దేవుని కార్యము మరియు మానవుని కార్యము

పరిశుద్ధాత్మ కార్యములో మానవుని కార్యము ఎంత మరియు మానవ అనుభవము ఎంత? ఇప్పటికీ ఈ ప్రశ్నలను ప్రజలు అర్ధం చేసుకోలేదనే చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ నియమాలను వారు అర్ధము చేసుకోకపోవడమే దానికి కారణము. “మానవుని కార్యము” అని నేను చెప్పానంటే, నిజానికి, పరిశుద్ధాత్మ చేత వాడబడిన వారు లేక పరిశుద్ధాత్మ కార్యమును కలిగి ఉన్న వారి కార్యమును నేను సూచిస్తున్నాను. అపొస్తలులు, పనివారు, లేక పరిశుద్ధాత్మ కార్యము ఆధీనములో ఉన్న సహోదర సహోదరీల కార్యమును నేను సుచిస్తున్నానే గానీ, మానవ చిత్తానుసారమైన కార్యమును కాదు. ఇక్కడ, “మానవ కార్యము” అంటే, ప్రజల పట్ల పరిశుద్ధాత్మ చేసే కార్యము వ్యాప్తి మరియు నియమాలను సూచిస్తుందే గానీ, శరీరధారి అయిన దేవుని కార్యమును సూచించడం లేదు. ఈ నియమాలనేవి పరిశుద్ధాత్మ నియమాలు మరియు వ్యాప్తి కాబట్టి, అవి శరీరధారి అయిన దేవుని కార్యపు నియమాలు మరియు వ్యాప్తి వలె ఒకటిగా ఉండవు. మానవ కార్యమందు మానవ స్వభావము మరియు నియమాలు ఉన్నాయి, అలాగే దేవుని కార్యమందు దేవుని స్వభావము మరియు నియమాలు ఉన్నాయి.

పరిశుద్ధాత్మ ప్రవాహంలోని కార్యమనేది దేవుని సొంత కార్యమైనప్పటికీ, లేక వాడబడుచున్న వ్యక్తుల కార్యమైనప్పటికీ, అది పరిశుద్ధాత్మ కార్యమైయున్నది. స్వయంగా దేవుని స్వభావమే ఆత్మగా ఉంటోంది, దీనినే పరిశుద్ధాత్మ లేక ఏడంతలు హెచ్చించబడిన ఆత్మగా కూడా పిలవచ్చు. మొత్తానికి, దేవుని ఆత్మ వివిధ కాలాల్లో నానా రకాల పేర్లతో పిలువబడినప్పటికీ, అవన్నీ దేవుని ఆత్మగానే ఉన్నాయి. వాటి స్వభావము ఒకటిగానే ఉన్నది. కాబట్టి, దేవుని కార్యమే పరిశుద్ధాత్మ కార్యము అయినప్పటికీ, శరీరధారి అయిన దేవుని కార్యము పరిశుద్ధాత్మ కార్యము కంటే తక్కువేమీ కాదు. వాడబడిన వ్యక్తుల కార్యము కూడా పరిశుద్దాత్మ కార్యమే. అయినప్పటికీ దేవుని కార్యము అనేది పరిశుద్దాత్మ కార్యపు సంపూర్ణ వ్యక్తీకరణగా ఉన్నది, ఇది సర్వ సత్యము, అయితే వాడబడుచున్న వ్యక్తుల కార్యము పరిశుద్దాత్మ ప్రత్యక్ష వ్యక్తీకరణ లేక ఆయన సంపూర్ణ వ్యక్తీకరణగా కాకుండా, అనేకమైన మానవ సంగతులతో మిళితమై ఉన్నది. పరిశుద్దాత్మ కార్యము వైవిధ్యమైనది మరియు ఎల్లలు లేనిది. పరిశుద్దాత్మ కార్యము వేర్వేరు మనుషుల్లో వేర్వేరుగా ఉంటుంది; ఇది విభిన్న స్వభావాలను వెల్లడిస్తుంది, కాలాన్ని బట్టి, అలాగే దేశాన్ని బట్టి భిన్నముగా ఉంటుంది. వాస్తవానికి, పరిశుద్ధాత్మ వివిధ నియమాల ప్రకారం, మరియు వివిధ రకాలుగా కార్యము చేసినప్పటికీ, ఆ కార్యము ఎలా చేసినప్పటికీ మరియు ఎలాంటి వ్యక్తుల పట్ల చేసినప్పటికీ, దాని స్వభావము ఎల్లప్పుడూ విభిన్నముగానే ఉంటుంది; వేర్వేరు వ్యక్తుల పట్ల చేయబడిన కార్యమంతా దాని నియమాలు కలిగి, అలాగే అవన్నీ దాని విషయాల స్వభావాన్ని కనుపరుస్తాయి. ఎందుకంటే పరిశుద్దాత్మ కార్యము వ్యాప్తిలో చాలా ఖచ్చితముగా మరియు చాలా ప్రామాణికముగా ఉంటుంది. అవతార దేహమందు చేయబడిన కార్యము మరియు ప్రజల పట్ల జరిగింపబడిన కార్యము ఒకటి కాదు మరియు దాన్ని జరిపించే వ్యక్తి పటిమను బట్టి కూడా ఆ కార్యము మార్పు చెందుతుంది. అవతార దేహమందు చేయబడిన కార్యము మనుష్యుల పట్ల చేయబడలేదు, ఇది మనుష్యుల పట్ల చేయదగిన కార్యమూ కాదు. క్లుప్తంగా, వివిధ విషయాల పట్ల చేయబడే కార్యము, ఎలా జరిగినప్పటికీ, అది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, మరియు ఆయన పనిచేసే వేర్వేరు వ్యక్తుల పరిస్థితులు మరియు స్వభావాలకు అనుగుణముగా ఆయన చేసే కార్యము కూడా విభిన్నముగా ఉంటుంది. వేర్వేరు ప్రజల సహజ స్వభావము ఆధారముగా పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తాడు, మరియు వారి పట్ల స్వభావాన్ని మించిన ఆక్షేపణలు చేయడు, అలాగే వారి సహజ స్థాయికి మించిన కార్యాన్ని వారి పట్ల ఆయన చేయడు. కాబట్టి, మానవుని పట్ల పరిశుద్దాత్మ కార్యమనేది, ప్రజలను ఆ కార్య లక్ష్యము స్వభావాన్ని చూడనిస్తుంది. మానవ సహజ స్వభావము మారదు; సహజమైన తన సామర్థ్యము పరిమితముగా ఉన్నది. ప్రజల శక్తి సామర్థ్యాలకు అనుగుణముగా, వారు దాని నుండి ప్రయోజనము పొందడానికి పరిశుద్ధాత్ముడు వారిని ఉపయోగించుకుంటాడు లేదా కార్యము చేస్తాడు. వాడబడుచున్న వ్యక్తులపై పరిశుద్దాత్మ కార్యము చేస్తున్నప్పుడు, ఆ ప్రజల తలాంతులు మరియు సహజ సామర్థ్యము ఇంకా బలపరచబడుతుందే గానీ, నిలువరించబడదు. కార్యము జరిగించడంలో వారి స్వాభావిక సామర్థ్యము వినియోగించబడుతుంది. ఆ కార్యములో ఫలితాలను సాధించడానికి, ఆయన కార్యములో ఉపయోగపడే మనుష్యుల విభాగాలను ఆయన ఉపయోగించుకుంటాడని చెప్పవచ్చు. దీనికి భిన్నముగా, అవతార దేహమందు చేయబడిన కార్యమనేది ఆత్మ కార్యమును ప్రత్యక్షముగా వెల్లడిచేస్తుంది, అది మానవుని మనస్సు మరియు తలంపులతో కల్మషము కానిది; మానవుని వరములు కానీ, మానవ అనుభవాలు కానీ, స్వాభావికమైన మానవుని స్థితి కానీ, ఏవీ దానిని చేరుకోలేవు. అమితమైన పరిశుద్దాత్మ కార్యమంతా మానవునికి ప్రయోజనము మరియు వృద్దిని చేకూర్చే విధముగా ఉద్దేశించబడింది. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు పరిపూర్ణ పరచబడగలిగితే, మరి కొంతమంది పరిపూర్ణత కొరకైన పరిస్థితులు కలిగి ఉండరు, అంటే వారు పరిపూర్ణ పరచబడలేరు మరియు రక్షింపబడలేరు, మరియు వారు పరిశుద్దాత్మ కార్యమును కలిగి ఉన్నప్పటికీ, అంతిమంగా వారు బహిష్కరించబడతారని అర్ధము. పరిశుద్దాత్మ కార్యము ప్రజలను వృద్ధి చేయడం కొరకే అని చెప్పినప్పటికీ, పరిశుద్దాత్మ కార్యమును కలిగియున్న వారందరూ పూర్తిగా పరిపూర్ణులవుతారని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, తమ అన్వేషణలో ప్రజలు అనుసరించే మార్గము పరిపూర్ణపరచబడే మార్గము కాదు. వారు మానవ సహకార రహితమైన మరియు అస్సలు మానవ అన్వేషణ లేని ఏకపక్షమైన పరిశుద్దాత్మ కార్యము కలిగి ఉన్నారు. అందువల్ల, పరిపూర్ణ పరచబడుచున్న వారికి సేవ చేయుటకు పరిశుద్దాత్మ కార్యము ఈ ప్రజల మీదికి వస్తుంది. పరిశుద్దాత్మ కార్యమును ప్రజలు ప్రత్యక్షముగా చూడలేరు మరియు ప్రజలు స్వయముగా నేరుగా దానిని తాకలేరు. కార్యపు బహుమతి కలిగి ఉన్న వారి ద్వారా మాత్రమే ఇది తెలియజేయబడుతుంది, అంటే వ్యక్తులు చేసే ప్రసంగాల ద్వారా పరిశుద్దాత్మ కార్యము అనుచరులకు అందించబడుతుంది.

పరిశుద్దాత్మ కార్యము అనేక రకాలైన ప్రజలు మరియు చాలా భిన్నమైన పరిస్థితులగుండా స్థాపించబడి పూర్తి చేయబడుతుంది. శరీరధారి అయిన దేవుని కార్యము మొత్తం కాలానికి చెందిన కార్యాన్ని కనుపరచి మరియు యుగమంతటిలోని ప్రజల ప్రవేశాన్ని సూచిస్తున్నపటికీ, ప్రజల ప్రవేశమునకు చెందిన వివరాలపై ఇంకా పని చేయవలసినది పరిశుద్దాత్మ చేత వాడబడుచున్న వ్యక్తులే గానీ, శరీరధారి అయిన దేవుడు కాదు. కాబట్టి దేవుని కార్యము, లేక దేవుని సొంత పరిచర్య అనేది శరీరధారి అయిన దేవుని శరీరము యొక్క కార్యమే గానీ, ఆయన స్థానములో మానవుడు చేయలేడు. పరిశుద్దాత్మ కార్యము అనేక రకాలైన వ్యక్తుల ద్వారా పూర్తి చేయబడుతుంది; ఏ ఒక్క వ్యక్తి దానిని పూర్తిగా సాధించలేదు, మరియు ఏ ఒక్క వ్యక్తి దానిని పూర్తిగా తెలియపరచలేడు. సంఘాలను నడిపించే వారు కూడా పరిశుద్దాత్మ కార్యాన్ని పూర్తిగా కనపరచలేరు; నడిపించే కార్యమును మాత్రమే వారు కొంత చేయగలరు. పరిశుద్దాత్మ కార్యమును మూడు భాగాలుగా విభజించవచ్చు; దేవుని స్వీయ కార్యము, వాడబడిన వ్యక్తుల కార్యము, మరియు పరిశుద్దాత్మ నడిపింపులో ఉన్న వారందరిపై ఉన్న కార్యము. కాలమంతటినీ నడిపించడమే దేవుని స్వీయ కార్యము; దేవుడు తన స్వీయ కార్యాన్ని ముగించిన తరువాత, ఆజ్ఞలను పొందుకుని లేక పంపబడి, దేవుని కార్యమునకు సహకరించే వారిగా ఉంటూ, దేవుని అనుచరులందరినీ నడిపించడమే వాడబడిన వారి యొక్క కార్యము; ఆయన స్వీయ కార్యాన్ని నిర్వర్తించడం, అంటే, ఆయన సాక్ష్యాన్ని మరియు ఆయన నిర్వహణ అంతటిని కొనసాగించడం, అలాగే పరిపూర్ణులుగా చేయగలిగిన వారిని ఒకేసారి పరిపూర్ణులుగా చేయడమే నడిపింపులో ఉన్న వారిపై పరిశుద్దాత్మ చేసే కార్యమై ఉన్నది. వెరసి, ఈ మూడు భాగాలు పరిశుద్దాత్మ సంపూర్ణ కార్యమై ఉన్నది, కానీ దేవుని కార్యము లేకపోతే, నిర్వహణ కార్యము పూర్తిగా నిలిచిపోతుంది. దేవుని కార్యము సమస్త మానవ జాతి కార్యమును లోబరచుకుని, మరియు యుగమంతటి కార్యాన్ని ఇది కనుపరుస్తుంది, అంటే దేవుని స్వీయ కార్యము పరిశుద్దాత్మ కార్యపు ధోరణి మరియు చలన శక్తిని కనుపరుస్తుందని భావము, అయితే దేవుని స్వీయ కార్యము తరువాత మరియు దానిని వెంబడిస్తూ, అపొస్తలుల కార్యము వస్తుంది, మరియు అది కాలాన్ని నడిపించదు, అలాగే ఒక యుగమంతటిలోని పరిశుద్దాత్మ కార్యపు ధోరణిని ఇది కనుపరచదు. నిర్వహణ కార్యముతో దీనికి ఎటువంటి సంబంధము లేని, మానవుడు చేయవలసిన కార్యమును మాత్రమే అవి చేస్తాయి. దేవుడు తానుగా చేసే కార్యము నిర్వహణ కార్యమందు ఒక ఆశయమై ఉన్నది. మానవ కార్యము అనేది వాడబడిన వ్యక్తులు మాత్రమే నెరవేర్చే బాధ్యత మరియు ఇది నిర్వహణ కార్యమునకు సంబంధము లేనిది. ఇవి రెండూ పరిశుద్దాత్మ కార్యము అనేది వాస్తవమైనప్పటికీ, కార్యపు విలక్షణతలు మరియు నిరూపణలలో వ్యత్యాసమున్న కారణాన్ని బట్టి, దేవుని స్వీయ కార్యమునకు మానవ కార్యమునకు మద్య స్పష్టమైన మరియు స్వాభావికమైన వ్యత్యాసాలు ఉన్నాయి. పరిశుద్దాత్మ చేసిన కార్యపు పరిధి వివిధ విలక్షణతలు కలిగియున్న అంశాలను బట్టి మారుతుంది. ఇవే పరిశుద్దాత్మ కార్యపు వ్యాప్తి మరియు నియమాలు.

మనిషి పని అతని అనుభవాన్ని మరియు అతని మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషి సంపాదించేది మరియు తను చేసే పని తనను తెలియజేస్తుంది. మానవ జ్ఞానము, మానవ యుక్తి, మానవ తర్కము, మరియు అతని సంపన్న భావనలు అన్నీ అతని కార్యములో ఇమిడి ఉన్నాయి. మానవుని అనుభవము అతని కార్యమును ప్రత్యేకమైనదిగా కనుపరచగలదు, మరియు ఒక వ్యక్తి అనుభవాలు అతని కార్యములో భాగాలుగా మారతాయి. మానవ కార్యము అతని అనుభవాన్ని వ్యక్తపరచగలదు. కొంతమంది వ్యక్తులు ప్రతికూలతను అనుభవించినప్పుడు, వారి సహవాసములోని భాష చాలా వరకు ప్రతికూలమైన విషయాలతో నిండి ఉంటుంది. ఒకవేళ వారి అనుభవము సానుకులమైతే, కొంతకాలానికి వారు సానుకూల దృష్టితో ఒక మార్గాన్ని ప్రత్యేకముగా కలిగి ఉంటారు, వారి సహవాసము చాల ప్రోత్సాహకరముగా ఉంటుంది, మరియు ప్రజలు వారి నుండి సానుకూలమైన అంశాలను పొందవచ్చు. ఒకవేళ పనివాడు కొంతకాలానికి ప్రతికూలముగా మారితే, అతని సహవాసము ఎప్పుడూ ప్రతికూల అంశాలనే కలిగి ఉంటుంది, ఇటువంటి సహవాసము నిరాశకు గురిచేస్తుంది, మరియు అతని సహవాసమును బట్టి ఇతరులు కూడా అనాలోచితముగా అణగారిపోతారు. నాయకుని స్థితిని బట్టి అనుచరుల స్థితి మారుతుంది. ఒక పనివాడు లోపల ఎలా ఉంటాడో, దాన్నే వ్యక్త పరుస్తాడు మరియు మానవ స్థితిని బట్టి పరిశుద్దాత్మ కార్యము తరచూ మారుతుంది. ఆయన వారి అనుభవము సాధారణ గమనము అనుసరించి ప్రజల ఆక్షేపణలను తీరుస్తూ, ప్రజల అనుభవానికి అనుగుణముగా కార్యము చేస్తాడే గానీ, వారిని బలవంతము చేయడు. దీన్ని బట్టి మానవ సహవాసము దేవుని వాక్యమునకు భిన్నమైనదని చెప్పొచ్చు. మనుష్యుల సహవాసము వారి వ్యక్తిగత తలంపులను మరియు అనుభవాన్ని తెలియజేస్తుంది, మరియు దేవుని కార్యము ఆధారముగా వారి ఆలోచనలు మరియు అనుభవాన్ని వ్యక్తపరుస్తుంది. దేవుడు కార్యము చేసిన లేక మాట్లాడిన తరువాత, వారి బాధ్యతగా దానిలో వారు దేనిని అనుసరించాలో లేక లోనికి ప్రవేశించాలో కనుగొని, ఆపై దానిని అనుచరులకు అందించాలి. అందువలన, మానవ కార్యము అతని ప్రవేశము మరియు ఆచరణను కనుపరుస్తుంది. నిజానికి, అలాంటి కార్యము మానవ ఉపదేశాలు మరియు అనుభవము, లేదా కొన్ని మానవ ఆలోచనలతో మిళితమై ఉన్నది. పరిశుద్దాత్మ ఎలా కార్యము చేసినప్పటికీ, అది మానవునిలో అయినా లేక దేవుని శరీర ధారణలో అయినా, పనివారు ఎల్లప్పుడూ తాము ఏమిటో తెలియపరుస్తారు. కార్యము చేసేది పరిశుద్దాత్మ అయినా, ఆ కార్యమనేది మానవ స్వాభావికత పునాదిగా ఉంటుంది, ఎందుకంటే పునాది లేకుండా పరిశుద్దాత్మ కార్యము చేయడు. మరో మాటలో చెప్పాలంటే, కార్యమేదీ శూన్యము నుండి రాదు, కాని ఎల్లప్పుడూ నిజమైన సందర్భాలు మరియు వాస్తవ పరిస్థితులకు అనుగుణముగా జరుగుతుంది. ఈ విధముగా మాత్రమే మానవుని స్వభావము రూపాంతరము చెంది పాత ఉద్దేశ్యాలు మరియు పాత ఆలోచనలు మార్చబడతాయి. మానవుడు తాను చూసేది, అనుభవించేది, మరియు ఊహించగలిగే దానినే వ్యక్త పరుస్తాడు, మరియు ఒకవేళ సిద్దంతమైనా లేక భావనలైనా మానవుని ఆలోచన ద్వారా దానిని పొందవచ్చు. మానవ కార్యమనేది, మనిషి చూసేది గానీ, మనిషి ఊహించేది లేక తలంచేది, ఆ కార్యము పరిమాణముతో సంబంధము లేకుండా, మానవ అనుభవ పరిధిని మించి ఉండదు. దేవుడు వ్యక్తపరిచేదంతా ఆయన ఏమైయున్నాడో అనేదిగా ఉంటుంది, అది మానవుడు గ్రహించలేనిది—అది, మానవ ఆలోచనా పరిధికి మించినది. ఆయన సమస్త మానవజాతిని నడిపించే తన కార్యాన్ని తెలియజేస్తాడు, ఇది ఆయన స్వీయ నిర్వహణకు సంబంధించినదే కానీ, మానవ అనుభవ వివరాలతో సంబంధం లేనిది. మానవుడు తెలియజేసేది తన అనుభవము అయితే, దేవుడు తెలియజేసేది, మానవాతీతమై, తన సహజ స్వభావముగా ఉన్న, ఆయన ఉనికిగా ఉంటుంది. మానవుని అనుభవమనేది దేవుడు తన ఉనికిని వ్యక్తపరచిన దాని ఆధారముగా పొందుకున్న తన జ్ఞానము మరియు వివేకమై ఉన్నది. అటువంటి బుద్ధి మరియు జ్ఞానాన్ని మానవ ఉనికి అని పిలుస్తారు, మరియు మానవ సహజ స్వభావము మరియు సామర్థ్యము వాటి ప్రాథమిక ఆధారమై ఉన్నది—అందువలన వాటిని మానవ అస్థిత్వము అని అంటారు. మానవుడు అనుభవిస్తున్న మరియు చూస్తున్న వాటితో సహవాసము చేయగలడు. తాము అనుభవించని వాటితో మరియు చూడని వాటితో, లేక తమ ఊహాతీతమైన, తమ అంతరంగములో లేని వాటితో ఎవరూ సహవాసము చేయలేరు. మానవుడు తెలియజేసేది తన అనుభవపూర్వకమైనది కానప్పుడు, అది తన ఆలోచన లేక సిద్దాంతం అవుతుంది. సులభముగా చెప్పాలంటే, తన మాటల్లో వాస్తవికత లేదు. సమాజమునకు సంబంధించిన విషయాలతో నీవు సంబంధము లేకుండా ఉన్నావో, సమాజములోని సంక్లిష్టమైన బంధాలతో స్పష్టముగా సహవాసము చేయలేవు. నీకు కుటుంబము లేకుండా, కుటుంబ సమస్యల గురించి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, వారు చెప్పిన వాటిలో చాలా వరకు నీకు అర్ధం కాదు. కాబట్టి, మానవుడు చేసే సహవాసాలు మరియు చేసే పని అతని అంతరంగిక జీవితాన్ని కనుపరుస్తుంది. ఎవరైనా గద్దింపు మరియు శిక్షను గురించిన తన ఆలోచనను పంచుకున్నప్పటికీ, మీకు దాని గురించి అనుభవమే లేకపోతే, అది వంద శాతము నమ్మకమైనది కానప్పటికీ, నీవు దానిని తిరస్కరించే ధైర్యం చేయలేవు. ఎందుకంటే వారి సహవాసము నీవు ఎన్నడూ అనుభవించనిది, నీవు ఎన్నడూ ఎరుగనది, మరియు నీ మనస్సు ఊహించలేనిది. వారి జ్ఞానము నుండి నీవు తీసుకోవలసినది ఏమైనా ఉన్నది అంటే, భవిష్యత్తులో గద్దింపు మరియు తీర్పులోనికి వెళ్ళే ఒక మార్గం మాత్రమే. కానీ, ఈ మార్గము కేవలం సిద్దాంత పరమైన జ్ఞానములో ఒకటి కావచ్చు; ఇది నీ సొంత అవగాహన, నీ సొంత అనుభవాన్ని బట్టి ఏర్పడదు. బహుశా వాళ్ళు చెప్పేది అక్షరాలా సత్యమని నీవు అనుకోవచ్చు, కానీ నీ సొంత అనుభవములో అనేక విధాలుగా ఇది అసాధ్యమని నీవు కనుగొనవచ్చు. బహుశా నీవు విన్న వాటిలో కొన్ని పూర్తిగా అసాధ్యమైనవని నీవు భావించవచ్చు; ఆ సమయములో నీవు దాని గురించిన తలంపులు కలిగి, అంగీకరించినప్పటికీ, నీవు అయిష్టంగానే చేస్తావు కానీ, నీ సొంత అనుభవములో, నీవు కలిగి ఉన్న భావనల భావము నీ ఆచరణ మార్గముగా మారుతుంది, మరియు నీవు ఎంతగా ఆచరిస్తావో, నీవు విన్న వాక్యముల నిజమైన విలువ మరియు భావాన్ని అంతగా గ్రహిస్తారు. నీ సొంత అనుభవాన్ని కలిగియున్న తరువాత, నీవు అనుభవించిన దాని బట్టి నీవు కలిగి ఉండవలసిన జ్ఞానమును గురించి నీవు చర్చించవచ్చు. అదనంగా, ఎవరి జ్ఞానము నిజమైనది మరియు ఆచరణాత్మకమైనది, అలాగే ఎవరి జ్ఞానము సిద్దాంత మూలమైనది మరియు నిష్ఫలమైనది అనే వాటి మధ్య వ్యత్యాసాన్ని నీవు గుర్తించగలవు. కాబట్టి, నీవు ప్రకటించే జ్ఞానము సత్యానికి అనుకూలముగా ఉన్నదా లేదా అనేది నీవు ఆచరణాత్మకమైన అనుభవము కలిగి ఉన్నావా లేదా అనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీ అనుభవములో సత్యము ఉన్న చోట, నీ జ్ఞానము ఆచరణాత్మకముగా మరియు విలువైనదిగా ఉంటుంది. నీ అనుభవము ద్వారా, నీవు వివేచనా మరియు తెలివిని కూడా పొందవచ్చు, నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, మరియు నీవెలా ప్రవర్తించాలి అనే దాని గురించిన బుద్ధి మరియు ఇంగిత జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. సత్యమును కలిగి లేని వ్యక్తులచే తెలియపరచబడిన జ్ఞానమే సిద్దాంతము, అది ఎంత ఉన్నతమైనదైనా కావచ్చు. ఈ రకమైన వ్యక్తి భౌతిక సంగతుల విషయానికొస్తే చాలా తెలివైనవాడు కావచ్చు, కానీ ఆత్మీయ సంగతుల విషయానికొస్తే ఎటువంటి వ్యత్యాసాన్ని కనుపరచలేరు. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు ఆత్మీయ విషయాల పట్ల ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండరు. వీరంతా ఆధ్యాత్మిక సంగతులను గ్రహించలేని మరియు ఆధ్యాత్మిక విషయాలలో వెలిగించబడని వ్యక్తులు. నీవు వ్యక్త పరిచేది ఏ రకమైన జ్ఞానమైనప్పటికీ, అది నీకు వలె ఉన్నంత కాలము అది నీ వ్యక్తిగత అనుభవము, నిజమైన జ్ఞానముగా ఉంటుంది. కేవలం సిద్దాంతము గురించి మాట్లాడే వ్యక్తులు, అంటే, సత్యము మరియు వాస్తవికత లేకుండా జీవించే వ్యక్తుల వాదనను వారి అస్థిత్వము అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వారు లోతైన ధ్యానము ద్వారా మాత్రమే తమ సిద్దాంతానికి చేరువయ్యారు, అలాగే అది వారి లోతైన చింతన యొక్క ఫలితము. ఇది కేవలము సిద్దాంతము మరియు ఊహ తప్ప మరేమీ కానప్పటికీ, అన్ని విధములైన వ్యక్తుల అనుభవాలు వారి అంతరంగిక సంగతులను కనుపరుస్తాయి. ఆధ్యాత్మికమైన అనుభవము లేని వారెవరైనా సత్య జ్ఞానము గురించి గానీ, ఆధ్యాత్మిక సంగతుల పట్ల తగిన జ్ఞానము గురించి గానీ మాట్లాడలేరు. తాను అంతరంగములో ఏమైయున్నాడో అదే మానవుడు వ్యక్తపరుస్తాడు. ఇది నిశ్చయము. ఎవరైనా ఆధ్యాత్మిక సంగతులను గురించిన జ్ఞానమును మరియు సత్య జ్ఞానమును కావాలని ఆశిస్తే, తాను నిజమైన అనుభవమును కలిగియుండాలి. మానవ జీవితములోని ఇంగిత జ్ఞానము గురించి నీవు మాట్లాడలేకపోతే, ఆధ్యాత్మిక సంగతుల గురించి నీవు ఎలా చర్చించగలవు? సంఘాలను నడిపించగలిగి, ప్రజలకు జీవాన్ని అందిస్తూ అలాగే ప్రజలకై అపోస్తలులుగా ఉండేవారు వాస్తవ అనుభవాన్ని కలిగి ఉండాలి; వారు ఆధ్యాత్మిక సంగతుల పట్ల సరైన అవగాహన కలిగి, సత్యము పట్ల సరైన సత్కారము మరియు అనుభవాన్ని కలిగి ఉండాలి. కేవలం అటువంటి వారు మాత్రమే సంఘాలను నడిపించే సేవకులు మరియు అపోస్తలులుగా ఉండుటకు యోగ్యులు. లేకపోతే, వారు కనిష్ఠులుగా అనుసరించవచ్చు గానీ నడిపించలేరు, ప్రజలకు జీవాన్ని సరఫరా చేయగల అపోస్తలులుగా ఉండలేరు. ఎందుకంటే, అపొస్తలుల పని హడావిడి చేయడమో లేక జగడమాడటమో కాదు; అది జీవాన్ని ఉపదేశించడం మరియు వారి స్వభావములను మార్చుటను బట్టి ఇతరులను నడిపించడమై ఉన్నది. ఈ విధిని నిర్వర్తించేవారు ఎవరూ భుజానికెత్తుకోలేని, భారమైన బాధ్యతను భుజానికెత్తుకొనుటకై ఆదేశించబడ్డారు. ఈ విధమైన కార్యమును జీవాత్మ కలిగియున్న వారు, అనగా, సత్యానుభావము కలిగి ఉన్నవారు మాత్రమే చేపట్టగలరు. వదిలివేసేవారు, తొందరపడేవారు, లేక తమను తాము విస్తరించుకోవాలి అనుకునేవారు దీనిని చేపట్టలేరు; సత్యానుభావము లేని, సరిచేయబడని లేక తీర్పు తీర్చబడని, ప్రజలు ఈ విధమైన కార్యము జరిపించలేరు. అనుభవ రహితమైన వ్యక్తులు, మోసపూరితమైన వ్యక్తులు, ఇలాంటి అస్తిత్వాన్ని కలిగి లేనందున వారు వాస్తవాన్ని స్పష్టముగా చూడలేరు. కాబట్టి, ఇలాంటి వ్యక్తి నాయకత్వపు కార్యాన్ని జరిగించలేకపోవడమే కాకుండా, సత్యము లేకుండా వారు బహు కాలము కొనసాగితే, వారు వెలివేయబడతారు. నీవు తెలియజేసే ప్రత్యక్షానుభావము నీవు జీవితములో అనుభవించిన కష్టాలకు, నీవు గద్దించబడిన సంగతులకు, నీవు తీర్పు తీర్చబడిన సమస్యలకు రుజువుగా నిలుస్తుంది. శ్రమల విషయములో ఇది కూడా నిజం: ఎక్కడ ఒకరు శుద్ధి చేయబడతారు, ఎక్కడ ఒకరు బలహీనులవుతారు అనేవి ఒకరు అనుభవము, ఒకరు మార్గము కలిగి ఉండే ప్రదేశాలుగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకవేళ ఎవరైనా వైవాహికత్వములో నిరాశలకు లోనైతే, “దేవా వందనాలు, దేవా స్తోత్రం, నా సమస్త జీవితాన్ని అర్పించి, నేను దేవుని హృదయ వాంఛను నెరవేర్చాలి, అలాగే నేను నా వైవాహికత్వమంతటిని దేవుని చేతుల్లో పెట్టాలి. నేను నా జీవితమంతటినీ దేవునికి అంకితం చేయడానికి సిద్దపడి ఉన్నానని,” వారు తరచూ పంచుకుంటారు. మనిషిలో ఉన్న సంగతులన్నీ సహవాసమందు తాను ఏమై ఉన్నాడో కనపరచగలగవు. ఒక వ్యక్తి మాట తీరు, వారు బిగ్గరగా లేక మౌనముగా మాట్లాడినప్పటికీ, అవేవీ అనుభవ సంబంధిత విషయాలు కావు, మరియు వారు ఎవరో ఏమి కలిగి ఉన్నారో వంటివి కనుపరచవు. ఈ విషయాలు ఒక వ్యక్తి గుణము మంచిదా చెడ్డదా, లేక స్వభావము మంచిదా చెడ్డదా అని మాత్రమే చెప్పగలవే కానీ, ఎవరికైనా అనుభవము ఉందా అనే వాటితో పోల్చలేము. ప్రసంగించినప్పుడు తనను తాను వ్యక్త పరుచుకోవడం లేక ప్రసంగ నైపుణ్యము లేదా వేగము అనేది అభ్యాసమునకు సంబంధించిన విషయమే గానీ ఒకరి అనుభవాన్ని భర్తీ చేయలేదు. నీ వ్యక్తిగత అనుభవాలను గురించి నీవు మాట్లాడేటప్పుడు, నీ అంతరంగములో ఉన్న విషయాలన్నీ మరియు ఏవి ప్రాముఖ్యమైనవిగా నీవు కనుగొంటావో వాటి గురించే పంచుకుంటావు. నా ప్రసంగము నా ఉనికిని చాటుతుంది, కానీ నేను చెప్పేది మానవాతీతము. నేను చెప్పునది మానవుడు అనుభవించేది కాదు, మానవుడు చూడగలిగేది కాదు; అది మానవుడు స్పర్శించగలిగేది కూడా కాదు, కానీ అదే నేనై యున్నాను. నేను ఆనుభవించిన దానినే పంచుకుంటానని కొందరు అనుకుంటారు కానీ, అది ఆత్మ ప్రత్యక్ష వ్యక్తీకరణ అని వారు గుర్తించరు. వాస్తవానికి, నేను అనుభవించిన దానినే నేను చెప్తున్నాను. ఆరువేల సంవత్సరాలుగా నిర్వహణ కార్యము జరిగించినది నేనే. మానవజాతిని సృజించినది మొదలుకొని ఇప్పటివరకు సమస్తాన్ని నేను అనుభవించాను; నేను దాని గురించి ఎందుకు చర్చించలేను? మానవ స్వభావమైతే నేను స్పష్టముగా చూచాను; దానిని చాలా కాలము క్రితమే గమనించాను. నేను దాని గురించి స్పష్టముగా ఎందుకు మాట్లాడలేను? నేను మానవ లక్షణాన్ని స్పష్టముగా చూశాను కాబట్టి, మానవుని గద్దించడానికి మరియు తీర్పు తీర్చడానికి నేను అర్హుడను, ఎందుకంటే సర్వ మానవాళి నా నుండే ఉద్భవించింది, కానీ సాతాను చేత పాడుచేయబడింది. నిజానికి, నేను చేసిన కార్యమును అంచనా వేయడానికి కూడా నేనే అర్హుడను. ఈ కార్యము నా శరీరము ద్వారా చేయబడకపోయినా, నేను కలిగియున్న మరియు నేనేగా ఉన్న, ఆత్మ ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఉన్నది. కావున, నేను చేయవలసిన కార్యమును చేయడానికి మరియు దానిని వెల్లడి చేయడానికి నేను అర్హుడనై ఉన్నాను. ప్రజలు వారు అనుభవించినదే చెప్తారు. వారు చూచినది, వారి మనస్సు అందుకోగలిగేది, మరియు వారి ఇంద్రియములు గుర్తించగలిగేది అది మాత్రమే. వారు పంచుకోగలిగేది అద మతరమే. అవతార దేహము ద్వారా పలుకబడిన దేవుని వాక్యములు ఆత్మ ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఉన్నాయి మరియు అవి శరీరము అనుభవించని మరియు చూడని ఆత్మ కార్యమును వెల్లడి చేస్తున్నాయి, దేహపు సారాంశము ఆత్మ అయినందున, ఆయన తన ఉనికిని ఇప్పటికీ తెలియజేస్తాడు, మరియు ఆత్మ కార్యమును వెల్లడిచేస్తాడు. ఇది శరీర గ్రహింపునకు అతీతమైనప్పటికీ, ఇదే ఆత్మ ద్వారా ఇదివరకే చేయబడిన కార్యముగా ఉన్నది. శరీరధారణ తరువాత, శరీరమును వ్యక్తపరచడం ద్వారా, దేవుని ఉనికిని ప్రజలు తెలుసుకునేలా ఆయన చేస్తాడు, అలాగే ఆయన చేసిన కార్యమును మరియు దేవుని స్వభావమును చూడటానికి ప్రజలకు వీలు కల్పిస్తాడు. వారు దేనిలో ప్రవేశించాలి మరియు వారు దేనిని అర్ధం చేసుకోవాలి అనే దాని గురించి మానవ కార్యమనేది మరింత స్పష్టతను ఇస్తుంది; సత్యమును గ్రహించడం మరియు అనుభవించడం వైపునకు ప్రజలను నడిపించడమనేది దీనిలో ఇమిడియున్నది. మానవ కార్యమనేది ప్రజలను కొనసాగనిస్తుంది; మానవజాతి కొరకు నూతన మార్గాలను మరియు యుగాలను ఆవిష్కరించి మరియు క్షయమైన వారు ఎరుగని వాటిని బయలుపరచడం, వారికి తన స్వభావం తెలియజెప్పడమే దేవుని కార్యమై ఉన్నది. సమస్త మానవ జాతిని నడిపించడమే దేవుని కార్యముగా ఉన్నది.

పరిశుద్దాత్మ చేయు సమస్త కార్యము ప్రజలకు ప్రయోజనము చేకూర్చడానికే జరిగించబడుతుంది. ఇదంతా ప్రజల క్షేమాభివృద్ది కోసమే; ప్రజలకు ప్రయోజనము చేకూర్చని కార్యమంటూ ఏదీ లేదు. సత్యము లోతైనదైనా లేక తేలికపాటిదైనా, సత్యమును అంగీకరించే వారి సామర్థ్యము ఏమైనప్పటికీ, పరిశుద్దాత్మ చేసేదంతా, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, పరిశుద్దాత్మ కార్యము ప్రత్యక్షముగా జరిగింపబడదు; ఆయనకు సహకరించే వ్యక్తుల ద్వారా అది వ్యక్తీకరించబడాలి. ఈ విధముగా మాత్రమే పరిశుద్దాత్మ కార్యపు ఫలితాలను పొందవచ్చు. నిజానికి, పరిశుద్దాత్మ నేరుగా కార్యము చేస్తున్నప్పుడు, అది ఎంత మాత్రమూ అపవిత్రము కాదు; అయితే, పరిశుద్దాత్మ మానవుని ద్వారా కార్యము చేస్తున్నప్పుడు, అది అత్యంత కలుషితము అవుతుంది మరియు అది పరిశుద్దాత్మ మూల కార్యముగా ఉండదు. ఇది ఇలా ఉండగా, సత్యము వివిధ దశలకు మారుతూ ఉంటుంది. అనుచరులు పరిశుద్దాత్మ కార్యము మరియు మానవ అనుభవ జ్ఞానము కలయికను పొందుతారే గానూ, పరిశుద్దాత్మ మూల ఉద్దేశ్యాలను పొందరు. అనుచరులు పొందుకునే భాగమైన పరిశుద్దాత్మ కార్యము సరియైనదే అయినప్పటికీ, పనివారు వేరైనందున వారు పొందుకునే అనుభవము మరియు మానవ జ్ఞానము భిన్నముగా ఉంటాయి. పరిశుద్దాత్మ వెలిగింపు మరియు నడిపింపు కలిగిఉన్న పనివారు ఆ వెలిగింపు మరియు నడిపింపు ఆధారముగా అనుభవాలను పొందడానికి కొనసాగుతారు. ఈ అనుభవాలలో మానవుని మనస్సు మరియు అనుభవము, అలాగే మానవత్వము కలిగి ఉండటము వంటివి కలిసి ఉన్నాయి, ఆ తరువాత, వారు కలిగి ఉండవలసిన జ్ఞానము లేక బుద్దిని పొందుకుంటారు. సత్యానుభవము తరువాత మానవుని అనుసరణ విధానము ఇదే. ప్రజల అనుభవము విభిన్నముగా మరియు ప్రజలు అనుభవించే విషయాలు విభిన్నముగా ఉన్నందున, ఈ అనుసరణ విధానము ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విధముగా, వెలిగింపు నొందినవారు విభిన్నముగా ఉంటారు కాబట్టి, పరిశుద్దాత్మ వెలిగింపు కూడా భిన్నమైన జ్ఞానమునకు మరియు అనుసరణకు దారితీస్తుంది. అనుసరణ సమయములో కొంతమంది పెద్ద తప్పులు చేస్తే కొంతమంది చిన్న చిన్న తప్పులు చేస్తారు మరియు కొంతమందైతే తప్పులు తప్ప మరేమీ చేయరు. ప్రజలు వారు అర్ధం చేసుకునే స్థాయిలో వ్యత్యాసము మరియు వారి సహజ స్వభావాల భిన్నత్వము దీనికి కారణమైయున్నది. ప్రసంగం విన్నాక కొంతమందికి ఒక విధమైన భావన ఉంటుంది, మరియు కొంతమందికి నిజాన్ని విన్నాక ఇంకోలా ఉంటుంది. కొంతమంది మెల్లగా దారి తప్పితే, కొంతమంది సత్యము నిజమైన భావన గ్రహింపు కాస్తయినా ఉండదు. కాబట్టి, ఒకని అవగాహన అనేది అతను ఇతరులను ఎలా నడిపించాలో నిర్దేశిస్తుంది; తన గురించి చెప్పుకోవడం మాత్రమే ఒకని పని కాబట్టి, ఇది ఖచ్చితమైన సత్యం. సత్యము పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నవారి ద్వారా నడిపించబడే ప్రజలు కూడా సత్యం పట్ల సరైన అవగాహన కలిగి ఉంటారు. వీరిలో అవగాహనలో లోపాలు ఉన్న వారు ఉన్నప్పటికీ, వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు, అందరూ లోపాలతో ఉండరు. సత్యాన్ని అర్ధం చేసుకోవడంలో ఒకరికి లోపాలు ఉన్నాయంటే, అతనిని అనుసరించే వారు కూడా నిస్సందేహముగా లోపాలు కలిగి ఉంటారు, మరియు ఈ ప్రజలు వాక్యపు ప్రతి అర్ధములో అసంబద్దముగా ఉంటారు. అనుచరుల అవగాహన స్థాయి పనివారి మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, దేవుని నుండి వచ్చిన సత్యము సరైనది మరియు నిష్కళంకమైనది, మరియు అది నిశ్చయమైనది. ఏదేమైనప్పటికీ, పనివారందరూ పూర్తిగా సరైన వారు కారు మరియు పూర్తిగా నమ్మదగిన వారని చెప్పలేము. సత్యాన్ని అనుసరించడానికి పనివారికి ఒక నిర్దిష్టమైన మార్గము ఉంటే, అనుసరించే వారు కూడా అనుసరణ మార్గాన్ని కలిగి ఉంటారు. సత్యాన్ని అనుసరించడానికి పనివారికి సిద్దాంతము తప్ప మార్గము లేకపోతే, అప్పుడు అనుసరించే వారికి వాస్తవికత ఉండదు. అనుచరుల శక్తి మరియు సామర్థ్యము పుట్టుకతోనే నిర్ణయించబడతాయి మరియు పనివారితో అనుబంధము కలిగి ఉండవు. అయితే, అనుచరులు ఎంతవరకు సత్యమును గ్రహించి మరియు దేవుని తెలుసుకోవాలి అనేది పనివారి మీద ఆధారపడి ఉన్నది (ఇది కొందరి కోసం మాత్రమే). పనివాడు ఎలా ఉంటాడో, తాను నడిపించే అనుచరులు కూడా అలానే ఉంటారు. ఒక పనివాడు తన గురించి, ఏది దాచుకోకుండా తెలియజేస్తాడు. తాను సాధించాలి అనుకునేవి లేక సాధించగలవి తనను అనుసరించే వారి నుండి పొందడమే అతను చేసే ఆక్షేపణలు. చాలా మంది పనివారు తమ అనుచరుల వద్ద ఆక్షేపణలు చేయడానికి తాముగా చేసే పనిని మూలముగా ఉపయోగిస్తారు, అలాంటి వారికి అనుచరులు అధికముగానే ఉన్నప్పటికీ ఏమీ సాధించలేరు—ఒకరు సాధించలేనిది ఇంకొకరి ప్రవేశమునకు ఆటంకముగా మారుతుంది.

సవరించబడటం, పరిష్కరించబడటము, తీర్పు మరియు గద్దింపు ద్వారా వెళ్ళిన వారి పనిలో అస్సలు దారి తప్పడము అనేది ఉండదు, మరియు వారి పని ఉద్ఘాటన చాలా ఖచ్చితముగా ఉంటుంది. పని చేయడానికి తమ స్వాభావికత మీద ఆధారపడే వారు చాలా పెద్ద తప్పులు చేస్తారు. అసంపూర్ణమైన వ్యక్తుల కార్యము వారి సొంత స్వాభావికతను తెలియపరుస్తుంది, పరిశుద్దాత్మ కార్యమునకు అది ప్రధాన ఆటంకముగా ఉంటుంది. ఒక వ్యక్తి సామర్థ్యము ఎంత మంచిదైనప్పటికీ, దేవుని అజ్ఞాపన కార్యమును చేయడానికి వారు ముందుగా సవరణ, పరిష్కరించబడటం, మరియు తీర్పు గుండా వెళ్ళవలసి ఉన్నది. ఒకవేళ వారు తీర్పు గుండా వెళ్ళకపోతే, వారి కార్యము, ఎంత మంచిగా జరిగించినప్పటికీ, సత్య నియమాలకు అనుగుణముగా ఉండలేవు, అవి ఎప్పటికీ మానవుని మంచితనము మరియు వారి స్వాభావికత ఫలముగానే ఉంటుంది. కూర్చబడటము, పరిష్కరించబడటము, మరియు తీర్పు గుండా వెళ్ళిన వారి కార్యమనేది కూర్చబడని, పరిష్కరించబడని, మరియు తీర్పు తీర్చబడని వారి కార్యము కంటే అత్యంత ఖచ్చితత్వముతో ఉంటుంది. న్యాయ తీర్పు గుండా వెళ్ళని వారు చాలా వరకు మానవ తెలివి మరియు సహజమైన ప్రతిభను కలగలిపిన మానవ భౌతికత మరియు ఆలోచనలను తప్ప మరేమీ వ్యక్తపరచరు. దేవుని కార్యమునకు మానవుని ఖచ్చితమైన వ్యక్తీకరణ ఇది కాదు. అలాంటి వ్యక్తులను అనుసరించేవారు తమ సహజ సామర్థ్యమును బట్టి వారు ముందుకు తేబడతారు. ఎందుకంటే, వారు మానవ అనుభవము మరియు తెలివిని ఎక్కువగా ప్రదర్శిస్తారు, అవి దేవుని మూల ఉద్దేశము నుండి దాదాపుగా విడదీసి, దాని నుండి చాలా దూరముగా మళ్లిస్తాయి, ఇలాంటి వ్యక్తి కార్యము ప్రజలను మనిషి ముందుకు తీసుకువస్తుందే తప్ప, వారిని దేవుని యెదుటకు తీసుకురాదు. కాబట్టి, న్యాయతీర్పు మరియు గద్దింపు గుండా వెళ్లనివారు దేవుని ఆజ్ఞాపన కార్యమును కొనసాగించడానికి అనర్హులు. అర్హుడైన పనివాని కార్యము ప్రజలను సరైన దారిలోనికి తెచ్చి మరియు వారికి గొప్ప సత్య ప్రవేశమును అనుగ్రహిస్తుంది. అతని కార్యము ప్రజలను దేవుని ఎదుటకు తీసుకువస్తుంది. అదనముగా, అతను చేసిన కార్యము ఒకరి నుండి ఒకరికి మారవచ్చు, ఏ నియమాలకు కట్టుబడి లేదు, ప్రజలకు స్వేచ్ఛ మరియు స్వాతంత్రము, జీవములో క్రమముగా ఎదిగే సామర్థ్యము మరియు సత్యములోనికి మరింత లోతైన ప్రవేశమును కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. అనర్హుడైన పనివాని కార్యము చాలా నష్టపోతుంది. అతని కార్యము అవివేకమైనది. అతడు ప్రజలను నియమాలలోకి మాత్రమే తీసుకురాగలడు, మరియు అతడు ఆక్షేపించేది ఒకరి నుండి ఒకరికి మారదు; ప్రజల వాస్తవ అవసరతలకు అనుగుణముగా అతడు కార్యము చేయడు. ఈ విధమైన కార్యములో, అనేకమైన నియమాలు మరియు అనేకమైన సిద్దాంతాలు ఉన్నాయి, మరియు అది ప్రజలను వాస్తవికతలోనికి, మరియు జీవితములో సాధారణ ఎదుగుదలను ఆచరణలోనికి తీసుకురాదు. అది కేవలం ప్రజలను కొన్ని పనికిమాలిన నియమాలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇటువంటి మార్గ నిర్దేశము ప్రజలను నాశనానికి మాత్రమే నడిపిస్తుంది. అతడు నిన్ను అతనిగా మారేలా నడిపిస్తాడు; అతను ఏమి కలిగి ఉన్నాడో మరియు ఏమైయున్నాడో దానిలోనికి నిన్ను అతడు తీసుకురాగలడు. నాయకులు అర్హులా కాదా అని అనుచరులు గుర్తించడానికి, వారు నడిపించు మార్గము మరియు వారి కార్య ఫలితాలను చూడటం, మరియు అనుచరులు నియమాలను సత్యమునకు అనుగుణముగా పొందుతున్నారా లేదా, మరియు వారి పరివర్తన కొరకు తగిన అనుసరణ మార్గాలను పొందుతున్నారా లేదా అని చూడటము కీలకమై ఉన్నది. నానా రకాలైన ప్రజల విభిన్నమైన కార్యము మధ్య వ్యత్యాసాన్ని నీవు గుర్తించాలి; మూర్ఖుడైన అనుచరునిగా నీవు ఉండకూడదు. ఇది ప్రజల ప్రవేశమునకు చెందిన విషయము మీద ఆధారమై ఉన్నది. ఏ వ్యక్తి నాయకత్వము మార్గము కలిగి ఉన్నదో, మరియు ఏది కలిగి లేదో నీవు గనుక గుర్తించలేకపోతే, నీవు సులభముగా మోసపోతావు. ఇవన్నీ నీ జీవితము మీద ప్రత్యక్ష ప్రభావమును కనుపరుస్తాయి. అసంపూర్ణమైన ప్రజల కార్యములో సహజత్వము అధికముగా ఉన్నది; అది ఎక్కువగా మానవ చిత్తముతో మిళితమై ఉన్నది. వారు పుట్టుకతోనే కలిగియున్న వారి అస్తిత్వమే సహజత్వము. అది పరిహారము పొందిన తరువాత లేక పరివర్తన పొందిన తరువాత కలిగియున్న జీవితము కాదు. అలాంటి వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని ఎలా ఆదుకొంటాడు? ఆదిలో మానవుడు కలిగియున్న జీవితము అతని సహజమైన తెలివితేటలు లేక ప్రతిభ అయి ఉన్నది. ఈ విధమైన తెలివితేటలు లేక ప్రతిభ మానవుని పట్ల దేవుడు కలిగియున్న కోరికలకు చాలా దూరముగా ఉన్నది. ఒకవ్యక్తి పరిపూర్ణ పరచబడకుండా మరియు తన దుర్నీతి స్వభావము సవరించబడకుండా మరియు పరిష్కారము నొందకపోతే, సత్యానికి మరియు తాను చెప్పే దానికి మధ్య చాలా అంతరము ఏర్పడుతుంది; అతడు తెలియపరిచేవి అతని ఆలోచన మరియు ఏకపక్ష అనుభవము వంటి అస్పష్టమైన సంగతులతో కలిసిపోయి ఉంటాయి. అంతేగాక, అతడు ఎలా పనిచేసినా, ప్రజలందరి ప్రవేశానికి తగిన సత్యము మరియు సమగ్ర లక్ష్యము లేదని ప్రజలు భావిస్తారు. ప్రజలు కోరుకునే వాటిలో ఎక్కువ భాగము, వారేదో కొయ్యల మీద కూర్చుండబెట్టిన బాతుల వలె, వారి శక్తికి మించినవిగా ఉంటాయి. ఇది మానవ చిత్తమునకు సంబంధించిన కార్యము. మానవుని దుర్నీతి స్వభావము, తన ఆలోచనలు, మరియు తన తలంపులు అతని శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. పుట్టుకతోనే సత్యాన్ని అనుసరించే సహజ గుణము మానవునికి లేదు, సత్యమును నేరుగా గ్రహించే సహజ స్వభావమూ అతనికి లేదు. మానవుని దుర్నీతి స్వభావమునకు జోడుగా సాధారణ వ్యక్తి ఈవిధముగా కార్యము చేసినప్పుడు, అది ఆటంకాలు కలిగించదా? అయితే, పరిపూర్ణత కలిగిన వ్యక్తి ప్రజలు గ్రహించవలసిన సత్యానుభావము, మరియు వారి దుర్నీతి స్వభావములను గురించిన జ్ఞానము కలిగి ఉంటాడు, తద్వారా తన కార్యములో అస్పష్టమైన మరియు అవాస్తవమైన సంగతులు క్రమముగా వైదొలగి, మానవ కల్పితాలు తగ్గుతాయి, మరియు అతని పని మరియు సేవ దేవుని ప్రమాణాలకు మరింత సమీపముగా ఉంటాయి. అందువలన, అతని పని వాస్తవిక సత్య ప్రవేశమును పొంది మరియు నిజమైనదిగా కూడా మార్పు చెందినది. మానవుని మనస్సులోని ఆలోచనలు ప్రత్యేకముగా పరిశుద్దాత్మ కార్యమును నిరోధిస్తాయి. మానవుడు గొప్ప ఊహా గానము మరియు సహేతుకమైన తర్కము కలిగి, వ్యవహారములు నడుపుటలో సుదీర్ఘమైన అనుభవమును కలిగి ఉన్నాడు. మానవుని ఈ విధమైన అంశాలు గనుక సవరణ మరియు దిద్దుబాటు గుండా వెళ్ళకపోతే, అవన్నీ కార్యమునకు నిరోధాలవుతాయి. ఆకారణంగా, మానవుని కార్యము, ప్రత్యేకముగా అసంపూర్ణమైన వ్యక్తుల కార్యము ఖచ్చితత్వము యొక్క ఉన్నత స్థాయిని సాధించలేదు.

మానవ కార్యము అనేది ఒక పరిధిలో మరియు పరిమితముగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నిర్దిష్టమైన దశ కార్యము మాత్రమే చేయగలడు గానీ యుగపు మొత్తము కార్యమును చేయలేడు—లేకపోతే, అతడు ప్రజలను నియామల మధ్యలోనికి నడిపిస్తాడు. మానవ కార్యము ఒక నిర్దిష్టమైన సమయము లేక దశకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఎందుకంటే, మానవ అనుభవము దాని ఆస్కారమును కలిగి ఉంటుంది. ఎవరూ మానవుని కార్యమును దేవుని కార్యముతో సరిపోల్చలేరు. మానవుని అనుసరణ మార్గాలు మరియు అతని సత్యానుభావములన్నీ ఒక నిర్దిష్టమైన పరిధికి వర్తిస్తాయి. మానవుడు నడిచే మార్గము పూర్తిగా పరిశుద్దాత్మ చిత్తమని మీరు చెప్పలేరు, ఎందుకంటే మానవుడు పరిశుద్దాత్మ చేత వెలిగింపబడతాడే గాని పూర్తిగా పరిశుద్దాత్మచేత నింపబడలేడు. మానవుడు అనుభవించగల సంగతులన్నీ సాధారణ మానవత్వపు పరిధిలోనే ఉంటాయి మరియు సాధారణ మానవ మనస్సులోని ఆలోచనల పరిధిని అధిగమించలేవు. సత్యమనే వాస్తవికతయందు జీవించగల వారందరూ ఆ పరిధిలోనే అనుభవిస్తారు. వారు సత్యమును అనుభవించినప్పుడు, అది ఎల్లప్పుడూ పరిశుద్దాత్మచే వెలిగింపబడిన సాధారణ మానవ జీవితపు ఒక అనుభవముగా ఉంటుంది; ఇది సాధారణ మానవ జీవితమును నుండి వైదొలగే అనుభవ మార్గము కాదు. జీవించుచున్న వారి మానవ జీవితాల మీద పరిశుద్దాత్మ చేత వెలిగించబడిన సత్యాన్ని వారు అనుభవిస్తారు. అంతేగాక, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది, మరియు దాని లోతు మానవుని స్థాయిని బట్టి ఉంటుంది. వారు నడిచే మార్గము సత్యమును అన్వేషించే ఒకరి సాధారణ మానవ జీవితమని మాత్రమే ఎవరైనా చెప్పగలరు, మరియు దీనినే పరిశుద్దాత్మచే వెలిగించబడిన సాధారణ వ్యక్తి నడిచే మార్గము అని పిలవవచ్చు. వారు నడిచే మార్గము పరిశుద్దాత్మ మార్గము అని ఎవరూ చేప్పలేరు. సాధారణ మానవ అనుభవములో, అన్వేషించే ప్రజలు ఒకేలా ఉండరు కాబట్టి, పరిశుద్దాత్మ కార్యము కూడా ఒకేలా ఉండదు. అదనముగా, ప్రజలు అనుభవ సందర్భాలు మరియు అనుభవ పరిధులు ఒకే విధముగా లేనందున, మరియు వారి మనస్సు మరియు తలంపులు కలిసిపోవడం వలన, వివిధ స్థాయిల లోని వారి అనుభవము మిళితముగా ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత పరిస్థితులను బట్టి సత్యాన్ని అర్ధము చేసుకుంటాడు. సత్యము గురించి వారికున్న నిజమైన భావము కేవలము ఒకటి లేక దానిలోని కొన్ని అంశాలు మాత్రమే గానీ, పూర్తియైనది కాదు. మానవుడు అనుభవించే సత్యము వ్యాప్తి ప్రతి వ్యక్తి పరిస్థితులకు అనుగుణముగా వ్యక్తి నుండి వ్యక్తికి విభిన్నముగా ఉంటుంది. ఈ విధముగా, నానారకాలైన వ్యక్తులు తెలియజేసిన ఒకే సత్యము జ్ఞానము, ఒకే విధముగా ఉండదు. చెప్పవలసినది ఏమిటంటే, మానవ అనుభవము అనేది ఎల్లప్పుడూ పరిమితులు కలిగి పరిశుద్దాత్మ చిత్తాన్ని సంపూర్ణముగా కనుపరచలేదు, మానవుడు తెలియజేసినది దేవుని చిత్తానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, మానవ అనుభవము అనేది పరిశుద్దాత్మ చేసే పరిపూర్ణపరచే కార్యమునకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ, మానవ కార్యమును దేవుని కార్యముగా పరిగణించలేము. మానవుడు దేవుడు తనకు అప్పగించిన కార్యమును చేసుకుంటూ, దేవునికి సేవకునిగా మాత్రమే ఉండగలడు. మానవుడు పరిశుద్దాత్మ చేత వెలిగింపబడిన జ్ఞానమును మరియు తన వ్యక్తిగత అనుభవాలను బట్టి పొందిన సత్యాలను మాత్రమే వ్యక్తపరచగలడు. మానవుడు యోగ్యత లేనివాడు మరియు పరిశుద్దాత్మ భాండాగారముగా ఉండుటకు తగిన నిబంధనలను పాటించడు. తన కార్యమే దేవుని కార్యమని చెప్పే యోగ్యత అతనికి లేదు. మానవుడు మానవ కార్య నియమాలను కలిగి ఉన్నాడు, మరియు మనుష్యులందరికీ రకరకాల అనుభవాలు ఉంటాయి మరియు విభిన్నమైన అనేక పరిస్థితులు కలిగి ఉంటారు. పరిశుద్దాత్మ వెలిగింపు నందు మానవ కార్యము అనేది అతని సమస్త అనుభవాలను సంఘటిస్తుంది. ఈ అనుభవాలు మానవ అస్తిత్వాన్ని మాత్రమే సూచిస్తున్నాయి మరియు దేవుని ఉనికిని, పరిశుద్దాత్మ చిత్తమును కనుపరచవు. కాబట్టి, మానవుడు నడిచే మార్గము పరిశుద్దాత్మ నడిచే మార్గమని చెప్పలేము, ఎందుకంటే మానవుని కార్యము దేవుని కార్యమును కనుపరచలేదు, మరియు మానవుని కార్యము మరియు మానవుని అనుభవము అనేవి పరిశుద్దాత్మ సంపూర్ణమైన చిత్తము కాదు. మానవుని కార్యము నియమాలలో పడిపోయే అవకాశము ఉన్నది, మరియు అతని కార్య విధానము కొంత పరిధి వరకు మాత్రమే పరిమితము చేయబడి ఉన్నది మరియు అది మానవులను స్వేచ్చాయుత మార్గములో నడిపించలేకపోతుంది. అనేకమంది అనుచరులు పరిమితమైన పరిధిలోనే జీవిస్తున్నారు, మరియు వారి అనుభవ విధానము కూడా దాని వ్యాప్తి వరకు పరిమితము చేయబడి ఉన్నది. మానవుని అనుభవము ఎల్లప్పుడూ పరిమితముగా ఉన్నది; తాను కార్యము చేయు విధానము కూడా కొన్ని పద్దతుల వరకు పరిమితము చేయబడి ఉన్నది మరియు దేవుని కార్యముతో లేక పరిశుద్దాత్మ కార్యముతో సరిపోల్చలేనిదిగా ఉన్నది. ఇలా ఎందుకంటే, మానవుని అనుభవము అంతిమముగా పరిమితమైయున్నది. దేవుడు ఎలా కార్యము చేసినప్పటికీ, అది నియమాలకు అతీతమైనది; అది ఎలా జరిగినప్పటికీ, అది ఒకే పద్దతికి పరిమితమై ఉండదు. దేవుని కార్యమునకు ఎటువంటి నియమాలు లేవు—ఆయన సమస్త కార్యము విడుదల చేయబడినది మరియు స్వేచ్ఛగా ఉన్నది. ఆయనను వెంబడించడానికి మానవుడు ఎంత సమయము వెచ్చించినప్పటికీ, అతడు దేవుని కార్యపు విధానాల ఏ కట్టడలనూ నీరుగార్చలేడు. ఆయన కార్యము సూత్రప్రాయముగా ఉన్నప్పటికీ, అది ఎల్లప్పుడూ నూతన విధానాల్లో జరిగించబడుతూ, నూతన పురోగతులను కలిగి, మానవాతీతముగా ఉంటుంది. ఏక కాలములో, దేవుడు నానారకములైన కార్యమును మరియు ప్రజలను నడిపించే వివిధ విధానాలు కలిగి ఉండవచ్చు, దీని వలన ప్రజలు ఎల్లప్పుడూ నూతన ప్రవేశములను మరియు మార్పులను కలిగి ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ నూతన విధానాల్లో కార్యము చేస్తున్నాడు కాబట్టి, ఆయన కార్యపు నియమాలను నీవు గుర్తించలేవు, మరియు ఇలా మాత్రమే దేవుని వెంబడించువారు నియమాలకు అతీతముగా ఉంటారు. దేవుని కార్యము ఎల్లప్పుడూ మానవ తలంపులను ఎదుర్కొంటూ, వాటిని దూరపరుస్తుంది. యదార్థ హృదయముతో ఆయనను వెంబడిస్తూ అన్వేషించే వారు మాత్రమే తమ స్వభావములలో రూపాంతరమును కలిగి, నియమాలకు అతీతముగా లేక ఎటువంటి మతపరమైన ఉద్దేశ్యాలతో నిరోధించబడకుండా, స్వేచ్ఛగా జీవించగలరు. మానవుని కార్యము తనకు తానుగా సాధించగలదాని మరియు తన అనుభవ ఆధారముగా ప్రజల వద్ద ఆక్షేపణలు చేస్తుంది. ఈ అవసరతల ప్రమాణము ఒక నిర్దిష్టమైన పరిధికి పరిమితము చేయబడియున్నది మరియు అనుసరణ విధానాలు కూడా చాలా పరిమితమై ఉంటాయి. కాబట్టి, అనుచరులు తెలియకుండానే పరిమితమైన వ్యాప్తిలో జీవిస్తారు; సమయము గతించేకొలది ఈ విషయాలన్నీ ఆచార వ్యవహారాలుగా మారిపోయాయి. ఒకవేళ కార్యమందు ఒక దశ దేవుని వ్యక్తిగత పరిపూర్ణత మరియు తీర్పు పొందని ఒకరిచే నడిపించబడితే, అతని అనుచరులందరూ దేవుని ఎదురించుటలో నైపుణ్యత గలవారిగా మరియు మతవాదులుగా తయారవుతారు. కాబట్టి, ఎవరైనా యోగ్యతగల నాయకుడైతే, ఆ వ్యక్తి తప్పనిసరిగా న్యాయతీర్పు గుండా వెళ్ళిన మరియు పరిపూర్ణపరచ బడటానికి అంగీకరించిన వారై ఉండాలి, వారు పరిశుద్దాత్మ కార్యమును కలిగి ఉన్నప్పటికీ, అస్పష్టమైన మరియు అవాస్తవమైన వాటిని మాత్రమే వ్యక్తపరుస్తారు. కాలంతో పాటుగా, వారు ప్రజలను అస్పష్టమైన మరియు అసహజమైన నియమాలలోనికి నడిపిస్తారు. దేవుడు జరిగించే కార్యము మానవ శరీర అనుగుణముగా ఉండదు. అది మానవ తలంపులకు విరోధమైనది కాబట్టి, అది మానవ ఆలోచనలకు అనుగుణముగా ఉండదు; అస్పష్టమైన మానవ రంగులతో అది మలినము కాలేదు. దేవుని ద్వారా పరిపూర్ణపరచబడని వ్యక్తి ఆయన కార్యపు ఫలితాలను సాధించలేడు; అవి మానవ ఊహకు అతీతమైనవి.

మానవుని మనస్సులోని కార్యమును సాధించడము మానవునికి చాలా సులభము. మత సంబంధిత లోకములోని సంఘ కాపరులు మరియు నాయకులు, ఉదాహరణకు, తమ కార్యమును జరిగించడానికి తమ వరములు మరియు స్థాయిలపై ఆధారపడుతారు. చాలా కాలము నుండి వారిని అనుసరించేవారు వారి వరముల ద్వారా వ్యాధిగ్రస్తులై మరియు వారి ఉనికిలో కొంత ప్రభావితము చేయబడతారు. వారు వ్యక్తుల వరాలు, సామర్థ్యాలు, మరియు జ్ఞానములపై దృష్టి ఉంచి, మరియు అస్వాభావికమైన సంగతులు, నిగూఢమైన అనేక అవాస్తవ సిద్దాంతాల (వాస్తవానికి ఈ నిగూఢమైన సిద్దాంతాలు నిష్ప్రయోజనమైనవి) పట్ల శ్రద్దను కనుపరుస్తారు. వారు ప్రజలు పనిచేయడానికి మరియు బోధించడానికి తగిన తర్భీదునిస్తూ, విస్తారమైన వారి మత సిద్దాంతముల పట్ల ప్రజల అవగాహనను మెరుగుపరుస్తారే కానీ, ప్రజల స్వభావములలో మార్పులపై దృష్టి పెట్టరు. ప్రజల స్వభావములు ఎంతగా మార్పు చెందాయి ప్రజలు సత్యాన్ని ఎంతవరకు అర్ధం చేసుకున్నారనే దానిపై వారు దృష్టి పెట్టరు. తమకు తాముగా వారు ప్రజల స్వభావమును పట్టించుకోరు, మరియు ప్ర్రజల సాధారణ మరియు అసాధారణ స్థితులను గురించి తెలుసుకోవడానికీ ప్రయత్నించరు. వారు ప్రజల తలంపులను ప్రతిఘటించరు, తమ తలంపులనూ వారు బహిర్గతము చేయరు, వారి లోపాలు మరియు దుర్నీతి కారణంగా, ప్రజలను కనీసము సరిదిద్దరు. వారిని అనుసరించే వారిలో అనేకమంది వరములతో సేవ చేస్తారు, వారు ప్రకటించేవన్నీ వాస్తవముతో పొంతనలేని మరియు ప్రజలకు జీవాన్ని పూర్తిగా ప్రసాదించలేని మతపరమైన ఆలోచనలు మరియు వేదాంతపరమైన సిద్దాంతాలు. నిజానికి, వారి పని ఉద్దేశ్యమే తలాంతులను పెంపొందించడం, ఏమీలేని ఒక వ్యక్తిని కళాశాల పట్టభద్రునిగా చేసి, తరువాత పనిచేసి నడిపించేవానిగా తయారుచేయడంగా ఉన్నది. దేవుని ఆరు వేల సంవత్సరాల కార్యములో ఏవైనా కట్టడలను నీవు గుర్తించావా? మానవుని కార్యములో అనేకమైన నియమాలు మరియు పరిమితులు ఉన్నాయి, మరియు మానవ మస్తిష్కము చాలా వితండవాదమైనది. కాబట్టి, మానవుడు వ్యక్తపరిచేది, తన అనుభవ పరిధిలోని జ్ఞానము మరియు సాక్షాత్కారాలై ఉన్నాయి. ఇంతకు మించి మానవుడు దేనినీ వ్యక్తపరచలేడు. మానవుని అనుభవాలు మరియు జ్ఞానము తన వారములు మరియు స్వాభావికత నుండి ఉద్భవించవు; అవి దేవుని నడిపింపు మరియు ప్రత్యక్ష కాపరత్వమును బట్టి ఉత్పన్నమవుతాయి. మానవుడు ఈ విధమైన కాపరత్వమును అంగీకరించే సహజ స్వభావమును మాత్రమే కలిగి ఉన్నాడే తప్ప దైవత్వము అనగా ఏమిటో సూటిగా చెప్పే సహజత్వమును కలిగి లేడు. మానవుడు ఉద్భవ స్థానముగా ఉండలేకపోతున్నాడు; అతడు ఉద్భవ స్థానము నుండి వచ్చే నీటిని అనుమతించే ఒక పాత్రగా మాత్రమే ఉంటాడు. ఇది మానవ నిజము, మనిషిగా కలిగి ఉండవలసిన సహజ స్వభావము. ఒక వ్యక్తి దేవుని వాక్యమును అంగీకరించే సహజత్వమును పోగొట్టుకొని మరియు మానవ స్వభావికతను కోల్పోతే, ఆ వ్యక్తి అత్యంత విలువైన దానిని కూడా కోల్పోతాడు మరియు మానవుడు సృజించబడిన కర్తవ్యాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఒక వ్యక్తికి దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానము లేక అనుభవము లేకపోతే, సృజించబడిన వానిగా నెరవేర్చవలసిన కర్తవ్యమైన, బాధ్యతను కోల్పోతాడు, మరియు సృజించబడిన వానిగా కలిగియున్న గౌరవాన్నీ కోల్పోతాడు. శరీరమందైనా లేక సూటిగా ఆత్మ ద్వారా అయినా, దైవత్వము అంటే ఏమిటో తెలియపరచడం దేవుని స్వభావమై ఉన్నది; అది దేవుని పరిచర్య. దేవుని కార్యమందైనా లేక ఆ తరువాత అయినా మానవుడు తన సొంత అనుభవాలను లేక జ్ఞానమును (అది, అతను ఏమిటో వ్యక్త పరుస్తుంది) వ్యక్త పరుస్తాడు; ఇది మానవ స్వభావం, మరియు మానవ కర్తవ్యం, అలాగే మానవుడు సాధించవలసినదీ ఇదే. మానవుని వ్యక్తీకరణ దేవుడు వ్యక్తపరచే దానికంటే చాలా వెనుకబడి ఉన్నప్పటికీ, అలాగే మానవుని వ్యక్తీకరణ నియామాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, అతడు నెరవేర్చవలసిన బాధ్యతను నెరవేర్చాలి మరియు చేయవలసిన దానిని చేయాలి. మానవుడు తన విధిని నెరవేర్చడానికి, మానవ యత్నముగా సాధ్యమైన ప్రతిదానినీ చేయాలి, మరియు అతడు కాస్త కూడా మొహమాటము కలిగి ఉండకూడదు.

ఏళ్ల తరబడి పనిచేసిన తరువాత, మానవుడు తన అనేక సంవత్సరాల అనుభవమును అలాగే తెలివిని మరియు కూడబెట్టిన నియమాలను సంక్షిప్తపరుస్తాడు. చాలా కాలము పాటు పని చేసిన వ్యక్తికి పరిశుద్దాత్మ కార్యము కదలికను ఎలా గ్రహించాలో తెలుస్తుంది; పరిశుద్దాత్మ ఎప్పుడూ కార్యము చేస్తాడో మరియు ఎప్పుడూ చేయడో అతనికి తెలుస్తుంది; భారము మోస్తూ సహవాసము ఎలా చేయాలో అతనికి తెలుస్తుంది; మరియు పరిశుద్దాత్మ కార్యపు సాధారణ స్థితి మరియు జీవమందు ప్రజల ఎదుగుదల గూర్చి అతనికి తెలుస్తుంది. ఏళ్ల తరబడి పనిచేసిన అలాంటి వ్యక్తి పరిశుద్దాత్మ కార్యము గూర్చి ఎరిగి ఉంటాడు. సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన వారు నిశ్చయముగా మరియు నిమ్మళముగా మాట్లాడుతారు; వారు మాట్లాడటానికి ఏమీ లేకపోయినా, వారు నిమ్మళముగా ఉంటారు. లోలోపల, వారు పరిశుద్దాత్మ కార్యము కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూనే ఉంటారు. వారు పనిలో అనుభవము గలవారు. సుదీర్ఘ కాలంపాటు పని చేసి, చాలా అనుభవము పొంది, అనేక పాఠాలు నేర్చుకున్న వ్యక్తి పరిశుద్దాత్మ కార్యమును ఆటంకపరిచే అనేకమైన వాటిని లోపల కలిగి ఉంటాడు; ఇదే అతడి దీర్ఘకాలిక పనిలో ఉన్న లోపము. అప్పుడే పని ప్రారంభించిన వ్యక్తి మానవ ఉపదేశాలు మరియు అనుభవముతో మలినము కాకుండా ఉంటాడు మరియు పరిశుద్దాత్మ కార్యము ఎలా చేస్తాడనే దాని గురించి ఏమీ తెలియకుండా ఉంటాడు. అయితే, పని చేసే సమయములో, అతడు పరిశుద్దాత్మ ఎలా పనిచేస్తాడో క్రమముగా గ్రహించడం నేర్చుకుని మరియు పరిశుద్దాత్మ కార్యము పొందేందుకు ఏమి చేయాలి, ఇతరుల బలహీనతలపై సరిగ్గా కొట్టడానికి ఏమి చేయాలి, మరియు పని చేయు వారు కలిగి ఉండవలసిన మరేదైనా సాధారణ జ్ఞానము వంటి వాటి గూర్చి అవగాహన పొందుతాడు. కాలక్రమేణా, అతడు గొప్ప నైపుణ్యముతో పనిచేసే బుద్ధి మరియు సాధారణ జ్ఞానము సాధిస్తాడు మరియు పనిచేసేటప్పుడు దానిని సులభముగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, పరిశుద్దాత్మ తన కార్యము చేసే విధానాన్ని మార్చినప్పటికీ, అతడు తన పనికి సంబంధించిన పాత జ్ఞానము మరియు పనికి సంబంధించిన పాత నియమాలకు కట్టుబడి ఉంటాడు, మరియు పనికి సంబంధించిన నూతన క్రియాశీలత గురించి కాస్త మాత్రమే తెలిస ఉటద. ఏళ్ల తరబడి చేయడము, పరిశుద్దాత్మ సన్నిధి మరియు నడిపింపుతో నింపబడటము అనేది అతనికి పని గురించిన ఉపదేశాలు మరియు గొప్ప అనుభవమును ఇస్తుంది. అటువంటి విషయాలు అతనిని ఆత్మ స్థైర్యముతో నింపుతాయే తప్ప, అది గర్వము కాదు. మరో మాటలో చెప్పాలంటే, అతడు తన సొంత కార్యమును బట్టి మరియు పరిశుద్దాత్మ కార్యము గూర్చి అతడు పొందుకున్న విషయపు సాధారణ జ్ఞానమును బట్టి సంతృప్తి చెందాడు. ప్రత్యేకముగా, ఇతరులు పొందని దానిని పొందడం లేదా గ్రహించడము అనేది తనపై తనకు మరింత విశ్వాసాన్ని కలుగజేస్తుంది; ఇతరులు ఈ ప్రత్యేకమైన ఆతిథ్యమునకు అర్హులు కాకపోతే, అతనిలోని పరిశుద్దాత్మ మాత్రము ఎన్నటికీ ఆరిపోదన్నట్టు కనబడుతుంది. అతని వంటి ప్రజలు, ఏళ్ల తరబడి పనిచేసిన వారు మరియు ఎవరి ఉపయోగము బహు విలువైనదిగా ఉంటుందో, వారు మాత్రమే దానిని ఆస్వాదించుటకు అర్హులు. పరిశుద్దాత్మ నూతన కార్యము పట్ల అతని అంగీకారమునకు ఈ విషయము గొప్ప ఆటంకముగా మారింది. అతడు నూతన కార్యమును అంగీకరించ గలిగినప్పటికీ, ఒక్క రాత్రిలోనే అతడు దానిని అలా చేయలేడు. దానిని అంగీకరించే ముందు అతడు దానిని అంగీకరించే ముందు నిశ్చయముగా అనేక మెలికలు మరియు మలుపుల ద్వారా వెళ్తాడు. అతని పాత తలంపులు పరిష్కరించబడి, మరియు అతని పాత స్వభావము తీర్పు తీర్చబడిన తరువాత మాత్రమే, ఈ పరిస్థితి క్రమముగా తిరోగమనము చెందుతుంది. ఈ దశలను దాటకుండా, తన పాత తలంపులకు అనుగుణముగా లేని నూతన బోధనలను అంత సులభముగా అంగీకరించడు మరియు వెళ్లనివ్వడు. మానవునిలో ఇది చాలా కష్టతరమైన విషయము మరియు అది మారడము అంత సులభమేమీ కాదు. ఒకవేళ, ఒక పనివానిగా, అతడు ఒకేసారి పరిశుద్దాత్మ కార్యమును గ్రహించగలిగి, దాని క్రియాశీలతను క్లుప్త పరచగలిగితే, మరియు అతడు కార్యానుభావము చేత పరిమితము చేయబడకుండా పాత కార్యపు వెలుగులో నూతన కార్యమును అంగీకరించగలిగితే, అప్పుడు అతడు బుద్ధిమంతుడు మరియు యోగ్యమైన పనివానిగా ఉంటాడు. ప్రజలు తరచూ ఇలాగే ఉంటారు; వారు తమ కార్యానుభావాన్ని క్లుప్తపరచలేక అనేక సంవత్సరాల పాటు పని చేస్తారు లేదా తమ అనుభవాన్ని మరియు కార్యపు జ్ఞానాన్ని క్లుప్త పరచిన తరువాత, వారు నూతన కార్యమును అడ్డుంటారు మరియు పాత నూతన కార్యమును అర్ధము చేసుకోలేకపోతారు లేక సరిగా గౌరవించలేరు. ప్రజలను నియంత్రించడం నిజముగా కష్టము! మీలో అనేకమంది ఈ విధముగానే ఉంటారు. పరిశుద్దాత్మ కార్యమును ఏళ్ల తరబడి అనుభవించిన వారికి నూతన కార్యమును అంగీకరించడం చాలా కష్టం, వారు ఎల్లప్పుడూ వైదొలగలేని తలంపులతో ఉంటారు, అయితే అప్పుడే పని చేయడం ప్రారంభించిన ఒక వ్యక్తికి పని గురించిన కనీస జ్ఞానము ఉండదు మరియు కొన్ని అతి సుళువైన విషయాలను సైతం ఎలా పరిష్కరించాలో తెలియదు. వీళ్లు చాలా కష్టతరమైన ప్రజలు! కాస్త పెద్దరికము గలవారు తాము ఎక్కడినుంచి వచ్చారో మరిచిపోవునంత గర్వము మరియు ఆహంకారులై ఉంటారు. వీళ్లు యౌవనస్తులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తారు. అయినప్పటికీ వారు నూతన కార్యమును అంగీకరించలేరు మరియు ఏళ్ల తరబడి వారు కూడబెట్టిన మరియు దాచిన తలంపులను విడిచిపెట్టలేరు. ఆ యౌవనస్తులు, అజ్ఞానులైన ప్రజలు ఉత్సాహవంతులై పరిశుద్దాత్మ నూతన కార్యమును కొద్దిగా అంగీకరించగలిగినప్పటికీ, వారు ఎల్లప్పుడూ అయోమయముగా మరియు సమస్యలు చెలరేగినప్పుడు ఏమిచేయాలో తెలియక ఉంటారు. వారు ఉత్సాహవంతులే కానీ అజ్ఞానులు. పరిశుద్దాత్మ కార్యము గురించి వారు కాస్త అవగాహన మాత్రమే కలిగి మరియు వారి జీవితాలలో దానిని ఉపయోగించుకోలేకుండా ఉంటారు; ఇది పూర్తిగా పనికిమాలిన సిద్దాంతము. మీలాంటి వ్యక్తులు అనేకమంది ఉన్నారు; ఉపయోగపడే వారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్దాత్మ వెలిగింపునకు మరియు ప్రకాశమునకు విధేయులై మరియు దేవుని చిత్తానుసారము జరిగించేవారు ఎంతమంది ఉన్నారు? మీలో ఇంతవరకు అనుచరులుగా ఉన్నవారు చాలా విధేయత కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ, నిజానికి, మీరు మీ తలంపులను విడనాడలేదు, మీరు ఇంకా బైబిల్‌లోనే వెదుకుతూ, అస్పష్టమైన దానిని నమ్ముచున్నారు, లేక తలంపులలో సంచరిస్తున్నారు. ఈనాటి నిజమైన కార్యమును జాగ్రత్తగా లేక దాని లోతుగా వెళ్లి పరిశీలించేవారు ఎవరూ లేరు. మీరు మీ పాత తలంపులతో నేటి సత్యమార్గమును అంగీకరిస్తున్నారు. అటువంటి విశ్వాసముతో మీరు ఏమి పొందగలరు? మీలో బహిర్గతము కాని అనేక తలంపులు దాగి ఉన్నాయని, వాటిని సులభముగా బయటపెట్టకుండా దాచడానికి, మీరు చాలా బాగా ప్రయతిస్తున్నారని చెప్పవచ్చు. నూతన కార్యమును మీరు చిత్తశుద్దితో అంగీకరించరు, మరియు మీ పాత ఆలోచనలను విడిచిపెట్టే యోచన చేయరు; మీరు జీవించడానికి చాలా తత్వ సిద్దాంతాలు ఉన్నాయి, మరియు అవి చాలా దృఢమైనవి. మీ పాత ఆలోచనలను మీరు విడిచిపెట్టరు మరియు అయిష్టముగానే మీరు నూతన కార్యము చేస్తారు. మీ హృదయాలు చాలా చెడ్డవి మరియు నూతన కార్యపు దశలను మీరు హృదయపూర్వకముగా తీసుకోరు. మీలాంటి వ్యర్ధులు సువార్తను విస్తరింపజేచే పని చేయగలరా? లోకమంతా దానిని వ్యాపింపజేసే కార్యమును మీరు చేపట్టగలరా? ఈ మీ అనుసరణలు మీ స్వభావములో మార్పు కలిగించి దేవుని తెలుసుకోకుండా ఆపుతున్నాయి. ఇలానే గనుక మీరు కొనసాగిస్తే, మీరు తప్పనిసరిగావెలివేయబడతారు.

దేవుని కార్యమును మానవుని కార్యము నుండి ఎలా వేరుపరచాలో మీరు తెలుసుకోవాలి. మానవుని కార్యములో నీవు ఏమి చూడగలవు? అతని కార్యములో అనేకమైన మానవ అనుభవ అంశాలు ఉన్నాయి; మానవుడు ఏది వ్యక్త పరుస్తాడో అదే తానుగా ఉంటాడు. దేవుని కార్యము కూడా ఆయన ఏమైయున్నాడో వ్యక్తపరుస్తుంది కాన ఆయన వ్యక్తిత్వం మానవుని వ్యక్తిత్వమునకు భిన్నముగా ఉంటుంది. మానవ వ్యక్తిత్వము మానవుని అనుభవాన్ని మరియు జీవితాన్ని (మానవుడు తన జీవితములో ఏమి అనుభావిస్తాడో లేక ఏది ఎదుర్కొంటాడో లేక తాను కలిగియున్న జీవన తత్వ సిద్దాంతాలు) కనుపరుస్తుంది, మరియు వివిధ పరిస్థితులలో జీవించే ప్రజలు వివిధమైన వ్యక్తిత్వాలను వ్యక్తపరుస్తారు. నీకు సమాజ అనుభవాలు ఉన్నాయా అనేది నీవు కుటుంబములో ఎలా జీవిస్తున్నావు మరియు దానిలోని అనుభవాన్ని మీరు వ్యక్తపరిచే దానిలో చూడవచ్చు, అయితే దేవుని కార్యములో ఆయన సామాజిక అనుభవాలు కలిగి ఉన్నాడా అనేది నీవు చూడలేవు. ఆయన మానవ తత్వమును గూర్చి బాగా ఎరిగియున్నాడు మరియు అని రకాల వ్యక్తులకు చెందిన అన్ని విధాలైన ఆచరణలను బహిర్గతము చేయగలడు. మనుష్యుల దుర్నీతి స్వభావములను మరియు తిరుగుబాటు ప్రవర్తనను బహిర్గతము చేయడములో ఆయన ఇంకా దిట్ట. ఆయన లోకానుసారమైన వ్యక్తుల మధ్య ఆయన నివాసము చేయడు, కానీ ఆయన నరుల స్వభావమును మరియు లోకానుసారమైన వ్యక్తుల అన్ని రకాలైన దుర్నీతి గురించి ఆయన ఎరిగియున్నాడు. అది ఆయన అస్థిత్వము. ఆయన మానవ స్వభావమును పూర్తిగా అర్ధం చేసుకున్నాడు కాబట్టి, లోకముతో ఆయనకు ఎటువంటి లావాదేవీలు లేకపోయినప్పటికీ, లోకముతో వ్యవహరించు నియమాలను ఆయన ఎరిగిఉన్నాడు. భూత, వర్తమానం అనే రెండు కాలాలల మానవ నేత్రాలు చూడలేని మరియు మానవ చెవులు గ్రహించలేని ఆత్మ కార్యమును ఆయన ఎరిగియున్నాడు. దీనిలో జీవించుట కొరకైన తాత్వికత కాని జ్ఞానము మరియు ప్రజలకు అగోచరమైన అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. ఇది ప్రజలకు బహిరంగ పరిచిన అలాగే ప్రజల నుండి మరుగు చేయబడిన ఆయన వ్యక్తిత్వము. ఆయన వ్యక్తపరిచేది ఒక అసాధారణ వ్యక్తి వ్యక్తిత్వము కాదు కానీ, అది ఆత్మ వ్యక్తిత్వము మరియు స్వాభావిక గుణ గణాలు. ఆయన లోకమందు పర్యటించనప్పటికీ, దాని గురించిన సమస్తమును ఎరిగియున్నాడు. బుద్ధి, జ్ఞానము లేని “ఆదిమానవులతో” ఆయన సంభాషించినప్పటికీ, జ్ఞానము కంటే ఉన్నతమైన మరియు గొప్ప వ్యక్తుల మాటల కంటే అత్యుత్తమ మాటలతో సంభాషిస్తాడు. మానవజాతి ప్రాథమికమైన మరియు అల్పమైన మానవత్వమును ఒకే సమయములో బయలుపరుస్తూ, మానవజాతిని సాధారణ మానవత్వముతో జీవించాల్సిందిగా ఆయన అడిగినప్పటికీ, మానవత్వము లేని మరియు మానవజాతి జీవనాన్ని మరియు ఆచారాలను అర్ధం చేసుకోని మందబుద్ది కలిగి మరియు స్తబ్ధులైన ప్రజల సమూహమందు ఆయన నివసిస్తున్నాడు. ఇదంతా ఆయన వ్యక్తిత్వము. రక్త మాంసాలు కలిగియున్న వ్యక్తి వ్యక్తిత్వము కంటే అది ఉన్నతమైనది. ఆయన చేయవలసిన కార్యము చేయడము కోసము మరియు దుర్నీతిమయమైన మానవజాతి స్వభావమును పూర్తిగా బహిర్గతము చేయడానికి, సంక్లిష్టమైన మరియు గందరగోళమయమైన మరియు నీచమైన సామాజిక జీవితమును అనుభవించడం ఆయనకు అనవసరము. ఒక దుర్భరమైన సామాజిక జీవితము ఆయన దేహమును వృద్ధి చేయదు. ఆయన కార్యము మరియు వాక్యాలు మానవుని అవిధేయతను బహిర్గతం చేస్తాయి మరియు లోకముతో వ్యవహరించడానికి అనుభవాన్ని మరియు ఉపదేశాలను మానవునికి అందించవు. ఆయన మానవునికి జీవాన్ని ప్రసాదించినప్పుడు, సమాజము లేక మానవుని కుటుంబాన్ని గురించి విచారించవలసిన అవసరము ఆయనకు లేదు. బట్టబయలు చేయడం మరియు తీర్పు తీర్చడం అనేవి ఆయన శరీర అనుభవ వ్యక్తీకరణ కాదు; చాలా కాలముగా మానవుని అవిధేయతను తెలుసుకుని మరియు మానవజాతి దుర్నీతిని అసహ్యించుకున్న తరువాత, మానవుని అన్యాయం గూర్చిన ఆయనకు ప్రత్యక్షత ఉన్నది. ఆయన చేయు కార్యమంతా మానవునికి తన స్వభావమును బయలు పరచడానికి మరియు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడినవి. ఆయన మాత్రమే ఈ కార్యము చేయగలడు; అది రక్తమాంసాలు కలిగిన వ్యక్తి సాధించగలది కాదు. ఆయన కార్యమును బట్టి, ఆయన ఎలాంటి వ్యక్తో మానవుడు చెప్పలేడు. ఆయన కార్య మూలముగా మానవుడు ఆయనను సృజించబడిన వ్యక్తిగా కూడా వర్గీకరించలేడు. ఆయన వ్యక్తిత్వము కూడా ఆయనను సృజించబడిన వానిగా వర్గీకరించలేకుండా చేస్తుంది. మానవుడు ఆయనను మానవాతీతునిగానే పరిగణిస్తాడు కానీ, ఆయనను ఏ జాతిలో పెట్టాలో తెలియదు, కాబట్టి మానవుడు ఆయనను దేవుని జాతిలో బలవంతముగా పెట్టవలసి వచ్చినది. అలా చేయడమనేది మానవునికి సమంజసము కాదు. ఎందుకంటే, మానవుడు చేయలేని కార్యాన్ని దేవుడు ప్రజల మధ్య చేశాడు.

దేవుడు చేసే కార్యము ఆయన శరీర అనుభవానికి ప్రాతినిధ్యము కాదు; మానవుడు చేసే కార్యము అతని అనుభవమునకు ప్రాతినిధ్యము వహిస్తుంది. తమ వ్యక్తిగత అనుభవాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతారు. దేవుడు సత్యాన్ని నేరుగా వ్యక్తపరచగలడు, అయితే మానవుడు సత్యానుభవమునకు అనుగుణముగా పొందిన అనుభవమును మాత్రమే వ్యక్తపరచగలడు. దేవుని కార్యమునకు నియమాలు ఉండవు మరియు అది సమయము లేక భౌగోళిక హద్దులకు పరిమితమై ఉండదు. ఆయన ఏమైయున్నాడని అని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఆయన తెలియజేయగలడు. ఆయనకు నచ్చినట్లు కార్యము చేస్తాడు. మానవుని కార్యమునకు పరిస్థితులు మరియు సందర్భాలు ఉంటాయి; అవి లేకుండా, అతడు కార్యము చేయలేడు, దేవుని జ్ఞానమును లేక అతని సత్యానుభవమును వ్యక్తపరచలేడు. ఏదైనా ఒక కార్యమనేది దేవుని కార్యమో లేక మానవుని కార్యమో చెప్పడానికి, ఆ రెండింటి మధ్య వ్యత్యాసాలను సరిపోల్చాలి. దేవుని ద్వారా కార్యము చేయబడకుండా మానవుని కార్యము మాత్రమే ఉంటే, ఇతరుల సామర్థ్యమునకు మించిన, మానవ బోధనలు ఎక్కువగా ఉన్నాయని నీవు సులభముగా తెలుసుకోవచ్చు; వారు మాట్లాడే స్వరములు, పరిస్థితుల నిర్వహణ లోని సూత్రాలు, పనిచేయడంలో అనుభవపూర్వకమైన వారి తిన్నని ప్రవర్తన వంటివన్నీ ఇతరులకు అందుబాటులో ఉండవు. మీరందరూ ఈ వ్యక్తులను మంచి సామర్థ్యము మరియు ఉన్నతమైన జ్ఞానము గలవారని మెచ్చుకుంటారు కాన దేవుని కార్యము మరియు మాటల నుండి ఆయన మానవత్వము ఎంత ఉన్నతమైనదో నీవు చూడలేవు. బదులుగా, ఆయన సామాన్యుడు మరియు కార్యము చేస్తున్నప్పుడు ఆయన సామాన్యుడు మరియు నిజమైనవాడు అయినప్పటికీ నరులచేత కొలవబడలేనివాడు కాబట్టి, ప్రజలు ఆయన పట్ల ఒక విధమైన గౌరవమును కలిగి ఉంటారు. బహుశా ఒక వ్యక్తి అనుభవము తన పనిలో విశేషముగా వృద్ధి చెందుతుంది లేక అతని ఊహ మరియు హేతుకతలు ముఖ్యముగా వృద్ధి చెందుతాయి మరియు అతని మానవత్వము చాలా మంచిది; అలాంటి గుణగణాలు మనుష్యుల మెప్పును మాత్రమే పొందగలవు కానీ, వారిలో భీతి మరియు భయమును ప్రేరేపించలేవు. బాగా పని చేసే వారినీ, విశేషమైన నిగూఢ అనుభవము గలవారినీ మరియు సత్యాన్ని అనుసరించే వారిని ప్రజలందరు మెచ్చుకుంటారు కానీ, అటువంటి ప్రజలు మెప్పు మరియు అసూయనే తప్ప భీతిని ఎన్నడూ వ్యక్తపరచలేరు. కానీ దేవుని కార్యమును అనుభవించిన ప్రజలు దేవుని కొనియాడరు; బదులుగా, ఆయన కార్యము మానవునికి అందనిది మరియు మనిషికి అగోచరమైనదని, అది స్వచ్చమైనది మరియు అద్భుతమైనదని భావిస్తారు. ప్రజలు దేవుని కార్యమును అనుభవించినప్పుడు, ఆయనను గూర్చిన వారి మొదటి అవగాహన ఆయన అగోచరమైన వాడు, తెలివి గలవాడు, మరియు అద్భుతమైన వాడని గ్రహించడంతో పాటు వారు వారికి తెలియకుండానే ఆయనను గౌరవిస్తారు మరియు మానవ మేధస్సుకు మించిన ఆయన చేయు కార్యపు మర్మాన్ని అనుభూతి చెందుతారు. అలాంటి ప్రజలు ఆయన ఆశయాలు నెరవేర్చాలని మరియు ఆయన కోరికలను తృప్తిపరచాలని మాత్రమే ఆశిస్తారు; ఆయనను అధిగమించాలని వారు కోరుకోరు. ఎందుకంటే, ఆయన చేసే కార్యము మానవ ఆలోచన మరియు ఊహకు మించినది మరియు ఆయనకు బదులుగా మానవుడు చేయలేనిది. మానవునికి తన కొరతల గూర్చి కూడా తెలియదు, అయినప్పటికీ దేవుడు ఒక మార్గమును ఏర్పరచి మానవుని నూతనమైన మరియు చాలా అందమైన లోకములోనికి తీసుకురావడానికి వచ్చాడు, మరియు దాని ద్వారా మానవజాతి నూతన వృద్దిని సాధించి నూతన ఆరంభమును కలిగి ఉన్నది. దేవుని పట్ల ప్రజలు కలిగి ఉండేది ప్రశంశ కాదు, లేదా ప్రశంశ మాత్రమే కాదు. భీతి మరియు ప్రేమ వారి లోతైన అనుభవముగా ఉంటుంది; దేవుడు నిజముగా అద్భుతమైనవాడని వారి భావన. మానవుడు చేయలేని కార్యాలు ఆయన చేస్తాడు మరియు మానవుడు చెప్పలేని విషయాలను చెబుతాడు. దేవుని కార్యమును అనుభవించిన ప్రజలు వర్ణనాతీతమైన అనుభూతిని ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. తగినంత లోతైన అనుభవమును కలిగియున్న ప్రజలు దేవుని ప్రేమను గ్రహించగలరు; ఆయన కార్యము ఎంతో తెలివైనది, ఎంతో అద్భుతమైనదని, వారు ఆయన మనోహరత్వమును అనుభూతి చెందగలరు, తద్వారా వారియందు ఎల్లలు లేని శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది భయమో, సందర్భానుసారమైన ప్రేమో, మరియు గౌరవమో కాదు కానీ, మానవుని పట్ల లోతైన దేవుని దయా గుణము మరియు అతని సహనమైయున్నది. అయినప్పటికీ, ఆయన గద్దింపు మరియు తీర్పును అనుభవించిన ప్రజలు ఆయన మహిమను గ్రహిస్తారు మరియు ఆయన ఏ నేరాన్ని సహించడు. ఆయన కార్యమును అధికముగా అనుభవించిన వ్యక్తులు కూడా ఆయనను అర్ధం చేసుకోలేరు; ఆయనను నిజముగా ప్రేమించే వారందరికీ, ఆయన కార్యము మానవ తలంపులకు అనుగుణముగా ఉండదు కానీ, ఎల్లప్పుడూ వారి ఆలోచనలకు విరుద్ధముగా ఉంటుందని తెలుసు. ఆయనను పూర్తిగా కొనియాడే మరియు విధేయత రూపమును కనుపరిచే ప్రజలు ఆయనకు అవసరము లేదు; బదులుగా, వారు నిజమైన గౌరవము మరియు విధేయతను కనుపరచాలి. అధికమైన ఆయన కార్యములో, నిజమైన అనుభవము కలిగియున్న వారెవరైనా ఆయన ఆదరణను అనుభూతి చెందుతారు, ఇది ప్రశంస కంటే ఉన్నతమైనది. ఆయన గద్దింపు మరియు తీర్పు కార్యమును బట్టి ప్రజలు ఆయన స్వభావమును చూశారు, మరియు దానినిబట్టి, వారు ఆయనను తమ హృదయాలలో గౌరవిస్తారు. దేవుడు గౌరవించబడాలి మరియు ఆచరించబడాలి. ఎందుకంటే, ఆయన అస్థిత్వము మరియు ఆయన స్వభావము సృజించబడిన ప్రాణి వలె ఉండవు మరియు అవి సృజించబడిన ప్రాణి కంటే ఉన్నతమైనది. దేవుడు స్వయం-భవుడు మరియు శాశ్వితమైనవాడు, ఆయన సృజించబడని వాడు మరియు దేవుడు మాత్రమే గౌరవమునకు మరియు విధేయతకు యోగ్యుడు; మానవుడు దీనికి అర్హుడు కాదు. కాబట్టి, ఆయన కార్యమును అనుభవించిన మరియు ఆయనను నిజముగా ఎరిగిన వారందరూ ఆయన పట్ల భక్తి భావన కలిగి ఉంటారు. ఏదేమైనప్పటికీ, ఆయనను గూర్చిన తమ తలంపులను విడిచిపెట్టని వారు—ఆయనను దేవునిగా పరిగణించని వారు—ఆయన పట్ల మర్యాద లేనివారు ఆయనను అనుసరించినప్పటికీ, వారు జయించబడరు; స్వతహాగానే వారు అవిధేయులు. ఆ విధముగా కార్యము చేయుట ద్వారా ఆయన సాధించాలనుకున్నది ఏమిటంటే, సృజింపబడిన జీవరాశి అంతా సృష్టికర్త పట్ల భక్తి హృదయాలను కలిగి ఉండాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన ఆధిపత్యమునకు షరతులు లేని విధేయత చూపాలి. ఆయన కార్యమంతా నెరవేర్చడానికి ఉద్దేశించబడిన అంతిమ ఫలితమే ఇది. అటువంటి కార్యమును అనుభవించిన ప్రజలు, దేవుని సేవించకపోతే, మరియు వారి అవిధేయత కాస్తయినా మారకపోతే, వారు తప్పకపరిత్యజించబడతారు. దేవుని పట్ల ఒక వ్యక్తి ప్రవర్తన కేవలం కొనియాడటం లేక దూరము నుండి గౌరవమును కనుపరచడం మరియు కాస్తయినా ప్రేమించకపోవడమే అయితే, అది దేవుని పట్ల ప్రేమలేని హృదయము కలిగియున్న వ్యక్తి నుండి వచ్చిన ఫలితమే అవుతుంది మరియు ఆ వ్యక్తి పరిపూర్ణ పరచబడే పరిస్థితులు ఉండవు. అంతటి కార్యము ఒక వ్యక్తి నిజమైన ప్రేమను పొందలేకపోతే, ఆ వ్యక్తి దేవుని పొందలేడు, సత్యాన్ని నిజముగా అనుసరించడు. దేవుని ప్రేమించని వ్యక్తి సత్యాన్ని ప్రేమించడు గనుక దేనినీ పొందలేడు, దేవుని అమోదాన్నీ పొందలేడు. ఏదో ఒకవిధంగా పరిశుద్దాత్మ కార్యమును అనుభవిస్తాము, ఎలా అయినా న్యాయతీర్పును అనుభవిస్తాము అనుకునే వ్యక్తులు దేవుని సేవించలేరు. వీరు స్వభావమును మార్చుకోలేని మరియు మిక్కిలి దుష్ట స్వభావములు కలిగిన వ్యక్తులు. దేవుని ఘనపరచని వారందరూపరిత్యజించబడతారు, శిక్షకు పాత్రులవుతారు, మరియు చెడుతనము చేయువారి వలె శిక్షింపబడతారు, అన్యాయమైన పనులు చేసిన వారి కంటే ఇంకా ఎక్కువగా బాధించబడతారు.

మునుపటి:  విజయం లేదా వైఫల్యం అనేది మనిషి నడిచే మార్గం మీద ఆధారపడి ఉంటుంది

తరువాత:  దేవుడి కార్యములోని మూడు దశలు గురించి తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడానికి మార్గం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger