిందిగా ఎవరిని కోరుతాడో వారంతా నీతిమంతులనీ, పరిపూర్ణులనీ, వారంతా దేవునితో నడిచే వ్యక్తులనీ మీరు అనుకుంటున్నారు. మీరు సిద్ధాంతానికి కట్టుబడతారు! దేవుడు ఎవరినైనా నిర్వచించినప్పుడు, ఆయన ఏకపక్షంగా అలా చేయడని మీరు తప్పక స్పష్టంగా చూడాలి. ఇక్కడ, అబ్రాహాము నీతిమంతుడని దేవుడు అనలేదు. దేవుని హృదయంలో, ప్రతి వ్యక్తిని కొలవడానికి ప్రమాణాలు ఉన్నాయి. అబ్రాహాము ఎలాంటి వ్యక్తో దేవుడు చెప్పనప్పటికీ, అతని ప్రవర్తనపరంగా, దేవునిపై అబ్రాహాముకు ఎలాంటి విశ్వాసం ఉంది? ఇది కాస్త అమూర్తంగా ఉందా? లేదా అతను గొప్ప విశ్వాసంతో ఉన్నాడా? లేదు, అతను అలా లేడు! అతని నవ్వు మరియు ఆలోచనలు అతనేమిటో చూపించాయి, కాబట్టి అతను నీతిమంతుడని మీరు అనుకోవడం మీ ఊహలోని కల్పన మాత్రమే, ఇది సిద్ధాంతాన్ని గుడ్డిగా వర్తింపజేయడమే మరియు ఇది బాధ్యతారహితమైన మదింపు. అబ్రాహాము నవ్వును, అతని కొద్దిపాటి వ్యక్తీకరణలను దేవుడు చూశాడా? ఆయనకు వాటి గురించి తెలుసా? దేవునికి తెలుసు. అయితే, తాను చేయాలని నిర్ణయించుకున్న దానిని దేవుడు మార్చుకుంటాడా? లేదు! దేవుడు ఈ మనిషిని ఎంచుకోవాలని యోచించి, నిర్ణయించినప్పుడు, అది పూర్తిచేయబడిందనే అనుకోవచ్చు. మనిషి ఆలోచనలు లేదా అతని ప్రవర్తన దేవునిపై కొద్దిగా కూడా ప్రభావం చూపవు లేదా అవరోధం కలిగించవు; దేవుడు ఏకపక్షంగా ఆయన ప్రణాళికను మార్చుకోడు లేదా మనిషి ప్రవర్తన కారణంగా, ఆ ప్రవర్తన అజ్ఞానంతో కూడినదైనప్పటికీ, ఆయన తన ప్రణాళికను అకస్మాత్తుగా మార్చుకోడు లేదా తారుమారు చేయడు. అయితే, ఆదికాండము 17:21-22లో రాసినది ఏమిటి? “అయితే వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.” అబ్రాహాము ఏమనుకున్నాడు లేదా అన్నాడు అనేదాన్ని దేవుడు కొద్దిగా కూడా పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే, ఆ సమయంలో, మనిషి గొప్ప విశ్వాసంతో ఉండాలనీ లేదా అతను దేవుని గురించి గొప్ప జ్ఞానం పొందగలిగేలా ఉండాలనీ, అంతేకాకుండా, దేవుడు చేసినది మరియు చెప్పినది అర్థం చేసుకోగలిగేలా ఉండాలనీ దేవుడు కోరలేదు. ఆవిధంగా, మనిషి స్థాయి తగినంతగా అసలు లేదు కాబట్టి, ఆయన చేయాలని నిర్ణయించుకున్న దానిని, ఆయన ఎంచుకోవాలని నిర్ణయించుకున్న వ్యక్తులను లేదా ఆయన చర్యల నియమాలను మనిషి పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన కోరలేదు. ఆ సమయంలో, అబ్రాహాము ఏమి చేసినా, అతను ఎలా ప్రవర్తించినా దేవుడు దానిని మామూలు విషయంగానే భావించాడు. ఆయన ఖండించకుండా లేదా మందలించకుండా, కేవలం ఇలా మాత్రమే అన్నాడు: “వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.” దేవుడికి సంబంధించినంత వరకు, ఆయన ఈ మాటలు ప్రకటించిన తర్వాత, ఈ విషయం అంచెలంచెలుగా నిజమైంది; దేవుని దృష్టిలో, ఆయన ప్రణాళిక ద్వారా నెరవేర్చవలసినది అప్పటికే సాధించబడింది. దీని కోసం ఏర్పాట్లు పూర్తైన తర్వాత, దేవుడు వెళ్లిపోయాడు. మనిషి చేసేది లేదా ఆలోచించేది, మనిషి అర్థం చేసుకున్నది, మనిషి ప్రణాళికలు-వీటన్నింటికీ దేవుడితో ఎలాంటి సంబంధం లేదు. దేవుడు నిర్ణయించిన సమయాలు మరియు దశలకు అనుగుణంగా, ప్రతి ఒక్కటీ దేవుని ప్రణాళిక ప్రకారం కొనసాగుతుంది. దేవుని కార్యపు నియమం అలాంటిది. మనిషి అనుకునేది లేదా మనిషికి తెలిసినది ఏదైనప్పటికీ, దానిలో దేవుడు జోక్యం చేసుకోడు, అయినప్పటికీ మనిషి నమ్మలేదు లేదా అర్థం చేసుకోలేదు కాబట్టి, ఆయన తన ప్రణాళికను విస్మరించడు లేదా తన కార్యాన్ని విడిచిపెట్టడు. ఈవిధంగా వాస్తవాలు దేవుని ప్రణాళిక మరియు ఆలోచనల ప్రకారం పూర్తిచేయబడతాయి. మనకు బైబిల్‌లో కనిపించేది ఖచ్చితంగా ఇదే: దేవుడు తాను నిర్ణయించిన సమయానికే ఇస్సాకును పుట్టించాడు. మనిషి ప్రవర్తన మరియు నడవడిక దేవుని కార్యాన్ని ఆటంకపరిచాయని ఈ వాస్తవాలు రుజువు చేస్తాయా? అవి దేవుని కార్యాన్ని ఆటంకపర్చలేదు. దేవునిపై మనిషికున్న కొద్ది విశ్వాసం మరియు దేవుని గురించి అతని ఆలోచనలు మరియు ఊహలు దేవుని కార్యాన్ని ప్రభావితం చేశాయా? లేదు, అవి ప్రభావితం చేయలేదు! ఏమాత్రం కూడా! దేవుని నిర్వహణ ప్రణాళిక ఏ మనిషి, పదార్థం లేదా పర్యావరణం చేత ప్రభావితం కాదు. ఆయన చేయాలని నిర్ణయించుకున్నవన్నీ సరైన సమయానికి మరియు ఆయన ప్రణాళిక ప్రకారం పూర్తి చేయబడతాయి, నెరవేర్చబడతాయి మరియు ఆయన కార్యానికి ఏ మనిషి అవరోధం కలిగించలేడు. మనిషి మూర్ఖత్వం మరియు అజ్ఞానంలోని కొన్ని అంశాలను మరియు ఆయన పట్ల మనిషి ప్రతిఘటన మరియు ఆలోచనల కొన్ని అంశాలను కూడా దేవుడు పట్టించుకోడు మరియు ఆయన తప్పక చేయవలసిన కార్యాన్ని ఏదిఏమైనా చేస్తాడు. ఇదే దేవుని స్వభావం మరియు ఇది ఆయన సర్వశక్తిమంతానికి ప్రతిబింబం.

ఇస్సాకును అబ్రాహాము బలి ఇవ్వడంతో దేవుని మానవాళి నిర్వహణ మరియు రక్షణ కార్యము ప్రారంభమవుతుంది

అబ్రాహాముకు కుమారుడిని ఇచ్చిన తరువాత, దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలు నెరవేర్చబడ్డాయి. దీనర్థం, దేవుని ప్రణాళిక ఇక్కడితో ఆగిపోయిందని కాదు; దీనికి విరుద్ధంగా, మానవాళి నిర్వహణ మరియు రక్షణ కోసం దేవుని బ్రహ్మాండమైన ప్రణాళిక ఇప్పుడే ప్రారంభమైంది మరియు అబ్రహాముకు కుమారుడిని ప్రసాదించడం అనేది ఆయన మొత్తం నిర్వహణ ప్రణాళికకు నాంది మాత్రమే. ఇస్సాకును అబ్రాహాము బలి ఇచ్చిన ఆ క్షణంలోనే సాతానుతో దేవుని యుద్ధం నిశ్శబ్దంగా ప్రారంభమైందని ఆ సమయంలో ఎవరికి తెలుసు?

మనిషి మూర్ఖుడైనప్పటికీ దేవుడు పట్టించుకోడు-ఆ మనిషి నిజమైనవాడుగా ఉండాలని మాత్రమే కోరుతాడు

తర్వాత, అబ్రాహాముకు దేవుడు ఏమి చేశాడో చూద్దాం. ఆదికాండము 22:2లో, దేవుడు అబ్రాహాముకు ఈ కింది ఆజ్ఞ ఇచ్చాడు: “అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.” దేవుని ఉద్దేశం స్పష్టంగా ఉంది: తాను ప్రేమించిన తన ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును దహనబలిగా ఇవ్వమని అబ్రాహాముతో ఆయన చెబుతున్నాడు. దానిని ఈ రోజు చూస్తే, దేవుని ఆజ్ఞ ఇప్పటికీ మనిషి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉందా? అవును! ఆ సమయంలో దేవుడు చేసినదంతా మనిషి ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది; అది మనిషికి అర్థంకాదు. వారి ఆలోచనలలో, ప్రజలు ఈ కింది దానిని విశ్వసిస్తారు: ఒక మనిషి నమ్మనప్పుడు, అది అసాధ్యమని అనుకున్నప్పుడు, దేవుడు అతనికి ఒక కుమారుడిని ఇచ్చాడు మరియు అతను కుమారుడిని పొందిన తరువాత, దేవుడు అతని కుమారుడిని బలి ఇవ్వమని కోరాడు. ఇది అస్సలు నమ్మలేనిది కాదా? అసలు దేవుడు ఏమి చేయాలనుకున్నాడు? దేవుడి అసలు ఉద్దేశం ఏమిటి? ఆయన బేషరతుగా అబ్రాహాముకు ఒక కుమారుడిని ఇచ్చాడు, అయినప్పటికీ ఆయన అబ్రహామును బేషరతుగా అర్పించమని కోరాడు. ఇది అతిగా ఉందా? మూడవ పక్షం దృష్టిలో, ఇది అతిగా ఉండటం మాత్రమే కాదు, కొంతవరకు “నిష్కారణంగా ఇబ్బంది పెట్టడం” కూడా. అయితే దేవుడు మరీ ఎక్కువ అడుగుతున్నాడని స్వయంగా అబ్రాహామే నమ్మలేదు. అతనికి దాన్ని గురించి కొన్ని చిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, అతనికి దేవుడిపై కొంచెం అనుమానం కలిగినప్పటికీ, అతను అర్పించడానికి సిద్ధం అయ్యాడు. ఈ సమయంలో, అబ్రాహాము తన కుమారుడిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని రుజువు చేయడానికి మీకు కనిపించేదేమిటి? ఈ వాక్యములలో ఏమి చెప్పబడుతున్నది? మూల వచనం ఈ కింది వృత్తాంతాలను అందిస్తుంది: “తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను” (ఆదికాండము 22:3). “ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనెను” (ఆదికాండము 22:9-10). అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడు, అతని చర్యలను దేవుడు చూశాడా? వాటిని చూశాడు. మొత్తం ప్రక్రియ-ప్రారంభం నుండి, దేవుడు ఇస్సాకును అర్పించమని అబ్రాహామును అడిగినప్పటి నుండి, అబ్రాహాము తన కుమారుడిని వధించడానికి తన కత్తిని పైకి లేపడం వరకు-అబ్రహాము మనస్సును దేవుడికి చూపించింది మరియు అతని గత మూర్ఖత్వం, అజ్ఞానం మరియు దేవుడిని అపార్థం చేసుకోవడంతో సంబంధం లేకుండా, ఆ సమయంలో దేవుని పట్ల అబ్రాహాము మనస్సు నిజంగా మరియు నిజాయితీగా ఉంది మరియు అతను నిజంగా దేవుడు అతనికి ఇచ్చిన కుమారుడైన ఇస్సాకును తిరిగి దేవుడికి ఇవ్వబోయాడు. అతనిలో, దేవుడు విధేయతను, తాను సరిగ్గా కోరుకున్న విధేయతనే చూశాడు.

మనిషికి దేవుడు ఎంతో చేశాడు, అది అర్థం చేసుకోలేని మరియు నమ్మదగినది కూడా కాదు. దేవుడు ఎవరికైనా ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, ఆ ఏర్పాటు తరచూ మనిషి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది మరియు అతడు దానిని అర్థం చేసుకోలేడు, కానీ ఈ వైరుధ్యం మరియు అర్థం చేసుకోలేకపోవడం అనేవి ఖచ్చితంగా మానవునికి దేవుడు చేసే విచారణ మరియు పరీక్షలే. అదే సమయంలో, అబ్రాహాము తన లోలోపల దేవుడికి విధేయతను ప్రదర్శించగలిగాడు, దేవుడి కోరికను తీర్చగలగడానికి ఇదే అత్యంత ప్రాథమిక షరతు. ఆ తర్వాత మాత్రమే, అంటే దేవుడి కోరికను అబ్రాహాము తీర్చగలిగినప్పుడు, అతడు ఇస్సాకును అర్పించినప్పుడు మాత్రమే, మానవాళి పట్ల తాను ఎంచుకున్న అబ్రాహాము పట్ల దేవుడు నిజంగా భరోసా మరియు ఆమోదం పొందినట్లు భావించాడు. అప్పుడే, తాను ఎంచుకున్న ఈ వ్యక్తే తన వాగ్దానాన్ని మరియు తన తదుపరి నిర్వహణ ప్రణాళికను చేపట్టగల ఒక తిరుగులేని నాయకుడని దేవుడు నిర్ణయానికి వచ్చాడు. ఇది ఒక విచారణ మరియు పరీక్షే అయినప్పటికీ, దేవుడు తృప్తి చెందినట్లు భావించాడు, తన పట్ల మనిషికున్న ప్రేమను ఆయన అనుభూతి చెందాడు మరియు మునుపెన్నడూ లేని విధంగా ఆయన మనిషి ద్వారా ఊరట పొందాడు. ఇస్సాకును వధించడానికి అబ్రాహాము తన కత్తిని ఎత్తిన క్షణంలో, దేవుడు అతనిని అపాడా? దేవుడు అబ్రాహాము ఇస్సాకును అర్పించనివ్వలేదు, ఎందుకంటే ఇస్సాకు ప్రాణం తీయాలనే ఉద్దేశం దేవునికి అసలే మాత్రం లేదు. కాబట్టి, దేవుడు అబ్రాహామును సరైన సమయంలో ఆపేశాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో, అబ్రాహాము విధేయత అప్పటికే పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది, అతను చేసింది సరిపోయింది మరియు దేవుడు తాను చేయాలనుకున్నదాని ఫలితాన్ని అప్పటికే చూశాడు. ఈ ఫలితం దేవుడిని సంతృప్తి పరిచిందా? ఈ ఫలితం దేవునికి సంతృప్తికరంగా ఉందని, దేవుడు కోరుకున్నదేనని మరియు దేవుడు చూడాలని తపించిందేనని చెప్పవచ్చు. ఇది నిజమేనా? వివిధ సందర్భాలలో, ప్రతి వ్యక్తిని పరీక్షించడానికి దేవుడు వివిధ మార్గాలను ఉపయోగించినప్పటికీ, అబ్రాహాములో దేవుడికి ఏమి కావాలో ఆయన చూశాడు, అబ్రాహాము హృదయం నిజమైనదనీ మరియు అతని విధేయత బేషరతుగా ఉందనీ ఆయన చూశాడు. ఖచ్చితంగా ఈ “బేషరతునే” దేవుడు కోరుకున్నాడు. ప్రజలు తరచూ, “నేను ఇప్పటికే దీనిని అర్పించాను, నేను ఇప్పటికే దానిని పరిత్యజించాను-అయినా దేవుడు నా పట్ల ఎందుకు సంతృప్తి చెందలేదు? అని అంటారు. ఎందుకు ఆయన నన్ను పరీక్షలకు గురిచేస్తూనే ఉన్నాడు? ఎందుకు ఆయన నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు? ఇది ఒక వాస్తవాన్ని కళ్లముందు ఉంచుతుంది: దేవుడు నీ హృదయాన్ని చూడలేదు మరియు నీ హృదయాన్ని పొందలేదు. అంటే, అబ్రాహాము తన కుమారుడిని తన చేత్తో వధించి దేవునికి అర్పించగలిగినంత నిజాయితీని నీలో ఆయన చూడలేదు. ఆయన నీలో బేషరతుగా ఉండే విధేయతను చూడలేదు మరియు నీ ద్వారా ఊరట పొందలేదు. కాబట్టి, దేవుడు నిన్ను ప్రయత్నిస్తూ ఉండడం సహజం. ఇది నిజం కాదా? ఈ విషయానికి సంబంధించినంత వరకు, మనం దీనిని ఇక్కడే వదిలివేస్తాము. తర్వాత, “అబ్రాహాముకు దేవుడి వాగ్దానము” చదువుతాము.

3. అబ్రాహాముకు దేవుడి వాగ్దానము

ఆదికాండము 22:16-18 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున, నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను: నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.

ఇది అబ్రాహాముకు దేవుడి ఆశీర్వాదానికి సంపూర్ణ వివరణ. ఇది సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, దీనిలోని విషయం చాలా గొప్పది: ఇందులో అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన బహుమతికి గల కారణం మరియు దాని నేపథ్యం మరియు ఆయన అబ్రాహాముకు ఏమి ఇచ్చాడు అనేవి ఉన్నాయి. దేవుడు ఈ మాటలను పలకడంలో ఉన్న ఆనందం మరియు ఉత్సాహంతో పాటు, తన మాటలను వినగలిగే వారిని పొందాలనే ఆయన తపన కూడా ఇందులో నిండి ఉంది. ఇందులో, ఆయన మాటల పట్ల విధేయత చూపే, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారి పట్ల దేవుని ఆప్యాయత మరియు మమకారాన్ని మనం చూస్తాము. అంతేగాకుండా, ప్రజలను పొందడానికి ఆయన చెల్లించే మూల్యాన్ని మరియు వారిని పొందడం కోసం ఆయన చూపే శ్రద్ధ మరియు చేసే ఆలోచనను మనం కూడా చూస్తాము. అలాగే, “నాతోడని ప్రమాణము చేసియున్నాను” అనే పదాలు ఉన్న ఈ గద్యభాగం, ఆయన నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన ఈ కార్యపు తెర వెనుక దేవుడు మరియు ఆయన ఒక్కడే భరించే చేదు మరియు బాధలను తెలిపే శక్తివంతమైన అనుభూతిని కూడా ఇస్తుంది. ఇది ఆలోచన రేకెత్తించే గద్యభాగం, తరువాతి తరం వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు వారిపై విస్తృత ప్రభావాన్ని చూపింది.

మనిషి అతని చిత్తశుద్ధి మరియు విధేయత కారణంగా దేవుని ఆశీర్వాదాలను పొందుతాడు

మనం ఇక్కడ చదివిన అబ్రహాముకు దేవుడి ఆశీర్వాదం గొప్పగా ఉండిందా? ఇది ఎంత గొప్పగా ఉండింది? ఇక్కడ ఒక కీలక వాక్యం ఉంది: “మరియు భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” అబ్రాహాముకు ముందు లేదా తరువాత వచ్చిన ఎవరికీ ఇవ్వని ఆశీర్వాదాలను పొందాడని ఈ వాక్యం చూపుతుంది. దేవుడు అడిగినట్లుగా, అబ్రాహాము తన ఒక్కగానొక్క కుమారుడిని-తన ప్రియమైన ఏకైక కుమారుడిని-దేవునికి తిరిగి ఇచ్చినప్పుడు (గమనిక: ఇక్కడ మనం “అర్పించడం” అనే పదాన్ని ఉపయోగించలేము; అతను తన కుమారుడిని దేవునికి తిరిగి ఇచ్చాడని మనం అనాలి), ఇస్సాకును అబ్రహాము అర్పించడాన్ని దేవుడు అనుమతించకపోవడమే కాకుండా, ఆయన అతనిని ఆశీర్వదించాడు కూడా. ఆయన అబ్రాహామును ఏ వాగ్దానంతో ఆశీర్వదించాడు? అతని సంతానాన్ని వృద్ధి చేస్తాననే వాగ్దానంతో ఆయన ఆశీర్వదించాడు. మరియు వారిలో ఎంతమందిని వృద్ధి చేయాల్సి ఉండింది? పవిత్ర గ్రంథాలు కింది వృత్తాంతాన్ని అందిస్తాయి: “ఆకాశ నక్షత్రములవలెను, సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” దేవుడు ఈ మాటలను ఏ సందర్భంలో పలికాడు? అంటే, దేవుని ఆశీర్వాదాలను అబ్రాహాము ఎలా పొందాడు? అతను పవిత్ర గ్రంథాల్లో దేవుడు చెప్పినట్లే వాటిని పొందాడు: “నీవు నా మాట వినినందున.” అంటే, అబ్రహాము దేవుని ఆజ్ఞను పాటించాడు కాబట్టి, దేవుడు చెప్పిన, కోరిన మరియు ఆజ్ఞాపించిన ప్రతిదాన్ని అతను చిన్నపాటి ఫిర్యాదు కూడా లేకుండా చేశాడు కాబట్టి, దేవుడు అతనికి అలాంటి వాగ్దానం చేశాడు. ఆ సమయంలో దేవుని ఆలోచనలను స్పృశించే ఒక కీలక వాక్యం ఈ వాగ్దానంలో ఉంది. మీరు దాన్ని చూశారా? “నాతోడని ప్రమాణము చేసియున్నాను” అనే దేవుని మాటలను మీరు పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. వాటి అర్థం ఏమిటంటే, దేవుడు ఈ మాటలు పలికినప్పుడు, ఆయన తనపై తాను ప్రమాణం చేసుకుంటున్నాడు. మనష్యులు ప్రమాణం చేసినప్పుడు ఏమి ఒట్టు వేసుకుంటారు? వారు పరలోకంపై ప్రమాణం చేస్తారు, అంటే వారు దేవుని మీద ఒట్టు వేస్తారు మరియు దేవునిపై ప్రమాణం చేస్తారు. దేవుడు తనపై తాను ప్రమాణం చేసే దృగ్విషయం గురించి ప్రజలకు అంత ఎక్కువ అవగాహన లేకపోవచ్చు, కానీ నేను మీకు సరైన వివరణ ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆయన మాటలను మాత్రమే వినగలిగినప్పటికీ, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి ఎదురవ్వడం వల్ల, దేవుడు మరోసారి ఒంటరిగా మరియు కోల్పోయినట్లు భావించాడు. నిరాశలో-మరియు, ఉపచేతనంగా అని కూడా చెప్పవచ్చు-దేవుడు చాలా సహజమైన ఒక పని చేశాడు: అబ్రాహాముకు ఈ వాగ్దానం చేసేటప్పుడు దేవుడు తన గుండె మీద తన చేతిని వేసి, తనతో తాను సంభాషించాడు మరియు ఇలా చేయడంతో ఈ వ్యక్తికి “నాతోడని ప్రమాణము చేసియున్నాను” అని దేవుడు చెప్పడం వినిపించింది. దేవుని చర్యల ద్వారా, నీకు నీవే ఆలోచించవచ్చు. నీవు నీ గుండె మీద చేతిని వేసి, నీతో నీవే సంభాషించినప్పుడు, నీవు ఏమి చెబుతున్నావో నీకు ఒక స్పష్టమైన ఆలోచన ఉందా? నీ వైఖరిలో నిజాయితీ ఉందా? నీవు నీ హృదయంతో నిష్కపటంగా మాట్లాడుతావా? ఆవిధంగా, దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు, ఆయన మనస్ఫూర్తిగా మరియు చిత్తశుద్ధితో ఉండినట్లు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అబ్రాహాముతో మాట్లాడుతూ మరియు ఆశీర్వదిస్తూ ఉన్న అదే సమయంలో, దేవుడు తనతో తాను కూడా మాట్లాడుతున్నాడు. ఆయన తనకు తాను చెప్పుకుంటున్నాడు: నేను అబ్రాహామును ఆశీర్వదిస్తాను, మరియు అతని సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాలు మరియు సముద్రపు ఒడ్డున ఇసుక లాగా సమృద్ధం చేస్తాను, ఎందుకంటే అతను నా మాటలను పాటించాడు మరియు నేను ఎంచుకున్న వ్యక్తి అతనే. దేవుడు “నాతోడని ప్రమాణము చేసియున్నాను” అని చెప్పినప్పుడు, ఆయన అబ్రాహాము నుండి ఎంచుకున్న ఇశ్రాయేలు ప్రజలను పుట్టిస్తానని, ఆతర్వాత ఆయన కార్యముతోపాటుగా అతను ఈ ప్రజలను ముందుకు నడిపిస్తాడని దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే, దేవుని నిర్వహణ కార్యాన్ని అబ్రాహాము సంతతి మోసేలా దేవుడే చేస్తాడు మరియు దేవుని కార్యము మరియు దేవుడు చెప్పినది అబ్రాహాముతో మొదలై అబ్రాహాము సంతతిలో కొనసాగుతుంది, ఆవిధంగా మనిషిని రక్షించాలనే దేవుని కోరిక నెరవేరుతుంది. మీరు ఏమంటారు, ఇది ఒక ఆశీర్వదించబడిన విషయం కాదా? మనిషికి అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు; ఇది అత్యంత ఆశీర్వదించబడిన విషయం అని చెప్పవచ్చు. అబ్రాహాము పొందిన ఆశీర్వాదం అతని సంతతి వృద్ధి కావడం కాదు, కానీ ఆయన నిర్వహణను, ఆయన అమలుపర్చడాన్ని మరియు ఆయన కార్యమును దేవుడు అబ్రాహాము సంతతిలో సాధించడం అయ్యాయి. అంటే అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు తాత్కాలికం కావు, కానీ దేవుని నిర్వహణ ప్రణాళిక ప్రగతితోపాటు కొనసాగాయి. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు తనపై తాను ప్రమాణం చేసినప్పుడు, ఆయన అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయ ప్రక్రియ నిజమైనదేనా? ఇది నిజమైనదేనా? అప్పటి నుండి, ఆయన ప్రయత్నాలు, ఆయన చెల్లించిన మూల్యం, ఆయన వద్ద ఉన్నవి మరియు ఆయనంటే ఏమిటో, ఆయన సమస్తం, ఆయన జీవం కూడా అబ్రాహాము మరియు అబ్రాహాము సంతతికి ఇవ్వబడుతుందని దేవుడు నిర్ణయించాడు. అలాగే, ఈ మనుష్యుల సమూహం నుండి ప్రారంభించి, ఆయన తన కార్యాలను వ్యక్తపరుస్తాడని మరియు ఆయన జ్ఞానం, అధికారం మరియు శక్తిని మనిషి చూసేలా చేస్తాడని దేవుడు నిర్ణయించాడు.

తన గురించి తెలిసిన మరియు తనకు సాక్ష్యం ఇవ్వగలిగే వారిని పొందడమే దేవుని స్థిరమైన కోరిక

దేవుడు తనతో తాను మాట్లాడే అదే సమయంలో, అబ్రాహాముతో కూడా మాట్లాడాడు, కానీ దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలను వినడం కాకుండా, దేవుని మాటలన్నింటిలోని ఆయన నిజమైన కోరికలను అబ్రహాము ఆ సమయంలో అర్థం చేసుకోగలిగాడా? అతను అర్థం చేసుకోలేదు! కాబట్టి, ఆ సమయంలో, దేవుడు తనపైతాను ప్రమాణం చేసినప్పుడు, ఆయన హృదయం ఇంకా ఒంటరిగా మరియు విచారంగా ఉంది. ఆయన అనుకున్న మరియు యోచించిన వాటిని అర్థం లేదా అవగాహన చేసుకోగలిగే వ్యక్తి ఇప్పటికీ ఒక్కడు కూడా లేడు. ఆ సమయంలో, ఆయన తప్పక చేయవలసిన కార్యము చేయడంలో ఆయనతో సహకరించే వారెవరైనా ఉండటం అటుంచి, అబ్రాహాముతో సహా ఆయనతో విశ్వాసంతో మాట్లాడగలిగేవారు ఎవ్వరూ లేరు. పైపైన చూసినప్పుడు, ఆయన మాటలను పాటించగలిగే అబ్రాహామును దేవుడు పొందాడు. కానీ వాస్తవానికి, దేవుని గురించి ఈ వ్యక్తికి జ్ఞానం అసలేమీ లేదు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినప్పటికీ, దేవుని హృదయం ఇప్పటికీ సంతృప్తిచెందలేదు. దేవుడు సంతృప్తి చెందలేదు అంటే అర్థం ఏమిటి? అంటే, ఆయన నిర్వహణ ఇప్పుడే ప్రారంభమైందని అర్థం, ఆయన పొందాలనుకున్న మనష్యులు, ఆయన చూడాలని తపించిన మనుష్యులు, ఆయన ప్రేమించిన మనుష్యులు ఇప్పటికీ ఆయనకు కనుచూపుమేరలో లేరని అర్థం; ఆయనకు సమయం అవసరమైంది, వేచి ఉండటం అవసరమైంది, సహనం వహించడం అవసరమైంది. ఆ సమయంలో, ఆయనకు అవసరమైనది లేదా ఆయన పొందాలనుకున్నది లేదా ఆయన తపించినది తెలిసిన వారు స్వయంగా దేవుడు తప్ప, ఒక్కరు కూడా లేరు. కాబట్టి, దేవుడు చాలా ఉత్సాహంగా ఉన్న అదే సమయంలో, దేవుడికి గుండె బరువెక్కినట్లు కూడా అనిపించింది. అయినప్పటికీ ఆయన ముందుకు అడుగులు వేయడం ఆపలేదు మరియు ఆయన తప్పక చేయవలసిన తదుపరి దశను గురించి యోచించడం కొనసాగించాడు.

అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానంలో మీకు ఏమి కనిపిస్తుంది? అబ్రాహాము దేవుని మాటలను కేవలం పాటించినందుకే దేవుడు అతనికి గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదించాడు. పైపైకి, ఇది సాధారణమైనదిగా మరియు క్రమంలో జరిగినదిగా కనిపించినప్పటికీ, ఇందులో మనకు దేవుని హృదయం కనిపిస్తుంది: దేవుడు ప్రత్యేకించి తన పట్ల మనిషి విధేయతను అమూల్యమైనదిగా భావిస్తాడు మరియు ఆయన పట్ల మనిషి అవగాహనను, ఆయన పట్ల చిత్తశుద్ధిని ఇష్టపడతాడు. ఈ చిత్తశుద్ధిని దేవుడు ఎంత ఇష్టపడతాడు? ఆయన దానిని ఎంత ఇష్టపడతాడో మీకు అర్థం కాకపోవచ్చు మరియు దీనిని తెలిసినవారు చాలావరకు ఎవరూ లేకపోవచ్చు. దేవుడు అబ్రాహాముకు ఒక కుమారుడిని ఇచ్చాడు, ఆ కుమారుడు పెరిగి పెద్దయ్యాక, ఆ కుమారుడిని దేవునికి అర్పించాల్సిందిగా అబ్రాహామును దేవుడు కోరాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞను తు.చ. తప్పకుండా పాటించాడు, అతను దేవుని మాటకు లోబడ్డాడు మరియు అతని చిత్తశుద్ధి దేవుడిని కదిలించింది మరియు దేవుడు దానిని అమూల్యమైనదిగా భావించాడు. దేవుడు దానిని ఎంత అమూల్యమైనదిగా భావించాడు? ఆయన దానిని ఎందుకు అమూల్యమైనదిగా భావించాడు? దేవుని మాటలను ఎవరూ అర్థం చేసుకోని లేదా ఆయన హృదయాన్ని అర్థం చేసుకోని సమయంలో, అబ్రాహాము ఆకాశాన్ని కదిలించిన మరియు భూమిని వణికించిన పని చేశాడు, అది దేవుడికి అపూర్వమైన సంతృప్తిని కలిగించింది మరియు ఆయన మాటలను పాటించగలిగే ఒక వ్యక్తిని పొందినందుకు దేవుడికి ఆనందం కలిగింది. ఈ సంతృప్తి మరియు ఆనందం దేవుడు తన చేతులతో సృష్టించిన జీవి నుండి కలిగాయి మరియు ఇది మనిషి దేవుడికి అర్పించిన మొదటి “బలి” మరియు మనిషిని సృష్టించినప్పటి నుండి దేవుడు అమూల్యంగా భావించినది ఇదే. దేవుడు ఈ బలి కోసం వేచి ఉండడానికి చాలా కష్టపడ్డాడు, తాను సృష్టించిన మనిషి నుండి మొదటి అత్యంత ముఖ్యమైన బహుమతిగా ఆయన దీనిని భావించాడు. ఇది దేవునికి ఆయన ప్రయత్నాలకు, ఆయన చెల్లించిన మూల్యానికి మొదటి ఫలాన్ని చూపింది మరియు ఇది మానవాళి పట్ల ఒక ఆశను కలిగించింది. ఆతర్వాత, ఆయనకు తోడుగా ఉండటానికి, ఆయన పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడానికి, ఆయన పట్ల చిత్తశుద్ధితో శ్రద్ధ తీసుకోవడానికి అలాంటి వ్యక్తుల సమూహం కోసం ఆయనలో మరింత ఎక్కువ ఆకాంక్ష కలిగింది. అబ్రాహాము జీవిస్తూనే ఉంటాడని కూడా దేవుడు ఆశించాడు, ఎందుకంటే ఆయన తన నిర్వహణను కొనసాగిస్తున్నప్పుడు అబ్రహాము లాంటి హృదయం తనకు తోడుగా మరియు తనతో ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నది ఏదైనప్పటికీ, అది కేవలం ఒక కోరిక మాత్రమే, కేవలం ఒక ఆలోచన మాత్రమే- ఎందుకంటే అబ్రహాము కేవలం ఆయనకు విధేయత చూపగలిగే ఒక మనిషి మాత్రమే, అతనికి దేవుని గురించి లేశమాత్రం కూడా అవగాహన లేదా జ్ఞానం లేదు. మనిషి నుండి దేవుడు కోరిన వాటి కంటే అబ్రహాము చాలా తక్కువ ప్రమాణాలు ఉన్న వ్యక్తి, ఆ ప్రమాణాలు ఏవంటే: దేవుడిని తెలుసుకోవడం, దేవుడికి సాక్ష్యం ఇవ్వగలగడం మరియు దేవునితో ఏకాభిప్రాయంతో ఉండటం. కాబట్టి, అబ్రాహాము దేవుడితో పాటు నడవలేకపోయాడు. అబ్రాహాము ఇస్సాను అర్పించడంలో, అబ్రాహాము చిత్తశుద్ధి మరియు విధేయతను దేవుడు చూశాడు, అతను దేవుని పరీక్షను తట్టుకోగలిగాడని చూశాడు. అతని చిత్తశుద్ధిని మరియు విధేయతను దేవుడు అంగీకరించినప్పటికీ, దేవుడికి విశ్వాసపాత్రునిగా మారడానికి, దేవుడిని తెలిసుకున్న మరియు అర్థం చేసుకున్న వ్యక్తిగా మారడానికి మరియు దేవుని స్వభావం తెలుసుకున్న వ్యక్తిగా మారడానికి అతను ఇప్పటికీ అనర్హుడే; అతను దేవునితో ఏకాభిప్రాయంతో ఉండటానికి మరియు దేవుని చిత్తాన్ని అమలు చేయడానికి ఎంతో దూరంగా ఉన్నాడు. కాబట్టి, తన హృదయంలో, దేవుడు ఇప్పటికీ ఒంటరిగా మరియు ఆత్రుతతో ఉన్నాడు. దేవుడు ఎంత ఎక్కువ ఒంటరిగా మరియు ఆత్రుతగా తయారవుతాడో, అంత వీలైనంత త్వరగా తన నిర్వహణను కొనసాగించాల్సిన మరియు అంత వీలైనంత త్వరగా ఆయన నిర్వహణ ప్రణాళికను పూర్తిచేయడానికి, ఆయన చిత్తాన్ని సాధించడానికి వ్యక్తుల సమూహాన్ని ఎంపిక చేయాల్సిన మరియు పొందాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇది దేవుని ఆత్రుతతో కూడిన కోరిక మరియు ఇది మొట్టమొదటి నుండి నేటి వరకు మారకుండా ఉండిపోయింది. ప్రారంభంలో మనిషిని సృష్టించినప్పటి నుండి, గెలిచే ఒక సమూహం కోసం, అంటే ఆయనతో కలిసి నడిచే మరియు ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోగల, తెలుసుకోగల మరియు గ్రహించగల ఒక సమూహం కోసం దేవుడు ఆకాంక్షించాడు. దేవుని ఈ కోరిక ఎప్పుడూ మారలేదు. ఆయన ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి అనేదానితో సంబంధం లేకుండా, ముందుకు సాగే మార్గం ఎంత కఠినమైనది అనేదానితో సంబంధం లేకుండా, ఆయన ఆకాంక్షించే లక్ష్యాలు ఎంత దూరంలో ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా, దేవుడు మనిషి నుండి తన అంచనాలను ఎప్పుడూ మార్చుకోలేదు లేదా వదిలిపెట్టలేదు. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కాబట్టి, దేవుని కోరిక గురించి మీరు ఏదైనా తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్నది బహుశా చాలా లోతైనది కాకపోవచ్చు—కానీ అది క్రమంగా తెలుస్తుంది!

అబ్రాహాము జీవించి ఉన్న అదే కాలంలో, దేవుడు ఒక నగరాన్ని కూడా నాశనం చేశాడు. ఆ నగరం పేరు సొదొమ. నిస్సందేహంగా, సొదొమ కథ చాలా మందికి బాగా తెలుసు, కానీ ఆ నగరాన్ని నాశనం చేయడానికి వెనుక ఉన్న దేవుని ఆలోచనలు ఎవరికీ తెలియవు.

కాబట్టి ఈరోజు, అబ్రాహాముతో దేవుని కింది సంభాషణల ద్వారా, ఆ సమయంలో ఆయనకున్న ఆలోచనల గురించి మనం తెలుసుకుంటాము, అదే సమయంలో ఆయన స్వభావం గురించి కూడా తెలుసుకుంటాము. తరువాత, మనం పవిత్ర గ్రంథంలోని కింది గద్య భాగాలను చదువుదాం.

బి. దేవుడు తప్పక సొదొమను నాశనం చేయాలి

ఆదికాండము 18:26 యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను.

ఆదికాండము 18:29 అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పెను. మరియు ఆయన, నేను దీనిని చేయను అని చెప్పెను.

ఆదికాండము 18:30 ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. మరియు ఆయన, నేను దీనిని చేయను అని చెప్పెను.

ఆదికాండము 18:31 ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననెను. మరియు ఆయన, నేను దీనిని నాశనం చేయను అని చెప్పెను.

ఆదికాండము 18:32 ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను. మరియు ఆయన, నేను దీనిని నాశనం చేయను అని చెప్పెను.

ఇవి బైబిల్ నుండి నేను ఎంచుకున్న కొన్ని సారాంశాలు. అవి సంపూర్ణమైన, మూల సంస్కరణలు కావు. మీరు స్వయంగా వాటిని చూడాలనుకుంటే, మీరు బైబిల్‌లో వాటిని చూడవచ్చు; సమయాన్ని ఆదా చేయడానికి, నేను మూల వృత్తాంతంలోని కొంత భాగాన్ని మినహాయించాను. ఇక్కడ నేను మన ఈరోజు సాంగత్యంతో సంబంధం లేని అనేక వాక్యాలను వదిలివేసి, పలు కీలక గద్య భాగాలను మరియు వాక్యాలను మాత్రమే ఎంచుకున్నాను. మనం సాంగత్యము చేసే అన్ని గద్య భాగాలు మరియు వృత్తాంతంలో, కథలు మరియు కథలలోని మనిషి ప్రవర్తన వివరాలపై దృష్టి పెట్టడాన్ని మనం దాటవేస్తాము; దానికి బదులుగా, ఆ సమయంలో దేవుని ఆలోచనలు మరియు అభిప్రాయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాము. దేవుని ఆలోచనలు మరియు అభిప్రాయాల్లో, మనం దేవుని స్వభావాన్ని చూస్తాము మరియు దేవుడు చేసిన ప్రతిదానిలో మనం స్వయంగా నిజమైన దేవుడినే చూస్తాము-ఇలా చేయడంతో మనం మన లక్ష్యాన్ని సాధిస్తాము.

దేవుడు ఆయన మాటలను పాటించగలిగే మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగే వారి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తాడు

పై గద్య భాగాలలో అనేక కీలక పదాలు ఉన్నాయి: సంఖ్యలు. మొదటిది, ఆ పట్టణములో యాభై మంది నీతిమంతులను తాను కనుగొంటే, ఆ ప్రదేశాన్నంతా విడిచిపెడతాననీ, అంటే, తాను ఆ పట్టణాన్ని నాశనం చేయనని యెహోవా చెప్పాడు. మరి సొదొమలో నిజానికి యాభై మంది నీతిమంతులు ఉండారా? లేరు. దాని తర్వాత వెంటనే, అబ్రాహాము దేవునితో ఏమి చెప్పాడు? ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడితే? అని అతను అడిగాడు. మరియు దేవుడు, నేను దీనిని చేయను అని చెప్పెను. తర్వాత, ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడితే? అని అబ్రాహాము అడిగాడు. మరియు దేవుడు, నేను దీనిని చేయను అని చెప్పెను. మరియు ఒకవేళ ఇరువది మందియే అయితే? నేను దీనిని చేయను. పది మందియే అయితే? నేను దీనిని చేయను. నిజానికి, నగరం లోపల పది మంది నీతిమంతులు ఉండారా? పది మంది లేరు-కానీ ఒక్కరే ఉన్నారు. ఈ ఒక్కరు ఎవరు? అతను లోతు. ఆ సమయంలో, సొదొమలో ఒక్క నీతిమంతుడు మాత్రమే ఉండెను, కానీ ఈ సంఖ్యను గురించి దేవుడు చాలా కఠినంగా లేదా ఖచ్చితంగా ఉండెనా? లేదు, ఆయన అలా లేడు! కాబట్టి, “పది మందియే అయితే” అనేదానికి చేరుకునేంత వరకు “నలుబది మందియే అయితే?” “ముప్పది మందియే అయితే?” అని మనిషి అడుగుతూనే ఉన్నాడు. “పది మందియే ఉన్నప్పటికీ, నేను నగరాన్ని నాశనం చేయను; నేను దానిని విడిచిపెడతాను మరియు ఈ పది మందితో పాటు ఇతర ప్రజలను క్షమిస్తాను” అని దేవుడు చెప్పాడు. పదిమంది మాత్రమే ఉంటే, అది చాలా దయనీయంగా ఉండి ఉండేది, కానీ నిజానికి, సొదొమలో నీతిమంతులైన వ్యక్తుల సంఖ్య అంత కూడా లేదని తేలింది. అప్పుడు దేవుని దృష్టిలో, నగర ప్రజలలో పాపులు మరియు దుష్టులు ఎంత మంది ఉన్నారంటే, వారిని నాశనం చేయడం తప్ప దేవునికి వేరే మార్గం లేకపోయిందని మీరు చూశారు. యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ నగరాన్ని నాశనం చేయనని దేవుడు చెప్పినప్పుడు దాని అర్థమేమిటి? దేవునికి ఈ సంఖ్యలు ముఖ్యం కాదు. ఆయన కోరుకున్న నీతిమంతులు నగరంలో ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. నగరంలో కేవలం ఒక్క నీతిమంతుడైన వ్యక్తే ఉంటే, ఆ నగరాన్ని నాశనం చేయడం ద్వారా దేవుడు వారికి హాని జరగనివ్వడు. దీనర్థం ఏమిటంటే, దేవుడు నగరాన్ని నాశనం చేయబోయాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, దానిలో ఎంత మంది నీతిమంతులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, దేవునికి ఈ పాపపు నగరం శాపగ్రస్తమైనది మరియు పాడుచేయదగినది, కాబట్టి నీతిమంతులు అలాగే ఉంటూ, అది నాశనం చేయబడాలి, దేవుని కండ్లకు కనిపించకుండా అంతరించిపోవాలి. యుగముతో సంబంధం లేకుండా, మానవాళి అభివృద్ధి దశతో సంబంధం లేకుండా, దేవుడి వైఖరి మారదు: ఆయన చెడ్డవారిని అసహ్యించుకుంటాడు మరియు ఆయన దృష్టిలో నీతిమంతుల పట్ల శ్రద్ద వహిస్తాడు. దేవుని ఈ స్పష్టమైన వైఖరే దేవుని గుణగణాల నిజమైన వెల్లడింపు కూడా. నగరం లోపల ఒక్క నీతిమంతుడు మాత్రమే ఉన్నందున, దేవుడు ఇక సంకోచించలేదు. అంతిమ ఫలితంగా సొదొమ తప్పనిసరిగా నాశనం చేయబడుతుంది. దీనిలో మీకు ఏమి కనిపిస్తుంది? ఆ యుగంలో, ఒక నగరంలో యాభై మంది నీతిమంతులు ఉంటే లేదా పది మంది ఉంటే దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయడు, అంటే దేవుడు మానవాళిని క్షమించాలని మరియు సహించాలని నిర్ణయించుకుంటాడు లేదా ఆయనను గౌరవించగలిగే మరియు ఆరాధించగలిగే కొంతమంది కారణంగా మార్గదర్శకత్వం చేసే పని చేస్తాడు. దేవుడు మనిషి నీతిమంతమైన పనుల పట్ల గొప్ప విశ్వాసం ఉంచుతాడు, తనను ఆరాధించగలిగే వారిపై గొప్ప విశ్వాసం ఉంచుతాడు మరియు ఆయన యెదుట మంచి పనులు చేయగలిగే వారి పట్ల గొప్ప విశ్వాసం ఉంచుతాడు.

తొలినాళ్ల నుండి నేటి వరకు, దేవుడు సత్యాన్ని తెలియజేయడం లేదా దేవుని మార్గం గురించి ఎవరైనా వ్యక్తికి చెప్పడం గురించి మీరు ఎప్పుడైనా బైబిల్‌లో చదివారా? లేదు, ఎప్పుడూ చదవలేదు. మనం చదివేవన్నీ మనిషికి దేవుడు చెప్పిన వాక్యములు, ప్రజలు ఏమి చేయాలో మాత్రమే చెప్పాయి. కొందరు వెళ్లి దానిని చేశారు, కొందరు చేయలేదు; కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. అక్కడ ఉన్నది అంతే. ఆవిధంగా, దేవుని దృష్టిలో నీతిమంతులైన వారు అంటే-కేవలం దేవుని వాక్యములను వినగలిగి, దేవుని ఆజ్ఞలను అనుసరించగలిగే వారే-ఆ యుగపు నీతిమంతులు. వారు మనుషుల మధ్య దేవుని వాక్యములను అమలు చేసే సేవకులు. అలాంటి వ్యక్తులను దేవుడు తెలిసిన వారని అనగలమా? వారిని దేవునిచే పరిపూర్ణులుగా చేయబడిన వ్యక్తులని అనగలమా? లేదు, వారిని అలా అనలేము. కాబట్టి, వారి సంఖ్య ఎంతైనప్పటికీ, దేవుని దృష్టిలో ఈ నీతిమంతులు దేవుడికి విశ్వసనీయులు అని పిలువబడటానికి అర్హులా? వారిని దేవుడికి సాక్షులు అని పిలువగలమా? ఖచ్చితంగా పిలువలేము! వారు ఖచ్చితంగా దేవుడికి విశ్వసనీయులు మరియు సాక్షులు అని పిలువబడటానికి అర్హులు కాదు. కాబట్టి, అలాంటి వారిని దేవుడు ఏమని పిలిచాడు? బైబిల్‌లో, మనం ఇప్పుడే చదివిన పవిత్ర గ్రంథంలోని గద్య భాగాల వరకు, వారిని దేవుడు “నా సేవకుడు” అని పిలిచిన అనేక సందర్భాలు ఉన్నాయి. అంటే, ఆ సమయంలో, దేవుని దృష్టిలో ఆ నీతిమంతులైన వ్యక్తులు దేవుని సేవకులు, వారు ఆయనకు భూమిపై సేవ చేసిన వ్యక్తులు. ఈ నామమును గురించి దేవుడు ఎలా ఆలోచించాడు? వారిని ఆయన అలా ఎందుకు పిలిచాడు? ప్రజలను పిలిచే నామములకు సంబంధించి దేవుని హృదయంలో ప్రమాణాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడు వ్యక్తులను నీతిమంతులు, పరిపూర్ణులు, నిజాయితీపరులు లేదా సేవకులని ఎలా పిలిచినప్పటికీ, ఆయనకు ప్రమాణాలు ఉన్నాయి. దేవుడు ఎవరినైనా తన సేవకుడు అని పిలిచినప్పుడు, ఆ వ్యక్తి ఆయన దూతలను స్వీకరించగలడని, ఆయన ఆజ్ఞలను పాటించగలడని మరియు దూతలు ఆజ్ఞాపించిన దానిని కొనసాగించగలడని ఆయన దృఢంగా విశ్వసిస్తాడు. ఆ వ్యక్తి కొనసాగించేది ఏమిటి? మనిషిని చేయాల్సిందిగా మరియు భూమిపై అమలు చేయాల్సిందిగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని వారు కొనసాగిస్తారు. ఆ సమయంలో, దేవుడు మనిషిని చేయాల్సిందిగా మరియు భూమిపై అమలు చేయాల్సిందిగా ఆజ్ఞాపించిన వాటిని దేవుడి మార్గంగా పిలువగలమా? లేదు, అలా పిలువలేము. ఎందుకంటే, ఆ సమయంలో మనిషిని ఇది లేదా అది మాత్రమే చేయాలని, ఇంతకుమించి మరేమీ వద్దని చెప్తూ, దేవుడు ఆ మనిషిని కొన్ని సరళమైన పనులు మాత్రమే చేయాల్సిందిగా కోరాడు; ఆయన కొన్ని మామూలు ఆజ్ఞలను మాత్రమే ఇచ్చాడు. దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం పని చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే, ఆ సమయంలో అనేక పరిస్థితులు ఇంకా అందుబాటులో లేవు, ఆ సమయం ఇంకా పరిపక్వత చెందలేదు మరియు దేవుని మార్గాన్ని అనుసరించడం మానవాళికి కష్టం, కాబట్టి దేవుని హృదయం నుండి దేవుని మార్గం ఇంకా వెలువడడం ప్రారంభం కాలేదు. దేవుడు మనం ఇక్కడ చూసే, ఆయన మాట్లాడిన-ముప్పై లేదా ఇరవై మంది-నీతిమంతులను తన సేవకులుగా చూశాడు. ఈ సేవకుల వద్దకు దేవుని దూతలు వచ్చినప్పుడు, వారు దూతలను స్వీకరించగలిగి మరియు వారి ఆజ్ఞలను పాటించగలిగి మరియు వారి మాటల ప్రకారం నడుచుకోగలిగి ఉన్నారు. దేవుని దృష్టిలో సేవకులుగా ఉన్నవారు చేయవలసినది మరియు పొందవలసినది ఖచ్చితంగా ఇదే. దేవుడు ప్రజల నామముల విషయంలో వివేకవంతుడు. ఆయన వారిని తన సేవకులని పిలవలేదు, ఎందుకంటే వారు ఇప్పుడు మీరున్నట్లే ఉండేవారు-వారు చాలా బోధనలు విన్నారు, దేవుడు ఏమి చేయడానికి ఉన్నాడో తెలుసుకున్నారు, దేవుడి చిత్తాన్ని చాలా వరకు అర్థం చేసుకున్నారు మరియు ఆయన నిర్వహణ ప్రణాళికను అవగాహన చేసుకున్నారు కాబట్టి వారు తమ మానవత్వంలో నిజాయితీగా ఉన్నారు మరియు వారు దేవుని మాటలను పాటించగలిగారు కాబట్టి; దేవుడు వారిని ఆజ్ఞాపించినప్పుడు, వారు చేస్తున్న పనిని పక్కనపెట్టి, దేవుడు ఆజ్ఞాపించిన దానిని కొనసాగించగలిగారు. కాబట్టి దేవుడికి సంబంధించినంత వరకు, సేవకుడు అనే పేరులోని అర్థానికి ఉన్న మరొక అర్థం, భూమిపై ఆయనకు సహకరించిన వారిని మరియు వారు దేవుని దూతలు కానప్పటికీ, వారు దేవుని వాక్యములను భూమిపై కార్యరూపంలో పెట్టినవారు మరియు అమలు చేసినవారని అర్థం. కాబట్టి, ఈ సేవకులు లేదా నీతిమంతులకు దేవుని హృదయంలో గొప్ప స్థానం ఉందని మీరు చూశారు. దేవుడు భూమిపై మొదలు పెట్టాల్సిన కార్యము ఆయనకు సహకరించే ప్రజలు లేకుండా సాధ్యపడేది కాదు మరియు దేవుని సేవకులు పోషించిన పాత్రను దేవుని దూతలు భర్తీ చేయగలిగి ఉండేవారు కారు. ఈ సేవకులకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పని ఆయనకు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఆయన వారిని వదిలివేసుకోలేక పోయాడు. దేవునికి ఈ సేవకుల సహకారం లేకపోతే, మానవాళిలో ఆయన కార్యము ఆగిపోయేది, దాని ఫలితంగా దేవుని నిర్వహణ ప్రణాళిక మరియు దేవుని ఆశలు ఫలించి ఉండేవి కావు.

దేవుడు తాను శ్రద్ధ వహించే వారి పట్ల అపరిమిత కరుణగలవాడు మరియు తాను అసహ్యించుకునే, తిరస్కరించే వారి పట్ల తీవ్ర ఉగ్రతగలవాడు

బైబిల్ వృత్తాంతాల్లో, సొదొమలో పది మంది దేవుని సేవకులు ఉన్నారా? లేరు! దేవునిచే మినహాయించబడటానికి ఆ నగరానికి అర్హత ఉందా? నగరంలో ఒక వ్యక్తి—లోతు- మాత్రమే దేవదూతలను ఆహ్వానించాడు. దీనిలోని అంతరార్థం, నగరంలో దేవుని సేవకుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, అందువల్ల లోతును రక్షించి, సొదొమ నగరాన్ని నాశనం చేయడం తప్ప దేవునికి వేరే మార్గం లేకపోయింది. పైన ఉదహరించిన అబ్రహాము మరియు దేవుని మధ్య జరిగిన సంభాషణలు చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ అవి చాలా లోతైన విషయాన్ని వివరిస్తాయి: దేవుని చర్యలకు నియమాలు ఉన్నాయి, ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన పరిశీలిస్తూ మరియు చర్చిస్తూ చాలా సమయం వెచ్చిస్తాడు; సరైన సమయం రాకముందే ఆయన ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడు లేదా అకస్మాత్తుగా ఎలాంటి నిశ్చయాలకు రాడు. సొదొమను నాశనం చేయాలనే దేవుని నిర్ణయంలో లేశమాత్రం కూడా తప్పు లేదని అబ్రాహాము మరియు దేవుని మధ్య జరిగిన సంభాషణలు మనకు చూపుతాయి, ఎందుకంటే ఆ నగరంలో నలభై మంది నీతిమంతులు, ముప్పై మంది నీతిమంతులు లేదా ఇరవై మంది కూడా లేరని దేవుడికి ముందే తెలుసు. పది మంది కూడా లేరు. ఆ నగరంలో ఉన్న ఒకేఒక్క నీతిమంతుడు లోతు. సొదొమలో జరిగిన సమస్తం మరియు దాని పరిస్థితులను దేవుడు గమనించాడు మరియు అవి దేవుడికి ఆయన అరచేతి అంత సుపరిచితంగా ఉన్నాయి. కాబట్టి, ఆయన నిర్ణయం తప్పు అవ్వడానికి వీలులేదు. దీనికి విరుద్ధంగా, దేవుడి సర్వశక్తిమత్వంతో పోలిస్తే, మనిషి చాలా నిస్తేజంగా, చాలా మూర్ఖంగా మరియు అజ్ఞానిగా, చాలా తాత్కాళిక దృష్టితో ఉంటాడు. అబ్రాహాము మరియు దేవుడికి జరిగిన సంభాషణలలో మనకు కనిపించేది ఇదే. దేవుడు తొలి నుండి నేటి వరకు తన స్వభావాన్ని వెల్లడిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా, ఇక్కడ, మనం చూడవలసిన దేవుని స్వభావము కూడా ఉంది. సంఖ్యలు అనేవి మామూలైనవి-అవి దేనినీ నిరూపించవు-కాని ఇక్కడ దేవుని స్వభావపు చాలా ముఖ్యమైన వ్యక్తీకరణ ఉంది. యాభై మంది నీతిమంతుల ఉంటే దేవుడు నగరాన్ని నాశనం చేయడు. దీనికి కారణం దేవుని కరుణా? దీనికి కారణం ఆయన ప్రేమ మరియు సహనమా? దేవుని స్వభావపు ఇవతలి వైపును మీరు చూశారా? కేవలం పది మంది నీతిమంతులు ఉంటే కూడా, ఈ పది మంది నీతిమంతుల కారణంగా దేవుడు నగరాన్ని నాశనం చేసి ఉండేవాడు కాదు. ఇది దేవుని సహనం మరియు ప్రేమనా, కాదా? దేవుడికి ఆ నీతిమంతుల పట్ల ఉన్న కరుణ, సహనం మరియు శ్రద్ధ కారణంగా, ఆయన నగరాన్ని నాశనం చేసి ఉండేవాడు కాదు. దేవుని సహనం ఇదే. చివరకు, మనం ఏ ఫలితాన్ని చూస్తాము? “ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో” అని అబ్రాహాము అన్నప్పుడు, “నేను దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నాడు. దాని తర్వాత, అబ్రాహాము మరింకేమీ మాట్లాడలేదు-ఎందుకంటే సొదొమలో అతను అనుకున్న పది మంది నీతిమంతులు కూడా లేరు మరియు ఇంక అతనికి చెప్పడానికి ఏమీ లేదు, అప్పుడు సొదొమను దేవుడు ఎందుకు నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడో అతనికి అర్థం అవుతుంది. దీనిలో, మీకు దేవుని ఏ స్వభావము కనిపిస్తుంది? దేవుడు ఏ రకంగా నిశ్చయించుకున్నాడు? ఈ నగరంలో పది మంది నీతిమంతులు కూడా లేకుంటే, అది ఉండటాన్ని అనుమతించకూడదని మరియు తప్పక దాన్ని నాశనం చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అది దేవుని ఉగ్రత కాదా? ఆ ఉగ్రత దేవుని స్వభావాన్ని సూచిస్తుందా? ఆ స్వభావమే దేవుని పరిశుద్ధ గుణగణాల వెల్లడింపా? అది మనిషి ఎలాంటి పరిస్థితిలో అపరాధము చేయకూడని చెప్పే దేవుని నీతిమంతమైన గుణగణాల వెల్లడింపా? సొదొమలో పది మంది నీతిమంతులు లేరని ధృవీకరించుకున్న తర్వాత, దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు మరియు ఆ నగరంలోని ప్రజలు దేవుడిని వ్యతిరేకించారు మరియు వారు చాలా అశుద్ధులు, చెడ్డవారు కాబట్టి వారిని కఠినంగా శిక్షిస్తాడు.

మనం ఈ గద్య భాగాలను ఇలా ఎందుకు విశ్లేషించాము? ఎందుకంటే, ఈ కొద్ది మామూలు వాక్యాలు దేవుని అపరిమిత కరుణ మరియు తీవ్ర ఉగ్రతతో కూడిన స్వభావాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తాయి. నీతిమంతులను అమూల్యంగా భావించడం మరియు వారిపట్ల కరుణ చూపడం, సహించడం మరియు వారిపట్ల శ్రద్ధ వహించడంతో పాటు, అదేసమయంలో, సొదొమలోని చెడిపోయిన వారందరి పట్ల దేవుడి మనస్సులో తీవ్రమైన అసహ్యం ఉండేది. ఇది అపరిమిత కరుణ, తీవ్ర ఉగ్రతనా కావా? దేవుడు ఏ విధంగా ఆ నగరాన్ని నాశనం చేశాడు? అగ్నితో నాశనం చేశాడు. ఆయన దానిని అగ్నితో ఎందుకు నాశనం చేశాడు? ఏదైనా అగ్నితో కాల్చివేయబడుతూ ఉండడాన్ని నీవు చూసినప్పుడు లేదా నీవు దేనినైనా కాల్చివేయబోతున్నప్పుడు, దాని పట్ల నీ భావనలు ఏమిటి? నీవు ఎందుకు దానిని కాల్చివేయాలనుకుంటున్నావు? ఇకపై అది అవసరం లేదని, దానిని ఇకపై చూడకూడదని నీవు అనుకుంటున్నావా? నీవు దానిని వదిలివేయాలనుకుంటున్నావా? దేవుడు అగ్నిని ఉపయోగించడమంటే పరిత్యజించడం, అసహ్యించుకోవడమని అర్థం మరియు ఆయన ఇకపై సొదొమను చూడాలనుకోవడం లేదు. దేవుడు సొదొమను అగ్నితో దహించేలా చేసిన భావోద్వేగం ఇదే. దేవుడు ఎంత ఆగ్రహంతో ఉన్నాడో అగ్నిని ఉపయోగించడం అనేది సూచిస్తుంది. దేవునిలో కరుణ మరియు సహనం వాస్తవానికి అలాగే ఉన్నాయి, కానీ ఆయన తన ఉగ్రతను చూపినప్పుడు దేవుని ఇంకో కోణంలో ఉన్న అపరాధాన్ని సహించని ఆయన పరిశుద్ధత, నీతి కూడా మనిషికి కనిపిస్తాయి. మనిషి దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించగలిగి, దేవుడు కోరుకున్నవాటికి అనుగుణంగా నడుచుకోగలిగినప్పుడే, దేవుడిలో మనిషి పట్ల అపరిమితమైన కరుణ ఉంటుంది; అదే మనిషి చెడుతనం, ద్వేషం మరియు ఆయన పట్ల శత్రుత్వంతో నిండి ఉన్నప్పుడు, దేవుడు తీవ్రమైన ఆగ్రహంతో ఉంటాడు. ఆయన ఎంత మేరకు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు? మనిషి నుండి ప్రతిఘటన మరియు అతని చెడు పనులు దేవుడికి కనిపించనంత వరకు, అవి ఆయన కండ్ల ఎదుట ఇక ఏమాత్రం లేనంత వరకు ఆయన ఆగ్రహం ఉంటుంది. అప్పుడే దేవుని ఆగ్రహం కనిపించకుండా పోతుంది. మరో మాటలో చెప్పాలంటే, వ్యక్తి ఎవరు అనేదానితో సంబంధం లేకుండా, వారి హృదయం దేవుడికి దూరమైతే, దేవుడి నుండి పక్కకు వెళితే, ఎప్పటికీ వెనక్కు రాకుంటే, వారి అన్ని రూపాల లేదా వారి వ్యక్తిగత కోరికల పరంగా, వారు తమ దేహంలో లేదా వారి ఆలోచనలలో దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు, అనుసరిస్తున్నారు మరియు విధేయత చూపతున్నారు అనేదానితో సంబంధం లేకుండా, వారిపై దేవుని ఆగ్రహం ఆగకుండా ప్రదర్శించబడుతుంది. మనిషికి కావలసినన్ని అవకాశాలు ఇచ్చాక, దేవుడు తన ఆగ్రహాన్ని మహోగ్రంగా చూపినప్పుడు, అది ఎలా ఉంటుందంటే, దానిని చూపడం మొదలుపెడితే ఇక వెనక్కి తీసుకోవడం ఏ విధంగానూ వీలుకాదు మరియు అలాంటి మనుష్యుల పట్ల ఆయన తిరిగి ఎప్పుడూ కరుణ, సహనం చూపడు. ఏవిధమైన అపరాధాన్ని సహించని దేవుని స్వభావపు మరో కోణం ఇదే. ఇక్కడ, దేవుడు ఒక నగరాన్ని నాశనం చేస్తాడనడం ప్రజలకు మామూలు విషయంగా అనిపిస్తుంది, ఎందుకంటే, దేవుని దృష్టిలో, పాపంతో నిండిపోయిన నగరం అస్థిత్వంలో ఉండలేదు మరియు కొనసాగలేదు మరియు దేవుడు దానిని నాశనం చేయడం అనేది సహేతుకమైనది. అంతేగాకుండా, ఆయన సొదొమను నాశనం చేయడానికి ముందు మరియు తరువాత జరిగిన దాంట్లో, దేవుని స్వభావపు సంపూర్ణత మనకు కనిపిస్తుంది. కరుణ, అందం మరియు మంచితనం ఉన్న వారిపట్ల దేవునిలో సహనం మరియు కరుణ ఉంటాయి; చెడుతనం, పాపం మరియు దుష్టతతో నిండిన వారిపట్ల, ఆయనకు, ఆగకుండా కొనసాగేంతగా, తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది. ఇవే దేవుని స్వభావపు రెండు ప్రధాన మరియు అతి ప్రముఖ అంశాలు, అంతేకాకుండా, దేవుడు వాటిని తొలి నుండి చివరి వరకు బహిర్గతం చేశాడు: అపరిమిత కరుణ మరియు తీవ్రమైన ఉగ్రత. మీలో అత్యధికులు దేవుని కరుణను ఎంతోకొంత అనుభవించారు, కానీ మీలో చాలా తక్కువ మందే దేవుడి ఉగ్రతను ప్రశంసించారు. దేవుడి కరుణ మరియు ప్రేమతో కూడిన దయను ప్రతి వ్యక్తిలో చూడవచ్చు; అంటే, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల అపరిమితమైన కరుణ కలిగి ఉన్నాడు. అయితే, చాలా అరుదుగా మాత్రమే-లేదా ఎప్పుడూ లేదని కూడా చెప్పవచ్చు-దేవుడు మీలో ఎవరైనా వ్యక్తుల పట్ల లేదా మీ మధ్య గల ప్రజలలోని ఏదైనా వర్గం పట్ల తీవ్రమైన ఆగ్రహం చూపాడు. ప్రశాంతంగా ఉండండి! ఇప్పుడో అప్పుడో, దేవుని ఉగ్రతను ప్రతి వ్యక్తి చూస్తాడు మరియు అనుభవిస్తాడు, కానీ ఇప్పుడు సమయం ఇంకా రాలేదు. ఇది ఎందుకని? ఎందుకంటే, ఎవరిపట్ల అయినా దేవుడు నిరంతర ఆగ్రహంతో ఉన్నప్పుడు, అంటే, ఆయన తన తీవ్రమైన ఉగ్రతను వారిపై చూపినప్పుడు, ఆయన ఆ వ్యక్తిని ఎంతోకాలం నుండి అసహ్యించుకున్నాడనీ, తిరస్కరించాడనీ, ఆయన వారి అస్థిత్వాన్ని తృణీకరించాడనీ మరియు ఆయన వారి అస్థిత్వాన్ని భరించలేడని అర్థం; వారిపై ఆయన ఆగ్రహించిన వెంటనే, వారు సమసిపోతారు. ఈరోజు, దేవుడి కార్యము ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు. దేవుడు తీవ్రమైన ఆగ్రహాన్ని చూపితే మీలో ఎవరూ దానిని తట్టుకోలేరు. కాబట్టి, ఇప్పుడు మీ అందరి పట్ల దేవుడు అపరిమిత కరుణతో మాత్రమే ఉన్నాడని మీరు చూస్తున్నారు, మీరు ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని ఇంకా చూడలేదు. దీనిని ఒప్పుకోని వారెవరైనా ఉంటే, దేవుడి ఆగ్రహం మరియు ఎలాంటి అపరాధాన్ని సహించని ఆయన స్వభావము నిజంగా ఉన్నాయో లేవో మీరు అనుభూతి చెందడానికి, దేవుడి ఉగ్రత మీపై చూపబడాలని మీరు కోరవచ్చు. మీరు ఆ సాహసం చేస్తారా?

అంత్యకాలపు ప్రజలు దేవుడి ఉగ్రతను ఆయన మాటలలో మాత్రమే చూస్తారు, దేవుడి ఉగ్రతను వాస్తవంగా అనుభవించరు

ఈ పవిత్ర గ్రంథం గద్య భాగాలలో కనిపించే దేవుడి స్వభావపు రెండు కోణాలు సాంగత్యానికి తగినవేనా? ఈ కథ విన్నాక, మీరు దేవుడి గురించి కొత్తగా అవగాహన పొందారా? మీరు ఏ రకమైన అవగాహన పొందారు? సృష్టికాలం నుండి ఇప్పటి వరకు, దేవుడి కృప లేదా కరుణ మరియు దయతో కూడిన ప్రేమను ఈ అంతిమ సమూహం అనుభవించినంత ఎక్కువగా ఏ సమూహం కూడా అనుభవించలేదని చెప్పవచ్చు. ఈ అంతిమ దశలో, దేవుడు తీర్పు మరియు శిక్ష కార్యము చేసినప్పటికీ, ఆయన తన కార్యాన్ని మహత్యం మరియు ఉగ్రతతో చేసినప్పటికీ, దేవుడు తన కార్యాన్ని పూర్తి చేయడానికి ఎక్కువసార్లు కేవలం మాటలను మాత్రమే ఉపయోగించాడు; ఆయన బోధించడానికి మరియు దాహం తీర్చడానికి, సమకూర్చడానికి మరియు ఆకలి తీర్చడానికి మాటలను ఉపయోగించాడు. ఈ సమయంలో, దేవుడి ఉగ్రత ఎల్లప్పుడూ దాచిపెట్టబడింది మరియు ఉగ్రతతో కూడిన దేవుడి స్వభావాన్ని ఆయన మాటలలో అనుభవించడం తప్ప, చాలా కొద్దిమంది మాత్రమే ఆయన ఉగ్రతను వ్యక్తిగతంగా అనుభవించారు. అంటే, తీర్పు మరియు శిక్ష సంబంధిత దేవుడి కార్యము సమయంలో, దేవుడి మాటలలో బహిర్గతమైన ఉగ్రత, దేవుడి మహత్యాన్ని, అలాగే ప్రజల అపరాధాన్ని ఆయన సహించకపోవడాన్ని వారు అనుభవించేలా చేసినప్పటికీ, ఈ ఉగ్రత ఆయన మాటలను దాటి వెళ్లలేదని అర్థం. మరోలా చెప్పాలంటే, మనిషిని మందలించడానికి, మనిషిని బట్టబయలు చేయడానికి, మనిషికి తీర్పునివ్వడానికి, మనిషిని శిక్షించడానికి మరియు మనిషిని ఖండించడానికి కూడా దేవుడు మాటలను ఉపయోగిస్తాడు-కానీ దేవుడు మనిషి పట్ల ఇంకా తీవ్ర ఆగ్రహం చెందలేదు, అలాగే ఆయన తన మాటలతో తప్ప మనిషిపై తన ఉగ్రతను ప్రదర్శించలేదు కూడా. ఆవిధంగా, ఈ యుగములో మనిషి అనుభవించిన దేవుడి కరుణ మరియు ప్రేమతో కూడిన దయ ఆయన నిజమైన స్వభావాన్ని బహిర్గతం చేస్తాయి. అయితే, మనిషి అనుభవించిన దేవుడి ఉగ్రత విషయానికొస్తే మాత్రం, అది కేవలం ఆయన పలుకుల స్వరం ప్రభావం మరియు అనుభూతి మాత్రమే. అనేకమంది ఈ ప్రభావాన్ని దేవుడి ఉగ్రత యొక్క నిజమైన అనుభూతి మరియు నిజమైన జ్ఞానమని తప్పుగా భావించారు. ఫలితంగా, చాలామంది ఆయన మాటలలో దేవుడి కరుణ, ప్రేమతో కూడిన దయను చూశామని, వారు మనిషి అపరాధం పట్ల దేవుడి అసహనాన్ని కూడా చూశామని నమ్ముతారు, వారిలో చాలామంది మనిషి పట్ల దేవుని కరుణ మరియు సహనాన్ని మెచ్చుకున్నారు కూడా. కానీ మనిషి ప్రవర్తన ఎంత చెడ్డదైనప్పటికీ లేదా అతని స్వభావము ఎంత చెడిపోయినప్పటికీ, దేవుడు అన్నివేళలా సహించాడు. ఈ సహించడంలో, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రయత్నాలు మరియు ఆయన పొందాలనుకునే వారిలో ప్రభావాన్ని సాధించడానికి ఆయన చెల్లించిన మూల్యం యొక్క ఫలితం కోసం వేచి ఉండటమే ఆయన లక్ష్యం. ఇలాంటి ఫలితం కోసం వేచిచూడడానికి సమయం పడుతుంది మరియు మనిషికి భిన్న వాతావరణాలను సృష్టించవలసిన అవసరం ఉంటుంది, ఎలాగంటే, మనుష్యులు పుట్టిన వెంటనే వయోజనులుగా ఎలా మారలేరో అలా; దానికి పద్దెనిమిది లేదా పంతొమ్మిది సంవత్సరాలు పడుతుంది మరియు కొంతమందికైతే వారు నిజంగా పెద్దవారుగా పరిపక్వత చెందడానికి ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దేవుడు వేచి ఉంటాడు, అలాంటి సమయం రావడానికి వేచి ఉంటాడు మరియు ఈ ఫలితం రావడానికి ఆయన వేచి ఉంటాడు. ఆయన వేచి ఉన్న కాలమంతా, దేవుడు అపరిమితమైన కనికరంతో ఉంటాడు. అయితే, దేవుడి కార్యము సమయంలో, అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రజలు పడగొట్టబడతారు, దేవుడి పట్ల తీవ్రమైన వ్యతిరేకత కారణంగా కొందరు శిక్షించబడతారు. మనిషి అపరాధాన్ని సహించని దేవుడి స్వభావానికి అలాంటి ఉదాహరణలు గొప్ప రుజువు మాత్రమే కాకుండా, తాను ఎంచుకున్న వారి పట్ల దేవుడి సహనం మరియు ఓర్పు యొక్క నిజమైన ఉనికిని పూర్తిగా నిర్ధారిస్తాయి. నిజానికి, ఈ ప్రత్యేకమైన ఉదాహరణల్లో, ఈ వ్యక్తుల్లో దేవుడి స్వభావములోని కొంత భాగం వెల్లడించబడటమనేది దేవుడి నిర్వహణ ప్రణాళిక మొత్తాన్ని ప్రభావితం చేయదు. వాస్తవానికి, దేవుడి కార్యపు ఈ అంతిమ దశలో, దేవుడు తాను వేచి ఉంటున్న సమయమంతా ఓర్పు వహించాడు, అలాగే ఆయనను అనుసరించే వారి రక్షణకు ఆయన ఓర్పును మరియు ఆయన జీవితాన్ని బదులుగా ఇచ్చాడు. ఇది మీకు కనిపిస్తోందా? దేవుడు కారణం లేకుండా తన ప్రణాళికను మార్చుకోడు. ఆయన తన ఉగ్రతను ప్రదర్శించగలడు, అదేసమయంలో ఆయన కనికరంతో కూడా ఉండగలడు; ఇదే దేవుడి స్వభావపు రెండు ప్రధాన భాగాల వ్యక్తీకరణ. ఇది చాలా స్పష్టంగా ఉందా, లేదా? మరోలా చెప్పాలంటే, సరైనవి మరియు సరికానివి, న్యాయమైనవి మరియు అన్యాయమైనవి, సానుకూలమైనవి మరియు ప్రతికూలమైనవి-ఇవన్నీ దేవుడు మనిషికి స్పష్టంగా చూపాడు. ఆయన ఏమి చేస్తాడో, ఆయన ఏమి ఇష్టపడతాడో, ఆయన దేనిని ద్వేషిస్తాడో-ఇవన్నీ ఆయన స్వభావములో నేరుగా ప్రతిబింబించగలవు. అలాంటి విషయాలను దేవుడి కార్యములో చాలా విశదంగా మరియు స్పష్టంగా కూడా చూడవచ్చు, అవి అస్పష్టంగా లేదా సాధారణంగా ఉండవు; అలాకాకుండా, అవి దేవుడి స్వభావాన్ని మరియు ఆయన వద్ద ఉన్నవాటిని మరియు ఆయనంటే ఏమిటో, ప్రత్యేకించి నిర్దిష్టంగా, నిజంగా మరియు ఆచరణాత్మక పద్ధతిలో ప్రజలందరూ చూసేలా వీలుకల్పిస్తాయి. స్వయంగా నిజమైన దేవుడంటే ఇదే.

దేవుడి స్వభావము మనిషికి ఎప్పుడూ దాచిపెట్టబడలేదు-మనిషి హృదయమే దేవుడి నుండి దూరమైంది

నేను ఈ విషయాల గురించి సాంగత్యము చేయకపోతే, మీలో ఎవరు కూడా బైబిల్ కథల్లోని దేవుడి నిజమైన స్వభావాన్ని చూడగలిగి ఉండేవారు కాదు. ఇది యథార్థం. ఎందుకంటే, దేవుడు చేసిన కొన్ని పనులను ఈ బైబిల్ కథలలో నమోదు చేసినప్పటికీ, దేవుడు కొద్ది మాటలు మాత్రమే మాట్లాడాడు మరియు ఆయన స్వభావాన్ని నేరుగా పరిచయం చేయలేదు లేదా ఆయన చిత్తాన్ని మనిషికి బహిరంగంగా వెల్లడించలేదు. తరువాతి తరాల వారు ఈ నమోదులన్నీ కథలే తప్ప మరేమీ కాదని భావించారు, కాబట్టి దేవుడు తనను తాను మనిషి నుండి దాచిపెట్టుకున్నాడనీ, మనిషి నుండి దాచబడింది దేవుడనే వ్యక్తి కాకుండా, ఆయన స్వభావము మరియు చిత్తం అని ప్రజలకు అనిపిస్తుంది. ఈరోజు నా సాంగత్యము తర్వాత కూడా, దేవుడు మనిషి నుండి పూర్తిగా దాగి ఉన్నాడని మీరు భావిస్తున్నారా? దేవుడి స్వభావము మనిషి నుండి దాచిపెట్టబడిందని మీరు ఇంకా విశ్వసిస్తున్నారా?

సృష్టి కాలం నుండి, దేవుడి స్వభావము ఆయన కార్యముతో పాటు కొనసాగుతున్నది. అది మనిషికి ఎప్పుడూ దాచపెట్టబడలేదు, కానీ మనిషికి పూర్తిగా వెల్లడి చేయబడింది మరియు స్పష్టం చేయబడింది. అయినప్పటికీ, కాలంతో పాటు, మనిషి హృదయానికి దేవుడి నుండి దూరం ఇంకా పెరిగింది మరియు మనిషి చెరుపు లోతుగా వేళ్లునుకోవడంతో, మనిషికి దేవుడికి మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగింది. నెమ్మదిగా అయినప్పటికీ ఖచ్చితంగా, మనిషి దేవుడి దృష్టి నుండి కనుమరుగయ్యాడు. మనిషి దేవుడిని “చూడలేనంతగా” మారిపోయాడు, దాంతో దేవుడి గురించి అతనికి ఎలాంటి “సమాచారం” తెలియకుండా పోయింది; కాబట్టి, దేవుడు ఉన్నాడో లేదో మనిషికి తెలియదు, అసలు దేవుడి ఉనికినే పూర్తిగా నిరాకరించేంత వరకు కూడా మనిషి వెళ్లిపోయాడు. ఫలితంగా, దేవుడి స్వభావాన్ని, అలాగే ఆయన వద్ద ఉన్నవి మరియు ఆయనంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోవడం అనేవి, మనిషి నుండి దేవుడు దాచిపెట్టుకున్నందుకు కాకుండా, మనిషి హృదయం దేవుడికి దూరంగా వెళ్లడం వల్లనే జరిగాయి. మనిషి దేవుడిని విశ్వసించినప్పటికీ, మనిషి హృదయంలో దేవుడు లేడు మరియు దేవుడిని ఎలా ప్రేమించాలో కూడా అతనికి తెలియదు లేదా మనిషి దేవుడిని ప్రేమించాలనుకోలేదు. ఎందుకంటే, అతని హృదయం ఎప్పుడూ దేవుడికి దగ్గరగా రాదు, అతను ఎల్లప్పుడూ దేవుడిని తప్పించుకుని తిరుగుతాడు. ఫలితంగా, మనిషి హృదయం దేవుడికి దూరంగా ఉండిపోయింది. అయితే, అతని హృదయం ఎక్కడ ఉంది? వాస్తవానికి, మనిషి హృదయం ఎక్కడికీ పోలేదు: దానిని దేవుడికి ఇవ్వకుండా లేదా దానిని దేవుడు చూడడానికి వెల్లడించకుండా, అతను దానిని తన కోసమే ఉంచుకున్నాడు. కొంతమంది తరచుగా దేవుడిని ప్రార్థిస్తూ, “ఓ ప్రభువా, నా హృదయాన్ని చూడు-నా ఆలోచనలన్నీ నీకు తెలుసు” అని అన్నప్పటికీ, మరికొందరు దేవుడు తమవైపు చూసేలా చేస్తామని ప్రమాణం చేస్తారు మరియు వారు వారి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే దేవుడు వారిని శిక్షించవచ్చని కూడా అంటారు. మనిషి తన హృదయంలోకి చూసేందుకు దేవుడిని అనుమతించినప్పటికీ, దేవుడి సమన్వయాలకు మరియు ఏర్పాట్లకు మనిషి విధేయుడై ఉండగలడని లేదా అతను తన విధిని, అవకాశాలను మరియు అతని సమస్తాన్ని దేవుడి నియంత్రణలో ఉంచినట్లు దీనర్థం కాదు. ఆవిధంగా, నీవు దేవుడికి చేసే ప్రమాణాలు లేదా నీవు ఆయనకు వెల్లడించినది ఏదైనప్పటికీ, దేవుడి దృష్టిలో నీ హృదయం ఆయనకు ఇప్పటికీ మూసివేయబడే ఉంది, ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూడటానికి మాత్రమే నీవు అనుమతిస్తావు, అంతేగానీ దానిని ఆయన నియంత్రించడానికి అనుమతించవు. మరోలా చెప్పాలంటే, నీవు అసలు నీ హృదయాన్ని దేవుడికి సమర్పించనేలేదు మరియు దేవుడు వినేందుకు తీయని మాటలు మాత్రమే మాట్లాడతావు; అదే సమయంలో, నీ కుట్రలు, యోచనలు మరియు ప్రణాళికలతో పాటు నీ రకరకాల మోసపూరిత ఉద్దేశాలను దేవుడి నుండి దాచిపెడతావు, అలాగే దేవుడు నీ అవకాశాలను, విధిని తీసుకుంటాడని తీవ్రంగా భయపడి, వాటిని నీ చేతుల్లోనే ఉంచుకుంటావు. కాబట్టి, దేవుడి పట్ల మనిషికున్న నిజాయితీ అయనకు ఎప్పుడూ కనిపించదు. దేవుడు మనిషి హృదయపు లోతులను గమనించినప్పటికీ, మనిషి ఆలోచించే వాటిని మరియు తన హృదయంలో చేయాలనుకుంటున్న వాటిని చూడగలిగినప్పటికీ మరియు అతని హృదయం లోపల దాచుకున్నవాటిని చూడగలిగినప్పటికీ, మనిషి హృదయం మాత్రం దేవునికి చెందదు మరియు మనిషి తన హృదయాన్ని దేవుడి నియంత్రణలో ఉంచలేదు. అంటే, దేవుడికి గమనించే హక్కు ఉంది కానీ, ఆయనకు నియంత్రించే హక్కు లేదని అర్థం. మనిషి తన వ్యక్తిగతమైన స్పృహలో, దేవుడి ఏర్పాట్లకు తననుతాను అప్పగించుకోవాలని అనుకోడు లేదా ఉద్దేశించడు. మనిషి దేవుడి నుండి తననుతాను మూసివేసుకోవడమే కాకుండా, దేవుడి విశ్వాసాన్ని చూరగొనడానికి మరియు తన అసలు ముఖాన్ని దేవుడికి కనిపించకుండా దాచిపెడుతూ, తప్పుడు అభిప్రాయాలను కల్పించడానికి, సుతిమెత్తని మాటలు మరియు పొగడ్తలు ఉపయోగిస్తూ తమ హృదయాలను కప్పివేసుకోవడానికి మార్గాల గురించి ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుడు చూడకుండా చేయడంలో వారి లక్ష్యం ఏమిటంటే, వారి నిజ స్వరూపాన్ని దేవుడు గ్రహించకుండా చేయడమే. వారు తమ హృదయాలను దేవుడికి ఇవ్వాలనుకోకుండా, వాటిని తమతోనే ఉంచుకుంటారు. దీని అంతరార్థం ఏమిటంటే, మనిషి చేసేవి, కోరుకునేవన్నీ మనిషి స్వయంగా ప్రణాళిక చేసినవే, లెక్కవేసున్నకున్నవే మరియు నిర్ణయించుకున్నవే; అతనికి దేవుడు పాలుపంచుకోవడం లేదా జోక్యం చేసుకోవడం అవసరం లేదు, అతనికి దేవుడి సమన్వయాలు మరియు ఏర్పాట్లు అంతకంటే అవసరం లేదు. ఆవిధంగా, దేవుడి ఆజ్ఞలు, ఆయన అమలు లేదా మనిషి నుండి దేవుడు కోరుకునే వాటికి సంబంధించి, మనిషి నిర్ణయాలు అనేవి అతని సొంత ఉద్దేశాలు మరియు ఆసక్తులపై, ఆ సమయంలో అతను స్వయంగా ఉన్న స్థితి మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మనిషి తాను వెళ్లాల్సిన మార్గాన్ని నిర్ణయించడానికి మరియు ఎంచుకోవడానికి ఎల్లప్పుడూ తనకు బాగా తెలిసిన జ్ఞానం, అంతర్దృష్టి మరియు తన సొంత వివేకాన్ని ఉపయోగిస్తాడు మరియు దేవుడి జోక్యాన్ని లేదా నియంత్రణను అనుమతించడు. దేవుడికి కనిపించే మనిషి హృదయం ఇదే.

తొలి నుండి నేటి వరకు, మనిషి మాత్రమే దేవుడితో సంభాషించగలిగినవాడు. అంటే, దేవుడు సృష్టించిన అన్ని ప్రాణులు మరియు జీవులలో, మనిషి తప్ప మరేదీ దేవుడితో సంభాషించలేకపోయింది. మనిషి వినగలగడానికి అతనికి చెవులు ఉన్నాయి, చూడగలగడానికి అతనికి కళ్ళు ఉన్నాయి; అతనికి భాష, సొంత ఆలోచనలు మరియు స్వతంత్ర చిత్తం ఉన్నాయి. దేవుడు మాట్లాడేది వినడానికి, దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దేవుడి చేసే పనిని అంగీకరించడానికి అవసరమైనవన్నీ అతనికి ఉన్నాయి, కాబట్టి, దేవుడు తనలాగే ఒకే మనస్సుగల మరియు తనతో నడవగల వాడిగా మనిషిని తయారు చేయాలనుకుంటూ తన కోరికలన్నింటినీ మనిషికి అప్పగిస్తాడు. మనిషి తన హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి, దానిని శుద్ధి చేయడానికి మరియు సన్నద్ధం చేసేలా దేవుడిని అనుమతించడానికి, దేవుడికి సంతృప్తికరమైనవారిగా మరియు దేవుడు ప్రేమించేవారిగా ఉండేలా అతన్ని తయారు చేయడానికి మరియు దేవుడిని గౌరవించేలా మరియు చెడును విసర్జించేలా అతన్ని మార్చడానికి దేవుడు నిర్వహణ ప్రారంభించినప్పటి నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎప్పడూ ఈ ఫలితం కోసం ఎదురుచూస్తూ, వేచి ఉన్నాడు. బైబిల్‌లో నమోదు చేసినవాటిలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే, తమ హృదయాలను దేవుడికి ఇవ్వగలిగిన వారు బైబిల్‌లో ఎవరైనా ఉన్నారా? ఈ యుగానికి ముందు ఏదైనా దృష్టాంతం ఉందా? ఈరోజు, మనం బైబిల్ వృత్తాంతాలను చదవడాన్ని మరియు ఈ వ్యక్తి-యోబు-చేసిన దానికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న “నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం” అనే అంశానికి ఏదైనా సంబంధం ఉందా అని చూడటాన్ని కొనసాగిద్దాం. యోబు పట్ల దేవుడు సంతృప్తి చెందాడా మరియు దేవుడు అతనిని ప్రేమించాడా చూద్దాం.

యోబు గురించి మీ అభిప్రాయం ఏమిటి? మూల పవిత్ర గ్రంథాన్ని ప్రస్తావిస్తూ, యోబు “దేవుడికి భయపడ్డాడు మరియు చెడును త్యజించాడు” అని కొందరు అంటారు. “దేవుడికి భయపడ్డాడు మరియు చెడును త్యజించాడు”: యోబు గురించి బైబిల్‌లో నమోదు చేసిన అసలు అంచనా అలా ఉంది. మీరు మీ సొంత మాటల్లో అయితే, యోబును ఎలా వివరిస్తారు? యోబు మంచివాడు మరియు సహేతుకమైన మనిషి అని కొందరంటారు; దేవుడిపై అతనికి నిజమైన విశ్వాసం ఉందని కొందరంటారు; యోబు నీతిమంతుడు మరియు మానవత్వం ఉన్న మనిషి అని కొందరంటారు. మీరు యోబు విశ్వాసాన్ని చూశారు, అంటే మీ హృదయాలలో మీరు యోబు విశ్వాసానికి గొప్ప ప్రాధాన్యతనిస్తారు మరియు అసూయపడతారు. ఈనాడు, అతని వల్ల దేవుడు ఎంతో సంతోషపడినట్టివి యోబు దగ్గర ఏమున్నాయో చూద్దాం. తరువాత, మనం కింది పవిత్ర గ్రంథాలను చదువుదాం.

సి. యోబు

1. యోబు గురించి దేవుడి మరియు బైబిల్‌లోని అంచనాలు

యోబు 1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

యోబు 1:5 వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

యోబు 1:8 యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అని యెహోవా సాతానుతో అనెను.

మీరు ఈ గద్య భాగాలలో చూసే కీలక అంశం ఏమిటి? పవిత్ర గ్రంథంలోని ఈ మూడు సంక్షిప్త గద్య భాగాలు యోబుకు సంబంధించినవి. సంక్షింప్తంగా ఉన్నప్పటికీ, అతను ఎలాంటి వ్యక్తో అవి స్పష్టంగా పేర్కొంటాయి. యోబు రోజువారీ ప్రవర్తన మరియు అతని నడవడిక గురించి వాటి వివరణ ద్వారా, నిరాధారంగా కాకుండా, యోబు గురించి దేవుడి అంచనా రుజువు చేయబడిందని అవి అందరికీ చెబుతాయి. అది యోబు (యోబు 1:1) గురించి మనిషి అంచనా అయినప్పటికీ లేదా అతని (యోబు 1:8) గురించి దేవుడి అంచనా అయినప్పటికీ, అవి రెండూ దేవుడు మరియు మనిషి యెదుట యోబు చేసిన పనుల ఫలితమే (యోబు 1:5) అని అవి మనకు తెలుపుతాయి.

మొదట, మనం మొదటి గద్య భాగాన్ని చదువుదాం: “ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.” ఇది యోబు గురించి బైబిల్‌లో ఉన్న మొదటి అంచనా మరియు ఈ వాక్యం యోబు గురించి రచయిత అంచనా. సహజంగానే, ఇది యోబు గురించి “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు,” అని మనిషి అంచనాను కూడా సూచిస్తుంది. తర్వాత, మనం యోబు గురించి దేవుడి అంచనాను చదువుదాం: “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు” (యోబు 1:8). ఈ రెండింటిలో, ఒకటి మనిషి నుండి వచ్చింది, మరొకటి దేవుడి నుండి ఉత్పన్నమైంది; అవి ఒకే విషయం గల రెండు అంచనాలు. కాబట్టి, యోబు ప్రవర్తన మరియు నడవడిక మనుష్యులకు తెలుసుననీ మరియు వాటిని దేవుడు కూడా ప్రశంసించాడనీ చూడవచ్చు. మరోలా చెప్పాలంటే, మనుష్యుల యెదుట మరియు దేవుడి ఎదుట యోబు నడవడిక ఒకేలా ఉంది; దేవుడు గమనించడానికి వీలుగా, అతను తన ప్రవర్తన మరియు ప్రేరణను ఎల్లప్పుడూ దేవుడి సమక్షంలో ఉంచాడు మరియు అతను దేవుడికి భయపడిన మరియు చెడును విసర్జించిన వ్యక్తి. కాబట్టి, దేవుడి దృష్టిలో, భూమి మీది ప్రజలలో, యోబు మాత్రమే యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు, అతను దేవుడికి భయపడిన మరియు చెడును విసర్జించిన వ్యక్తి.

యోబు దైనందిన జీవితంలో దేవుడి పట్ల భయము కలిగి, చెడును విసర్జించడం గురించి నిర్దిష్ట వ్యక్తీకరణలు

తర్వాత, యోబు దేవుడి పట్ల భయము కలిగి, చెడును విసర్జించడం గురించి నిర్దిష్ట వ్యక్తీకరణలను చూద్దాం. దానికి ముందు మరియు తరువాతి గద్య భాగాలతో పాటు, యోబు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించడం గురించి నిర్దిష్ట వ్యక్తీకరణలలో ఒకటైన యోబు 1:5 ని కూడా మనం చదువుదాం. ఇది అతను తన రోజువారీ జీవితంలో దేవుడి పట్ల ఎలా భయం కలిగి ఉన్నాడు మరియు అతను చెడును ఎలా విసర్జించాడు అనేదానికి సంబంధించినది; మరీ ముఖ్యంగా, అతను దేవుడి పట్ల తనకున్న భయం మరియు చెడును విసర్జించడం కోసం తాను చేయవలసిన పనులు చేయడం మాత్రమే కాకుండా, తన కుమారుల తరపున దేవుడి యెదుట క్రమం తప్పకుండా దహనబలులు అర్పించాడు. విందు చేసుకుంటున్నప్పుడు వారు తరచుగా “పాపం చేసి, తమ హృదయాలలో దేవుడిని దూషించారని” అతను భయపడ్డాడు. ఈ భయం యోబులో ఎలా వ్యక్తమైంది? మూల వచనం ఈ కింది వృత్తాంతాన్ని అందిస్తుంది: “వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను.” దేవుడి పట్ల యోబుకున్న భయం అతని బాహ్య ప్రవర్తనలో కనిపించడానికి బదులు, అతని హృదయంలో నుండి వచ్చిందని మరియు దేవుడి పట్ల అతనికున్న భయాన్ని అతని రోజువారీ జీవితంలోని ప్రతి అంశంలో, అన్ని సమయాలలో చూడవచ్చని అతని నడవడిక మనకు చూపుతుంది, ఎందుకంటే, అతను తనంతటతానే చెడును విసర్జించడమే కాకుండా, తరచుగా తన కుమారుల తరపున దహనబలులు కూడా అర్పించాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడం మరియు తన హృదయంలో దేవుడిని త్యజించడం గురించి యోబు తీవ్రంగా భయపడటం మాత్రమే కాకుండా, తన కుమారులు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయవచ్చమో మరియు వారి హృదయాలలో ఆయనను త్యజించవచ్చమో అని కూడా భయపడ్డాడు. దీనినిబట్టి, దేవుడి పట్ల యోబుకున్న భయం సత్య నిర్ధారణకు నిలబడుతుందని మరియు మనిషికున్న ఏ సందేహానికి లోబడదని చూడవచ్చు. అతను ఈవిధంగా అప్పుడప్పుడు చేశాడా లేదా తరచుగా చేశాడా? ఈ వచనంలోని ఆఖరి వాక్యము “యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను”. ఈ మాటల అర్థం ఏమిటంటే, యోబు అప్పుడప్పుడు లేదా తనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి తన కుమారులను చూడలేదు, అదేవిధంగా ప్రార్థన ద్వారా అతను దేవుడి యెదుట ఒప్పుకోలేదు. దానికి బదులుగా, పరిశుద్ధులుగా చేయబడటానికి అతను తన కుమారులను క్రమం తప్పకుండా పంపాడు మరియు వారి కోసం దహనబలులను అర్పించాడు. ఇక్కడ “నిత్యము” అనే పదానికి అర్థం, అతను ఒకటి లేదా రెండు రోజులు లేదా ఒక క్షణంపాటు అలా చేశాడని కాదు. దేవుడి పట్ల యోబు భయపు వ్యక్తీకరణ తాత్కాలికం కాదని మరియు జ్ఞానం లేదా మాట్లాడే మాటల వరకే ఆగిపోలేదని అర్థం; దానికి బదులుగా, దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గం అతని హృదయాన్ని నడిపించిందనీ, అది అతని ప్రవర్తనను నిర్దేశించిందనీ మరియు అతని హృదయంలో అది అతని అస్థిత్వానికి మూలమనీ ఇది చెబుతోంది. అతను నిత్యము అలా చేయడమనేది, అతని హృదయంలో, తానే స్వయంగా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తానేమోనని అతను తరచుగా భయపడ్డాడనీ మరియు తన కుమారులు మరియు కుమార్తెలు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తారేమోనని కూడా అతను భయపడ్డాడని చూపుతుంది. దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గానికి అతని హృదయంలో అసలు ఎంత ప్రాధాన్యత ఉందో అది సూచిస్తుంది. అతను తన మనస్సులో బెదిరిపోయాడు మరియు భయపడ్డాడు-తాను చెడు చేశాననే, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాననే మరియు తాను దేవుడి మార్గం నుండి పక్కకు వెళ్లాననే మరియు దేవుడిని సంతృప్తి పరచలేకపోయాననే భయం వలన అతను నిత్యము ఆవిధంగా చేశాడు. అదే సమయంలో, అతని కుమారులు మరియు కుమార్తెలు దేవుడి పట్ల అపరాధము చేశారని భయపడుతూ, వారి గురించి కూడా అతను ఆందోళన చెందాడు. యోబు తన రోజువారీ జీవితంలో ఇలా చేయడమనేది చాలా సాధారణ నడవడిక. యోబు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించడం అనేవి ఉత్త మాటలు కాదని, యోబు నిజంగా అలాంటి వాస్తవికతతో జీవించాడని రుజువు చేసేది ఖచ్చితంగా ఈ సాధారణ నడవడికే. “యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను”: ఈ మాటలు దేవుడి యెదుట యోబు రోజువారీ పనుల గురించి మనకు చెబుతాయి. అతను ఆవిధంగా నిత్యము చేసినప్పుడు, అతని ప్రవర్తన మరియు అతని హృదయం దేవుడి సమక్షానికి చేరిందా? మరో మాటలో అడగాలంటే, అతని హృదయం మరియు అతని ప్రవర్తన పట్ల దేవుడు తరచుగా సంతోషించాడా? అలాంటప్పుడు, యోబు ఏ స్థితిలో మరియు ఏ సందర్భంలో నిత్యము ఆవిధంగా చేశాడు? దేవుడు యోబుకు తరచుగా కనిపించిన కారణంగా అతను అలా ప్రవర్తించాడని కొందరు అంటారు; చెడును విసర్జించాలనే చిత్తం ఉన్నందున అతను నిత్యము ఆవిధంగా చేశాడని కొందరు అంటారు; బహుశా తనకు అదృష్టం అంత తేలికగా రాలేదని అతను భావించాడనీ, అది దేవుడు తనకు ప్రసాదించాడని అతనికి తెలుసనీ, అందుకే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడం లేదా అపరాధము చేయడం వల్ల తన ఆస్తిని కోల్పోతానని అతను తీవ్రంగా భయపడ్డాడనీ మరికొందరు అంటారు. ఈ వాదనల్లో ఏవైనా నిజాలు ఉన్నాయా? స్పష్టంగా లేవు. ఎందుకంటే, దేవుడి దృష్టిలో, యోబు గురించి దేవుడు ఎక్కువగా అంగీకరించింది మరియు ఇష్టపడింది కేవలం అతడు ఆవిధంగా నిత్యము చేయడాన్ని మాత్రమే కాదు; అతన్ని సాతానుకు అప్పగించినప్పుడు మరియు ప్రలోభపెట్టినప్పుడు దేవుడి ముందు, మనుష్యులు మరియు సాతాను ముందు అతని నడవడికను దేవుడు మరింతగా ఇష్టపడ్డాడు. కింది విభాగాలు చాలా నమ్మదగిన సాక్ష్యాన్ని అందిస్తాయి, అది యోబు గురించి దేవుడు అంచనా వేసిన సత్యాన్ని మనకు చూపే సాక్ష్యం. తరువాత, మనం పవిత్ర గ్రంథంలోని కింది గద్య భాగాలను చదువుదాం.

2. సాతాను మొట్టమొదటి సారి యోబును ప్రలోభపెట్టాడు (అతని పశువులు దొంగిలించబడతాయి మరియు అతని బిడ్డలపై విపత్తు విరుచుకు పడుతుంది)

ఎ. దేవుడు అన్న మాటలు

యోబు 1:8 యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అని యెహోవా సాతానుతో అనెను.

యోబు 1:12 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవిచ్చెను. కావున, యెహోవా సన్నిధినుండి అపవాది బయలు వెళ్లెను.

బి. సాతాను జవాబు

యోబు 1:9-11 అప్పుడు యెహోవాకు జవాబిస్తూ అపవాది ఇలా అడిగెను, యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.

యోబు విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికి, యోబును ప్రలోభపెట్టడానికి సాతానుని అనుమతించిన దేవుడు

యెహోవా దేవుడికి మరియు సాతానుకు మధ్య జరిగిన సంభాషణ గురించి బైబిల్‌లో మనం చూసే మొదటి నమోదే యోబు 1:8. అయితే, దేవుడు ఏమి చెప్పాడు? మూల వచనం ఈ క్రింది వృత్తాంతాన్ని అందిస్తుంది: “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అని యెహోవా సాతానుతో అనెను”. సాతాను యెదుట యోబు గురించి దేవుడి అంచనా ఇది; అతడు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడనీ, దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించినవాడనీ దేవుడు చెప్పాడు. దేవుడికి మరియు సాతానుకు మధ్య ఈ సంభాషణకు ముందు, యోబును ప్రలోభపెట్టడానికి సాతానును ఉపయోగించాలనీ-యోబును సాతానుకు అప్పగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఒక విధంగా చూస్తే, ఇది యోబు గురించి దేవుడి పరిశీలన మరియు మూల్యాంకనం ఖచ్చితమైనవనీ మరియు తప్పు లేనివనీ రుజువు చేస్తుంది మరియు యోబు సాక్ష్యం ద్వారా సాతాను సిగ్గుపడేలా చేస్తుంది; మరోవిధంగా చూస్తే, ఇది దేవుడి యందు యోబు విశ్వాసాన్ని మరియు దేవుడి పట్ల భయాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆవిధంగా, సాతాను దేవుడి యెదుటకు వచ్చినప్పుడు, దేవుడు సందేహించలేదు. అతను నేరుగా విషయానికి వచ్చి సాతానును ఇలా అడిగాడు: “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా?” దేవుడి ప్రశ్నలో ఈ కింది అర్థం ఉంది: సాతాను అన్ని ప్రదేశాలు సంచరించాడని మరియు దేవుడి సేవకుడైన యోబుపై తరచుగా నిఘా పెట్టాడని దేవుడికి తెలుసు. దేవుడి యందు యోబు విశ్వాసం మరియు దేవుడి పట్ల భయం స్థిరంగా ఉండలేవని నిరూపించడానికి అతన్ని నాశనం చేసే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ, అది తరచుగా యోబును ప్రలోభాలకు గురి చేసి, అతనిపై దాడి చేసింది. యోబు దేవుడిని పరిత్యజించేలా చేయడానికి మరియు అతన్ని దేవుడి చేతుల్లో నుండి స్వాధీనం చేసుకోవడానికి అతన్ని నాశనం చేసే అవకాశాల కోసం కూడా సాతాను తక్షణమే వెతికింది. అయినప్పటికీ, దేవుడు యోబు హృదయంలోకి చూశాడు మరియు అతను యథార్థవంతుడనీ, న్యాయవంతుడనీ మరియు అతను దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించినవాడనీ దేవుడు గుర్తించాడు. యోబు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించిన యథార్థవర్తనుడనీ, న్యాయవంతుడనీ, యోబు ఎప్పుడూ దేవుడిని పరిత్యజించి, సాతానును అనుసరించడనీ సాతానుకు చెప్పడానికి దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. యోబు గురించి దేవుడి అంచనాను వినడంతో, అవమానంతో సాతానులో ఆగ్రహం కలిగింది మరియు యోబును లాక్కోవడానికి సాతానులో మరింత ఆగ్రహం మరియు అసహనం కలిగాయి, ఎందుకంటే ఎవరైనా యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా ఉండగలరని లేదా దేవుడి పట్ల భయం కలిగి ఉండగలరని, చెడును విసర్జించగలరని సాతాను ఎప్పుడూ విశ్వసించలేదు. అదే సమయంలో, మనిషిలోని పరిపూర్ణతను, నిజాయితీని కూడా సాతాను అసహ్యించుకున్నాడు మరియు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే వ్యక్తులను ద్వేషించాడు. కాబట్టి యోబు 1:9-11 లో ఇలా రాయబడింది, “అప్పుడు యెహోవాకు జవాబిస్తూ అపవాది ఇలా అడిగెను, యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.” సాతాను మోసపూరిత స్వభావం దేవుడికి బాగా తెలుసు మరియు యోబును నాశనం చేయాలనే యోచన సాతాను చాలాకాలంగా చేశాడని పూర్తిగా తెలుసు కాబట్టి, యోబు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడని మరియు అతను దేవుడి పట్ల భయంగలవాడని, చెడును విసర్జించినవాడని సాతానుకు మరోసారి చెప్పడం ద్వారా సాతానును దారిలో పెట్టాలని, సాతాను తన అసలు ముఖాన్ని, యోబుపై దాడిని మరియు ప్రలోభాన్ని బహిర్గతం చేసేలా చూడాలని దేవుడు భావించాడు. మరోలా చెప్పాలంటే, యోబు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడనీ, అతనికి దేవుడి పట్ల భయం ఉందనీ, చెడును విసర్జించాడనీ దేవుడు ఉద్దేశపూర్వకంగానే నొక్కి చెప్పాడు మరియు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు, దేవుడి పట్ల భయం కలిగిన, చెడును విసర్జించిన యోబు మీద సాతానుకు ద్వేషం మరియు కోపం ఉన్నాయి కాబట్టి సాతాను యోబుపై దాడి చేసేలా దేవుడు చేశాడని అర్థం. తత్ఫలితంగా, యోబు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు, దేవుడి పట్ల భయం కలిగిన, చెడును విసర్జించినవాడు అనే వాస్తవం ద్వారా దేవుడు సాతానును అవమానపరుస్తాడు మరియు సాతాను పూర్తిగా అవమానం మరియు ఓటమి పొందినట్టు భావిస్తాడు. ఆ తర్వాత, యోబు పరిపూర్ణతను, నిజాయితీని, దేవుడి యందు భయం కలిగి ఉండటాన్ని లేదా చెడును విసర్జించడాన్ని గురించి ఇకపై సందేహించడు లేదా ఆరోపణలు చేయడు. ఈ విధంగా, దేవుడి పరీక్ష మరియు సాతాను ప్రలోభం దాదాపు అనివార్యమైంది. దేవుడి పరీక్షను, సాతాను ప్రలోభాలను తట్టుకోగలిగినవాడు ఒక్క యోబు మాత్రమే. ఈ సంభాషణ తర్వాత, యోబును ప్రలోభపెట్టడానికి సాతాను అనుమతించబడ్డాడు. ఆవిధంగా సాతాను మొదటి దఫా దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల లక్ష్యం యోబు ఆస్తి, ఎందుకంటే సాతాను యోబుకు వ్యతిరేకంగా కింది ఆరోపణ చేశాడు: “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? ... నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.” దీని ఫలితంగా, యోబుకు ఉన్నదంతా తీసుకోవడానికి సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు-దేవుడు సాతానుతో మాట్లాడింది కేవలం ఈ ఉద్దేశంతోనే. అయినప్పటికీ, దేవుడు సాతానుకు ఒక షరతు విధించాడు: “అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవిచ్చెను” (యోబు 1:12). యోబును ప్రలోభపెట్టడానికి సాతానుకు అనుమతి ఇచ్చిన తర్వాత మరియు యోబును సాతాను చేతిలో పెట్టిన తర్వాత దేవుడు పెట్టిన షరతు ఇదే మరియు ఆయన సాతానుకు విధించిన పరిమితి కూడా ఇదే: యోబుకు ఏమాత్రము హాని చేయవద్దని ఆయన సాతానును ఆదేశించాడు. యోబు పరిపూర్ణుడు, నిజాయితీపరుడని దేవుడు గుర్తించినందున, ఆయన యెదుట యోబు పరిపూర్ణత, నిజాయితీ ఎలాంటి సందేహాలకు తావులేనివనే మరియు అతను పరీక్షను తట్టుకోగలడనే నమ్మకం ఆయనకు ఉన్నందున, యోబును ప్రలోభపెట్టడానికి దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు, కానీ సాతానుపై పరిమితి విధించాడు: యోబు ఆస్తినంతా తీసుకోవడానికి సాతానుకు అనుమతి ఉంది, కానీ అతనిపై అది వేలు కూడా వేయలేకపోయింది. దీని అర్థం ఏమిటి? దేవుడు ఆ క్షణంలో యోబును సాతానుకు పూర్తిగా అప్పగించలేదని అర్థం. సాతాను తనకు ఇష్టమైన రీతిలో యోబును ప్రలోభపెట్టగలిగాడే తప్ప, యోబును-అతని తలలోని ఒక్క వెంట్రుకను కూడా- గాయపరచలేకపోయాడు, ఎందుకంటే మనిషికి సంబంధించిన ప్రతిదీ దేవుడిచే నియంత్రించబడుతుంది మరియు మనిషి జీవించడం లేదా మరణించడం కూడా దేవుడిచే నిర్ణయించబడుతుంది. సాతానుకు ఆ అనుమతి లేదు. సాతానుతో దేవుడు ఈ మాటలు చెప్పిన తర్వాత, సాతాను ప్రారంభించడానికి ఇక ఆగలేకపోయింది. యోబును ప్రలోభపెట్టడానికి అది అన్ని మార్గాలను ఉపయోగించింది మరియు ఎంతోకాలం గడవకముందే కొండంత విలువైన గొర్రెలు, ఎద్దులు మరియు దేవుడు అతనికి ఇచ్చిన సమస్త ఆస్తిని యోబు కోల్పోయాడు.... ఆ విధంగా అతనికి దేవుడి పరీక్షలు ఎదురయ్యాయి.

యోబు లోనైన ప్రలోభాల మూలాలను గురించి బైబిల్ మనకు తెలుపుతున్నప్పటికీ, ఏమి జరుగుతుందో ఈ ప్రలోభాలకు లోనైన యోబుకు అసలు తెలుసా? యోబు కేవలం మరణంగల మనిషి; వాస్తవానికి తన చుట్టూ జరుగుతున్న కథ గురించి అతనికేమీ తెలియదు. అయినప్పటికీ, దేవుడి యందు అతనికున్న భయము మరియు అతని పరిపూర్ణత, నిజాయితీ వలన తనకు దేవుడి పరీక్షలు ఎదురయ్యాయని అతను గ్రహించాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమి జరిగిందో లేదా ఈ పరీక్షల వెనుక ఉన్న దేవుడి ఉద్దేశాలు ఏమిటో అతనికి తెలియదు. కానీ అతనికి ఏమి జరిగింది అనేదానితో సంబంధం లేకుండా, తన పరిపూర్ణతకు, నిజాయితీకి కట్టుబడి ఉండాలనీ మరియు దేవుడి యందు భయం కలిగి, చెడును విసర్జించే మార్గానికి కట్టుబడి ఉండాలనీ అతనికి తెలుసు. ఈ విషయాల పట్ల యోబు వైఖరి మరియు ప్రతిస్పందనను దేవుడు స్పష్టంగా చూశాడు. దేవుడు ఏమి చూశాడు? ఆయన దేవుడికి భయపడే యోబు హృదయాన్ని చూశాడు, ఎందుకంటే ప్రారంభం నుండి యోబు పరీక్షించబడే వరకు, యోబు హృదయం దేవుడికి తెరిచే ఉంది, అది దేవుడి యెదుట పరచబడింది మరియు యోబు తన పరిపూర్ణతను, నిజాయితీని త్యజించలేదు లేదా దేవుడి పటల భయం కలిగి,చెడును విసర్జించడాన్ని అతను వదిలివేయలేదు లేదా పక్కకు తొలగలేదు-దేవుడికి సంతోషాన్నిచ్చేది ఇంతకంటే మరేదీ లేదు. తర్వాత, యోబు ఎలాంటి ప్రలోభాలకు గురయ్యాడు మరియు ఈ పరీక్షలను ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. పవిత్ర గ్రంథాల నుండి చదువుదాం.

సి. యోబు ప్రతిస్పందన

యోబు 1:20-21 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను, నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

యోబు తన వద్ద ఉన్నదంతా తిరిగి ఇచ్చేయడానికి బాధ్యత తీసుకోవడం అనేది దేవుడి పట్ల అతనికున్న భయం నుండి ఉద్భవించింది

“అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు” అని దేవుడు సాతానుకు చెప్పిన తర్వాత, సాతాను వెళ్లిపోయింది, ఆ వెనువెంటనే యోబు ఆకస్మిక మరియు దారుణ దాడులకు లోనయ్యాడు: మొదట, అతని ఎద్దులు మరియు గాడిదలు దొంగిలించబడ్డాయి, అతని సేవకుల్లో కొందరు చంపబడ్డారు; తర్వాత, అతని గొర్రెలు మరియు మరికొందరు సేవకులు అగ్నికి ఆహుతి చేయబడ్డారు; ఆ తర్వాత, అతని ఒంటెలు తీసుకోబడ్డాయి మరియు అతని సేవకుల్లో మరింతమంది చంపబడ్డారు; చివరకు, అతని కుమారులు మరియు కుమార్తెల ప్రాణాలు కూడా తీయబడ్డాయి. మొదటి ప్రలోభం సమయంలో యోబు అనుభవించిన వేదన ఈ దాడుల క్రమమే. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, ఈ దాడుల సమయంలో సాతాను యోబు ఆస్తిని మరియు అతని బిడ్డలను మాత్రమే లక్ష్యం చేసుకుంది, అంతేగానీ స్వయంగా యోబుకు హాని చేయలేదు. అయినప్పటికీ, యోబు తక్షణమే గొప్ప సంపద కలిగిన ధనవంతుడి నుండి ఏమీలేని నిరుపేదగా మారిపోయాడు. ఈ నిర్ఘాంతపోయే ఆశ్చర్యకరమైన దెబ్బను ఎవరూ తట్టుకోగలిగి లేదా దానికి సరిగ్గా ప్రతిస్పందించగలిగి ఉండేవారు కాదు, అయినప్పటికీ యోబు తన అసాధారణ పక్షాన్ని ప్రదర్శించాడు. పవిత్ర గ్రంథం ఈ కింది వృత్తాంతాన్ని ఇస్తుంది: “అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసెను”. తన బిడ్డలను, తన ఆస్తినంతా కోల్పోయానని విన్న తర్వాత యోబు మొదటి ప్రతిస్పందన ఇదే. అన్నింటికీ మించి, అతను ఆశ్చర్యపోయినట్లు లేదా భయాందోళనకు లోనైనట్లు కనిపించలేదు, అతను ఏ మాత్రం కోపం లేదా ద్వేషం వ్యక్తం చేయలేదు. అయితే, ఈ విపత్తులు ప్రమాదవశాత్తు జరిగినవి లేదా మనిషి చేసినవి కావనీ, కనీసం అవి ప్రతీకారం లేదా శిక్షగా వచ్చినవి కూడా కావనీ అతడు మనసులో అప్పటికే గుర్తించాడనీ మీకు తెలుసు. దానికి బదులుగా, అతడు యెహోవా పరీక్షలకు గురయ్యాడు; అతని ఆస్తిని, బిడ్డలను తీసేసుకోవాలనుకున్నది యెహోవానే. అప్పుడు యోబు చాలా ప్రశాంతంగా మరియు స్పష్టమైన తలంపుతో ఉన్నాడు. అతని పరిపూర్ణమైన మరియు నీతివంతమైన మానవత్వం, అతనికి సంభవించిన విపత్తులను గురించి సహేతుకంగా మరియు సహజంగా సరైన తీర్పులు మరియు నిర్ణయాలు తీసుకునేలా చేసింది, పర్యవసానంగా, అతను అసాధారణమైన ప్రశాంతతను చూపించాడు: “అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసెను.” “తన పై వస్త్రమును చింపుకొని” అంటే, అతను వివస్త్రంగా ఉన్నాడనీ, అతని వద్ద ఏమీ లేదనీ అర్థం; “తలవెండ్రుకలు గొరిగించుకొని‘ అంటే అతను అప్పుడే పుట్టిన శిశువు లాగా దేవుడి యెదుటకు తిరిగి వచ్చాడనీ; “నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసెను” అంటే అతను దిగంబరంగా లోకంలోకి వచ్చాడనీ మరియు ఇప్పటికీ ఏమీ లేనివాడనీ, అతను అప్పుడే పుట్టిన శిశువా అన్నట్లుగా దేవుడి వద్దకు తిరిగి వచ్చాడనీ అర్థం. అతనికి సంభవించిన వాటన్నింటి పట్ల యోబు ప్రదర్శించిన వైఖరి దేవుడి సృష్టిలోని ఏ జీవి సాధించగలిగినది కాదు. అతనికి యెహోవా పట్ల ఉన్న విశ్వాసం అనేది విశ్వాసపు ప్రపంచాన్ని మించిపోయింది; ఇది దేవుడి పట్ల అతనికున్న భయము, దేవుడి పట్ల అతని విధేయత; దేవుడు తనకు ఇచ్చినందుకు మాత్రమే కాకుండా, తన నుండి తీసుకున్నందుకు కూడా కృతజ్ఞతలు చెప్పగలిగాడు. అంతేగాకుండా, అతను తన జీవితంతో సహా, తన వద్ద ఉన్నదంతా దేవుడికి తిరిగి ఇచ్చే బాధ్యతను తానే స్వయంగా తీసుకోగలిగాడు.

దేవుడి యందు యోబుకు ఉన్న భయం మరియు విధేయత మానవాళికి ఒక ఉదాహరణ మరియు అతని పరిపూర్ణత, నిజాయితీ మానవత్వపు సర్వోన్నత శిఖరం, మనుష్యులు కలిగి ఉండాల్సినవి ఇవే. అతను దేవుడిని చూడనప్పటికీ, అతను దేవుడు నిజంగా ఉన్నాడని తెలుసుకున్నాడు మరియు ఇలా తెలుసుకున్నందున అతను దేవుడికి భయపడ్డాడు, దేవుడికి భయపడినందున అతను దేవుడికి విధేయుడు కాగలిగాడు. అతని వద్ద ఉన్నదంతా తీసుకోవడానికి అతను దేవుడికి స్వేచ్ఛనిచ్చాడు, అయినా అతను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు మరియు దేవుడి యెదుట సాష్టాంగపడి, ఈ క్షణంలో, దేవుడు తన శరీరాన్ని తీసుకున్నప్పటికీ, ఎలాంటి ఫిర్యాదు చేయకుండా, దేవుడు అలా తీసుకోవడానికి సంతోషంగా అనుమతిస్తానని చెప్పాడు. అతని సంపూర్ణ నడవడిక అనేది అతని యథార్థవర్తనత మరియు న్యాయశీలతతో కూడిన మానవత్వం కారణంగా వచ్చింది. అంటే, అతని అమాయకత్వం, నిజాయితీ మరియు దయ ఫలితంగా, యోబు దేవుడి ఉనికిని గ్రహించడంలో మరియు అనుభవించడంలో అచంచలంగా ఉన్నాడు, ఈ పునాదిపైనే దేవుడి ముందు అతను తన కోరికలను కోరుకున్నాడు, తన ఆలోచనలను, ప్రవర్తనను, నడవడికను మరియు పనుల నియమాలను, దేవుడు తనకు చేసిన మార్గనిర్దేశం మరియు అన్ని విషయాలలో తాను చూసిన దేవుని పనులకు అనుగుణంగా ప్రమాణీకరించుకున్నాడు. కాలం గడిచేకొద్దీ, అతని అనుభవాలే అతనిలో దేవుడి పట్ల నిజమైన మరియు వాస్తవమైన భయాన్ని కలిగించాయి మరియు అతను చెడును విసర్జించేలా చేశాయి. యోబు గట్టిగా కట్టుబడిన నిజాయితీకి ఇదే మూలం. యోబులో నిజాయితీ, అమాయకత్వం మరియు దయతో కూడిన మానవత్వం ఉంది మరియు అతనికి దేవుడికి భయపడడం, దేవుడి పట్ల విధేయత చూపడం మరియు చెడును విసర్జించడంలో వాస్తవమైన అనుభవం ఉండటంతో పాటు, “యెహోవానే ఇచ్చాడు, యెహోవానే తీసుకున్నాడు” అనే జ్ఞానం ఉంది. కేవలం వీటి కారణంగానే సాతాను చేసిన అలాంటి దుర్మార్గపు దాడుల మధ్య కూడా తన సాక్ష్యం ఇవ్వడంలో అతను స్థిరంగా నిలబడగలిగాడు మరియు కేవలం వీటి కారణంగానే దేవుడిని నిరాశపరచకుండా ఉండగలిగాడు మరియు దేవుడి పరీక్షలకు తాను గురైనప్పుడు దేవుడికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వగలిగాడు. మొదటి ప్రలోభం సమయంలో యోబు ప్రవర్తన చాలా ముక్కుసూటిగా ఉన్నప్పటికీ, తరువాతి తరాలవారు జీవితకాల ప్రయత్నాల తర్వాత కూడా అలాంటి ముక్కుసూటితనాన్ని సాధిస్తారనే దానికి లేదా పైన వివరించిన యోబు నడవడికను వారు తప్పక పొందుతారనే దానికి భరోసా లేదు. ఈరోజు, యోబు ముక్కుసూటి నడవడిక ముందు, దేవుడిని విశ్వసిస్తున్నామని మరియు దేవుడిని అనుసరిస్తున్నామని చెప్పుకునే వారు దేవుడి పట్ల “జీవితాంతం సంపూర్ణ విధేయత మరియు విశ్వాసంతో” ఉంటామనే కేకలు మరియు పట్టుదలతో పోలిస్తే, మీరు తీవ్రంగా సిగ్గుపడుతున్నారా, లేదా?

నీవు యోబు మరియు అతని కుటుంబం అనుభవించిన బాధలన్నింటినీ పవిత్ర గ్రంథాలలో చదివినప్పుడు, నీ ప్రతిస్పందన ఏమిటి? నీవు ఆలోచనలలో మునిగిపోయావా? నీవు నిర్ఘాంతపోయావా? యోబు గురైన పరీక్షలను “ఘోరమైనవిగా” వర్ణించవచ్చా? మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర గ్రంథాలలో వివరించిన విధంగా యోబు గురైన పరీక్షలను చదవడం అనేది చాలా భయం గొలిపేలా ఉంది, అదే నిజ జీవితంలో అవి ఎలా ఉండేవో చెప్పలేను. అయితే, యోబుకు సంభవించినవి “అభ్యాస కవాతు” కాదు, నిజమైన “తుపాకులు” మరియు “తూటాలు” ఉన్న నిజమైన “యుద్ధం” అని మీకు తెలుస్తుంది. కానీ అతను ఎవరి చేతిలో ఈ పరీక్షలకు గురయ్యాడు? వాస్తవానికి, అవి సాతాను చేసిన పనులే మరియు వాటిని సాతాను తన స్వహస్తాలతో చేసింది. అయినప్పటికీ, వీటిని చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. యోబును ఏ మార్గాలలో ప్రలోభపెట్టాలో దేవుడు సాతానుకు చెప్పాడా? ఆయన చెప్పలేదు. దేవుడు సాతాను తప్పక కట్టుబడాల్సిన ఒక షరతు మాత్రమే విధించాడు, ఆతర్వాత యోబు ప్రలోభపెట్టబడ్డాడు. యోబు ప్రలోభానికి గురైనప్పుడు, అది మనిషి పట్ల సాతానుకున్న విద్వేషం, అసహ్యం మరియు దేవుడి పట్ల దానికున్న శత్రుత్వం గురించి ప్రజలలో దానిపై చెడు మరియు అసహ్య భావనను కలిగించింది. ఆ ప్రలోభం ఎంత క్రూరంగా ఉండినదో మాటలు వర్ణించలేవని ఇందులో మనం చూస్తాము. ఆ క్షణంలో, మనిషిని వేధించిందిన సాతాను విద్వేషపూరిత స్వభావం మరియు దాని అసహ్యకరమైన ముఖం పూర్తిగా బట్టబయలయ్యాయని చెప్పవచ్చు. యోబును వ్యాకులపరిచే మరియు క్రూరమైన దుష్టతకు గురిచేయడానికి ఈ అవకాశాన్ని, అంటే, దేవుడు అనుమతించిన ఈ అవకాశాన్ని, సాతాను ఉపయోగించుకుంది, ఈ క్రూరత్వ విధానం మరియు స్థాయి రెండూ ఈనాటి ప్రజలు ఊహించలేనివి మరియు అసలేమాత్రం భరించలేనివి. యోబు సాతాను ద్వారా ప్రలోభపెట్టబడ్డాడని మరియు ఈ ప్రలోభ సమయంలో అతను తన సాక్ష్యం ఇవ్వడంలో స్థిరంగా నిలిచాడని చెప్పడం కంటే, దేవుడు అతనికి పెట్టిన పరీక్షలలో, యోబు తన పరిపూర్ణతను, నిజాయితీని కాపాడుకోవడానికి మరియు దేవుడి యందు భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని రక్షించడానికి సాతానుతో పోటీకి తలపడ్డాడని చెప్పడమే బాగుంటుంది. ఈ పోటీలో, యోబు కొండంత విలువైన గొర్రెలు మరియు పశువులను కోల్పోయాడు, అతను తన ఆస్తినంతటినీ కోల్పోయాడు మరియు అతను తన కుమారులు, కుమార్తెలను కూడా కోల్పోయాడు. అయినా, అతను తన పరిపూర్ణతను, నిజాయితీని లేదా దేవుడి యందు భయాన్ని విడిచిపెట్టలేదు. మరో మాటలో చెప్పాలంటే, సాతానుతో జరిగిన ఈ పోటీలో, యోబు తన పరిపూర్ణతను, నిజాయితీని మరియు దేవుడి యందు భయాన్ని కోల్పోవడం కంటే తన ఆస్తి మరియు బిడ్డలను కోల్పోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. మనిషిగా ఉండటమనే అర్థం మూలాన్ని పట్టుకుని ఉండటానికే అతను ప్రాధాన్యత ఇచ్చాడు. యోబు తన ఆస్తులను కోల్పోయే మొత్తం ప్రక్రియ సంక్షిప్త వృత్తాంతాన్ని పవిత్ర గ్రంథాలు అందిస్తాయి మరియు యోబు నడవడిక, వైఖరిని కూడా నమోదు చేస్తాయి. ఈ సంక్షిప్తమైన, క్లుప్తమైన వృత్తాంతాలు ఈ ప్రలోభాన్ని ఎదుర్కోవడంలో యోబు దాదాపు ప్రశాంతంగా ఉన్నాడనే భావాన్ని ఇస్తాయి, కానీ వాస్తవంగా జరిగిన వాటిని మళ్లీ పునర్నిర్మాణం చేయాల్సి వస్తే—సాతాను విద్వేషపూరిత స్వభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే—అప్పుడు విషయాలు ఈ వాక్యాలలో వివరించినంత సరళమైనవి లేదా సులభవైనవిగా ఉండవు. వాస్తవం చాలా క్రూరంగా ఉంది. మానవాళి పట్ల మరియు దేవుడు ఆమోదించే అన్నింటి పట్ల సాతాను వ్యవహరించే విధ్వంసకర మరియు ద్వేషపూరిత స్థాయి అలాంటిది. యోబుకు హాని చేయవద్దని దేవుడు సాతానును కోరకుంటే, సాతాను నిస్సందేహంగా ఎలాంటి కనికరం లేకుండా అతన్ని వధించి ఉండేవాడు. ఎవరైనా దేవుడిని ఆరాధించడం సాతానుకు ఇష్టముండదు, అలాగే దేవుడి దృష్టిలో నీతిమంతులు మరియు దేవుడి యందు భయం కలిగి, చెడును విసర్జించే వారుగా కొనసాగగలగడానికి పరిపూర్ణులు, నిజాయితీపరులుగా ఉండేవారిని అది ఇష్టపడదు. ప్రజలు దేవుడికి భయపడటం, చెడును విసర్జించడం అంటే, వారు సాతానును తప్పించుకోవడం మరియు విడిచిపెట్టడం అని అర్థం, కాబట్టి సాతాను ఎలాంటి కనికరం లేకుండా తన ఆగ్రహాం మరియు ద్వేషాన్ని పోగుచేసి యోబుపై విరుచుకుపడటానికి దేవుడి అనుమతిని ఉపయోగించుకుంది. తర్వాత, యోబు మనస్సు నుండి శరీరం వరకు, బయట నుండి లోపలి వరకు ఎంత భయంకరమైన వేదనను అనుభవించాడో మీరు చూస్తారు. ఆ సమయంలో అది ఎలా ఉండినదో ఈ రోజు మనకు కనిపించదు మరియు ఆ సమయంలో యోబు వేదనకు గురైనప్పుడు అతని భావోద్వేగాల సంక్షిప్త క్షణకాలపు చిత్రాన్ని బైబిల్ వృత్తాంతాల నుండి మాత్రమే మనం పొందగలము.

యోబు అచంచలమైన నిజాయితీ సాతాను అవమానపడేలా చేస్తుంది మరియు అది భయాందోళనతో పారిపోయేలా చేస్తుంది

కాబట్టి, యోబు ఈ వేదనకు గురైనప్పుడు దేవుడు ఏమి చేశాడు? దేవుడు గమనించాడు, చూశాడు మరియు ఫలితం కోసం వేచి చూశాడు. దేవుడు గమనించినప్పుడు, చూసినప్పుడు, ఆయనకు ఎమనిపించింది? వాస్తవానికి, ఆయన దుఃఖంతో తల్లడిల్లాడు. కానీ ఆయన అనుభవించిన దుఃఖం కారణంగా యోబును ప్రలోభపెట్టడానికి సాతానుకు అనుమతి ఇచ్చినందుకు దేవుడు పశ్చాత్తాపడి ఉండేవాడా? దీనికి సమాధానం, లేదు, ఆయన అలాంటి పశ్చాత్తాపపడి ఉండేవాడు కాదు. ఎందుకంటే, యోబు పరిపూర్ణుడు మరియు నిజాయితీపరుడనీ, అతనికి దేవుడి యందు భయం ఉందని మరియు చెడుని విసర్జించాడని ఆయన దృఢంగా విశ్వసించాడు. దేవుడి యెదుట యోబు నీతిని ధ్రువీకరించడానికి మరియు దాని సొంత దుర్మార్గం మరియు ధిక్కారాన్ని బహిర్గతం చేయడానికే దేవుడు సాతానుకు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా, యోబు తన నీతిని మరియు దేవుడి యందు తనకున్న భయాన్ని, చెడును విసర్జించడాన్ని లోకంలోని ప్రజలు, సాతాను మరియు దేవుడిని అనుసరించే వారందరి యెదుట కూడా పరీక్షించుకోవడానికి అతనికి ఇదొక అవకాశం. యోబు గురించి దేవుడి అంచనా సరైనదేనని మరియు దోషరహితమని అంతిమ ఫలితం రుజువు చేసిందా? నిజంగా యోబు సాతానును అధిగమించాడా? యోబు మాట్లాడిన పురాతన మాటలు మనం ఇక్కడ చదువుతాము, అతను సాతానును అధిగమించాడని రుజువు చేసే మాటలు ఇవి. అయను ఇలా అన్నాడు: “నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను.” దేవుడి పట్ల యోబుకున్న విధేయత వైఖరి ఇదే. తర్వాత, అతను ఇలా అన్నాడు: “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.” యోబు అన్న ఈ మాటలు దేవుడు మనిషి హృదయపు లోతులను గమనిస్తాడనీ, మనిషి మనసులోనికి చూడగలడనీ రుజువు చేస్తాయి, యోబును ఆయన ఆమోదించడం తప్పులేనిదనీ, దేవుడి ఆమోదం పొందిన ఈ వ్యక్తి నీతిమంతుడనీ రుజువు అవి చేస్తాయి. “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.” ఈ మాటలు దేవుడికి యోబు ఇచ్చిన సాక్ష్యం. సాతానును భయబ్రాంతికి గురిచేసింది, దానిని అవమానానికి గురిచేసింది, అది భయాందోళనలతో పారిపోయేలా చేసింది, అంతేకాకుండా, సాతానుకు సంకెళ్లు వేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసింది కూడా ఈ సాధారణ మాటలే. అలాగే, ఈ మాటలు యెహోవా దేవుడి అద్భుతాన్ని మరియు ఆయన పనుల శక్తిని సాతాను అనుభూతి చెందేలా చేశాయి మరియు దేవుని మార్గం ద్వారా పాలించబడుతున్న హృదయం గల వ్యక్తి అసాధారణ సమ్మోహన శక్తిని గ్రహించేలా చేశాయి. అంతేగాకుండా, దేవుడికి భయపడే మరియు చెడును విసర్జించే మార్గానికి కట్టుబడటం ద్వారా ఒక చిన్న మరియు మామూలు వ్యక్తి చూపించిన ప్రబల జీవశక్తిని అవి సాతానుకు ప్రదర్శించాయి. సాతాను ఆ విధంగా మొదటి పోటీలో ఓడిపోయింది. “దీనినుండి నేర్చుకున్నప్పటికీ”, సాతానుకు యోబును వదిలిపెట్టే ఉద్దేశం లేదు లేదా దాని విధ్వంసపూరిత స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. యోబుపై దాడి చేయడం కొనసాగించడానికి సాతాను ప్రయత్నించింది, కాబట్టి మరోసారి దేవుడి యెదుటకు వచ్చింది ...

తర్వాత, యోబు రెండవసారి ప్రలోభపెట్టబడటాన్ని గురించి పవిత్ర గ్రంథాలలో చదువుదాం.

3. సాతాను యోబును మరోసారి ప్రలోభపెడుతుంది (యోబు శరీరం అంతటా చీము పుండ్లు పడతాయి)

ఎ. దేవుడు అన్న మాటలు

యోబు 2:3 యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడని యెహోవా సాతానుతో అనెను.

యోబు 2:6 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవిచ్చెను.

బి. సాతాను అన్న మాటలు

యోబు 2:4-5 అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని సాతాను యెహోవాకు జవాబిచ్చెను.

సి. పరీక్షను యోబు ఎలా ఎదుర్కొంటాడు

యోబు 2:9-10 అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు ఆమెతో, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. ఏమిటి? మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా? అనెను. ఈ అన్నింటిలో యోబు తన మాటలలో కూడా పాపము చేయలేదు.

యోబు 3:3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

దేవుడి మార్గం పట్ల యోబుకున్న ప్రేమ మిగతా అన్నింటిని అధిగమించింది

దేవుడు మరియు సాతాను మధ్య జరిగిన మాటలను పవిత్ర గ్రంథాలు కింది విధంగా నమోదు చేశాయి: “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేని నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడని యెహోవా సాతానుతో అనెను”(యోబు 2:3). ఈ సంభాషణలో, దేవుడు సాతానును మళ్లీ అదే ప్రశ్న అడిగాడు. ఇది మొదటి పరీక్ష సమయంలో యోబు ప్రదర్శించిన మరియు జీవించిన దాని గురించి యెహోవా దేవుడి నిర్ధారణాపూర్వక అంచనాను మనకు చూపే ప్రశ్న, సాతాను ప్రలోభానికి గురవ్వడానికి ముందు యోబు గురించి దేవుడు అంచనా వేసిన దానికి ఇది ఏమాత్రం భిన్నంగా లేదు. చెప్పాలంటే, అతను ప్రలోభానికి గురవ్వడానికి ముందే, దేవుని దృష్టిలో యోబు పరిపూర్ణుడు, కాబట్టి దేవుడు అతన్ని మరియు అతని కుటుంబాన్ని రక్షించాడు మరియు అతనిని ఆశీర్వదించాడు; దేవుడి దృష్టిలో అతను ఆశీర్వదించబడేందుకు అర్హుడు. ప్రలోభం తర్వాత, యోబు తన ఆస్తిని మరియు తన బిడ్డలను కోల్పోయిన కారణంగా తన మాటలతో పాపం చేయలేదు, కానీ యెహోవా నామాన్ని స్తుతించడాన్ని కొనసాగించాడు. అతని అసలు నడవడికయే దేవుడు అతనిని మెచ్చుకునేటట్లు చేసింది, దాని కారణంగా, దేవుడు అతనికి పూర్తి మార్కులు ఇచ్చాడు. ఎందుకంటే యోబు దృష్టిలో, అతను దేవుడిని త్యజించేలా చేయడానికి అతని సంతానం లేదా అతని ఆస్తులు సరిపోవు. మరో మాటలో చెప్పాలంటే, అతని హృదయంలోని దేవుడి స్థానాన్ని, అతని బిడ్డలు లేదా ఏదైనా ఆస్తి భర్తీ చేయలేదు. యోబు మొదటిసారి ప్రలోభానికి గురైన సమయంలో, అతనికి దేవుడి యందుగల ప్రేమ మరియు దేవుడి యందు భయం కలిగి ఉండే మరియు చెడుని విసర్జించే మార్గం పట్ల అతనికున్న ప్రేమ మిగతా అన్నింటిని మించిపోయాయని దేవుడికి చూపాడు. ఈ పరీక్ష యోబుకు కేవలం యెహోవా దేవుడి నుండి బహుమతిని పొందిన మరియు అతనికున్న ఆస్తి మరియు బిడ్డలను ఆయనే తీసుకుపోయిన అనుభవాన్ని అందించింది.

యోబుకైతే, ఇది అతని ఆత్మను పరిశుద్ధం చేసిన నిజమైన అనుభవం; ఇది అతని ఉనికిని నెరవేర్చిన జీవిత బాప్టిజం, అంతేగాకుండా, ఇది దేవుడి పట్ల అతని విధేయతను మరియు దేవుడి యందు భయాన్ని పరీక్షించే ఒక విలాసవంతమైన విందు. ఈ ప్రలోభం యోబును ధనవంతుడి స్థాయి నుండి ఏమీ లేని నిరుపేద స్థాయికి మార్చింది మరియు అది మానవాళి పట్ల సాతాను దుష్టతను అనుభవించేలా కూడా చేసింది. అతని దారిద్ర్యము అతను సాతానును అసహ్యించుకునేలా చేయకపోగా, అతను సాతాను నీచమైన పనులలో సాతాను వికార రూపాన్ని మరియు ధిక్కారాన్ని, అలాగే దేవుడి పట్ల సాతానుకున్న శత్రుత్వాన్ని మరియు తిరుగుబాటును చూశాడు మరియు ఇది దేవుడి యందు భయం కలిగి ఉండే మరియు చెడును విసర్జించే మార్గాన్ని ఎప్పటికీ గట్టిగా పట్టుకుని ఉండేలా అతన్ని బాగా ప్రోత్సహించింది. ఆస్తి, బిడ్డలు లేదా బంధుమిత్రులు లాంటి బాహ్య కారణాల వలన తాను దేవుడిని ఎప్పటికీ విడిచిపెట్టనని మరియు దేవుడి మార్గాన్ని తిరస్కరించనని, లేదా సాతానుకు, ఆస్తి లేదా ఎవరైనా వ్యక్తికి బానిసగా ఉండనని అతను గట్టి నిర్ణయంతో వ్యవహరించాడు; యెహోవా దేవుడు తప్ప, ఎవరూ తనకు ప్రభువు లేదా దేవుడు కాలేరని ప్రమాణం చేశాడు. యోబు ఆకాంక్షలు అలా ఉండేవి. మరోవైపు, యోబు ఈ ప్రలోభం నుండి కూడా ఏదో ఒకటి సంపాదించాడు: దేవుడు అతనికి పెట్టిన పరీక్షల మధ్య అతను గొప్ప సంపదను సంపాదించాడు.

యోబు జీవితంలో గత కొన్ని దశాబ్దాల పాటు, అతను యెహోవా కార్యములను చూశాడు మరియు యెహోవా దేవుడి ఆశీర్వాదాలు పొందాడు. అతనికి అపారమైన అసౌకర్యం మరియు రుణపడిపోవడాన్ని మిగిల్చినవి ఆ ఆశీర్వాదాలే, ఎందుకంటే అతను దేవుడి కోసం ఏమీ చేయలేదనీ, అయినా అంత గొప్ప ఆశీర్వాదాలను మరియు అంత ఎక్కువ కృపను పొందాననీ అతను విశ్వసించాడు. ఈ కారణంచేత, అతను దేవుడి రుణం తీర్చగలుగుతానని ఆశిస్తూ, దేవుడి కార్యములు మరియు ఘనతకు సాక్ష్యమిచ్చే అవకాశం తనకు లభిస్తుందని ఆశిస్తూ, దేవుడు తన విధేయతకు పరీక్ష పెడతాడని ఆశిస్తూ, అంతేకాకుండా, అతని విధేయత మరియు అతని విశ్వాసం దేవుడి ఆమోదం పొందే వరకు అతని విశ్వాసం పరిశుద్ధం చేయబడగలదని, అతను తరచుగా తన హృదయంలో ప్రార్థించాడు. తర్వాత, యోబు పరీక్షకు గురైనప్పుడు, దేవుడు తన ప్రార్థనలను విన్నాడని అతను విశ్వసించాడు. యోబు ఈ అవకాశాన్ని అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు, అందుచేత అతను దానిని తేలికగా చూసే సాహసం చేయలేదు, ఎందుకంటే అతని అతిపెద్ద జీవితకాలపు కోరిక నెరవేరగలదు. ఈ అవకాశం రావడమంటే, అతని విధేయత మరియు దేవుడి యందు భయం పరీక్షించబడగలవు మరియు పరిశుద్ధం చేయబడగలవని అర్థం. అంతేగాకుండా, యోబుకు దేవుడి ఆమోదం పొందే అవకాశం లభించిందనీ, ఆ విధంగా అతను దేవుడికి దగ్గరయ్యాడనీ దీని అర్థం. పరీక్ష సమయంలో, అలాంటి విశ్వాసం మరియు పట్టుదల అతన్ని మరింత పరిపూర్ణుడుగా తయారయ్యేలా మరియు దేవుడి చిత్తం గురించి మరింత అర్థం చేసుకునేలా చేశాయి. దేవుని ఆశీర్వాదాలు మరియు కృపకు యోబు కూడా ఎంతో కృతజ్ఞతతో నిండిపోయాడు, దేవుడి పనుల పట్ల అతని మనసులో గొప్ప ప్రశంసలు కురిపించాడు, దేవుడి పట్ల అతను మరింత భయభక్తులతో, గౌరవంతో ఉన్నాడు మరియు దేవుడి మనోహరత, ఘనత, పరిశుద్ధత కోసం మరింత పరితపించాడు. ఈ సమయంలో, యోబు దేవుడి పట్ల భయం కలిగిన, చెడును విసర్జించిన వ్యక్తి అయినప్పటికీ, అతని అనుభవాలకు సంబంధించి, యోబు విశ్వాసం మరియు జ్ఞానం ఉరుకుల పరుగులతో వృద్ధి చెందాయి: అతని విశ్వాసం పెరిగింది, అతని విధేయత వేళ్లూనుకుంది మరియు దేవుడి పట్ల అతని భయం మరింత ప్రగాఢంగా మారింది. ఈ పరీక్ష యోబు స్ఫూర్తిని మరియు జీవితాన్ని మార్చినప్పటికీ, అలాంటి మార్పు యోబును సంతృప్తిపరచలేదు లేదా అతని పురోగతిని నెమ్మదిపర్చలేదు. అదే సమయంలో, ఈ పరీక్ష నుండి అతను పొందినదానిని లెక్కిస్తూ, తన సొంత లోటుపాట్లను పరిగణిస్తూ, తనకు ఎదురయ్యే తదుపరి పరీక్ష కోసం వేచి చూస్తూ, అతను నిశ్శబ్దంగా ప్రార్థించాడు, ఎందుకంటే, దేవుడి తరువాతి పరీక్ష సమయంలో తన విశ్వాసం, విధేయత మరియు దేవుడి యందు భయం కలిగి ఉండటాన్ని పెంచుకోవాలని అతను ఆకాక్షించాడు.

మనిషి మనస్సులోని ఆలోచనలను మరియు మనిషి మాట్లాడే మరియు చేసే ప్రతిదాన్ని దేవుడు గమనిస్తాడు. యోబు ఆలోచనలు యెహోవా దేవుడి చెవులకు చేరాయి. ఊహించినట్లే, దేవుడు అతని ప్రార్థనలను ఆలకించాడు. ఈ విధంగా యోబుకు దేవుని తదుపరి పరీక్ష వచ్చింది.

విపరీతమైన శ్రమల మధ్య, మానవాళి మీద దేవుడి శ్రద్ధను నిజంగా గ్రహించిన యోబు

సాతానుకు యెహోవా దేవుడు ప్రశ్నలు వేసిన తర్వాత, సాతాను లోలోపల సంతోషించింది. ఎందుకంటే దేవుడి దృష్టిలో పరిపూర్ణుడైన మనిషిపై దాడి చేయడానికి ఇది మరోసారి అనుమతిస్తుందని సాతానుకు తెలుసు-సాతానుకు ఇది ఒక అరుదైన అవకాశం. యోబు నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి, దేవుడిపై అతని విశ్వాసాన్ని కోల్పోయేలా చేయడానికి, తద్వారా ఇకపై దేవుడికి భయపడకుండా లేదా దేవుడి నామాన్ని స్తుతించకుండా చేయడానికి, సాతాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంది. ఇది సాతానుకు ఒక అవకాశం లాంటిది. ఎందుకంటే: ఏ స్థలంలోనైనా లేదా సమయంలోనైనా, అది యోబును తన ఆజ్ఞకు అనుగుణంగా ఆడే ఒక ఆట వస్తువు లాగా మార్చుకోగలదు. సాతాను తన దుష్ట ఉద్దేశాల జాడ కూడా తెలియకుండా దాచిపెట్టింది, కానీ అది తన దుష్ట స్వభావాన్ని నియంత్రించుకోలేక పోయింది. పవిత్ర గ్రంథాలలో నమోదు చేయబడినట్లు, యెహోవా దేవుడి మాటలకు దాని సమాధానంలో ఈ సత్యం సూచించబడింది: “అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని సాతాను యెహోవాకు జవాబిచ్చెను” (యోబు 2:4-5). దేవుడికి, సాతానుకు మధ్య జరిగిన ఈ సంభాషణ నుండి సాతాను ద్వేషం గురించి జ్ఞానాన్ని మరియు అనుభూతిని పొందకుండా ఉండటం అనేది అసాధ్యం. సాతాను ఈ భ్రమలను విన్న తరువాత, సత్యాన్ని ప్రేమించే మరియు చెడును అసహ్యించుకునే వారందరూ నిస్సందేహంగా సాతాను మూర్ఖత్వాన్ని, సిగ్గులేనితనాన్ని ఎంతో ద్వేషిస్తారు, సాతాను భ్రమలను చూసి భయం మరియు అసహ్యం చెందుతారు, అదే సమయంలో, యోబు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేస్తారు, అతనికి మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు, ఈ నీతిమంతుడైన వ్యక్తి పరిపూర్ణతను సాధించగలగాలని ప్రార్థిస్తారు, దేవుడికి భయపడే, చెడును విసర్జించే ఈ వ్యక్తి సాతాను ప్రలోభాలను శాశ్వతంగా అధిగమించాలని మరియు దేవుడి మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాల మధ్య వెలుతురులో జీవించాలని కోరుకుంటారు; అదేవిధంగా, అలాంటి వ్యక్తులు యోబు నీతిమంతమైన పనులు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించే వారందరినీ ఎప్పటికీ ప్రేరేపించాలని మరియు ప్రోత్సహించాలని కోరుకుంటారు. ఈ ప్రకటనలో సాతాను దురుద్దేశం కనిపించినప్పటికీ, సాతాను “అభ్యర్థనకు” దేవుడు ప్రశాంతంగా సమ్మతించాడు-కానీ ఆయన ఒక షరతు కూడా విధించాడు: “అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదు” (యోబు 2:6). ఎందుకంటే, ఈసారి, యోబు శరీరానికి హాని కలిగించడానికి సాతాను తన చేతిని పొడిగించమని అడిగింది, దానికి దేవుడు “కానీ అతని ప్రాణాన్ని రక్షించు” అని చెప్పాడు. అంటే, ఆయన యోబు శరీరాన్ని సాతానుకు ఇచ్చాడని అర్థం, కానీ యోబు జీవితాన్ని రక్షించడం దేవుడి బాధ్యత. సాతాను యోబు ప్రాణాన్ని తీయలేకపోయింది, అయితే ఇది కాకుండా యోబుకు వ్యతిరేకంగా సాతాను ఇతర మార్గాలను లేదా పద్ధతిని ఉపయోగించగలిగింది.

దేవుడి అనుమతి తీసుకున్న తర్వాత, వెంటనే సాతాను యోబు వద్దకు వెళ్లి, అతని శరీరమంతా చీము పుండ్లు పడేలా చేస్తూ, అతని చర్మాన్ని గాయపర్చడానికి తన చేతిని ముందుకు చాచింది, దీంతో యోబు చర్మంపై నొప్పితో బాధపడ్డాడు. యోబు యెహోవా దేవుడి అద్భుతాన్ని, పరిశుద్ధతను స్తుతించాడు, అది సాతాను పొగరును ఇంకా ఎక్కువ ఘోరంగా మార్చింది. మనిషిని బాధపెట్టడంలో అది సంతోషాన్ని పొందుతుంది కాబట్టి, సాతాను తన చేతిని ముందుకు చాచి యోబు చర్మాన్ని చీల్చి, అతనికి చీము పుండ్లు పడేలా చేసింది. వెంటనే యోబుకు తన శరీరమంతా విపరీతమైన నొప్పి మరియు బాధ కలిగాయి, ఈ నొప్పి వలన అతని ఆత్మకు తగిలిన దెబ్బ నుండి ఉపశమనం లభిస్తుందా అన్నట్లు, అతను తల నుండి పాదాల వరకు చేతులతో తడుముకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. దేవుడు తనను చూస్తూ తన పక్కనే ఉన్నాడనీ, కనిపించకుండా ఉండేందుకు శాయశక్తులా ఆయన ప్రయత్నించాడనీ యోబు తెలుసుకున్నాడు. అందుకే, అతను మరోసారి నేలపై మోకరిల్లి: “నీవు మనిషి హృదయం లోనికి చూస్తావు, నీవు అతని యాతనను గమనిస్తావు; అతని బలహీనత నీకు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అన్నాడు. యోబు అనుభవిస్తున్న భరించలేని బాధను సాతాను చూసిందే తప్ప, యెహోవా దేవుడి నామమును యోబు విడిచిపెట్టడం అది చూడలేదు. ఆ విధంగా, అతని ఒక్కొక్క అవయవాన్ని చీల్చాలని తహతహలాడుతూ, అది యోబు ఎముకలను గాయపర్చడానికి తన చేతిని హడావుడిగా ముందుకు చాచింది. ఒక్క క్షణంలో, యోబు ఇంతకు ముందెన్నడూ అనుభవించని యాతనను అనుభవించాడు; ఆ యాతన అతని ఎముకల నుండి మాంసాన్ని ఒలుస్తున్నారా, అతని ఎముకలను ముక్కలు ముక్కలుగా నుజ్జునుజ్జు చేస్తున్నారా అన్నట్లుగా ఉంది. ఈ చిత్రవధ చేసే యాతన కన్నా చనిపోవడమే మేలని అతను అనుకునేలా చేసింది. ఈ నొప్పిని భరించగల అతని సామర్థ్యం దాని పరిమితికి చేరుకుంది.... అతను గట్టిగా ఏడ్వాలనుకున్నాడు, నొప్పిని తగ్గించుకునే ప్రయత్నంలో అతను తన శరీరం నుండి చర్మాన్ని పీకివేయాలనుకున్నాడు-అయినప్పటికీ అతను తన అరుపులను అణచుకున్నాడు మరియు అతని శరీరం నుండి చర్మాన్ని పీకివేయలేదు, ఎందుకంటే తన బలహీనతను సాతాను చూడటం అతనికి ఇష్టం లేదు. కాబట్టి యోబు మరోసారి మోకరిల్లాడు, కానీ ఈసారి అతనికి యెహోవా దేవుడు ఉన్నట్లు అనిపించలేదు. యెహోవా దేవుడు తరచుగా అతని ముందు, అతని వెనుక, మరియు అతనికి ఇరుపక్కల ఉంటాడని అతనికి తెలుసు. అయినప్పటికీ, అతని నొప్పి సమయంలో, దేవుడు ఒక్కసారి కూడా చూడలేదు; అతను తన ముఖాన్ని కప్పుకుని, దాక్కున్నాడు, ఎందుకంటే ఆయన మనిషిని సృష్టించడంలోని అర్థం మనిషికి బాధలు తీసుకురావడం కాదు. ఈ సమయంలో, యోబు రోదిస్తున్నాడు, ఈ శారీరక యాతనను తట్టుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తున్నాడు, అయినప్పటికీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా అతను ఎక్కువసేపు ఉండలేకపోయాడు: “మొదటి దెబ్బకు మనిషి పడిపోతాడు, అతను బలహీనుడు మరియు అశక్తుడు, అతను చిన్న వయసువాడు మరియు అజ్ఞాని-నీవు అతని పట్ల ఎందుకు అంత శ్రద్ధగా మరియు సున్నితంగా ఉండాలనుకుంటున్నావు? నీవు నన్ను దెబ్బ కొట్టావు, అయినా అలా చేయడం నిన్నే బాధిస్తుంది. నీవు సంరక్షణ మరియు శ్రద్ధ తీసుకోవడానికి మనిషిలో అంత విలువైనది ఏముంది?” యోబు ప్రార్థనలు దేవుడి చెవులకు చేరాయి, దేవుడు మౌనంగా ఉన్నాడు, కేవలం నిశ్శబ్దంగా చూస్తున్నాడు.... గ్రంథంలోని ప్రతి ఉపాయాన్ని ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో, సాతాను నిశ్శబ్దంగా వెళ్లిపోయింది, అయినప్పటికీ యోబుపై దేవుడి పరీక్షలకు ఇది ముగింపు పలకలేదు. యోబులో బయలుపరచబడిన దేవుడి శక్తి బహిరంగపరచబడలేదు కాబట్టి, సాతాను వెనక్కు వెళ్లిపోవడంతో యోబు కథ ముగియలేదు. ఇతర పాత్రలు ప్రవేశించడంతో, మరిన్ని అద్భుత దృశ్యాలు ఇంకా రావాల్సి ఉంది.

యోబు అన్ని సందర్భాల్లోనూ దేవుడి పేరు స్తుతించడమనేది దేవుడి పట్ల అతని భయం మరియు అతను చెడును విస్మరించడానికి సంబంధించి మరొక వ్యక్తీకరణ

యోబు సాతాను విధ్వంసాన్ని అనుభవించాడు, అయినప్పటికీ అతడు యెహోవా దేవుడి నామాన్ని వదిలిపెట్టలేదు. మనిషి కళ్ళకు కనిపించే రూపంలో సాతాను పాత్రను పోషిస్తూ, మొట్టమొదట బయటకు వచ్చిన అతని భార్య, యోబుపై దాడి చేసింది. మూల వచనం దీనిని ఇలా వివరిస్తుంది: “అతని భార్య వచ్చినీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను” (యోబు 2:9-10). ఇవి మనిషి ముసుగులోని సాతాను మాట్లాడిన మాటలు. అవి ఒక దాడి, ఒక ఆరోపణ, అలాగే ఒక ఎర, ఒక ప్రలోభం, మరియు ఒక నింద. యోబు శరీరంపై దాడి చేయడంలో విఫలమైనందున, యోబు తన నిజాయితీని విడిచిపెట్టి, దేవుడిని పరిత్యజించి, ఇకపై జీవించకుండా ఉండేలా చేయాలనుకుంటూ, సాతాను యోబు నిజాయితీపై నేరుగా దాడి చేసింది. అలాగే, యోబును ప్రలోభపెట్టడానికి అలాంటి మాటలను ఉపయోగించాలని కూడా సాతాను అనుకుంది: యెహోవా నామాన్ని యోబు వదిలిపెట్టి ఉంటే, అతను అంత యాతనను భరించాల్సిన అవసరం ఉండేది కాదు; అతను శారీరక వేదన నుండి బయటపడగలిగేవాడు. తన భార్య సలహాకు బదులుగా, యోబు ఆమెను ఇలా అంటూ మందలించాడు, “నువ్వు ఒక మూర్ఖురాలైన స్త్రీ మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఏమిటి? మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” (యోబు 2:10). యోబుకు ఈ మాటలు ఎంతోకాలం నుండి తెలుసు, కానీ వాటిని గురించి యోబుకు జ్ఞానం ఉందనే సత్యం ఇప్పుడు నిరూపించబడింది.

అతని భార్య దేవుడిని దూషించి మరణించాలని అతనికి సలహా ఇచ్చినప్పుడు, ఆమె మాటల్లోని అర్థం: నీ దేవుడు నీతో అలాగే వ్యవహరిస్తాడు, కాబట్టి ఆయనను ఎందుకు దూషించకూడదు? ఇంకా జీవించి నీవు ఏమి చేస్తున్నావు? నీ దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు, అయినప్పటికీ నీవు ‘యెహోవా నామము స్తుతింపబడునుగాక’ అని అంటున్నావు. నీవు ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు ఆయన నీపైకి విపత్తును ఎలా తీసుకురాగలిగాడు? త్వరపడు, దేవుడి నామాన్ని వదిలిపెట్టు, ఇక ఏమాత్రం ఆయనను అనుసరించకు. అప్పుడు నీ కష్టాలు ముగిసిపోతాయి.” ఈ క్షణంలో పుట్టింది, దేవుడు యోబులో చూడాలనుకున్న సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని సాధారణ వ్యక్తి ఎవరూ భరించగలిగేవాడు కాదు లేదా ఇలాంటిది బైబిల్‌లోని ఏ కథలోనూ మనం చదవలేదు-కానీ యోబు ఈ మాటలు మాట్లాడడానికి ఎంతోకాలం ముందే దేవుడు దానిని చూశాడు. దేవుడు చేసింది సరైనదేనని యోబు అందరికీ నిరూపించేలా వీలుకల్పించడానికి మాత్రమే దేవుడు ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకున్నాడు. అతని భార్య సలహాను మేరకు యోబు తన నిజాయితీని వదులిపెట్టలేదు లేదా దేవుడిని పరిత్యజించలేదు, కానీ అతను తన భార్యతో ఇలా అన్నాడు: “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” ఈ మాటలకు గొప్ప విలువ ఉందా? ఇక్కడ, ఈ మాటల విలువను రుజువు చేయగల ఒకేఒక వాస్తవం ఉంది. ఈ మాటల విలువ ఏమిటంటే, వాటిని దేవుడు తన హృదయంలో ఆమోదించాడు, వీటినే దేవుడు కోరుకున్నది, ఇవే దేవుడు వినాలనుకున్నవి మరియు దేవుడు చూడాలనుకున్న ఫలితం ఇదే; ఈ మాటలే యోబు సాక్ష్యానికి కీలకం. దీనిలో, యోబు పరిపూర్ణత, నిజాయితీ, దేవుడి పట్ల భయం మరియు చెడును విసర్జించడం నిరూపించబడ్డాయి. అతను ప్రలోభ పెట్టబడినప్పుడు, అతని శరీరమంతా చీము పుండ్లు పడినప్పుడు, అతను తీవ్రమైన వేదనను భరించినప్పుడు మరియు అతని భార్య మరియు బంధువర్గం అతనికి సలహా ఇచ్చినప్పుడు కూడా, అతను అలాంటి మాటలు మాట్లాడడంలోనే యోబు అమూల్యత ఉంది. మరోలా చెప్పాలంటే, ఏ ప్రలోభాలు వచ్చినప్పటికీ, ఎంతటి బాధాకరమైన దురవస్థలు లేదా వేదనలైనప్పటికీ, తనకు మరణమే సంభవించినప్పటికీ, దేవుడిని పరిత్యజించనని లేదా దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని త్యజించనని అతను మనస్సులో విశ్వసించాడు. కాబట్టే, అతని హృదయంలో దేవుడికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉందనీ, అతని హృదయంలో దేవుడే ఉన్నాడని మీకు కనిపిస్తుంది. అందుచేతనే మనం పవిత్ర గ్రంథాలలో అతన్ని గురించి ఇలాంటి వర్ణనలను చదువుతాము: ఈ అన్నింటిలో యోబు తన మాటలలో కూడా పాపము చేయలేదు. అతను తన మాటల్లో కూడా పాపం చేయకపోవడమే కాకుండా, తన హృదయంలో దేవుడి గురించి అతను ఫిర్యాదు చేయలేదు. అతను దేవుడి గురించి గాయపరిచే మాటలు మాట్లాడలేదు లేదా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. అతని నోటితో దేవుడి నామాన్ని స్తుతించడం మాత్రమే కాకుండా, హృదయంలో కూడా అతను దేవుడి నామాన్నే స్తుతించాడు; అతని నోరు మరియు హృదయం ఒక్కటిగా ఉన్నాయి. దేవుడు చూచిన నిజమైన యోబు ఇతనే, ఈ కారణంతోనే దేవుడు యోబును అమూల్యంగా పరిగణించాడు.

యోబు గురించి ప్రజల్లో ఉన్న ఎన్నెన్నో అపార్థాలు

యోబు అనుభవించిన కష్టాలు దేవుడు పంపిన దేవదూతలు చేసిన పని కాదు లేదా అది దేవుడు స్వహస్తాలతో చేసింది కూడా కాదు. దానికి బదులుగా, ఇది దేవుడి శత్రువైన సాతాను స్వయంగా చేసిన పని. ఫలితంగా, యోబు అనుభవించిన కష్టాల స్థాయి తీవ్రమైనది. అయినప్పటికీ, ఆ క్షణంలో, యోబు దేవుడి గురించి తన హృదయంలో ఉన్న రోజువారీ జ్ఞానాన్నీ, అతని రోజువారీ పనుల నియమాలను మరియు దేవుడి పట్ల అతని వైఖరినీ ఎలాంటి పరిమితి లేకుండా ప్రదర్శించాడు-ఇది సత్యం. యోబు ప్రలోభపెట్టబడకపోతే, దేవుడు యోబుకు పరీక్షలు పెట్టకపోతే, “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అని యోబు అన్నప్పుడు, యోబు వంచకుడనీ; దేవుడు అతనికి చాలా ఆస్తులు ఇచ్చాడు కాబట్టే, అతను యెహోవా నామమును స్తుతించాడని మీరు అంటారు. ఒకవేళ, పరీక్షలకు గురికాకముందే, “మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా” అని యోబు అన్నట్లయితే, యోబు అతిశయోక్తిగా మాట్లాడుతున్నాడనీ మరియు అతడు దేవుడి చేతితో తరచుగా ఆశీర్వదించబడినందున అతడు దేవుడి నామమును విడిచిపెట్టడనీ మీరు అంటారు. దేవుడు అతనికి వినాశనం కలిగించి ఉంటే, అతను దేవుడి నామమును ఖచ్చితంగా విడిచిపెట్టేవాడని కూడా మీరు అంటారు. ఎవరూ కోరుకోని లేదా చూడటానికి కూడా ఇష్టపడని పరిస్థితులలో, తమ మీదకు రాబోతున్నాయనే భయపడే, తమకు రావాలని ఎవరూ కోరుకోని, దేవుడు కూడా చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, యోబు తన చిత్తశుద్ధిని నిలబెట్టుకోగలిగాడు: “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక,” మరియు “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” ఈ సమయంలో యోబు నడవడికను చూశాక, పెద్దపెద్ద మాటలు మాట్లాడటానికి ఇష్టపడే మరియు సాహిత్యాలను, సిద్ధాంతాలను మాట్లాడటానికి ఇష్టపడే వారందరూ నోటి మాటరాక మూగబోయారు. మాటల్లో మాత్రమే దేవుడి నామమును స్తుతించే వారు, అయినప్పటికీ, దేవుడి పరీక్షలను ఎన్నడూ అంగీకరించని వారంతా యోబు స్థిరంగా కట్టుబడిన నిజాయితీ ద్వారా ఖండించబడ్డారు మరియు దేవుడి మార్గానికి మనిషి స్థిరంగా కకట్టుబడగలడని ఎన్నడూ నమ్మని వారంతా యోబు సాక్ష్యంతో తీర్పు పొందారు. ఈ పరీక్షల సమయంలో, యోబు నడవడిక మరియు అతను మాట్లాడిన మాటలను చూశాక, యోబు సాక్ష్యాన్ని నిరాకరిస్తూ, కొందరు అయోమయంగా, కొందరు అసూయగా, కొందరు అనుమానంగా, మరికొందరు నిరాసక్తంగా కూడా కనిపిస్తారు, ఎందుకంటే పరీక్షల సమయంలో యోబుకు ఎదురైన వేదనను చూడటం, యోబు మాట్లాడిన మాటలను చదవడమే కాకుండా, పరీక్షలు ఎదురైనప్పుడు యోబు ద్వారా బట్టబయలైన మనిషి “బలహీనతను” కూడా చూస్తారు. ఈ “బలహీనత” యోబు పరిపూర్ణత్వంలో అసంపూర్ణత్వమని, దేవుడి దృష్టిలో పరిపూర్ణుడైన వ్యక్తిలోని మచ్చ అని వారు విశ్వసిస్తారు. అనగా, పరిపూర్ణులంటే దోష రహితమైన వారనీ, మచ్చ లేదా కళంకం లేనివారనీ, వారికి బలహీనతలు ఉండవనీ, బాధ తెలియదనీ, వారు ఎన్నడూ దుఃఖముతో లేదా విచారంతో ఉండరనీ మరియు ద్వేషం లేదా బయటికి విపరీతమైన ప్రవర్తన చూపకుండా ఉంటారనీ విశ్వాసం ఉంది; దీంతో, యోబు నిజంగా పరిపూర్ణుడని చాలామంది విశ్వసించరు. అతనికి పరీక్షలు ఎదురైన సమయంలోని అతని ప్రవర్తనను, ప్రజలు చాలా వరకు ఆమోదించరు. ఉదాహరణకు, యోబు తన ఆస్తిని మరియు బిడ్డలను కోల్పోయినప్పుడు, ప్రజలు ఊహించినట్లుగా, అతను కన్నీటిపర్యంతం కాలేదు. అతని “తగినట్లుగా ప్రవర్తన లేకపోవడం” అనేది అతను ఉదాసీనంగా ఉన్నాడని ప్రజలు అనుకునేలా చేస్తుంది, ఎందుకంటే తన కుటుంబం కోసం అతనిలో కన్నీరు లేదా ఆప్యాయత లేవు. యోబు పట్ల ప్రజలకు కలిగిన మొదటి చెడు అభిప్రాయం ఇదే. ఆ తర్వాత అతని ప్రవర్తన వారిని మరింత కలవరపరచింది. “పై వస్త్రమును చింపుకోవడం” అనేది దేవుడి పట్ల అతనికున్న అగౌరవంగా ప్రజలు అన్వయించుకున్నారు మరియు “అతను తలవెండ్రుకలు గొరిగించుకోవడం” అంటే దేవుడి పట్ల యోబు దైవదూషణ మరియు వ్యతిరేకత అని తప్పుగా విశ్వసించారు. “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అనే యోబు మాటలను తప్ప, యోబులో దేవుడు మెచ్చుకున్న ఏ నీతినీ ప్రజలు గుర్తించరు, అందువల్ల యోబు గురించి అత్యధికులకు అవగాహన లేకపోవటం, అపార్థం, సందేహం, నిరాకరించడం మరియు సిద్ధాంతాన్ని మాత్రమే ఆమోదించడం తప్ప మరేమీ కాదు. యోబు పరిపూర్ణుడు మరియు నీతిమంతుడు, దేవుడి పట్ల భయం కలిగిన, చెడును విసర్జించినవాడు అనే యెహోవా దేవుడి మాటలను వారిలో ఏ ఒక్కరూ నిజంగా అర్థం చేసుకోలేరు మరియు ప్రశంసించలేరు.

యోబు గురించి వారికున్న పై అభిప్రాయాన్ని బట్టి, అతని నీతి పట్ల ప్రజలకు మరిన్ని సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే, పవిత్ర గ్రంథాలలో నమోదు చేయబడిన యోబు పనులు, నడవడిక ప్రజలు ఊహించినంతగా భూమి బద్దలయ్యేంత ఆశ్చర్యాన్ని కలిగించేలా లేవు. అతను ఘనకార్యాలేవీ చేయకపోవడమే కాకుండా, బూడిద మధ్యలో కూర్చొని తనకుతాను గోక్కోవడానికి ఒక కుండపెంకును కూడా తీసుకున్నాడు. ఈ పని కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది, యోబు నీతిని సందేహించేలా-తిరస్కరించేలా కూడా-చేస్తుంది, ఎందుకంటే తనకుతాను గోక్కునే సమయంలో యోబు దేవుడిని ప్రార్థించలేదు లేదా వాగ్దానాలు చేయలేదు; పైగా, అతను నొప్పితో రోదించినట్లు కనిపించలేదు. ఈ సమయంలో, ప్రజలు యోబు బలహీనతను తప్ప ఇకదేన్నీ చూడలేదు, అందువల్ల వారు “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” అని యోబు అనడాన్ని విన్నప్పుడు కూడా, వారు అసలు చలించలేదు లేదా అనిశ్చితితో లేరు మరియు యోబు మాటల నుండి అతని నీతిని ఇంకా గుర్తించలేకుండానే ఉన్నారు. యోబు తన పరీక్షల వేదనలను అనుభవిస్తున్న సమయంలో ప్రజలకు కలిగిన ప్రాథమిక అభిప్రాయం ఏమిటంటే, అతను కుంగిపోలేదు లేదా అహంకారంగా లేడు. ప్రజలు అతని ప్రవర్తన నేపథ్యంలో ఉన్న అతని హృదయపు లోతుల్లో జరిగిన కథను చూడరు లేదా అతని హృదయంలో దేవుడి పట్ల భయాన్ని లేదా చెడును విసర్జించే మార్గపు నియమానికి అతను కట్టుబడి ఉండడాన్ని చూడరు. అతని నిబ్బరము, అతని పరిపూర్ణత మరియు నిజాయితీ అనేవి కేవలం డొల్ల మాటలనీ, దేవుడి పట్ల అతనికున్న భయం కేవలం అక్కడ ఇక్కడ విన్న మాటలు మాత్రమేననీ ప్రజలు అనుకునేలా చేస్తుంది, అదే సమయంలో, అతను బయటికి వెల్లడించిన “బలహీనత”, దేవుడు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడని నిర్వచించిన అతని పట్ల వారికి “కొత్త దృక్పథాన్ని” అలాగే “కొత్త అవగాహనను” కూడా ఇస్తూ, వారిపై ఒక గాఢమైన ముద్ర వేస్తుంది. అలాంటి “కొత్త దృక్పథం” మరియు “కొత్త అవగాహన” యోబు నోరు తెరిచి, అతను పుట్టిన రోజును దూషించినప్పుడు నిరూపించబడింది.

అతను అనుభవించిన వేదన స్థాయి ఏ మనిషికీ ఊహకందనిది మరియు అర్థంకానిది అయినప్పటికీ, అతను మతవిరుద్ధమైన మాటలు మాట్లాడలేదు, కానీ తన సొంత మార్గాల ద్వారా తన శరీర బాధను తగ్గించుకున్నాడు. పవిత్ర గ్రంథాలలో నమోదు చేయబడినట్లుగా, అతను ఇలా అన్నాడు: “నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక” (యోబు 3:3). బహుశా, ఎవరూ ఎప్పుడూ ఈ మాటలను ముఖ్యమైనవిగా పరిగణించి ఉండకపోవచ్చు మరియు వాటి పట్ల శ్రద్ధ చూపిన వ్యక్తులు ఉంటే ఉండవచ్చు. మీ దృష్టిలో, వాటి అర్థం యోబు దేవుడిని వ్యతిరేకించాడనా? అవి దేవుడిపై ఫిర్యాదు చేసే మాటలా? యోబు అన్న ఈ మాటల గురించి మీలో చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు, యోబు యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు అయితే, అతను ఎలాంటి బలహీనత లేదా దుఃఖాన్ని చూపించి ఉండకూడదనీ, దానికి బదులుగా సాతాను ఏ దాడినైనా సానుకూలంగా ఎదుర్కొని ఉండాల్సిందనీ, అంతేగాకుండా, సాతాను ప్రలోభాలను చూసి నవ్వుకొని ఉండాల్సిందనీ విశ్వసిస్తారు. సాతాను అతని శరీరానికి కలిగించిన ఏ వేదనకు అతను స్వల్పంగా కూడా స్పందించి ఉండకూడదు లేదా తన హృదయంలోని ఏ భావోద్వేగాలకు నమ్మకద్రోహం చేసి ఉండకూడదు. దేవుడు ఈ పరీక్షలను మరింత కఠినతరం చేయాలని కూడా అతను కోరాల్సింది. దృఢసంకల్పంతో ఉండే మరియు నిజంగా దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే ఎవరైనా ప్రదర్శించవలసింది మరియు కలిగి ఉండవలసింది ఇదే. ఈ విపరీతమైన వేదనల మధ్య, యోబు తన పుట్టిన రోజును మాత్రమే దూషించాడు. అతను దేవుడి గురించి ఫిర్యాదు చేయలేదు, సరికదా దేవుడిని వ్యతిరేకించే ఉద్దేశం కూడా అతనికి ఏమాత్రం లేదు. దీనిని చేయడం చెప్పినంత సులభం కాదు, ఎందుకంటే పురాతన కాలం నుండి నేటి వరకు, ఎవ్వరూ ఎప్పుడు కూడా అలాంటి ప్రలోభాలను అనుభవించలేదు లేదా యోబు పడిన బాధలను పడలేదు. మరి యోబు గురైన అలాంటి ప్రలోభాలకు ఎవ్వరూ ఎప్పుడూ ఎందుకు గురికాలేదు? ఎందుకంటే, దేవుడు చూసినట్లుగా, అలాంటి బాధ్యతను లేదా ఆజ్ఞను ఎవరూ తట్టుకోలేరు, యోబు చేసినట్లుగా ఎవరూ చేయలేరు, అంతేకాకుండా, యోబు అలాంటి వేదనను ఎదుర్కొన్నప్పుడు చేసినట్లుగా, ఎవరు కూడా, తమ పుట్టిన రోజును దూషించడమే కాకుండా, దేవుడి నామమును విడిచిపెట్టకుండా, యెహోవా దేవుడి నామమును స్తుతించడాన్ని కొనసాగించలేరు. ఇలా ఎవరైనా చేయగలరా? యోబు గురించి మనం ఇలా చెప్పినప్పుడు, మనం అతని ప్రవర్తనను మెచ్చుకుంటున్నామా? అతను నీతిమంతుడు, దేవుడికి అలాంటి సాక్ష్యమివ్వగలడు మరియు వుడిని నిందించడానికి అది ఇంకెప్పుడూ ఆయన యెదుటకు రాకుండా, సాతాను దాని చేతులతో తలపట్టుకొని పారిపోయేలా చేయగల సమర్థుడు,—కాబట్టి అతన్ని మెచ్చుకోవడంలో తప్పు ఏముంది? దేవుడి కంటే ఉన్నత ప్రమాణాలు మీకు ఉండగలవా? మీకు పరీక్షలు ఎదురైనప్పుడు మీరు యోబు కంటే మరింత మెరుగ్గా ఉండగలిగేవారా? యోబును దేవుడు ప్రశంసించాడు-మీకు ఏమి అభ్యంతరాలు ఉండగలవు?

యోబు తన పుట్టిన రోజును దూషిస్తాడు, ఎందుకంటే తన వల్ల దేవుడు బాధపడటం అతనికి ఇష్టం లేదు

ప్రజలు తోటి ప్రజల బాహ్య రూపాలను మాత్రమే చూస్తే, దేవుడు మాత్రం ప్రజల హృదయాల్లోకి చూస్తాడని నేను తరచుగా అంటుంటాను. దేవుడు ప్రజల హృదయాలలోకి చూస్తాడు కాబట్టే, ఆయన వారి గుణగణాలను అర్థం చేసుకుంటాడు, అదే ప్రజలైతే ఇతరుల బాహ్య రూపాన్ని బట్టి వారి గుణగణాలను నిర్వచిస్తారు. యోబు నోరు తెరిచి, తన పుట్టిన రోజును దూషించినప్పుడు, ఈ చర్య యోబు ముగ్గురు స్నేహితులతో పాటు ఆధ్యాత్మికవేత్తలందరినీ ఆశ్చర్యపరిచింది. మనిషి దేవుడి నుండి వచ్చాడు కాబట్టి జీవం, దేహం, అలాగే దేవుడు అతనికి ప్రసాదించిన అతని పుట్టిన రోజు పట్ల కృతజ్ఞతతో ఉండాలి, వాటిని అతను దూషించకూడదు. సాధారణ ప్రజలు అర్థం చేసుకోగల మరియు భావించగల విషయం ఇదే. దేవుడిని అనుసరించే ఎవరికైనా, ఈ అవగాహన పవిత్రమైనది మరియు ఉల్లంఘించలేనిది, ఇది ఎప్పటికీ మారలేని సత్యం. మరోవైపు, యోబు నిబంధనలను ఉల్లంఘించాడు: యోబు తన పుట్టిన రోజును దూషించాడు. ఇది నిషేధిత భూభాగంలోకి ప్రవేశించడం అవుతుందని సాధారణ ప్రజలు భావించే చర్య. యోబు ప్రజల అవగాహనకు మరియు సానుభూతికి అర్హుడు కాకపోవడమే కాకుండా, దేవుడి క్షమాపణకు కూడా అర్హుడు కాదు. అదే సమయంలో, యోబు నీతి పట్ల కూడా అత్యధికులకు సందేహం కలిగింది, ఎందుకంటే అతని పట్ల దేవుడి అనుగ్రహం తన మనసుకు తోచినట్లుగా యోబు ప్రవర్తించేలా చేసినట్లు అనిపించింది; ఇది తనను ఆశీర్వదించినందుకు మరియు జీవితాంతం అతని పట్ల శ్రద్ధ చూపినందుకు దేవుడికి అతను కృతజ్ఞత తెలియజేయకపోవడమే కాకుండా, అతను తన పుట్టిన రోజును విస్మరించేలా అతనికి చాలా ధైర్యం మరియు నిర్లక్ష్యాన్ని ఇచ్చింది. ఇది దేవుడిని ఎదిరించడం కాకపోతే, మరేంటి? అలాంటి పైపై మెరుగులు యోబు చేసిన ఈ పనిని ఖండించడానికి ప్రజలకు రుజువును అందిస్తాయి, అయితే ఆ సమయంలో యోబు నిజంగా ఏమి ఆలోచిస్తున్నాడో ఎవరు తెలుసుకోగలరు? యోబు ఆవిధంగా ప్రవర్తించడానికి గల కారణాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇక్కడి లోపలి కథ మరియు కారణాలు దేవుడికి మరియు యోబుకు మాత్రమే తెలుసు.

యోబు ఎముకలను పీడించడానికి సాతాను తన చేతిని ముందుకు చాచినప్పుడు, యోబుకు తప్పించుకునే దారి లేకుండా లేదా ఎదిరించే శక్తి లేకుండా దాని కోరల్లో చిక్కుకున్నాడు. అతని శరీరం మరియు ఆత్మ విపరీతమైన బాధను అనుభవించాయి, ఈ నొప్పి అనేది దేహంలో జీవిస్తున్న మనిషి అల్పత్వం, బలహీనత మరియు శక్తిహీనత గురించి అతనికి లోతుగా తెలిసేలా చేసింది. అదే సమయంలో, దేవుడు మానవాళి పట్ల శ్రద్ధ వహించాలనీ మరియు కాపాడుకోవాలనీ ఎందుకు అనుకుంటున్నాడనేదాని గురించి కూడా అతనికి లోతైన జ్ఞానం మరియు అవగాహన పొందేలా చేశాయి. రక్తమాంసాలతో ఉన్న మనిషి నిజానికి చాలా శక్తిహీనుడు మరియు బలహీనుడని సాతాను కోరల్లో ఉన్నప్పుడు, యోబు గ్రహించాడు. అతను మోకాళ్లపై కూర్చొని దేవుడిని ప్రార్థించినప్పుడు, దేవుడు తనను పూర్తిగా సాతాను హస్తాల్లో పెట్టాడు కాబట్టి దేవుడు తన ముఖాన్ని కప్పుకుని దాక్కొన్నాడా అన్నట్లు ఉందని అతను భావించాడు. అదే సమయంలో, దేవుడు కూడా అతని కోసం రోదించాడు, అంతేకాకుండా, అతని కోసం దు:ఖించాడు; అతని బాధతో దేవుడు బాధపడ్డాడు మరియు అతని గాయంతో గాయపడ్డాడు.... యోబు దేవుడి బాధను, అలాగే అది దేవుడికి భరించలేనిదిగా ఉండటాన్ని అనుభవించాడు… దేవుడికి ఇక ఎంత మాత్రం దుఃఖం కలిగించాలని గానీ లేదా దేవుడు తన కోసం రోదించాలని గానీ యోబు కోరుకోలేదు, సరికదా దేవుడు తన వల్ల బాధపడితే చూడాలని కూడా అతను కోరుకోలేదు. ఈ క్షణంలో, ఈ శరీరం ద్వారా తనకు వచ్చిన బాధను ఇక ఏమాత్రం భరించకుండా ఉండటానికి, యోబు తన శరీరాన్ని త్యజించాలని మాత్రమే కోరుకున్నాడు, ఎందుకంటే, ఇది తన బాధతో దేవుడు వేదన అనుభవించకుండా ఆపివేస్తుంది-అయినప్పటికీ అతను త్యజించలేకపోయాడు మరియు అతను శరీర బాధను భరించడమే కాకుండా, దేవుడికి విచారం కలిగించకూడదనే వేదనను కూడా భరించాడు. ఈ రెండు బాధలు-ఒకటి శరీరం నుండి, మరొకటి ఆత్మ నుండి-యోబుకు హృదయ విదారకమైన, పేగులను మెలివేసే బాధను తెచ్చిపెట్టాయి మరియు రక్తమాంసాలు గల మనిషి పరిమితులు అతడిని ఎలా నిరాశగా మరియు నిస్సహాయంగా భావించేలా చేస్తాయో అర్థమయ్యేలా చేశాయి. ఈ పరిస్థితులలో, దేవుడి పట్ల అతని తపన ప్రచండంగా పెరిగింది మరియు సాతాను పట్ల అతని అసహ్యం మరింత తీవ్రమైంది. ఈ సమయంలో, దేవుడు తన కోసం కన్నీళ్లు పెట్టుకోవడం లేదా బాధను అనుభవించడం చూడటం కంటే, లోకంలో మనిషిగా ఎప్పుడూ పుట్టకుండా ఉండి ఉంటేనే, తను అసలు లేకుండా ఉంటేనే మంచిదని అనుకుని ఉంటాడు. తనను అనారోగ్యం మరియు అలసిపోయేలా చేసిన తన శరీరాన్ని, అతని పుట్టిన రోజును మరియు అతనితో సంబంధం ఉన్న అన్నింటిని కూడా గాఢంగా అసహ్యించుకోవడం ప్రారంభించాడు. అతను తన పుట్టిన రోజు గురించి ఇకపై ఎలాంటి ప్రస్తావన ఉండాలని గానీ లేదా దానితో ఏదైనా సంబంధం ఉండాలని గానీ కోరుకోలేదు, కాబట్టి అతను బిగ్గరగా తన పుట్టిన రోజును దూషించాడు: “నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక. ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక” (యోబు 3:3-4). “నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక” అనే యోబు మాటలు అతని పట్ల అతనికున్న అసహ్యాన్ని, అలాగే “ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక” అని దేవుడి బాధకు కారణమయినందుకు తననుతానే నిందించుకోవడాన్ని మరియు రుణపడి ఉండటాన్ని తెలియజేస్తాయి. అప్పుడు యోబు ఎలా భావించాడు అనేదానికి ఈ రెండు వృత్తాంతాలే అంతిమ వ్యక్తీకరణలు మరియు అందరికీ అతని పరిపూర్ణతను మరియు నిజాయితీని పూర్తిగా ప్రదర్శిస్తాయి. అదే సమయంలో, యోబు కోరుకున్నట్లుగానే, దేవుడి పట్ల అతని విశ్వాసం మరియు విధేయత, అలాగే దేవుడి పట్ల అతనికున్న భయం నిజంగా పెరిగాయి. వాస్తవానికి, ఈ పెరుగుదల సరిగ్గా దేవుడు ఆశించిన ప్రభావమే.

సాతానును ఓడించిన యోబు, దేవుడి దృష్టిలో నిజమైన మనిషిగా మారుతాడు

యోబు మొదటిసారి పరీక్షలకు గురైనప్పుడు, అతను తన సమస్త ఆస్తిని మరియు తన బిడ్డలందరినీ కోల్పోయాడు, కానీ అతను కుప్పకూలిపోలేదు లేదా దేవుడికి వ్యతిరేకంగా పాపఫలితాన్ని ఇచ్చే మాటలు ఏవీ అనలేదు. అతను సాతాను ప్రలోభాలను అధిగమించాడు, అతను తన భౌతిక ఆస్తులను, అతని సంతానం మరియు తన ప్రాపంచిక ఆస్తులన్నింటినీ కోల్పోయే పరీక్షను అధిగమించాడు, అంటే తన నుండి దేవుడు తీసుకుపోవడం వల్ల అతను ఆయనకు విధేయత చూపగలిగాడు, అలాగే అతను దేవుడు చేసిన పని వల్ల దేవుడికి కృతజ్ఞతలు తెలుపగలిగి, స్తుతించగలిగాడు కూడా. సాతాను మొదటి ప్రలోభం సమయంలో యోబు నడవడిక అలాంటిది, అలాగే దేవుడి మొదటి పరీక్ష సమయంలో యోబు సాక్ష్యం కూడా అదే. రెండవ పరీక్షలో, యోబును బాధపెట్టడానికి సాతాను తన చేతిని ముందుకు చాచాడు, యోబు ముందెన్నడూ అనుభవించనంత ఎక్కువ నొప్పిని అనుభవించినప్పటికీ, అతని సాక్ష్యం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు సరిపోతుంది. సాతానును మరోసారి ఓడించడానికి అతను తన ధైర్యాన్ని, దృఢ విశ్వాసాన్ని, దేవుడి పట్ల విధేయతతో పాటు దేవుడి పట్ల భయాన్ని ఉపయోగించాడు మరియు అతని నడవడిక, అతని సాక్ష్యాలు మరోసారి దేవుడి ఆమోదం, అనుగ్రహం పొందాయి. ఈ ప్రలోభం సమయంలో, శారీరక బాధ తన విశ్వాసాన్ని, దేవుడి పట్ల విధేయతను మార్చలేదని లేదా దేవుడి పట్ల తన భక్తిని మరియు దేవుడి పట్ల భయాన్ని తీసివేయలేదని సాతానుకు ప్రకటించడానికి యోబు తన నిజమైన నడవడికను ఉపయోగించాడు; మృత్యువును ఎదుర్కొన్న కారణంగా అతను దేవుడిని త్యజించడు లేదా తన పరిపూర్ణతను మరియు నిజాయితీని వదులుకోడు. యోబు పట్టుదల సాతానును పిరికిపందగా మార్చింది, అతని విశ్వాసం సాతానుకు భయభ్రాంతులతో వణుకు పుట్టేలా చేసింది, ఆ జీవన్మరణ యుద్ధంలో అతను సాతానుతో పోరాడిన తీక్షణత సాతానులో తీవ్ర ద్వేషాన్ని మరియు ఆగ్రహాన్ని పెంచింది; అతని పరిపూర్ణత మరియు నిజాయితీ వల్ల అతన్ని సాతాను ఇక ఏమీ చేయలేక పోయింది, దాంతో సాతాను అతనిపై దాడులు చేయడాన్ని మానుకుంది మరియు యెహోవా దేవుడి యెదుట యోబుకు వ్యతిరేకంగా ఉంచిన ఆరోపణలను వదిలేసింది. అంటే యోబు ఈ లోకాన్ని జయించాడనీ, అతను శరీరాన్ని జయించాడనీ, అతను సాతానును జయించాడనీ మరియు అతను మృత్యువును జయించాడనీ అర్థం; అతను దేవుడికి చెందిన సంపూర్ణమైన మరియు శుద్ధమైన మనిషి. ఈ రెండు పరీక్షల సమయంలో, యోబు తన సాక్ష్యంలో స్థిరంగా నిలబడ్డాడు, నిజానికి తన పరిపూర్ణత, నిజాయితీని చూపాడు మరియు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించడం అనే అతని జీవిత నియమాల పరిధిని విస్తృతం చేశాడు. ఈ రెండు పరీక్షలకు గురైన తర్వాత, యోబులో ఉన్నతమైన అనుభవం పుట్టింది, ఈ అనుభవం అతన్ని మరింత పరిణతిగల, అనుభవజ్ఞుడిగా మార్చింది, ఇది అతన్ని బలవంతునిగా మార్చింది, అతనిలో గొప్ప నమ్మకాన్ని కలిగించింది, ఇది అతను ధృడంగా కట్టబడిన యథార్థతలోని నిజాయితీ మరియు యోగ్యత పట్ల మరింత విశ్వాసాన్ని కలిగించింది. యెహోవా దేవుడు యోబుకు పెట్టిన పరీక్షలు, మనిషి పట్ల దేవుడికి గల శ్రద్ధ గురించి అతనికి లోతైన అవగాహనను, జ్ఞానాన్ని ఇచ్చాయి, అతడు దేవుడి ప్రేమ అమూల్యతను గ్రహించేలా చేశాయి, ఇక్కడి నుండి దేవుడి పట్ల శ్రద్ధ మరియు ప్రేమ అతనికున్న దేవుడి పట్ల భయానికి తోడయ్యాయి. యెహోవా దేవుడి పరీక్షలు యోబును ఆయన నుండి దూరం చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా, అతని హృదయాన్ని దేవుడికి దగ్గర కూడా చేసింది. యోబు భరించిన శారీరక బాధ తారాస్థాయికి చేరుకున్నప్పుడు, అతనికి యెహోవా దేవుడిలో కనిపించిన ఆందోళన, తన పుట్టిన రోజును దూషించడం తప్ప అతనికి మరో అవకాశం ఇవ్వలేదు. అలాంటి ప్రవర్తనకు ఎంతోకాలం నుండి పథకం వేయలేదు, కానీ ఇది అతని హృదయంలో నుండి సహజంగా బయటపడ్డ దేవుడి పట్ల శ్రద్ధ మరియు ప్రేమ, ఇది దేవుడి పట్ల శ్రద్ధ మరియు ప్రేమతో సహజంగా బయట పడిన విషయం. అంటే, అతను తనను తాను అసహ్యించుకున్నాడు కాబట్టి, అతను దేవుడికి వేదన కలిగించడానికి ఇష్టపడలేదు అలాగే తట్టుకోలేకపోయాడు కాబట్టి, అతని శ్రద్ధ మరియు ప్రేమ నిస్వార్థ స్థితికి చేరుకున్నాయి. ఈ సమయంలో, యోబు దేవుడి యందు తన దీర్ఘకాల ఆరాధన, ఆకాంక్షను మరియు దేవుడి పట్ల భక్తిని శ్రద్ధ మరియు ప్రేమించే స్థాయికి ఉన్నతీకరించుకున్నాడు. అదే సమయంలో, యోబు దేవుడి యందు తన విశ్వాసాన్ని, విధేయతను మరియు దేవుడి పట్ల భయాన్ని శ్రద్ధ మరియు ప్రేమించే స్థాయికి ఉన్నతీకరించుకున్నాడు. అతను తనకుతానుగా దేవుడికి హాని కలిగించే ఎలాంటి పనిని చేయలేదు, తనకుతానుగా దేవుడిని భాదించే ఎలాంటి నడవడికను నడుకోలేదు మరియు తన సొంత కారణాల వల్ల దేవుడికి ఎలాంటి విచారం, దుఃఖం లేదా అసంతృప్తిని తనంతతాను కలిగించలేదు. దేవుడి దృష్టిలో, యోబు మునుపటి యోబులాగే ఉన్నప్పటికీ, యోబు విశ్వాసం, విధేయత మరియు దేవుడి పట్ల భయం కలిగి ఉండటమనేవి దేవుడికి పూర్తి సంతృప్తిని మరియు ఆనందాన్ని కలిగించాయి. ఈ సమయంలో, దేవుడు ఆశించిన పరిపూర్ణతను యోబు పొందాడు; అతను దేవుడి దృష్టిలో “యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు” అని పిలవబడటానికి నిజంగా తగిన వ్యక్తిగా మారాడు. అతని నీతివంతమైన పనులు సాతానును జయించేలా అలాగే దేవుడికి తన సాక్ష్యంలో స్థిరంగా నిలబడేలా చేశాయి. కాబట్టి, అతని నీతివంతమైన పనులు అతన్ని పరిపూర్ణుడిని చేశాయి, అలాగే అతని జీవితపు విలువను ఎప్పుడూ లేనంతగా ఉన్నతీకరించుకునేలా, అతీంద్రియంగా మారేలా చేశాయి మరియు అవి అతన్ని ఇకపై సాతాను దాడి చేయలేని, ప్రలోభపెట్టలేని మొదటి వ్యక్తిని కూడా చేశాయి. యోబు నీతిమంతుడు కాబట్టి, అతను సాతానుచే నిందించబడ్డాడు, ప్రలోభపెట్టబడ్డాడు; యోబు నీతిమంతుడు కాబట్టి, సాతానుకు అప్పగించబడ్డాడు; అలాగే యోబు నీతిమంతుడు కాబట్టి అతడు సాతానును అధిగమించి, ఓడించి, తన సాక్ష్యములో స్థిరంగా నిలబడ్డాడు. యోబు ఇప్పటి నుండి, సాతానుకు మళ్లీ అప్పగించబడని మొదటి వ్యక్తి అయ్యాడు, అతను దేవుడి సింహాసనం యెదుటకు నిజంగా వచ్చాడు మరియు సాతాను నిఘా లేదా విధ్వంసం లేకుండా దేవుడి ఆశీర్వాదాలతో వెలుగులో జీవించాడు. దేవుడి దృష్టిలో అతను నిజమైన వ్యక్తి అయ్యాడు; అతను విముక్తుడుగా చేయబడ్డాడు…

యోబు పరిచయం

యోబు పరీక్షలను ఎలా ఎదుర్కున్నాడో తెలుసుకున్న తర్వాత, మీలో చాలామంది యోబు గురించి మరిన్ని వివరాలను, ప్రత్యేకించి అతను దేవుడి మెప్పును పొందిన రహస్యానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. కాబట్టి, ఈరోజు మనం యోబు గురించి మాట్లాడుకుందాం!

యోబు తన దైనందిన జీవితంలో పరిపూర్ణతను, నిజాయితీని, దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించడాన్ని మనం చూస్తాము

యోబు గురించి మనం చర్చించుకోవాలంటే, మనం తప్పక అతని గురించి అంచనాను దేవుడి సొంత మాటలతో ప్రారంభించాలి: “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.”

మొదట మనం యోబు పరిపూర్ణత మరియు నిజాయితీ గురించి తెలుసుకుందాం.

“పరిపూర్ణత” మరియు “నిజాయితీ” అనే మాటల గురించి మీ అవగాహన ఏమిటి? యోబు అపవాదు లేనివాడనీ, అతడు గౌరవనీయుడనీ మీరు నమ్ముతారా? వాస్తవానికి, ఇది “పరిపూర్ణత” మరియు “నిజాయితీ” అనే మాటలకు అక్షరతః అన్వయించుకోవడం, అర్థం చేసుకోవడం అవుతుంది. కానీ నిజ జీవిత సందర్భం యోబు నిజమైన అవగాహనలో అంతర్భాగం-సాహిత్యాలు, గ్రంథాలు మరియు సిద్ధాంతం మాత్రమే ఎలాంటి సమాధానాలు అందించవు. మనం యోబు గృహ జీవితాన్ని, అతని జీవితంలో అతని సాధారణ నడవడిక ఎలా ఉండేదో చూడటంతో ప్రారంభిద్దాము. జీవితంలో అతని నియమాలు మరియు లక్ష్యాల గురించి, అలాగే అతని వ్యక్తిత్వం మరియు అన్వేషణ గురించి ఇది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు, యోబు 1:3 లోని చివరి మాటలను చదువుదాం: “తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.” యోబు స్థితి మరియు స్థాయి చాలా ఉన్నతమైనవని ఈ మాటలు తెలుపుతున్నాయి, అతను తూర్పు జనులందరిలో గొప్పవాడు కావడానికి కారణం అతని అమితమైన ఆస్తుల వల్లనా లేదా అతను యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడు, చెడును విసర్జిస్తూ దేవుడి పట్ల భయాన్ని కలిగి ఉండటం వల్లనా అనేది మనకు తెలపనప్పటికీ, మొత్తంగా, యోబు స్థితి మరియు స్థాయి చాలా అమూల్యమైనవని మనకు తెలుసు. బైబిల్‌లో నమోదు చేసినట్లుగా, యోబు పరిపూర్ణుడనీ, అతనికి దేవుడి పట్ల భయం ఉందనీ, చెడును విసర్జించాడనీ మరియు గొప్ప సంపద మరియు గౌరవనీయమైన హోదా ఉందనీ యోబు గురించి ప్రజలకున్న మొట్టమొదటి అభిప్రాయాలు. అటువంటి వాతావరణంలో మరియు అటువంటి పరిస్థితులలో జీవించే ఒక సాధారణ వ్యక్తి అయిన యోబు ఆహారం, జీవన నాణ్యత మరియు అతని వ్యక్తిగత జీవితంలోని వివిధ అంశాలు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తాయి; కాబట్టి మనం తప్పక పవిత్ర గ్రంథాలను చదవడాన్ని కొనసాగించాలి: “అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను” (యోబు 1:4-5). ఈ వృత్తాంతం మనకు రెండు విషయాలను తెలియజేస్తుంది: మొదటిది, యోబు కుమారులు మరియు కుమార్తెలు క్రమం తప్పకుండా, చాలా తింటూ, తాగుతూ విందులు చేసుకునేవారు; రెండవది, యోబు తరచుగా దహన బలులు అర్పించేవాడు, ఎందుకంటే అతను తన కుమారులు మరియు కుమార్తెలు పాపం చేస్తున్నారనీ, వారి హృదయాలలో వారు దేవుడిని త్యజిస్తారనే భయంతో వారి కోసం తరచుగా చింతించేవాడు. ఇందులో రెండు రకాల వ్యక్తుల జీవితాలు వివరించబడ్డాయి. మొదటిది, యోబు కుమారులు మరియు కుమార్తెలు, వారి ఐశ్వర్యం కారణంగా తరచూ విందులు చేసుకున్నారు, మితిమీరి జీవించారు, తమ ఇష్టానుసారంగా ద్రాక్షరసం, ఆహారం తీసుకున్నారు మరియు భౌతిక సంపదతో ఉన్నతమైన నాణ్యతగల జీవితాన్ని అనుభవించారు. అలాంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు, వారు తరచూ పాపం చేయడం మరియు దేవుడికి అపరాధము చేయడం అనేది అనివార్యం-అయినప్పటికీ వారు తమను తాము పరిశుద్ధం చేసుకోలేదు లేదా దహన బలులు అర్పించలేదు. కాబట్టి, వారి హృదయాల్లో దేవుడికి స్థానం లేదనీ, వారు దేవుడి కృప గురించి ఆలోచించలేదనీ లేదా దేవుడిపట్ల అపరాధము చేయడానికి భయపడలేదనీ, సరికదా వారు తమ హృదయాల్లో దేవుడిని త్యజించడానికి కూడా భయపడలేదని మీరు చూస్తారు. వాస్తవానికి, మన దృష్టి యోబు బిడ్డలపై కాదుగానీ, అలాంటి వాటిని ఎదుర్కున్నప్పుడు యోబు ఏమి చేశాడు అనేదానిపై; ఇది యోబు దైనందిన జీవితం మరియు అతని మానవత్వపు గుణగణాలతో కూడిన వృత్తాంతంలో వివరించబడిన ఇతర విషయం. యోబు కుమారులు మరియు కుమార్తెల విందు గురించి బైబిల్‌లో వర్ణించిన చోట, యోబు గురించి ప్రస్తావనలేదు; అతని కుమారులు మరియు కుమార్తెలు తరచుగా కలిసి తిని, తాగుతారని మాత్రమే చెప్పబడింది. మరోలా చెప్పాలంటే, అతను విందులు చేయలేదు, లేదా తన కుమారులు, కుమార్తెలతో కలిసి మితిమీరి తినలేదు. సంపన్నుడైనప్పటికీ మరియు అనేక ఆస్తులు, సేవకులు ఉన్నప్పటికీ, యోబు జీవితం విలాసవంతమైనది కాదు. అతను తన ఉన్నతమైన జీవన పరిస్థితులతో వంచించబడలేదు, అతను తన సంపద వల్ల, శరీర భోగం కోసం గొంతుదాకా మెక్కలేదు లేదా దహన బలులు అర్పించడం మరచిపోలేదు సరికదా అతని సంపద అతని హృదయంలోని దేవుడిని క్రమంగా త్యజించేలా కూడా చేయలేదు. యోబు స్పష్టంగా తన జీవనశైలిలో క్రమశిక్షణతో ఉన్నాడు, అతనిపై దేవుడి ఆశీర్వాదాల ఫలితంగా అతడు అత్యాశగల వ్యక్తి లేదా భోగప్రియుడు కాదు మరియు అతను జీవన నాణ్యతపై దృష్టి నిలుపలేదు. బదులుగా, అతను వినయంగా, నిరాడంబరంగా ఉన్నాడు, అతను ఆడంబరానికి పోలేదు మరియు అతను దేవుడి యెదుట వివేకంగా, పదిలంగా ఉన్నాడు. అతను తరచుగా దేవుడి అనుగ్రహం, ఆశీర్వాదాల గురించి ఆలోచించేవాడు మరియు అతడు ఎల్లప్పుడూ దేవుడి పట్ల భయం కలిగి ఉండేవాడు. తన దైనందిన జీవితంలో, యోబు తరచుగా తన కుమారులు మరియు కుమార్తెల కోసం దహన బలులు అర్పించడానికి తొందరగా నిద్ర లేచేవాడు. మరోలా చెప్పాలంటే, యోబు స్వయంగా దేవుడి పట్ల భయం కలిగి ఉండడమే కాకుండా, తన బిడ్డలు కూడా దేవుడి పట్ల అలాగే భయం కలిగి ఉండాలని మరియు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయకూడదని ఆశించాడు. యోబు హృదయంలో అతని భౌతిక సంపదకు ఎలాంటి స్థానం లేదు లేదా దేవుడికి ఉన్న స్థానాన్ని అది భర్తీ చేయలేదు; తన కోసమైనా లేదా అతని బిడ్డల కోసమైనా, యోబు రోజువారీ పనులన్నీ దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే దానితో ముడిపడి ఉన్నాయి. యెహోవా దేవుడి పట్ల ఆయనకున్న భయం అతని మాటల దగ్గరే ఆగిపోలేదు, అతడు దానిని కార్యరూపంలో పెట్టిన దానిలో మరియు అతని దైనందిన జీవితంలోని ప్రతి భాగంలోనూ అది ప్రతిబింబించింది. యోబు ఈ నిజమైన ప్రవర్తన అతను నిజాయితీపరుడనీ, అతనికి న్యాయాన్ని మరియు సానుకూల విషయాలను ఇష్టపడే గుణగణాలు ఉన్నాయని మనకు చూపుతుంది. యోబు తరచుగా తన కుమారులు మరియు కుమార్తెలను పంపించి, పరిశుద్ధం చేశాడు అంటే అతను తన బిడ్డల ప్రవర్తనను అంగీకరించలేదు లేదా ఆమోదించలేదని అర్థం; బదులుగా, వారి ప్రవర్తనతో అతని మనస్సులో అతను విసుగు చెందాడు మరియు వారిని ఖండించాడు. తన కుమారులు మరియు కుమార్తెల ప్రవర్తన యెహోవా దేవుడిని సంతోషపెట్టడం లేదని అతను నిశ్చయించుకున్నాడు, అందువల్ల యెహోవా దేవుడి యెదుటకు వెళ్లి వారి పాపాలను ఒప్పుకోమని అతను వారిని తరచుగా పిలిచాడు. యోబు పనులు మనకు అతని మానవత్వపు మరొక కోణాన్ని చూపుతాయి, అందులో ఒకటి, తరచుగా పాపం చేసే మరియు దేవుడికి అపరాధము చేసే వారితో అతను ఎప్పుడూ కలిసి నడవలేదు, బదులుగా వారిని వదులుకున్నాడు మరియు దూరంగా పెట్టాడు. ఈ వ్యక్తులు తన కుమారులు మరియు కుమార్తెలే అయినప్పటికీ, వారు తన సొంత రక్తసంబంధీకులైన కారణంగా అతను తన సొంత ప్రవర్తనా నియమాలను విడిచిపెట్టలేదు, లేదా తన సొంత మనోభావాల కారణంగా వారి పాపాలలో పాలుపంచుకోలేదు. బదులుగా, పాపములను ఒప్పుకొని యెహోవా దేవుడి క్షమను పొందాలని ఆయన వారిని ప్రేరేపించాడు మరియు వారి సొంత అత్యాశతో కూడిన ఆనందం కోసం దేవుడిని విడిచిపెట్టవద్దని హెచ్చరించాడు. యోబు ఇతరులతో ప్రవర్తించిన నియమాలు, దేవుడి పట్ల ఆయనకున్న భయం మరియు చెడును విసర్జించే నియమాల నుండి వేరు చేయలేనివి. అతను దేవుడు అంగీకరించిన దానినే ప్రేమించాడు మరియు దేవుడిని తిరస్కరించిన దానిని అసహ్యించుకున్నాడు; అతను తమ హృదయాలలో దేవుడి పట్ల భయం కలిగిన వారిని ప్రేమించాడు మరియు దేవుడికి వ్యతిరేకంగా చెడు లేదా పాపం చేసేవారిని అసహ్యించుకున్నాడు. అలాంటి ప్రేమ మరియు అసహ్యం అతని దైనందిన జీవితంలో ప్రదర్శించబడ్డాయి మరియు అదే యోబులో దేవుడు చూసిన గొప్ప నిజాయితీ. సహజంగానే, ఇది యోబు దైనందిన జీవితంలో ఇతరులతో అతని సంబంధాల్లో అతని నిజమైన మానవత్వపు వ్యక్తీకరణ మరియు జీవించడం కూడా అవుతుంది, దీని గురించి మనం తప్పక తెలుసుకోవాలి.

యోబు పరీక్షలు ఎదుర్కొన్న సమయంలో అతని మానవత్వపు వ్యక్తీకరణలు (యోబు పరీక్షలు ఎదుర్కొన్న సమయంలో అతని పరిపూర్ణత, నిజాయితీ, దేవుడి పట్ల భయం కలిగి ఉండడం, చెడును విసర్జించడాన్ని అవగాహన చేసుకోవడం)

మనం పైన పంచుకున్నవి యోబు పరీక్షలు ఎదుర్కోవడానికి ముందు అతని రోజువారీ జీవితంలో ప్రదర్శించబడిన అతని మానవత్వపు వివిధ కోణాలు. నిస్సందేహంగా, ఈ వివిధ వ్యక్తీకరణలు యోబు నిజాయితీ, దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించడం గురించి తొలి పరిచయాన్ని, అవగాహనను అందిస్తాయి అలాగే సహజంగానే తొలి ధృవీకరణను కూడా అందిస్తాయి. నేను “తొలి” అని చెప్పడానికి కారణం, చాలా మందికి ఇప్పటికీ యోబు వ్యక్తిత్వం మరియు దేవుడి పట్ల విధేయత చూపే మరియు భయం కలిగి ఉండే మార్గాన్ని అతను అనుసరించిన స్థాయి గురించి నిజమైన అవగాహన లేదు. అనగా, యోబు గురించి చాలా మందికి ఉన్న అవగాహన బైబిల్‌లోని “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక,” మరియు “మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” అనే అతని మాటలతో కూడిన రెండు వృత్తాంతాల్లో అందించబడిన అతని గురించి కొంత అనుకూలమైన అభిప్రాయం కంటే లోతుకు వెళ్లదు. కాబట్టి, యోబు దేవుడి పరీక్షలను ఎదుర్కున్నప్పుడు తన మానవత్వంతో ఎలా జీవించాడు అనేదానిని అర్థం చేసుకోవడం మనకు ఎంతో అవసరం; ఈ విధంగా, యోబు నిజమైన మానవత్వం అందరికీ సంపూర్ణంగా చూపబడుతుంది.

యోబు అతని ఆస్తి దొంగిలించబడిందనీ, అతని కుమారులు, కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారనీ మరియు అతని సేవకులు వధించబడ్డారనీ విన్నప్పుడు, అతను కింది విధంగా స్పందించాడు: “అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసెను” (యోబు 1:20). ఈ మాటలు మనకు ఒక వాస్తవాన్ని తెలుపుతాయి. ఈ వార్త విన్న తర్వాత, యోబు భయాందోళనకు గురి కాలేదు, ఏడ్వలేదు లేదా తనకు వార్త అందించిన సేవకులను నిందించలేదు, సరికదా, విచారించడానికి, వివరాలను ధృవీకరించడానికి మరియు నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి కనీసం అతను నేరం జరిగిన ప్రదేశాన్ని తనిఖీ కూడా చేయలేదు. అతను తన ఆస్తులను కోల్పోయినందుకు ఎలాంటి బాధను లేదా విచారాన్ని వ్యక్తం చేయలేదు, లేదా తన బిడ్డలను, తనకు ఇష్టమైన వారిని కోల్పోయినందుకు అతను కన్నీరు కార్చలేదు. దానికి విరుద్ధంగా, అతడు తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసెను. యోబు చర్యలు ఎవరైనా సాధారణ వ్యక్తి చర్యల వలే లేవు. అవి చాలా మందిని అయోమయానికి గురిచేస్తాయి మరియు యోబు “ఉదాసీన స్వభావం” అనేది వారు తమ మనస్సులలో అతన్ని నిందించేలా చేస్తుంది. వారి ఆస్తులను ఆకస్మాత్తుగా కోల్పోతే, సాధారణ ప్రజలకైతే గుండె పగులుతుంది లేదా నిరాశకు గురవుతారు-లేదా, కొంతమంది విషయంలో, వారు తీవ్ర క్రుంగుబాటుకు కూడా లోను కావచ్చు. ఎందుకంటే, ప్రజల హృదయాలలో, వారి ఆస్తి జీవితకాల ప్రయత్నాన్ని సూచిస్తుంది-వారి మనుగడ ఆధారపడి ఉండేది దానిపైనే, వారిని జీవించి ఉండేలా చేసేది ఆ ఆశే; వారు ఆస్తిని కోల్పోవడమంటే వారి ప్రయత్నాలు ఏమీ చేయలేదనీ, వారు ఆశ లేకుండా ఉన్నారనీ మరియు వారికి భవిష్యత్తు కూడా లేదని అర్థం. వారి ఆస్తి, దానితో వారికున్న సన్నిహిత సంబంధం పట్ల ఎవరైనా సాధారణ వ్యక్తి వైఖరి ఇదే మరియు ప్రజల దృష్టిలో ఆస్తికి ఉన్న ప్రాముఖ్యత కూడా ఇదే. కాబట్టి, యోబు ఆస్తిని పోగొట్టుకోవడం పట్ల తను ప్రదర్శించిన ఉదాసీన వైఖరిని చూసి అనేక మంది అయోమయంలో పడ్డారు. ఈ రోజు, యోబు హృదయంలో ఏమి జరుగుతుందో వివరించడం ద్వారా ఈ ప్రజలందరిలో ఉన్న అయోమయాన్ని మనం దూరం చేయబోతున్నాము.

దేవుడు అంత అపారమైన ఆస్తులను ఇచ్చాడు కాబట్టి, ఆ ఆస్తులను కోల్పోయినందుకు యోబు దేవుడి యెదుట సిగ్గుపడాలనీ సాధారణ ఇంగితజ్ఞానం చెబుతుంది, ఎందుకంటే అతను వాటిని సరిగ్గా చూసుకోలేదు లేదా వాటిని సంరక్షించలేదు; అతనికి దేవుడు ఇచ్చిన ఆస్తులను ఎక్కువకాలం కాపాడుకోలేదు. కాబట్టి, అతను తన ఆస్తి దొంగిలించబడిందని విన్నప్పుడు, అతను మొదటగా ప్రతిస్పందించవలసింది, నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి, కోల్పోయిన ప్రతిదానిని లెక్క వేసుకోవడం, ఆపై దేవుడి ఆశీర్వాదాలను మరోసారి పొందేలా దేవుడి ముందు జరిగిన దాన్ని ఒప్పుకోవడం. అయితే, యోబు అలా చేయలేదు, అలా చేయకపోవడానికి సహజంగానే అతనికి సొంత కారణాలు ఉన్నాయి. తనకు ఉన్నదంతా దేవుడు ప్రసాదించినదేననీ మరియు తన సొంత శ్రమతో సంపాదించింది కాదనీ యోబు తన మనస్సులో గాఢంగా విశ్వసించాడు. కాబట్టి, ఈ ఆశీర్వాదాలను పెట్టుబడి పెట్టవలసిన వాటిగా అతను పరిగణించలేదు, దానికి బదులుగా కట్టబడి ఉండాల్సిన మార్గానికి కట్టుబడి ఉండటానికి తన శక్తినంతటినీ కూడగట్టుకొని వేచి చూస్తూ తన మనుగడ నియమాలను కట్టుబడి ఉన్నాడు. అతను దేవుడి ఆశీర్వాదాలను మనసులో ప్రేమగా దాచుకుని, వాటి కోసం కృతజ్ఞతలు తెలిపాడు, కానీ అతను ఆశీర్వాదాల పట్ల ఆకర్షితుడు కాలేదు లేదా వాటిని ఇంకా ఎక్కువ కోరుకోలేదు. ఆస్తి పట్ల అతని వైఖరి అలాంటిది. ఆశీర్వాదాలు పొందడానికి అతను ఏమీ చేయలేదు, లేదా దేవుడి ఆశీర్వాదాలు లేకపోవటం లేదా కోల్పోవడం గురించి బాధపడలేదు లేదా దుఃఖపడలేదు; అతను దేవుడి ఆశీర్వాదాల వల్ల క్రూరంగా మారలేదు, అతిగా సంతోషించలేదు, లేదా అతను తరచుగా అనుభవించే ఆశీర్వాదాల వల్ల దేవుడి మార్గాన్ని విస్మరించలేదు లేదా దేవుడి కృపను మరచిపోలేదు. యోబు ఆస్తి పట్ల అతని వైఖరి అతని నిజమైన మానవత్వాన్ని ప్రజలకు వెల్లడిస్తుంది: మొదటిది, యోబు అత్యాశగల వ్యక్తి కాదు మరియు అతని భౌతిక జీవితంలో ఎలాంటి కోరికలు లేవు. రెండవది, తనకు ఉన్నదంతా దేవుడు తీసుకుపోతాడని అతను ఎప్పుడూ ఆందోళన చెందలేదు లేదా భయపడలేదు, యోబు తన హృదయంలో దేవుడి పట్ల విధేయత చూపిన వైఖరి ఇది; అంటే, దేవుడు అతని నుండి ఎప్పుడు తీసుకుంటాడు, అసలు తీసుకుంటాడా లేదా అనే దాని గురించి అతనికి ఎటువంటి కోరికలు లేదా ఫిర్యాదులు లేవు, ఎందుకు అని కారణం అడగలేదు, కానీ దేవుడి ఏర్పాట్లకు విధేయత చూపాలని మాత్రమే కోరుకున్నాడు. మూడవది, తన ఆస్తులు తన సొంత శ్రమతో సంపాదించడం వల్ల వచ్చాయని అతను ఎప్పుడూ విశ్వసించలేదు, అవి దేవుడు తనకు ప్రసాదించినవని విశ్వసించాడు. ఇది దేవుడి పట్ల యోబుకున్న నమ్మకం మరియు అతని దృఢ విశ్వాసానికి సూచన. యోబు మానవత్వాన్ని మరియు అతని రోజువారీ నిజమైన అన్వేషణను ఈ మూడు అంశాల్లోని సారాంశం స్పష్టం చేసిందా? యోబు తన ఆస్తిని కోల్పోయినప్పుడు అతని ప్రశాంత నడవడికలో అతని మానవత్వం మరియు అన్వేషణ అంతర్భాగంగా ఉన్నాయి. దేవుడి పరీక్షలను ఎదుర్కున్న సమయంలో “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” అని చెప్పడానికి యోబుకు ఆ స్థాయి మరియు విశ్వాసం ఉండడానికి కారణం సరిగ్గా అతని రోజువారీ అన్వేషణే. ఈ మాటలు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కావు, లేదా యోబు మెదడులో అప్పుడే స్ఫురించినవి కావు. అవి అనేక సంవత్సరాల జీవితానుభవంలో అతను చూసిన మరియు పొందిన వాటి నుండి వచ్చాయి. దేవుడి ఆశీర్వాదాలను మాత్రమే కోరుకునే, దేవుడు వారి నుండి తీసుకుపోతాడని భయపడే, అలాంటి విషయాన్ని ద్వేషించే మరియు దాని గురించి ఫిర్యాదు చేసే వారందరితో పోలిస్తే, యోబు విధేయత ఎంతో వాస్తవం కాదా? దేవుడు ఉన్నాడని విశ్వసించినప్పటికీ, దేవుడు సమస్తాన్ని పాలిస్తాడని ఎప్పుడూ విశ్వసించని వారందరితో పోలిస్తే, యోబులో గొప్ప యథార్థత మరియు నిజాయితీ లేవంటారా?

యోబు వివేకము

యోబు వాస్తవ అనుభవాలు, అతని నిజాయితీ మరియు యథార్థమైన మానవత్వం అంటే అర్థాన్ని, అతను తన ఆస్తులను మరియు బిడ్డలను కోల్పోయినప్పుడు అతను తీసుకున్న అత్యంత వివేకవంతమైన నిర్ణయము మరియు ఎంపికలు సూచిస్తాయి. అలాంటి వివేకవంతమైన ఎంపికలు అతని రోజువారీ అన్వేషణల నుండి మరియు అతని రోజువారీ జీవితంలో అతను తెలుసుకున్న దేవుడి పనుల నుండి విడదీయరానివి. యోబు యథార్థతే అతను యెహోవా హస్తం అన్నింటినీ పాలిస్తున్నదని విశ్వసించగలిగేలా చేసింది; అతని విశ్వాసమే సమస్త విషయాలపై యెహోవా దేవుడి సార్వభౌమాధిపత్యపు వాస్తవాన్ని తెలుసుకునేలా చేసింది; అతని జ్ఞానమే అతను యెహోవా దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని మరియు ఏర్పాట్లను సమ్మతించేలా, వాటి పట్ల విధేయత చూపగలిగేలా చేసింది; అతని విధేయతే యెహోవా దేవుడి పట్ల తనకున్న భయం మరింత నిజాయితీ ప్రదర్శించేలా చేసింది; అతని భయమే అతడు చెడును విసర్జించడాన్ని మరింత వాస్తవం చేసింది; అంతిమంగా, యోబు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించాడు కాబట్టి అతడు పరిపూర్ణుడిగా మారాడు; అతని పరిపూర్ణత అతన్ని బుద్ధిశాలిగా మార్చింది మరియు అత్యంత వివేకాన్ని అందించింది.

“వివేకము” అనే ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి అక్షరత: వివరణ ఏమిటంటే, మంచి జ్ఞానాన్ని కలిగి ఉండటం, వారి ఆలోచనలలో తార్కికంగా, వివేకశీలురై ఉండటం, సరియైన మాటతీరు, పనులు, నిర్ణయాలను కలిగి ఉండటం మరియు సరియైన, నియమిత నైతిక ప్రమాణాలను కలిగి ఉండటమని అర్థం. యోబు వివేకము అంత సులభంగా వివరించబడలేదు. యోబు అత్యంత వివేకము కలవాడని చెప్పినప్పుడు, అతని మానవత్వం మరియు దేవుడి యెదుట అతని నడవడికను దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది. యోబు యథార్థమైనవాడు కాబట్టి, అతను దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని విశ్వసించగలిగాడు మరియు విధేయత చూపగలిగాడు, అది అతనికి ఇతరులు పొందలేని జ్ఞానాన్ని ఇచ్చింది, ఈ జ్ఞానం అతన్ని మరింత ఖచ్చితంగా గుర్తించగలిగేలా, నిర్ణయించుకోగలిగేలా మరియు అతనికి ఏమి జరిగిందో నిర్వచించగలిగేలా చేసింది, ఏమి చేయాలో, దేనికి దృఢంగా కట్టుబడాలో మరింత ఖచ్చితంగా మరియు స్పష్టంగా ఎంచుకునేలా చేసింది. అతని మాటలు, ప్రవర్తన, అతని చర్యల వెనుక ఉన్న నియమాలు మరియు అతను వ్యవహరించే నియమావళి నియమితంగా, స్పష్టంగా మరియు నిర్దిష్టంగా ఉన్నాయని, గుడ్డిగా, దూకుడుగా లేదా భావావేశపూరితంగా లేవని చెప్పవచ్చు. అతనికి ఏమి జరిగినా ఏవిధంగా వ్యవహరించాలో అతనికి తెలుసు, క్లిష్టమైన సంఘటనల మధ్య సంబంధాలను ఎలా సమతుల్యం చేయాలో, ఎలా నిర్వహించుకోవాలో అతనికి తెలుసు, వేగంగా పట్టుకోవాల్సిన మార్గాన్ని వేగంగా ఎలా పట్టుకోవాలో అతనికి తెలుసు, అంతేకాకుండా, యెహోవా దేవుడు ఇచ్చే, తీసుకునే వాటి పట్ల ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. యోబు స్పష్టమైన వివేకము ఇదే. ఇది ఖచ్చితంగా ఎందుకంటే యోబు తన ఆస్తులు, కుమారులు కుమార్తెలను కోల్పోయినప్పుడు, “యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక,” అని అనడానికి అతనికి అలాంటి వివేకము ఉంది కాబట్టే.

యోబు విపరీతమైన శరీర బాధను, అతని రక్తసంబంధీకుల, స్నేహితుల ఆక్షేపణలను ఎదుర్కున్నప్పుడు మరియు అతను మృత్యువును ఎదుర్కున్నప్పుడు, అతని అసలు నడవడిక ప్రజలందరికీ మరోసారి అతని వాస్తవమైన ముఖాన్ని చూపించింది.

యోబు నిజమైన ముఖం: నిజమైనది, స్వచ్ఛమైనది మరియు ఎలాంటి అసత్యం లేనిది

యోబు 2:7-8 చదువుదాం: “కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండెను.” ఇది యోబు శరీరంపై బాధించే కురుపులు పడినప్పుడు అతని ప్రవర్తన యొక్క వివరణ. ఈ సమయంలో, యోబు నొప్పిని భరించి బూడిదలో కూర్చున్నాడు. అతనికి ఎవరూ చికిత్స చేయలేదు, శరీరపు బాధను తగ్గించడానికి ఎవరూ సహాయపడలేదు; దానికి బదులుగా, అతను బాధగల కురుపులను గోకివేసేందుకు చిల్ల పెంకును ఉపయోగించాడు. పైపైన, యోబు వేదనలో ఇది ఒక దశ మాత్రమే, అతని మానవత్వానికి మరియు దేవుడి పట్ల భయం కలిగి ఉండటానికి దీనితో ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ సమయంలో తన మనోస్థితి మరియు అభిప్రాయాలను వ్యక్తపరచడానికి యోబు ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ యోబు చర్యలు మరియు అతని నడవడిక అతని మానవత్వానికి నిజమైన వ్యక్తీకరణ. మనం మునుపటి అధ్యాయంలోని నమోదులో తూర్పు దిక్కు జనులందరిలో యోబు గొప్పవాడుగా నుండెనని చదివాము. అదే సమయంలో, రెండవ అధ్యాయంలోని ఈ వృత్తాంతం, తూర్పు దిక్కు జనులందరిలోని ఈ గొప్పవాడు నిజానికి బూడిద మధ్య కూర్చొని తనను తాను గోక్కుకోవడానికి ఒక చిల్ల పెంకును తీసుకున్నాడని మనకు చూపుతుంది. ఈ రెండు వర్ణనల మధ్య స్పష్టమైన వైరుధ్యం లేదా? ఇది మనకు యోబు నిజమైన స్వభావాన్ని చూపే వైరుధ్యం: అతనికి ప్రతిష్టాత్మకమైన స్థాయి మరియు హోదా ఉన్నప్పటికీ, అతను ఈ విషయాలను ఎన్నడూ ప్రేమించలేదు లేదా వాటిపై శ్రద్ధ చూపలేదు; ఇతరులు తన స్థాయిని ఎలా చూస్తున్నారనే విషయాన్ని పట్టించుకోలేదు, లేదా అతని చర్యలు లేదా నడవడిక అతని స్థాయిపై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా అనేదాని గురించి ఆందోళన చెందలేదు; హోదాతో వచ్చే ప్రయోజనాల్లో అతను తలమునకలు కాలేదు, లేదా హోదా మరియు స్థాయితో వచ్చిన కీర్తిని ఆస్వాదించలేదు. అతను అతని విలువను మరియు యెహోవా దేవుడి దృష్టిలో అతని జీవన ప్రాముఖ్యతను మాత్రమే పట్టించుకున్నాడు. యోబు నిజమైన స్వభావమే అతని గొప్ప గుణగణాలు: అతను కీర్తిని, సంపదను ప్రేమించలేదు మరియు కీర్తి కోసం, సంపద కోసం జీవించలేదు; అతను నిజమైనవాడు, స్వచ్ఛమైనవాడు మరియు అబద్ధం లేనివాడు.

ప్రేమ మరియు ద్వేషాల మధ్య యోబు విభజన

యోబు మరియు అతని భార్యకు మధ్య జరిగిన ఈ సంభాషణలో యోబు మానవత్వపు మరో కోణం ప్రదర్శించబడింది: “అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను” (యోబు 2:9-10). అందుకతడు ఆమెతో, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. ఏమిటి? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” (యోబు 2:9-10). యోబు అనుభవిస్తున్న వేదనను చూసి, అతని భార్య అతడు వేదన నుండి తప్పించుకోవడానికి యోబుకు సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది, అయినప్పటికీ ఆమె “మంచి ఉద్దేశాలు” యోబును ఒప్పించలేదు; బదులుగా, అవి అతని కోపాన్ని రెచ్చగొట్టాయి, ఎందుకంటే ఆమె యెహోవా దేవుడి పట్ల అతని విశ్వాసాన్ని మరియు విధేయతను నిరాకరించింది, అలాగే యెహోవా దేవుడి అస్థిత్వాన్ని కూడా నిరాకరించింది. ఇది యోబుకు భరించలేనిదిగా ఉంది, ఎందుకంటే ఇతరులు ఏమి చెప్పినా, దేవుడిని వ్యతిరేకించే లేదా బాధ కలిగించే ఏదైనా పని చేయడానికి అతను ఎప్పుడూ పూనుకోలేదు. ఇతరులు దేవుడిని దైవదూషణ చేసే, అవమానించే మాటలు మాట్లాడడం చూసినప్పుడు అతను ఉదాసీనంగా ఎలా ఉండగలడు? అందువల్లనే అతను తన భార్యను “మూర్ఖపు స్త్రీ” అని అన్నాడు. తన భార్య పట్ల యోబు వైఖరి కోపం మరియు ద్వేషంతో పాటు, నింద మరియు మందలింపుతో కూడినది. ఇది యోబు మానవత్వపు సహజ వ్యక్తీకరణ-ప్రేమ మరియు ద్వేషం మధ్య భేదం చూపడం-అలాగే ఇది అతని నిజాయితీగల మానవత్వానికి నిజమైన సూచిక. యోబులో న్యాయ స్పృహ ఉంది-ఇది అతడు దుర్మార్గపు గాలివాటములను ద్వేషించేలా మరియు అసంబద్ధ మతవిశ్వాశాలను, హాస్యాస్పదమైన వాదనలను మరియు మూర్ఖపు వాదనలను అసహ్యించుకునేలా, ఖండించేలా తిరస్కరించేలా చేసింది మరియు అతను జనాలచే తిరస్కరించబడినప్పుడు, అతని సన్నిహితులచే విడిచిపెట్టబడినప్పుడు అతని సొంత, సరైన నియమాలకు మరియు వైఖరికి వాస్తవంగా కట్టుబడి ఉండేలా చేసింది.

యోబు దయ మరియు చిత్తశుద్ధి

యోబు నడవడికలో, మనం అతని మానవత్వపు వివిధ కోణాల వ్యక్తీకరణలను చూడగలుగుతున్నాము కాబట్టి, యోబు తన పుట్టిన రోజును దూషించడానికి నోరు తెరిచినప్పుడు అతని ఎలాంటి మానవత్వం మనకు కనిపిస్తుంది? మనం కింద చర్చించబోయే అంశం ఇదే.

పైన, యోబు పుట్టిన రోజును దూషించే మూలాల గురించి నేను మాట్లాడాను. దీనిలో మీకు ఏమి కనిపిస్తుంది? యోబు కఠినాత్ముడు, ప్రేమ లేనివాడు అయితే, అతను ఉదాసీనుడు, భావోద్వేగాలు మరియు మానవత్వం లేని మనిషి అయితే, అతను దేవుడి మనసులోని కోరికను పట్టించుకోగలిగేవాడా? అతను దేవుడి మనస్సు గురించి శ్రద్ధ వహించాడు కాబట్టి తన సొంత పుట్టిన రోజును తృణీకరించగలిగాడా? మరోలా చెప్పాలంటే, యోబు కఠినాత్ముడు, మానవత్వం లేనివాడు అయితే, అతను దేవుడి బాధను చూసి వ్యధ చెందగలిగేవాడా? దేవుడు తన వలన దుఃఖ పడ్డాడు కాబట్టి అతను తన పుట్టిన రోజును దూషించగలిగాడా? దీనికి సమాధానం, ఖచ్చితంగా కాదు అనే! యోబు దయగలవాడు కాబట్టి, అతను దేవుడి హృదయాన్ని పట్టించుకున్నాడు; యోబు దేవుడి హృదయాన్ని పట్టించుకున్నాడు కాబట్టి, అతను దేవుడి బాధను గ్రహించాడు; అతను దయగలవాడు కాబట్టి, దేవుడి బాధను గ్రహించడం వల్ల ఎక్కువ వేదనను అనుభవించాడు; అతను దేవుడి బాధను గ్రహించినందున, అతను తన పుట్టిన రోజును అసహ్యించుకోవడం ప్రారంభించాడు, అందుకే తన పుట్టిన రోజును దూషించాడు. బయటి వ్యక్తులకు, పరీక్షల సమయంలో యోబు మొత్తం ప్రవర్తన ఆదర్శప్రాయమైనది. అతను తన పుట్టిన రోజును దూషించడం ఒక్కటి మాత్రమ అతని పరిపూర్ణత మరియు నీతిపై ప్రశ్నార్థకంగా మారుతుంది లేదా భిన్నమైన అంచనాను అందిస్తుంది. వాస్తవానికి, ఇది యోబు మానవత్వపు గుణగణాలకు నిజమైన వ్యక్తీకరణ. అతని మానవత్వపు గుణగణాలను మరెవరో దాచలేదు లేదా మూటగట్టలేదు లేదా సవరించలేదు. తన పుట్టిన రోజును అతను దూషించినప్పుడు, అతను తన హృదయపు లోతులలో దయ మరియు చిత్తశుద్ధిని ప్రదర్శించాడు; అతను అడుగు భాగం స్పష్టంగా కనిపించే నిర్మలమైన, తేట నీటి ఊటలా ఉన్నాడు.

యోబు గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, అనేకమందికి నిస్సందేహంగా యోబు మానవత్వపు గుణగణాలను గురించి చాలా ఖచ్చితమైన మరియు నిష్పాక్షిక అంచనా వస్తుంది. దేవుడు చెప్పినట్లుగా, యోబు పరిపూర్ణత మరియు నీతి గురించి వారిలో లోతైన, ఆచరణాత్మకమైన మరియు మరింత మెరుగైన అవగాహన మరియు ప్రశంస కూడా ఏర్పడాలి. ఈ అవగాహన మరియు ప్రశంస ప్రజలు దేవుడికి భయపడే మరియు చెడును విసర్జించే మార్గంలో నడవటాన్ని ప్రారంభించేలా చేయడంలో సహాయపడతాయని ఆశిస్తున్నాము.

దేవుడు యోబును సాతానుకు అప్పగించడం మరియు దేవుడి కార్యపు లక్ష్యం మధ్య సంబంధం

యోబు పరిపూర్ణుడు మరియు యథార్థవర్తనుడని మరియు అతను దేవుడికి భయపడ్డాడని, చెడును విసర్జించాడని ఇప్పుడు చాలా మంది ప్రజలు గుర్తించినప్పటికీ, ఇలా గుర్తించడం అనేది వారికి దేవుడి ఉద్దేశం గురించి ఎక్కువ అవగాహన కల్గించదు. యోబు మానవత్వం మరియు అన్వేషణ పట్ల అసూయపడే సమయంలోనే, వారు దేవుడి గురించి కింది ప్రశ్న అడుగుతారు: యోబు ఎంతో పరిపూర్ణుడు మరియు యథార్థవర్తనుగా ఉన్నాడు, ప్రజలు అతన్ని ఎంతో ఆరాధిస్తారు,అలాంటప్పుడు దేవుడు అతన్ని సాతానుకు ఎందుకు అప్పగించాడు మరియు అతనిని చాలా వేదనకు ఎందుకు గురిచేశాడు? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది హృదయాలలో తప్పక ఉంటాయి-లేదా చాలా మంది హృదయాలలో ఈ సందేహమే ప్రశ్నగా ఉంటుంది. ఇది చాలా మందిని అయోమయానికి గురి చేసింది కాబట్టి, మనం ఈ ప్రశ్నను చర్చించాలి మరియు తగిన విధంగా వివరించాలి.

దేవుడు చేసే ప్రతి ఒక్కటీ అవసరమైనది మరియు అసాధారణ ప్రాముఖ్యతగలది, ఎందుకంటే ఆయన మనిషిలో చేసేదంతా ఆయన నిర్వహణ మరియు మానవాళి రక్షణకు సంబంధించినది. సహజంగానే, దేవుడి దృష్టిలో యోబు పరిపూర్ణుడు మరియు యథార్థవర్తనుడు అయినప్పటికీ, యోబులో దేవుడు చేసిన పని భిన్నమైనది కాదు. మరోలా చెప్పాలంటే, దేవుడు ఏమి చేసినా లేదా ఆయన ఏ మార్గంలో చేసినా, ఖర్చు ఎంతైనా, ఆయన లక్ష్యం ఏదైనా, ఆయన చర్యల ఉద్దేశం మారదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, దేవుడి మాటలను, అదేవిధంగా మనిషి నుండి దేవుడు కోరుకున్నవి మరియు చిత్తాన్ని మనిషిలో పనిచేసేలా చేయడం; మరోలా చెప్పాలంటే, మనిషి ఆయన హృదయాన్ని అర్ధం చేసుకునేలా, ఆయన గుణగణాలను అవగాహన చేసుకునేలా ఆయన దశలవారీ చర్యలకు అనుగుణంగా దేవుడు సానుకూలమైనదిగా విశ్వసించినవన్నీమనిషిలో పని చేసేలా చేయడం మరియు దేవుడి పట్ల మనిషి భయం కలిగి ఉండేలా, చెడును విసర్జించేలా చేయడానికి, మనిషిని దేవుడి సార్వభౌమాధిపత్యానికి మరియు ఏర్పాట్లకు లోబడి ఉండేలా చేయడం-ఇవన్నీ దేవుడు చేసే ప్రతిదానిలో ఆయన ఉద్దేశపు ఒక కోణం. మరో కోణం ఏమిటంటే, సాతాను అంటే, దేవుడి కార్యములో వైఫల్యం మరియు సేవా వస్తువు కాబట్టి, మనిషిని తరచుగా సాతానుకు ఇవ్వడం జరుగుతుంది; సాతాను ప్రలోభాలలో మరియు సాతాను దుర్మార్గం, వికారం మరియు సాతాను ధిక్కారపు దాడిలో ప్రజలను చూడడానికి దేవుడు ఉపయోగించే మార్గం ఇదే, దీని ద్వారా ప్రజలు సాతానును ద్వేషించేలా చేయడం, ప్రతికూలమైన వాటిని తెలుసుకోగలిగేలా మరియు గుర్తించేలా చేయడం. ఈ ప్రక్రియ వారు సాతాను నియంత్రణ, ఆరోపణలు, జోక్యం మరియు దాడుల నుండి తమను తాము క్రమంగా విడిపించుకోవడానికి వీలుకల్పిస్తుంది-దేవుడి వాక్యముల సహాయంతో, దేవుడి గురించి వారి జ్ఞానం మరియు విధేయత, దేవుడి పట్ల వారి విశ్వాసం మరియు ఆయన పట్ల భయంతో, వారు సాతాను దాడులు మరియు ఆరోపణలపై విజయం సాధించే వరకు కొనసాగుతుంది; అప్పుడే వారు సాతాను ఆధిపత్యం నుండి పూర్తిగా రక్షించబడతారు. ప్రజల రక్షణ అంటే అర్థం, సాతాను ఓడించబడిందని, అంటే, వారు ఇకపై సాతాను నోటికి ఆహారం కాదని-వారిని మింగడానికి బదులుగా, సాతాను వారిని విడిచిపెట్టిందని అర్థం. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు నీతిమంతులు, ఎందుకంటే వారికి దేవుడి పట్ల విశ్వాసం, విధేయత మరియు భయం ఉన్నాయి, ఎందుకంటే వారు సాతాను నుండి పూర్తిగా విడిపోయారు. వారు సాతాను సిగ్గుపడేలా చేస్తారు, వారు సాతానును పిరికిపందగా చేస్తారు మరియు వారు సాతానును పూర్తిగా ఓడిస్తారు. దేవుడిని అనుసరించడంలో వారి విశ్వాసం, దేవుడి పట్ల విధేయత మరియు భయం సాతానును ఓడిస్తాయి మరియు సాతాను వారిని పూర్తిగా విడిచిపెట్టేలా చేస్తాయి. ఇలాంటి వారు మాత్రమే దేవుడిచే నిజంగా పొందబడ్డారు మరియు మానవులను రక్షించడంలో దేవుడి అంతిమ లక్ష్యం ఇదే. వారు రక్షింపబడాలని కోరుకుంటే, దేవుడిచే పూర్తిగా పొందబడాలని కోరుకుంటే, దేవుడిని అనుసరించే వారందరూ సాతాను నుండి పెద్ద మరియు చిన్న రెండు రకాల ప్రలోభాలను మరియు దాడులను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రలోభాలు మరియు దాడుల నుండి బయటపడి సాతానును పూర్తిగా ఓడించగలిగిన వారే దేవుడిచే రక్షించబడినవారు అవుతారు. దేవుడిచే రక్షింపబడిన వారు అంటే, దేవుడి పరీక్షలకు గురైనవారు మరియు సాతానుచే చెప్పలేనన్ని సార్లు ప్రలోభింపబడిన, దాడి చేయబడిన వారని అర్థం. దేవుడిచే రక్షింపబడిన వారు దేవుడి చిత్తాన్ని, కోరికలను అర్థం చేసుకుంటారు మరియు దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని, ఏర్పాట్లను ఆక్షేపణ లేకుండా ఆమోదించగలుగుతారు, అలాగే వారు సాతాను ప్రలోభాల మధ్య దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గాన్ని విడిచిపెట్టరు. దేవుడిచే రక్షింపబడిన వారిలో యథార్థత, దయ ఉంటాయి, వారు ప్రేమ మరియు ద్వేషాల మధ్య భేదం చూపగలరు, వారికి న్యాయ స్పృహ ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటారు, వారు దేవుడి పట్ల శ్రద్ధ వహించగలరు మరియు దేవుడికి సంబంధించిన సమస్తాన్నీ అమూల్యమైన నిధిగా పరిగణించగలరు. అలాంటి వారు సాతానుచే బంధించబడరు, గూఢచర్యం చేయబడరు, నిందించబడరు లేదా బాధించబడరు; వారు పూర్తి స్వేచ్ఛగా ఉంటారు, పూర్తిగా విముక్తి పొంది, విడుదల చేయబడి ఉంటారు. యోబు అలాంటి స్వేచ్ఛ పొందిన వ్యక్తే మరియు దేవుడు అతన్ని సాతానుకు ఎందుకు అప్పగించాడనే దాని ప్రాముఖ్యత ఇదే.

సాతానుచే యోబు బాధించబడ్డాడు, కానీ అతను శాశ్వతమైన స్వేచ్ఛ మరియు విముక్తిని కూడా పొందాడు అలాగే సాతాను చెరుపుకు, బాధకు మరియు నిందారోపణలకు మళ్లీ ఎప్పుడూ గురికాకుండా ఉండటానికి బదులు దేవుడి అనుగ్రహపు వెలుగులో స్వేచ్ఛగా, అడ్డంకులు లేకుండా జీవించడానికి అలాగే అతనికి దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదాల మధ్య జీవించడానికి హక్కును పొందాడు. ఈ హక్కును ఎవరూ తీసివేయలేరు లేదా నాశనం చేయలేరు లేదా స్వాధీనం చేసుకోలేరు. యోబు విశ్వాసం, పట్టుదల, దేవుడి పట్ల విధేయత, భయం కలిగి ఉండటానికి ఫలితంగా ఇవ్వబడింది; భూమిపై సంతోషం, ఆనందం పొందేందుకు మరియు భూమిపై దేవుడు సృష్టించిన నిజమైన జీవిగా జోక్యం లేకుండా సృష్టికర్తను ఆరాధించడానికి, పరలోకము ద్వారా నియమింపబడిన మరియు భూలోకము ద్వారా అంగీకరింపబడిన హక్కు మరియు అర్హతను గెలుచుకోవడానికి యోబు తన జీవితాన్నే మూల్యంగా చెల్లించాడు. యోబు భరించిన ప్రలోభాల గొప్ప ఫలితం కూడా అలాంటిదే.

ప్రజలు ఇంకా రక్షించబడాల్సి ఉన్నప్పుడు, సాతాను వారి జీవితాలలో తరచూ జోక్యం చేసుకుంటుంది మరియు జీవితాలను నియంత్రిస్తుంది కూడా. మరోలా చెప్పాలంటే, రక్షింపబడని వారు సాతానుకు బంధీలై ఉన్నారు, వారికి స్వేచ్ఛ లేదు, వారిని సాతాను విడిచిపెట్టలేదు, దేవుడిని ఆరాధించడానికి వారికి అర్హత లేదా హక్కు లేదు, వారిని సాతాను దగ్గరగా వెంబడించి, క్రూరంగా దాడి చేస్తుంది. అలాంటి వ్యక్తులకు మాట్లాడటంలో ఆనందం లేదు, వారికి సాధారణ అస్థిత్వం గురించి మాట్లాడే హక్కు లేదు, అంతకుమించి వారికి మాట్లాడటంలో గౌరవం లేదు. సాతానుతో జీవన్మరణ యుద్ధంలో పోరాడటానికి, దేవుడి పట్ల నీ విశ్వాసం, విధేయత మరియు దేవుడి పట్ల భయం కలిగి ఉండటాన్ని ఆయుధాలుగా ఉపయోగించి, అది నీకు వ్యతిరేకంగా దాడులు మరియు ఆరోపణలు చేయడం పూర్తిగా వదిలివేసేలా, అది నిన్ను చూసినప్పుడల్లా తోక ముడిచి పిరికిపందగా మారేలా చేస్తూ, నీవు సాతానును పూర్తిగా ఓడించేలా, ఎదురు నిలబడి సాతానుతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే-నీవు రక్షించబడతావు మరియు స్వేచ్ఛ పొందుతావు. నీవు సాతానుతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పటికీ, సాతానును ఓడించడానికి సహాయపడే తగినన్ని ఆయుధాలు నీ వద్ద లేకపోతే, నీవు ఇంకా ప్రమాదంలోనే ఉంటావు; కాలం గడిచేకొద్దీ, నీలో లేశమాత్రం కూడా బలం లేకుండా సాతాను నిన్ను హింసించినప్పుడు, నీవు ఇప్పటికీ సాక్ష్యం చెప్పలేకపోతే, ఇప్పటికీ సాతాను ఆరోపణలు మరియు దాడుల నుండి పూర్తిగా విముక్తి పొందకపోతే, అప్పుడు నీకు రక్షణ లభించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. చివరికి, దేవుడి కార్యపు ముగింపు ప్రకటించబడినప్పుడు, నిన్ను నీవు విడిపించుకోలేకుండా, ఇంకా నీవు సాతాను నియంత్రణలోనే ఉంటావు, దీంతో నీకు ఇంకెప్పటికీ అవకాశం లేదా ఆశ ఉండదు. అప్పుడు, అలాంటి వ్యక్తులు పూర్తిగా సాతాను చెరలోనే ఉంటారని ఇది సూచిస్తుంది.

దేవుడి పరీక్షలను అంగీకరించండి, సాతాను ప్రలోభాలను అధిగమించండి మరియు మీ సంపూర్ణ అస్థిత్వాన్ని పొండడానికి దేవుడిని అనుమతించండి

దేవుడి స్థిరమైన ఏర్పాటు మరియు మనిషికి మద్దతు ఇచ్చే కార్యములో, ఆయన మనిషికి తన చిత్తాన్ని మరియు అవసరాలను సంపూర్ణంగా చెబుతాడు మరియు ఆయన కార్యములు, స్వభావం మరియు ఆయన కలిగి ఉన్నవాటిని మరియు ఆయన ఏమిటో మనిషికి చూపిస్తాడు. దీని ఉద్దేశం మనిషిని స్థాయితో సన్నద్ధం చేయడం మరియు దేవుడిని అనుసరిస్తుండగా మనిషి ఆయన నుండి వివిధ సత్యాలను-సాతానుతో పోరాడటానికి దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుధాలైన సత్యాలను, పొందేందుకు వీలుకల్పించడమే. ఈ విధంగా సన్నద్ధం చేయబడిన తర్వాత, మనిషి తప్పక దేవుడి పరీక్షలను ఎదుర్కోవాలి. మనిషిని పరీక్షించడానికి దేవుడి వద్ద అనేక సాధనాలు మరియు మార్గాలు ఉన్నాయి, కానీ వాటిలో ప్రతిదానికి దేవుని శత్రువు “సహకారం” అవసరం: అంటే, మనిషికి సాతానుతో యుద్ధం చేసే ఆయుధాలను ఇచ్చిన తర్వాత, దేవుడు మనిషిని సాతానుకు అప్పగిస్తాడు మరియు మనిషి స్థాయిని “పరీక్షించడానికి” సాతానును అనుమతిస్తాడు. మనిషి సాతాను యుద్ధ వ్యూహాలను ఛేదించగలిగితే, అతడు సాతాను చక్రబంధం నుండి తప్పించుకొని ఇంకా జీవించగలిగితే, అప్పుడు మనిషి పరీక్షలో ఉత్తీర్ణుడై ఉంటాడు. కానీ మనిషి సాతాను యుద్ధ వ్యూహాల నుండి బయటపడటంలో విఫలమైతే మరియు సాతానుకు లొంగిపోతే, అప్పుడు అతను పరీక్షలో ఉత్తీర్ణత పొందనివాడై ఉంటాడు. దేవుడు మనిషి ఏ కోణాన్ని పరీక్షించినా, సాతాను దాడి చేసినప్పుడు మనిషి తన సాక్ష్యంలో స్థిరంగా ఉన్నాడా లేదా మరియు అతను సాతానుకు చిక్కుబడిపోయి దేవుడిని వదిలివేసి, సాతానును లొంగిపోయాడా లేదా అనేవే ఈ పరీక్షకు ఆయన ప్రమాణాలు. మనిషి రక్షింపబడగలడా లేదా అనేది అతడు సాతానును అధిగమించగలడా మరియు ఓడించగలడా లేదా అనేదానిపై, సాతాను పూర్తిగా ఆశ వదులుకుని, ఒంటరి అయిపోయేలా చేస్తూ, సాతాను బానిసత్వాన్ని అధిగమించడానికి ఆయన మనిషికి ఇచ్చిన ఆయుధాలను సొంతంగా పైకి ఎత్తగలడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. సాతాను ఆశ వదులుకుని, ఎవరినైనా విడిచిపెడితే, దాని అర్థం ఆ వ్యక్తిని దేవుడి నుండి తీసుకోవడానికి మళ్లీ ఎప్పుడూ సాతాను ప్రయత్నించదు, ఈ వ్యక్తిని మళ్లీ ఎప్పుడూ నిందించదు మరియు ఈ వ్యక్తి విషయంలో జోక్యం చేసుకోదు, వారిని మళ్లీ ఎప్పుడూ హింసించాలని లేదా వారిపై దాడి చేయాలని అనుకోదు అని అర్థం; ఎవరైనా అలాంటి వ్యక్తి మాత్రమే నిజంగా దేవుడిచే పొందబడి ఉంటాడు. దేవుడు ప్రజలను పొందే మొత్తం ప్రక్రియ ఇదే.

యోబు సాక్ష్యం ద్వారా తర్వాతి తరాలకు ఇవ్వబడిన హెచ్చరిక మరియు జ్ఞానోదయం

దేవుడు ఎవరినైనా పూర్తిగా పొందే ప్రక్రియను అర్థం చేసుకున్న అదే సమయంలోనే, దేవుడు యోబును సాతానుకు అప్పగించడం లోని లక్ష్యాలు మరియు ప్రాముఖ్యతను కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఇక యోబు వేదన చూసి కలవరపడరు మరియు దాని ప్రాముఖ్యత గురించి కొత్త ప్రశంస కలిగి ఉంటారు. తాము కూడా యోబు లాగా అదే ప్రలోభానికి గురవుతామో అని వారు ఇక ఆందోళన చెందరు మరియు దేవుడి పరీక్షలు రావటాన్నిఇకపై వ్యతిరేకించరు లేదా తిరస్కరించరు. యోబు విశ్వాసం, విధేయత మరియు సాతానును అధిగమించడానికి అతని సాక్ష్యం ప్రజలకు బ్రహ్మాండమైన సహాయం మరియు ప్రోత్సాహానికి మూలంగా ఉన్నాయి. వారు యోబులో, తమ సొంత రక్షణ కోసం ఆశను చూస్తారు, దేవుడి పట్ల విశ్వాసం, విధేయత మరియు భయం కలిగి ఉండటం ద్వారా, సాతానును ఓడించడం, సాతానుపై ఆధిపత్యం సాధించడం పూర్తిగా సాధ్యమని వారు చూస్తారు. వారు దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని మరియు ఏర్పాట్లను అంగీకరించినంత కాలం మరియు సర్వం కోల్పోయిన తర్వాత కూడా దేవుడిని విడిచిపెట్టకూడదనే పట్టుదల మరియు విశ్వాసం కలిగి, సాతాను సిగ్గుపడేలా, ఓడిపోయేలా చేయగలిగినంత కాలం, సాతానును పిరికిపందగా మార్చడానికి మరియు వెనక్కు వెళ్లిపోవడానికి, వారికి కావలసింది, తమ ప్రాణాలు పోయినా-తమ సాక్ష్యంలో స్థిరంగా నిలబడే దృఢ సంకల్పం మరియు పట్టుదల మాత్రమేనని వారు చూస్తారు. తర్వాతి తరాలకు యోబు సాక్ష్యం ఒక హెచ్చరిక, వారు సాతానును ఓడించకపోతే, సాతాను ఆరోపణలు మరియు జోక్యాల నుండి తాము ఎప్పటికీ తప్పించుకోలేరని లేదా సాతాను యాతన మరియు దాడుల నుండి తప్పించుకోలేరని ఈ హెచ్చరిక వారికి చెబుతుంది. యోబు సాక్ష్యం తర్వాతి తరాలకు జ్ఞానోదయం కలుగజేసింది. ఈ జ్ఞానోదయం, ప్రజలు యథార్థవర్తనులు మరియు న్యాయవంతులుగా ఉంటేనే వారు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించగలరని బోధిస్తుంది; వారు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జిస్తే మాత్రమే వారు దేవుడికి బలమైన మరియు ప్రతిధ్వనించే సాక్ష్యం చెప్పగలరని అది వారికి బోధిస్తుంది; వారు దేవుడికి బలమైన మరియు ప్రతిధ్వనించే సాక్ష్యం ఇస్తే మాత్రమే వారు ఇంకెప్పుడూ సాతానుచే నియంత్రించబడరు మరియు దేవుడి మార్గదర్శకత్వం, రక్షణలో జీవించగలరు-అప్పుడే వారు నిజంగా రక్షించబడి ఉంటారు. రక్షణను అన్వేషించే ప్రతి ఒక్కరూ, యోబు వ్యక్తిత్వం మరియు అతని జీవిత అన్వేషణను అనుసరించాలి. దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించే వారందరికీ, యోబు జీవితాంతం గడిపిన జీవితం మరియు పరీక్షల సమయంలో అతని ప్రవర్తన అమూల్యమైన నిధి.

యోబు సాక్ష్యం దేవుడికి ఓదార్పునిస్తుంది

యోబు ఒక ప్రేమాస్పదుడైన వ్యక్తి అని నేను ఇప్పుడు మీకు చెబితే, ఈ పదాల అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నేను ఈ విషయాలన్నీ చెప్పడానికి వెనుక ఉన్న భావనను గ్రహించలేకపోవచ్చు; కానీ మీరు యోబు అనుభవించినటువంటి లేదా అలాంటి పరీక్షలనే అనుభవించే, మీరు ప్రతికూలతను ఎదుర్కొనే, దేవుడు మీ కోసం వ్యక్తిగతంగా ఏర్పాటు చేసిన పరీక్షలను అనుభవించే, సాతానును అధిగమించడానికి మరియు ప్రలోభాల మధ్య దేవుడికి సాక్ష్యమివ్వడానికి మీ సమస్తాన్ని ఇచ్చే మరియు అవమానాన్ని మరియు కష్టాలను సహించే రోజు వరకు వేచి ఉండండి-అప్పుడు మీరు నేను చెప్పే ఈ మాటలను అర్థం చేసుకోగలుగుతారు. ఆ సమయంలో, నీవు యోబు కంటే చాలా తక్కువ వాడివని నీకు అనిపిస్తుంది, యోబు ఎంత ప్రేమాస్పదుడో మరియు అనుసరించడానికి అర్హుడో నీవు గ్రహిస్తావు; ఆ సమయం వచ్చినప్పుడు, చెడ్డవారైన మరియు ఈ కాలంలో జీవించే వ్యక్తికి యోబు చెప్పిన ఉత్తమ పదాలు ఎంత ముఖ్యమైనవో మరియు యోబు సాధించిన వాటిని సాధించడం ఈనాటి ప్రజలకు ఎంత కష్టమో నీవు తెలుసుకుంటావు. నీకు ఇది కష్టంగా అనిపించినప్పుడు, దేవుడి హృదయం ఎంత ఆత్రుతతో మరియు చింతిస్తూ ఉందో, అలాంటి వ్యక్తులను పొందటానికి దేవుడు చెల్లించిన మూల్యం ఎంత ఎక్కువగా ఉందో మరియు మానవాళి కోసం దేవుడు చేసే మరియు వెచ్చించేది ఎంత విలువైనదో నీవు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మీరు ఈ మాటలను విన్నారు, మీకు యోబు గురించి ఖచ్చితమైన అవగాహన మరియు సరైన అంచనా ఉందా? మీ దృష్టిలో, యోబు దేవుడి పట్ల భయం కలిగిన, చెడును విసర్జించిన నిజమైన యథార్థవర్తనుడు మరియు న్యాయవంతుడైన వ్యక్తేనా? చాలా మంది చాలా ఖచ్చితంగా అవును అని చెబుతారని నేను నమ్ముతున్నాను. యోబు చేసిన మరియు బహిర్గతము చేసిన వాస్తవాలు ఏ మనిషి లేదా సాతాను కాదనలేనివి. సాతానుపై యోబు విజయానికి అవి అతి శక్తివంతమైన రుజువులు. ఈ రుజువు యోబులో పుట్టినది మరియు ఇదే దేవుడు పొందిన మొదటి సాక్ష్యం. ఆ విధంగా, యోబు సాతాను ప్రలోభాలపై విజయం సాధించి, దేవుడికి సాక్ష్యమిచ్చినప్పుడు, దేవుడికి యోబులో ఆశ కనిపించింది, ఆయన హృదయం యోబు ద్వారా ఓదార్పు పొందింది. సృష్టి ఆది నుండి యోబు సమయం వరకు, నిజమైన ఓదార్పు అంటే ఏమిటో మరియు మనిషి ఓదార్చడం అంటే ఏమిటో ఇప్పుడే మొదటిసారి దేవుడు అనుభవించాడు. తన కోసం పుట్టిన నిజమైన సాక్ష్యాన్ని ఆయన చూసింది, పొందింది ఇదే మొదటిసారి.

యోబు సాక్ష్యం మరియు యోబు వృత్తాంతాల వివిధ కోణాలను గురించి విన్న తర్వాత, చాలా మంది ప్రజలు తమ ముందున్న మార్గం కోసం ప్రణాళికలు వేసుకుంటారని, అదే విధంగా, పూర్తి ఆందోళన మరియు భయం గల చాలా మంది ప్రజలు నెమ్మదిగా శరీరం మరియు మనస్సు రెండింటిలోనూ విశ్రాంతి పొందటం ప్రారంభిస్తారని నేను విశ్వసిస్తున్నాను. కొద్దికొద్దిగా ఉపశమనం పొందడం ప్రారంభిస్తారని కూడా నేను విశ్వసిస్తున్నాను ...

కింది వృత్తాంతాలు కూడా యోబుకు సంబంధించినవే. వీటిని చదవడం కొనసాగిద్దాం.

4. చెవి చెప్పింది వినడం ద్వారా, యోబు దేవుడిని వింటాడు

యోబు 9:11 ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేను: నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

యోబు 23:8-9 నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు; పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు: ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు: దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.

యోబు 42:2-నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము: ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము. వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని: అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి ఎందుకు పశ్చాత్తాపపడాలి.

యోబుకు దేవుడు స్వయంగా బయలు పరచుకోనప్పటికీ, దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని యోబు విశ్వసిస్తాడు

ఈ పదాలు నొక్కి చెబుతున్నదేమిటి? ఇక్కడ ఒక వాస్తవం ఉందని మీలో ఎవరైనా తెలుసుకున్నారా? మొట్టమొదట, దేవుడు ఉన్నాడని యోబుకు ఎలా తెలిసింది? తర్వాత, దేవుడు భూమ్యాకాశములు మరియు సమస్తాన్ని పాలిస్తున్నాడని అతనికి ఎలా తెలిసింది? ఈ రెండు ప్రశ్నలకు జవాబిచ్చే ఒక వృత్తాంతం ఉంది: “వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని: అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి ఎందుకు పశ్చాత్తాపపడాలి (యోబు 42:5-6). ఈ మాటల నుండి మనం తెలుసుకున్నది ఏమిటంటే, యోబు దేవుడిని తన కండ్లతో చూడటానికి బదులు, పురాణాల నుండి దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఈ పరిస్థితులలో అతను దేవుడిని అనుసరించే మార్గంలో నడవడం ప్రారంభించాడు, ఆ తర్వాత తన జీవితంలో మరియు అన్ని విషయాల్లో దేవుడి ఉనికిని అతను ధ్రువీకరించాడు. ఇక్కడ ఒక నిరాకరించలేని వాస్తవం ఉంది-ఆ వాస్తవం ఏమిటి? దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించగలిగినప్పటికీ, యోబు ఎప్పుడూ దేవుడిని చూడలేదు. ఇందులో, అతను ఈనాటి ప్రజలతో సమానంగా లేడా? యోబు దేవుడిని ఎప్పుడూ చూడలేదు, దీని అంతరార్థం ఏమిటంటే, అతను దేవుడి గురించి విన్నప్పటికీ, దేవుడు ఎక్కడ ఉన్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో లేదా దేవుడు ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయ కారకాలు; నిష్పాక్షికంగా చెప్పాలంటే, అతను దేవుడిని అనుసరించినప్పటికీ, దేవుడు అతనికి ఎప్పుడూ కనిపించలేదు లేదా అతనితో మాట్లాడలేదు. ఇది వాస్తవం కాదా? దేవుడు యోబుతో మాట్లాడకపోయినప్పటికీ లేదా అతనికి ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వకపోయినప్పటికీ, యోబు దేవుడి అస్థిత్వాన్ని చూశాడు మరియు సమస్త విషయాలలో అతని సార్వభౌమాధిపత్యాన్ని చూశాడు మరియు యోబు వినికిడి ద్వారా దేవుడి గురించి విన్న పురాణాల ద్వారా, అతను దేవుడికి భయపడే మరియు చెడును విసర్జించే జీవితాన్ని ప్రారంభించాడు. యోబు దేవుడిని అనుసరించడానికి ఉన్న మూలాలు మరియు ప్రక్రియలు అలాంటివి. కానీ అతను దేవుడి పట్ల ఎంత భయం కలిగి ఉన్నప్పటికీ, చెడును విసర్జించినప్పటికీ, అతను తన యథార్థతకు ఎంత గట్టిగా కట్టుబడినప్పటికీ, దేవుడు అతనికి ఎప్పుడూ కనిపించలేదు. ఈ వృత్తాంతాన్ని చదువుదాం. అతను ఇలా అన్నాడు, “ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేను: నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు” (యోబు 9:11). ఈ మాటలు చెప్పేదేమిటంటే, యోబు తన చుట్టూ దేవుడిని మనస్సులో భావించి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు-కానీ అతను దేవుడిని ఎప్పుడూ చూడలేకపోయాడు. కొన్నిసార్లు దేవుడు తన ముందు నుండి వెళుతున్నట్లు లేదా పని చేస్తున్నట్లు లేదా మనిషికి మార్గం చూపిస్తున్నట్లు అతను ఊహించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడూ తెలియలేదు. మనిషి ఎదురుచూడనప్పుడు దేవుడు అతని పైకి వస్తాడు; దేవుడు అతని పైకి ఎప్పుడు లేదా ఎక్కడ వస్తాడో మనిషికి తెలియదు, ఎందుకంటే మనిషి దేవుడిని చూడలేడు, కాబట్టి మనిషి నుండి దేవుడు నుండి దాగి ఉంటాడు.

దేవుడు అతని నుండి దాగి ఉన్నాడనే వాస్తవం వలన యోబుకు దేవుడిపై ఉన్న విశ్వాసం చలించలేదు

గ్రంథంలోని కింది వృత్తాంతంలో, యోబు అప్పుడు ఇలా అంటాడు, “నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడు; పడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు: ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు: దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను” (యోబు 23:8-9). ఈ వృత్తాంతంలో, యోబు అనుభవాల్లో, దేవుడు అతనికి తొలి నుండి చివరి వరకు దాచి పెట్టబడ్డాడని మనం తెలుసుకుంటాము; దేవుడు అతనికి ప్రత్యక్షంగా కనిపించలేదు లేదా అతనితో ప్రత్యక్షంగా ఎలాంటి మాటలు మాట్లాడలేదు, అయినప్పటికీ యోబు హృదయంలో, దేవుడి ఉనికి పట్ల విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు అతని ముందు నడుస్తూ ఉండవచ్చని లేదా అతని ప్రక్కన పని చేస్తూ ఉండవచ్చని, అతను దేవుడిని చూడలేక పోయినప్పటికీ, తనకు సంబంధించిన ప్రతిదాన్ని నడుపుతూ దేవుడు తన పక్కనే ఉన్నాడని, యోబు ఎల్లప్పుడూ విశ్వసించాడు. దేవుడిని యోబు ఎప్పుడూ చూడలేదు, కానీ మరే వ్యక్తీ చేయలేనట్లు అతను తన విశ్వాసానికి కట్టుబడి ఉండగలిగాడు. ఇతరులు అలా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే, దేవుడు యోబుతో మాట్లాడలేదు, అతనికి కనిపించలేదు, అలాంటప్పుడు ఒకవేళ అతను నిజంగా విశ్వసించకపోతే, అతను ముందుకు సాగగలిగి ఉండేవాడు కాదు లేదా దేవుడికి భయపడే, చెడును విసర్జించే మార్గానికి కట్టుబడగలిగేవాడు కాదు. ఇది నిజం కాదా? యోబు ఈ మాటలను చదివినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? యోబు పరిపూర్ణత మరియు న్యాయవర్తనత మరియు దేవుడి ఎదుట అతని నీతి నిజమైనవని, దేవుడి విషయంలో అతిశయోక్తి కాదని నీకు అనిపిస్తోందా? దేవుడు ఇతరులతో లాగే యోబుతో వ్యవహరించినప్పటికీ, అతనికి కనిపించకపోయినప్పటికీ లేదా మాట్లాడకపోయినప్పటికీ, యోబు తన నిజాయితీకి కట్టుబడ్డాడు, దేవుడి సార్వభౌమాధికారాన్ని విశ్వసించాడు, అంతేకాకుండా, దేవుడి పట్ల అపరాధం జరుగుతుందనే భయం కారణంగా అతను తరచూ దహనబలులు అర్పించాడు మరియు దేవుడి యెదుట ప్రార్థించాడు. దేవుడిని చూడకుండానే యోబు దేవుడి పట్ల భయం కలిగి ఉండగలడంలో, అతను సానుకూల విషయాలను ఎంతగా ప్రేమించాడో, అతని విశ్వాసం ఎంత దృఢంగా మరియు నిజమైనదో మనకు కనిపిస్తుంది. దేవుడు అతనికి కనిపించకుండా దాగి ఉన్నందున, అతను దేవుడి ఉనికిని తిరస్కరించలేదు లేదా అతను తన విశ్వాసాన్ని కోల్పోలేదు, అతను దేవుడిని ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆయనను విడిచిపెట్టలేదు. అలాకాకుండా, సమస్త విషయాలను పాలించే దేవుడి కనిపించని కార్యము మధ్య, అతను దేవుడి ఉనికిని తెలుసుకున్నాడు మరియు దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని మరియు శక్తిని అనుభవించాడు. దేవుడు దాగి ఉన్న కారణంగా అతను నీతితో ఉండటాన్ని వదిలివేయలేదు లేదా దేవుడు అతనికి ఎప్పుడూ కనిపించని కారణంగా దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని విడిచిపెట్టలేదు. తన ఉనికిని నిరూపించుకోవడానికి దేవుడు బహిరంగంగా కనిపించాలని యోబు ఎప్పుడూ అడగలేదు, ఎందుకంటే అతను ఇప్పటికే సమస్త విషయాలలో దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని చూశాడు మరియు ఇతరులు పొందని ఆశీర్వాదాలు, కృపను తాను పొందానని అతను విశ్వసించాడు. దేవుడు అతనికి కనిపించకుండా దాగి ఉన్నప్పటికీ, దేవుడి పట్ల యోబుకున్న విశ్వాసం ఎప్పుడూ చలించలేదు. కాబట్టే, అతను ఎవరూ పొందని పంటను పొందాడు: దేవుడి ఆమోదం మరియు దేవుడి ఆశీర్వాదం.

యోబు దేవుడి నామమును స్తుతిస్తాడు మరియు ఆశీర్వాదాలు లేదా విపత్తు గురించి ఆలోచించడు

పవిత్ర గ్రంథాలలోని యోబు కథలలో ఎప్పుడూ ప్రస్తావించబడని వాస్తవం ఒకటుంది, ఈ వాస్తవం మీదే ఈ రోజు మనం దృష్టి సారిస్తాము. యోబు ఎప్పడూ దేవుడిని చూడనప్పటికీ, దేవుడి మాటలను తన చెవులతో వినకపోయినప్పటికీ, యోబు హృదయంలో దేవుడికి ఒక స్థానం ఉంది. దేవుడి పట్ల యోబు వైఖరి ఎలా ఉండేది? ఇంతకు ముందు పేర్కొన్నట్లు, “యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” లాగా ఉండేది. అతడు దేవుడి నామమును స్తుతించడమనేది సందర్భంతో సంబంధం లేకుండా మరియు ఎటువంటి కారణానికి కట్టుబడకుండా బేషరతుగా ఉండేది. యోబు దేవుడిచే నియంత్రించబడటానికి వీలుగా అతని హృదయాన్ని దేవుడికి అర్పించాడని మనం చూస్తాము; అతని హృదయంలో అతను ఆలోచించినవన్నీ, అతను నిర్ణయించుకున్నవన్నీ మరియు అతను ప్రణాళిక చేసుకున్నవన్నీ దేవుడి యెదుట తెరిచి ఉంచాడు మరియు దేవుడికి కనిపించకుండా మూసివేయలేదు. అతని హృదయం దేవుడికి వ్యతిరేకంగా నిలుబడలేదు, తన కోసం ఏదైనా చేయమని లేదా తనకు ఏదైనా ఇవ్వమని అతను దేవుడిని ఎప్పుడూ అడగలేదు మరియు అతను దేవుడిని ఆరాధించడం ద్వారా ఏదైనా పొందుతాననే మితిమీరిన కోరికలు అతనిలో లేవు. యోబు దేవుడితో వ్యాపారాలను గురించి మాట్లాడలేదు, దేవుడికి ఏ అభ్యర్థనలు చేయలేదు లేదా దేవుడి నుండి ఏ కోరికలు కోరలేదు. అతను దేవుడి నామమును స్తుతించడం అనేదానికి సమస్త విషయాలను పాలించడంలో దేవుడి గొప్ప శక్తి మరియు అధికారమే కారణం, అతను ఆశీర్వాదాలను పొందాడా లేదా విపత్తుకు గురయ్యాడా అనే దానిపై ఆధారపడలేదు. దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడా లేదా వారిని విపత్తుకు గురి చేస్తున్నాడా అనేదానితో సంబంధం లేకుండా, దేవుడి శక్తి మరియు అధికారం మారదని, కాబట్టి, ఒక వ్యక్తి ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా, దేవుడి నామమును స్తుతించాలని అతను విశ్వసించాడు. మనిషిని దేవుడు ఆశీర్వదించడమనేది దేవుడి సార్వభౌమాధిపత్యం కారణంగానే, అలాగే మనిషిపై విపత్తు విరుచుకుపడటం కూడా దేవుని సార్వభౌమాధిపత్యం కారణంగానే. దేవుడి శక్తి మరియు అధికారం మనిషికి సంబంధించిన సమస్తాన్ని పాలిస్తాయి మరియు సమకూరుస్తాయి; మనిషి అదృష్టంలోని అస్థిరతలు దేవుడి శక్తి మరియు అధికారపు అభివ్యక్తి, ఒకరి సొంత అభిప్రాయంతో సంబంధం లేకుండా, దేవుడి నామమును స్తుతించాలి. యోబు అతని జీవితకాలంలో అనుభవించినది మరియు తెలుసుకున్నది ఇదే. యోబు ఆలోచనలు మరియు పనులన్నీ దేవుడి చెవిన పడ్డాయి, దేవుడి యెదుటకు చేరుకున్నాయి మరియు దేవుడు వాటిని ముఖ్యమైనవిగా చూశాడు. యోబు లోని ఈ జ్ఞానాన్ని ఎంతో విలువైనదిగా దేవుడు భావించాడు మరియు అలాంటి హృదయం ఉన్నందుకు యోబును ఎంతో అమూల్యమైనవాడిగా భావించాడు. ఈ హృదయం ఎల్లప్పుడూ, అన్ని ప్రదేశాలలో దేవుడి ఆజ్ఞ కోసం ఎదురుచూసింది మరియు సమయం లేదా ప్రదేశంతో సంబంధం లేకుండా, అతనికి ఎదురైన ప్రతిదానిని స్వాగతించింది. యోబు దేవుడిని ఎలాంటి కోరికలు కోరలేదు. అతను తాను చేయాలని కోరుకున్నదంతా, దేవుడి చేసే అన్ని ఏర్పాట్ల కోసం వేచి ఉండటం, వాటిని అంగీకరించడం, ఎదుర్కోవడం మరియు పాటించడం మాత్రమే; ఇది తన కర్తవ్యమని యోబు విశ్వసించాడు మరియు దేవుడు కూడా కోరుకున్నది సరిగ్గా ఇదే. యోబు దేవుడిని ఎప్పుడూ చూడలేదు లేదా ఆయన ఏదైనా మాట్లాడటం, ఏవైనా ఆజ్ఞలు ఇవ్వడం, ఏవైనా బోధలు చేయడం లేదా ఏదైనా నిర్దేశించడం అతను వినలేదు. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే, దేవుడు సత్యాన్ని గురించి అతనికి ఎటువంటి జ్ఞానోదయం, మార్గదర్శకత్వం లేదా ఏర్పాటు ఇవ్వనప్పటికీ, అతనికి దేవుడి పట్ల అలాంటి జ్ఞానం మరియు వైఖరి ఉండటమనేది-అమూల్యమైనది, అతను అలాంటి విషయాలను ప్రదర్శించడమనేది దేవుడికి చాలు మరియు అతని సాక్ష్యాన్ని దేవుడు ప్రశంసించాడు, గౌరవించాడు. యోబు ఎప్పుడూ దేవుడిని చూడలేదు లేదా దేవుడు స్వయంగా పలికిన ఎలాంటి బోధనలను వినలేదు, కానీ దేవుడి యెదుట లోతైన సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడగలిగి, ప్రగల్భాలు మాత్రమే పలుకగలిగి, బలులను అర్పించడం గురించి మాట్లాడగలిగినప్పటికీ, దేవుడి గురించి ఎప్పుడూ నిజమైన జ్ఞానం లేని మరియు నిజంగా దేవుడి పట్ల భయంలేని వ్యక్తుల కంటే యోబు హృదయం మరియు స్వయంగా అతను దేవుడికి చాలా విలువైనవాడు. ఎందుకంటే యోబు హృదయం నిర్మలమైనది, దేవుడి నుండి దాచపెట్టబడనిది మరియు అతని మానవత్వమనేది నిజాయితీ మరియు దయగలది, అతను న్యాయాన్ని, సానుకూలమైనదాన్ని ప్రేమించాడు కాబట్టి. అలాంటి హృదయం మరియు మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే, దేవుడి మార్గాన్ని అనుసరించగలడు మరియు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించగలడు. అలాంటి వ్యక్తి దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని చూడగలడు, ఆయన అధికారాన్ని మరియు శక్తిని చూడగలడు మరియు ఆయన సార్వభౌమాధిపత్యం మరియు ఏర్పాట్ల పట్ల విధేయత సాధించగలడు. ఇలాంటి వ్యక్తి మాత్రమే దేవుడి నామమును నిజంగా స్తుతించగలడు. ఎందుకంటే, దేవుడు తనను ఆశీర్వదిస్తాడా లేదా తనకు విపత్తు కలిగిస్తాడా అని అతను చూడలేదు, ఎందుకంటే సమస్త నియంత్రణ దేవుడి చేతిలో ఉందని మరియు మనిషి ఆందోళన చెందడమనేది అతని మూర్ఖత్వానికి, అజ్ఞానానికి మరియు అహేతుకతకు, దేవుడి సార్వభౌమాధిపత్యం గురించి సందేహానికి మరియు దేవుడి పట్ల భయం లేకుండా ఉండటానికి సంకేతమని అతనికి తెలుసు. యోబు జ్ఞానం సరిగ్గా దేవుడు కోరుకున్నదే. కాబట్టి, యోబుకు మీకంటే ఎక్కువ సిద్ధాంతపరమైన జ్ఞానం ఉండేదా? ఆ సమయంలో దేవుడి కార్యాలు, మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, దేవుడి గురించి జ్ఞానం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. యోబు సాధించిన అలాంటి గొప్పకార్యం తక్కువదేమీ కాదు. అతను దేవుడి కార్యమును అనుభవించలేదు లేదా దేవుడు మాట్లాడటం ఎప్పుడూ వినలేదు లేదా దేవుడి ముఖాన్ని చూడలేదు. అతను దేవుడి పట్ల అలాంటి వైఖరి కలిగి ఉండటమనేది, పూర్తిగా అతని మానవత్వం మరియు వ్యక్తిగత అన్వేషణ ఫలితమే, ఈనాటి ప్రజలలో ఈ మానవత్వం మరియు అన్వేషణ లేవు. కాబట్టి, ఆ యుగములో, “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు” అని దేవుడు అన్నాడు. ఆ యుగంలో, అతని గురించి దేవుడు అప్పటికే అలాంటి అంచనాకు మరియు అలాంటి నిర్ణయానికి వచ్చాడు. ఈరోజున అది ఎంతవరకు నిజం కాగలదు?

దేవుడు మనిషి నుండి దాగి ఉన్నప్పటికీ, మనిషి ఆయనను తెలుసుకోవటానికి సమస్త విషయాలలో ఆయన కార్యములు సరిపోతాయి

యోబు దేవుడి ముఖాన్ని చూడలేదు లేదా దేవుడు మాట్లాడిన మాటలు వినలేదు, అతను దేవుడి కార్యాన్ని వ్యక్తిగతంగా చాలా తక్కువ అనుభవించాడు, అయినప్పటికీ అతనికి దేవుడి పట్ల ఉన్న భయాన్ని, అతడు పరీక్షలు ఎదుర్కున్న సమయంలో అతని సాక్ష్యాన్ని అందరూ చూశారు, ప్రేమించారు, చూసి సంతోషించారు, దేవుడు ప్రశంసలు కురిపించాడు, ప్రజలు అసూయ పడ్డారు మరియు వాటిని ఆరాధించారు, అంతకంటే ఎక్కువగా, వాటికి స్తుతి కీర్తనలు పాడారు. అతని జీవితంలో చాలా ఘనమైనది లేదా అసాధారణమైనది ఏమీ లేదు: ఎవరైనా ఒక సాధారణ వ్యక్తిలాగే, సూర్యోదయానికి పనికి వెళ్తూ, సూర్యాస్తమయం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి తిరిగి వస్తూ, అతను ఒక సాధారణ జీవితాన్ని గడిపాడు. ఇందులో ఉన్న తేడా ఏమిటంటే, అతని జీవితంలోని అనేక సాధారణ దశాబ్దాల్లో, అతను మరేవ్యక్తి ఎప్పుడూ పొందని దేవుడి మార్గం గురించి అంతర్దృష్టి పొందాడు మరియు దేవుడి గొప్ప శక్తిని మరియు సార్వభౌమాధిపత్యాన్ని గ్రహించాడు మరియు అర్థం చేసుకున్నాడు. అతను ఎవరైనా సాధారణ వ్యక్తి కంటే తెలివైనవాడు కాదు, ప్రత్యేకించి అతని జీవితంలో దృఢ సంకల్పం లేదు, అంతేకాకుండా, అతనిలో కనిపించని ప్రత్యేక నైపుణ్యాలను లేవు. అయితే, అతనిలో ఉన్నవి నిజాయితీ, దయగల హృదయం మరియు నీతిగా ఉండే వ్యక్తిత్వం, ఇది న్యాయాన్ని, నీతిని మరియు సానుకూల విషయాలను ఇష్టపడే వ్యక్తిత్వం-వీటిలో ఏది కూడా అత్యధిక మంది సాధారణ ప్రజల్లో లేదు. అతను ప్రేమ మరియు ద్వేషం మధ్య తేడా కనుగొన్నాడు, అతనిలో న్యాయ భావన ఉంది, అతను లొంగనివాడు, పట్టుదలగలవాడు మరియు తన ఆలోచనల పట్ల సూక్ష్మమైన శ్రద్ధ కనబరిచాడు. ఈ విధంగా, భూమి మీద తన సాధారణ జీవిత సమయంలో అతను దేవుడు చేసిన అన్ని అసాధారణ కార్యాలను చూశాడు, అతను దేవుడి గొప్పతనాన్ని, పరిశుద్ధతను మరియు నీతిని చూశాడు, అతను మనిషి పట్ల దేవుడి శ్రద్ధ, కృప మరియు రక్షణను చూశాడు, అతను సర్వోన్నత దేవుడి గౌరవం మరియు అధికారాన్ని కూడా చూశాడు. యోబు ఎవరైనా సాధారణ వ్యక్తికి సాధ్యం కాని వాటిని పొందగలగడానికి మొదటి కారణం, అతని హృదయం నిర్మలమైనది మరియు అతని హృదయం దేవుడికి చెందినది మరియు సృష్టికర్తచే నడుపబడింది. రెండవ కారణం అతని అన్వేషణ: నిష్కళంకంగా మరియు పరిపూర్ణంగా ఉండాలనే, పరలోకపు చిత్తానికి కట్టుబడి ఉండాలనే, దేవుడిచే ప్రేమించబడిన మరియు చెడును విసర్జించిన వ్యక్తిగా ఉండాలనే అతని అన్వేషణ. దేవుడిని చూడలేనప్పుడు లేదా దేవుడి మాటలు వినలేనప్పుడు యోబుకు ఇవి ఉన్నాయి మరియు వీటిని అనుసరించాడు; అతను దేవుడిని ఎప్పుడూ చూడనప్పటికీ, దేవుడు సమస్తాన్ని ఎలా పరిపాలిస్తాడో అతను తెలుసుకున్నాడు మరియు అలా చేయడానికి దేవుడు ఉపయోగించే జ్ఞానాన్ని అతను అర్థం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడిన మాటలు అతను ఎప్పుడూ విననప్పటికీ, మనిషికి ప్రతిఫలమిచ్చే మరియు మనిషి నుండి తీసుకునే పనులన్నీ దేవుడి నుండే వచ్చాయని యోబుకు తెలుసు. అతని జీవితంలోని సంవత్సరాలు ఎవరైనా సాధారణ వ్యక్తి జీవిత సంవత్సరాలకు భిన్నంగా లేకపోయినప్పటికీ, అతను తన జీవితంలోని సాధారణత అన్ని విషయాలపై దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని గురించిన తన జ్ఞానాన్ని ప్రభావితం చేసేలా లేదా దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించడాన్ని ప్రభావితం చేసేలా అనుమతించలేదు. అతని దృష్టిలో, అన్ని విషయాలకు సంబంధించిన చట్టాల్లో దేవుడి కార్యాములు నిండి ఉన్నాయి మరియు దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని వ్యక్తి జీవితంలోని ఏ భాగంలోనైనా చూడవచ్చు. అతను దేవుడిని చూడలేదు, కానీ దేవుడి కార్యములు ప్రతిచోటా ఉన్నాయని అతను తెలుసుకోగలిగాడు మరియు భూమిపై అతని సాధారణ సమయంలో, అతని జీవితంలోని ప్రతి మూలలో అతను దేవుడి అసాధారణమైన మరియు అద్భుతమైన కార్యములను చూడగలిగాడు మరియు తెలుసుకోగలిగాడు మరియు దేవుడి అద్భుత ఏర్పాట్లు చూడగలిగాడు. దేవుడు కనిపించుకుండా దాగి ఉండటం, ఆయన నిశ్శబ్దం దేవుడి కార్యములను యోబు గ్రహించకుండా అడ్డుకోలేదు లేదా సమస్త విషయాలపై దేవుడి సార్వభౌమాధిపత్యం గురించి అతని జ్ఞానాన్ని ప్రభావితం చేయలేదు. అతని రోజువారీ జీవిత సమయంలో, సమస్త విషయాల మధ్య దాగి ఉన్న దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని మరియు ఏర్పాట్లను గ్రహించడమే ఆయన జీవితం. తన రోజువారీ జీవితంలో అతను, సమస్త విషయాల్లో మౌనంగా ఉన్నప్పటికీ సమస్త విషయాల చట్టాలను పరిపాలించడం ద్వారా తన హృదయం మరియు అతని మాటలను వ్యక్తపరిచే దేవుడి హృదయపు స్వరాన్ని మరియు దేవుడి మాటలను కూడా విన్నాడు మరియు అర్థం చేసుకున్నాడు. కాబట్టి, యోబుకు సమానమైన మానవత్వం మరియు అన్వేషణ ప్రజలు కలిగి ఉంటే, అప్పుడు వారు కూడా యోబుతో సమానంగా అవగాహన మరియు జ్ఞానాన్ని పొందగలరు మరియు యోబు లాగే సమస్త విషయాలపై దేవుడి సార్వభౌమాధిపత్యం గురించిన అదే అవగాహన మరియు జ్ఞానాన్ని పొందగలరు. యోబుకు దేవుడు కనిపించలేదు లేదా అతనితో మాట్లాడలేదు, కానీ యోబు పరిపూర్ణుడిగా, నీతిమంతుండుగా ఉండగలిగాడు మరియు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించేలా ఉండగలిగాడు. మరోలా చెప్పాలంటే, దేవుడు మనిషికి కనిపించకపోయినప్పటికీ లేదా మాట్లాడకపోయినప్పటికీ, దేవుడి ఉనికి, శక్తి మరియు అధికారాన్ని గురించి మనిషి తెలుసుకోవటానికి సమస్త విషయాల్లో దేవుడి కార్యములు మరియు సమస్త విషయాలపై ఆయన సార్వభౌమాధిపత్యం సరిపోతాయి మరియు మనషి దేవుడి పట్ల భయం కలిగి ఉండే మరియు చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించేలా చేయడానికి దేవుడి శక్తి మరియు అధికారం సరిపోతాయి. యోబు లాంటి సాధారణ వ్యక్తి దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించేలా ఉండడాన్ని సాధించగలిగాడు కాబట్టి, దేవుడిని అనుసరించే ప్రతి సాధారణ వ్యక్తి కూడా సాధించగలగాలి. ఈ మాటలు తార్కికమైన అంచనాలాగా అనిపించినప్పటికీ, ఇది విషయాల చట్టాలను ఉల్లంఘించదు. అయినా వాస్తవాలు అంచనాలకు సరిపోలలేదు: దేవుడి పట్ల భయం కలిగి ఉండటం, చెడును విసర్జించడం అనేవి యోబును, యోబును మాత్రమే కాపాడుతాయి అన్నట్లు కనిపిస్తుంది. “దేవుడి పట్ల భయం కలిగి ఉండటం మరియు చెడును విసర్జించడం” అని పేర్కొన్నప్పుడు, దేవుడి పట్ల భయం కలిగి ఉండే మరియు చెడును విసర్జించే మార్గానికి యోబు పేరు అంటించబడిందా అన్నట్లు మరియు ఇతరులకు దీనితో ఎలాంటి సంబంధం లేనట్లు ఉంది కాబట్టి, దీన్ని యోబు మాత్రమే చేయాలని ప్రజలు అనుకుంటారు. దీనికి గల కారణం స్పష్టంగా ఉంది: యోబుకు మాత్రమే నిజాయితీ, దయగల మరియు నీతిమంతమైన మరియు న్యాయాన్ని మరియు నీతిని మరియు సానుకూల విషయాలను ఇష్టపడే వ్యక్తిత్వం ఉంది కాబట్టి, యోబు మాత్రమే దేవుడి పట్ల భయం కలిగి ఉండే మరియు చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించగలడు. మీరందరూ తప్పక ఇక్కడి అంతరార్థాన్ని అర్థం చేసుకుని ఉండాలి-ఎందుకంటే న్యాయాన్ని, నీతిని మరియు సానుకూలమైన దాన్ని ప్రేమించే, నిజాయితీ, దయ మరియు నీతిగల మానవత్వం ఎవరిలో లేవు, ఎవరూ దేవుడి పట్ల భయం కలిగి ఉండలేరు మరియు చెడును విసర్జించ లేరు. కాబట్టి, ప్రజలు ఎప్పటికీ దేవుడి ఆనందాన్ని పొందలేరు లేదా పరీక్షల మధ్య స్థిరంగా నిలబడలేరు. ఇందులో ఉన్న మరో అర్థం ఏమిటంటే, యోబు తప్ప, ప్రజలందరూ ఇప్పటికీ సాతాను బంధనంలో మరియు ఉచ్చులో ఉన్నారు; వారందరినీ అది నిందిస్తున్నది, వారిపై దాడి చేస్తున్నది మరియు వారిని దూషిస్తున్నది. వారందరినీ మింగడానికి సాతాను ప్రయత్నిస్తూనే ఉంది, వారందరికీ స్వేచ్ఛ లేదు, వారంతా సాతాను బందీలుగా చేసిన ఖైదీలు.

మనిషి హృదయంలో దేవుడి పట్ల శత్రుత్వం ఉంటే, దేవుడికి మనిషి ఎలా భయపడగలడు మరియు చెడును విసర్జించగలడు?

ఈనాటి ప్రజల్లో యోబుకున్న మానవత్వానికి సమానమైన మానవత్వం లేదు కాబట్టి, వారి స్వభావం మరియు గుణగణాలు మరియు దేవుడి పట్ల వారి వైఖరి ఏమిటి? వారు దేవుడికి భయపడతారా? వారు చెడును విసర్జిస్తారా? దేవుడి పట్ల భయం లేని లేదా చెడును విసర్జించని వారిని సంక్షిప్తంగా రెండు పదాల్లో చెప్పవచ్చు: “దేవుడి శత్రువులు.” మీరు తరచూ ఈ రెండు పదాలను అంటారు, కానీ వాటి అసలు అర్థం మీకు ఎప్పుడూ తెలియదు. “దేవుడి శత్రువులు” అనే పదాలకు గుణగణాలు ఉన్నాయి: దేవుడు మనిషిని శత్రువుగా చూస్తాడని అవి చెప్పడం లేదు, మనిషే దేవుడిని శత్రువుగా చూస్తాడని చెబుతున్నాయి. మొదట, దేవుడిని ప్రజలు విశ్వసించడం ప్రారంభించినప్పుడు, వారిలో ఎవరికి వారి సొంత లక్ష్యాలు, ప్రేరణలు మరియు ఆకాంక్షలు లేవా? వారిలో ఒక భాగం దేవుడి ఉనికిని విశ్వసించినప్పటికీ మరియు దేవుడి ఉనికిని చూసినప్పటికీ, దేవుడిపై వారి విశ్వాసంలో ఇప్పటికీ ఆ ప్రేరణలు ఉన్నాయి మరియు దేవుడిని విశ్వసించడంలో వారి అంతిమ లక్ష్యం ఆయన ఆశీర్వాదాలను మరియు వారు కోరుకునే వాటిని పొందడమే. ప్రజల జీవిత అనుభవాలలో, వారు తరచూ తమలో తాము ఆలోచిస్తారు, నేను దేవుడి కోసం నా కుటుంబం మరియు వృత్తిని వదులుకున్నాను, అయితే ఆయన నాకు ఏమి ఇచ్చాడు? నేను దీనిని తప్పక జోడించాలి, దీనిని ధృవీకరించాలి—ఇటీవల నేను ఏవైనా ఆశీర్వాదాలు పొందానా? ఈ సమయంలో నేను చాలా ఇచ్చాను, నేను పరిగెత్తాను, పరిగెత్తాను, చాలా బాధపడ్డాను-దానికి బదులుగా దేవుడు నాకు ఏవైనా వాగ్దానాలు చేశాడా? ఆయన నా మంచి పనులను గుర్తు చేసుకున్నాడా? నా అంతం ఎలా ఉండబోతుంది? నేను దేవుడి ఆశీర్వాదాలు పొందగలనా? … ప్రతి వ్యక్తి తన హృదయంలో నిరంతరం ఇలాంటి లెక్కలు వేసుకుంటాడు మరియు వారి ప్రేరణలు, ఆకాంక్షలు మరియు బేరసారాల మానసికత కలిగిన కోరికలు కోరుతారు. దీని అర్థం ఏమిటంటే, మనిషి తన హృదయంలో నిరంతరం దేవుడిని పరీక్షిస్తూ, నిరంతరం దేవుడి గురించి ప్రణాళికలు వేస్తూ, తన వ్యక్తిగత లక్ష్యం కోసం నిరంతరం దేవుడితో వాదిస్తూ, దేవుడి నుండి ఒక ప్రకటనను పొందడానికి ప్రయత్నిస్తూ, దేవుడు తనకు ఏమైన ఇవ్వగలడా లేదా అని చూస్తూ ఉంటాడు. దేవుడిని అనుచరించే సమయంలో, మనిషి దేవుడిని దేవుడిగా భావించడు. మనిషి దేవుడితో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆయనను నిరంతరం కోరికలు కోరుతూ, అడుగడుగునా ఆయనపై ఒత్తిడి కూడా తెస్తూ ఉంటాడు, ఒక అంగుళం పొందిన తర్వాత దాన్ని ఒక మైలు చేయాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడితో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే, మనిషి ఆయనతో వాదిస్తాడు కూడా మరియు వారికి పరీక్షలు ఎదురైనప్పుడు లేదా వారు కొన్ని పరిస్థితులలో ఉన్నప్పుడు, వారి పనిలో తరచూ బలహీనంగా, ఉదాసీనంగా, నిరుత్సాహంగా తయారవుతారు మరియు దేవుడి గురించి పూర్తి ఫిర్యాదులు చేస్తారు. మనిషి మొదట దేవుడిని విశ్వసించడం ప్రారంభించినప్పటి నుండి, అతను దేవుడిని స్విస్ ఆర్మీ కత్తి అయిన కార్నూకోపియాగా భావించాడు మరియు దేవుడి నుండి దీవెనలు మరియు వాగ్దానాలు పొందాలని ప్రయత్నించడం తన సహజ హక్కు మరియు బాధ్యత అన్నట్లుగా తనను తాను దేవుడికి గొప్ప రుణదాతగా భావించాడు. అయితే దేవుడి బాధ్యత మనిషిని రక్షించడం, శ్రద్ధ వహించడం మరియు అతనికి కావల్సినవి సమకూర్చడం. దేవుడిని విశ్వసించే వారందరికీ ఉన్న “దేవుడిపై విశ్వాసపు” ప్రాథమిక అవగాహన అలాంటిది మరియు దేవుడిపై విశ్వాసం గురించి భావనపై వారి లోతైన అవగాహన అలాంటిది. వ్యక్తిగత అన్వేషణలోని మనిషి స్వభావం మరియు గుణగణాల్లో, దేవుడి పట్ల భయానికి సంబంధించినదేదీ లేదు. దేవుడిని విశ్వసించడంలో మనిషికున్న లక్ష్యానికి దేవుడి ఆరాధనతో బహుశా ఏ సంబంధం ఉండకపోవచ్చు. అంటే దేవుడిపై విశ్వాసం ఉండాలంటే దేవుడి పట్ల భయం కలిగి ఉండటం మరియు ఆయనను ఆరాధించడం అవసరమని మనిషి ఎప్పుడూ భావించలేదు లేదా అర్థం చేసుకోలేదు. అటువంటి పరిస్థితుల దృష్ట్యా, మనిషి గుణగణాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ గుణగణాలు ఏమిటి? మనిషి హృదయం అపాయకరమైనది, ఇందులో ద్రోహం మరియు మోసం ఉన్నాయి, అది న్యాయం, నీతి మరియు సానుకూలమైన వాటిని ప్రేమించదు, దీనిలో ధిక్కారం మరియు దురాశ ఉన్నాయి. మనిషి హృదయం దేవుడి నుండి ఇంత ఎక్కువగా మూసివేయబడి ఉండకూడదు; దానిని అతను దేవుడికి అసలు ఇవ్వలేదు. దేవుడు మనిషి నిజమైన హృదయాన్ని ఎప్పుడూ చూడలేదు మరియు మనిషి ఆయనను ఎప్పుడూ ఆరాధించలేదు. దేవుడు ఎంత గొప్ప మూల్యం చెల్లించినప్పటికీ, ఎంత కార్యము చేసినప్పటికీ, మనిషికి ఎంత సమకూర్చినప్పటికీ, మనిషి వీటన్నింటి పట్ల అంధుడై, పూర్తి ఉదాసీనంగా ఉంటాడు. మనిషి తన హృదయాన్ని దేవుడికి ఎప్పుడూ ఇవ్వలేదు, అతను తనంతతానే తన హృదయం గురించి పట్టించుకోవాలనుకుంటాడు, తన సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాడు-దీనిలోని ఉప వృత్తాంతం ఏమిటంటే, మనిషి దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించడం లేదా దేవుడి సార్వభౌమాధిపత్యానికి మరియు ఏర్పాట్లకు విధేయత కలిగి ఉండటం లేదా దేవుడిని దేవుడుగా ఆరాధించడం అతనికి ఇష్టం లేదు. ఈనాటి మనిషి పరిస్థితి అలాంటిది. ఇప్పుడు మళ్ళీ యోబు గురించి చూద్దాం. అసలు మొట్టమొదట, అతను దేవుడితో ఒప్పందం చేసుకున్నాడా? దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గానికి గట్టిగా కట్టుబడి ఉండటంలో అతనికి ఏవైనా నిగూఢ ఉద్దేశాలు ఉండేవా? ఆ సమయంలో, రాబోయే అంతం గురించి దేవుడు ఎవరికైనా చెప్పాడా? ఆ సమయంలో, అంతం గురించి దేవుడు ఎవరికీ వాగ్దానాలు చేయలేదు మరియు నేపథ్యం ఇదైనప్పటికీ యోబు దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించగలిగి ఉన్నాడు. ఈనాటి ప్రజలు యోబుతో పోల్చడానికి సరితూగుతారా? ఇందులో చాలా తేడా ఉంది; వారిరువురూ విభిన్న కూటములలో ఉన్నారు. దేవుడి గురించి యోబుకు పెద్దగా జ్ఞానం లేకపోయినప్పటికీ, అతను తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు మరియు అది దేవుడికి చెందింది. అతను దేవుడితో ఎప్పుడూ ఒప్పందం చేసుకోలేదు మరియు దేవుడి నుండి అతనికి విపరీతమైన కోరికలు లేదా ఆకాంక్షలు లేవు; దానికి బదులుగా, “యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొని పోయెను” అని విశ్వసించాడు.తన జీవితంలో అనేక సంవత్సరాలు దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గానికి కట్టుబడి ఉండటం ద్వారా అతను చూసినది మరియు పొందినది ఇదే. అదేవిధంగా, ఈ మాటల్లో సూచించిన ఫలితాన్ని కూడా అతను పొందాడు: “మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా?” అతను తన జీవిత అనుభవాల సమయంలో దేవుడి పట్ల విధేయతగల వైఖరి ఫలితంగా అతను చూసినవి, తెలుసుకున్నవి ఈ రెండు వాక్యాలే మరియు అవే సాతాను ప్రలోభాల సమయంలో విజయం సాధించడానికి అతని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు మరియు అవే అతను దేవుడికి సాక్ష్యం ఇవ్వడంలో స్థిరంగా నిలబడి ఉండటానికి పునాది. ఈ సమయంలో, యోబు ఒక ప్రేమాస్పదుడైన వ్యక్తి అని మీరు భావిస్తారా? మీరు కూడా అలాంటి వ్యక్తి కావాలని ఆశిస్తారా? సాతాను ప్రలోభాలకు గురికావడానికి మీరు భయపడతారా? మీరు యోబు లాగే అవే పరీక్షలకు గురి చేయబడాలని దేవుడిని ప్రార్థించాలని సంకల్పిస్తారా? నిస్సందేహంగా, చాలామంది అలాంటి వాటి కోసం దేవుడిని ప్రార్థించే సాహసం చేయరు. అలాంటప్పుడు, మీ విశ్వాసం దయనీయంగా తక్కువదని స్పష్టంగా తెలుస్తుంది; యోబుతో పోలిస్తే, మీ విశ్వాసం అసలు ప్రస్తావించడానికే అర్హత లేనిది. మీరు దేవుడికి శత్రువులు, మీకు దేవుడి పట్ల భయం లేదు, మీరు దేవుడికి సాక్ష్యం ఇవ్వడంలో స్థిరంగా నిలబడలేరు మరియు మీరు సాతాను దాడులు, ఆరోపణలు మరియు ప్రలోభాలపై విజయం సాధించలేరు. దేవుడి వాగ్దానాలు పొందడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి? యోబు కథను విని, మనిషిని రక్షించడంలో దేవుడి ఉద్దేశాన్ని మరియు మనిషి రక్షణకున్న అర్థాన్ని అవగాహన చేసుకున్న తర్వాత, యోబుకు ఎదురైన అవే పరీక్షలను అంగీకరించగల విశ్వాసం ఇప్పుడు మీకుందా? దేవుడి పట్ల భయం కలిగి ఉండే, చెడును విసర్జించే మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం మీకు కొద్దిగా అయినా ఉండకూడదా?

దేవుడి పరీక్షల గురించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి

యోబు పరీక్షలు ముగిశాక, అతని సాక్ష్యాన్ని పొందిన తరువాత, యోబు లాంటి వ్యక్తుల సమూహాన్ని-లేదా సమూహం కంటే ఎక్కువ మందిని-పొందుతానని దేవుడు నిర్ణయించుకున్నాడు, అయినప్పటికీ దేవుడిపై పోటీ పడటం ద్వారా యోబును ప్రలోభపెట్టడానికి, అతనిపై దాడి చేయడానికి, లేదా బాధించడానికి సాతాను ఉపయోగించిన మార్గాలను ఇతర వ్యక్తులపై ఉపయోగించడానికి మళ్లీ అనుమతించకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు; బలహీనుడైన, మూర్ఖుడైన, తెలివితక్కువవాడైన మనిషి పట్ల సాతాను మళ్లీ అలాంటి పనులు చేయడానికి దేవుడు అనుమతించలేదు—సాతాను యోబును ప్రలోభపెట్టడమనేదే చాలా ఎక్కువ! ఇష్టమొచ్చినట్టు సాతాను ప్రజలను బాధించడాన్ని అనుమతించకపోవడం అనేది దేవుడి కరుణ. దేవుడికి, యోబు సాతాను ప్రలోభాలకు మరియు బాధకు గురవ్వడం అనేదే చాలా ఎక్కువ. సాతాను మళ్లీ ఎప్పుడూ అలాంటి పనులు చేయడానికి దేవుడు అనుమతించలేదు, ఎందుకంటే దేవుడిని అనుసరించే ప్రజల జీవితాలను, సమస్తాన్ని దేవుడు పాలిస్తాడు మరియు నిర్వహిస్తాడు, సాతాను తన ఇష్టప్రకారం దేవుడు ఎంచుకున్న వారిని తారుమారు చేయడానికి సాతానుకు అర్హత లేదు-మీరు ఈ అంశం పట్ల స్పష్టతతో ఉండాలి! దేవుడు మనిషి బలహీనతను పట్టించుకుంటాడు మరియు అతని మూర్ఖత్వాన్ని మరియు అజ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి పూర్తిగా రక్షించబడటానికి, దేవుడు అతనిని సాతానుకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ, మనిషి మోసగించబడటాన్ని మరియు సాతాను చేతిలో బాధించబడటాన్ని దేవుడు ఎప్పుడూ ఇష్టపడడు మరియు మనిషి ఎప్పుడూ బాధలను అనుభవించడాన్ని ఆయన చూడాలనుకోడు. మనిషిని దేవుడు సృష్టించాడు, పరలోకము ద్వారా నియమింపబడిన మరియు భూలోకము ద్వారా అంగీకరింపబడిన మనిషికి సంబంధించిన ప్రతిదాన్ని దేవుడే పాలిస్తాడు మరియు ఏర్పాటు చేస్తాడు; ఇది దేవుడి బాధ్యత మరియు దేవుడు అన్ని విషయాలను పరిపాలించే అధికారం కూడా ఇదే! సాతాను ఇష్టం వచ్చినట్టు మనిషిని బాధించడాన్ని మరియు వారి పట్ల చెడుగా వ్యవహరించడాన్ని దేవుడు అనుమతించడు, మనిషిని తప్పుదారి పట్టించడానికి సాతాను వివిధ మార్గాలను ఉపయోగించడాన్ని ఆయన అనుమతించడు, అంతేకాకుండా, మనిషిపై దేవుడి సార్వభౌమాధిపత్యంలో సాతాను జోక్యాన్ని ఆయన అనుమతించడు లేదా మానవాళిని నిర్వహించడం మరియు రక్షించడం అనే దేవుడి గొప్ప కార్యము గురించి చెప్పడం అటుంచి, సమస్త విషయాలను దేవుడు పాలించే చట్టాలను సాతాను అణగదొక్కడాన్ని మరియు నాశనం చేయడాన్ని దేవుడు అనుమతించడు! దేవుడు రక్షించాలనుకునే వారు మరియు దేవుడికి సాక్ష్యమివ్వగలిగినవారు, దేవుడి ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలో ప్రధాన అంశం మరియు స్ఫటికం వలె స్పష్టమైనవారు, అలాగే ఆయన ఆరు వేల సంవత్సరాల కార్యము పట్ల కృషికి ఆయనకు దక్కిన మూల్యం. దేవుడు ఊరికే అలా ఈ వ్యక్తులను సాతానుకు ఎలా ఇవ్వగలడు?

దేవుడి పరీక్షల గురించి ప్రజలు తరచూ ఆందోళన చెందుతారు మరియు భయపడతారు, అయినా వారు ఎల్లప్పుడూ సాతాను ఉచ్చులోనే జీవిస్తున్నారు మరియు సాతాను దాడి చేసే మరియు బాధించే అపాయకరమైన భూభాగంలోనే జీవిస్తున్నారు-అయినప్పటికీ వారికి భయం తెలియదు మరియు కలవరపడరు. ఏమి జరుగుతున్నది? దేవుడి పట్ల మనిషికున్న విశ్వాసం అతను చూడగలిన విషయాలకే పరిమితం. మనిషి పట్ల దేవుడి ప్రేమ మరియు శ్రద్ధ లేదా మనిషి పట్ల ఆయనకున్న సున్నితత్వం మరియు ఆలోచన గురించి అతనికి కొద్దిగా కూడా ప్రశంసాభావం లేదు. కానీ దేవుడి పరీక్షలు, తీర్పు మరియు శిక్ష, మహత్యం మరియు ఉగ్రత గురించి కొంచెం తడబాటు మరియు భయం తప్ప, మనిషికి దేవుడి మంచి ఉద్దేశాల గురించి కొద్దిగా కూడా అవగాహన లేదు. పరీక్షల గురించి ప్రస్తావించినప్పుడు, దేవుడికి నిగూఢ ఉద్దేశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తారు, మరికొందరు దేవుడు తమకు వాస్తవంగా ఏమి చేస్తాడో తెలియక దేవుడికి చెడు వ్యూహాలు ఉన్నాయని కూడా విశ్వసిస్తారు; కాబట్టి, ఒకవైపు దేవుడి సార్వభౌమాధిపత్యం మరియు ఏర్పాట్లకు విధేయత చూపుతూనే, మనిషిపై దేవుడి సార్వభౌమాధిపత్యాన్ని మరియు మనిషి కోసం దేవుడు చేసిన ఏర్పాట్లను ప్రతిఘటించడానికి మరియు వ్యతిరేకించడానికి వారు చేయగలిగినదంతా చేస్తారు, ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే దేవుడు వారిని తప్పుదారి పట్టిస్తాడనీ, తమ సొంత తలరాతపై తమ పట్టు ఉంచుకోకపోతే, తమ వద్ద ఉన్నదంతా దేవుడు తీసుకోవచ్చనీ మరియు వారి జీవితాన్ని కూడా అంతం చేయవచ్చనీ వారు విశ్వసిస్తారు. మనిషి సాతాను శిబిరంలో ఉన్నాడు, కానీ అతను సాతానుచే బాధించబడటం గురించి ఎప్పుడూ ఆందోళన చెందడు, సాతాను అతన్ని బాధించినప్పటికీ, సాతాను తనను బందీ చేస్తుందని ఎప్పుడూ భయపడడు. దేవుడి రక్షణను తాను అంగీకరిస్తానని అతను చెబుతూ ఉంటాడు, కానీ దేవుడిని ఎప్పుడూ విశ్వసించడు లేదా దేవుడు మనిషిని సాతాను పంజా నుండి నిజంగా రక్షిస్తాడని నమ్మడు. యోబు లాగే, మనిషి దేవుడి నిర్వహణలకు మరియు ఏర్పాట్లకు లోబడి, తన సర్వస్వాన్ని దేవుడి చేతులలో పెట్టగలిగితే, అప్పుడు మనిషి అంతం యోబు లాగే—దేవుడి ఆశీర్వాదాలను స్వీకరించినట్లు ఉండదా? మనిషి దేవుడి పాలనను అంగీకరించి, లొంగిపోగలిగితే, కోల్పోయేది ఏముంటుంది? కాబట్టి, మీ చర్యల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు మీపై పడబోతున్న ప్రతిదాని గురించి జాగ్రత్తగా ఉండాలని నేను మీకు సూచిస్తున్నాను. మీ ఉడుకు రక్తం లేదా మీ సహజత్వంపై ఆధారపడి లేదా మీ ఊహలు మరియు ఉద్దేశాల ప్రకారం దేవుడు మరియు ఆయన మీకోసం ఏర్పాటు చేసిన వ్యక్తులు, విషయాలు మరియు వస్తువుల పట్ల మీ దూకుడుగా లేదా ఆవేశపూరితంగా ఉండకండి; మీ చర్యల విషయంలో మీరు తప్పక జాగ్రత్తగా ఉండాలి మరియు దేవుడి ఆగ్రహాన్ని రెచ్చగొట్టకుండా ఉండేందుకు ప్రార్థనలు చేయాలి మరియు ఎక్కువగా అభ్యర్థించాలి. ఇది గుర్తుంచుకోండి!

దీని తర్వాత, తన పరీక్షల తర్వాత యోబు ఎలా ఉన్నాడో చూద్దాం.

5. తన పరీక్షల తర్వాత యోబు

యోబు 42:7-9 అది ఇలా ఉండింది, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా: యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.

యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

యోబు 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

యోబు 42:17 పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.

దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే వారిని దేవుడు ప్రేమగా చూస్తాడు, అదేసమయంలో మూర్ఖులను దేవుడు తక్కువగా చూస్తాడు

యోబు 42:7-9, యోబు తన సేవకుడని దేవుడు చెప్పెను. యోబును ప్రస్తావించడానికి “సేవకుడు” అనే పదాన్ని ఆయన ఉపయోగించడమనేది, ఆయన హృదయంలో యోబుకున్న ప్రాధాన్యతను ప్రదర్శిస్తుంది; యోబును దేవుడు ఏదైనా గొప్ప గౌరవప్రదమైన పేరుతో పిలవకపోయినప్పటికీ, ఈ పిలుపుకు దేవుడి హృదయంలో యోబుకున్న ప్రాధాన్యతపై ఎలాంటి ప్రభావం లేదు. ఇక్కడ “సేవకుడు” అనేది యోబుకు దేవుడు పెట్టుకున్న మారుపేరు. “నా సేవకుడు యోబు” అని దేవుడు అనేకసార్లు ప్రస్తావించడమనేది, యోబు పట్ల ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో చూపుతుంది, “సేవకుడు” అనే పదానికి వెనుక ఉన్న అర్థాన్ని దేవుడు చెప్పనప్పటికీ, “సేవకుడు” అనే పదానికి దేవుడి నిర్వచనాన్ని పవిత్ర గ్రంథంలోని ఈ వృత్తాంతంలో ఆయన మాటలలో చూడవచ్చు. దేవుడు మొదట తేమానీయుడైన ఎలీఫజుతో ఇలా అన్నాడు: “నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది.” దేవుడు యోబును పరీక్షలకు గురి చేసిన తర్వాత, యోబు చెప్పిన మరియు చేసినవన్నీ తాను అంగీకరించినట్లు మొట్టమొదటిసారి ఆయన బహిరంగంగా ప్రజలకు చెప్పిన మాటలు ఇవే, యోబు చేసిన వాటన్నింటిలోని ఖచ్చితత్వాన్ని మరియు శుద్ధతను ఆయన బహిరంగంగా ధృవీకరించడం కూడా ఇదే మొదటిసారి. ఎలీఫజ్ మరియు ఇతరుల తప్పు, అర్థరహిత ప్రసంగం కారణంగా దేవుడు వారిపై ఆగ్రహంగా ఉన్నాడు, ఎందుకంటే, యోబు లాగానే, వారు కూడా వారి జీవితంలో దేవుడిని చూడలేకపోయారు లేదా ఆయన మాటలను వినలేకపోయారు, అయినప్పటికీ యోబుకు దేవుడి గురించి అంత ఖచ్చితమైన జ్ఞానం ఉంది, అదే వారి విషయానికొస్తే, వారు చేసిన ప్రతి పనిలో దేవుడి చిత్తాన్ని ఉల్లంఘిస్తూ, ఆయన సహనాన్ని పరీక్షిస్తూ, దేవుడి గురించి కేవలం గుడ్డిగా ఊహించగలిగారు. ఫలితంగా, యోబు చేసిన మరియు చెప్పినవన్నీ అంగీకరించే అదే సమయంలోనే, దేవుడు ఇతరులపై ఉగ్రతను పెంచుకున్నాడు, ఎందుకంటే ఆయన వారిలో దేవుడి పట్ల భయం కలిగి ఉండటంలో వాస్తవాన్ని చూడలేకపోవడమే కాకుండా, వారు మాట్లాడే మాటల్లో కూడా దేవుడి పట్ల ఎలాంటి భయాన్ని వినలేకపోయాడు. కాబట్టి దేవుడు వారి నుండి కింది కోరికలను కోరాడు: “కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను.” ఈ వృత్తాంతంలో దేవుడు ఎలీఫజ్ మరియు ఇతరులకు వారి పాపాలకు విమోచన కలిగించే పనిని చేయమని చెబుతున్నాడు, ఎందుకంటే వారి అవివేకము అనేది యెహోవా దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపం, కాబట్టి వారు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి దహన బలులు అర్పించవలసి వచ్చింది. దహన బలులును తరచూ దేవుడికి అర్పిస్తారు, అయితే ఈ దహన బలులలో ఉన్న అసాధారణత ఏమిటంటే వాటిని యోబుకు అర్పించడం. యోబు తన పరీక్షల సమయంలో దేవుడికి సాక్ష్యమిచ్చాడు కాబట్టి దేవుడు అతన్ని స్వీకరించాడు. అదే సమయంలో, యోబు ఈ స్నేహితులు, అతని పరీక్షల సమయంలో బయట పడ్డారు; వారి అవివేకము కారణంగా, వారిని దేవుడు ఖండించాడు, వారు దేవుడి ఉగ్రతను రెచ్చగొట్టారు, కాబట్టి వారు దేవుడిచే శిక్షించబడాలి-యోబు యెదుట దహన బలులు అర్పించడం ద్వారా శిక్షించబడాలి-ఆ తర్వాత వారి పట్ల దేవుడి శిక్షను మరియు ఉగ్రతను తొలగించమని దేవుడిని యోబు ప్రార్థించాడు. ఇక్కడ దేవుడి ఉద్దేశం వారు సిగ్గుపడేలా చేయడమే, ఎందుకంటే వారికి దేవుడి పట్ల భయం లేదు మరియు చెడును విసర్జించలేదు, వారు యోబు యథార్థతను ఖండించారు. ఒక వైపు, దేవుడు వారి చర్యలను అంగీకరించలేదనీ, కానీ యోబును చాలా వరకు అంగీకరించాడనీ మరియు అతని ద్వారా ఆనందం పొందాడని దేవుడు వారికి చెబుతున్నాడు; మరోవైపు, దేవుడిచే అంగీకరించబడటం అనేది మనిషిని దేవుడి యెదుట ఉన్నతంగా ఉంచుతుందని, మనిషి తన అవివేకము కారణంగానే దేవుడిచే అసహ్యించుకోబడుతున్నాడని మరియు దాని కారణంగానే దేవుడికి అపరాధము చేస్తున్నాడని, దేవుడి దృష్టిలో తక్కువగా మరియు నీచుడుగా ఉన్నాడని దేవుడు వారికి చెబుతున్నాడు. దేవుడు రెండు రకాల వ్యక్తులకిచ్చిన నిర్వచనాలు ఇవే, అవి ఈ రెండు రకాల వ్యక్తుల పట్ల దేవుడి వైఖరులు మరియు ఈ రెండు రకాల వ్యక్తుల విలువపై దేవుడి మాట మరియు వారి గురించి దేవుడి అభిప్రాయం. దేవుడు యోబును తన సేవకుడని పిలిచినప్పటికీ, దేవుడి దృష్టిలో ఈ సేవకుడు ప్రియమైనవాడు మరియు ఇతరుల కోసం ప్రార్థించే మరియు వారి తప్పులను క్షమించే అధికారం అతనికి ప్రసాదించబడింది. ఈ సేవకుడు దేవుడితో నేరుగా మాట్లాడగలిగాడు, దేవుడి యెదుటకు నేరుగా రాగలిగాడు మరియు అతని హోదా ఇతరుల కంటే ఉన్నతమైనది మరియు ఎక్కువ గౌరవప్రదమైనది. దేవుడు అన్న “సేవకుడు” అనే మాటకు నిజమైన అర్థం ఇదే. యోబుకు దేవుడి పట్ల భయం ఉండటం, చెడును విసర్జించడం కారణంగా అతనికి ఈ ప్రత్యేక గౌరవం ఇవ్వబడింది మరియు ఇతరులు దేవుడిచే సేవకులని పిలవబడకపోవడానికి కారణం వారు దేవుడికి భయపడకుండా, చెడును విసర్జించకుండా ఉండటమే. దేవుడి ఈ రెండు స్పష్టమైన భిన్న వైఖరులే ఈ రెండు రకాల వ్యక్తులపై ఆయనకున్న వైఖరులు: దేవుడి పట్ల భయం కలిగి, చెడును విసర్జించే వారిని దేవుడు అంగీకరిస్తాడు, ఆయనకు వారు అమూల్యమైనవారిగా కనిపిస్తారు, అదే మూర్ఖులైతే దేవుడికి భయపడరు, చెడును విసర్జించలేరు మరియు దేవుడి అనుగ్రహాన్ని పొందలేరు; వారిని దేవుడు తరచూ అసహ్యించుకుంటాడు, ఖండిస్తాడు మరియు వారిని చిన్నచూపు చూస్తాడు.

దేవుడు యోబుకు అధికారాన్ని ప్రసాదిస్తాడు

యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడు, యోబు ప్రార్థించడం వల్ల, దేవుడు వారి అవివేకతకు తగినట్లుగా వారితో వ్యవహరించలేదు-వారిని శిక్షించలేదు లేదా వారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు. అలా ఎందుకని? ఎందుకంటే దేవుడి సేవకుడైన యోబు వారి కోసం చేసిన ప్రార్థనలు ఆయన చెవినబడ్డాయి; దేవుడు యోబు ప్రార్థనలను అంగీకరించాడు కాబట్టి వారిని క్షమించాడు. కాబట్టి, ఇందులో మీకు ఏమి కనిపిస్తుంది? దేవుడు ఎవరికైనా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, వారికి భౌతిక విషయాలు మాత్రమే కాకుండా అనేక ప్రతిఫలాలు కూడా ప్రసాదిస్తాడు: దేవుడు వారికి అధికారం, ఇతరుల కోసం ప్రార్థించే హక్కు కూడా ఇస్తాడు మరియు దేవుడు వీరి ఉల్లంఘనలను మరచిపోతాడు, విస్మరిస్తాడు, ఎందుకంటే ఆయన ఈ ప్రార్థనలను వింటాడు. దేవుడు యోబుకిచ్చిన అధికారం ఇదే. వారిని ఖండించడాన్ని ఆపివేయమని యోబు చేసిన ప్రార్థనల ద్వారా, యెహోవా దేవుడు ఆ మూర్ఖులు సిగ్గు పడేలా చేశాడు-వాస్తవానికి, ఎలీఫజు మరియు ఇతరులకు ఆయన విధించిన ప్రత్యేకమైన శిక్ష అది.

యోబు మరోసారి దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాడు మరియు అతను మళ్లీ ఎప్పుడు సాతాను ద్వారా బాధించబడలేదు

యెహోవా దేవుడి పలుకులలో ఈ మాటలు ఉన్నాయి, “నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది.” యోబు చెప్పినది ఏమిటి? ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది, అలాగే యోబు మాట్లాడాడని నమోదు చేయబడిన యోబు పుస్తకంలోని అనేక పేజీలలో ఉన్న మాటల గురించి మాట్లాడుకున్నదే. ఈ అనేక పేజీల్లోని మాటల్లో, ఎప్పుడూ దేవుడి పట్ల యోబుకు ఎటువంటి ఫిర్యాదులు లేదా అనుమానాలు లేవు. అతను కేవలం ఫలితం కోసం వేచి చూస్తాడు. ఈ వేచి ఉండటం అనేది అతని విధేయతా వైఖరి, దాని ఫలితంగా, అతను దేవుడితో చెప్పిన మాటల ఫలితంగా, యోబును దేవుడు అంగీకరించాడు. అతను పరీక్షలను సహించినప్పుడు మరియు కష్టాలను అనుభవించినప్పుడు, దేవుడు అతని పక్కనే ఉన్నాడు, మరియు దేవుడి సన్నిధి అతని కష్టాలను తగ్గించనప్పటికీ, దేవుడు ఆయన చూడాలకున్నది చూశాడు మరియు ఆయన వినాలనుకున్నది విన్నాడు. యోబు ప్రతి చర్యను, మాటను దేవుడు చూశాడు, విన్నాడు; దేవుడు విన్నాడు మరియు చూశాడు-ఇది వాస్తవం. యోబుకున్న దేవుడి గురించి జ్ఞానం, ఆ సమయంలో అతని హృదయంలో దేవుడి గురించి అతని ఆలోచనలు, వాస్తవానికి ఈనాటి ప్రజలకున్న వాటిలాగా నిర్దిష్టంగా లేవు, కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో, అతను చెప్పినదంతా దేవుడు గుర్తించాడు, ఎందుకంటే అతని ప్రవర్తన, అతని హృదయంలో ఉన్న ఆలోచనలతో పాటు, అతను వ్యక్తం మరియు బహిర్గతం చేసినవి ఆయన అవసరాలకు సరిపోతాయి. యోబు పరీక్షలకు గురిచేయబడిన సమయంలో, అతను హృదయంలో ఆలోచించి, చేయాలని నిర్ణయించుకున్నది దేవుడికి తృప్తికరమైన ఫలితాన్ని చూపించింది, ఆతర్వాత దేవుడు యోబు పరీక్షలను తొలగించి వేశాడు, యోబు కష్టాల నుండి బయటపడ్డాడు మరియు అతని పరీక్షలు తొలిగిపోయాయి మరియు అతనిపై మళ్లీ ఎప్పుడూ పడలేదు. అప్పటికే యోబు పరీక్షలకు గురి చేయబడ్డాడు, ఈ పరీక్షల సమయంలో స్థిరంగా నిలబడి, సాతానుపై పూర్తిగా విజయం సాధించాడు కాబట్టి, దేవుడు అతడు తగిన విధంగా అర్హుడైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. యోబు 42:10, 12లో నమోదు చేయబడినట్లు, యోబు మరోసారి ఆశీర్వదించబడ్డాడు మరియు అతను మొదటిసారి పొందిన దానికంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. ఆ సమయంలో సాతాను వెనక్కు తగ్గిపోయాడు, ఇకపై ఏమీ అనలేదు లేదా చేయలేదు, అప్పటి నుండి ఇక యోబు విషయంలో సాతాను జోక్యం చేసుకోలేదు లేదా దాటి చేయలేదు, దేవుడు యోబుకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఇక ఆరోపణలు చేయలేదు.

యోబు అతని జీవితంలోని తర్వాతి సగభాగాన్ని దేవుడి ఆశీర్వాదాల మధ్య గడుపుతాడు

ఆ సమయంలో ఆయన ఆశీర్వాదాలు గొర్రెలు, పశువులు, ఒంటెలు, భౌతిక ఆస్తులు మొదలైన వాటికి మాత్రమే పరిమితమైనప్పటికీ, దేవుడి హృదయంలో యోబుకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు అంతకంటే చాలా ఎక్కువ. ఆ సమయంలో, యోబుకు దేవుడు ఎలాంటి శాశ్వత వాగ్దానాలు ఇవ్వాలనుకున్నాడో నమోదు చేయబడ్డాయా? ఆయన యోబుకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో, దేవుడు అతని అంతం గురించి ప్రస్తావించలేదు లేదా సృశించలేదు మరియు దేవుడి హృదయంలో యోబుకున్న ప్రాముఖ్యత లేదా స్థానంతో సంబంధం లేకుండా, మొత్తంగా తన ఆశీర్వాదాల విషయంలో దేవుడికి చాలా లెక్క ఉంది. దేవుడు యోబు అంతాన్ని ప్రకటించలేదు. దీని అర్థం ఏమిటి? ఆ సమయంలో, మనిషి అంతాన్ని ప్రకటించే దశకు దేవుడి ప్రణాళిక ఇంకా చేరుకోని, ప్రణాళిక ఆయన కార్యపు చివరి దశకు ఇంకా చేరకోని ఆ సమయంలో, అంతం గురించి దేవుడు ఏ ప్రస్తావన చేయలేదు, మనిషికి భౌతిక ఆశీర్వాదాలను మాత్రమే ప్రసాదించాడు. దీనర్థం, యోబు జీవితంలో రెండవ సగభాగం దేవుడి ఆశీర్వాదాల మధ్య గడిచింది, అదే అతనిని ఇతర వ్యక్తుల కంటే విభిన్నం చేసింది-కానీ వారి లాగానే అతను వృద్ధాప్యం పొందాడు, ఎవరైనా సాధారణ వ్యక్తిలాగే అతను ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన రోజు వచ్చింది. “పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను” (యోబు 42:17) అని నమోదు చేయబడింది. ఇక్కడ “కాలము నిండి మృతినొందెను” అంటే ఏమిటి? ప్రజల అంతాన్ని దేవుడు ప్రకటించడానికి ముందటి యుగంలో, దేవుడు యోబుకు ఆయుర్దాయం నిర్ణయించాడు. ఆ వయస్సుకు చేరుకున్నప్పుడు, యోబు సహజసిద్ధంగా ఈ ప్రపంచాన్ని వదిలివేయడానికి ఆయన అనుమతించాడు. యోబు రెండవ ఆశీర్వాదం నుండి అతని మరణం వరకు, దేవుడు అతనికి మరే కష్టాలను కలిగించలేదు. దేవుడికి, యోబు మరణం సహజమైనది మరియు అవసరమైనది కూడా; ఇది చాలా సామాన్య విషయం, ఇది ఒక తీర్పుగానీ లేదా ఖండనగానీ కాదు. యోబు జీవించి ఉన్నప్పుడు, అతను దేవుడిని ఆరాధించాడు మరియు ఆయనకు భయపడ్డాడు; మరణం తర్వాత అతను ఏ రకమైన అంతాన్ని పొందాడు అనేదాన్ని గురించి దేవుడు ఏమీ చెప్పడం గానీ లేదా దానిపై ఏదైనా వ్యాఖ్యానం గానీ చేయలేదు. దేవుడికి ఆయన చెప్పే మరియు చేసే విషయాలలో ఒక బలమైన యుక్తత ఉంది మరియు ఆయన మాటలు మరియు చర్యలలోని విషయం మరియు నియమాలు ఆయన కార్యపు దశ మరియు ఆయన పని చేస్తున్న కాలానికి అనుగుణంగా ఉన్నాయి. దేవుడి హృదయంలో యోబు లాంటి వ్యక్తికి ఎలాంటి అంతం ఉంది? దేవుడు తన హృదయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నాడా? అవును, తీసుకున్నాడు! అది మనిషికి తెలియదు, అంతే; మనిషికి దేవుడు చెప్పదలచుకోలేదు, అలాగే మనిషికి చెప్పే ఏదైనా ఉద్దేశం కూడా ఆయనకు లేదు. కాబట్టి, పైపైన చెప్పాలంటే, యోబు పూర్తి కాలం జీవించి మరణించాడు, యోబు జీవితం అలాంటిది.

యోబు తన జీవితకాలంలో జీవించిన జీవితం విలువ

యోబు విలువైన జీవితాన్ని జీవించాడా? ఆ విలువ ఎక్కడ ఉంది? ఆయన విలువైన జీవితాన్ని జీవించాడని ఎందుకు చెప్పబడుతుంది? మనిషికి సంబంధించి అతని విలువ ఏమిటి? మనిషి దృష్టికోణంలో చూస్తే, సాతాను మరియు ప్రపంచ ప్రజల యెదుట దేవుడికి ప్రతిధ్వనించే సాక్ష్యాన్ని అందించడంలో, దేవుడు రక్షించాలనుకునే మానవాళికి అతను ప్రాతినిధ్యం వహించాడు. దేవుడిపై ఆధారపడటం ద్వారా సాతానుపై విజయం సాధించడం పూర్తిగా సాధ్యమని ప్రజలు చూసేందుకు వీలుకల్పిస్తూ, దేవుడు సృష్టించిన జీవి నెరవేర్చాల్సిన కర్తవ్యాన్ని అతను నెరవేర్చాడు, ఒక ఉదాహరణను నెలకొల్పుటు మరియు దేవుడు రక్షించాలని కోరుకునే వారందరి కోసం ఒక ఆదర్శంగా వ్యవహరించాడు. దేవుడికి, అతని విలువ ఏమిటి? దేవుడికి, యోబు జీవితం విలువ అతను దేవుడి పట్ల భయం కలిగి ఉండటం, దేవుడిని ఆరాధించడం, దేవుని పనులకు సాక్ష్యమివ్వడం మరియు దేవుని పనులను ప్రశంసించడం, దేవుడికి ఓదార్పును మరియు ఆయనకు ఆనందాన్ని కలిగించే సామర్థ్యంలో ఉంది; దేవుడికి, యోబు జీవితం విలువ, దేవుడు మానవాళిలో కీర్తి పొందేలా, ఆయన హృదయానికి ఓదార్పునిచ్చేలా, ఆత్రుతతో ఉన్న ఆయన హృదయం ఒక ఫలితాన్ని మరియు ఆశను చూడటానికి వీలుకల్పించేలా చేయడానికి, అతని మరణానికి ముందు, యోబు పరీక్షలను ఎలా అనుభవించాడు మరియు సాతానుపై విజయం ఎలా సాధించాడు మరియు సాతాను మరియు ప్రపంచంలోని ప్రజల ముందు దేవుడికి ఎలా అద్భుతమైన సాక్ష్యమిచ్చాడు అనే దానిలో ఉంది. అతనిచ్చిన సాక్ష్యం దేవుడికి సాక్ష్యం ఇవ్వడంలో స్థిరంగా నిలబడగల సామర్థ్యానికి మరియు మానవాళిని నిర్వహించే దేవుడి కార్యములో దేవుడి తరపున సాతానును సిగ్గుపడేలా చేయగలగడానికి ఒక ఉదాహరణను నెలకొల్పింది. ఇది యోబు జీవిత విలువ కాదా? యోబు దేవుడి హృదయానికి ఓదార్పునిచ్చాడు, అతను దేవుడికి మహిమను పొందే ఆనందపు ముందస్తు రుచిని చూపించాడు మరియు దేవుడి నిర్వహణ ప్రణాళికకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. అప్పటి నుండి, యోబు పేరు దేవుడు మహిమ పొందడానికి చిహ్నంగా, మానవాళి సాతానుపై సాధించిన విజయానికి సంకేతంగా మారింది. యోబు తన జీవితకాలంలో గడిపిన జీవితంతో పాటు, సాతానుపై అతని అద్భుతమైన విజయాన్ని దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, అతని పరిపూర్ణతను, నీతి మరియు దేవుడి పట్ల భయం కలిగి ఉండటాన్ని వచ్చే తరాలు గౌరవిస్తాయి మరియు అనుకరిస్తాయి. అతడిని దోషరహితమైన, మెరిసే ముత్యం లాగా దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, అంతేకాకుండా అతను మనిషికి అమూల్యమైన వాడిగా కూడా ఉంటాడు!

తర్వాత, ధర్మశాస్త్ర యుగములో దేవుడి కార్యమును చూద్దాం.

డి. ధర్మశాస్త్ర యుగపు నిబంధనలు

పది ఆజ్ఞలు

బలిపీఠాలను నిర్మించడం కోసం నియమాలు

సేవకులతో వ్యవహరించడానికి సంబంధించిన నిబంధనలు

దొంగతనం మరియు పరిహారం కోసం నిబంధనలు

సబ్బాతు సంవత్సరం మరియు మూడు విందులను ఆచరించడం

సబ్బాతు దినము కోసం నిబంధనలు

పరిహారార్థబలుల కోసం నిబంధనలు

దహన బలులు

ధాన్య బలులు

శాంతి బలులు

పాప పరిహారార్థబలులు

అపరాధ పరిహారార్థ బలులు

యాజకులు ఇచ్చే బలులకు సంబంధించిన నిబంధనలు (ఆరోన్ మరియు అతని కుమారులు పాటించాలని ఆజ్ఞాపించబడ్డారు)

యాజకులచే దహన బలులు

యాజకులచే ధాన్య బలులు

యాజకులచే పాప పరిహారార్థబలులు

యాజకులచే అపరాధ పరిహారార్థ బలులు

యాజకులచే శాంతి బలులు

యాజకులు బలులను తినడానికి సంబంధించిన నిబంధనలు

పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులు (తినగలవి మరియు తినగూడనివి)

ప్రసవం తర్వాత మహిళలను పరిశుద్ధం చేయడానికి సంబంధించిన నిబంధనలు

కుష్టు వ్యాధిని పరీక్షించడానికి ప్రమాణాలు

కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందిన వారి కోసం నిబంధనలు

కుష్టు పొడ సోకిన ఇండ్లను శుద్ధి చేయుటకు నిబంధనలు

అసాధారణ స్రావముతో బాధపడేవారి కోసం నిబంధనలు

ఏడాదికి ఒకసారి తప్పక పాటించవలసిన ప్రాయశ్చిత్త దినము

పశువులు మరియు గొర్రెల దహనబలికి నియమాలు

అన్యుల హేయమైన ఆచారాలను అనుసరించడాన్ని నిషేధించడం (వావివరుసలు తప్పడం మొదలైనవి)

ప్రజలు తప్పక పాటించాల్సిన నిబంధనలు (“మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను”)

తమ సంతానమును మోలెకు బలి ఇచ్చేవారిని ఉరితీయడం

వ్యభిచార నేరానికి శిక్షకు సంబంధించిన నిబంధనలు

యాజకులు పాటించవలసిన నియమాలు (వారి రోజువారీ ప్రవర్తనకు సంబంధించిన నియమాలు, పరిశుద్ధ వస్తువుల వినియోగానికి సంబంధించిన నియమాలు, బలులు సమర్పించడానికి నియమాలు మొదలైనవి)

ఆచరించాల్సిన విందులు (సబ్బాతు దినము, పాస్ ఓవర్, పెంతెకోస్తు, ప్రాయశ్చిత్త దినం మొదలైనవి)

ఇతర నిబంధనలు (దీపాలు వెలిగించడం, జూబ్లీ, భూ విమోచన, ప్రమాణాలు చేసే, దశమవంతులు సమర్పించే సంవత్సరాలు మొదలైనవి)

ధర్మశాస్త్ర యుగపు నిబంధనలనేవి సమస్త మానవాళికి దేవుడి మార్గనిర్దేశానికి నిజమైన రుజువు

కాబట్టి, మీరు ధర్మశాస్త్ర యుగపు నిబంధనలను మరియు సూత్రాలను చదవాలి, మీరు చదివారా? ఈ నిబంధనలకు విస్తృత పరిధి ఉందా? మొదట, పది ఆజ్ఞలు వాటిలోకి వస్తాయి, దాని తర్వాత బలిపీఠాలను నిర్మించడం మొదలైనవి ఉన్నాయి. వీటి తర్వాత సబ్బాతును పాటించడం, మూడు విందులను పాటించడం కోసం నిబంధనలు ఉన్నాయి, వాటి తర్వాత బలులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఎన్ని రకాల బలులు ఉన్నాయో మీరు చూశారా? దహన బలులు, ధాన్య బలులు, శాంతి బలులు, పాపపరిహారార్థ బలులు మొదలైనవి ఉన్నాయి. వాటి తర్వాత యాజకులచే దహన బలులు, ధాన్య బలులు మరియు ఇతర రకాల బలులతో సహా యాజకులు చేసే బలులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ఎనిమిదవ సమూహం యాజకులు బలులను తినడానికి సంబంధించినవి ఆ తర్వాత ప్రజల జీవిత కాలాలలో పాటించాల్సిన వాటి గురించిన నిబంధనలు ఉన్నాయి. ప్రజల జీవితంలోని అనేక అంశాలకు, ప్రజలు ఏమి తినవచ్చు లేదా తినకూడదు అనేదానికి సంబంధించిన నిబంధనలు, ప్రసవం తర్వాత స్త్రీలను శుద్ధి చేయడానికి నిబంధనలు మరియు కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందిన వారి కోసం నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల్లో, దేవుడు వ్యాధి గురించి మాట్లాడేదాకా వెళ్తాడు మరియు గొర్రెలు, పశువుల బలులు మొదలైన వాటికి కూడా నియమాలు ఉన్నాయి. గొర్రెలు, పశువులను దేవుడు సృష్టించాడు మరియు దేవుడు నీకు చెప్పినట్లు నీవు వాటిని బలి ఇవ్వాలి; ఎలాంటి సందేహం లేకుండా, దేవుడి మాటలకు కారణం ఉంది; దేవుడు ఆఙ్ఙాపించినట్లు వ్యవహరించడం నిస్సందేహంగా సరైనది మరియు ప్రజలకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది! సబ్బాతు దినము, పాస్ ఓవర్ మరియు ఇలాంటి మరిన్ని విందులు మరియు నియమాలు కూడా ఉన్నాయి—దేవుడు వీటన్నింటి గురించి చెప్పాడు. చివరివి చూద్దాము: ఇతర నిబంధనలు-దీపాలు వెలిగించడం, జూబ్లీ, భూ విమోచన, ప్రమాణాలు చేసే, దశమవంతులు సమర్పించే సంవత్సరాలు మొదలైనవి. వీటికి విస్తృత పరిధి ఉందా? మొదట మాట్లాడాల్సింది ప్రజలచే బలుల అంశం గురించి. తర్వాత దొంగతనం మరియు పరిహారం కోసం నిబంధనలు, సబ్బాతు దినము పాటించడం…; జీవితపు అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. అంటే, దేవుడు తన నిర్వహణ ప్రణాళిక అధికారిక కార్యాన్ని ప్రారంభించినప్పుడు, మనిషి అనుసరించాల్సిన అనేక నిబంధనలను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ నిబంధనలు మనిషి భూమి మీద మనిషిలాగా సాధారణ జీవితాన్ని, అంటే దేవుడి నుండి మరియు ఆయన మార్గదర్శకత్వం నుండి వేరుపర్చలేని మనిషి సాధారణ జీవితాన్ని గడపడానికి వీలుకల్పించేందుకు ఉన్నాయి. దేవుడు మొదట బలిపీఠాలను నిర్మించడం, బలిపీఠాలను ఏర్పాటు చేయడం గురించి మనిషికి చెప్పాడు. ఆ తర్వాత, బలులు సమర్పించే విధానం గురించి ఆయన మనిషికి చెప్పాడు మరియు మనిషి జీవించడం ఎలాగో-అతను జీవితంలో దేనికి కట్టుబడి ఉండాలో మరియు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఏర్పాటు చేశాడు. దేవుడు మనిషి కోసం ఏర్పాటు చేసినవి అన్నింటికి వర్తిస్తుంది మరియు ఈ ఆచారాలు, నిబంధనలు మరియు సూత్రాలతో ఆయన ప్రజల ప్రవర్తనను ప్రామాణీకరించాడు, వారి జీవితాలకు మార్గనిర్దేశం చేశాడు, దేవుడి నియమాలను పాటించడానికి వారికి మార్గనిర్దేశం చేశాడు, దేవుడి బలిపీఠం యెదుటకు వచ్చేలా వారికి మార్గనిర్దేశం చేశాడు, వరుస క్రమం, క్రమబద్ధత మరియు నిరాడంబరత కలిగి, మనిషి కోసం దేవుడు సృష్టించిన అన్నింటి మధ్య మనిషి జీవించడానికి వారికి మార్గనిర్దేశం చేశాడు. భూమి మీద మనిషి దేవుడిని ఆరాధించే సామాన్య జీవితాన్ని పొందేలా, సాధారణ మనిషి జీవితం పొందేలా వీలుకల్పించడానికి, మనిషికి పరిమితులను ఏర్పర్చడానికి దేవుడు మొదట ఈ సాధారణ నిబంధనలు మరియు సూత్రాలను ఉపయోగించాడు; ఆయన ఆరు-వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ప్రారంభంలోని నిర్దిష్ట విషయం అలాంటిది. నిబంధనలు మరియు నియమాలలో చాలా విస్తృతమైన విషయం ఉంది, అవి ధర్మశాస్త్ర యుగములో మానవాళికి దేవుడి మార్గదర్శకత్వపు నిర్దిష్టతలు, వాటిని ధర్మశాస్త్ర యుగము కంటే ముందు వచ్చిన వ్యక్తులు అంగీకరించాల్సి మరియు పాటించాల్సి వచ్చింది, అవి ధర్మశాస్త్ర యుగములో దేవుడు చేసిన కార్యము గురించి నమోదు మరియు అవి సమస్త మానవాళికి దేవుడి నాయకత్వం మరియు మార్గదర్శకత్వానికి నిజమైన రుజువు.

దేవుడి బోధనలు మరియు నిబంధనల నుండి మానవాళి ఎల్లప్పుడూ విడదీయరానిది

ఈ నిబంధనల్లో తన కార్యము పట్ల, తన నిర్వహణ పట్ల మరియు మానవాళి పట్ల దేవుడి వైఖరి గంభీరమైనదిగా, మనస్సాక్షికి లోబడినదిగా, కఠినమైనదిగా మరియు బాధ్యతయుతమైనదిగా ఉన్నట్లు మనం చూస్తాము. మానవాళి మధ్య ఆయన తప్పక చేయాల్సిన కార్యాన్ని తన దశల ప్రకారం, కొద్దిపాటి తేడా కూడా లేకుండా, మానవాళితో ఆయన తప్పక మాట్లాడాల్సిన మాటలను కొద్దిపాటి దోషం లేదా లోపం కూడా లేకుండా మాట్లాడుతూ, దేవుడి నాయకత్వం నుండి మనిషి విడదీయరానివాడని అతడు చూడగలిగేలా చేస్తూ మరియు మానవాళికి దేవుడు చేసేది మరియు చెప్పేది ఎంత ముఖ్యమైనదో చూపుతూ ఆయన కార్యాన్ని చేస్తాడు. తరువాతి యుగములో-ధర్మశాస్త్ర యుగము-ప్రారంభంలో మనిషి ఎలా ఉంటాడు అనేదానితో సంబంధం లేకుండా దేవుడు ఈ సులభమైన ఏర్పాట్లు చేశాడు. దేవుడి దృష్టిలో, ఆ యుగములో దేవుడు, ప్రపంచం మరియు మానవాళి గురించి ప్రజల భావనలు అమూర్తంగా మరియు అపారదర్శకంగా ఉండేవి, వారికి కొన్ని జాగరూగకతతో కూడిన ఆలోచనలు మరియు ఉద్దేశాలు ఉన్నప్పటికీ, అవన్నీ అస్పష్టంగా మరియు తప్పుగా ఉండేవి, కాబట్టి దేవుడి బోధనలు మరియు నిబంధనల నుండి మానవాళి విడదీయరానిదిగా ఉండేది. తొట్టతొలి మానవాళికి ఏమీ తెలియదు, కాబట్టి మాటల రూపంలో ఉండిన ఈ నిబంధనల ద్వారా మరియు ఈ నియమాల ద్వారా, మనిషి హృదయంలో ఈ విషయాలను మెల్లమెల్లగా నింపుతూ మరియు మనిషికి దేవుడి గురించి క్రమంగా అవగాహన, దేవుడి నాయకత్వం మరియు మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధపు ప్రాథమిక భావన గురించి క్రమక్రమంగా ప్రశంస మరియు అవగాహన కల్పిస్తూ, మనుగడ కోసం మనిషికి దేవుడు అత్యంత అల్పజ్ఞానాన్ని, ప్రాథమిక సూత్రాలను మరియు జీవించడానికి అవసరమైన నిబంధనల నుండి బోధించడం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఈ ప్రభావాన్ని సాధించిన తర్వాత మాత్రమే, దేవుడు తాను చేయబోయే కార్యాన్ని కొద్దికొద్దిగా చేయగలిగాడు, కాబట్టి ఈ నిబంధనలు మరియు ధర్మశాస్త్ర యుగములో దేవుడు చేసిన కార్యము మానవాళిని రక్షించే ఆయన కార్యానికి పునాదిరాయి లాంటిది మరియు దేవుడి నిర్వహణ ప్రణాళిక కార్యపు మొదటి దశ. ధర్మశాస్త్ర యుగపు కార్యానికి ముందు, ఆదాము, హవ్వ మరియు వారి వారసులతో దేవుడు మాట్లాడినప్పటికీ, ఆ ఆజ్ఞలు మరియు బోధనలు మనిషికి ఒకదాని తర్వాత ఒకటిగా జారీ చేసేంత క్రమబద్ధంగా లేదా నిర్దిష్టంగా లేవు మరియు వాటిని రాయడం జరగలేదు, అలాగే అవి నిబంధనలుగా కూడా మారలేదు. ఎందుకంటే, ఆ సమయంలో, దేవుడి ప్రణాళిక అంత దూరం వెళ్లలేదు; దేవుడు మనిషిని ఈ దశకు నడిపించిన తర్వాత మాత్రమే ఆయన ధర్మశాస్త్ర యుగపు ఈ నిబంధనలను మాట్లాడటం ప్రారంభించాడు మరియు వాటిని మనిషి అమలు చేసేలా చేయడం మొదలుపెట్టాడు. ఇది ఒక అవసరమైన ప్రక్రియ మరియు దీని ఫలితం అనివార్యమైనది. ఈ సాధారణ ఆచారాలు మరియు నిబంధనలు దేవుడి నిర్వహణ కార్యపు దశలను మరియు ఆయన నిర్వహణ ప్రణాళికలో బయలు పరిచిన దేవుడి జ్ఞానాన్ని మనిషికి చూపుతాయి. ఆయనకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తుల సమూహాన్ని పొందటాన్ని మరియు ఆయన మనసుతో సమానమైన మనసే ఉన్న ఒక సమూహాన్ని పొందగలగడాన్ని ప్రారంభించడానికి ఏ విషయాన్ని మరియు సాధనాలను ఉపయోగించాలో, కొనసాగించడానికి ఏ సాధనాలను ఉపయోగించాలో మరియు ముగించడానికి ఏ సాధనాలను ఉపయోగించాలో దేవుడికి తెలుసు. మనిషిలో ఏముందో ఆయనకు తెలుసు, మనిషిలో లేనిదేమిటో కూడా ఆయనకు తెలుసు. మనిషికి ఏమి సమకూర్చాలో మరియు మనిషిని ఎలా ముందుకు నడిపించాలో ఆయనకు తెలుసు, అదేవిధంగా మనిషి ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో కూడా ఆయనకు తెలుసు. మనిషి తోలుబొమ్మ లాంటివాడు. దేవుడి చిత్తం గురించి మనిషికి అవగాహన లేకపోయినప్పటికీ, ఈ రోజు వరకు, దేవుడి నిర్వహణ కార్యము ద్వారా, అంచెలంచెలుగా, ముందుకు నడిపించబడటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఆయన ఏమి చేయాలనే దాని గురించి దేవుడి హృదయంలో ఎలాంటి అస్పష్టత లేదు; ఆయన హృదయంలో చాలా స్పష్టమైన, విస్తృతమైన ప్రణాళిక ఉంది మరియు పైపైన చేయడం నుండి లోతైన స్థాయికి పురోగమింపజేస్తూ, ఆయన తన దశలు, తన ప్రణాళిక ప్రకారం తాను చేయాలనుకున్న కార్యాన్ని కొనసాగించాడు. ఆయన తర్వాత చేయాల్సిన కార్యాన్ని సూచించనప్పటికీ, ఆయన తదుపరి కార్యము ఇంకా కొనసాగుతూనే ఉంది మరియు ఆయన ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా పురోగమిస్తూనే ఉంది, ఇది దేవుడికి ఉన్న మరియు ఆయన అంటే ఏమిటి అనేదానికి వ్యక్తీకరణ మరియు ఇది దేవుడి అధికారం కూడా. తన నిర్వహణ ప్రణాళికలోని ఏ దశలో ఆయన పని చేస్తున్నాడనే దానితో సంబంధం లేకుండా, ఆయన స్వభావం మరియు ఆయన గుణగణాలు స్వయంగా ఆయన్నే సూచిస్తాయి. ఇది సంపూర్ణంగా నిజం. యుగము లేదా కార్యపు దశతో సంబంధం లేకుండా, ఎప్పటికీ మార్పు చెందని విషయాలు ఉన్నాయి: ఎలాంటి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడు, ఎలాంటి వ్యక్తులను ఆయన అసహ్యించుకుంటాడు, ఆయన స్వభావం మరియు ఆయన వద్ద ఉన్నది మరియు అయన అంటే ఏమిటో వంటి విషయాలు. ధర్మశాస్త్ర యుగములో దేవుడు ఏర్పాటు చేసిన ఈ నిబంధనలు మరియు సూత్రాలు ఈనాటి ప్రజలకు చాలా సామాన్యమైనవిగా మరియు పైపై విషయాలుగా కనిపించినప్పటికీ, వాటిని అర్థం చేసుకోవడం మరియు సాధించడం సులభమే అయినప్పటికీ, వాటిలో ఇప్పటికీ దేవుడి జ్ఞానం ఉంది, ఇప్పటికీ దేవుడి స్వభావము మరియు ఆయనవద్ద ఉన్నది మరియు అయన అంటే ఏమిటో ఉంది. ఈ స్పష్టమైన సరళ నిబంధనల్లో మానవాళి పట్ల దేవుడి బాధ్యత మరియు శ్రద్ధతో పాటు, ఆయన ఆలోచనల సున్నితమైన గుణగణాలు వ్యక్తీకరించబడతాయి, ఫలితంగా దేవుడు సమస్తాన్ని పరిపాలిస్తాడనే, సమస్త విషయాలను ఆయన నియంత్రిస్తాడనే వాస్తవాన్ని మనిషి నిజంగా గ్రహించడానికి వీలుకల్పిస్తుంది. మానవవాళి జ్ఞానంలో ఎంత నిష్ణాతులైనప్పటికీ లేదా మనిషి ఎన్ని సిద్ధాంతాలు లేదా మర్మాలను అర్థం చేసుకున్నప్పటికీ, దేవుడి దృష్టిలో వీటిలో ఏవీ మానవాళికి ఆయన ఏర్పాటును మరియు నాయకత్వాన్ని భర్తీ చేయలేవు; మానవవాళి ఎల్లప్పుడూ దేవుడి మార్గదర్శకత్వం మరియు దేవుడి వ్యక్తిగత కార్యము నుండి విడదీయరానిదిగా ఉంటుంది. మనిషికి దేవుడికీ మధ్య ఉన్నది అలాంటి విడదీయరాని సంబంధమే. దేవుడు నీకు ఒక ఆఙ్ఞ లేదా ఒక నియమం ఇచ్చాడా లేదా ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి నీకు సత్యాన్ని ప్రసాదించాడా అనే దానితో సంబంధం లేకుండా, ఆయన ఏమి చేసినప్పటికీ, దేవుడి లక్ష్యం మనిషిని అందమైన రేపటి వైపుకు నడిపించడమే. దేవుడు పలికిన మాటలు, ఆయన చేసే కార్యము రెండూ ఆయన గుణగణాల ఒక కోణాన్ని బహిర్గత పర్చడమే మరియు ఆయన స్వభావం మరియు ఆయన జ్ఞానపు ఒక కోణాన్ని బహిర్గత పర్చడమే; అవి ఆయన నిర్వహణ ప్రణాళికలోని ఒక విడదీయరాని దశ. వీటని ఏమాత్రం విస్మరించకూడదు! దేవుడు చేసే ప్రతి దానిలో ఆయన చిత్తం ఉంది; దేవుడు తప్పుడు వ్యాఖ్యలకు భయపడడు, అదేవిధంగా ఆయన గురించి మనిషికున్న ఏవైనా ఉద్దేశాలు లేదా ఆలోచనలకు భయపడడు. ఆయన తన నిర్వహణ ప్రణాళిక ప్రకారం, ఎవరైనా వ్యక్తి, పదార్ధం లేదా వస్తువుతో అవరోధించబడకుండా తన కార్యాన్ని చేస్తూనే ఉంటాడు మరియు తన నిర్వహణను కొనసాగిస్తాడు.

మంచిది. ఈ రోజుకు ఇక ఇంతే. మరోసారి కలుద్దాం!

నవంబరు 9, 2013

మునుపటి:  దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు I

తరువాత:  దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు III

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger