దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు I

ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించడానికి కూడుకున్నాము. ఇది దేవుని కార్యాన్ని ప్రారంభించినప్పటి నుండి చర్చించబడుతున్న అంశం మరియు ప్రతి వ్యక్తికి ఎంతో ప్రాముఖ్యమైన అంశం. మరో మాటలో చెప్పాలంటే, దేవుని నమ్మే క్రమంలో ప్రతి వ్యక్తి ఎదుర్కునే సమస్యే ఇది; ఇది తప్పక ఎదుర్కోవాల్సిన సమస్య. ఇది మానవజాతి తప్పించుకోలేని కీలకమైన, అనివార్యమైన సమస్య. ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, దేవుని నమ్మే ప్రతి వ్యక్తికి ఉండే ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? దేవుని చిత్తాన్ని గ్రహించడమే చాలా ప్రాముఖ్యమైన విషయమని కొంతమంది ప్రజలు అనుకుంటారు; దేవుని మాటలను ఎక్కువగా తిని త్రాగడమే ప్రాముఖ్యమైనదని కొంతమంది నమ్ముతారు; కొంతమంది వారి గురించి వారు తెలుసుకోవడమే ప్రాముఖ్యమైన విషయంగా భావిస్తారు; మరికొంతమందైతే, దేవుని ద్వారా రక్షణ ఎలా పొందాలి, ఎలా దేవుణ్ణి అనుసరించాలి, దేవుని చిత్తాన్ని బట్టి ఎలా మెప్పించాలో తెలుసుకోవడం ప్రాముఖ్యమైనదని అభిప్రాయపడతారు. మనం ఈ రోజు ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. అయితే మరి మనం ఏమి చర్చిస్తున్నాం? దేవుడు అనే అంశాన్ని గూర్చి చర్చిస్తున్నాం. ప్రతి వ్యక్తికి ఇది అంత ప్రాముఖ్యమైన అంశమా? ఈ అంశం దేనిని సూచిస్తుంది? నిజానికి, ఇది దేవుని స్వభావము, దేవుని గుణగణాలు మరియు దేవుని కార్యముల నుండి వేరు చేయబడదు. కాబట్టి ఈ రోజున మనం “దేవుని కార్యము, దేవుని స్వభావము మరియు దేవుడు సమస్తమునైయున్నాడు” అనే అంశమును గురించి చర్చిద్దాం.

మనుష్యులు దేవుని నమ్మడం ప్రారంభించినప్పటి నుండి, వారు దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు దేవుడు సమస్తమునైయున్నాడు అనే అంశాలను ఎదుర్కొన్నారు. దేవుని కార్యము అనే విషయానికొచ్చినప్పుడు, “దేవుని కార్యము మనపై జరిగింది, మనము దాన్ని ప్రతి దినం అనుభవిస్తాము, కాబట్టి ఇది మనకు తెలియని విషయమేమి కాదు” అని కొంతమంది అంటారు. దేవుని స్వభావం గురించి మాట్లాడేటప్పుడు, “దేవుని స్వభావం అనేది మన జీవిత కాలమంతా అధ్యయనం చేసి, అన్వేషించి, దృష్టి పెట్టాల్సిన అంశము, కాబట్టి మనము తప్పనిసరిగా దానిని ఎరిగి ఉండాలి” అని కొందరుఅంటారు. దేవుడే సమస్తమునైయున్నాడు అనే విషయానికొచ్చినప్పుడు, “మనం వెంబడిస్తుంది, మనం నమ్ముతుంది, మరియు మనం అన్వేషించేది సమస్తమునైయున్న దేవుడినే; అలాగే ఆయన గురించి మనకు తెలియనిది ఏమైనా ఉందా” అని కొందరు అంటారు. సృష్టి మొదలుకుని దేవుడు తన కార్యాన్ని ఎన్నడూ ఆపలేదు; ఆయన కార్యమంతటిలో ఆయన తన స్వభావాన్ని వ్యక్త పరుస్తూనే ఉన్నాడు మరియు తన వాక్యాన్ని వ్యక్త పరచడానికి ఉపయోగించిన వివిధ మార్గాలను తెలియజేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో, ఆయన తనను గూర్చి మరియు తన గుణగణాలను గూర్చి మానవజాతికి వ్యక్తము చేయడాన్ని, మనిషిపట్ల తన చిత్తాన్ని మరియు మనిషి నుండి తను కోరేవాటిని వ్యక్తము చేయడాన్ని ఆయన ఎన్నడూ ఆపలేదు. అందువల్ల, ఉన్నదున్నట్టు చెప్పాలంటే, ఈ అంశాలకు ఎవరూ క్రొత్తేమి కాదు. అయితే, నేడు దేవుని అనుసరించే ప్రజలకు, దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు దేవుడే సమస్తమునైయున్నాడు అనేవన్నీ నిజంగా చాలా తెలియని క్రొత్త విషయాలుగా ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది? మనిషి దేవుని కార్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, వారు కూడా దేవునితో సాన్నిహిత్యంలోనికి వచ్చి, వారు దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకున్నట్లు, లేకా అది ఎలా ఉంటుందనే దాని పట్ల కాస్త అవగాహన కలిగి ఉన్నట్టు భావించేలా చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారం, మనిషి తాను దేవుని కార్యాన్ని, లేదా దేవుని స్వభావాన్ని ఎరుగని వానిగా భావించడు. కాని, మనిషి తాను దేవునికి బాగా పరిచయస్తుడని మరియు దేవుని గురించి బాగా అవగాహన ఉన్నవాడని అనుకుంటాడు. కాని ఇది ఇప్పుడు ఉన్నట్లుగా, దేవుని గురించిన ఈ అవగాహన, అనేక మందిలో, పుస్తకాలలో వారు చదివిన దాని వరకే పరిమితమయ్యింది, వ్యక్తిగత అనుభవానికి పరిమితమై, ఊహాగానము ద్వారా నియంత్రించబడింది, మరియు అన్నిటి కన్నా, వారు తమ సొంత కళ్లతో చూడగలిగే నిజాలకే పరిమితమయ్యారు—ఇవన్నీ సమస్తమైయున్న నిజ దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఈ “దూరం” ఇంకెంత దూరం? బహుశా, మనిషికి కచ్చితంగా తెలిసి ఉండకపోవచ్చు, లేదా బహుశా మనిషికి కాస్త బుద్ధి, ఆలోచన ఉండవచ్చు—కానీ స్వయాన దేవుని విషయానికొచ్చినప్పుడు, ఆయనను గురించి మానవునికున్న అవగాహన నిజమైన దేవుని గుణగణాల నుండి ఎంతో దూరంగా ఉంటుంది. అందుకని, “దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు దేవుడే సమస్తమైయున్నాడు” అనేటువంటి అంశము కోసం, ఒక క్రమబద్ధమైన మరియు నిర్దిష్టమైన రీతిలో పాల్గొనడం మనకు ఎంతో అవసరం.

నిజానికి, దేవుని స్వభావము ప్రతి ఒక్కరికి తెరవబడి ఉంటుంది గాని దాచబడి ఉండదు, ఎందుకంటే దేవుడు బుద్ధిపూర్వకంగా ఎప్పుడూ దూరం పెట్టలేదు మరియు ప్రజలు ఆయనను తెలుసుకోకుండా లేదా ఆయనను అర్ధం చేసుకోకుండా నిలువరించడం కోసం తనను తాను మరుగు చేసుకోడానికి బుద్ధిపూర్వకముగా ఎప్పుడూ ప్రయత్నించలేదు. దేవుని స్వభావము వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషిని యదార్థంగా ఎదుర్కొనుటకు ఎల్లప్పుడూ తెరువబడే ఉన్నది. దేవుని నిర్వాహకత్వంలో, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, ప్రతి ఒక్కరినీ ఎదుర్కొంటాడు, మరియు ఆయన కార్యము ప్రతి ఒక్క వ్యక్తి మీద జరుగుతుంది. అయన ఈ కార్యాన్ని చేస్తున్నప్పుడు, ఆయన తన స్వభావాన్ని అనునిత్యం ప్రత్యక్షపరచుకొంటూ మరియు ప్రతి ఒక్క వ్యక్తిని సమకూర్చి నడిపించడానికి, ఆయన ఏమై ఉన్నాడో మరియు ఏమి కలిగియున్నాడో తెలియజేసే తన గుణగణాలను నిరంతరం ఉపయోగిస్తున్నాడు. ప్రతి కాలములో మరియు ప్రతి దశలో, పరిస్థితులు బాగున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా, సమస్త మానవాళిని బ్రతికించుట కొరకు మరియు సమస్త మానవాళికి అందించుట కొరకు ఆయన జీవము నిరంతరం మరియు ఎడతెగకుండా అందుబాటులో ఉన్నట్లుగానే, దేవుని స్వభావము, ఆయన ఉనికి మరియు ఆయనకున్న సర్వసంపదలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ, దేవుని స్వభావము కొందరికి మరుగై ఉంటుంది. ఎందుకు మరుగై ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రజలు దేవుని కార్యములో జీవిస్తూ దేవుణ్ణి అనుసరిస్తున్నప్పటికీ, వారు దేవుణ్ణి అర్ధం చేసుకోడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు మరియు దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవునికి దగ్గరవ్వాలని ఆశించలేదు. ఈ ప్రజలకు దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకోవడం అంటే వారి అంతం సమీపిస్తోందని ముందుగా వారికి చెప్పినట్లుగా ఉంటుంది; అంటే ఇక వారు దేవుని స్వభావం ద్వారా తీర్పు తీర్చబడి శిక్షించబడతారని అర్ధం. కాబట్టి, వారు దేవుణ్ణి గానీ లేదా ఆయన స్వభావాన్ని గానీ అర్ధం చేసుకోడానికి ఎన్నడూ ఇష్టపడరు. అంతేగాకుండా, వారుదేవుని చిత్తాన్ని గురించిన లోతైన అవగాహనను కలిగియుందామని లేదా ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానాన్ని కలిగియుందామని ఆశ కలిగియుండరు. వారు బుద్ధిపూర్వకమైన సహకారమును అందించుట ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నించరు, అంటే వారు ఎప్పటికీ ఆనందిస్తూ వారు చేయాలనుకున్న పనులు చేయడంలో ఎప్పుడూ అలసిపోకుండా ఉంటారు; వారు నమ్మాలి అనుకున్న దేవుణ్ణి నమ్ముతారు; కేవలం వారి ఊహాగానాలలో ఉన్న దేవుడినే, వారి తలంపుల నుండి ఉత్పన్నమయ్యే దేవుడినే మాత్రమే నమ్ముతారు; మరియు వారి అనుదిన జీవితాలలో వారి నుండి విడదీయలేని దేవుడినే నమ్ముతారు. సమస్తమై ఉన్నటువంటి నిజమైన దేవుని విషయానికి వచ్చినప్పుడు, వారు పూర్తిగా నిరాకరిస్తూ ఆయనను అర్ధం చేసుకోవాలని గాని, లేక ఆయన పట్ల శ్రద్ధ చూపాలనే ఆశ గాని వారికి లేదు మరియు ఆయనకు సమీపముగా ఎదగడానికి ఇష్టపడరు. దేవుడు తెలియజేసే వాక్కులను వారు కేవలం తమను తాము అలంకరించుకోడానికి, కూర్చుకోడానికే ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా వారిని ఇదివరికే విజయవంతమైన విశ్వాసులుగాను మరియు తమ హృదయాల్లో దేవునిపై విశ్వాసం ఉన్న ప్రజలుగాను తయారు చేసి పెట్టింది. వారి హృదయాల్లో కలిగే తమ ఊహాగానాలతో, తమ తలంపులతో మరియు దేవుని పట్ల తమకున్న వ్యక్తిగత నిర్వచనాలతోనూ నడిపించబడతారు. మరొక విధంగా చెప్పాలంటే, సమస్తమునైయున్న ఈ నిజ దేవుడు ఖచ్చితంగా వారితో జరిగించడానికి ఏ కార్యము లేదన్నమాట. ఎందుకంటే, వారు సమస్తమైయున్న నిజ దేవుణ్ణి అర్ధం చేసుకుని, దేవుని స్వభావాన్ని గ్రహించి, మరియు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కలిగి ఉన్నాడో అర్ధం చేసుకోవడం అనేది వారికి తమ క్రియలు, తమ విశ్వాసం, మరియు తమ అన్వేషణలు శిక్షించబడతాయని అర్ధం. అందుకే వారు దేవుని గుణగణాలను గ్రహించడానికి అసహ్యపడుతుంటారు మరియు దేవుని స్వభావాన్ని, దేవుని చిత్తాన్ని మరింత ఉత్తమంగా అర్థము చేసుకోవడానికి మరియు దేవుని గురించి మరింత ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి ప్రార్థించాలని గాని, లేక చురుకుగా అన్వేషించాలని గాని ఇష్టపడరు మరియు అసహ్యించుకుంటూ ఉంటారు. దేవుడంటే ఏదో తయారుచేయబడినట్లు, అస్పష్టముగా ఉన్నట్లు మరియు శూన్యములో ఉన్నట్లు భావిస్తారు. దేవుడంటే వారు ఆయనను గూర్చి ఊహించుకున్నట్లుగానే ఉంటాడని, వారి పిలుపుకు తల ఊపుతూ వారితోనే ఉండేవాడని, పోషించడములో అలసిపోని వ్యక్తయని మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడని వారు ఊహించుకుంటూ ఉంటారు. వారు దేవుని కృపను ఆస్వాదించాలనుకున్నప్పుడు, ఆ కృపను అనుగ్రహించమని వారు దేవుణ్ణి అడుగుతారు. వారికి దేవుని ఆశీర్వాదము అవసరమైనప్పుడు, ఆ ఆశీర్వాదాన్ని ఇమ్మని వారు దేవుణ్ణి అడుగుతారు. కష్టాన్ని ఎదుర్కున్నప్పుడు, వారిని ధైర్యపరిచి, వారి వెనుక కవచంలా ఉండమని వేడుకుంటారు. దేవుని గురించిన ఈ ప్రజల జ్ఞానము కృప మరియు ఆశీర్వాదపు పరిధుల మధ్య చిక్కుకుపోయింది. దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు సమస్తమునైయున్న దేవుని గురించిన వారి జ్ఞానము కూడా వారి ఊహలకు మరియు అక్షరాలకు మరియు సిద్దాంతాలకు మాత్రమే పరిమితమైంది. అయితే దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకోవాలని, సమస్తమునైయున్న దేవుని యథార్థంగా చూడాలని, మరియు దేవుని స్వభావాన్ని, ఆయన ఏమై ఉన్నాడో ఏమి కలిగి ఉన్నాడో నిజంగా అర్ధం చేసుకోవాలని కొంతమంది ప్రజలు ఎంతో ఆతురతను కలిగియున్నారు. ఈ ప్రజలు సత్యపు వాస్తవికత మరియు దేవుని రక్షణలను గూర్చి అన్వేషణలో ఉన్నారు. అంతేగాకుండా, దేవుని ద్వారా విజయం, రక్షణ మరియు పరిపూర్ణతలను పొందాలని ఎదురుచూస్తున్నారు. వారు తమ హృదయాలను దేవుని వాక్యాన్ని చదవడానికి, తమ హృదయాలను ప్రతి పరిస్థితిని మరియు ప్రతి వ్యక్తిని, కార్యక్రమాన్ని, మరియు వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని అభినందించడానికి ఉపయోగిస్తారు. అంతేగాకుండా, వారుశ్రద్ధ కలిగి ప్రార్థిస్తారు మరియు వెదకుతారు. వారు దేవుని చిత్తాన్ని ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటారు మరియు దేవుని నిజ స్వభావమును మరియు ఆయన గుణగణాలను ఎక్కువగా అర్థము చేసుకోవాలని కోరుకుంటారు, తద్వారా వారు ఎన్నటికీ దేవుణ్ణి విరోధించకుండా, వారి అనుభవాల ద్వారా దేవుని ప్రేమానురాగాన్ని మరియు ఆయన వాస్తవ కోణాన్ని ఎక్కువగా చూస్తారు. వారి హృదయాల్లో కూడా నిజమైన సత్య దేవుడు ఉంటాడు కాబట్టి, వారి హృదయాల్లో దేవుడు స్థానము కలిగియుంటాడు, అందుచేత, వారు తమ ఊహాగానాలు, తలంపులు, లేదా అస్పష్టతల మధ్య జీవించలేరు. ఈ ప్రజలు దేవుని స్వభావం మరియు ఆయన గుణగణాలను గూర్చి అర్ధం చేసుకోవాలనే బలమైన కోరికకుగల కారణము ఏమిటంటే మానవజాతికి తమ అనుభవ గమనంలో క్షణక్షణం దేవుని స్వభావం మరియు ఆయన గుణగనాలు ఎంతో అత్యవసరమైయున్నాయి; ఒకరి జీవిత కాలమంతా జీవాన్ని అందించేది ఆయన స్వభావము మరియు గుణగణాలు మాత్రమే. దేవుని స్వభావాన్ని వారు అర్ధం చేసుకున్నప్పుడు, వారు ఇంకా ఎక్కువగా దేవునియందు భయభక్తులు కలిగియుంటారు, దేవుని కార్యానికి మెరుగ్గా సహకరిస్తారు మరియు దేవుని చిత్తంపట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి వారి సామర్థ్యాల మేరకు వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. దేవుని స్వభావంపట్ల అలాంటి వైఖరులను రెండు రకాల వ్యక్తులు కలిగి ఉంటారు. మొదటి రకం దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకోవాలని అనుకోరు. వారు దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకోవాలని, సమస్తమునైయున్న దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుడంటే ఏమిటో మరియు ఏమి కలిగి ఉంటాడో చూడాలని మరియు దేవుని చిత్తాన్ని యథార్థంగా అభినందించాలని ఆశిస్తున్నామని చెప్పినప్పటికీ, వారి అంతరంగ లోతుల్లో దేవుడు లేడనే భావిస్తారు. ఇలా ఎందుకంటే ఈ రకమైన వ్యక్తులు ఎప్పుడూ దేవునిపట్ల అవిధేయత చూపుతారు మరియు ఎదిరిస్తారు; వారు తమ హృదయాల్లో స్థానం కోసం దేవునితో పోరాడుతూ, దేవుని అస్తిత్వాన్ని తరచూ సందేహిస్తారు, లేక నిరాకరిస్తారు. దేవుని స్వభావము లేదా సమస్తమునైయున్న నిజ దేవుడు వారి హృదయాలను ఆధీన పరచుకోడానికి వారు ఇష్టపడరు. వారు కేవలం తమ కోరికలు, ఊహాగానాలు, మరియు ఆశయాలను నెరవేర్చుకోడానికే ఇష్టపడతారు. కాబట్టి, ఈ ప్రజలు దేవుణ్ణి నమ్మొచ్చు, దేవుని అనుసరించవచ్చు, మరియు ఆయన కోసం వారి కుటుంబాలను మరియు ఉద్యోగాలను కూడా వదిలేయవచ్చు, కానీ వారు తమ చెడు మార్గాలను విడిచిపెట్టరు. కొంతమంది కానుకలను దొంగిలించడం లేక వృధా చేయడం, రహస్యంగా దేవుణ్ణి దూషించడం వంటివి కూడా చేస్తారు, మరి కొందరైతే వారి గురించి పదేపదే చెప్పుకోడానికి, తమను తాము హెచ్చించుకోడానికి తమ స్థాయిలను ఉపయోగిస్తూ, ప్రజలు కోసం మరియు హోదా కోసం దేవునితో పోటిపడతారు. ప్రజలు వారిని ఆరాధించేలా చేయడానికి వారు వివిధ రకాలైన పద్దతులు మరియు కార్యక్రమాలను ఉపయోగిస్తూ, ప్రజలను గెలిచి వారిపై నియంత్రణ సాధించడానికి వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా కొంతమందైతే వారిని దేవునిగా భావించి తద్వారా వారు దేవునితో సమానంగా గౌరవించబడటానికి ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు చెడిపోయారని ఎవరితోనూ వారు చెప్పరు, అంటే తాము బాగా భ్రష్టుపట్టిన వారని మరియు అహంకారులని, వారిని ఆరాధించకూడదని, మరియు వారు ఎంత బాగా పనిచేసినా, అదంతా దేవుని గొప్పతనాన్ని బట్టే తాము చేయవలసిన దానిని ఎలాగైనా చేస్తున్నామని ప్రజలతో చెప్పరు. ఎందుకు వారు ఈ విషయాలు చెప్పరు? ఎందుకంటే ప్రజల హృదయాల్లో వారు తమ స్థానాన్ని కోల్పోతామని ఎంతగానో భయపడుతారు. అందుకని, అలాంటి ప్రజలు దేవుణ్ణి అర్ధం చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కాబట్టి, వారు ఎప్పుడూ దేవుణ్ణి హెచ్చించరు మరియు దేవునికి సాక్ష్యమియ్యరు. దేవుని అర్ధం చేసుకోకుండా వారు ఆయనను తెలుసుకోగలరా? అది అసాధ్యం! అందువల్ల, “దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు సమస్తమునైయున్న దేవుడు” అనే ఈ అంశములోని మాటలు చాలా మామూలుగా ఉన్నప్పటికీ, ప్రతి వ్యక్తి పట్ల అవి వేర్వేరు భావాలను కలిగి ఉంటాయి. తరచూ దేవునికి లోబడకుండా, దేవుణ్ణి ఎదిరిస్తూ మరియు దేవునిపట్ల వైరాన్ని కలిగి ఉండే వ్యక్తికి ఈ మాటలు శిక్షను సూచిస్తాయి; అయితే నిజమైన వాస్తవికతను అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని వెదకడానికి తరచుగా దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి అలాంటి వాక్కులను తేనెను జుర్రుకున్నట్లుగా తీసుకుంటాడు. కాబట్టి మీలో కొంతమందికి దేవుని స్వభావం మరియు దేవుని కార్యము గురించి మాట్లాడటం ఇతరులు వినగానే, వారికి తలనొప్పి రావడం మొదలవుతుంది, వారి హృదయాలు తిరస్కారమతొ నిండిపోతాయి మరియు వారు చాలా తీవ్రంగా ఇబ్బంది పడతారు. అయితే మీలో మరికొందరు, ఇది నాకు చాలా ప్రయోజనకరమైన అంశము కాబట్టి, ఇది నాకు ఖచ్చితంగా అవసరమైన అంశము. ఇది నా జీవిత అనుభవము నుండి పోగొట్టుకోలేనిది; ఇది మర్మానికే మర్మము, దేవునిపై నమ్మకానికి పునాది మరియు మానవజాతి నిషేధించలేనిది. మీ అందరికీ ఈ అంశము బాగా దగ్గరగాను మరియు దూరంగాను మరియు ఇంకా తెలియనిదిగాను సుపరిచితమైనదిగాను అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ, ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిన, తెలుసుకోవాల్సిన మరియు అర్ధం చేసుకోవాల్సిన అంశము. మీరు దీనిపట్ల ఎలాంటి ధోరణి కలిగియున్న, లేక మీరు దీన్ని ఎలా చూసినా, లేక దీన్ని ఎలా అర్ధం చేసుకున్నా సరే, ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయలేము.

మానవజాతిని సృజించినప్పటి నుండి దేవుడు తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆదిలో, ఇది చాలా సులభమైన కార్యము. అయితే, ఇది నిరాడంబరత కలిగినదే అయినప్పటికీ, దేవుని సారము మరియు స్వభావపు వ్యక్తీకరణలు ఇందులో ఉన్నాయి. దేవుని కార్యము ఇప్పుడు ఘనపరచబడినప్పటికీ, ఈ కార్యము ఆయనను వెంబడించే ప్రతి వ్యక్తిపై అద్భుతంగా మరియు నిర్దిష్టంగా మారడమే కాకుండా, ఆయన వాక్యపు గొప్ప వర్ణనతో, అంతటా ఉన్న దేవుని వ్యక్తి మానవ జాతి నుండి మరుగు చేయబడ్డాడు. ఆయన రెండు సార్లు శరీరధారి అయినప్పటికీ, బైబిల్ వృత్తాంతాల కాలం నుండి ఆధునిక దినాల వరకు, నిజమైన దేవుని వ్యక్తిని ఎవరైనా చూశారా? మీ అవగాహన ఆధారంగా, ఎవరైనా దేవుని నిజమైన వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? లేదు. నిజమైన దేవుని వ్యక్తిని ఎవరూ చూడలేదు, అంటే దేవుని నిజ స్వరూపాన్ని ఎవరూ చూడలేదనేది దీని భావం. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే విషయమే. అంటే, దేవుని నిజమైన వ్యక్తి, లేక దేవుని ఆత్మ అనేది, ఆయన సృజించిన, ఆదాము హవ్వలతో కలిపి, ఆయన అంగీకరించిన, నీతిమంతుడైన యోబుతో సహా, సమస్త మానవజాతికి మరుగై ఉన్నది. వారెవ్వరూ దేవుని నిజమైన వ్యక్తిని చూడలేదు. అయితే తన నిజమైన వ్యక్తిని దేవుడు కావాలనే ఎందుకు మరుగు చేస్తాడు? “మనుష్యులను భయపెట్టడానికి దేవుడు సంకోచిస్తాడు” అని కొంతమంది అంటారు. “మనిషి చాలా అల్పమైన వాడు మరియు దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి, దేవుడు తన నిజమైన వ్యక్తిని మరుగు చేశాడు; మానవులు ఆయనను చూడలేరు, లేకపోతే వాళ్ళు చనిపోతారు” అని ఇతరులు అంటారు. అయితే, “అనుదినమూ దేవుడు తన కార్యాన్ని నిర్వహించడంలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి, ఇతరులు ఆయనను చూసేలా కనబడటానికి ఆయనకు సమయం ఉండకపోవచ్చు” అని కూడా మరికొంతమంది అంటారు. మీరు ఏది నమ్మినా సరే, ఇక్కడ నాకు ఒక నిర్ధారణ ఉంది. ఆ నిర్ధారణ ఏంటి? అదేమిటంటే, తన నిజమైన వ్యక్తిని ప్రజలు ఊరకే చూడటానికి దేవుడు ఇష్టపడటం లేదు. మానవజాతికి మరుగై ఉండటం అనేది దేవుడు ఉద్దేశపూర్వకంగా చేసే కార్యమే. మరో మాటలో చెప్పాలంటే, తన నిజమైన వ్యక్తిని ప్రజలు చూడకూడదనేది దేవుని ఉద్దేశం. ఇప్పటికైనా ఈ విషయం అందరికీ తెలియాలి. దేవుడు తన వ్యక్తిని ఎవరికీ వెల్లడించకపోతే, దేవుని వ్యక్తి (ఆయన ఉన్నాడని) ఉన్నాడని మీరు నమ్ముతారా? నిజానికి ఆయన ఉన్నాడు. దేవుని వ్యక్తి ఉనికి సర్వ సందేహానికి అతీతమైనది. కానీ, దేవుని వ్యక్తి ఎంత గొప్ప వాడు లేదా చూడటానికి ఆయన ఎలా ఉంటాడు లాంటి ప్రశ్నల కోసం మానవజాతి పరిశోధించాలా? లేదు. దీనికి సమాధానం అనుకూలమైనది కాదు. ఒకవేళ దేవుని వ్యక్తి అనే విషయం విశదీకరించవలసిన అంశమే కానప్పుడు, మరి ఇదంతా దేని గురించి? (దేవుని స్వభావం.) (దేవుని కార్యము.) అయితే, అధికారిక అంశాన్ని గురించి పంచుకోవడం ఆరంభించే ముందు, క్షణం ముందు మనం చర్చిస్తున్న విషయానికి తిరిగి వద్దాము: తన నిజమైన వ్యక్తిని దేవుడు మానవజాతికి ఎందుకు కనపరచలేదు? తన నిజమైన వ్యక్తిని దేవుడు కావాలన మానవజాతి నుండి ఎందుకు మరుగు చేశాడు? ఒకే ఒక్క కారణం ఉంది, అదేమిటంటే: దేవుడు సృజించిన, మానవుడు, ఆయన కార్యాన్ని వేల సంవత్సరాలుగా అనుభవించినప్పటికీ, దేవుని కార్యాన్ని, దేవుని స్వభావాన్ని, మరియు దేవుని లక్షణాన్ని ఎరిగిన ఒక్క వ్యక్తి కూడా లేడు. అలాంటి ప్రజలు, దేవుని దృష్టిలో, ఆయన విరోధులు మరియు తన పట్ల వైరాన్ని కలిగి ఉండే ప్రజలకు దేవుడు తనను తాను కనుపరచుకోడు. దేవుడు తన వ్యక్తిని బయలుపరచకపోవడానికి మరియు ఎందుకు ఆయన తన వ్యక్తిని మానవజాతి నుండి ఉద్దేశపూర్వకంగా దాస్తున్నాడనే దానికి ఉన్న ఏకైక కారణం ఇదే. దేవుని స్వభావాన్ని తెలుసుకునే దాని ప్రాముఖ్యత ఇప్పుడు మీకు స్పష్టమైందా?

దేవుని నిర్వహణ అనేది ఉనికిలో ఉన్నప్పటి నుండి, తన కార్యాన్ని జరిగించడం పట్ల ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతోనే ఉన్నాడు. ఆయన తన వ్యక్తిని మనిషి నుండి దాచినప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ మనిషిపై కార్యాన్ని చేస్తూ, ఆయన స్వభావాన్ని వెల్లడిచేస్తూ, తన ఆత్మతో సమస్త మానవజాతిని నడిపిస్తూ మరియు ఆయన బలము, ఆయన జ్ఞానము, మరియు ఆయన అధికారము ద్వారా ప్రతి వ్యక్తిపై కార్యము చేస్తూ, తద్వారా ధర్మశాస్త్ర యుగము, కృపా యుగము, మరియు నేటి దేవుని రాజ్యపు యుగమును ఉనికిలోనికి తెస్తూ, మనిషి పక్షానే ఉన్నాడు. దేవుడు తన వ్యక్తిని మనిషి నుండి దాచినప్పటికీ, ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము మరియు అధికారాలు, మరియు మానవజాతి పట్ల ఆయన చిత్తము అనేవి మనిషి చూచి అనుభవించడానికి విస్తారంగా బయలుపరచబడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే, మానవులు దేవుని చూచి, తాకలేక పోయినప్పటికీ, మానవజాతి ఎదుర్కొన్న దేవుని స్వభావం మరియు ఆయన గుణము పూర్తిగా దేవుని వ్యక్తీకరణలే. అది నిజం కాదా? దేవుడు తన కార్యం కోసం ఎంచుకున్న విధానము మరియు సమీపించే కోణము ఏదైనప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన నిజమైన గుర్తింపుతోనే ప్రజలతో వ్యవహరిస్తూ, ఆయనకు అప్పగించబడిన కార్యాన్ని చేస్తూ, ఆయన చెప్పవలసిన వాక్యాలను చెప్తాడు. దేవుడు ఏ స్థితి నుండి మాట్లాడినా సరే—ఆయన మూడవ ఆకాశమందు నిలబడి కావచ్చు, లేక శరీరునిగా నిలబడి కావచ్చు, లేక సాధారణ వ్యక్తిగా కూడా కావచ్చు–ఆయన ఎల్లప్పుడూ మనిషితో ఆయన పూర్ణ హృదయంతో, మరియు ఆయన పూర్ణ మనస్సుతో, ఎలాంటి మోసము లేదా మొహమాటము లేకుండా మాట్లాడతాడు. తన కార్యాన్ని జరిగించేటప్పుడు, దేవుడు తన వాక్యాన్ని మరియు తన స్వభావాన్ని తెలియజేస్తూ, ఎలాంటి తారతమ్యము లేకుండా, ఆయన ఏమి కలిగి ఉన్నాడో మరియు ఏమై ఉన్నాడో తెలియపరుస్తాడు. ఆయన తన వ్యక్తిత్వం మరియు అధికారాలతో మానవజాతిని నడిపిస్తాడు. “చూడడానికి మరియు తాకడానికి వీలుకాని” దేవుని నడిపింపులో—అనాగరిక కాలంలో—మనిషి ఈ విధంగానే జీవించాడు.

ధర్మశాస్త్ర యుగం తరువాత దేవుడు మొదటిసారి శరీరునిగా—ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన ఒక మానవావతారం-గామారాడు. మానవునికి, ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కువ కాలమా? (ఎక్కువ కాలమేమీ కాదు.) మానవుని సాధారణ జీవిత కాలం ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనిషికి అది మరీ అంత పెద్ద కాలమేమీ కాదు. కానీ శరీరధారి అయిన దేవునికి, ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలు నిజంగా ఎక్కువే. ఆయన ఒక వ్యక్తిగా—దేవుని కార్యాన్ని మరియు ఆజ్ఞను పొందుకున్న ఒక సామాన్య వ్యక్తిగా మారాడు. అంటే ఆయన ఒక సాధారణ వ్యక్తి నిర్వహించలేని కార్యాన్ని తీసుకుని, సాధారణ వ్యక్తి తట్టుకోలేని బాధను భరించవలసి వచ్చింది. ఆయన కార్యాన్ని ఆరంభించినది మొదలుకుని ఆయన సిలువ వేయబడే వరకు, కృపా యుగంలో యేసు ప్రభువు భరించిన బాధ, నేటి ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగింది కాకపోవచ్చు, కానీ బైబిల్లోని కథనాల ద్వారా మీరు దాని గురించి కనీసం ఒక ఆలోచనైనా పొందలేదా? మొత్తానికి, నమోదు చేయబడిన ఈ వాస్తవాల్లో ఎన్ని వివరాలు ఉన్నప్పటికీ, నేటి కాలపు దేవుని కార్యము కష్టాలు మరియు బాధలతో నిండి ఉన్నది. చెడిపోయిన మనిషికి, ముప్పై మూడున్నర సంవత్సరాలు చాలా కాలమేమీ కాదు; ఒక చిన్న బాధ ఒక చిన్న విషయం. అయితే మానవజాతి పాపాలన్నిటినీ భరిస్తూ, తినుచూ, నిద్రిస్తూ మరియు పాపులతో జీవించవలసి వచ్చిన, పరిశుద్ధుడైన, నిందా రహితుడైన దేవునికి, ఆ బాధ నమ్మలేనంత తీవ్రమైనదిగానే ఉంది. ఆయన సృష్టికర్త, సార్వభౌమాధికారి మరియు సమస్త అధిపతి అయినప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, చెడిపోయిన మనుష్యుల అణచివేతను మరియు క్రూరత్వాన్ని భరించవలసి వచ్చింది. తన కార్యాన్ని పూర్తి చేసి కష్టాల సంద్రము నుండి మానవజాతిని రక్షించడానికి, మనిషి చేత ఆయన నిందించబడి సమస్త మానవజాతి పాపాలను భరించవలసి వచ్చింది. ఆయన అనుభవించిన బాధ పరిధిని సామాన్య ప్రజలు గ్రహించలేరు మరియు అభినందించ లేరు. ఈ బాధ దేనిని సూచిస్తుంది? ఇది మానవజాతి పట్ల దేవునికున్న అంకితభావాన్ని సూచిస్తుంది. ఇది ఆయన అనుభవించిన అవమానాన్ని మరియు మానవ రక్షణకై, వారి పాపాలను విమోచించడానికి, మరియు ఆయన కార్యపు ప్రస్తుత దశను పూర్తి చేయడానికి ఆయన చెల్లించిన మూల్యాన్ని సూచిస్తుంది. ఇది మనిషి దేవుని ద్వారా సిలువను బట్టి విమోచించబడతాడని కూడా సూచిస్తుంది. ఇది రక్తములో, జీవితంలో, చెల్లించిన మూల్యము మరియు సృజించబడిన ఏ జీవియైనా వెచ్చించలేని మూల్యము. ఆయన దేవుని లక్షణాన్ని కలిగి దేవుడు కలిగియున్న అధికారాలను కలిగి, ఈ రకమైన బాధను భరించి మరియు ఈ విధమైన కార్యాన్ని ఆయన చేయగలిగాడు. ఇది ఆయనకు బదులుగా ఆయన ద్వారా సృజించబడినది ఏదీ చేయలేనిది. కృపా యుగములోని దేవుని కార్యము మరియు ఆయన స్వభావపు ప్రత్యక్షత ఇదే. దేవుడు ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమై ఉన్నాడనే దాని గురించి ఇది ఏమైనా వెల్లడిస్తుందా? మానవజాతి దానిని తెలుసుకోవడం ప్రయోజనకరమేనా? ఆ కాలంలో, దేవుని వ్యక్తిని మానవుడు చూడనప్పటికీ, వారు దేవుని పాపపరిహారార్ధ బలిని పొంది సిలువను బట్టి దేవుని ద్వారా విమోచించబడ్డారు. కృపా యుగంలో దేవుడు చేసిన కార్యము గురించి మానవాళికి తెలియకపోవచ్చు, కానీ ప్రస్తుత కాలంలో దేవుడు తెలియజేసే స్వభావము మరియు చిత్తాన్ని గురించి తెలిసిన వారెవరైనా ఉన్నారా? మనిషికి కేవలం ఆయా యుగాల్లోని ఆయా మార్గాల ద్వారా దేవుని కార్యపు వివరాలను తెలుసు, లేదా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్న సమయంలో జరిగిన దేవునికి చెందిన కథనాల గురించి తెలుసు. ఈ వివరాలు మరియు కథనాలు కేవలం దేవుని గురించిన కొంత సమాచారం మరియు చరిత్రనే తప్ప దేవుని స్వభావంతో మరియు లక్షణంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండవు. కాబట్టి దేవుని గురించి ప్రజలకు అనేక కథనాలు తెలుసు అంటే, దానర్ధం వారికి దేవుని స్వభావము లేదా ఆయన అంతర్గతాన్ని గురించి ప్రజలు లోతైన అవగాహన మరియు జ్ఞానం కలిగి ఉన్నారని కాదు. ధర్మశాస్త్ర యుగంలో లాగా, కృపా యుగంలోని ప్రజలు శరీరునిగా ఉన్న దేవునితో తక్షణ మరియు సన్నిహిత సంభాషణ అనుభవాన్ని కలిగి ఉన్నప్పటికీ, నిజానికి, దేవుని స్వభావము మరియు దేవుని లక్షణాన్ని గురించిన జ్ఞానము వారికి లేదు.

రాజ్యపు యుగంలోనూ, దేవుడు తాను మొదటిసారి చేసిన విధంగానే, మరోసారి శరీరధారిగా మారాడు. ఈ కార్యపు సమయంలో, దేవుడు ఇంకా తన వాక్యాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తూ, ఆయన చేయవలసిన కార్యాన్ని చేస్తాడు, మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడో మరియు ఏమై ఉన్నాడో తెలియజేస్తాడు. అదే సమయంలో, ఆయన మనిషి అవిధేయత మరియు నిర్లక్ష్యాన్ని భరిస్తూ మరియు సహిస్తూనే ఉంటాడు. ఈ కార్యపు కాలంలో కూడా దేవుడు తన స్వభావాన్ని అనునిత్యం బయలుపరుస్తూ తన చిత్తాన్ని తెలియజేయడా? కాబట్టి, మనిషిని సృజించినది మొదలుకుని నేటి వరకు, దేవుని స్వభావము, ఆయన ఉనికి మరియు అధికారాలు, మరియు ఆయన చిత్తము ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఎల్లప్పుడూ తెరవబడే ఉన్నాయి. దేవుడు తన అంతర్గతాన్ని, తన స్వభావాన్ని, లేక తన చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా ఎన్నడూ మరుగు చేయలేదు. నిజానికి, దేవుడు ఏమి చేస్తున్నాడో, ఆయన చిత్తమేమిటనే దాని గురించి మానవజాతే పట్టించుకోదు—అందుకే దేవుని గురించి మనిషి అంత దయనీయమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు తన వ్యక్తిని దాచినప్పుడు, కూడా ఆయన అనుక్షణం మానవజాతి పక్షానే నిలిచి, అన్ని సమయాల్లోనూ తన చిత్తాన్నీ, స్వభావాన్నీ మరియు అంతర్గతాన్నీ బహిరంగంగానే కనుపరుస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే, దేవుని వ్యక్తి ప్రజలకు కూడా బహిర్గతమే అయినప్పటికీ, మనుష్యుల అంధత్వము మరియు అవిధేయత కారణంగా, వారు ఎన్నడూ దేవుని స్వరూపాన్ని చూడలేకపోతున్నారు. మరైతే, దేవుణ్ణి మరియు దేవుని స్వభావాన్ని అర్ధం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సులభం కాదా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం చాలా కష్టం కాదా? ఇది సులభమేనని మీరు చెప్పవచ్చు, కానీ కొంతమంది ప్రజలు దేవుని తెలుసుకోవాలని అన్వేషిస్తున్నప్పుడు, వారు నిజంగా ఆయనను తెలుసుకోలేరు లేదా ఆయన గురించిన స్పష్టమైన అవగాహన పొందలేరు—అది ఎల్లప్పుడూ అస్పష్టంగా మరియు సందిగ్ధంగా ఉంటుంది. కానీ, ఒకవేళ అది అంత సులభం కాదని మీరు చెబితే, అది కూడా సరైనది కాదు. చాలా కాలంగా దేవుని కార్యానికి సంబంధించిన అంశముగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ, వారి అనుభవాల ద్వారా, దేవునితో సత్సంబంధాలను కలిగి ఉండాలి. వారు కనీసం తమ హృదయాల్లో కొంతవరకైనా దేవుణ్ణి గ్రహించి ఉండాలి లేదా దేవుని పట్ల ఆధ్యాత్మిక ప్రక్షాళన కలిగి ఉండాలి, మరియు వారు కనీసం దేవుని స్వభావం గురించి వినియున్న జ్ఞానాన్ని కాస్తయినా కలిగి ఉండాలి లేదా ఆయన గురించి కొంతైనా అవగాహన పొంది ఉండాలి. మానవుడు దేవుని అనుసరించటం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు, మానవజాతి చాలా ఎక్కువగానే పొందుకుంది, కానీ సమస్త విధాలైన కారణాల వలన—మనిషి పేలవమైన సామర్థ్యము, నిర్లక్ష్యము, తిరుగుబాటుతనము మరియు పలు రకాలైన ఉద్దేశాలను బట్టి—మానవజాతి కూడా దాని నుండి ఎంతో కోల్పోయింది. ఇప్పటికే దేవుడు మానవజాతికి తగినంత ఇవ్వలేదా? దేవుడు తన వ్యక్తిని మానవజాతికి మరుగు చేసినప్పటికీ, ఆయన ఏమై ఉన్నాడో మరియు ఏమి కలిగి ఉన్నాడో, మరియు తన జీవము నుండి, ఆయన మానవులను పోషిస్తాడు; మానవజాతికి దేవుని గురించిన జ్ఞానము కేవలం ఇప్పుడున్నట్లుగా మాత్రమే ఉండకూడదు. అందుకని దేవుని కార్యము, దేవుని స్వభావం, మరియు స్వయంభవుడైన దేవుడు అనే అంశం గురించి మీతో మరింతగా పంచుకోవడం అవసరమని నేను భావిస్తున్నాను. దీని ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుడు మనిషి పట్ల కనుపరచిన వేల సంవత్సరాల శ్రద్ధ మరియు సంరక్షణ వ్యర్థంగా ముగిసిపోకూడదు, తద్వారా మానవజాతి వారి పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని యదార్ధంగా అర్థం చేసుకుని అభినందించగలుగుతారు. దీనిని బట్టి ప్రజలు దేవుని గురించిన వారి అవగాహనలో ఒక నూతన దశను చేరుకోగలుగుతారు. ఇది ప్రజల హృదయాలలో దేవుణ్ణి ఆయన నిజమైన స్థానానికి తిరిగి తెస్తుంది; అంటే, ఆయనకు న్యాయము చేస్తుంది.

దేవుని స్వభావాన్ని మరియు దేవుణ్ణి అర్థం చేసుకోవడాన్ని మీరు చిన్నగా ప్రారంభించాలి. అయితే ఎక్కడి నుండి చిన్నగా ప్రారంభించాలి? ప్రారంభించడానికి, నేను బైబిల్ నుండి కొన్ని అధ్యాయాలను ఎంచుకున్నాను. కింద ఉన్న సమాచారంలో బైబిల్ వచనాలు ఉన్నాయి, అవన్నీ దేవుని కార్యము, దేవుని స్వభావము, మరియు స్వయంభవుడైన దేవుడు అనే అంశానికి సంబంధించినవి. దేవుని కార్యము, దేవుని స్వభావం, మరియు స్వయంభవుడైన దేవుని గురించి తెలుసుకోవడంలో మీకు సహాయపడటానికి నేను ఈ సారాంశాలను విషయ సూచన సంగతులను ప్రత్యేకంగా కనుగొన్నాను. వాటిని పంచుకోవటం ద్వారా, దేవుడు తన గత కార్యము ద్వారా ఎలాంటి స్వభావాన్ని వెల్లడించాడో మరియు ఆయన లక్షణానికి సంబంధించిన ఏ అంశాలు మానవునికి తెలియవో వాటిని మనము చూడగలుగుతాము. ఈ అధ్యాయాలన్నీ పాతవి కావచ్చు కానీ, మనము పంచుకుంటున్న అంశము ప్రజలకు తెలియని మరియు ఎన్నడూ వినని ఒక కొత్త విషయం. మీలో కొందరికి ఇది నమ్మశక్యంగా అనిపించదు—ఆదాము హవ్వలను తీసుకురావటం మరియు నోవహు వద్దకు తిరిగి వెళ్లడం అనేవి మళ్లీ అవే దశలను వెనక్కి తీసుకురావటం కాదా? మీరు ఏమనుకున్నా సరే, ఈ అధ్యాయాలు ఈ అంశం గురించి పంచుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటూ నేటి కూడికకు బోధనా గ్రంథాలుగా లేదా మొదటి ప్రాథమిక పాఠ్య భాగాలుగా పనికొస్తాయి. ఈ కూడికను నేను ముగించే సమయానికి, ఈ అధ్యాయాలను ఎంచుకోవటం వెనక ఉన్న నా ఉద్దేశాలను మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు బైబిల్ చదివిన వారు ఈ కొన్ని వచనాలను చదివి ఉండవచ్చు, కానీ వాటిని నిజంగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. ముందుగా, మనము వాటిని క్లుప్తంగా సమీక్షిద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కటిని మన కూడికలో సవివరముగా పరిశీలించుదాం.

ఆదాము మరియు హవ్వలు మానవజాతికి పితరులు. ఒకవేళ మనము బైబిల్లోని పాత్రలను గురించి ప్రస్తావించవలసి వస్తే, అప్పుడు వాటిని మనము ఆ ఇద్దరితోనే ప్రారంభించాలి. ఆ తరువాత నోవహు, మానవజాతికి రెండవ పితరుడు. మూడవ పాత్ర ఎవరు? (అబ్రహము.) మీ అందరికీ అబ్రహాము చరిత్ర తెలుసా? మీలో కొంత మందికి ఇది తెలిసి ఉండవచ్చు, కానీ ఇతరులకు ఇది స్పష్టంగా ఉండకపోవచ్చు. నాల్గవ పాత్ర ఎవరు? సొదోమ వినాశన చరిత్రలో ప్రస్తావించబడినది ఎవరు? (లోతు.) కానీ లోతు గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఇది ఎవరిని సూచిస్తుంది? (అబ్రహము.) అబ్రహాము కథనంలో యెహోవా దేవుడు చెప్పినదానిని గురించి ప్రధానంగా ప్రస్తావించబడినది. మీరు దానిని చూశారా? ఐదవ పాత్ర ఎవరు? (యోబు.) దేవుడు తన కార్యపు ప్రస్తుత దశలో యోబు చరిత్రను ఎక్కువగా ప్రస్తావించలేదా? మరి మీరు ఈ చరిత్ర గురించి ఎంతో శ్రద్ధను కలిగియున్నారా? ఒకవేళ మీరు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే, మీరు బైబిల్లోని యోబు చరిత్రను జాగ్రత్తగా చదివారా? యోబు ఏం విషయాలు చెప్పాడో మరియు ఏం పనులు చేశాడో మీకు తెలుసా? మీలో ఎక్కువగా చదివిన వారికి, మీరు దీన్ని ఎన్నిసార్లు చదివారు? తరచుగా మీరు దీనిని చదువుతున్నారా? హాంకాంగ్‌కు చెందిన సోదరీలూ దయచేసి మాకు చెప్పండి. ( ఇదివరకు మనం కృపా యుగంలో ఉన్నప్పుడు దీన్ని నేను రెండుసార్లు చదివాను.) అప్పటి నుండి మీరు మళ్లీ దీనిని చదవలేదా? అది విచారకరం. నేను మీకు ఒకటి చెప్తాను: దేవుని కార్యపు ఈ దశలో ఆయన యోబు గురించి అనేక సార్లు ప్రస్తావించాడు, ఇది ఆయన ఉద్దేశాలకు ఒక ప్రతిబింబము. ఆయన యోబు గురించి అనేక సార్లు ప్రస్తావించాడే గానీ, నీ దృష్టిని ప్రేరేపించలేదు అనేది ఒక వాస్తవానికి నిదర్శనం: మంచి ప్రజలుగా దేవునికి భయపడుతూ, చెడును అసహ్యించుకునే ప్రజలుగా ఉండాలనే ఆసక్తి మీకు లేదు. ఎందుకంటే, యోబు చరిత్ర గురించి దేవుడు చెప్పిన ఒక స్థూలమైన ఆలోచనతో మీరు సంతృప్తి చెందారు. మీరు కేవలం చరిత్రను అర్థం చేసుకోవటంతోనే సంతృప్తి చెందారు, కానీ యోబు ఎవరో మరియు అనేక సందర్భాలలో దేవుడు యోబునే ఎందుకు సూచిస్తున్నాడు అనే దాని వెనకున్న ఉద్దేశాన్ని మీరు పట్టించుకోరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నమూ చేయరు. దేవుని చేత కొనియాడబడిన అలాంటి వ్యక్తి పట్ల మీరు ఆసక్తి చూపకపోతే, మరి దేనిపట్ల మీరు సరిగ్గా ఆసక్తి చూపుతున్నారు? దేవుడు ప్రస్తావించిన అలాంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీరు పట్టించుకోకపోతే లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, దేవుని వాక్యము పట్ల మీకున్న వైఖరి గురించి అది ఏమి చెబుతుంది? అది శోచనీయం కాదా? మీలో అనేకమంది ఆచరణాత్మకమైన విషయాలలో లేదా సత్యాన్వేషణలో నిమగ్నమవ్వరని ఇది రుజువు చేయడం లేదా? నీవు సత్యాన్ని అనుసరిస్తే, దేవుడు ఆమోదించే వ్యక్తులు మరియు దేవుడు చెప్పిన పాత్రల చరిత్రల పట్ల సరియైన శ్రద్ధను కనుపరుస్తావు. నీవు వారికి అనుగుణంగా జీవించగలవా లేదా వారి చరిత్రలను నిశితంగా కనుగొన్నావా అనే దానితో సంబంధం లేకుండా, నీవు త్వరగా వెళ్లి వారి గురించి చదివి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారి మాదిరిని అనుసరించడానికి మార్గాలను కనుగొంటావు, మరియు నీ సామర్థ్యం మేరకు నీవు చేయగలిగింది చేస్తావు. సత్యం కోసం పరితపించే వారెవరైనా ఇలా వ్యవహరించాలి. కానీ, వాస్తవం ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న మీలో అనేకమంది యోబు చరిత్రను ఎప్పుడూ చదవలేదు—అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

నేను చర్చిస్తున్న అంశానికి తిరిగి వద్దాము. పాత నిబంధన ధర్మశాస్త్ర యుగానికి చెందిన లేఖన భాగంలో, బైబిల్ చదివిన చాలామంది ప్రజలకు సుపరిచితమైన అత్యంత ప్రాతినిథ్యపు పాత్రలను గురించిన నిర్దిష్ట కథనాలపై దృష్టి సారించాలని నేను అనుకున్నాను. ఈ పాత్రల గురించిన చరిత్రలను చదివిన వారెవరైనా దేవుడు వారిపై చేసిన కార్యాన్ని మరియు దేవుడు వారితో మాట్లాడిన వాక్యాలు సమానంగా స్పష్టంగా మరియు నేటికి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అనుభూతి చెందగలుగుతారు. బైబిల్లోని చరిత్రలను, ఈ కథనాలను నీవు చదివినప్పుడు, చరిత్రలోని ఆ సమయాల్లో దేవుడు తన కార్యము గురించి మరియు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాడో నీవు బాగా అర్థం చేసుకోగలుగుతావు. కానీ ఈ రోజు నేను ఈ అధ్యాయాలను చర్చించాలని నిర్ణయించుకోవడానికి గల కారణం నీవు కేవలం కథనాలపై లేదా వాటిలోని పాత్రలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తావని కాదు. కానీ, దీనిని బట్టి నీవు—ఈ పాత్రల కథనాల ద్వారా—దేవుని క్రియలను మరియు ఆయన స్వభావాన్ని అభినందించగలవు. ఇది నిన్ను దేవుని గురించి ఇంకా సులభంగా తెలుసుకొని మరియు అర్థం చేసుకోవడానికి, ఆయన వాస్తవ రూపాన్ని చూడటానికి అనుకూలతను కలిగిస్తుంది; ఇది ఆయనను గురించిన మీ ఊహాగానాలను మరియు ఉద్దేశాలను తొలగించి, సందిగ్ధతతో ఆవరించబడిన విశ్వాసము నుండి నిన్ను దూరంగా నడిపించడానికి సహాయపడుతుంది. స్థిరమైన పునాది నీకు లేకపోతే, దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మరియు దేవుని గురించి తెలుసుకోవడం అనేది తరచుగా నిస్సహాయత, శక్తిహీనత, మరియు కనీసం ఎక్కడ ప్రారంభించాలి అనే సందిగ్ధతా భావానికి దారి తీస్తుంది. ఇది నిన్ను దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవడంలో, దేవుని చిత్తాన్ని మరింత ఖచ్చితంగా గ్రహించడంలో, దేవుని స్వభావాన్ని మరియు స్వయంభవుడైన దేవుని గురించి తెలుసుకోవడంలో, నీకు సహాయపడే ఒక పద్ధతిని మరియు విధానాన్ని అభివృద్ధి చేయటానికి నిన్ను ప్రేరేపించి, నిన్ను దేవుని అస్తిత్వాన్ని మరియు మానవజాతి పట్ల ఆయనకున్న చిత్తాన్ని యదార్ధంగా అభినందించేలా చేస్తుంది. దీని వలన మీ అందరికీ ప్రయోజనం ఉండదా? ఇప్పుడు ఈ కథనాలను మరియు లేఖన భాగాలను మీరు మళ్లీ చూస్తున్నప్పుడు, మీ హృదయాలలో మీకు ఏమి అనిపిస్తుంది? నేను ఎంచుకున్న లేఖన భాగాలు నిష్ప్ర్రయోజనమైనవని మీరు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు మీకు చెప్పిన దాన్నే నేను మళ్ళీ నొక్కి చెప్పాలి: దేవుడు తన కార్యాన్ని ప్రజల పట్ల ఎలా చేస్తాడో చూడటంలో మరియు మానవ జాతి పట్ల ఆయన వైఖరిని మరింతగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయ పడటమే ఈ పాత్రల కథనాలను మీ చేత చదివించడం యొక్క లక్ష్యం.

లేఖన భాగములోని ఒక ఉద్ఘాటనతో మొదలుపెడుతూ, ఆదాము అవ్వల చరిత్రతో మనము ప్రారంభిద్దాం.

అ. ఆదాము మరియు హవ్వ

1. ఆదాముకు ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ

ఆది 2:15-17 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని, ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా—ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును: అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

ఈ వచనాలు నుండి మీరు ఏమి తెలుసుకుంటారు? ఈ లేఖన భాగము మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ గురించి చర్చించాలని నేను ఎందుకు నిర్ణయించుకున్నాను? మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆదాము మరియు దేవుని స్వరూపాన్ని మీ మనసులో కలిగి ఉన్నారా? మీరు ఊహించడానికి ప్రయత్నించవచ్చు: ఒకవేళ ఆ సన్నివేశంలో మీరూ ఒకరైతే, అంతరంగంలో, దేవుడు ఎలా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు? దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది హృదయాన్ని కదిలించే దయాపూర్వకమైన ఒక చిత్రము. దానిలో దేవుడు మరియు మానవుడు మాత్రమే ఉన్నప్పటికీ, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం మిమ్మల్ని ప్రశంస పూర్వకమైన భావనతో నింపుతుంది: పొంగిపొర్లుతున్న దేవుని ప్రేమ మనిషికి ఉచితముగా అందించబడి మనిషిని చుట్టుముడుతుంది; మానవుడు నిర్దోషిగా మరియు నిర్మలంగా, బాధ్యత లేకుండా మరియు నిర్లక్ష్యంగా, దేవుని దృష్టిలో ఆనందంగా నివసిస్తున్నాడు; దేవుడు మానవుని పట్ల శ్రద్ధను కనుపరుస్తాడు. అయితే, మానవుడు దేవుని సంరక్షణ మరియు ఆశీర్వాదములో నివసిస్తాడు; మనిషి చేసే మరియు చెప్పే ప్రతి ఒక్క విషయము దేవునితో విడదీయరానిదిగా ముడిపడి ఎడబాయనిదిగా ఉంటుంది.

మానవుని సృజించిన తరువాత దేవుడు అతనికి ఇచ్చిన మొదటి ఆజ్ఞగా దీన్ని చెప్పవచ్చు. ఈ ఆజ్ఞ ఏమి తెలియజేస్తుంది? ఇది దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది, అలాగే మానవ జాతి పట్ల ఆయన కలిగి ఉన్న చింతలను కూడా తెలియజేస్తుంది. ఇది దేవుని మొదటి ఆజ్ఞ, అదేవిధంగా మనిషి పట్ల దేవుడు ఆందోళన వ్యక్త పరచడం కూడా ఇదే మొదటిసారి. అంటే, దేవుడు మానవుని సృజించిన అప్పటి నుండి అతని పట్ల ఆయన బాధ్యత వహించాడు. ఆయన బాధ్యత ఏమిటి? ఆయన మనిషిని రక్షించాలి, మానవుని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన వాక్యాలను మానవుడు విశ్వసించి పాటించగలడని ఆయన నిరీక్షిస్తున్నాడు. మానవుని పట్ల దేవునికున్న మొదటి నిరీక్షణ కూడా ఇదే. ఈ నిరీక్షణతో దేవుడు ఈ క్రింది విధంగా చెప్పాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును: అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు: నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” ఈ సాధారణ వాక్యాలు దేవుని చిత్తాన్ని సూచిస్తాయి. తన హృదయమందు, దేవుడు మానవుని పట్ల శ్రద్ధ చూపటం ప్రారంభించాడని, కూడా అవి వెల్లడిస్తున్నాయి. అన్నిటిలోకెల్లా, ఆదాము మాత్రమే దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాడు; ఆదాము మాత్రమే దేవుని జీవ వాయువును కలిగి జీవిస్తున్న వాడు; అతడు దేవునితో నడవగలడు, దేవునితో సంభాషించగలడు. అందుకే దేవుడు అతనికి ఈ ఆజ్ఞను ఇచ్చాడు. మానవుడు ఏమి చేయగలడు మరియు ఏమి చేయలేడు అనే దానిని దేవుడు తన ఆజ్ఞలో ఎంతో స్పష్టంగా తెలియపరిచాడు.

ఈ కొన్ని సాధారణ వాక్యాలలో, దేవుని హృదయాన్ని చూస్తాము. అయితే ఎలాంటి హృదయము తనను తాను కనపరుచుకుంటుంది? దేవుని హృదయంలో ప్రేమ ఉన్నదా? శ్రద్ధ ఉన్నదా? ఈ వచనాల్లో, దేవుని ప్రేమ మరియు శ్రద్ధ అభినందించబడటమే కాదు, కానీ అన్యోన్యంగా ఉన్నట్టు కూడా భావించబడింది. మీరు ఒప్పుకోరా? నేను దీనిని చెప్పడం విన్న తర్వాత, మీరు ఇంకా వీటిని సాధారణమైన కొన్ని వాక్యాలు మాత్రమేనని అనుకుంటున్నారా? అవి అన్నిటికన్నా అనేంత సులభమైనవి కాదు, అవును కదా? మీకు దీని గురించి ముందే తెలుసా? ఒకవేళ దేవుడు ఈ కొన్ని వాక్యాలను నీకు వ్యక్తిగతంగా చెబితే, లోపల నీకు ఎలా అనిపిస్తుంది? ఒకవేళ నీవు మానవత్వం ఉన్న వ్యక్తివి కాకుండా, నీ హృదయము చల్లగా ఉంటే, అప్పుడు నీవు దేనిని అనుభూతి చెందవు, నీవు దేవుని ప్రేమను అభినందించలేవు, మరియు నీవు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు. కానీ మనస్సాక్షి మరియు మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిగా, నీవు వేరుగా భావిస్తావు. నీవు ఆత్మీయతను అనుభవిస్తావు, నీవు సంరక్షించబడ్డావనీ మరియు ప్రేమను పొందావనీ భావిస్తావు మరియు నీవు సంతోషాన్ని అనుభవిస్తావు. అది నిజం కాదా? నీవు సంగతులను అనుభవించినప్పుడు, నీవు దేవుని పట్ల ఎలా ప్రవర్తిస్తావు? నీవు దేవునితో అనుసంధానించబడినట్టుగా భావిస్తున్నావా? నీవు నీ హృదయపు లోతుల్లో నుండి దేవుని ప్రేమిస్తూ గౌరవిస్తావా? నీ హృదయము దేవునికి దగ్గరగా ఎదుగుతున్నదా? దేవుని ప్రేమ మానవునికి ఎంత ప్రాముఖ్యమో దీనిని బట్టి మీరు చూడవచ్చు. కానీ అత్యంత కీలకమైనది ఏమిటంటే, దేవుని ప్రేమ పట్ల మానవుని ప్రశంస మరియు అవగాహన. నిజానికి, దేవుడు తన కార్యపు ఈ దశలో ఇలాంటి విషయాలు చాలానే చెప్పలేదా? దేవుని హృదయాన్ని కొనియాడే ప్రజలు నేడు ఉన్నారా? ఇప్పుడు నేను మాట్లాడిన దేవుని చిత్తాన్ని మీరు గ్రహించగలరా? దేవుని చిత్తము ఇలా పటిష్టంగా, ప్రత్యక్షముగా, మరియు వాస్తవముగా ఉన్నప్పుడు మీరు దానిని నిజంగా అభినందించలేరు. అందుకనే మీకు దేవుని గురించిన వాస్తవ జ్ఞానం మరియు అవగాహన లేదని నేను అంటున్నాను. ఇది నిజం కాదా? అయితే ప్రస్తుతానికి మనం దాన్ని వదిలేద్దాం.

2. దేవుడు హవ్వను సృజించడం

ఆది 2:18-20 మరియు దేవుడైన యెహోవా—నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి; ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను: జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను; అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.

ఆది 2:22-23 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను, స్త్రీనిగా నిర్మించి, ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము: ఇది నరునిలోనుండి తీయబడెను, గనుక నారి అనబడును.

ఈ లేఖన భాగంలో ఒక కీలకమైన పంక్తి ఉన్నది: “జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో, ఆ పేరు దానికి కలిగెను.” కాబట్టి, జీవము గల వాటన్నిటికీ వాటి పేర్లను పెట్టింది ఎవరు? అది ఆదాము, దేవుడు కాదు. ఈ వాక్య భాగం మానవజాతికి ఒక వాస్తవాన్ని తెలియజేస్తుంది: దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన అతనికి తెలివిని ఇచ్చాడు. అంటే, మానవుని తెలివి దేవుని నుండి వచ్చినది. ఇది ఖచ్చితం. కానీ ఎందుకు? దేవుడు ఆదామును సృజించిన తరువాత, ఆదాము పాఠశాలకు వెళ్ళాడా? అతనికి ఎలా చదవాలో తెలుసా? దేవుడు జీవము గలిగిన వివిధ జీవులను చేసిన తర్వాత, ఆదాము ఈ జీవున్నిటిని గుర్తించాడా? వాటి పేర్లు ఏమిటో దేవుడు అతనికి చెప్పాడా? నిజానికి, ఈ జీవులకు పేర్లను ఎలా పెట్టాలో దేవుడు అతనికి బోధించలేదు. అది నిజం! మరి, జీవము గలిగిన జీవులన్నిటికీ వాటి పేర్లను ఎలా పెట్టాలో మరియు ఏరకమైన పేర్లు వాటికి పెట్టాలో ఆదాముకు ఎలా తెలుసు? ఇది దేవుడు ఆదామును సృజించినప్పుడు అతనికి ఏమి జోడించాడు అనే ప్రశ్నకు సంబంధించినది. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన తన తెలివితేటలను అతనికి జోడించాడని వాస్తవాలు రుజువు చేస్తున్నాయి. ఇది కీలక అంశం, కాబట్టి జాగ్రత్తగా వినాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక కీలక అంశం కూడా ఉంది: ఆదాము జీవము కలిగిన జీవులన్నిటికీ వాటి పేర్లను పెట్టిన తర్వాత, ఆ పేర్లు దేవుని నిఘంటువులో స్థిరపరచబడ్డాయి. దీనిని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఎందుకంటే, దీనిలో దేవుని స్వభావము కూడా ఇమిడి ఉన్నది, మరియు ఇది నేను మరి ఎక్కువగా వివరించాల్సిన అంశము.

దేవుడు మానవుని సృజించి, అతనిలో జీవవాయువును ఊది, అయన తెలివితేటలు, ఆయన శక్తి సామర్థ్యాలు, మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడో మరియు ఏమై ఉన్నాడో దానిని నుండి కూడా కొంత అతనికి ఇచ్చాడు. దేవుడు మానవునికి ఇవన్నీ ఇచ్చిన తరువాత, మానవుడు స్వతంత్రంగా కొన్ని పనులను చేయగలుగుతూ తనంతట తానుగా ఆలోచించగలిగాడు. ఒకవేళ మానవుడు ఆలోచించేది మరియు చేసేది దేవుని దృష్టిలో మంచిదైతే, అప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడు మరియు జోక్యం చేసుకోడు. మానవుడు చేసేది సరైనదైతే, దేవుడు దానిని నిలబెడతాడు. అయితే, “జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను” అనే వాక్యము దేనిని సూచిస్తుంది? జీవము కలిగిన వివిధ జీవులకు పెట్టబడిన పేర్లలో దేనినైనా తగినట్టు మార్చడానికి దేవుడు చూడలేదని ఇది సూచిస్తుంది. ఒక జీవిని ఆదాము ఏ పేరుతో పిలిచాడో, ఆ జీవి పేరును ధృవీకరిస్తూ, దేవుడు “అలా కలుగును గాక” అని చెప్తాడు. ఆ విషయం గురించి దేవుడు ఏమైనా అభిప్రాయాన్ని వ్యక్త పరచాడా? లేదు, ఆయన కచ్చితంగా చేయలేదు. కాబట్టి, దీని నుండి మీరు ఏమి గ్రహిస్తారు? దేవుడు మానవునికి తెలివిని ఇచ్చాడు మరియు మానవుడు తనకు దేవుడిచ్చిన తెలివిని పనులను చేయడానికి ఉపయోగించాడు. ఒకవేళ మానవుడు చేసేది దేవుని దృష్టిలో సానుకూలంగా ఉంటే, అప్పుడది ఎలాంటి తీర్పు లేదా విమర్శ లేకుండా, అది ధృవీకరించబడి, గుర్తించబడి, అంగీకరించబడుతుంది. ఇది ఏ వ్యక్తి, లేదా దురాత్మ లేదా సాతాను చేయలేని పని. ఇక్కడ దేవుని స్వభావపు ప్రత్యక్షతను మీరు చూస్తున్నారా? ఒక మానవుడు, ఒక చెడిపోయిన వ్యక్తి, లేదా సాతాను, వారి నామములో ఎవరినైనా ఏదైనా వారు చేయలేని దానిని, చేయడానికి అనుమతిస్తారా? అసలు కానే కాదు! ఈ స్థానం కోసం ఆ ఇంకో వ్యక్తితో లేదా వారికి విభిన్నమైన మరో శక్తితో వారు పోరాడతారా? నిజంగా వారు చేస్తారు! అది ఒకవేళ ఆ సమయంలో ఆదాముతో పాటు ఉన్న ఒక చెడిపోయిన వ్యక్తి లేక సాతాను అయితే, ఆదాము చేస్తున్న దానిని వారు ఖచ్చితంగా తిరస్కరించేవారు. వారు స్వతంత్రంగా ఆలోచించగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారని మరియు వారు ప్రత్యేకమైన సొంత వివేచనను కలిగి ఉన్నారని నిరూపించడానికి, ఆదాము చేసిన ప్రతి దానిని వారు సంపూర్ణంగా తిరస్కరించారు: “నీవు దీన్ని ఇలా పిలవాలనుకుంటున్నావా? సరే, నేను దీన్ని ఇలా పిలవను, నేను దాన్ని అలా పిలుస్తాను; నీవు దాన్ని టామ్ అని పిలిచావు అయితే నేను దీన్ని హ్యారీ అని పిలుస్తాను. నేను ఎంత తెలివైనవాడినో చూపించాలి.” ఇది ఎలాంటి స్వభావము? ఇది క్రూరమైన అహంకారము కాదా? మరి దేవుని సంగతేంటి? ఆయన అలాంటి స్వభావము కలిగి ఉన్నాడా? ఆదాము చేస్తున్న దాని పట్ల దేవునికి అసాధారణమైన అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? సమాధానము నిస్సందేహంగా లేదు అని! దేవుడు వెల్లడి పరిచే స్వభావములో, వితండవాదం, అహంకారం లేదా స్వనీతి సూచన కాస్త కూడా లేదు. అంత మట్టుకు ఇక్కడ స్పష్టమయింది. ఇది చిన్న విషయముగా కనిపించవచ్చు కానీ, నీవు దేవుని మనస్సును అర్థం చేసుకోకపోతే, దేవుడు ఎలా వ్యవహరిస్తాడో మరియు దేవుని వైఖరి ఏమిటో గుర్తించడానికి నీ హృదయము ప్రయత్నించకపోతే, అప్పుడు నీవు దేవుని స్వభావాన్ని తెలుసుకోలేవు లేదా ఆయన స్వభావపు ప్రత్యక్షతను మరియు వ్యక్తీకరణను చూడలేవు. అది అలా కాదా? నేనిప్పుడు మీకు వివరించిన దానితో మీరు ఏకీభవిస్తారా? ఆదాము చర్యలకు ప్రతిస్పందనగా, “నీవు బాగా చేసావు, నీవు సరిగ్గా జరిగించావు, నేను ఒప్పుకుంటున్నాను!” అని దేవుడు గొప్పగా ప్రకటించలేదు. అయితే, ఆయన హృదయంలో, ఆదాము చేసిన దానిని, దేవుడు ఆమోదించాడు, అభినందించాడు, మరియు మెచ్చుకున్నాడు. సృష్టి తర్వాత ఆయన ఆదేశానుసారం దేవుని కొరకు మానవుడు చేసిన మొదటి పని ఇదే. ఇది దేవుని స్థానములో మరియు దేవుని తరఫున మానవుడు చేసిన పని. దేవుని దృష్టిలో, ఆయన మానవునికి అనుగ్రహించిన తెలివి నుండి ఇది ఉద్భవించింది. ఇది ఒక మంచి సంగతిగా, ఒక సానుకూలమైన విషయంగా దేవుడు చూశాడు. ఆ కాలంలో ఆదాము ఏమి చేశాడనేది మానవునిలో ఉన్న దేవుని తెలివికి మొదటి సాక్షాత్కారముగా ఉన్నది. ఇది దేవుని దృష్టిలో ఒక చక్కని సాక్షాత్కారము. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఏమై ఉన్నాడో మరియు ఆయన కలిగియున్న దానిలో కొంత భాగాన్ని మానవునికి అందించి తద్వారా మానవజాతి ఆయనను ప్రత్యక్ష పరిచే జీవము గల ఒక జీవిగా ఉండాలనేది దేవుని లక్ష్యము. అలాంటి జీవము గల జీవి ఆయన తరపున పని చేయడాన్ని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు.

3. దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించాడు

ఆది 3:20-21 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.

ఆదాము హవ్వకు పెట్టిన పేరు వెనుక వాస్తవ ఉద్దేశం ఉన్నట్లు కనుపరిచే, ఈ మూడవ వాఖ్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదాము సృజించబడిన తరువాత, స్వతహాగా తాను ఉద్దేశాలను కలిగి అనేక సంగతులను అవహగన చేసుకున్నట్లుగా ఇది కనుపరుస్తుంది. అయితే ఇప్పటికి, మూడవ భాగము గురించిన చర్చలో అతడు ఏమి గ్రహించాడో లేక ఎంత మాత్రం గ్రహించాడో అనేది నా ప్రధాన లక్ష్యం కాదు కాబట్టి, దాని గురించి మనం అధ్యయనమో లేదా పరిశీలనో చేయబోవడం లేదు. అయితే మరి, నేను ఎత్తి చుపాలనుకుంటున్న ముఖ్యాంశం ఏమై ఉంటుంది? “దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, వారికి తొడిగించెను,” అనే వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈనాటి మన సహవాసంలో ఒకవేళ మనం ఈ లేఖన పంక్తిని గురించి విచారణ చేయనట్లైతే, ఈ వాక్యాలను గుర్చిన లోతైన అంతర్భావాలను మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ముందుగా, నేను కొన్ని ఆధారాలు ఇస్తాను. కావాలంటే మీరు, ఏదేను తోట, అందులో ఆదాము హవ్వలు నివసిస్తున్నట్లు, ఊహించుకోండి. దేవుడు వారి చూడటానికి వెళ్తాడు, కానీ వారు దిగంబరులైనందున దాగుకుంటారు. దేవుడు వారిని కనుగొనలేక, ఆయన వారిని పిలిచిన తరువాత, “మా దేహాలు దిగంబరముగా ఉన్నందున మేము నీకు కనపడటానికి సాహసించలేము” అని అంటారు. వారు దిగంబరులుగా ఉన్న కారణాన్ని బట్టి వారు దేవునికి కనబడే సాహసం చేయలేరు. అయితే మరి, దేవుడైన యెహోవా వారి పట్ల ఏమి చేస్తాడు? “దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, వారికి తొడిగించెను” అని మూల వాక్యము చెప్తుంది. దీన్ని బట్టి, దేవుడు వారి వస్త్రాలు తయారుచేయడానికి ఏమి ఉపయోగించాడో మీరు గ్రహించారా? దేవుడు వారికి వస్త్రాలు చేయడానికి జంతు చర్మాలను వాడుకున్నాడు. చెప్పాలంటే, మానవవునికి వస్త్రాలుగా ధరింపజేయడానికి దేవుడు ఉన్నితో అంగీలను చేశాడు. మానవుని కొరకు దేవుడు తయారుచేసిన మొదటి వస్త్రాలు ఇవే. ఈనాటి ప్రమాణాలను బట్టి చూస్తే వెంట్రుకలతో నేసిన అంగీ అనేది ఒక విలాసవంతమైన వస్తువు మరియు ధరించడానికి అందరూ కొనగలిగేది కాదు. ఒకవేళ ఎవరైనా నిన్ను ఇలా అడిగితే: మన పితరులు ధరించిన ప్రధమ వస్త్రాలు ఏమిటి? అది ఒక వెంట్రుకల అంగీ అని నీవు సమాధానమియ్యవచ్చు. ఈ వెంట్రుకల అంగీని తయారుచేసింది ఎవరు? దానిని చేసింది దేవుడే అని నీవు జవాబివ్వచ్చు! ఇక్కడ ఈ వస్తాలు దేవుడే తయారు చేశాడన్నది ప్రాముఖ్యమైన అంశముగా ఉన్నది. మరి అది చర్చించదగిన అంశము కాదా? నేను వర్ణించడాన్ని వినిన తరువాత, మీ మనస్సులో ప్రతిరూపము ఏమైనా ఆవిర్భవించిందా? కనీసం మీరు ఒక స్థూల సారాంశ నివేదికనైనా కలిగి ఉండవలసి ఉన్నది. నేడు మీతో మాట్లాడే ఈ అంశాన్ని వలన మానవుని మొదటి వస్త్రాలు ఏమైయున్నాయో మీకు తెలుస్తుందని కాదు. మరైతే, ఆ అంశము, ఏమై ఉంటుంది? ఇక్కడ అంశము వెంట్రుకల అంగీ గురించి కాదు, కానీ—ఆయన ఇక్కడ చేసిన దానిలో దేవుడు బయలుపరచినట్లుగా—ఆయన స్వభావము, ఆయన కలిగియున్న దానిని, మరియు ఆయన ఏమైయున్నాడో అనేదాని గురించి—ప్రజలు ఎలా తెలుసుకుంటారానేదే అంశమై యున్నది.

“దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, వారికి తొడిగించెను.” ఈ సన్నివేశంలో, దేవుడు ఆదాము హవ్వలతో కూడా ఉన్నప్పుడు ఏ రకమైన రూపాన్ని ధరించినట్లు మనకు కనబడుతుంది? ఇరువురు మ్రాత్రమే ఉన్న ఈ ప్రపంచంలో, దేవుడు తనను తాను ఏ విధంగా కనుపరచుకుంటాడు? దేవుని రూపంలో ఆయన తనను తాను కనుపరచుకుంటాడా? హాంగ్ కాంగ్‌కు చెందిన సహోదర సహోదరీలూ, దయచేసి సమాధానమివ్వాలి. (ఒక తండ్రి రూపంలో.) దక్షిణ కొరియాకు చెందిన సహోదర సహోదరీలు, దేవుడు ఎటువంటి రూపంలో కనబడతాడని మీరు అనుకుంటున్నారు? (కుటుంబ యజమాని.) తైవాన్‌కు చెందిన సహోదర సహోదరీలు, మీరు ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? (ఆదాము హవ్వల కుటుంబములో ఒకరి పాత్రయైన, ఒక కుటుంబ సభ్యుని పాత్ర.) మీలో కొంతమంది దేవుడు ఆదాము హవ్వల కుటుంబములో ఒక సభ్యునిగా ప్రత్యక్షమవుతాడని అనుకుంటారు, మరికొందరైతే దేవుడు ఆదాము హవ్వల కుటుంబానికి యజమానిగానో ఇంకొందరు ఒక తండ్రిగానో ప్రత్యక్షమవుతాడని చెప్తారు. ఇవన్నీ చాలావరకు సరైయైనవే. అయితే నేనేమి అందుకుంటున్నానో మీరు గమనిస్తున్నారా? ఈ ఇరువురు వ్యక్తులను దేవుడే సృజించి, ఆయన వారి పట్ల తోటివారిగా ప్రవర్తించాడు. వారిని మాత్రమే కుటుంబమని ఎంచి, దేవుడు వారి బ్రతుకులకు సంరక్షణ మరియు వారికి ఆహారము, వస్త్రాలను మరియు ఇంటి అవసరతలను సమకూర్చాడు. ఇక్కడ, దేవుడు ఆదాము హవ్వల తండ్రిగా కనబడతాడు. దేవుడు దీనిని చేసినప్పుడు, దేవుడు ఎంత శ్రేష్టమైన వాడని మానవుడు చూడలేదు; దేవుని సర్వాధికారాన్ని గానీ, ఆయన మర్మాన్ని గానీ, మరీముఖ్యంగా ఆయన ఉగ్రత లేక ప్రభావాన్ని గానీ అతడు చూడలేదు. అతడు చూసేదల్లా, దేవుని విధేయత, ఆయన అనురాగము, మానవునిపై ఆయనకున్న శ్రద్ధ మరియు అతడి పట్ల ఆయనకున్న బాధ్యత మరియు జాగ్రత్తయైయున్నది. దేవుడు ఆదాము హవ్వల పట్ల ప్రవర్తించిన తీరు అనేది తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఎంతగా శ్రద్దను కనుపరుస్తారో అందుకు తగినట్టుగా ఉన్నది. ఇది కూడా తల్లిదండ్రులు స్వంత కుమారులను కుమార్తెలను నిజముగా, స్పష్టముగా మరియు ప్రత్యక్షంగా, ప్రేమించి, సంరక్షించి జాగ్రత్త కలిగియుండటం లాంటిదే. తనను తాను ఆధిక్యమైన గొప్ప స్థితికి హెచ్చించుకోడానికి బదులుగా, మనిషికి వస్త్రాలు తయారు చేయడానికి దేవుడు వ్యక్తిగతంగా చర్మాలను వాడాడు. ఈ వెంట్రుకల అంగీ వారి మానాన్ని దాచడానికో లేక చలి నుండి వారిని కాపాడడానికో ఉపయోగించబడిందా అనేది విషయమే కాదు. అయితే ఈ వస్త్రాలను మానవుని దేహాన్ని కప్పడానికి దేవుడే వ్యక్తిగతంగా తన స్వహస్తాలతో తయారు చేశాడనేదే అస్సలు విషయమై ఉన్నది. ప్రజలు అనుకున్నట్లు, వస్త్రాల వాస్తవ స్థితిని లేదా ఆశ్చర్యకరమైన ఇతర విధానాల అవలంబన అనేది దేవుడు మాత్రమే చేస్తాడని ఆలోచించకుండా, దేవుడు చేయడు, చేయకూడదని మానవుడు అనుకున్న దానిని దేవుడే న్యాయబద్ధంగా జరిగించాడు. ఇదొక సామాన్యమైన విషయంగా కనపడొచ్చు— కొందరు వ్యక్తులైతే ఇది పేర్కొనదగినదని కూడా భావించకపోవచ్చు—అయితే అది దేవుని పట్ల చంచలమైన అభిప్రాయాలతో ఆవరించబడిన ఆయన అనుచరుడు ఆయన యధార్ధత మరియు మనోహరతలను గూర్చిన వివేకాన్ని పొంది, ఆయన విశ్వాస విధేయతలను చూడటానికి వీలును కల్పిస్తుంది. అది తామే గొప్పవారనీ మరియు బలవంతులనీ భావించే మహా దురహంకార ప్రజలను దేవుని యధార్ధత విధేయతల ఎదుట అవమానముతో వారి తలలను వంచుకునేలా చేస్తుంది. ఇక్కడ, దేవుని యధార్ధత విధేయతలనేవి ఆయన ఎంతటి ప్రేమామయుడో ప్రజలు తెలుసుకోడానికి మరింత దోహదపడతాయి. ప్రతిగా, “ఎల్లలులేని” దేవుడు, “ప్రేమామయుడైన” దేవుడు మరియు “సర్వశక్తిమంతుడైన” దేవుడు పేరుతో ప్రజలు తమ హృదయాలలో అంటిపెట్టుకుని ఉన్న దేవుడు నిరర్ధకంగా, అసహ్యంగా మారిపోయి, కొద్దిపాటి తాకిడికే కుప్పకూలిపోతాడు. నీవు ఈ వాక్యాన్ని చూసి ఈ కథనాన్ని విన్నప్పుడు, దేవుడు అటువంటి ఒక పనిని చేశాడని నీవేమైనా ఆయనను చులకనగా చూస్తున్నావా? కొంతమంది అలా ఉండొచ్చేమో, కానీ మిగిలిన వారు అందుకు విరుద్దమైన ప్రతిస్పందనలు కలిగి ఉంటారు. దేవుడు యదార్ధమైనవాడు మరియు ప్రేమమయుడని, నిశ్చయంగా దేవుని యధార్ధత మరియు మనోహరత్వమే తమను నడిపిస్తుందని వారు అనుకుంటారు. వారు దేవుని నిజ స్వరూపాన్ని చూసే కొలది, నిజమైన దేవుని ప్రేమ అస్తిత్వాన్ని, తమ హృదయాల్లోని దేవుని ప్రాధాన్యతను, మరియు అనుక్షణం ఆయన వారి పక్షాన నిలిచే తీరును వారు అంతగా కొనియాడతారు.

ఇప్పుడు, మన చర్చను ప్రస్తుతానికి అన్వయించి చూద్దాం. ఆదిలో దేవుడు తాను సృజించిన ప్రజలకోసం పలువిధాలైన ఈ చిన్న పనులను, ప్రజలు ఎన్నడూ ఆలోచించడానికి లేక ఆశించడానికి సాహసించని పనులను సైతం చేయగలిగినప్పుడు, మరి నేటి ప్రజల కోసం దేవుడు అటువంటి పనిలు చేస్తాడా? కొంతమంది, “అవును” అంటారు! మరి అలా ఎందుకు? ఎందుకనగా దేవుని గుణము కపటమైనది కాదు, మరియు ఆయన మనోహరత్వము కల్పితము కాదు. దేవుని గుణము అనేది నిజముగా ఉన్నది, వేరేవాళ్ళ చేత కల్పించబడింది కాదు, మరియు పలు కాలాలు, ప్రదేశాలను మరియు యుగాలను బట్టి మారేదైతే ఖచ్చితంగా కాదు. సాధారణమైనది మరియు నిరర్ధకమైనది అని ప్రజలు అనుకునే ఏదైనా పనిని—దేవుడు దీనిని కూడా చేస్తాడని ఊహించలేనంత పనికిమాలిన పనిని చేయడం ద్వారా మాత్రమే ఆయన యధార్ధతను మరియు మనోహరత్వాన్ని నిజంగా బయట పెట్టవచ్చు. దేవుడు గొప్పలు చెప్పుకునే వాడు కాదు. ఆయన మనోవైఖరిలో మరియు గుణములో ఎటువంటి అతిశయము, వేషధారణ, గర్వము లేక అహంకారమనేది లేదు. ఆయన ఎన్నడూ అతిశయించువాడు కాదు, కానీ ప్రతిగా తాను సృజించిన మనుష్యులను విశ్వసనీయత, నిజాయితీలతో ప్రేమిస్తాడు, శ్రద్ధను కనుపరుస్తాడు, సంరక్షిస్తూ, నడిపిస్తాడు. దేవుడు చేసిన దానిని చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే అభినందించినప్పటికీ, అనుభవించినప్పటికీ, లేక కనుగొన్నప్పటికీ, ఆయన నిశ్చయంగా దానిని చేస్తూనే ఉన్నాడు. దేవుడు అటువంటి గుణాన్ని కలిగియున్నాడని తెలుసుకోవడమనేది ఆయన యెడల ప్రజలకున్న ప్రేమపై ప్రభావం చూపుతుందా? దేవుని పట్ల వారు కలిగియున్న భయాన్ని అదేమైనా ప్రభావితం చేస్తుందా? నీవు దేవుని నిజ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, నీవు ఆయనకు ఇంకా సన్నిహితమై మానవజాతి పట్ల ఆయన కలిగియున్న ప్రేమ మరియు శ్రద్దను చాలా మనస్పూర్తిగా అభినందిస్తావనీ, అలాగే నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయనను గూర్చిన సంశయాలు సందిగ్దతల నుండి విడుదల పొందుతావనీ నేను ఆశిస్తున్నాను. దేవుడు మానవుని కొరకు ప్రతిదాన్ని నిమ్మళంగా జరిగిస్తున్నాడు, తన యధార్ధత, విశ్వసనీయత మరియు ప్రేమ ద్వారా అన్నిటినీ మౌనంగా చేస్తున్నాడు. అయితే, ఆయన చేసే దేని పట్లయినా తనకు ఎలాంటి చింత లేక విచారము ఉండదు, అలాగే ఎవరైనా ఏదోరకంగా ఆయనకు తిరిగి చెల్లించవలసిన అవసరము లేదు లేక మానవాళి నుండి ఏదైనా పుచ్చుకోవాలనే ఉద్దేశాలు ఎన్నడూ ఆయనకు లేవు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతిదానిని బట్టి మానవాళి నిజ విశ్వాసాన్ని మరియు ప్రేమను పొందాలన్నదే ఆయన కలిగియున్న ఏకైక ఉద్దేశమైయున్నది. ఇక్కడితో, మొదటి అంశాన్ని నేను ముగిస్తున్నాను.

ఈ చర్చలేమైనా మీకు సహాయపడ్డాయా? ఎంత వరకు అవి దోహదపడ్డాయి? (దేవుని ప్రేమను గూర్చిన గ్రహింపు మరియు జ్ఞాననము మనకు చాలానే ఉన్నది.) (దేవుని వాక్యాన్ని చక్కగా అభినందించడానికి, ఆయన కలిగియున్న మనోభావాలను మరియు ఆయన చెప్పిన సంగతులు వాటిని చెప్పినప్పటి నేపథ్య భావాలను గ్రహించడానికి, ఆ సమయంలో ఆయనేమి అనుభూతి చెందాడో తెలుసుకోడానికి ఈ సహవాసపు విధానమనేది మనకు దోహదపడగలుగుతుంది.) ఈ వాక్యాలు చదివాక, మీలో ఎవరికైనా దేవుని వాస్తవికమైన అస్థిత్వము గురించి మరింత లోతైన అవగాహన కలిగిందా? ఇకపై దేవుని అస్తిత్వమనేది శున్యంగానో లేక సందిగ్ధంగానో ఉండదని మీరు అనుకుంటున్నారా? మీకు గనుక ఒకసారి ఇలా అనిపించిందంటే, దేవుడు సరిగ్గా మీ పక్షానే ఉన్నాడని అర్ధం చేసుకున్నారా? బహుశా ఇప్పటికిప్పుడు అంటే ఉద్రేకమనేది ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు, లేక ఇప్పటికింకా మీరు దానిని అనుభవించలేకపోయి ఉండవచ్చు. అయితే ఒకానొక దినాన, మనస్పూర్తిగా మీరు మీ హృదయాల్లో దేవుని స్వభావము మరియు గుణము పట్ల ఒక గాంభీర్యమైన అభినందన మరియు వాస్తవ జ్ఞానాన్ని కలిగినప్పుడు, సరిగ్గా దేవుడు నీ పక్షానే ఉన్నాడని నీవు తెలుసుకుంటావు—నీవు మాత్రం దేవునిని యధార్ధముగా నీ హృదయంలోకి ఎప్పుడూ ఆహ్వానించలేదు. అదే సత్యం!

సహవాసానికి సబంధించిన ఈ పద్దతి గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? మీరు కొనసాగగలరా? దేవుని కార్యము మరియు దేవుని స్వభావము అనే అంశము మీద ఈ విధమైన కూడిక చాలా భారంగా ఉంటుందని మీరేమైనా అనుకుంటున్నారా? మీరెలా భావిస్తున్నారు? (చాలా బాగుంది, ఉత్సాహంగా ఉన్నది) బాగుందని మీకు అనిపించేలా చేసింది ఏమిటి? మీరెందుకు ప్రేరేపితులయ్యారు? (ఇది ఏదేను తోటకి తిరిగి చేరుకోవడం, తిరిగి దేవుని వైపునే ఉండటం లాగా ఉందని.) వాస్తవానికి “దేవుని స్వాభావికత” అనేది ప్రజలకు కొంతమేర పరిచయం లేని ఒక అంశమైయున్నది, ఎందుకనగా సాధారణంగా మీరు ఊహించుకునేది, మీరు పుస్తకాలలో చదివేది లేక కూడికల్లో వినేది, ఒక గుడ్డివాడు ఏనుగును తాకుతునట్టు కాస్త నీవు అనుభూతి చెందడానికి దారితీస్తుంది—మీరు మీ చేతులతో తాకుతున్నట్లు మాత్రమే అనుకుంటారు, కాని నిజానికి మీరు దేనినీ దృశ్య భావన పొందలేరు. గుడ్డిగా చుట్టూ తడుముకోవడం అనేది నీకు దేవుని గూర్చి ఒక మాదిరి గ్రహింపునైనా ఇవ్వలేదు, ఆయనను గుర్చిన ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని విడిచిపెట్టండి; అది కేవలం నీ ఊహగానాన్ని ఇంకా పురికొల్పి, దేవుని స్వభావము మరియు గుణాన్ని గూర్చి సరిగ్గా అర్ధ నిర్ధారణ చేయకుండా నిరోధిస్తుంది, మరియు మీ ఊహాగానం నుండి ఉద్భవించే అపోహలు నీ హృదయాన్ని ఎప్పుడూ సందేహాలతో ముంచెత్తుతాయి. ఏదైనా విషయం పట్ల నీవు నిశ్చయత కలిగి లేకపోయినప్పటికీ, దానిని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నీ హృదయంలో ప్రతివాదాలు మరియు పోరాటాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, మరియు భంగం కలిగించిదన్న ఒక భావన కూడా, నిన్ను అయోయానికి మరియు కలవరానికి గురిచేస్తాయి. దేవుడిని అనుసరించాలనీ, దేవునిని తెలుసుకోవాలనీ, మరియు ఆయను స్పష్టంగా చూడాలనీ ఆశపడినప్పటికీ, జవాబులు ఎన్నటికీ కనుగొనలేకపోతున్నట్లు అనిపించడమనేది బాదపెట్టే విషయం కాదా? నిజానికి, ఈ మాటలు దేవునిని భయభక్తులతో అనుసరించి, తృప్తిపరచాలనే ఆశ కలిగిన వారిపైకి మాత్రమే ఎక్కుపెట్టబడ్డాయి. ఇటువంటి విషయాలను పట్టించుకోని ప్రజలకు ఇది అస్సలు విషయమే కాదు, ఎందుకనగా వారు దేవుని ప్రామాణికత మరియు అస్తిత్వం అనువాటిని ఒక చరిత్రగానో లేక ఊహానుభూతిగానో మాత్రమే ఉండాలని కోరుకుంటారు, కాబట్టి వారికిష్టమోచ్చినట్లు వారు చేస్తారు, కాబట్టి వారు అతిపెద్దవారిగానో లేక బహు ప్రాముఖ్యమైనవారిగానో ఉండొచ్చు, కాబట్టి వారు ఫలితార్ధాలను లేక్కచేయకుండానే దుర్మార్గపు క్రియలకు పాల్పడవచ్చు, కాబట్టి వారికి శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరమో లేక ఏదైనా బాధ్యత వహించాల్సిన అవసరమో ఉండదు, దీన్నిబట్టి దుర్మార్గులను గూర్చి దేవుడు చెప్పిన సంగతులు సైతం వారికి వర్తించవు. ఇటువంటి ప్రజలు దేవుని స్వాభావికతను తెలుసుకోడానికి ఇష్టపడరు. వారు దేవుడు మరియు ఆయనను గూర్చిన సమస్తాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించి విసిగి వేసారిపోయారు. దేవుడు లేడన్న దానికే వారు మొగ్గుచుపుతారు. ఈ వ్యక్తులు దేవుణ్ణి ప్రతిఘటిస్తారు, మరియు వెళ్ళగొట్టబడే వారిలో వీరు కుడా ఉంటారు.

తరువాత, నోవహు కథనము మరియు దేవుని కార్యమనే అంశముతో అది ఎలా ముడిపడి ఉందన్న దాని గురించి, దేవుని స్వభావం గురించి మరియు స్వయంభవుడైన దేవుణ్ణి గురించి మనము చర్చించనున్నాము.

లేఖనాల్లోని ఈ భాగంలో నోవహు పట్ల దేవుడు ఏమి చేస్తున్నాడని మీరు చుస్తున్నారు? ఇక్కడ కూర్చున్న అందరికీ బహుశా లేఖనాలను చదవడాన్ని బట్టి: నోవహును ఓడను నిర్మించేలా చేసి, తరువాత దేవుడు జలప్రళయము ద్వారా లోకాన్ని నాశనం చేశాడన్న దాని గురించి కొంతమేర తెలిసి ఉండవచ్చు. నోవహు ఎనిమిది మందితో కూడిన తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఓడను నిర్మించి, అది వారు బ్రతికి మానవజాతి తదుపరి తరానికి పితరులుగా ఉండటానికి దేవుడు అనుమతించాడు. మనమిప్పుడు లేఖనాన్ని చూద్దాం.

బి. నోవహు

1. జలప్రళయముతో దేవుడు లోకాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశించి నోవహును ఓడను నిర్మించాల్సిందిగా నిర్దేశించాడు

ఆది 6:9-14 నోవహు వంశావళి యిదే: నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది; గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో, వారిని భూమితోకూడ నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.

ఆది 6:18-22 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతో కూడ నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును, ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

ఈ భాగాలను చదివిన తరువాత నోవహు ఎవరనే దాని గురించి మీకు ఒక సాధారణ అవగాహన కలిగిందా? నోవహు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడు? మూల వాక్యము: “అతని తరములలో నోవహు నీతిమంతుడు మరియు నిందారహితుడు” అని ఉన్నది. ఆధునిక ప్రజలు అర్ధం చేసుకున్నదాన్ని బట్టి, ఆ దినాలలో ఎటువంటి వ్యక్తి నీతిమంతుడు” అయ్యుంటాడు? ఒక నీతిమంతుడు తప్పనిసరిగా నిందారహితుడై ఉండాలి. ఈ నిందారహితుడు మానవ దృష్టిలో నిందారహితుడా, లేక దేవుని దృష్టిలో నిందారహితుడా అన్నది మీరేమైనా తెలుసుకున్నారా? నిస్సంకోచంగా, ఈ నిందారహితుడు దేవుని దృష్టిలో నిందారహితుడే, కానీ మానవుల దృష్టిలో మాత్రం కాదు. ఇది నిశ్చయమై ఉన్నది! మానవుడు అంధుడై, చూడలేకపోవడం ఇందుకు కారణమై ఉన్నది, దేవుడు మాత్రమే సమస్త భూగోళాన్ని మరియు ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తాడు, మరియు దేవుడు మాత్రమే నోవహు నిందారహితుడని ఎరిగియున్నాడు. కావున, ఆయన నోవహును పిలిచిన క్షణం నుండే జలప్రళయంతో లోకాన్ని నాశనం చేయాలన్న దేవుని ప్రణాళిక మొదలైంది.

ఆ యుగంలో, చాలా ప్రాముఖ్యమైన పనిని చేయడానికి దేవుడు నోవహును పిలవాలని ఉద్దేశించాడు. ఈ కార్యాన్ని ఎందుకు జరిగించవలసి వచ్చింది? ఎందుకంటే, ఆ క్షణంలో దేవుడు తన హృదయంలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. జల ప్రళయంతో లోకాన్ని నాశనం చేయాలన్నదే ఆయన ప్రణాళికయై ఉన్నది. ఎందుకు ఆయన లోకాన్ని నాశనం చెయ్యాలి? ఇక్కడ సెలవిచ్చినట్లు: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” “భూలోకము బలాత్కారముతో నిండియుండెను” అన్న వాక్యం నుండి మీరేమి సంగ్రహించారు? ఇది భూమి మీద లోకము దాని జనము ఘోరమైన చెడుతనానికి ఒడిగట్టిన ఒక ఉత్పాతమై ఉన్నది: కాబట్టే, “భూలోకము బలాత్కారముతో నిండియున్నది.” నేటి వ్యవహారిక భాషలో చెప్పాలంటే, “భూలోకము బలాత్కారముతో నిండియున్నది” అంటే మొత్తం వికృతమై పోయిందని భావం. మానవునికి, జీవితపు ప్రతి దశలో క్రమబద్ధమైన సాదృశ్యతలన్నీ పోగొట్టుకుని, ప్రతిదీ గందరగోళంగా మరియు అదుపు చేయలేనిదిగా మారిపోయిందనేది దీని అర్ధమై ఉన్నది. దేవుని దృష్టిలో, లోక ప్రజలందరూ చాలా చెడిపోయారనేది దీని అర్ధమై ఉన్నది. అయితే చెడుతనము ఏ మేర వరకు ఉంది? దేవుడు వారిని చూసి తట్టుకోలేనంత లేక సహించలేనంత మేర చెడుతనానికి పాల్పడ్డారు. దేవుడు వారిని నాశనం చేయాలని ఉద్దేశించే స్థాయి చెడుతనానికి ఒడిగట్టారు. దేవుడు లోకాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నప్పుడు, ఒక ఓడను కట్టడానికి ఎవరో ఒకరిని కనుగొనాలని దేవుడు భావించాడు. దేవుడు ఈ కార్యాన్ని నిర్వహించడానికి నోవహును ఏర్పరచుకున్నాడు; అంటే, ఆయన నోవహు చేత ఓడను నిర్మింపజేశాడు. ఆయన నోవహునే ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని దృష్టిలో, నోవహు ఒక నీతిమంతుడుగా ఉన్నాడు; దేవుడు ఏదైతే సూచించాడో, నోవహు ఆలాగే చేశాడు. చెప్పాలంటే, దేవుడు చెప్పిన ప్రతిదానిని చేయడానికి నోవహు సిద్దపడ్డాడు. దేవుడు తనతో పాటు కార్యము జరిగించి, తాను అప్పగించిన దానిని నెరవేర్చడానికి—భూమి మీద తన కార్యాన్ని సంపూర్తి చేయడానికి ఇటువంటి వ్యక్తిని కనుగొనాలనుకున్నాడు. అప్పట్లో, నోవహు కాకుండా అటువంటి కార్యాన్ని సంపూర్తి చేయగలిగే వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? ఖచ్చితంగా లేరు! దేవుడు అప్పగించిన దానిని నెరవేర్చగలిగే ఒకేఒక వ్యక్తి, పనిమంతుడు నోవహు మాత్రమే, కాబట్టే దేవుడు అతడిని ఎంచుకున్నాడు. అయితే, దేవుడు ప్రజలను రక్షించే అవధులు మరియు ప్రామాణికాలు అప్పుడున్న లాగానే ఇప్పుడూ ఉన్నాయా? ఖచ్చితంగా ఒక వ్యత్యాసం ఉన్నదనేదే దీనికి సమాధానం! మరి నేనెందుకు ఇలా అడుగుతున్నాను? ఆ కాలంలో దేవుని దృష్టిలో నోవహు ఒక్కడే నీతిమంతునిగా ఉన్నాడంటే, అది తన భార్య లేక తన కుమారులు కోడళ్ళలో ఎవరూ నీతిమంతులు కారని తెలియజేస్తుంది, అయితే అప్పటికీ నోవహును బట్టే దేవుడు వారిని మన్నించాడు. దేవుడు ప్రస్తుతం చేసినట్లుగా వారి మీద ఆక్షేపణలు చేయకపోవడమే, కాకుండా ఎనిమిది మంది నోవహు కుటుంబ సభ్యులందరినీ బ్రతికించాడు. నోవహు నీతిని బట్టి వారు దేవుని దీవెనలను పొందుకున్నారు. నోవహు లేకపోతే, దేవుడు అప్పగించిన దానిని వారిలో ఎవరూ నెరవేర్చే వారు కాదు. దీన్నిబట్టి, లోక వినాశనం నుండి తప్పించుకోవాల్సిన ఒకేఒక వ్యక్తి నోవహు అయితే, మిగిలిన వారు కేవలం దాయాదులైన లబ్దిదారులుగా ఉన్నారు. దేవుడు తన నిర్వహణ కార్యాన్ని లాంఛనంగా మొదలుపెట్టే మునుపటి యుగంలో, ఏ నియమ ప్రామాణికతల చేత ఆయన ప్రజలతో వ్యవహరించి వారిని అడిగాడో అవి కొంతమట్టుకు సడలించబడ్డాయన్నట్టు అది కనుపరుస్తుంది. ఈ నాటి ప్రజలకు, ఎనిమిది మంది ఉన్న నోవహు కుటుంబము పట్ల దేవుడు ప్రవర్తించిన పద్ధతి “న్యాయబద్ధంగా” లేనట్లు కనపడుతుంది. కానీ ఆయన ప్రస్తుతం ప్రజల పట్ల జరిగిస్తున్న గొప్ప కార్యపు పరిమాణాన్ని ప్రస్తుతం ఆయన తెలియజేసే వాక్యపు గొప్ప పరిమాణంతో సరిపోల్చి చూస్తే, ఎనిమిది మందితో కూడిన నోవహు కుటుంబము పట్ల దేవుడు ప్రవర్తించిన తీరు ఆ కాలంలో ఆయన కార్యపు నేపథ్యము ద్వారా అందించబడిన ఒక కార్యపు నియమముగా మాత్రమే ఉన్నది. పోల్చి చూస్తే, దేవుని వద్ద నుండి అధికంగా పొందినది ఎనిమిది మంది ఉన్న నోవహు కుటుంబమా, లేక ఈ నాటి ప్రజలా?

నోవహు పిలవబడటమనేది ఒక మామూలు విషయమే, కానీ మనం మాట్లాడుకుంటున్న దానిలో ముఖ్య అంశమైన— దేవుని స్వభావము, ఆయన సంకల్పము, మరియు ఈ గ్రంథములోని ఆయన గుణము అనేది—అంత సరళమైనదేమీ కాదు. ఇటువంటి పలురకాలైన దేవుని దశలను అవగాహన చేసుకోడానికి, మొదట మనం దేవుడు ఎటువంటి వ్యక్తిని పిలవాలని ఆశిస్తున్నాడో సరిగా గ్రహించాలి, దాని నుండి, ఆయన స్వభావము, సంకల్పము, మరియు గుణాన్ని తెలుసుకోవాలి. ఇదే కీలకమైనది. మరి దేవుని దృష్టిలో, ఆయన పిలిచే ఈ మనిషి మాములుగా ఎటువంటి వ్యక్తి అయ్యుండాలి? అది ఖచ్చితంగా ఆయన వాక్కులను వినగలిగి ఆయన ఆదేశాలను పాటించగలిగే వ్యక్తియై ఉండాలి. అదే విధంగా, దేవుని వాక్యాన్ని ప్రచురించడాన్ని బాధ్యతగా ఎంచి దాన్ని నెరవేర్చడానికే తాము కట్టుబడి ఉన్నామన్నట్టు ప్రవర్తించే వ్యక్తియై, అది కూడా బాధ్యతాయుతమైన భావాన్ని కలిగియున్న వ్యక్తిగా ఉండాలి. మరైతే ఈ వ్యక్తి దేవుణ్ణి ఎరిగినవాడై ఉండాల్సిన అవసరమున్నదా? లేదు. ఆ కాలంలో, నోవహు దేవుని బోధనలు పెద్దగా విన్నదీ లేక దేవుని కార్యాన్ని ఏమైనా అనుభవించినదీ లేదు. అందువలన, దేవుని గూర్చిన అవగాహనను నోవహు చాలా తక్కువ కలిగి ఉన్నాడు. నోవహు దేవునితో నడిచెను అనేది ఇక్కడ రాయబడినప్పటికీ, అతడు దేవుడిని వ్యక్తిగా ఎప్పుడైనా చూశాడా? ఖచ్చితంగా లేదన్నదే సమాధానం! ఎందుకంటే, ఆ దినాలలో, దేవదూతలు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చేవారు. విషయాలను చెప్పి జరిగించడంలో వారు దేవునికి ప్రాతినిధ్యం వహించగలిగినప్పటికీ, వారు దేవుని చిత్తాన్ని మరియు ఆయన ఆశయాలను తెలియజేయడం మాత్రమే చేసేవారు. దేవుని రూపము మనిషికి ముఖాముఖిగా వెల్లడి చేయబడలేదు. లేఖనాల్లోని ఈ భాగంలో, మొత్తంగా నోవహు చేయాల్సి వచ్చింది ఏమిటి మరియు దేవుడు అతడికి ఇచ్చిన ఆదేశాలు ఏమై ఉన్నాయన్న దానినే మనము ప్రధానంగా చూస్తాము. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేసిన ముఖ్యాంశము ఏమిటి? దేవుడు చేసే ప్రతిదీ సంక్షిప్తతతో రూపొందించబడింది. ఏదైనా ఒక సంగతి లేక పరిస్థితి సంభవించడాన్ని గమనించినప్పుడు, దాన్ని అంచనా వేయడానికి తన దృష్టిలో ఒక ప్రామాణికం ఉంటుంది, దాన్ని పరిష్కరించడానికి ఆయన ఒక ప్రణాళిక ఏమైనా ప్రయోగించాలా లేక ఈ విషయాన్ని లేదా పరిస్థితిని పరిష్కరించడానికి ఏ పద్దతిని అవలభించాలన్న దానిని ఈ ప్రామాణికమే నిశ్చయిస్తుంది. ప్రతిదాని పట్ల ఆయనకున్న భావనలలో నిష్పాక్షపాతము లేక కొరత అనేది లేదు. నిజానికి ఇది పూర్తి విరుద్దంగా ఉంది. దేవుడు నోవహుతో చెప్పిన దాన్ని తెలియజేసే ఒక వచనం ఇక్కడ ఉన్నది: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.” దేవుడు దీనిని పలికినప్పుడు, తాను కేవలం మనుష్యులను మాత్రమే నాశనం చేస్తున్నట్టుగా ఆయన ఉద్దేశించాడా? లేదు! శరీర సంబంధమైన జీవరాశులన్నిటినీ నాశనం చేయబోతున్నట్టు దేవుడు పలికాడు. దేవుడు ఎందుకు వినాశనాన్ని కోరుకున్నాడు? ఇక్కడ దేవుని స్వభావపు ప్రత్యక్షత మరొకటి ఉన్నది; దేవుని దృష్టిలో, మనిషి చెడుతనము పట్ల, మాలిన్యము, బలత్కారము, శరీరులందరి అవిధేయత పట్ల ఆయనకున్న సహనానికి ఒక హద్దు ఉన్నది. ఆయన హద్దు ఏమిటి? దేవుడు పలికినట్లు: “దేవుడు భూలోకమును చూచినప్పుడు, అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.” “భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి” అనే వాక్యానికి అర్ధం ఏమిటి? దేవుడిని వెంబడించిన వారు, దేవుని నామమున ప్రార్ధించే వారు, ఒకప్పుడు దేవునికి దహనబలిని అర్పించిన వారు, నోటితో దేవునిని ఒప్పుకుని దేవుడిని స్తుతించిన వారితో సహా—ఒకసారి తమ ప్రవర్తన చెడుతనముతో నిండి దేవుని దృష్టికి వెళ్లిందంటే, ఆయన వారిని నాశనం చేయాల్సి ఉంటుందని దాని అర్ధం. అదే దేవుని హద్దు. కాబట్టి, మనిషి పట్ల మరియు శరీరులందరి చెడుతనము పట్ల దేవుడు ఎంతమేరకు సహనాన్ని కలిగి ఉంటాడు? ఎంతవరకు అంటే, దేవుడిని వెంబడించే వారు లేక అవిశ్వాసులు అని కాకుండా, ప్రజలందరూ సన్మార్గంలో నడవకుండా ఉన్నంతవరకే సహనం కలిగి ఉంటాడు. ఎంతవరకు అంటే, మనిషి నైతికంగా చెడిపోయి బ్రష్టత్వంతో నిండిపోవడం మాత్రమే కాదు, కానీ దేవుని అస్తిత్వాన్ని నమ్మేవారు ఒక్కరూ లేకుండా, దేవుని చేత లోకం పాలించబడుతుందని ఆ దేవుడే ప్రజలను వెలుగు మరియు సన్మార్గంలోకి తీసుకురాగాలడని నమ్మే వారు ఎవరూలేనంత వరకే సహనం కలిగి ఉంటాడు. ఎంతవరకు అంటే, మనిషి దేవుని అస్తిత్వాన్ని ధిక్కరించి దేవుడు ఉనికిలో ఉండటాన్నే ఒప్పుకోనంత పరిస్థితి రానంతవరకే సహనం కలిగి ఉంటాడు. ఒకసారి మాననవుని చెడుతనము గనుక ఈ స్థాయిని చేరుకుందంటే, దేవుడు ఇక ఏమాత్రమూ సహించలేడు. దాని స్థానంలో ఏమి ఉంటుంది? దేవుని ఉగ్రత మరియు దేవుని శిక్ష వస్తుంది. అప్పుడది దేవుని స్వభావానికి సంబంధించిన ఒక అసంపూర్ణమైన ప్రత్యక్షతగా లేదా? ప్రస్తుత యుగమందు, దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరూ లేరా? దేవుని దృష్టిలో నిందారహితులు ఎవరూ లేరా? ఈ ఒక్క యుగంలోనే భూమి మీదున్న శరీరులందరి నడవడిక దేవుని దృష్టిలో చెడిపోయిందా? ఈ నాటి యుగమందు దేవుడు సంపుర్ణులుగా చేయాలనుకుంటున్న వారు దేవుడిని వెంబడించి ఆయన రక్షణను స్వీకరించగలిగే వారు తప్ప—శరీర సంబందులైన ప్రజలందరూ—దేవుని సహనపు పరిధిని సవాలు చేయడం లేదా? మీ ప్రక్కన జరిగేది—మీ కళ్ళతో చూసి మీ చెవులతో వింటూ, ఈ లోకంలో మీరు అనుదినమూ వ్యక్తిగతంగా అనుభవించేదంతా—బలత్కారముతో నిండి లేదా? దేవుని దృష్టిలో, అలాంటి ఒక లోకము, అలాంటి ఒక యుగము అంతము చేయబడకూడదా? ప్రస్తుత యుగానికి సంబంధించిన నేపథ్యము నోవహు కాలానికి చెందిన నేపథ్యానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ, మనిషి చెడుతనము పట్ల దేవునికున్న స్పందనలు మరియు ఉగ్రత సరిగ్గా ఒకేలాగే ఉన్నాయి. దేవుడు తన కార్యాపు కారణాన్ని బట్టి సహించగలుగుతున్నాడు, కానీ పరిస్థితులు సందర్భాలను బట్టి చూస్తే, దేవుని దృష్టిలో ఈ లోకము ఎప్పుడో నాశనమై ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు జలప్రళయం వలన లోకము నాశనం చేయబడినప్పటి వాటికంటే ఎంతో మించి పోయాయి. అయితే వ్యత్యాసం ఏమిటి? బహుశా మీలో ఎవరూ అభినందించలేని విధంగా, దేవుని హృదయాన్ని మిక్కిలి బాధించే విషయం కూడా ఇదే.

జలప్రళయం చేత ఆయన లోకాన్ని నాశనం చేసినప్పుడు, ఒక ఓడను నిర్మించి కొంత సన్నాహపు కార్యాన్ని జరిగించాల్సిందిగా నోవహను దేవుడు పిలవగలిగాడు. తన కొరకు ఈ వరుస కార్యాలను జరిగించడానికి, నోవహు అనే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ ప్రస్తుత యుగంలో మాత్రం, దేవుడు పిలుచుకోడానికి ఎవరూ లేరు. మరి అలా ఎందుకు? బహుశా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కారణాన్ని చక్కగా గ్రహించి తెలుసుకోవచ్చు. నేను దాన్ని పలకడం మీకు అవసరమా? దాన్ని పెద్దగా చెప్పడం వలన మీ ముఖం చిన్నబోయేలా చేసి, అందరినీ ఇబ్బంది పెట్టొచ్చు. కొందరైతే, “దేవుని దృష్టిలో మనము నీతిమంతులము నిందారహితులము కాకపోయినప్పటికీ, ఒకవేళ దేవుడు మనల్ని ఏదైనా చేయాలని ఆజ్ఞాపిస్తే, దాన్ని చేసే సమర్ధత మనమింకా కలిగే ఉంటాము” అని చెప్పొచ్చు. ఇదివరకు, ఆయన భయంకరమైన విపత్తు రాబోతుందని చెప్పినప్పుడు, మేము ఆ విపత్తులో కావాల్సిన ఆహార పదార్ధాలను సిద్దపర్చుకోవడం మొదలుపెట్టాము. ఇదంతా దేవుని ఆశయాల మేరకు జరగలేదా? దేవుని కార్యానికి మనము నిజంగా సహకరించలేదా? నోవహు చేసిన వాటితో మనము చేసిన ఈ పనులను సరిపోల్చలేమా? మనము చేసిన దానినే చేయడమనేది నిజమైన విధేయత కాదా? మనము దేవుని ఆదేశాలను అనుసరించడంలేదా? దేవుని వాక్కులపై మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్పినట్లు మనం చేయలేదా? మరెందుకు దేవుడు ఇంకా చింతిస్తున్నాడు? దేవుడు తాను పిలవడానికి ఎవ్వరు లేరని ఎందుకు అన్నాడు?” మీ పనులకు నోవహు పనులకు మధ్య వ్యత్యాసమేమైనా ఉన్నదా? వ్యత్యాసం ఏమిటి? (ప్రళయం కోసం ఈ దినానే ఆహారం సిద్దపరచడమనేది మా మదిలోని భావన.) (మన పనులు “నీతిమంతులుగా” ఉండేంతగా ఉండవు, అయితే నోవహు మాత్రం దేవుని దృష్టిలో ఒక నీతిమంతునిగా ఉన్నాడు.) మీరు చెప్పింది ఎంతో దూరంలో లేదు. నోవహు చేసిన దానికి ప్రస్తుతం ప్రజలు చేస్తున్న దానికి ప్రముఖమైన విభిన్నత ఉన్నది. దేవుని ఆదేశానుసారం నోవహు జరిగించినప్పుడు, దేవుని తలంపులు ఏమైయున్నాయో అతనికి తెలీదు. దేవుడు ఏమి నెరవేర్చాలని ఆశించాడో అతడికి తెలీదు. దేవుడు కేవలం అతనికి ఒక ఆజ్ఞను ఇచ్చి ఒక పని చేయడానికి అతనికి ఆదేశించాడు, అధిక వివరణ ఏమీ లేకుండానే, నోవహు ముందుకెళ్ళి దానిని చేశాడు. అతడు రహస్యంగా దేవుని తలంపులను తెలుసుకోడానికి ప్రయత్నంచలేదు, లేక అతడు దేవుణ్ణి ప్రతిఘటించడమో లేదా కపటత్వాన్ని కనుపరచడమో చేయలేదు. అతడు వెంటనే వెళ్లి నిష్కపటమైన పవిత్ర హృదయంతో ఆ ప్రకారం చేశాడు. దేవుడు అతడిని చేయమన్నది ఏదైనా, అతడు చేయడం, దేవుని వాక్యాన్ని విని పాటించడమనేది తాను చేసిన దానిమీద తనకున్న విశ్వాసాన్ని స్థిరపరచింది. ఆవిధంగా దేవుడు పురమాయించిన దానిని అతడు ముక్కుసూటిగా సహజంగా పరిష్కరించాడు. ఆయన గుణము—ఆయన కార్యాల భావము విధేయతే తప్ప, ప్రవచించడము కాదు, ఎదిరించడమూ కాదు, పైగా, తన స్వప్రయోజనాల గురించో లేక తన లాభనష్టాల గురించో ఆలోచించడం లేదు. తదుపరిగా, దేవుడు లోకాన్ని జలప్రళయం చేత నాశనం చేస్తానని చెప్పినప్పుడు, నోవహు ఎప్పుడు ఏం విషయాలు జరుగుతాయని అడగలేదు, మరియు అతడు దేవుడు లోకాన్ని ఎలా నాశనం చేయబోతున్నాడన్నది ముమ్మాటికి ఆయనను అడుగలేదు. అతడు కేవలం దేవుడు ఆదేశించినట్లు జరిగించాడు. దేవుడు దానిని ఏ విధంగా నిర్మించాలి మరియు దేనితో నిర్మించాలని ఆశించాడో, అతడు దేవుడు అడినట్లుగానే చేసి తక్షణమే పనిని కూడా మొదలుపెట్టాడు. దేవుణ్ణి సంతృప్తిపరచాలన్న వైఖరితో అతడు దేవుని ఆదేశాలను అనుసరించి నడచుకున్నాడు. అతడేమైనా జలప్రళయం నుండి తననుతాను తప్పించుకోడానికి దాన్ని చేస్తున్నాడా? లేదు. లోకము నాశనం చేయబడటానికి ముందు ఇదెంత కాలం ఉంటుందని అతడేమైనా దేవుణ్ణి అడిగాడా? అతడు ఏం అడుగలేదు. ఓడను నిర్మించడానికి ఎంతకాలం పడుతుందనేది అతనికేమైనా తెలుసా లేక అతడు దేవుణ్ణి అడిగాడా? అతనికి అది కూడా తెలీదు. అతడు కేవలం లోబడి, చెప్పింది విని, ఆ ప్రకారం నడుచుకున్నాడు. ఇప్పుడున్న ప్రజలు అలా కాదు: దైవ వాక్యము ద్వారా కొద్దిపాటి సమాచారం బయటకు వచ్చిన వెనువెంటనే, గాలిలో ఆకుల చప్పుడును ప్రజలు పసిగట్టిన వెంటనే, ఏదేమైనా మూల్యాన్ని లెక్క చేయకుండా, వారు తినడానికి, త్రాగడానికి, మరియు తరువాతి కాలంలో వాడుకునే వాటిని సిద్దపరచడానికి, విపత్తు విరుచుకుపడినప్పుడు తాము తప్పించుకునే మార్గాలను సైతం ప్రణాళిక చేయడానికి, తక్షణమే వారు రంగంలోకి దిగుతారు. ఇంత కన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే, ఇటువంటి కీలకమైన క్షణంలో, మనిషి మెదళ్లు “పని పూర్తి చేయడంలో” చాలా చురుకుగా ఉంటాయి. దేవుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వని పరిస్థితుల్లో కూడా, మానవుడు ప్రతిదానికి ఎంతో సముచితంగా ప్రణాళిక వేయగలడు. అలాంటి ప్రణాళికలను వర్ణించడానికి మీరు, “పరిపూర్ణమైనది” అన్న మాటని వాడొచ్చు. దేవుడు ఏమి చెప్తున్నాడు, దేవుని తలంపులు ఏమైయున్నాయి, లేక దేవుడు ఏమి ఆశిస్తున్నాడన్న విషయానికొస్తే, దానిని ఎవరూ పట్టించుకోరు మరియు ఎవరూ దానిని మెచ్చుకోడానికి ప్రయత్నించరు. ఈ నాటి ప్రజలకు మరియు నోవహుకు మధ్య ఉన్న అతిపెద్ద విభేదం ఇది కాదా?

ఈ గ్రంధంలోని నోవహు కథనంలో, మీరు దేవుని స్వభావంలోని ఒక భాగాన్ని గమనించారా? మానవుని చెడుతనము, అపవిత్రత, మరియు బలత్కారము పట్ల దేవుడు కలిగియున్న సహనానికి హద్దు ఉన్నది. ఆయన ఆ హద్దును చేరినప్పుడు, ఇక ఏ మాత్రమూ సహించకుండా తన నూతన నిర్వహణ మరియు నూతన ప్రణాళికను మొదలుపెట్టి, తాను చేయవలసిన దానిని చేయడం ఆరంభించి, తన క్రియలను మరియు తన స్వభావపు మరో కోణాన్ని బయలుపరుస్తాడు. ఈ విధమైన ఆయన కార్యమనేది తాను ఎప్పుడూ మానవుని చేత బాధింపబడకుండా ఉండటానికో, ఆయన బలముతో ఉగ్రతతో నిండియున్నాడని నిరూపించడానికో కాదు, మరియు ఇది ఆయన మానవజాతిని నిర్మూలము చేయగలడని కనుపరచడానికి కాదు. అది ఈ విధమైన మానవజాతి ఆయన యెదుట నివసించడానికి, ఆయన ఆధీనములో జీవించడానికి ఆయన స్వభావము మరియు పరిశుద్ద గుణములు ఇకపై ఎన్నడూ అనుమతించలేవు లేక సహించలేవు. చెప్పాలంటే, సమస్త మానవాళి ఆయనకు విరోధముగా ఉన్నప్పుడు, భూమి అంతటిమీద ఆయన రక్షించగలిగిన వాడు ఒకడునూ లేనప్పుడు, అటువంటి మానవజాతి పట్ల మరియు చిత్తము పట్ల ఆయన ఇక ఎన్నటికీ సహనాన్ని కనుపరచకుండా, ఈ విధమైన మానవాళిని నిర్ములించడానికి, ఎలాంటి అనుమానం లేకుండా, తన ప్రణాళికను నిర్వహిస్తాడు. దేవుని చేత జరిగించబడే అలాంటి కార్యము ఆయన స్వభావము ద్వారా నిశ్చయించబడుతుంది. ఇది ఒక అవశ్యకమైన ఫలితార్ధముగా, మరియు దేవుని ఆధిపత్యమందు సృజించబడిన ప్రతి జీవి ఖచ్చితంగా భరించవలసిన పర్యవసానమై ఉన్నది. ఇప్పుడున్న ఈ యుగంలో, దేవుడు తన ప్రణాళికను నెరవేర్చి తాను రక్షించాలనుకున్న వారిని రక్షించడానికి ఇక ఎదురుచూడలేడని ఇది కనుపరచట్లేదా? ఈ పరిస్థితుల్లో, దేనిపట్ల దేవుడు అధిక శ్రద్ధను కలిగి ఉన్నాడు? ఆయనను ఏమాత్రమూ వెంబడించని వారు లేక ఎలాగైనా ఆయనను విరోధించాలనే వారు తనపట్ల ఎలా వ్యవహరిస్తారు లేక తనను ఎలా ప్రతిఘటిస్తారనో, లేక మానవాళి తనను ఎలా దూషిస్తుందనో పట్టించుకోడు. ఆయనను వెంబడించే వారు, తన నిర్వహణ ప్రణాళికలోని రక్షణకు సంబంధించిన లక్ష్యాలు, ఆయన చేత సంపూర్ణ పరచబడ్డారా లేదా, వారు ఆయన సంతృప్తికి కారకులుగా మారారా లేదా అన్నదానిని మాత్రమే ఆయన పట్టించుకుంటాడు. ఆయనను వెంబడించేవారు కాకుండా మిగిలిన ప్రజల విషయానికొస్తే, ఆయన తన ఉగ్రతను తెలియజేయడానికి అప్పుడప్పుడు కొద్దిపాటి శిక్షను వేస్తాడు. ఉదాహరణకు: సునామీలు, భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు. అదే సమయంలో, ఆయన తను వెంబడించేవారిని మరియు తను రక్షించబోతున్న వారిని కూడా సమర్ధవంతంగా సంరక్షించి కాపాడుకుంటాడు. దేవుని స్వభావము ఇదైయున్నది: ఒకవైపు, ఆయన సంపూర్ణపరచాలని తలంచిన ప్రజల పట్ల అత్యంత సహనాన్ని మరియు ఓర్పును కలిగి, సాధ్యమైనంతవరకు ఆయన వారికోసం ఎదురుచూడగలడు; మరోవైపు, తనను వెంబడించకుండా తనను ఎదిరించే సాతాను సంబంధులైన ప్రజలను ఆయన తీవ్రంగా అసహ్యించుకుని చీత్కరించుకుంటాడు. అయితే ఈ సాతాను-సంబంధులు తనను వెంబడిస్తున్నారా లేక తనను ఆరాదిస్తున్నారా అని ఆయన లెక్క చేయకుండా, తన హృదయంలో వారి పట్ల సహనాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన వారిని ఇంకా ద్వేషిస్తాడు, మరియు ఆయన ఈ సాతాను సంబంధుల అంతమును నిర్దేశిస్తూ, ఆయన తన నిర్వహణ ప్రణాళిక దశల రాక కొరకు కూడా వేచియున్నాడు.

తదుపరి వాక్య భాగాన్ని పరిశీలిద్దాం.

2. జలప్రళయం తరువాత నోవహుకు దేవుని దీవెన

ఆది 9:1-6 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

ఈ వాక్య భాగము నుండి మీరేమి గమనిస్తున్నారు? ఈ వచనాలనే నేనెందుకు ఎన్నుకున్నాను? ఓడలో నోవహు మరియు తన కుటుంబ జీవితాన్ని గూర్చి ఉదహరించడాన్ని ఎందుకు నేను ఎంచుకోలేదు? ఎందుకంటే, ఆ వివరణకు నేడు మనం పంచుకుంటున్న విషయానికి అంతగా పొందిక లేదు. మనం దృష్టి సారిస్తున్నది దేవుని స్వభావం మీద. ఒకవేళ మీరు ఆ వివరాలను గూర్చి తెలుసుకోవాలని ఆశిస్తే, అప్పుడు మీ అంతట మీరే బైబిల్‌ని తీసుకొని చదువుకోవచ్చు. దాన్ని గూర్చి మనమిక్కడ చర్చించటం లేదు. దేవుని కార్యాలను ఎలా తెలుకోవాలన్నది నేడు మనం చర్చించుకుంటున్న ప్రాముఖ్యమైన సంగతై ఉన్నది.

నోవాహు దేవుని ఆదేశాలను స్వీకరించి ఓడను తయారు చేసి లోకాన్ని అంతమొందించడానికి దేవుడు జలప్రళయాన్ని ఉపయోగించిన దినాలు బ్రతికిన తరువాత, ఎనిమిది మందితో కూడిన తన కుటుంబమంతా బ్రతికారు. నోవహు కుటుంబంలోని ఎనిమిది మంది తప్ప, మానవజాతి మొత్తం నాశనం చేయబడ్డారు, భూమి మీద ఉన్న జావరాశులన్నీ నాశనం చేయబడ్డాయి. నోవహుకు, దేవుడు దీవెనలు అనుగ్రహించి, తనకు మరియు తన కొడుకులకు కొన్ని సంగతులు చెప్పాడు. ఈ సంగతులతో పాటుగా దేవుడు తన దీవెనలను కూడా అతనికి అనుగ్రహించాడు. ఇది దేవుడు ఆయన మాట విని మరియు ఆయన ఆదేశాలను స్వీకరించగల వానికి ఇచ్చే దీవెన మరియు వాగ్దానమై ఉన్నది, మరియు దేవుడు మనుష్యులకు బహుమానాలిచ్చే విధానం కూడా ఇదే. చెప్పాలంటే, నోవహు దేవుని దృష్టిలో నిర్దోషమైన వాడా లేదా యధార్ధత కలిగిన వాడా అను దానితో నిమిత్తం లేకుండా, మరియు అతనికి దేవుని గూర్చి ఎంత వరకు తెలుసనే దానితో పని లేకుండా, సంక్షిప్తంగా చెప్పాలంటే, నోవహు మరియు తన ముగ్గురు కొడుకులు మొత్తం దేవుని మాటలను విని, దేవుని కార్యానికి తోడ్పడ్డారు మరియు దేవుని ఆదేశాలకు అనుకూలంగా వారు చేయాల్సిన దాన్ని చేసారు. దాని ఫలితంగా, జలప్రళయం ద్వారా లోకము నాశనమైన నేపథ్యంలో వారు మనుష్యులను మరియు అనేక రకాల జీవరాశులను దేవుని కొరకు కాపాడి, దేవుని నిర్వహణ ప్రణాళిక తరువాతి దశకు గొప్ప సహాయాన్ని చేసారు. అతను చేసిన సమస్తం మూలంగా, దేవుడు అతడిని దీవించాడు. ఈనాటి ప్రజలకు, నోవహు చేసింది చెప్పుకోదగ్గది కూడా కాకపోవచ్చు. కొంతమందైతే: నోవహు చేసిందేమీ లేదు; దేవుడు అతడిని తప్పించాలని తన మనస్సులో నిశ్చయించుకున్నాడు, కనుక అతడు నిశ్చయంగా తప్పించబడబోతున్నాడని కూడా భావించి ఉండవచ్చు. అతను బ్రతికి ఉన్నది తన సొంత సాఫల్యతల కారణంగా కాదు. మానవుడు నిశ్చేష్టుడన్న కారణం చేత మాత్రమే, దేవుడు జరగాలని కోరుకున్నది ఇదే. అయితే దేవుడు అది అనుకోవడం లేదు. దేవునికి, ఒక వ్యక్తి ఘనుడైనా లేదా నిష్ప్రయోజకుడైనా కూడా, వారు ఆయన చెప్పేది విని, ఆయన ఆదేశాలను మరియు ఆయన అప్పగించిన వాటికి కట్టుబడినంత వరకు, ఆయన కార్యానికి, ఆయన సంకల్పానికి మరియు ఆయన ఏర్పాటుకు తోడ్పడగలరు, దాని వల్ల ఆయన సంకల్పం మరియు ఆయన ఆలోచన చక్కగా జరిగించబడుతుంది, అప్పుడు అటువంటి నడత ఆయన జ్ఞప్తికి మరియు ఆయన ఆశీర్వాదానికి యోగ్యమైనదిగా ఉంటుంది. దేవుడు అటువంటి ప్రజలను గొప్పవారిగా చూస్తాడు మరియు వారి క్రియలను మరియు ఆయన యందు వారికున్న ప్రేమ మరియు అనురాగాన్నిబట్టి ఆయన ఎంతో వర్దిల్లచేస్తాడు. ఇది దేవుని స్వభావం. అయితే దేవుడు నోవహును ఎందుకు దీవించాడు? ఎందుకంటే, దేవుడు అటువంటి క్రియలను మరియు మానవుని లోబడే తత్వాన్ని ఇలాగే లెక్కిస్తాడు.

నోవహును దేవుడు దీవించడాన్ని గూర్చి, కొందరు: “మానవుడు దేవుని మాట విని దేవుణ్ణి సంతృప్తిపరిస్తే, దేవుడు మానవుణ్ణి తప్పకుండా ఆశీర్వదించాలి. అది చెప్పకుండా వెళ్ళదు కదా?” అని అంటారు. దాన్ని మనం చెప్పవచ్చా? కొంతమంది: “లేదు” అని అంటారు. మనమెందుకు అలా చెప్పలేము? కొందరు: “దేవుని దీవెనను పొందుటకు మనిషి యోగ్యుడు కాడు” అని అంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే, దేవుడు తనకు అప్పగించిన దాన్ని ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు, వారి క్రియలు సరైనవా కావా మరియు ఆ వ్యక్తి అనుసరించాడా, మరియు అతను దేవుని ఆలోచనను సంతృప్తి పరచాడా మరియు వారు చేసేది ఆ విలువకు తగినట్టుగా ఉందా, లేదా అని నిర్దారించడానికి దేవుడు ఒక ప్రామాణికను కలిగి ఉంటాడు. దేవుడు లెక్క చేసేది మనుష్యుల హృదయాన్నేగానీ, వారి బాహ్య క్రియలను కాదు. ఎవరో ఏది ఒకటి చేసిన దాన్ని బట్టి దేవుడు దీవించాల్సిన అవసరం లేదు. ఇది దేవుణ్ణి గూర్చి మనుష్యులకు ఉన్న చెడు అభిప్రాయం. దేవుడు కేవలం సంగతుల చివరి పర్యవసానాన్ని మాత్రమే కాక, ఒక మనిషి హృదయం ఏ విధంగా ఉంటుందో మరియు సంగతుల పురోగతి సమయంలో ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దానిని ఎక్కువగా పట్టించుకుంటాడు మరియు వారి మనస్సులో లోబడే తత్వం, ఆలోచించే తత్వం మరియు దేవుణ్ణి తృప్తిపరచాలనే ఆశ ఉందా అని గమనిస్తాడు. ఆ కాలంలో నోవహుకు దేవుని గూర్చి ఎంత వరకు తెలుసు? ఇది ప్రస్తుతం మీరు ఎరిగియున్న సిద్ధాంతాల లాగా ఉన్నదా? సత్యమును గూర్చిన దేవుని జ్ఞానము మరియు భావజాలము లాంటి దృక్పథాల పరంగా చూస్తే, మీకు లాంటి నీరు పోయబడటాన్ని మరియు కాపరత్వాన్ని అతడు పొందుకున్నాడా? లేదు, అతడు పొందుకోలేదు! అయితే ఖండించ వీలు కాని నిజం ఒకటి ఉన్నది: ఈనాటి మనుష్యుల తెలివి, ఆలోచన మరియు హృదయాల లోతుల్లో సైతం, దేవుని యెడల వారి భావజాలం మరియు స్వభావాలు అస్థిరంగా మరియు సందేహాస్పదంగా ఉన్నవి. మనుష్యులలో కొంత మంది దేవుని అస్తిత్వం పట్ల వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నారని కూడా మీరు అనవచ్చు. అయితే నోవాహు హృదయంలో మరియు అతని ఆలోచనల్లో దేవుని అస్తిత్వం పూర్తిగా మరియు కొంచెం కూడా అనుమానం లేకుండా ఉన్నది, కావున దేవుని పట్ల అతని అణకువ నిష్కల్మషమైనదై పరీక్షకు తాళగలిగింది. అతని హృదయం శుద్ధమైనదై, దేవుని ఎదుట నిష్కపటంగా ఉన్నది. దేవుని ప్రతి వాక్యమును పాటించడానికి తనను తాను నచ్చజేప్పుకోడానికి అతనికి సిద్ధాంతాలను గూర్చి ఎక్కువ తెలివి అక్కర్లేదు లేదా దేవుడు తనకు అప్పగించిన దాన్ని స్వీకరించడానికి మరియు ఏమైనా చేయగల శక్తిని కలిగి ఉండటానికి దేవుని అస్తిత్వాన్ని రుజువు చేయడానికి అతనికి ఎన్నో సత్యాలు అక్కర్లేదు. నోవహుకు మరియు ఈనాటి మనుష్యులకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే. దేవుని దృష్టిలో నిర్దోషమైన మనిషి అంటే ఖచ్చితమైన అర్ధం కూడా ఇదే. దేవుడు కావాలనుకునేది నోవహు వంటి ప్రజలనే. అతను దేవుడు చేత హెచ్చించబడే మనిషి మరియు ఖచ్చితంగా దేవుడు చేత దీవించబడే లాంటి మనిషి. మీరు దీని నుండి ఏదైనా విశదీకరణను పొందుకున్నారా? మనుష్యులు మనుష్యులను వెలుపల నుండి గమనిస్తారు, అయితే దేవుడు మనుష్యుల హృదయాలను మరియు వారి గుణాన్ని పరిశోదిస్తాడు. దేవుడు ఎవరినీ తన పట్ల ఎటువంటి నులివెచ్చని స్థితిని లేదా అనుమానాలను కలిగి ఉండడానికి అనుమతించడు, అలాగే మనుష్యులు ఆయనను ఏ రకంగానూ సంశయించడానికి లేదా పరీక్షించడానికి ఒప్పుకోడు. అందుకని, ఈనాటి ప్రజలు దేవుని వాక్యంతో ముఖాముఖిగా ఉన్నా కూడా—మీరు దేవునితో ముఖాముఖిగా కూడా మాట్లాడవచ్చు—వారి హృదయపు లోతుల్లో ఉన్న ఏదో ఒకదాని వలన, వారి దుర్నీతి లక్షణపు స్థితి మరియు ఆయన పట్ల వారి వ్యతిరేక స్వభావము వలన, మనుష్యులు దేవుని మీద వాస్తవికమైన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా అడ్డుపడింది మరియు ఆయనకు లోబడకుండా ఆటంకపరిచింది. దీనివల్ల, దేవుడు నోవహుకు దయచేసిన అలాంటి దీవెనను పొందుకోవడం వారికి ఎంతో కష్టతరమయ్యింది.

తర్వాత, దేవుడు మనిషితో తన నిబంధనకు గుర్తుగా ఇంద్రధనస్సును ఏవిధంగా ఉపయోగించాడన్న దాన్ని గూర్చి ఈ లేఖన భాగాలను పరిశీలిద్దాం.

3. మనిషితో చేసిన తన నిబంధనకు ఒక సూచనగా దేవుడు ఇంద్రధనస్సును ఉపయోగిస్తాడు

ఆది 9:11-13 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు—నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

ఇంద్రధనస్సు అంటే ఏంటో అనేకమంది ప్రజలకు తెలుసు మరియు ఇంద్రధనస్సుకు సంబంధించిన కొన్ని కథలను విని ఉంటారు. బైబిల్‌లో ప్రస్తావించబడిన ఇంద్రధనస్సును గూర్చిన కథనాన్ని గమనిస్తే, కొంతమంది ప్రజలు దాన్ని విశ్వసిస్తారు మరియు కొంతమంది దీనిని చారిత్రాత్మకమైనదిగా భావిస్తారు, అయితే మరికొంతమంది దాన్ని నమ్మనే నమ్మరు. ఏదేమైనా సరే, ఇంద్రధనస్సుకు సంబంధించి జరిగిన సన్నివేశాలన్నీ దేవుని కార్యమై ఉన్నాయి మరియు మానవుణ్ణి దేవుడు చక్కపరిచే పనిలో భాగంగా జరిగాయి. ఈ సంగతులు బైబిల్లో ఖచ్చితంగా నమోదు చేయబడ్డాయి. ఆ సమయంలో దేవుడు ఎటువంటి మనస్తితిలో ఉన్నాడో లేదా దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఉన్న అంతరార్ధాలను ఈ నమోదులు మనకు తెలియచేయవు. అంతేకాకుండా, వాటిని చెప్పినప్పుడు దేవుని భావన ఎలా ఉన్నది అది ఎవరూ గుర్తించలేరు. ఎదేమైనా, ఈ సంఘటన మొత్తానికి సంబంధించి దేవుని మానసిక పరిస్థితి ఈ మాటల మధ్యలో వెల్లడి చేయబడుతుంది. ఆ సమయంలో అతని ఆలోచనలు దేవుని వాక్యంలోని ప్రతి మాట మరియు వాక్యము ద్వారా పేజీ నుండి దూకుతాయి.

మనుష్యులు దేనిని గూర్చి చింతించాలి మరియు వారు దేనిని గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలి అనేవే దేవుని తలంపులు. ఎందుకంటే, దేవుని తలంపులు దేవుణ్ణి గూర్చిన మానవుని గ్రహింపుతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి మరియు దేవుని గురించి మానవుని గ్రహింపు మానవుడు బ్రతుకులోకి రావడానికి పూర్తిగా కావలసిన ఒక దారి. కాబట్టి ఈ సంగతులు సంభవించినప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు?

వాస్తవానికి, ఆయన దృష్టిలో ఎంతో మంచిగా సన్నిహితంగా ఉండాలని మానవజాతిని ఆయన సృజించాడు, అయితే ఆయనకు ప్రతికూలంగా తిరుగుబాటు చేసిన తర్వాత వారు జలప్రళయం చేత నాశనం చేయబడ్డారు. అటువంటి మానవజాతి ఒక్కసారిగా అలా అదృశ్యమైపోవడం దేవుణ్ణి బాధ పెట్టిందా? అవును అది బాధ పెట్టింది! కాబట్టి ఈ వేదనలో ఆయన భావ వ్యక్తీకరణ ఏమైయున్నది? అది బైబిల్లో ఏ విధంగా వ్రాయబడింది? ఇది బైబిల్‌లో ఈ వాక్యాలలో వ్రాయబడింది: “నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.” ఈ సాదారణమైన వాక్యం దేవుని తలంపులను తెలియచేస్తుంది. ఈ విశ్వపు వినాశనం ఆయనకు ఎంతో వేదనను కలిగించింది. మానవుని మాటల్లో చెప్పాలంటే, ఆయన ఎంతో విచారంగా ఉన్నాడు. మనం ఊహించవచ్చు: ఒకప్పుడు జీవంతో నిండిన భూమి జలప్రళయంతో నాశనమైన తర్వాత ఏ విధంగా ఉంటుందో? ఒకప్పుడు మానవాళితో నిండిన భూమి ఆ కాలంలో చూడడానికి ఎలా ఉండేదో? మానవ వసతి లేదు, బ్రతికి యున్న జీవులు లేవు, ప్రతిచోటా నీరు మరియు నీటి పైభాగం మీద పూర్తిగా విధ్వంసము. భూమిని సృజించినప్పుడు దేవుని అసలైన ఉద్దేశం అటువంటి దృశ్యమా? కానే కాదు! దేవుని నిజమైన ఉద్దేశం ఏంటంటే, భూమియందంతటా జీవాన్ని చూడడం, ఆయన సృజించిన మనుష్యులు ఆయనను ఆరాధించడం చూడటం, నోవహు మాత్రమే ఆయనను ఆరాధించడానికి లేదా ఆయన అప్పగించిన వాటిని సంపూర్తి చేయడానికి లేదా ఆ ఒక్కడు మాత్రమే ఆయన పిలుపుకు సమాధానం ఇవ్వగలగడానికి కాదు. మానవజాతి అద్రుశ్యమైనప్పుడు, దేవుడు తాను ఆరంభమందు అనుకున్నది కాక పూర్తిగా వ్యతిరేకతను చూశాడు. ఆయన హృదయం వేదన చెందకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆయన తన వైఖరిని బయలుపరుస్తున్నప్పుడు మరియు ఆయన భావోద్రేకాలను తెలియజేస్తున్నప్పుడు, దేవుడు ఒక నిర్ణయానికొచ్చాడు. ఆయన ఏ రకమైన నిర్ణయానికొచ్చాడు? మేఘంలో ధనుస్సు తయారు చేయడం (అంటే, మనం చూసే ఇంద్రధనుస్సులు) మానవునితో ఒక నిబంధనగా, దేవుడు మరలా జలప్రళయంతో మానవజాతిని నాశనం చేయనని ప్రమాణం చేయడం. అదే సమయంలో, అది దేవుడు భూమిని జలప్రళయంతో నాశనం చేశాడని మనుష్యులకు చెప్పడానికి కూడా, దాని వల్ల దేవుడు అటువంటి పని ఎందుకు చేయవలసి వచ్చిందని మానవాళి ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంది.

ఆ కాలంలో భూమి వినాశనమనేది దేవుడు కావాలనుకున్నదేనా? నిశ్చయంగా అది దేవుడు కావాలనుకున్నది కాదు. లోక వినాశనం తర్వాత భూమిమీద కనబడే హృదయ విదారకమైన దృశ్యంలో ఒక చిన్నపాటి భాగాన్ని మనం తలచుకోగలమేమో, అయితే ఆదే సమయంలో దేవుని దృష్టిలోని ఆ దృశ్యం ఏ విధంగా ఉన్నదో తలచుకోడానికి కూడా మనం తెగించలేము. జలప్రళయం వలన భూమి నాశనమవుతున్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు దేవుడు ఎటువంటి భావనను కలిగి ఉంటాడన్నది ఇప్పుడున్న లేదా అప్పుడున్న మనుష్యులు ఎవరూ ఊహించలేరు లేదా గుర్తించలేరని మనం చెప్పవచ్చు. మనిషి అవిధేయత మూలంగానే దేవుడు దాన్ని తప్పక చేయాల్సి వచ్చింది, కానీ నిజంగా జలప్రళయం వల్ల భూమిని నాశనం చేయడం వలన దేవుని హృదయం పడ్డ వేదనను ఎవరూ గ్రహించలేరు లేదా గుర్తించలేరు. అందకని దేవుడు మానవజాతితో ఒక నిబంధన చేసాడు, దాని వల్ల దేవుడు ఒకానొకప్పుడు ఇటువంటి కార్యాన్ని చేసాడనే సంగతిని జ్ఞాపకముంచుకోవాలని మనుష్యులకు చెప్పి మరియు దేవుడు ఇకమీదట భూమిని నాశనం చేయడని వారికి వాగ్దానం చేయడాన్నే గురిగా పెట్టుకున్నాడు. ఈ నిబంధనలో మనం దేవుని హృదయాన్ని చూస్తాము—దేవుడు ఈ మానవజాతిని నాశనం చేసినప్పుడు ఆయన హృదయం వేదనతో ఉండడాన్ని మనం చూస్తాము. మనిషి భాషలో మాట్లాడాలంటే, మానవాళిని దేవుడు నాశనం చేసి మానవజాతి అదృశ్యమవుతున్నట్లు దేవుడు చూసినప్పుడు, ఆయన హృదయము రోదించి రక్తసిక్తమైంది. దాన్ని వర్ణించడానికి ఇది శ్రేష్ఠమైన మార్గం కాదా? మనుషుల మనోభావాలను విశదపరచడానికి మనుషులు ఈ మాటలను వాడతారు, అయితే మనిషి భాష చాలా తేలిక అయినందున, వాటిని ఉపయోగించి దేవుని భావనలను మరియు మనోభావాలను వర్ణించడమనేది నాకు అంత పెద్ద తప్పుగా ఏమీ అనిపించలేదు, మరియు అవేమీ అంత ఎక్కువ అతిగా కూడా లేవు. కనీసం ఆ కాలంలో దేవుని మనస్థితి ఎలా ఉండేదన్న దాని గురించైనా ఇది మీకు ఎంతో వాస్తవికమైన, సరియైన అవగాహన కల్పిస్తుంది. మీరిప్పుడు ఇంద్రధనుస్సును తరిగి చూసినప్పుడు మీకు ఏమని అనిపిస్తుంది? కనీసం జలప్రళయం చేత లోకాన్ని నాశనం చేసిన దానిని బట్టి ఒకసారి దేవుడు ఎలా బాధపడ్డాడో మీకు గుర్తుండి ఉంటుంది. దేవుడు ఈ లోకాన్ని ద్వేషించి ఈ మానవజాతిని తృణీకరించినప్పటికీ, ఆయన తన స్వహస్తాలతో సృజించిన మానవజాతిని ఆయనే నాశనం చేసినప్పుడు, తన హృదయము ఎంతగా నొచ్చుకుందో, విడిచిపెట్టడానికి ఎంతగా వేదన చెందాడో, ఎంత అయిష్టమైన భావన కలిగియున్నాడో, మరియు భరించడం ఎంత కష్టతరమో మీకు జ్ఞాపకముంటుంది. ఎనిమిది మంది ఉన్న నోవహు కుటుంబమే ఆయనకున్న ఏకైక ఆదరణయై ఉన్నది. సమస్త జీవులను సృజించే శ్రమతో కూడిన ఆయన కృషి నిరర్ధకం కాకుండా ఉన్నదంటే అది నొవహు తోడ్పాటు వలన మాత్రమే జరిగింది. దేవుడు బాధపడే సమయంలో, ఆయన బాధకు ఉపశమనమిచ్చినది ఉన్నదంటే అది ఈ విషయం మాత్రమే. అప్పటి నుండి, దేవుడు మానవజాతి పట్ల తనకున్న ఆశలన్నీ నొవహు కుటుంబం పైనే పెట్టుకుని, వారు తన శాపము క్రింద కాకుండా, తన దీవెనల క్రింద జీవించాలని ఆశిస్తూ, దేవుడు మరలా జలప్రళయంతో లోకాన్ని నాశనం చేయడాన్ని వారు ఎన్నడూ చూడకూడదని కాంక్షిస్తూ, అలాగే వారు కూడా నాశనం కాకూడదని నిరీక్షిస్తున్నాను.

దేవుని స్వభావములోని ఏ భాగం గురించి మనము దీని నుండి తెలుసుకోవాలి? మానవుడు దేవునితో వైరాన్ని కలిగి ఉన్న కారణంచేత ఆయన మానవుడిని తిరస్కరించాడు, అయితే తన హృదయంలో, మానవజాతి పట్ల ఆయనకున్న జాగ్రత్త, చింతన, కరుణ ఏమాత్రం మారలేదు. అయన మానవాళిని నాశనం చేసినప్పుడు కూడా, తన హృదయం మారకుండా అలానే ఉన్నది. మానవజాతి పూర్తిగా చెడిపోయి దేవుని పట్ల తీవ్రమైన స్థాయిలో అవిధేయతను కనుపరచినప్పుడు, దేవుడు తన స్వభావము మరియు తన గుణమును బట్టి, మరియు తన నియమాల ప్రకారంగా, ఈ మానవజాతిని నాశనం చేయవలసి వచ్చింది. కానీ దేవుడు తన గుణాతిశయపు కారణం చేత, ఆయన ఇప్పటికీ మానవజాతిపై దయ చూపుతూ, మరియు మానవజాతి మనుగడ కొనసాగించు నిమిత్తం వారిని విమోచించడానికి పలు మార్గాలను ఉపయోగించాలని ఆశించాడు. అయితే, మనుషులు మాత్రం, దేవుణ్ణి ఎదిరించి, దేవుని పట్ల అవిదేయతను కొనసాగించి, దేవుని రక్షణను స్వీకరించడానికి ఒప్పుకోలేదు; అంటే, ఆయన సదుద్దేశాలను స్వీకరించడానికి ఒప్పుకోలేదు. దేవుడు వారిని ఏవిధంగా పిలిచి, వారికి జ్ఞాపకం చేసినప్పటికీ, వారికి సమకూర్చినప్పటికీ, వారికి సహాయపడినప్పటికీ, లేక వారిని భరించినప్పటికీ, మనుషులు మాత్రం దానిని గ్రహించలేదు లేక గుర్తించలేదు, మరియు వారు దృష్టి పెట్టలేదు. దేవుడు తన వేదనలో, మనుషుల పునరాగమనం కొరకు ఎదురుచూస్తూ, మనుషుల పట్ల తన శక్తికొలది సహనం చూపడాన్ని ఇంకా మరువలేదు. ఆయన తన హద్దును చేరుకున్నాక, ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా చేయాల్సిన దానిని చేశాడు. ఇంకా చెప్పాలంటే, మానవజాతిని నాశనం చేయాలని దేవుడు యోచించినప్పటి నుండి మానవజాతి నాశనం చేయడంలో తన కార్యాన్ని మొదలు పెట్టే వరకు ఒక ఖచ్చితమైన కాల వ్యవధి మరియు క్రమము ఉన్నది. ఈ క్రమము అనేది మానవుని పురాగామనాన్ని క్రియాత్మకం చేయడానికై ఉన్నది, మరియు దేవుడు మానవునికి ఇచ్చిన ఆఖరి అవకాశము ఇదే. మరైతే మానవజాతిని నాశనం చేయడానికి ముందున్న ఈ వ్యవధిలో దేవుడు ఏం చేశాడు? దేవుడు జ్ఞాపకం చేసే మరియు ఉద్భోదించే కార్యాన్ని విశేషమైన రీతిలో చేశాడు. దేవుని హృదయము ఎంతటి వేదనలో మరియు విచారములో ఉన్నదన్న దానితో సంబంధం లేకుండా, మానవజాతి పట్ల ఆయన తన సరక్షణను, చింతను, విస్తారమైన కరుణ చూపడాన్ని కునసాగించాడు. దీని నుండి మనం ఏం చూస్తున్నాము? మానవాళి పట్ల దేవునికున్న ప్రేమ వాస్తవమని అది కేవలం ఆయన చేసే ముఖస్తుతి మాత్రం కాదని ఎలాంటి సందేహం లేకుండా మనం చూస్తాము. ఇది నిజమైనది, స్పర్శనీయమైనది మరియు అభినందించదగినది, కపటమైనదో, కలుషితమైనదో, వంచనతో కూడినదో లేక ఆడంబరపూర్వకమైనదో కాదు. ఆయన ప్రేమింపదగిన వాడని ప్రజలకు కనుపరచడానికి ఏదైనా వంచనను లేక మాయా ప్రతిరుపాలను సృజించడాన్ని దేవుడు ఎన్నడూ ఉపయోగించడు. ప్రజలకు తన మనోహరత్వాన్ని కనుపరచుకోడానికి, లేక తన సుందరమైన పరిశుద్దతను ప్రదర్శించడానికి ఆయన అబద్దపు సాక్ష్యాలను వినియోగించడు. దేవుని స్వభావంలో ఉన్న ఈ దృష్టికోణాలన్నీ మానవుని ప్రేమకు యోగ్యమైనవి కావా? అవి ఆరాధింపదగినవి కావా? అవి గౌరవింపదగినవి కావా? ఇప్పుడు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను: ఈ మాటలను విన్నాక, దేవుని మహోన్నత అనేది ఒక కాగితపు ముక్క మీదనున్న నిష్ప్రయోజనమైన మాటలని మీరు తలంచుచున్నారా? దేవుని మనోహరత అన్నది కేవలం వట్టి మాటలేనా? కాదు! ఖచ్చితంగా కాదు! దేవుని పూర్ణాధిపత్యము, మహోన్నత, పరిశుద్దత, శాంతము, ప్రేమ మొదలైనవి—దేవుని స్వభావము మరియు గుణాతిశయమును గూర్చిన పలురకాలైన దృష్టికోణాలలోని ప్రతి ఒక్క దానికి సంబంధించిన ప్రతి వివరణ ఆయన తన కార్యాన్ని చేసిన ప్రతిసారి మానవుని పట్ల తనకున్న చిత్తములో మిళితమైన, మరియు ప్రతి వ్యక్తిలో నెరవేరి పరావర్తనం చెందిన ఒక అనుసరణాత్మకమైన పరిభాషను కనుగొంటాయి. ఇదివరకు మీరు దీనిని ఎలా భావించారన్న దానితో సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తి పట్ల దేవుడు సాధ్యమైన అన్ని విధాలుగా శ్రద్ధ వహిస్తూ, ప్రతివ్యక్తి హృదయాన్ని పరిమళింపజేయడానికి, మరియు ప్రతివ్యక్తి ఆత్మను మేల్కొల్పడానికి, తన స్వచ్చమైన హృదయాన్ని, వివేకాన్ని, మరియు పలురకాలైన విధానాలను ఉపయోగిస్తాడు. ఇది నిర్వివాదమైన సత్యమై ఉన్నది. ఇక్కడ ఎంతమంది కూర్చున్నా గానీ, దేవుని ఓర్పు, సహనము, మరియు మనోహరత్వము పట్ల ప్రతి ఒక్క వ్యక్తి వేర్వేరు అనుభవాలు మరియు మనోభావాలు కలిగి ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, దేవునికి సంబంధించిన ఈ అనుభవాలు మరియు ఈ అనుభూతులు లేక తన దృక్పథము వంటి, ఈ సానుకూల సంగతులన్నీ దేవుని వద్ద నుండి వచ్చినవే. కావున అందరి అనుభవాలను మరియు దేవుని సంబంధించిన అవగాహనను కలిపి నేడు మనం చదువుతున్న ఈ వాక్య భాగాలకు వాటిని జోడించడం ద్వారా, మీరిప్పుడు దేవుణ్ణి గూర్చి ఒక మరింత వాస్తవికమైన మరియు ఖచ్చితమైన అవగాహనను కలిగియున్నారా?

ఈ కథనాన్ని చదివి ఈ ఉదంతము ద్వారా బయలుపరచపడిన దేవుని వైఖరిలో కొంత భాగాన్ని గ్రహించిన తరువాత, ఎటువంటి నూతన అభినందనను మీరు దేవుని పట్ల కలిగి ఉన్నారు? అది దేవుడు మరియు తన హృదయమును గూర్చి మీకేమైనా లోతైన అవగాహననిచ్చిందా? ఇప్పుడు నొవహు కథనాన్ని మీరు పునర్దర్శించినప్పుడు మీకేమైనా వేరే భావన కలుగుతుందా? మీ ఉద్దేశ్యంలో, ఈ బైబిల్ వచనాలను పంచుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు మనము దానిని వారితో పంచుకోవడమనేది, అవసరం లేదని మీరేమైనా భావిస్తున్నారా? నిశ్చయంగా అది అవసరమే! మనము చదివినది ఒక కథనమే అయినప్పటికీ, అది దేవుడు జరిగించిన కార్యానికి ఒక వాస్తవ లిఖితప్రమాణమై ఉన్నది. ఈ కథనాలు మరియు ఈ పాత్రకు సంబంధించిన వివరాలను గ్రహించి, తద్వారా మీరు వెళ్లి ఈ పాత్రను గురించి చదివేలా మిమ్మల్ని బలపరచాలన్నది నా లక్ష్యము కాదు, మరియు మీరు వెనక్కి వెళ్లి బైబిల్‌ను మరలా చదవాలని అస్సలు కాదు. మీకు అర్ధమవుతోందా? మరైతే ఈ కథనాలు దేవుని పట్ల మీకున్న జ్ఞానానికి ఏమైనా దోహదపడ్డాయా? ఈ కథనం దేవుని పట్ల మీకున్న జ్ఞానానికి ఏమి కలిపింది? హాంగ్ కాంగ్‌కు చెందిన సహోదర సహోదరీలారా, చెప్పండి. (దేవుని ప్రేమను మనలో పాపులైన మనుషులు ఎవ్వరూ కలిగి ఉండరన్నట్టుగా మనము చూశాము.) దక్షిణ కొరియాకు చెందిన సహోదర సహోదరీలారా, చెప్పండి. (మానవుల పట్ల దేవునికున్న ప్రేమ నిజమైనది. మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ అనేది తన వైఖరిని తెలియపరుస్తుంది మరియు తన మహోన్నతను, పరిశుద్దతను, సర్వాధికారాన్ని మరియు తన ఓర్పును కనుపరుస్తుంది. దానిని మనం లోతుగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించడమనేది మనకు విలువైనదై ఉన్నది.) (ఆపుడు మాత్రమే, ఒకవైపు, నీతికలిగిన దేవుని పరిశుద్ద స్వభావాన్ని నేను చూడగలుగుతాను, మరియు మానవాళి పట్ల దేవునికి ఉన్న చింతను, మానవజాతి పట్ల దేవుడు చూపే కరుణను కూడా నేను చూడగలుగుతాను, మరియు దేవుడు చేసే ప్రతి కార్యము ఆయనకున్న ప్రతి తలంపు మరియు భావన మానవజాతి పట్ల తనకున్న ప్రేమ మరియు శ్రద్ధను బయలుపరుస్తుంది.) (గతంలో నేను మానవజాతి ఘోరమైన స్థాయిలో దుర్మార్గంగా మారిపోయిందన్న కారణం చేత దేవుడు లోకాన్ని నాశనం చేయడానికి జలప్రళయాన్ని ఉపయోగించాడనీ, మరియు వారాయనను అసహ్యించుకున్నందుచేతనే దేవుడు ఈ మానవజాతిని నాశనం చేశాడనీ అర్ధం చేసుకున్నాను. ఈనాడు దేవుడు నొవహు కథనాన్ని గూర్చి మాటలాడి దేవుని హృదయం రక్తము కారుచున్నదని చెప్పిన తరువాత మాత్రమే, దేవునికి ఈ మానవాళిని విడనాడటం వాస్తవానికి ఇష్టపడలేదని నేను తెలుసుకున్నాను. మానవాళి ఎంతో అవిధేయతతో ఉన్నందుచేత మాత్రమే దేవునికి వారిని నాశనం చేయడం కాకుండా వేరే దారి లేకుండా పోయింది. వాస్తవానికి, ఈ సమయంలో దేవుని హృదయం ఎంతో వేదనతో ఉన్నది. దీన్నిబట్టి, దేవుని స్వభావములో మనుష్యుల యెడల ఆయనకున్న జాగ్రత్తను మరియు శ్రద్ధను నేను గమనించగలను. ఇదివరకు నేనిది ఎరుగని సంగతై ఉన్నది.) చాలా బాగుంది! తదుపరిగా మీరిక కొనసాగించవచ్చు. (ఇది విన్నాక నేను ఎంతో ప్రభావితుడనయ్యాను. ఇంతకుముందు నేను బైబిల్ చదివాను, కానీ మనం ఆయనను గూర్చి తెలుసుకోవాలని దేవుడు నేరుగా ఈ సంగతులను విడమర్చడాన్ని గూర్చిన ఈరోజు వంటి అనుభూతి నాకు ఎప్పుడూ కలుగలేదు. బైబిల్‌ని తెలుసుకోడానికి దేవుడు మనల్ని ఈవిధంగా వెంటబెట్టుకెళ్ళడం వలన మనుషుల చెడుతనము ఎదుట దేవుని గుణమనేది మానవజాతి పట్ల ప్రేమ మరియు సంరక్షణ అయ్యి ఉన్నదని తెలుసుకోడానికి వీలు కలిగించింది. మనిషి పాడైపోయినప్పటి నుండి ఈ ప్రస్తుత అంత్య దినాల దాకా, దేవునికి నీతియుక్తమైన వైఖరి ఉన్నా కూడా, ఆయనకున్న ప్రేమ మరియు శ్రద్ధ మారకుండా అలాగే ఉన్నాయి. సృష్టి మొదలుకొని ఇప్పటి దాకా, మనిషి పాడై పోయినా, దేవుని ప్రేమ భావము ఎప్పటికీ మారదని ఇది తెలియచేస్తుంది.) (కాలము లేదా ఆయన కార్యం చేసే స్థలము మారినందువల్ల దేవుని భావము మారదని ఈ దినం నేను తెలుసుకున్నాను. దేవుడు భూమిని సృజిస్తున్నా లేదా మానవుడు పాడై పోయిన తరువాత దాన్ని నాశనం చేస్తున్నా, ఆయన చేసే ప్రతి దానికీ భావం ఉంటుంది మరియు ఆయన వైఖరిని కలిగి ఉంటుందని కూడా నేను తెలుసుకున్నాను. అందువల్ల దేవుని ప్రేమ అపారమైనది మరియు కొలవ శక్యము కానిదని నేను తెలుసుకున్నాను మరియు ఇతర సహోదరులు మరియు సహోదరీలు ప్రస్తావించిన విధంగా, ఆయన భూమిని నాశనం చేసినప్పుడు మనిషి పట్ల దేవునికున్న శ్రద్ధ మరియు జాలిని నేను కూడా తెలుసుకున్నాను. నేడు వినిన తరువాత, దేవుడు నిజంగా సమర్దుడు, నిజంగా విశ్వసనీయమైనవాడు, విశ్వసించదగినవాడు మరియు ఆయన వాస్తవంగా ఉన్నాడని నేను తలంచుచున్నాను. దేవుని వైఖరి అలాగే ప్రేమ వాస్తవంగా నిర్దిష్టమైనవని నా హృదయంలో నేను యదార్ధంగా గుర్తించగలను. ఇదే ఈ దినం వినిన తరువాత నేను పొందిన అనుభూతి.) మంచిది! మీరు విన్నదంతా మీ హృదయంలోనికి స్వీకరించారని అనిపిస్తోంది.

మనం నేడు చర్చించిన బైబిల్ కథనాలన్నిటితో పాటు, బైబిల్ వచనాలన్నిటి నుండి మీరేమైనా గ్రహించారా? దేవుడు ఎప్పుడైనా ఆయన స్వంత తలంపులను వ్యక్తపరచడానికి లేదా మానవజాతి యెడల ఆయనకున్న ప్రేమ మరియు జాగ్రత్తను విశదపరచడానికి ఆయన స్వంత భాషను వాడారా? ఆయనకు మానవాళి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో లేదా ప్రేమ కలిగి ఉన్నాడో తెలియచేయడానికి ఆయన సామాన్యమైన భాషను వాడిననట్లు వ్రాయబడిందా? వ్రాయబడలేదు! ఇది వాస్తవం కాదా? మీలో ఎంతో మంది బైబిల్ని లేదా బైబిల్ కాక వేరే గ్రంధాలను పఠించిన వారున్నారు. మీలో ఎవరైనా ఇటువంటి వాక్యాలను చూసారా నిస్సందేహంగా జవాబు లేదనే వస్తుంది! అంటే, బైబిల్ నమోదులలో, దేవుని వాక్యాలు లేదా ఆయన కార్యపు ఆధార పత్రాలలో కూడా, దేవుడు ఏ శకములో లేదా ఏ యుగములోను ఆయన ఆలోచనలను విశదపరచడానికి లేదా మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను మరియు జాగ్రత్తను తెలియచేయడానికి ఆయన స్వంత విధానాన్ని వాడలేదు, లేదా దేవుడు ఎప్పుడూ ఆయన ఆలోచనలను మరియు మనోభావాలను తెలియచెప్పడానికి ఉపన్యాసాన్ని లేదా ఏదైనా క్రియలను వాడలేదు-అది నిజం కాదా? నేను దాన్నెందుకు చెప్తున్నాను? నేనెందుకు దీన్ని ప్రస్తావిస్తున్నాను? ఎందుకంటే, ఇది సైతం దేవుని ప్రేమతత్వమును మరియు ఆయన వైఖరిని ప్రతిబింబిస్తుంది.

దేవుడు మానవాళిని సృజించాడు; వారు పాడైపోయారా లేదా వారు ఆయనను వెంబడిస్తున్నారా అనే దాంతో నిమిత్తం లేకుండా, దేవుడు మనుష్యులను ఆయనకు ఎంతో ప్రియమైన వారిగా లెక్కిస్తాడు-లేదా మనుష్యులు చెప్పిన విధంగా, మనుష్యులు ఆయనకు ఎంతో ఇష్టమైన వారు-మరియు ఆయన ఆటాడుకునే సాధనాలు కాదు. ఆయనే సృష్టికర్త అని మరియు మానవుడు ఆయన సృష్టి అని దేవుడు చెప్పినా కూడా, స్థానంలో కొద్దిగా బేధమున్నట్లు అనిపించవచ్చు, నిజానికి దేవుడు మనుష్యుల కోసం చేసిన ప్రతిదీ ఈ ప్రకృతి యొక్క సంబంధానికి మించిపోయింది. దేవుడు మానవజాతిని ప్రేమిస్తున్నాడు, మనుష్యుల పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడు మరియు మానవాళి పట్ల శ్రద్ధ కనుపరుస్తాడు, అదే విధంగా మానవాళికి నిత్యము మరియు ఎడతెగకుండా సమకూరుస్తున్నాడు. ఇది ఎక్కువైన కార్యం లేదా చాలా పరపతికి తగినదని ఆయన తన హృదయంలో ఎప్పుడూ అనుకోడు. మానవజాతిని కాపాడడాన్ని, వారికి సమకూర్చడాన్ని మరియు వారికి అన్నీ అనుగ్రహించడాన్ని బట్టి మనుష్యులకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నట్లుగా ఆయన తలంచడంలేదు. ఆయన మానవాళికి నెమ్మదిగా మరియు మౌనంగా, ఆయన స్వంత దారిలో మరియు ఆయన స్వంత తత్వము ద్వారా మరియు ఆయన కలిగి ఉన్న మరియు ఉన్నవాటిని సమకూరుస్తాడు. మనుష్యులు ఆయన నుండి ఎంత పోషణను మరియు ఎంత ఉపకారమును పొందుకున్నప్పటికీ, దేవుడు ఎప్పుడూ దాన్ని గూర్చి ఆలోచించడు లేదా పేరును పొందడానికి ప్రయత్నించడు. ఇది దేవుని గుణాతిశయమును బట్టి నిశ్చయించబడుతుంది మరియు ఇది సరిగ్గా దేవుని స్వభావపు వాస్తవ పరిభాషయై ఉన్నది. అందుకని, బైబిల్‌లో ఉందా లేక ఏ ఇతర గ్రంధాల్లో ఉందా అన్నదానితో నిమిత్తం లేకుండా, దేవుడు ఆయన తలంపులను తెలియజేయడాన్ని మనం ఎన్నడూ కనుగోనలేము, మరియు మానవాళి ఆయన యెడల కృతజ్ఞతతో ఉండేలా లేదా ఆయనను స్తుతించాలనే గురితో దేవుడు మనుష్యులకు విశదపరచడం లేదా వెల్లడించడం లాంటి కార్యాలను ఆయన ఎందుకు చేస్తాడు, లేదా ఆయన మనుష్యుల కోసం ఎందుకు అంత శ్రద్ధ వహిస్తాడు అనేది మనము కనుగోనలేము. ఆయన గాయపడిప్పుడు, తన హృదయము మిక్కిలి వేదనలో ఉన్నప్పుడు కూడా, మానవాళి పట్ల తనకున్న బాధ్యతను లేక మానవాళి పట్ల తనకున్న శ్రద్ధను ఎప్పటికీ విస్మరించడు; అయితే ఈ బాధ మరియు వేదనను ఆయన ఒక్కడే మౌనంగా భరిస్తాడు. ఇందుకు వ్యతిరేకంగా, దేవుడు తను ఎప్పుడూ జరిగించినట్లుగానే మానవజాతికి సమకూరుస్తూనే ఉంటాడు. మానవాళి పదేపదే దేవుణ్ణి కీర్తిస్తూ లేక ఆయనకు సాక్ష్యమిస్తున్నప్పటికీ, ఈ ప్రవర్తన ఏదీ దేవుడు కోరింది కాదు. ఇది ఎందుచేతనంటే మానవజాతికి దేవుడు చేసే సత్కార్యాలు వేటినీ కృతజ్ఞతకు ప్రతిగా ఇచ్చిపుచ్చుకోవాలని గానీ లేక మళ్ళీ చెల్లించాలని గానీ ఆయన ఎన్నడూ భావించడు. ఇంకో ప్రక్కన, దేవునికి భయపడి దుర్మార్గాన్ని విడిచిపెట్టగలిగే వారు, దేవునిని నిజంగా వెంబడిస్తూ, ఆయన చెప్పేది వింటూ మరియు ఆయనకు లోబడగలిగే వారు, మరియు ఆయనకు విధేయులుగా ఉండగలిగే వారు—దేవుని దీవెనలను తరచుగా పొందే ప్రజలు వీరే, మరియు అటువంటి ఆశీర్వాదాలను దేవుడు మినహాయింపు లేకుండానే అనుగ్రహిస్తాడు. ఇంతకుమించి, దేవుని వద్ద నుండి ప్రజలు పొందుకునే దీవెనలు తరచుగా వారి ఊహకు అతీతమైనవి, మరియు మానవులు తాము చేసిన దానిని లేక తాము చెల్లించిన వెల ద్వారా సమర్ధించుకోగలిగిన దేనికైనా కూడా అతీతమైనవే. మానవాళి దేవుని దీవెనలను ఆస్వాదిస్తున్నప్పుడు, దేవుడు ఏమి చేస్తున్నాడన్న దానిపట్ల ఎవరైనా శ్రద్ధ చూపారా? దేవుడు ఎలా ఉన్నాడన్న దాని పట్ల ఎవరైనా శ్రద్దను కనుపరుస్తారా? దేవుని వేదనను ఎవరైనా గుర్తించే ప్రయత్నం చేస్తారా? జవాబు అంత ఖచ్చితంగా లేదు! ఆ క్షణంలో దేవుడు పడిన వేదనను, నోవహుతో కలిపి, ఏ మనిషైనా గుర్తించగలడా? దేవుడు అటువంటి ఒక నిబంధనను ఎందుకు స్థిరపరిచాడని ఎవరైనా అర్ధం చేసుకోగలరా? వారు చేసుకోలేరు! మానవాళి దేవుని వేదనను గుర్తించనిది, వారు దేవుని వేదనను అవగాహన చేసుకోలేరన్న కారణం చేతనో, దేవునికిని మానవునికి మధ్యనున్న దూరం లేక వారి స్థాయిలో ఉన్న వ్యత్యాసాన్ని గూర్చిన కారణం చేతనో కాదు; అందుకు ప్రతిగా, దేవుని భావనలలో వేటి పట్ల మానవాళి అస్సలు శ్రద్ధ చూపకపోవడమే అందుకు కారణమై ఉన్నది. తన పట్ల ఆసక్తి చూపడానికి, తనను తెలుసుకోడానికి లేక తన పట్ల శ్రద్దను కనుపరచడానికి దేవునికి ప్రజలు అవసరం లేదని—దేవుడు స్వతంత్రుడని మానవజాతి భావిస్తుంది. దేవుడు దేవుడై ఉన్నాడు, కాబట్టే ఆయనకు వేదన లేదు, భావోద్రేకాలు లేవు; ఆయన బాధపడడు, ఆయన దుఃఖించడు, ఆయన కనీసం ఏడవడు కూడా. దేవుడు దేవుడై ఉన్నాడు, అందుకే ఆయనకు ఎలాంటి భావోద్వేగపూర్వకమైన వ్యక్తీకరణల అవసరం లేదు మరియు ఆయనకు ఎలాంటి భావప్రేరితమైన ఓదార్పు అవసరం లేదు. ఒకవేళ, తప్పని పరిస్థితుల్లో, ఆయనకు ఈ విషయాల అవసరం వస్తే, ఆయన ఒక్కడిగానే పోరాడగలుగుతాడు మరియు మానవజాతి నుండి ఎలాంటి సహాయసహకారం అవసరం ఉండదు. అందుకు వ్యతిరేకంగా, నిర్బలమైన, పరిపక్వత లేని, మనుషులకు దేవుని సానుభూతి, సమకూర్పు, ప్రోద్బలం, మరియు కాలాలన్నిటిలో అన్ని చోట్ల వారి మనోభావాల నెమ్మది కొరకు సైతం ఆయన అవసరత ఉన్నది. అలాంటి సంగతులు మానవజాతి హృదయ అంతరంగపు లోతుల్లో నిగూఢమైయున్నాయి: మనిషి బలహీనమైన వాడు; వారిని అన్నివిధాలుగా ఆదుకోడానికి వారికి దేవుడు కావాలి, దేవుని వద్ద నుండి వారు పొందుకునే సంరక్షణ అంతటికీ వారు యోగ్యులు, మరియు తమదని అనుకున్న దానిని దేవుడిని స్వాధికారంతో అడగాలి. దేవుడు బలవంతుడై ఉన్నాడు; సమస్తము ఆయన వద్ద ఉన్నది, మరియు ఆయన మానవజాతి రక్షకునిగా మరియు ఆశీర్వాదాలను అనుగ్రహించే వానిగా ఉండాల్సి ఉన్నది. ఆయనే దేవుడు అయినందున, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు మరియు ఆయనకు మానవాళి నుండి ఎలాంటి అవసరత ఎప్పటికీ ఉండదు.

దేవుని ప్రత్యక్షతలకు సంబంధించిన దేనిని మానవుడు లక్ష్యపెట్టలేదు కాబట్టి, దేవుని బాధను, వేదనను, లేక సంతోషాన్ని అతడు ఎన్నడూ అనుభూతి చెందలేదు. అయితే అందుకు వ్యతిరేకంగా, దేవునికి తన అరచేయి లాగా మానవుని హావభావాలన్నీ తెలిసే ఉన్నవి. దేవుడు అన్ని సమయాల్లో మరియు అన్ని చోట్లా అందరి అవసరతలను తీర్చి, మారుతున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలను వీక్షిస్తుంటాడు, మరియు దానిని బట్టి వారిని ఆదరించి ప్రోత్సహించి, వారికి దారిచూపి ప్రకాశింపజేస్తాడు. మానవజాతి పట్ల దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి, మరియు వారి కారణంగా ఆయన చెల్లించిన వెల అంతటి పరంగా చూస్తే, బైబిల్‌లో లేక ఇప్పటిదాకా దేవుడు చెప్పిన దేనినుండైనా దేవుడు మానవుని నుండి ఏదోకటి కోరతాడన్న ఒక వాక్య భాగాన్నైనా ప్రజలు కనుగొనగలరా? లేదు! ఇందుకు ప్రతిగా, దేవుని తలంపును ప్రజలు ఎంతలా నిర్లక్ష్యం చేసినా సరే, ఇంకా ఆయన మానవజాతిని తరచూ నడిపిస్తూ, మానవజాతికి నిత్యం సమకూర్చి వారికి సహాయం అందిస్తాడు, ఆయన వారికొరకు సిద్దపరచిన సుందరమైన గమ్యస్థానాన్ని వారు చేరుకోడానికి వారు దేవుని మార్గాన్ని వెంబడించేలా చేస్తాడు. ఇక దేవుని విషయానికొస్తే, ఆయన ఏమి కలిగి ఉన్నాడో అదే అయ్యున్నాడు, ఆయన కృప, ఆయన కరుణ, మరియు ఆయన బహుమానాలన్నీ, తనను ప్రేమించి వెంబడించే వారికి ఎలాంటి దాపరికం లేకుండా అనుగ్రహించబడతాయి. కానీ, తాను అనుభవించిన వేదన లేక తన మానసిక పరిస్థితిని ఆయన ఏ వ్యక్తికీ ఎన్నడూ బయలుపరచడు, మరియు తనను ఎవరూ పట్టించుకోకపోవడాన్ని గూర్చి లేక తన చిత్తాన్ని తెలుసుకోకపోవడాన్ని గూర్చి ఆయన ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తపరచడు. ఇదంతా అయన మౌనంగా భరిస్తూ, మానవజాతి గ్రహించగలిగే రోజు కొరకు ఎదురుచుస్తాడు.

నేనెందుకు ఇక్కడే ఈ విషయాలను చెప్తున్నాను? నేను చెప్పిన సంగతులను బట్టి మీకు ఏమి కనపడుతుంది? దేవుని గుణంలో మరియు స్వభావంలో అందరూ విస్మరించే ఒక విషయమున్నది, అది ఇతరులు మహోన్నత వ్యక్తులుగా భావించే వారు, మంచివారు, లేక తమ ఊహాగానానికి సంబంధించిన దేవునితో సహా ఏ వ్యక్తి కలిగి లేనిది దేవుడు మాత్రమే కలిగి ఉన్న విషయమై ఉన్నది. ఈ విషయము ఏమై ఉంటుంది? అదే దేవుని దాతృత్వము. దాతృత్వాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు, నీ బిడ్డల విషయంలో, నీవెప్పుడు వారితో బేరమాడటమో లేక పేచీలు పెట్టడమో చేయవన్న కారణం చేత, నీవు కూడా ఎంతో దాతృత్వము గలవారని నీవు అనుకోవచ్చు, లేక నీ తల్లిదండ్రుల విషయంలో నీవు చాలా దాతృత్వము గలవారని నీవు అనుకుంటావు. నీవేమి అనుకున్నా ఫర్వాలేదు, కనీసం నీవు “దాతృత్వము” అన్న మాటను గురించిన ఒక భావనను కలిగి, దానిని ఒక సానుకూలమైన మాటగానైనా పరిగణించావు, దాతృత్వము గల వ్యక్తిగా ఉండటమనేది చాలా ఘనమైనది. నీవు దాతృత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, నిన్ను నీవు చాలా ఉన్నతంగా ఎంచుకుంటారు. కానీ సమస్త విషయాలలో, ప్రజలు, సంఘటనలు, లక్ష్యాలు, మరియు ఆయన కార్యములో, దేవుని దాతృత్వాన్ని చూడగలిగే వారు ఒక్కరూ లేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే, మనుషులు ఎంతో స్వార్ధపరులు! ఎందుకు నేను అలా అంటున్నాను? మానవజాతి అనేది ఒక భౌతికమైన లోకంలో జీవిస్తున్నది. నీవు దేవుడిని వెంబడిస్తావు, కానీ దేవుడు నీకు ఎలా సమకూర్చుతాడు, నిన్ను ప్రేమిస్తాడు, మరియు నీ పట్ల శ్రద్ధ కనుపరుస్తాడని నీవు ఎన్నడూ చూడవు లేక గుర్తించవు. మరైతే నీవేమి చూస్తావు? నిన్ను ప్రేమించి లేక నిన్ను గారాబం చేసే నీ రక్తసంబంధులను నీవు చూస్తావు. మీ శరీరానికి లాభదాయకమైన సంగతులనే నీవు చూస్తావు, నీవు ప్రేమించే ప్రజలు మరియు వస్తువులనే నీవు పట్టించుకుంటావు. మనుషుల దాతృత్వముగా పిలవబడేది ఇదే. అయితే, అటువంటి “దాతృత్వము” గల వ్యక్తులు, దేవుడు వారికిచ్చే జీవితాన్ని గూర్చి ఎప్పుడూ ఆలోచించరు. దేవునికి విరుద్దంగా, మనుషుల దాతృత్వమనేది స్వార్ధపూరితంగా మరియు హేయమైనదిగా మారుతుంది. మనుషులు నమ్మే దాతృత్వము నిష్పలమైనది, అవాస్తవమైనది, కల్మషమైనది, దేవునితో పొసగనిది, మరియు దేవునితో సంబంధం లేనిదై ఉన్నది. మనిషి దాతృత్వము తన కొరకైతే, దేవుని దాతృత్వము ఆయన స్వభావానికి సంబంధించిన ఒక వాస్తవ ప్రత్యక్షతగా ఉన్నది. ఖచ్చితంగా ఇది దేవుని దాతృత్వము కారణం చేత మాత్రమే మనిషి అనునిత్యం ఆయనచే పోషింపబడతాడు. నేడు నేను మాట్లాడుతున్న ఈ అంశము అంత గొప్పగా మిమ్మల్ని కదిలించకపోయినప్పటికీ, ఏదో ఏకీభవించడం కోసం మాత్రం తల ఊపుతూ ఉండవచ్చు, కానీ నీ హృదయమందు దేవుని హృదయాన్ని గ్రహించడానికి ప్రయత్నించినప్పుడు, తెలియకుండానే నీవు దీనిని కనుగొంటావు: ఈ లోకంలో నీవు అర్ధం చేసుకోగలిగే ప్రజలు, వస్తువులు, మరియు సంగతులన్నిటిలో, దేవుని దాతృత్వము మాత్రమే వాస్తము మరియు నిశ్చయమై ఉన్నది, ఎందుకంటే కేవలం నీపై ఆయనకున్న ప్రేమ మాత్రమే ఎల్లలు లేనిది మరియు నిష్కళంకమైనది. దేవుడు కాకుండా, దాతృత్వం గలవారని ఎవరైనా పిలవబడితే అది అబద్దం, భూటకం, మరియు అప్రమాణికం అవుతుంది; అది ఒక ఉద్దేశాన్ని, ఖచ్చితమైన ఆలోచనలు, మరియు ఒక ప్రతిఫల సిద్దాంతాన్ని కలిగి ఉంటుంది, మరియు అది పరీక్షింపబడటానికి నిలబడలేదు. అది మలినమైనది మరియు హేయమైనదని కూడా మీరు అనవచ్చు. మీరు ఈ మాటలను ఒప్పుకుంటూన్నారా?

ఈ అంశాలు మీకు చాల అపరిచితమైనవని వాటిని గ్రహించడానికి ముందు అవగతం చేసుకోడానికి మీకు కాస్త సమయం పడుతుందని నాకు తెలుసు. ఈ విషయాల పట్ల మీరు ఎంత అపరిచితంగా ఉంటారో, మీ హృదయంలో ఈ అంశాలను మీరు అంతగా కోల్పోతున్నారని అది నిరూపిస్తుంది. ఒకవేళ నేను ఈ అంశాలను ఎన్నటికీ ప్రస్తావించకపోయివుంటే, మీలో ఎవరికైనా వాటి గూర్చి తెలిసేదా? వాటి గురించి మీకు ఎప్పటికీ తెలిసేది కాదని నేను విశ్వసిస్తున్నాను. ఇది మాత్రం ఖచ్చితం. మీరెంతగా అవగాహన చేసుకుని గ్రహించినా సరే, సంక్షిప్తంగా చెప్పాలంటే, నేను మాట్లాడుతున్న ఈ అంశాలు అనేకమంది ప్రజలు కలిగి లేనివి మరియు అనేకమంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవై ఉన్నాయి. ఇవి ప్రతొక్కరికీ ప్రాముఖ్యమైన అంశాలై ఉన్నాయి—అవి అముల్యమైనవి మరియు అవి జీవమునై, మీరు ముందుకు సాగడానికి ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన సంగతులై ఉన్నాయి. ఈ మాటలు మార్గదర్శకాలుగా కాకుండా, దేవుని వైఖరి మరియు లక్షణాన్ని గుర్చిన గ్రహింపు నీకు లేకుండా, దేవుని విషయానికొచ్చిన ప్రతిసారి నీవు ప్రశ్నార్ధకంగానే ఉండిపోతావు. దేవుని గూర్చిన అవగాహన కూడా నీకు లేకపోతే, నీవు ఆయనను ఎలా ఖచ్చితంగా నమ్మగలవు? దేవుని మనోభావాలు, ఆయన చిత్తము, అయన మనస్థితి, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయనను బాధపెట్టేది ఏమిటి, మరియు ఆయనను సంతోషపెట్టేది ఏమిటన్న వాటి గూర్చి నీకేమీ తెలియదు, మరి దేవుని హృదయం పట్ల నీవెలా సద్భావనను కలిగి ఉంటావు?

దేవుడు వ్యాకుల పడిన ప్రతిసారీ, తన పట్ల కనీస శ్రద్దను కనుపరచని ఒక మానవజాతిని, తనను వెంబడిస్తూ తనను ప్రేమిస్తున్నామని చాటుకుంటూ తన మనోభావాలను మాత్రం పూర్తిగా విస్మరించే ఒక మానవజాతిని ఆయన ఎదుర్కొంటాడు. ఆయన హృదయము ఎలా బాధపడకుండా ఉంటుంది? దేవుని నిర్వహణ కార్యములో, ఆయన తన కార్యాన్ని యదార్ధంగా జరిగించి ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, మరియు ఆయన వారిని ఎలాంటి మినహాయింపు మరియు దాపరికం లేకుండా ఎదుర్కొంటాడు; అయితే అందుకు వ్యతిరేకంగా, ఆయనను వెంబడించే ప్రతి వ్యక్తి తన నుండి నిరుద్ధంగా ఉంటాడు, మరియు క్రియాశీలకంగా ఆయనకు దగ్గరవ్వడానికి, తన హృదయాన్ని అవగతం చేసుకోడానికి, లేక తన భావనల పట్ల ధ్యాస పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. దేవుని అంతరంగికులుగా ఉండాలని ఆశించే వారు సైతం ఆయనకు దగ్గరవ్వడానికి, తన హృదయం పట్ల శ్రద్ధ చూపడానికి, లేక తనను తెలుసునేలా ప్రయత్నించడానికి ఇష్టపడటం లేదు. దేవుడు ఆనందభరితుడై సంతోషముగా ఉన్నప్పుడు, తన ఆనందంలో పాలిభాగస్తులవ్వడానికి ఎవ్వరూ లేరు. ప్రజలు దేవుణ్ణి అపార్థం చేసుకున్నప్పుడు, గాయపడిన తన హృదయాన్ని ఆదరించే వారు ఒక్కరూ లేరు. ఆయన హృదయము బాధించబడుతున్నప్పుడు, తమ యందు నమ్మకముంచడానికి ఆయనను ఏ ఒక్క వ్యక్తి కూడా ఇష్టపడటం లేదు. ఇన్ని వేల సంవత్సరాల దేవుని నిర్వహణ కార్యములో, దేవుని మనోద్వేగాలను అవగాహన చేసుకున్నవారు ఎవ్వరూ లేరు, వాటిని గ్రహించిన వారు లేక గుర్తించిన వారు ఎవ్వరూ లేరు, దేవుని సుఖ దుఃఖాలలో భాగస్తులవ్వడానికి ఆయన పక్షాన నిలబడగలిగే వారు ఎవ్వరూ లేరు. దేవుడు ఒంటరి అయిపోయాడు. ఆయన ఒంటరిగానే ఉన్నాడు! చెడిపోయిన మానవజాతి ఆయనను ఎదిరించిన కారణం చేత మాత్రమే కాదు, కానీ ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండాలని ఆశించే వారు, దేవుని తెలుసుకుని ఆయనను అవగాహన చేసుకోవాలని ఆశించే వారి కారణం చేతనే ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన కొరకు తమ జీవితాలన్నిటినీ వెచ్చించడానికి సిద్దపడే వారికి సైతం, ఆయన ఉద్దేశాలు తెలియవు, తన స్వభావము మరియు తన భావోద్వేగాలు అర్ధం కావు.

నోవహు కథనం అంతానికి వచ్చేసరికి, ఆ కాలంలో దేవుడు తన మనోభావాలను తెలియజేయడానికి ఒక అపూర్వమైన విధానాన్ని అవలభించినట్లు మనము చూస్తాము. అదొక విశేషమైన విధానము: అదే జలప్రళయం చేత లోకాన్ని నాశనం చేసి అంతమొందించాలని దేవుడు ప్రకటించిన మనిషితోనే ఒక నిబంధన చేయడమై ఉన్నది. భూమిమీద, ఒక నిబంధన చేయడమనేది చాల సామాన్యమైన సంగతిగా అనిపించవచ్చు. ఇది రెండు పక్షాలను కట్టడి చేసి తమ ఒప్పందాన్ని తామే అతిక్రమించకుండా నియత్రించడానికి వాడటం తప్ప మరేమీ కాదు, ఆవిధంగా తాము ఇరివురి ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. చూడటానికి, ఇదొక అత్యంత సామాన్యమైన సంగతే, కానీ ఈ కార్యము చేయడంలోని దేవుని ఉద్దేశం మరియు వెనకున్న ప్రేరేపణల బట్టి చూస్తే, ఇది దేవుని వైఖరి మరియు మనస్థితికి సంబంధించిన ఒక వాస్తవ ప్రత్యక్షతయై ఉన్నది. ఒకవేళ నీవు ఈ మాటలను మాత్రము పక్కన పెట్టి వాటిని నిర్లక్ష్యం చేసి, నేను గనుక ఈ సంగతులను గూర్చిన సత్యాన్ని చెప్పకపోయినట్లయితే, అప్పుడు మానవజాతికి దేవుని తలంపు అన్నది తెలిసుండేది కాదు. బహుశా నీ ఊహాగానంలో దేవుడు ఈ నిబంధన చేసినప్పుడు ఆయన చిరునవ్వుతో ఉండవచ్చు, లేక ఆయన హావభావాలు బహుశా తీవ్రంగా ఉండవచ్చు, కానీ దేవుడు కలిగి ఉండవచ్చని ప్రజలు భావించిన అత్యంత సాధారణమైన హావభావాలను పక్కన పెడితే, దేవుని ఒంటరితనాన్ని తప్ప, తన హృదయాన్ని లేక తన వేదనను చూసిన వారెవ్వరూ లేరు. దేవుడు తమను నమ్మేటట్లు ఎవ్వరూ చేయలేరు లేక దేవుని విశ్వసనీయతకు ఎవరూ అర్హులు కాలేరు, లేక ఆయన తన ఉద్దేశాలను వెల్లడి చేయగలిగే లేక తన వేదనను చెప్పేగలిగే ఒక వ్యక్తిగా ఎవరూ చేయలేరు. అందువల్ల, దేవునికి అటువంటి కార్యం జరిగించడం తప్ప గత్యంతరం లేకుండా పోయింది. భూమిమీద, గత సమస్యను పరిష్కరించి జలప్రళయంతో తాను లోకాన్ని నాశనం చేయడం చేత ఒక పరిపూర్ణమైన ముగింపును తెచ్చి, మానవజాతిని నిష్క్రమింపజేయడంలో దేవుడు చాలా తేలికైన పనిని చేశాడు. ఏదేమైనప్పటికీ, ఈ క్షణంతో దేవుడు తన హృదయపు లోతుల్లోని వేదనను భూస్థాపితం చేసేశాడు. చెప్పుకోడానికి దేవునికి ఎవరూ లేని ఒకానొక సమయంలో, తాను మరలా జలప్రళయం చేత లోకాన్ని నాశనం చేయబోనని వారితో చెప్పి, ఆయన మానవజాతితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ ఇంద్రధనస్సు ప్రత్యక్షమైనప్పుడు, అది అటువంటి ఒక సంఘటన జరిగిందని ప్రజలకు జ్ఞాపకం చేసి దుర్మార్గం నుండి వారిని ఎడంగా ఉండాలని హెచ్చరించడమై ఉన్నది. అలాంటి ఒక వేదనకరమైన స్థితిలో ఉండి కూడా, దేవుడు మానవజాతిని మరిచిపోలేదు మరియు ఇంకా వారి పట్ల ఎంతో శ్రద్దను కనుపరిచాడు. దీనిని దేవుని ప్రేమ మరియు దాతృత్వము కాదంటారా? అయితే ప్రజలు బాధపడుతున్నప్పుడు వారు ఏమని ఆలోచిస్తారు? దేవుడు వారికి మిక్కిలి అవసరమైన సమయం ఇది కాదా? ఇటువంటి సమయాల్లోనే, ఆయన అయితే వారిని ఆదరించగలడని, ప్రజలు ఎల్లప్పుడూ దేవునిని మధ్యలోకి లాగుతారు. ఎప్పుడైనా సరే, ప్రజలను దేవుడు ఎన్నటికీ తక్కువ చేయడు, మరియు ఆయన ప్రజలను వారి ఇబ్బందుల నుండి బయటకు రప్పించి వెలుగులో జీవించేలా చేస్తాడు. మనుష్య జాతికి దేవుడు ఎంతగా సమకూర్చినప్పటికీ, మానవుని హృదయంలో దేవుడు ఓదార్పునిచ్చే ఒక గుళిక, ఆదరించే ఔషధం తప్ప ఇంకేదీ కాదు. దేవుడు బాధపడుతున్నప్పుడు, తన హృదయం గాయపడినప్పుడు, సృజించబడిన ఒక జీవిగా ఉండి లేక ఏ వ్యక్తిగానైనా ఆయన తోడుండి లేక ఆదరించడమనేది ఖచ్చితంగా ఇది దేవునికి ఉన్న ఒక మితిమీరిన కోరిక మాత్రమే. దేవుని భావనల పట్ల మానవుడు ఎన్నడూ శ్రద్ధను కనుపరచడు, కాబట్టి దేవుడు ఆదరించగలిగే వ్యక్తి ఒకరుండాలని దేవుడు ఎప్పుడూ అడగదు లేక ఎదురుచూడడు. ఆయన తన మనఃస్థితిని తెలియజేయడానికి తన సొంత విధానాలనే అవలంబిస్తాడు. కొద్దిపాటి బాధను అనుభవించడమనేది దేవునికి ఎంతో కష్టతరమని ప్రజలు అనుకోరు, కానీ నీవు నిజంగా దేవుడిని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు చేసే ప్రతి కార్యంలోని తన సదుద్దేశాలను నీవు యదార్ధంగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే, నీవు దేవుని మహోన్నతను మరియు దాతృత్వాన్ని అనుభవించగలుగుతారు. ఇంద్రధనస్సును ఉపయోగించి దేవుడు మానవజాతితో నిబంధన చేసుకున్నప్పటికీ, ఆయన దీనిని ఎందుకు చేశాడన్నది—ఆయన ఈ నిబంధనను ఎందుకు స్తాపించాడన్నది ఆయన ఎవరితోనూ చెప్పలేదు—అంటే, ఆయన తన మూల ఉద్దేశ్యాలను ఎవరికీ ఎన్నడూ చెప్పలేదని భావము. ఇది ఎందుచేతనంటే తన స్వహస్తాలతో సృజించిన మానవజాతి మీద దేవునికి ఉన్న ప్రేమ లోతును గ్రహించగలిగేవారు ఎవరూ లేరు, మరియు ఆయన మానవజాతిని నాశనం చేసినప్పుడు మాత్రం తన హృదయము ఎంతటి వేదనను అనుభవించిందన్న దానిని గుర్తించగలిగేవారు కూడా ఎవరూ లేరు. దీన్నిబట్టి, ఒకవేళ తనకు అనిపించిన దానిని ప్రజలకు చెప్పాల్సి వచ్చినప్పటికీ, వారు ఈ నమ్మకాన్ని కలిగి ఉండలేరు. ఆయన బాధలో ఉన్నా గానీ, తన కార్యపు తదుపరి భాగాన్ని కొనసాగిస్తాడు. బాధంతటినీ దేవుడు తనకుతానే మౌనంగా భరిస్తూ, మానవజాతికి మాత్రము ఎప్పుడూ తన వద్దనున్న ఉత్తమమైన దానిని మరియు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. ఈ బాధలను దేవుడు ఎప్పడూ బాహాటంగా వ్యక్తపరచడు. అందుకు ప్రతిగా, ఆయన వాటిని ఓర్చుకుంటూ మౌనంగా ఎదురు చూస్తాడు. దేవుని సహనము ప్రతికూలంగా, స్తబ్దముగా, లేక నిస్సహాయతగా ఉండేదో, లేక అదొక బలహీనతకు సూచనో కాదు. అందుకు బదులుగా, దేవుని ప్రేమాగుణములు నిరంతరం నిస్వార్ధమైనవిగానే ఉన్నాయి. ఆయన గుణము స్వభావములకు ఇదొక సహజమైన ప్రత్యక్షతగా, మరియు నిజమైన సృష్టికర్తగా దేవుని గుర్తింపునకు ఒక యదార్ధమైన స్వరూపముగా ఉన్నది.

ఇలా చెప్పినందుకు కొంతమంది నా భావాన్ని అపార్ధం చేసుకోవచ్చు. “ఇంతటి వివరణాత్మకతతో, ఎంతో సంచలనాత్మకమైన రీతిలో దేవుని మనోభావాలను అభివర్ణించడం అనేది, దేవునిని బట్టి ప్రజలు చింతించేలా చేయడానికే అన్నట్టు ఉన్నదా?” ఇక్కడున్న ఉద్దేశం అదేనా? (కాదు.) మీరు దేవుని గురించి చక్కగా తెలుసుకుని, విస్తారమైన తన దృక్పథాలను అవగాహన చేసుకుని, తన మనోభావాలను అర్ధం చేసుకుని, దేవుని గుణము మరియు స్వభావములు మనుషుల వట్టి మాటలు, వారి పత్రికలు మరియు సిద్దాంతాలు, లేక వారి ఊహాగానాల ద్వారా వర్ణించబడటానికి బదులుగా, ఆయన కార్యము ద్వారా, యథాతథంగా మరియు పొల్లు పోకుండా తెలియజేయబడ్డాయని గుర్తించడమే, నేను ఈ విషయాలను చెప్పడానికున్న ఏకైక ఉద్దేశ్యమై ఉన్నది. చెప్పాలంటే, దేవుడు మరియు దేవుని లక్షణము అనేవి నిజంగానే ఉన్నాయి—అవేమీ చిత్రలేఖనాలు కావు, ఊహాగానాలు కావు, మానవ నిర్మితము కాదు, మరియు మానవ కల్పితాలు ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మీరు దీనిని గుర్తుపట్టారా? ఒకవేళ మీరు దాన్ని గుర్తుపడితే, ఈనాటి నా మాటలు వాటి గమ్యాన్ని చేరుకున్నాయని అర్ధం.

ఈ దినం మనము మూడు అంశాల గురించి మాట్లాడుకున్నాము. ఈ మూడు అంశాలపై జరిగిన మన సహవాసం నుండి అందరూ చాలానే పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ మూడు అంశాల నుంచి, నేను అభివర్ణించిన దేవుని తలంపులు లేక నేను ప్రస్తావించిన దేవుని స్వభావము మరియు గుణము అనేవి దేవుని గూర్చిన ప్రజల ఊహాగానాలను మరియు అవగాహనను మార్చి వేసి, దేవునిపై అందరికున్న విశ్వాసాన్ని సైతం మార్చేశాయని, మరియు ఇంతే కాకుండా, ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో ప్రసంశించే దేవుని ప్రతిరుపాన్నీ మార్చేశాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏది ఏమైనా సరే, బైబిల్ గురించిన ఈ రెండు భాగాలలో దేవుని స్వభావం గూర్చి మీరు నేర్చుకున్నది మీకు లాభదాయకంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను, మరియు మీరు మళ్ళీ వచ్చాక మీరు దాని గురించి ఎక్కువగా పర్యాలోచన చేస్తారని నిరీక్షిస్తున్నాను. ఇక్కడితో ఈరోజు కూడిక ముగుస్తోంది. శుభం!

నవంబర్ 4, 2013

మునుపటి:  దేవుడి స్వభావాన్ని మరియు ఆయన కార్యము సాధించే ఫలితాలను ఎలా తెలుసుకోవాలి

తరువాత:  దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు II

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger