దేవుని వాక్యము ద్వారా సమస్తము సాధించబడుతుంది

భిన్నమైన యుగాలను బట్టి, దేవుడు తన వాక్యములు పలుకుతాడు మరియు తన పని పూర్తి చేస్తాడు, మరియు భిన్నమైన యుగాలలో ఆయన భిన్నమైన వాక్యములు పలుకుతాడు. దేవుడు నియమాలకు కట్టుబడటం లేక ఒకే పనిని పునరావృతం చేయడం లేక గత విషయాలను బట్టి చింతించడం వంటివి చేయడు; ఆయన ఎల్లప్పుడు నూతనమైన దేవుడు మరియు ఎన్నడూ పాత దేవుడు కాదు, మరియు ఆయన అనుదినము నూతన వాక్యములు పలికేవాడు. నీవు నేడు దేని ద్వారా కట్టుబడి ఉండాలో దానికే కట్టుబడి ఉండాలి; ఇదే మానవుని యొక్క బాధ్యత మరియు కర్తవ్యం. ప్రస్తుత దినమందు ఆచరణ అనేది దేవుని వెలుగు మరియు మాటల పట్ల కేంద్రీకృతమై ఉండటం చాలా కీలకం. దేవుడు నియమాలకు కట్టుబడి ఉండడు, తన వివేకమును మరియు సర్వశక్తిని స్పష్టంగా కనుపరచడానికి అనేకమైన విభిన్న దృక్కోణాల నుండి మాట్లాడగల సమర్ధుడు. ఆయన మాట్లాడేది ఆత్మ లేక మానవ లేక మూడవ వ్యక్తి దృక్కోణము నుండా అనేది విషయము కాదు—దేవుడు ఎల్లప్పుడూ దేవుడే, మరియు ఆయన మాట్లాడే మానవ దృక్కోణం బట్టి ఆయన దేవుడు కాదని నీవు చెప్పలేవు. దేవుడు మాట్లాడే వివిధ దృక్కోణాల ఫలితంగా కొందరు వ్యక్తుల్లో భావాలు ఏర్పడ్డాయి. అలాంటి మనుష్యులకు దేవుని గూర్చిన జ్ఞానము ఉండదు, మరియు ఆయన కార్యము గురించిన జ్ఞానము ఉండదు. ఒకవేళ దేవుడు ఒకే దృక్కోణం నుండే మాట్లాడితే, మానవుడు దేవుని గురించి నియమాలు పెట్టడా? మానవుడు ఆవిధంగా ప్రవర్తించడాన్ని దేవుడు అనుమతిస్తాడా? దేవుడు ఏ దృక్కోణం నుండి మాట్లాడినప్పటికీ, ఆయన అలా చేయడానికి తగిన ఉద్దేశ్యాలను కలిగియున్నాడు. ఒకవేళ, దేవుడు ఎల్లప్పుడూ ఆత్మ దృక్పథంతోనే మాట్లాడితే, నీవు ఆయనతో సన్నిహితముగా ఉండగలవా? కాబట్టి, కొన్నిసార్లు తన మాటలను నీకు అందించడానికి మరియు నిన్ను యధార్ధతలోనికి నడిపించడానికి ఆయన మూడవ వ్యక్తిగా మాట్లాడతాడు. దేవుడు చేసేదంతా యుక్తమైనది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇదంతా దేవునిచే జరిపించబడుతుంది మరియు నీవు దీనిని సందేహించకూడదు. ఆయన దేవుడు, ఆయన ఏ దృక్పథం నుండి మాట్లాడినా, ఆయన ఎల్లప్పుడూ దేవుడే. ఇది మారని సత్యం. ఆయన ఎలా కార్యము చేసినప్పటికీ, ఆయన ఇప్పటికీ దేవుడే, మరియు ఆయన స్వభావము ఎన్నటికి మారదు! పేతురు దేవుని ఎంతో ప్రేమించాడు మరియు దేవుని హృదయానుసారునిగా ఉన్నాడు, కానీ దేవుడు అతనిని ప్రభువుగానో లేక క్రీస్తుగానో చూడలేదు, ఎందుకంటే నరుని యొక్క స్వభావము అటువంటిది, అది ఎన్నటికీ మారదు. తన పనిలో, దేవుడు నియమాలకు కట్టుబడి ఉండడు, కానీ తన కార్యమును ప్రభావంతముగా చేయటానికి మరియు మానవునికి తనను గూర్చిన జ్ఞానాన్ని వృద్ధి చేయుటకు వివిధ పద్దతులను ఉపయోగిస్తాడు. ఆయన ప్రతి కార్య విధానము, మానవుడు ఆయనను తెలుసుకోవడానికి, మరియు మానవుని సంపూర్ణ పరచడానికి సహాయపడుతుంది. ఆయన ఏ కార్య విధానమును అవలభించినప్పటికీ, ప్రతి ఒక్కటీ మానవుని బలపరచడానికి మరియు మానవుని సంపూర్ణ పరచడానికి దోహదపడుతుంది. ఆయన కార్య విధానాల్లో ఒకటి చాలా కాలము నుండి కొనసాగుతున్నప్పటికీ, అది ఆయన పట్ల మానవుని విశ్వాసాన్ని ఉద్రేక పరచడానికి దోహదపడుతుంది. కాబట్టి, మీ హృదయములో ఏ సందేహమూ ఉండకూడదు. ఇవన్నీ దేవుని కార్యము యొక్క దశలు, మరియు మీరు వాటికి లోబడి ఉండాలి.

ఈనాడు మాట్లాడేది వాస్తవికతలోనికి ప్రవేశము గురించి—పరలోకాన్ని అధిరోహించడం కాదు, లేక రాజులుగా పాలించడం కాదు; మాట్లాడేదంతా వాస్తవికతలోనికి ప్రవేశము యొక్క అన్వేషణ మాత్రమే. దీనికంటే ఆచరణాత్మకమైన అన్వేషణ మరొకటి లేదు, రాజులుగా పాలించడం గురించి మాట్లాడటం ఆచరణాత్మకం కాదు. మానవుడు గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ, నేటికీ దేవుని కార్యమును తన మతపరమైన అభిప్రాయాలతోనే కొలుస్తాడు. దేవుడు పనిచేయు అనేకమైన పద్దతుల యొక్క అనుభవము పొందిన మానవునికి, దేవుని కార్యము గురించి ఇప్పటికీ తెలియదు, ఇంకా సూచనలను మరియు అద్భుతాలను వెతుకుతున్నాడు, అలాగే దేవుని మాటలు నెరవేరాయో లేదో చూడాలని ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. ఇది మహా అజ్ఞానం కాదా? ఒకవేళ దేవుని మాటలు నెరవేరకపోతే, ఆయన దేవుడని ఇంకా నీవు నమ్ముతావా? నేడు, సంఘములో ఇలాంటి వారు అనేకమంది సూచనలు మరియు అద్భుతాలు చూడాలని వేచియున్నారు. ఒకవేళ దేవుని మాటలు నెరవేరితే, అప్పుడు ఆయన దేవుడని; దేవుని మాటలు నెరవేరకపోతే, ఆయన దేవుడు కాదని వారు చెప్తారు. నీవైతే, ఆయన మాటల నెరవేర్పును బట్టి దేవుడని నమ్ముచున్నావా లేక ఆయనే దేవుడని నమ్ముచున్నావా? దేవుని పట్ల విశ్వాసము గురించి మానవుని యొక్క దృక్పథం సరియైనదిగా ఉండాలి! దేవుని మాటలు నెరవేరలేదని నీవు చూసినప్పుడు, నీవు పారిపోతావు—దేవునిపై విశ్వాసము అంటే ఇదేనా? మీరు దేవుని విశ్వసించినప్పుడు, సమస్త విషయాలలో దేవుని ఏర్పాటునకు మరియు దేవుని సమస్త కార్యములకు మీరు లోబడి ఉండాలి. పాత నిబంధనలో దేవుడు అనేకమైన మాటలు పలికాడు—వాటిలో నీవు దేని నెరవేర్పును నీ కళ్లతో చూశావు? నీవు చూడలేదు కాబట్టి యెహోవా నిజమైన దేవుడు కాదని నీవు చెప్పగలవా? అనేక మాటలు నెరవేరినప్పటికీ, మానవుడు దానిని స్పష్టంగా చూడలేడు, ఎందుకంటే మానవుడిలో సత్యము లేదు మరియు ఏమీ అర్ధం చేసుకోలేడు. కొందరైతే దేవుని మాటలు నెరవేరలేదని భావించినప్పుడు పారిపోవాలని చూస్తారు. ప్రయత్నించు. నీవు పారిపోగలవో లేదో చూడు. పారిపోయినప్పటికీ, మీరు మరలా తిరిగి వస్తారు. దేవుడు తన మాటతో నిన్ను నియంత్రిస్తాడు, అలాగే ఒకవేళ నీవు సంఘాన్ని మరియు దేవుని వాక్యాన్ని విడనాడినట్లయితే, నీవు జీవించడానికి మార్గము ఉండదు. నీవు దీనిని నమ్మకపోతే, నీవే ప్రయత్నించు—నీవు కేవలం అలా విడనాడగలనని భావిస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను నియంత్రిస్తుంది. నీవు విడనాడలేవు. ఇది దేవుని పరిపాలనా విధి! ఎవరైనా ప్రయత్నించాలని అనుకుంటే, వారు చెయ్యొచ్చు. నీవు ఈ వ్యక్తి దేవుడు కాదు అంటున్నావు, కాబట్టి ఆయనకు విరోధముగా ఒక పాపము చేసి ఆయన ఏమి చేస్తాడో చూడు. నీ శరీరము చనిపోయే స్థితి ఉండకపోవచ్చు, ఇంకా నిన్ను నీవు పోషించుకుంటావు మరియు దుస్తులు ధరిస్తావు, కానీ మానసికంగా ఇది భరించలేనిదిగా; ఇంతకంటే బాధాకరమైనది ఇంకేది లేదన్నంతగా; వత్తిడికి మరియు భాధకు నీవు గురవుతావు. మానవుడు మనోవేదనను మరియు వినాశనాన్ని భరించలేడు—బహుశా నీవు శరీర భాధను భరించగలవు, కానీ మానసిక వత్తిడిని మరియు దీర్ఘకాలిక బాధను భరించుటలో నీవు పూర్తిగా అసమర్దుడివి. నేడు, సూచనలు మరియు అద్భుతాలు చూడలేకపోవుటను బట్టి కొందరు విరోధులుగా మారారు, అయినప్పటికీ, దేవుడు తన మాట ద్వారా మానవుని నియంత్రిస్తాడు కాబట్టి, వారు ఎంతటి ప్రతికూలత కలిగి ఉన్నా, ఎవ్వరు పారిపోయే సాహసం చెయ్యరు. అక్కడ ఎటువంటి వాస్తవాల ఆగమనము లేనందున, ప్రస్తుతానికి ఎవరూ పారిపోలేరు. ఇవి దేవుని క్రియలు కావా? నేడు, మానవునికి జీవితాన్ని అందించడానికి దేవుడు భూమిపైకి వచ్చాడు. జనులు అనుకునట్లుగా దేవునికి మరియు మానవునికి మధ్య శాంతియుతమైన సంబంధమున్నదని రుజువు చేయడానికి సూచనలు మరియు అద్భుతాలు చూపి ఆయన నిన్ను వంచించడు. జీవితముపై ఏకాగ్రత లేకుండా, దానికి బదులుగా దేవుడు సూచనలు మరియు అద్భుతాలు చేయడముపై దృష్టి పెట్టే వారందరూ పరిసయ్యులే! యేసును సిలువకు వ్రేలాడదీసిన పరిసయ్యులు వీరే. దేవునిపై నీకున్న విశ్వాస దృక్పథంతో నీవు దేవుని కొలుస్తూ, ఆయన మాటలు నెరవేరితే దేవుని నమ్మడం, అలా కాకపోతే సందేహించడం ఇంకా దైవదూషణకు పాల్పడటం చేస్తే, నీవు ఆయనను సిలువకు దిగగొట్టినట్టు కాదా? ఇలాంటి వారు తమ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటారు, మరియు అత్యాశ కలిగి సుఖముగా ఆనందిస్తారు!

ఒక వైపున, మానవునితో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, అతనికి దేవుని కార్యము గురించి తెలియదు. మానవుని తీరు తిరస్కార పూర్వకమైనది కానప్పటికీ, అది సందేహాస్పదమైనది. మానవుడు తిరస్కరించడు, అలాగని పూర్తిగా కూడా గుర్తించడు. దేవుని కార్యము గురించి మనుష్యులకు స్పష్టమైన జ్ఞానము ఉంటే, వారు పారిపోరు. మరో సమస్య ఏమిటంటే, మానవునికి యధార్ధత తెలియదు. నేడు, ప్రతి వ్యక్తి దైవ వాక్యముతో కార్యాంతరుడై ఉన్నాడు; నిజానికి, భవిష్యత్తులో, సూచనలు మరియు అద్భుతాలు చూడాలని నీవు యోచించకూడదు. నేను నీకు స్పష్టముగా చెప్తున్నాను; ప్రస్తుత దశలో, నీవు చూడగలిగేదంతా దేవుని మాటలే, మరియు ఎటువంటి నిజాలు లేకపోయినా, దేవుని జీవము మానవునిలోనికి ఇంకనూ చొచ్చుకుపోగలదు. వెయ్యేండ్ల రాజ్యము యొక్క ప్రధానమైన పని ఈ పనే, మరియు నీవు గనుక ఈ పని తెలుసుకోకపోతే, నీవు బలహీనమై కుంగిపోతావు; నీవు శోధనల మద్య దిగజారిపోతావు, ఇంకా బాధాకరముగా, సాతాను బానిసగా కొనిపోబడతావు. దేవుడు ప్రధానముగా తన మాటలు పలుకడానికి భూమిపైకి వచ్చాడు; నీవు నిమగ్నమవ్వాల్సింది దేవుని వాక్యమందు, నీవు చూడవలసినది దేవుని వాక్యము, నీవు వినాల్సింది దేవుని వాక్యము, నీవు నిలిచియుండవలసినది దేవుని వాక్యమందు, నీవు అనుభవించవలసినది దేవుని వాక్యము, అలాగే దేవుని మానవ అవతారము మానవుని పరిపూర్ణ పరచడానికి ప్రాముఖ్యముగా వాక్యమును ఉపయోగిస్తాడు. ఆయన సూచనలు మరియు అద్భుతములను చూపడు, మరియు ప్రాముఖ్యముగా గతములో యేసు చేసిన కార్యము చేయడు. వారు దేవుడు మరియు ఇద్దరు శరీరులైప్పటికీ, వారి పరిచర్యలు ఒకేలా ఉండవు. యేసు వచ్చినప్పుడు, ఆయన కుడా దేవుని పనిలో కొంత భాగము చేసి అలానే కొన్ని మాటలు మాట్లాడాడు—కానీ ఆయన సాధించిన ప్రధానమైన కార్యము ఏమిటి? ఆయన ప్రధానముగా సాధించినది సిలువ వేయబడటము. సిలువ కార్యమును సంపూర్తి చేయడానికి మరియు సమస్త మానవాళిని విమోచించడానికి ఆయన పాప పూరితమైన శరీరముగా మారాడు, మరియు సర్వ మానవ పాపములకై తనను పాపపరిహారార్ధ బలిగా చేసుకున్నాడు. ఇదే ఆయన సాధించిన ప్రధాన కార్యము. చివరిగా, తరువాత వచ్చిన వారికి మార్గనిర్దేశనం చేయడానికి ఆయన సిలువ మార్గాన్ని అందించాడు. యేసు వచ్చినప్పుడు, విమోచనా కార్యము సంపూర్తి చేయడమే ప్రాథమికమై ఉన్నది. ఆయన మానవాళిని విమోచించి, మరియు పరలోక రాజ్య సువార్తను మానవుడికి తీసుకువచ్చాడు, అంతేగాక, అయన పరలోకరాజ్యము యొక్క మార్గాన్ని ముందుంచాడు. దాని ఫలితముగా, తరువాత వచ్చిన వారందరూ “మనము సిలువ మార్గములో నడవాలి, మరియు సిలువ కొరకు మనల్ని మనము త్యాగము చేసుకోవాలి” అన్నాడు. వాస్తవానికి, ఆదిలో, యేసు కూడా కొంత వేరే పని చేశాడు అలాగే మానవుడు తన పాపములను ఒప్పుకుని పశ్చాతాపపడేలా చేయడానికి కొన్ని మాటలను పలికాడు. కానీ, ఇప్పటికీ ఆయన పరిచర్య సిలువ కార్యముగానే ఉన్నది, మరియు సత్య మార్గమును గురించి ఆయన బోధించిన మూడున్నర సంవత్సరాలు ఆ తదుపరి వచ్చిన సిలువ వేయబడటం కొరకైన సిద్దపాటై ఉన్నది. అనేక సార్లు యేసు చేసిన ప్రార్ధనలు సిలువ కార్యము కొరకు కూడా ఉన్నాయి. సిలువ కార్యము సంపూర్తి చేయడమే ప్రధానమైన పనిగా ఆయన గడిపిన ఒక సామాన్యమైన మానవ జీవితము మరియు భూమిపై ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు; ఈ పనిని చేపట్టడానికి అవి ఆయనను బలపరచవలసియున్నవి, దాని ఫలితముగా, దేవుడు సిలువ కార్యమును ఆయనకు అప్పగించాడు. మనవావతారమయిన దేవుడు నేడు ఏ పనిని సంపూర్తి చేస్తాడు? నేడు, ప్రధానముగా “శరీరమందు ప్రత్యక్ష పరచబడిన వాక్యము” యొక్క కార్యమును సంపూర్తి చేయడానికి, మానవుని పరిపూర్ణునిగా చేయుటకు వాక్యమును ఉపయోగించడానికి, మరియు వాక్యముతో మానవుడు ఏకీభవించుటకు మరియు వాక్య శుద్దీకరణను అంగీకరింపజేయుటకు దేవుడు శరీర ధారి అయ్యాడు. ఆయన తన మాటలలో నీవు పోషణ మరియు జీవమును పొందేలా చేస్తాడు; ఆయన మాటల్లో నీవు ఆయన కార్యమును మరియు క్రియలను చూడగలవు. నిన్ను శిక్షించడానికి మరియు శుద్ధి చేయడానికి దేవుడు వాక్యమును ఉపయోగిస్తాడు, కాబట్టి, నీవు కష్టాలు అనుభవిస్తున్నట్లయితే, అది కూడా దేవుని వాక్యము వలనే. నేడు, దేవుడు వాక్యములతో పనిచేస్తున్నాడు, కానీ వాస్తవాలతో కాదు. ఆయన వాక్యము నీ మీదికి వచ్చిన తర్వాత మాత్రమే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయగలడు మరియు నీవు బాధను భరించేలా అలాగే మధురమైన అనుభూతి చెందేలా చేస్తుంది. దేవుని వాక్యము మాత్రమే నిన్ను వాస్తవికతలోనికి తీసుకురాగలదు, మరియు దేవుని వాక్యము మాత్రమే నిన్ను పరిపూర్ణునిగా చేయగలదు. కాబట్టి, కనీసం దీనినైనా నీవు అర్ధం చేసుకోవాలి: ప్రతి వ్యక్తిని పరిపూర్ణ పరచడానికి మరియు మానవునికి మార్గ నిర్దేశం చేయడానికి తన వాక్యమును ఉపయోగించడమే అంత్య దినాల్లో ప్రధానముగా దేవుడు చేసే కార్యమై ఉన్నది. ఆయన వాక్యము ద్వారానే తన కార్యాలన్నీ చేస్తాడు; వాస్తవాలను ఉపయోగించి ఆయన నిన్ను శిక్షించడు. కొందరు దేవుని ఎదిరించే సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు నీకు మహా ఆందోళన కలిగించడు, నీ శరీరము శిక్షించబడదు, లేదా నీవు కష్టాలు అనుభవించవు—కానీ అయన వాక్యము నీ మీదికి వచ్చి, నిన్ను శుద్ది చేసిన మరుక్షణము, అది నీవు భరించలేనిదిగా ఉంటుంది. మరి, అది అలా ఎందుకు ఉండకూడదు? సేవకుల కాలములో, మానవుని అగాధములో పడవేయమని దేవుడు చెప్పాడు. మానవుడు నిజముగా అగాధమునకు చేరుకున్నాడా? కేవలం మానవుని శుద్ది చేయడానికి ఆ మాటలను ఉపయోగించుటను బట్టి, మానవుడు అగాధములోనికి ప్రవేశించాడు. కాబట్టి, అంత్య దినాలలో దేవుడు శరీరధారియై ఉన్నప్పుడు, సమస్తాన్ని నెరవేర్చడానికి మరియు అన్నింటినీ స్పష్ట పరచడానికి దేవుడు ప్రధానముగా వాక్యమును ఉపయోగించాడు. ఆయన మాటల్లో మాత్రమే ఆయన ఏమిటో నీవు చూడగలవు; ఆయన మాటల్లో మాత్రమే ఆయనే దేవుడని నీవు చూడగలవు. దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, ఆయన మాటలు పలకడము తప్పు వేరే పని చేయడు—కాబట్టి, ఇక వాస్తవాల అవసరము ఉండదు, మాటలు సరిపోతాయి. ఎందుకంటే, తన శక్తిని మరియు తన మాటలలోని ఆధిపత్యాన్ని మానవుని చూడనివ్వడానికి, తన మాటలయందు ఆయన తనను తాను ఎలా మరుగుచేసుకుంటాడో మానవుని చూడనివ్వడానికి, తన మాటల్లో తన పరిపూర్ణతను మానవుని తెలుసుకునేలా చేసే, ఈ పనిని చేయడానికే ఆయన ప్రధానముగా వచ్చాడు. ఆయన వద్ద ఏమున్నాయో మరియు ఆయన ఏమై ఉన్నాడో అంతా ఆయన మాటల్లోనే ఉన్నాయి. దీనిలో దేవుడు తన మాటలు పలికే అనేకమైన పద్దతులను నీవు చూచేలా తయారు చేయబడ్డావు. ఈ కాలమంతటిలో దేవుని కార్యమందు ఎక్కువ భాగం మానవునికి సిద్దపాటు, ప్రత్యక్షత మరియు ఒప్పందమై ఉన్నాయి. ఆయన ఒక వ్యక్తిని అంత తేలికగా శపించడు, ఒకవేళ అలా చేసినప్పటికీ, ఆయన వాక్యము ద్వారా మాత్రమే వారిని శపిస్తాడు. కాబట్టి, దేవుడు శరీరధారియైన ఈ కాలములో, ఇంకా దేవుడు రోగులను స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం చూడాలని ప్రయతించవద్దు, అదేపనిగా సూచనలను వెతకడం మానేయండి—ప్రయోజనము ఉండదు! ఆ సూచనలు మానవుని పరిపూర్ణుని చేయలేవు! స్పష్టముగా చెప్పాలంటే: నేడు, శరీర సంబంధియైన నిజ దేవుడు పని చేయడు, ఆయన కేవలం మాట్లాడతాడు. ఇది సత్యం! ఆయన నిన్ను పరిపూర్ణ పరచడానికి వాక్యాలను ఉపయోగిస్తాడు, మరియు నిన్ను పోషించి నీరు పోయడానికి వాక్యములను ఉపయోగిస్తాడు. ఆయన కార్యము చేయడానికి కూడా మాటలను ఉపయోగిస్తాడు, తన యధార్ధతను నీకు గ్రహింపచేయడానికి వాస్తవాల స్థానములో ఆయన వాక్యాలను ఉపయోగిస్తాడు. నీవు ఈ విధముగా దేవుని కార్యమును గ్రహించగలిగితే, ప్రతికూలముగా ఉండటం కష్టం. ప్రతికూలమైన విషయాలపై దృష్టి పెట్టే బదులుగా, సానుకూలమైన వాటి మీద మాత్రమే నీవు దృష్టి పెట్టాలి—అనగా, దేవుని మాటలు నేరవేరాయా లేదా అని కాకుండా, ప్రవచనాలు ఉన్నాయా లేదా అని కాకుండా, తన మాటల నుండి దేవుడు మానవునికి జీవాన్ని కలిగిస్తాడు, మరియు ఇదే అన్నింటికన్నా గొప్ప సూచన; మరి ఎక్కువగా, ఇది కాదనలేని సత్యం. ఇది దేవుని తెలుసుకోవడానికి ఉత్తమమైన సాక్ష్యం, మరియు సూచనలన్నిటికంటే ఇది గొప్ప సూచన. ఈ మాటలు మాత్రమే మానవుని పరిపూర్ణ పరచగలవు.

రాజ్య కాలము ప్రారంభమైన వెంటనే, దేవుడు తన మాటలను విడుదల చేయడం ప్రారంభించాడు. భవిష్యత్తులో, ఈ మాటలు క్రమముగా నేరవేరతాయి, ఆ సమయములో, మానవుడి జీవితము పక్వతకు చేరుతుంది. మానవుని యొక్క భ్రష్ట స్వభావాన్ని బయలుపరచడానికి దేవుడు వాక్యాన్ని ఉపయోగించడం మరింత వాస్తవం మరియు చాలా అవసరం, మరియు మానవుని విశ్వాసాన్ని పరిపూర్ణపరిచే తన కార్యము చేయడానికి ఆయన వాక్యమును తప్ప మరేమీ ఉపయోగించడు, ఎందుకంటే ఈ దినం వాక్య కాలము, దీనికి మానవుని విశ్వాసము, తీర్మానము మరియు సహకారము అవసరం. తన వాక్యమును ఉపయోగించి మానవునికి సేవ చేయడం మరియు సమకూర్చడమే అంత్య దినములలో అవతార మూర్తి అయిన దేవుని కార్యమై ఉన్నది. అవతార మూర్తి అయిన దేవుడు తన మాటలను పలకడము ముగించిన తరువాత మాత్రమే అవి నెరవేరడం మొదలవుతాయి. ఆయన మాట్లాడే సమయములో, తన మాటలు నెరవేరవు, ఎందుకంటే ఆయన శరీర స్థితిలో ఉన్నపుడు, అయన మాటలు నెరవేరలేవు. దేవుడు శరీరుడే కాని ఆత్మ కాదని మానవుడు చూచి; తద్వారా మానవుడు తన కళ్లతో దేవుని వాస్తవికతను వీక్షించడానికి ఇది జరిగింది. ఆయన కార్యము సంపూర్తి అయిన దినమున, భూమిపై ఆయన పలకవలసిన మాటలన్నీ చెప్పిన పిమ్మట, ఆయన మాటల నెరవేర్పు మొదలవుతుంది. దేవుని మాటల నెరవేర్పు కాలము ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆయన ఇంకా తన మాటలు చెప్పడము పూర్తి చేయలేదు. కాబట్టి, దేవుడు తన మాటలను ఇంకా భూమిపై మాట్లాడటము నీవు చూచినప్పుడు, ఆయన మాటల నెరవేర్పు కొరకు ఎదురుచూడకు; దేవుడు తన మాటలు మాట్లాడటం ముగించడం మరియు భూమి మీద తన కార్యము సంపూర్తి అయినప్పుడు మాత్రమే ఆయన మాటల నెరవేర్పు మొదలవుతుంది. భూమిపై ఆయన మాట్లాడే మాటల్లో, ఒక సందర్భములో, జీవితము యొక్క ఏర్పాటు ఉంది, మరొక సందర్భములో, ప్రవచనము ఉన్నది; రాబోయేవి, జరుగబోయేవి, మరియు ఇంకా నెరవేరవలసిన వాటి యొక్క ప్రవచనము. యేసయ్య మాటలలో ప్రవచనము కూడా ఉన్నది. ఒక సందర్భములో, ఆయన జీవమును ఇచ్చాడు, మరొక సందర్భములో, ఆయన ప్రవచనము పలికాడు. ఈ రోజు వాక్యాలు మరియు వాస్తవాల నిర్వహణ గురించి ఒకే సమయములో మాట్లాడటం లేదు, ఎందుకంటే మానవుడు తన కళ్లతో చూసే దానికి మరియు దేవుడు చేసే దానికి మధ్య మహా గొప్ప వ్యత్యాసమున్నది. దేవుని కార్యము పూర్తయిన తర్వాత, ఆయన మాటలు నెరవేరతాయి, ఆ మాటల తరువాత వాస్తవాలు వస్తాయని మాత్రమే చెప్పవచ్చు. అంత్య దినాలలో అవతార మూర్తి అయిన దేవుడు భూమిమీద వాక్య పరిచర్య జరిగిస్తాడు, వాక్య పరిచర్య చేస్తున్నపుడు, ఆయన మాటలను మాత్రమే పలుకుతాడు, మరియు ఇతర విషయాలను పట్టించుకోడు. ఒకసారి ఆయన పని గనుక పూర్తయితే, ఆయన మాటలు నెరవేరడం మొదలవుతాయి. ఈనాడు, నిన్ను పరిపూర్ణ పరచడానికి మొదటగా వాక్యాలు ఉపయోగించబడతాయి; విశ్వమందంతటా ఆయన మహిమను పొందినప్పుడు, ఆయన కార్యము సంపూర్తి అవుతుంది—పలుకబడవలసిన మాటలు పలుకబడతాయి, పిమ్మట మాటలన్నీ వాస్తవాలుగా మారుతాయి. మానవాళి ఆయనను తెలుసుకోవడానికి, ఆయన ఏమిటో, తన వాక్యము ద్వారా ఆయన జ్ఞానమును మరియు తన అద్భుత కార్యాలను మానవాళి చూడాలని, అంత్య దినాల్లో దేవుడు భూమిమీద వాక్య పరిచర్యను జరిగించడానికి వచ్చాడు. రాజ్య కాలములో, మానవజాతిని జయించడానికి దేవుడు వాక్యాన్ని ప్రధానముగా ఉపయోగిస్తాడు. భవిష్యత్తులో, ఆయన వాక్యము ప్రతి మతము, రంగము, దేశము, మరియు జాతి మీదకు వస్తుంది. దేవుడు జయించడానికి వాక్యమును ఉపయోగిస్తాడు, తన వాక్యము అధికారము మరియు శక్తి కలిగి ఉన్నదని ప్రజలందరు చూచేలా చేస్తాడు—కాబట్టి ఈనాడు, మీరు దైవ వాక్యమును మాత్రమే ఎదుర్కొంటారు.

ఈ కాలంలో దేవుడు మాట్లాడిన మాటలు ధర్మశాస్త్ర కాలములో మాట్లాడిన మాటల కంటే భిన్నముగా ఉంటాయి, అలాగే, కృపా కాలములో మాట్లాడిన మాటలతో కూడా విభేదిస్తాయి. కృపా కాలములో, దేవుడు వాక్యము యొక్క కార్యమును చేయలేదు, కానీ మానవజాతిని విమోచించడానికి సిలువ కార్యమును గురించి వివరించాడు. ఎందుకు దేవుడు సిలువ వేయబడి, సిలువ శ్రమలకు అప్పగింపబడ్డాడో, మానవుడు దేవుని కొరకు మానవుడు ఎలా సిలువ వేయబడవలసి ఉన్నదో మాత్రమే పరిశుద్ద గ్రంధము వివరిస్తుంది. ఆ కాలములో దేవుడు చేసిన కార్యమంతా సిలువయాగం చుట్టూ కేంద్రీకృతమై వున్నది. రాజ్య కాలములో శరీరధారి అయిన దేవుడు తనయందు విశ్వాసముంచు వారందరినీ జయించునట్లు మాట్లాడతాడు. ఇది “శరీరమందు ప్రత్యక్షపరచబడిన వాక్యం”; ఈ కార్యమును నెరవేర్చడానికి అంత్యదినములలో దేవుడు వచ్చాడు, అంటే, శరీరమందు ప్రత్యక్షపరచబడిన వాక్యము యొక్క నిజమైన ప్రాముఖ్యతను నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన మాటలు మాత్రమే పలుకుతాడు మరియు వాస్తవాలు చాలా అరుదుగా కనుపరచబడతాయి. శరీరమందు ప్రత్యక్షపరచబడుచున్న వాక్యము యొక్క సారాంశం ఇదే, మరియు శరీర ధారి అయిన దేవుడు తన మాటలు పలికినప్పుడు, శరీరమందు కనుపరచబడుచున్న వాక్యము, మరియు శరీరమందు ప్రవేశించుచున్న వాక్యము ఇదే. “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను, వాక్యము శరీరధారియై యుండెను”. అంత్య దినాల్లో దేవుడు చేసే కార్యము (శరీరమందు వాక్య ప్రత్యక్షత), మరియు ఆయన సమస్త నిర్వహణ యొక్క చివరి ప్రణాళికా అధ్యాయము ఇదే, కాబట్టి తన మాటలను ప్రత్యక్షపరచడానికి దేవుడు భూమిపైకి రావలసియున్నది. ఈ దినము చేసేది, భవిష్యత్తులో చేయబోయేది, దేవుడు సాధించేది, మానవుని అంతిమ గమ్యస్థానం, రక్షింపబడేవి, నాశనం చేయబడేవి, ఇంకా—చివరికి సాధించవలసిన కార్యమంతా స్పష్టముగా చెప్పబడింది, శరీరమందు వాక్య ప్రత్యక్షత యొక్క నిజమైన ప్రాముఖ్యతను నెరవేర్చడం కోసమే. గతంలో వెలువడిన పాలనా విధులు మరియు నిబంధన, నశించే వారు, విశ్రాంతిలోనికి ప్రవేశించే వారు—ఈ మాటలన్నీ తప్పక నెరవేరుతాయి. అంత్య దినాల్లో శరీరధారి అయిన దేవుడు నెరవేర్చే ప్రధాన కార్యము ఇదే. ఆయన ప్రజలకు, దేవునిచే ముందుగా నిర్ణయింపబడిన వారు ఎక్కడకు చెందుతారు, మరియు దేవునిచే ముందుగా నిర్ణయింపబడని వారు ఎక్కడకు చెందుతారు, ఆయన ప్రజలు మరియు కుమారులు ఎలా వర్గీకరించబడతారు, ఇశ్రాయేలు పట్ల ఏమి జరుగుతుంది, ఐగుప్తు పట్ల ఏమి జరగబోతుంది అనేది అర్థమయ్యేలా చేస్తాడు—భవిష్యత్తులో, ఈ మాటలలో ప్రతి ఒక్కటి నెరవేర్చబడుతుంది. దేవుని కార్యము యొక్క వేగము పెరుగుచున్నది. ప్రతి కాలములో ఏమి జరగాలి, అంత్య దినాల్లో శరీరధారి అయిన దేవునిచే ఏమి జరిగింపబడవలసి ఉన్నది, మరియు ఆయన చేయవలసిన పరిచర్యను మానవునికి వెల్లడి చేయుటకు దేవుడు వాక్యమును ఒక సాధనముగా ఉపయోగిస్తాడు, మరియు ఈ మాటలన్నీ శరీరమందు ప్రత్యక్షపరచబడే వాక్యము యొక్క నిజమైన ప్రాముఖ్యతను నెరవేర్చుట కోసం ఉద్దేశించబడ్డాయి.

నేను ఇదివరికే చెప్పినట్టు: “సూచనలు మరియు అద్భుతాలను చూడటంపై దృష్టి సారించే వారందరూ విడువబడతారు; వారు పరిపూర్ణులుగా చేయబడువారు కారు.” నేను అనేకమైన మాటలు మాట్లాడాను, అయినప్పటికీ మానవునికి నా కార్యము గురించి కనీస జ్ఞానమైనా కూడా లేదు, మరియు ఈ సమయానికి వచ్చినప్పటికీ, ఇంకా జనులు సూచనలు మరియు అద్భుతాలను అడుగుతారు. దేవునిపై నీ విశ్వాసము సూచనలు మరియు అద్భుతాలను వెదకటం తప్ప ఇంకేమీ కాదా, లేక జీవము పొందటం కోసమా? యేసయ్య కుడా అనేకమైన మాటలు చెప్పాడు, వాటిలో కొన్ని ఇంకా నెరవేరవలసి ఉన్నది. యేసు దేవుడు కాదని నీవు చెప్పగలవా? ఆయనే క్రీస్తు మరియు దేవుని ప్రియ కుమారుడని దేవుడు సాక్ష్యమిచ్చాడు. దానిని నీవు తిరస్కరించగలవా? ఈనాడు, దేవుడు మాటలు మాత్రమే మాట్లాడతాడు, ఇది నీకు స్పష్టంగా తెలియకపోతే, నీవు స్థిరముగా నిలువలేవు. ఆయన దేవుడు కాబట్టి నీవు ఆయనను నమ్ముచున్నావా లేక ఆయన మాటలు నెరవేరాయా లేదా అనే దానిమీద ఆధారపడి ఆయనను నమ్ముచున్నావా? నీవు సూచనలు మరియు అద్భుతాలను నమ్ముచున్నావా లేక దేవుని నమ్ముచున్నావా? నేడు, ఆయన సూచనలు మరియు అద్భుతాలు కనుపరచడు—ఆయన నిజంగా దేవుడా? ఆయన పలికే మాటలు నెరవేరకపోతే, నిజముగా ఆయన దేవుడా? దేవుని యొక్క స్వభావము ఆయన పలికే మాటలు నెరవేరాయా లేదా అనే దానిని బట్టి నిర్ణయించబడుతుందా? కొంతమంది ప్రజలు ఆయనను విశ్వసించక ముందే ఆయన దేవుని మాటల నెరవేర్పు కోసం ఎందుకు ఎదురుచుస్తారు? దీని అర్ధం ఆయన వారికి తెలియదనా? అలాంటి ఉద్దేశ్యాలు కలిగిన వారందరూ దేవుని తిరస్కరించే వారే. వారు దేవుని కొలవడానికి ఉద్దేశ్యాలను ఉపయోగిస్తారు; దేవుని మాటలు నెరవేరితే, వారు ఆయనను నమ్ముతారు, అలా జరగకపోతే, వారు ఆయనను నమ్మరు; వారు ఎల్లప్పుడూ సూచనలు మరియు అద్భుతాల కోసం వెదకుతారు. ఈ ప్రజలు ఆధునిక కాలానికి చెందిన పరిసయ్యులు కారా? నీవు స్థిరముగా నిలబడగలవా లేదా అనేది నీకు నిజమైన దేవుడు తెలుసా లేదా అనే దానిమీద ఆధారపడి ఉన్నది—ఇది చాలా ప్రాముఖ్యం! నీలో దేవుని వాక్యము యొక్క వాస్తవికత ఎంత ఎక్కువగా ఉంటుందో, దేవుని వాస్తవికత గురించి నీవు అంత జ్ఞానము కలిగి ఉంటావు, శ్రమల కాలములలో అంతే స్థిరముగా నిలబడతావు. నీవు సూచనలు మరియు అద్భుతాలపై ఎంత దృష్టి పెడతావో, అంత స్థిరముగా నిలువలేవు, మరియు శ్రమల మధ్యలో నీవు పడిపోతావు. సూచనలు మరియు అద్భుతాలు పునాది కాదు; దేవుని వాస్తవికత మాత్రమే జీవము. కొందరికి దేవుని కార్య నెరవేర్పు వలన కలిగే ఫలితాలు తెలియదు. వారు దేవుని కార్యము గురించిన జ్ఞానము వెదకకుండా, తమ జీవితములను ఆందోళనలో గడుపుతారు. ఎల్లపుడూ దేవుడు వారి కోరికలు తీర్చేలా చేయడమే వారి అన్వేషణ యొక్క లక్ష్యము, అప్పుడు మాత్రమే వారు విశ్వాసములో ఏకాగ్రత కలిగి ఉంటారు. దేవుని మాటలు నెరవేరితే జీవమును వెంబడిస్తామని, కాని దేవుని మాటలు నెరవేరకపోతే, తాము జీవాన్ని వెంబడించే అవకాశం లేదని వారు చెప్తారు. దేవుని యందు విశ్వాసముంచడం అంటే సూచనలు మరియు అద్భుతాలు చూడటం కోసం వెదకటం మరియు పరలోకము మరియు మూడవ ఆకాశమును అధిరోహించడం కోసం అన్వేషించడమని మానవుడు అనుకుంటాడు. దేవునిపై తమకున్న విశ్వాసం వాస్తవికతలోనికి ప్రవేశము యొక్క అన్వేషణ, జీవాన్ని వెంబడించడం, మరియు దేవుని మెప్పు పొందడం కొరకు అన్వేషణ అని వారిలో ఒక్కడూ చెప్పడు. ఇలాంటి అన్వేషణలో ఉన్న విలువ ఏమిటి? దైవ జ్ఞానాన్ని మరియు దైవ సంతృప్తిని నమ్మని వారు దేవుని నమ్మేవారు కాదు; వారు దైవ దూషకులు!

దేవునియందు విశ్వాసముంచడం అంటే ఏంటో ఇప్పడు మీకు అర్థమైనదా? సూచనలు మరియు అద్భుతాలను చూడటమే నమ్మడమా? దాని అర్ధం పరలోకానికి వెళ్లడమేనా? దేవునియందు విశ్వాసముంచడం అనేది కాస్త కూడా సులభం కాదు. ఆ మతపరమైన ఆచారాలను ప్రక్షాళన చేయాలి; రోగులను స్వస్థపరచడం మరియు దెయ్యాలను వెళ్ళగొట్టడాన్ని అన్వేషించడం, సూచనలు మరియు అద్భుతాలపై దృష్టి సారించడం, దేవుని దయ, మరియు శాంతిని అతిగా ఆశించడం, శరీరేఛ్చలు మరియు సుఖాలను వెంబడించడాన్ని ప్రక్షాళన చేయాలి—ఇవి మతపరమైన ఆచారాలు మరియు ఈ మతపరమైన ఆచారాలు స్థిరమైన విశ్వాసం లేనివి. ఈనాడు దేవునిపై నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? మీ జీవిత వాస్తవికతగా దేవుని వాక్యాన్ని అంగీకరించడం మరియు ఆయన కొరకు నిజమైన ప్రేమను కలిగియుండటానికి ఆయన వాక్యము ద్వారా దేవుని గురించి తెలుసుకోడమే. స్పష్టంగా చెప్పాలంటే: దేవుని విశ్వసించడం అంటే నీవు దేవునికి లోబడటం, దేవుని ప్రేమించడం, దేవునిచే సృజింపబడినవి జరిగించవలసిన కర్తవ్యాన్ని జరిగించడం. దేవునియందు విశ్వాసముంచడం యొక్క లక్ష్యము ఇదే. దేవుని మనోహరత, దేవుడు ఎంత పూజార్హుడు, తాను సృజించిన వాటిలో దేవుడు ఎలా రక్షణ కార్యము జరిగించి మరియు పరిపూర్ణ పరుస్తాడు అనే జ్ఞానాన్ని మీరు తప్పక పొందాలి—ఇవి దేవునిపై మీకుండాల్సిన విశ్వాసము యొక్క ప్రాథమిక అంశాలు. దేవునిపై విశ్వాసం అంటే ప్రధానంగా శారీరక జీవితము నుండి దేవుని ప్రేమించే జీవితమునకు; దుర్నీతిలో జీవించడం నుండి దేవుని మాటల యొక్క జీవములో జీవించడం వరకు మారడం; ఇది సాతాను యొక్క ఆధిపత్యము నుండి వెలుపలకు వచ్చి దేవుని సంరక్షణ మరియు కాపుదలలో జీవించడం; ఇది శరీరమునకు విధేయత కాకుండా దేవునికి విధేయత చూపడం; ఇది దేవుడు నీ పూర్ణహృదయాన్ని స్వాధీనం చేసుకోడానికి అనుమతించడం, ఇది నిన్ను పరిపూర్ణునిగా చేయడానికి, మరియు సాతాను దుర్నీతి స్వభావము నుండి నిన్ను విడిపించడానికి దేవుని అనుమతించడం. దేవునిపై విశ్వాసముంచడం ప్రధానం తద్వారా దేవుని శక్తి మరియు మహిమ నీలో కనుపరచబడుతుంది, కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని చేయగలరు, దేవుని ప్రణాళికను నెరవేర్చగలరు, సాతాను ఎదుట దేవుని కొరకు సాక్ష్యమివ్వగలరు. దేవునిపై విశ్వాసము సూచనలు మరియు అద్భుతాలు చూడాలనే కోరిక చుట్టూ తిరుగకూడదు, మీ వ్యక్తిగత శరీరాశ కోసం కాకూడదు. ఇది దేవుని తెలుసుకోవాలని అన్వేషించడం, దేవునికి విధేయత చూపడం, మరియు, పేతురు వలె, ఒకని మరణము వరకు ఆయనకు లోబడినట్టుగా ఉండాలి. దేవునిపై విశ్వాసముంచడము యొక్క ప్రధాన లక్ష్యాలు ఇవే. దేవుని తెలుసుకొని మరియు ఆయనను సంతృప్తి పరచడానికి ఒకడు దేవుని వాక్యాన్ని తినాలి మరియు త్రాగాలి. దేవుని వాక్యాన్ని తినడం మరియు త్రాగడం ద్వారా నీవు దేవుని గూర్చిన గొప్ప జ్ఞానాన్ని పొందుతావు, అప్పుడు మాత్రమే నీవు ఆయనకు లోబడగలవు. దైవ జ్ఞానముతో మాత్రమే మీరు ఆయనను ప్రేమించగలరు, మరియు దేవునిపై తనకున్న విశ్వాసములో మానవుడు కలిగి ఉండవలసిన లక్ష్యము ఇదే. ఒకవేళ, దేవునిపై నీకున్న విశ్వాసములో, నీవు ఎల్లప్పుడూ సూచనలు మరియు అద్భుతాలు చూడాలని ప్రయత్నిస్తుంటే, దేవుపై ఈ విశ్వాసము యొక్క దృష్టి సరైనది కాదు. దేవునిపై విశ్వాసము అంటే ప్రధానముగా దేవుని వాక్యమును జీవిత వాస్తవికతగా అంగీకరించడం. తన నోటినుండి వచ్చిన దేవుని మాటలను ఆచరణలో పెట్టడము మరియు వాటిని మీలో అమలు చేయడము ద్వారా మాత్రమే దేవుని లక్ష్యము నెరవేరుతుంది. దేవునియందు విశ్వాసముంచడం మానవుడు దేవుని ద్వారా పరిపూర్ణుడు కావడానికి, దేవునికి లోబడటానికి, మరియు దేవునికి సంపూర్ణ విధేయత చూపడానికి ప్రయత్నించాలి. నీవు గనుక అభియోగము లేకుండా దేవునికి లోబడి, దేవుని ఆశల పట్ల శ్రద్ధ వహించి, పేతురు యొక్క స్థితిని పొంది, మరియు దేవుడు చెప్పిన పేతురు యొక్క తీరుని కలిగి ఉన్నట్లయితే, అప్పుడు నీవు దేవునిపై విశ్వాసములో విజయము సాధించావు మరియు దేవునిచే నీవు పొందుకోబడ్డావని సూచిస్తుంది.

దేవుడు తన కార్యమును విశ్వమందంతటా జరిగిస్తాడు. ఆయన యందు విశ్వాసముంచు వారందరూ ఆయన వాక్యమును అంగీకరించాలి, మరియు ఆయన వాక్యమును తిని త్రాగాలి; దేవుడు కనబరచిన సూచనలు మరియు అద్భుతాలను చూసి ఎవరూ దేవునిచే జయింపబడలేరు. యుగయుగాలుగా, మానవుని పరిపూర్ణ పరచడానికి దేవుడు ఎల్లప్పుడూ వాక్యమును ఉపయోగించాడు. కావున మీరు సూచనలు మరియు అద్భుతాలపై మీ దృష్టిని సారించకూడదు, కానీ దేవునిచే పరిపూర్ణ పరచబడటం కోసం ప్రయత్నించాలి. పాత నిబంధన కాలములో, దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు, మరియు కృపా కాలములో, యేసు, కూడా, అనేక మాటలు మాట్లాడాడు. యేసు అనేక మాటలు చెప్పిన తరువాత, తదుపరి అపోస్తలులు మరియు శిష్యులు యేసయ్య ఇచ్చిన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఆచరించడానికి ప్రజలను నడిపించి, యేసు చెప్పిన సూచనలు మరియు మాటల ప్రకారం జీవించారు. అంత్య దినాల్లో, మానవుని పరిపూర్ణ పరచడానికి దేవుడు ప్రధానముగా వాక్యాన్ని ఉపయోగిస్తాడు. మానవుని బాధించడానికి లేక మానవుని ఒప్పించడానికి ఆయన సూచనలు మరియు అద్భుతాలను ఉపయోగించడు; ఇది దేవుని శక్తిని కనుపరచలేదు. ఒకవేళ దేవుడు సూచనలు మరియు అద్భుతాలు మాత్రమే చూపిస్తే, అప్పుడు దేవుని వాస్తవికతను కనుపరచడం అసాధ్యమై ఉండేది, తద్వారా మానవుని పరిపూర్ణ పరచడమూ అసాధ్యం. సూచనలు మరియు అద్భుతాల ద్వారా దేవుడు మానవుని పరిపూర్ణ పరచడు, కానీ మానవునికి నీరు పోయుటకు మరియు కాపాడుటకు వాక్యమును ఉపయోగిస్తాడు, ఆ తరువాత మానవుని సంపూర్ణ విధేయత మరియు దేవుని గూర్చిన మానవుని జ్ఞానము సాధించబడుతుంది. ఆయన చేసే కార్యము మరియు మాట్లాడే మాటల లక్ష్యము ఇదే. మానవుని పరిపూర్ణము చేయడానికి దేవుడు సూచనలు మరియు అద్భుతాలను చూపించే పద్దతిని ఉపయోగించడు—ఆయన మాటలను ఉపయోగిస్తాడు, మానవుని పరిపూర్ణము చేయడానికి వివిధ కార్య విధానములను ఉపయోగిస్తాడు. అది శుద్దీకరణ, వ్యవహారశైలి, సవరణ లేక సమకూర్పు ఏదైనా కావచ్చు, మానవుని పరిపూర్ణ పరచడానికి, మానవునికి దేవుని కార్యము గురించిన మహా జ్ఞానాన్ని, తెలివి మరియు దైవ మహత్యమును ఇవ్వడానికి దేవుడు అనేకమైన విభిన్న దృక్కోణాల నుండి మాట్లాడతాడు. దేవుడు యుగాన్ని ముగించే అంత్య దినాల్లో మానవుడు పరిపూర్ణుడైనప్పుడు, సూచనలు మరియు అద్భుతాలను చూసేందుకు అతడు అర్హుడవుతాడు. నీవు దేవుని తెలుసుకుని మరియు ఆయన ఏమి చేసినప్పటికీ దేవునికి విధేయత చూపగలిగితే, సూచనలు మరియు అద్భుతములు చూసినప్పుడు నీకు ఆయన గురించి ఎటువంటి భావనలు కలుగవు. ప్రస్తుతము, నీవు అవినీతిని కలిగి మరియు దేవునికి పూర్తిగా విధేయత చూపలేని—ఈ స్థితిలో నీవు సూచనలు మరియు అద్భుతాలు చూడటానికి అర్హులని నీవు భావిస్తున్నావా? ఎప్పుడు దేవుడు సూచనలు మరియు అద్భుతాలు కనుపరుస్త్దాడో, అప్పుడు దేవుడు మానవుని శిక్షిస్తాడు, మరియు అప్పుడు కాలం కూడా మారుతుంది, అంతేగాక, అప్పుడు యుగము కూడా ముగించబడుతుంది. దేవుని కార్యము సజావుగా సాగుతున్నప్పుడు, ఆయన సూచనలు మరియు అద్భుతాలు కనుపరచడు. సూచనలు మరియు అద్భుతాలు కనుపరచడం ఆయనకు నవ్వు తెప్పించేంత సులభం, కానీ అది దేవుని కార్యము యొక్క సూత్రము కాదు, దేవుని యొక్క మానవ నిర్వహణ లక్ష్యమూ కాదు. ఒకవేళ మానవుడు సూచనలు మరియు అద్భుతాలను చూస్తే, ఒకవేళ దేవుని ఆత్మ దేహము మానవునికి కనబడితే, ప్రజలందరూ దేవుని నమ్మరా? జయించువారి సమూహము తూర్పు నుండి పొందబడుతుందని నేను ఇదివరకే చెప్పాను, మహాశ్రమల మధ్యనుండి వచ్చిన వారే జయించువారు. ఆ మాటల అర్ధం ఏమిటి? ఈ ప్రజలు తీర్పు మరియు శిక్ష, నడవడిక మరియు సవరణ, మరియు నానావిధములైన శుద్దీకరణ ద్వారా వెళ్ళిన తరువాత మాత్రమే నిజమైన విధేయత పొందుకుంటారు. ఈ ప్రజల విశ్వాసము అస్పష్టమైనది మరియు నిస్సారమైనది కాదు, కానీ నిజమైనది. వారు ఏ సూచనలు మరియు ఆశ్చర్యకార్యాలు, లేక ఏ అద్భుతాలను చూడలేదు; వారు మరుగైన అక్షరాలు మరియు సిద్దాంతాలు, లేక లోతైన భావాలు గురించి మాట్లాడరు; బదులుగా వారు వాస్తవికత, మరియు దేవుని మాటలు, మరియు దేవుని వాస్తవికత యొక్క నిజమైన జ్ఞానము కలిగియున్నారు. అటువంటి సమూహము దేవుని శక్తిని స్పష్టపరచుటకు సమర్ధవంతమైనది కాదా? అంత్య దినాల్లో దేవుని కార్యమే నిజమైన పని. యేసయ్య కాలములో, ఆయన మానవుని విమోచించడానికే, కానీ పరిపూర్ణ పరచడానికి రాలేదు మరియు ప్రజలు ఆయనను అనుసరించడానికి ఆయన కొన్ని అద్భుతాలు ప్రదర్శించాడు. ఎందుకంటే ఆయన ప్రధానముగా సిలువ కార్యము సంపూర్తి చేయడానికి వచ్చాడు మరియు సూచనలు కనుపరచడం ఆయన పరిచర్య కార్యములో భాగము కాదు. అటువంటి సూచనలు మరియు అద్భుతాలు ఆయన కార్యమును ప్రభావంతముగా చేయుటకోసం జరిగింపబడిన పని; అవి అదనపు పనే, కానీ మొత్తం కాలము యొక్క కార్యమును సూచించలేదు. పాత నిబంధన కాలములో, దేవుడు కుడా సూచనలు మరియు అద్భుతాలు కనుపరిచాడు—కానీ దేవుడు నేడు చేసిన కార్యమే నిజమైన కార్యము, మరియు నేడు ఆయన సూచనలు మరియు అద్భుతాలు అస్సలు కనుపరచడు. ఆయన సూచనలు మరియు అద్భుతాలు కనుక చూపితే, ఆయన అస్సలు కార్యము చెల్లాచెదురైపోతుంది, మరియు ఆయన ఇకపై ఎటువంటి కార్యము చేయలేడు. మానవుని పరిపూర్ణ పరచడానికి వాక్యాన్ని ఉపయోగించాల్సిందిగా దేవుడు చెప్పి, దానితో పాటు సూచనలు మరియు అద్భుతాలు కూడా కనుపరిస్తే, మానవుడు నిజముగా ఆయనను నమ్ముతున్నాడో లేదో స్పష్టపరచబడుతుందా? కాబట్టి, దేవుడు అలాంటి పనులు చేయడు. మానవుని అంతరంగం చాలా మతపరమైపోయింది; మానవుని హృదయములో ఉన్న సమస్త మతపరమైన భావనలు మరియు అతీతమైన సంగతులను పారద్రోలి మరియు దేవుని వాస్తవికతను మానవునికి తెలియజేయడానికి అంత్య దినాల్లో దేవుడు వచ్చాడు. ఊహాజనితమైన మరియు కల్పితమైన దేవుని స్వరూపమును తీసివేయడానికి ఆయన వచ్చాడు—మరో మాటలో చెప్పాలంటే, అది అస్సలు ఉనికిలోనే లేని దేవుని స్వరూపం. కాబట్టి, ఇప్పుడు నీవు తెలుసుకోవాల్సింది వాతవికత గురించి మాత్రమే! సత్యము సమస్తాన్ని అధిగమిస్తుంది. ఈ దినము నీవు ఎంత వాస్తవాన్ని కలిగియున్నావు? సూచనలు మరియు అద్భుతాలను కనుపరచేదంతా దేవుడేనా? దురాత్మలు కుడా సూచనలు మరియు అద్భుతాలను కనుపరచగలవు; అది కూడా దేవుడేనా? దేవునిపై తనకున్న విశ్వాసములో మానవుడు సూచనలు మరియు అద్భుతాలకు బదులుగా వెదకవలసినది సత్యం, మరియు తాను కనుగొనవలసినది జీవము. దేవునిపై విశ్వాసముంచే వారందరికీ ఇదే లక్ష్యమవ్వాలి.

మునుపటి:  రాజ్యపు యుగమంటే వాక్కుల యుగమని అర్థం

తరువాత:  దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు ఆయన ఆచరణాత్మకతకు ఖచ్చితంగా లోబడేవారు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger