చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (1)

అతి త్వరలో నా కార్యము ముగియనుంది, మరియు అనేక సంవత్సరాల ఈ బంధం ఒక భరింపశక్యం కాని జ్ఞాపకంగా మారుతుంది. నేను ఎడతెగక పదేపదే నా వాక్యములు చెప్పాను మరియు నిరంతరం నా నూతన కార్యములను ఆవిష్కరించాను. వాస్తవానికి, నేను చేసే ప్రతి ఒక్క పనిలో నా సలహా ఒక ఆవశ్యక అంశముగా ఉంటుంది. నా సలహా లేకపోతే, మీరందరూ దారి తప్పి తిరుగుతారు, మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లుగా గుర్తిస్తారు. ఇప్పుడు నా కార్యము పూర్తి కాబోతుంది, అది దాని చివరి దశలో ఉంది. అయినప్పటికీ, నేను సలహా ఇచ్చే పని చేయాలనుకుంటున్నాను, అంటే, మీరు వినడానికి సలహా మాటలు అందించాలనుకుంటున్నాను. నేను తీసుకున్న శ్రమలను మీరు వృధా పోనివ్వరని, మరీ ముఖ్యంగా నేను తీసుకున్న ఆలోచనాత్మక సంరక్షణను మీరు అర్థం చేసుకుంటారని మరియు ఒక మనిషిగా ఎలా ప్రవర్తించాలనే దానికి నా మాటలను పునాదిగా పరిగణిస్తారని ఆశిస్తున్నాను. అవి మీరు వినటానికి ఇష్టపడే మాటలైనా, కాకపోయినా సంతోషంతో అంగీకరించేవైనా, కాకపోయినా లేదా అసౌకర్యంతో మాత్రమే అంగీకరించేవైనా, మీరు వాటిని మీరు తీవ్రంగా పరిగణించాలి. అలా కాని పక్షంలో, మీ సాధారణ మరియు ఉదాసీన స్వభావాలు మరియు ప్రవర్తనలు నన్ను తీవ్రంగా నిరాశ పరుస్తాయి, వాస్తవానికి అసహ్యం కలిగిస్తాయి. మీరందరూ నా మాటలను మళ్లీ మళ్లీ వేల సార్లు చదువుతారని, ఇంకనూ మీరు వాటిని హృదయపూర్వకంగా తెలుసుకొనవచ్చునని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీమీద నా అంచనాలను మీరు విఫలం చేయకుండా ఉండగలరు. అయితే, మీలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఈ విధంగా జీవించడం లేదు. దానికి విరుద్ధంగా, మీరందరూ ఒక చెడుతనం గల జీవితంలో, హృదయానుసారంగా తిని మరియు త్రాగే జీవితంలో మునిగిపోయారు, మీలో ఒక్కరు కూడా మీ హృదయము మరియు ఆత్మను సంపన్నం చేసుకోవటానికి నా మాటలను వినియోగించడం లేదు. ఈ కారణం చేతనే, మానవాళి నిజమైన వైఖరి గురించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది: మనుష్యులు ఎప్పుడైనా నన్ను మోసం చేయవచ్చు మరియు ఎవరు కూడా నా మాటల పట్ల పూర్తి విశ్వాసంగా ఉండలేరు.

మానవుడు సాతాను చేత ఎంతగానో చెడగొట్టబడ్డాడు, ఇకపై ఒక మనిషిగా ఉండలనే స్థాయిలో చెడగొట్టబడ్డాడు. చాలామంది మనుష్యులు ఈ వాక్యమును ఒక పరిధి మేరకు గుర్తిస్తారు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రస్తావించే “గుర్తింపు” అనేది నిజమైన జ్ఞానాన్ని వ్యతిరేకించినట్లుగా, కేవలం ఒక విధమైన పై పై అంగీకారంగా ఉంటోంది. మీలో ఎవరూ మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అంచనా వేసుకోలేరు మరియు విశ్లేషించుకోలేరు, మీరు ఇంకనూ నా మాటల గురించి సందిగ్ధంలోనే ఉండొచ్చు. కానీ ఈసారి, మీలో ఉన్న చాలా తీవ్రమైన సమస్య గురించి వివరించడానికి నేను వాస్తవాల్ని వినియోగిస్తున్నాను. దాని పేరు ద్రోహం. మీ అందరికీ “ద్రోహం” అనే మాట తెలిసి ఉండవచ్చు, ఎందుకంటే మీలో చాలామంది వేరొకరికి ద్రోహం చేసేలా ఏదైనా చేసి ఉండొచ్చు, ఎలా అంటే, ఒక భర్త తన భార్యకు ద్రోహం చేయడం, ఒక భార్య తన భర్తకు ద్రోహం చేయడం, ఒక కుమారుడు తన తండ్రికి ద్రోహం చేయడం, ఒక కుమార్తె తన తల్లికి ద్రోహం చేయడం, ఒక బానిస తన యజమానికి ద్రోహం చేయడం, స్నేహితులు ఒకరినొకరురు ద్రోహం చేసుకోవడం, అమ్మేవారు కొనేవారిని మోసం చేయటం మొదలైనవి. ఈ ఉదాహరణలన్నీ ద్రోహం సారాన్ని కలిగి ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ద్రోహం అనేది, వాగ్దానానికి భంగం చేసే, నైతిక సూత్రాలను ఉల్లంఘించే లేదా మానవ నైతికతకు విరుద్ధంగా వ్యవహరించే ఒక ప్రవర్తనా రూపం, మానవత్వానికి కలిగే ఒక నష్టాన్ని ఇది ప్రదర్శిస్తుంది. సాధారణంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో జన్మించిన ఒక మానవునిగా, సత్యానికి ద్రోహం కలిగించే దానిని మీరు ఎప్పుడైనా చేసి ఉండొచ్చు, మీకు గుర్తున్నా, లేకున్నా మీరు ఎప్పుడైనా వేరక వ్యక్తికి ద్రోహం చేసి ఉండవచ్చు లేదా ఇంతకు ముందు వేరొకరికి చాలా సార్లు ద్రోహం చేసి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులకు లేదా మీ స్నేహితులకు ద్రోహం చేసే సామర్థ్యం మీరు కలిగి ఉన్నారు కాబట్టి, మీరు ఇతరులకు కూడా ద్రోహం చేయగల సమర్థులే. అన్నిటికంటే ముఖ్యంగా, నన్ను మోసం చేయగల మరియు నేను తృణీకరించే పనులు చేయగల సమర్థులు మీరు. వేరొక మాటలో చెప్పాలంటే, ద్రోహం అనేది పైపైన కనిపించే అనైతిక ప్రవర్తన మాత్రమే కాదు. అది సత్యానికి విరుద్ధమైనది. అది ఖచ్చితంగా మానవాళి ప్రతిఘటనకు మరియు నామీద అవిధేయతకు మూలం లాంటిది. అందుకే నేను ఈ క్రింది వివరణ ద్వారా దానిని సంగ్రహపరిచాను. అది: ద్రోహం మానవ నైజం, మరియు ఆ స్వభావమనేది నాతో ప్రతి ఒక్కరి ఒప్పందానికి గొప్ప శత్రువు లాంటిది.

నాకు సంపూర్ణమైన విధేయత చూపలేని ప్రవర్తనే ద్రోహం. నాకు నమ్మకంగా ఉండలేని ప్రవర్తనే ద్రోహం. నన్ను మోసం చేయడం మరియు నన్ను మోసం చేయటానికి అబద్ధాలు చెప్పడమే ద్రోహం. అనేకమైన తలంపులు కలిగి ఉండి మరియు వాటిని ప్రతి చోటా వ్యాప్తి చేయడమే ద్రోహం. నా సాక్ష్యాలను మరియు ఆసక్తులను ఆదరించలేకపోవడమే ద్రోహం. హృదయంలో నాకు దూరంగా ఉంటూ, పైకి మాత్రం కృత్రిమ నవ్వులు చిందించడమే ద్రోహం. ఇలాంటి అన్నిరకాల ద్రోహపూరిత చర్యల్లో మీరు సమర్థులు మరియు అవి మీలో సర్వసాధారణమై ఉన్నాయి. మీలో ఎవరు కూడా దీనిని ఒక సమస్యగా అనుకోకపోవచ్చు కానీ, నేను అలా అనుకోను. ఒక వ్యక్తి నాకు చేసిన ద్రోహాన్ని నేను స్వల్ప విషయంగా పరిగణించలేను, ఖచ్చితంగా దానిని విస్మరించలేను. ఇప్పుడు, నేను మీ మధ్య పనిచేస్తున్నప్పుడు, మీరు ఈ విధంగా ప్రవర్తించారు—ఎవరూ మిమ్మల్ని గమనించని రోజున, తమ స్వంత చిన్న పర్వతాలకు రాజులుగా ప్రకటించుకున్న బందిపోటు దొంగల వంటి వారు కారా మీరు? అలా జరిగినప్పుడు మరియు ఒక మహా విపత్తుకు మీరు కారణమైనప్పుడు మిమ్మల్ని పరిశుద్ధం చేయడానికి ఎవరుంటారు? కొన్ని ద్రోహపూరిత చర్యలు అప్పుడప్పుడు జరిగే సంఘటనలు మాత్రమే అని, అదేమీ మీ నిరంతర ప్రవర్తన కాదని మరియు మీ గర్వాన్ని గాయపరిచే విధంగా వాటి గురించి చర్చించాల్సిన యోగ్యత లేదని మీరు అనుకుంటారు. మీరు నిజంగా ఆవిధంగా అనుకుంటే, మీకు జ్ఞానం కొరతగా ఉన్నట్లే. ఆ విధంగా అనుకోవడం తిరుగుబాటుకు నమూనా మరియు మూలం కూడా. మనిషి స్వభావమే అతని జీవితము; అతని మనుగడకు అదే ఆధార సూత్రం, దానిని అతడు మార్చలేడు. ద్రోహ స్వభావాన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. మీరు ఒక బంధువుకు లేదా ఒక స్నేహితుడికి ద్రోహం చేయటానికి ఏదైనా చేసినట్లయితే, అది మీ జీవితంలో భాగమని మరియు అది మీ జన్మతో వచ్చిన స్వభావమని ఋజువు చేస్తుంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇతరుల నుంచి దొంగిలించడం ద్వారా ఆనందిస్తే, కొన్నిసార్లు దొంగిలించడం మరియు కొన్నిసార్లు దొంగిలించకపోయినప్పటికీ, ఆ సంతోషం వారి జీవితంలో భాగం అవుతుంది. కాబట్టి, వారు దొంగిలించినా లేదా దొంగిలించక పోయినా, దొంగిలించడం అనేది వారికి సంబంధించిన ఒక రకమైన ప్రవర్తన మాత్రమే అని నిరూపించబడదు. బదులుగా, దొంగతనం వారి జీవితంలో భాగమని, అది వారి స్వభావమని నిరూపించబడుతుంది. కొంతమంది ఇలా అడుగవచ్చు: అది వారి స్వభావం అయినప్పుడు, కొన్నిసార్లు చక్కని వస్తువులను చూసినప్పటికీ వాళ్లెందుకు దొంగతనం చేయరు? సమాధానం చాలా సరళమైనది. వారు దొంగతనం చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే నిఘా నేత్రాల నుండి వాటిని కొట్టేయడానికి అది చాలా పెద్ద వస్తువు అయి ఉండవచ్చు లేదా అలా చేయడానికి సరైన సమయం లేకపోవడం లేదా ఆ వస్తువు చాలా ఖరీదైనది కావచ్చు. గట్టి కాపలా ఉండటం లేదా దాని మీద వారికి ప్రత్యేకమైన ఆసక్తి లేకపోవటం లేదా దానివల్ల వారికి ఎటువంటి ఉపయోగం ఉంటుందో తెలియక పోవడం మొదలైనవి కూడా కారణం కావచ్చు. ఇలాంటి కారణాలన్నీ అందుకు సాధ్యమే. కానీ, ఏదేమైనప్పటికీ వారు ఏదైనా దొంగిలించినా లేదా దొంగిలించకపోయినా వారి ఆలోచన క్షణికమైనదని లేదా అది లిప్తకాలం పాటు మాత్రమే ఉండేదని ఋజువు చేయబడదు. దానికి విరుద్ధంగా, అది వారి స్వభావంలో ఒక భాగమని మరియు వారు మంచి కొరకు మారటం కష్టతరమని ఋజువవుతుంది. అటువంటి వ్యక్తి ఒకసారి దొంగతనంతో సంతృప్తి చెందడు; ఏదైనా మంచి వస్తువు చూసినప్పుడల్లా లేదా సరైన సమయం దొరికినప్పుడల్లా ఇతరులకు చెందిన వాటిని తనదిగా చేసుకోవాలనే ఆలోచనలు అతనిలో కలుగుతాయి. అందుకే, ఈ ఆలోచన అనేది కేవలం అప్పుడప్పుడూ కొన్ని వస్తువులను తీసుకోవడం కాకుండా, అది ఆ వ్యక్తి స్వంత స్వభావంలోనే ఉందని నేను అంటాను.

ఎవరైనా తమ నిజమైన ముఖ వైఖరికి ప్రాతినిధ్యం వహించడానికి వారి స్వంత మాటలను మరియు చర్యలను ఉపయోగించవచ్చు. ఈ నిజమైన ముఖ వైఖరి వారి స్వభావం. నీవు కఠినమైన రీతిలో మాట్లాడే వ్యక్తి అయితే నీవు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు. నీవు స్వభావం మోసపూరితమైనది అయితే, నీవు కపటంగా వ్యవహరిస్తారు, ఇతరులు నీ చేత చాలా సులభంగా మోసగించబడతారు. నీ స్వభావం చెడ్డది అయితే, నీ మాటలు వినడానికి ఆహ్లాదంగా ఉంటాయి కానీ, నీ చర్యలు నీ చెడ్డయుక్తులను దాచలేవు. సోమరితనం మీ స్వభావం అయితే, నీవు చెప్పేవన్నీ నీ అనాసక్తత మరియు సోమరితనం వలన నీ బాధ్యతలను విస్మరించడానికి ఉద్దేశించబడినవిగా మరియు నీ చర్యలన్నీ నెమ్మదిగా మరియు అశ్రద్ధగా ఉంటాయి మరియు సత్యాన్ని దాచటంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీది అర్థం చేసుకునే స్వభావం అయితే, నీ మాటలు న్యాయంగా ఉంటాయి మరియు నీ చర్యలు కూడా సత్యానికి చాలా అనుగుణంగా ఉంటాయి. నీ స్వభావం నమ్మకంగా ఉన్నట్లయితే, నీ మాటలు ఖచ్చితంగా, నిజాయితీగా మరియు నీవు వ్యవహరించే విధానం చక్కగా స్థాపితం అవుతుంది, నీ యజమానికి ఇబ్బంది కలిగించే దేని నుంచైనా విడుదల కలిగిస్తుంది. నీ స్వభావం కామంతో నిండినది లేదా డబ్బు కోసం వ్యామోహం కలిగినదిగా ఉంటే, నీ హృదయం తరచుగా వాటితో నింపబడుతుంది, నీవు నీకు తెలియకుండానే, ప్రజలు తేలిగ్గా మర్చిపోలేని మరియు అసహ్యించుకునే, వికారమైన, అనైతిక కార్యాలకు పాల్పడతారు. నేను ఇప్పుడు చెప్పినట్లుగా, మీ స్వభావం ద్రోహంతో కూడుకున్నది అయితే, దాని నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోలేరు. మీరు ఇతరులకు అన్యాయం చేయనట్లయితే, మీకు ద్రోహ స్వభావం లేదనుకుని అదృష్టాన్ని నమ్మవద్దు. మీ ఆలోచన అదే అయినప్పుడు, మీరు నిజంగానే అసహ్యించబడతారు. ప్రతిసారి నేను మాట్లాడే అన్ని వాక్యములు ఒక మనిషి గురించి లేదా ఒక రకమైన మనిషి గురించి కాకుండా అందరు మనుష్యులను లక్ష్యంగా చేసుకొని ఉంటాయి. మీరు ఒక విషయంలో నాకు ద్రోహం చేయలేదంటే, ఏ విషయంలోనూ ద్రోహం చేయలేరని ఋజువు పరచబడదు. కొంతమంది మనుష్యులు వారి వైవాహిక జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, సత్యాన్ని వెతుకుటలో నమ్మకాన్ని కోల్పోతారు. కొంతమంది మనుష్యులు వారి కుటుంబం విచ్ఛిన్నం అయ్యే సమయంలో నాకు నమ్మకంగా ఉండాల్సిన బాధ్యతను విస్మరిస్తారు. కొంతమంది ఆనందము మరియు ఉత్సాహ క్షణాలను వెతికే క్రమంలో నన్ను వదిలేస్తారు. కొంతమంది వెలుగులో జీవించటం మరియు పరిశుద్ధాత్మ కార్యములలో ఆనందం పొందుకోవడం కన్నా చీకటి లోయలో పడటాన్ని ఇష్టపడతారు. కొంతమంది వారి ధన వ్యామోహాన్ని సంతృప్తిపరచడానికి స్నేహితుల సలహాలను విస్మరిస్తారు మరియు అప్పుడు కూడా వారి తప్పును అంగీకరించరు మరియు వారి మార్గాన్ని మార్చుకోరు. కొంతమంది నా రక్షణను పొందుకోవడం కోసం నా నామంతో తాత్కాలికంగా జీవిస్తున్నారు, మిగిలిన వారు నిర్బంధం వల్ల కొద్దిగా మాత్రమే సమర్పించుకుంటారు ఎందుకంటే, వారు జీవితము మరియు మరణ భయం చేత పట్టబడ్డారు. ఇవి మరియు మరీ ముఖ్యంగా సమగ్రత లేని ఇతర అనైతిక చర్యలు వంటి ప్రవర్తనలతో మనుష్యులు వారి హృదయాల్లో లోతుగా నన్ను మోసం చేయడం లేదా? ద్రోహం చేయడానికి మనుష్యులు ముందుగా ప్రణాళిక వేయరని నాకు తెలుసు, వారి ద్రోహం వారి స్వభావం సహజ ప్రకటనగానే ఉంటుంది. ఎవరు కూడా నాకు ద్రోహం చేయాలని కోరుకోరు మరియు నాకు ద్రోహం చేయడానికి ఏదో ఒకటి చేసిన వారు ఎవరు కూడా సంతోషంగా లేరు. దీనిని బట్టి, వారు భయంతో వణికిపోతున్నారా, లేదా? కాబట్టి, ఈ ద్రోహాలను ఎలా విమోచించాలి మరియు ప్రస్తుత పరిస్థితిని ఎలా మార్చాలి అని మీరు ఆలోచిస్తున్నారా?

మునుపటి:  భూమిపై దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి

తరువాత:  చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (2)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger