చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (2)

మానవుని స్వభావం నా సారానికి పూర్తిగా భిన్నమైనది, మానవుని అవినీతి స్వభావం పూర్తిగా సాతాను నుండి ఆవిర్భవించింది; మానవుని స్వభావం సాతానుచే తయారుచేసి చెడగొట్టబడింది. అంటే, మానవుడు దాని చెడుతనము మరియు వికారముల ప్రభావంతో జీవిస్తాడు. మానవుడు సత్య ప్రపంచములో లేదా పరిశుద్ధ వాతావరణములో ఎదగడు మరియు ఇంకా తక్కువగా మానవుడు వెలుతురులో జీవిస్తాడు. కాబట్టి, జన్మించినది మొదలుకొని వారి స్వభావంలో సత్యమును కలిగి ఉండటం ఎవరికీ సాధ్యం కాదు, దేవుని పట్ల భయము మరియు విధేయతతో వుండే సారముతో ఎవరు కూడా జన్మించలేరు. దీనికి భిన్నంగా, ప్రజలు దేవుని వ్యతిరేకించే, దేవుని పట్ల అవిధేయత చూపే స్వభావం కలిగి వుంటారు సత్యము పట్ల ప్రేమను కలిగివుండరు. ఈ స్వభావమే నేను చర్చించాలనుకుంటున్న సమస్య—ద్రోహం. ప్రతి వ్యక్తికీ దేవునిపై కలిగివున్న ప్రతిఘటనకు మూలము ద్రోహం. ఈ సమస్య అనేది కేవలం మానవునిలో మాత్రమే ఉంటుంది, నాలో కాదు. కొంతమంది అడుగుతారు: క్రీస్తు ఈ లోకంలో జీవించినట్లుగానే అందరు మనుష్యులు జీవిస్తున్నప్పటికీ, ఎందుకు అందరు మనుష్యులు దేవునికి ద్రోహం చేసే స్వభావాల్ని కలిగి ఉంటారు, అయినప్పటికీ క్రీస్తును ఎందుకు కలిగిఉండడు? ఇది మీకు తప్పనిసరిగా స్పష్టంగా వివరించాల్సిన ఒక సమస్య.

మానవజాతి ఉనికికి ఆధారము ఆత్మ పునరావృత పునరావతారం. ఒక వ్యక్తి శరీరము జన్మించినప్పుడు, తుదకు శరీరం దాని పరిమితులను చేరుకున్నంతవరకూ దాని జీవితం కొనసాగుతుంది, ఆత్మ తన పెంకును విడిచిపెట్టునపుడు అది చివరి క్షణం. ఒక వ్యక్తి ఆత్మ వస్తుంది, కాలక్రమేణా వెళ్లిపోవటంతో ఈ ప్రక్రియ మరల మరల జరుగుతుంది, ఆవిధంగా మానవాళి ఉనికి నిర్వహించబడుతుంది. శరీరం అనేది మనిషి ఆత్మకు జీవం కూడా మరియు మానవుని శరీర ఉనికికి మానవుని ఆత్మ మద్దతు ఇస్తుంది. అంటే, ప్రతి మనిషి జీవం వారి ఆత్మ నుండి వస్తుంది, జీవం వారి ఆత్మకు స్వాభావికంగా ఉండదు. ఆవిధంగా మానవుని స్వభావం వారి ఆత్మ నుండి వస్తుంది కానీ వారి శరీరం నుండి కాదు. సాతాను శోధనలను, బాధలను మరియు అవినీతిని వారు ఎలా అనుభవించారో ప్రతి వ్యక్తి ఆత్మకు మాత్రమే తెలుసు. ఈ విషయాలు మనిషి శరీరానికి తెలియనివి. అందువలన, మానవాళి తెలియకుండానే మరింత చీకటిగా, మరింత మురికిగా మరియు మరింత ఎక్కువ చేదుగా మారుతుంది, అదే సమయంలో, మానవునికి మరియు నాకు మధ్య దూరం మరింత ఎక్కువగా పెరుగుతుంది మరియు మానవాళికి జీవితం మరింత చీకటిగా మారుతుంది. సాతాను మానవాళి ఆత్మలను తన పట్టులో ఉంచుకొంటాడు, కావున, మానవుని శరీరాన్ని కూడా తప్పనిసరిగా సాతాను ఆక్రమించాడు. అటువంటి శరీరం మరియు అటువంటి ఒక మానవాళి దేవుని ప్రతిఘటించకుండా ఎలా ఉంటాయి? వారు ఆయనతో సహజంగా అనుకూలంగా ఎలా ఉండగలరు? నేను సాతానుని మధ్యకాశములో నాశనం చేయటానికి కారణం, అది నన్ను మోసం చేసినందుకే. కాబట్టి, మానవులు తమ ప్రమేయాల నుండి ఎలా విముక్తులవగలరు? అందుకే ద్రోహం మానవ స్వభావం. మీరు ఈ వాదమును అర్ధం చేసుకున్న తరువాత, క్రిస్తు స్వభావంపై కొంత మేరకు మీరు నమ్మకం కలిగివుండాలి. దేవుని ఆత్మను ధరించుకున్న శరీరం దేవుని స్వంత శరీరం. దేవుని ఆత్మ సర్వశ్రేష్టమైనది; అయన సర్వ శక్తిమంతుడు, పవిత్రుడు మరియు నీతిమంతుడు. అదే విధంగా, అయన శరీరం కూడా సర్వోన్నతమైనది, సర్వ శక్తిమంతమైనది, పవిత్రమైనది, నీతిమంతమైనది. అటువంటి శరీరం నీతికరమైన, మానవాళికి ప్రయోజనకరమైనవి చేయును, అవి పవిత్రమైనవి, మహిమకరమైనవి మరియు శక్తివంతమైనవి; సత్యమును ఉల్ల౦ఘి౦చే, నైతికతను మరియు న్యాయమును ఉల్ల౦ఘి౦చే దేనినైనా ఆయన చేయలేడు, దేవుని ఆత్మకు ద్రోహ౦ చేసే దేనినైనా చేయుటకు ఆయన చాలా తక్కువ సమర్థుడై ఉంటాడు. దేవుని ఆత్మ పవిత్రమైనది, అదేవిధంగా అయన శరీరం సాతానుచే చెడగొట్టబడనిది; అయన శరీరం మానవుని శరీరం కంటే భిన్నమైన సారమును కలిగివుంటుంది. సాతానుచే చెడగొట్టబడిన వాడు మానవుడు కానీ దేవుడు కాదు; సాతాను దేవుని శరీరాన్ని చెడగొట్టలేడు. ఆ విధంగా, మానవుడు మరియు క్రిస్తు ఒకే స్థలములో జీవించినది వాస్తవమైనా, మానవుడు మాత్రమే సాతానుని కలిగివున్నాడు, సాతానుచే వాడబడ్డాడు మరియు సాతానుచే పట్టబడ్డాడు. దీనికి విరుద్ధంగా, క్రీస్తు సాతాను అవినీతి నిత్యం ప్రవేశించలేనంత దుర్బేధ్యమైనవాడు. సాతాను ఎప్పటికీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించలేడు, దేవునికి సమీపముగా ఎప్పటికి చేరుకోలేడు. ఈరోజు, సాతానుచే చెడగొట్టబడిన మానవాళి మాత్రమే నాకు ద్రోహం చేస్తుందని మీరు అందరు అర్ధం చేసుకోవాలి. ద్రోహం అనేది ఎప్పటికి క్రీస్తును కలిగివున్న సమస్య కాదు.

సాతానుచే చెడగొట్టబడిన ఆత్మలన్నియు సాతాను రాజ్యములో దాసత్వములో పట్టబడివుంటాయి. క్రీస్తును నమ్మేవారు మాత్రమే వేరుచేయబడతారు, సాతాను శిబిరం నుంచి రక్షించబడి ఈనాటి రాజ్యమునకు తీసుకోని రాబడతారు. ఈ ప్రజలు ఇక ఎంతమాత్రం సాతాను ప్రభావంతో జీవించరు. అయినప్పటికీ, మానవుని స్వభావం ఇంకను మానవుని శరీరముతో పాతుకుపోయి వుంది, అంటే మీ ఆత్మలు రక్షింపబడినప్పటికీ, మీ స్వభావం మునుపటి స్వభావం లాగే వుంది మరియు మీరు నాకు ద్రోహం చేసే అవకాశం వంద శాతముగా వుంది. అందుకనే నా కార్యము చాలా కాలము ఉంటుంది, మీ స్వభావం లొంగనిదిగా ఉంటుంది. ఇప్పుడు, మీరందరూ మీ విధులను నిర్వర్తించే క్రమంలో మీ శక్తి మేరకు కష్టాలను ఎదుర్కొంటున్నారు, అయినప్పటికీ, మీలో ప్రతి ఒక్కరు సాతాను రాజ్యానికి, శిబిరానికి మరియు మీ పాత జీవితాలకి తిరిగి వెళ్లే సామర్ధ్యతను కలిగివున్నారు—ఇది కాదనలేని నిజం. ఆసమయంలో, ఇప్పుడు చేసినట్లుగా మానవత్వపు తునకను లేదా మానవ పోలికను ఇవ్వటం అనేది మీకు సాధ్యం కాదు. తీవ్రమైన పరిస్థితులలో, మీరు నాశనం చేయబడతారు మరియు, అంతకంటే ఎక్కువగా, శాశ్వతంగా అభిశంసించబడతారు, తీవ్రంగా శిక్షించబడతారు, మరల పునరావతారం పొందలేరు. ఇది మీ ముందున్న సమస్య. నేను ఈ విధంగా మీకు గుర్తు చేస్తున్నాను, మొదటగా, నా కార్యం వ్యర్థం కాదు మరియు రెండవదిగా మీరు వెలుగు నిండిన రోజులలో జీవించగలరు. నిజానికి, నా కార్యం వ్యర్ధమా కాదా అనేది కీలకమైన సమస్య కాదు. కీలకమైన విషయం ఏమిటంటే, మీరు సంతోషకరమైన జీవితాలను మరియు ఒక అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉండగలుగుతారు. నా పని ఏమిటంటే, ప్రజల ఆత్మలను రక్షించే పని. మీ ఆత్మ సాతాను చేతులలో పడినట్లయితే, మీ శరీరం శాంతిలో జీవించలేదు. నేను మీ శరీరాన్ని కాపాడుతున్నాను అంటే, మీ ఆత్మ కూడా ఖచ్చితంగా నా సంరక్షణలో ఉంటుంది. నేను మిమ్మల్ని నిజంగా అసహ్యించుకుంటే, మీ శరీరం మరియు ఆత్మ ఒకేసారి సాతాను హస్తములలోకి పడిపోతాయి. అప్పుడు మీరు మీ పరిస్థితిని ఊహించగలరా? ఒకరోజు నా మాటలు మీ మీద నుండి వెళ్ళిపోయినట్లయితే, అప్పుడు మిమ్మల్నందరినీ సాతానుకు అప్పగిస్తాను, నా కోపం చెదరిపోయ్యేవరకు అది మిమ్మల్ని బాధాకరంగా హింసిస్తుంది లేదా నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని శిక్షిస్తాను, నాకు ద్రోహం చేసే మీ హృదయాలు ఎప్పటికి మారవు.

నాకు చేసిన ద్రోహం ఇంకా ఎంత మీలో మిగిలివుందో అని ఇప్పుడు మీరందరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోవాలి. మీ ప్రతిస్పందన కొరకు నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నేనెప్పుడూ మనుష్యులతో ఆటలాడుకోను. నేను ఏదైనా చేస్తానని చెప్తే ఖచ్చితంగా చేస్తాను. మీలో ప్రతి ఒక్కరు నా మాటలను తీవ్రంగా పరిగణించే వారిగా ఉంటారని మరియు వాటిని కల్పనా కథలాగా భావించరని ఆశిస్తున్నాను. నేను కోరుకునేది మీ నుంచి నిర్దిష్టమైన చర్య, కానీ మీ ఊహలు కాదు. తరువాత, మీరు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, అవి ఈ క్రింది విధంగా ఉంటాయి:

1. మీరు నిజంగా సేవ చేసే వ్యక్తి అయితే, ఎటువంటి అలసత్వం లేదా ప్రతికూలత లేకుండా మీరు నాకు విశ్వసనీయంగా సేవ చేయగలరా?

2. నేను మిమ్మల్ని ఎన్నడూ ప్రశంసించలేదని మీరు కనుగొన్నట్లయితే, మీరు ఇంకా నాతో ఉండగలరా మరియు జీవితకాలము నాకు సేవ చేయగలరా?

3. మీరు ఎంతో ఎక్కువగా కష్టపడినప్పటికీ నేను మీకు ఇంకా చాలా చల్లగా ఉన్నట్లయితే, మీరు అస్పష్టతలో నా కోసం పనిచేయడం కొనసాగించగలరా?

4. మీరు నా కొరకు ఖర్చు చేసినప్పటికీ, నేను మీ చిన్న చిన్న కోరికలను తీర్చకపోతే మీరు నాతో నిరుత్సాహానికి మరియు నిరాశకు గురవుతారా లేదా కోపానికి గురయ్యి దూషిస్తారా?

5. మీరు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ప్రేమతో, నాకు విశ్వసనీయంగా ఉన్నప్పటికీ ఇంకా మీరు అనారోగ్యం, పేదరికం మరియు మీ స్నేహితులు మరియు బంధువులు మిమ్ములను విడిచిపెట్టడం వంటి దుఃఖమును అనుభవిస్తున్నట్లయితే, లేదా మీరు జీవితంలో ఏదైనా ఇతర దౌర్బాగ్యములను భరిస్తున్నట్లయితే, నాపట్ల మీ విశ్వసనీయత మరియు ప్రేమ ఇంకను కొనసాగుతాయా?

6. మీరు మీ హృదయములో ఊహించుకున్నవేవీ కూడా నేను చేసిన దానితో సరిపోలేకపోతే, మీ భవిష్యత్తు మార్గములో మీరు ఎలా నడుస్తారు?

7. మీరు పొందుకోవాలని ఆశించిన ఏదైనా విషయాలను మీరు పొందుకోకపోతే నా అనుచరుడిగా ఉండటాన్ని కొనసాగిస్తారా?

8. నా కార్యము ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యతను మీరు ఎన్నడూ అర్థం చేసుకోనట్లయితే, మీరు స్వేచ్ఛగా తీర్పులు ఇవ్వని మరియు ముగింపులకు రాని విధేయత కలిగిన వ్యక్తి కాగలరా?

9. నేను మనవాళితో కలిసివున్నప్పుడు నేను మాట్లాడిన అన్ని మాటలు మరియు చేసిన అన్ని కార్యములను కూడబెట్టగలరా?

10. మీరు నా విశ్వాసపాత్రమైన అనుచరుడిగా ఉండగలరా, మీరు ఏమీ అందుకోనప్పటికీ, నా కోసం జీవితకాల బాధను భరించడానికి సిద్ధంగా ఉన్నారా?

11. నా కొరకు మీ భవిష్యత్తు మనుగడను పరిగణనలోకి తీసుకోవడం, ప్రణాళిక రచించడం లేదా సిద్దపడటాన్ని విడిచిపెట్టగలరా?

ఈ ప్రశ్నలు మీ నుంచి నా చివరి ఆవశ్యకతలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు మీరందరు నా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడిగిన వాటిలో మీరు ఒకటి లేదా రెండింటిని నెరవేర్చినట్లయితే, మీరు తప్పనిసరిగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆవశ్యకతల్లో ఒక్కదాన్ని కూడా మీరు నెరవేర్చకపోతే, మీరు ఖచ్చితంగా నరకంలోకి నెట్టబడే వ్యక్తి. అటువంటి వ్యక్తులకు, నేను చెప్పాల్సినదేమీ లేదు, వారు ఖచ్చితంగా నాతో సమ్మతించే వ్యక్తులు కారు. ఎటువంటి పరిస్థితులలోనైనా నాకు ద్రోహం చేయగలిగే వ్యక్తిని నా గృహంలో నేను ఎలా ఉంచగలను? చాలా పరిస్థితుల్లో ఇప్పటికీ నాకు ద్రోహం చేయగల వారి విషయానికొస్తే, ఇతర ఏర్పాట్లు చేయడానికి ముందు వారి పనితీరును నేను గమనిస్తాను. అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితులనప్పటికీ, నాకు ద్రోహం చేసే సామర్ధ్యం వున్న అందరిని నేను ఎప్పటికీ మర్చిపోను; నేను వారిని నా హృదయంలో గుర్తుంచుకుంటాను మరియు వారి చెడు కార్యములను తిరిగి చెల్లించే అవకాశం కొరకు ఎదురుచూస్తాను. నేను లేవనెత్తిన ఆవశ్యకతలన్నీ మీలో మీరు తప్పనిసరిగా పరీక్షించుకోవాల్సిన సమస్యలు. మీరందరు వాటిని తీవ్రంగా పరిగణిస్తారని మరియు నాతో అశ్రద్ధగా వ్యవహరించరని నేను ఆశిస్తున్నాను. సమీప భవిష్యతులో, నా ఆవశ్యకతలపై మీరు నాకు ఇచ్చిన సమాధానాల్ని పరిక్షిస్తాను. ఆ సమయానికి, నాకు మీ నుండి ఇక ఏమీ అవసరం లేదు మరియు మీకు మనఃపూర్వకముగా ఉపదేశం ఇవ్వను. బదులుగా నేను నా అధికారాన్ని ప్రయోగిస్తాను. ఉంచవలసిన వారిని ఉంచుతాను, ప్రతిఫలం పొందవలసిన వారికి ప్రతిఫలం లభిస్తుంది, ఎవరినైతే సాతానుకు అప్పగించాలో వారిని సాతానుకు అప్పగించాలి, ఎవరైతే కఠినంగా శిక్షించబడాలో వారు కఠినంగా శిక్షించబడతారు మరియు నశించాల్సిన వారు నాశనం చేయబడతారు. ఆవిధంగా, నా రోజుల్లో నన్ను కలతపెట్టే వాళ్ళు ఇకపై వుండరు. మీరు నా మాటల్ని విశ్వసిస్తున్నారా? ప్రతీకారములో మీకు నమ్మకముందా? నన్ను మోసం మరియు ద్రోహం చేసిన చెడ్డవారినందరినీ నేను శిక్షిస్తానని మీరు నమ్ముతారా? ఆ రోజు త్వరగా లేదా తర్వాత రావాలని మీరు ఆశిస్తున్నారా? మీరు శిక్షను చూసి భయపడే వ్యక్తినా లేదా శిక్షను భరించాల్సినప్పటికీ నన్ను ప్రతిఘటించే వ్యక్తినా? ఆరోజు వచ్చినప్పుడు మీరు జయద్వానాల మధ్య లేదా నవ్వుల మధ్య ఉంటారనీ లేదా ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారనీ మీరు ఊహించగలరా? మీరు ఎటువంటి ముగింపును కలవాలని ఆశిస్తున్నారు? మీరు వంద శాతం నన్ను విశ్వసిస్తున్నారా? లేదా వంద శాతం నన్ను అనుమానిస్తున్నారా? అని ఎప్పుడైనా తీవ్రంగా ఆలోచించారా? మీ చర్యలు మరియు ప్రవర్తన మీ మీద ఎటువంటి పర్యవసానాలు మరియు ఫలితాలను తీసుకువస్తాయో మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ఆలోచించారా? ప్రతిగా నామాటలన్నీ నెరవేరతాయని మీరు నిజంగా ఆశిస్తున్నారా? లేదా ప్రతిగా నామాటలన్నీ నెరవేరతాయని భయపడుతున్నారా? నా మాటలను నెరవేర్చడానికి నేను త్వరలోనే వెళ్లిపోతానని మీరు ఆశిస్తే, మీరు మీ స్వంత మాటలను మరియు చర్యలను ఎలా చూడాలి? నేను త్వరలో వెళ్లిపోతానని మీరు ఆశించనప్పుడు మరియు నా మాటలన్నీ నెరవేరబడవని మీరు ఆశించనప్పుడు నాయందు అసలు ఎందుకు విశ్వాసముంచారు? మీరు నన్ను ఎందుకు అనుసరిస్తారో మీకు నిజంగా తెలుసా? మీ కారణం కేవలం మీ పరిధిని విస్తరించుకోవడమే అయితే, మిమ్మల్ని మీరు అంతగా ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఆశీర్వదించబడాలి మరియు రాబోయే విపత్తు నుండి తప్పించ బడాలంటే మీ స్వంత ప్రవర్తన గురించి ఎందుకు మీరు ఆందోళన చెందడం లేదు? నా ఆవశ్యకతలను మీరు సంతృప్తి పరచగలరా అని మిమ్మల్ని మీరు ఎందుకు ప్రశ్నించకోరు? రాబోయే ఆశీర్వాదాలను పొందడానికి మీరు అర్హత కలిగి ఉన్నారా అని కూడా మిమ్మల్ని మీరు ఎందుకు అడగరు?

మునుపటి:  చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (1)

తరువాత:  మీరు మీ చేతలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger